Central Information Commission
-
ఈసీ తీరుపై సీఐసీ విస్మయం
న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరు, విశ్వసనీయతను ప్రశ్నిస్తూ అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) తీవ్రంగా తప్పుబట్టింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఈసీని సీఐసీ ఆదేశించింది. ఈవీఎంల పనితీరు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై తాము లేవనెత్తిన అనుమానాలను నివృత్తిచేసేలా సమాచారం ఇవ్వాలని మాజీ ఐఏఎస్ అధికారి ఎంజీ దేవసహాయం సహా ప్రముఖ సాంకేతికవిద్యా నిపుణులు, ఐఐటీ, ఐఐఎంలలోని విద్యావేత్తలు, మాజీ ప్రభుత్వ ఉన్నతాధికారులు 2022 మే రెండో తేదీన ఈసీకి ఆర్టీఐ చట్టంకింద దరఖాస్తు పెట్టుకోవడం తెల్సిందే. తమ ఆర్టీఐ దరఖాస్తుపై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుందని 2022 నవంబర్ 22న దేవసహాయం మరోసారి ఆర్టీఐ కింద సమాచారం అడిగారు. 30 రోజుల్లోపు సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఈసీ సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆయన సీఐసీను ఆశ్రయించారు. దేవసహాయానికి ఎందుకు మీ స్పందన తెలపలేదు? అని ఈసీలోని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్‌కు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ హీరాలాల్ సమరియా అడగ్గా ఆయన సమాధానం ఇవ్వలేదు. ‘‘ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇవ్వకుండా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్(పీఐఓ) వ్యవహరించిన తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. దీనిపై 30 రోజుల్లోగా పాయింట్లవారీగా వివరణ ఇవ్వండి’ అని ఈసీని సీఐసీ ఆదేశించింది. -
సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీచేయండి
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్ర సమాచార కమిషన్(ఎస్ఐసీ)లలో పోస్టులను భర్తీచేయకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసింది. తెలంగాణ, త్రిపుర, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో సేవలు అందించడానికి ఎలాంటి సమాచార కమిషనర్లు అందుబాటులో లేరంటూ సమాచారహక్కు(ఆర్టీఐ)చట్టం కార్యకర్త అంజలీ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ‘ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయండి. లేదంటే ఆర్టీఐ చట్టం నిరీ్వర్యమైపోతుంది’ అంటూ కేంద్రప్రభుత్వం, రాష్ట్రాలను ఆదేశించింది. ‘ రాష్ట్ర సమాచార కమిషన్లలో అనుమతించిన పోస్టులు ఎన్ని? ఖాళీలెన్ని? పెండింగ్‌లో ఉన్న కేసులెన్ని? అనే వివరాలను నివేదించండి’ అని సిబ్బంది, శిక్షణ శాఖను ఆదేశించింది. -
సీఐసీ వద్ద 19 వేల దరఖాస్తులు పెండింగ్
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార హక్కు కమిషన్ (సీఐసీ) వద్ద గత ఏప్రిల్ నాటికి 19,233 దరఖాస్తులు, అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం బుధవారం లోక్‌సభకు తెలిపింది. పది మంది సభ్యులుండే సీఐసీలో నాలుగు ఖాళీలు ఉన్నాయని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2021–22లో 29,213 దరఖాస్తులు, 2020–21లో 35,178 , 2018–19లో 29,655 పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. -
భర్త ఆదాయం తెల్సుకునే హక్కు భార్యకుంది
జోధ్‌పూర్: సమాచార హక్కు చట్టం ప్రకారం భర్త ఆదాయాన్ని తెల్సుకునే హక్కు భార్యకు ఉందని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ప్రకటించింది. తన భర్త ఆదాయ వివరాలను తెలియజేయాలని జోధ్‌పూర్‌కి చెందిన రెహ్మత్ బాను ఆదాయపన్ను శాఖను కోరగా, వారు సమాచారమివ్వడానికి తిరస్కరించారు. దీంతో ఆమె సీఐసీకి అప్పీల్ చేసుకోగా, పిటిషన్‌ను విచారించిన కేంద్ర సమాచార కమిషన్, జోథ్‌పూర్ ఆదాయపన్ను శాఖకు 15 రోజుల్లోపు రెహ్మత్ కోరిన సమాచారమివ్వాలని ఆదేశించింది. మూడో వ్యక్తి ఆదాయ సమాచార వివరాలు ఇవ్వడం కుదరదని, ఇది సమాచార హక్కు నిర్వచన పరిధిలోకి రాదని, ఆదాయ పన్ను శాఖ వాదనను సీఐసీ తిరస్కరించింది. ‘ఇది వ్యక్తిగత సమాచారమని, దీన్ని వెల్లడించడం కుదరదు’అని ఆమె భర్త తిరస్కరించిన నేపథ్యంలో ఈ తీర్పు వెలువడిందని ఆమె న్యాయవాది రజక్ హైదర్ తెలిపారు. -
ఆర్టీఐ లేకుండానే సమాచారం
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చే దరఖాస్తులను తగ్గించడానికి ప్రభుత్వం ఇకపై క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్నంతటినీ ప్రజలకు అందుబాటులో ఉంచేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీఐ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఢిల్లీలో జరిగిన అన్ని రాష్ట్రాల చీఫ్ కమిషనర్లు, కమిషనర్ల సదస్సులో అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడితే అది ప్రభుత్వ విజయానికి సంకేతం కాదని అన్నారు. ప్రభుత్వ పనితీరు సంతృప్తికరంగా ఉన్నప్పుడే ఆర్టీఐ కింద వచ్చే దరఖాస్తుల సంఖ్య తగ్గుతుందని షా అన్నారు. ఆర్టీఐ దరఖాస్తు అవసరం లేకుండా ప్రజలు ఎలాంటి సమాచారాన్నయినా క్షణాల్లో తెలుసుకునేలా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా షా వెల్లడించారు. ప్రజలకి తమ హక్కులతో పాటుగా బాధ్యతలు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నా చితకా కారణాలకి, అవసరం లేకపోయినా ఆర్టీఐని ప్రయోగిస్తూ దానిని దుర్వినియోగం చేయవద్దని అమిత్ షా ప్రజలకి హితవు పలికారు. ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత కోసం, ఎవరికైనా వ్యక్తిగతంగా అన్యాయం జరిగితే అప్పుడే ఆర్టీఐని వినియోగించాలని అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని ఒక హక్కులా చూడకుండా, దానిని వినియోగించడంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అమిత్ షా కోరారు. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ ఎం. రవికుమార్, కమిషనర్లు బివి. రమణకుమార్, ఇలాపురం రాజా పాల్గొన్నారు. -
కే౦ద్ర సమాచార శాఖ అదనపు డీజీగా వెంకటేశ్వర్
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర సమాచార శాఖ(తెలంగాణ) అదనపు డైరక్టర్ జనరల్‌గా ఎస్. వెంకటేశ్వర్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహించిన వెంకటేశ్వర్ డిప్యుటేషన్ మీద హైదరాబాద్‌కు వచ్చారు. రిజిస్టార్ ఆఫ్ న్యూస్ పేపర్ ఫర్ ఇండియా(హైదరాబాద్) కార్యాలయంలో అదనపు ప్రెస్ రిజిస్టార్‌గా వ్యవహరించనున్నారు. అంతేగాక సమాచార, మంత్రిత్వ శాఖలో నూతనంగా ఏర్పాటు చేసిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరోకు అధిపతిగా వ్యవహరిస్తారు. 1989 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన ఎస్. వెంకటేశ్వర్ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పలు విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తన 30 సంవత్సరాల సర్వీస్ కాలంలో పత్రికా సమాచార కార్యాలయం, బెంగుళూరు అదనపు డైరక్టర్ జనరల్‌గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కార్యాలయం, భువనేశ్వర్ డైరక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. -
సీఐసీలోకి నలుగురు కొత్త కమిషనర్లు
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్‌లో నలుగురు కొత్త కమిషనర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. కమిషన్‌లో మొత్తం ఉండాల్సిన కమిషనర్ల సంఖ్య 11 కాగా, ప్రస్తుతం అందులో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్(సీఐసీ) సహా ముగ్గురు కమిషనర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మాజీ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి యశ్వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి నీరజ్ కుమార్ గుప్తా, న్యాయ శాఖ మాజీ కార్యదర్శి సురేశ్ చంద్ర సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. వీరి నియామకంతో కమిషన్‌లో సభ్యుల సంఖ్య ఏడుకు చేరింది. సిన్హా 1981 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. యూకేలో భారత హైకమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. తాజా నియామకంతో వనజ(1980 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారిణి) సీఐసీలోని ఏకైక మహిళా కమిషనర్‌గా నిలవనున్నారు. గుప్తా 1982 ఐఏఎస్ అధికారి కాగా, సురేశ్ చంద్ర ఈ ఏడాదే న్యాయశాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. 2002–04 మధ్య ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ప్రైవేట్ సెక్రటరీగా కూడా చంద్ర ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలు చేసినవారు(బ్యూరొక్రాట్స్) కాకుండా.. లా, సైన్స్, సోషల్ సర్వీస్, మేనేజ్మెంట్, జర్నలిజం తదితర రంగాల్లోని నిపుణులకు(నాన్ బ్యూరొక్రాట్స్) కమిషనర్లుగా సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 12(5)ని ఉటంకిస్తూ మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు విజ్ఞప్తిని తాజా నియామకాల్లో కేంద్రం పట్టించుకోలేదు. -
బోస్ బతికున్నారో లేదో చెప్పండి: సీఐసీ
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారా? చనిపోయారా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందిగా జాతీయ అర్కైవ్స్ విభాగాన్ని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. బోస్పై అవధేశ్ కుమార్ చతుర్వేది అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం కింద అభ్యర్థించారు. 2015, 16ల్లో బోస్ జయంతి రోజున ప్రధాని ఎందుకు నివాళి అర్పించారో చెప్పాలన్నారు. సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సంబంధిత రికార్డులన్నీ జాతీయ అర్కైవ్స్ విభాగం వద్ద ఉన్నాయని పీఎంవో చెప్పడంతో 15 రోజుల్లోగా దరఖాస్తుదారుడికి స్పష్టమైన సమాచారం ఇవ్వాలని ప్రధాన సమాచార కమిషనర్ ఆర్కే మాథుర్ అర్కైవ్స్ విభాగాన్ని ఆదేశించారు. -
క్రికెట్ ‘సమాచారం’ చెప్పాల్సిందే!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ పరిపాలనకు సంబంధిం చిన కీలక పరిణామం... ఇప్పటి వరకు సగటు క్రికెట్ అభిమాని దేని గురించి అడిగినా ‘చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ దాటవేస్తూ వచ్చిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పవర్‌కు బ్రేక్... బీసీసీఐని కూడా ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రజలు సమాచార హక్కు చట్టం కింద ఏదైనా సమాచారం కోరితే బీసీసీఐ తప్పనిసరిగా దానిని వెల్లడించాల్సి ఉంటుంది. వివిధ చట్టాలు, సుప్రీం కోర్టు ఉత్తర్వులు, లా కమిషన్ ఆఫ్ ఇండియా నివేదిక, జాతీయ క్రీడా మంత్రిత్వశాఖ నిబంధనలు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 2 (హెచ్) పరిధిలోకి బీసీసీఐ వస్తుందంటూ సీఐసీ తేల్చింది. ‘దేశంలో క్రికెట్ కార్యకలాపాలు నిర్వహించేందుకు సర్వహక్కులు ఉన్న బీసీసీఐ ప్రభుత్వ ఆమోదం పొందిన జాతీయ స్థాయి సంస్థ అంటూ సుప్రీం కోర్టు కూడా గతంలోనే స్పష్టం చేసింది. ఆర్టీఐ చట్టం పరిధిలో జాతీయ క్రీడా సమాఖ్య జాబితాలో బీసీసీఐ ఉంటుంది. బోర్డుతో పాటు అనుబంధ సంఘాలన్నింటికీ ఆర్టీఐ చట్టం వర్తిస్తుంది’ అని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు తన 37 పేజీల ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్టీఐ చట్టాన్ని సమర్థంగా అమలు పరచడం కోసం 15 రోజుల్లోగా దరఖాస్తులు స్వీకరించే ఏర్పాట్లు చేసుకోవాలని, సమాచార అధికారులను కూడా నియమించుకోవాలని బీసీసీఐ అధ్యక్షుడు, కార్యదర్శి, సీఓఏలకు ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. బీసీసీఐ ఏ మార్గదర్శకాల కింద దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోందో, భారత్‌కు ఆడే ఆటగాళ్లను ఎంపిక చేస్తోందో తెలపాలంటూ గీతారాణి అనే మహిళ చేసిన దరఖాస్తుతో ఇదంతా జరిగింది. టీమిండియా క్రికెటర్లు దేశం తరఫున ఆడుతున్నారా లేక ప్రైవేట్ సంఘం బీసీసీఐ తరఫున ఆడుతున్నారా అని ఆమె ప్రశ్నించింది. తమ దగ్గర తగిన వివరాలు లేవంటూ ఆమెకు కేంద్ర క్రీడాశాఖ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోవడంతో సీఐసీ జోక్యం అనివార్యమైంది. అసాధారణ అధికారాలు ఉన్న బీసీసీఐ పనితీరు వల్ల ఆటగాళ్ల మానవ హక్కులకు కూడా భంగం కలిగే అవకాశం ఉందని... ఇలాంటి అంశాలపై ఇన్నేళ్లుగా బోర్డును బాధ్యులుగా చేయాల్సి ఉన్నా సరైన నిబంధనలు లేక ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదని కూడా ఆచార్యులు అభిప్రాయ పడ్డారు. -
‘ఎంపీల్యాడ్స్’పై పారదర్శకత
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యులు తమ ఎంపీల్యాడ్స్ (స్థానికప్రాంత అభివృద్ధి పథకం) నిధులను ఖర్చుచేసే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు చట్టబద్ధ నిబంధనావళిని రూపొందించాలని లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కార్యాలయాలను కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. నిధుల ఖర్చులో పారదర్శకతతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు తదితర అంశాలను ఇందులో చేర్చాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చెరో 10 మంది ఎంపీలు తమ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం ప్రతీ ఎంపీకి ఏటా రూ.5 కోట్ల చొప్పున నియోజకవర్గం అభివృద్ధికి కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా కేంద్రం కేటాయిస్తున్న నిధుల్లో ప్రతిఏటా రూ.12,000 కోట్లు వినియోగం కావ ట్లేదు.ఈ నేపథ్యంలో ఎంపీల్యాడ్స్ నిధుల నుం చి తమ పార్లమెంటు సభ్యులు ఎంత ఖర్చు చేశారన్న సమాచారం లభ్యం కాకపోవడంపై ఇద్దరు వ్యక్తులు సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఎందుకు లేదు? ఈ పిటిషన్లను విచారించిన సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు.. ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై తమవద్ద ఎలాంటి సమాచారం లేదని కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎంపీలకు నిధులు కేటాయిస్తున్నప్పుడు.. వారి ఖర్చుల వివరాలను ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎంపీలు ఏయే పనులకు ఎంతెంత ఖర్చు చేశారన్న సమాచారం జిల్లా యంత్రాంగాల వద్దే ఉంటుందన్న కేంద్రం వాదనపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీలందరూ నియోజకవర్గాల వారీగా ఏయే పనులు చేపట్టారు? వాటికి ఎంత ఖర్చు చేశారు? దీని కారణంగా ఎవరికి లబ్ధి చేకూరింది? పనులు పూర్తి కాకపోవడానికి గల కారణం ఏంటి? ఏయే దరఖాస్తులను ఎందుకు తిరస్కరించారు? తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించారు. ఏటా దాదాపు రూ.12,000 కోట్లు నిరుపయోగం అవుతున్నాయన్న ప్రభుత్వ నివేదికపై స్పందిస్తూ.. ఈ నిధులను పూర్తి పారదర్శకంగా, జవాబుదారీతనంతో వినియోగించేలా చట్టబద్ధమైన నిబంధనావళిని రూపొందించాలని ఉభయ సభాధిపతుల కార్యాలయాలకు సూచించారు. గతేడాది 298 మంది ఎంపీలు తమ ఎంపీల్యాడ్స్ నిధులను వాడుకోకపోవడం, వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి చెరో 10 మంది ఎంపీలు ఉండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయకుండా, సొంత పనులకు వాడుకోకుండా, పనులకు ప్రైవేటు ట్రస్టులకు, అనర్హులైన, సామర్థ్యంలేని సంస్థలకు కట్టబెట్టే చర్యలను నియంత్రించేలా నిబంధనలు రూపొందించాలని శ్రీధర్ చెప్పారు. నిబంధనలు అతిక్రమిస్తే విధించే శిక్ష, జరిమానాలపై కూడా నిబంధనావళిలో స్పష్టత ఇవ్వాలన్నారు. ఈ మేరకు 54 పేజీల ఉత్తర్వులను జారీచేశారు. తెలియజేయడం ఎంపీల బాధ్యత తన పదవీకాలం పూర్తయ్యాక ప్రతీ ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగంపై ఉభయసభల అధిపతులకు సమగ్ర నివేదికను సమర్పించేలా చూడాలన్నారు. సమాచారహక్కు చట్టం కింద ఈ వివరాలను తమ నియోజకవర్గాల ప్రజలకు తెలియజేయడం ఎంపీల బాధ్యతని శ్రీధర్ ఆచార్యులు వ్యాఖ్యానించారు. పారదర్శకతను సాధించేందుకు పార్లమెంటు కార్యాలయ సిబ్బంది, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సిస్టమ్స్ సాయం తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల ఖర్చు వివరాలను రాజకీయ పార్టీలు, ఎంపీలు తమ అధికారిక వెబ్సైట్లో పోస్ట్ చేయాలనీ, సోషల్‌మీడియా ద్వారా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరారు. దీనివల్ల నిధుల దుర్వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాలవారీగా పార్లమెంటు సభ్యులు ఏయే పనులను, ఎం తెంత వ్యయంతో చేపట్టారు? వాటి పురోగతి ఏంటి? తదితర వివరాలను జిల్లా యంత్రాంగాలు తమ వెబ్సైట్లలో అప్డేట్ చేస్తూ ఉండాలని శ్రీధర్ ఆచార్యులు ఆదేశించారు. -
తిరుమల శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
-
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ), కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ప్రశ్నించింది. తిరుమల ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించడానికి, శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) ఆదేశించింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు. కారణం లేకుండానే వెయ్యి కాళ్ల మండపం కూల్చేశారు తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. తిరుమల ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1,500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్ అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుమల కొండపై శ్రీవారి ప్రధాన ఆలయం మహాద్వారం ఎదురుగా ఉన్న 15 శతాబ్దం నాటి వెయ్యి కాళ్ల మండపాన్ని ఎలాంటి కారణం లేకుండానే 2003లో కూల్చివేశారని ఆక్షేపించారు. తేలిగ్గా తీసుకోవద్దు... తిరుమల కొండపై ఉన్న ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించి ఉంటే, వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారు కాదని మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయాలు, ఆభరణాల పరిరక్షణ విషయంలో జస్టిస్ వాద్వా, జస్టిస్ జగన్నాథరావు కమిటీలు ఇచ్చిన నివేదికలను ఇప్పటిదాకా ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీటీడీని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే వినతులకు టీటీడీ పాలక మండలి గతంలో స్పందించేదని, ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని చెప్పారు. ‘‘ఫిర్యాదిదారుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రధానమంత్రి కార్యాలయం తేలిగ్గా తీసుకోరాదు. ప్రాచీన కట్టడాలను కాపాడే విషయంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలాజికల్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. భారతదేశ ప్రాచీన సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే తిరుమల ఆలయాలు, కట్టడాలు, అప్పటి విలువైన ఆభరణాలను కాపాడడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. టీటీడీ పాలక మండలిలో తిష్టవేసిన రాజకీయ నాయకులకే ఈ అంశాన్ని వదిలేసి చేతులు దులుపుకోవద్దు’’ అని మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. -
సీఐసీలో పోస్టుల భర్తీకి ప్రకటన
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)లోని ఖాళీల భర్తీకి కేంద్రం ప్రకటన విడుదల చేసింది. సమాచార కమిషనర్ పోస్టుకు ఆసక్తి గల 65 ఏళ్లలోపు అభ్యర్థులు ప్రొఫార్మా ప్రకారం వివరాలను పంపాలని కోరింది. అభ్యర్థులు ప్రజా జీవితంలో ఉండి విస్తృత పరిజ్ఞానం, అనుభవంతోపాటు చట్టాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక సేవ, జర్నలిజం, మేనేజ్మెంట్, పరిపాలన తదితర రంగాల్లో నిపుణులై ఉండాలని తెలిపింది. వేతనం, అలవెన్సు, ఇతర సదుపాయాలు, నిబంధనలను నియామక సమయంలో వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది. సీఐసీలో 10 మంది కమిషనర్లకు గాను ప్రధాన సమాచార కమిషనర్ రాథా కృష్ణ మాథుర్ సహా ప్రస్తుతం ఆరుగురు మాత్రమే పనిచేస్తున్నారు. సమాచార హక్కు చట్టంలో పలు మార్పులు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. సమాచార కమిషనర్ల వేతనాలు, అలవెన్సులు, ఇతర నియమ నిబంధనలను ప్రభుత్వం సూచించిన విధంగానే ఉండాలి. వారి పదవీ కాలం ఐదేళ్లు కాకుండా ప్రభుత్వం సూచించిన కాలానికే పరిమితం కావాలి.. వంటివి కూడా ఉన్నాయి. ఇటువంటి మార్పులతో ఈ చట్టాన్ని బలహీన పరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామంటున్నారు. -
సమాచార కమిషనర్ల భర్తీలో ఇంత నిర్లక్ష్యమా?
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) తోపాటు రాష్ట్రాల సమాచార కమిషన్ల (ఎస్ఐసీ)లో పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉండటంపై సుప్రీంకోర్టు స్పందించింది. సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఖాళీ పోస్టులను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో తెలపాలని కేంద్రానికి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, ఒడిశాలకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా అఫిడవిట్ సమర్పించకుంటే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందంది. సమాచార హక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు వేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. ‘ప్రస్తుతం సీఐసీలో 4 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రధాన సమాచార కమిషనర్ సహా మరో నాలుగు పోస్టులు ఖాళీ కానున్నాయి. ‘సీఐసీలో 23వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఎస్ఐసీలో ఒక్క సభ్యుడినీ నియమించలేదు. ప్రధాన సమాచార కమిషనర్ లేకుండానే గుజరాత్, మహారాష్ట్ర కమిషన్లు నడుస్తున్నాయి’ అని పిటిషనర్ తరఫు లాయరు ప్రశాంత్ భూషణ్ అన్నారు. సీఐసీ, ఎస్ఐసీలకు కమిషనర్లను నియమించకుండా కేంద్ర, రాష్ట్రాలు స.హ. చట్టాన్ని నీరుగారుస్తున్నాయన్నారు. -
ఆర్టీఐ కమిషనర్లను నియమించరా?
సాక్షి, న్యూఢిల్లీ: సమాచార హక్కు చట్టం పరిధిలోని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ), రాష్ట్రాల సమాచార కమిషన్ల(ఎస్ఐసీ)లో ఖాళీల్ని భర్తీ చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేశారు. వేలాది అప్పీళ్లు, ఫిర్యాదుల పరిష్కారంపై ఈ జాప్యం ప్రభావం చూపుతుందని, ఖాళీల్ని ఎందుకు భర్తీ చేయలేదో జవాబు చెప్పాలని కేంద్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు నోటీసులు జారీచేసింది. సమాచార హక్కు కమిషనర్లను భర్తీ చేయకపోవడంతో వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ముగ్గురు పిటిషనర్లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వెంటనే చర్యలు చేపట్టాలి: సుప్రీం ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఖాళీల్ని భర్తీ చేయకపోతే ఈ రాజ్యాంగ సంస్థల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఈ విభాగాల్లో అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇతర చట్టబద్ధ సంస్థల్లోను ఇది అలవాటుగా మారిపోయింది. వందల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదు. మీరు ఏదొకటి చేయాలి’ అని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్‌కు సుప్రీం స్పష్టం చేసింది. సీఐసీలో 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదుల పెండింగ్ ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్, మాజీ నేవీ అధికారి లోకేశ్ బాత్రా, అమ్రితా జోహ్రిల తరఫున న్యాయవాది కామిని జైస్వాల్ వాదిస్తూ.. ప్రస్తుతం సీఐసీలో 4 ఖాళీలున్నాయని, 23,500కు పైగా అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘వేలాది అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నా బ్యాక్‌ల్యాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, బెంగాల్, కేరళ, కర్ణాటక, ఒడిషా తదితర రాష్ట్రాల్లో సమాచార హక్కు కమిషన్లలో బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా ఆర్టీఐ చట్టాన్ని కాలరాస్తున్నారు. కేంద్ర సమాచార కమిషన్ వద్ద వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016లో వచ్చిన అప్పీళ్లూ పెండింగ్‌లో ఉన్నాయి’ అని జైస్వాల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్‌లో ఒక్క కమిషనర్‌ను కూడా భర్తీ చేయలేదని, ఆ రాష్ట్ర ఎస్ఐసీ ప్రస్తుతం ఎలాంటి విధులూ నిర్వర్తించడం లేదని కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర కమిషన్‌లో నాలుగు ఖాళీలు ఉన్నాయని, అక్కడ 40 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని, కర్ణాటకలో ఆరు పోస్టుల ఖాళీగా ఉండగా.. 33 వేల అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు.కేరళలో ఒకే ఒక్క కమిషనర్ విధుల్లో ఉన్నారని, అక్కడ 14 వేల అప్పీళ్లను పరిష్కరించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. ఇన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నా ఎందుకు జాప్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, ఒడిశా, కర్ణాటక, ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. -
లీజు రెన్యువల్ వివరాలు ఇవ్వండి
న్యూఢిల్లీ: తన స్థలంలో ఉన్న ప్రభుత్వ డిస్పెన్సరీ లీజు పునరుద్ధరణ(రెన్యువల్)కు సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద ఇవ్వడానికి కార్మిక శాఖ నిరాకరించడంపై ప్రధాని మోదీ ఆంటీగా చెప్పుకుంటున్న 90 ఏళ్ల మహిళ అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించింది. గుజరాత్‌లోని వాద్నగర్లో దహిబెన్ నరోత్తమ్‌దాస్ మోదీ నివసిస్తున్నారు. ఆమెకు చెందిన స్థలంలో బీడీ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ డిస్పెన్సరీ నడుస్తోంది. 1983లో రూ. 600 అద్దె ఇవ్వగా.. అనంతరం రూ.1,500కు పెంచారు. అప్పటి నుంచి అద్దె పెంచకపోవడంతో గత ఏడాది డిసెంబర్లో లీజు వివరాలు, పునరుద్ధరించక పోవడానికి కారణాలు చెప్పాలంటూ కార్మిక శాఖకు సమాచార హక్కు చట్టం కింద ఆమె దరఖాస్తు చేశారు. సరైన సమాధానం రాకపోవడంతో కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)కి దహిబెన్ ఫిర్యాదు చేశారు. గత వారం సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు వద్దకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. లీజును రెన్యువల్ చేయకపోవడంతో ఆ మొత్తంతో జీవించడం కష్టంగా మారిందని ఆమె పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఆమె మొదట దాఖలు చేసిన పిటిషన్‌కు సరైన సమాధానం రాకపోవడంతో.. 2018 జనవరి 9న ఆమె రెండో అప్పీలు దాఖలు చేశారు. అందులో తాను ప్రధాని మోదీ ఆంటీనని, తనకు న్యాయం జరగకపోతే ప్రధానికే ఈ విషయం తెలియజేస్తానని పేర్కొన్నారు. ప్రధాని మోదీతో బంధుత్వం గురించి పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ ఎందుకు సమాధానం ఇవ్వలేదని, ఆమె ఆర్టీఐ పిటిషన్‌ను విచారించిన అధికారులపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలపాలని సమాచార కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు ప్రశ్నించారు. -
ఎంపీ కూడా పీఐవోనే: సీఐసీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుడి స్థానిక ప్రాంత అభివృద్ధి నిధుల(ఎంపీల్యాడ్స్) పథకం అమలు స్థితి తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని, సంబంధిత సమాచారం ఇవ్వడంలో సదరు పార్లమెంటు సభ్యుడిని కూడా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి(పీఐవో)గా పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. గ్వాలియర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ప్రశాంత్ జైన్ అనే వ్యక్తి తన నియోజకవర్గంలో 2015 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు ఎంపీల్యాడ్స్ నిధుల వినియోగం, ఏయే పథకాలకు వెచ్చించారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు, పనుల స్థితి వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సమాధానం ఇస్తూ ఎంపీ ల్యాడ్స్ వెబ్సైట్లో సంబంధిత వివరాలు ఉంటాయని, జిల్లా యంత్రాంగం ఎంపీల్యాడ్స్ ద్వారా వెచ్చించిన నిధులు ఉంటాయని పేర్కొన్నారు. అయితే, ఇందులో నిర్ధిష్ట సమాచారం లేదు. దీంతో దరఖాస్తుదారు దీనిని ప్రథమ అప్పిలేట్ అధికారి(ఎఫ్ఏఏ) వద్ద సవాలు చేయగా అక్కడా అదే సమాధానం ఎదురైంది. దీంతో దరఖాస్తుదారు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పలు కీలక అంశాలపై ఉత్తర్వులు జారీచేశారు. ఈ పథకం కింద పనుల వారీగా, పథకాల వారీగా, కాంట్రాక్టర్ల పేర్లు, పర్యవేక్షకుల పేర్లతో సహా పూర్తి వివరాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే ఎంపీల్యాడ్స్ కోసం వచ్చిన ప్రతిపాదనలు, తిరస్కరించిన ప్రతిపాదనలు, కారణాలను కూడా వెబ్సైట్లో ఉంచాలన్నారు. ఇలాంటి వివరాలు మంత్రిత్వ శాఖ వద్ద లేనప్పుడు సదరు ఎంపీ ఐదేళ్ల తన పదవీ కాలంలో ఆయా నిధులను ఖర్చు చేయని, పనులు పూర్తవని సందర్భం ఉంటే వాటిని పర్యవేక్షించడం సాధ్యం కాదని సమాచార కమిషనర్ తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. ఎంపీల్యాడ్స్ వివరాలు నియోజకవర్గ ప్రజలు తెలుసుకోగోరినప్పుడు సంబంధిత పార్లమెంటు సభ్యుడినే పీఐవోగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు -
కోహినూర్ తెచ్చేందుకు ఏం చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పురాతన, అమూల్యమైన వస్తువులను తిరిగి భారత్‌కు తెప్పించే విషయమై తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), విదేశాంగశాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం, సుల్తాన్‌గంజ్ బుద్ధ, నాసక్ వజ్రం, టిప్పు సుల్తాన్ ఖడ్గం, ఉంగరం, పులి బొమ్మ, మహారాజా రంజిత్‌సింగ్ బంగారు సింహాసనం, షాజహాన్ వినియోగించిన మరకత గ్లాసు, సరస్వతి విగ్రహం తదితరాలను భారత్‌కు తిరిగి తెప్పించేందుకు తీసుకున్న చర్యలేంటో చెప్పాలని సమాచార హక్కు చట్టం కార్యకర్త బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ దరఖాస్తు చేశారు. దీన్ని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)కు బదిలీ చేశారు. స్పందించిన ఏఎస్ఐ.. విలువైన వస్తువులను తిరిగి తెప్పించే అంశం తమ పరిధిలోనిది కాదని బదులిచ్చింది. అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలించిన అమూల్యమైన వస్తువులను మాత్రమే తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు తమ శాఖ కృషి చేస్తుందని, బ్రిటిష్ కాలంలో తరలిపోయిన వస్తువులను తిరిగి తెచ్చే అధికారం తమకు లేదని సమాధానమిచ్చింది. ఈ విషయం తెలిసి కూడా పీఎంవో, విదేశాంగ శాఖ.. ఆర్టీఐ దరఖాస్తును ఏఎస్ఐకి ప్రతిపాదించడంపై సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న వారసత్వ సంపదను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. -
వెయిటింగ్ లిస్ట్‌ను వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు(డీఎస్ఎస్ఎస్బీ) పరీక్షలో ఎంపికై వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్ధుల పేర్లను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆదేశించింది. ఈ జాబితాను వారం రోజుల్లో ఆన్లైన్లో ఉంచాలని సీఐసీ కమిషనర్ యశోవర్ధన్ ఆజాద్ సెలెక్షన్ బోర్డును కోరారు. డీఎస్ఎస్ఎస్బీ గత ఏడాది 34 టీచర్ పోస్టుల భర్తీకి గాను పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన వారితో 33 పోస్టులను భర్తీ చేసింది. అయితే, వెయిటింగ్ లిస్ట్, కటాఫ్ మార్కులు, ర్యాంకుల వివరాలు తెలపాలని రేఖారాణి అనే అభ్యర్థిని కోరగా డీఎస్ఎస్ఎస్బీ తిరస్కరించింది. దీనిపై ఆమె సీఐసీని ఆశ్రయించారు. వెయిటింగ్ లిస్ట్‌ను రహస్యంగా ఉంచడం సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీఐసీ పేర్కొంది. అర్జీదారుకు వివరాలు తెలుసుకునే హక్కు ఉందంటూ, ఈ పరీక్ష వెయిటింగ్ లిస్ట్‌ను రెండు వారాల్లోగా ఆన్లైన్లో ఉంచాలంది. -
మాల్యా అప్పులపై బిత్తరపోయే సమాధానం
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా అప్పులపై ఆర్థికమంత్రిత్వ శాఖ బిత్తరపోయే సమాధానమిచ్చింది. మాల్యా అప్పులకు సంబంధించి ఎలాంటి రికార్డులు తమ దగ్గర లేవని కేంద్ర సమాచార కమిషన్‌కి కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. మాల్యా అప్పులకు సంబంధించి వివరాలు కావాలంటూ రాజీవ్ కుమార్ ఖరే అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. అయితే ఆ వివరాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ నుంచి సరియైన స్పందన రాలేదు. అంతేకాక తాము ఆ రికార్డులను ఇవ్వలేమని, వ్యక్తిగత భద్రత, దేశ ఆర్థిక ప్రయోజనాలపై ప్రభావం చూపే వివరాలు ఇవ్వకుండా ఆర్టీఐ చట్టంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయంటూ ఆర్ధిక శాఖ తెలిపింది. కానీ అంతకముందు ఇదే విషయంపై పార్లమెంట్లో ఆర్థికమంత్రిత్వ శాఖ సమాధానం కూడా ఇచ్చింది. ఆర్థిక శాఖ వైఖరితో షాక్ అయిన రాజీవ్, సమాచార హక్కు కమిషన్‌ను ఆశ్రయించారు. ఆ కమిషన్, ఆర్థికశాఖను వివరాల కోరింది. మళ్లీ అదే సమాధానాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెప్పింది. మాల్యా అప్పులకు సంబంధించిన రికార్డులేవీ తమ దగ్గర లేవని, దరఖాస్తుదారుడు కోరుతున్న సమాచారం ఆయా బ్యాంకులు లేదా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండొచ్చని చెప్పింది. ఆర్థికశాఖ సమాధానంపై సమాచార హక్కు కమిషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. చట్టప్రకారం ఇది అస్పష్టమైన, అస్థిరమైన జవాబు అంటూ నిరసన వ్యక్తం చేసింది. రాజీవ్ దరఖాస్తును సంబంధిత పబ్లిక్ అథారిటీకి బదిలీ చేయాలని సూచించింది. -
చనిపోయిన నా భర్త డబ్బు ఎలా తీసుకున్నాడు?
న్యూఢిల్లీ: మూడేళ్ల కిందట చనిపోయిన తన భర్త జాతీయ పొదుపు పత్రాలను(ఎన్ఎస్సీ) ఎలా క్లెయిమ్ చేసుకున్నాడంటూ ఓ మహిళ కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ)ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సీఐసీ.. వెంటనే విచారణకు ఆదేశించింది. కర్నూలు జిల్లాకు చెందిన టి.సుబ్బమ్మ భర్త ఆదిశేషయ్య రూ.10 వేల విలువైన ఐదు జాతీయ పొదుపు పత్రాలను కొనుగోలు చేశాడు. 2004లో ఆయన మరణించాడు. అప్పట్నుంచి ఆయన భార్య ఈ సొమ్ము కోసం అనేక పర్యాయాలు కర్నూలు పోస్టాఫీసును సంప్రదించింది. అయినా సరైన సమాధానం లభించలేదు. కొన్నాళ్ల తర్వాత స్పందించిన పోస్టాఫీసు సిబ్బంది.. 2007లో ఆమె భర్త ఈ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకున్నట్లు తెలియజేశారు. అయితే 2004లో చనిపోయిన తన భర్త 2007లో ఎలా క్లెయిమ్ చేసుకుంటారని సుబ్బమ్మ ఆర్టీఐ ద్వారా సమాచారం కోరింది. అయినా సరైన స్పందన లేకపోవడంతో సీఐసీని ఆశ్రయించింది. చనిపోయిన వ్యక్తి మూడేళ్ల తర్వాత పోస్టాఫీసుకు వెళ్లి రూ.50 వేలు వడ్డీతో సహా ఎలా తీసుకున్నాడో చెప్పాలని కోరింది. ఆమె పిటిషన్‌పై పోస్టల్ డిపార్ట్మెంట్ స్పందన చట్టవిరుద్ధంగా ఉందని, అవకతవకలను కప్పిపుచ్చుకునేలా వారు వ్యవహరించారని సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడినట్లు ఆమె కుమారుడు చెప్పారు. తమ బంధువు సహాయంతో పోస్టాఫీసు సిబ్బంది మోసానికి పాల్పడ్డారని ఆరోపించారు. కర్నూలు సూపరింటెండెంట్ కృష్ణమాధవ్‌కు సీఐసీ షోకాజ్ నోటీస్ జారీ చేసిందన్నారు. నవంబర్ 1 లోగా పూర్తి వివరాలను సమర్పించాలని చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌ను సీఐసీ ఆదేశించిందని తెలిపారు. -
ప్రైవేటు ఆసుపత్రుల ‘స్టెంట్ దోపిడీ’: సీఐసీ
న్యూఢిల్లీ: హృద్రోగులకు అమర్చే స్టెంట్ల విషయంలో ప్రైవేటు వైద్యశాలలు దోపిడీకి పాల్పడుతున్నాయని కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) పేర్కొంది.స్టెంట్లు వేయడం కోసం ఎంతమంది రోగులను ప్రైవేటు వైద్యశాలలకు రెఫర్ చేసిందీ చెప్పాలంటూ కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)ని సీఐసీ ఆదేశించింది. గుండెకు స్టెంట్లు వేయడం కోసం ఈఎస్ఐ నుంచి ప్రైవేటు ఆసుపత్రులకు ఎంత మంది రోగులను రెఫర్ చేశారు...అందుకోసం ఎంత మొత్తం చెల్లించారనే వివరాలు ఇవ్వాలంటూ పవన్ సారస్వత్ అనే సమాచార హక్కు కార్యకర్త గతంలో దరఖాస్తు చేశారు. ఈ సమాచారం ఇచ్చేందుకు ఈఎస్ఐసీ నిరాకరించడంతో అతను సీఐసీని ఆశ్రయించారు. కేసును విచారించిన కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఇందులో పెద్ద కుంభకోణం దాగి ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. -
గాడ్సే చెప్పిందేంటి?
గాంధీ హత్య కేసు వివరాలు చెప్పాలంటూ ఎన్ఏఐని ఆదేశించిన సీఐసీ న్యూఢిల్లీ: గాంధీజీ హత్య కేసు వివరాలను, హంతకుడు నాథురామ్ గాడ్సే విచారణలో ఇచ్చిన వాంగ్మూలాన్ని వెల్లడించాలని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాను (ఎన్ఏఐ) కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. ఆ వివరాలన్నింటిని ఎన్ఏఐ వెబ్సైట్లో పొందుపరచాలని సూచించింది. చార్జ్‌షీట్, వాంగ్మూలాన్ని వెల్లడించాలని అశుతోష్ బన్సాల్ అనే వ్యక్తి ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఈ దరఖాస్తును ఢిల్లీ పోలీసులు ఎన్ ఏఐకి బదిలీ చేశారు. కాగా, ఆ వివరాలను తమ వెబ్సైట్లో శోధించి కావాల్సిన సమాచారాన్ని పొందాలని దరఖాస్తుదారుడికి ఎన్ ఏఐ సూచించింది. దీంతో సమాచారాన్ని పొందడంలో విఫలమైన బన్సాల్.. సీఐసీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులును ఆశ్రయించాడు. ఆయన స్పందించి దరఖాస్తుదారుడు అడిగిన సమాచారాన్ని రికార్డ్స్‌లో ఇండెక్స్‌తో సహా అందించాలన్నారు. దరఖాస్తుదారుడి నుంచి పేజీకి రూ. 2 చొప్పున వసూలు చేస్తూ 20 రోజుల్లోగా గాంధీ హత్య కేసు చార్జ్‌షీట్ పత్రాలను, గాడ్సే వాంగ్మూలాన్ని సీడీ రూపంలో అందించాలని ఆదేశించారు. -
ప్రధాని డిగ్రీ వివరాలు ఇవ్వండి: సీఐసీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ డిగ్రీలకు సంబంధించి వివరాల్ని అందించాలంటూ ఢిల్లీ, గుజరాత్ వర్సిటీలతో పాటు ప్రధాని కార్యాలయాన్ని కేంద్ర సమాచార సంఘం(సీఐసీ) శుక్రవారం ఆదేశించింది. డిగ్రీ పూర్తయిన ఏడాది, ఇతర వివరాలు అందిస్తే పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఆయా వర్సిటీలకు వీలువుతుందని సీఐసీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు పీఎంఓను కోరారు. 1978 లో గ్రాడ్యుయేషన్ (ఢిల్లీవర్సిటీ) 1983లో పోస్టు గ్రాడ్యుయేషన్ (గుజరాత్ యూనివర్సిటీ)లకు సంబంధించి నరేంద్ర దామోదర్ మోదీ పేరిట ఉన్న వివరాల్ని పరిశోధించి ఇవ్వాలంటూ ఆయా యూనివర్సిటీల ప్రజా సమాచార విభాగం అధికారులను సమాచార సంఘం కోరింది. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ప్రధాని విద్యార్హతల వివరాల్ని కోరినప్పుడు ఇవ్వడం సబబుగా ఉంటుందని తన ఉత్తర్వుల్లో ఆచార్యులు పేర్కొన్నారు. ప్రధాని డిగ్రీలపై కేజ్రీవాల్ నుంచి వచ్చిన వివరణల్నే ఆర్టీఐ దరఖాస్తుగా పరిగిణించిన సీఐసీ ఈ ఆదేశాలు జారీచేసింది. -
మోదీ ఏం చదివారు? ఎన్ని డిగ్రీలు ఉన్నాయి?
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న విద్యార్హతలేమిటో వెల్లడించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)కి లేఖ రాశారు. ప్రధాని మోదీకి ఉన్న డిగ్రీలేమిటో ప్రజలకు తెలియజేయాల్సిన అసవరముందని, ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సందేహాలను తొలగించాలని ఆయన కోరారు. 'ప్రధాని మోదీ తన విద్యార్హతల గురించి వివరాలు ప్రజలకు తెలియజేయకుండా సంబంధిత విభాగాలను అడ్డుకుంటున్నారని కథనాలు వస్తున్నాయి. ప్రధానికి ఎలాంటి విద్యార్హతలుగానీ, డిగ్రీలుకానీ లేవనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరముంది' అని కేజ్రీవాల్ హిందీలో రాసిన ఈ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ పేరిట రాసిన ఈ లేఖలో సీఐసీ పనితీరుపైనా కేజ్రీవాల్ పలు ప్రశ్నలు లేవనెత్తారు. 'నా విద్యార్హతల గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకున్నారు. కానీ ప్రధాని డిగ్రీల గురించి వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు. ఇది సీఐసీ స్వతంత్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నది' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.