colours
-
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
HOLI 2024: జీవితం వర్ణమయం
మానవ జీవితం రంగుల మయం. ఆ మాటకొస్తే అసలీ ప్రపంచమే రంగులమయం. ఎందుకంటే మన జీవనవిధానమే రకరకాల రంగులతో మమేకమై ఉంది. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉంటే ప్రకృతిలో వేనవేల రంగులున్నాయి. ఈ ప్రకృతిలోని రంగులన్నీ జీవన తత్త్వాన్ని బోధిస్తాయి. ఆ రంగులతో చేసుకునే సంబరమే హోలీ. అందుకే హోలీని ఆలయాలలో కూడా ఒక వేడుకగా... ఉత్సవంగా నిర్వహిస్తారు. చిగురించే మోదుగులు. పూసే గురువిందలు. పరిమళించే మల్లెలు. మొగ్గలు తొడిగే మొల్లలు... రాలే పొగడ పుప్పొడి రేణువులు. చిందే గోగు తేనెలు. గుబాళించే గోరింట పూలు. ఎర్రని చివుళ్లతో మామిళ్లు... తెల్లని పూతాపుందెతో వేప చెట్లు... ఇందుకే కదా కవులు కీర్తించేది... వసంతాన్ని రుతువులకే రారాజని! మధుమాస వేళలో జరిగే వసంతోత్సవాన్ని భారతదేశమంతటా ఘనంగా జరుపుకుంటుంది. గతంలో రాజు, పేద, ధనిక, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఈ రంగునీళ్లను ఒకరిపై ఒకరు చల్లుకొని సంతోషించేవారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు. ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్గుణోత్సవమని... వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాం. హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ కథలు ఉన్నాయి. యోగనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన పూలబాణాలను ప్రయోగిస్తాడు. ఆ బాణాల తాకిడికి ధ్యాన భంగం అయిన శివుడు ఆగ్రహంతో తన మూడో కంటిని తెరచి మన్మథుడిని మసి చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి తనకు పతి భిక్ష పెట్టవలసిందిగా ప్రాధేయపడటంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మథుడు.. రతీదేవికి మాత్రమే శరీరంతో కనిపించేలా వరమిచ్చాడు. అలా మళ్లీ మన్మథుడు రతీదేవికి దక్కాడు. ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ ఓ కారణమైందని విశ్వసిస్తారు. అన్నింటికీ మించి హోలీ పండుగ పుట్టుకకు మరో కథను చెబుతారు. శ్రీకృష్ణుడు నల్లనివాడు, రాధ మేలిమి బంగారం. ఓరోజున వారిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని వనవిహారం చేస్తుండగా రాధ చేతిపక్కన ఉన్న తన చేయి నల్లగా ఉండటం చూసి దిగులు పడ్డాడట కృష్ణుడు. కన్నయ్య విచారానికి కారణం తెలుసుకున్న యశోదమ్మ ‘నాయనా! రాధమ్మ అసలు రంగు తెలియకుండా నువ్వు ఆమె ఒంటినిండా రంగులు కలిపిన నీళ్లు పోయి’ అని సలహా ఇచ్చిందట. అమ్మ మాట మేరకు నల్లనయ్య రాధమీద రంగునీళ్లు పోశాడట. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన రాధ తను కూడా కృష్ణుని మీద రంగులు కలిపిన నీరు చిలకరిస్తూ కృష్ణునికి అందకుండా ఉద్యానవనం నుంచి బయటకు పరుగులు తీసిందట. రాధాకృష్ణులిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు రంగునీళ్లు పోసుకోవడం చూసిన పురజనులు... ఆనందోత్సాహాలతో రంగుల పండుగ చేసుకున్నారట. ఆనాడు ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ. నాటినుంచి ప్రతి ఫాల్గుణ పున్నమినాడు ప్రజలందరూ ఒకరినొకరు రంగులతో ముంచెత్తుకోవడం, పెద్దఎత్తున పండుగలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. పైన చెప్పుకున్న కథల నుంచి మనం గ్రహిం^è వలసినది ఏమిటంటే... మనందరమూ మనుషులమే కాబట్టి ఏదో ఒక లోపం ఉండితీరుతుంది. అలాంటి లోపాలను తీసుకు వచ్చే దుర్గుణాలను దూరం చేసుకోవడం అవసరం. అన్ని రంగులు ఉంటేనే.. ప్రకృతికి అందం. అందరిని కలుపుకుంటేనే మనసుకి అందం. అన్ని ఆలోచనలను పరిగణించి, చక్కని దారిన కలిసి నడిస్తేనే మనిషికి అందం. హోళీ రోజున ఒకరిపై ఒకరు చల్లుకునేవి రంగులు కావు. అనురాగ ఆప్యాయతలు కలసిన పన్నీటి పరిమళ జల్లులు. హోలీ పండుగను వసంత రుతువు వస్తోందనడానికి సంకేతంగా భావిస్తారు. వసంతకాలం అంటే చెట్లు చిగిర్చి పూలు పూసే కాలం కదా! అంటే మనలో ఉన్న దుర్గుణాలనే ఎండుటాకులను రాల్చేసి, వాటి స్థానంలో ఉల్లాసం, ఉత్సాహం, ప్రేమ, అనే సుగుణాలతో కూడిన ఆకులను చిగురింప చేసుకోవాలి. మన్మథుడు అంటే మనస్సును మథించేవాడని అర్థం. మనిషిలో దాగి ఉన్న కామక్రోధలోభమోహమదమాత్సర్యాలనే ఆరు అంతః శత్రువులు మనస్సును మథిస్తాయి. వాటినే అరిషడ్వర్గాలు అంటారు. మనిషిని పతనం చేసే ఈ ఆరుగుణాలనూ అదుపులో ఉంచుకోవాలని చెప్పేందుకే పరమేశ్వరుడు కామదేవుడిని భస్మం చేశాడు. రూపం కోల్పోయిన మన్మథుడు ఆనాటి నుంచి మనుషుల మనస్సులలో దాగి ఉండి అసలు పని నుంచి దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకునేందుకే, ఈశ్వరుడు కాముణ్ణి భస్మం చేసిన రోజైన ఫాల్గుణ శుద్ధపూర్ణిమకు ముందురోజు, గ్రామాలలో కామదేవుని ప్రతిమను తయారుచేసి, ఊరేగింపుగా తీసుకెళతారు. యువకులంతా కలిసి కామదహనం చేస్తారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. మన జీవితాలలో అనేక విధాలైన అలకలు, కినుకలు, అసంతృప్తులు, కోపాలు, తాపాలు, ఆవేశకావేశాలు, అలజడులు, అపశ్రుతులు, తడబాట్లు, ఎడబాట్లు ఉండొచ్చు. అందువల్ల ఈ హోళీ రోజు మనకు దగ్గరగా ఉన్న వారితోనే మాట, ఆట కాకుండా.... మనసుకు దగ్గర అయిన బంధు మిత్రులతో, మనవల్లో, వారి వల్లో ఏర్పడిన మానసిక దూరాన్ని తగ్గించుకుని, మనమే ముందుగా ఒక అడుగు వేసి అందరినీ దగ్గర చేసుకుని జీవితాలను వర్ణమయం... రాగ రంజితం చేసుకుందాం. హోలీ పర్వదినాన్ని అందరూ ఆప్యాయతతో కలిసే రంగుల రోజుగా మార్చుకుందాం. – డి.వి.ఆర్. భాస్కర్ -
కృత్రిమ రంగులపై కొరడా: భారీ జరిమానా, జైలు
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అనేక ఆనారోగ్య సమస్యల కారణంగా కాటన్ క్యాండీలు, గోబీ మంచూరియన్లో వాడే ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై నిషేధం విధించింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు ఉత్తర్వులు జారీ చేశారు. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ శాంపిల్స్‌లో హానికరమైన రసాయనాలను వాడినట్లు గుర్తించడంతో ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ విక్రయాలను పూర్తిగా నిషేధించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దీంతో ఫుడ్ కలరింగ్ ఏజెంట్లపై కొరడా ఝళిపించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా కర్ణాటక చేరింది. రోడమైన్-బి , కార్మోయిసిన్ వంటి కలరింగ్ ఏజెంట్ల వాడకం హానికరమైందని తెలిపింది. కృత్రిమ రంగులను ఉపయోగించి తయారు చేసే ఆహార పదార్థాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు మంత్రి దినేష్ గుండూరావు ప్రకటించారు. హానికరమైన కలర్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తేలితే, ఆహార భద్రతా చట్టం కింద వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని ఆయన హెచ్చరించారు. నేరం రుజువైతే కనీసం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించేలా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 171 నమూనాలలో 107 టార్ట్రాజైన్, సన్‌సెట్ ఎల్లో, రోడమైన్-బీ, కార్మోయిసిన్ లాంటి హానికర రసాయనాలను ఉపయోగించి తయారు చేసినట్లు అధికారులు గర్తించారు. 64 సురక్షితంగా ఉన్నట్టు తేలింది. అలాగే 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించగా, వాటిలో 10 సురక్షితమైనవిగానూ, 15 హానికరమైనవిగా తేలాయి. -
ఐఫోన్ 15 కీలక అప్డేట్: ఆ రంగులకు సెలవు!
ఎంతగానో ఎదురు చూస్తున్న యాపిల్ ( Apple ) ఐఫోన్ 15 ( iPhone 15) సిరీస్‌కు సంబంధించిన కీలక అప్డేట్ గురించి తెలిసింది. ఐఫోన్ 15 లాంచ్ డేట్‌పై యాపిల్ పెదవి విప్పలేదు. కానీ సెప్టెంబర్ 12 లేదా 13 తేదీల్లో ఐఫోన్ 15 విడుదలవుతుందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఐఫోన్ 15 రంగులకు సంబంధించి తాజా రూమర్ ఒకటి విస్తృతంగా ప్రచారమవుతోంది. ఐఫోన్ల, ఇతర యాపిల్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించే 9to5Mac అనే వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కోసం యాపిల్ కంపెనీ రెండు కొత్త కలర్ ఆప్షన్లను పరిచయం చేయాలని యోచిస్తోంది. గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను నిలిపివేసి కొత్తగా గ్రే, బ్లూ కలర్స్‌ను తీసుకురానుంది. గోల్డ్, పర్పుల్ కలర్స్ అవుట్! ఐఫోన్లలో ముందు నుంచి వస్తున్న గోల్డ్, పర్పుల్ కలర్ ఆప్షన్లను ఐఫోన్ 15 ప్రో మోడల్‌తో నిలిపేస్తున్నట్లు చెబుతున్నారు. 2018లో ఐఫోన్ ఎక్స్ఎస్ మోడల్ నుంచి గోల్డ్ కలర్ ఆప్షన్‌ను యాపిల్ కొనసాగిస్తోంది. నిజానికి ఐఫోన్ 6 మోడల్ నుంచే గోల్డ్ కలర్ ఏదో ఒక రూపంలో ఉంటూ వస్తోంది. ఇక పర్పుల్ కలర్ వేరియంట్ ఐఫోన్ 14 ప్రో మోడల్స్‌తో పరిచయమైంది. These could be the new iPhone 15 Pro color options:- Space Gray- Silver- Titan Gray- Dark BlueWhich color would you pick?Source: @9to5mac pic.twitter.com/ePSwkkk9m4— Apple Hub (@theapplehub) August 24, 2023 సెప్టెంబరులో విడుదల కానున్న ఐఫోన్ 15 ప్రో ( iPhone 15 Pro ) కొత్త ఏ17 బయోనిక్ చిప్, 48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సిస్టమ్, పిల్-ఆకారపు కటౌట్‌తో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కలిగి ఉంటుందని పుకారు ఉంది. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌తో మొదటిసారిగా కలర్-కోఆర్డినేటెడ్ ఛార్జింగ్ కేబుల్లను పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. Apple is expected to launch the iPhone 15 Pro and iPhone 15 Pro Max next month! Here are some of the major changes:Design updatesThe new Pro models will feature some design changes, including a new Titanium body (replacing Stainless Steel) and the thinnest bezels on a… pic.twitter.com/dg8kDLNJdw— Apple Hub (@theapplehub) August 23, 2023 -
మహీంద్రా థార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్: కొత్త ఆప్షన్స్‌తో పండగే!
సాక్షి,ముంబై: మహీంద్రాకు చెందిన పాపులర్ కారు థార్ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనే కస్టమర్లకు తీపి కబురు. పాపులర్ థార్ ఇపుడు కొత్త రంగుల్లో వినియోగ దారులకు అలరించనుంది. ఇప్పటి వరకు థార్ (4X2 RWD)వెర్షన్లకు మాత్రమే పరిమితమైన ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్ ఆప్షన్స్ ఇపుడిక 4x4 వేరియంట్లలో కూడా లభించనున్నాయి. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 2.0 లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ ఇలా రెండు ఇంజన్ ఆప్షన్స్‌లో లభిస్తున్న మహీంద్రా థార్‌కు (4X2 ) డిమాండ్ భారీగానే ఉంది. అయితే థార్ 4x4 వేరియంట్లో కొత్త కలర్ ఆప్షన్స్ లభిస్తాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తం 6 రంగుల్లో (ఎవరెస్ట్ వైట్, బ్లేజింగ్ బ్రాంజ్, ఆక్వా మెరైన్, రెడ్ రేజ్, నాపోలి బ్లాక్ , గెలాక్సీ గ్రే) మహీంద్రా థార్ లభించనుంది. సుదీర్ఘ వెయిటింగ్ పీరియడ్‌తో దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్‌స్టైల్ ఎస్యేవీలలో ఒకటి థార్. మరోవైపు మహీంద్రా కొత్త 5-డోర్ల థార్‌ను రాబోయే నెలల్లో దేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 117 బిహెచ్పి ,300 ఎన్ఎమ్లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.అలాగే 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జోడించగా, ఇది 150 బీహెచ్పీని, 320 Nm టార్క్‌ను అందిస్తుంది. ఎంట్రీ-లెవల్ ధరతో మహీంద్రా థార్ ధర రూ. 9.99 లక్షలతో ప్రారంభం (ఎక్స్-షోరూమ్, ఇండియా). -
Happy Holi 2023: రంగుల పండుగ హోలీ విశిష్టత ఇదే.. ఎప్పుడు జరుపుకోవాలంటే..?
మంగళవారం(07-03-2023)రంగుల కేళి హోలీ సంబురాలు జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. నేటి ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ప్రజలు హోలీని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిలయమైన భారత్‌లో ప్రతి ఏటా అనేక పండుగలను జరుపుకొంటారు. అయితే రంగుల పండుగ హోలీకి వీటిలో ప్రత్యేక స్థానం ఉంటుంది. అందర్నీ కలిపే పండుగగా చెప్పుకునే హోలీని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటారు. ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. అయితే ఈ హోలీ పండుగ విశిష్టత ఏంటి? ఎన్నిరోజులు జరుపుకొంటారు? హోలికా దహనం ఎందుకు చేస్తారు? ఈ ఏడాది ఏ మూహుర్తంలో పూజలు చేసుకోవాలి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, రాధా కృష్ణల ప్రేమకు గుర్తుగా హోలీ జరుపుకొంటారు. ఈ పండుగను రెండు రోజులు చేసుకుంటారు. మొదటి రోజు చోటీ హోలి. అంటే హోలికా దహనం. రెండో రోజు రంగుల హోలి. అంటే ఒకరిపైఒకరు రంగులు జల్లుకొని పండుగ చేసుకోవడం. ఈ ఏడాది చోటి హోలి (హోలికా దహన్) మార్చి 7న, బడీ హోలి(రంగుల హోలి)మార్చి 8న జరపుకోవాలని ప్రముఖ పంచాంగం వెబ్సైట్ డ్రిక్ పంచాగ్ తెలిపింది. హోలికా దహనం ఏ సమయంలో.. హోలికా దహనాన్ని మార్చి 7న(మంగళవారం) సాయంత్రం 6:24 గంటల నుంచి రాత్రి 8:51 గంటల మధ్యే జరుపుకోవాలి. అయితే పౌర్ణమి తిథి మార్చి 6(సోమవారం) సాయంత్రం 4:17కు ప్రారంభమై, మార్చి 7( మంగళవారం) సాయంత్రం 6:09 గంటలకు ముగుస్తుంది. హోలికా దహనం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించి భోగి మంటలు వెలిగిస్తారు. తెలుగురాష్ట్రాల ప్రజలు ఈ పూజను సాయంత్రం 6:24 నుంచి రాత్రి 08:49 మధ్య జరుపుకోవాలని పండితులు చెప్పారు. ఎందుకీ పండుగ? హిందూ పురాణాల ప్రకారం హోలికా దహనం ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు చూద్దాం. రాక్షసుల రాజైన హిరణ్యకశ్యపుడు.. తన సొంత కుమారుడు ప్రహ్లాదుడుని చంపేందుకు శత విధాలా ప్రయత్నిస్తాడు. ఎందుకుంటే అతడు విష్ణువును ఆరాధించడం హిరణ్యకశ్యపుడికి అసలు నచ్చదు. దీంతో ఎన్నోసార్లు ప్రాహ్లాదుడ్ని చంపే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. విష్ణువు అతడ్ని కాపాడుతుంటాడు. అయితే ప్రహ్లాదుడ్ని చంపేందుకు హిరణ్యకశ్యపుడి సోదరి హోలికా సాయం చేయాలనుకుంటుంది. ఇద్దరూ కలిసి పథకం పన్నుతారు. దీని ప్రకారం హోలికా మంటల్లో కూర్చుంటే.. ప్రహ్లాదుడ్ని ఆమె ఒడిలో కూర్చోమని హిరణ్యకశ్యపుడు ఆదేశిస్తాడు. తండ్రిమాట ప్రకారం ప్రహ్లాదుడు వెళ్లి మంటల్లోనే హోలికా ఒడిలో కూర్చుంటాడు. కాపాడమని విష్ణువును ప్రార్థిస్తాడు. దీంతో విష్ణువే ప్రహ్లాదుడ్ని మంటల్లో కాలిపోకుండా చేస్తాడు. హోలికా మాత్రం అదే మంటల్లో కాలిబూడిదవుతుంది. దీంతో చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు హోలికా దహనం చేసి, ఆ మరునాడు హోలి పండుగను ఘనంగా జరుపుకొంటారు. అలాగే ఈ పండుగను శ్రీకృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు. కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని నల్లని శరీర రంగు , రాధ శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుటుందని, అందుకే ఈ రోజును రంగుల పండుగగా జరుపుకుంటారని ప్రజలు విశ్వసిస్తారు. -
చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..
భారతీయ మార్కెట్లో చైనీస్ ఉత్పత్తులకు గిరాకీ మామూలుగా ఉండదు, అయితే ఈ సారి హోలీ సందర్భంగా కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆత్మనిర్భర్ భారత్ చొరవతో చాలామంది చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సుముఖత చూపించడం లేదు. నివేదికల ప్రకారం, ఢిల్లీలో ఇప్పటికే చాలామంది వ్యాపారులు కేవలం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా సదర్ బజార్ విక్రేత జావేద్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది కొనుగోలుదారులు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలిపాడు. తమ పిల్లలకు రంగులను కొనుగోలు చేయడానికి చేయడానికి వచ్చిన కస్టమర్లతో ఒకరు మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ ఉత్పత్తుల నాణ్యత బాగుండటంతో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. మార్కెట్లో అమ్మకానికి ఉన్న చాలా ఉత్పత్తులు మన దేశంలో తయారు చేయబడినవి కావడం సంతోషించదగ్గ విషయం అన్నారు. కొనుగోలుదారుల నుంచి చైనా ఉత్పత్తుల మీద పెరుగుతున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తున్నామని, లోపాలు ఉన్న వాటిని తిరిగి ఇవ్వకపోవడం కూడా చైనా ఉత్పత్తులు అమ్మకపోవడానికి కారణమని కొంతమంది వ్యాపారాలు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ హోలీ పండుగ వేళ భారతీయ ఉత్పత్తులకు డిమాండ్ పెరగటం మంచి విషయమనే చెప్పాలి. -
స‘లక్ష’ణంగా త్రివర్ణ శోభితం!
ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులు అద్ది ఔరా అనిపిస్తున్నాడు. పొడవైన బాసుమతి రకం బియ్యాన్ని ఎంచుకుని వాటికి రంగులు దిద్ది.. వాటిని చార్టులపై అంటించాడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్రశ్రీహరి(రామం). గతంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నెలా 15 రోజుల్లో 3 లక్షల బియ్యం గింజలపై జాతీయ జెండా రంగులను అద్ది రికార్డు సృష్టించాడు. తాజాగా సుమారు రెండు నెలల్లో 5 లక్షల బియ్యం గింజలపై రంగులు అద్దడం ద్వారా తన రికార్డును తానే బ్రేక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇప్పటికే ఈ అంశం పలు రికార్డు సంస్థల దృష్టికి వెళ్లినట్టు తెలిపాడు. -
ఫ్యాక్ట్ చెక్ : ఏ రంగు కనిపించినా YSRCP రంగేనంటూ ఎల్లో బ్యాచ్ విష ప్రచారాలు
-
ఆనంద్ మహీంద్ర అద్భుతమైన పోస్ట్: నెటిజన్లు ఫిదా
సాక్షి,ముంబై: పారిశశ్రామిక వేత్త, బిలియనీర్ ఆనంద్ మహీంద్ర మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ విజ్ఞాన, వినోద అంశాలను అభిమానులతో పంచుకోవడం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన ఫోటోను పంచుకున్నారు. వజ్రోత్సవాల వేళ మువ్వన్నెల జాతీయ జెండా రంగులతో ప్రకృతిలో సహజంగా పరుచుకున్న రమణీయమైన దృశ్యాన్ని షేర్ చేశారు. అంతేకాదు శత సంవత్సరాల దాకా ప్రతీ రోజూ ఈ రంగులు, ఈ దృశ్యం ఆవిష్కృతం కావాలని ఆయన అభిలషించారు. పైన వెలుగులు చిమ్ముతున్న సూరీడు, మధ్యలో నిర్మల ఆకాశం.. దిగువన పచ్చటి పంటచేలతో అలుముకున్న ఆకుపచ్చని రంగుతో చూడ ముచ్చటగా ఉన్న ఈ పిక్‌ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా 75 వసంతాల స్వాత్రంత్ర్య దినోత్సవ సంబరాల్లో ఈ ఫోటో మరింత ఆకర్షణీయంగా నిలిచింది. (Reliance Jio 5G Phone: జియో మరో సంచలనం?12 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్) ఇదీ చదవండి :వన్‌ప్లస్ 10టీ 5జీ వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ May all days dawn with these colours from now on. Onwards to the 100th anniversary of our Independence… 🇮🇳 pic.twitter.com/6H75bunovc — anand mahindra (@anandmahindra) August 16, 2022 -
ఎమ్మెల్యే భూమన నివాసంలో జాతీయ జెండా రంగుల వెలుగులు (ఫొటోలు)
-
డిఫరెంట్‌గా కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు.. టీఎస్ఆర్టీసీ చేసేదేంటి...?
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు ఆకర్షణీ యంగా రూపుదిద్దుకుంటోంది. కొత్త హంగులు, రంగులతో ప్రయాణికుల ముందుకు రానుంది. ఆర్టీసీ బస్సు ఏళ్లుగా ఒకే రకంగా ఉంటోంది. కర్ణాటక, మహారాష్ట్ర ఆర్టీసీ బస్సులు తెలంగాణ బస్సుల కంటే భిన్నం గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కూడా మార్పులు, చేర్పులు చేయాలని సంస్థ నిర్ణయించింది. ఎలా ఉండాలో చెప్పండి: ఎండీ గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు బస్సుల రంగులు, ఇత రాల్లో మార్పులు చేసేవారు. కానీ, ఇప్పుడు డిపోస్థాయి నుంచి సిబ్బంది ఎవరైనా సరే ఈ విషయంలో సలహాలు ఇవ్వాలని ఎండీ ఆహ్వానించారు. ఈ మేరకు డిపోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. బస్సుల ఆకృతి, సీట్లు ఎలా ఉండాలి, ఫుట్ రెస్టు ఏర్పాటులో మార్పు అవసరమా, డోర్లు ముందుండాలా, వెనక ఉండాలా, మధ్యలో ఉండాలా, ఏసీ వ్యవస్థలో మార్పులు కావాలా, రంగుల్లో ఎలాంటి మార్పులుండాలి, ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు, వారి నుంచి తరచూ వస్తున్న ఫిర్యాదులేంటి? ఏయే మార్పులు చేయాలి? ఇలా చాలా అంశాల్లో సలహాలను అడిగారు. సిబ్బంది సూచనల ఆధారంగా మార్పుచేర్పులు చేయబోతున్నారు. దాదాపు 550 కొత్త బస్సులను త్వరలో కొనబో తున్నారు. సాధారణంగా ఆర్టీసీ ఛాసీస్‌లను మాత్రమే కొంటుంది. వాటి బస్‌బాడీ మియాపూర్ బస్‌బాడీ యూనిట్లో రూపొం దించుకుంటుంది. ఏసీ బస్సులు మాత్రం బాడీతోసహా అన్నీ కంపెనీ నుంచే వస్తాయి. ఇప్పుడు సిబ్బంది ఇచ్చే సూచనల ఆధా రంగా ఈ కొత్త బస్సుల కొనుగోలు నుంచే మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు గూగుల్ మీట్ ద్వారా మంగళవారం ఉన్నతాధికారులు డిపో మేనేజర్లతో మాట్లాడి వివరాలు సేకరించారు. -
ఓలా న్యూ స్టైల్... స్కూటర్ డెలివరీలో కొత్త పంథా
హైదరాబాద్: మార్కెట్లోకి రావడానికి ముందే రిజిస్ట్రేషన్లలో ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుంది. బైకు డిజైన్, డెలివరీలో కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతోంది. ఎస్ 1 సిరీస్ ఇప్పటికే ఎలక్ట్రిక్ ఓలా స్కూటర్ కావాలంటూ లక్ష మందికి పైగా బుకింగ్‌లో తమ పేరు నమోదు చేసుకున్నారు. అయితే స్కూటర్ ఎలా ఉంటుంది. మోడల్ ఏంటీ అన్న వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే ప్రభుత్వ రికార్డుల్లో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1 ప్రో పేరుతో రెండు స్కూటర్ల పేర్లు నమోదయ్యాయి. దీని ప్రకారం ఓలా స్కూటర్లు ఎస్ 1 సిరీస్‌లో మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. పది రంగుల్లో ఇప్పటి వరకు మూడు నాలుగు రంగుల్లోనే వాహనాలు మార్కెట్లో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. కానీ గతానికి భిన్నంగా ఒకే సారి పది రంగుల్లో హల్చల్ చేసేందుకు ఓలా సిద్ధమైంది. లేత నుంచి ముదురు వరకు మొత్తం పది రంగుల్లోఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నారు. మేల్, ఫిమేల్ కస్టమర్ల టేస్ట్‌కి తగ్గట్టుగా ఈ కలర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. హోం డెలివరీ ఇప్పటి వరకు ఆటోమోబైల్ మార్కెట్లో వాహనాలు కొనాలంటే మొదటి మొట్టుగా షోరూమ్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ఓలా షోరూమ్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. స్కూటర్ని బుక్ చేసుకున్న కస్టమర్లకు నేరుగా ఇంటికే హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. -
ప్రేమికుల రోజు; ఈ రంగు ‘విఫల ప్రేమ’కు సింబల్!
వాలెంటైన్ డే ను అర్ధవంతంగా, ఆనందంగా జరుపుకోవాలనే వారు ఈ రోజుకోసం ఎదురుచూస్తూనే ఉంటారు. ఆ రోజున నచ్చిన వారికి గులాబీలను, కానుకలు ఇచ్చి తమ ప్రేమను పంచుకుంటారు. ప్రత్యేకమైన ఈ రోజున ఏ కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వెళితే ఏంటో అనే ఆలోచన ఉండేవాళ్లూ సహజం. సహజంగానే రెడ్ కలర్ ప్రేమకు, పసుపు స్నేహానికి.. అని బేరీజులు వేసుకునేవారూ ఉంటారు. కలర్ డ్రెస్సింగ్ విషయంలో గ్లోబల్ వైజ్‌గా ఉన్న కలర్‌ఫుల్ ముచ్చట్లివి.. నీలం: ఈ రంగు డ్రెస్‌ను వాలెంటైన్ డే రోజున ధరిస్తే ‘ఎవ్వరితోనూ ప్రేమలో లేను’ అనే అర్ధమట. ఎరుపు: ఎలాంటి సందేహం లేకుండా ప్రేమకు చిహ్నంగా ఈ రంగును వాడుతూనే ఉంటారు. ఎరుపు రంగు డ్రెస్ ధరిస్తే ‘ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు’ అని గుర్తు అట. పచ్చ: ‘ఆశ’ను చిగురంపజేసే సుగుణం ఆకుపచ్చ రంగుకు ఇచ్చేశారు. సో.. ఎదురుచూడండి అని చెప్పకనే చెబుతున్న విషయమట. ఆరెంజ్ ప్రేమికుల రోజున నచ్చినవారికి ‘ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు’ అన్నమాటట. నలుపు: హాట్ కలర్‌గా పేరున్న రంగు నలుపు. ఈ డ్రెస్‌లో ఎవరినైనా ఇట్టే కట్టిపడేయచ్చు. కానీ, ప్రేమికుల రోజున దీనిని ధరిస్తే మాత్రం ‘విఫల ప్రేమ’కు అర్ధమట. తెలుపు: ఈ రంగు ప్రేమికుల రోజున ఎదుటివారికి మనల్ని ఎలా పరిచయం చేస్తుందంటే.. మీకు ‘వేరొకరితో ‘పెళ్లికి నిర్ణయమైపోయింద’ని అర్ధమట. పసుపు: ఎలాగూ ఈ రంగు గురించి తెలిసిందే సింపుల్‌గా ‘ఫ్రెండ్షిప్’ అని చెప్పకనే చెప్పడం అన్నమాట. ఈ రోజున కేవలం స్నేహానికే నా ప్రాముఖ్యత అని పసుపు రంగు డ్రెస్ ద్వారా తెలియజేయడం. బూడిద: ‘నా కెవ్వరిమీదా ఇంట్రస్ట్ లేదు’ అనే వైఖరిని ప్రదర్శించడం అనే అర్థం గ్రే కలర్ ఇస్తుందట. పింక్: గులాబీ రంగును ప్రేమికుల రోజున ధరించారు అంటే మీరు ‘ప్రపోజల్స్‌కి సిద్ధం’గా ఉన్నారని అర్ధం వస్తుందట. అందుకని, పింక్ డ్రెస్ ధరించేవారు కొంచెం ఆలోచించుకోవాలట. పర్పుల్: వంగపండు రంగు అంటారు దీన్నే. ‘మొదటి చూపులోనే ఎవరితోనో ప్రేమలో పడ్డారు’ అని తెలిసిపోతుందట. పీచ్: ‘నాకు ఫ్రెండ్స్, పార్టనర్ లేరు’ అనే భావం వస్తుందట. ఎదుటి వారు కొంత జాలి కూడా చూపుతారట. అందుకని, పీచ్ కలర్ డ్రెస్ ధరించేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడం మంచిదట. చదవండి: సింగర్ సునీతకు ‘వాలెంటైన్’ డే సర్ప్రైజ్ కిస్ చేస్తే ఇది ‘మిస్’ కారు.. -
భావోద్వేగం: అద్దాలు పెట్టుకోగానే అవాక్కయ్యాడు..
లండన్: మొదటిసారిగా తన చూట్టు ఉన్న రంగుల ప్రపంచాన్ని చూసి ఓ వ్యక్తి అవాక్కయ్యాడు. అదేంటి మొదటి సారి రంగులు చూడటమేంటని షాకవుతున్నారా. అసలు విషయం ఏంటంటే.. యూకేకు చెందిన మోకిన్లీ మాక్(22) పుట్టుకతోనే కలర్ బ్లైండ్. ఈ నేపథ్యంలో మాక్ ఫ్రెండ్స్ అతడికి కలర్ బ్లైండ్ గ్లాసెస్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో మాక్ ఆ కళ్లద్దాలను పెట్టుకుని చూశాడు. దీంతో తన ఎదురుగా రంగురంగుల కార్లు, పచ్చని చెట్లు, రంగుల ఇళ్లను చూసి అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన చూట్టు ఇంతటి అందమైన రంగుల ప్రపంచం ఉంటుందా అని తెలుసుకున్న మాక్ పట్టనంత ఆనందంతో ఉక్కిరిబిక్కయ్యాడు. ఇదంతా అతడి స్నేహితులు తమ సెల్ఫోన్లలో బందించారు. (చదవండి: 100 రోజులు ఒకే డ్రెస్ వేసుకుంది.. కారణం) అనంతరం ఈ వీడియోను మాక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం పంచుకున్నాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 2 మిలియన్లకు పైగా వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. మాక్ పట్టనంత సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ దృశ్యాన్ని చూసి నెటిజన్లు భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘ఇది చూసి నాగుండె బరువెక్కింది’, ‘ప్రపంచాన్ని విభిన్న కోణాల్లో చూసే వారికి మీరు ఆదర్శంగా నిలిచారు.. నిజంగా మీ ఆనందానికి అవదులు లేవు’, ‘అసలైన రంగుల ప్రపంచాన్ని చూస్తునందుకు సంతోషం. మీకు నిజంగా అద్భుతమైన స్నేహితులు ఉన్నారు. వారి ఎప్పుడు అలాగే ఉంచుకోండి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: స్టార్ హీరోయిన్ క్యూట్ ఫొటో, కామెంట్ల వెల్లువ) View this post on Instagram A post shared by Mac (@maciavelli_) -
హైదరాబాద్ లో హోలీ సంబరాలు
-
టెక్నో పెయింట్స్ మరింత కలర్‌ఫుల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెయింట్స్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ టెక్నో పెయింట్స్ 1,800 రకాల కొత్త రంగులను పరిచయం చేసింది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ పెయింట్లు కూడా ఉన్నాయి. దిగ్గజ కంపెనీలకు ధీటుగా కలర్ స్పెక్ట్రాను రూపొందించింది. దీని ద్వారా నచ్చిన రంగులు ఎంచుకోవడానికి కస్టమర్లకు మరింత సులువు అవుతుందని టెక్నో పెయింట్స్ ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. డైరెక్టర్లు సీవీఎల్ఎన్ మూర్తి, సత్యనారాయణ రెడ్డి, సీఈవో కె.అనిల్‌తో కలిసి శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది డీలర్ నెట్వర్క్ ద్వారా రిటైల్ విభాగంలోకి ప్రవేశిస్తామన్నారు. ఇప్పటికే 30 కోట్ల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ప్రాజెక్టులకు రంగులు అందించామని పేర్కొన్నారు. రూ.250 కోట్ల ఆర్డర్ బుక్ ఉందని వెల్లడించారు. రెండింతలకు సామర్థ్యం..: ప్రస్తుతం టెక్నో పెయింట్స్‌కు అయిదు ప్లాంట్లున్నాయి. వీటన్నిటి వార్షిక సామర్థ్యం 42,000 మెట్రిక్ టన్నులు. ఆరవ ప్లాంటును హైదరాబాద్ సమీపంలోని సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో నెలకొల్పుతున్నారు. 3 ఎకరాల విస్తీర్ణంలో రానున్న ఈ ప్లాంటు కోసం రూ.25 కోట్ల పెట్టుబడి చేస్తున్నట్టు శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘ఏడాదిలో సిద్ధం కానున్న కొత్త ప్లాంటుతో సామర్థ్యం రెండింతలకు చేరుతుంది. నూతనంగా 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. 2018–19లో రూ.62 కోట్ల టర్నోవర్ సాధించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.90 కోట్లు ఆశిస్తున్నాం. రెండేళ్లలో రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యం. ఆఫ్రికాలో సంయుక్త భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉన్నాం. దక్షిణాదితోపాటు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సేవలు అందిస్తున్నాం. త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తాం’ అని వివరించారు. -
కలర్స్ హెల్త్ కేర్ సంస్థల్లో ఐటీ దాడులు
చిత్తూరు ,తిరుపతి రూరల్: హైదరాబాద్‌లోని కలర్స్ హెల్త్ కేర్ సంస్థకు చెందిన దేశవ్యాప్తంగా ఉన్న బ్రాంచ్‌ల్లో ఆదాయపు పన్ను శాఖాధికారులు బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. తిరుపతిలోని రెండు బ్రాంచ్‌లతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 49 బ్రాంచ్‌ల్లో ఈ దాడులు రాత్రి వరకు కొనసాగాయి. తిరుపతి కేటీరోడ్డు, ఎంఆర్‌పల్లి సర్కిల్లోని బ్రాంచ్‌ల్లో హైదరాబాద్, చెన్నై నుంచి వచ్చిన రెండు బృందాలు సోదాలు చేశాయి. పలు కీలక పత్రాలు, రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. బరువు తగ్గించడం, బ్యూటీషియన్ వంటి రంగాల్లో కలర్స్ హెల్త్ కేర్ సంస్థ వ్యాపారాలు చేస్తోంది. కాగా ఆ సంస్థ ఆదాయపు పన్ను శాఖకు పన్నులు సక్రమంగా చెల్లించడం లేదని గుర్తించారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా బుధవారం దాడులు చేశారు. తిరుపతిలోని రెండు బ్రాంచ్‌ల్లో కూడా దాడులు జరిగాయి. దాడులకు సంబంధించి ఐటీ అధికారులు కానీ, కలర్స్ సంస్థ ప్రతినిధులు కానీ వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు. ఐటీ అధికారులు ఈ దాడుల విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తిరుపతిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా నిలిచింది. -
స్మైలీ మిల్కీ బ్యూటీ
-
ఇంధనానికి తగ్గ రంగు స్టిక్కర్లు
న్యూఢిల్లీ: దేశరాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)లో నడిచే వాహనాలకు అధికారులు ఇకపై ఇంధనాన్ని బట్టి స్టిక్కర్లు ఏర్పాటు చేయనున్నారు. హోలోగ్రామ్ స్టిక్కర్ రంగును బట్టి ఆ వాహనం పెట్రోల్, సీఎన్జీ, డీజిల్, విద్యుత్‌లలో దేంతో నడుస్తోందో కనిపెట్టేయవచ్చు. కేంద్ర రోడ్డు రవాణా జాతీయరహదారుల మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనను సుప్రీంకోర్టు ఆమోదించింది. ఎన్సీఆర్లో శీతాకాలంలో కాలుష్యం బెడదను తగ్గించేందుకు తీసుకునే చర్యలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. తాజా ప్రతిపాదనల ప్రకారం పెట్రోల్, సీఎన్జీ వాహనాలకు లేత నీలిరంగు, డీజిల్‌తో నడిచే వాహనాలకు ఆరెంజ్ కలర్ హోలోగ్రామ్ స్టిక్కర్లుంటాయి. దీంతోపాటు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు గ్రీన్ నంబర్ ప్లేట్లను లేదా గ్రీన్ హోలోగ్రామ్ స్టిక్కర్లను వాడేలా చూడాలని సూచించింది. -
బోనం.. పర్యావరణహితం
సాక్షి, సిటీబ్యూరో: గోల్కొండ జగదాంబిక బోనాలను ఈసారి పర్యావరణహితంగా నిర్వహించనున్నారు. ఇందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 15న ప్రారంభం కానున్న ఉత్సవాలకు వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయి. లక్షలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో పకడ్బందీ చర్యలు చేపట్టారు. మరోవైపు ఈసారి ఉత్సవాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు సైతం ప్లాస్టిక్ బ్యాగులు, ఇతర వస్తువులను వినియోగించకుండా అవగాహన కల్పించడంతో పాటు ప్రభుత్వం స్వయంగా ఏర్పాటు చేసే సదుపాయాల్లోనూ ప్లాస్టిక్‌వస్తువులు లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఈ మేరకు మంచి నీటి సరఫరాకు పేపర్, మట్టి గ్లాసులను వినియోగించనున్నారు. వాటర్ ప్యాకెట్లు అందజేయాల్సి వస్తే.. బాగా దళసరిగా ఉండే ప్యాకెట్లను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించారు. గోల్కొండ కోటకు వెళ్లే రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసే మంచినీటి కేంద్రాల్లో వీలైనంత వరకు మట్టి గ్లాసులను వినియోగించాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.తొలి రోజు దాదాపు 1.5 లక్షల మంది భక్తులు తరలి రానున్నట్లు అంచనా. అలాగే 22న భక్తుల రద్దీ భారీగా పెరుగనుంది. ఆ రోజు 3లక్షల మందికి పైగా భక్తు లు తరలివచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత భక్తు ల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టనుంది. ఇం దుకనుగుణంంగా మంచినీటి సరఫరా, ఇతర ఏర్పాట్లను వివిధ విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుధ్య సిబ్బంది ‘స్వచ్ఛ హైదరాబాద్’ స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మెట్ల పునరుద్ధరణ... చారిత్రక జగదాంబిక ఆలయానికి వెళ్లే మార్గంలోని మెట్లను పురావస్తుశాఖ అధికారులు పునరుద్ధరించారు. ఈ మార్గంలో సుమారు 300లకు పైగా మెట్లు ఉన్నాయి. ఊడిపోయిన కొన్ని మెట్లను వాటి సహజత్వానికి అనుగుణంగా పునరుద్ధరించి, భక్తులు వెళ్లేందుకు వీలుగా రెయిలింగ్ ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలను సైతం పునరుద్ధరించారు. అలాగే ఇప్పటి వరకు అక్కన్న మాదన్నల రికార్డు రూమ్‌ల వద్ద భక్తులు విడిది చేస్తున్నారు. దీంతో రికార్డు రూమ్ సహజత్వం దెబ్బతింటోందని పురావస్తు శాఖ భావిస్తోంది. దీంతో ఈ ఏడాది బోనాలను అలంకరించుకునేందుకు, వంటలు చేసుకునేందుకు రికార్డు రూమ్‌కు దూరంగా మొదటి బావి వద్ద అనుమతినిచ్చినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. రికార్డు రూమ్‌తో పాటు, కోట సహజత్వానికి విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంటునట్లు పురావస్తుశాఖ గోల్కొండ ఇన్చార్జి భానుప్రకాశ్ వర్మ ‘సాక్షి’తో చెప్పారు. మొదటి బావి వద్ద స్థలం ఎంతో విశాలంగా ఉంటుందని అక్కడ భక్తులు చక్కగా విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. ఆలయ మార్గంలో అలంకరణ... ఆషాఢమాసంలో ఎంతో వైభవంగా జరిగే బోనాల వేడుకలు గోల్కొండతో మొదలవుతాయి. ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలను కనుల పండువగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ మార్గాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తున్నారు. అలాగే భక్తుల రాకపోకలకు వీలుగా, రద్దీ నియంత్రణకు అనుకూలంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆలయ మార్గంలో 60 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 1,800 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రత చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. -
పడవలకు పసుపు రంగు
నెల్లూరు రూరల్ : సముద్రపు దొంగలను గుర్తించేందుకు, జలమార్గంలో వచ్చే తీవ్రవాదులను పసిగట్టేందుకు, గల్లంతవుతున్న మత్స్యకారులను గుర్తించేందుకు, అంతరాష్ట్ర, దేశ వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు, సముద్రంలో చేపల వేటకు వచ్చే మత్స్యకారులు ఇతర రాష్ట్రాలు, దేశసరిహద్దులు దాటిపోతుండడం తదతర ఘటనలు చోటుచేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. విదేశీయులు ఎవరైనా మన సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు బోట్లు ఏ దేశానికి సంబంధించినవో, మన దేశపరిధిలో అయితే ఏ రాష్ట్రానికి చెందినవో గుర్తించడానికి వీలుగా తీర రక్షణ దళం ప్రతి తీర రాష్ట్రానికి చెందిన పడవలకు ఒక రంగు కేటాయించింది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రంగు కేటాయిస్తూ ఏప్రిల్ నెలాఖరు లోపు రంగులు వేయడం పూర్తి చేయాలని ఆయా ప్రభుత్వాలకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు పడవలను పరిశీలించి పసుపు, నీలం రంగులు వేసే విధంగా చర్యలు చేపడుతున్నారు. పైభాగానికి పసుపు రంగు, నీటిలో మునిగి ఉన్న భాగానికి ముదురు నీలిరంగు వేయాలి. రంగువేయని పడవలకు రిజిస్ట్రేషన్ నిలిపివేయడమే కాకుండా వారికి అందే రాయితీలను నిలిపివేస్తామని సంబంధిత అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా ముంబై తరహా దాడులు జరగకుండా ఇతర దేశాలకు చెందిన వారు మన సరిహద్దుల్లోకి వచ్చినప్పుడు సులువుగా గుర్తించవచ్చని చెబుతున్నారు. రంగు వేస్తేనే రాయితీ వేట విరామ సమయంలో 61 రోజు లకు రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న ప్రతి ఇంజ న్బోటుపై వేట చేస్తే మత్స్యకారుడి కుటుంబానికి రూ.4 వేలు జీవన భృతి ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది నుంచి ఇంజిన్బోటు డీజిల్‌కు లీటరుకు రూ.6 రాయితీ ఇవ్వనున్నారు. పసుపురంగు వేయకపోతే ఇవన్నీ నిలిచిపోనున్నాయి. అలాగే బోట్లకు రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ నిలిపేస్తారు. ఆయా కుటుంబాలకు ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిపేయనున్నారు. సర్కారు సూచించిన కలర్ కోడ్ ముత్తుకూరు: రాష్ట్ర ప్రభుత్వం సముద్రంలో చేపల వేట సాగించే పడవలకు పైభాగంలో పచ్చరంగు పూయాలని, అడుగు భాగం ముదురునీలం రంగు వేయాలని ఆదేశించగా మత్స్యశాఖ అ« దికారులు రంగంలోకి దిగారు. మత్స్యకారులచే రంగులు కొనుగోలు చేయిం చి, పడవలకు కలర్ కోడ్ ఇప్పించే పనిలో పడ్డారు. ఇప్పటికే పొరుగున ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో పడవలకు కలర్ కోడ్ ఇచ్చే కార్యక్రమం ఊపందుకొంది. ఒక పడవకు కలర్ కోడ్ ఇవ్వాలంటే రూ.2,500 ఖర్చవుతోందని అంచనా. జిల్లాలో సుమారు 2,000 ఇంజన్ పడవలు ఉన్నాయి. ముత్తుకూరు మండలంలో 383 ఫైబర్ బోట్లు, 155 తెప్పలు, 18 మరపడవలు ఉన్నాయి. కాగా జిల్లాలో కలర్ కోడ్ కార్యక్రమం ఇంకా ఊపందుకోలేదు. చిత్రం తీసి ఆన్లైన్లో ఉంచుతాం జిల్లాలో మత్స్యకారులు తమ పడవలకు పసుపు, ముదురు నీలిరంగు వేయాలి. ఇలా చేస్తేనే వారికి రాయితీలు వర్తిస్తాయి. రంగు వేసిన ప్రతి పడవను చిత్రం తీసి ఆన్లైన్లో నమోదు చేస్తాం. రంగు వారికే వాటికే రాయితీలు, ఇతర పథకాలు వర్తిస్తాయి. – ఎ.సాల్మన్‌రాజు, జిల్లా మత్స్యశాఖ జేడీ పడవలకు కలర్ కోడ్ ఇవ్వాలి కలర్ కోడ్‌పై మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నాం. పడవలకు రంగులు పూయాలని కోరుతున్నాం. కోస్టుగార్డు అధికారులు తేలిగ్గా గుర్తించేందుకు ప్రభుత్వం ఈ కలర్ కోడ్ సూచించింది. –ప్రసాద్, ఎఫ్డీఓ, ముత్తుకూరు -
వామ్మో ! బిర్యానీలో రోజ్ వాటర్
-
హోలీ.. రంగేళి
–నగరంలో ఘనంగా వేడుకలు కర్నూలు(హాస్పిటల్): హోళీరే రంగేళీ హోళీ అంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు రంగుల హోళీ ఆడుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కర్నూలు నగరంలోని ప్రధాన వీధుల్లో రంగులు చల్లుకున్నారు. రాజవిహార్, పెద్దమార్కెట్, నెహ్రూరోడ్, ఎన్ఆర్ పేట, కొత్తపేట, ప్రకాష్‌నగర్, బుధవారపేట, చాణిక్యపురికాలనీ, శంకరమఠం, ఎన్సీసీ అధికారుల క్వార్టర్స్, మాధవీనగర్, టెలికాంనగర్, నంద్యాల చెక్‌పోస్ట్, బృందావన్‌నగర్, బళ్లారిచౌరస్తా, అశోక్‌నగర్, వెంకటరమణకాలనీ తదితర ప్రాంతాల్లో జనం రంగుల్లో మునిగిపోయారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రధానంగా ఆదివారం పండుగ రావడంతో పండుగ వాతావరణం మరింత రంగుల మయంగా మారింది. హోళీ అనంతరం సాయంత్రం కామదహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనూ ఎంపీ బుట్టా రేణుక, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు రంగులు పూసుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. -
ఎన్నెన్నో వర్ణాలు.. ఎన్నెన్నో అందాలు