Digitalization
-
రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్‌జీపీటీ స్పందన ఇదే..ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. -
ప్రపంచ ఎకానమీలో భారత్ వెలుగులు
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ‘‘ప్రకాశవంతమైన ప్రాంతం‘గా కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) క్రిస్టాలినా జార్జివా అన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ వాటా 15 శాతంగా ఉంటుందని భారత్‌లో పర్యటించనున్న ఆమె అంచనా వేశారు. కరోనా మహమ్మారి సమస్య నుంచి ప్రపంచంలోని ఐదవ–అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను ‘‘డిజిటలైజేషన్’’ బయటపడవేయగలిగిందన్నారు. దీనికితోడు దేశం అనుసరిస్తున్న వివేకవంతమైన ఆర్థిక విధానం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో మూలధన పెట్టుబడులను గణనీయంగా పెంచుతూ (33 శాతం పెంపుతో రూ.10 లక్షల కోట్లకు) బడ్జెట్లో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం దేశ వృద్ధి వేగాన్ని కొనసాగించడంలో సహాయపడతాయని జార్జివా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆమె ఈ మేరకు తెలిపిన అభిప్రాయాల్లో కొన్ని ముఖ్యాంశాలు... ► 2022–23లో భారత్ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండొచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 6.1%గా ఉంటుందన్నది మా అభిప్రాయం. ఆయా గణాంకాలు దేశాన్ని ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఎకానమీగా నిలుపుతాయి. ► ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటును 5.9 శాతానికి తగ్గించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధి అభినందనీయం. ► భారత్ ఎకానమీ మిగతా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలాగా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రపంచ సగటు కంటే, భారత్ వృద్ధి వేగం ఎక్కువగా ఉంది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా దాదాపు 15 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. ► దేశాన్ని ‘గ్రీన్ ఎకానమీ’ వైపు మళ్లించడానికి, తద్వారా వృద్ధిని కొనసాగించడానికి పునరుత్పాదక ఇంధనాలతో సహా వివిధ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడంపై భారతదేశం ఎంత శ్రద్ధ కనబరుస్తోందో నేను ప్రత్యేకంగా గమనించాను. -
లక్ష ట్రక్ ఆపరేటర్లకు డిజిటల్ సర్వీసులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక లక్ష పైచిలుకు ట్రక్ ఆపరేటర్లకు (ట్రకర్లు) డిజిటలీకరణ సేవలు అందించినట్లు టెక్ స్టార్టప్ సంస్థ బ్లాక్‌బక్ సహ వ్యవస్థాపకుడు రాజేశ్ వై తెలిపారు. తమ వ్యాపారాలను పూర్తిగా స్మార్ట్ఫోన్ల ద్వారా నిర్వహించుకోవడానికి, నగదు లావాదేవీలను తగ్గించుకోవడానికి, తమ ట్రక్కులను మరింత మెరుగ్గా నియంత్రించుకోవడానికి, ఆదాయా న్ని మెరుగుపర్చుకోవడానికి ఇవి ఉపయోగపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో 5,000 పైచిలుకు గ్రామాల్లో తమకు కార్యకలాపాలు ఉన్నాయని, వచ్చే 12 నెలల్లో దీన్ని 15,000కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు రాజేశ్ వివరించారు. కొత్త లోడ్ ఆర్డర్లను పొందడం మొదలుకుని జీపీఎస్‌లతో ట్రక్కులను ట్రాక్ చేసుకోవడం, రుణాలు పొందడం వరకు బ్లాక్బక్తో అన్ని రకాల సర్వీసులు పొందవచ్చని పేర్కొన్నారు. 2015లో రాజేశ్, చాణక్య హృదయ, రామసుబ్రమణియన్ బి కలిసి బ్లాక్‌బక్‌ను ఏర్పాటు చేశారు. (ఇదీ చదవండి: రుణాల చెల్లింపులో అదానీ పోర్ట్స్ దూకుడు.. తాజాగా రూ. 1,500 కోట్లు) -
PM SHRI Scheme: ఇక 'బడి' జిటల్
సాక్షి, హైదరాబాద్: మౌలిక వసతులు కల్పించి సాంకేతిక సొబగులతో ప్రభుత్వ పాఠశాలవిద్యను తీర్చి దిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పథకానికి తెలంగాణ నుంచి 1,200 స్కూళ్లను అధికారులు ప్రతిపాదించారు. ఒకవైపు ఆహ్లాదకర వాతావరణం, మరోవైపు ఆధునికపద్ధతుల్లో బోధన ఉంటే పాఠశాలల్లో మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చనేది కేంద్రం యోచన. గ్రామస్థాయి విద్యార్థులకు కూడా జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను అందుబాటులోకి తేవచ్చని, విద్యార్థుల ప్రతిభకు మరింత పదును పెట్టి, ఉపాధి మార్గాలకు పాఠశాల దశలోనే పునాదులు వేయాలని భావిస్తోంది. ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు మూడేళ్లలో రూ.46 లక్షలు అందించనుంది. మౌలిక సదుపాయం.. మరింత సాయం పీఎంశ్రీ కింద ఎంపికైన బడుల్లో సొంత భవనాలు, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, సౌరవిద్యుత్ ఏర్పాటు, కాయగూరల తోట ఏర్పాటు, ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడం, శుద్ధజలం, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ) ల్యాబ్, డిజిటల్ గ్రంథాలయం, క్రీడలకు ప్రోత్సాహం, నాణ్యమైన విద్యతోపాటు అంతర్జాల సదుపాయం, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ, వృత్తివిద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి వంటివాటికి ఈ నిధులను వాడుకోవచ్చని కేంద్రం పేర్కొంది. స్కూల్ దశ నుంచే ఒకేషనల్ కోర్సులను ప్రోత్సహిస్తారు. విద్యార్థి డిగ్రీకి వచ్చేసరికి ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా తీర్చిదిద్దాలన్న జాతీయ విద్యావిధానం–2020కి అనుగుణంగా ఈ పథకాన్ని తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్ డేటానే ప్రామాణికం ప్రతీ పాఠశాల సమాచారాన్ని డ్రిస్టిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్(యూడైస్ ప్లస్)లో నమోదు చేస్తున్నారు. దీని ఆధారంగానే పీఎంశ్రీ పథకానికి ఎంపిక చేస్తారు. యూడైస్‌లో ఆయా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, బోధన విధానాలు, కొన్నేళ్లుగా టెన్త్‌లో వస్తున్న గ్రేడ్లు, ఇతర క్లాసుల్లో వస్తున్న విద్యార్థుల మార్కుల వివరాలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సహకారం, అందుతున్న నిధులతోపాటు ఆ స్కూల్‌కు కావాల్సిన అదనపు గదులు, చేయాల్సిన మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల సమాచారాన్ని పొందుపరుస్తారు. స్థానిక సంస్థల ఆమోదం తప్పనిసరి పీఎంశ్రీ పథకం ఆమోదానికి స్థానిక సంస్థల ప్రతినిధుల ఆమోదాన్ని తప్పనిసరి చేశారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న పాఠశాలలను ఓ కమిటీ పరిశీలిస్తుంది. పథకంలో చేరేందుకు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు, నిధుల వినియోగంపై ఆజమాయిషీకిగాను అవసరమైన కమిటీ ఏర్పాటును గ్రామాల్లో సర్పంచ్‌లు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, కొన్నిగ్రామాల్లో రాజకీయకోణంలో దీనిపై ఇప్పటికీ సర్పంచ్‌లు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని అధికారులు అంటున్నారు. వారికి అవగాహన కలి్పంచి, పాఠశాలల పురోభివృద్ధికి తోడ్పడేలా చూడాలని కేంద్ర విద్యాశాఖ అన్నిరాష్ట్రాలకు సూచించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వచ్చే ఏప్రిల్ నుంచి ఈ పథకం ద్వారా నిధులు అందే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రయోగాలు.. వర్చువల్ రియాలిటీ ద్వారా అవగాహన పీఎంశ్రీ పాఠశాలల డిజిటలైజేషన్లో భాగంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసి, క్లౌడ్ మేనేజ్మెంట్ ద్వారా అన్నిప్రాంతాల నుంచి ఫ్యాకలీ్టని అందుబాటులోకి తేవాలన్నది కేంద్ర విద్యాశాఖ ఆలోచన. దీనివల్ల గ్రామస్థాయి విద్యార్థులకు జాతీయస్థాయి విద్యాప్రమాణాలు అందుతాయని భావిస్తోంది. సైన్స్ సబ్జెక్టుల్లో ప్రయోగాలు, సోషల్‌లో భౌగోళిక స్థితిగతులు వర్చువల్ రియాలిటీలో విద్యార్థులకు అవగాహన కలి్పంచాలని అధికారులు భావిస్తున్నారు. ఉదాహరణకు మొక్క ఆవిర్భావం దగ్గర్నుంచి, దాని ఎదుగుదల దశలను వర్చువల్ పద్ధతిలో విద్యార్థి క్లాస్‌రూం నుంచే తెలుసుకునే వెసులుబాటు కలి్పస్తారు. గ్రహాలు, సూర్య, చంద్రమండలాల్లో మార్పులను ఆధునిక సాంకేతికతతో అర్థమయ్యేలా చెబుతారు. రాష్ట్రం వాటా 40% పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలలకు కేంద్రం, రాష్ట్రం 60:40 నిష్పత్తిలో నిధులను కేటాయించనున్నాయి. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తూ, టీచర్లు తగిన నిష్పత్తిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే ఈ పథకం కింద అధికారులు ఎంపిక చేయనున్నారు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14,500 పాఠశాలలను వివిధ ప్రమాణాల ద్వారా గుర్తించారు. అయితే ఈ పథకం కింద ఎంపికైన పాఠశాలలు సాధిస్తున్న ప్రగతి, మెరుగైన ఫలితాల గురించిన పర్యవేక్షణ బాధ్యత మాత్రం కేంద్ర విద్యామంత్రిత్వశాఖదే. మూడు దశల్లో పాఠశాలల స్క్రీనింగ్ పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను ఎంపిక చేయడానికి మూడు దశల స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. మొదటిదశలో స్కూల్లో టెన్త్, ఇతర క్లాసులకు సంబంధించిన కొన్నేళ్ల ఫలితాలు అప్లోడ్ చేశాం. పాఠశాలకు కావాల్సిన నిధులు, మౌలిక వసతుల గురించిన సమాచారారాన్ని యూడైస్ ద్వారా తెలిపాం. మొదటిదశలో మా స్కూల్ ఎంపికైంది. ఇటీవల అధికారులు వచ్చి పరిశీలించారు. మూడోదశలో జిల్లా అధికారులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. మా స్కూల్లో 580 మంది ఉన్నారు. గతేడాది 80 మంది విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్స్ గత నాలుగేళ్లల్లో 48 మందికి లభించాయి. పీఎంశ్రీ కింద భారీగా నిధులొస్తే స్కూల్లో ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుంది. ఫలితంగా ప్రతిభకు మరింత పదును పెట్టవచ్చు. – ఆకుల పద్మలత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐదు వేల పాఠశాలల వివరాలు పంపాం కేంద్రం తీసుకొస్తున్న పీఎంశ్రీ పథకం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకు తోడ్పడుతుంది. అనేక ప్రామాణిక అంశాల ఆధారంగా రాష్ట్రంలో 5 వేల పాఠశాలల వివరాలను అడిగారు. ఇవన్నీ పంపాం. 1,200 స్కూల్స్ పీఎంశ్రీ పరిధిలోకి వస్తాయని ఆశిస్తున్నాం. వీలైనంత త్వరలోనే ఈ పథకం అమలులోకి వస్తుందనే విశ్వాసం ఉంది. – వాకాటి కరుణ, రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
సత్యదేవుని ఆభరణాల డిజిటలైజేషన్
అన్నవరం: సత్యదేవుని బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల డిజిటలైజేషన్ ప్రక్రియ ఆదివారం ఆరంభమైంది. ఉత్సవాలు, ఇతర పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించే ఆభరణాలను డిజిటలైజ్ చేసేందుకు దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు ఆధ్వర్యాన ఫొటోలు తీయించారు. స్వామి వారికి ప్రతి రోజూ అలంకరించే ఆభరణాలను తీయడం సాధ్యం కాదు కనుక వాటిని స్వామివారి జన్మనక్షత్రం మఖ నాడు మూలవిరాట్‌కు అభిషేకం చేసేందుకు తీసినపుడు డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి కిరీటాలు, హారాలు, నేత్రాలు, స్వామివారి మీసం, కర్ణాభరణాలు, బంగారు పాత్రలు, పళ్లాలు సుమారు వంద ఆభరణాలను ఆదివారం రికార్డు ప్రకారం తూకం వేసి, ఫొటోలు తీయించారు. ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట శ్రీనివాస్, అర్చకుడు సుధీర్, అకౌంట్స్ సెక్షన్ సూపరింటెండెంట్లు అనకాపల్లి ప్రసాద్, బలువు సత్య శ్రీనివాస్, ఎస్పీఎఫ్ పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డిజిటలైజేషన్లో భాగంగా ప్రతి ఆభరణాన్నీ ఫొటో తీసి, రికార్డుల ప్రకారం సరి చూసి, దాని పేరు, బరువు, ఇన్వెంటరీ నంబర్, తనిఖీ చేసిన తేదీ తదితర వివరాలతో ఆల్బమ్ చేయించి, దేవస్థానం వెబ్సైట్లో పొందుపరుస్తారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి నిత్యం అలంకరించే ఆభరణాలు సుమారు 200 ఉన్నాయి. ఇవి కాకుండా గతంలో వాడి పాతబడటంతో ప్రస్తుతం దేవస్థానం లాకర్లలో ఉంచిన ఆభరణాలు మరో 200 ఉన్నాయి. వీటి రక్షణకు దేవస్థానంలో నిత్యం 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ప్రధానాలయం వద్ద కాపలా ఉంటారు. దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవస్థానంలో గతంలో గోల్డ్ బాండ్ కోసం ఎస్బీఐకి ఇవ్వగా మిగిలిన ఆభరణాలన్నింటినీ డిజిటలైజ్ చేస్తున్నామని ఈఓ త్రినాథరావు చెప్పారు. రామాలయం, వనదుర్గ, కనకదుర్గ, నేరేళ్లమ్మ ఆలయాల్లోని ఆభరణాలను సోమవారం, బ్యాంకుల్లోని ఆభరణాలను మంగళవారం డిజిటిలైజ్ చేస్తామని తెలిపారు. ప్రస్తుతం వాడకంలో లేని ఆభరణాలను దేవస్థానానికి తిరిగి జమ చేయాల్సిందిగా అర్చకులను ఆదేశించామన్నారు. డిజిటలైజేషన్ వలన భవష్యత్తులో ఆ ఆభరణం చోరీ అయినా లేక పాడయినా దాని వివరాలు తెలుస్తాయని ఈఓ తెలిపారు. (క్లిక్: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు!) -
డిజిటల్ హెల్త్‌లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లు వెచ్చించి వైద్య, ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ సూచించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) కార్యక్రమాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో నిలవటాన్ని అభినందిస్తూ ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. పౌరుల ఆరోగ్య వివరాలకు సంబంధించి ఆస్పత్రుల్లో ఓపీ, ఐపీ, వైద్య పరీక్షలు, చికిత్స లాంటి సమస్త వివరాలను కాగితాలతో పనిలేకుండా కేవలం ఒక్క క్లిక్ ద్వారా తెలుసుకునేలా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 14 అంకెలతో డిజిటల్ ఐడీ దేశంలో ఎక్కడికి వెళ్లినా కాగితాలతో పనిలేకుండా పౌరులకు వైద్య సేవలు అందించడం ఏబీడీఎం ముఖ్య ఉద్దేశం. ప్రతి పౌరుడికీ 14 అంకెల డిజిటల్ ఆరోగ్య ఐడీ నంబర్ కేటాయించి కాగితాల అవసరం లేకుండా ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 2.75 కోట్ల మంది ప్రజలకు రాష్ట్రంలో డిజిటల్ ఐడీలు జారీ అయ్యాయి. వీరిలో 28,314 మంది ఐడీలకు హెల్త్ రికార్డులను అప్లోడ్ చేశారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ నుంచి బోధనాసుపత్రుల వరకూ 13,373 ఆసుపత్రులను రిజిస్టర్ చేశారు. 7,023 మంది ప్రభుత్వ వైద్యులు రిజిస్టర్ అయ్యారు. పౌరులకు డిజిటల్ ఐడీల జారీ, వైద్యుల రిజిస్ట్రేషన్ విభాగాల్లో దేశంలోనే ఏపీ తొలి స్థానంలో నిలవడం గమనార్హం. పైలట్ ప్రాజెక్టుకు రాష్ట్రం ఎంపిక ఏబీడీఎం కార్యక్రమాల్లో రాష్ట్రం ముందు వరుసలో నిలవడంతో నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించి పైలెట్ ప్రాజెక్టు అమలుకు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏబీడీఎంలో నర్సులు, పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. కేంద్రం కంటే ముందే గతేడాది సెప్టెంబర్‌లో ఏబీడీఎం కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించగా అంతకంటే ముందే డిజిటల్ హెల్త్ రికార్డ్స్ సేవలను సీఎం జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులందరికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన గుర్తింపు కార్డులను జారీ చేసింది. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో తెలుసుకునేలా ఆరోగ్య రికార్డులను అనుసంధానించింది. త్వరలో సీహెచ్‌సీల్లో ప్రారంభం ఏబీడీఎం కార్యకలాపాల్లో వేగంగా ముందుకు వెళ్తున్నాం. నర్సులు, పారామెడికల్ సిబ్బంది రిజిస్ట్రేషన్ కూడా చేపడతాం. ఇప్పటికే పీహెచ్సీ, యూపీహెచ్సీ, బోధనాస్పత్రుల్లో ఈ–హాస్పిటల్ విధానాన్ని అమలు చేస్తున్నాం. త్వరలో సీహెచ్‌సీల్లో ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ నెల 23 నుంచి ఎంపిక చేసిన సీహెచ్‌సీలో పైలట్‌గా సేవలు ప్రారంభిస్తాం. అనంతరం అన్ని సీహెచ్‌సీల్లో ఈ–హాస్పిటల్ విధానం అమలు చేస్తాం. ఆరోగ్య శ్రీ, ఎన్సీడీ స్క్రీనింగ్ ద్వారా నిక్షిప్తం చేసిన ప్రజల ఆరోగ్య రికార్డులను ఏబీడీఎంకు అనుసంధానిస్తాం. – నవీన్‌కుమార్, ప్రత్యేక కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ -
అమెజాన్ ద్వారా దేశంలో ఇంత మంది ఉపాధి పొందుతున్నారా?!
న్యూఢిల్లీ: భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత నుంచి ఇప్పటి వరకూ దాదాపు 5 బిలియన్ డాలర్ల ఎగుమతులకు తోడ్పాటు అందించినట్లు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.6 లక్షల పైగా ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చినట్లు వివరించింది. ఇప్పటి దాకా 40 లక్షల లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) డిజిటైజ్ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న సంస్థల డిజిటైజేషన్కూ తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించి 2020 జనవరిలో నిర్వహించిన తొలి అమెజాన్ సంభవ్ కార్యక్రమంలో 2025 నాటికి 1 కోటి పైగా ఎంఎస్ఎంఈలను డిజిటలీకరించాలని, 10 బిలియన్ డాలర్ల ఎగుమతులు, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2021లో టెక్నాలజీ ఆవిష్కరణలపై పనిచేసే ఎంట్రప్రెన్యూర్లు, స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసేందుకు వెంచర్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు వివరించింది. ఇది ఇప్పటికే ’మైగ్లామ్’, ’ఎం1ఎక్సేంజ్’, ’స్మాల్ కేస్’ వంటి సంస్థల్లో ఇన్వెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఎంఎస్ఎంఈల డిజిటలీకరణ, ఎగుమతులకు ఊతమిచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల ద్వారా వేల సంఖ్యలో ఉపాధి అవకాశాల కల్పనకు సహాయం అందించగలుగుతున్నామని అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ (భారత్‌లో వినియోగదారుల వ్యాపార విభాగం) మనీష్ తివారి తెలిపారు. చదవండి: ఏపీజే ఎడ్యుకేషన్‌తో ఏడబ్ల్యూఎస్ జట్టు -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు డిజిటల్ బాట
న్యూఢిల్లీ: గతేడాది నిషేధం ఎత్తివేసిన తర్వాత నుంచి స్వల్పకాలంలోనే 21 లక్షల క్రెడిట్ కార్డులను జారీ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు వచ్చే కొన్ని త్రైమాసికాల్లో పలు డిజిటల్ ఆవిష్కరణలు చేయనున్నట్టు బ్యాంకు సీఎఫ్‌వో ఆర్ శ్రీనివాసన్ వైద్యనాథన్ తెలిపారు. ఈ ఏడాది మార్చి చివరి నుంచి డిజిటల్ ఉత్పత్తుల ఆవిష్కరణపైనా ఆర్బీఐ ఆంక్షలు ఎత్తివేయడంతో బ్యాంకు తదుపరి వృద్ధి ప్రణాళికలపై దృష్టి పెట్టింది. ‘‘బలమైన, సురక్షితమైన టెక్నాలజీతో, మరింత విస్తరణకు వీలుగా ఏర్పాట్లు చేశాం. కొత్త సాంకేతికతను అదే పనిగా పర్యవేక్షిస్తున్నాం’’ అని ఫలితాల సమావేశం సందర్భంగా వైద్యనాథన్ తెలిపారు. చదవండి: కీలక నిర్ణయం..వాటాలను విక్రయించేందుకు సిద్ధమైన హెచ్డీఎఫ్సీ క్యాపిటల్..! -
కోవిడ్ ఎఫెక్ట్.. డాక్టర్లతో ఆన్లైన్ సంప్రదింపులు..
దేశీయ వైద్య రంగంలో డిజిటలైజేషన్ బాగా పెరిగినట్టు ప్రముఖ హెల్త్‌కేర్ సంస్థ ప్రాక్టో నివేదిక వెల్లడించింది. ’కోవిడ్–19ని అర్ధం చేసుకోవడం–భారతదేశంలోని మూడు వేవ్స్‌ను పోల్చడం’ అనే పేరుతో చేసిన తాజా అధ్యయనం తాలూకు నివేదికలో కోవిడ్ కాలం నాటి పలు అంశాలను విశ్లేషించారు. ఈ నివేదిక వెల్లడించిన కొన్ని విశేషాలు.. – మూడు కోవిడ్ వేవ్స్ సమయంలో రోజుకు ఆ¯Œన్లైన్లో డాక్టర్‌తో రోగి గడిపిన సగటు సమయం 30 నిమిషాలు - గత రెండేళ్లలో, కోవిడ్–19 నిర్వహణలో డిజిటల్ హెల్త్‌కేర్ ముఖ్యమైన పాత్ర పోషించింది - మొత్తం ఆన్లైన్ సంప్రదింపులలో 70 శాతం కోవిడ్ గురించే సాగాయి. –సెకండ్‌వేవ్ టైమ్‌లో ఆన్లైన్ సంప్రదింపులు గరిష్టంగా 690 శాతం పెరిగాయి. – మొత్తం టెలిమెడిసిన్ వినియోగదారులలో 57 శాతం మంది మొదటి వినియోగదారులే. – మొత్తం ఆన్లైన్ సంప్రదింపులలో 54 శాతం మిలీనియల్స్, జెడ్ఎస్ నుంచి వచ్చినవి – ఆయుర్వేదం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ వైద్యంలో 50 శాతం వృద్ధి నమోదైంది. – డెంటల్, సైకియాట్రీ, సెక్సాలజీ వంటి స్పెషాలిటీలు వ్యక్తిగత నియామాకాలలో పెరుగుదల సాధించాయి. – డోలో 650 ఎంజి, జింకోవిట్, లిమ్సీ 500 ఎంజీ, అజీ 500ఎంజీ, పాన్‌డి మందులు ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. – కోవిడ్–19 స్వాట్ పరీక్ష, పూర్తి రక్త గణన పరీక్ష, థైరాయిడ్ ప్రొఫైల్‌లు ఎక్కువగా ఆర్డర్ చేసిన రోగనిర్ధారణ పరీక్షలు మెట్రో నగరాల వారీగా... – మూడవ వేవ్‌లో మొత్తం కోవిడ్ సంప్రదింపులలో 32 శాతం బెంగళూరు నుంచే వచ్చాయి. – రెండవ వేవ్ సమయంలో ఢిల్లీ నుండి అత్యధిక సంప్రదింపులు వచ్చాయి, – మూడు వేవ్స్‌లో అత్యధిక ఆన్లైన్ సంప్రదింపులు చేసిన నగరాలలో హైదరాబాద్ మూడవది – మొదటి వేవ్ సమయంలో, ముంబై అత్యధిక ఆన్లైన్ కోవిడ్ సంప్రదింపులకు వేదికైంది. చదవండి: ఓపెన్ మార్కెట్లో కోవిషీల్డ్ బూస్టర్ డోస్.. ధర ఎంతంటే ? -
రాకెట్ స్పీడ్‌తో డిజటల్ ఎకానమీ
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగం, ఆదాయాలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో భారత డిజిటల్ ఎకానమీ గణనీయంగా వృద్ధి చెందనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2030 నాటికి 800 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా 6,300 పైచిలుకు ఫిన్‌టెక్ సంస్థలు ఉండగా .. వీటిలో 28 శాతం సంస్థలు ఇన్వెస్ట్మెంట్ టెక్నాలజీ, 27 శాతం పేమెంట్స్, 20 శాతం ఇతరత్రా రంగాలకు చెందినవి ఉన్నాయని మంత్రి సీతారామన్ చెప్పారు. ‘భారత్‌లో డిజిటల్ ఎకానమీ 2020లో 85–90 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇంటర్నెట్ వినియోగం, ఆదాయాల వృద్ధితో ఇది అనేక రెట్లు పెరిగి 2030 నాటికి 800 బిలియన్ డాలర్లకు చేరనుంది‘ అని ఆమె వివరించారు. రిటైల్ ఇన్వెస్టర్లు.. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసిందని మంత్రి చెప్పారు. దీంతో 2016 మార్చిలో 4.5 కోట్లుగా ఉన్న రిటైల్ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య 2021 మార్చి 31 నాటికి ఏకంగా 8.82 కోట్లకు చేరాయని ఆమె వివరించారు. డిజిటల్ ఎకానమీకి తోడ్పాటు అందించే దిశగా కేంద్రం తాజా బడ్జెట్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల (డీబీయూ) ఏర్పాటును ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. చదవండి: డిజిటైజేషన్‌తో బ్యాంకింగ్‌లో పెను మార్పులు -
వర్క్‌ఫ్రం హోం లేకపోతే ఏం.. సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉద్యోగులు ఎప్పటి నుంచి కార్యాలయాలకు రావాలనే విషయంలో స్పష్టమైన విధానం అంటూ ఏదీ రూపొందించుకోలేదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదేళ్ల అన్నారు. మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ రెడీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా అనేక అంశాలపై ఆయన స్పందించారు. క్లిష్టపరిస్థితుల్లో ఆఫీసులకు రావడం ఎందుకనే భావన ఉద్యోగుల్లో నెలకొంది. 73 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికే మొగ్గు చూపుతున్నట్టు పలు సర్వేల్లో తేలింది. ఆఫీస్ వర్క్ ఒత్తిడి పెరిగితే ఉద్యోగులు కంపెనీలు మారేందుకు వెనుకాడటం లేదు. గతంలోనే ఉన్నడూ లేనంతగా రాజీనామాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఉద్యోగుల ఆందోళన పరిగణలోకి తీసుకుని ప్లెక్లిబులిటీ ఉండే హైబ్రిడ్ పని విధానం వైపు మైక్రోసాఫ్ట్ మొగ్గిందని ఆయన తెలిపారు. టెక్నాలజీతో ఉత్పాదకత పెంపు టెక్నాలజీ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవడం ద్వారా వివిధ స్థాయుల్లోని వ్యాపార సంస్థలు తమ ఉత్పాదకతను మరింతగా పెంచుకోవచ్చని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తద్వారా తమ ఉత్పత్తులు, సర్వీసులను చౌకగా అందించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు డిజిటల్ బాట పడుతున్నాయని ఆయన వివరించారు. హైబ్రిడ్ పని ధోరణి పెరుగుతోందని, వ్యాపారాలు మరింత లోతుగా అనుసంధానమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీల మధ్య విశ్వసనీయమైన సంబంధాలు నెలకొనాలంటే ఎల్లలు లేని డిజిటల్ వ్యవస్థ అవసరం అవుతుందని నాదెళ్ల తెలిపారు. ‘ద్రవ్యోల్బణం పెరిగే ఆర్థిక వ్యవస్థలో.. ధరలను కట్టడి చేసే శక్తి డిజిటల్ టెక్నాలజీకి ఉంది. చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు టెక్నాలజీ ఊతంతో తమ ఉత్పత్తులు, సర్వీసుల ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చౌకగా అందించవచ్చు‘ అని నాదెళ్ల పేర్కొన్నారు. చిప్‌ల డిజైనింగ్‌లో అవకాశాలు: చంద్రశేఖర్ వచ్చే 5–7 ఏళ్లలో సెమీకండక్టర్ డిజైన్, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ తయారీ సేవల్లో భారత్ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. కంప్యూటింగ్‌కు సంబంధించి రాబోయే రోజుల్లో ఇవి కీలకంగా ఉండనున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు. కాగా, కరోనా విజృంభణ మొదలైనప్పటి నుంచి కంపెనీల్లో టెక్నాలజీ, డేటా అనలిటిక్స్ వినియోగించడం మరింతగా పెరిగిందని ఫ్యూచర్ రెడీ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు తెలిపారు. వ్యాపార సంస్థలు ఉత్పాదకత పెంచుకోవడానికి, నిర్ణయాత్మకంగా వ్యవహరించడానికి, పోటీ పడటానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని వారు పేర్కొన్నారు. మరింత పటిష్టంగా భారత్ వృద్ధి: టీసీఎస్ చంద్రశేఖరన్ భారత్ దీర్ఘకాల వృద్ధి గతిపై కరోనా మహమ్మారి ప్రభావం పెద్దగా లేదని దేశీ దిగ్గజం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. కొన్ని ప్రాథమిక అంశాల కారణంగా కాస్త జాప్యం మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఎకానమీ పూర్తి స్థాయిలో పుంజుకున్నాక.. ఈ దశాబ్దంలో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసే దేశాల్లో భారత్ ముందు ఉంటుందని చెప్పారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ 2022.. నచ్చిన చోట నుంచి పనిచేసే వెసులుబాటు! -
ఆ రంగంలో మూడు కోట్ల ఉద్యోగాలు - టాటా గ్రూప్ చైర్మన్
భవిష్యత్తులో డిజిటల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు టాటా గ్రూపు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్. విద్యా, వైద్యం, వ్యాపారం ఇలా అన్ని రంగంల్లో డిజిటల్ కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సెమికండర్లు, 5జీ ఎక్విప్మెంట్ తయారీలోకి టాటా అడుగుపెడుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా డిజిటల్ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలపై జాతీయ మీడియాకు ఆయన వివరించిన అంశాల్లో ప్రధానమైనవి ఇలా ఉన్నాయి. ఈ నాలుగే కీలకం కరోనా తర్వాత పరిస్థితులూ పూర్తిగా మారిపోయాయి. జీవన విధానం మారిపోయింది, పని చేఏ తీరులో మార్పులు వచ్చాయి. వ్యాపారం కూడా రూపు మార్చుకుంటోంది. రాబోయే రోజుల్లో డిజిటలీకరణ, కొత్త రకం సప్లై చైయిన్, పర్యవరణానికి హానీ చేయకుండా అభివృద్ధి చెందడం ముఖ్యమైన అంశాలుగా మారబోతున్నాయి. వీటన్నింటీలో ఆరోగ్యం కాపాడుకోవడం ఓ అంతర్భాగంగా ఉంటుంది. ఈ నాలుగు అంశాల్లో వ్యాపార విస్తరణపై టాటా గ్రూపు దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న అన్ని వ్యాపారాల్లో ఈ నాలుగు థీమ్‌లకు అనుగుణంగా భవిష్యత్ ప్రణాళికలు ఉంటాయి. టేకోవర్లు డిజిటలీకరణ అని సింపుల్‌గా చెప్పుకున్నాం. కానీ ప్రయాణాలు, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలా అన్నింటా డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది చాలా పెద్ద పని. ఈ రంగంలో విస్తరించేందుకు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అవసరాలను బట్టి కొన్ని సంస్థలను కొనాల్సి రావచ్చు. సెమికండక్టర్ల తయారీలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సెమి కండక్టర్ల కొరత ఉంది. భవిష్యత్తులో వీటికి మరింత డిమాండ్ ఉంటుంది. వ్యూహాత్మకంగా టాటా గ్రూపు సెమికండక్టర్ల తయారీ పరిశ్రమలోకి అడడుగుపెడుతోంది. ఇప్పటి వరకు సెమికండక్టర్ల తయారీకి చాలా దేశాలు చైనాపై ఆధారపడేవి. ప్రపంచ వ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో చాలా దేశాలు చైనాకు ప్రత్యామ్నయం చూస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఇండియా వినియోగించుకోవాలి. అందుకే సెమికండక్టర్లు, 5జీ టెక్నాలజీ ఎక్విప్మెంట్ తయారీపై దృష్టి పెట్టాం. 3 కోట్ల ఉద్యోగాలు కరోనా కారణంగా సమాజంలో అసమానతలు పెరిగాయి. ఇవి సమసిపోవాలంటే విద్యా, వైద్య రంగంలో త్వరితగతిన మార్పులు జరగాల్సి ఉంది. ఈ రంగంలో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఉద్యోగ అవకాశాలను సృష్టించవచ్చు. ముఖ్యంగా స్కిల్ తక్కువగా ఉన్న వారికి ఉద్యోగాలను కల్పించే వెసులుబాటు కలుగుతుంది. హైబ్రిడ్‌తో ఇంటి నుంచి, ఆఫీసు నుంచి పని చేసే హైబ్రిడ్ విధానం మరింత విస్త్రృతమైతే పదో తరగతి వరకు చదివిన గృహిణులకు కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. మా అంచనా ప్రకారం హైబ్రిడ్ పద్దతి సక్సెస్ అయితే 12 కోట్ల మంది మహిళలు ఇంటి నుంచే వివిధ ఉద్యోగాలు చేయగలుతారు. దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకి 440 బిలియన్ డాలర్లు సమకూరుతాయి. -
స్వయం సమృద్ధికి తెలంగాణ విధానాలు స్ఫూర్తి
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ మొదలుకుని పరిపాలన, పథకాల అమల్లో తెలంగాణ స్వయం సమృద్ధి సాధన దిశగా పయనిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. తెలంగాణ నుంచి ఇతరులు స్ఫూర్తి పొందాల్సిన అవసరముందన్నారు. యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం శుక్రవారం నిర్వహించిన అమెరికా ఇండియా వర్చువల్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు. కరోనా సంక్షోభంలోనే అనేక అవకాశాలున్నాయని, దేశంలోని ప్రగతిశీల రాష్ట్రాలు చేపడుతున్న కార్యక్రమాలు, విధానాలను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే సులభతర వాణిజ్య విధానం (ఈఓడీబీ)లో తెలంగాణకు టాప్ 20లో చోటు దక్కే అవకాశముందని వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఆరేళ్లుగా టాస్క్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చదువుతూ పనిచేసుకునే రీతిలో డ్యూయల్ డిగ్రీ విధానం తేవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. డిజిటలైజేషన్ ద్వారానే సేవలు.. ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటలైజేషన్ ద్వారానే అనేక సేవలు అందుకునే అవకాశముందని కేటీఆర్ అన్నారు. విద్యా రంగంలో డిజిటలైజేషన్ అవసరముందని చెప్పారు. భారత్‌లో ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని, టీహబ్, వీహబ్, టీ వర్క్స్ వంటి వినూత్న కార్యక్రమాలతో ముందుకు పోవాలన్నారు. నూతన ఐటీ సాంకేతికత కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా ఆరోగ్య, వ్యవసాయ రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందిస్తామని మంత్రి ప్రకటించారు. -
కోవిడ్ సంక్షోభం తర్వాత అనేక అవకాశాలు
సాక్షి, హైదరరాబాద్: ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం ముగిసిన తర్వాత అనేక అవకాశాలు వస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు అన్నారు. ఇప్పటికే తెలంగాణ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మారిందన్నారు. అయితే ప్రస్తుత సంక్షోభం తర్వాత వివిధ రంగాల్లో రానున్న మార్పులకు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. గురువారం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండు రోజులపాటు “ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అప్పార్చునిటీస్ ఇన్ పోస్ట్ కోవిడ్ వరల్డ్” పేరుతో నిర్వహిస్తున్న ఈ వర్చువల్ కాన్ఫరెన్స్‌లో పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐఐ రూపొందించిన ‘నిజామాబాద్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్’ పేరుతో ఒక నివేదికను విడుదల చేశారు. ప్రస్తుతం ఉన్న సంక్షోభం ద్వారా ప్రపంచం డిజిటలీకరణ వైపు వెళ్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, తెలంగాణ సైతం ఈ మార్గాన్ని అందిపుచ్చుకోవడానికి ముందువరుసలో ఉందన్నారు. ఇప్పటికే తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే కార్యక్రమానికి సంబంధించిన పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు. పల్లెలకు ఇంటర్నెట్.. విప్లవాత్మక మార్పులు పల్లెలకు ఇంటర్నెట్ వెళ్ళిన తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని, ఇది డిజిటల్ విప్లవం వైపుగా తెలంగాణను తీసుకెళ్తుందన్న విశ్వాసాన్ని కేటీర్ వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక కొత్త అవకాశాలు వస్తాయని, ఆ దిశగా వారిని నైపుణ్య శిక్షణలో భాగస్వాములు చేసేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14 ప్రాధాన్యత రంగాలను ఎంచుకుని ఆ రంగాల్లో మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని తెలిపిన మంత్రి కేటీఆర్, ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. దీంతోపాటు హైదరాబాద్‌ని ‘స్టార్టప్ క్యాపిటల్’గా తయారు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీ హబ్ ఏర్పాటు ఇండియన్ స్టార్టప్ సిస్టంలో ఒక గొప్ప మార్పుకి కారణం అయ్యిందన్నారు. ఇప్పటికే టీ హబ్ ద్వారా అనేక స్టార్టప్ కంపెనీలు గొప్ప ప్రగతిని సాధించాయన్నారు. దీంతో పాటు మహిళల కోసం ప్రత్యేకంగా వీ హబ్‌ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. (చదవండి: ప్రపంచం చూపు మన వైపు) వ్యాపారానికే కాక వ్యవసాయానికి ప్రాధాన్యత భారీ స్థాయిలో పారిశ్రామిక పార్కులు ఉండాలన్న బృహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు కేటీఆర్. ఇప్పటికే ఈ దిశగా దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కులను తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్.. హైదరాబాద్ ఫార్మా సిటీతో పాటు దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్.. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైసెస్ లాంటి వివిధ పారిశ్రామిక పార్కుల అభివృద్ధి చేపడుతున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలియజేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పోల్చిచూస్తే రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఉన్నత ప్రమణాలు నెలకొల్పామన్నారు. దేశంలోని 24 గంటలపాటు గృహ, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కేవలం వ్యాపార సంస్కరణలకు, పెట్టుబడుల ఆకర్షణలో మాత్రమే కాకుండా వ్యవసాయ రంగానికి సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు రైతు బంధు, రైతు బీమా రైతు సంక్షేమ కార్యక్రమాల ద్వారా రైతాంగంలో వ్యవసాయం పట్ల సానుకూల దృక్పథం ఏర్పడిందని తెలిపారు కేటీఆర్. (చదవండి: ఇంటింటికీ ఇంటర్నెట్ ) తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల వలనే దేశంలోనే అత్యధికంగా సాగు నమోదు అయిందన్నారు కేటీఆర్. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది సుమారు 36 శాతం సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. తెలంగాణ రైతాంగానికి, వారి సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో తనదైన శైలితో ముందుకు పోతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, ఖమ్మం : నగదు రహిత లావాదేవీలకు రేషన్ దుకాణాలు వేదికలుగా మారాయి. కార్డులపై వినియోగదారులకు ఇప్పటివరకు బియ్యం, పంచదార వంటి సరుకులను పంపిణీ చేసిన దుకాణాలు.. ఈ నెల నుంచి బహుళ సేవలు అందించనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ సజావుగా సాగేందుకు.. రేషన్ దుకాణాల్లో సరుకులు తీసుకునే వినియోగదారులు ఇతర సేవలు ఇక్కడి నుంచే పొందేందుకు అవకాశం కల్పించడం వల్ల ఇటు వినియోగదారులకు.. అటు డీలర్లకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం ప్రత్యేకంగా టీ–వాలెట్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 669 రేషన్ దుకాణాలు ఉండగా.. కార్డులు 4,07,622 ఉన్నాయి. వీటికి నెలవారీగా 64,29,346 కేజీల బియ్యం సరఫరా అవుతుంది. గతంలో రేషన్ దుకాణాల ద్వారా 9 రకాల వస్తువులు సరఫరా చేసేవారు. బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, నూనె, పసుపు, కారం, చింతపండు, గోధుమపిండి వంటివి రేషన్ కార్డుదారులకు అందించేవారు. అయితే ప్రస్తుతం బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేస్తున్నారు. పంచదార కూడా అంత్యోదయ కార్డులున్న వారికే ఇస్తున్నారు. దీనివల్ల రేషన్ డీలర్లు బియ్యం ఒక్కటే అమ్ముతున్నందున తమకు కమీషన్ సరిపోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా మరిన్ని సేవలను అందించడం వల్ల డీలర్లకు కమీషన్ పెంచడంతోపాటు డిజిటల్ లావాదేవీలను ప్రజలకు అలవాటు చేయవచ్చనే ఉద్దేశంతో వాటిని అందుబాటులోకి తెచ్చింది. అందుతున్న సేవలివే.. రేషన్ దుకాణాల ద్వారా వినియోగదారులకు సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. చిన్న మొత్తంలో లావాదేవీల కోసం బ్యాంక్‌కు కానీ.. మీసేవ కేంద్రానికి కానీ వెళ్లాల్సి వచ్చేది. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత జనం ఎక్కువగా ఉంటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం చిన్న మొత్తంలో లావాదేవీలు చేయాలంటే రేషన్ దుకాణానికి వెళితే చాలు.. అక్కడ మన పని క్షణాల్లో చేసుకునే సదుపాయం కల్పించారు. రూ.2వేలలోపు లావాదేవీలను ఇక్కడ చేసుకునే వీలు కల్పించారు. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడంతో వినియోగదారులకు డిజిటల్ లావాదేవీలు చేసుకోవడం ఇక సులువుగా మారింది. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ విధానం ద్వారా మొబైల్ రీచార్జి, నగదు బదిలీ, డీటీహెచ్, విద్యుత్ బిల్లుల చెల్లింపు, బస్ టికెట్ బుకింగ్, ఇంటర్నెట్ సర్వీస్ చార్జీలు, ఆధార్ చెల్లింపులు చేసుకోవచ్చు. ఇవన్నీ చేసినందుకు రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించనున్నారు. దీంతో రేషన్ డీలర్లకు ఆదాయం పెరిగే అవకాశం కలగనున్నది. ప్రారంభమైన సేవలు జిల్లాలోని రేషన్ దుకాణాల్లో ఈ డిజిటల్ సేవలు ప్రారంభమయ్యాయి. గత నెలలో ఒక రోజుపాటు ఈ లావాదేవీలపై రేషన్ డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే డీలర్లు లావాదేవీలు ఎలా చేయాలో శిక్షణ పొందడంతో రేషన్ దుకాణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. అయితే వీటిని కొత్తగా ప్రవేశపెట్టడం.. కొందరు డీలర్లకు దీనిపై ఇంకా పూర్తి అవగాహన లేకపోవడంతో పూర్తిస్థాయిలో లావాదేవీలు జరగడం లేదు. దీనిపై రేషన్ డీలర్లు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. వారికి అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో సూచనలు చేసి.. లావాదేవీలు నిర్వహించేలా చూడనున్నారు. టీ–వాలెట్ సేవలు అందిస్తున్నాం.. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ ద్వారా సేవలు అందిస్తున్నాం. అయితే ఇప్పుడే కొత్త కావడంతో వినియోగదారులు పూర్తిస్థాయిలో అలవాటు కాలేదు. రేషన్ దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉన్నాయని అందరికీ తెలియజేస్తున్నాం. ఈ విధానం వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – షేక్ ఇబ్రహీం, రేషన్ డీలర్ పటిష్టంగా అమలు చేస్తాం.. రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్‌ను అమలు చేసేందుకు ఇటీవల డీలర్లకు శిక్షణ ఇచ్చాం. ఈ నెల నుంచి రేషన్ దుకాణాల్లో టీ–వాలెట్ ద్వారా లావాదేవీలు చేయిస్తున్నాం. ఏ ప్రాంతంలోనైనా టీ–వాలెట్ అమలు కాకపోతే మరోసారి డీలర్లకు సూచనలు చేసి పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – అనిల్‌కుమార్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
ఆముక్తమాల్యద తాళపత్రం.. తమిళనేలపై భద్రం
‘‘తెలుగదేలయన్న దేశంబు తెలుగు తెలుగు వల్లభుండ తెలగొకండ ఎల్లనృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స’’ఐదొందల ఏళ్లక్రితం శ్రీ కృష్ణదేవరాయల కలం నుంచి జాలువారిన పద్యమిది. పది హేనో శతాబ్దంలో వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామంలో ‘దేశ భాషలందు తెలుగు లెస్స’అని ప్రపంచానికి చాటారు. కానీ... తెలుగంటే ఎంతో అభిమానాన్ని చాటుకున్న కృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ఆముక్తమాల్య దలో మాతృభాషపై తన మమకారాన్ని మరోసారి చాటారు. ఈ పద్యకావ్యం గురించి తెలియని తెలుగువారుండరేమో. ఈ అక్షరా లను నిక్షిప్తం చేసిన తాళపత్రగ్రంథం ఇప్పటికీ భద్రంగా ఉన్న సంగతి చాలా తక్కువ మం దికి తెలుసు. ఇది తమిళనాడులోని తంజా వూరులో ఉన్న సరస్వతి మహల్ గ్రంథాల యంలో కొలువుదీరి ఉంది. ఈ తెలుగు గ్రంథం తమిళ రాష్ట్రంలో ఉన్నా దాన్ని డిజిటలైజేషన్ చేయాలన్న ఆలోచన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలు పొరపాటున చెదల బారినపడో, వాతావరణ ప్రభావానికి గురయ్యో, అనుకోని ఇతర ప్రమాదాలబారిన పడో ధ్వంసమైతే శాశ్వతంగా అవి అదృశ్య మైనట్టే. దాని ఫొటో ప్రతులు రూపొందిం చాలని ఎనిమిది దశాబ్దాల క్రితమే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆకాంక్షిం చారు. కానీ ఆయన ఆలోచనను కూడా ఇప్పటి వరకు ఎవరూ అమలు చేయకపోవ టం విడ్డూరమే. – సాక్షి, హైదరాబాద్ వందల్లో గ్రంథాలు... తంజావూరు గ్రంథాలయంలో 778 తెలుగు తాళపత్ర గ్రంథాలున్నాయి. వీటిల్లో 455 గ్రంథాలను తర్వాత పుస్తకరూపంలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికీ మరో 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. వీటిల్లో సనాతన వైజ్ఞానికశాస్త్రం, గణితం, పురాణాలు... ఇలా ఎన్నో ఉన్నాయి. వాటిల్లోని ప్రత్యేకతలు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కాగితంపై రాసిన ఒరిజినల్ గ్రంథాలు 44 ఉన్నాయి. వీటిల్లో పుస్తకరూపంలో తీసుకు రానివి 26 ఉన్నాయి. ఇలా ఎన్నో విలువైన తెలుగు గ్రంథాలు తమిళనేలపై ఉన్నా వాటిని జనంలోకి తెచ్చే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. అసలు.. ఆ పుస్తకాల సారాంశమేంటో తెలుసుకునే కసరత్తు కూడా జరగలేదు. వాటిని భాషావేత్తలు పరిశోధిస్తే సమాజానికి తెలియని ఎన్ని కొత్త విషయాలు తెలుస్తాయో కూడా అంచనా వేయలేని పరిస్థితి. సర్వేపల్లి కాంక్షించినా... డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతి కాకపూర్వం ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉండగా, 1933లో తంజావూరు సరస్వతి మహల్ గ్రంథాలయంలోని తెలుగు గ్రంథాల గురించి తెలుసుకున్నారు. వాటిల్లో అచ్చు కానివి, బాహ్య ప్రపంచానికి తెలియనివి ఎన్ని ఉన్నాయో తెలుసుకుందామని వెళ్లి శోధించి వాటి జాబితా రూపొందించారు. వాటిల్లో అముద్రిత గ్రంథాలను ముద్రించాలని నాటి ప్రభుత్వానికి అందించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిస్థాయి వరకు వెళ్లటం, బిజీగా గడపటంతో ఆ గ్రంథాలు అలాగే ఉండిపోయాయి. ఇటీవల కొందరు భాషాభిమానులు సర్వేపల్లి రూపొందించిన జాబితాను గుర్తించారు. కానీ, రెండు తెలుగు ప్రభుత్వాలు మాత్రం దాన్ని పట్టించుకోలేదు. భాషాభిమానుల నుంచి విన్నపాలను అందుకున్నా ఆ దిశగా ఆసక్తి చూపకపోవటం విడ్డూరం. గణితశాస్త్రంలో మన ఘనత.. గణితశాస్త్రంలో అద్భుతాలు సృష్టించింది సనాతన భారతమే, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గణితంలో ఘనతను సాధిస్తుందీ మనవారే. అలాంటి గణితం పద్యరూపంలో ఉందంటే నమ్ముతారా.. గణితంలోని ఎన్నో అంశాలను పద్యాల ద్వారా గొప్పగా వివరించి ఆ శాస్త్రంలో ప్రత్యేకతలను పరిచయం చేసింది ‘గణిత చూడామణి’. 19 వ శతాబ్దంలో ఇలాగే ఇది తళుక్కున మెరిసి పూర్వీకులను గణిత పం డితులుగా మార్చింది. తంజావూరు గ్రంథా లయంలో దిక్కూమొక్కూలేక పడి ఉన్న తెలుగు తాళపత్రగ్రంథాల్లో ఎన్ని గొప్ప విషయాలున్నాయో, అవి ఎప్పుడు మన ముందుకు వస్తాయోనని భాషాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొనాలి.. ‘నేను ఓ సదస్సు కోసం వెళ్లినప్పుడు తంజావూరు గ్రంథాలయంలో తెలుగు తాళపత్రగ్రంథాలను చూసి పులకరించి పోయాను. ఆముక్తమాల్యద లాంటి ఒరిజినల్ ప్రతులున్నాయని తెలుసుకుని సంబరపడ్డాను. వాటిల్లో ముద్రితం కానివాటిని వెంటనే ముద్రించటంతోపాటు తాళపత్ర గ్రంథా లను డిజిటలైజేషన్ చేయాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వానికి నివేదించాను. కానీ, ఇప్పటి వరకు ఆ కసరత్తు ప్రారంభం కాకపోవటం బాధాకరం’ డాక్టర్ రాజారెడ్డి, వైద్యుడు, చరిత్రపరిశోధకులు ముందుకు సాగని మహాసభల స్ఫూర్తి.. ప్రపంచ తెలుగు మహాసభలలో ఎంతోమంది భాషాభిమానులు ప్రాచీన తెలుగుగ్రంథాల పరిరక్షణకు పలు సూచనలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అముద్రిత తెలుగు గ్రంథాలను గుర్తించి వాటిని కాపీ చేసి ప్రజల ముంగిటకు తేవాలని కోరా రు. ఈ క్రమంలోనే లండన్ లైబ్రరీలో దాదాపు 8 వేలకు పైచిలు కు తెలుగు పుస్తకాలున్నాయని, వాటిల్లో కొన్ని తెలుగునేలపై లభించటం లేదని గుర్తించి వాటిని కాపీ చేయాలని ప్రస్తావిం చారు. కానీ ఆ దిశగా అసలు అడుగు పడకపోవటం విచిత్రం. కౌటిల్యుడి అర్థశాస్త్రం ఇలాగే వెలుగు చూసింది... రాజనీతి, పాలన, సమాజం... ఇలా ఎన్నో అంశాలను స్పృశిస్తూ ప్రపంచానికి మార్గదర్శనంగా నిలిచిన గొప్ప గ్రంథం అర్థశాస్త్రం. కౌటిల్యుడు రాసిన ఈ మహత్ గ్రంథం క్రీస్తుపూర్వంలో ఆవిష్కృతమైనా ఆ తర్వాత క్రీ.శ.12 వ శతాబ్దం వరకు దీనిని ప్రపంచం అనుసరించింది. ఆ తర్వాత ఆ గ్రంథ ప్రతులే కనిపించలేదు. కానీ, వందల ఏళ్ల తర్వాత ఆ గ్రంథం తాళపత్ర రూపం మైసూరులో ప్రత్యక్షమైంది. అక్కడి గ్రంథాలయంలో అనామకంగా పడి ఉన్న ఆ సంస్కృత గ్రంథాన్ని శ్యామశాస్త్రి గుర్తించి 1909 ప్రాంతంలో ఆంగ్లంలోకి అనువదించి పుస్తకరూపమిచ్చారు. -
దూరదర్శన్ కేంద్రాల మూసివేత!
జ్యోతినగర్ (రామగుండం): రాష్ట్రంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన ప్రసారాలను అందించిన 19 ప్రసార భారతి దూరదర్శన్ కేంద్రాలు మరో వారం రోజుల్లో మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రసార భారతి డైరెక్టరేట్ జనరల్ నుంచి ఆయా దూరదర్శన్ కేంద్రాలకు ఉత్తర్వులు అందాయి. లోపవర్ ట్రాన్స్‌మీటర్/ వెరీ లోపవర్ ట్రాన్స్‌మీటర్ ప్రసారాలను నెలాఖరులో నిలుపుదల చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. మూతపడే వాటిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 25 ఏళ్ల నుంచి ప్రసారాలను అందిస్తున్న 5 కేంద్రాలు ఉన్నాయి. ఎన్టీపీసీ రామగుండం టెంపరరీ టౌన్షిప్లో 1989లో ఏర్పాటు చేసిన దూరదర్శన్ కేంద్రం ద్వారా రామగుండం, గోదావరిఖని ప్రాంతంతో పాటు 40 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు దూరదర్శన్ ప్రసారాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావమైనప్పటి నుంచి యాదగిరి పేరుతో ప్రసారాలు అందిస్తున్నారు. పోర్టబుల్ టీవీలకు తప్పని ఇబ్బందులు దూరదర్శన్ కేంద్రాలను ఎత్తివేసినప్పటికీ డిజిటలైజేషన్ సాయంతో నాణ్యమైన ప్రసారాలు రానున్నట్లు సమాచారం. కానీ పోర్టబుల్ టెలివిజన్లకు డిజిటల్ విధానం ఎంతవరకు ఉపయోగపడుతుందనేది తెలియాల్సి ఉంది. సిగ్నల్స్ అందుకునే సామర్థ్యం బ్లాక్ అండ్ వైట్ టీవీలకు సాధ్యమా..అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో డేటా లేకుండా ప్రసారాలను చూడవచ్చని చెబుతున్నందున, ఎఫ్ఎం తరహాలో మొబైల్ ప్రసారాలకు ఆదరణ లభించే అవకాశం ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే దూరదర్శన్ చూస్తున్నట్లు సర్వేలో తేలడంతోనే కేంద్రాల తొలగింపునకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో మూతపడనున్న దూరదర్శన్ ట్రాన్స్మీటర్లు 19 భద్రాచలం, భైంసా, గద్వాల, జడ్చర్ల, కరీంనగర్, కొల్లాపూర్, కోస్గి, మిర్యాలగూడ, మాడ్గుల, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, సిద్దిపేట, సిరిసిల్ల, తాలకొండపల్లి, వేములవాడ, వనపర్తి, యెల్లందు. -
హాజరు పడాలంటే చెట్టెక్కాల్సిందే!
రాంచీ: క్లాస్‌లో కూర్చొని.. రోల్ నంబర్ వన్.. రోల్ నంబర్ టూ.. అంటూ విద్యార్థుల అటెండెన్స్ తీసుకునే టీచర్లు తమ హాజరు నమోదు కోసం మాత్రం చెట్లెక్కుతున్నారు. హాజరు కోసం చెట్లెక్కడమేంటి.. అనే కదా? టీచర్లు సరిగ్గా పాఠశాలకు వస్తున్నారో? లేక రిజిస్టర్లో దొంగ సంతకాలు పెట్టి సొంతపనులు చక్కబెట్టుకుంటున్నారో? గుర్తించేందుకు జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవలే కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ప్రతి స్కూల్లో ఓ ట్యాబ్లెట్ ఫోన్ ఉంటుంది. స్కూల్‌కు రాగానే దానిలో ఫేస్ రికగ్నేషన్ ఫీచర్‌తో హాజరును నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు టీచర్ ఆ రోజు స్కూల్‌కు వచ్చినట్లు అది విద్యాశాఖ కార్యాలయానికి హాజరు నమోదును పంపుతుంది. టెక్నాలజీ బాగానే ఉన్నా.. అసలు సమస్య సిగ్నల్స్‌తో వచ్చింది. ఆ రాష్ట్రంలోని పాలము జిల్లా, సోహ్రీఖాస్ గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ అందాలంటే చెట్లెక్కాల్సిందే. దీంతో తమ హాజరు నమోదు చేయడానికి టీచర్లకు చెట్లెక్కక తప్పడంలేదు. టీచర్లు యువకులైతే సరే.. మరి వయసు పైబడినవారి సంగతేంటి? స్కూల్‌కు వచ్చినా.. గైర్హాజరైనట్లేనా? ఈ ప్రశ్నకు విద్యాశాఖ అధికారుల నుంచి మాత్రం సమాధానం రావడంలేదట. -
నేటి నుంచి వరల్డ్ ఐటీ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: ‘ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్’గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు భాగ్యనగరం వేదికగా సోమవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించనున్నారు. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహించనున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్ వేదిక కావడం విశేషం. ఐటీ రంగ వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు, ఆవిష్కరణలు, వ్యూహాలు, వ్యాపారాలు, భవిష్యత్తు తదితర అంశాలపై మేధోమథనం కోసం ఏటా నాస్కామ్ నిర్వహించే ఇండియా లీడర్షిప్ ఫోరం (ఐఎల్ఎఫ్) కార్యక్రమం సైతం ఈ సదస్సుతోపాటే జరగనుంది. ఐఎల్‌ఎఫ్‌లో అంతర్భాగంగా ప్రపంచ ఐటీ కాంగ్రెస్ నిర్వహణలో నాస్కామ్ భాగస్వామ్యం వహించనుంది. ‘పంచ’తంత్రం... ఐటీ కంపెనీల్లో ఆటోమేషన్ ప్రభావం ఎక్కువ కావడం, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), వర్చువల్ రియాలిటీ (వీఆర్), బ్లాక్‌చైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఐటీ కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇలాంటి పరిణామాలను తట్టుకునేందుకు కంపెనీలకు సంసిద్ధత తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఐదు ప్రధాన అంశాలపై ప్రపంచ ఐటీ కాంగ్రెస్‌లో దృష్టిసారించనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో శరవేగంగా వస్తున్న మార్పులను తట్టుకొని ఐటీ పరిశ్రమలు మనుగడ సాధించేందుకు సంసిద్ధులై ఉండటం, వ్యాపారంలో కీలకాంశాలను డిజిటైజ్ చేయడం, భవిష్యత్తులో మనుగడగల ఓ సంస్థ, భవిష్యత్తు సవాళ్లు, సరిహద్దుల చెరిపివేతకు భాగస్వామ్యం అనే అంశాల ఎజెండాపై సదస్సులో మేధోమథనం చేయనున్నారు. 30 దేశాల నుంచి ప్రతినిధులు... ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సుకు 30 దేశాల నుంచి ఐటీ రంగానికి సంబంధించిన 2,000 మంది దార్శనికులు, పరిశ్రమ, ప్రభుత్వాల సారథులు, విద్యావేత్తలు హాజరుకానున్నారు. టాప్ 500 ఐటీ కంపెనీల నుంచి కనీసం 20 మంది సీఈఓలు, మరో 100 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఈ భేటీలో పాల్గొననున్నారు. సదస్సులో 50కిపైగా చర్చాగోష్టులు, మరో 50కిపైగా ఐటీ ఉత్పత్తులపై ప్రదర్శన(షోకేస్)లు ఉండనున్నాయి. సదస్సు ప్రారంభోత్సవంలో డబ్ల్యూఐటీఎస్‌ఏ చైర్మన్ ఇవాన్ చియు, ప్రధాన కార్యదర్శి జిమ్ పైసంట్, విప్రో చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషబ్ ప్రేమ్‌జీ, నాస్కామ్ చైర్మన్ రమణ్ రాయ్, అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలు సైతం ప్రసంగించనున్నారు. సదస్సులో ప్రతినిధులు 1,000 నిమిషాల చర్చాగోష్టుల్లో పాలుపంచుకోవడంతోపాటు వ్యాపార ప్రదర్శనలు తిలకించనున్నారు. భారత సంతతికి చెందిన కెనడా సైన్స్ అండ్ టెక్నాలజీశాఖ మంత్రి నవదీప్ బైన్స్, బీసీజీ చైర్మన్ హన్స్‌పౌల్ బుర్కనర్, అడోబ్ చైర్మన్ శంతాను నారాయణ్, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, బాలీవుడ్ నటి దీపికా పదుకుణే, ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తదితరులు సదస్సులో పాల్గొననున్నారు. హ్యూమనాయిడ్ రోబో సోఫియాతో మంగళవారం నిర్వహించే ఇంటర్వ్యూ సదస్సుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అతిథులకు చౌమహళ్లలో విందు ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చే దేశ, విదేశీ అతిథుల గౌరవార్థం రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి 7 గంటల నుంచి నగరంలోని చౌమహల్లా ప్యాలెస్‌లో ప్రత్యేక విందును ఏర్పాటు చేసింది. -
స్మార్ట్‌గా పాస్ పుస్తకం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూ రికార్డుల ప్రక్షాళనలో సరికొత్త ఆవిష్కరణలకు తెరలేచింది. భూ వివాదాలకు తావివ్వకుండా రాష్ట్ర సర్కారు డిజిటల్ పాస్‌పుస్తకాలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల రెవెన్యూ రికార్డుల నవీకరణ ప్రక్రియను పూర్తి చేసిన యంత్రాంగం.. మార్చి 11న కొత్త పాస్‌పుస్తకాల జారీకి రంగం సిద్ధం చేసింది. ఇందులోభాగంగా ఇప్పటి వరకు అమలులో ఉన్న పాస్బుక్ల స్థానే ‘స్మార్ట్’ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందులో సమగ్ర భూ వివరాలను నిక్షిప్తం చేయనుంది. ఈ సమాచారాన్ని ఆన్లైన్లో పొందుపరచనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ప్రభుత్వం.. ఈ సమాచారాన్ని తారుమారు చేయకుండా అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తోంది. ప్రస్తుతం పాస్‌పోర్టుల జారీలో అవలంభిస్తున్న విధానం మాదిరి ఈ కార్డులకు రూపకల్పన చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ హై సెక్యూరిటీ ముద్రణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 18 సెక్యూరిటీ ఫీచర్లతో చూడముచ్చటగా.. ఈ డిజిటల్ పాస్‌పుస్తకాల్లో 18 ఫీచర్లు ఉండనున్నాయి. భూ కేటగిరీ, పట్టాదారు, సాగు విస్తీర్ణం, బ్యాంకు ఖాతా, ఫోన్, ఆధార్ నంబర్ సహా ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేసేందుకు అనువుగా సాంకేతికతకు జోడించినట్లు తెలిసింది. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా రైతులకు సరికొత్త ’స్మార్ట్’ పాసు పుస్తకాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. దానికి అనుగుణంగా రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తోంది. గత మూడు రోజులుగా తహసీల్దార్లకు శిక్షణా తరగతులను నిర్వహించింది. అదే రోజు నుంచి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కూడా తహసీల్దార్లే చూడనున్నందున దానికి తగ్గట్టుగా శిక్షణ ఇస్తోంది. మరోవైపు హై సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్‌కు ముద్రణ బాధ్యతలు అప్పజెప్పిన ప్రభుత్వం.. తహసీల్దార్ల డిజిటల్ సంతకాల సేకరణలో నిమగ్నమైంది. అవసరమైతే, బల్క్‌గా డిజిటల్ సంతకాల చేసే వెసులుబాటు కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. పెట్టుబడి సాయంలో కీలకం! తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పెట్టుబడి సాయంలో ఈ కార్డులు కీలకం కానున్నాయి.గతంలో నకిలీ పాస్‌పుస్తకాల బెడద కారణంగా పంటనష్ట పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ, బ్యాంకు రుణాలతో ప్రభుత్వానికి టోకరా వేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న స్మార్ట్ కార్డులతో అక్రమాలకు ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాకుండా ప్రతి ఏడాది ఎకరాకు రూ.8వేలను పెట్టుబడి ప్రోత్సాహకంగా రైతన్నకు అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఖరీఫ్‌లో రూ.4వేల చొప్పున రైతులకు ఇచ్చేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది. -
ఏపీ ప్రభుత్వంతో పెగాసిస్టమ్స్ ఒప్పందం
-
అర చేతి తెరలోకి తెలుగొస్తుందా?
కంప్యూటర్లో తెలుగు టైపు చెయ్యడం అన్నది పాతమాట. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా, అసలు తెలుగులోనే కంప్యూటర్లు ఎందుకు ఉండకూడదూ అని ఆలోచిద్దాం.కంప్యూటర్లు వాడుకలోనికి రావడం మొదలైననాటి నుండి వాటిలో (ఆంగ్లేతర) మానవ భాషల వినియోగానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంత సాంకేతిక అభివృద్ధి జరిగిన తర్వాత, ఇప్పటికైనా మామూలు తెలుగువాడు కంప్యూటర్ని తెలుగులోనే వాడుకోగలడా!? అయితే, ఎంతవరకూ వాడుకోగలడు? దీన్ని నాలుగు స్థాయుల్లో చూద్దాం. కంప్యూటర్ అంటే స్మార్టు ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు కూడా. ఒకటో స్థాయి: తెలుగు చూడటం, టైపు చెయ్యడం ఈ స్థాయిలో కంప్యూటర్లు తెలుగులో సమాచారాన్ని తెరపై చూపించగలగాలి. మనకి టైపు చేసే వీలు కల్పించాలి. నేడు మనం ఈ స్థాయిని చాలావరకు చేరాం అని చెప్పవచ్చు. అన్ని రకాల కంప్యూటర్లలోనూ (విండోస్, గ్నూ/లినక్స్, మ్యాకింటోష్), కొత్త స్మార్టు ఫోన్లలోనూ (ఆండ్రాయిడ్, ఐఓస్, విండోస్) ఇప్పుడు మనం తెలుగు సమాచారాన్ని చూడవచ్చు, వీటిలో టైపు చెయ్యవచ్చు కూడా. ఈ పరికరాలన్నీ కూడా ఇప్పుడు కనీసం ఒక తెలుగు ఫాంటుతో వస్తున్నాయి. ఇక టైపు చెయ్యడానికి మనం కీబోర్డు సెట్టింగులలో తెలుగు భాషను ఎంచుకుంటే చాలు. చాలా వరకూ తెలుగు ఇన్‌స్క్రిప్టు కీబోర్డు లేయవుట్లు ఉంటుంది. మనకి ఇప్పటికే ఆపిల్, మాడ్యులర్ వంటి లేయవుట్లు తెలిసివుంటే, వాటితోనూ టైపు చేసుకోడానికి అప్లికేషన్లూ దొరుకుతున్నాయి. అంతర్జాలంలో మనకు అన్ని అవసరాలకు ఉపయోగపడే తెలుగు సమాచారం అందుబాటులో లేదు. తెలుగు వార్తా పత్రికల సైట్లు, తెలుగు బ్లాగులు, తెలుగు వికీపీడియా, మరి కొన్ని గాసిప్ సైట్లూ తప్ప అంతర్జాలంలో తెలుగు పెద్దగా లేదన్నది ఒక వాదన. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వెబ్ సైట్లూ అరకొరగానే తెలుగులో ఉన్నాయి. కానీ ఈ మధ్య ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాసేవారు బాగా పెరిగారు. రెండో స్థాయి: తెరపై మొత్తం తెలుగు కనబడటం ఈ స్థాయిలో కంప్యూటరు గానీ, ఫోను గానీ మామూలు అవసరాలకు వాడుకోడానికి ఆంగ్లం అవసరం ఉండకూడదు. తెలుగుకి సంబంధించినంత వరకూ మనం ఈ స్థాయిలో మొదటి మెట్టు దగ్గరే ఉన్నాం. విండోస్, గ్నూ/లినక్స్ నిర్వాహక వ్యవస్థలను తెలుగు భాషలో వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ విండోస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కొరకు తెలుగు భాషా ప్యాక్‌లు మైక్రోసాఫ్ట్ వారి సైటు నుండి దింపుకోవచ్చు. మొజిల్లా ఫైర్ఫాక్స్, గూగుల్ క్రోమ్ వంటి ఏవో కొన్ని అప్లికేషన్లు మాత్రమే తెలుగులో లభిస్తున్నాయి. ఇక అంతర్జాలం విషయానికి వచ్చేసరికి, గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్ వంటి సైట్లూ, ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, లిబ్ర ఆఫీస్ లోనూ కొంత వరకూ తెలుగు స్పెల్ చెకింగ్ అందుబాటులో ఉంది. కానీ తెలుగు వ్యాకరణాన్ని సరిచూసే వెసులుబాటు మాత్రం లేదు. మన దేశ కంపెనీలు పేటీఎమ్, 1ఎమ్జీ వంటి ఆప్స్ తెలుగులో కూడా ఉన్నాయి. వీటిని తెలుగులో వాడుకోడానికి, ఆయా ఆప్స్ సెట్టింగులలో మన భాషని తెలుగుగా ఎంచుకోవాలి. గూగుల్ మ్యాప్స్‌లో ఊర్లు, వీధుల పేర్లు ఈ మధ్య తెలుగులో కనిపిస్తున్నాయి. ఇదో శుభపరిణామం. ఇన్ని ప్రోగ్రాములూ ఆప్స్ తెలుగులో అందుబాటులో ఉన్నా వీటిలోని అనువాదాలు అందరికీ అర్థమయ్యే విధంగా లేవనీ అనువాదాలలో నిలకడ, నాణ్యత లోపించాయనీ కూడా ఫిర్యాదులున్నాయి. మనం వాడి చూసి, తప్పులనూ దోషాలనూ ఆయా కంపెనీలకు నివేదించాలి. తెలుగు బాగా తెలిసిన వారినీ, అనువాదాలపై పట్టున్న వారినీ ఈ స్థానికీకరణ ప్రక్రియలో భాగస్వాములను చెయ్యాలి. ఇంత చెప్పుకున్నా, రోజువారీ అవసరాలను పూర్తిగా తెలుగులోనే జరుపుకోగలమా అంటే లేదనే చెప్పాలి. ఈ దిశగా మనం ప్రభుత్వాలనూ, వ్యాపార సంస్థలనూ అడగాలి. తెలుగు రాష్ట్రాల్లో అమ్ముడయ్యే, వస్తూత్పత్తులూ, సేవలూ, వాటి సంబంధిత సమాచారమూ తెలుగులో కూడా ఉండేవిధంగా మన ప్రభుత్వాలు విధానపరంగా చర్యలు చేపట్టాలి. ఇంగ్లీషు లేకుండా కంప్యూటర్లు వాడుకోడానికి, కీబోర్డులు తెలుగులో కూడా ఉండాలి. గతంలో టీవీఎస్ కీబోర్డులు తెలుగు మీటలతో ఉండేవి. ఈ మధ్య సురవర వారు తెలుగు కీబోర్డులు అమ్మారు. అలాంటి ప్రయత్నాలు ఊపందుకోవాలి. భారతదేశంలో విక్రయించే స్మార్టు ఫోన్లలో తప్పనిసరిగా ప్రాంతీయ భాషలు ఉండాలని కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ఉంది. కానీ కంప్యూటర్లకూ, వెబ్ సైట్లకూ ఇలాంటి ఉత్తర్వులు ఏమీ ఉన్నట్టు లేవు. మూడో స్థాయి: కంప్యూటర్లు మన మాటల్ని అర్థం చేసుకొని తెలుగులోనే బదులివ్వగలగడం ఐఫోన్లో సిరి, గూగుల్ అసిస్టెంట్, మైక్రోసాఫ్ట్ కోర్టానా, అమెజాన్ అలెక్సా వంటి ఉత్పత్తులు/సేవలు మన మాటల్ని ఇంగ్లీషు (ఇంకొన్ని భాషల్లో) అర్థం చేసుకుని బదులివ్వగలుగుతున్నాయి. కానీ, ఇవి తెలుగులో మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. తెరపై తెలుగు పాఠ్యాన్ని చదవగలిగే ఉపకరణాలు ఉన్నా, అవి చదివింది వింటే తెలుగు విన్నట్టు ఉండదు. తెలుగు తీయదనాన్ని అవి నేర్చుకోలేదు. అది నేర్పవలసింది తెలుగువారం మనమే కదా. ఇక తెలుగులో ఉన్న రకరకాల మాండలీకాల్నీ యాసల్నీ, మనందరం మాట్లాడే పద్ధతులనీ అర్థం చేసుకుని అదే రీతిలో బదులివ్వాలంటే, చాలా పరిశోధన జరగాలి. ఈ దిశగా, ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాజెక్టులు, పరిశోధనలూ చెయ్యాలి. నాలుగో స్థాయి: తెలుగులోనే కంప్యూటరు ప్రోగ్రామింగ్ తెలుగులో కంపైలరు తయారుచేయడానికి, తెలుగులో ప్రాగ్రామింగు రాయడానికి ఔత్సాహికుల చిన్ని చిన్ని ప్రయత్నాలు జరిగినా, ఒక స్థాయి చేరుకోడానికి ఇప్పటివరకూ జరిగిన ప్రయత్నాలు సముద్రంలో నీటు బొట్టు కాదు కదా పరమాణువంత లెక్క. ఈ నాలుగో స్థాయిని ప్రస్తుతానికి చేరుకోలేనిదిగా వదిలేయవచ్చు. కానీ, మనం కంప్యూటర్లో చిన్న చిన్న పనులు చక్కబెట్టుకోడానికి, పైపై ఆటోమేషన్‌లకు తేలిగ్గా వాడుకోగలిగేలా తెలుగు స్క్రిప్ట్ కూడా ఉంటే బాగుంటుంది. మూడో స్థాయి వరకూ మనం ఎదగడానికి, తెలుగు భాషకి ప్రత్యేకించి తీరని సాంకేతిక ఇబ్బందులంటూ ఏమీ లేవు; కేవలం మన భాషంటే తేలికభావం, నిర్లక్ష్యం, ఉదాసీనత తప్ప! ఈ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నైనా మనందరం మన అమ్మ భాషకి పునరంకితమై ఈ దిశగా కృషి చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి తెలుగు సామెతల సంకలనం 1868లో వెలువడిన ‘ఆంధ్రలోకోక్తి చంద్రిక’. సంకలన కర్త ఎం.డబ్ల్యూ. కార్. ఇందులో 2,200 సామెతలున్నాయి. పుస్తకం విజ్ఞానధనం పదిలపరచిన తాళం కప్పలేని ఇనప్పెట్టె. – సూర్యప్రకాశ్ నిజమైన కళ ఆత్మనే సంస్కరిస్తుంది. కాని ఆ సంస్కారం కంటికి కనబడదు. చూసి విలువ కట్టలేము. – చలం -
డిజిటలైజేషన్ గడువు పెంపుకు బాబు లేఖ
అమరావతి : కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేబుల్ టీవీ డిజిటలైజేషన్ గడువు రేపటితో ముగియనుంది. గడువును ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని లేఖలో చంద్రబాబు నాయుడు కోరారు. డిసెంబర్ 31 నాటికి ఏపీ ఫైబర్ ప్రాజెక్టు పూర్తవుతుందని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ద్వారా కేబుల్ ప్రసారాలను ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనలో ఉంది. -
రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్
ఏలూరు (మెట్రో) : రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే అవసరమైన ధ్రువీకరణ పత్రా లు అందించే నూతన విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని సీసీఎల్ఏ అనిల్ చంద్ర పునీత రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం మధ్యాహ్నం జిల్లా జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మా ట్లాడారు. ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు రెవెన్యూ సమాచారాన్ని ఆన్లైన్లో పొందు పరచామని, ప్రజలు ఏ ధ్రువీకరణ పత్రం కావాలన్నా క్షణాల్లో పొందే వెసులుబాటు కల్పించామని, ఈ మేరకు ప్రజలకు అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూ రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేశామని, ఈ నేపథ్యంలో రైతులకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలను ఆన్లైన్లో పొందే అవకాశాన్ని కల్పించామన్నారు. డీఆర్వో హైమావతి, సూపరింటెండెంట్లు దొర, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
‘నోట్ల రద్దు’తో సైబర్ నేరాలకు చెక్
మోసాలు తగ్గాయంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు తర్వాత సైబర్ నేరాలు పెద్దగా లేవని రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏటీఎం సెంటర్లలో డబ్బులు ఉండ టం లేదు. రద్దుకు ముందు ఇంటర్నెట్ బ్యాంకిం గ్‌పై పెద్దగా అవగాహన లేకపోవడంతో సైబర్ మోసగాళ్లు రెచ్చిపోయారు. కానీ రద్దు తర్వాత ప్రతీ ఒక్కరు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరి స్తున్నారని సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు. ఇక ఏటీఎం సెంటర్లలో జరిగే ‘స్కిమ్మింగ్’ మోసాలు అస్సలు కనిపించడం లేదన్నారు. దీని కి కారణం.. ఏటీఎం సెంటర్లో డబ్బులు పెట్టిన వెంటనే నిమిషాల వ్యవధిలో ఖాళీ అయిపోతుండటమేనని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నూ నోట్ల కోసం ఏటీఎంల వద్ద క్యూ ఉండటం తో సైబర్ నేరగాళ్లకు స్కిమ్మింగ్ పరికరాలు అమర్చే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. నవంబర్ 8కి ముందు ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 నుంచి 4 సైబర్ నేరాలు నమోదయ్యేవని, ప్రస్తుతం వారానికి రెండు, మూడు కేసులు కూడా ఉండటం లేదని సైబర్ క్రైమ్ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు.