Degree Course
-
సర్వర్లు డౌన్.. ప్రవేశాలకు ఆటంకం!
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ప్రస్తుతం వివిధ కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు జరుగుతున్నాయి. వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. అలాగే ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే తరచూ సర్వర్లు మొరాయిస్తుండటంతో సమయానికి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందడం లేదు. ఇంజనీరింగ్ ప్రవేశాలకు ఈ నెల 7, డిగ్రీ ప్రవేశాలకు 10వరకు మాత్రమే గడువు ఉంది. సర్వర్ల మొరాయింపుతో సకాలంలో సర్టిఫికెట్లు అందక విద్యార్థులు హైరానా పడుతున్నారు. సమయానికి ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోగలమా, లేదా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. ఆయా ధ్రువపత్రాలు అప్లోడ్ చేస్తే గానీ విద్యార్థులకు రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటివి అందే అవకాశం లేదు. సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలువిద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరి. దీంతో వాటికోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇటీవల సచివాలయ సిబ్బందితో పింఛన్లను పంపిణీ చేయించడంతో ఈ నెల ఒకటి, రెండు తేదీల్లో సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో లేరు. మరికొన్నిచోట్ల సచివాలయాలను వేరొక చోటకి మార్చారు. కొత్తగా వీటిని ఎక్కడ పెట్టారో తెలియక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు తప్పనిసరిగా నోటరీ చేయించాలంటున్నారు. పాత సర్టిఫికెట్లను రెన్యువల్ చేయడానికి మళ్లీ నోటరీ ఎందుకు అని ప్రశ్నిస్తే నోటరీ చేయిస్తేనే దరఖాస్తులు ముందుకు కదులుతాయని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు నోటరీ చేయించాల్సి వస్తోంది.నోటరీకి సుమారు రూ.200 వసూలు చేస్తుండడం పేద విద్యార్థులకు భారంగా పరిణవిుంచింది. దీంతో పాటు పాత ధ్రువపత్రాలు, రేషన్ కార్డులు, కుటుంబంలోని అందరు సభ్యుల ఆధార్ కార్డుల జిరాక్సులకు మరికొంత వెచ్చించాల్సి రావడం ఆర్థికంగా ఇబ్బందవుతోంది. ఇవన్నీ సచివాలయ సిబ్బందికి సమర్పించడానికి విద్యార్థులు ఒకటికి రెండుసార్లు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీలో ఆలస్యంఎలాగోలా సచివాలయ సిబ్బంది కోరిన పత్రాలన్నీ సమర్పించి వారి నుంచి పత్రాలను తీసుకువెళ్లి తహసీల్దారు కార్యాలయంలో సమర్పిస్తే అక్కడ ఆర్ఐ, తహసీల్దారు సంతకాలకు ఆలస్యమవుతోంది. వారు ఇతర పనులతో బిజీగా ఉండడంతో రాత్రికి గానీ కార్యాలయాలకు చేరుకోవడం లేదు. ఆ తర్వాత ఇతర పనులపై దృష్టి సారించి విద్యార్థుల ధ్రువపత్రాలపై చివరలో సంతకాలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆన్లైన్ చేయడానికి సర్వర్ల మొరాయింపుతో మరింత ఆలస్యమవుతుంది. దీంతో విద్యార్థులకు ఇబ్బంది తప్పడం లేదు.వలంటీర్లతో ఇంటి వద్దే అందించిన గత ప్రభుత్వంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే వలంటీర్ల ద్వారా విద్యార్థుల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించింది. ఆయా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వలంటీర్లు ఇంటింటికీ తిరిగి ఎవరికి ఏ సర్టిఫికెట్లు కావాలో అడిగి తెలుసుకుని వారే ఇంటి వద్దే ఆన్లైన్ చేశారు. కావాల్సిన సర్టిఫికెట్లను అప్లోడ్ చేసి సర్టిఫికెట్లు వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పైగా ఈ డ్రైవ్‌ల్లో సర్టిఫికెట్లకు దరఖాస్తులు చేసుకున్నవారికి ఎటువంటి రుసుం తీసుకోకుండా వాటిని అందజేసింది. ప్రస్తుతం వలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం దూరం పెట్టడంతో ధ్రువపత్రాలు పొందడం విద్యార్థులకు కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువు ముంచుకొస్తుండటంతో తమకు సకాలంలో సర్టిఫికెట్లు అందేలా చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. -
నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్ట్స్, సైన్స్, సోషల్‌సైన్సెస్, కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్‌వర్క్, ఆనర్స్ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది.ఈ మేరకు జూలై 2వ (నేడు) నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. 5న కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన, 11 నుంచి 15 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించింది. 19న తుది సీట్ల కేటాయింపు పూర్తిచేయనుంది. సీట్లు పొందిన విద్యార్థులు 20 నుంచి 22లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు (దివ్యాంగులు, ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) సర్టిఫికెట్లను 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనుంది.ఈ విద్యార్థులు విజయవాడలోని ఎస్ఆర్ఆర్, విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణ కళాశాల, తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాలి. ఉన్నత విద్యామండలి ఓఏఎండీసీ (https://cets.apsche.ap.gov.in/ APSCHE/OAMDC23/OAMDCHome.html) పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. -
నేడు ‘దోస్త్’ తొలి దశ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ‘దోస్త్’ ద్వారా దరఖాస్తు చేసిన విద్యార్థులకు గురువారం తొలి దశ సీట్లు కేటాయిస్తారు. సాయంత్రం 3గంటలకు విద్యా ర్థులు ఏ కాలేజీలో, ఏ కోర్సులో సీటు వచ్చిందో ఆన్లైన్ ద్వారా చూసుకోవచ్చని ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. దోస్త్‌లో ఇప్పటివరకూ 1.03 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో 85 వేల మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. -
డిగ్రీ చదివినా తక్షణ ఉపాధి!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మార్పులొస్తున్నాయి. విదేశీ అధ్యయనాల మేరకు బోధన ప్రణాళికలు రూపొందుతున్నాయి. పారిశ్రామిక అవసరాలే గీటురాయిగా డిగ్రీలో నైపుణ్యాన్ని మేళవిస్తున్నారు. మూడేళ్ళ స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులు వస్తున్నాయి. డిగ్రీ చేసినా ఉపాధి ఖాయమనే భరోసా కల్పిస్తున్నాయి. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆనర్స్ డిగ్రీ కోర్సులను నాలుగేళ్ళతో పరిమితంగా ప్రవేశపెట్టారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ విధంగా ప్రవేశపెడుతున్న అనేక మార్పుల పురోగతిని కేంద్ర విద్యాశాఖ ఇటీవల సమీక్షించింది. మరోవైపు కాంబినేషన్ కోర్సులు, తక్షణ ఉపాధి అవకాశాలున్న స్కిల్ అనుసంధాన కోర్సులకు డిమాండ్ పెరుగుతోందని యూజీసీ తన నివేదికలో పేర్కొంది. ఇక మీదట సాధారణ డిగ్రీ కోర్సుల స్థానంలో సాంకేతికత తోడైన డిగ్రీ కోర్సులు ప్రాచుర్యం పొందుతాయని తెలిపింది. కంప్యూటర్స్, డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర కోర్సుల మేళవింపుతో కొత్త డిగ్రీ కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఆర్ట్స్‌తో కంప్యూటర్ పరిజ్ఞానం, సైన్స్‌తో సామాజిక అవగాహన కోర్సులు కలగలిపి రాబోతున్నాయి. జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఈ తరహా బోధన ప్రణాళికను యూజీసీ ఇప్పటికే సిద్ధం చేసింది. దీనికి అనుగుణంగానే దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో క్రెడిట్స్ విధానం అమలులోకి రాబోతోంది. యూజీసీ కొత్త ప్రణాళికలను అన్ని రాష్ట్రాలూ ఆమోదించాయి. క్రెడిట్ విధానం బెస్ట్ డిగ్రీ పట్టాలు ఇక క్రెడిట్స్ ఆధారంగా ఉండనున్నాయి. ఒక్కో స్థాయికి కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. విద్యార్థులు మూడేళ్లలో 120 క్రెడిట్లు పూర్తి చేస్తేనే అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) డిగ్రీకి అర్హులవుతారు. అదే విద్యార్థి నాలుగేళ్లలో 160 క్రెడిట్ల ను పూర్తి చేస్తేనే యూజీ ఆనర్స్ డిగ్రీ పట్టా లభిస్తుంది. అలా గే ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో చేరేవారు రీసెర్చ్ కోసం వెళ్లాలనుకుంటే తమ నాలుగేళ్ల కోర్సులోనే రీసెర్చ్ ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మూడేళ్ల డిగ్రీ కోర్సులు చే స్తున్నవారు కూడా నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులకు మారేందుకు కొత్త కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అవకా శం కల్పిస్తుంది. ఇప్పటికే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (సీబీసీఎస్) ప్రకారం మూడేళ్ల యూజీ కోర్సుల్లో పేర్లు నమోదు చేసు కు న్న, అభ్యసిస్తున్న విద్యార్థులు కూడా నా లుగేళ్ల యూజీ ఆనర్స్ కొనసాగించడానికి అర్హులని కొత్త నిబంధనల్లో పేర్కొన్నారు. ఆనర్స్ వైపు ఆకర్షణ తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ ఆనర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూజీసీ రూపొందించింది. తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (ఆనర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెచ్చారు. ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు ఆనర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అక్కౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, ఆనర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. ఇక బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్లల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. నైపుణ్యం వెలికితీసేలా మూల్యాంకనం విద్యార్థిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసే మూల్యాంకన విధానం అందుబాటులోకి రాబోతోంది. దీనిపై ఇప్పటికే అధ్యయనం పూర్తయింది. డిగ్రీ కోర్సులు ఇక మీదట పూర్తి నైపుణ్యంతో అందించాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ముందుకు తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. ఇప్పటికే ఈ ప్రయోగం మొదలైంది. భవిష్యత్‌లో దీని వేగం పెరుగుతుంది. ఇక మీదట డిగ్రీ కోర్సు చేసినా మంచి ఉపాధి పొందుతారనే విశ్వాసం విద్యార్థుల్లో వస్తుంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
యూజీ ఆనర్స్.. ఇక జాబ్ ఈజీ
గుణదల(విజయవాడ తూర్పు): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానంలో భాగంగా యూజీ ఆనర్స్ (నాలుగేళ్ల డిగ్రీ) కోర్సుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు దేశ, విదేశాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రూపొందించిన యూజీ ఆనర్స్ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టేందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు సిద్ధమయ్యాయి. దీనిలో భాగంగా ఉన్న త విద్యా మండలి మార్గదర్శకాల ప్రకారం యూజీ ఆనర్స్ కోర్సుపై ఈ నెల మొదటి వారం నుంచే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు పెద్ద ఎత్తున విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి. నాలుగేళ్ల డిగ్రీ వల్ల కలిగే ప్రయోజనాలను విద్యావేత్తలు, మేధావులు వివరిస్తున్నారు. దేశంలో ఎక్కడైనా ఉన్నత విద్య అభ్యసించవచ్చని, విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు సులభంగా లభిస్తాయని చెబుతున్నారు. దీంతో యూజీ ఆనర్స్‌పై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతోంది. కోర్సులు ఇలా... బీఏ ఆనర్స్ : హిస్టరీ, టూరిజం మేనేజ్మెంట్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, స్పెషల్ ఇంగ్లిష్, స్పెషల్ తెలుగు ఒక మేజర్ సబ్జెక్ట్‌గా ఉంటాయి. ఈ కోర్సులోనే మైనర్ సబ్జెక్టులుగా సోషియాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ ఉంటాయి. బీఎస్సీ ఆనర్స్: కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్, నానో టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, మాథమేటిక్స్, స్టాటిస్టిక్స్, బోటనీ, హారి్టక ల్చర్, జువాలజీ, అగ్రికల్చర్, మైక్రో బయాలజీ, బయోకెమిస్ట్రీ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. మైనర్ సబ్జెక్టులుగా ఫుడ్ టెక్నాలజీతోపాటు ఎంపిక చేసుకున్న కోర్సుకు ఆధారంగా మరికొన్ని సబ్జెక్టులు ఉంటాయి. బి.కాం ఆనర్స్: బి.కాం జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్, బీబీఏ జనరల్, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఫైనాన్సియల్ సరీ్వసెస్, అకౌంట్స్ అండ్ టాక్సెస్ మేజర్ సబ్జెక్టులుగా ఉంటాయి. యూజీ ఆనర్స్ మొదటి ఏడాది పూర్తి చేస్తే సర్టిఫికెట్ ఇస్తారు. రెండో ఏడాది పూర్తి చేసిన వారికి డిప్లొమా వస్తుంది. మూడేళ్లు పూర్తి చేస్తే డిగ్రీ, నాలుగో ఏడాది ఉత్తీర్ణులైతే ఆనర్స్ పట్టా పొందుతారు. నాలుగేళ్లు ఆనర్స్ పూర్తి చేసిన తర్వాత పీజీ ఏడాది చదివితే నేరుగా పీహెచ్డీ చేసే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ, ఉన్నత విద్యా అవకాశాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ విద్యా విధానం విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉద్యోగాలు పొందేందుకు అవకాశాలు లభిస్తాయి. యువత ఉన్నత భవిష్యత్తుకు నూతన కోర్సులు బంగారు బాటలు వేస్తాయి. – డాక్టర్ భాగ్యలక్ష్మి, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్, విజయవాడ -
డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. ఐటీ కంపెనీల క్యూ...
సాక్షి, హైదరాబాద్: డిగ్రీనా... అనే చులకన భావం ఇక నుంచి ఉండదంతే. దేశవ్యాప్తంగా డిగ్రీ కోర్సులకు భవిష్యత్‌లో డిమాండ్ పెరగబోతోంది. ఇంతకాలం కొనసాగిన సంప్రదాయ కోర్సుల్లో అనేక మార్పులు తెస్తున్నారు. సాంకేతిక విద్యకు తీసిపోని రీతిలో సాన పడుతున్నారు. దేశ, విదేశాల్లో ఉపాధి అవకాశాలుండేలా తీర్చి దిద్దుతున్నారు. అనేక కొత్త కోర్సుల మేళవింపు, కంప్యూటర్ అప్లికేషన్ల గుభాళింపు డిగ్రీ కోర్సుల తీరు తెన్నులనే మార్చబోతోంది. హానర్స్ కోర్సులకు ప్రాధాన్యం తెలంగాణ సహా దేశంలో అన్ని రాష్ట్రాలూ మూడేళ్ళ డిగ్రీ కోర్సుల స్థానంలో నాలుగేళ్ళ హానర్స్ కోర్సులకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందుకు అవసరమైన మార్గదర్శకాలను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రూపొందించింది. ఈ ఏడాది నుంచే తెలంగాణలో నాలుగేళ్ళ బీఎస్సీ (హానర్స్) కంప్యూటర్స్‌ను 50కి పైగా కాలేజీల్లో అందుబాటులోకి తెస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి అతి ముఖ్యమైన అంశాలు హానర్స్‌లో చోటు చేసుకోబోతున్నాయి. నూతన జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఎగ్జిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. నాలుగేళ్ళు చదివితే హానర్స్ డిగ్రీ ఇస్తారు. మూడేళ్ళకే మానుకుంటే సాధారణ డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు. దీంతో పాటు ఏ తరహా డిగ్రీ చేసినా, ఇష్టమైన ఓ సబ్జెక్టును చేసే సరికొత్త విధానం అందుబాటులోకి తెచ్చారు. అంటే బీఏ కోర్సు చేస్తున్న విద్యార్థి కూడా కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ఓ సబ్జెక్టు చేసే వీలుంది. వాణిజ్య విప్లవంలో డిగ్రీకి ప్రాధాన్యత గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ–కామర్స్ రాజ్యమేలుతోంది. దీంతో కామర్స్ డిగ్రీ నేపథ్యం ఉన్న వారికి మంచి డిమాండ్ వచ్చింది. కంప్యూటర్స్ పరిజ్ఞానంతో కూడిన అనలిస్టులు, అకౌంటెంట్లకు మంచి వేతనాలతో కూడిన ఉపాధి లభిస్తోంది. ఈ కారణంగా డిగ్రీ కోర్సుల్లో కామర్స్‌ను ఎంచుకునే వారి సంఖ్య 36 శాతం నుంచి 41 శాతానికి పెరిగింది. బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)లో చేరికలు కూడా ఆరేళ్ళల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ)లో ప్రవేశాలు 9 రెట్లు పెరిగాయి. దీంతో బీకాం కోర్సులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. బీకాం జనరల్‌తో పాటు, కంప్యూటర్స్, టాక్సేషన్, హానర్స్, బిజినెస్ అనలిటిక్స్ వంటి కొత్త స్పెషలైజేషన్‌ను తీసుకొచ్చారు. బీమా, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెరగడం, జీఎస్టీ తీసుకురావడంతో టాక్స్ నిపుణుల అవసరం రెట్టింపయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఈ–కామర్స్, రిటైల్ సంస్థల పెరుగుదల కూడా కలిసివచ్చింది. పెరుగుతున్న క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కేవలం ఇంజనీరింగ్ కాలేజీలకు వెళ్ళే ఐటీ కంపెనీలు ఇప్పుడు నాణ్యమైన విద్యను అందించే డిగ్రీ కాలేజీల్లోనూ నియామకాలు చేపడుతున్నాయి. నాన్–ఇంజనీరింగ్‌గా పిలిచే డిగ్రీ విద్యార్థులను గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున తమ కంపెనీల్లో చేర్చుకుంటున్నాయి. రాష్ట్రంలో 110 వరకూ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలున్నాయి. ఇందులో హైదరాబాద్‌లోనే దాదాపు 300 కాలేజీలున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు వంద కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నారు. ఫార్మా, బ్యాంకింగ్, రిటైల్, మార్కెటింగ్ కంపెనీలతో పాటు టీసీఎస్, కాగ్నిజెంట్, విప్రో, సీజీఎల్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి. ప్రతీ ఏటా ఈ కంపెనీలు 10 నుంచి 20 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రూ. 3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకూ వార్షిక వేతనం ఇస్తున్నాయి. -
డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం పెరుగుతోంది. ఈ ఏడాది ‘దోస్త్’నియామకాలను పరిశీలిస్తే అబ్బాయిల సంఖ్యను మించిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 4.60 లక్షల డిగ్రీ సీట్లు ఉండగా ‘దోస్త్’ద్వారా 1,90,578 సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 90,534 (47.50 శాతం) మంది బాలురు చేరితే, 1,00,044 (52.50 శాతం) మంది బాలికలు వివిధ రకాల డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందారు. అయితే బీకాం, బీఏ కోర్సుల్లో బాలికలకన్నా బాలుర శాతమే ఎక్కువగా ఉండగా సైన్స్ గ్రూపుల్లో మాత్రం బాలురకన్నా బాలికలే ఎక్కువగా ఉన్నారు. భవిష్యత్తులో డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉపాధి వైపు అబ్బాయిలు.. కోవిడ్ తర్వాత 50 శాతం మంది అబ్బాయిల్లో గ్రాడ్యుయేషన్ తర్వాత కుటుంబ బాధ్యతల్లోకి వెళ్లక తప్పడం లేదని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనంలో వెల్లడైంది. రెండేళ్లుగా వెంబడిస్తున్న ఆర్థిక ఒడుదుడుకులే ఈ పరిస్థితికి కారణంగా సెస్ పేర్కొంది. దీనికి అనుగుణంగానే ఇంటర్ తర్వాత ఉపాధి కోర్సులను విద్యార్థులు ఎంచుకుంటున్నారు. పీజీ చేయాలనే ఆలోచన కొందరికి మాత్రమే ఉంటోంది. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ కోర్సుల్లో చేరడం ద్వారా తక్షణ ఉపాధి పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా కామర్స్‌లో 54.45 శాతం బాలురు చేరారు. బీఏలో కంప్యూటర్ అనుబంధ కోర్సుల కాంబినేషన్ రావడవంతో ఈ కోర్సులో 60.84 శాతం మంది చేరారు. మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ, బీబీఎంలో 56.54 శాతం మంది చేరారు. వాణిజ్యరంగం పెరగడం, కామర్స్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు విస్తృతమవ్వడంతో ఈ కోర్సును ఎంచుకున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమ్మాయిల లక్ష్యం పీజీ.. గత రెండేళ్లుగా పీజీ కోర్సుల్లో చేరుతున్న అమ్మాయిల శాతం పెరిగింది. కోవిడ్ కాలం నుంచి డిగ్రీలను ఎంపిక చేసుకోవడంలోనూ ఇదే విధానం వారిలో కనిపిస్తోంది. డిగ్రీతోనే ఉపాధి వైపు వెళ్లడానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని సెస్ సర్వేలో తేలింది. దీంతో పీజీ తర్వాత పోటీ పరీక్షలు రాయడం లేదా పరిశోధనల వరకూ వెళ్లే ఆలోచనలతోనే అమ్మాయిలు అందుకు తగ్గ డిగ్రీ కోర్సులను ఎంచుకుంటున్నారు. ఈ ఏడాది ‘దోస్త్’ప్రవేశాల్లో బీకాం, బీఏ కోర్సులకన్నా, బీఎస్సీ (లైబ్రరీ సైన్స్), సాధారణ బీఎస్సీ కోర్సుల్లో అమ్మాయిల ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. మేనేజ్మెంట్ కోర్సుల వైపు అమ్మాయిలు పెద్దగా వెళ్లకపోవడం గమనార్హం. అవకాశాలు పెరగడమే కారణం.. టెన్త్, ఇంటర్ దశ నుంచే అమ్మాయిలకు గురుకులాలు పెరగడం, ఉన్నతవిద్యను అందించాలనే అవగాహన తల్లిదండ్రుల్లోనూ పెరగడం వల్ల ఉన్నతవిద్యలో అమ్మాయిల ప్రవేశాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో వారి శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. – ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది నుంచి డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. ప్రభుత్వ పరిధిలోని అన్ని రెసిడెన్షియల్ కాలేజీల్లో దీన్ని ముందుగా అందుబాటులోకి తెస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఆసక్తి చూపిస్తే వాటిలోనూ అనుమతిస్తామని అధికారులు తెలిపారు. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రాంచైజ్ అలయెన్స్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి సంయుక్తంగా ఫ్రెంచ్ భాషను తీసుకురావడంపై కొన్నాళ్లు కసరత్తు చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ పాఠ్యప్రణాళిక రూపకల్పనలో కీలకపాత్ర పోషించింది. ఫ్రాన్స్ విదేశీ మంత్రిత్వశాఖతో కలిసి రాష్ట్రంలో అధ్యాపకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓయూ పరిధిలోని కాలేజీల్లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఈ కోర్సును ప్రవేశపెట్టి, వచ్చే ఏడాది నుంచి ఇతర విశ్వవిద్యాలయాల పరిధిలోని కాలేజీలకు విస్తరిస్తారు. ఇప్పటివరకూ హిందీ, తెలుగు సహా ఇతర భాషలు డిగ్రీలో ద్వితీయ భాషలుగా ఉన్నాయి. అయితే, ఫ్రెంచ్ భాషను రాష్ట్రంలో డిప్లొమా, ఇతర సర్టిఫికెట్ ప్రోగ్రాములుగా అందించారు. కొన్నేళ్లుగా కొంతమంది ఈ సబ్జెక్టులను నేర్చుకున్నారు. సీనియర్ డిప్లొమా చేసిన వాళ్లు కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్నారు. ఇప్పుడు వీళ్లను ఫ్రెంచ్ అధ్యాపకులుగా గుర్తించబోతున్నారు. వీరికి బోధనకు అనుకూలంగా ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని ఓయూ అధికారులు తెలిపారు. ఫ్యాకల్టీ సిద్ధం: చైర్మన్, ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్ భాషను ద్వితీయ భాషగా తెచ్చేందుకు కొన్నేళ్లుగా చేస్తున్న కృషి ఈ ఏడాది కార్యాచరణకు నోచుకుంటోంది. మంచి పాఠ్య ప్రణాళికతోపాటు సుశిక్షితులైన బోధకులను సిద్ధం చేశాం. ఈ భాష నేర్చుకున్న విద్యార్థి మంచి ఉద్యోగాలు పొందే వీలుంది. ఫలితంగా డిగ్రీ కోర్సులు మరింత ఆదరణ పొందుతాయి. ఉపాధి అవకాశాలు ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం వల్ల బహుళజాతి సంస్థల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కొన్నేళ్లుగా చూస్తే రాష్ట్రంలో ఈ తరహా భాష మిళితమైన కార్పొరేట్ సంస్థల వ్యాపార లావాదేవీలు పెరిగాయి. సంస్థల ఏర్పాటు విస్తరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బహుళజాతి కంపెనీల్లో ఫ్రెంచ్, ఇతర విదేశీ భాషలు తెలిసిన వారికి ప్రాధాన్యత లభిస్తోంది. భవిష్యత్‌లో డిగ్రీ స్థాయిలో ఫ్రెంచ్‌తో పాటు జర్మనీ ఇతర కోర్సులు అందుబాటులోకి తెచ్చే వీలుంది. పీజీలోనూ ఈ భాషల ప్రాధాన్యత పెరిగే అవకాశముంది. – ప్రొఫెసర్ డి.రవీందర్, వీసీ, ఉస్మానియా వర్సిటీ -
డిగ్రీలో కోర్సు ఏదైనా.. పీజీలో నచ్చిన కోర్సు
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో సంస్కరణలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టింది. డిగ్రీలో ఏ కోర్సు చేసినా పీజీలో ఇష్టమైన సామాజిక కోర్సు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఇతర రాష్ట్ర విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచాలని తీర్మానించింది. సోమవారం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వీసీలతో ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మీడియాకు వివరించారు. బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌కు సరికొత్త విధానం ఇప్పటివరకు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఏ సబ్జెక్టు తీసుకుంటే పోస్టు గ్రాడ్యుయేషన్‌లోనూ అదే కోర్సు చేయాల్సి ఉండేది. దీని వల్ల చాలా మంది విద్యార్థులు ఇష్టమైన సబ్జెక్టులు చదివేందుకు వేరే రాష్ట్రాలు, దేశాలకు వెళ్తున్నారు. అందుకే ఉమ్మడి పోస్టు గ్రాడ్యుయేట్ అర్హత పరీక్ష నిబంధనలు సడలించారు. ఇక సోషల్ సైన్స్ గ్రూపులైన ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి కోర్సులు ఇంగ్లిష్, తెలుగులో చేయాలంటే డిగ్రీలో ఏ కోర్సు చేసినా సరిపోతుంది. ఉన్నత విద్యలో విద్యార్థులకు ఇచ్చే బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్‌పై కూడా సరికొత్త విధానం తీసుకొచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉస్మానియా వర్సిటీ వీసీకి ఉన్నత విద్యా మండలి సూచించింది. రాష్ట్రంలో మూడేళ్లుగా దాదాపు 50 కాలేజీల్లో పలు కోర్సుల్లో జీరో ప్రవేశాలు ఉంటున్నాయి. వీటిని రద్దు చేయడమే మంచిదని మండలి భావిస్తోంది. అయితే డిమాండ్ ఉన్న కోర్సులను కాలేజీలు నిర్వహించుకునేందుకు అనుమతించడంపై కసరత్తు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. విద్యార్థుల్లేని గ్రూపుల స్థానంలో విద్యార్థులు కోరుకునే గ్రూపులకు కాలేజీలు ముందుకొస్తే పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు. పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటా 20 శాతం పీజీ ఎంట్రన్స్‌లో నేషనల్ ఇంటిగ్రేషన్ కోటాను 20 శాతం పెంచాలని సమావేశం తీర్మానించింది. ప్రస్తుతం ఈ కోటా 5 శాతమే ఉంది. తాజా నిర్ణయంతో కొత్తగా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. దీనికోసం సూపర్ న్యూమరరీ సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్ వంటి విదేశీ భాషల కోర్సులను కాలేజీల్లో ప్రవేశపెట్టేందుకు విద్యా మండలి సుముఖత వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన పాఠ్య ప్రణాళిక, బోధన విధానంపై సమగ్ర నివేదిక రూపొందించే బాధ్యతను ఉస్మానియా వర్సిటీ వీసీ రవీందర్‌కు అప్పగించింది. సమావేశంలో రాష్ట్ర కాలేజీ విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యా మండలి వైఎస్ చైర్మన్ వెంకటరమణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
New Education Policy: డిగ్రీ ఇక నాలుగేళ్లు
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా యూనివర్సిటీ అనుబంధ కాలేజీల్లో డిగ్రీ కోర్సు ఇకపై నాలుగేళ్లు ఉండనుంది. 2022–23 విద్యా సంవత్సరం నుంచే దీనిని ప్రారంభించేలా వర్సిటీ అకడమిక్ సెనేట్ కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ సమావేశ మందిరంలో మంగళవారం అకడమిక్ సెనేట్ సమావేశమైంది. వైస్ చాన్స్‌లర్ కేబీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి, సీడీసీ డీన్ సుందరకృష్ణ పాటు కమిటీలో 32 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. 2021–22 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను సభ్యుల ముందు ఉంచారు. అదే విధంగా 2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ కార్యకలాపాలు, తదితర 50 అంశాలపై చర్చించి, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. విద్యా పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ►నూతన విద్యా పాలసీకి అనుగుణంగా యూనివర్సిటీ అనుబంధ కాలేజీలన్నింటిలోనూ నాలుగేళ్ల డిగ్రీ కోర్సు అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మూడు ఏళ్లు పూర్తయ్యాక పదినెలల ఇంటర్న్‌షిప్ ఉండేలా సిలబస్‌ను రూపొందించనున్నారు. దీనిని 2022–23 విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని నిర్ణయించారు. ►డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లిష్ మీడియంలో బోధన, పరీక్షల నిర్వహణకు నిర్ణయించారు. ►డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ స్థాయిలో పరీక్షల నిర్వహణలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించారు. ►కాలేజీల్లో నాణ్యమైన విద్యాబోధన చేపట్టేలా అన్ని చర్యలు తీసుకునేలా పర్యవేక్షణ పెంచ నున్నారు. ►నాలుగేళ్ల డిగ్రీతో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తప్పనిసరిగా పొందేలా బోధనకు ప్రాధాన్యం ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సెనేట్ సభ్యులు సూచించారు. ►అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ జయశంకర్ ప్రసాద్ సమన్వయకర్తగా వ్యవహరించగా, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం. రామిరెడ్డి సెనేట్ అజెండా, వర్సిటీలో నూతన విద్యా విధానం అమలు తీసుకుంటున్న చర్యలపై వివరించారు. -
తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమానికి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కోర్సుల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయనున్న నేపథ్యంలో పలు కాలేజీలు తమ తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేసుకునేందుకు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పించాయి. 2021–22 విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమంలోనే డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉంటాయని, తెలుగు మాధ్యమ కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీలు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఈ నెల 12వ తేదీ గడువు ముగిసే సమయానికి రాష్ట్రంలోని 557 కాలేజీలు తాము నిర్వహిస్తున్న తెలుగు మాధ్యమ కోర్సులను ఆంగ్ల మాధ్యమానికి మార్పు చేయాలని దరఖాస్తు చేశాయి. దీనితో పాటు విద్యార్థులు చేరని పలు కోర్సులను ఉపసంహరించుకుంటూ 111 కాలేజీలు దరఖాస్తు చేశాయి. రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కాలేజీల్లో 154 ప్రభుత్వ పరిధిలో ఉండగా 111 కాలేజీలు ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలుగా కొనసాగుతున్నాయి. 1,022 ప్రైవేటు అన్ ఎయిడెడ్ కాలేజీలున్నాయి. -
డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను డిగ్రీలో ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2021–22 విద్యా సంవత్సరంలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో (బీబీఏ) మూడు రకాల కొత్త కాంబినేషన్లను అమల్లోకి తీసుకొస్తోంది. బీబీఏ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు బీబీఏ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ, బీబీఏ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ కోర్సులను ఈ ఏడాది అందుబాటులోకి తేనుంది. ఇందుకు అవసరమైన కసరత్తును ప్రారంభించింది. మార్కెట్లో ఉపా«ధి అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టే కార్యాచరణను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది బీఎస్సీ డేటా సైన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్ వంటి కోర్సులను ప్రవేశపెట్టగా, ఈసారి బీబీఏలో మూడు కొత్త కాంబినేషన్లతో కోర్సులను ప్రవేశపెడుతోంది. ఈ కోర్సులను నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోగా, వాటితో పాటు ప్రభుత్వ కాలేజీల్లోనూ ఆయా కోర్సులను ప్రవేశ పెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రేపటి నుంచి డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రిజిస్ట్రేషన్ రాష్ట్రంలోని అన్ని విశ్వ విద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ తదితర డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాల నోటిఫికేషన్‌ను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) జారీ చేసింది. మంగళవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రవేశాల ప్రకటనను అధికారులు జారీ చేశారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, కళాశాల విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, మండలి వైస్ చైర్మన్, దోస్త్ కన్వీనర్ లింబాద్రి పాల్గొన్నారు. జూలై 1 నుంచి 15 వరకు విద్యార్థులు తమ ఇంటర్మీయట్ హాల్ నంబర్ సాయంతో దోస్త్ వెబ్సైట్లో (https://dost.cgg.gov.in) రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి నిర్వహించే డీహెచ్‌ఎంసీటీ, డీఫార్మసీ కోర్సుల్లోనూ దోస్త్ ద్వారానే ప్రవేశాలు చేపట్టనున్నారు. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులు జూలై 3 నుంచి 16 వరకు కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి దశ సీట్లను జూలై 22న కేటాయిస్తారు. -
ఏపీ: ఆంగ్ల మాధ్యమంలో డిగ్రీ కోర్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది. ఈ మేరకు మండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలలు రానున్న కొత్త విద్యా సంవత్సరం నుండి ఇంగ్లిష్ మీడియంలో మాత్రమే ప్రోగ్రాములను అందించాలని గత ఫిబ్రవరి 12న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. దీని ప్రకారం కొత్త, అదనపు ప్రోగ్రామ్‌ల మంజూరు.. ఆయా కోర్సుల కాంబినేషన్ మార్పు, ప్రస్తుతం నడుస్తున్న మాధ్యమాన్ని ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ఏప్రిల్ 27న నోటిఫికేషన్ జారీచేసింది’.. అని మండలి కార్యదర్శి ఆ ప్రకటనలో వివరించారు. అలాగే, 2021–22 విద్యా సంవత్సరం నుంచి నాలుగేళ్ల అన్ఎయిడెడ్ అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) హానర్స్ ప్రోగ్రాముల కోసం దరఖాస్తులను ఆంగ్ల మాధ్యమానికి మాత్రమే అనుమతిస్తామని కూడా స్పష్టంచేసింది. అలాగే, ఇప్పటికే తెలుగు మాధ్యమంలో అన్ఎయిడెడ్ కోర్సులను అందిస్తున్న అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు ప్రస్తుతం ఉన్న అన్ని తెలుగు మీడియం విభాగాలను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చుకునేందుకు ప్రతిపాదనను పంపించాలని మండలి సూచించింది. లాంగ్వేజ్ కోర్సులు మినహాయించి ఇతర విభాగాల కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి ఈనెల 18 నుంచి 28వ తేదీలోపు ఉన్నత విద్యా మండలికి ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంది. అలా ఇవ్వని పక్షంలో 2021–22 నుండి ఆయా కోర్సుల నిర్వహణకు అనుమతులివ్వలేమని స్పష్టంచేసింది. గడువు దాటాక ఎలాంటి ప్రతిపాదనలను స్వీకరించబోమని పేర్కొంది. అలాగే, అన్ఎయిడెడ్ ప్రోగ్రాములలో నిర్వహణ సాధ్యంకాని, నిర్వహించని యూజీ ప్రోగ్రాములను ఉపసంహరించుకోవాలనుకునే ప్రైవేట్ అన్ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు, ప్రైవేట్ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు తమ ప్రతిపాదనలను కూడా ఈనెల 18 నుంచి 28లోగా సమర్పించాలని సూచించింది. మీడియం మార్పిడి, ప్రోగ్రామ్‌ల ఉపసంహరణకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదని మండలి పేర్కొంది. కొత్తగా చేరే వారికే ఆంగ్ల మాధ్యమం ఇదిలా ఉంటే.. ఇప్పటికే తెలుగు మీడియం చదువుతున్న 65,981 మంది విద్యార్థులు యధాతథంగా ఆయా కోర్సుల్లో కొనసాగుతారు. 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా చేరే విద్యార్థులకు మాత్రమే ఇంగ్లిష్ మీడియం అమలవుతుంది. -
తగ్గిన చేరికలు..వెలవెలబోతున్న డిగ్రీ విభాగాలు
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు సహకరించాల్సిన కాలేజీల యాజమాన్యాల నిర్లిప్తతతో చేరికల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. బోధనా సిబ్బంది, సదుపాయాల కల్పన విషయంలో యాజమాన్యాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీని పూర్తిగా ఆన్లైన్లో ప్రభుత్వమే ‘ఆన్లైన్ అడ్మిషన్స్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఎండీసీ) ద్వారా పారదర్శకంగా నిర్వహించింది. విద్యార్థులు తాము కోరుకున్న కాలేజీలో నచ్చిన సీటు పొందేలా అవకాశం కల్పించింది. ఈ అడ్మిషన్ల ప్రక్రియను మూడు విడతల్లో ఉన్నత విద్యామండలి నిర్వహించింది. 152 ప్రభుత్వ కాలేజీలు, 120 ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలు, 1,062 ప్రైవేట్ కాలేజీల్లో డిగ్రీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేశారు. ఈ కాలేజీల్లో 4,96,055 సీట్లు ఉండగా 2,61,383 సీట్లను ఆన్లైన్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌లో విద్యార్థులకు కేటాయించారు. పలు కాలేజీల్లో సీట్లు సగానికి పైగా ఖాళీగా మిగిలాయి. సరైన ప్రమాణాలను పాటించకపోవడం, సదుపాయాలు లేకపోవడంతో విద్యార్థులు వాటిల్లో చేరేందుకు విముఖత చూపారు. పలు కోర్సుల్లో సీట్లు ఖాళీ... మూడు విడతల కౌన్సెలింగ్ అనంతరం చేరికలను పరిశీలిస్తే పలు కాలేజీల్లో కొన్ని కోర్సుల్లో ఒకరిద్దరు మాత్రమే చేరగా మరికొన్ని చోట్ల 10 నుంచి 20 మంది లోపే ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లోని 48 విభాగాల్లో, ఎయిడెడ్ కాలేజీల్లోని 194 విభాగాల్లో, ప్రయివేటు కాలేజీల్లోని 1,309 విభాగాల్లో చేరికలు 30 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా కాలేజీల్లో కోర్సుల కొనసాగింపు సమస్యగా మారింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో తక్కువ చేరికలున్న కోర్సుల విద్యార్థులను ఇతర కాలేజీలలోని అదే కోర్సులకు లేదా అక్కడే ఇతర కోర్సులలోకి మార్పు చేసే ప్రక్రియ చేపట్టారు. దాదాపు 1,600 మంది విద్యార్థులను ఇలా తరలిస్తున్నారు. ప్రైవేట్ కాలేజీల్లో మాత్రం తక్కువ చేరికలున్న కోర్సుల నుంచి మార్పులు చేసుకొనేందుకు ఇదివరకే అడ్మిషన్ల సందర్భంగా ప్రభుత్వం విద్యార్థులకు అవకాశం కల్పించింది. చేరికలు తక్కువగా ఉన్న కాలేజీలపై నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించని కాలేజీలకు ఉన్నత విద్యామండలి ఆన్లైన్ అడ్మిషన్ల కన్నా ముందుగానే నోటీసులు జారీచేసింది. 72 కాలేజీలు గత కొన్నేళ్లుగా యూనివర్సిటీల అఫ్లియేషన్ లేకుండానే కొనసాగుతున్నాయి. 25 శాతం కన్నా తక్కువ చేరికలున్న 174 కాలేజీలు, ఒక్కరు కూడా లేకుండా కేవలం కాగితాలపై నడుస్తున్న కాలేజీలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. లోపాలను సవరించుకోకుండా కొనసాగుతున్న కాలేజీలపై 2020–21 ఆన్లైన్ అడ్మిషన్లకు ముందుగానే ఉన్నత విద్యామండలి కొరడా ఝళిపించింది. 48 కాలేజీలు స్పందించకపోవడంతో అనుమతులను రద్దుచేసింది. మరో 61 కాలేజీల్లో కోర్సులను ఉపసంహరించింది. -
ఇక నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇక నుంచి మూడేళ్ల డిగ్రీ కోర్సు స్థానంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సు అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులో చేరే విద్యార్థులు మూడేళ్ల అనంతరం ఆ కోర్సును మధ్యలో ముగించుకొనేలా ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ కోర్సులో పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశారు. 2020–21 విద్యాసంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. రాష్ట్రంలో డిగ్రీ చదివే విద్యార్థుల్లో నైపుణ్యాలు మెరుగుపర్చేందుకు ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్‌తో కూడిన నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను 2020–21 నుంచి ప్రవేశపెట్టాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే విద్యాశాఖకు సూచించారు. దీనిపై ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి కసరత్తు చేసి ప్రణాళికను రూపొందించాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతికి పంపగా మూడేళ్ల డిగ్రీ కోర్సులు మాత్రమే దేశంలో ఉన్నందున ఆ విధంగానే అమలు చేయాలని సూచించింది. దీంతో ఉన్నత విద్యామండలి మూడేళ్ల డిగ్రీ కోర్సులను కొనసాగిస్తూనే పది నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రణాళికను రూపొందించింది. ఈలోగా జాతీయ నూతన విద్యావిధానం–2020లో కేంద్ర ప్రభుత్వం బహుళ నిష్క్రమణ అవకాశాలుండేలా 3, 4 ఏళ్ల కాలపరిమితితో డిగ్రీ కోర్సు ప్రవేశపెట్టాలని పేర్కొంది. ప్రాజెక్టు వర్కులు, ఇంటర్న్‌షిప్‌లతో నైపుణ్యాలు మెరుగుపర్చేలా డిగ్రీ కోర్సులుండాలని స్పష్టం చేసింది. ఆ కోర్సులు ఇక ఉండవు.. ఈ ఏడాది ఆగస్టు 6న సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులను ప్రవేశ పెట్టాలని, 10 నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తూ విద్యార్థులకు మూడేళ్ల తరువాత ఎగ్జిట్ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటి వరకు వేర్వేరుగా అమల్లో ఉన్న మూడేళ్ల నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, నాలుగేళ్ల ప్రొఫెషనల్ కోర్సులన్నీ రద్దయ్యాయి. వాటి స్థానంలో మూడేళ్ల ఎగ్జిట్ ఆప్షన్‌తో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి.. అన్ని యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల విద్యా నిపుణులతో సిలబస్ రివిజన్‌ను చేయించింది. ఆయా వర్సిటీలు సంబంధిత విభాగాల అనుమతితో వీటిని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
ఐఐటీ మద్రాస్ ఆన్లైన్ డిగ్రీ
బీఎస్సీ ఇన్ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్‌ను దేశంలోనే తొలిసారి ప్రవేశపెట్టిన ఐఐటీ మద్రాస్.. కోర్సులో ఎన్నెన్నో ప్రత్యేకతలు సాక్షి, హైదరాబాద్: సర్టిఫికెట్ కోర్సుకు 3 – 4 నెలలు.. డిప్లొమా అంటే ఏడాది.. డిగ్రీ చదవాలంటే మూడేళ్లు! ఇదీ ప్రస్తుత విధానం. ఇకపై మాత్రం కాదు. ఎందుకంటే దేశంలోనే తొలిసారిగా ఐఐటీ మద్రాస్ మంగళవారం ఆన్లైన్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టింది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆన్లైన్లో ఈ కోర్సును ప్రారంభించారు. ‘బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్’ అనే ఈ కోర్సుకు బోలెడు ప్రత్యేకతలున్నాయి. ఇంటర్మీడియెట్ పాసైతే చాలు ఈ కోర్సులో చేరి పోవచ్చు. అంతేకాదు.. ఇతర కోర్సులు చేసి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లూ చేరవచ్చు. ఒకసారి చేరితే మూడేళ్లపాటు డిగ్రీ చదివి తీరాలనే నిబంధనేదీ లేదు. కొన్ని నెలలు, కొన్ని అంశాలను చదవకుంటే సర్టిఫికెట్ కోర్సుగా, మరింత కాలం అదనపు సబ్జెక్టులను కలుపుకుని చదివితే డిప్లొమా, డిగ్రీ సర్టిఫికెట్లు అందించటం ఈ కోర్సు ప్రత్యేకత. ఐటీ పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు రూపొందిన ఈ కోర్సు విద్యార్థులకు మాత్రమే కాక, వృత్తి నైపుణ్యాలను పెంచు కోవాలనుకునే ఐటీ ఉద్యోగులకూ ఉప యోగపడుతుందని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ భాస్కర్ రామమూర్తి తెలిపారు.మేధోవలసను ఆపాలి: కేంద్ర మంత్రి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ ఢిల్లీ నుంచి ఈ ఆన్లైన్ కోర్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ లక్షల మంది విద్యార్థులు ఏటా ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారని, ఐఐటీలాంటి సంస్థలు ఈ మేధోవలసకు అడ్డుకట్ట వేయాలని కోరారు. ఐఐటీ మద్రాస్ సిద్ధంచేసిన బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ ఇందుకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే, ఐఐటీ మద్రాస్ అధ్యాపకులు ప్రతాప్ హరిదాస్, ఆండ్రూ తంగరాజ్, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ పవన్‌కుమార్ గోయంకా పాల్గొన్నారు. ఏటా జనవరి, మే, సెప్టెంబర్‌లో విద్యార్థులను చేర్చుకుంటారు. వారానికి 2 – 3 గంటల వీడియో పాఠాలు, క్విజ్లు.. దగ్గరలోని సెంటర్ వద్ద పరీక్షలు నిర్వహిస్తారు. క్వాలిఫయర్ పరీక్ష సాయంతో కోర్సులోకి ఎవరు చేరవచ్చో నిర్ణయిస్తారు. ఫౌండేషన్ సర్టిఫికెట్ కోర్సులో గణితం, గణాంకశాస్త్రం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ప్రాథమిక పాఠాలు వంటి ఎనిమిది కోర్సులుంటాయి. ఈ 8 సబ్జెక్టులను పూర్తిచేసి కోర్సు వదిలేయాలనుకునే వారికి ఫౌండేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కొనసాగిస్తే.. ప్రోగ్రామింగ్, డేటా సైన్స్‌లలో డిప్లొమా చేయవచ్చు. కంపెనీల్లో పనిచేస్తూ నైపుణ్యాలను పెంచుకోవాలనుకునే వారు నేరుగా డిప్లోమా కోర్సులో చేరవచ్చు. వారానికి పది గంటల చొప్పున ఆన్లైన్ పాఠాలు, పరీక్షలుంటాయి. ఏడాది నుంచి రెండేళ్లలో ఈ దశను పూర్తిచేసిన వారికి ప్రోగ్రామింగ్, డేటా సైన్స్ సబ్జెక్టుల్లో విడివిడిగా డిప్లొమా అందిస్తారు. రెండు సబ్జెక్టుల్లోనూ డిప్లొమా అందుకునే అవకాశమూ ఉంది. డిగ్రీ కోర్సు పూర్తి చేయాలనునుకునే వారు కోర్సును కొనసాగించవచ్చు కూడా. చివరగా డిగ్రీ కోర్సు పూర్తికి మూడు నుంచి ఆరేళ్లు పడుతుంది. తొలి రెండు దశలు పూర్తిచేసిన వారు లేదా నేరుగా డిప్లొమా కోర్సులో చేరి పూర్తిచేసిన వారు డిగ్రీ కోర్సు పూర్తి చేసేందుకు అర్హులు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పలు ఆప్షన్లలో రెండింటిని ఎంచుకుని కోర్సు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఫౌండేషన్ కోర్సుకైతే రూ.32 వేలు, డిప్లొమా కోర్సుకు రూ.1.10 లక్షలు, డిగ్రీ కోర్సుకు రూ.లక్ష ఫీజు. అంటే, ఇంటర్మీడియట్ తరువాత బీఎస్సీ ఇన్ ప్రోగ్రామింగ్/డేటా సైన్సెస్ డిగ్రీ కోర్సు పూర్తికి రూ.2.42 లక్షలు ఖర్చవుతాయన్నమాట. వివరాలకు వెబ్సైట్: onlinedegree. iitm. ac. in -
సల్మాన్ బి.ఎ పాస్
అల్లరి పిల్లవాడు సల్మాన్ బి.ఎ ఫస్ట్ ఇయర్ ముప్పై అయిదు శాతం మార్కులతో గట్టెక్కాడు. గట్టేం ఖర్మ చెట్టూ పుట్టా ఎక్కేశాడు ఆనందంతో. మరి చదవని చదువుకు అప్పనంగా మార్కుల షీటు అందితే ఆనందం కాదూ? అసలు సంగతి ఏమి భాయీ అంటే ఆగ్రా యూనివర్సిటీ వాళ్లు తాజాగా మార్కుల లిస్టులు కుర్రాళ్లకు జారీ చేశారు. బి.ఎ ఫస్ట్ క్లాస్ మార్కుల లిస్టు ఒకటి చూస్తే దాని మీద సల్మాన్‌ఖాన్ ఫొటో ఉంది. ఫొటో ఉన్న పాపానికి మన హీరోగారిని ఏ డిస్టింక్షన్లోనో పాస్ చేయవచ్చు కదా. అత్తెసరున ముప్పై శాతం మార్కులు వేసి ఉన్నారు. ఇది ఆ నోటా ఈ నోటా పాకి పెద్ద వైరల్ అయ్యింది. ‘మరీ ఇంత నిర్లక్ష్యమా’ అని బాలీవుడ్లో కొందరు నోటితో నొసలుతో నోస్‌తో కూడా వెక్కిరిస్తున్నారు. అదే యూనివర్సిటీ వారు మరో మార్కుల లిస్ట్‌లో రాహుల్ గాంధీ ఫొటోను కూడా అంటించారని బోగట్టా. ఏందయా ఈ మాయా అని అడిగితే ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ అని తప్పును సరి చేసుకోవడానికి పరుగులు తీశారు. ఈలోపల జరగాల్సిన డ్యామేజీ జరిగే పోయింది. అభిమానులేమో సల్మాన్ ఫొటో ఎక్కడ వాడినా కండకు పది చొప్పున నూటికి నూరు మార్కులు వేయాల్సిందేనని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఈసారి ఎన్ని వస్తాయో చూడాలి. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ మొదటి, రెండు, మూడేళ్ల సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ప్రొఫెసర్ శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 14 దరఖాస్తు చివరి తేదీగా నిర్ణయించామన్నారు. రూ.150 అపరాధ రుసుంతో 18 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలన్నారు. కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
‘డిగ్రీ’ వద్దు.. ‘డిప్లొమా’ ముద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య లక్షకు పైగా తగ్గిపోయింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), డెలాయిట్ సంస్థ సంయుక్తంగా వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాదు గతంతో పోల్చితే మన రాష్ట్రంలో కాలేజీల సంఖ్య కూడా పెరిగిందని ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ (ఏఎస్‌హెచ్‌ఈ) ఆఫ్ స్టేట్స్ అండ్ యూటీస్ ఇన్ ఇండియా–2016’నివేదిక తెలిపింది. ఈ నివేదికను సీఐఐ ఇటీవల విడుదల చేసింది. ఏఎస్‌హెచ్‌ఈ–2015 నివేదిక ప్రకారం రాష్ట్రం లో 13,82,137 మంది విద్యార్థులు వివిధ ఉన్నత విద్యా కోర్సులను అభ్యసించగా, 2016 నివేదిక ప్రకారం 12,81,443 మందే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు వెల్లడైంది. మొత్తం లక్షమంది విద్యార్థులు తగ్గగా.. ఒక్క డిగ్రీలోనే 79,880 మంది తగ్గిపోయారు. అలాగే గతంలో రాష్ట్రంలో మొత్తం 2,256 కాలేజీలు ఉంటే 2016 నివేదిక ప్రకారం వాటి సంఖ్య 2,536కు పెరిగింది. అంటే 284 కాలేజీలు పెరిగాయి. పెరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య మొత్తంగా తగ్గినా.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గతంలో కంటే ఈసారి బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదిక వెల్లడించింది. 2015 నివేదిక ప్రకారం ఎస్సీ విద్యార్థులు 15.8 శాతం ఉన్నత విద్యను అభ్యసిస్తే.. 2016లో 16.2 శాతానికి పెరిగింది. బీసీ విద్యార్థులు అంతకుముందు 42.5 శాతం మంది ఉన్నత విద్యను అభ్యసించగా, తాజాగా 44 శాతానికి పెరిగింది. ఎస్టీ విద్యార్థులు గతంలో 7.4 శాతం ఉండగా, ప్రస్తుతం 8.4 శాతానికి పెరిగింది. ముస్లిం విద్యార్థుల సంఖ్య గతంలో 6.5 శాతం ఉంటే.. ఈసారి 6.8 శాతానికి చేరింది. డిప్లొమాకు పెరుగుతున్న ఆదరణ రాష్ట్రంలో డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. గత నివేదికతో పోలిస్తే 2016లో 15,042 మంది అత్య«ధికంగా డిప్లొమా కోర్సుల్లో చేరారు. మన రాష్ట్రాల్లోనే ఎక్కువ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో కేరళ, కర్ణాటక ముందున్నాయి. అక్కడ ఉన్నత విద్యను బోధించేందుకు 13 మంది విద్యా ర్థులకు ఒక అధ్యాపకుడు ఉండగా.. తెలం గాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 14 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు ఉన్నారు. దేశ వ్యాప్తంగా చూస్తే సరాసరి ప్రతి 21 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు పని చేస్తున్నట్లు వెల్లడించింది. -
డిసెంబర్లో ఉస్మానియా డిగ్రీ, పీజీ పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు కంట్రోలర్ ప్రొ.అప్పారావు శుక్రవారం తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో తొలిసారిగా సెమిస్టర్ పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టిన్నట్లు చెప్పారు. డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నవంబర్ 18 లోగా ఫీజు చెల్లించాలని, రూ.500 అపరాధ రుసుముతో 26 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. నవంబర్ 23 నుంచి డిగ్రీ కోర్సుల ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, డిసెంబర్లో జరిగే పీజీ సెమిస్టర్ పరీక్ష ఫీజును వచ్చే నెల 16 లోగా చెల్లించాలని, రూ.300 అపరాధ రుసుముతో 23 వరకు చెల్లించవచ్చని చెప్పారు. -
లక్ష దాటిన డిగ్రీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
త్వరలో గడువు పెంచుతాం: కమిషనర్ సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం చేపట్టిన కామన్ షెడ్యూలు, ఆన్లైన్ దరఖాస్తుల విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్ సోమవారం వెల్లడించారు. ఇప్పటిదాకా లక్ష మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరగవచ్చన్నారు. కాబట్టి దరఖాస్తుల గడువు పెంచనున్నట్టు వెల్లడించారు. వారిలో చాలామంది డిగ్రీలో చేరతారు గనుక వారికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని వివరించారు. ఇప్పటికే కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చినవారు వాటిని మార్చుకోవచ్చని చెప్పారు. ఆన్లైన్ ప్రక్రియతో ప్రవేశాల విధానంలో ప్రక్షాళన జరిగిందని చెప్పారు. ‘‘రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 96,593 మంది తెలంగాణ, 1,641 మంది ఏపీ, 1,776 మంది ఇతర రాష్ట్రాల వారున్నారు. తమ పేర్లతో వేరేవారు దరఖాస్తు చేశారంటూ రద్దు కోసం 201 మంది విద్యార్థులు చేసిన అభ్యర్థనపై విచారణ చేయిస్తాం’’ అన్నారు. న్యాక్ అక్రెడిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బాలికల డిగ్రీ కాలే జీల్లో హాస్టల్ సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ఈసారి సీట్ల సంఖ్య 30 వేలు పెరిగిందన్నారు. గతేడాది 1,085 కాలేజీల్లో 3,61,172 సీట్లుండగా ఈసారి 1,103 కాలేజీల్లో 3,94,575 సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. -
డిగ్రీ ఆన్లైన్ దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రారంభించిన ఆన్లైన్ దరఖాస్తుల గడువును మరికొన్ని రోజులు పొడిగిస్తామని విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తెలిపారు. రెండు మూడు రోజుల్లో పొడిగింపు తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలపై రంజీవ్ ఆచార్య బుధవారం వివిధ డిగ్రీ కాలేజీల ప్రిన్సిపాళ్లు, హెల్ప్‌లైన్ కేంద్రాల ఇన్‌చార్జీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్లైన్ ప్రవేశాలను పక్కాగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈసారి ప్రవేశాలకోసం అతితక్కువమంది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కారణాలేంటని ఆచార్య ప్రశ్నించగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు వచ్చాక ప్రవేశాలు పెరుగుతాయని, వారంతా దరఖాస్తు చేసుకునేలా గడువును పొడిగించాలని ప్రిన్సిపాళ్లు కోరారు. ఇందుకు రంజీవ్ ఆచార్య ఆమోదం తెలిపారు. గురువారం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లోనూ ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. 33 ప్రభుత్వ డిగ్రీ కాలే జీల భవనాలకు రూ. 74.25 కోట్లు తెలంగాణ రాష్ట్రంలో 33 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు (జీడీసీ) సొంత భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం రూ.74.25 కోట్లు మంజూరు చేసింది. అలాగే మెదక్ జిల్లా జోగిపేట్, మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూలు, ఖమ్మం పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాలల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేయడానికి 2.49 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇవీ కొత్త భవనాలు నిర్మించే కాలేజీల వివరాలు కరీంనగర్: జీడీసీ హుస్నాబాద్, గంభీరావుపేట, మహదేవ్పూర్, చొప్పదండి. ఖమ్మం: జీడీసీ నేలకొండపల్లి, గార్ల. వరంగల్: జీడీసీ భూపాలపల్లి, చేర్యాల,మరిపెడ మహబూబ్‌నగర్: జీడీసీ ఆమ్రాబాద్, కొడంగల్, జీడీసీ (డబ్ల్యూ) నాగర్‌కర్నూల్, గద్వాల, జీడీసీ కొల్లాపూర్, షాద్‌నగర్, శాంతినగర్. మెదక్: జీడీసీ (డబ్ల్యూ) సిద్దిపేట్, గజ్వేల్, జోగిపేట్, మెదక్, జీడీసీ పటాన్చెరు, నర్సాపూర్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బుద్దెర. నల్లగొండ: జీడీసీ ఆలేరు, హుజూర్నగర్. నిజామాబాద్: జీడీసీ మోర్తాడ్, దర్పల్లి. రంగారెడ్డి: జీడీసీ చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, తాండూరు, హయత్‌నగర్, విద్యానగర్. -
బ్యాచిలర్ డిగ్రీతో బెటర్ ఫ్యూచర్!!
గ్రాడ్యుయేట్స్ స్పెషల్ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియెట్ పూర్తయిన విద్యార్థుల్లో ఎక్కువ మంది చూపు.. ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులవైపే! ప్రొఫెషనల్ కోర్సులవైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నా.. సంప్రదాయ బీఏ/బీఎస్సీ/బీకామ్ కోర్సులకూ జాబ్ మార్కెట్లో ఏమాత్రం వన్నె తగ్గలేదంటున్నారు నిపుణులు. కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటం, కంపెనీలకు వివిధ నైపుణ్యాలున్న మానవ వనరుల అవసరం ఏర్పడుతుండటమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులతో కెరీర్ స్కోప్.. కాంపిటీషన్ కింగ్.. బీఏ పోటీ పరీక్షల ప్రపంచంలో బీఏ విద్యార్థులదే పైచేయి. సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీపరీక్షలకు ఉపయోగపడే పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ, తెలుగు సాహిత్యం వంటి సబ్జెక్టులను డిగ్రీ స్థాయిలోనే చదివుండటం వల్ల ప్రిపరేషన్లో ఎంతో కలిసొస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులు సైతం సివిల్స్‌లో సోషల్‌సెన్సైస్ సబ్జెక్టులు ఎంచుకుని విజయాలు సాధిస్తున్నారంటేనే ఆర్ట్స్ సబ్జెక్టుల ప్రాధాన్యత ఏమిటో తెలుస్తోంది. బీఏలో చేరిన మొదట్నుంచే సివిల్స్ లక్ష్యంగా కృషి చేస్తే తేలికగా విజయం సాధించొచ్చని నిపుణులు అంటున్నారు. వివిధ వర్సిటీలందించే పీజీ కోర్సుల్లో చేరి ఎంఏలో ఎకనామిక్స్, హిస్టరీ, ఇంగ్లిష్, సోషల్వర్క, ఫారెన్ లాంగ్వేజెస్, పాలిటీ వంటి కోర్సులు అభ్యసిస్తే మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఎకనామిక్స్ చేసినవారికి ఉద్యోగాలెన్నో! హిస్టరీ విద్యార్థులు ఆర్కియాలజీ విభాగాల్లో పనిచేయొచ్చు. పాలిటీ చదివితే వివిధ పత్రికలు, న్యూస్ చానెళ్లు, పోటీ పరీక్షల కోచింగ్ కేంద్రాల్లో అవకాశాలు లభిస్తాయి. లాంగ్వేజెస్ చేసినవారు వివిధ రాయబార కార్యాలయాల్లో, కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేయొచ్చు. కెరీర్ షైనింగ్.. కామర్స్ ప్రస్తుత జాబ్ మార్కెట్ అవసరాలకనుగుణంగా బీకాంలో ఈ-కామర్స్; ఫైనాన్షియల్ మేనేజ్మెంట్; కార్పొరేట్ సెక్రటరీషిప్ వంటి వినూత్న స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంపెనీలకు అవసరమైన అకౌంటింగ్ కార్యకలాపాల నిర్వహణకు కామర్స్ పట్టభద్రులు తప్పనిసరి. వివిధ దేశీయ, విదేశీ సంస్థలు ఒక మాదిరి పట్టణాల్లో సైతం తమ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిల్లో ఖాతాల నిర్వహణ వంటి విభాగాల్లో బీకాం విద్యార్థుల అవసరం ఎంతో ఉంది. కాబట్టి డిగ్రీలో బీకాం, బీకాం(కంప్యూటర్స్ విద్యార్థులు)లు అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాలీ వంటి కోర్సులను నేర్చుకోవడంతోపాటు, స్పోకెన్ ఇంగ్లిష్‌పై దృష్టిపెడితే ప్రారంభంలోనే ఐదెంకెల వేతనాలు ఖాయం. ఇక చార్టర్‌డ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి కోర్సులు పూర్తి చేస్తే.. అవకాశాలు కోకొల్లలు. భావి శాస్త్రవేత్తలకు... బీఎస్సీ ‘దేశవ్యాప్తంగా పరిశోధనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అభివృద్ధి కుంటుపడటం ఖాయం’. ఇది దేశంలోని మేధావులు, నిపుణులు తరచుగా వ్యక్తం చేస్తున్న ఆందోళన! ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే.. నిష్ణాతులైన శాస్త్రవేత్తల అవసరం ఎంతో. డిగ్రీలో కెమిస్ట్రీ, న్యూక్లియర్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, మెరైన్ బయాలజీ, మైక్రోబయాలజీ, బోటనీ, జువాలజీ, మ్యాథ్స్, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, స్టాటిస్టిక్స్ వంటి కోర్సులను దీర్ఘకాలిక దృష్టితో చదవాలి. డిగ్రీ మొదటి ఏడాది నుంచే సబ్జెక్టులను క్షుణ్నంగా చదువుతూ.. ఇష్టమైన అంశంపై పీజీ చేస్తే ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. సీఎస్ఐఆర్ నెట్లో జేఆర్ఎఫ్ సాధిస్తే ప్రతినెలా ఫెలోషిప్ పొందడంతోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ విద్యా సంస్థల్లో పీహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా పనిచేస్తూ ఆకర్షణీయ జీతాలూ పొందొచ్చు. డిగ్రీ కోర్సులకు.. పూర్వ వైభవం మూడేళ్ల నుంచి సంప్రదాయ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారిని బీఏ బాగా ఆకర్షిస్తోంది. సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షల్లో బీఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. బీకాంలో కూడా ఎక్కువ మంది చేరుతున్నారు. సీఏ, కాస్ట్ అకౌంటెంట్స్, సీఎస్ కోర్సుల్లో చేరాలనుకునేవారికి బీకాం సరైన మార్గం. కార్పొరేట్ సంస్థలు సైతం డిగ్రీ ఉత్తీర్ణులకే ప్రాధాన్యతనిస్తున్నాయి. కంపెనీలు క్యాంపస్ నియామకాల ద్వారా బీఎస్సీ ఫైనలియర్ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. గత నెలలో 40 మందికి పైగా సైన్స్ విద్యార్థులను రూ.15 వేలతో కంపెనీలు నియమించుకున్నాయి. - ప్రొ. టీఎల్ఎన్ స్వామి, ప్రిన్సిపాల్, నిజాం కాలేజ్ -
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?
* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు * ఇప్పటికే ప్రారంభమైన తరగతులు * ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది. ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు. -
ప్రత్యేక అవకాశాన్ని పునరుద్ధరించాలి'
న్యూఢిల్లీ: గతవారం ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థుల జవాబుపత్రాల తిరిగి మూల్యాంకణానికి అవకాశం ఇచ్చింది. ఇదే క్రమంలో వివిధ కారణాల వల్ల నిర్దేశించిన కాలానికి డిగ్రీ కోర్సులను పూర్తి చేయని విద్యార్థులకు మరో ‘ప్రత్యేక అవకాశం ఇవ్వాలని’ విద్యార్థి సంఘాలు వర్సిటీ అధికారులను కోరుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఇతరత్రా పరిస్థితుల వల్ల కోర్సును పూర్తి చేయని విద్యార్థులకు ఈ అవకాశం గొప్పసహాయకారిగా ఉంటుందని ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్(డీయూఎస్‌యూ) అధ్యక్షుడు మోహిత్ నాగర్ అభిప్రాయపడ్డారు. పరీక్షల విభాగంపై అధిక ఒత్తిడి పడుతున్నదనే కారణంతో గతంలో ఉన్న ఈ ‘ప్రత్యేక అవకాశాన్ని’ వర్సిటీ రద్దు చేసిందని చెప్పారు. దీన్ని ఢిల్లీ హైకోర్టు కూడా తప్పుపట్టిందన్నారు. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు వర్సీటీ రూల్స్ ప్రకారం ప్రవేశం పొందిన తేదీ నుంచి (డిగ్రీని ఆరు సంవత్సరాల్లో, పీజీని నాలుగు సంవత్సరాల్లో )పూర్తి చేయాల్సి ఉంది. ‘ ప్రత్యేక అవకాశం కల్పించడం ద్వారా మధ్యలో చదువులు నిలిపేసిన విద్యార్థులు పెండింగ్ పరీక్షలు రాయడానికి వీలుకలిగింది. కానీ రెండేళ్ల క్రితం ఈ విధానాన్ని డీయూ రద్దు చేసింది. ఈ విషయమై 32 మంది విద్యార్థులు ఢీల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల విజ్ఞప్తిని పరిశీలించి అవకాశం ఇవ్వాలని హైకోర్టు డీయూ అకాడమిక్ కౌన్సిల్‌కు సూచించింది. విద్యార్థులకు ప్రత్యేక అవకాశం కల్పించడం చట్టవ్యతిరేకమని డీయూ నిబంధనల్లో ఎక్కడా లేదని గుర్తు చేసిందని డీయూ మీడియా కోఆర్డినేటర్, విద్యార్థుల సంక్షేమం జాయింట్ డీన్ మాలె నీరవ్ చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఒకసారి ‘ప్రత్యేక అవకాశాన్ని’ విద్యార్థులకు కల్పించామని డీయూ అధికారి పేర్కొన్నారు. మళ్లీ ఈ అవకాశాన్ని తిరిగి కల్పించే ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేశారు.