Blood Donation
-
కుక్క కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్.. రతన్ టాటా మంచి మనసు
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఒక కుక్కకు రక్తదానం చేసేందుకు మరో ఆరోగ్యకరమైన కుక్కను కనుగొనాలని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ముంబయి ప్రజలను కోరారు. రక్తదానం చేసే శునకానికి ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు ఉండాలో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పంచుకున్నారు. తన కోసం ఏదీ కోరని ఆయన ఒక కుక్క కోసం ఈ పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా ముంబయిలో యానిమల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఏడు నెలల కుక్కను అడ్మిట్ చేశారు. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి వెంటనే రక్తం కావాలని కోరారు. ఆ విషయం రతన్ టాటా దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశారు.‘ముంబయి..నాకు మీ సహాయం కావాలి. మా యానిమల్ ఆసుపత్రిలో ఉన్న ఏడు నెలల కుక్కకు అత్యవసరంగా రక్తమార్పిడి చేయాల్సి ఉంది. అది తీవ్ర జ్వరంతో, ప్రాణాంతక రక్తహీనతతో బాధపడుతోంది. మాకు అత్యవసరంగా ముంబయిలో డాగ్ బ్లడ్ డోనర్ కావాలి. రక్తం ఇచ్చే కుక్క వైద్యపరంగా ఆరోగ్యంగా ఉండాలి. 1 నుంచి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. 25 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు ఉండాలి. కనీసం గత ఆరు నెలలుగా కుక్కకు పూర్తిగా టీకాలు వేయాలి. డీవార్మింగ్(నులిపురుగులు) చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉండకూడదు’ అంటూ పోస్ట్ చేశారు. ఆయన పోస్ట్‌కు స్పందిస్తూ చాలా మంది వ్యక్తులు కుక్క కోసం సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఆయన మంచి మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెట్టారు. ‘దేని కోసం పోస్ట్ చేయని లెజెండ్, తనది కాని కుక్క కోసం సహాయం కోరుతున్నారు. వినయం గురించి తెలిపే గొప్పపాఠం ఇది’ అని ఒకరు కామెంట్ చేశారు. అయితే రతన్ టాటా పోస్ట్ చూసి చాలామంది డాగ్ బ్లడ్ డోనార్లు సంప్రదించారని తెలిసింది. ‘సహాయం చేసిన వారికి నా అభినందనలు’ అంటూ రతన్ టాటా పోస్ట్‌లో పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Ratan Tata (@ratantata)రతన్ టాటాకు మూగజీవులపై ఉన్న ప్రేమ అందరికీ తెలిసిందే. వీలైతే ప్రతిఒక్కరు ఒక కుక్కను దత్తత తీసుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూంటారు. టాటా గ్రూప్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ప్రాంతం చుట్టూ నివసించే వీధికుక్కల కోసం ప్రత్యేక కెన్నెల్‌ను(సంరక్షణ కేంద్రం) ఏర్పాటు చేశారు. రతన్ టాటా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా భావించే స్మాల్ యానిమల్ హాస్పిటల్‌ను టాటా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి 98,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 200 కంటే ఎక్కువ జీవులకు వైద్యం అందించేలా 5 అంతస్తుల్లో విస్తరించి ఉంది. -
ఏ గ్రూపు రక్తం ఎవరికి రైట్... ఎవరికి రాంగ్?
-
బ్లడ్ డొనేషన్ పేరుతోనూ మోసాలు!
హైదరాబాద్: రక్తం, ప్లాస్మా వంటివి అత్యవసరమైన వారిని సంప్రదించి, వారి నుంచి కొంత మొత్తం తీసుకుని మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని సీసీఎస్ ఆ«దీనంలోని వెస్ట్ జోన్ క్రైమ్ టీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు డీసీపీ శిల్పవల్లి శుక్రవారం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా, పొనుగుటివలస ప్రాంతానికి చెందిన రెడ్డి సందీప్ 2016లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై హార్డ్‌వేర్ నెట్వర్కింగ్ కోర్సు కూడా పూర్తి చేశాడు. నిరుద్యోగంతో పాటు ఆరి్థక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో నేరాల బాటపట్టాడు. విశాఖపట్నంలోని ద్వారక, రెండో పట్టణ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేశాడు. ఆయా కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చాడు. 2020లో కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆ రోగులకు వైద్యం చేయడానికి కోలుకున్న పేషెంట్ ప్లాస్మా అవసరం పెరిగింది. దీంతో పలువురు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా డోనర్స్ కోసం ప్రయత్నాలు చేశారు. ఈ విషయం గమనించిన సందీప్ డోనర్ పేరుతో మోసాలు చేయాలని పథకం వేశాడు. దీనిని అమలులో పెట్టడంలో భాగంగా ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో సెర్చ్ చేశాడు. ప్లాస్మా డోనర్స్ కోసం వాటిలో ప్రకటనలు ఇచి్చన వారికి ఫోన్లు చేసేవాడు. తాను ఇటీవల కోవిడ్ నుంచి కోలుకున్నానని, నాది మీకు కావాల్సిన బ్లడ్ గ్రూప్ అని నమ్మబలికే వాడు. తాను ప్లాస్మా డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చెప్పేవాడు. అయితే తాను శ్రీకాకుళం నుంచి రావడానికి రవాణా, ఇతర ఖర్చులకు కొంత డబ్బు కావాలని కోరేవాడు. తన బ్యాంకు ఖాతా లేదా ఈ–వాలెట్ వివరాలు పంపి వాటిలో డబ్బు వేయించుకునే వాడు. ఆపై వారి ఫోన్లకు స్పందించకుండా మోసం చేసేవాడు. మరికొందరికి కొవిడ్ రోగులకు చికిత్స కోసం వాడే యాంటీ వైరల్ డ్రగ్స్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశాడు. ఇలా రెండు రాష్ట్రాల్లోనూ కలిపి దాదాపు 200 మందిని మోసం చేశాడు. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని బెట్టింగ్‌లతో పెట్టేవాడని డీసీపీ తెలిపారు. నగరానికి చెందిన కొందరినీ మోసం చేయడంతో ఇతడిపై సిటీలోని పంజగుట్ట, రామ్‌గోపాల్‌పేట, బంజారాహిల్స్‌తో పాటు సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలోనూ కేసులు నమోదు కావడంతో అరెస్టయ్యాడు. కొన్ని కేసుల్లో శిక్ష కూడా పడింది. తాజాగా మరోసారి సోషల్‌మీడియా వేదికగా బ్లడ్, ప్లాస్మా డొనేషన్ పేరుతో మోసాలు ప్రారంభించిన అతడిపై దోమలగూడ ఠాణాలో కేసు నమోదు కావడంతో వాంటెడ్‌గా మారాడు. సీసీఎస్‌లోని వెస్ట్‌జోన్ క్రైమ్ టీమ్ ఇన్స్పెక్టర్ డి.భిక్షపతి నేతృత్వంలోని బృందం శుక్రవారం పట్టుకుంది. -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగపూర్‌లో రక్తదాన కార్యక్రమం
భారత స్వాతంత్య్ర దినోత్సవం, సింగపూర్ జాతీయ దినోత్సవం(ఆగస్టు9)ను పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సహకారంతో సింగపూర్‌లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. HSA ఔట్రం రోడ్,కొత్తగా ఏర్పాటైన వన్ పుంగోల్‌లో ఏకకాలంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 75మంది దాతలు ఈ కార్యక్రమంలో పాల్గొని మానవత్వాన్ని చాటుకున్నారు.కుంకు వరలక్ష్మి-నాగేశ్వరరావు అనే దంపతులిద్దరూ రక్తదానంలో పాల్గొని అందరికి స్ఫూర్తిగా నిలిచారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు శ్రీ బొమ్మా రెడ్డి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ.. రక్తదానం గురించి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ రక్తదానం చేయాలని, దీనివల్ల మరింత ఆరోగ్యంగా ఉంటామని పేర్కొన్నారు. గత ఏళ్లుగా వరుసగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎవరైనా రక్తం కావాలని సహాయం అడిగితే వెంటనే స్పందించాలని పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి కార్యక్రమం 29 అక్టోబర్ 2023న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
సులభమైన మార్గం.. మీకు కూడా మంచిదే: మెగాస్టార్
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణాలను కాపాడటానికి, మానవాళికి తోడ్పడటానికి సులభమైన, సమర్థవంతమైన, ఖర్చులేని మార్గం రక్తదానమని పిలుపునిచ్చారు. రక్తదానం చేయడం వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉటామని సూచించారు. రక్తదానం చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సూచించారు. (ఇది చదవండి: షూటింగ్లో ప్రమాదం.. బిగ్ బాస్ నటికి తీవ్రగాయాలు!) రక్తదాతలైన సోదర, సోదరిమణులకు రక్త దానంలోపాల్గొనేలా అవగాహన కల్పించేవారికి మెగాస్టార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరికీ సంతోషాన్ని కోరుకుంటున్నానని ట్వీట్లో ప్రస్తావించారు. The simplest, effective, no cost way to save lives and contribute to humanity. And guess what .. this is one donation that makes us healthier too !! Donate Blood & Save Lives!! Wishing everyone a Happy #WorldBloodDonorsDay ! And More power to all my Blood Brothers / Blood… pic.twitter.com/8Fqb0dt5jK — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2023 -
రక్త సారథులు.. ప్రాణ వారధులు
మదనపల్లె సిటీ : రక్తం ఎంత విలువైందో అందరికీ తెలిసిందే. ఒక యూనిట్ రక్తంతో ఒకరి ప్రాణాలే కాపాడొచ్చు. అత్యవసర సమయంలోనే కాదు... పలువురు వ్యాధిగ్రస్తులకు పక్షం రోజులకోసారి రక్తం ఎక్కించాల్సిందే. లేకపోతే వారి ప్రాణాలకే ప్రమాదం. కరోనా సమయంలో తలసేమియా, సికల్‌సెల్ వ్యాధిగ్రస్తులు, గర్భిణులకు ఒక యూనిట్ దొరకడం ఎంత కష్టంగా మారిందో చూశాం. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతి మూడు, ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చుని వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. అయినా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. రక్తమిస్తే అనారోగ్యం పాలవుతామని అపోహ పడుతున్నారు. దీంతో రక్తనిల్వల కొరత ఎప్పుడూ ఏర్పడుతూనే ఉంది. బ్లడ్‌బ్యాంకు నిర్వాహకులు శిబిరాల నిర్వహణ, దాతల కోసం తరచూ పలు సంస్థలను కోరుతూనే ఉన్నారు. అయినా స్పందన అంతంత మాత్రమే లభిస్తోంది. కొంత మంది దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి వారు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బుధవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఇవ్వడమే కాదు.. ఇప్పిస్తారు రక్తం ఇవ్వడమే కాదు. అవగాహన కల్పించి ఇతరులతో ఇప్పించడం కూడా గొప్ప విషయమే. ఈ విషయంలో రెండో కోవకు చెందుతారు అబూబకర్‌సిద్దిక్. మదనపల్లె పట్టణంలో హెల్పింగ్‌మైండ్స్ సంస్థను ఏర్పాటు చేశారు. తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. అంతే కాకుండా అత్యవసర సమయంలో ఎవరైనా ఫోన్ చేస్తే వారికి రక్తం ఇస్తారు. ఇప్పటి రకు 38 సార్లు రక్తదానం చేశారు. సంస్థ తరఫున పదేళ్లలో సుమారు 18 వేల మందితో రక్తదానం చేయించారు. చిరు వ్యాపారి.. రక్తదానంలో మేటి మదనపల్లె పట్టణానికి చెందిన హర్షద్‌అలీ చిరు వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. స్నేహితుడు అనారోగ్యం పాలవడంతో ఓ గ్రూపు రక్తం అవసరం కావడంతో దొరకపోవడం వల్ల ఇబ్బందులు పడ్డాడు. అప్పటి నుంచి రక్తంతో ఎవరూ ఇబ్బందులు పడకూడదని రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 సార్లు రక్తదానం చేశారు. ఆపద వస్తే .. వాలిపోతాడు స్వర్ణకారుడిగా పని చేస్తూ స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నాడు మదనపల్లె పట్టణానికి చెందిన ఢంకనాచారి. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసే తృప్తిలో ఎక్కడా ఉండదని నమ్మిన యువకుడు. బ్లడ్ బ్యాంకులో తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. అత్యవసరమైతే ఫోన్ చేస్తే చాలు రక్తదానం చేస్తున్నాడు. ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేసి అందరి మన్ననలు పొందాడు. చదువుకుంటూ.. రక్తదాతగా మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన పుష్ప తిరుపతిలో ఫుడ్ టెక్నాలజీ కోర్సు చదువుతోంది. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడవచ్చునని తెలుసుకుంది. ఎవరికికై నా ఆపద వస్తే చాలు రక్తదానం చేస్తుంది. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేసింది. రక్తదానం చేయడమే కాకుండా సహ విద్యార్థినులకు రక్తదానం గురించి అవగాహన కల్పిస్తుంది. స్ఫూర్తి ప్రదాత శివాజీ డిగ్రీ చదువుతూ రక్తదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివాజి. వివేకా ఆశయ ఫౌండేషన్ తరచూ నిర్వహించే రక్తదాన శిబిరాలు ఏర్పాటులో సహాయ, సహకారాలు అందిస్తున్నాడు. ఇప్పటి వరకు 11 సార్లు రక్తదానం చేశారు. రక్తదానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చూస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెకు చెందిన శివ. ఉద్యోగం చేస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తే స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు రక్తదానం చేశారు. -
ఒడిశా రైలు ప్రమాదం.. రక్తదానానికి యువత క్యూ
ఒడిశాలో కనీవినీ ఎరుగని రీతిలో రైలు ప్రమాదం జరిగిన సమయంలో నేటి తరం యువత తమలో మానవత్వం ఉందని నిరూపించారు. క్షతగాత్రులతో కిక్కిరిసిపోయిన బాలసోర్ ప్రభుత్వ ఆస్పత్రికి యువతీ యువకులు క్యూ కట్టారు. బాధితులకి అవసరమైన రక్తం తాము ఇస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఒక జిల్లా ఆస్పత్రికి ఒకేసారి 250 మందికి పైగా క్షతగాత్రులు రావడంతో వారికి చికిత్స ఎలా అందించాలో తెలీక సిబ్బంది తీవ్ర గందరగోళానికి గురయ్యారు. అప్పటికే రైలు ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక యువత ఆస్పత్రికి వచ్చి తమ వంతు ఏదైనా చేస్తామన్నారు. ఈ విషయాన్ని జిల్లా అదనపు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మృత్యుంజయ్ మిశ్రా చెప్పారు. ‘‘నేను గత కొన్ని దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఒకేసారి వందల మంది క్షతగాత్రులకి చికిత్స అందించడం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రక్తదానం చేయడానికి రావడం సంభ్రమాశ్చర్యాల్ని కలిగించింది. రాత్రంతా 500 యూనిట్ల రక్తాన్ని సేకరించాం. రక్తం ఇచ్చిన యువతకి ధన్యవాదాలు ’’ అని డాక్టర్ వివరించారు. -
వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే: బంగారంలాంటి బ్లడ్ డోనర్
అనుబంధాల గురించి చెప్పే సందర్భంలో ‘నీటి కంటే రక్తం చిక్కనిది’ అంటారు. రక్తం చిక్కనిది మాత్రమే కాదు... ఎన్నో జీవితాలను చక్క బెట్టేది. జీవితానికి రక్షణగా నిలిచేది. ‘అన్నదానం మాత్రమే కాదు రక్తదానం కూడా మహాదానం’ అనే ఎరుకను ప్రజల్లో తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నిస్తోంది ఆశా సూర్యనారాయణ్... ‘ప్రౌడ్ టు బీ బ్లడ్ డోనర్’ ‘మీ రక్తంతో పాటు ఒకరికి జీవితాన్ని కూడా ఇస్తున్నారు’ ‘రక్తదాతలు జీవితరక్షకులు’... మొదలైన నినాదాలు గట్టిగా వినిపించని కాలం అది. 24 సంవత్సరాల వయసులో తొలిసారిగా రక్తదానం చేసింది బెంగళూరుకు చెందిన ఆశా సూర్యనారాయణ్. ఒకరోజు దినపత్రిక చదువుతున్నప్పుడు రక్తదానానికి సంబంధించి సిటీ హాస్పిటల్ వారి ప్రకటన కనిపించింది. తనది వారు అడిగిన బ్లడ్‌గ్రూపే. వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి రక్తదానం చేసింది. నిజానికి తనకు అప్పుడు రక్తదానం ఎలా చేయాలి, దాని విలువ ఏమిటి... మొదలైన విషయాలపై అవగాహన లేదు. ఇప్పుడు ఆమె వయసు 55 సంవత్సరాలు. ఆరోజు ప్రారంభమైన రక్తదానం ఇప్పటికీ ఆగలేదు. ఒకసారి బెంగళూరులో క్యాన్సర్ పేషెంట్‌కు రక్తదానం చేసింది. మరుసటి రోజు ఆ హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు... ఆశను చూసి ఒక వృద్ధురాలు వేగంగా నడిచివచ్చింది. దగ్గరికి రాగానే తన కాళ్ల మీద పడింది. ‘అయ్యో! మీరు పెద్దవాళ్లు’ అంటూ ఆమెను లేపింది ఆశ. ‘మీరు ఎవరో తెలుసుకోవచ్చా?’ అని అడిగేలోపే... ‘మీరు రక్తదానం చేసి నా బిడ్డను బతికించారు’ అంటూ కట్టలకొద్ది డబ్బును ఇవ్వబోయింది. ఆ డబ్బును తీసుకోవడానికి నిరాకరించిన ఆశ ‘ఒక్క రూపాయి కూడా అవసరం లేదు తల్లీ. ఇప్పుడే కాదు మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తాను’ అని ఆ వృద్ధురాలికి ధైర్యం చెప్పింది. నిజానికి ఈ సంఘటన రక్తదానం పట్ల తన దృక్పథాన్ని పూర్తిగా మార్చి వేసింది. నిబద్ధతను మరింతగా పెంచింది. ‘నేను చేయడమే కాదు చేయించాలి కూడా’ అనుకొని రక్తదానం గురించి మహిళలతో మాట్లాడినప్పుడు వారు విముఖంగా ఉన్నారు. ‘రక్తదానం వల్ల మహిళలు బలహీనమవుతారు’... మొదలైన అపోహలే దీనికి కారణం. అందుకే అలాంటి అపోహలను తొలిగించే ప్రచారాన్ని చేపట్టింది. ఇది మంచి ఫలితం ఇచ్చింది. చాలామంది మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. రక్తదానం చేయడానికి ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు, కుటుంబ సభ్యులు భయపడుతుంటారు. ఆశ కుటుంబలో కూడా మొదట్లో అలాంటి భయాలు ఉన్నా, తరువాత మాత్రం ఆమెకు పూర్తిగా అండగా నిలిచారు. కోవిడ్ కోరలు చాచిన భయానక కాలంలో బ్లడ్ డొనేషన్స్ భారీగా తగ్గిపోయాయి. రెగ్యులర్‌గా రక్తదానం చేసేవాళ్లు కూడా ‘రిస్కు ఎందుకు’ అంటూ ఇళ్లు కదలడం లేదు. ఆ సమయంలో తాను చొరవ తీసుకుంది. ‘రక్తదానం చేయడానికి అభ్యంతరం లేదు. కానీ బ్లడ్‌బ్యాంకుకు మాత్రం వచ్చేది లేదు’ అన్నారు చాలామంది. అలాంటి వారికి ధైర్యం చెప్పి బ్లడ్‌బ్యాంకులకు తీసుకెళ్లేది ఆశ. ఆశను అభిమానంగా ‘గోల్డెన్ బ్లడ్ డోనర్’ అని పిలుచుకుంటారు అభిమానులు. రక్తదానంతో మొదలైన ఆమె సమాజసేవ అక్కడితో ఆగిపోలేదు. మరెన్నో మంచిపనులకు అది బలమైన పునాదిగా మారింది. కోవిడ్ సమయంలో దిక్కుమొక్కులేని వారికి అన్నదానం, అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం, వాక్సినేషన్ డ్రైవ్..ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని మాత్రమే. -
రక్తదాతలూ ఈ విషయం గుర్తుంచుకోండి..!
రక్తదానం చేయాలనుకునేవారు తాము డొనేట్ చేస్తున్న బ్లడ్‌బ్యాంకులో... రక్తాన్ని కాంపోనెంట్స్‌ను విడదేసే సౌకర్యం ఉందా, లేదా అని ముందుగా వాకబు చేయాలి. అలా విడదీసే సౌకర్యం ఉంటేనే రక్తదానం చేయాలి. లేదంటే ఎక్కువ మందికి ఉపయోగపడాల్సిన రక్తం... కేవలం ఒకరికే ఉపయోగపడుతుంది. రక్తంలో ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్లెట్స్, ప్లాస్మా... వంటి అనేక కాంపోనెంట్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇవన్నీ కలగలసి ఉన్న రక్తాన్ని హోల్ బ్లడ్ అంటారు. గతంలో పేషెంట్స్‌కు ఏ కాంపొనెంట్ అవసరం ఉన్నా మొత్తం హోల్ బ్లడ్ ఎక్కించేవారు. కానీ ఇప్పుడు బ్లడ్‌లోని కాంపొనెంట్స్‌ను విడదీసి... అవసరమున్న దాన్ని మాత్రమే ఎక్కించే వీలుంది. అంటే... ఒక వ్యక్తికి హోల్‌బ్లడ్ ఎక్కిస్తే... అతడికి అవసరం లేని కాంపోనెంట్స్ కూడా అతడి శరీరంలోకి వెళ్లి వృథా అయిపోతాయి. అలా కాకుండా ఏ కాంపొనెంట్ అవసరమో, అదే ఎక్కిస్తే ఒక హోల్ బ్లడ్‌ను అనేక మందికి సర్దుబాటు చేయవచ్చు. ఉదాహరణకు... అగ్నిప్రమాదానికి లోనైన ఓ వ్యక్తికి ప్లాస్మా ఎక్కువగా అవసరం. ఇక రక్తహీతన (అనీమియా)తో బాధపడుతున్న వ్యక్తికి పూర్తి రక్తం కంటే పాకెట్ ఆర్బీసీ ఎక్కువగా అవసరం. అలాగే డెంగీ సోకి ప్లేట్లెట్ల సంఖ్య బాగా తగ్గిన వారికి ప్లేట్లెట్లు మాత్రమే అవసరం. రక్తాన్ని వేర్వేరు కాంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకుల్లో రక్తదానం చేస్తే అప్పుడు, వాటిని విడదీసి రకరకాల అవసరాలు ఉన్న అనేకమంది రోగులకు ఎక్కించవచ్చు. అలా ఒకరి రక్తం ఒకే వ్యక్తి కంటే ఎక్కువ మందికి ఉపయోగపడేలా చేయవచ్చు. అందుకే రక్తదానం చేయదలచిన దాతలు రక్తాన్ని కంపోనెంట్లుగా విడదీయగల సామర్థ్యం ఉన్న బ్లడ్‌బ్యాంకులోనే రక్తదానం చేయడం వల్ల ఏకకాలంలో అనేక మందికి రక్తదానం చేసిన ప్రయోజనం ఉంటుంది. -
బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలి
సాక్షి,సిటీబ్యూరో: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ సెంటర్ ఏర్పాటుకు అందరు విరాళాలిచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ శర్మన్ అన్నారు. బుధవారం రెడ్ క్రాస్ ప్రతినిధులు కలెక్టర్ ను కలిసి బ్లడ్ సెంటర్ ఏర్పాటు, పనుల పురోగతిపై వివరించారు. ఈ సందర్భంగా దాతలు లారెన్స్ మాయో ఆప్టికల్స్ ఆఫీస్ కంప్యూటర్లను విశాల్ పెరిఫెరెల్స్, కలర్ ప్రింటర్ ను, డా. శ్యాంకాంత్ బసాకే రూ. 7500 చెక్కులను రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా కలెక్టర్ కు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్ఓ సూర్యలత, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీం రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, రాధా కృష్ణ,, డా. సిసా తదితరులు పాల్గొన్నారు. -
రక్త మార్పిడి కలకలం: యువకుడి మృతిపై అనుమానాలు?
ములకలపల్లి: రక్త మార్పిడి చేయించుకున్న యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్ఎంపీ అందించిన వైద్యం వికటించి మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమలాపురంలో కలకలం రేపింది. గ్రామానికి చెందిన యువకుడు జక్కా రామకృష్ణ (29) మంగళవారం ఆకస్మిక మృతి చెందగా..ఆర్ఎంపీ వైద్యం వికటించడంతోనేనని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజులుగా నీరసంగా ఉంటోందని మా«ధారంలోని ఓ ఆర్ఎంపీ వద్ద చికిత్స పొందుతున్నాడు. సోమవారం ములకలపల్లి సెంటర్లోని ఓ రక్తపరీక్షా కేంద్రంలో కమలాపురం గ్రామానికి చెందిన చెందిన ఓ యువకుడి రక్తాన్ని సేకరించి..సదరు మాధారం ఆర్ఎంపీ పర్యవేక్షణలో ఎక్కించారు. ఈ క్రమంలో రామకృష్ణ ఆరోగ్యం క్షీణించి..చనిపోయాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. చదవండి: ప్రాణం తీసిన పేకాట.. మద్యంమత్తులో బండరాయితో మోది.. ఆర్ఎంపీ నివాసంలో రక్తం పరిశీలిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు అధికారుల విచారణ మృతుడికి భార్య సమ్మక్క, ఏడాది వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ పోటు వినోద్ కమలాపురం వెళ్లి వివరాలు సేకరించారు. రక్తం ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ములకలపల్లిలోని రక్త పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి తాత్కాలికంగా సీజ్ చేశారు. మాధారంలోని ఆర్ఎంపీ ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేడు. అక్కడ మందులను పరిశీలించారు. విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. మృతుడి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ‘సారూ.. భూములు లాక్కోద్దు’ తహసీల్దార్ కాళ్లపై రైతులు -
డేటింగ్ యాప్‌లో.. బ్లడ్ డోనార్స్!
కరోనాకు ముందు డేటింగ్ యాప్‌లకు మంచి డిమాండ్ ఉండేది. టిండర్ లాంటి డేటింగ్ యాప్ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి కోసం తెగ స్వైప్ చేశారు. కరోనా దెబ్బకు డేటింగ్ యాప్‌లు చప్పబడ్డాయి. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో టిండర్ మరోసారి యాక్టివేట్ అయ్యింది. అయితే ఈసారి లైఫ్ పార్టనర్ కోసం కాదు. తమ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికోసం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా ..రక్తదాతలు, పేషంట్లకు మధ్య వారధిగా నిలుస్తూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నారు చెన్నైకి చెందిన వైద్యవిద్యార్థి రియా గుప్తా డేటింగ్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఎంతోమందికి రక్తం అందిస్తున్నారు. ఇటీవల రెండునెలల వయసున్న భవన్ కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం అవసరమైంది. కరోనా సమయంలోఎక్కడా రక్తదానం చేసేవారు దొరకలేదు. ఈ విషయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాతంలో రియాకు తెలియడంతో.. తనకు తెలిసిన వాళ్లు, స్నేహితులకు ఫోన్లు చేయడం, సోషల్ మీడియా, వాట్సాప్‌లలో బ్లడ్ డోనార్స్ కావాలని పోస్టులు పెట్టింది. ఎట్టకేలకు ఆమె పోస్టులకు టిండర్ అకౌంట్లో ఒక దాత అర్ధరాత్రి మూడు గంటలకు స్పందించారు. దీంతో మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు భవన్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలా అవసరంలో ఉన్న వారెందరికో రియా బ్లడ్డోనార్స్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాస్మాడోనర్ ప్రేరణతో.. ‘‘మనదేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోన్న ఈ సమయంలో ‘‘ఫలానా గ్రూపు రక్తం కావాలి! సాయం చేయండి ప్లీజ్!’’ అని సోషల్ మీడియాలో కోకొల్లలుగా మెసేజులు వస్తున్నాయి. అలా ఓ నెలరోజులు పాటు నేను నా ఫ్రెండ్స్ వాళ్ల రిక్వెస్ట్‌లు చూసేవాళ్లం. కరోనా సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువే. వ్యాక్సిన్ వేసుకున్న వారు 28 రోజులు గడవందే రక్తదానం చేయకూడదు. దీంతో రక్తదాతలు దొరకడం చాలా కష్టమైంది. ఇలా అనుకుంటున్న సమయంలో ఓరోజు.. ‘‘టిండర్ అకౌంట్ ద్వారా ప్లాస్మా డోనర్ దొరికారు’’ అని ఒకతను చెప్పడం మేము విన్నాం. అప్పుడు అతనిలాగే బ్లడ్ డోనర్స్ కోసం టిండర్ డేటింగ్ యాప్‌ను వాడాలనుకున్నాం. ఈ క్రమంలోనే నా స్నేహితులతో కలసి ‘‘బ్లడ్‌డోనర్స్ కావాలి’’ అని టిండర్‌లో పోస్టులు పెట్టాము. దానికి మంచి స్పందన లభించడంతో..స్లాక్, టిండర్, వాట్సాప్ గ్రూపులను ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, మెటర్నిటి ఆసుపత్రి, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటిని సమన్వయపరిచాం. ఈ సంస్థల నుంచి ‘‘బ్లడ్ కావాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్‌ను టిండర్ గ్రూపులో పోస్టు చేస్తాం! రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి పేషంట్లు లేదా ఆసుపత్రి సిబ్బందిని నేరుగా కలుసుకునే Ðð సులుబాటు కల్పిస్తాం’’ అని రియా చెప్పింది. ఇప్పటిదాక వందమందికిపైగా డోనర్స్‌తో రక్తదానం చేయించాము. నా ఇన్స్టాగ్రామ్ పేజి బ్లడ్ డోనార్ కనెక్ట్‌కు రక్తం కావాలని ఏదైనా మెస్సేజ్ వచ్చిందంటే అరగంట నుంచి గంటలోపు రక్త దాతను వెదికి రిక్వెస్ట్ పెట్టిన వారికి చేరుస్తాము. త్వరలో మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము’’ అని రియా వివరించింది. రియా చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న రెడ్ క్రాస్ ఇండియా, చెన్నై ట్రైకలర్ వంటి ఎన్జీవోలు సైతం రక్తం కోసం రియాను సంప్రదించడం విశేషం. -
హాట్సాఫ్ ఎస్పీ శ్వేత: రక్తదానంలో మగువలూ ముందడుగు
ప్రస్తుతం కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలకు కునుకు లేకుండా చేస్తోంది. చాలా మందికి రక్తం, ప్లాస్మా అవసరం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం అవసరం గుర్తించిన మహిళలు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. రక్తదానం అంటే ఇప్పటికీ ఎన్నో అపోహలు సమాజంలో ఉన్నాయి. రక్తం ఇస్తే ఏమవుతుందోనన్న భయం ఇంకా చాలామందిని వీడడం లేదు. మహిళల్లో రక్తదాన విషయంలో ఇంకా ఎన్నో అనుమానాలుంటున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. నెలసరి ఒత్తిళ్లు, ప్రసవానంతర సమస్యలు, రక్తహీనత... వంటివి వారిని ఈ విషయం లో వెనకడుగు వేయిస్తున్నాయి. వాటినన్నింటినీ దాటుకుంటూ నేటితరం యువతులు ‘మేము సైతం’ అంటూ రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి... సాధారణంగా చాలామంది మహిళల్లో రక్తహీనత అనేది ఒక సమస్యగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడం అంటే గొప్ప విషయంగానే భావించాలి. కామారెడ్డి జిల్లాలో రక్తదానం ఒక ఉద్యమంగా సాగుతున్న సందర్భంలో రక్తదానం చేస్తూ పలువురు మహిళలు కూడా రక్తదాతలుగా వెలుగొందుతున్నారు. కామారెడ్డి జిల్లా ఆవిర్భవించి నాలుగేళ్లు గడచింది. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన యువ ఐపీఎస్ ఆఫీసర్ ఎన్.శ్వేత ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె తొమ్మిదిసార్లు రక్తదానం చేశారు. ఏటా రెండుసార్లు రక్తం ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నానని, ఇది నిరాటంకం గా కొనసాగిస్తానంటున్నారు. ఎస్పీ స్ఫూర్తితో పలువురు యువతులు మేము కూడా... అంటూ ముందుకు వస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు వివిధ ప్రాంతాలకు చెందిన యువతులు రక్తదానం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. రక్తదానం చేయడం వలన ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడొచ్చని చెబుతున్నారు. అపోహలు వీడాలి మహిళలు రక్తదానం విషయంలో ఉన్న అపోహలు వీడాల్సిన అవసరం ఉంది. మగవారే కాదు మగువలూ రక్తం ఇవ్వొచ్చు. రక్తం ఇవ్వడం వలన ఎలాంటి ఇబ్బందులు ఉండవు. నేనైతే ప్రతీ ఆరు నెలలకోసారి రక్తదానం చేస్తున్నాను. ఇప్పటికీ తొమ్మిది సార్లు ఇచ్చాను. రాబోయే రోజుల్లోనూ ఇస్తూనే ఉంటా. మహిళలకు రక్తదాన విషయంలో రకరకాల అనుమానాలు ఉన్నాయి. జీవన చక్రంలో సాధారణంగా జరిగే వాటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్న విషయాన్ని గుర్తించాలి. రక్తదానంపై విద్యార్థి దశలోనే అవగాహన కల్పించాలి. –ఎన్.శ్వేత, జిల్లా ఎస్పీ, కామారెడ్డి రక్తదానం చేస్తున్న జిల్లా ఎస్పీ శ్వేతను అభినందిస్తున్న ఐఏఎస్ అధికారి సత్యనారాయణ (ఫైల్) ఇబ్బందులేవీ రావు రక్తదాతల సమూహం ద్వారా దీని ప్రాధాన్యత తెలుసుకుని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేస్తే ఇబ్బందులు ఉంటాయన్నది అపోహ మాత్రమే. సమయానికి రక్తం దొరక్క చాలా మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలున్నాయి. రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలు కాపాడామన్న సంతోషం కలుగుతోంది. – శోభ, కామారెడ్డి గొప్ప అనుభూతి మొదటిసారి రక్తదానం చేశాను. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. ఒకరికైనా సాయపడుతున్నాను అనే ఆలోచనతో గొప్ప అనుభూతిని పొందాను. రక్తదాతల సమూహం ద్వారా అవసరం ఉన్న వారికి రక్తదానం చేయడానికి ఎప్పుడైనా నేను సిద్ధం. – నవ్య, మద్దికుంట, రామారెడ్డి మండలం ఎనిమిది సార్లు రక్తదానం చేశాను రక్తదానం విషయంలో ఎలాంటి అపోహలకూ లోను కావొద్దు. నేను ఇప్పటికీ ఎనిమిది సార్లు రక్తదానం చేశాను. ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ ఒక్క ఆడపిల్ల రక్తదానానికి ముందుకు రావాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు దూసుకుపోతున్నారు. రక్తదానంలోనూ బాధ్యతను నెరవేర్చాలి. –వెన్నెల, కామారెడ్డి పట్టణం ప్రాణదాతలు కావాలి నా బ్లడ్ గ్రూప్ ఓ నెగటివ్. అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైనా రక్తం అవసరం ఉందని తెలిస్తే వెళ్లి ఇస్తున్నాను. ఇప్పటికి ఐదు సార్లు రక్తదానం చేశాను. అపోహలు వీడితే రక్తదానం చేయడానికి ఎవరికి వారే ముందుకు వస్తారు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని. –లావణ్య, రాంరెడ్డిపల్లి, బీబీపేట మండలం యువతులు ముందడుగు రక్తదానం చేస్తే ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకావని తెలుసుకుని రక్తం చేయడానికి ముందుకు వచ్చాను. ముఖ్యంగా యువత రక్తదానం పట్ల అవగాహన పెంచుకోవాలి. రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. – హర్ష, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి -
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్సీపీకి సర్టిఫికెట్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సర్టిఫికెట్ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మధుసూధన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం) ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. -
రక్త దాత స్ఫూర్తి ప్రదాత
ఎంతో కాలంగా రక్తం లభ్యత అనేది రోజు రోజుకూ పెనుభూతంలా మారుతున్న సామాజిక సమస్యగా పరిణమిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, కేన్సర్ చికిత్సలు, తలసేమియా చికిత్స, ప్రసవ సమయం.. ఇలా పలు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. గత దశాబ్దకాలంగా రక్తదానం గురించి అవగాహన పెరిగినప్పటికీ రక్తనిల్వలు సరిపడా ఉండడం లేదు. ఆరోగ్యకరమైన ప్రతీ వ్యక్తి స్వచ్చందంగా రక్తదాతగా మారడం మాత్రమే దీనికి పరిష్కారం. ఈ విషయంలో అవగాహన కలిగిస్తూ పలువురికి స్ఫూర్తి నిస్తున్నారు కొందరు నగరవాసులు. అక్టోబర్ 1న జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవ సందర్భంగా ప్రత్యేక కథనం. తీ 3 సెకన్లకు ఒక వ్యక్తి రక్త కొరతతో మరణిస్తున్నాడు అని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నాలుగు కోట్ల యూనిట్ల రక్త నిల్వలు అవరం కాగా ప్రస్తుతం సమకూరుతున్నది మాత్రం 40 లక్షల యూనిట్లు మాత్రమే. సాంకేతికత ఎంత పెరిగినా ఒకరి నుంచి మరొకరికి అందించడం తప్ప రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేమనేది నిజం. కానీ రక్తదానంపై ఇంకా ప్రజల్లో పలు సందేహాలున్నాయి. అయితే అవన్నీ అపోహలు మాత్రమేనని, క్రనీసం18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి, 50 కేజీల కన్నా ఎక్కువ బరువున్న ప్రతీ ఆరోగ్యకరమైన వ్యక్తి నిస్సందేహంగా రక్తదానం చేయవచ్చునని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పతీ మూడు నెలలకు ఒకసారి రక్తదానం, అలాగే 15 రోజులకు ఒకసారి ప్లేట్లెట్స్ దానం చేయొచ్చునని, రక్తదానం వలన మరింత ఆరోగ్యంగా మారడమే కాకుండా పలు వ్యాధులు ఎదుర్కొనే రోగనిరోదక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ‘సోషల్’ తో మేలు.. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి నిత్యం నగరానికి వేల యూనిట్ల రక్త అవసరం.. సోషల్‌మీడియా ప్రభావం పెరిగాక స్వచ్చందంగా రక్తదానానికి ముందుకు వచ్చే దాతల సంఖ్య కూడా పెరిగింది. బ్లడ్ డొనేషన్ గ్రూప్స్ ద్వారా, సోషల్‌మీడియా యాప్స్‌ని అనుసరించి నిమిషాల్లో అవసరమున్న చోటుకే వచ్చి రక్తదానం చేస్తున్నారు. కొన్ని ఆస్పత్రులలో బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకువచ్చే ప్యాకెట్లకు బదులు నేరుగా దాత నుంచి రక్తం తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వలన స్వచ్చంద రక్తదాతల ఆవశ్యకత పెరిగింది. రెడ్ డ్రాప్...సేవ్ లైఫ్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో నివసించే రెహమాన్ ఇప్పటి వరకు 92 సార్లు రక్తదానం చేశాడు. అంతేకాదు సిటీలో ఎవరికి రక్తం అవసరమైనా ఇతరుల నుండి రక్తదానం చేయించడంలో ముందుంటాడు. రెహమాన్ పుట్టిన కొన్ని నెలలకే రక్తహీనతతో తల్లి మరణించింది. ఊహ తెలిశాక.. ఆరు యూనిట్ల రక్తం అందక నాన్న చనిపోయాడు. తన జీవితంలోనే చోటు చేసుకున్న ఈ సంఘటనలతో చలించిపోయిన రెహమాన్ ఎవరికి రక్తం అవసరమున్నా వెళ్లి ఇచ్చేవాడు. అమ్మ ప్రాణం పోసి జన్మనిస్తే రక్తదాత తన రక్తంతో మరుజన్మనిస్తాడు అంటాడు రెహమన్. రక్తదాతల అవసరాన్ని గమనించి రెడ్‌డ్రాప్ యువజన సేవా సమితి అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటు చేసి రక్తదానానికి తనవంతు కృషి చేస్తున్నాడు. తన సంస్థ ద్వారా ఇప్పటి వరకు 9600 మందిని ఆయన రక్తదాతలుగా మార్చారు. యాబైకి పైగా రక్తదాన శిబిరాలు నిర్వహించి బ్లడ్‌బ్యాంక్‌లకు రక్తాన్ని అందించారు. ప్రస్తుతం అందరూ తనని ప్రేమగా రెడ్‌డ్రాప్ రెహమాన్ అని పిలుస్తారు. అవగాహన పెరిగింది.. నేను ఇప్పటి వరకు 18 సార్లు రక్తదానం చేశాను. టెక్నాలజీ పెరిగాక రక్తదానం అనేది మరింత సులభంగా మారింది. ఈ మధ్య ఎవరికి రక్తం అవసరౖమైనా సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయడంతో అక్కడి ప్రాంతంలో ఉన్న డోనర్స్ స్పందిస్తున్నారు. చాలా గ్రూప్‌లలో నేను సభ్యునిగా ఉన్నాను. నేను ఇవ్వలేని పరిస్తితులలో నా స్నేమితులకు ఫార్వడ్ చేస్తాను. –మహ్మద్ రఫీ, సాఫ్ట్వేర్. 55 సార్లు రక్తమిచ్చా... రక్తదానం వలన మరోవ్యక్తికి ప్రాణం నిలుస్తుంది. వ్యక్తిగతంగా ఇంతకన్నా గొప్ప పని ఇంకేది ఉండదు. ఇప్పటి వరకు నేను 55 సార్లు రక్తదానం చేశాను.మారుమూల గ్రామాల నుండి చికిత్స కోసం ఎందరో నగరానికి వస్తుంటారు.వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియదు. అలాంటప్పుడు రక్తదాతల అవసరం చాలా ఉంటుంది. ఎవరైనా సమయానికి రక్తం అందక చనిపోతే మనిషిగా మనం ఓడిపోయినట్టే అని నా భావన. అందుకే ప్రతి మూడు నెలలకు గాంధీ హస్పిటల్, రెడ్‌క్రాస్ సొసైటీ తదితర ప్రాంతాలలో స్వచ్చందంగా వెళ్లి రక్తదానం చేస్తుంటాను. –కొండల్‌రెడ్డి, రైతు స్వరాజ్య వేదిక. -
రక్తదానం చేసిన కుక్క
కోల్‌కతా : కుక్కలకు విశ్వాసం ఎక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే. తాజాగా కోల్‌కతాలో ఓ కుక్క మరో కుక్కకు రక్తదానం చేసి సూపర్ హీరోగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. డానీ అనే 13 ఏళ్ల పెంపుడు కుక్క కిడ్నీ సమస్యతో బాధపడుతుంది. దీంతో డానీ యజమానులు చికిత్స కోసం దానిని చెన్నై నుంచి కోల్‌కత్తాకు తీసుకొచ్చారు. అక్కడ నటుడు అనింద్య చటర్జీకి చెందిన సియా(కుక్క పేరు) డానీకి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడింది. ఇందుకు సంబంధించి అనింద్య మాట్లాడుతూ.. ‘సియా చాలా తెలివిగా రక్తదానం చేసింది. ఎటువంటి ఇబ్బంది పడకుండా పనిని పూర్తి చేసింది. ఇందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే తీసుకుంది. సియా వల్ల నాకు ఈ రోజు గర్వంగా ఉంది. సియా డానీని కాపాడుకునేందుకు ఓ జంటకు సాయం చేసింది’ అని అన్నారు.(చదవండి : చనిపోయే ముందు అరచేతిపై రిజిస్ట్రేషన్ నంబర్) ‘డానీ దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యతో బాధపడుతుంది. అందుకు చికిత్స అందించాలంటే రక్తం కావాల్సి వచ్చింది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల రక్తదాతలు దొరకని పరిస్థితి. అలాగే కోల్‌కతాలో ఇలాంటి చికిత్స కొత్తది. కానీ డానీకి రక్తదాత లభించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము’ అని వెటర్నరీ డాక్టర్ దేబాజిత్ రాయ్ తెలిపారు. కాగా, గత నెలలో యూఎస్‌లో అనారోగ్యంతో ఉన్న ఓ కుక్కపిల్లను కాపాడేందుకు ఏడేళ్ల జాక్స్ అనే కుక్క రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. -
25వ సారి రక్తదానం
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని రెడ్‌స్టార్ బ్లడ్ డోనర్ గ్రూపు సభ్యుడు నరేష్ 25వ సారి రక్తదానం చేశారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో నజీమా అనే మహిళకు అత్యవసరమైన సమయంలో బ్లడ్ డొనేట్ చేశారు. ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేస్తున్న నరేష్‌ను పలువురు అభినందించారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. -
రక్తదానం చేసిన కేటీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 20వ అవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి కేటీఆర్ రక్తదానం చేశారు. తలసేమియా, ఇతర అత్యవసర చికిత్సలకు సాయం అందించడానికి రక్తదానం చేసినట్టు వెల్లడించారు. అలాగే స్థానిక ఆస్పత్రుల్లో రక్తదానం చేసి వారికి సాయంగా నిలవాలని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు తమ ఇళ్లపైనే పార్టీ జెండా ఎగరవేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ అవిర్భావ దినోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. అలాగే ఈ సారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎవరికి వారు తమ ప్రాంతాల్లో అత్యంత నిరాడంబరంగా పార్టీ పతాకావిష్కరణ చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించిన సంగతి తెలిసిందే. చదవండి : టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ శుభాకాంక్షలు -
రక్తదానం చేసిన మెగాస్టార్
ఎన్నిసార్లు దానం చేసినా తరగని నిధి.. రక్తదానం. ప్రస్తుత కరోనా కాలంలో అందరూ ఇళ్లకే పరిమితమైపోపోవడంతో రక్తదానానికి ఎవరూ ముందుకు రావట్లేదు. మరోవైపు బ్లడ్‌బ్యాంకుల్లో రక్తం నిలువలు నిండుకోవడంతో రక్తమార్పిడి అవసరమయ్యేవారి పరిస్థితి దుర్భరంగా మారుతోంది. దీంతో అత్యవసర చికిత్స చేస్తున్న సమయంలో ఆసుపత్రుల్లో తగినంత రక్తం అందుబాటులో ఉండట్లేదు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్తులకు నెలకు రెండుసార్లు రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. కానీ, సకాలంలో రక్తం దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకొచ్చి ఆదివారం ఉదయం రక్తదానం చేశారు. (సాహో డైరెక్టర్‌కి ‘మెగా’ ఆఫర్) దీన్ని తన చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కు అందించారు. కాగా కొద్ది రోజుల క్రితం నేచురల్ స్టార్ నాని సైతం రక్తదానం చేయగా దాన్ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకుకు ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్డౌన్ వల్ల రక్తదాన శిబిరాలపై ఆంక్షలు ఉండగా చాలామంది రక్తదానం చేసేందుకు ముందుకు రావట్లేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రక్తదాతలు వెంటనే అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్తదానం చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు కోరారు. (‘కరోనా’ సందేశం.. పవన్, బన్నీ మిస్) -
జాదవ్ బర్త్‌డే.. నెటిజన్లు ఫిదా!
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ కేదార్ జాదవ్ తన 35వ బర్త్‌డే వేడుకలను చాలా సింపుల్‌గా జరుపుకున్నాడు. అయితే తన బర్త్‌డే రోజు ఓ మంచి పని చేసి అభిమానుల మనసులు దోచుకున్నాడు. తన సొంత పట్టణమైన పుణేలోని ఓ ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తికి అత్యవసరంగా రక్తం అవసరం ఏర్పడింది. ఈ విషయాన్ని ఓ ఎన్జీవో నుంచి తెలుసుకున్న జాదవ్ స్పందించాడు. వెంటనే ఆ ఎన్జీవోకు వెళ్లి రక్త దానం చేశాడు. జాదవ్ రక్త దానం చేసిన ఫోటోలను ఆ ఎన్జీవో తన ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బర్త్‌డే రోజు ఓ నిండు ప్రాణాన్ని కాపాడవని నెటిజన్లు జాదవ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా ప్రతీ ఒక్కరూ కనీసం వారివారి పుట్టినరోజునైనా రక్త దానం చేయాలని కొందరు నెటిజన్లు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక కేదార్ జాదవ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా, జట్టుకు అవసరమైన సమయంలో తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో టీమిండియాకు సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా, ఫామ్‌లో లేక జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండేలు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంతో వీరి నుంచి జాదవ్‌కు విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటికీ జాదవ్ టీమిండియా సెలక్షన్స్‌లో రెగ్యులర్‌గా ఉంటాడు. ఇక ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఐపీఎల్లో రాణించి అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాలో చోటు దక్కించుకోవాలని తహతహలాడాడు. కానీ కరోనా కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉండటంతో జాదవ్ కాస్త నిరుత్సాహపడ్డాడు. भारतीय क्रिकेट टीम के विस्फोटक बल्लेबाज @JadhavKedar जी ने इस संकट के समय में पुणे में एक बेहद जरूरतमंद इंसान के लिए रक्तदान कर मानवता की अद्भुत मिसाल पेश की है,@BloodsevaIndia परिवार आपके जज्बे को नमन करता है और आशा करता है आप दो मिनट का वीडियो संदेश रक्तदान पर हमें भेजें ।। pic.twitter.com/Eqa0Ehppam — Blood Seva Parivar (@BloodsevaIndia) March 26, 2020 -
బ్లడ్ అలెర్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఏదైనా ఆపద రానుందని తెలిస్తే అప్రమత్తంగా ఉండాలని రెడ్ అలెర్ట్ ప్రకటిస్తారు. ఇప్పుడు విశాఖకు ‘బ్లడ్’ అలెర్ట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. విశాఖపట్నంలో రోజురోజుకు రక్తానికి డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచే కాదు.. పొరుగు జిల్లాలు, పొరుగున ఉన్న ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రోగులు, క్షతగాత్రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. వీరికి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఉన్న బ్లడ్‌బ్యాంకులు సమకూరుస్తున్నాయి. విశాఖలో శస్త్రచికిత్సలు, ప్రసవాలు, డెంగీ బాధితులు, అవయవ మార్పిడులు పెరుగుతున్నాయి. ఒకపక్క రక్తదాతలు పెరుగుతున్నా అంతకు మించి డిమాండ్ పెరుగుతోంది. ఇలా ఏటా 10 శాతం చొప్పున రక్తదాతల అవసరం పెరుగుతూ వస్తోంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం జనాభాలో ఒక శాతం రక్తం నిల్వలు అవసరమవుతాయి. జిల్లా జనాభా 44 లక్షలుంది. ఈ లెక్కన ఏటా 44 వేల యూనిట్ల రక్తం సరిపోతుంది. కానీ ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి విశాఖ వచ్చే రోగులు/క్షతగాత్రుల తాకిడితో ఇప్పుడు లక్ష యూనిట్లకు పైగా రక్తం కావలసి వస్తోంది. వీటిని సమకూర్చడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ.. విశాఖలో 17 బ్లడ్ బ్యాంకులున్నాయి. ఇవి పెరుగుతున్న రక్తం డిమాండ్‌కు అనుగుణంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీలతో ఈ బ్లడ్ బ్యాంకులు అవగాహన కుదుర్చుకున్నాయి. ఏటా రెండు సార్లు ఈ కళాశాలల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ రక్తపు నిల్వలను సమకూర్చుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులు కూడా విరివిగా రక్తదానానికి ముందుకొస్తున్నారు. ఇలా సగటున ఏటా 85 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తున్నాయి. ఒకసారి సేకరించిన రక్తం 30 రోజులకు మించి నిల్వ ఉండదు. అందువల్ల రక్త సేకరణ జరిగాక ఆ 30 రోజుల్లోగా వినియోగించకపోతే వృథా అయిపోతుంది. కొన్నిసార్లు ఎక్కువ రక్తం యూనిట్లు అవసరం పడడం, మరికొన్ని సార్లు అంతగా డిమాండ్ లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏ ఏడాది సేకరణ ఎంత ? సంవత్సరం యూనిట్లు 2016–17 82,390 2017–18 82,339 2018–19 97,626 మూడు నెలల్లో సేకరించిన యూనిట్లు మార్చి 6,984 ఏప్రిల్ 6,314 మే 7,539 2018 ఎపిడమిక్ సీజన్లో.. ఆగస్ట్ 11,532 సెప్టెంబర్ 11,150 అక్టోబర్ 6,418 వ్యాధుల సీజన్ మొదలు.. వర్షాలతో పాటు వ్యాధుల సీజనూ మొదలవుతోంది. దోమకాటుతో డెంగీ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు విజృంభించనున్నాయి. వీటి బారిన పడిన వారికి ఒక్కసారిగా ప్లేట్లెట్లు పడిపోతాయి. వీరికి తక్షణమే రక్తం ఎక్కించి ప్రాణం కాపాడవలసి ఉంటుంది. వర్షాకాలం సీజన్లో విశాఖ నగరం, ఏజెన్సీలో ఏటా పెద్ద సంఖ్యలో ఈ జ్వర మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ సోకిన వారికి ప్లేట్లెట్లు శరవేగంగా పడిపోయి. రోగి ప్రాణానికే ముప్పు వాటిల్లుతుంది. వీరికి రక్తం నుంచి ప్లేట్లెట్లను వేరు చేసి రోగికి ఎక్కిస్తారు. కొన్ని జబ్బుల వారికి ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, ఫ్రెష్ ఫ్రోజెన్ ప్లాస్మా వంటివి అవసరమవుతాయి. వీటిని కూడా రక్తం నుంచి సెపరేట్ చేసి అవసరమైన వారికిస్తారు. మిగిలిన రక్తాన్ని హిమోగ్లోబిన్ అవసరమున్న వారికిస్తారు. ఏజెన్సీలో రక్తహీనత, తలసేమియా, ఎనీమియా, సికిల్‌సెల్ వంటి వ్యాధులతో బాధపడే వారు అధికంగా ఉంటారు. వీరికి రక్తం ఎక్కించి ప్రాణాపాయం నుంచి తప్పిస్తారు. ఇప్పుడు వ్యాధుల సీజను ప్రారంభం కావడంతో మరో నాలుగు నెలల పాటు రెట్టింపు రక్తపు నిల్వలు కావలసి ఉంటుంది. సాధారణ రోజుల్లో నెలకు ఐదారు వేల యూనిట్ల రక్తం అవసరం ఉండగా ఈ ఎపిడమిక్ సీజనులో రెట్టింపు సంఖ్యలో అంటే.. 12 వేల యూనిట్ల రక్తం అవసరమవుతుందని వైద్యారోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విశాఖలో 22 వేలకు పైగా యూనిట్ల రక్తం నిల్వ ఉంది. కొరత రాకుండా చూస్తున్నాం విశాఖ ఆస్పత్రులకు రక్తం అవసరం ఉండే రోగులు, క్షతగాత్రులు ఎక్కువగా వస్తుంటారు. రక్తదాతల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తక్షణమే సమకూర్చే చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీ విద్యార్థులే కాదు.. 80 శాఖల ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములను చేస్తున్నాం. వ్యాధుల సీజన్ ప్రారంభం కావడంతో డెంగీ తదితర రోగులకు సరిపడినన్ని ప్లేట్లెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. పాడేరులో త్వరలో బ్లడ్‌బ్యాంకు ఏర్పాటవుతోంది. అక్కడున్న బ్లడ్ స్టోరేజి యూనిట్‌ను ముంచంగిపుట్టుకు తరలిస్తాం. జిల్లాలో మొబైల్ బ్లడ్ కలెక్షన్ వాహనాన్ని నర్సీపట్నం, అనకాపల్లిల్లో అందుబాటులో ఉంచాం. ఎపిడమిక్ సీజన్లో రక్తం కొరత రాకుండా అప్రమత్తంగా ఉన్నాం. – రోణంకి రమేష్, ఏడీఎంహెచ్‌వో -
రక్తం లేకుంటే దేవుడు కూడా కాపాడలేడు
సాక్షి, హైదరాబాద్: ఆకలైన వారికి ఆ పూటకు అన్నం లేకపోయినా కొన్ని రోజులు జీవిస్తారు. కానీ రక్తం అవసరమైన వారికి ఆ సమయంలో ఇవ్వకపోతే మాత్రం విలువైన నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అన్ని దానాలకంటే అన్నదానం గొప్పదని గతంలో చెప్పేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని వైద్యులు చెబుతున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త ల్యాండ్‌స్టైనర్ జయంతి సందర్భంగా ఏటా జూన్ 14వ తేదీని ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవ ముఖ్యోద్దేశం 'స్వచ్చందంగా ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్నవారికి మనసారా కృతజ్ఞతలు తెలపడం'. అంతేకాదు.. రక్తదానానికి ప్రజలను పోత్సహించడం. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ అవసరమొచ్చినా సురక్షితంగా సకాలంలో రక్తాన్ని అందించవచ్చు. రక్తం అవసరం, దాని గొప్పతనం అది అవసరమైనప్పుడు మాత్రమే తెలుస్తుంది. అవసరమైనప్పుడు రక్తసంబంధీకులు సైతం రక్తం ఇవ్వడానికి ముందుకు రాని ఈ రోజుల్లో మేమున్నామంటూ కులం, మతం, ప్రాంత భేదాలు చూడకుండా రక్తదానం చేస్తున్న వారిని రక్తదాతా సుఖీభవ అని ఆశీర్వదిస్తున్నారు. కృత్రిమంగా సృష్టించలేని రక్తం అందుబాటులో లేకపోతే దేవుడు కూడా ప్రాణాలు కాపాడలేడు. ఒకసారి రక్తదానం చేస్తే ముగ్గురి ప్రాణాలు నిలబడతాయి. అందుకే రక్తదాతలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు అని బాధితులు చెప్పుకుంటారు. రక్తదానానికి అర్హత... ♦ దాత బరువు 45 కిలోలు ఉండాలి. ♦ వయస్సు 18 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి. ♦ దాత నాడి నిమిషానికి 60 నుంచి 100సార్లు కొట్టుకోవాలి. ♦ రక్తంలో హెచ్‌బీ శాతం 12.5 గ్రాములకు పైగా ఉండాలి. తీసుకునేది 300 మిల్లీ లీటర్లు ప్రతి మనిషిలో 5 లీటర్ల రక్తం ప్రవహిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు. రక్తదానం సమయంంలో ప్రతి వ్యక్తి నుంచి కేవలం 300 మిల్లీ లీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. ఆ రక్తం మళ్లీ కొన్ని గంటల్లోనే శరీరంలో తయారవుతుంది. అన్ని పరీక్షలు చేసిన తర్వాతే రక్తం సేకరిస్తారు. సేకరించిన రక్తాన్ని అవసరం మేరకు రోగులకు ఎక్కిస్తారు. -
సౌకర్యం ఉన్నా..ఫలితం సున్నా..!
సాక్షి, ప్రొద్దుటూరు : ప్రాణాపాయంలో రక్తం ద్వారా మనిషిని కాపాడవచ్చు. ఎలాంటి ఆస్పత్రుల్లోనైనా మొదటి ప్రాధాన్యత రక్తానిదే. రక్తపు నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సైతం రక్తపు నిల్వలు లభించడం కష్టతరంగా మారింది. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం జిల్లాకు రక్తసేకరణ, రవాణా వాహనాన్ని మంజూ రు చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోజూ ఆయా ప్రాంతాల్లో రక్తాన్ని సేకరించి ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రజాదరణ లేక రక్త సేకరణలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అన్ని సౌకర్యాలు కలిగిన వాహనం ఉన్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. రూ.48లక్షలతో వాహనం ఏర్పాటు జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా దేశంలోని మిగతా జిల్లాలతోపాటు వైఎస్సార్ జిల్లాకు రక్తసేకరణ, రవాణ వాహనాన్ని మంజూరు చేశారు. ఇందు కోసం రూ.48లక్షలు వెచ్చించారు. 2017 సెప్టెంబర్ 19న ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఏసీతో కూడిన ఈ వాహనంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా ఈ వాహనం పనిచేస్తోంది. స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్‌బ్యాంకు డాక్టర్ కవిత వాహన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వాహనానికి ఇరువురు ల్యాబ్ టెక్నీషియన్లతోపాటు డ్రైవర్ ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్లకు నెలకు రూ.19వేలు చొప్పున, డ్రైవర్‌కు రూ.15వేలు చొప్పున వేతనాలు ఇస్తున్నారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో తిరిగినందుకు నెలకు సుమారు రూ.15వేలు డీజల్ ఖర్చు వస్తోంది. నెరవేరని లక్ష్యం నిబంధనల ప్రకారం ఈ వాహనం ద్వారా నెలకు 1500 యూనిట్ల రక్తాన్ని సేకరించాల్సి ఉంది. అయితే ఇందులో సగం యూనిట్ల రక్తం కూడా సమకూరడం లేదని తెలుస్తోంది. 2017లో 1481 యూనిట్లు, 2018లో 3,704 యూనిట్లు మాత్రమే రక్తాన్ని సేకరించారు. కొన్ని నెలల్లో 120 యూనిట్ల రక్తం మాత్రమే సేకరించారు. ప్రధానంగా ప్రచారం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సేకరించిన రక్తాన్ని ప్రతి నెల పులివెందుల, ప్రొద్దుటూరు, కడపలోని మదర్ బ్లడ్‌బ్యాంకులకు అందించాల్సి ఉంది. వీటి ద్వారా జమ్మలమడుగు, బద్వేలు, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో రక్తాన్ని నిల్వ చేస్తారు. ప్రతి నెల ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి 500 యూనిట్లు, రిమ్స్‌కు 2వేల యూనిట్లు రక్తపు నిల్వలు అవసరమని సమాచారం. అయితే తగినంత రక్తపు నిల్వలు రాకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న వారు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లో రక్తం తీసుకోవాలంటే తప్పనిసరిగా బదులు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
రక్తనిధి ఖాళీ
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో రక్తనిధి కేంద్రానికి వెళ్లిన వారికి తీరా అక్కడ నిరాశే ఎదురవుతోంది. సకాలంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ దొరక్క క్షతగాత్రులు, పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణులు, తలసీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో పగటి ఉష్ణోగ్రతలు 40–43 సెల్సియస్ డిగ్రీలు నమోదు అవుతున్నాయి. దీంతో త్వరగా నీరసించే ప్రమాదం ఉంది. దీనికి తోడు కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఐపీఎం సహా రెడ్‌క్రాస్ సొసైటీ, వైఎంసీఏ, లయన్స్ క్లబ్ తదితర స్వచ్చంధ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించినా ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వలు నిండుకోవడంతో రోగుల అసరాలు తీర్చలేని దుస్థితి నెలకొంది. క్షతగాత్రులకు నరకమే..: రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కేర్, యశోద, కామినేని, కిమ్స్ వంటి ఆసుపత్రులకు ఎక్కువగా తీసుకువస్తారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వారిని సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి చికిత్స సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్ రాసిచ్చిన చీటీ తీసుకుని రక్తనిధి కేంద్రాలకు వెళ్తే, తీరా అక్కడ స్టాకు లేదంటున్నారు. ఒక వేళ ఉన్నా..బాధితుడి బంధువుల్లో ఎవరో ఒకరు రక్తదానం చేస్తేకాని అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెళిక పెడుతున్నారు. సకాలంలో రక్తం దొరక్క పోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో చికిత్సలు వాయిదా పడుతున్నాయంటే ఆశ్చర్య పోనవసరం లేదు. ప్రైవేటు బ్లడ్ బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాలనే నిబంధన ఉన్నా పట్టించుకోవడం లేదు. కొందరు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వహకులు, కార్పొరేట్ ఆస్పత్రులు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రూ.1500–2500 వరకు విక్రయిస్తుండటం కొసమెరుపు. తలసీమియా బాధితులకు దొరకడం లేదు నగరంలో సుమారు మూడు వేల మంది తలసీమియా బాధితులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతి 15–20 రోజుల కోసారి రక్తం ఎక్కిం చాల్సి ఉంటుంది. ఇలా రోజుకు 30–40 యూనిట్ల రక్తం అవసరం. రక్తదాన శిబి రాలు ఏర్పాటు చేస్తే పగటి ఉష్ణోగ్రతలకు బయపడి రక్తదానం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులకు రక్తం సరఫరా చేయ డం మాకు చాలా కష్టంగా మారింది. గత్యంతరం లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని కొనుగోలు చేస్తున్నారు.–అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి,తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ -
టాటా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
న్యూయార్క్ : తెలంగాణ అమెరికన్ తెలుగు అసోషియేషన్ (టాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదానం శిబిరానికి భారీ స్పందన లభించింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా న్యూయార్క్ టాటా టీమ్ హప్పాగేలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి రక్తదాతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో 100 మంది టాటా సంస్థ సభ్యుల కుటుంబాలు పాల్గొన్నాయి. వారి నుంచి 55 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. టాటా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లిక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటైంది. ప్రతి ఒక్కరు రక్తాన్ని దానం చేయాలని మల్లిక్ రెడ్డి కోరారు. శిబిర ఏర్పాటుకు సహకరించిన డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి( టాటా ఆడ్వేజరీ కౌన్సిల్ చైర్మన్), విక్రమ్ రెడ్డి (టాటా ప్రెసిడెంట్), టాటా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్వీపీ మల్లిక్ రెడ్డి, రంజిత్ క్యాతమ్, శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, పవన్ రవ్వ, మాధవి సోలేటి, శ్రీనివాస్, రఘురాం పన్నాల, రమ వనమ, ప్రహ్లాద్, సత్య గగ్గెనపల్లి, యోగి వనమ, హేమంత్ కంచెర్ల, మౌనిక పెద్దిరెడ్డి, రవ్వ రాగిని, అనిత గగ్గెనపల్లి, త్రినాథ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.