durgam cheruvu
-
హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేక్!
హైదరాబాద్, సాక్షి: హైడ్రా దూకుడుకు తెలంగాణ హైకోర్టు బ్రేకులు వేసింది. దుర్గం చెరువు కూల్చివేతలపై సోమవారం స్టే ఆదేశాలు జారీ చేసింది.ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దుర్గం చెరువు నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించారు. తమ అభ్యంతరాలను లేక్ ప్రొటెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు..కూల్చివేతలు ఆపేయాలని స్టే ఆర్డర్స్ జారీ చేస్తూనే.. అక్టోబర్ 4న లేక్ ప్రొటెక్షన్ కమిటీ ముందు దుర్గం చెరువు నిర్వాసితులు హాజరు కావాలని ఆదేశించింది. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అక్టోబర్ 4 నుండి ఆరు వారాల లోపు ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దుర్గం చెరువు పరిసర నివాసితులకు ఊరట లభించినట్లయ్యింది. -
‘దుర్గం చెరువు’ దోషులు అధికారులే!
సాక్షి, హైదరాబాద్/గచ్చిబౌలి: ‘‘హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హుడా) అనుమతులు ఇచ్చిందంటే ప్రభుత్వం ఇచ్చినట్టే కదా! నీటి పారుదల శాఖ ఇచ్చిన నిరభ్యంతర పత్రాల(ఎన్వోసీ) మేరకే ఇళ్లు, భవనాలు నిర్మించాం. 30 ఏళ్లు దాటింది. ఇప్పుడు ఏకంగా 204 నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చారు. ఇక్కడ దోషులెవరు? ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు అప్పుడే నిర్ధారిస్తే.. ఇప్పుడు కూల్చివేతలు ఉండేవి కాదు కదా’’.. .. దుర్గం చెరువు సమీపంలోని నెక్టార్ గార్డెన్‌కు చెందిన ఓ ఇంటి యజమాని ఆందోళన ఇది. ఆయనే కాదు.. గత 30 ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్న చాలా మంది తమ ఇళ్లు, భవనాలు చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క దుర్గం చెరువు ప్రాంతంలోనే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నాలాలను ఆనుకొని నిర్మించిన విల్లాలు, అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలకు ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, తదితర ప్రభుత్వ విభాగాలు అనుమతులు ఇచ్చాయి. ఇప్పుడేమో అధికారులు ఆ ఇళ్లు ఎఫ్టీఎల్ పరిధిలో, బఫర్‌జోన్‌లో ఉన్నట్టు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. నోటీసులు ఇచ్చిన తహసీల్దార్ దుర్గం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించారంటూ.. శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకారెడ్డి ఈ నెల 5న వాల్టా చట్టం కింద అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, కావూరిహిల్స్, నెక్టార్ గార్డెన్లలో ఉన్న 204 నిర్మాణాలకు నోటీసులు ఇచ్చారు. 30 రోజుల్లో నిర్మాణాలను తొలగించుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చే నిర్మాణాలకు ‘ఎఫ్’అని.. కొంతభాగం ఎఫ్టీఎల్లోకి వస్తే ‘ఎఫ్/పీ’అని.. బఫర్‌జోన్‌లోకి వచ్చే నిర్మాణాలపై ‘బీ’అని గోడలపైన రాశారు. రాజకీయ, సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ఈ నోటీసులు అందుకున్న వారిలో ఉన్నారు. ఓ పర్యావరణవేత్తకు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు సమాచారం. అమర్ సొసైటీలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు కూడా ఉంది. ఎకరా రూ.వంద కోట్లపైనే..! దుర్గం చెరువు ప్రాంతంలో ఆక్రమణకు గురైన భూముల ప్రస్తుత మార్కెట్ విలువ ఎకరానికి రూ.వంద కోట్లపైనే ఉంటుందని అంచనా. చదరపు గజం విలువే రూ.2 లక్షలపైన ఉంటుంది. హైటెక్‌సిటీని ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ప్రాంతం రియల్టర్లకు, బిల్డర్లకు హాట్‌కేక్‌లా మారింది. దాంతో రెండు, మూడు దశాబ్దాల క్రితం నుంచే కబ్జాల పర్వం మొదలైంది. ఈ అక్రమ నిర్మాణాలకు అందరూ బాధ్యులే. అప్పటి ప్రభుత్వ పెద్దలు, రాజకీయ ప్రముఖుల నుంచి అక్రమ లేఅవుట్లకు అడ్డగోలుగా అనుమతులిచ్చిన హుడా అధికారులు.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమణకు గురవుతున్నట్టు తెలిసినా ఎన్వోసీలు ఇచ్చిన నీటిపారుదల, రెవెన్యూ అధికారులు కూడా బాధ్యులే. నిజాం కాలంలో నిర్మించిన దుర్గం చెరువు రెండు గుట్టల మధ్య సుమారు 160.7 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాయదుర్గం పాయెగాలో 62ఎకరాలు, మాదాపూర్ సర్వే నం.63, 64లలో 28 ఎకరాలు, గుట్టల బేగంపేట్ సర్వే నంబర్లు 42 నుంచి 61 వరకు 70.7 ఎకరాల విస్తీర్ణంలో దుర్గంచెరువు ఉండేది.హుడా ఆమోదంతో నిర్మాణాలు.. ఈ ప్రాంతంలో 1991లో మొదట అమర్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ 15 ఎకరాల విస్తీర్ణంలో 150 ప్లాట్లతో లేఅవుట్ చేసింది. అయితే చెరువు చుట్టూ 30 అడుగుల పరిధిలో స్థలాన్ని గ్రీన్‌బెల్ట్ కోసం కేటాయించిన హుడా.. 130 ప్లాట్లకు 1995లో తుది ఆమోదం ఇచ్చింది. ఈ క్రమంలోనే వరుసగా కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్ గేటెడ్ కమ్యూనిటీలకు కూడా హుడా ఆమోదం లభించింది. నెక్టార్ గార్డెన్ పూర్తిగా, కావూరి హిల్స్‌లోని కొంత భాగం దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉంది. గతంలో భారీ వర్షాలు వచ్చినప్పుడు కావూరి హిల్స్, నెక్టార్ గార్డెన్, అమర్ సొసైటీలలోకి వరద నీరు చేరేది. దీనితో దుర్గంచెరువు పూర్తిగా నిండకుండా, ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలేస్తూ.. ఎఫ్‌టీఎల్‌పై ఫోకస్ పడకుండా చేశారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఒత్తిడి తీసుకొచ్చి వర్షాకాలంలో దుర్గం చెరువు గేట్లు మూసివేయ కుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే చెరువు సుందరీకరణ పేరిట చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయడంతో.. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వారికి అదో రక్షణ గోడగా మారిపోయింది.అధికారులు ఏమంటున్నారు? 2013లో సుమారు 160.7 ఎకరాల్లో దుర్గం చెరువు విస్తీర్ణాన్ని గుర్తిస్తూ ఎఫ్టీఎల్ను నిర్ధారించామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖల నుంచి వచ్చిన ఎన్వోసీల మేరకు అనుమతులను ఇచ్చినట్లు హెచ్ఎండీఏ అధికారులు అంటున్నారు. ఇక ‘‘ప్రభుత్వం ఆమోదించిన మాస్టర్ ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకుంటాం. చాలా చోట్ల కాలువలను పూర్తిగా మూసివేయడం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి చేరుతుంది. దీంతో ఎఫ్టీఎల్ నిర్ధారణలో శాస్త్రీయత లోపిస్తోంది’’అని హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం.అక్రమమైతే కూల్చేయండి.. వాల్టా చట్టం రాకముందే 1995లో లేఅవుట్‌కు ఆమో దం లభించింది. హుడా అనుమతితోనే ఇళ్లు నిర్మించారు. 2016లో 600 చదరపు గజాల స్థలంలో ఇల్లు కొనుగోలు చేశాం. ఈ ప్రాంతం చెరువు పరిధిలోకి వస్తుందన్న సమాచారమేదీ లేదు. ఇప్పుడు బఫర్ జోన్లోకి వస్తుందంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైతే కూల్చేయండి, ముఖ్యమంత్రి నా ఒక్కడి కోసం పనిచేయడం లేదు కదా! బీఆర్ఎస్ నాయకులు నా ఇంటి విషయంలో రాజకీయం చేస్తున్నారు. – సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిభయభ్రాంతులకు గురిచేయొద్దు 1995లో హుడా అనుమతి ఇవ్వడంతోనే ప్లాట్లు కొనుగోలు చేసి ఇ ళ్లు కట్టుకున్నాం. ఇప్పటికీ ఈఎంఐలు కట్టేవారు ఉన్నారు. 2023 లో జీహెచ్ఎంసీ హైపవర్ కమిటీ ఈ ప్రాంతం ఎఫ్టీఎల్లోకి రాదని తేల్చింది. ప్రభుత్వాలు మారితే ఎఫ్టీఎల్ మారుతుందా? – అమర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి గోపాల కృష్ణారెడ్డిఇళ్లు కట్టాలంటే ఏ అనుమతులు ఉండాలిగ్రీన్బెల్ట్ను వదిలి అమర్ సొసైటీ లేఅవుట్‌కు హుడా అధికారులు ఆమోదం తెలిపారు. అనుమతి ఉన్న లేఅవుట్లో ప్లాట్ తీసుకొని, ఇంటి నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నాం. హైదరాబాద్‌లో ఇళ్లు కట్టుకోవాలంటే ఇంకా ఏమేం అనుమతులు తీసుకోవాలో చెప్పండి. – పోలవరపు శ్రీనివాస్, అమర్ సొసైటీ వాసి -
చెరువు ఆక్రమణ... సీఎం సోదరుడితోపాటు పలువురికి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా, అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజాగా ఐటీ కారిడార్ వద్ద ఉన్న దుర్గం చెరువు పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో సహా మొత్తం 204 మందికి నోటీసులు ఇచ్చారు.నగరంలో ప్రసిద్ధి చెందిన దుర్గం చెరువుకు ‘సీక్రెట్ లేక్’ గుర్తింపు ఉంది. హైటెక్‌సిటీ వెలిశాక చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. రాజకీయ, వ్యాపార ప్రముఖులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, విశ్రాంత బ్యూరోక్రాట్లు నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో.. అధికారులు వాటి జోలికి వెళ్లలేదనేది వాస్తవం. కానీ, ఇప్పుడు హైడ్రా చర్యలతో కదలిక వచ్చింది.దుర్గం చెరువును ఆనుకుని ఉన్న పరిసరాల్లో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించారు. దుర్గం చెరువుకు ఇరువైపులా.. కొందరు ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ నిర్మాణాలు ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శేరిలింగంపల్లి తహసీల్దార్.. వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసుల్లో భాగంగా 30 రోజుల్లో స్వచ్చందంగా అక్రమ కట్టడాలను కూల్చివేయాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టరీత్యా తామే కట్టడాలను కూల్చేస్తామని తెలిపారు.దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం కూడా ఉంది. దీంతో, తిరుపతి రెడ్డికి కూడా అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నెక్టార్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, అమర్ కోఆపరేటివ్ సోసైటీ, కావూరీ హిల్స్‌లోని కొన్ని నివాసాలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణాలన్నింటిని కూల్చివేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు: తిరుపతి రెడ్డిఇక, తహసీల్దార్ నోటీసులపై తాజాగా సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసు నా దృష్టికి వచ్చింది. నేను 2015లో అమర్ సొసైటీలో ఒక ఇంటిని కొనుగోలు చేశాను. నేను ఇంటిని కొనుగోలు చేసినప్పుడు ఈ భూమి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందన్న సమాచారం నాకు తెలియదు. ప్రస్తుతం ప్రభుత్వం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భూములపై చర్యలు తీసుకున్న నేపథ్యంలో నా బిల్డింగ్ ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
వాటర్ స్పోర్ట్.. కయాకింగ్..
తక్కువ వెడల్పు కాస్త ఎక్కువ పొడవు ఉండే కయాక్ లేదా పడవను రెండు వైపుల ప్యాడ్స్ ఉన్న ఒక తెడ్డును ఉపయోగించి నీటిపై కదిలించడమే కయాకింగ్. సాధారణంగా ఈ పడవపై ఒకేసారి ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు కలిసి పడవను నడిపించడమే ఈ క్రీడలోని ప్రత్యేకత. ముఖ్యంగా ఇది పర్యాటక క్రీడగా దేశంలో గుర్తింపు పొందింది. సాహస ప్రేమికులు, అడ్వెంచర్ టూరిజాన్ని ఇష్టపడేవారు ఈ కయాకింగ్కు ఆకర్షితులవుతుంటారు. సరస్సులు లేదా పెద్ద చెరువుల్లో వినోదించడానికి ఇదో చక్కని మార్గంగా చెప్పొచ్చు. ప్రస్తుతం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ కయాకింగ్ అందుబాటులో ఉంది. దీంతో ఈ జలక్రీడను నగర వాసులు ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా కాలంగా నీటి క్రీడగా ఉంటూ వస్తున్నప్పటికీ గత దశాబ్ద కాలంగా ప్రధాన పర్యాటక క్రీడగా కూడా దేశంలో ప్రసిద్ధి చెందింది. సాహస ప్రేమికులైన పర్యాటకుల్లో చాలా మంది ఈ కయాకింగ్‌ను అనేక సార్లు ఎంజాయ్ చేసి ఉంటారు. అయితే నిన్నా మొన్నటి వరకూ దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే వారికి ఈ అవకాశం దక్కేది. ఇటీవల నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా కొన్ని çచోట్ల కయాకింగ్ అందుబాటులోకి వచి్చంది. ఆయా చోట్ల ఇప్పటికే నగరవాసులు ఈ జలక్రీడను ఆస్వాదిస్తున్నారు.కోట్‌పల్లి అటవీ ప్రాంతంలో..తెడ్డు చేతపట్టి జలాశయంలో నీటిని వెనక్కి నెట్టుకుంటూ ముందుకు సాగిపోతుంటే.. కయాకింగ్స్ ఈ అనుభూతి పొందాలంటే మాత్రం వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి ప్రాజెక్టుకు పోవాల్సిందే. అటవీ ప్రాంతం మధ్యలో కనుచూపు మేరలో నీటి అలలపై తేలియాడే పడవలు కనువిందు చేస్తాయి. నిత్యం 300 నుంచి 400 మంది పర్యాటకులు ఇక్కడ బోటింగ్ చేస్తుంటారు. వారాంతాలు, సెలవు రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. గత పదేళ్లుగా ఇక్కడ బోటింగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు. సుమారు 20 మంది లైఫ్ గార్డ్స్ అందుబాటులో ఉంటారు. లైఫ్ జాకెట్స్, ఇతర ప్రమాణాలు పాటిస్తుంటారు. ఒక్కరు ప్రయాణించే బోటుకు గంటకు రూ.250 ఫీజు వసూలు చేస్తారు. ఇద్దరు ప్రయాణించే బోటుకు రూ.400 వరకూ వసూలు చేస్తారు. ఈ రిజర్వాయర్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ తెరిచి ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకోవడానికి వివరాలు అందుబాటులో ఉంటాయి. వికారాబాద్ పర్యాటక రంగంలో కోట్‌పల్లి బోటింగ్ పాత్ర కీలకమనే చెప్పాలి. ప్రయాణం ఇలా..నగరం నుంచి సుమారు 80 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంటుంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్, తాండూరుకు ఆర్టీసీ బస్సు సరీ్వసులు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి నుంచి రైలు సదుపాయం కూడా ఉంది. సొంత వాహనాల్లో వచ్చేవారు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి చేవెళ్ల మీదుగా రావచ్చు. దీంతోపాటు శంకర్పల్లి మీదుగానూ రావచ్చు. ఇక్కడకు వచ్చే వారు అనంతగిరి కొండల్లో కొలువైన శ్రీ అనంత పధ్మనాభస్వామి వారిని దర్శించుకుంటారు. అనంతగిరుల అందాలను ఆస్వాదిస్తారు.నగరంలోనూ పలు చోట్ల.. ఈ వాటర్ స్పోర్ట్స్‌కు సంబంధించి నగరంలోని దుర్గం చెరువు కేంద్ర బింధువుగా మారింది. ఇక్కడ సూర్యాస్తమయ సమయాల్లో హుషారుగా సాగే కయాకింగ్ ఈవెంట్లో ఔత్సాహికులు పాల్గొనవచ్చు. పడవలను తిప్పుతూ సరదాగా కాసేపు గడపాలనుకునే వారికి రూ.700 రుసుముతో ఆ అవకాశం అందుబాటులో ఉంది. అలా కాకుండా ప్రొఫెషన్‌గా తీసుకుని సీరియస్‌గా కయాకింగ్ నేర్చుకోవాలనుకుంటే కూడా ఇక్కడి వాటర్ స్కూల్లో ప్రత్యేక కోర్సు అందుబాటులో ఉంది. ఒక్క సోమవారం మినహా వారంలోని అన్ని రోజుల్లో ఈ క్రీడ అందుబాటులో ఉంటుంది.మరిన్ని ప్రాంతాల్లో... అదే విధంగా నగరంలోని హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న యాచ్ క్లబ్ కూడా కయాకింగ్ ప్రియుల కోసం పడవలను అందుబాటులో ఉంచుతోంది. లక్నవరం సరస్సులో కాయక్ని అద్దెకు తీసుకుని, చుట్టూ నిర్మలమైన కొండలు ఉన్న సరస్సులో విహరించే అవకాశం ఉంది. అక్కడ కొన్ని క్యాంపింగ్ గ్రూపులు, స్థానికులు గంటల ప్రాతిపదికన కయాక్‌లను అద్దెకు ఇస్తారు. సాధారణంగా ఉదయం వేళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.కయాకింగ్కు ఆదరణ పెరిగింది.. నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. గత 30 ఏళ్లుగా ట్రెక్కింగ్, బోటింగ్ చేస్తున్నాను. మన దగ్గర ఎంటర్టైన్మెంట్ అంటే ఎక్కువగా సినిమాల వరకే ఉంటాయి. అయితే ఎంతో మంచి వినోదాన్ని అందించే పర్యావరణ వింతలు, ట్రెక్కింగ్, బోటింగ్ వంటివి చాలా ఉన్నాయి. వీటిని ప్రోత్సహించేందుకు ప్రొగ్రసివ్ తెలంగాణ సొసైటీ ఆధ్వర్యంలో కోట్‌పల్లిలో బోటింగ్ ఏర్పాటు చేశాం. దీని కోసం నా సొంత ఖర్చుతో బోట్లను కొనుగోలు చేసి ఇచ్చాను. దీని ద్వారా ఇప్పుడు కొంత మంది యువతకు ఉద్యోగావకాశాలు లభించాయి. అంతే కాకుండా పరోక్షంగా వందలాది కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ఇప్పుడు ఇక్కడకు నిత్యం వేలాది మంది బోటింగ్‌కు వస్తున్నారు. – విశ్వేశ్వరరెడ్డి, చేవెళ్ల బీజేపీ ఎంపీఆరోగ్యలాభాలెన్నో.. కయాకింగ్ వల్ల అనేక రకాల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రీడ మజిల్ స్ట్రెంగ్త్ పెంచుతుంది. ముఖ్యంగా అప్పర్ బ్యాక్, చేతులు, భుజాలు, ఛాతీ భాగంలో కండరాలు బలోపేతం అవుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేకూరుస్తుంది. -
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
దుర్గం చెరువు ఎస్టీపీ సిద్ధం
హైదరాబాద్: దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించేందుకు జలమండలి అడుగులు వేస్తోంది. మహానగర పరిధిలో రోజూ ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేసేందుకు 31 కొత్త మురుగు నీటిశుద్ధి కేంద్రా(ఎస్టీపీ)ల నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే 15 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన కోకాపేట ఎస్టీపీ ప్రారంభం కాగా.. సుమారు 7 ఎంఎల్డీల సామర్థ్యంతో నిర్మించిన దుర్గం చెరువు మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని సోమవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఆరు నెలలుగా దీని ట్రయల్ రన్ కొనసాగుతోంది. ఎస్బీఆర్ సాంకేతికతతో.. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో దుర్గం చెరువు ఎస్టీపీల నిర్మాణం చేపట్టారు. ఎస్బీఆర్ టెక్నాలజీ ఎస్టీపీని నిర్మించడంతో ఒకే చాంబర్లో అయిదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ ఉంటుంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని శుద్ధి జరుగుతుంది. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెంట్ పద్ధతుల కంటే మెరుగ్గా మురుగు నీటి శుద్ధి జరుగుతుంది. మూడు ప్యాకేజీల్లో.. మహానగరంలో మొత్తం 3 ప్యాకేజీల్లో 5 సర్కిళ్లలో సుమారు రూ.3866.41 కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీ సామర్థ్యం గల 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. ► ప్యాకేజీ–1 లో అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ ప్రాంతాల్లో రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా 402.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–2 లో రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ సర్కిల్ ప్రాతాల్లో రూ.1355.13 కోట్లతో 6 ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్డీ మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ► ప్యాకేజీ–3లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను ఏర్పాటు చేసి, ఇక్కడ 376.50 ఎంఎల్డీల మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. రోజువారీగా 1950 ఎంఎల్డీల మురుగునీరు.. హైదరాబాద్ అర్బన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీలు ఉండగా, ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టారు. 2036 సంవత్సరం వరకు ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేయవచ్చు. వాసన కట్టడికి చర్యలు నివాసాల సమీపంలో నిర్మిస్తున్న ఎస్టీపీల నుంచి దుర్వాసన రాకుండా జలమండలి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. దీనికోసం ఆధునిక విదేశీ సాంకేతికతను అధికారులు ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా.. విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కోసం గార్డెనింగ్, ల్యాండ్ స్కేపింగ్ పనులు చేపడుతున్నారు. వీటితో పాటు మొత్తం 22 ఎస్టీపీల ప్రాంగణాల్లో సుగంధ ద్రవ్యాల జాతికి చెందిన ఆకాశమల్లి, మిల్లింగ్, టోనియా, మైకేలియా చంపాకా, (సింహాచలం సంపంగి) మొక్కల్ని నాటారు. ఇవి దుర్వాసనను అరికట్టి సువాసనను వెదజల్లుతాయి. -
కేబుల్ బ్రిడ్జికి వెళ్తున్నారా.. పోలీసుల హెచ్చరిక ఇదే..
సాక్షి, హైదరాబాద్: వాహనదారులను సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను నిలిపితే జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేస్తే 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాల ప్రకారం.. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, ప్రమాదాలను నిలువరించేందుకు సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేయరాదని పోలీసులు హెచ్చరించారు. పార్కింగ్ చేసిన వాహనాలకు భారీ జరిమానా విధిస్తామని తేల్చిచెప్పారు. క్యారేజ్‌వే వద్ద వాహనాలను పార్క్ చేయడం వల్ల ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. అక్రమంగా వాహనాలను పార్కింగ్ చేస్తే భారీ జరిమానా విధిస్తామని సైబరాబాద్ పోలీసులు హెచ్చరించారు. అయితే కేబుల్ బ్రిడ్జిపై వాహనాలను పార్కింగ్ చేసి, ఇతరులకు ఇబ్బంది కలిగించినట్లు ప్రజల దృష్టికి వస్తే నేరుగా తమకు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. 9490617346 అనే నెంబర్‌కు వాట్సాప్ చేయాలని తెలిపారు. ఇదే సమయంలో ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు. Traffic movement on the Cable bridge is smooth. We request commuters not to park vehicles on carriageway which obstructs traffic flow. If any are found parking illegally on the bridge will attract a hefty penalty. Public can also report these issues through WhatsApp 9490617346. pic.twitter.com/UZiy5MjMQd — CYBERABAD TRAFFIC POLICE (@CYBTRAFFIC) August 8, 2023 -
HYD: కేబుల్‌బ్రిడ్జి దగ్గరకు వెళ్తున్నారా.. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.!
హైదరాబాద్(మాదాపూర్): కేబుల్‌బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారు కేబుల్‌బ్రిడ్జి వద్దకు వచ్చి దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ఇక్కడకు వచ్చి చెరువు మధ్యలోకి దూకుతున్నారు. అక్కడ ఎక్కువ లోతుగా ఉండడంతో దూకిన వారు బురదలో చిక్కుకుంటున్నారు. ఇటీవల తొమ్మిదిమంది ఆత్మహత్యాయత్నం చేయగా లేక్ పోలీసులు ముగ్గురిని కాపాడారు. మాదాపూర్‌లో దుర్గం చెరువు ఏరియా చుట్టుపక్కల ప్రాంతాల వారికి దూరాన్ని తగ్గించేందుకు కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేసిన ఈ తీగల వంతెనను నిత్యం సందర్శకులు సందర్శిస్తుంటారు. అయితే ఈ కేబుల్ బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారింది. ►కేబుల్ బ్రిడ్జిపై కేవలం 4 అడుగుల ఎత్తు ఉండడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ►లేక్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నప్పటికి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ►ఆకస్మాత్తుగా చెరువు మధ్య భాగంలో దూకడంతో ఊబిలోకి చొచ్చుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. ►చెరువు మధ్యభాగంలో దాదాపు 40 అడుగుల లోతు ఉండడంతో బయటకు తీయాలంటే ఎక్కువ సమయం పడుతోంది. ►ఇప్పటికి 9 మంది సూసైడ్ చేసుకున్నారని అందులో ముగ్గురిని రక్షించినట్టు తెలిపారు. ►కేబుల్‌బ్రిడ్జిపై 12 నుండి 14 అడుగుల ఎత్తు ఉండే విధంగా రక్షణ కంచె ఏర్పాటు చేయాలని దుర్గం చెరువు లేక్‌పోలీసులు తెలిపారు. ►సూసైడ్ చేసుకునే వారు పైకిఎక్కే క్రమంలో తొందరగా స్పందించవచ్చన్నారు. ►ఎవరైనా అదృశ్యమైతే వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఈ సమాచారం వల్ల ప్రాణాలను కాపాడవచ్చన్నారు ► కాగా సందర్శకులు కేబుల్‌బ్రిడ్జిపై నిలబడకుండా ఐటీ పెట్రోలింగ్ 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అయిన ప్రమాదాలు జరుగుతున్నాయి. ►ఎత్తైన కంచెను ఏర్పాటు చేస్తే కొంతవరకు ఆత్మహత్యలను నివారించవచ్చని సీనియర్ సిటిజన్లు తెలిపారు. ►అనుమతులు లేకుండా డ్రోన్లు వాడకూడదన్నారు. ►లేక్ పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు జమీందర్లు, ఇద్దరు కానిస్టేబుళ్లును అందుబాటులో ఉంచారు. వీరితో పాటు ఒక ఎస్సై ఉంటారు. ►రిస్క్ చేసేందుకు ఒక స్పీడ్ బోటు ఉన్నాయి. చెరువు చుట్టూరా తిరిగేందుకు నాలుగు బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. ►చెరువులో పడ్డ వారిని ఏ విధంగా రక్షించాలో ఫైర్ సిబ్బంది శిక్షణ పొందారు ►పైనుంచి దూకిన వారిని, నీటిలో మునిగిపోతున్న వారిని ఏ విధంగా కాపాడాలో, బయటికి తీసుకువచి్చన తరువాత ఎలాంటి ప్రథమ చికిత్స చేయాలో శిక్షణ ఇచ్చారు. ►మూడు పద్దతులలో కాపాడనున్నట్టు తెలిపారు. డ్రైలాండ్ రిసు్క, సెమి కాంటాక్ట్, ఫుల్ కాంటాక్ట్ పద్ధతులను వాడాలని పోలీసులు తెలిపారు. ►బోట్ నడిపే విధానం, బోటు చెడిపోతే బాగు చేసుకునే పద్ధతులపై శిక్షణ ఇచ్చారు. సమస్యలకు చావు పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. అలా అని చావు పరిష్కారం కాదు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో, బంధువులతో కలసి మాట్లాడి పరిష్కరించుకోవాలి. అధైర్యపడవద్దు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి సూసైడ్లు చేసుకోవద్దు. విలువైన కట్టడానికి అర్థం మారిపోతుంది. ఎవరైనా అదృశ్యమైనా, అనుమానాస్పదంగా ఉన్నా పోలీస్‌స్టేషన్‌లో వెంటనే ఫిర్యాదు చేస్తే ఫోన్ ట్రేస్ చేసి లోకేషన్‌ని గుర్తించి ప్రాణాలను కాపాడవచ్చు. –మాదాపూర్ ఇన్స్పెక్టర్ తిరుపతి -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
Video: దుర్గంచెరువు వద్ద డ్రోన్ షో.. ఆకాశంలో అద్భుతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో చేపట్టిన ప్రగతిపై ఆకాశంలో డ్రోన్లతో ప్రదర్శన కనువిందు చేసింది. మాదాపూర్‌లోని దుర్గంచెరువు వద్ద సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. పదిహేను నిమిషాల పాటు డ్రోన్లతో దుర్గంచెరువుపై ఆకాశంలో ఈ ప్రదర్శన సాగింది. 2014–2023 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అమరదీపం, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రాలతో కూడిన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దీంతోపాటు దేశంలోనే శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుల ప్రతిభను కూడా ప్రదర్శించారు. ఇటీవల ప్రారంభించిన సచివాలయం, యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు, కాళేశ్వరం ప్రాజెక్టు, దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేషన్ సెంటర్ టీ హబ్, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా, రాష్ట్రంలో ప్రత్యేకతను చాటుకున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్, మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్ ప్రగతిని డ్రోన్ల ద్వారా చిత్రాలతో కూడిన ప్రదర్శన కూడా విశేషంగా ఆలరించింది. ప్రదర్శన ముగిసే వరకు సైబరాబాద్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. అందరూ ఆసక్తిగా ఈ దృశ్యాన్ని తమ సెల్ఫోన్లలో బంధించారు. ప్రదర్శనను మంత్రులు మల్లారెడ్డి, మహమూద్ అలీ, సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్‌రావులు, సైబరాబాద్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆసక్తిగా తిలకించారు. చదవండి: సీఎం ఆదేశిస్తే డోర్నకల్ నుంచి పోటీ చేస్తా: మంత్రి సత్యవతి రాథోడ్ Drone Show at Durgam Cheruvu by Cyberabad police as part of #తెలంగాణదశాబ్దిఉత్సవాలు #TelanganaTurns10 pic.twitter.com/0Nqa8cy0Eb — Naveena Ghanate (@TheNaveena) June 4, 2023 This drone show with 500 drones is just mind-blowing 👏 Great job @cyberabadpolice 👍#TelanganaTurns10#తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/qlkPwPV7pH — Konatham Dileep (@KonathamDileep) June 4, 2023 -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఆంక్షలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై మూడు రోజులపాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్థరాత్రి నుంచి 10వ తేదీ ఉదయం వరకు కేబుల్ బ్రిడ్జి మూసివేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణ మ్యానువల్ ప్రకారం కాలనుగుణంగా ఇంజినీర్లచే తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో భారీ బరువున్న క్రేన్లను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో ట్రాఫిక్‌ను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగు రోజులపాటు వాహనదారులు, పాదాచారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలని కమిషనర్ సూచించారు. మరోవైపు రాకపోకలు నిలిచిపోయే ఆ నాలుగు రోజులపాటు ట్రాఫిక్‌ను వివిధ మార్గాల్లో మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. రోడ్ నం.45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్‌ను రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. అలాగే ఐకియా రోటరీ నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా జూబ్లీహిల్స్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను సైతం రెండు మార్గాల్లో మళ్లించనున్నారు. ఈ విషయాన్ని గమనించి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లి సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు కోరారు. చదవండి: Alert: హనుమాన్ శోభాయాత్ర.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
కేబుల్‌బ్రిడ్జి పైనుండి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, హైదరాబాద్: కేబుల్‌బ్రిడ్జి పైనుండి యువతి చెరువులోకి దూకిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ ప రిధిలో చోటుచేసుకుంది. ఎస్సై భాస్క ర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడారి హర్షిత(19) జ్ఞానదీపిక కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. మెహిదీపట్నంలోని సప్తగిరి కాలనీ, రేతిబౌలిలో నివాసముంటుంది. కాగా మంగళవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో కేబుల్‌బ్రిడ్జి పై నుండి దుర్గం చెరువులోకి దూకింది. పెట్రోలింగ్ పోలీసులు గమనించి లేక్ పోలీసులను ఆప్రమత్తం చేయగా లేక్ డిపార్ట్మెంట్ ఎస్సై భాను ప్రకాశ్ వెంటనే బోటు డ్రైవర్ మనోహర్‌తో కలసి ఆమె దూకిన చోట గాలించి రక్షించారు. వెంటనే మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
ఆర్టీసీ ‘హైదరాబాద్ దర్శిని’.. వీకెండ్లో స్పెషల్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను సందర్శించేందుకు ఆర్టీసీ ప్రవేశపట్టిన ‘హైదరాబాద్ దర్శిని’ సిటీ టూర్ బస్సుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి శని, ఆదివారాల్లో వీటిని నడుపుతారు. 12 గంటల సమయంలో హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు. - శని, ఆదివారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. - బిర్లామందిర్, చౌమొహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్‌లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తరువాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్ తదితర ప్రాంతాలను సందర్శించిన అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ అల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఛార్జీలు ఇవే.. - మెట్రో ఎక్స్‌ప్రెస్‌లలో పెద్దలకు రూ.250, పిల్లలకు రూ.130 . - మెట్రో లగ్జరీ బస్సుల్లో.. పెద్దలకు రూ.450 , పిల్లలకు రూ.340 . -
కేబుల్ బ్రిడ్డి వద్ద టెన్షన్.. దుర్గం చెరువులో దూకి యువతి ఆత్మహత్య!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్ పోలీసులు.. యువతి కోసం స్పీడ్‌బోట్స్‌తో గాలిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది. కాగా, కేబుల్ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. -
బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదంటూ..
మాదాపూర్: ‘నేను ఇవాళ రాత్రి 8 గంటలకు దుర్గంచెరువు కేబుల్ మీది నుంచి దూకుతున్నాను. నేను చావడం డ్రగ్స్ అడిక్ట్ వల్లనో, అమ్మాయి వల్లనో కాదు. నేను మరీ అంత చీప్ కాదు. కాలేజీ చదువు వల్ల అయితే అసలే కాదు. బతికేందుకు, చనిపోయేందుకు కారణం లేదు’అంటూ ఓ ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని షేక్‌పేట్ మండలం ఓయూ కాలనీలో నివాసముండే బుద్ధవనం సునీల్‌కుమార్ మాదాపూర్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు నిఖిల్ (17) మాదాపూర్ కావూరి హిల్స్‌లోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీ ముగియగానే నిఖిల్ రోజుమాదిరిగా బుధవారం సాయంత్రం ఇంటర్నెట్ సెంటర్‌కు వచ్చాడు. తన బ్యాగును అక్కడే వదిలి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాలేదు. నిఖిల్‌కు తండ్రి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ అని వచ్చింది. అనుమానంతో అతడి బ్యాగును పరిశీలించగా ఈ సూసైడ్ నోట్ లభించింది. సునీల్ వెంటనే మాదాపూర్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను రంగంలోకి దించి దుర్గంచెరువులో గాలించినా అతడి ఆచూకీ లభించలేదు. శుక్రవారం చెరువు ఒడ్డుకు నిఖిల్ మృతదేహం కొట్టుకురావడంతో పోలీసులు గమనించి స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. నిఖిల్ ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని మాదాపూర్ సీఐ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. డిప్రెషన్‌కు కారణాలు తెలియవని పేర్కొన్నారు. అతడికి ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారాలేవీ లేవని చెప్పారు. -
దుర్గం చెరువు: విదేశాల్లో ఉన్నామా అనే ఫీలింగ్!
సాక్షి, మాదాపూర్: ఇటు ఆకాశ హార్మ్యాలు.. అటు ఎత్తైన కేబుల్ బ్రిడ్జి.. చుట్టూ పచ్చని చెట్లు.. కొలువైన వివిధ రకాల విగ్రహాలు...సరస్సులోని నీటిని ముద్దాడుతున్న సూర్యకిరణాలు... విదేశాల్లో ఉన్నామా .. అనే అనుభూతి.. ఇలాంటి వాతావరణంలో బోటింగ్ అంటే నచ్చనివారు ఎవరుంటారు చెప్పండి?.ప్రశాంత వాతావరణానికి కేరాఫ్‌గా ఉన్న మాదాపూర్ దుర్గంచెరువులో బోటింగ్ చేసేందుకు సందర్శకులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చదవండి: దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ? చెరువు వద్ద ఏర్పాటు చేసిన రాతి జంట చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చిన్నా.. పెద్దా అంతా కేరింతలు కొడుతూ ఉత్సాహంగా బోటింగ్ చేస్తున్నారు. సందర్శకులు బోటింగ్ చేసేందుకు కలి్పంచిన ఏర్పాట్లు, కోవిడ్ నిబంధనల అమలుకు తీసు కున్న చర్యలు తదితర అంశాలపై దుర్గం చెరువు ఏజీఎం బాలకృష్ణతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ... సాక్షి : ఇక్కడ ఎన్ని బోట్లు ఉన్నాయి? జవాబు: మొత్తం ఏడు ఉన్నాయి. నాలుగు పెడల్ బోట్లు, ఒకటి డీలక్స్ బోటు, ఒకటి స్పీడ్ బోటు, ఒకటి ఫ్యామిలీ బోటు ఉన్నాయి. సాక్షి: బోటింగ్ ఫీజుల వివరాలు తెలపండి. జవాబు:బోట్లు పూర్తి కండీషన్‌తో ఉండేలా చూస్తున్నాం. పెడల్ బోటింగ్ ఒకరికి రూ.50 (15 నిమిషాలు), డీలక్స్ బోట్ రూ.50 (15 నిమిషాలు), స్పీడ్‌బోట్ రూ.400 (నలుగురికి 6 నిమిషాలు)క్రూస్ బోట్ (ఫ్యామిలీ బోట్) 50 మంది కెపాసిటీ ఉంటుంది. ఒకరికి రూ.50 (15 నిమిషాలు) సాక్షి: కోవిడ్ జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? జవాబు:కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నాం. సందర్శకులు దిగిన వెంటనే బోట్లకు శానిటైజ్ చేయడం, తప్పని సరిగా సందర్శకులు మాస్‌్కలు ధరించడంతో పాటు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాం., ప్రతి సందర్శకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నాం. సాక్షి: సందర్శకుల తాకిడి ఎలా ఉంది? జవాబు: సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శకులు 200 నుంచి 300 మంది వరకు వస్తున్నారు. అదే శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో ఎక్కువ మంది వస్తుంటారు. ఆదివారం సుమారు 600 నుంచి 800 మంది బోటింగ్ చేస్తుంటారు. సందర్శకులకు మరిన్ని వసతులు కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సాక్షి: కొత్త ప్రణాళికలు ఏమైన ఉన్నాయా? జవాబు:పిల్లలకు, పెద్దలకు, సెయిలింగ్, కయాకింగ్, కానోయింగ్ వంటి పర్యావరణ అనుకూల క్రీడలను నేర్పించడానికి యాచ్ క్లబ్ ఆఫ్ హైదరా>బాద్ ముందుకొచి్చంది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాక్షి: సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నారా? జవాబు: సీనియర్ సిటిజన్లు తమకు రాయితీ ఇవ్వాలని, తినుబండారాలు అందుబాటులో ఉంచాలని, సేద తీరేందుకు కూర్చీలు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు, తాగునీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. పై విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. -
దుర్గం చెరువు బ్రిడ్జ్ పై బైక్ రేసింగ్‌లు
-
దుర్గం చెరువు అందాలు.. ఎన్నోన్నో వర్ణాలు
-
దుర్గం చెరువు బ్రిడ్జి... ఈ వీడియో చూశారా ?
హైదరాబాద్ నగరానికి ఐకాన్ చార్మినార్... ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి సైబర్ టవర్స్‌కి దక్కింది. ఇప్పుడు వాటి సరసన చేరేందుకు సిద్ధమవుతోంది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. స్థానికులకే కాదు విదేశీయులను సైతం అబ్బురపరుస్తోంది. బ్రిటీష్ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఇటీవల దుర్గం చెరువుపై నుంచి ప్రయాణించారు. చక్కని సాయంత్రం వేళ భారీ భవంతుల చాటున అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలు తీగల వంతెన మీద ప్రతిబింబిస్తోంది. ఈ మనోహర దృశ్యాన్ని మొబైల్లో షూట్ చేసి ట్విట్టర్లో మనతో ఆండ్రూ ఫ్లెమింగ్ పంచుకున్నారు. మీరు ఓ సారి ఆ వీడియో చూడండి . -
కేబుల్ బ్రిడ్జి మీద బన్నీ బర్త్‌డే వేడుకలు
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పుడొక లెక్క అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ డైరెక్షన్లో చేసిన 'ఆర్య' సినిమాతో బన్నీకి స్టైలిష్ స్టార్ అన్న పేరు వచ్చింది. ఇక అదే డైరెక్టర్‌తో చేస్తున్న 'పుష్ప'తో బన్నీకి ఐకాన్ స్టార్ అన్న కొత్త పేరొచ్చింది. ఇక పుష్పరాజ్ ఎలా ఉంటాడనేది టీజర్ ద్వారా శాంపిల్ చూపించింది చిత్రయూనిట్. ఇందులో ఎర్రచందనాన్ని లారీలో లోడ్ నింపుతూ, అడ్డొచ్చినవారిని చితకబాదుతూ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు బన్నీ. అభిమాన హీరోను తొలిసారి ఇలా డిఫరెంట్ స్టైల్లో చూసి విజిల్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. పైగా ఈ రోజు హీరో బర్త్‌డే కావడంతో రచ్చరచ్చ చేస్తున్నారు. అటు చిత్రయూనిట్ కూడా అతడి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద లేజర్, లైట్ షో ఉంటుందని ప్రకటించింది. ఈరోజు రాత్రి 7- 8.30 గంటల మధ్య ఈ స్పెషల్ షో ఉంటుందని వెల్లడించింది. గతంలో ఏ తెలుగు హీరోకు దక్కని ఈ అరుదైన గౌరవం అల్లు అర్జున్‌కు దక్కడంతో అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. హీరో బర్త్‌డే కోసం ఇలా లేజర్ అండ్ లైటింగ్ షో ఏర్పాటు చేయడం విశేషమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పుష్ప టీజర్ లక్షల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 13న థియేటర్లలోకి రానుంది. చదవండి: పుష్ప టీజర్: తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ చూస్తుండగానే మోనాల్‌కు ముద్దు పెట్టిన కుర్ర మాస్టర్! -
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తున్న కారు టైర్ బ్లాస్ట్ కావడంతో పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ గోడను ఢీకొనడంతో టైర్ పేలిపోయింది. ఆ సమయంలో వాహనాల రద్దీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన కారు ట్రాఫిక్ పోలీసులు సహాయంతో అక్కడ నుంచి తరలించారు. దేశంలోనే అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి అయిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని సెప్టెంబర్ 25న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన చాలామందికి దుర్గంచెరువు మంచి పర్యటక కేంద్రంగా మారింది. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున సదర్శిస్తోంది. సాయంకాల సమయంలో ఆకట్టుకునే లైటింగ్స్ వారిని ఎంతో ఆకర్షిస్తోంది. దీంతో ఫోటోలకు యువతతో పాటు పెద్దలూ పోటీపడుతున్నారు. అయితే వంతెన ప్రారంభయయ్యాక వాహనాలు సైతం పెద్ద ఎత్తున వంతెన మీదుగా వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే పర్యటకుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
ఇలాంటి ఫ్యామిలీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన తీగల వంతెన సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వారంతంలో పెద్ద ఎత్తున నగర వాసులు వస్తుండటంతో ప్రభుత్వం వారి కోసం ప్రత్యేక అనుమతులు సైతం ఇచ్చింది. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు వాహనాలను నిషేధించిన అధికారులు.. కేవలం పర్యటకులను మాత్రమే అవకాశం కల్పించారు. అయినప్పటికీ వంతెనపై రద్దీ ఏమాత్రం తగ్గడంలేదు. ట్రాఫిక్‌కి అంతరాయం కలుగుతున్నా.. అవేవీ పట్టించుకోకుండా వంతెనపైనే వాహనాలు ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో చర్యలకు ఉపక్రమించిన పోలీసులు.. వంతెనపై పెద్ద ఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్‌పై వాహనాలు ఆపితే.. భారీగా జరిమానాలు విధిస్తున్నారు. అయితే తామేమీ తక్కువ కాదన్నట్లు సందర్శకులు అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇటీవల పిల్లలతో వచ్చిన ఓ కుటుంబం వంతెనపై బైక్ ఆపి ఫోటోలకు ఫోజులిచ్చింది. సీసీ కెమెరాలను గమనించిన భర్త.. బైక్ నెంబర్ ప్లేట్ కనిపించకుండా భార్య మెడలోని చున్నీని తీసి దానిని కవర్ చేశాడు. ఇది కూడా అక్కడి కెమెరాలో రికార్డు అయ్యింది. వీరి ఘనకార్యం కాస్తా పోలీసుల కంటపడంతో అలర్ట్ అయ్యారు. ఇది గమనించి వారు బైక్ తీసుకుని అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయినప్పటికీ జరిమానా నుంచి తప్పించుకోలేదు. దీనికి సంబంధించిన వీడియోను సైబరాబాద్ పోలీసులు అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున కామెంట్స్ పెడుతున్నారు. బిగ్‌బాస్ (సీసీ కెమెరా) చూస్తున్నాడు, ఇలాంటి తెలివైన భార్య ఉండటం గ్రేట్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదకరంగా..
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని సందర్శించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. లాక్డౌన్ కాలంలో ఇంటికే పరిమితమైన నగరవాసులకు దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారింది. సాయంకాల సమయంలో వెలుగులు విరజిమ్మే లైటింగ్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దీంతో ఇక్కడ ఫొటోలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా అదే స్థాయిలో పోటీపడుతున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వంతెన గుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఫొటోషూట్లు నిర్వహిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా వీరి వైఖరి మారడం లేదు.(చదవండి: అర్థరాత్రి దుస్తులు విప్పేసి నడిరోడ్డుపై సెల్ఫీలు) ఈ క్రమంలో.. ఓ కుటుంబం సోమవారం సాయంత్రం ప్రమాదకర రీతిలో ఫొటోలు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు. రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దయచేసి బాధ్యతాయుతంగా వ్యవహరించాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్థరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైవ్‌లో పోకిరీల ఆగడాలను చూసిన పోలీసులు.. వాళ్లిద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. కాగా గతనెల 25న మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా తీగల వంతెన ప్రారంభమైంది. -
కేబుల్ బ్రిడ్జి పై సండే సందడి
-
కొత్త అందాలు