CMO
-
పరువు పోతోంది పరిష్కారమేంటి?
సాక్షి, హైదరాబాద్: మధ్యాహ్న భోజనం పురుగులతో విద్యార్థులు ఏదో ఒకచోట అస్వస్థతకు లోనవుతూనే ఉన్నారు. ‘ఒకరోజు ఖమ్మం జిల్లాలో, మరోరోజు నారాయణపేట జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తినే మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వం పరువు పోతోంది. ఏం చేద్దాం..ఎలా పరిస్థితిని చక్కబెడదాం’అంటూ ఉన్నతాధికారులు హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.‘నాణ్యత లేని భోజనం పెడితే కటకటాలు లెక్కబెట్టిస్తాం’అని సీఎం నవంబర్ 14న ప్రకటించారు. అయినా వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను సీఎంవో ఆదేశించింది. ఘటన జరిగినప్పుడు హెచ్ఎంనో, డీఈవోనో సస్పెండ్ చేస్తే కొత్త సమస్యలొస్తున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. టీచర్ల నుంచి వ్యతిరేకత కొని తెచ్చుకుంటున్నామని సీఎం భావిస్తున్నారు. ఇవేవీ లేకుండా పురుగుల అన్నంతో పరువు పోకుండా ఏం చేయాలో నివేదిక ఇవ్వడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. సమస్య ఎక్కడ? రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. విద్యార్థుల హాజరుశాతం పెంచేందుకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. విద్యార్థుల సంఖ్యను బట్టి పౌర సరఫరాల శాఖ నుంచి బియ్యం అందజేస్తారు. మిగతా సరుకులన్నీ స్వయం సహాయ బృందాల నిర్వహణలో ఉంటాయి. ఎక్కువ మంది విద్యార్థులుంటే కొంత వరకూ నిర్వహణ సాధ్యమవుతోంది. మరీ తక్కువగా విద్యార్థులుంటేనే నిర్వహణ వ్యయం ఇబ్బందే. 13,005 స్కూళ్లలో 50 లోపు విద్యార్థులే ఉన్నారు.ఈ కారణంగా వచ్చే నిధులు తక్కువ. స్వయం సహాయ బృందాలకు నెలవారీ బిల్లులు కూడా చెల్లించడం లేదు. అప్పు తెచ్చి వంట చేస్తున్నామని, వడ్డీ తామే కడుతున్నామంటున్నారు. ఈ సమస్యలు పరిష్కరించకుండా ఏం చేసినా నాణ్యత ఎలా పెరుగుతుందని వారు ప్రశి్నస్తున్నారు. అదీగాక సివిల్ సప్లై నుంచి వచ్చే బియ్యంలో పురుగులు ఉంటున్నాయని, వాటిని రీ సైక్లింగ్ చేస్తే తప్ప పురుగులు అరికట్టడం సాధ్యం కాదంటున్నారు. దీనికి బడ్జెట్ ఉండదని హెచ్ఎంలు అంటున్నారు. ఇక్కడో రీతి... అక్కడో తీరు కేజీబీవీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన మెనూ అమలు చేస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో రకమైన ఆహారం ఇస్తారు. గుడ్లు కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అన్నం, వెజిటబుల్స్, రసం, కోడిగుడ్డు, ఆకుకూరపప్పు, నెయ్యి, పెరుగు ఇస్తున్నారు. కాబట్టి నిర్వహణ వ్యయం సరిపోతుందనేది హెచ్ఎంల వాదన. ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం బియ్యం, కూరగాయలు, పప్పు మాత్రమే ఇస్తున్నారు. పప్పు, కోడిగుడ్డు రోజూ ఉండదు. కూరల రేట్లు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ నిర్వహణ సమస్యగా ఉన్నాయని ప్రధానోపాధ్యాయులు విద్యాశాఖకు తెలిపారు.విధాన పరమైన లోపాలున్నాయి మధ్యాహ్న భోజన నాణ్యత పెంచాలంటే ముందుగా విధానపరమైన మార్పులు అవసరం. సంబంధిత ఏజెన్సీలకు ముందుగా బిల్లులు చెల్లించాలి. నాణ్యత పెంచేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించాలి. నిధులు పెంచాలి. తప్పు జరిగినప్పుడు హెచ్ఎంలనే బాధ్యులను చేయడం అన్యాయం. – పి.రాజాభాను చంద్రప్రకాశ్, తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు టీచర్లనే ప్రశ్నించడం సరికాదు మధ్యాహ్న భోజన పథకం అమలులో హెచ్ఎంల పాత్ర నామమాత్రమని 2014లో ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. బోధన సంబంధమైన విధులే హెచ్ఎంలకు తలకు మించి ఉన్నాయి. తప్పు జరిగితే బాధ్యులను చేయాలనే విధానం మంచిది కాదు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు -
రుణమాఫీపై తెలంగాణ సీఎంవో కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రుణమాఫీ వర్తించే రైతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలని కోరింది. తద్వారా త్వరగతిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా? లేదంటే వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది. ఉదాహరణకు.. ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలి. ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్‌తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్‌లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ.. కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్ డేటేడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది. -
సీఎంవోలో సీనియర్ ఐఏఎస్‌కు అవమానమా?
అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్ అధికారి. డిప్యూటేషన్ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. -
సీఎం ఆఫీసులో కంటైనర్.. పరువు తీసుకున్న ఈనాడు
-
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ తొలి ఆదేశాలు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన తర్వాత ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తొలిసారి సీఎం హోదాలో ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ ప్రభుత్వంలోని జల మంత్రిత్వ శాఖకు కేజ్రీవాల్ ఈ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల వివరాలు ఆదివారం(మార్చ్ 24) నిర్వహించిన మీడియా సమావేశంలో ఢిల్లీ ఆర్థిక, జల వనరుల మంత్రి అతిషి వెల్లడించారు. ‘జైలులో ఉండి కూడా సీఎం తన కుటుంబ సభ్యులైన ఢిల్లీ వాసుల గురించే ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఢిల్లీలో నీటి కొరత లేకుండా చూడాలని తనను సీఎం ఆదేశించారు. క్యాబినెట్ పనితీరును సీఎం జైలు నుంచే పర్యవేక్షిస్తున్నారన్నారు’ అని అతిషి చెప్పారు. मुख्यमंत्री अरविंद केजरीवाल जी को जेल से भी अपने परिवार दिल्ली की जनता की चिंता है उन्होंने मुझे जेल से लिखित आदेश भेजा है, जिसे पढ़ते वक्त मेरी आँखों में आँसू थे ऐसा कौन सा मुख्यमंत्री है जो जेल में होने के बावजूद भी अपनी चिंता नहीं कर रहा है बल्कि लोगों के बारे में सोच रहा… pic.twitter.com/6Ht9lNdunN — AAP (@AamAadmiParty) March 24, 2024 కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో మార్చ్ 21న అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్(ఈడీ) కస్టడీలో ఉన్నారు. కోర్టు ఆయనను మార్చ్ 29దాకా ఈడీ కస్డడీకి ఇచ్చింది. జైలు నుంచే తమ నేత సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తారని ఆప్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గ్యాంగులే జైళ్ల నుంచి ఆపరేట్ చేస్తాయని దీనిపై ఇప్పటికే బీజేపీ కౌంటర్ కూడా ఇవ్వడం గమనార్హం. Delhi CM Arvind Kejriwal sends order from ED custody to Water Minister Atishi. https://t.co/FcceGPK5Yx pic.twitter.com/iZs4PzHhhR — ANI (@ANI) March 24, 2024 ఇదీ చదవండి.. కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట -
HYD: స్ట్రీట్ ఫుడ్ కుమారి ఆంటీ షాపుపై స్పందించిన సీఎంవో
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఆంటీ కుమారికి షాక్ ఇచ్చిన పోలీసులు.. ఆమె ఫుడ్ కోర్టును బంద్ చేయించిన విషయం తెలిసిందే. ఏ సోషల్ మీడియా అయితే ఆమెను ఫేమస్ చేసిందో.. అదే ఆమెను ఇబ్బందులకు గురిచేసింది. ఆమె వీడియోలు వైరల్ అయ్యాక ఆ ఫుడ్ కోర్టుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో జనం వస్తుండడం.. వాహనాల పార్కింగ్తో ఈ మధ్య మాదాపూర్‌లోని ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో మంగళవారం నాడు పోలీసులు రంగంలోకి దిగారు. ఆమె ఫుడ్‌కోర్టును అక్కడి నుంచి తరలించారని ఆదేశించారు. ఈ క్రమంలో కుమారి ఆంటీ షాపుపై సీఎంవో స్పందించింది. కుమారి ఆంటీ షాపును మార్చాలనే నిర్ణయాన్ని తెలంగాణ సర్కార్ వెనక్కి తీసుకుంది. యథావిధిగా కొనసాగించాలని డీజీపీ, ఎంఏయూడీ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజాపాలనకు ప్రాధాన్యత ఇస్తామంటూ సీఎంవో ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా? -
యాది మరువలేదు.. ‘సాక్షి’ కథనంపై స్పందించిన సీఎంఓ
సాక్షి, కామారెడ్డి: ‘రేవంతన్నా.. నన్ను యాది మరవకు’ శీర్షికన ‘సాక్షి’ మెయిన్‌లో ఆదివారం ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. సీఎంఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో భిక్కనూరు లక్ష్మి ఇంటికి వెళ్లారు ఆమె కుటుంబ వివరాలు సేకరించారు. గతేడాది మార్చి 28న జిల్లాలో హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్‌రెడ్డి కూలిపోయిన ఇంట్లో ఉంటున్న భిక్క నూరు లక్ష్మి బాధలు ఆలకించారు. అధికారంలోకి రాగానే ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై సీఎంఓ స్పందించి, వివరాలు సేకరించాలని కలెక్టర్‌ను ఆదేశించింది. దీంతో వెంటనే రెవెన్యూ ఇన్స్పె క్టర్ పూల్‌సింగ్, ఏడీ నర్సింహారెడ్డి చిన్నమల్లా రెడ్డి గ్రామానికి వెళ్లి లక్ష్మి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూలిపోగా మిగిలిన కొద్ది భాగంలో లక్ష్మి కుటుంబం నివసిస్తున్న విషయాన్ని నోట్ చేసుకున్నారు. ఇప్పటికిప్పుడు ఇబ్బంది ఉంటే పొరుగునే ఉన్న తిమ్మక్‌పల్లిలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తా మని అధికారులు చెప్పారు. అయితే కూలిపోయిన ఇంటి స్థలంలోనే కొత్త ఇల్లు నిర్మాణానికి సాయం అందించాలని లక్ష్మి కోరడంతో ప్రభుత్వానికి ప్రతిపాద నలు పంపిస్తామని రెవెన్యూ అధికారులు పేర్కొ న్నారు. ఈ సందర్భంగా లక్ష్మితో పాటు ఆమె కు టుంబ సభ్యులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. -
TS: సీఎంవో కార్యాలయంలో కేటుగాడు.. ప్రోటోకాల్ ఆఫీసర్ పేరుతో..
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ సెటిల్మెంట్లు, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కేటుగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్లో దొంగ ప్రోటోకాల్ ఆఫీసర్‌గా అవతారం ఎత్తిన ప్రవీణ్ సాయి.. పలువురికీ సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్‌తో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసాలకు తెర తీశాడు. వనస్థలిపురంలో నివాసం ఉంటున్న అత్తిలి ప్రవీణ్ సాయి.. 6 నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి శఠగోపం పెట్టాడు. అతని అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు.. ఇన్నోవా కార్, సెల్ ఫోన్‌ను సీజ్ చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు -
విశాఖలో సీఎంవోకు దశలవారీగా చర్యలు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాజధాని అంశానికి ఎవరు సహకరించినా స్వాగతిస్తామని తెలిపారాయన. విశాఖ రాజధాని జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన భేటీకి శనివారం మంత్రి గుడివాడ అమర్నాథ్తో కలిసి హాజరయ్యారు వైవీ సుబ్బారెడ్డి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు దశలవారీగా చేపడతాం. విజయదశమి నుంచి పాలనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే కమిటీ వేయడం జరిగిందని తెలిపారు. అలాగే.. అక్టోబర్ 15న విశాఖ రాజధానిని స్వాగతిస్తూ భారీ కార్యక్రమం చేపట్టే యోచనలోఉన్నట్లు తెలిపారాయన. ‘‘విశాఖ వందనం’’ పేరుతో అన్ని వర్గాల ప్రజలతో కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. అన్ని సమకూర్చుకున్న తర్వాతే విజయదశమి నుంచి విశాఖ నుంచి సీఎం జగన్ పాలనా ముహూర్తం ఖరారైందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. సీఎస్ కీలక వ్యాఖ్యలు అంతకుముందు వీఎంఆర్‌డీలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని బిల్డింగ్‌ల ఎంపిక, సన్నద్ధతపై సీఎస్ చర్చించారు. విశాఖలో రాజధాని ఏర్పాట్లపై అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం విశాఖలో జరిగే మౌలిక సదుపాయాలు, అభివృద్ధిని త్వరలో అందరూ చూస్తారని అన్నారు. విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించామని తెలిపారాయన. విశాఖలో ఇప్పటికే ఆమోదం పొందిన జాతీయ స్థాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్‌ల అమలు కోసం కొన్ని సూచనలు చేశామని జవహర్ రెడ్డి తెలిపారు. నీతి ఆయోగ్ ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 20 నగరాలలో విశాఖ ఒకటి కావడం శుభ పరిణామమని.. 2047 వికసిత్ భారత్ కోసం ఎంపిక చేసిన నాలుగు నగరాలలో విశాఖ ఒకటని ఈ సందర్భంగా సీఎస్ జవహర్ రెడ్డి ప్రస్తావించారు. -
పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటున్నా ఆరోగ్యంలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. (ఇది చదవండి: విషమంగా పంచ్ ప్రసాద్ ఆరోగ్యం.. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చు!) వీలైనంత త్వరగా అతడికి ఆపరేషన్ చేయాలని, అందుకు చాలా ఖర్చవుతుందని, దాతలు సాయం చేయాలని కోరాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు. పంచ్ ప్రసాద్‌కు ఆపరేషన్.. అండగా ఏపీ ప్రభుత్వం పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు స్పందించిన సీఎం జగన్.. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పంచ్ ప్రసాద్‌కి వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న పంచ్ ప్రసాద్‌కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏపీ ప్రభుత్వం వైద్యం చేయిస్తోంది. అంతకుముందు ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు. ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని వెల్లడించారు. వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో మంచి ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. (ఇది చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన బుల్లితెర నటి తండ్రి) My team is following up with the family and guiding them in LOC application process. We will LOC under CMRF for renal transplantation as soon as we complete the documents verification.#YSJaganCares https://t.co/CAkeihv0VR — Dr Hari Krishna (@HariKrishnaCMO) June 8, 2023 -
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు ఊరట..
వేతన పెంపు విషయంలో కంపెనీ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్న మైక్రోసాఫ్ట్ (Microsoft) ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయం చెప్పారు ఆ కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్. జీతం పెరగకపోయినా ఆదాయం పెంచుకునే చిట్కా చెప్పారు. ఈ ఏడాది ఉద్యోగుల వేతనాలను పెంచడం లేదని మైక్రోసాఫ్ట్ ఇటీవల ప్రకటించింది. సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా ఉద్యోగులకు సమాచారం అందించారు. దీనిపై కంపెనీ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు తమ ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని కంపెనీ సీఎంఓ సూచించారు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ క్రిస్ కాపోస్సేలా ఇటీవల సందేశాలు పంపినట్లు ఫార్చూన్ పత్రిక పేర్కొంది. కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఎందుకు పెంచలేదో ఆ లేఖలో ఆయన వివరించారు. అలాగే ఆదాయాన్ని పెంచుకునే మార్గాన్ని సూచించారు. కంపెనీ స్టాక్ ధర పెరిగితే.. ఉద్యోగులకు అందే పరిహారం కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతుందని, ప్రతిఒక్కరూ స్టాక్ ధర పెరిగేలా పనిచేయాలని సూచించారు. ఈ ఏడాది కంపెనీ షేరు విలువ ఇప్పటికే 33 శాతం పెరిగినట్లు ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కంపెనీని అనుకూలంగా ఉంచే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు, మానవ వనురుల పెంపు, డేటా సెంటర్ సామర్థ్యాన్ని విస్తరించడానికి కట్టుబడి ఉందని క్రిస్ కాపోస్సేలా పేర్కొన్నారు. ఇదీ చదవండి: మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల -
మణిపూర్ లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులందరినీ రక్షించాం
-
సీఎంవో వద్ద ఆత్మహత్యాయత్నం.. అసలు సంగతి ఇది!
సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో.. అవాస్తవంతో కూడిన కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే సీఎంవో విడుదల చేసిన ఒక స్పష్టమైన ప్రకటన ఆధారంగా.. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ వివరాలు ఇలా ఉన్నాయి. రాజులపూడి ఆరుద్ర, వైఫ్ ఆఫ్ భువనేశ్వర్‌కు తనకు రెండు స్థిరాస్తులు ఉన్న్టటు చెప్తున్నారు. ఇందులో ఒకటి కాకినాడ జిల్లా అన్నవరం వద్ద కాగా, రెండోది అమలాపురంలో ఉంది. అన్నవరం సమీపంలో ఉన్న స్థలాన్ని అమ్మకోనీయకుండా అడ్డుపడుతున్నారంటూ “స్పందన’’ కార్యక్రమం ద్వారా ఆరుద్ర, సెప్టెంబరు 12న కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కాకినాడ ఎస్పీ సెప్టెంబరు 14నే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను గన్‌మెన్‌గా, ఇంటిలిజెన్స్ విభాగం నుంచి తొలగించి వారికి ఏఆర్‌కు పంపారు. ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదుచేసి విచారణ చేపట్టారు. తమపై తీసుకుంటున్న చర్యలను నిలుపుదల చేయాలంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు హైకోర్టును కోర్టును ఆశ్రయించగా, అక్టోబరు 30న న్యాయస్థానం 8 వారాలపాటు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిటిషనర్ ఆరుద్ర ఆరోపించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ ప్రస్తుతం ఎమ్మెల్యేకు గన్‌మ్యాన్‌గా లేరు. అమ్మడానికి వీల్లేదు! ఇక అమలాపురం ఆస్తికి సంబంధించి కూడా వివరాలు ఇలా ఉన్నాయి. పిటిషనర్ ఆరుద్ర. ఆమె భర్త భువనేశ్వర్.. ఐదుగురు సంతానంలో ఒకరు. అందులో సోమశేఖర్ నాల్గవ సంతానం కాగా పిటిషనర్ భర్త 5వ సంతానం. వారి తండ్రి రాజులపూడి వైకుంఠ రావు చనిపోయేముందు తన భార్య అయిన సీతమ్మకి ఒక అన్‌రిజిస్టర్డ్ వీలునామా రాసి ఉన్నారు. దాని ద్వారా పొందిన హక్కుతో రాజులపూడి సీతమ్మ 15.8.2007 న ఒక అన్‌రిజిస్టర్ వీలునామా రాసి ఉన్నారు. దాని ప్రకారం తన ఐదవ సంతానం అయిన రాజులపూడి భువనేశ్వర్- తాను ఇచ్చిన ఆస్తిని ఉన్నంతకాలం అనుభవించవచ్చు. కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. అతని తదనంతరం తన నాల్గవ కుమారుడైన రాజులపూడి సోమశేఖర్ కుమారుడైన భరత్ కుమార్‌కు ఆ ఆస్తి చెందేలా.. అతను అమ్ముకునేందుకు అధికారం ఇస్తూ వీలునామా రాశారు సీతమ్మ. పిటిషనర్ ఆరుద్ర తన కుమార్తె అయిన సాయి లక్ష్మీ చంద్ర అనారోగ్యం దృష్ట్యా సదరు ఆస్తిని అమ్మి ఆమెకు వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. అయితే భరత్ కుమార్ అమలాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా(O.S.No.24/2022)వేశారు. దీనిపై పిటిషనర్ ఆరుద్ర, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి సెప్టెంబరు 26న స్పందనలో ఫిర్యాదు చేయగా, 29న ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. తదుపరి విచారణ చేయగా, ఈ విషయం సివిల్ తగాదాగా నమోదయ్యిందని, కోర్టు పరిధిలో ఉందని రిప్లై కూడా ఇచ్చారు. చివరగా.. రాజులపూడి ఆరుద్ర బుధవారం ఉదయం సీఎంఓ అధికారులను కలిసిన సందర్భంలో వైద్యానికయ్యే అంచనాలను పంపాలని కోరడం జరిగింది. అంతేకాక దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు సీఎంఓ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత డాక్టర్లతో వైద్యం గురించి మాట్లాడాలనీ, సీఎంఆర్ఎఫ్తో ఫాలో అప్చేసుకోవాలని కూడా ఆదేశించారు. -
రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు యువతి లేఖ
బెంగళూరు: దేశంలో రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు అత్యంత దీన స్థితిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మట్టీ రోడ్లే దర్శనమిస్తుంటాయి. ఉన్న రోడ్లలో కూడా చాలా వరకు అన్నీ అతుకులు, గతుకులతోనే నిండిపోయాయి. అయితే ఓ యువతి తమ గ్రామంలో అధ్వానంగా ఉన్న రోడ్ల సమస్యకు పరిష్కారం తేవాలనుకుంది. ఇందుకు సరికొత్త నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల బింధు అనే యువతి దావణ్‌గెరె జిల్లాలోని హెచ్ రాంపురాలో టీచర్‌గా పనిచేస్తోంది. తమ గ్రామంలో రోడ్లు బాగోలేక పోవడం వల్ల గ్రామంలోని యువతకు పెళ్లిళ్లు కావడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది. ఇందులో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. రోడ్లు బాగోలేవని, వీలైనంత తొందరగా వాటిని పునురద్దరించాలని కోరింది. అలాగే రోడ్ల మరమ్మత్తులు చేపట్టేవరకు వివాహం చేసుకోనని స్పష్టం చేసింది. చదవండి: వైరల్: బుల్లెట్ బండి పాటకు ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి డ్యాన్స్ ‘మా గ్రామానికి మంచి రోడ్డు కనెక్టివిటీ లేదు. గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. మాలో చాలా మందికి వివాహ సంబంధాలు అందడం లేదు. ఎందుకంటే ఇక్కడి పిల్లలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. మా ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం.హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది’ బిందు పేర్కొన్నారు. చదవండి: karnataka: బస్సులో యువతి పట్ల అసభ్య ప్రవర్తన కాగా బిందు లేఖకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అంతేగాక గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్ శాఖను తక్షణమే పనులు చేపట్టాలని.. జరుగుతున్న పనుల గురించి వారికి తెలియజేయాలని సీఎంఓ ఆదేశించింది. దీని మీద బిందు మాట్లాడుతూ ‘ఈ రోడ్డును బాగు చేయడానికి మా ప్రజాప్రతినిధులకు కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. అందుకే అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను”అని పేర్కొంది. -
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
-
సీఎం జగన్ ప్రత్యేక చొరవ: 48 గంటల్లో భూవివాదం పరిష్కారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: భూవివాదం విషయంలో సెల్ఫీ వీడియో తీసుకున్న కుటుంబం వార్త కలకలం రేపిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కుటుంబ సమస్య పరిష్కారమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవతో ఆ సమస్యకు పరిష్కారం లభించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండలం ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్ బాషాకు సంబంధించిన పొలం వివాదం ఉంది. తనకు న్యాయం చేయాలని అక్బర్ కుటుంబంతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ అతడి సమస్యపై ముఖ్యమంత్రి కార్యాలయం తక్షణం స్పందించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో సమస్యను 48 గంటల్లోనే పరిష్కారమైంది. ఆ పొలం వివాదం సమసిపోయింది. ఈ విషయాన్ని బాధితుడు అక్బర్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలిపాడు. తమకు సీఎం జగన్ న్యాయం చేశారని చెప్పారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి సమష్టి కృషితో సమస్య పరిష్కారమైందని వివరించాడు. తమ పొలం సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌కు రుణపడి ఉంటామని ప్రకటించాడు. చదవండి: బ్యాంక్‌కు నిద్రలేని రాత్రి.. అర్ధరాత్రి పాము హల్చల్ -
హుజూరాబాద్ ఎఫెక్ట్.. సీఎంఓలో ఎస్సీ సామాజిక వర్గ ఐఏఎస్
సాక్షి, హైదరాబాద్: ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి కార్యదర్శిగా బదిలీ చేస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశా రు. ఎస్సీల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా అద నపు బాధ్యతలను సైతం రాహుల్ బొజ్జాకు అప్ప గించారు. ప్రతిష్టాత్మక దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో సీఎంవోలో ఎస్సీ సామాజికవర్గ ఐఏఎస్ అధికారిని నియమించడం గమనార్హం. -
పది లక్షలిస్తేనే పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆరోగ్య శాఖలో డిప్యూటీ సెక్రటరీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. ‘రూ.10 లక్షలిస్తే పదోన్నతి వచ్చేలా చేస్తా.. కోరిన చోటుకు పోస్టింగ్ ఇస్తా’ అంటూ నేరుగా ఒక వైద్యుడి క్లినిక్‌కు వెళ్లి డబ్బు డిమాండ్ చేసిన వైనం సీసీటీవీ ఫుటేజ్ ద్వారా బయటకొచ్చింది. గుంటూరు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న డా.వై.కిరణ్‌కుమార్ తనకు న్యాయంగా రావాల్సిన పదోన్నతి దక్కలేదంటూ నాలుగున్నరేళ్ల పాటు అప్పటి ప్రభుత్వంతో పోరాడారు. జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించగా పదోన్నతి ఇవ్వాల్సిందేనని కమిషన్ తీర్పుచెప్పింది. అధికారులు మాత్రం పదోన్నతి ఇవ్వకుండా తిప్పుకున్నారు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా.. కిరణ్‌కుమార్ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎంఓ ఆదేశించింది. అయితే కిరణ్‌కుమార్ బావమరిది ఆనంద్... సచివాలయంలో ఆరోగ్యశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసే యిర్మియా రాజును సంప్రదించి తన బావ పదోన్నతి అంశాన్ని చర్చించారు. తనకు రూ.10 లక్షలు ఇస్తే నోషనల్ ప్రమోషన్, మళ్లీ పోస్టింగ్ ఇస్తానని యిర్మియా డిమాండ్ చేశారు. ఫైలు చదివాక మిగతా విషయాలు మాట్లాడుతా నవంబర్ 4న గుంటూరులో కిరణ్‌కుమార్ నిర్వహిస్తున్న క్లినిక్‌కు వెళ్లిన యిర్మియా.. దాదాపు 30 నిముషాలు మాట్లాడి రూ.10 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. నవంబర్ 20న మళ్లీ క్లినిక్‌కు వెళ్లి రూ.50వేలు తీసుకున్నారు. ‘మీకు మూడేళ్ల నుంచి వేతనం రాలేదు కదా అది కూడా వచ్చేలా చేస్తా..మీ ఫైలు చాలా క్లిష్టంగా ఉంది. బాగా చదవాలి. అన్నీ చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతా’ అని చెప్పారు. ఫైలు పరిశీలించాక నాలుగైదు రోజుల్లో కలుస్తానని, అప్పుడు మిగతా మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అతను క్లినిక్‌కు వెళ్లిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో అడ్డంగా దొరికిపోయారు. వైద్యుడి నుంచి డబ్బు తీసుకుంటున్న దృశ్యాలు.. ఎడమవైపు డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు, కుడివైపున వైద్యుడి బావమరిది ఆనంద్ సీఎంవో కార్యాలయ ఆదేశాలు బేఖాతరు తనకు న్యాయం జరగడం లేదని కిరణ్‌కుమార్ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆ వినతిని పరిశీలించిన సీఎం కార్యాలయం 2019 నవంబర్ 5న వైద్య ఆరోగ్యశాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని, 2015లో జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని అమలు చేసి న్యాయం చేయాలని సూచించింది. అయితే ఇవేమీ ఖాతరు చేయకుండా డిప్యూటీ సెక్రటరీ యిర్మియారాజు డబ్బులు వసూలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. రూ.10 లక్షలు డిమాండ్ చేశారు గత నాలుగున్నర సంవత్సరాలుగా నోషనల్ ప్రమోషన్‌పై పోరాడుతున్నాను. అప్పటి ప్రభుత్వం న్యాయం చేయకపోగా విజిలెన్స్, ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని కూడా అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో నా బావమరిది ఆనంద్...డిప్యూటీ సెక్రటరీ యిర్మియా రాజును సంప్రదించారు. అనంతరం ఆయన నా దగ్గరకొచ్చి రూ.10 లక్షలు డిమాండు చేశారు. అడ్వాన్సుగా రూ.50వేలు ఇచ్చాను. మరో రెండు లక్షలు ఇవ్వాలని, మిగతా సొమ్ము పనయ్యాక ఇవ్వాలని అడిగారు. అలాగే ఇస్తానని చెప్పాను. – డా.కిరణ్‌కుమార్, ప్రొఫెసర్, జనరల్ సర్జరీ -
సీఎంవోకు ఫోన్‌కాల్.. వైరల్ ఆడియో క్లిప్‌పై ఫిర్యాదు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) హెల్ప్‌లైన్‌కు ఎవరో ఫోన్ చేసినట్లు, తమ అభిప్రాయాలు చెప్పినట్లు రెండు రోజులుగా పత్రికలు, చానళ్లలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సోమవారం హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సీఎంవోకు వచ్చిన ఫోన్‌కాల్ అంటూ 2.56 నిమిషాల నిడివి గల ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్‌కు కాల్ చేసి ముఖ్యమంత్రి వైఖరిని తప్పు పట్టిన కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువకుడు’ అంటూ వాట్సాప్‌లో ఇది చక్కర్లు కొడుతోంది. ఈ నకిలీ ఆడియో ద్వారా సీఎంపై దుష్ఫ్రచారం చేస్తున్న వ్యవహారాన్ని సీఎంవో సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులు సీపీని కోరారు. దీనిపై స్పందించిన ఆయన కేసును సాంకేతికంగా దర్యాప్తు చేయాలని, బాధ్యుల్ని తక్షణం గుర్తించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. -
ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో హితవు పలికింది. ఈ విషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సుదీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్టును సఫలం చేసేదిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సీఎంవో పేర్కొంది. అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కూడా చర్చించారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని, విద్యుత్ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది. సోమవారం నాటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని, ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. చదవండి: కృష్ణకు గో‘దారి’పై.. -
బినామీ సంస్థకే ‘ఫ్లెక్సీ పవర్’
సాక్షి, అమరావతి: ఫ్లెక్సీ పవర్ పేరుతో తన బినామీకి అడ్డగోలుగా దోచిపెట్టాలన్నదే ప్రభుత్వాధినేత అసలు వ్యూహమని తేటతెల్లమైంది. ఏ అర్హత లేని ఎకొరాన్ కంపెనీకి ప్రభుత్వ పెద్దలు సహకరించడం, అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే.. విద్యుత్ నిల్వ ప్రాజెక్టు (ఫ్లెక్లీ పవర్) పేరుతో టెండర్లను ఖరారు చేసి, ‘ఎకొరాన్’కు మేలు చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఆరాట పడుతోందని ‘కోడ్ ఉన్నా కమీషన్ల బేరం’ శీర్షికన బుధవారం ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అనుభవం ఉన్న సంస్థలపై అనర్హత వేటు! పవన విద్యుత్, సౌర విద్యుత్ రంగంలో ఏమాత్రం సమర్థత లేని ఎకొరాన్ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన లింగమనేనికి ఎకొరాన్ సంస్థ అధిపతి దగ్గరి బంధువని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆ సంస్థకు ఫ్లెక్సీ పవర్ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. సమీకృత పవన, సౌర, జల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసి, దాన్ని డిమాండ్ ఉన్నప్పుడు గ్రిడ్‌కు అందించాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ పనుల్లో అనుభవం గల కంపెనీలు టెండర్లలో పాల్గొన్నప్పటికీ ఏవో కారణాలు చూపించి వాటిపై వేటు వేసి, అర్హత లేని ఎకొరాన్‌కు లబ్ధి చేకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టమవుతోంది. ఎకొరాన్ ప్రతిపాదన.. ఆగమేఘాలపై ఆమోదం చిన్నాచితక పవన విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లే ఉన్న ఎకొరాన్ సంస్థకు ఫ్లెక్సీ పవర్‌ను అందించే సామర్థ్యం లేదు. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఏకంగా 2,000 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టును ప్రభుత్వం వద్ద ప్రతిపాదించింది. కర్నూలు జిల్లా అవుకు దగ్గర 600 మెగావాట్లు, కడప జిల్లా మైలవరం దగ్గర 1,400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. అయితే తొలిదశలో అవుకు దగ్గర 200 మెగావాట్లు, కడప జిల్లాలో800 మెగావాట్ల హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తామంది. దీనికి 7,437 ఎకరాల భూమి ఇవ్వాలని కోరింది. ఎకొరాన్ నుంచి ప్రతిపాదన రావడమే ఆలస్యం మార్చి 1వ తేదీన ఇంధన శాఖ దానికి ఆమోదం తెలిపింది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకుండానే, ఎకొరాన్ ఆర్థిక పరిస్థితిని ఆరా తీయకుండానే అన్ని అనుమతులు ఇచ్చేసింది. దీన్ని అడ్డం పెట్టుకున్న ఎకొరాన్ ఏకంగా 600 మెగావాట్ల ఫ్లెక్సీ పవర్ బిడ్డింగ్‌లో పాల్గొంది. ప్రభుత్వానికి సమర్పించిన ప్రతిపాదనల్లో తాను అంతర్జాతీయ సంస్థ ‘జీఈ’తో కలిసి జాయింట్ వెంచర్‌గా సమీకృత హైబ్రిడ్ ఇంధన ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. కానీ, బిడ్డింగ్‌లో మాత్రం జీఈతో ఒప్పందం చేసుకున్నట్టు రుజువుగా ఒక్క డాక్యుమెంట్ కూడా సమర్పించలేదని తెలిసింది. టెండర్లు లీకయ్యాయా? ఆన్లైన్ బిడ్డింగ్‌లో ఎవరెంత కోట్ చేశారన్నది టెండర్లు తెరిచినప్పుడే బయటపడుతుంది. ఫ్లెక్సీ పవర్ టెండర్ లీకైనట్లు సమాచారం. ఈ టెండర్ తమకే దక్కుతుందని ఎకొరాన్ చెప్పుకోవడం గమనార్హం. వాస్తవానికి ఫ్లెక్సీ పవర్‌ను అందించే సమర్థత గల ఇతర కంపెనీల కన్నా తామే తక్కువ కోట్ చేశామని ఎకొరాన్ ప్రతినిధులు అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడే టెండర్లు తెరిచి, తమను ఎల్–1గా ప్రకటించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి పెరగడంతో అధికారులు హడలిపోతున్నారు. త్వరలో ప్రభుత్వం మారితే తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే ఎకొరాన్ ఈ హడావిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఆమోదిస్తే తాము చిక్కుల్లో ఇరుక్కుంటామని అధికారులు ఆందోళన చెందుతున్నారు. సమన్వయ కమిటీ సమావేశం వాయిదా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే 600 మెగావాట్ల ఫ్లెక్సీ పవర్ టెండర్లను ఆమోదించేందుకు తక్షణమే విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాయిదా పడింది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ బుధవారం ప్రత్యేక కథనం ప్రచురించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) ఒత్తిడికి తలొగ్గితే ఇబ్బందుల్లో పడతామని గుర్తించారు. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో సమావేశాన్ని వాయిదా వేసేలా కథనం ప్రచురించిన ‘సాక్షి’కి విద్యుత్ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ‘మీ వార్తతో మమ్మల్ని కాపాడారు’ అని ఓ చీఫ్ ఇంజనీర్ వ్యాఖ్యానించారు. -
మింగిన మట్టికి టెండర్ల ముసుగు!
సాక్షి, అమరావతి: మట్టి మాఫియాగా అవతరించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేయగా అరకొరగా మిగిలిన దాన్ని విక్రయించి అక్రమాలను కప్పిపుచ్చేందుకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు టెండర్లు పిలిచారు. సీఎం కార్యాలయం(సీఎంవో) కీలక అధికారి సూచనల మేరకే ఈ టెండర్లు పిలిచినట్లు సమాచారం. పోలవరం కుడి కాలువలో మిగిలిన మట్టిని 261 రీచ్‌లుగా విభజిస్తూ ధరను రూ.312.88 కోట్లుగా నిర్ణయించి నెలన్నర క్రితం విక్రయానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో ఐదు రీచ్‌లలో మట్టిని రూ.5.76 కోట్లకు కొనుగోలు చేయడానికి కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేశారు. వాటిని ఆమోదించిన అధికారులు మిగిలిన రీచ్‌లకు టెండర్లను పిలిచేందుకు కసరత్తు చేస్తుండటం గమనార్హం. పోలవరం కుడి కాలువను 174 కి.మీ.లు, ఎడమ కాలువను 181.50 కి.మీ.ల పొడవున తవ్వే పనులను 2005లోనే ప్రారంభించారు. కాలువ తవ్వి మట్టిని ఇరువైపులా 30 అడుగుల ఎత్తులో గట్లుగా పోశారు. కాలువ పనులు పూర్తయ్యాక ఈ మట్టిని టెండర్ల ద్వారా విక్రయించాలి. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకూ పోలవరం కుడి, ఎడమ కాలువల్లో మట్టిని తరలించడానికి ఎవరూ సాహసించలేదు. కుడి, ఎడమల దోపిడీ రూ.3,370 కోట్లు... పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం కుడి కాలువ మట్టిని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణా జిల్లాలో మంత్రి దేవినేని ఉమా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దోచేశారు. క్యూబిక్ మీటర్ మట్టిని సగటున రూ.250 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదు. పోలవరం కుడి కాలువ తవ్వకంలో 11.82 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని కాలువ గట్లపై పోసినట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. టీడీపీ మట్టి మాఫియా దెబ్బకు ప్రస్తుతం 3.21 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి మాత్రమే మిగిలినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే 8.61 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని టీడీపీ మాఫియా దోచేసినట్లు స్పష్టమవుతోంది. క్యూబిక్ మీటర్ రూ.250 చొప్పున విక్రయం ద్వారా రూ.2,152.50 కోట్ల మేర దోచేసినట్లు అంచనా వేస్తున్నారు. పోలవరం ఎడమ కాలువ మట్టిని మంత్రి యనమల రామకృష్ణుడు, డిప్యూటీ సీఎం చినరాజప్ప అనుచరులు, మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దోచేశారు.ఎడమ కాలువలో 10.81 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా ఇప్పటివరకూ 9.96 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వారు. ఇందులో 4.87 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని మాఫియా మాయం చేసిందని అధికారవర్గాలే అంగీకరిస్తున్నాయి. ఈ మట్టిని క్యూబిక్ మీటర్ రూ.250 చొప్పున విక్రయించడం ద్వారా రూ.1,217.50 కోట్లకు పైగా దోచేసినట్లు స్పష్టమవుతోంది. కుడి, ఎడమ కాలువల్లో మట్టిని దోపిడీ చేయడం ద్వారా మట్టి మాఫియా రూ.3,370 కోట్లకు పైగా మింగేసినట్లు వెల్లడవుతోంది. విజిలెన్స్, నిఘా నివేదిక బుట్టదాఖలు.. పోలవరం కాలువల్లో మట్టిని కాజేసి అమ్ముకోవడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2017, 2018లో టీడీపీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మట్టి దందాను సర్కార్ దృష్టికి తెచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు పోలవరం ఎడమ కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని ఇంటెలిజెన్స్ విభాగం కూడా సర్కార్‌కు నివేదికలు ఇచ్చింది. వీటిపై చర్యలు తీసుకోకుండా సీఎం చంద్రబాబే మోకాలొడ్డినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. దోపిడీని దాచేందుకే టెండర్లు.. టీడీపీ నేతల మట్టి దందాపై ఉభయ గోదావరి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నట్లు గుర్తించడంతో దోపిడీని కప్పిపుచ్చడం కోసమే ఎన్నికల ముందు మట్టి విక్రయానికి టెండర్లు పిలవాలని సీఎంవోకు చెందిన కీలక అధికారి జలవనరులశాఖను ఆదేశించారు. పోలవరం కుడి కాలువ 2, 3, 4, 5, 6 7 ప్యాకేజీల్లో మిగిలిపోయిన మట్టిని 261 రీచ్‌లుగా విభజించి కనీస విలువను రూ.312.68 కోట్లుగా నిర్ణయిస్తూ నెలన్నర క్రితం టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఐదు రీచ్‌లకు మాత్రమే కాంట్రాక్టర్లు షెడ్యూలు దాఖలు చేయడంతో రూ.5.76 కోట్లకు విక్రయిస్తూ టెండర్లను ఆమోదించారు. మిగతా రీచ్‌లకు టెండర్లు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
మంత్రి కిడారితో రాజీనామా చేయించండి
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమ, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌తో రాజీనామా చేయించాలని గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడినట్టు తెలిసింది. శ్రావణ్‌కుమార్ ఇటు అసెంబ్లీకి గాని, అటు శాసన మండలికి గాని ఎన్నిక కాకుండానే మంత్రిపదవి చేపట్టారు. రాజ్యాంగం మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎవరైనా మంత్రిగా పదవి చేపట్టిన తరువాత ఏ చట్టసభకైనా (అసెంబ్లీ లేదా మండలి) సభ్యునిగా ఎన్నిక కావాల్సి ఉంది. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టి ఈనెల 10వ తేదీ నాటికి ఆరు నెలలు అవుతోంది. ఈ నేపథ్యంలో కిడారి శ్రావణ్‌కుమార్ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించాల్సిందిగా గవర్నర్ కార్యాలయ వర్గాలు సీఎంవోకు సూచించినట్టు సమాచారం. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. హడావుడి నిర్ణయంతో మంత్రి అయ్యారు నాలుగున్నరేళ్లు పాటు మంత్రివర్గంలో ముస్లింలు, గిరిజనులకు అవకాశం కల్పించని చంద్రబాబు ఎన్నికలకు ముందు కంటితుడుపు చర్యగా గత ఏడాది నవంబర్ 11వ తేదీన కిడారి శ్రావణ్‌కుమార్‌ను, ఫరూక్‌ను మంత్రివర్గంలో తీసుకున్నారు. ఆ తరువాత ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడంతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగిసేంత వరకు ఆయన మంత్రి పదవికి ఢోకా లేదు. కిడారికి మాత్రం టీడీపీ ఆ అవకాశం కల్పించలేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినప్పటికీ.. ఫలితాలు వెలువడలేదు. ఇదిలావుంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున అరకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కిడారి సర్వేశ్వరరావు ఆ తరువాత చంద్రబాబు ప్రలోభాలకు లోనై తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. గత ఏడాది సర్వేశ్వరరావును నక్సలైట్లు హతమార్చారు. విధిలేని పరిస్థితుల్లో ఆయన కుమారుడు కిడారి శ్రావణ్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అతనికి గిరిజన సంక్షేమం, ప్రాథమిక విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను చంద్రబాబు కేటాయించారు. ఇదిలావుంటే.. మంత్రి శ్రావణ్‌కుమార్ స్పందిస్తూ గవర్నర్ కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని, ముఖ్యమంత్రిని కలిసి ఆయన సూచన మేరకు నడుచుకుంటానని పేర్కొన్నారు. ఐతే, కిడారి గురువారం సీఎంకు రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నుట్లు తెలిసింది. ఆ తరువాత గవర్నర్ ఆమోదానికి సీఎం పంపాల్సి ఉంటుంది. మొత్తానికి ఏ చట్ట సభకు ఎన్నిక కాకుండానే ఆరు నెలలపాటు మంత్రి పదవి అనుభవించిన రికార్డు మాత్రం శ్రావణ్‌కుమార్‌కు దక్కుతుంది. -
టీడీపీ సేవలో సీఎంవో!