DDCA
-
భారత్‌లో మరో టీ20 లీగ్.. తొలి ఎడిషన్ అప్పటి నుంచే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. 2008లో మొదలైన ఈ టీ20 లీగ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారి ప్రతిభ నిరూపించుకుంటే ఆటగాళ్లపై కనకవర్షం కురవడం ఖాయం. అంతేకాదు.. ఇక్కడ ప్రతిభ చూపితే జాతీయ జట్టులోనూ చోటు దక్కించుకునే అవకాశాలు ఉంటాయి.ఇటీవలి కాలంలో యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ తదితరులు అలా టీమిండియాలో చోటు దక్కించుకున్న వాళ్లే. యంగ్ టాలెంట్ హంట్‌లో భాగంగా దేశవాళీ క్రికెట్, అండర్-19 టోర్నీల్లో ఆకట్టుకున్న ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ ఫ్రాంఛైజీలు తమకు కావాల్సిన వాళ్లను ఎంపిక చేసుకుంటాయి.ఇప్పటికే పలు స్థానిక లీగ్లుఈ క్రమంలో పలు రాష్ట్రాల క్రికెట్ బోర్డులు సైతం టీ20 లీగ్‌లు నిర్వహిస్తూ స్థానిక ఆటగాళ్ల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే తమిళనాడు ప్రీమియర్ లీగ్, ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్, ఆంధ్ర ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, పంజాబ్ ప్రీమియర్ లీగ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లు పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ బోర్డు సైతం ఇదే బాటలో నడవాలని నిశ్చయించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ పేరిట టోర్నీని ఆరంభించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. ఆగష్టు 2024 ద్వితీయార్థ భాగంలో ఈ లీగ్‌ను మొదలుపెట్టనున్నట్లు పేర్కొంది. మ్యాచ్‌లన్నీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపింది.అదే స్పెషల్ ఇక్కడమిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఢిల్లీ తమ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించనుంది. ఈ టోర్నీలో పురుషులతో పాటు మహిళా జట్లకు కూడా అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా 40 మ్యాచ్‌లు నిర్వహణకు షెడ్యూల్ ఖరారు చేస్తామని తెలిపిన డీడీసీఏ.. ఇందులో 33 మెన్, 7 వుమెన్ క్రికెట్ మ్యాచ్‌లు ఉంటాయని వెల్లడించింది.ఇక ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో మొత్తంగా ఆరు జట్లు(మెన్) ఉంటాయని.. వీటికోసం ఫ్రాంఛైజీలు రూ. 49.65 కోట్ల రూపాయాల మేర ఖర్చు చేయవచ్చని డీడీసీఏ తెలిపింది. ఇందులోని టాప్ 4 బిడ్డర్లు మహిళా జట్లను ఆటోమేటిక్‌గా కైవసం చేసుకుంటాయని పేర్కొంది. స్థానికంగా క్రికెట్‌ను మరింత అభివృద్ధి చేసేందుకే ఈ లీగ్ ఆరంభిస్తున్నట్లు తెలిపింది. -
క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయడు ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యవీర్‌కు చోటు దక్కింది. కాగా ఢిల్లీ ప్రాబ్బుల్స్లో ఆర్యవీర్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ జట్టుకు అర్నవ్ బుగ్గా సారథ్యం వహిస్తున్నాడు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ మల్హోత్రా స్పందించారు. "ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్. అతడి ఫుట్‌వర్క్ కూడా చాలా బాగుంది. బంతిని కూడా బాగా మిడిల్ చేస్తున్నాడు. అతడి ఆటతీరు మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే ఆర్యను ఎంపిక చేశాం" అని ఆకాష్ మల్హోత్రా పేర్కొన్నాడు. ఇక జట్టు ఎంపికైన తర్వాత ఆర్యవీర్ తల్లి ఆర్తి సెహ్వాగ్ అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిపోస్ట్ చేసింది. Delhi Men's under 16 Team for the match against Bihar in the Vijay Merchant Trophy. Delhi won the toss and elected to bat first. pic.twitter.com/KcwMwSS4yw — DDCA (@delhi_cricket) December 6, 2022 అంతకుముందు ఆర్యవీర్ కూడా నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాగా ఢిల్లీ నుంచి ఎంతో మంది స్టార్ క్రికెటర్లగా ఎదిగారు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్, సెహ్వాగ్, మదన్‌లాల్ వంటి క్రికెటర్లు ఢిల్లీకి చెందిన వారే. View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) -
Rohan Jaitley: డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
Rohan Jaitley Elected As DDCA President: ప్రతిష్టాత్మక ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా దివంగత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ మళ్లీ ఎన్నికయ్యారు. గురువారం వెలువడిన ఫలితాల్లో ఆయన సమీప ప్రత్యర్థి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్‌పై 753 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఇక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిద్ధార్థ్ సింగ్ వర్మ కార్యదర్శి పదవిని సొంతం చేసుకున్నారు. మాజీ క్రికెటర్ అయిన సిద్ధార్థ్, మాజీ ముఖ్యమంత్రి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు, ప్రస్తుత పశ్చిమ ఢిల్లీ ఎంపీ పర్వేశ్ వర్మకు సోదరుడు. చదవండి: T20 World Cup 2021 Aus Vs SL: కప్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్న ఆసీస్... వరుస విజయాలు -
డీడీసీఏ అధ్యక్షుడిగా రోహన్ జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడవు శనివారంతో ముగియగా... అధ్యక్ష పదవి రేసులో రోహన్ మాత్రమే ఉండటంతో అతడిని ఏకగ్రీవం చేస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అధ్యక్ష పదవిలో రోహన్ వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఉండనున్నారు. గతంలో అరుణ్ జైట్లీ 1999 నుంచి 2013 వరకు డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నారు. న్యాయవాది అయిన రోహన్... తండ్రి బాటలోనే నడుస్తూ డీడీసీఏ అధ్యక్ష పదవిని అలంకరించడంతో పలువురు క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు. కోశాధికారి, డైరెక్టర్ పదవుల కోసం నవంబర్ 5–8 మధ్య ఎన్నికలు జరగనున్నాయి. కోశాధికారి పదవి కోసం బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సీకే ఖన్నా సతీమణి శశి, గౌతమ్ గంభీర్ మేనమామ పవన్ గులాటి మధ్య పోటీ నెలకొని ఉంది. -
కీలక పదవికి జైట్లీ కుమారుడు ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021 జూన్ 30 వరకు ఆయన డీసీసీఏ అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. వృత్తిరిత్యా న్యాయవాది అయిన రోహాన్.. తన తండ్రి బాటలో నడవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక అధికారులు, నేతల సూచనల మేరకు డీడీసీఏ బరిలో నిలిచి విజయం సాధించారు. ఈ సందర్భంగా రోహాన్ జైట్లీకి పలువురు ఆటగాళ్లు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. జైట్లీ నేతృత్వంలోనే ఢిల్లీ క్రికెట్ సంఘం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా అవినీతి ఆరోపణలు రావడంతో రజత్ శర్మ రాజీనామా చేయగ.. ఆ పదవిక ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రోహాన్ ఎన్నికయ్యారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. -
కీలక పదవిలో అరుణ్ జైట్లీ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీమంత్రి, దివంగత బీజేపీ నేత అరుణ్ జైట్లీ కుమారుడు రోహాన్ జైట్లీ ఓ కీలక పదవి కోసం పోటీపడుతున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోషియేషన్ (డీడీసీఏ) ప్రెసిడెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రోహాన్ జైట్లీ బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సభ్యులంతా ఆయననే మద్దతు తెలుపుతుండటంతో ఎన్నికల లాంఛనం కానున్నట్లు సమాచారం. ఇక డీసీసీఏ పదవికి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం పలువురు ప్రముఖలు జైట్లీకి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఢిల్లీ డాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ దావన్ ట్విటర్ వేదికగా విషెష్ తెలియజేశాడు. అతను విజయం సాధించాలని, డీడీసీఏ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాడు. మరోవైపు రోహాన్ ఎన్నికకు తామంతా సహకరిస్తామని డీసీఏ సభ్యులు తెలిపారు. ఢిల్లీ క్రికెట్ సంఘానికి కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఎంతో సేవ చేసిన విషయం తెలిసిందే. 1999 నుంచి 2013 వరకు ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్‌కు అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. ఆయన సారథ్యంలో ఎంతో మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు సైతం ఎంపికయ్యారు. ఆయన సేవలను గుర్తించిన డీసీఏ జైట్లీ మరణాంతరం ఢిల్లీలోని ప్రముఖ ఫిరోజ్ షా కోట్ల మైదానానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టి ఘనంగా సత్కరించింది. అయితే తండ్రి వారసత్వంలో కొనసాగాలి అనుకున్న రోహాన్.. స్థానిక పెద్దల సహకారంతో డీడీసీఏ పదవికి నామినేషన్ వేశారు. అయితే రోహాన్ ఎన్నికకు ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఎన్నిక నల్లేరు మీద నడకే కానుంది. మరోవైపు డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొంతకాలంగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో అధ్యక్షుడు రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి గత ఏడాది నవంబర్‌లో సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. -
రసాభాసగా మారిన ఏజీఎం
-
ఢిల్లీ క్రికెట్లో గల్లీ గొడవ
న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న విభేదాలు రచ్చకెక్కాయి. ఆదివారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సందర్భంగా సభ్యులు ఒకరిపై మరొకరు నేరుగా చేయి చేసుకున్నారు. అధికార వర్గానికి చెందిన సంయుక్త కార్యదర్శి రంజన్ మన్‌చందాను ప్రత్యర్థి వర్గం ప్రతినిధి మఖ్సూద్ ఆలమ్ చెంపదెబ్బ కొట్టగా... స్థానిక ఎమ్మెల్యే కూడా అయిన ఓం ప్రకాశ్ శర్మపై కూడా వినోద్ తిహారాకు చెందిన వ్యక్తులు దాడికి దిగారు. ఇంత గొడవ మధ్యలో కూడా అన్ని తీర్మానాలకు ఆమోదం లభించినట్లు ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారికంగా ప్రకటించింది. జస్టిస్ బదర్ అహ్మద్ స్థానంలో కొత్తగా జస్టిస్ దీపక్ వర్మను కొత్త అంబుడ్స్‌మన్‌గా నియమించారు. ‘ఢిల్లీ క్రికెట్ సంఘం అతి ఘోరంగా సున్నాకే ఆలౌటైంది. కొందరు సంఘం పరువు తీస్తున్నారు. ఈ సంఘాన్ని వెంటనే రద్దు చేయాలని బీసీసీఐ, గంగూలీకి విజ్ఞప్తి చేస్తున్నా. అవసరమైతే తప్పు చేసినవారిపై జీవితకాల నిషేధం కూడా విధించండి’ అని భారత మాజీ క్రికెటర్, ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్ తాజా ఘటనపై వ్యాఖ్యానించాడు. -
బీసీసీఐనే బురిడీ కొట్టించాడు!
న్యూఢిల్లీ: అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లు ఆడేందుకు వయసు దాచి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)నే తప్పుదారి పట్టించే యత్నం చేసిన ఢిల్లీ క్రికెటర్ ప్రిన్స్ రామ్ నివాస్ యాదవ్‌పై నిషేధం పడింది. ఈ మేరకు రామ్ నివాస్ యాదవ్ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడనే విషయం తాజాగా వెలుగుచూడటంతో అతనిపై నిషేధం విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ నిషేధం రెండేళ్ల పాటు మాత్రమే అమల్లో ఉంటుందని బోర్డు తెలిపింది. దాంతో 2020-21, 2021-22 సీజన్లలో దేశవాళీ టోర్నీల్లో పాల్గొనే అవకాశాన్ని రామ్ నివాస్ కోల్పోయాడు. ‘ అతను వయసుతో బోర్డును రాష్ట్ర అసోసియేషన్‌ను తప్పుదోవ పట్టించే యత్నం చేశాడు. దీనిపై బీసీసీఐ నుంచి మాకు సమాచారం అందింది. దాంతో అతనిపై విచారణ చేయగా తప్పు చేసినట్లు తేలింది’ అని డీడీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అతను 1996, జూన్ 10వ తేదీన పుడితే, బీసీసీఐకి ఇచ్చిన సర్టిఫికేట్లో 2001, డిసెంబర్ 12వ తేదీన పుట్టినట్లు ఉంది. ఈ విషయం అతని సెకండరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లో బట్టబయలు అయ్యింది. ఏకంగా ఐదు ఏళ్ల తేడాతో బోర్డునే బురిడీ కొట్టించాలని చూడటంతో బీసీసీఐ సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ క్రికెట్ బోర్డులో అతని ఐడీ నంబర్ 12968 కాగా, ఢిల్లీ తరఫున రిజస్ట్రేష్ చేసుకున్నాడు. 2018-19 సీజన్‌కు సంబంధించి అండర్-19 క్రికెట్ కేటగిరీలో అతను రిజస్టర్ చేసుకున్నాడు. కాగా, అతని వయసుకు సంబంధించి సర్టిఫికేట్‌ను ఇటీవల బీసీసీఐ ఇవ్వాల్సి రావడంతో అసలు దొంగ సర్టిఫికేట్ వ్యవహారం బయటపడింది. అతనికి సంబంధించి పూర్తి వివరాలను బీసీసీఐ.. డీడీసీఏకు అందజేసింది. అందులో అతని జన్మించిన సంవత్సరం 2001గా ఉంది. -
గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం
ఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ క్రికెట్ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్ పేరు పెట్టాలని ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయించింది. భారత జట్టుకు ఎన్నో సేవలందించిన ఈ ఢిల్లీ ఆటగాడికి ఒక గుర్తింపు ఇవ్వడానికి డీడీసీఏ సమాయత్తమైంది. దానిలో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలోని ఒక స్టాండ్‌కు గంభీర్ పేరును దాదాపు ఖరారు చేసింది. ఈ మేరకు వచ్చే నెలలో గంభీర్ పేరుతో స్టాండ్ ఏర్పాటు కానుంది. జూనియర్, సీనియర్ స్థాయిలో ఢిల్లీ తరఫున గంభీర్ ఎన్నో మ్యాచ్‌లు ఆడాడు. 2018లో ఆంధ్రప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భాగంగా ఢిల్లీ తరఫున చివరి మ్యాచ్ ఆడుతూనే గంభీర్ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. 1999 సీజన్లో గంభీర్ రంజీ ట్రోఫీ అరంగేట్రాన్ని ఢిల్లీ తరఫున ఆరంభించాడు. అలా టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెట్టి భారత్ తరఫున 9 ఏళ్ల క్రికెట్ ఆడాడు. 2007-08 సీజన్లో అతని సారథ్యంలోని ఢిల్లీ రంజీ ట్రోఫీ అందుకుంది. -
‘ఆ రాజీనామా ఇంకా ఆమోదించలేదు’
న్యూఢిల్లీ: ఢిల్లీ, డిస్ట్రిక్ట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్ష పదవికి సీనియర్ జర్నలిస్టు రజత్ శర్మ ఉన్నపళంగా రాజీనామా చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. అయితే రజత్ శర్మ రాజీనామాను తాము ఇంకా ఆమోదించలేదని డీడీసీఏ డైరెక్టర్ ఆర్పీసింగ్ స్పష్టం చేశారు. రజత్ శర్మ రాజీనామాను తాము వెంటనే ఆమోదించేసినట్లు వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఇంకా ఆయన రాజీనామా అంశం చర్చల దశలోనే ఉందన్నారు. రజత్ రాజీనామాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. డీడీసీఏలో అధిక ఒత్తిళ్లు ఎదురవుతున్న కారణంగానే రాజీనామా చేసినట్లు శనివారం తన పదవికి గుడ్‌బై చెప్పిన తర్వాత రజత్ శర్మ తెలిపారు. కొంత మంది క్రికెట్ సమగ్ర అభివృద్ది కోసం కాకుండా స్వార్థ పూరిత విధానాలకు పాల్పడుతున్నారన్నారు. డీడీసీఏలో తారాస్థాయిలో అంతర్యుద్దం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక గత కొద్ది రోజులుగా ముఖ్య కార్యదర్శి వినోద్ తిహారాతో రజత్ శర్మకు పొసగటం లేదు. అరుణ్ జైట్లీ మరణం తర్వాత డీడీసీఏ సభ్యుల మధ్య బేదాభిప్రాయాలు రావడం అంతేకాకుండా రజత్ శర్మపై అన్ని వైపులా ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా తమ నిర్ణయాలకు అధ్యక్షుడు వ్యతిరేకించడంతో సంఘం సభ్యులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. -
జైట్లీ మృతికి బీసీసీఐ ప్రగాఢ సంతాపం
న్యూఢిల్లీ: క్రికెట్ పాలకుడిగా తనదైన ముద్ర వేసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా, సుదీర్ఘ కాలం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా పనిచేసిన జైట్లీని సమర్ధుడైన పాలకుడిగా కొనియాడింది. జైట్లీ మృతి తనకు, దేశానికి తీరని లోటని బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా అన్నారు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో పలువురు స్థానిక క్రికెటర్లు దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎదిగారు. వారిలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, సెహ్వాగ్, టీమిండియా ప్రస్తుత ఆటగాళ్లైన కెప్టెన్ కోహ్లి, ధావన్, ఇషాంత్ శర్మ తదితరులున్నారు. జెట్లీ తనకు పితృ సమానుడని గంభీర్ అభివర్ణించాడు. జైట్లీ మృతి కలచి వేసిందని దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. జైట్లీ మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు విండీస్‌తో టెస్టులో నల్ల బ్యాడ్జీలు ధరించారు. -
జైట్లీ మరణం.. గంభీర్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఆగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని విచారం వ్యక్తం చేస్తోంది. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ పలువురు రాజీకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే బీసీసీఐతో పాటు టీమిండియా తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ జైట్లీ మరణంపై భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘నాన్న నీకు మాట్లాడాలని చెప్తారు. నాన్నలాంటి వారు నిన్ను అందరి ముందు ప్రసంగించాలని సూచిస్తారు. తండ్రి నీకు నడక నేర్పిస్తారు. తండ్రిలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. నాన్న నీకు పేరు పెడతాడు. నాన్న సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా తండ్రి సమానుడైన అరుణ్ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది’ అంటూ భావోద్వేగ సందేశాన్ని గంభీర్ ట్విటర్లో పోస్ట్ చేశారు. (చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!) ‘అరుణ్ జైట్లీ గారు మరణించారన్న వార్త విని షాకయ్యాను. ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనది. నా లాంటి ఎంతో మంది ఆటగాళ్లను ప్రోత్సహించేవారు. 2006లో నా తండ్రి చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఓదార్చారు. నాలో ధైర్యాన్ని నింపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’అంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లి ట్వీట్ చేశాడు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వీరేంద్ర సెహ్వాగ్, గంభీర్, ధావన్, కోహ్లి వంటి ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించే జైట్లీ వారికి సరైన అవకాశాలు ఇచ్చేందుకు పాటు పడేవారు. అంతేకాకుండా ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి తగిన కృషి చేశారు. చదవండి: అపర చాణక్యుడు.. ట్రబుల్ షూటర్! అరుణ్ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం -
అరుణ్ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ అగ్రనేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(66) మరణం పట్ల యావత్ భారతావని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తోంది. న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా జైట్లీ దేశానికి అందించిన సేవలను రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఆయన సుదీర్ఘ కాలం(1999-2013) ఢిల్లీ క్రికెట్‌కు సేవలందించారు. అంతేకాకుండా బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఈ సమయంలోనే జైట్లీకి క్రికెట్‌తో ఎనలేని బంధం ఏర్పడింది. బీసీసీఐతో ఉన్న సత్ససంబంధాలతో ప్రతిభ ఉన్న ఢిల్లీ ఆటగాళ్లను టీమిండియా తరుపున ఆడించే ప్రయత్నం చేశారు. ప్రతిభావంతులైన క్రికెటర్లను ప్రొత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే వారు. ఇక ఢిల్లీ క్రికెట్ అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆటగాళ్లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో తీవ్ర కృషి చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఆటగాళ్లు టీమిండియా తరుపున ఆడుతున్నారంటే అది జైట్లీ చలవే అని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆరుణ్ జైట్లీతో తమకున్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జైట్లీ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ‘అరుణ్ జైట్లీ మరణం వ్యక్తిగతంగా నన్ను ఎంతో బాధించింది. ఆయనతో నాకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఎప్పుడు కలిసినా ప్రేమగా పలకరించేవారు. ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే నాతో సహా ఎంతో మంది ఢిల్లీ ఆటగాళ్లు దేశానికి ఆడారు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో, ఆటగాళ్ల సమస్యలను పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుండే వారు. ఆయన కుటుంబానికి, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’ అంటూ ట్వీట్ చేశారు. వీరేంద్ర సెహ్వాగ్‌తో పాటు గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, సురేష్ రైనా, హర్ష బోగ్లే, తదితర ఆటగాళ్లు అరుణ్ జైట్లీ మరణానికి ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. చదవండి: అరుణ్ జైట్లీ అస్తమయం అరుదైన ఫోటో ట్వీట్ చేసిన కపిల్ సిబల్ -
ఆ క్రికెటర్‌పై జీవితకాల నిషేధం
న్యూఢిల్లీ: ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారీపై దాడికి పాల్పడిన అండర్-23 క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాలం నిషేధం విధించారు. ఈ మేరకు ఆ క్రికెటర్‌ను జీవితకాలం ఏ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ స్పష్టం చేసింది. ‘ అమిత్ భండారీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన యువ క్రికెటర్ అనూజ్ దేడాపై జీవితకాల నిషేధం విధిస్తున్నాం. ఇక్కడ అనూజ్ దేడాపై న్యాయపరమైన చర్యలను పక్కకు పెడితే, అతను ఇక నుంచి ఏ క్రికెట్ ఆడకుండా జీవితకాలం నిషేధం విధిస్తూ చర్యలు తీసుకున్నాం’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ తెలిపారు. భారత క్రికెట్ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్ కమిటీ చైర్మన్ అమిత్ భండారిపై సోమవారం అనూజ్ బృందం గుంపుతో కలిసి దాడికి దిగింది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీ కోసం స్థానిక సెయింట్ స్టీఫెన్స్ మైదానంలో సాగుతున్న ఢిల్లీ సీనియర్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ సెషన్‌ను భండారి పరిశీలిస్తుండగా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో దాడికి తెగబడింది. వీరిలో ఒకడు తుపాకీతో బెదిరించాడు. దీంతో భండారి పారిపోయేందుకు యత్నించినా వెంటాడి మరీ కొట్టడంతో తీవ్ర అలజడి రేగింది. -
ఐరన్ రాడ్లతో భారత మాజీ క్రికెటర్‌పై దాడి
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ, ఢిల్లీ డిస్ట్రిక్స్ అసోసియేషన్(డీడీసీఏ) సెలక్షన్ కమిటీ చీఫ్ అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. డీడీసీఏ అండర్-23 సెలక్షన్ జరుగుతున్న సమయంలో ఈ దాడి జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యూఢిల్లీలోని స్టీఫెన్స్ గ్రౌండ్ వద్ద ఉన్న కశ్మేరా గేట్ ఏరియాలో దాడి జరిగినట్లు సహ సెలక్టర్ సుఖ్విందర్ సింగ్ తెలిపారు. అతనిపై ఐరన్ రాడ్లు, హాకీ స్టిక్‌లతో కొన్ని అల్లరి మూకలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో భండారీ తలకు, చెవికి తీవ్ర గాయాలైన భండారీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీ అండర్-23 టీమ్ మేనేజర్ శంకర్ సైనీ కథనం ప్రకారం.. ‘టీమ్ ట్రయల్స్‌ని సెలక్టర్లతో కలిసి అమిత్ భండారీ పరిశీలిస్తుండగా.. నేను భోజనం కోసం అక్కడే ఏర్పాటు చేసిన టెంట్‌లోకి వెళ్లాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి భండారీతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ.. నిమిషాల వ్యవధిలోనే అనూహ్యాంగా సుమారు పదిహేను మంది హాకీ స్టిక్స్, రాడ్స్, సైకిల్ చైన్లతో వచ్చి భండారీపై దాడికి దిగారు. దీంతో.. అక్కడ ట్రయల్స్ కోసం వచ్చిన యువ క్రికెటర్లు ఆ మూకని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. అప్పటికే భండారీని తీవ్రంగా గాయపడ్డాడు’ అని సైనీ తెలిపారు. ఈ దాడి ఎవరు చేసారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. -
సెహ్వాగ్, గంభీర్ కొత్త ఇన్నింగ్స్
న్యూఢిల్లీ: టీమిండియా హిట్ ఓపెనింగ్ జోడీల్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడీ ఒకటి. ఈ ఇద్దరూ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. తాజాగా వీరిద్దరూ కలిసి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనునన్నారు. అయితే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ మైదానం బయట కావడం విశేషం. డీడీసీఏ క్రికెట్ కమిటీలో తాజాగా ఈ ఇద్దరికీ చోటు కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పటికే ఈ క్రికెట్ కమిటీలో మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, రాహుల్ సంఘ్వితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఢిల్లీ క్రికెట్లో కోచ్‌లు, సెలక్టర్ల ఎంపిక, ఇతర అంశాలను ఈ క్రికెట్ కమిటీ చూసుకుంటుంది. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే ఈ క్రికెట్ కమిటీ నియామకాలు జరిపినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. అయితే, గంభీర్, సెహ్వాగ్ విషయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది. గంభీర్ ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటి వ్యక్తి సెలక్టర్లను ఎలా నియమిస్తాడు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు గంభీర్ ఇప్పటికే డీడీసీఏలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు. ఈ క్రికెట్ కమిటీలో గంభీర్‌కు ఓ ముఖ్యమైన పదవి కట్టబెట్టనున్నారు. డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
‘గంభీర్‌కు మళ్లీ కీలక బాధ్యతలు’
న్యూఢిల్లీ: భారత వెటరన్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో మళ్లీ కీలకం కానున్నాడు. శుక్రవారం ఢిల్లీ క్రికెట్ సంఘానికి ఎన్నికలు నిర్వహించగా రజత్ శర్మ నేతృత్వంలోని ప్యానెల్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా కార్యదర్శిగా ఎన్నికైన వినోద్ తిహారా మాట్లాడుతూ.. ఇకపై గంభీర్ డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉంటాడని, క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నింట్లోనూ అతడి పాత్ర ఉంటుందని చెప్పాడు. ‘క్రికెట్ సంబంధిత నిర్ణయాలన్నీ గంభీరే తీసుకుంటాడు. ఢిల్లీ క్రికెట్లో గంభీర్‌ది పెద్ద పేరు. దాంతో డీడీసీఏలో గంభీర్ మేజర్ రోల్ పోషిస్తాడు’ అని తిహారా చెప్పారు. గతేడాది డీడీసీఏ మేనేజింగ్ కమిటీలో గంభీర్‌ను ప్రభుత్వ నామినీగా నియమించారు. అయితే గంభీర్ ఇంకా క్రికెట్ ఆడుతూ ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాల్లో భాగంగా అతనికి కీలక బాధతలు అప్పచెప్పడానికి అర్హత లేదని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పరిపాలన కమిటీ సభ్యుడు జస్టిస్ విక్రమ్‌జిత్ సేన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, తాజాగా మరొకసారి గంభీర్ పేరును తెరపైకి తేవడాన్ని రజత్ శర్మ ప్యానల్ సమర్ధించుకుంది. మరొకసారి గంభీర్ విషయంలో ఎటువంటి వివాదాలు చెలరేగకుండా ఉండేలా చూసుకుంటామని తిహారా తెలిపారు. ఈ మేరకు తమకు కొన్ని ప్రణాళికలున్నాయని ఆయన స్పష్టం చేశారు. క్రికెట్ విధాన నిర్ణయాల్లో గంభీర్ కీలకంగా వ్యవహరిస్తాడన్నారు. ఇందుకు క్రికెట్ అఫైర్స్ పేరుతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. -
అరుణ్ జైట్లీ క్షమిస్తారా..?
న్యూఢిల్లీ : పంజాబ్ నేత బిక్రం సింగ్‌తో మొదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. కేజ్రీవాల్‌పై ముప్పైకి పైగా పరువు నష్టం దావా కేసులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా పలు బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కేజ్రీవాల్ క్షమాపణలు చెబుతూ లేఖలు రాయడంలో బిజీగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరికి కూడా క్షమాపణలు చెప్పారు. నేడో, రేపో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కూడా కేజ్రీ లేఖ అందనుంది. కానీ ఈ విషయంపై అరుణ్ జైట్లీ ఎలా స్పందిస్తారో అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పరువు నష్టం కేసు.. 13ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జైట్లీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేజ్రీతో సహా పలువురు ఆప్ నేతలు ఆయనపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో జైట్లీ వారిపై పరువు నష్టం దావా కేసు వేశారు. ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలు చేసిన జైట్లీ పరువు నష్టం కింద రూ. 10 కోట్లు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పుడు ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ క్షమాపణలు తెలిపారు. అంత తేలిగ్గా వదలరు.. ఈ విషయాన్ని జైట్లీ అంత తేలికగా వదిలిపెట్టరని, ఆప్ కన్వీనర్‌ను క్షమించే అవకాశం లేదని జైట్లీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీతో పాటు.. తనపై ఆరోపణలు చేసిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ బాజ్‌పేయిలు కూడా క్షమాపణలు చెబితే జైట్లీ ఈ విషయం గురించి పునరాలోచిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కెప్టెన్‌గా రిషబ్ పంత్‌కు ఉద్వాసన..!
న్యూఢిల్లీ:ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)లో నెలకొన్న అంతర్గత రాజకీయాల కారణంగా రిషబ్ పంత్‌ను ఢిల్లీ కెప్టెన్సీ పదవి నుంచి తొలగించారు. అదే సమయంలో చాలాకాలంగా ఢిల్లీకి జట్టులో చోటు కోల్పోయిన లెఫ్టార్మ్ స్సిన్నర్ ప్రదీప్ సాంగ్వాన్‌ను రిషబ్ పంత్ స్థానంలో సారథిగా ఎంపిక చేస్తూ డీడీసీఏ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. 2016లో ఢిల్లీ తరపున చివరిసారి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడిన సాంగ్వాన్‌కు ఒక్కసారిగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు. ఓవరాల్‌గా చూస్తే 2017 ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ తరపున సాంగ్వాన్ చివరిసారి కనిపించాడు. నిషేధిత ఉత్ర్పేరకం వాడి పాజిటివ్‌గా తేలిన తొలి క్రికెటర్‌గానూ సాంగ్వాన్ నిలవడం గమనార్హం. అయితే రిషబ్ పంత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడం, ఆపై సాంగ్వాన్‌కు ఆ బాధ్యతలను అప్పగించడాన్ని ఢిల్లీ సెలక్టర్ల చైర్మన్ అతుల్ వాసన్ సమర్దించుకున్నాడు. 'రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఇబ్బంది పడుతున్న కారణంగానే ఆ భారాన్ని తగ్గించేందుకు అతని కెప్టెన్సీకి ఉద్వాసన పలికాం. అదే సమయంలో సీనియర్ ఆటగాడైన సాంగ్వాన్‌ను సారథిగా ఎంపిక చేశాం. కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి సాంగ్వాన్‌కు అన్ని అర్హతలున్నాయి' అని అతుల్ హసన్ తెలిపారు. మరొకవైపు సీనియర్ ఆటగాళ్లైన ఉన్కుక్త్ చంద్, మనన్ శర్మ, మిలింద్ కుమార్ల సైతం జట్టు నుంచి తప్పించారు. -
సెహ్వాగ్ ఒకే.. యువ సంచలనాన్ని ఎలా మరిచారు?
సాక్షి, స్పోర్ట్స్ : భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఇక్కడ జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌కు టీమిండియా క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ద్వారం స్వాగతం పలకనుంది. ఇక్కడి ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలోని రెండో గేట్‌కు మాజీ డాషింగ్ ఓపెనర్ వీరూ పేరు పెట్టిన విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే డీడీసీఏ చేసిన పెద్ద తప్పిదంపై నెటిజన్లు మండిపడుతున్నారు. సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో చాలా రికార్డులు సాధించాడంటూ కొన్ని ఘనతలపై ఏర్పాడు చేసిన బోర్డులో డీడీసీఏ పెద్ద తప్పిదం చేసింది. 'భారత్ తరఫున అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యామ్స్ మెన్ సెహ్వాగ్' అంటూ రాశారు. కానీ కరుణ్ నాయర్ ను డీడీసీఏ మరిచిపోవడం దుమారం రేపింది. భారత్ నుంచి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించింది ఇద్దరు క్రికెటర్లు కాగా, తొలి ఆటగాడు సెహ్వాగ్, రెండో ఆటగాడు కరుణ్ నాయర్ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అందులోనూ ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ కూడా ఐపీఎల్ లో ఢిల్లీ (ఢిల్లీ డేర్ డెవిల్స్) జట్టుకే ప్రాతినిధ్యం వహించినా అతడ్ని డీడీసీఏ ఎలా మరిచిపోతుందంటూ ప్రశ్నిస్తున్నారు. టెస్టుల్లో రెండు సార్లు సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీలు సాధించాడు. యువ సంచలనం కరుణ్ నాయర్ 2016లో చెన్నైలోని చిదంబరం స్డేడియంలో ఇంగ్లండ్ జట్టుతో ఆడిన టెస్టులో 303 పరుగులు చేసిన విషయాన్ని యావత్ భారత దేశ క్రికెట్ ప్రేమికులు గుర్తించుకోగా.. డీడీసీఏకు మాత్రం ఈ విషయం లెక్కలోకి రాదా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చురకలంటించారు. DDCA honours @virendersehwag , forgets @karun126’s triple hundred. On Gate No 2, “ only Indian to score 300 in Tests”. New board maybe pic.twitter.com/jrFlTLguUM — Sahil Malhotra (@Sahil_Malhotra1) 31 October 2017 -
కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోవాలి
ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ: ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణను ఎదుర్కోనున్నారు. ఆయనతో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలు అశుతోష్ కుమార్, విశ్వాస్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, దీపక్ బాజ్‌పాయ్‌లు కూడా విచారణను ఎదుర్కోనున్నారు. ఈ కేసును శనివారం చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమిత్ దాస్ విచారించారు. విచారణకు జైట్లీ హాజరుకాకపోవడంపై కోర్టులో పలువురు న్యాయవ్యాదులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో తమకు ముప్పు ఉందని నిందితులు పేర్కొనడంతో... కేసుకు సంబంధించినవారు మినహా మిగిలిన వారందరినీ బయటకు పంపేయాలని భద్రతా సిబ్బందిని జడ్జి ఆదేశించారు. అనంతరం, తాము ఏ తప్పు చేయలేదని, విచారణకు సిద్ధమని నిందితులు పేర్కొన్నారు. దీంతో ఐపీసీ సెక్షన్ 500 కింద కేజ్రీవాల్, ఇతర నిందితులకు నోటీసులు జారీ చేస్తూ జడ్జి తదుపరి విచారణను మే 20కి వాయిదా వేశారు. డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో అరుణ్‌జైట్లీ అక్రమాలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. -
గంభీర్-కోచ్‌ల వివాదంపై కమిటీ
ఢిల్లీ: ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీ సందర్భంగా ఢిల్లీ ఓపెనర్ గౌతం గంభీర్, కోచ్ క్రిష్ణన్ భాస్కరన్ పిళ్లై మధ్య చోటు చేసుకున్న వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఢిల్లీ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీసీ) ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీలో రాజేందర్ ఎస్ రాథోడ్, సోనీ సింగ్‌లు మిగిలిన ఇద్దరు సభ్యులు. విజయ్ హజారే వన్డే ట్రోఫీలో ఢిల్లీ పోరాటం ముగిసిన తరువాత తనను గంభీర్ తీవ్రంగా దూషించినట్లు బాస్కరన్ అనేకసార్లు మీడియా ముందు వాపోయాడు. తనను అసభ్య పదజాలంతో దూషిస్తూ గంభీర్ అగౌరపరిచాడని భాస్కరన్ తెలిపాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీడీసీఏ.. ఆ ఘటనపై విచారణకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ డీడీసీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ విక్రమ్ జిత్ సేన్ తాజాగా ఒక సర్క్యులర్ ను జారీ చేశారు. -
అలాంటి తప్పుడు ప్రకటనలు వారికి అలవాటే
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సస్పెండ్‌కు గురైన బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్‌లకు తప్పుడు ప్రకటనలు చేయడం, ఎదుటివారికి మచ్చతెచ్చేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారిందని ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) హైకోర్టుకు వెల్లడించింది. ఈ కేసును విచారిస్తున్న జాయింట్ రిజిస్ట్రార్ ఏకే సిసోడియా ముందు కొన్ని పత్రాలను కూడా బుధవారం సమర్పించింది. తమ వ్యవహారాల్లో తలదూర్చి పనితీరును, ఆర్థిక వ్యవహారాలను తప్పుబడుతూ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ ప్రకటనలు చేశారని డీడీసీఏ పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలు ఖండించకపోగా తాను చేసిన ఆరోపణలు వాస్తవాలు అంటూ కేజ్రీవాల్ సమర్థించుకున్నారు. ఆజాద్ కూడా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఈ నేపథ్యంలో కౌంటర్ కోరగా మీడియా ముందుకు ఎప్పుడు వెళ్లినా పక్కవారి గౌరవానికి భంగం కలిగేలా కేజ్రీవాల్, ఆజాద్ మాట్లాడతారని అది వారిద్దరికి అలవాటుగా మారిందని డీడీసీఏ బుధవారం ఆరోపించింది. -
నేనేమీ ఆయన పరువు తీయలేదు
ప్రజలు అనుకుంటున్న విషయాలే చెప్పను న్యూఢిల్లీ: ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అవకతవకల కేసులో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పరువుకు భంగం కలిగించేలా తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని హస్తిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టుకు తెలిపారు. జైట్లీ గురించి బహిరంగంగా ప్రజలు చెప్పుకొంటున్న విషయాలనే తాను చెప్పానని, అంతేకానీ ఆయనకు వ్యతిరేకంగా తన సొంతమాటలు ఏవీ చెప్పలేదని ఆయన వివరణ ఇచ్చారు. జైట్లీ తనపై, ఆప్ నాయకులపై దాఖలుచేసిన పరువునష్టం దావాలో ఈ మేరకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది మంగళవారం కోర్టుకు తెలియజేశారు. జైట్లీ పరువునష్టం కేసులో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టు అభియోగాలు ఖరారుచేసింది. ('లక్ష ఓట్లతో ఓడిపోయావు.. నీకేం పరువుంది?') డీడీసీఏ అధ్యక్షుడిగా ఉన్నకాలంలో అక్రమాలు జరిగినట్టు వెలుగుచూడటంతో ఆ అవకతవకలతో జైట్లీకి సంబంధం ఉందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో జైట్లీ కేజ్రీవాల్, ఆప్ నేతలు రాఘవ్ చద్దా, కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, దీపక్ వాజపేయి తదితరులపై వ్యక్తిగత హోదాలో రూ. 10 కోట్ల పరువునష్టం దావా వేశారు.