Bolla Brahma Naidu
-
నేడు వినుకొండకు వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ శుక్రవారం పల్నాడు జిల్లా వినుకొండ రాను న్నారు. టీడీపీ గూండాల చేతిలో బుధవారం రాత్రి వినుకొండలో నడిరోడ్డుపై దారుణంగా హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శిస్తారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయలు దేరి గుంటూరు, చిలకలూరిపేట, నరసరావుపేట బైపాస్ మీదుగా వైఎస్ జగన్ వినుకొండ చేరుకుంటారు.టీడీపీ మూకల నరమేథం ఘటన గురించి తెలిసిన వెంటనే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో ఫోన్లో మాట్లాడారు. హత్య ఘటన, వినుకొండలో పరిస్థితిని ఆరా తీశారు. స్థానిక పార్టీ నాయకులంతా వెంటనే రషీద్ కుటుంబ సభ్యులను కలిసి తోడుగా నిలవాలని ఆదేశించారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేదు..రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో కూ టమి సర్కారు ఘోర వైఫల్యం, టీడీపీ నేతల అరాచక పర్వంపై వైఎస్ జగన్ గురువారం ‘ఎక్స్’ వేదిక గా స్పందించారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగు తోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని, ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. ‘వైఎస్సార్ సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పా ల్పడుతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఏపీ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షపూరిత దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది. నిన్న వినుకొండ లో నరమేథం ఘటన దీనికి పరాకాష్ట. నడి రోడ్డుపై జరిగిన ఈ దారుణం ప్రభుత్వానికి సిగ్గు చేటు’ అని పేర్కొ న్నారు. సీఎం సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశా లతో ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ‘ఎవరి స్థాయిలో వారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీస్ సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. దీంతో నే రగాళ్లు, హంతకులు చెలరేగి పోతున్నారు’ అని పేర్కొన్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధా నాలు వీడాలని సీఎం చంద్రబా బును గట్టిగా హెచ్చరిస్తున్నట్లు చెప్పా రు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై న తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్రప్రభుత్వ ఏజెన్సీ లతో ప్రత్యేక విచారణ నిర్వహించాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కార్యకర్తలెవరూ అధైర్యపడొద్దని, అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. టీడీపీ మూక చేతిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ అరాచకాలకు చంద్రబాబుదే బాధ్యతపుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పలపై టీడీపీ శ్రేణులు దాడి చేయడాన్ని వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. వినుకొండలో నరమేధానికి తెగబడి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో మిథున్‌రెడ్డి, రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణలో ఘోరంగా విఫలమైందని చెప్పేందుకు ఈ అరాచకాలే నిదర్శనమని, వీటికి సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. -
రాక్షస పాలనపై ప్రజా పోరాటం చేద్దాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో సాగుతోన్న రాక్షస పాల నపై ప్రజాపోరాటం చేద్దామని వైఎస్సార్సీపీ అధ్య క్షుడు వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్త జిలానీ నడిరోడ్డుపై పాశ వికంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘట న గురించి తెలియగానే బెంగళూరులో ఉన్న వైఎస్ జగన్ వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. రషీద్ కుటుంబానికి అండగా నిలవాలని ఆదేశించారు.గురు వారం బెంగళూరు నుంచి తాడేపల్లిలోని నివా సానికి చేరుకున్న వైఎస్ జగన్.. అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పుడు గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలు జరిగిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అధికారంలోకి వచ్చిన పార్టీ దృష్టి పెట్టాలిగానీ.. వైఎస్సార్సీపీని అణగదొక్కాలనే కోణంలో దారు ణాలకు పాల్పడటం హేయమన్నారు.కొత్తగా కొలు వుదీరిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దామని అనుకున్నామని.. కానీ అధికారంలోకి వచ్చిన నెల న్నరలోనే హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు రాష్ట్రాన్ని చిరునామాగా మార్చేశారని తెలిపారు. వినుకొండలో రషీద్‌ను పాశవికంగా హత్య చేయడం అందుకు పరాకాష్ట అన్నారు. ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే పుంగనూరులో ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్పపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని మండిపడ్డారు.శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందనడానికి నెలన్నర రోజులుగా సాగుతున్న అరాచకాలే తార్కాణమన్నారు. ప్రజ లందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. కానీ సీఎం సహా బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తులే రాజకీయ దురు ద్దేశాలతో వెనకుండి ప్రోత్సహిస్తుండటం వల్లే ఇ లాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయ న్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని.. అంద రికీ అండగా నిలుస్తామని జగన్ భరోసా ఇచ్చారు. -
వినుకొండ ఘటనపై బొల్లా బ్రహ్మనాయుడు ఫైర్
-
మీరంతా ఆశీర్వదిస్తే నరసరావుపేట ఎంపీగా గెలుస్తా: అనిల్
-
పాటతో శ్రీ కృష్ణ దేవరాయలుని ఏకిపారేసిన బ్రహ్మనాయుడు
-
ప్రతి ఇంట్లో ఉండే మనిషి సీఎం జగన్
-
ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్టుగా ప్రచారం
గుంటూరు ఈస్ట్: టీడీపీ గూండాల దాడిలో గాయపడి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ శావల్యాపురం మండల కన్వినర్ భీమని అంకారావును వైఎస్సార్సీపీ నేతలు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే తనపై దాడి చేసి రెండు గంటల పాటు తన కారును అడ్డగించారని, తన ప్రాణాలకు ముప్పు వాటిల్లడంతో అంకారావు అడ్డుగా రావడంతో టీడీపీ నేతల చేతుల్లో తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు వేసుకున్న రాళ్లే వాళ్లకు తగిలాయన్నారు. టీడీపీ నేత పుల్లారావు, ఆయన భార్య చేసిన దోపిడీ గురించి అందరికీ తెలుసన్నారు. ధూళిపాళ్ల నరేంద్ర సంగం డెయిరీలో సంతకాలు ఫోర్జరీ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తనకు అక్రమ ఆస్తులున్నట్టు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. జీవీ ఆంజనేయులు ఎన్ఎస్పీ కాలువ పైన రైతుల వద్ద నుంచి కొన్న భూమిలో గెస్ట్‌హౌస్ నిర్మించారని.. ప్రభుత్వం దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు వినుకొండలో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే బొల్లాపై టీడీపీ శ్రేణుల దాడి
సాక్షి, నరసరావుపేట, వినుకొండ(నూజెండ్ల): పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై గురువారం వినుకొండ పట్టణంలో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురు రోడ్డుపై కారును అడ్డగించి కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే బొల్లా గన్‌మెన్ తలపై టీడీపీ జెండాలు కట్టిన వెదురు కర్రలతో దాడి చేయడంతో తీవ్ర గాయమైంది. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడి నుంచి ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో కొంతమంది వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం గాయపడ్డారు. బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే బొల్లా తన కారులో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ బస్టాండ్ మీదుగా వెళుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తల మీద అక్రమ కేసులు నమోదు చేశారంటూ నిరసన కార్యక్రమం పేరిట వందలాది మంది టీడీపీ కార్యకర్తలు గుమికూడి ఒక్కసారిగా ఎమ్మెల్యే కారును అడ్డగించారు. నిరసన కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి తీసుకోలేదు. ప్రభుత్వ భూముల్లో మట్టి అమ్ముకున్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలని, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ఆయన అనుచరులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు, టీడీపీ జెండాలతో భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే కాన్వాయ్‌ను చుట్టుముట్టారు. పోలీసులు వారిస్తున్నా ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. సుమారు గంట సేపు కాన్వాయ్‌ని కదలనివ్వకుండా రణరంగం సృష్టించారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న వైఎస్సార్సీపీ శ్రేణులను చూసి మరింత రెచ్చిపోయి రాళ్లు, గాజు సీసాలు, కొబ్బరి బొండాలతో దాడికి తెగబడ్డారు. ఎమ్మెల్యేను టీడీపీ శ్రేణుల దాడి నుంచి తప్పించేందుకు పోలీసులు లాఠీచార్జి చేసినా వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే కారుపై పెద్దపెద్ద బండలతో దాడి చేశారు. ఎమ్మెల్యేను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న గన్‌మెన్ నబీపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయమైంది. పరిస్థితి అదుపు తప్పడంతో వినుకొండ టౌన్ సీఐ సాంబశివరావు గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రద్దు చేసుకుని పోలీసు బందోబస్తు నడుమ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. పోలీసులు వినుకొండ పట్టణంలో 144 సెక్షన్‌ను విధించారు. పథకం ప్రకారమే దాడి.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బొల్లా తగిన ఆధారాలు చూపుతూ తన నిజాయితీని నిరూపించుకుంటూ వస్తున్నారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆగస్టు ఒకటో తేదీన వినుకొండలో జరగనున్న నేపథ్యంలో పొలిటికల్ మైలేజీ కోసం ఎలాగైనా గొడవలు సృష్టించి అధికార పార్టీపై, స్థానిక ఎమ్మెల్యేపై లోకేశ్‌తో విమర్శలు చేయించాలని ఆంజనేయులు తాపత్రయపడుతున్నారు. పథకం ప్రకారమే వినుకొండలో సంగం డెయిరీలో కూర్చుని టీడీపీ అల్లరి మూకలను రెచ్చగొట్టి వదిలారు. ముందుస్తు పథకంలో భాగంగానే ఎమ్మెల్యే కారు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేయించారు. అదే సమయంలో తమ అనుకూల మీడియాలో మాత్రం వైఎస్సార్సీపీ నేతలే తమపై దాడులు చేశారని ప్రచారం చేయించారు. నాపై దాడికి జీవీ పక్కా ప్లాన్: ఎమ్మెల్యే బొల్లా వినుకొండ అభివృద్ధి, కార్యకర్తల కోసం తన ప్రాణాలైనాలెక్క చేయనని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. టీడీపీ అల్లరి మూకల దాడి అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయంగా ఎదగలేక తనను అంతమొందించేందుకు జీవీ ఆంజనేయులు కుట్ర పన్నారని ఆరోపించారు. గతంలో బొగ్గరం తిరునాళ్లలో తన కారుపై రాళ్లురువ్వి దాడులకు పాల్పడ్డారని, మరోమారు తనపై దాడికి జీవీ పక్కా ప్లాన్ వేశారని చెప్పారు. దాడిని ఖండించిన మంత్రి రజిని ఎమ్మెల్యే బొల్లాపై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు మంత్రి రజిని, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. నరసరావుపేటలో వారు మీడియాతో మాట్లాడుతూ కోల్పోయిన తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ ఇలా దాడులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు వారిని ఎప్పటికీ నమ్మబోరన్నారు. వినుకొండ ప్రశాంతతను చెడగొడుతున్న జీవీ ‘తన రాజకీయ లబ్ధి కోసం జీవీ అంజనేయులు నిత్యం ఏదో ఒక గొడవ చేస్తూ వినుకొండ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు. ఎన్నడూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. ఎమ్మెల్యే బొల్లాను రాజకీయంగా ఎదుర్కొవడం చేతకాక టీడీపీ వర్గాలు ఇలా దాడులకు తెగబడుతున్నాయి.’ – మక్కెన మల్లికార్జున, మాజీ ఎమ్మెల్యే -
టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై దాడి!
సాక్షి, గుంటూరు: వినుకొండలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. బ్రహ్మనాయుడు కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ సంద్బరంగా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడిని టీడీపీ శ్రేణులు అరగంటపాటు అడ్డుకున్నారు. వారి రాళ్ల దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడిలో ఎమ్మెల్యే గన్‌మెన్‌కు గాయాలయ్యాయి. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. ఈ క్రమంలో వినుకొండలో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. అనంతరం.. ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియాతో మాట్లాడుతూ.. నేను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళ్తుంటే దాడికి దిగారు. టీడీపీ నేతలు నా కారుపై రాళ్ల దాడి చేశారు. కావాలనే వారు ప్లాన్ ప్రకారం నాపై దాడి చేశారు. నాపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారు. టీడీపీ కుట్రలను తిప్పి కొడతాం. ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను. రెండు రోజుల క్రితం నా డెయిరీ ఫామ్‌ను ధ్వంసం చేశారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారు. ప్రజల తిరుగబాటుతో తోక ముడిచారు. జీవీ ఆంజనేయులుకు ప్రజాభిమానం లేదు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలది నీచమైన సంసృతి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఇది కూడా చదవండి: జగనన్న విదేశీ విద్యా దీవెన నిధులు జమ చేసిన సీఎం జగన్ -
టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్.. ఎమ్మెల్యే ధీటైన జవాబు
సాక్షి పల్నాడు: వినుకొండ మండలం శావల్యాపురంలో తెలుగుదేశం నాయకులు ఓవరాక్షన్‌కు దిగారు. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా శావల్యపురంలో జీవీ ఆంజనేయులు పాదయాత్ర చేశారు. అయితే.. ఈ క్రమంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ యాత్రకు తారసపడ్డారు. అయితే.. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి వాహనానికి టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. వాహనాన్ని చుట్టుముట్టి పార్టీ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. దీంతో సహనం నశించిన ఎమ్మెల్యే.. ఆగ్రహంతో బయటకు వచ్చారు. ‘రండిరా.. చూసుకుందాం..’ అంటూ యెల్లో బ్యాచ్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈలోపు రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి చెదరగొట్టారు. పోలీసులు కలుగజేసుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఎమ్మెల్యే కారును అక్కడి నుంచి పంపించేశారు. -
రూ. 20 కోట్ల లంచం అడిగారు.. అడగలేదని ప్రమాణం చేయగలరా?
అమరావతి: గతంలో గౌతమ బుద్ధ టెక్స్టైల్స్ అనుమతికి టీడీపీ నేత ప్రతిపాటి పుల్లారావు లంచం అడిగారని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. తాను పార్టీ మారడంతో డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేసిన విషయాన్ని బ్రహ్మనాయుడు మీడియాకు తెలిపారు. ఈరోజు(మంగళవారం) అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన బ్రహ్మనాయుడు.. ‘వాళ్ల ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారు. లంచం అడగలేదని ప్రతిపాటి పుల్లారావు ప్రమాణం చేయగలరా?, చంద్రబాబు హెరిటేజ్ డెయిరీ పెట్టిన నాటి నుంచి తొక్కేయాలని చూశారు. హెరిటేజ్‌ను తిరుమల డెయిరీ క్రాస్ చేసింది. 2012లో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ కు టెండర్ వేశాను. టెండర్ ప్రకారమే డబ్బులు కట్టాను ...రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా. గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి ప్రత్తిపాటి పుల్లారావు నన్ను 20 కోట్లు లంచం అడిగారు. ఆ 20 కోట్లు చంద్రబాబు నుంచి లోకేష్ దాకా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు నన్ను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నా . కానీ ప్రత్తిపాటి పుల్లారావు అలా చేయలేదు. నన్ను పెట్టిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. నేను కష్టాన్ని నమ్ముకునే వ్యక్తిని... అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నన్ను దెబ్బకొట్టాలన్నదే చంద్రబాబు ఉద్ధేశం’ అని తెలిపారు. -
ఆ టీడీపీ నేత సిగ్గు లేకుండా రూ.20 కోట్లు అడిగాడు: ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు
సాక్షి, అమరావతి: గతంలో చంద్రబాబు ముంచేసిన పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్ చేయూత అందించారని రాష్ట్రంలో కొత్తగా 2 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. శానస సభలో ‘పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులు’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీలిచ్చి పరిశ్రమలకు అండగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో కొత్తగా పోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతీయస్థాయిలో పోటీపడి బల్క్ డ్రగ్ పార్క్ సాధించామన్నారు. చదవండి: ఆ నాలుగు రాష్ట్రాల్లో ఏపీ ఒకటని చెప్పడానికి గర్వపడుతున్నా: సీఎం జగన్ ఏపీలో వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతోందన్నారు. రీ సర్వే ద్వారా ఎంతో మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామిక రంగం చాలా ఇబ్బందులకు గురైందన్నారు. గతంలో ఏపీలో పర్రిశమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభించడంతో పాటు, చక్కటి ప్రోత్సాహం లభిస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎంవోయూలు చేసుకోవడం తప్ప, అమలు పరిచిన పరిస్థితి లేదన్నారు. గతంలో ఓ టీడీపీ నేత సిగ్గు లేకుండా తనను లంచం అడిగాడని బ్రహ్మ నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో తనకు జరిగిన ఘటన గురించి ఆయన వివరిస్తూ.. తాను 2012లో గౌతమ్‌బుద్ధ టెక్సాస్ పార్క్ పేరిట టెండర్ వేశానని, టెండర్ తనకే వచ్చిందన్నారు. డబ్బులు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ కూడా జరిగిందన్నారు. కేంద్రం నుంచి రూ. 40 కోట్లు సబ్సిడీ కూడా వచ్చిందన్నారు. సబ్సీడీ వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. రూ.40 కోట్లు సబ్సిడీలో తమకు రూ.20 కోట్లు లంచం ఇవ్వాలని, లేకపోతే అనుమతి ఇచ్చేదిలేదని చిలకలూరిపేటకు చెందిన టీడీపీ మంత్రి డిమాండ్ చేశారని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మండిపడ్డారు. -
మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులుపై ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆగ్రహం
-
ఇసుక రావడం కొంత లేటవుతోందని చెప్పా..
-
‘టీడీపీలో ఇక ఆ పదిమందే మిగిలేది’
సాక్షి, గుంటూరు : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆయన పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదని వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. పదిమంది తప్ప ఇంకెవరూ ఆ పార్టీలో మిగలరని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబుకు బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తాము వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అయినందుకు గర్వంగా ఉందని, కరోనా సమయంలోనూ ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనపై అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. ఇక మారుమూలన ఉన్న తమ వినుకొండ నియోజకవర్గానికి ఇసుక రావడంలో ఆలస్యం అవుతుందని తాను చెప్పానని, అయితే దాన్ని ఎల్లో మీడియా భూతద్ధంలో చూపిస్తోందని ధ్వజమెత్తారు. చదవండి: మోసం చేసే మాటలు వద్దు: సీఎం జగన్ -
‘సీఎంపై రాయపాటి వ్యాఖ్యలు అర్థరహితం’
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయపాటి చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గౌతమ్ టెక్స్టైల్స్ పార్క్‌ను ఎందుకు రద్దు చేయించారో చెప్పాలని బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. నిస్వార్థంగా పని చేస్తున్న ముఖ్యమంత్రిపై చంద్రబాబు కులముద్ర వేయిస్తున్నారని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గం ఉన్న జన్మభూమి కమిటీల వల్లే చంద్రబాబు 23 సీట్లుకు దిగజారారని ఆయన మండపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అది ఓర్వలేక రాయపాటిని చంద్రబాబు అస్త్రంగా చేసుకుని కుట్రలు పన్నుతున్నారన్నారు. బ్యాంకులు లూటీ చేసిన చరిత్ర రాయపాటిదని అన్నారు. కమ్మ సామాజిక వర్గానికి తామంతా అండగా ఉంటామని ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు హామీ ఇచ్చారు. -
రాజధానిపై వదంతులు నమ్మవద్దు
సాక్షి, రొంపిచర్ల(గుంటూరు) : రాజధాని అంశంపై టీడీపీ నాయకులు చేస్తున్న వదంతులు నమ్మవద్దని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. రొంపిచర్లలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారే గానీ రాజధానిని మారుస్తామని చెప్పలేదన్నారు. రాజధానిని నిర్మించాలంటే రూ.50 వేల కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం 34 వేలు ఎకరాలు తీసుకుందని, కానీ కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ప్రాంతం భూకంపాలు, వరదలకు నిలయంగా ఉంటుందని చెప్పిందని గుర్తు చేశారు. అక్కడ రాజధాని వద్దని చెప్పినా టీడీపీ నాయకులు ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా ముందుగానే 2 వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఇప్పటికే విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నాయకుల కోసమే రాజధాని అమరావతిలో ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఈ భూముల్లో పునాదులు 30 మీటర్ల లోతు నుంచి వేయాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీకి కూడా 100 అడుగుల లోతు నుంచి పునాదులు వేయాల్సి వచ్చిందన్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని జిల్లాలో గల జోన్–1, 2 పరిధిలో వరి పండించుకునేందుకు సాగునీరు అందుతుందన్నారు. వరి పంట సాగు చేసేందుకు విత్తనాలు కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే రొంపిచర్ల మార్కెట్‌యార్డులో 1000 క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 56 వేల టన్నుల యూరియా, 28 వేల టన్నుల ఎరువులు సిద్ధం చేశామని చెప్పారు. -
పమిడిపాడు కాలువగట్టుపై రైతుల ఆందోళన
-
పమిడిపాడు కాలువగట్టుపై రైతుల ఆందోళన.. ఉద్రిక్తత
సాక్షి, గుంటూరు: సాగునీరు విడుదల కోరుతూ రైతులు ఆందోళనకు దిగడంతో నూజెండ్లలోని పమిడిపాడు వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో రైతులు పమిడిపాడు కాలువకట్టపై బైఠాయించి.. ఆందోళనకు దిగారు. అయితే, పోలీసులు రైతుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా అరెస్టు చేసి.. అక్కడి నుంచి తరలించారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో బొల్లా బ్రహ్మనాయుడు కిందపడిపోయి.. స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. -
హత్యతో బ్రహ్మనాయుడికి సంబంధం లేదు
వినుకొండ: గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయిన మల్లికార్జున్ అనే ముగ్గురు యువకులు వినుకొండ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బొల్లా బ్రహ్మనాయుడే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనిని వైఎస్సార్సీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణ చేపట్టిన వినుకొండ సీఐ శ్రీనివాస రావు మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి బొల్లా బ్రహ్మనాయుడుకి ఈ కేసుతో సంబంధం లేదని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల సోమయ్యకు, ఎనుగంటి రామకోటయ్యకు మధ్య ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి..పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని తెలిపారు. రోడ్డు ప్రమాదంగా సృష్టించాలని నిందితులు భావించారని పేర్కొన్నారు. గతంలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, తాజాగా సిమెంటు రోడ్డు విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని అన్నారు. -
టీడీపీ శవరాజకీయాలపై స్థానికుల ఆగ్రహం
-
నీచ రాజకీయాలు ఎన్నటికీ చేయను
గుంటూరు, వినుకొండ టౌన్: నీచ రాజకీయాలను ఎన్నటికీ చేయనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. వినుకొండ మండలంలోని ఎ.కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా వెంకటకృష్ణ, గురజాల సోమయ్య, మేడబోయన మల్లిఖార్జున్ ముగ్గురు యువకులు వినుకొండకు సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామంలో వివాదాల కారణంగా కారుతో ఢీకొట్టి ప్రమాదం సృష్టించారని ఆరోపణలు ఉత్పన్నమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బొల్లానే ముగ్గురి మృతికి కారణమంటూ ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన బొల్లా స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. హత్యా రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదని, కార్యకర్తలను రెచ్చగొడుతూ వారి మధ్య వివాదాలను సృషించి రాజకీయ లబ్ధిపొందాలని శాసనసభ్యుడు జీవీ ఆంజనేయులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హత్యా రాజకీయాలు చేయడం, ప్రోత్సహించడం తనకు తెలియని విషయాలని చెప్పారు. హత్యలు ఎవరు చేస్తారో? చేయిస్తారో? ప్రజలకు తెలుసన్నారు. గతంలో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయిన జీవీ హత్యల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముగ్గురిని బలిగొన్నాక కన్వీనర్ సస్పెండా? 2004లో జీవీకి పార్టీ అధిష్టానం అసెంబ్లీకి పోటీ చేసేందుకు సీటు ఎందుకు కేటాయించలేదో? నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని బొల్లా గుర్తుకు చేశారు. 62 ఏళ్లలో వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా నిజాయితీగా చేయడం బ్రహ్మనాయుడుకు మొదటి నుంచి వచ్చిన అలవాటని చెప్పారు. ఎమ్మెల్యే కొత్తపాలెం గ్రామం పార్టీలో వర్గాలను తయారు చేసి వివాదాలకు కారణం కాలేదా అని ప్రశ్నించారు. అందులో భాగంగా టీడీపీ గ్రామ పార్టీ నాయకుడికి వారి పార్టీలో వారికే విభేదాలు వచ్చాయన్నది ఎమ్మెల్యేకు తెలియదా అన్నారు. దీనిని పరిష్కరించకుండా వివాదాన్ని పెంచి పోషిస్తున్నది ఎమ్మెల్యే కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఆ వివాదాలను పరిష్కరించుకోవడం కోసం కొందరు మోటారు సైకిల్‌పై, మరికొందరు కారులో వస్తుండగా జరిగిన ఘోరం కాదా ఇది అని నిలదీశారు. ఎమ్మెల్యే పెట్టిన రాజకీయ చిచ్చులో అమాయకంగా ముగ్గురు ముక్కుపచ్చలారని యువకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ సంస్కృతి, రాజకీయాలను ఎన్నటికీ చేయనని బొల్లా చెప్పారు. నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతున్న ఎమ్మెల్యే ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు. ప్రజల్లో ఉనికిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే జీవీ నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నిజానిజాలు ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. ముగ్గురి ప్రాణాలు పోయిన తర్వాత పార్టీ గ్రామ కన్వీనర్‌ను సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. ముందు నుంచి వారి మధ్య వస్తున్న వివాదాలను పరిష్కరించి ఉంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేవి కాదు అన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆంజనేయులు చరిత్ర అందరికీ తెలుసు
-
టీడీపీ ఎమ్మెల్యే.. స్మగ్లర్లకు డాన్
సాక్షి, గుంటూరు: వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు స్మగ్లింగ్ చేసి డబ్బులు సంపాదించారని, ఆయన స్మగ్లర్లకే డాన్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నేత బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. హత్యా రాజకీయాలు, శవరాజకీయాలు చేసే చరిత్ర ఆంజనేయులుదేనని మండిపడ్డారు. వ్యాపారంలో సొంత భాగస్వామిని హత్య చేయించిన వ్యక్తి ఆంజనేయులు అని అన్నారు. భాగస్వామి భార్యను బెదిరించి.. వారి ఆస్తులన్నీ బలవంతంగా ఆంనేయులు లాక్కున్నారని అన్నారు. ఆంజనేయులు వేలకోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై హత్య కేసు బనాయించడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని, ఈ మేరకు పోలీసులపై ఆయన తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. పోలీసులు పక్షపాతం లేకుండా ఈ కేసును విచారిస్తే వాస్తవం ఏమిటో తెలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆంజనేయులు ముగ్గురిని చంపినట్టు వినుకొండలో ప్రచారం జరుగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వినుకొండలో వైఎస్సార్సీపీ గెలుస్తుందని అన్నారు. -
జననేత దీక్షలే మాకు శ్రీరామరక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పెదకూరపాడు ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు ‘మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజల కోసం ఎన్నో దీక్షలు, ఉద్యమాలుచేశారు. అవే మా గెలుపునకు శ్రీరామరక్ష కానున్నాయి. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అభిమానం, ఆప్యాయతలను ప్రజలు వైఎస్ జగన్‌పై చూపుతున్నారు. ఫ్యాను గుర్తుకు ఓటేసి మళ్లీ స్వర్ణయుగం తెచ్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జననేత జగన్‌ను సీఎంను చేసేందుకు ఎదురుచూస్తున్నారు.’ అని పెదకూరపాడు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. ఆయనతో సోమవారం న్యూస్‌లైన్ ఇంటర్వ్యూ నిర్వహించగా పలు విషయాలు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రజలు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే గెలుపొందాలని కోరుకుంటున్నారు. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని విశ్వసిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధికి నేను ప్రత్యేక ప్రణాళిక రూపొందించాను. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే పర్యటించా. ప్రజల అవసరాలు నాకు తెలుసు. వాటికనుగుణంగా ప్రణాళిక తయారుచేయించాను. ఎమ్మెల్యేగా గెలవగానే దీన్ని అమలుచేస్తాను. అభివృద్ధి పనులే ప్రధాన ధ్యేయం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే బెల్లంకొండ అడ్డరోడ్డు నుంచి అమరావతి వరకు డబల్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తా. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మిస్తా. అమరావతి, నరుకుళ్లపాడు మధ్యలో ప్రమాదభరితంగా ఉన్న చప్టాను హైలెవల్ బ్రిడ్జిగా నిర్మిస్తా. బెల్లంకొండ మండలంలో పులిచింతల నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తా. కొందరికి నష్టపరిహారం అందక, మరికొందరికి పునరావాసం ఏర్పాటుకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆయన నాయకత్వంలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాల్లో కృష్ణానదిపై లిఫ్ట్ ఇరిగేషన్లు ఏర్పాటుచేసి రైతులు పంటలు పండించుకునేందుకు వీలుగా నీరందించేందుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటాను. పెదకూరపాడులో పేదలకు ఇళ్ల స్థలాలు, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తా. పులిచింతల ప్రాజెక్టుకు వెళ్లేందుకు రోడ్డు నిర్మిస్తా. యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి నియోజకవర్గంలో అత్యధికంగా పత్తి, మిర్చి పంటలు పండిస్తుంటారు. ఈ ప్రాంతంలో రైతుబజార్లు, పరిశ్రమల స్థాపనకు కృషి చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తా. నియోజకవర్గ కేంద్రం పెదకూరపాడుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు కృషిచేస్తా. అమరావతిలో పర్యాటకులకు సౌకర్యాల ఏర్పాటుకు కృషిచేస్తాను. విద్యారంగ అభివృద్ధికి చొరవ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో మోడల్ పాఠశాలలు నిర్మించేలా చొరవతీసుకుంటాను. ఇతర ప్రభుత్వ రంగ విద్యాసంస్థల ఏర్పాటుకు కృషి చేస్తా. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అందరి సాయం తీసుకుంటా. ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు పూర్తిస్థాయిలో పనిచేస్తా.