Customs officials
-
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
RGIA Hyderabad: బంగారం తెచ్చి.. చెత్తబుట్టలో వేసి
సాక్షి, శంషాబాద్: కస్టమ్స్ తనిఖీలు తప్పించుకుని బంగారాన్ని బయటికి తరలించేందుకు స్మగ్లర్లు కొత్తకొత్త మార్గాలను ఆశ్రయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులే బంగారాన్ని బయటికి తీసుకురాకుండా, ఎయిర్‌పోర్టు ఉద్యోగులతో బయటికి తరలిస్తున్న సంఘటనలు బయటపడుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు కస్టమ్స్ తనిఖీలకు రాకముందు అరైవల్‌లో ఉన్న మరుగుదొడ్డిలోకి వెళ్లాడు. అక్కడి ఓ చెత్త డబ్బాలో తాను తీసుకొచ్చిన బంగారాన్ని వేసి యథాతథంగా కస్టమ్స్ తనిఖీలకు వెళ్లాడు. తనిఖీల్లో ఏమీ దొరక్కపోయినా అనుమానించిన అధికారులు అతడిని విచారించడంతో తాను తీసుకొచ్చిన బంగారాన్ని చెత్తడబ్బాలో వేసినట్లు చెప్పాడు. దానిని ఎయిర్‌పోర్టు ఉద్యోగి బయటికి తీసుకెళ్లనున్నట్లు చెప్పడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బంగారాన్ని తరలించేందుకు వెళ్లిన సదరు ఎయిర్‌పోర్టు ఉద్యోగిని కూడా అరెస్ట్ చేశారు. 933 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా ఇదే తరహాలో కువైట్ నుంచి వచ్చిన ప్రయాణికుడు 1,300 గ్రాముల బంగారాన్ని చెత్తడబ్బాలో దాచిపెట్టడంతో కస్టమ్స్ అధికారులు దానిని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: వర్షం ఉంటే బడులకు సెలవులివ్వండి.. విద్యాశాఖ ఆదేశం -
8 కిలోల బంగారం దుస్తుల్లో దాచేశారు..
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న 8 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారు జామున బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడు ప్యాంటులో దాచి తీసుకొచ్చిన 2 కేజీల బంగారం బిస్కెట్ ముక్కలు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.21 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. అదే విమానంలో వచ్చిన మరో ప్రయాణికుడు కూడా లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 1.75 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ 1.8 కోట్లుగా నిర్ధారించారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద లో దుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 2.17 కేజీల బంగారం పేస్టును బయటికి తీశారు. దీని విలువ 1.31 కోట్లుగా నిర్ధారించారు. దుబాయ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ధరించిన లో దుస్తుల్లో 2.05 కేజీల బంగారం బయటపడింది. దీని 1.24 కోట్లుగా నిర్ధారించారు. ఆ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం పట్టుబడిన 8 కేజీల బంగారం విలువ రూ.4.86 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో ఒకే రోజులో అత్యధికంగా పట్టుబడిన బంగారం ఇదేనని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. -
బంగారం ద్రవాన్ని చీరపై స్ప్రేగా చల్లి అక్రమ రవాణా
హైదరాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు అతడి లగేజీని పరిశీలించారు. అందులో ఉన్న ఓ కాటన్ చీరపై బంగారం ద్రవాన్ని స్ప్రేగా చల్లి తీసుకొచ్చినట్లు గుర్తించి దానిని బయటికి తీశారు. బయటపడిన 461 గ్రాముల బంగారం విలువ రూ.28 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలి బ్యాండేజీలో బంగారం
దొడ్డబళ్లాపురం: కాలికి గాయమైనట్లు బ్యాండేజీ చుట్టుకుని లోపల బంగారం దాచి అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. రూ.43లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మే 21న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు తెలియడంతో అతన్ని తనిఖీలు చేశారు. అతడి కాలికి చుట్టిన బ్యాండేజీపై అనుమానం వచ్చి విప్పి చూడగా రెండు బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. మరో చైను కూడా అతడి నుండి స్వాధీనం చేసుకున్నారు. స్టీలు కడియం రూపంలో. చేతి కడియానికి స్టీలు పూత పూసి బంగారును తరలిస్తున్న వ్యక్తిని విమానాశ్రయంలో పట్టుకున్నారు. మే 20న బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికునిపై అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీ చేయగా, చేతికి ఉన్న పెద్ద స్టీలు కనిపించింది. దానిని పరిశీలించగా, బంగారు కడియమని, పైకి కనబడకుండా ఉండడానికి స్టీలు పూత పూసినట్లు వెల్లడైంది. రూ.31 లక్షల విలువ చేసే అర్ధ కేజీ బంగారాన్ని స్వాదీనం చేసుకొన్నారు. -
టాయిలెట్లో రూ.2 కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు
సాక్షి, ఢిల్లీ: టాయిలెట్లో రెండు కోట్లు విలువ చేసే బంగారు కడ్డీలు కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని ఇందీరాగాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐ) విమానాశ్రయంలో ఆదివారం చోటు చేసుకుంది. దేశీయ పర్యటనలు పూర్తి చేసుకున్న అంతర్జాతీయ విమానg ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 2వద్ద ఆగినప్పుడూ ఈ ఘటన వెలుగు చూసిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారుల ఎయిర్‌పోర్ట్‌లో ఆగి ఉన్న విమానాన్ని తనిఖీ చేస్తుండగా.. వాషరూమ్లో సింక్‌కు దిగువున టేప్‌తో అతికించిన బూడిదరంగు పర్సును కనుగొన్నారు. దీంతో వెంటనే అధికారులు ఆ పర్సును స్వాధీనం చేసుకుని చూడగా..మొత్తం మూడు వేల గ్రాములకు బరువున్న నాలుగు దీర్ఘచతురస్రాకరా బంగారు కడ్డీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీర్ఘచతురస్రాకారంలో ఉండే బంగారు కడ్డీల ధర సుమారు 2 కోట్లు రూపాయాలపైనే ఉంటుందని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. (చదవండి: 'మా రక్షణ కోసం చేస్తున్న యుద్ధం': రష్యా విదేశాంగ మంత్రి) -
భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: ఇద్దరు ప్రయాణికులు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో శనివారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన ప్రసాద్‌గౌడ్ అనే వ్యక్తి బంగారు బిస్కెట్లు ఉన్న లగేజీని కస్టమ్స్ కంటపడకుండా తరలించేందకు యత్నించాడు. అతడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టడంతో లగేజీలో 2.1 కేజీ బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారం విలువ రూ.కోటి ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రసాద్‌గౌడ్ క్యారియర్‌గా బంగారాన్ని తరలించేందుకు యత్నించినట్లు అనుమానిస్తున్నారు. అలాగే కువైట్ నుంచి కేయూ–373 విమానంలో వచ్చిన అహ్మద్ అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి కదలికలను అనుమానించి అతడి లగేజిని తనిఖీ చేయగా 268 గ్రాముల బంగారాన్ని బయటికి తీశారు. బంగారం విలువ రూ.12 లక్షలు ఉంటుదని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో షారూక్‌ను అడ్డుకున్న అధికారులు.. ఆ తర్వాతే బయటకు..!
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ముంబై విమానాశ్రయంలో బాలీవుడ్ స్టార్‌ను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. అయన వద్ద నుంచి అత్యంత ఖరీదైన వాచీలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా భద్రతా సిబ్బంది షారూక్‌ను నిలువరించారు. రూ.18 లక్షల లగ్జరీ వాచీలు షారూక్ ఖాన్ బ్యాగ్‌లో ఉండగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అయితే ఆ తర్వాత వాటిపై కస్టమ్ డ్యూటీ మొత్తం రూ.6.83 లక్షలను బాలీవుడ్ హీరో చెల్లించారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించాక షారూక్ ఖాన్ విమానాశ్రయం నుంచి పంపించివేశారు. అయితే షారూక్‌ను ఎయిర్‌పోర్ట్‌లో అడ్డుకోవడం ఇదేం మొదటిసారి కాదు. 2011లో విదేశీ వస్తువులను తీసుకురావడంతో కస్టమ్స్ అధికారులు రూ1.5 కోట్ల జరిమానా విధించారు. ప్రస్తుతం ఎస్ఆర్కే స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ పఠాన్‌లో నటిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె, జాన్ అబ్రహం నటిస్తున్న ఈ చిత్రం జనవరి 25, 2023న విడుదల కానుంది. అంతేకాకుండా సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో అతిథి పాత్రతో పాటు 'జవాన్', 'డుంకీ' కూడా కనిపించనున్నారు. దుబాయ్‌లోని షార్జాలో జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్- 2022లో పాల్గొన్న షారూక్ తిరిగి ముంబై చేరుకున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న సిగరెట్ల పట్టివేత
శంషాబాద్: అక్రమంగా నిషేధిత సిగరెట్లను తరలిస్తున్న నిందితులను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో రూ. 2.98 లక్షల విలువ చేసే నిషేధిత సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. బెహరాన్ నుంచి జీఎఫ్274 విమానంలో హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడి వద్ద 29,800 నిషేధిత సిగరేట్లు లభ్యమయ్యాయి. కస్టమ్స్ అధికారులు నిందితుని విచారణ చేస్తున్నారు. -
విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు
Indian Women Luggage Contain 109 Live Animals: బ్యాంకాక్ విమానాశ్రయంలో ఇద్దరు భారతీయ మహిళలను అరెస్టు చేశారు. ఏకంగా 109 జంతువులను అక్రమంగా తరలించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఈ మేరకు నిత్య రాజీ, జకియా సుల్తాన్ అనే ఇద్దరు మహిళలు రెండు లగేజ్ల్లో జంతువులు తరలించేందుకు యత్నించారు. ఆ మహిళల లగేజ్ల్లో బతికే ఉన్న రెండు తెల్ల పందికొక్కులు, రెండు అర్మడిల్లోలు, 35 తాజేళ్లు , 50 బల్లులు, 20 పాములు కనిపించాయని అధికారులు వెల్లడించారు. ఆ మహిళిద్దరూ విమానంలో చెన్నైకి వెళ్లాల్సి ఉందని చెప్పారు. వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. ఇటీవల, గత నెలలో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు థాయ్‌లాండ్ నుంచి వన్యప్రాణులను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన రెండు ప్రయత్నాలను అడ్డుకున్నారు కూడా. -
పొట్ట విప్పి చూడ డ్రగ్స్ ఉండు!
శంషాబాద్: మాదకద్రవ్యాలను క్యాప్సుల్స్ రూపంలో ప్యాక్ చేసి, కడుపులో దాచుకుని స్మగ్లింగ్ చేస్తున్న విదేశీయులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా పట్టుబడుతున్నారు. గత నెల 21న ఒకరిని టాంజానియా జాతీయుడిని పట్టుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ.11.57 కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 26న టాంజానియాకు చెందిన మరో వ్యక్తిని పట్టుకున్నామని, ఆరు రోజుల చికిత్స అనంతరం రూ.11.53 కోట్ల విలువైన హెరాయిన్ క్యాప్సుల్స్ రికవరీ చేశామని కస్టమ్స్ అధికారులు బుధవారం ప్రకటించారు. డ్రగ్స్ మాఫియా వాళ్లు 1.38 కేజీల హెరాయిన్‌ను పారదర్శకంగా ఉండే టేప్‌తో 108 క్యాప్సుల్స్‌గా మార్చారన్నారు. టాంజానియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తిని క్యారియర్‌గా మార్చుకుని అతడికి భారత్ రావడానికి టూరిస్ట్ వీసా ఇప్పించారని చెప్పారు. అతడితో హెరాయిన్ క్యాప్సుల్స్‌ను మింగించి ఎథిహాద్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో అబుదాబి మీదుగా హైదరాబాద్ పంపినట్లు తెలిపారు. ప్రయాణికుల జాబితా వడపోసి.. కస్టమ్స్ అధికారులు అనునిత్యం విదేశాల నుంచి ప్రధానంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల జాబితాను సేకరించి ప్యాసింజర్స్ ప్రొఫైలింగ్ విధానంతో వడపోస్తారు. గత నెల 26న వచ్చిన ప్యాసింజర్స్ జాబితాను ఇలాగే వడపోయగా టాంజానియా జాతీయుడిపై అనుమానం వచ్చింది. శంషాబాద్ విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ప్రాథమిక విచారణ చేసింది. తాను హెరాయిన్ క్యాప్సుల్స్ మింగి వస్తున్నానని, రెండు మూడు రోజుల్లో వీటిని తన వద్దకు వచ్చే రిసీవర్లకు అందించాల్సి ఉందని అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు ఆరు రోజులు ఆస్పత్రిలో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో 108 క్యాప్సుల్స్ బయటకు వచ్చేలా చేశారు. వీటిలో ఉన్న 1.38 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ డ్రగ్స్ ఉత్తరాదికి వెళ్లాల్సి ఉందని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. శంషాబాద్ లో గత 15 రోజుల్లోనే మొత్తం రూ.113.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. -
బంగారం పట్టివేత
సాక్షి, శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణంగా తనిఖీ చేశారు. అతడి ప్యాంట్ లోపలి భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జేబులో 475 గ్రాముల బంగారాన్ని గుర్తిచి బయటికి తీశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ. 24.8 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డ్రగ్స్ సరఫరాదారుల అరెస్ట్) -
బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
బెంగళూరు: బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సుమారు రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని కార్గో సెక్షన్ వద్ద బెడ్షీట్లు, మిషన్ విడిభాగాల్లో దాచి ఉంచిన ఎక్స్టసీ మాత్రలు, హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నైజిరియన్ వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితులపై దర్యాప్తు చేపటినట్లు పేర్కొన్నారు. సరుకుల రూపంలో డ్రగ్స్‌ను జాంబీయా, బెల్జియం నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు స్వాధీనం చేసుకున్న కిలో హెరాయిన్ సుమారు రూ.7కోట్లు, 4.551 కిలోల ఎక్స్టసీ మాత్రలు దాదాపు రూ.3కోట్ల విలువ ఉంటుందని అంచనా. -
ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేస్టులా మార్చి.. కాళ్లకు చుట్టుకుని..
సాక్షి, శంషాబాద్(హైదరాబాద్): అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుంచి జి–9–450 విమానంలో సోమవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అతడి వద్ద బంగారం బయటపడింది. పేస్టులా మార్చిన బంగారాన్ని రెండు కాళ్లకు టేపుతో అతికించి తీసుకొచ్చాడు. 970 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ రూ. 47.55 లక్షలుంటుందని అధికారులు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కూతురు ప్రేమ వివాహం.. తండ్రి ఆత్మహత్య -
వీడొక్కడే సినిమాలో లాగా.. మహిళ కడుపులో.. అధికారులు షాక్..
న్యూఢిల్లీ: కడుపులో కొకైన్ దాచుకుని విదేశాల నుంచి వస్తున్న ఒక మహిళను కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఆ మహిళ ఉగాండ దేశస్థురాలిగా గుర్తించారు. ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదరు మహిళ కదలికలు అనుమానాస్పదంగా ఉండటాన్ని అధికారులు గుర్తించారు. తొలుత అధికారులు.. సదరు మహిళ గర్భవతి కాబోలు అని భావించారు. ఆమెను సహయం చేయడానికి ఆమెవైపు చేరుకున్నారు. అయితే.. ఆ మహిళ మాత్రం అధికారులను చూడగానే భయంతో వణికిపోయింది. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు తమదైన శైలీలో విచారించారు. ఆ తర్వాత... మహిళను ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. స్కానింగ్‌లో సదరు మహిళ కడుపులో ఒక కేజీ కొకైన్ క్యాప్సుల్స్ ఉన్నట్లు గుర్తించారు. కాగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుంచి 91 కొకైన్ క్యాప్సుల్స్లను బయటకు తీశారు. వాటి బరువు 993 గ్రాముల వరకు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 14 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ సంఘటనను చూసి అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా ఇప్పటి వరకు 400 గ్రాముల వరకు కొకైన్‌ను రవాణా చేయడం మాత్రమే చూశామన్నారు. ఇంత భారీ ఎత్తున కొకైన్ రవాణా చేయడం చూడలేదన్నారు. ఇది కడుపులో విస్ఫోటనం చెందితే మహిళ ప్రాణాలకే ప్రమాదమన్నారు. బాధిత మహిళ కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని వైద్యులు తెలిపారు. మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఇదేం ఐడియారా బాబు..’, ‘వీడొక్కడే సినిమా గుర్తొచ్చిందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. Correction: The estimated value of the drug is Rs. 14 crores. This is the 24th case of seizure of NDPS covered drugs at Delhi airport this year. 32 passengers have been arrested so far. The estimated value of drug seizures would go into more than Rs. 845* crores: Customs Dept pic.twitter.com/nSgyZQo79U — ANI (@ANI) December 29, 2021 -
జ్యూస్ యంత్రంలో బంగారం
శంషాబాద్: జ్యూస్ యంత్రంలో అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ–952 విమానంలో శనివారం రాత్రి ఓ ప్రయాణికుడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అతని కదలికలకపై అనుమానం కలిగిన కస్టమ్స్ అధికారులు ప్రయాణికుడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చేతితో జ్యూస్ తయారు చేసే ఓ యంత్రాన్ని కనుగొని, దాన్ని కట్ చేయగా 671 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ 34.18 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమర్జెన్సీ లాంతరులో ఆరు కిలోల బంగారం
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఈకే 524 విమానంలో మంగళవారం ఉదయం శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అతని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిం చగా ఎమర్జెన్సీ లాంతరు వెనుక భాగంలో బ్యాటరీల సైజులో నలుపు రంగు కవర్లో అమర్చిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 6.06 కిలోల బరువున్న ఈ బంగారం విలువ 2.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిని కొరియర్‌గా ఉపయోగించుకుని బంగారాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత
శంషాబాద్: ఓ ప్రయాణికుడు అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు సోమవారం రియాద్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టిన కస్టమ్స్ అధికారులకు లోదుస్తుల్లో ప్రయాణికుడు దాచిన 100 గ్రాముల బంగారు కడ్డీ బయటపడింది. దీని విలువ సుమారు 4.90 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చెప్పులో బంగారం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. దుబాయ్ నుంచి ఈకే–526 విమానంలో గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను అనుమానించిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అతడు ధరించిన చెప్పులకు వెండి రంగులో ఉన్న డిజైన్ పలకలను తొలగించడంతో బంగారం బయటపడింది. అంతేకాకుండా అతడి బ్యాగేజీలో ఉన్న ఫేషియల్ క్రీమ్ బాక్సులో కూడా బంగారం లభించింది. మొత్తం 495 గ్రాముల బరువు కలిగిన బంగారం విలువ 24.14 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. -
కడుపులో రూ.11 కోట్ల విలువైన కొకైన్
బెంగళూరు: బెంగళూరు ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. ఆఫ్రికన్ దేశస్తుడి నుంచి దాదాపు రూ. 11 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఆఫ్రికా దేశస్తుడు విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ఆహారం, మంచినీరు తీసుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడినిక స్కాన్ చేయగా.. పొట్టలో కొకైన్ ఉన్నట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వైద్యుల సహాయంతో అతని కడుపులోంచి కొకైన్‌ను బయటికి తీశారు. కాగా కొకైన్ విలువ దాదాపు రూ. 11 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. చదవండి: నా చావుకు భార్య, అత్తింటివారే కారణం.. పెళ్లి చేసుకుంటానని పిలిచి లాడ్జికి తీసుకెళ్లి.. -
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టివేత
-
పేస్ట్ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు విచారించగా బంగారం దాచిన విషయం బయటపడింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేసి కాళ్లకు వేసుకునే సాక్స్‌లో దాచిన రెండు కేజీలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు