burns
-
విస్తారా విమానంలో బాలికపై పడిన హాట్ చాక్లెట్.. తీవ్ర గాయాలు
ఈ మధ్యకాలంలో విమానంలో ప్రయాణికులు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. ప్రయాణికుల చేష్టలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా మరో ఘటన జరిగింది. అయితే ఈసారి ప్రయాణికురాలైన 10 ఏళ్ల చిన్నారిపై విమనయాన సిబ్బంది హాట్ చాక్లెట్ ఒలకబోసింది. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి ఫ్రంక్ఫర్ట్కు వెళ్తున్న విస్తారా విమానంలో ఆగస్టు 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆసల్యంగా వెలుగులోకి వచ్చాయి. రచనా గుప్తా అనే మహిళా తన కూతురితో కలిసి ఫ్రంక్ఫర్ట్కు విస్తారా విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో చిన్నారి ఓ కప్పు హాట్ చాక్లెట్‌ని ఆర్డర్ చేసింది. దీనిని తీసుకొచ్చిన సిబ్బంది ప్రమాదవశాత్తూ చిన్నారి ఎడమ కాలుపై పడటంతో తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి, విమానం ల్యాండ్ అయ్యాక అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆసుపత్రికి తరలించారు. ఎయిర్‌హోస్టెస్ తప్పిదం కారణంగాబాలికకు గాయాలైనట్లు గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే జరిగిన ఈ పరిణామానికి విమానయాన సంస్థ కనీసం క్షమాపణలు చెప్పలేదని, వైద్య ఖర్చులు కూడా చెల్లించలేదని ఆమె ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ బిల్లు 503 యూరోలు, ఆసుపత్రి బిల్లు కూడా మేమే కట్టున్నామని గుప్తా తెలిపారు. అంతేగాక ఈ ఘటన ద్వారా లిస్బన్‌కు వెళ్లాల్సిన తమ కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయ్యామని ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడానికి ఎయిర్‌లైన్స్ ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే, తమ బృందాలు కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నాయని, వారిని భారత్‌కు తిరిగి వచ్చేందుకు వీలు కల్పించామని, వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దురదృష్ట ఘటనలు ఎదురవ్వకుండా చూసుకుంటామని తెలిపింది. చదవండి: మణిపూర్ హింసపై 53 సభ్యులతో సీబీఐ దర్యాప్తు.. బృందంలో 29 మంది మహిళా అధికారులు -
గుర్‌గ్రామ్‌కు పాకిన అల్లర్లు.. రెస్టారెంట్‌కు నిప్పు పెట్టిన అల్లరిమూకలు..
చంఢీగర్: హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తోంది. ఆందోళనలు ప్రారంభమై 18 గంటలు గుడుస్తున్నా ఏమాత్రం చల్లారడం లేదు. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లా నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాద్షాపూర్ ప్రాంతంలో తాజాగా నిరసనకారులు రెచ్చిపోయారు. దుకాణాలను ఆందోళనకారులు కూల్చేస్తున్నారు. ఓ రెస్టారెంట్‌కు నిప్పంటించారు. మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో దాదాపు 200 మంది ఆందోళనకారులు ఆ ప్రాంతానికి వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. షాపులను, మాంసం దుకాణాలను కూల్చివేసినట్లు వెల్లడించారు. ఎవరూ గాయపడలేదని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ అల్లర్లలో దాదాపు నలుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘర్షణల్లో ఇప్పటికే 44 కేసులు నమోదు కాగా.. 70 మందిని అరెస్టు చేశారు. హర్యానాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానలా మారింది. అల్లర్లకు కేంద్ర స్థానమైన నుహ్ జిల్లాతో సహా పక్కనే ఉన్న ప్రాంతాలకు కూడా వ్యాపించింది. నుహ్ జిల్లాకు పక్కనే ఉన్న గురగ్రామ్‌కు కూడా ఈ అల్లర్లు వ్యాపించాయి. ఈ ఘర్షణల్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు హోం గార్డులు మరణించగా.. నిన్న రాత్రి జరిగిన అల్లర్లలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పటివరకు 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే శోభాయాత్రపై ఓ వర్గం ప్రజలు రాళ్లదాడి జరిపారు. అక్కడి నుంచి ప్రారంభమైన అల్లర్లు నుహ్ జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి. అల్లరిమూకలు ఇప్పటికే వందల వాహనాలకు నిప్పంటించారు. ఘర్షణలను అదుపు చేయడానకిి కర్ఫ్యూ కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్నెట్‌ని కూడా నిలిపివేసింది. సంయమనం పాటించాలని ప్రజలను సీఎం కోరారు. ఇదీ చదవండి: Haryana Nuh Violence: హర్యానాలో హై అలర్ట్.. కర్ఫ్యూ విధింపు.. -
కొంపముంచిన టిక్‌టాక్ రెసిపీ.. దెబ్బకు ముఖం వాచిపోయింది!
టిక్‌టాక్‌లో నెటిజన్ల మనసు దోచేయడానికి రకరకాల వీడియోలు చేస్తుంటారు. సరికొత్త రీల్స్‌తో ఫేమస్ అయిపోవాలని చూస్తుంటారు. ఈ విధంగానే ట్రై చేసిన టిక్‌టాక్ రీల్ ఓ మహిళ కొంపముంచింది. ఓ రెసిపీ కోసం రీల్ చేసే క్రమంలో ఆమె ముఖం కాలిపోయింది. అందమైన ఆవిడ ముఖం బొబ్బలతో నిండిపోయింది. 'జీవితంలో ఎదుర్కొన్న విపరీతమైన నొప్పి' అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆవిడ పేరు షాఫియా బషీర్(37). టిక్‌టాక్‌లో జనాలను అట్రాక్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వంటకం వీడియో తీయాలనుకుంది. ఈ క్రమంలో గుడ్లను మైక్రోవేవ్‌లో ఉడకబెట్టింది. ఆ తర్వాత బాగా ఉడికిన గుడ్లను బయటకు తీయాలనుకుంది. అందుకు చల్లని చెంచాను మైక్రోవేవ్‌లో పెట్టింది. అంతే.. అందులో ఉన్న వేడి నీరు ఒక్కసారిగా ఆమె ముఖం మీద పడ్డాయి. వెంటనే చల్లని నీటిలో ముఖం పెట్టినప్పటికీ.. తీవ్ర గాయాలయ్యాయి. ముఖమంతా బొబ్బలు వచ్చాయి. ఇంకేముంది ఆ తర్వాత ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఒంటరి మహిళ అయినందున చాలా ఖాళీ సమయం దొరుకుతుందని.. ఆ క్రమంలో టిక్‌టాక్‌లో వంటల వీడియోలు చేస్తుంటానని చెప్పింది. అయితే ప్రస్తుతం గాయం నుంచి కొలుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ ఘటన తన జీవితంలో విపరీతమైన నొప్పిని కలిగించిందని తెలిపింది. టిక్‌టాక్ వీడియోలు చేసే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చదవండి:‘ఏడాది పాటు షిప్పు ప్రయాణం’.. డబ్బు కట్టి గొల్లుమంటున్న జనం -
శానిటైజర్‌కు ‘అగ్ని’పరీక్ష,.. ఇద్దరికి తీవ్రగాయాలు
సాక్షి, బంజారాహిల్స్: శానిటైజర్ కాలుతుందో.. లేదో చూద్దామని అగ్గిపుల్ల గీసి వేయడంతో మంటలు చెలరేగి ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు...బంజారాహిల్స్ రోడ్ నం.4లోని యానిమల్ కేర్ సెంటర్లో వికారాబాద్‌కు చెందిన జె.మొగలప్ప నాలుగేళ్లుగా పని చేస్తున్నాడు. అతనితో పాటు పవన్ ఆఫీస్ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 12న ఇద్దరూ కలిసి ఐదు లీటర్ల శానిటైజర్‌ను ఓ చిన్న డబ్బాలోకి ఒంపుతుండగా, అసలు శానిటైజర్‌కు నిప్పు అంటుకుంటుందా లేదా అని పవన్‌కు అనిపించింది. వెంటనే తన వద్ద ఉన్న అగ్గిపెట్టెను తీసి అగ్గిపుల్లను గీసి శానిటైజర్లో వేశాడు. ఒక్కసారి మంటలు చెలరేగి ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డాడు. మొగలప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనగర్‌కాలనీ తన్వీర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దోమ తెరలు, బ్లాంకెట్ల సరాఫరా.. 60 కోట్ల కాంట్రాక్ట్ ఇప్పిస్తానని.. ) -
బాలికకు దెయ్యం పట్టిందని చిత్రహింసలు పెట్టిన ఓ బాబా
-
దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి
పరిగి: ఇంటర్ చదువుతున్న బాలిక.. అనారోగ్యానికి గురైంది.. ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు.. భూతవైద్యం చేస్తానంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.. చిత్రహింసలు పెట్టాడు.. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. భూత వైద్యం చేస్తానని.. వికారాబాద్ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిగి మండలం నస్కల్ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది. ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. మండే నిప్పులపై బాలికను నడిపించాడంతోపాటు ఆమెపై కాళ్లుపెట్టి నిల్చున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు. -
అమానుషం! బాలికను కొట్టి, అగరబత్తులతో కాల్చి...
Exorcist was arrested in Jharkhand: ఇంకా చాలా చోట్ల మూఢనమ్మకాలను విశ్వాసించే వాళ్లు ఉన్నారు. వాళ్ల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఆ దర్మార్గులు చేసే అకృత్యాలకు అంతేలేదు. చిన్న పెద్ద అనే భేదం లేకుండా మూఢనమ్మకాల పేరుతో సాగిస్తున్న హింసకు బలవుతున్నావారు కోకొల్లలు. అచ్చం అలాంటి సంఘటనే జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసుల కథనం ప్రకారం....జార్ఖండ్‌లోని చత్రా జిల్లాలో ఒక బాలిక హోలీ ఆడిన తర్వాత అస్వస్థతకు గురైంది. ఈ మేరకు మౌలానా ఎమ్‌డి వాహిద్ అనే భూతవైద్యుడు ఆ బాలిక భూతవైద్యం ద్వారా బాగుపడుతుందని ఆ బాలిక కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో ఆ బాలికను అతని వద్దకు తీసుకువచ్చారు. అతను ఆ బాలికను భూత వైద్యం పేరిట చిత్రహింసలకు గురిచేశాడు. అంతేకాదు ఆమెను కొట్టి, అగరబత్తీలతో కాల్చాడం వంటి అకృత్యాలను చేశాడు. దీంతో ఆ బాలిక మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. ఆ తరువాత ఆ బాలికను కుటుంబ సభ్యులు చత్రలోని సదర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పరిస్థితి క్షీణించడంతో రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కి తరలించారు. ఈ మేరకు బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు వాహిద్ (35)ను అరెస్టు చేసినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాకేష్ రంజన్ తెలిపారు. (చదవండి: నొప్పి భరించలేక యువతి ఆత్మహత్య) -
విద్యార్థుల ఫోన్లను తగలుబెట్టిన టీచర్లు!... మండిపడుతున్న నెటిజన్లు!
Students' Cellphones Seized Thrown Into Fire: విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టే నిమిత్తం టీచర్లు కచ్చితంగా కొన్ని కఠిన చర్యలు అమలు చేస్తుంటారు. అది వారి బావి భవిష్యత్తును దృష్టలో ఉంచుకుని కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరిస్తారు. అచ్చం అలానే ఇండోనేషియాలోని టీచర్లు విద్యార్థుల పట్ల కఠినమైన వైఖరిని అవలంభించారు. అయితే ఈ టీచర్లు విద్యార్థులు మాట వినకపోవటం వల్ల వాళ్లు అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో ఏమో తెలియదు గానీ విద్యార్థులను మాత్రం కాస్త కఠినంగానే శిక్షించారు. అసలు విషయంలోకెళ్తే...నిజానికి పాఠశాల్లో స్మార్ట్ ఫోన్లను కొన్ని గంటల సేపు నిషేధించడం లేదా స్టడీ అవర్స్ అయ్యేంతవరకు నిషేధిస్తారు. కానీ ఇండోనేషియాల బోర్డింగ్ స్కూల్లో స్మార్ట్ ఫోన్లు పూర్తిగా నిషేధించారో ఏమో తెలియదు గానీ విద్యార్థుల ఎంత చెప్పిన స్మార్ట్ ఫోన్లు తీసుకువస్తున్నారని టీచర్లు కోపంతో ఫోన్ల్నింటిని వారి వద్ద నుంచి తీసేసుకున్నారు. వాటిని వారి ముందే మంటల్లో వేసి కాల్చేశారు. ప్లీజ్ మేడం వద్దు అంటూ విద్యార్థులు అరుస్తున్నప్పటికీ వినిపించుకోకుండా టీచర్లు స్మార్ట్ ఫోన్లు మంటల్లో వేసేశారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు బహుశా టీచర్లు పదేపదే చెప్పినా విద్యార్థులు వినిపించుకోకపోవడంతో అలా చేసి ఉంటారని కొందరు, అయినా ఒకరి ఆస్తిని నాశనం చేసే హక్కు ఎవరికి లేదంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. View this post on Instagram A post shared by Fakta Indo | Berita Indonesia (@fakta.indo) (చదవండి: మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!) -
కూల్‌గా కూర్చోని ఫోన్ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో
ఓ వైపు స్మార్ట్ ఫోన్ విక్రయాలు పెరుగుదలతో పాటే వాటి రిపేర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక కొన్ని ఫోన్లు వాటి లోపల సాంకేతిక సమస్య మరేదో కారణం వల్ల వాడుతున్నప్పుడో, లేదా జేబులో పెట్టుకున్నప్పుడో పేలిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అందుకే నిపుణుల ఛార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్‌ని వాడకూడదని సూచిస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి ఫోన్‌ని రిపేర్ చేయాలని ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలిన ఘటన వియత్నాంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. షాపులోని ఓ వ్యక్తి తన డెస్క్ ముందు కూర్చోని ఫోన్ రిపేర్ చేస్తుంటే... సడెన్‌గా అది పెద్ద శబ్దంతో పేలింది. హఠాత్తుగా ఫోన్ పేలి మంటలు వచ్చాయి. అదృష్టవశాత్తు అతను అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అనంతరం దాన్ని జాగ్రత్తగా తీసి... షాప్ బయటకు విసిరేశాడు. అతను ఆలస్యం చేసి ఉంటే... పెద్ద అగ్ని ప్రమాదం జరిగేదే. అక్కడి సీసీటీవీ కెమెరా ఈ దృశ్యాన్ని రికార్డ్ చేసింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తూ.. "ఇదే ఫోన్ పాకెట్లో పేలితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... "లక్కీ బాయ్ నీకు ఏమీ కాలేదు" అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. చదవండి: హే! ఇది నా హెయిర్ స్టైయిల్... ఎంత క్యూట్‌గా ఉందో ఈ ఏనుగు!! -
ఔటర్ రింగ్ రోడ్డుపై అగ్నికి అహుతైన లారీ
-
రోచ్ గర్జన... ఇంగ్లండ్ 77 ఆలౌట్
బ్రిడ్జిటౌన్: వెస్టిండీస్ పేసర్ కీమర్ రోచ్ (5/17) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను హడలగొట్టాడు. అతడి ధాటికి ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు గురువారం ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 77 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా వెస్టిండీస్‌కు 212 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇంగ్లండ్ జట్టులో ఓపెనర్లు బర్న్స్ (2), జెన్నింగ్స్ (17), కెప్టెన్ రూట్ (4), బెయిర్ స్టో (12), స్టోక్స్ (0), మొయిన్ అలీ (0), బట్లర్ (4), ఫోక్స్ (2) అంతా విఫలమయ్యారు. రోచ్ ఐదు వికెట్లను 31 బంతుల వ్యవధిలో 9 పరుగులిచ్చి పడ గొట్టడం విశేషం. అంతకుముందు ఆతిథ్య జట్టు 289 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మైర్ (81; 9 ఫోర్లు, 8 సిక్స్‌లు) దూకుడైన ఇన్నింగ్స్, షై హోప్ (57), చేజ్ (54) అర్ధ సెంచరీలతో విండీస్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. అండర్సన్ (5/46)కు ఐదు, స్టోక్స్ (4/59)కు నాలుగు వికెట్లు దక్కాయి. -
ఘట్కేసర్లో డీసీఎం వ్యాన్ మంటలు
-
12 పాఠశాలలను తగలబెట్టిన ఉగ్రవాదులు
ఒక ఆడపిల్ల (మలాలా) చదువుకుంటేనే.. ఆకాశమంత ఎత్తు ఎదిగి, నోబెల్ అవార్డు అందుకునే స్థాయికి చేరుకుంది. మూఢాచారాలపై, మతఛాందసవాదులపై ఏకంగా యుద్ధమే చేస్తోంది. మరి దేశంలోని మిగతా ఆడపిల్లలంతా చదువుకుంటే... అమ్మో, ఇంకేమైనా ఉందా? ఉగ్రవాదాన్ని, మూఢాచారాల్ని కూకటివేళ్లతో పెకలించేయరూ..! అందుకేనేమో.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తీవ్రవాదులు తగలబెట్టేస్తున్నారు. విద్య మనిషిని సంస్కరిస్తుంది... జ్ఞానాన్ని పెంచుతుంది... అజ్ఞానాన్ని తుంచేస్తుంది. ఆధునికతవైపు నడిపిస్తుంది... మూఢాచారాలపై పోరాడే శక్తినిస్తుంది. అందుకేనేమో.. మతఛాందసవాదులైన ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఆ విద్యకు ఆలవాలమైన పాఠశాలలపై కన్నేశారు. ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో చాటిచెప్పి.. నోబెల్ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగిన మలాలా పుట్టిన గడ్డపైనే.. ఆడపిల్లలు చదువుకునే పాఠశాలలను తగులబెడుతున్నారు. వివరాల్లోకెళ్తే.. పూర్తిగా ధ్వంసం: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్–బాల్టిస్తాన్‌లో గుర్తుతెలియని ఉగ్రవాదులు 12 స్కూళ్లను తగలబెట్టారు. ఇందులో ఆరు బాలికల పాఠశాలలే ఉన్నాయి. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేసిన స్థానికులు.. స్కూళ్లకు తగిన రక్షణ కల్పించాలని ఆందోళన చేపట్టారు. గిల్గిత్‌కు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిలాస్ టౌన్లో గురువారం రాత్రి మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. 12 స్కూళ్లను తగలబెట్టి, పూర్తిగా ధ్వంసం చేశారని స్థానిక డైమర్ జిల్లా ఎస్పీ రాయ్ అజ్మల్ వెల్లడించారు. దీనిపై విచారణ మొదలుపెట్టామని, నిందితులను పట్టుకోవడానికి భద్రత దళాలు వేట మొదలుపెట్టాయని చెప్పారు. స్కూళ్లపై ఎలాంటి బాంబు దాడీ జరగలేదని డైమర్ ప్రాంత కమిషనర్ అబ్దుల్ వహీద్ చెప్పారు. నిర్మాణంలో ఉన్న పాఠశాలలపైనా..: మిలిటెంట్లు దాడి చేసిన స్కూళ్లలో కొన్ని ఇంకా నిర్మాణంలోనే ఉన్నాయని, భవిష్యత్తులో పాఠశాలలేవీ నిర్మించకుండా ఉండేందుకే ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ దాడులకు తామే బాధ్యులమని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటన చేయలేదు. అయితే ఈ ప్రాంతంలో గతంలోనూ తాలిబన్లు స్కూళ్లపై దాడులు చేసిన సందర్భాలు ఉన్నాయి. బాలికల పాఠశాలలపైనే ఎక్కువగా ఈ దాడులు జరిగేవి. మళ్లీ ఆ రోజులను గుర్తుచేస్తూ ఘటనలు జరుగుతుండడంపై గిల్గిట్–బాల్టిస్తాన్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
కాలుతున్న ఇనుప సూదితో గొంతు, తలపై..
జైపూర్ : మూడనమ్మకాలకు తలఒగ్గి 10నెలల పసిబిడ్డ తలపై, గొంతుపై ఎర్రగా కాలిన ఇనుప సూదితో కాల్చారు కసాయి తల్లిదండ్రులు. పిల్లాడు నొప్పితో కేకలు పెడుతున్నా వదిలిపెట్టకుండా విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. ఈ సంఘటన గురువారం రాజస్థాన్‌లోని బాన్స్వారా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలోకి వెళితే.. బాన్స్వారా జిల్లాలోని తేజ్‌పుర్ గ్రామానికి చెందిన నందలాల్‌కు దేవ్లా(10నెలలు)అనే కుమారుడు ఉన్నాడు. దేవ్లా గత పదిరోజులుగా అస్వస్థతకు గురై బాధపడుతున్నాడు. ఎవరికి చూపించినా ఆరోగ్యం కుదుట పడకపోవటంతో మూడనమ్మకాల వలలో చిక్కుకున్నారు. భూపేంద్ర బజార్‌లోని ఓ వీధిలో చెత్తతో మంట వేసి అందులో ఇనుప సూదిని బాగా కాల్చారు. ఎర్రగా కాలుతున్న సూదితో దేవ్లా గొంతు, తలపై విచక్షణా రహితంగా వాతలు పెట్టారు. పసి పిల్లాడు నొప్పితో విలవిల్లాడుతున్నా వదిలి పెట్టలేదు. వాతలు పెట్టినప్పటికి రోగం నయం కాకపోగా.. పిల్లాడి పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో చేసేదేమి లేక దగ్గరలోని ఉదయ్‌పూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు, గొంతుకు బలమైన గాయాలు కావటంతో పిల్లాడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా వైద్యాధికారి ఎస్ఎల్ నినమ స్పందిస్తూ.. రాజస్థాన్ ప్రభుత్వం ఏటా పెద్ద మొత్తంలో ప్రజల ఆరోగ్యంపై ఖర్చు చేస్తోందన్నారు. కానీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో మూడనమ్మకాలు ఇంకా మనుగడలో ఉన్నాయన్నారు. గిరిజన ప్రజలు తెలిసితెలియక మూడనమ్మకాల భారిన పడి పిల్లల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. చదువులేక పోవటం కారణంగా చిన్నపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు. -
న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు దహనం
బార్ కౌన్సిల్ సభ్యులు విధుల బహిష్కరణ జేసీ-2కి వినతిపత్రం అందజేత రాజమహేంద్రవరం క్రైం, కాకినాడ లీగల్ : న్యాయవాదులు, ప్రజల హక్కులను హరించేలా రూపొందించిన 1961 న్యాయవాదుల చట్ట సవరణ బిల్లును నిరసిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో న్యాయవాదులు శుక్రవారం విధులను బహిష్కరించారు. ఈ బిల్లును ప్రతిపాదించిన లా కమిషన్ చైర్మన్ బల్బీర్ సింగ్ చౌహాన్‌ను తక్షణమే ఆపదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బల్బీర్ సింగ్ చౌహాన్ దిష్టిబొమ్మను, న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు కాపీలను దహనం చేశారు. రాజమహేంద్రవరంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలోను, కాకినాడలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. రాజేష్, కార్యదర్శి గెద్దాడ వెంకటేశ్వరరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు గోకుల్ కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద ఆందోళన చేశారు. అలాగే అమలాపురం, మండపేట, తుని, పిఠాపురం, పెద్దాపురం తదితర కోర్టులలో న్యాయవాదులు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. కాకినాడలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ – 2 రాధాకృష్ణకు మెమొరాండం సమర్పించారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ న్యాయవాదుల చట్ట సవరణ బిల్లు వలన కక్షిదారులు వారికి కావలసిన న్యాయవాదులను నియమించుకునే హక్కును కోల్పోతారన్నారు. అదే విధంగా న్యాయవాదులు కూడా స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చిన కేసులను వాదించడానికి సాధ్యం కాదన్నారు. న్యాయవాదుల మీద దాడులు జరిగినా, లేదా ప్రజా ప్రయోజనాల దృష్టా ్య ఆందోళన చేసే హక్కును కూడా ఈ సవరణలతో న్యాయవాదులు కోల్పోతారన్నారు. ఈ సవరణలు రాజ్యాంగ విరుద్ధమైనవని ఆయన పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పీఆర్ఎస్ మిత్రా, ఉపాధ్యక్షుడు ఎ. వెంకట రాజు, ట్రెజరర్ కె. బాల భాస్కర్, సీనియర్ న్యాయవాది తవ్వల వీరేంద్ర, మహిళా రిప్రజెంటేటివ్ దాసరి అమ్ములు, జేవీవీ రమణ, పెల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కాకినాడలో జరిగిన ఆందోళనలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చిక్కాల అబ్బు, దేశి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
విమానంలో హెడ్‌ఫోన్ పేలితే..
గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో బెంబేలెత్తిన వినియోగదారులకు మరో షాకింగ్ న్యూస్. తాజాగా ఆస్ట్రేలియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళ...ఇయర్ ఫోన్స్ లో సంగీతం వింటుండంగా సడన్ గా పేలిపోవడం ఆందోళకు దారి తీసింది. విమానాల్లో బ్యాటరీతో పనిచేసే పరికరాల ప్రమాదాల గురించి తరచూ హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ ఈ సంఘటన చోటు చేసుకుందని బుధవారం అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 19న బీజింగ్ నుంచి మెల్బోర్న్ వస్తుండగా ఓ మహిళ ఆ హెడ్ ఫోన్స్ అకస్మాత్తుగా పెద్ద శద్దంతో పేలిపోయాయి. మ్యూజిక్ వింటుండగా సడెన్ పేలిపోయాయయనీ, చిన్న చిన్న నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయని దీంతో నా ముఖమంతా కాలిపోతున్న అనుభూతి కలిగిందని తెలిపింది. తన మెడచుట్టూ ఉన్న హెడ్ ఫోన్ ఒక్క ఉదుటున విసిరికొట్టానంటూ తన భయంకర అనుభవాలను ఆస్ట్రేలియన్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బ్యూరో కి నివేదించింది. దీంతో పాటు నల్లబడిన ముఖం , చేతులు, మెడపైన బొబ్బల్ని అధికారులకు చూపించిందా మహిళ. విమాన సహాయకులు వచ్చి బకెట్ నీళ్లు గుమ్మరించినా, అప్పటికే బ్యాటరీ, దాని కవరు మొత్తం కరిగిపోయి ఫ్లోర్‌కు అతుక్కుపోయిందని చెప్పింది. అలాగేకరిగిన ప్లాస్టిక్, కాలిన ఎలక్ట్రానిక్స్, కాలిన జుట్టు లాంటి వాసనను తోటి ప్రయాణికులు భరించలేకపోయారని తెలిపింది. మొత్తం అక్కడున్నవారంతా దగ్గుతూ ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారని చెప్పింది. కాగా విమానాల్లో ఇటీవల ఇలాంటి పేలుళ్ల ఘటనలు బాగా పెరిగాయి. విమాన ప్రయాణాల్లో బ్యాటరీలతో పనిచేసే డివైస్ లను సంబంధిత లగేజ్ ఏరియాలలో దాచి పెట్టడం లేదా వాడకుండా ఉండడం చేయాలని అధికారులు సూచిస్తున్నారు. విచారణలో లిథియం బ్యాటరీ మూలంగా ఈ పేలుడు సంభవించిందని అధికారులు తేల్చారు. -
విమానంలో మ్యూజిక్ వింటుంటే.. మంటలు
-
విమానంలో మ్యూజిక్ వింటుంటే.. మంటలు వచ్చి..
సిడ్నీ: విమానంలో మ్యూజిక్ వింటున్న ఓ మహిళ తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన చైనాలో చోటు చేసుకుంది. చైనా రాజధాని బీజింగ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే విమానంలో ఎక్కిన ఓ మహిళ బ్యాటరీతో నడిచే హెడ్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటోంది. కొద్దిసేపట్లోనే హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ఆమె హెడ్‌ఫోన్స్‌ను పక్కకు తీసి కింద పడేసింది. ఈ ఘటనలో ఆమె ముఖం, మెడతో పాటు చేతులకు గాయాలయ్యాయి. హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు రావడంతో షాక్‌కు గురైన విమాన సిబ్బంది.. గాయాలపాలైన మహిళను శస్త్రచికిత్సకు తరలించారు. కిందపడిన హెడ్‌ఫోన్స్ విమానం ఫ్లోర్‌కు కరుచుకుపోవడంతో దాన్ని అక్కడి నుంచి తొలగించారు. బ్యాటరీలతో నడిచే వస్తువులను విమానంలో వాడొద్దని అధికారులు పేర్కొన్నారు. -
అక్కను వేధించిన వారికి బుద్ది చెప్పిన మరునాడే..
షహజాన్ పూర్: తన సోదరిని ఏడిపించేందుకు ప్రయత్నించిన జులాయిలను అడ్డుకున్నాడని ఓ పదిహేడేళ్ల యువకుడిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని షహజన్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడు 50శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నాడు. సూరజ్ కశ్యప్ అనే యువకుడికి ఓ సోదరి ఉంది. వారిది సౌఫ్రీ అనే గ్రామం. ఈ గ్రామంలో కొంతమంది తాగుబోతు యువకులు వాళ్లింటి ముందు ఫుల్లుగా మద్యం సేవిస్తూ అడ్డగోలిగా అసభ్యంగా మాట్లాడుతుండటంతో కశ్యప్ వచ్చి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. దీంతో వాళ్లు ఇంట్లోకి చొరబడి తన సోదరిని వేధించడం మొదలుపెట్టారు. దీంతో ఆ నలుగురితో యువకుడు పోరాడగా చుట్టుపక్కల వారు కూడా వచ్చి వారిని తరిమికొట్టారు. ఇది మనసులో పెట్టుకున్న వారు అతడు ఒంటరిగా బయటకు వెళుతుండం చూసి కాపుకాసి దాడి చేశారు. బాగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. -
రాంగోపాల్‌వర్మ చిత్రపటాలు దహనం
యాడికి : దర్శకుడు రాంగోపాల్ వర్మ చిత్రపటాలను యాడికిలో ఉపాధ్యాయులు మంగళవారం దహనం చేశారు. పీఆర్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవీంద్ర మాట్లాడుతూ... గూగుల్ ఉండగా ఉపాధ్యాయులు ఎందుకు దండగా.. అంటూ రాంగోపాల్‌వర్మ చేసిన వ్యాఖ్యలతో ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఆయన ఇలా మాట్లాడటం దారుణమన్నారు. ఉపాధ్యాయులు లేకుండానే ఆయన ఈ స్థాయికి ఎదిగారా? అని ప్రశ్నించారు. ఆయన భేషరతుగా ఉపాధ్యాయులందరికీ క్షమామణ చెప్పాలని డిమాండ్ చేశారు. యూనియన్ మండల కమిటీ అధ్యక్షుడు చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు ఆర్ఎస్ నాయక్, గోపాల్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. -
కాలిన గాయాలతో ఇద్దరి మృతి
మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం బాలాజీ నగర్లో ఓ కుటుంబం పై నిన్న జరిగిన హత్య యత్నంలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన సుంకయ్యతో పాటు వీరన్న(5) అనే చిన్నారి మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున సుంకయ్య కుటుంబం నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో సగం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఇద్దరు మృతిచెందారు. -
నంబర్‌వన్ ఆస్ట్రేలియా
రెండో టెస్టులోనూ కివీస్ చిత్తు క్రైస్ట్‌చర్చ్: టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటింది. బుధవారం న్యూజిలాండ్‌తో ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో ఆసీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో చేజిక్కిం చుకుంది. ఈ ఫలితంతో కంగారూలు 112 పాయిం ట్లతో భారత్ (110)ను వెనక్కి నెట్టి ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచారు. 2014 తర్వాత ఆసీస్ మళ్లీ నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. న్యూజి లాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ పరాజయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఓవర్‌నైట్ స్కోరు 70/1తో చివరి రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బర్న్స్ (65), ఖాజా (45) రెండో వికెట్‌కు 64 పరుగులు జోడించగా... అనంతరం స్మిత్ (53 నాటౌట్), వోజెస్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్‌ను ముగించారు. తొలి టెస్టును కూడా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలుచుకుంది. మరో వైపు అంపైర్‌ను దూషించినందుకు మ్యాచ్ నాలుగో రోజే పేసర్ హాజల్‌వుడ్‌కు 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాగా విధించిన ఐసీసీ... ఇప్పుడు ఆసీస్ కెప్టెన్ స్మిత్‌ను కూడా బాధ్యుడిగా చేస్తూ అతని ఫీజులో 30 శాతం కోత విధించింది. ఎనిమిదో సారి ఈ ఏడాది టెస్టు ర్యాంక్‌లకు కటాఫ్ తేదీ ఏప్రిల్ 1. ఈ లోపు ఏ దేశాలకూ టెస్టులు లేవు. కాబట్టి ఐసీసీ ప్రతి ఏడాదీ అందించే గదతో పాటు 10 లక్షల డాలర్ల బహుమతి కంగారూలకు దక్కుతుంది. ఆ జట్టు ఈ ఘనత సాధించడం ఇది ఎనిమిదోసారి. 2003 నుంచి 2009 వరకు వరుసగా ఏడేళ్లు ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించింది. ఆ తర్వాత ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాల ఆధిపత్యం కొనసాగింది. తిరిగి ఆసీస్ పాత వైభవాన్ని తెచ్చుకుంది. ఈ ఏడాది ర్యాంక్‌ల్లో రెండో స్థానంలో నిలిచిన భారత్‌కు ఐదు లక్షల డాలర్లు లభిస్తాయి. వన్డేల్లోనూ ఆస్ట్రేలియా నంబర్‌వన్‌గా సీజన్‌ను ముగించడం విశేషం. -
ఆసీస్ దీటైన జవాబు
స్మిత్, బర్న్స్ సెంచరీలు న్యూజిలాండ్‌తో రెండో టెస్టు క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ జో బర్న్స్ (321 బంతుల్లో 170; 20 ఫోర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (241 బంతుల్లో 138; 17 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో... న్యూజిలాం డ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటైన జవాబు ఇచ్చింది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వోజెస్ (2 బ్యాటిం గ్), లయోన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 7 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖాజా (24) వికెట్‌ను కోల్పోయింది. అయితే స్మిత్, బర్న్స్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిం చారు. పచ్చిక వికెట్‌పై కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో చెలరేగినా... రెండు సెషన్ల పాటు వికెట్‌ను కాపాడుకున్నారు. సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ క్రమంలో స్మిత్ కెరీర్లో 14వ సెంచరీ పూర్తి చేయగా... బర్న్స్ కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 289 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్‌పై మూడో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే ఆట చివర్లో కొత్త బంతితో వాగ్నేర్ మ్యాజిక్ చేశాడు. 5 బంతుల తేడాలో స్మిత్, బర్న్స్ వికెట్లను తీసి ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత వోజెస్, లయోన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బౌల్ట్, వాగ్నేర్ చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 370 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌కు బౌన్సర్ దెబ్బ: టీ విరామానికి ముందు ఓవర్లో వాగ్నేర్ వేసిన షార్ట్ పిచ్ బంతి అన్యూహంగా ఎగిసి వచ్చి స్మిత్ తలను బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా కెప్టెన్ కుప్పకూలిపోయాడు. అయితే ఫీల్డర్లు వెంటనే సపర్యలు చేయడంతో పాటు కాస్త తేరుకున్న స్మిత్.. తర్వాత వైద్య చికిత్స తీసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. -
స్మిత్, బర్న్స్ బాదుడు
క్రైస్ట్‌చర్చ్: న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటుగా స్పందిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. కివీస్ కంటే 7 పరుగులు వెనుకబడి ఉంది. 57/1 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 3 వికెట్లు నష్టపోయి 306 పరుగులు జోడించింది. ఓపెనర్ బర్న్స్(170), కెప్టెన్ స్మిత్(138) సెంచరీలతో చెలరేగారు. వార్నర్ 12, ఉస్మాన్ ఖాజా 24 పరుగులు చేసి అవుటయ్యారు. వోజెస్(2), లియన్(4) క్రీజ్ లో ఉన్నారు. కివీస్ బౌలర్లలో వాగ్నర్, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 370 పరుగులు చేసింది. మెకల్లమ్ సెంచరీతో (79 బంతుల్లో 145; 21 ఫోర్లు, 6 సిక్సర్లు) రికార్డు సృష్టించాడు. -
ఖవాజా, బర్న్స్ శతకాల మోత
► తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 345/3 ► విండీస్‌తో రెండో టెస్టు మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా (227 బంతుల్లో 144; 6 ఫోర్లు; 1 సిక్స్), ఓపెనర్ జో బర్న్స్ (230 బంతుల్లో 128; 16 ఫోర్లు; 1 సిక్స్) శతకాలు సాధించడంతో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో మూడు వికెట్లకు 345 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్ (49 బంతుల్లో 32 బ్యాటింగ్; 3 ఫోర్లు), వోజెస్ (24 బంతుల్లో 10 బ్యాటింగ్; 2 ఫోర్లు) ఉన్నారు. 154 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న ఖవాజాకు కెరీర్లో ఇది మూడో సెంచరీ. అయితే ఇవన్నీ గత నాలుగు ఇన్నింగ్స్‌లలోనే రావడం విశేషం. మరోవైపు గత 16 ఏళ్లలో బాక్సింగ్ డే టెస్టుకు మెల్బోర్న్ మైదానంలో అత్యల్ప(53,389) సంఖ్యలో ప్రేక్షకులు వచ్చారు.