Domestic violence case
-
ఆమెకు రూ.10కోట్లు కావాలి అందుకే ఇలా...: కాంగ్రెస్ ఎమ్మెల్యే
భోపాల్: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్.. భార్య ఫిర్యాదు మేరకు గృహహింస, అత్యాచారం, బెదిరింపులు వంటి క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఉమంగ్ భార్య తన ఇంటి సహాయకురాలి భర్త పేరుతో కూడా ఆస్తులు కలిగి ఉన్నారని, అలాగే ఆయన సహజీవనం చేసిన సోనియా భరద్వాజ్ ఆత్మహత్యలో కూడా ఉమంగ్ ప్రమేయం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీంతో ఆయనపై నౌగోన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఐతే ఆ ఆరోపణలన్నింటిని ఖండించారు ఉమంగ్. తన భార్య తనను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పారు. తనను మానసికంగా వేధించి, బ్లాక్మెయిల్ చేస్తున్నందుకు నవంబర్2న ఆమెపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్లు ఆయన తెలిపారు. అంతేగాక తనను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రి నరోత్తమ్ కూడా ఆ ఆరోపణలకు బలం చేకూరేలా ఉమంగ్‌కు గతంలో కొంతమంది భార్యలు ఉన్నారని అన్నారు. ఐతే ఉమంగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శక్తిమంతమైన గిరిజన నాయకుడు. పైగా మాజీ ముఖ్యమంత్రి జమునాదేవి మేనల్లుడు కూడా. గత కమల్ నాథ్ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా పనిచేసిన ఉమంగ్ ప్రస్తుతం గంద్వాని స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. (చదవండి: దాహమేసి నీరు తాగిందని.. గోమూత్రంతో వాటర్ ట్యాంక్ శుభ్రం!) -
పుల్లారెడ్డి స్వీట్స్: పుల్లారెడ్డి కొడుకు, మనవడికి కోర్టు నోటీసులు
దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి కుటుంబ వివాదం చివరకు కోర్టుకు చేరింది. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై ఆయన భార్య ప్రజ్ఞారెడ్డి పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కేసు పెట్టిన విషయం తెలిసిందే. కాగా, ప్రజ్ఞారెడ్డి బుధవారం హైదరాబాద్ మొబైల్ కోర్టును ఆశ్రయించారు. తనను ఇంట్లోనే నిర్బంధించి వేధింపులకు గురిచేశారని ప్రజ్ఞారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ఇంటిలో తనను ఎలాంటి హింసకు గురి చేస్తున్నారన్న వైనాన్ని తెలిపే ఫొటో కాపీలను ఆమె కోర్టులో సమర్పించారు. దీంతో, ఆమె పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలు ప్రజ్ఞారెడ్డికి భద్రత కల్పించాలని పంజాగుట్ట పోలీసులను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. అనంతరం, పుల్లారెడ్డి కొడుకు రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య, కుమారుడు ఏక్నాథ్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, గత కొంతకాలంగా ఏక్నాథ్ రెడ్డి ఆయన భార్య ప్రజ్ఞా రెడ్డి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రోజు ఏక్నాథ్ రెడ్డి.. భార్యను ఇంట్లో నుంచి బయటకు రాకుండా రాత్రికి రాత్రే ఆమె ఉంటున్న గదికి అడ్డుగా గోడను నిర్మించి అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఈ ఘటన అనంతరం ప్రజ్ఞా రెడ్డి.. పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇది కూడా చదవండి: టీవీ నటి, టిక్‌టాక్ స్టార్ కన్నుమూత -
Vismaya Case: నాన్నా! భయమేస్తోంది.. వచ్చేయాలనుంది
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విస్మయ వరకట్న వేధింపుల హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భర్త కిరణ్‌ను దోషిగా ప్రకటించింది కొల్లాం న్యాయస్థానం. అంతేకాదు కీలక ఆధారం ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. 22 ఏళ్ల విస్మయ అత్తింటి వేధింపులు భరించలేక.. తన ఇంటికి ఫోన్ చేసిన మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ‘‘నన్ను బలవంతంగా ఇక్కడ ఉంచాలని చూస్తే.. మీరు నన్ను మళ్లీ చూడలేరు. నేను ఏదో ఒకటి చేస్తాను. ఇంక భరించలేను. అచా (నాన్న).. నాకు వెనక్కి వచ్చేయాలని ఉంది. నన్ను కొడతారని భయంగా ఉంది’’ అంటూ ఆమె కన్నీటి పర్యంతమైన వాయిస్ ఆ క్లిప్‌లో(మలయాళంలో) ఉంది. అయితే తండ్రి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంది. కేరళ కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్ డిగ్రీ స్టూడెంట్ అయిన విస్మయ నాయర్.. కిందటి ఏడాది జూన్ 21న కొల్లాం సస్తమ్కొట్ట సమీపంలోని సస్తమనాదాలో ఉన్న అత్తగారింట్లో విగతజీవిగా కనిపించింది. అదనపు కట్న వేధింపులే ఆమె మృతికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. వరకట్న వేదింపులతో పాటు గృహ హింస కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీలోని సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్లు చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ వ్యవహారంతో విస్మయ భర్త కిరణ్ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఊడింది. ఇంతకాలం బెయిల్ మీద బయట ఉన్నాడతను. ఇక మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్లో పని చేసే కిరణ్‌కి.. కొల్లాంకు చెందిన విస్మయ వీ నాయర్‌ను ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు పెద్దలు. అయితే అదనపుకట్నం కోసం ఆమెను వేధించసాగాడు కిరణ్. అప్పటికీ కొత్త కారు కొనిచ్చినప్పటికీ.. తాను ప్రభుత్వ ఉద్యోగినని, వేరే మోడల్ కారు కావాలంటూ ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ క్రమంలో.. ఆమె ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించడం విషాదాన్ని నింపడంతో పాటు దేశవ్యాప్తంగా వరకట్న మరణాలపై చర్చకు దారి తీసింది. ఇక విస్మయ కేసులో.. ఇవాళ (సోమవారం, మే 23) తీర్పు నేపథ్యంలో.. అతని బెయిల్ రద్దు అయ్యింది. దీంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కొల్లాం అదనపు సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆడియో, తాను వేధింపులకు గురైనట్లు ఫొటోలు పంపిన విస్మయ.. కీలక ఆధారాలను అందించినట్లు అయ్యింది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మంగళవారం అతనికి విధించబోయే శిక్షను ఖరారు చేయనుంది. ఈలోపే అధికారికమో, కాదో క్లారిటీ లేని ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతుండడం గమనార్హం. -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. ఏక్నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు ఆమె బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు(ఏక్నాథ్ రెడ్డి భార్య) ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. -
జానీ తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించిన నటి
Actress Amber Heard Cries At Court: ప్రముఖ హాలీవుడ్ హీరో జానీ డేప్ తన మాజీ భార్య, నటి అంబర్ హెర్డ్‌పై వేసిన పరువు నష్టం దావా కేసుపై ప్రస్తుత కోర్టులో విచారణ జరుగుతోంది. వారు కలుసున్నపుడు జానీ డేప్ తరచూ కొడుతుండేవాడని, తాను గృహహింస బాధితురాలిని అంటూ అంబర్ హెర్డ్ ఇటీవల తను రాసిన ఓ వ్యాసంలో వెల్లడించింది. దీంతో తనపై అంబర్ తప్పుడు ఆరోపణలు చేసిందని పేర్కొంటూ జానీ ఏప్రిల్ 20న మాజీ భార్యపై రూ. 380 కోట్ల పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే రెండు వారాలుగా ఈ కేసుపై విచారణ జరుగుతోంది. చదవండి: త్వరలో హీరోతో బాలీవుడ్ హీరోయిన్ పెళ్లి, హింట్ ఇచ్చేసిందిగా! ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన హియరింగ్‌లో అంబర్, జానీ డేప్పై సంచలన ఆరోపణలు చేసింది. జానీ తనను తరచూ కొట్టేవాడంటూ కోర్టులోనే బోరున విలపించింది అంబర్. ‘మా కొద్దిపాటి వైవాహిక జీవితంలో జానీ తరచూ కొట్టేవాడు. అంతేకాదు అసభ్యపదజాలంతో దూషించేవాడు. మొదటి సారి తన టాటూను చూసి నవ్వానని కొట్టాడు. ఆయన శరీరంపై చెదిరిన ఉన్న టాటూ ఏంటని అడగ్గా విన్నో(జానీ డేప్ మాజీ ప్రియురాలు విన్నోనా రైడర్ పేరు) అని సమాధానం ఇచ్చాడు. అది జోక్ అనుకుని నవ్వేశాను. దీంతో నా చెంపపై కొట్టి నీకు ఇది సరదాగా ఉందా? అంటూ అభ్యంతరకర పదం(బీ..) వాడాడు’ అని పేర్కొంది. చదవండి: సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా? ఆ సమయంలో తనకు ఏం అర్థం కాలేదని, షాక్‌తో అతనివైపే ఉండిపోయాను’ అని చెప్పింది. అంతేగాక జానీ తనపై పలుమార్లు దాడి చేశాడని, మద్యం, మాదకద్రవ్యాల మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ భౌతికంగా గాయపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే ఇతర యువతుల పట్ల సన్నిహితంగా ఉన్న సంఘటనలు గురించి తరచూ తన దగ్గర ప్రస్తావించేవాడని పేర్కొంది. ఈ క్రమంలో ఓ రోజు తన జీవితంలో అంత్యంత చేదు సంఘటన చోటుచేసుకుందని, ఆ రోజును ఎప్పటికీ మరిచిపోలేని చెప్పింది. ఓ రోజు సాయంత్రం డ్రగ్స్ తీసుకుని ఫుల్ మత్తులో ఉన్న జానీ తన బట్టలు చించి, శరీరా భాగాల్లో కోకైన్ కోసం వేతికాడంటూ నాటి చేదు సంఘటనలను గుర్తు చేసుకుంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అంబర్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గృహహింస కేసులో దోషిగా లియాండర్ పేస్..
గృహ హింస కేసులో టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి భార్య రియా పిళ్లై లియాండర్ పేస్పై గృహ హింస కేసు వేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేస్‌ను దోషిగా నిర్ధారించిన కోర్టు.. కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రియా పిళ్లై తన భాగస్వామి అయిన లియాండర్ పేస్ ఇంటిని విడిచి వెళ్లాలి అనుకుంటే. .తనకు నెలకు రూ.లక్ష రూపాయల భరణం చెల్లించాలని, అలాగే అద్దె కోసం మరో రూ.50వేలు ప్రతినెలా అందించాలని పేస్‌ను కోర్టు ఆదేశించింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోమల్‌సింగ్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఎనిమిదేళ్లుగా తాము ఇద్దరం లివ్ఇన్ రిలేషన్లో ఉన్నామని.. పలు సార్లు పేస్ గృహ హింసకు పాల్పడ్డాడని రియా పిళ్లై ఆరోపించింది. ఈ క్రమంలో రక్షణ కల్పించాలని కోరుతూ రియా పిళ్లై 2014లో కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఈ కేసుపై తీర్పును కోర్టు వెల్లడించింది. చదవండి: ధోనిను కలవడంతో నా కల నిజమైంది.. అది ఎప్పటికీ మర్చిపోలేను' -
విరాట్ కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..?
Virat Kohli: టీమిండియా టెస్ట్ సారధి విరాట్ కోహ్లి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి డైరెక్టర్‌గా ఉన్న ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు అక్షింతలు వేసింది. కోహ్లిని బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకుని, భార్యకు భరణం కట్టలేనంటావా..? అంటూ మొట్టికాయలు వేసింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ వివాహిత.. తన భర్త, అతడి తల్లి కలిసి వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది. ఈ క్రమంలో భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఆ మహిళ.. భర్త నుంచి భరణం ఇప్పించాలని కోర్టును ఆశ్రయించింది. దీనిని విచారించిన ట్రయల్ కోర్టు.. ఆమెకు నెలకు రూ. 30 వేల భరణం చెల్లించాలని సదరు భర్తను ఆదేశించింది. అయితే, ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ భర్త ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులో అప్పీల్ చేశాడు. తనకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదని, ఛారిటీల ద్వారా వచ్చే డబ్బుతో నెట్టుకొస్తున్నానని, తాను భరణాన్ని చెల్లించే పరిస్థితి లేదని కోర్టుకు విన్నవించుకున్నాడు. పిటిషనర్ అప్పీల్‌పై అడిషినల్ సెషన్స్ జడ్జ్ అనూజ్ అగ్రవాల్ స్పందిస్తూ.. ‘విరాట్ కోహ్లి లాంటి సెలబ్రిటి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీకి డైరెక్టర్‌గా ఉండి భరణం చెల్లించేందుకు డబ్బులు లేవంటే నమ్మేలా లేదని అప్పీల్‌ను తిరస్కరించారు. మెయింటెనెన్స్ తప్పనసరిగా చెల్లించాల్సిందేనంటూ పిటిషనర్‌ను ఆదేశించారు. చదవండి: ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి! ఇప్పటికే... -
'పెళ్లికి ముందు బంగారం.. పెళ్లి తర్వాత అంటరానిదానినా..?'
ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లైన కొన్ని రోజులకే ఆ భర్త పూర్తిగా మారి సైకోలా తయారయ్యాడు.ఆ యువకుడు అగ్రకులానికి చెందిన వాడు కావడంతో ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని గ్రామస్తులు ఎగతాళి చేస్తున్నారని పునరాలోచనలో పడ్డాడు. భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే నువ్వు అంటరానిదానివని సదరు యువతిని కులం పేరుతో దూషించాడు. తనను ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తే అలాంటి మాట అనడంతో ఆ భార్య సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సంఘటన గుజరాత్లో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా జోతానా తాలుకాకు చెందిన సదరు జంట ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి వయసు 20 ఏళ్లు. యువకుడి వయసు 24 ఏళ్లు. ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మెమాగర్ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే ఆ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం.. కాగా యువకుడు అగ్ర కులానికి చెందిన వాడు. ఐనప్పటికీ పెద్దలను ఎదురించి ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలయింది. దళిత అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కూడా సూటిపోటి మాటలతో వేధించేవారు. అలా అందరూ తనను వెక్కిరించడంతో అతడు కూడా సదరు యువతిని పెళ్లి చేసుకొని తప్పు చేశానని భావించాడు. పెళ్లికి ముందు బంగారం అని పిలిచిన వాడే పెళ్లి చేసుకున్నాక అంటరానిదానివని అనడంతో ఆమె ఎంతో మనోవేదనకు గురయింది. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి అతడు శృంగారం కోసం వస్తే ఆమె నిరాకరించింది. నన్ను అంటరానిదానినంటూ కులం పేరుతో దూషిస్తావా? నేను నీతో శృంగారం చేయనని తెగేసి చెప్పింది. ఇక దాంతో అతడు కోపంతో భార్యను ఇష్టానుసారం కొట్టి బలవంతంగా అనుభవించసాగాడు. అలా కొన్ని రోజుల పాటు ఇంట్లో ఆ యువతిని రేప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు. అయితే ఇదే క్రమంలో ఇటీవల ఐరన్ రాడ్డుతో తలపై కొట్టడంతో ఆమె ఆస్పత్రి పాలయింది. అనంతరం మెహ్సానాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. కోలుకున్న తర్వాత గత్లోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన టీడీపీ సర్పంచ్
భీమడోలు: తెలుగుదేశం పార్టీకి చెందిన పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను సర్పంచి కూర్మా లక్ష్మి తనను భర్త రాజ్‌కుమార్ హింసిస్తున్నట్లు ఆదివారం రాత్రి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిస అయిన తన భర్త రాజ్‌కుమార్ తొమ్మిది నెలలుగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పెద్దల సమక్షంలో మాట్లాడినా అతడి తీరు మారకపోవడంతో ఇటీవల అంబర్‌పేటలోని తన పుట్టింటికి వెళ్లినట్లు తెలిపారు. ఆదివారం అంబర్‌పేట వచ్చిన రాజ్‌కుమార్ తనను తీవ్రంగా కొట్టి గాయపర్చి, హింసించారని తెలిపారు. భీమడోలు ఎస్ఐ వి.ఎస్.వి.భద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అవి నీచమైన ఆరోపణలు, నన్ను నమ్మండి: హనీసింగ్
Yo Yo Honey Singh: ప్రముఖ బాలీవుడ్ సింగర్ యోయో హనీసింగ్ తనను టార్చర్ పెట్టాడంటూ అతడి భార్య షాలిని గృహహింస ఆరోపణలు చేసిన విషయం విదితమే. అతడికి వేరే మహిళలతో అక్రమ సంబంధం ఉందని, అదేంటని నిలదీస్తే తనపైకి మందు బాటిల్ విసిరాడని ఆమె తీవ్రంగా ఆరోపించింది. తాజాగా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు హనీసింగ్. 'నా భార్య షాలిని తల్వార్ నాపై, నా కుటుంబంపై మోపిన అసత్య, హానికరమైన ఆరోపణలు విని నేను చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. ఆమె చెప్పేవి చాలా అసహ్యంగా ఉన్నాయి. గతంలో నా మ్యూజిక్ మీద, ఆరోగ్యం మీద ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ వాటిపై నేనెప్పుడూ స్పందించలేదు. నాపై వ్యతిరేక ప్రచారం జరిగినా ఎలాంటి ప్రెస్‌నోట్ జారీ చేయలేదు. కానీ ఈసారి మౌనంగా ఉండటం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఎందుకంటే నాకు ఎంతగానో అండగా నిలబడ్డ నా వృద్ధ తల్లిదండ్రులు, చెల్లె మీద ఆమె నీచమైన ఆరోపణలు చేస్తోంది. ఇవి మా పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయి' 'నేను ఇండస్ట్రీలో ఉండి 15 ఏళ్లు పైనే అవుతోంది. ఈ జర్నీలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు కళాకారులు, సంగీతకారులతో కలిసి పని చేశాను. నా భార్యతో ఎలా ఉంటాననేది అందరికీ తెలుసు. ఎందుకంటే షూటింగ్‌లు, ఈవెంట్లకు ఆమెను కూడా వెంటపెట్టుకుని వెళ్లేవాడిని. ఆమె చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయటపడుతుందని ఆశిస్తున్నా. అప్పటివరకు నా గురించి, నా కుటుంబం గురించి ఎలాంటి నిర్ధారణకు రావొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నా' అని పోస్ట్ పెట్టాడు. pic.twitter.com/YiHnKbJlSW — Yo Yo Honey Singh (@asliyoyo) August 6, 2021 -
ఆయనతో కాపురం చేయలేను.. విడాకులు కావాలి: టెకీ
అసలే లాక్డౌన్. మా ఆయన ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు. దీనికి తోడు నిత్యం మద్యం సేవిస్తున్నాడు. మత్తులో మరో మహిళతో గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఆమెతో వివాహేతర సంబంధం ఉందని తేలడంతో ప్రశ్నిస్తే అనుమానంతో రోజూ నరకం చూపిస్తున్నాడు... – ఓ బాధితురాలు ఇటీవల అర్బన్ మహిళా స్టేషన్లో అధికారికి వినిపించిన గోడు ఇద్దరం ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. గతంలో ఉద్యోగ ఒత్తిడి కారణంగా వారానికోసారి, నెలలో రెండు మూడు సార్లు కలిసే వాళ్లం. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం కారణంగా ఇద్దరం ఒకే దగ్గర ఉంటున్నాం. ఏమైందో కానీ ఇప్పుడు ఆయన నా మాట వినడం లేదు. చిన్న విషయాలకే చిరాకు పడుతున్నాడు. అన్ని విషయాల్లో ఆయనదే పైచేయి కావాలని పట్టుబడుతున్నాడు. నేను ఆయనతో సమానంగా ఉద్యోగం చేస్తున్నా... సంపాదిస్తున్నా. అయినా నాపై పెత్తనం చేయడం నచ్చడం లేదు. అందువల్ల ఇకపై ఆయనతో కాపురం చేయలేను. నాకు విడాకులు ఇప్పించండి. – ఇటీవల ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తన భర్తపై పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న విషయాలివి. నేను ఉద్యోగం చేస్తున్నా. ఈ క్రమంలో ఉద్యోగానికి సంబంధించి పలువురితో ప్రతీరోజూ ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుంది. నేను మాట్లాడుతున్న మాటలను నా భర్త చాటుగా వినడంతో పాటు నేను స్నానానికి వెళ్లినప్పుడు నా ఫోన్లో మెసేజ్‌లు, కాల్‌లిస్ట్ చూస్తున్నాడు. ఇదంతా నాకు నచ్చలేదు. నాపై నమ్మకం లేని వ్యక్తితో కాపురం చేయడం ఎలా? దీంతో పాటు అదనపు కట్నం కోసం వేధింపులు ఇటీవల పెరిగాయి. ఆయనను భరించడం సాధ్యం కాదని తేలినందున నాకు విడాకులు ఇప్పించండి. – మహిళా పోలీసుస్టేషన్లో ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇచ్చిన ఫిర్యాదు సారాంశమిది. వరంగల్ క్రైం : కుటుంబం, భార్యాభర్తల మధ్య ఏర్పడే చిన్నచిన్న వివాదాలు ఏకంగా కాపురం కూలి పోయే స్థాయికి చేరుతున్నాయి. స్మార్ట్ ఫోన్లలో జరిగే వాట్సప్ చాటింగ్ వందల మంది జంటలు విడిపోవటానికి కారణహమవుతోంది. అనుమానం పెనుభూతమై భార్యలపై భౌతిక దాడుల వరకు వస్తోంది. మారుతున్న జీవన పరిస్థితుల వల్ల కుటుంబా ల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దంపతులి ద్దరూ ఉద్యోగం చేస్తున్న నేటి సమాజంలో ఇద్దరం సమానమే కదా అనే భావన పంతానికి దారి తీస్తోంది. ఫలితంగా అందమైన జీవితాలు రోడ్డు పాలు అవుతున్నాయి. కరోనా తెచ్చిపెట్టిన చిచ్చు కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించడం, ప లు కంపెనీలు, ప్రభుత్వ శాఖల్లో వర్క్ ఫ్రం హోంకు అవకాశమిచ్చారు. దీంతో ఉదయం ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చే పలువురు ఎక్కువ సమయం ఇళ్లలోనే గడపాల్సి వస్తోంది. ఈ సమయాన్ని కొందరు దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి యత్నిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం తప్పులు వెతుకుతూ డిటెక్టివ్ పాత్రలు పోషిస్తున్నారు. దీంతో గొడవలు మొదలై విడాకుల వరకు వస్తున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో మహిళలపై పెరుగుతున్న దాడుల నివారణ, సమస్యల పరిష్కారం, కౌన్సిలింగ్ కోసం ప్రత్యేకంగా రెండు మహిళా పోలీస్స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఇటీవల ఈ పోలీస్ స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తే అనేక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత ఏడాది మొత్తం నమోదైన కేసులు.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే నమోదైన కేసులకు సమానంగా ఉండడం కరోనా తెచ్చిన మరో కష్టాన్ని చాటిచెబుతోంది. అనుమానంతో పెరుగుతున్న కేసులు భర్తకు భార్యపై కలిగే అనుమానం రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడానికి కారణమవుతోందని అధికారిక నివేదికలు చెబుతున్నారు. చాలా ఫిర్యాదుల్లో కేవలం భార్యపై అనుమానం కారణంగా భర్త భౌతిక దాడులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. పోలీస్ అధికారుల విచారణలో కూడా ఈ విషయం వెల్లడవుతోంది. ఇక కొన్ని చోట్లయితే వర్క్ ఫ్రం హోంతో ఇంట్లో ఉండే భర్తలు తమకిష్టమైన ఆహా రం వండడం లేదని కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నట్లు తెలిసింది. చాలా మంది మహిళలు ఇటీవల పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల్లో వంట గదికి సంబంధించినవి కూడా ఉండడం పోలీసు అధికారులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో పాటు ఇంతకాలం వరకట్నం కోసం అడపాదడపా వేధించే భర్తలు కరోనా మొదలయ్యాక దీనిని పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహిళా పోలీస్స్టేషన్లలో భర్త, కుటుంబ సభ్యులపై ఐపీసీ 498, 3/4 వరకట్న వేధింపుల చట్టం కేసులు నమోదవుతుండడం ఇందుకు తార్కాణంగా నిలుస్తోంది. కరోనా వేళ ప్రపంచం ఓపక్క భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో మహిళలపై గృహ హింస పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమేనని పోలీసు అధికారులు చెబు తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు ఇలా... సంవత్సరం అర్బన్ మహిళా పోలీసు స్టేషన్ రూరల్ మహిళా పోలీసుస్టేషన్ 2019 218 120 2020 166 15 2021 72 18 -
అంజుమ్ సుల్తానాకు అండగా నిలుస్తాం
సాక్షి హైదరాబాద్: గృహహింస బాధిత మహిళల హక్కులకు రక్షణ, న్యాయం అందించి అండగా నిలిచేందుకు ఓ సంస్థ ప్రారంభమైంది. ‘కాన్ఫిడరేషన్ మూవ్మెంట్ ఎగినెస్ట్ డొమెస్టిక్ వయొలెన్స్’ పేరుతో స్థాపించిన ఈ సంస్థ గృహహింసకు వ్యతిరేకంగా పని చేయనుంది. మేజర్ ప్రొఫెసర్ సుల్తానా ఖాన్ సోమవారం మీడియా ప్లస్ ఆడిటోరియంలో విలేకరులతో మాట్లాడుతూ.. చట్టంలోని లొసుగులను కొంతమంది సొమ్ముచేసుకుని భార్యాపిల్లలపై దాష్టీకాలకు తెగబడుతున్నారని తెలిపారు. అంజుమ్ సుల్తానా అనే బాధిత మహిళకు జరిగిన అన్యాయం గురించి తెలిపారు. అంజుమ్‌కి ముగ్గురు పిల్లలు పుట్టిన అనంతరం భర్త ఆమెను వదిలేశాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతను మరో మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపారు. అంజుమ్ లాంటి బాధితులు సమాజంలో చాలా మంది ఉన్నారని, తీవ్రమైన గృమహింసకు గురవుతున్న వారు తమ సమస్యలను తెలియజేయడానికి ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మహిళలకు సరైన న్యాయం జరగకపోవటం సమాజానికి శ్రేయస్కరం కాదని తెలిపారు. గృహహింస బాధత మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తమ సంస్థ తరఫున న్యాయం చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. మహిళలకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సామాజిక మహాజన సంఘర్షణ సమితి, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆల్ మైనారిటీస్ ఎమ్మార్పీఎస్, యాంటీ కరప్షన్ మహిళా కమిటీ, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, కవులు, రచయిత్రులు పాల్గొన్నారు. -
గృహ హింస: ‘కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కారించాం’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్లో మహిళలపై గృహహింస వేధింపులు పెరిగాయని దాదాపు 200లకు పైగా ఫిర్యాదులు వచ్చాయని మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మా తెలిపారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... కరోనా నేపథ్యంలో అర్థిక భద్రత అనేది పెరిగిందన్నారు. చాలామంది ఆడవాళ్లు అనేక ప్రాంతాల్లో చిక్కుకుపోయారని చెప్పారు. ఆర్థిక సహాయం కోసం ఇలా అనేక రకాల ఫిర్యాదుల వచ్చాయని పేర్కొన్నారు. మా పరిధి కాదనే ఆలోచన లేకుండా ఏ ఒక్క కేసును నిర్లక్ష్యం చేయలేదన్నారు. ఫిర్యాదులను బట్టి తగిన సహాయం చేశామన్నారు. ఇక లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉండే మహిళల పరిస్థితి తారుమారు అయ్యాయి అనేదే లేదన్నారు. గృహ హింసకు సంబంధించిన కేసులన్ని కూడా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కారించామని తెలిపారు. దాదాపుగా కౌన్సెలింగ్ ద్వారా చాలా వరకు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే పరిష్కారం అందించామని చెప్పారు. (అందంగా ఉండొద్దు, గుండు చేయించుకో) ఆంధ్రప్రదేశ్ మద్యపాన నిషేధం అమలులో ఉన్న నేపథ్యంలో చాలా వరకు గృహహింస కేసులు తక్కువ నమోదయ్యాయని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీలో మద్యపానం వల్ల జరిగే గృహహింస అనేది చాలా వరకు తగ్గిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా వరకు మహిళలు సంతోషంగా ఉన్నారని, అమ్మఒడి, ఇళ్ల పట్టాలు వంటి పథకాలు అందించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. మహిళలంతా రాష్ట్రంలో భరోసాతో ఉన్నారని ఆమె పేర్కొన్నారు. వారి కుటుంబంలో ఏదైన మాట అనాలి అంటేనే భయం వచ్చే పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉందని చెప్పారు. గ్రామ సచివాలయంలో ఉన్నవారంతా కూడా మహిళలకు రక్షణగా నిలుస్తున్నారని తెలిపారు. దిశ చట్టం అమలులోకి వచ్చాక మూడు నెలల్లో 167 కేసులను చార్జీ షీట్ ఫైల్ చేశామన్నారు. అందులో 20 కేసులకు శిక్షణను కూడా ఖరారు చేసినట్లు వెల్లడించారు. సీఎం జగన్ ఏపీలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ల ఇచ్చి మహిళ సాధికారతను అందించారని వాసిరెడ్డి వ్యాఖ్యానించారు. (నేడు 12 దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభం) -
ఫ్యామిలీ తగాదా ఇల్లాలి దీనగాథ
సాక్షి, సిటీబ్యూరో: ఇంట్లోని ఇల్లాలుకు లాక్డౌన్ కష్టాలను తెచ్చిపెడుతోంది. కుటుంబ వివాదాలకు హేతువుగా మారుతోంది. గృహహింసకు తావిస్తోంది. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సైబరాబాద్, రాచకొండ పోలీసులకు డయల్ 100, ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా సుమారు 459 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదు లను తీవ్రంగా పరిగణించిన రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ ఆయా ఠాణాల అధికారులతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మాట వినకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఎలాంటి ఫిర్యాదులు? ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ కొడుతున్నారని, కర్రీ సరిగా వండలేదని, టీవీ ప్రోగ్రామ్‌ల విషయంలో గొడవలు, సెల్‌ఫోన్ వినియోగంలోనూ ఘర్షణ, కట్నం తేవాలంటూ కొట్లాట, డ్యూటీ చేయట్లేదు కదా నీకు తిండి పెట్టడం దండగ అని ఇంట్లో ఉంటున్న భర్తలు హింసిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా లాక్డౌన్ వేళ 4590 ఫిర్యాదులు వచ్చాయని షీ బృందాలు చెబుతున్నాయి. ఇవి చాలా చిన్న విషయంగా కనిపిస్తున్నా చాలా మంది కుటుంబాల్లో మనస్పర్థలకు దారి తీస్తున్నాయని, చిన్న పిల్లలపై కూడా ప్రభావం చూపుతున్నాయని ఫ్యామిలీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న కౌన్సెలర్లు అంటున్నారు. అందుకే ఎవరి నుంచైనా ఫిర్యాదు రాగానే ఆయా కుటుంబాలను పిలిపించి వారికి నచ్చచెబుతున్నామని, ఆయన తీరు మారకపోతే కేసుల వరకు వెళుతున్నాయని పేర్కొన్నారు. గృహహింస ఫిర్యాదులకే ప్రాధాన్యం.. లాక్డౌన్ వేళ ఇంట్లో ఉంటున్న మహిళలపై గృహహింస పెరుగుతోందని మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ ఫిర్యాదులనే ప్రథమ ప్రాధాన్యతగా తీసుకోవాలని ఇప్పటికే అన్ని ఠాణాల అధికారులకు ఆదేశాలిచ్చాం. కొంతమంది సోషల్ మీడియా, డయల్ 100 ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొందరేమో ప్రజారవాణా వ్యవస్థ అందుబాటులో లేకపోవడంతో ఇంట్లోనే మిన్నకుండిపోతున్నారని తెలిసింది. మీకు గృహిహింస ఎదురైతే మాత్రం వాటాప్ కంట్రోల్ నంబర్ 9490617111, షీ బృందాలకు ఫిర్యాదు చేయాలి. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా కూడా ఫిరా>్యదు చేయండి.– మహేష్ భగవత్, రాచకొండ సీపీ -
లాక్డౌన్: గృహ హింస కేసులు రెట్టింపు..
న్యూఢిల్లీ: ఓ వైపు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తుంటే... కొంతమంది కీచకులు మాత్రం విపత్కర పరిస్థితుల్లోనూ తమ వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ప్రాణాంతక వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తే దానిని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గత 20 రోజులుగా పెరుగుతున్న గృహ హింస కేసులే ఇందుకు నిదర్శనం. మార్చి 24న భారత్‌లో 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి మొదటివారంతో పోలిస్తే.. మార్చి 30 నాటికి గృహహింస కేసుల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యింది. 111గా కేసుల సంఖ్య 257కు చేరిందని జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. కాగా లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసే విధుల్లో పోలీసులు తలమునకలైన వేళ మహిళలపై అకృత్యాల సంఖ్య పెచ్చుమీరుతున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నా.. వారిలో కేవలం ఒక శాతం మంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఫిర్యాదు చేసేందుకు రావడం లేదని సమాచారం. అయితే ఇది కేవలం ఒక్క భారత్‌కే పరిమితమైన అంశం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అకృత్యాల బారిన పడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.(కరోనా: ‘ప్లాస్మా థెరపీ’తో చెక్!) యూరప్ దేశాల్లో.. ఇటలీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాల్లో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటలీలో ఈ మహమ్మారి కారణంగా దాదాపు 10 వేల మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా హెల్్ప లైన్లతో అధికారులు బిజీగా ఉండగా... గృహహింస బాధితులు టెక్ట్స్ మెసేజ్‌లు, ఈమెయిల్స్ ద్వారా తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఉండేందుకే వారు ఈ మార్గాలను ఎంచుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఫ్రాన్స్‌లో.. పొరుగు దేశాలపై కరోనా పంజా విసురుతున్న తరుణంలో ఫ్రాన్స్ మార్చి 17 నుంచి లాక్డౌన్ విధించింది. ఇక ఆనాటి నుంచి కేవలం వారం రోజుల్లోనే గృహహింస కేసుల సంఖ్య 32 శాతానికి చేరింది. ముఖ్యంగా రాజధాని ప్యారిస్‌లో ఈ గణాంకాలు 36 శాతానికి చేరడం ఆందోళనకరంగా పరిణమించింది.(కరోనా: మరో షాకింగ్ న్యూస్!) స్పెయిన్‌లో.. ఇటలీ తర్వాత ఎక్కువ కరోనా మరణాలు స్పెయిన్‌లోనే సంభవించాయి. ఈ క్రమంలో అక్కడ మార్చి 14 నుంచి లాక్డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మార్చి మొదటి రెండు వారాల్లో గృహ హింస బాధితుల సంఖ్య 12 శాతం పెరిగింది. హెల్్పలైన్ వెబ్‌సైట్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదుల సంఖ్య ఏకంగా 270 శాతం పెరిగింది. చైనాలో.. ఇక ఆసియా దేశం చైనాలోని హుబే ప్రావిన్స్‌లో గృహ హింస ఫిర్యాదుల సంఖ్య గతేడాది(47)తో పోలిస్తే 162కు పెరిగింది. కాగా ఇక్కడే వుహాన్ నగరంలో కరోనా వైరస్ 2019 చివర్లో పురుడు పోసుకున్న విషయం తెలిసిందే.(అక్కడ నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారంటే!) అగ్రరాజ్యంలో.. కరోనా కారణంగా అమెరికా ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో జాతీయ గృహహింస నిరోధక సంస్థ హాట్‌లైన్‌కు రోజుకు సగటున 2 వేల కాల్స్ వస్తున్నాయి. అందులో 950 కరోనా కేసులకు సంబందించినవి కాగా మిగితావి గృహహింస ఫిర్యాదులకు సంబంధించినవి. ఇక సీటెల్‌లో వీటి సంఖ్య 21 శాతం పెరిగింది. కాగా బ్రెజిల్, ఆస్ట్రేలియా, కాటలోనియా దేశాల్లోనూ పరిస్థితికి ఇందుకు భిన్నంగా లేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హామీ ఇస్తున్నా.. భారత్ వంటి దేశాల్లో కొంతమంది మహిళలు అత్తింటివారికి భయపడి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని మహిళా హక్కుల సంఘాలు అంటున్నాయి. ఈ మేరకు జీ న్యూస్ కథనం వెలువరించింది. -
పోర్న్ స్టార్‌గా మారిన దర్శకుడి కుమార్తె..అరెస్ట్
న్యూయార్క్ : ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ కుమార్తె మికేలాపై గృహహింస కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆమెకు కాబోయే భర్త చక్పాంకో(50) ధృవీకరించారు. మికేలాపై శనివారం కేసు నమోదైందని, 1000 డాలర్ల పూచికత్తుపై బెయిల్ కూడా వచ్చిందన్నారు. మరో 12 గంటల్లో మికేలా విడుదలకానుందని తెలియజేశారు. కాగా, 23 ఏళ్ల మికేలా పోర్న్‌స్టార్‌గా కెరీర్ ఆరంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే అరెస్ట్ కావడం గమనార్హం. ఆమె ఎవరితోనో గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో గృహహింస కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని మికాలె కాబోయే భర్త చక్ పాంకో కూడా ధ్రువీకరించారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. (చదవండి : పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె.) మికేలాను స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా దత్తత తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే తాను పోర్న్ స్టార్‌గా మారానని ప్రకటించిన మికాలే.. అలా మారడం తనకు మానసికంగా చాలా ఉపయోగపడిందని పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు అడ్డుచెప్పలేదని వెల్లడించింది. కాబోయే భర్త చక్ పాంకో (47) సైతం పోర్న్ స్టార్‌గా తన ఎంట్రీకి మద్దతుగా నిలిచారని వెల్లడించారు. తన అభిమానుల్లో ఎక్కువగా వయసు మళ్లిన వైట్‌మెన్‌లను ఎంపిక చేసుకుంటానని, పాంకోపై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలే చేస్తానని, ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు ఉండవని చెప్పారు. -
కామాంధుడైన కన్నతండ్రిని.. కత్తితో పొడిచి
మాస్కో: తండ్రి లైంగిక వేధింపులు భరించలేక కన్న కూతుళ్లు అతడిని హతమార్చారు. కత్తితో పొడిచి.. సుత్తితో తండ్రి తలను మోది అంతమొందించారు. 2018లో రష్యాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు మంగళవారం స్థానిక కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా నేరం రుజువైతే నిందితురాళ్లకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. వివరాలు... రష్యాకు చెందిన క్రెస్టీనా(20), ఏంజిలీనా(19), మారియా కాచాతుర్యాన్(18) అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ తండ్రి మైఖేల్‌తో కలిసి నివసించేవారు. అయితే మైఖేల్ ఎల్లప్పుడూ వారిని శారీరంగా హింసిస్తూ.. లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రష్యాలో గృహహింసకు సంబంధించి ఎటువంటి ప్రత్యేక చట్టం లేకపోవడంతో అతడి ఆగడాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తండ్రిపై ద్వేషం పెంచుకున్ను అక్కాచెల్లెళ్లు ముగ్గురు గతేడాది జూలైలో అతడిని హత్య చేశారు. కత్తితో పలుమార్లు దాడి చేసి.. సుత్తితో కొట్టి చంపారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సంపాదించినట్లు విచారణ అధికారులు మంగళవారం పేర్కొన్నారు. ఈ మేరకు క్రెస్టీనా, ఏంజెలీనాపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వారిద్దరూ ఉద్దేశపూర్వకంగానే తండ్రి మైఖేల్‌ను హత్య చేసినట్లు కోర్టుకు తెలిపారు. అంతేగాక మారియాకు సైక్రియాట్రిస్ట్‌తో చికిత్స అందించాలని సూచించారు. ఈ క్రమంలో క్రెస్టీనా, ఏంజెలీనాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రష్యా చట్టాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గృహహింస చట్టం లేనందు వల్లే ఇద్దరు అమ్మాయిలకు ఇలాంటి పరిస్థితి తలెత్తిదంటూ మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మహిళా హక్కుల కార్యకర్త అన్నా రివీనా ఈ విషయం గురించి మాట్లాడుతూ... ‘ విచారణాధికారుల ప్రకటన గృహహింసను ప్రోత్సహించేందిగా కనిపిస్తోంది. ఆత్మ రక్షణ కోసం చేసిన పనిని నేరంగా చిత్రీకరించడం దారుణం. అసలు సమస్య ఏంటో ఎవరికీ పట్టడం లేదు. పౌరుల జీవితాన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేస్తున్నాయి’ అని మండిపడ్డారు. -
‘ఇక యువీ ప్రశాంతంగా ఉండగలడు’
ఢిల్లీ: గృహ హింస కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు చాలా పెద్ద ఊరట లభించిందని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం సోదరుడు జోరావర్ భార్య ఆకాంక్ష శర్మ.. యువరాజ్‌తో పాటు అతని కుటుంబంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే యువరాజ్‌పై పెట్టిన కేసులో ఎటువంటి వాస్తవం లేదని, లబ్ధి కోసమే అలా కేసు పెట్టినట్లు ఆకాంక్ష తెలిపినట్లు యువీ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. దాంతో ఇక నుంచి యువరాజ్ ప్రశాంతంగా ఉండగలడని వారు తెలిపారు. ఇటీవల జోరావర్-ఆకాంక్ష సింగ్‌లు కోర్టు ద్వారా విడాకులు పొందిన సంగతి తెలిసిందే. అయితే 2017లో భర్తతో పాటు యువరాజ్ సింగ్, అతని తల్లి షబ్నామ్ సింగ్‌లపై ఆకాంక్ష గృహ హింస కేసు పెట్టారు. చట్టం నుంచి తప్పించుకోలేని సందర్భంలో యువరాజ్‌పై పెట్టిన కేసును ఆకాంక్ష ఉపసంహరించుకున్నారని అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘కోట్లాది అభిమానులున్న యువీ పేరును అడ్డం పెట్టుకుని మమ్మల్ని టార్గెట్ చేశారు. గృహ హింస పేరుతో యువీ ప్రతిష్టకు భంగం కల్గించాలని ఆకాంక్ష చూశారు. చట్టంపై నమ్మకంతో యువీ పోరాడాడు. యువీకి చివరి ఊరట లభించింది మేము యువీని చూసి గర్విస్తున్నాం’ అని కుటుంబ సభ్యులు తెలిపారు. -
భర్తపై గృహహింస కేసు పెట్టిన టీవీ నటి
ముంబై: ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారీ భర్త అనుభవ్ కోహ్లిని పోలీసులు ముంబైలో అరెస్టుల చేశారు. ఆయనపై భార్య శ్వేత గృహహింస కేసును నమోదు చేశారు. అంతేకాకుడా శ్వేత కుతూరు పాలక్ తివారీకి అతను అసభ్య ఫొటోలను చూపించినట్టు అభియోగాలు వినిపిస్తున్నాయి. నటి శ్వే తా తివారీ ఆదివారం మధ్యాహ్నం భర్తకు వ్యతిరేకంగా ముంబై సమతా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె వెంట తల్లి, కూతురు పాలక్ ఉన్నారు. మద్యం మత్తులో అనుభవ్ నిత్యం తనను కొట్టేవాడని, కోపంలో ఓసారి పాలక్‌పై కూడా అతను చేయి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అనుభవ్‌ను స్టేషన్‌కు పిలిచి.. నాలుగుగంటలపాటు చర్చించిన అనంతరం అరెస్టు చేశారు. శ్వేత తివారి గతంలో రాజా చౌదరిని పెళ్లాడారు. వీరికి కూతురు పాలక్ ఉంది. గృహహింస బారిన పడిన ఆమె 2007లో రాజాతో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొంతకాలం డేటింగ్ చేసిన అనుభవ్ కోహ్లిని 2013లో ఆమె పెళ్లాడారు. వీరికి రెండేళ్ల కొడుకు రెయాన్ష్ కొహ్లి ఉన్నాడు. శ్వేత-అనుభవ్ మధ్య గొడవలు రావడం ఇదే తొలిసారి కాదు. 2017లోనూ వీరు గొడవలు పడ్డట్టు కథనాలు వచ్చాయి. ‘కౌసటి జిందగి క్యా’ సీరియల్లో ప్రేరణగా అత్యంత పాపులర్ అయిన శ్వేత.. పలు టీవీ సీరియళ్లతోపాటు హిందీ బిగ్‌బాస్-4 విన్నర్‌గా నిలిచారు. -
సీఎం విడాకులు తీసుకుంటున్నారా; ఛీప్ పబ్లిసిటీ!
అగర్తలా : తన భర్త గురించి కొంతమంది వ్యక్తులు పనిగట్టికుని మరీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని త్రిపుర సీఎం బిప్లవ్ దేవ్ భార్య నితి దేవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బిప్లవ్ దేవ్ తన భార్యను వేధింపులకు గురిచేస్తూ, గృహహింసకు పాల్పడ్డారని.. ఈ క్రమంలో నితి ఆయనకు విడాకులు ఇవ్వనున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్‌లలో ప్రచారమైన సంగతి తెలిసిందే. ఈ విషయాల గురించి నితి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఈ మేరకు ఫేస్బుక్లో ఆమె సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘ పుకార్లకు నోరు ఉండదు కదా. నీచమైన బుద్ధి కలిగిన, అనారోగ్యంతో బాధ పడుతున్న కొంతమంది వ్యక్తులు ఛీప్ పబ్లిసిటీ కోసం ఇలాంటివి ప్రచారం చేస్తారు. నా భర్తను చెడుగా చూపించి రాజకీయంగా లబ్ది పొందాలని భావించిన వాళ్లే డబ్బులు చెల్లించి మరీ ఇలా దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఒకరి భార్య, మరొకరి వదినగా, కూతురిగా, కోడలిగా ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తున్నా. మన రాష్ట్ర ప్రజలకు నిజంగా నాపై ప్రేమానురాగాలు ఉంటే, నన్ను పూర్తిగా విశ్వసించినట్లైతే అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని బాయ్‌కాట్ చేయండి. నా భర్త పట్ల నాకు అనిర్వచనీయమైన ప్రేమ ఉంది. ఎవరో ఏదో అన్నారని వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదు’ నితి దేవ్ పేర్కొన్నట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. కాగా దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బీజేపీ గతేడాది త్రిపురలో అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో యువ నాయకుడు బిప్లవ్ దేవ్‌ను.. కమలనాథుల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. ఇక పదవి చేపట్టిన నాటి నుంచి బిప్లవ్ కుమార్ అనేకమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మహాభారత కాలంలో శాటిలైట్ కమ్యూనికేషన్ ఉందంటూ మొదలైన ఆయన వ్యవహారం.. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని మతి చెడిందంటూ ఎద్దేవా చేయడం... మాజీ మిస్ వరల్డ్ డయానా హెడెన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు... సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే సరితూగుతారని, మెకానికల్ వాళ్లు పనికి రారని ప్రకటన... చివరకు.. చదువుకోవటం కన్నా పాన్ షాపులు పెట్టుకోవటం. ఆవులు మేపుకోవటం ఉత్తమం అంటూ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించటం, ఇలా వరుసగా తన వ్యవహార శైలితో ఆయన మీడియాలో దర్శనమిచ్చారు. -
దారుణం : ఇనుప రాడ్లతో వాతలు పెట్టి..
పట్నా : కోరినంత కట్నం ఇవ్వలేదని కట్టుకున్న భార్యను అతి దారుణంగా హింసించాడో ఓ కసాయి భర్త. తల్లిదండ్రులతో కలిసి ఆమెను రైల్వేట్రాక్‌పై పడేసి అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సదరు మహిళ భర్త, అత్తింటివారిపై ఫిర్యాదు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెళ్లి సమయంలో కట్నంగా రెండు లక్షల రూపాయలతో పాటు బైక్ కూడా కొనివ్వాలని నిందితుడు అమ్మాయి(22) తరఫు వారిని డిమాండ్ చేశాడు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి అతడు.. తన తల్లిదండ్రులతో కలిసి భార్యను హింసించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టిన భర్త, అత్తమామలు.. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని, శరీరంలోని చాలా భాగాలు పూర్తిగా కాలిపోయాయని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు. కాగా వరకట్న వేధింపుల కేసులు, హత్యలు అధికమవుతున్నాయి. వరకట్నం ఇవ్వని కారణంగా కేరళకు చెందిన తుషార అనే వివాహిత అత్యంత దారుణ స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. కోరిన కట్నం ఇవ్వలేదనే కారణంతో భర్త హింసిస్తూ.. కేవలం చక్కెర నీళ్లు, నానిన బియ్యం మాత్రమే ఆహారంగా పెట్టడంతో మార్చి 21న ఆమె చనిపోయారు. -
‘క్రైమ్ సీన్ కోసం అలా చేయమంది.. ఇప్పుడేమో’
న్యూఢిల్లీ : బాలీవుడ్, టీవీ నటి అర్జూ గోవిత్రికర్ తన భర్త సిద్ధార్థ్ సబర్వాల్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తాగి వచ్చి రోజూ తనను కొడుతున్నాడని భర్తపై గృహ హింస కేసు పెట్టారు. బాత్రూంలో పడేసి తనపై విచక్షణా రహితంగా దాడి చేశాడని పేర్కొంటూ... ఇందుకు ఆధారంగా తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని కూడా జత చేశారు. ఈ విషయంపై స్పందించిన సిద్ధార్థ్ సబర్వాల్ ముంబై మిర్రర్‌తో మాట్లాడుతూ... ‘ తన వృత్తిలో భాగంగా ఓ క్రైమ్ షో రిహార్సల్ కోసం తనను కొట్టాలని అర్జూ అడిగింది. కానీ ఇప్పుడేమో ఇలా చేసింది. నాపై ఆమె చేసిన ఆరోపణలకు సరైన వేదికపైనే సమాధానం చెబుతా’ అని వ్యాఖ్యానించాడు. కాగా అర్జూ 2010లో వ్యాపారవేత్త అయిన సిద్ధార్థ్ సబర్వాల్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఐదేళ్ల కొడుకు ఉన్నాడు. సిద్ధార్థ్ కుటుంబంతో సహా ఇటీవలే వర్లీలోని కొత్త అపార్టుమెంటులోకి మారాడు. ఈ క్రమంలో వీరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు తల్లెత్తినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తనకు కొడుకును దూరం చేస్తున్నాడంటూ అర్జూ.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక అమితాబ్ సినిమా ‘బాగ్బన్’తో గుర్తింపు తెచ్చుకున్న అర్జూ.. ప్రస్తుతం నాగిన్, ఏక్ లడ్కీ అంజానీ సీ తదితర హిందీ సీరియళ్లలో నటిస్తున్నారు. -
వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య
చిక్కడపల్లి: భర్త, కుటుంబ సభ్యుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. సీఐ సైరెడ్డి వెంకట్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా, ఇందిరానగర్‌కు చెందిన సౌజన్య (29), మెట్రో సర్వో డ్రైవ్స్ కంపెనీలో అసిస్టెంట్ ఇంజినీరింగ్‌గా పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న చిక్కడపల్లికి చెందిన ప్రకాష్‌ను 2017లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. గత ఏడాది జూలైలో పాపకు జన్మనిచ్చిన సౌజన్య రెండు నెలల క్రితం చిక్కడపల్లిలోని అత్తగారింటికి వచ్చి అక్కడే ఉంటోంది. ఆదివారం మధ్యాహ్నం గదిలోకి వెళ్లిన సౌజన్య ఎంత కూ బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె భర్త కిటికీలోంచి చూడగా సౌజన్య ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. తలుపులు బద్దలు కొట్టి ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె భర్త, అత్త రుష్యేంద్రమణి వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తండ్రిపెద్దపుల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బ్యాంక్ అధికారిపై గృహ హింస కేసు
గుంటూరు, తెనాలి: స్థానిక ఐడీబీఏ శాఖలో అసిస్టెంటు మేనేజరుగా పనిచేస్తున్న కరేటి శ్రీనివాస్, అతడి తలిదండ్రులు, సోదరిపై హైదరాబాద్‌లో గృహహింస కేసు (డీవీసీ నెం.56/2019) నమోదైంది. రాజేంద్రనగర్‌లోని 14వ మేజిస్ట్రేటు కోర్టులో శ్రీనివాస్, తల్లిదండ్రులు కరేటి ఉషారాణి, రామనాథ్, సోదరి అనితపై ఈనెల ఒకటో తేదీన కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబం ఆదివారం తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ పాండురంగపేటకు చెందిన కరేటి శ్రీనివాస్‌కు, హైదరాబాద్‌లోని శివమౌనిక యాదవ్‌కు 2012 డిసెంబరులో వివాహమైంది. తెనాలిలోనే జరిగిన ఈ పెళ్లికి ముందుగానే కట్నం కింద నగదు, చెక్కులు, ఇతర ఆస్తుల్ని తీసుకున్నారు. మరో ఆర్నె ల్లకు భార్య దగ్గర మరో రూ.8 లక్షల్ని శ్రీనివాస్ తీసుకున్నాడు. ఇంత కట్నం తీసుకున్నా, ఇంకా డబ్బులు తెమ్మంటూ వేధింపులు ఆరంభించారు. శ్రీనివాస్ తల్లిదండ్రులు ఉషారాణి, కరేటి రామనా«థ్, సోదరి అనిత కూడా ఇందుకు సహకరించినట్టుగా బాధిత శివమౌనిక యాదవ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషనులో 2017లో ఫిర్యాదు చేశారు. దీనిపై అక్కడి పోలీసులు 498–ఎ ఐపీసీ 3,4 డీపీఏ కింద కేసు నమోదు చేశారు. నిందితుల్ని అరెస్టు చేశారు. గతేడాది పోలీసులు ఈ కేసులో చార్జిషీటును సమర్పించారు. శ్రీనివాస్, అతడి తండ్రి అధిక రేటుతో వడ్డీ వ్యాపారం చేస్తుంటారని, బాకీదారైన ఒక స్కూలు టీచరును ఇదే విషయమై దూషించగా, ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు చార్జిషీటులో పొందుపరిచారు. వరకట్న వేధింపుల కేసు విచారణ దశలో ఉండగా, తాజాగా హైదరాబాద్ కోర్టులో గృహహింస కేసు నమోదైంది. -
రెండు పెళ్లిళ్లు జరిగినా..
దోమకొండ నిజామాబాద్ : మండలంలోని అంచనూర్ గ్రామానికి చెందిన గుండు మహిపాల్(44) అనే వ్యక్తి జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏఎస్ఐ లింబాద్రి తెలిపారు. మృతుడు మహిపాల్‌కు 2003లో వివాహం కాగా భార్య కల్పన పుట్టింటికి వెళ్లిపోయి వరకట్నం కేసు పెట్టిందని తెలిపారు. తిరిగి 2011లో మరో వివాహం చేసుకోగా భార్య కాపురానికి రావడం లేదన్నారు. రెండు పెళ్లిళ్లు జరిగిన సంసార జీవితం లేకపోవడంతో జీవితంపై విరక్తి చేంది ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మృతుడు గ్రామంలో కరెంట్ మోటార్ల మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఆయన వివరించారు.