EAMCET results
-
TS EAMCET Results 2023: ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, వైద్య విభాగాలకు సంబంధించిన ఫలితాల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి(ఉన్నత విద్య) కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సైతం పాల్గొన్నారు. పరీక్షరాసినవారిలో ఇంజినీరింగ్‌లో 80 శాతం, అగ్రికల్చర్లో 86 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు మంత్రి తెలిపారు. అలాగే.. రెండు కేటగిరీల్లో ఏపీకి చెందిన విద్యార్థులే టాప్ ఫైవ్ ర్యాంకుల్లో సత్తా చాటడం గమనార్హం. సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఇంజినీరింగ్ పరీక్షలో 79 శాతం అబ్బాయిలు, 85 శాతం అమ్మాయిలు క్వాలిఫై అయినట్లు తెలిపారామె. అనిరుధ్ అనే విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్ దక్కినట్లు ప్రకటించారు. అగ్రికల్చర్ పరీక్షలో 84 శాతం అబ్బాయిలు, 87 శాతం అమ్మాయిలు అర్హత సాధించారని తెలిపారు మంత్రి సబిత. అగ్రికల్చర్ & మెడిసిన్(AM) కేటగిరీ టాప్ 5 ర్యాంకుల్లో నలుగురు ఏపీకి చెందిన వాళ్లే కావడం గమనార్హం. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బూరుగుపల్లి సత్య రాజ జశ్వంత్ ఇందులో టాపర్‌గా నిలిచాడు. ఇక.. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో విశాఖపట్నంకు చెందిన సానపాల అనిరుధ్ టాపర్‌గా నిలిచాడు. ఇందులోనూ టాప్ 5లో నలుగురు ఏపీవాళ్లే కావడం గమనార్హం. ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన ఫలితాల ర్యాంకులను, మార్కులను విడుదల చేశారు. ఎంసెట్ పరీక్షకు 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మే 10, 11వ తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షను, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలన్నీ ఆన్ లైన్ లోనే జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షలకు 1,95,275 మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,06,514 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ఉండే అవకాశం ఉంది. ఇక, స్థానిక విద్యార్థుల కోసం రాష్ట్ర కోటా కింద 85శాతం రిజర్వ్ చేయగా, 15 శాతం సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించారు. -
కాస్త ముందుగానే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: రేపు(గురువారం) ఉదయం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన అధికారులు.. సమయంలో మార్పులు చేశారు. ఉదయం 9:30 గంటలకే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. చదవండి: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు -
ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఈఏపీ సెట్ ఫలితాల్లో.. వ్యవసాయ విభాగంలో 95.03 శాతం మంది, ఇంజనీరింగ్ విభాగంలో 89.12 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నత విద్య మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి AP EAMCET (ప్రస్తుతం AP EAPCET అని పిలుస్తారు) APSCHE తరపున JNTU అనంతపురం ద్వారా ఇంజనీరింగ్, ఫార్మసీ మరియు అగ్రికల్చర్ వంటి అండర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ కోర్సులలో ప్రవేశం కల్పిస్తోంది. ఇంజనీరింగ్, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 3,01,172 మంది దరఖాస్తు చేసుకుంటే 2,82,496మంది పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 1,94,752మంది, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు 87,744మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు ఈఏపీ సెట్ నిర్వహించారు. ఫలితాల కోసం AP EAPCET - 2022 Results క్లిక్ చేయండి. -
ఇంటర్ పాసైతే.. ఇంజనీరింగ్‌కు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్ ఫలితాలు బుధవారం విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల సంఖ్య పెరగడం, ఇంటర్ మార్కుల వెయిటేజీ లేకపోవడంతో.. ర్యాంకులు ఏ విధంగా ఉంటాయోనన్న ఆసక్తి కనిపిస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో.. ఇంజనీరింగ్ ప్రవేశాల విషయంలో ప్రభుత్వం కాస్త ఉదార నిర్ణయం తీసుకుంది. ఇంటర్లో జనరల్ కేటగిరీకి 45 శాతం, రిజర్వుడ్‌కు 40 శాతం మార్కులు వస్తేనే ఎంసెట్‌కు అర్హతగా పేర్కొనే నిబంధనను సడలించింది. కోవిడ్ పరిస్థితులు, ఇంటర్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ఎంసెట్ పాసైనవారు సులువుగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందొచ్చు. ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు బుధవారం ఎంసెట్ ఫలితాల వెల్లడి కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. దీనిపై ఇప్పటికే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించామని వివరించారు. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. మొత్తం 1,64,964 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,47,986 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం రాష్ట్రం లో మొత్తం లక్షకుపైగా ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 30వేల వరకు మేనేజ్మెంట్ కోటాలో ఉన్నాయి. ఈసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎంసెట్‌కు హాజరైన నేపథ్యంలో.. సీట్ల కోసం డిమాండ్ ఉండొచ్చని అంచనా. -
ఎంసెట్: వైఎస్సార్ జిల్లాకు ర్యాంకుల పంట
వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాల్లో వైఎస్సార్ జిల్లాకు ర్యాంకుల పంట పండింది. అగ్రికల్చర్, మెడిసిన్‌లో టాప్ 10లోపు రెండు ర్యాంకులను, ఇంజనీరింగ్ విభాగంలో ఒక ర్యాంక్‌ను జిల్లా కైవసం చేసుకుంది. కడపకు చెందిన ఎర్రగుడి లిఖితకు 7వ ర్యాంకు సాధించగా, వేంపల్లికి చెందిన జాగా వెంకట వినయ్ 8వ ర్యాంక్‌లో మెరిశారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన గంగుల భువన్‌రెడ్డి 3 వ ర్యాంక్ సాధించారు. (చదవండి : ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల) కాగా, ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ఉదయం విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ త్వరలోనే నిర్వహిస్తామని చెప్పారు. అక్టోబర్ 14నుంచి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 1నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.comలో చూసుకోవచ్చు. -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్–2020 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. విద్యార్థుల మొబైల్ నంబర్లకు కూడా ర్యాంకుల వివరాలు వస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను www.sakshieducation.comలో చూసుకోవచ్చు. ఆన్లైన్ (సీబీటీ) విధానంలో జరిగిన ఈ పరీక్షలను హైదరాబాద్‌తో పాటు ఏపీలోని మొత్తం 47 నగరాల్లో 118 కేంద్రాల్లో నిర్వహించారు. గత నెల సెప్టెంబర్ 17వ తేదీ నుంచి 25 వరకు ఉదయం, మధ్యాహ్నం మొత్తం 14 సెషన్లలో పరీక్షలు జరిగాయి. 9 సెషన్లలో జరిగిన ఇంజనీరింగ్ విభాగానికి 1,85,946 మంది దరఖాస్తు చేయగా 1,56,899 మంది (84.38 శాతం) పరీక్ష రాశారు. ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు అగ్రి, మెడికల్ విభాగం పరీక్షలు జరగ్గా మొత్తం 87,652 మందికి గాను 75,834 (86.52%) మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ విభాగంతో 1,33,066 మంది విద్యార్థులు, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 69,616 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌లో ర్యాంకర్లు వీరే ఫస్ట్ ర్యాంక్ : వావిలపల్లి సాయినాథ్(విశాఖ) రెండో ర్యాంక్ : కుమార్ సత్యం (హైదరాబాద్) మూడో ర్యాంక్: గంగుల భువన్‌రెడ్డి(ప్రొద్దుటూర్) నాలుగో ర్యాంక్: లిఖిత్ రెడ్డి(హైదరాబాద్) ఐదో ర్యాంక్: కౌశల్ కుమార్( సికింద్రాబాద్) ఆరో ర్యాంక్ : శ్రీహర్ష (రాజమండ్రి) ఏడో ర్యాంక్: సాయితేజ వారణాసి ( హైదరాబాద్) ఎనిమిదో ర్యాంక్ : హార్ధిక్ రాజ్‌పాల్( హైదరాబాద్) తొమ్మిదో ర్యాంక్: కృష్ణసాయి( శ్రీకాకుళం) పదో ర్యాంక్: జితేంద్ర( విజయనగరం) అగ్రికల్చర్, మెడిసిన్‌లో ర్యాంకర్లు వీరే ఫస్ట్‌ర్యాంక్: చైతన్య సింధు (తెనాలి) రెండో ర్యాంక్: లక్ష్మి సామయి మారుతి (తాడికొండ) మూడో ర్యాంక్ : మనోజ్ కుమార్ (తిరుపతి) నాలుగో ర్యాంక్: దరశి విష్ణుసాయి( నెల్లూరు) ఐదో ర్యాంక్: సుభాంగ్ ( హైదరాబాద్) ఆరో ర్యాంక్: హవీష్‌రెడ్డి(హైదరాబాద్) ఏడో ర్యాంక్: లిఖిత (కడప) ఎనిమిదో ర్యాంక్: జడ వెంకటవినయ్(వేంపల్లి) తొమ్మిదో ర్యాంక్: నితిన్ వర్మ(కర్నూలు) పదో ర్యాంక్: రేవంత్ (గుంటూరు) -
తెలంగాణ ఎంసెట్‌లో మన విద్యార్థులే టాప్
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్/తిరుపతి ఎడ్యుకేషన్: తెలంగాణ ఎంసెట్–2019 ఫలితాల్లో మన రాష్ట్ర విద్యార్థులు ‘టాప్’ లేపారు. ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ విభాగాల్లో టాప్ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీ విద్యార్థులు టాప్ టెన్‌లో మొదటి, రెండో ర్యాంకుతో కలిపి మొత్తం ఐదు ర్యాంకులు సాధించి తమ ప్రతిభ చూపారు. అదేవిధంగా అగ్రి, మెడికల్ విభాగంలోనూ టాప్ టెన్‌లో ఐదు ర్యాంకులు సాధించారు. ఆదివారం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో విడుదలైన ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగంలో ప్రథమ ర్యాంక్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన కురిశెట్టి రవి శ్రీతేజకు దక్కింది. ఇదే విభాగంలో రెండో ర్యాంకు విజయవాడకు చెందిన డి.చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్యకు, నాలుగో ర్యాంకు నెల్లూరుకు చెందిన బట్టేపాటి కార్తికేయకు, ఐదో ర్యాంకు భీమవరానికి చెందిన గొర్తి భానుదత్తాకు, 8వ ర్యాంకు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గౌరుపెద్ది హితేందర్ కాశ్యప్‌కు లభించాయి. ఇక అగ్రి, మెడికల్ విభాగంలో రాజమహేంద్రవరంకు చెందిన దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి రెండో ర్యాంకును దక్కించుకున్నాడు. ఇదే విభాగంలో మూడో ర్యాంకు కాకినాడకు చెందిన మార్కాని వెంకట సాయి అరుణ్తేజకు, నాలుగో ర్యాంకు తిరుపతికి చెందిన సుంకర సాయి స్వాతికి, 8వ ర్యాంకు విశాఖపట్నానికి చెందిన సిద్ధార్థ భరద్వాజ్ బృందావనంకు, 9వ ర్యాంకు తిరుపతికి చెందిన పూజకు లభించాయి. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు తెలంగాణకు చెందిన ఎంపటి కుశ్వంత్‌కు దక్కింది. ఏపీ ఎంసెట్‌లోనూ అతడే టాప్ తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులు పొందిన పలువురు విద్యార్థులు ఇటీవల వెల్లడైన ఏపీ ఎంసెట్–2019 ఫలితాల్లోనూ సత్తా చాటడం విశేషం. ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో కురిశెట్టి రవి శ్రీతేజ మొదటి ర్యాంక్ దక్కించుకోవడం విశేషం. అదేవిధంగా గొర్తి భానుదత్తా ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ పొందాడు. అలాగే ఏపీ ఎంసెట్‌లో అగ్రి, మెడికల్ విభాగంలో రెండో ర్యాంక్ దక్కించుకున్న దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ఎంసెట్‌లోనూ అదే స్థానంలో నిలిచాడు. అదేవిధంగా తిరుపతికి చెందిన సుంకర స్వాతి ఏపీ ఎంసెట్ మెడికల్ విభాగంలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఈ నెల 20 తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 తర్వాత ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలో ఇంజనీరింగ్‌లో 90 వేల వరకు సీట్లు ఉన్నాయన్నారు. ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య మాట్లాడుతూ ఎంసెట్ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాలను స్వీకరించగా 330 అభ్యంతరాలు వచ్చాయన్నారు. వాటిని నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిశీలించి ఫైనల్ ‘కీ’ని విడుదల చేశామన్నారు. ఏపీ ఎంసెట్ ప్రవేశాలపై అధికారుల మల్లగుల్లాలు ఏపీ ఎంసెట్ ఫలితాలు వెలువడినా ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నెల 18 లోపు ప్రవేశాలు కల్పించాలని భావించినా అందుకు సమయం చాలకపోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల అఫ్లియేషన్‌కు సంబంధించిన ప్రక్రియను కాకినాడ జేఎన్టీయూ, అనంతపురం జేఎన్టీయూలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రక్రియ ముగియడానికి మరో నాలుగు రోజులు పడుతుంది. అలాగే జేఈఈ మొదటి విడత ప్రవేశాలు చేపడితే జేఈఈతోపాటు ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు సాధించినవారు ఐఐటీ, ఎన్ఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో చేరతారు. అది పూర్తయ్యాక ఎంసెట్ ప్రవేశాలు ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నత విద్యామండలి అధికారులు ఉన్నారు. అయితే.. ఇప్పటికే ప్రవేశాలు ఆలస్యమయ్యాయని, జేఈఈ ప్రవేశాల కంటే ముందే వీటిని ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయంతో సాంకేతిక విద్యా శాఖ ఉంది. మొదటి విడతలో సీట్లు పొంది చేరని వారుంటే ఆ స్థానాల్లో రెండోసారి కౌన్సెలింగ్ సమయంలో అందరికీ అవకాశం కల్పిస్తే సరిపోతుందన్న ఆలోచనతో ఉంది. దీన్ని విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేశ్ దృష్టికి తెచ్చి ఆయన సూచనల మేరకు ముందుకు వెళ్తామని మండలి వర్గాలు వివరించాయి. పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తా మాది కాకినాడ. నేను నీట్లో 1,292వ ర్యాంక్, ఏపీ ఎంసెట్‌లో 107వ ర్యాంకు సాధించాను. జాతీయ వైద్య విద్య కళాశాలల్లో చదువుకుని పేద ప్రజలకు సేవలందిస్తాను. –ఎం.వెంకట అరుణ్ తేజ, తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం మూడో ర్యాంకర్ ఐఐటీలో సీటు సాధిస్తా.. నాకు ఇంటర్లో 985 మార్కులొచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో నాలుగో ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్‌లో 33వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ఐఐటీలో సీటు సాధిస్తా. – చంద్రశేఖర ఎస్ఎస్ హేతహవ్య, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) రెండో ర్యాంకర్ ఐఐటీయే లక్ష్యం మా నాన్న సురేష్ నాయుడు ఆక్వా రైతు, అమ్మ అమరావతి గృహిణి. పదో తరగతిలో 10 గ్రేడ్ పాయింట్లు సాధించా. ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 5వ ర్యాంకు సాధించా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. – బట్టేపాటి కార్తికేయ, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) నాలుగో ర్యాంకర్ పరిశోధనలంటే ఇష్టం.. మా నాన్న నాగ వెంకట విశ్వనాథం ప్రైవేటు ఉద్యోగి. అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. పదో తరగతిలో, ఇంటర్లో 10 జీపీఏ సాధించా. ఏపీ ఎంసెట్‌లో, జేఈఈ మెయిన్‌లో 3వ ర్యాంకు వచ్చింది. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం చూస్తున్నా. నాకు పరిశోధనలంటే ఇష్టం. – భాను దత్త, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) ఐదో ర్యాంకర్ సివిల్స్ సాధిస్తా.. నా తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. జేఈఈ మెయిన్‌లో 125వ ర్యాంకు సాధించా. సివిల్స్‌లో విజయం సాధించడమే నా లక్ష్యం. – గౌరిపెద్ది హితేందర్ కాశ్యప్, తెలంగాణ ఎంసెట్ (ఇంజనీరింగ్) ఎనిమిదో ర్యాంకర్ కార్డియాలజిస్టునవుతా.. నాన్న సూర్యభాస్కర రెడ్డి రైల్వే ఉద్యోగి. అమ్మ విజయశాంతి గృహిణి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణ ఎంసెట్‌లో రెండో ర్యాంక్ సాధించగలిగాను. పదో తరగతిలో, ఇంటర్మీడియట్లో పదికి పది జీపీఏ సాధించాను. ఏపీ ఎంసెట్‌లో కూడా రెండో ర్యాంక్ వచ్చింది. కార్డియాలజిస్టునవుతా. – దాసరి కిరణ్‌కుమార్ రెడ్డి, తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్, మెడిసిన్ విభాగం రెండో ర్యాంకర్ -
నేడు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు
-
ఇంజనీరింగ్‌లో బాలురు..అగ్రి–మెడికల్‌లో బాలికల హవా
సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం)/ఆర్‌ఆర్‌పేట (ఏలూరు): బీటెక్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ సైన్సు టెక్నాలజీ, బి–ఫార్మసీ, ఫార్మాడీ, బీఎస్సీ హార్టికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎంసెట్–2019 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కోటేశ్వరరావు, ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.రామలింగరాజు, కన్వీనర్ ప్రొ. సీహెచ్.సాయిబాబు, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ జీఎస్ పండాదాస్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తీర్ణతా శాతాలు ఇలా.. ఇంజనీరింగ్‌లో బాలురు, అగ్రి–మెడికల్ విభాగంలో బాలికలు ఆధిక్యాన్ని కనబరిచారు. అలాగే, ఇంజనీరింగ్‌లో 74.39 శాతం మంది, అగ్రి–మెడికల్‌లో 83.64 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజనీరింగ్ టాప్ పది ర్యాంకుల్లో బాలురు ఉండగా.. అగ్రి–మెడికల్‌లో బాలురు, బాలికలు చెరో అయిదు స్థానాల్లో నిలిచారు. ఇంజనీరింగ్, అగ్రి–మెడికల్ రెండు విభాగాల్లోని 20 ర్యాంకర్లలో తొమ్మిది మంది తెలంగాణ, ఒకరు బీహార్‌కు చెందిన వారు కాగా.. మిగిలిన వారు ఏపీ విద్యార్థులు. కాగా, ఏపీ ఎంసెట్–2019 పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో నిర్వహించారు. ఫలితాలను మే 1న విడుదల చేయాలని అధికారులు భావించినా తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలలో గందరగోళం ఏర్పడడంతో ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. కనీస అర్హత మార్కులు 40 ఇదిలా ఉంటే.. 160 మార్కులకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించగా 40 మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి అర్హత మార్కుల్లేవు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,719 మంది దరఖాస్తు చేయగా 1,85,711 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,38,160 (74.39 శాతం) మంది అర్హత సాధించారు. అగ్రి, మెడికల్ విభాగంలో 86,986 మంది దరఖాస్తు చేయగా 81,916 మంది పరీక్ష రాశారు. వీరిలో 68,512 మంది (83.64 శాతం) అర్హత సాధించారు. ఇంజనీరింగ్ విభాగంలో బాలురు 82,088 మంది, బాలికలు 56,072 మంది అర్హత సాధించారు. అగ్రి–మెడికల్‌లో బాలురు 22,946 మంది, బాలికలు 45,566 మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా, ఇంజనీరింగ్ విభాగంలో 1,22,188 మందికి, అగ్రి, మెడికల్ విభాగంలో 63,206 మందికి ర్యాంకులు కేటాయించారు. ఎంసెట్‌లో పాసైనా ఇంటర్లో ఫెయిల్ మరోవైపు.. ఎంసెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు అందులో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఫెయిల్ కావడంతో వారికి ర్యాంకులు కేటాయించలేదు. ఇంజనీరింగ్ విభాగంలో 12,874 మంది ఎంసెట్‌లో ఉత్తీర్ణులైనా ఇంటర్లో ఉత్తీర్ణత సాధించలేదు. అగ్రి–మెడికల్ విభాగంలో ఉత్తీర్ణులైన 3,152 మంది ఇంటర్లో పాస్ కాలేదు. అలాగే, ఇంటర్మీడియెట్ కాకుండా వేరే బోర్డుల నుంచి ఎంసెట్ పరీక్షకు హాజరైన ఇంజనీరింగ్ విభాగంలోని 3,067 మంది, అగ్రి–మెడికల్ విభాగంలో 2,153 మంది విద్యార్థులు ఇంటర్ మార్కులు అందచేయకపోవడంవల్ల వారికి ర్యాంకులు కేటాయించలేదు. సమాధానాల ఆప్షన్లలో మార్పులు ఇంజనీరింగ్ విభాగంలో ఏడు సెషన్లలో నిర్వహించిన పరీక్షలలో ప్రాథమిక కీ కి సంబంధించి 139 ప్రశ్నలపై అభ్యంతరాలు రాగా నిపుణుల సలహా మేరకు 10 ప్రశ్నలకు ఆప్షన్లు మార్పుచేశారు. మరో 10 ప్రశ్నల మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు. అలాగే, మెడికల్ విభాగంలో మూడు సెషన్లలో జరిగిన పరీక్షలలో 41 ప్రశ్నలకుగాను నిపుణుల సలహా మేరకు మూడు ప్రశ్నలకు ఆప్షన్లను మార్పు చేయగా ఒక ప్రశ్న మల్టిపుల్ ఆప్షన్లకు మార్కులు కేటాయించారు. 10 నుంచి ర్యాంకు కార్డులు ఇదిలా ఉంటే.. ఎంసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ పదో తేదీ నుంచి ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్సీహెచ్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్/ఈఏఎంసీఈటీ’ వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎంసెట్‌లో అర్హత పొంది ర్యాంకు రాని వారు ఎంసెట్ వెబ్సైట్లో పొందుపర్చిన డిక్లరేషన్ ఫారంను పూర్తిచేసి ఇంటర్ మార్కుల జాబితాను కన్వీనర్ ఆఫీస్ అడ్రస్‌కు పోస్టు ద్వారా, లేదా ఈమెయిల్ ఐడీ ‘హెల్ప్లైన్ఏపీఎంసెట్2కె19ఎట్దరేట్జీమెయిల్డాట్కామ్’కు పంపితే తదుపరి జాబితాల్లో వారికి ర్యాంకులు కేటాయిస్తారు. విద్యార్థులు తమ ప్రశ్నపత్రం, నిర్ధారించిన కీ తో సరిపోల్చుకునేందుకు వారి ఆన్లైన్ జవాబుపత్రాలను అభ్యర్థుల ఈమెయిల్‌కు ఎంసెట్ అధికారులు పంపించారు. వాటిని ఎంసెట్ వెబ్సైట్లో కూడా పొందుపరిచారు. 18లోగా అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ఎంసెట్ ఫలితాల విడుదల దాదాపు నెలరోజుల పాటు ఆలస్యం కావడంతో విద్యార్థుల్లో అనేకమంది ఇతర విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీని ప్రభావం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలపై పడనుంది. దీంతో సాధ్యమైనంత త్వరగా అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈనెల 18 లోగానే అడ్మిషన్లను చేపడతామని అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్‌లో టాప్ 10 ర్యాంకర్లు.. – కురిశేటి రవి శ్రీతేజ (పశ్చిమగోదావరి) – పి. వేదప్రణవ్ (రంగారెడ్డి, తెలంగాణ) – గొర్తి భానుదత్త (పశ్చిమగోదావరి) – డి. చంద్రశేఖర్ ఎస్ఎస్ హేతహవ్య (రంగారెడ్డి, తెలంగాణ) – బి. కార్తికేయ (రంగారెడ్డి, తెలంగాణ) – రిషి షరాఫ్ (మాధేపూర్, బీహార్) – జీవీకె సూర్య లిఖిత్ (పశ్చిమగోదావరి) – ఎ. అభిజిత్‌రెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ) – ఆర్యన్ లద్ధా (రంగారెడ్డి, తెలంగాణ) – ఎ. హేమవెంకట అభినవ్ (కొత్తగూడెం, తెలంగాణ) అగ్రి–మెడికల్‌లో టాప్ 10 ర్యాంకర్లు.. – సుంకర సాయిస్వాతి (చిత్తూరు) – దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి (తూర్పుగోదావరి) – అత్యం సాయిప్రవీణ్ గుప్తా (తూర్పుగోదావరి) – తిప్పరాజు హాసిత (హైదరాబాద్) – జి.మాధురిరెడ్డి (రంగారెడ్డి, తెలంగాణ) – గొంగటి కృష్ణవంశీ (నెల్లూరు) – కేజే వైష్ణవీ వర్మ (కర్నూలు) – డి. సుభిక్ష (తూర్పుగోదావరి) – కొర్నెపాటి హరిప్రసాద్ (గుంటూరు) – ఎంపటి కుష్వంత్ (భూపాలపల్లి, తెలంగాణ) ఐఏఎస్ అవుతా ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ఫస్ట్ ర్యాంకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ముంబై ఐఐటీలో సీఎస్ఈ గ్రూపు చదవాలని ఉంది. తల్లిదండ్రులు గీతాకుమారి, నాగ వెంకట ఉమామహేశ్వర గుప్తాల సహకారంతో పాటు ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించగలిగా. పదో తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్ ఎంపీసీలో పదికి పది జీపీఏ, జేఈఈ మెయిన్స్‌లో 136వ ర్యాంకు వచ్చింది. బిట్ శాట్‌లో 450 మార్కులకు 450 మార్కులు వచ్చాయి. నిర్దిష్టమైన ప్రణాళిక, పట్టుదల, క్రమశిక్షణతో రోజుకు 14 గంటలు చదివేవాడని శ్రీతేజ తల్లిదండ్రులు తెలిపారు. – రవి శ్రీతేజ, తాడేపల్లిగూడెం, ప.గో.జిల్లా, ఎంసెట్ ఇంజనీరింగ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ కార్డియాలిజిస్ట్ను అవుతా మెడిసిన్‌లో కార్డియాలజిస్ట్ కావాలని ఉంది. తల్లిదండ్రులు విజయశాంతి, సూర్యభాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు ఇచ్చిన స్ఫూర్తితో ఎంసెట్ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించగలిగా. టెన్త్, ఇంటర్లో పదికి పది జీపీఏ సాధించా. నీట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి మంచి కార్డియాలజిస్ట్‌గా గుర్తింపు పొందాలన్నది నా కోరిక. – దాసరి కిరణ్‌కుమార్, ఎంసెట్ ఆగ్రికల్చర్ విభాగంలో 2వ ర్యాంకర్, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా పరిశోధనా రంగంలో రాణిస్తా పరిశోధన రంగంలో నూతన ఆవిష్కరణలు చేసి దేశాన్ని సమాచార, సాంకేతిక రంగంలో ముందంజలో నిలపాలని ఉంది. అమ్మానాన్నలు నాగ వెంకట విశ్వనాథం, సూర్య సుందరలక్ష్మి. ఇద్దరూ టీచర్లు. పేద విద్యార్థుల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న వీరు తమ కుమారుడి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. – గొర్తి భానుదత్త, ఇంజనీరింగ్ 3వ ర్యాంకర్, భీమవరం, ప.గో. జిల్లా -
జూన్ 3 లేదా 4న ఎంసెట్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాలు జూన్ 3 లేదా 4న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ఇంటర్మీడియట్ రీవెరిఫికేషన్ ఫలితాలను బోర్డు ఈ నెల 27న వెల్లడించిన నేపథ్యంలో ఆ ఫలితాల డేటాను తీసుకొని ఎంసెట్ ఫలితాల ప్రాసెస్‌ను పూర్తి చేయాలని నిర్ణయించింది. రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల డేటా, గతంలోనే పాసైనా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సమాచారాన్ని కూడా తీసుకొని ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ఖరారు చేయాల్సి ఉంది. బోర్డు నుంచి డేటా వచ్చేందుకు ఒకట్రెండు రోజులు పట్టనున్న నేపథ్యంలో ఎంసెట్ ర్యాంకులను జూన్ 3 లేదా 4న విడుదల చేయాలని ఎంసెట్ కమిటీ భావిస్తోంది. బోర్డు డేటాను బుధవారం ఇస్తే ఈ నెల 31న ఫలితాలను వెల్లడించే అవకాశాలను కమిటీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
ప్రైవేటు ‘ఇంజనీరింగ్’ దందా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలు అక్రమ అడ్మిషన్ల దందాకు తెరతీశాయి. బీ–కేటగిరీ మేనేజ్మెంట్ కోటా ఇంజనీరింగ్ సీట్లకు రెక్కలొచ్చాయి. ఎంసెట్ ఫలితాలు ప్రకటించక ముందే ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు కోర్సుల వారీగా సీట్లను లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి ప్రైవేటు కళాశాలలు బహిరంగ ప్రకటన జారీ చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంసెట్ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ‘మేనేజ్మెంట్ కోటా’ఫీజులను మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలు తెరచాటుగా మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్ముకుంటున్నాయి. ఎంసెట్ ఫలితాల ప్రకటించక ముందే, బహిరంగ ప్రకటన జారీ చేయకుండానే అక్రమంగా బీ–కేటగిరీ సీట్లను భర్తీ చేసేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ వంటి కోర్సుల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ అయిపోయాయి. ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి సీట్ల అమ్మకాలపై బేరాసారాలు జరుపుతున్న ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో అడ్మిషన్ కోసం రూ.14 లక్షల డొనేషన్‌తోపాటు ఏటా రూ.90 లక్షల ఫీజును చెల్లించాలని అడుగుతూ ఆ వీడియోలో సదరు కళాశాల ప్రతినిధి అడ్డంగా దొరికిపోయాడు. కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీట్ల భర్తీ ఇప్పటికే ముగిసిందని ఆయన పేర్కొనడం గమనార్హం. ఇక ఐటీ విభాగం సీటుకు రూ.8 లక్షలు, ఈసీఈ విభాగంలో సీటుకు రూ.7 లక్షల డొనేషన్ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. నిర్ణీత డొనేషన్లు చెల్లిస్తేనే సీటు దక్కుతుందని, ఎలాంటి తగ్గింపులుండవని స్పష్టం చేశాడు. ఇష్టముంటేనే డొనేషన్లు చెల్లించి సీట్లను రిజర్వు చేసుకోవాలని, లేకుంటే మేనేజ్మెంట్ సీట్ల భర్తీ కోసం తాము పత్రికల్లో బహిరంగ ప్రకటన జారీ చేసినప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించడం గమనార్హం. అయితే కన్వీనర్ సీట్ల ఫీజుల మాదిరిగానే బీ–కేటగిరీ సీట్ల ఫీజులూ ఉంటాయి. కానీ దీనికి విరుద్ధంగా ప్రైవేటు కాలేజీలు ఫీజులను దండుకుంటున్నాయి. ముందే మేనేజ్మెంట్ కోటా సీట్లను అమ్మేసుకుని ఆ తర్వాత నిబంధనల ప్రకారమే వాటిని భర్తీ చేశామని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఉత్తుత్తిగా పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తున్నాయని చాలా ఏళ్ల నుంచి ఉన్న ఆరోపణలకు ఈ ఉదంతం మరింత బలాన్నిచ్చింది. బీ–కేటగిరీ సీట్ల భర్తీలో అక్రమాల నిర్మూలనకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీలో అలస్యంగా ఎంసెట్ ఫలితాలు
-
ఈ నెల మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రి, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 తుది ఫలితాలను ఈ నెల మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలపై సందిగ్థత, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇందులో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు, ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, ఎంసెట్ చైర్మన్ రామచంద్రరాజు, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు, ఉన్నత విద్యా మండలి కార్యదర్శి వరదరాజన్, ప్రవేశాల ప్రత్యేకాధికారి డాక్టర్ రఘునాధ్ తదితరులు పాల్గొన్నారు. ఎంసెట్ ఫలితాల విడుదలకు ఆటంకంగా ఉన్న పలు అంశాలపై సీఎస్ వారితో చర్చించారు. ఫలితాల విడుదలపై తొందర అవసరం లేదని, ఏపీ ఇంటర్మీడియెట్ మార్కులతోపాటు, తెలంగాణ ఇంటర్మీడియెట్ మార్కులు కూడా వచ్చాకే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. మే మూడో వారంలో ఫలితాల విడుదలకు నిర్ణయించారు. తెలంగాణ ఇంటర్ మార్కులు వచ్చాక ఎంసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు. గోప్యంగా ఉంచుతామని హామీ ఇవ్వడంతో ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు ఈ ఏడాది ఫలితాలను గ్రేడింగ్ విధానంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల ఇంటర్ మార్కులను అందించడంలో సమస్య ఏర్పడింది. మార్కులు బయటకు వెల్లడించడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న భావనతో బోర్డు అధికారులు.. ఎంసెట్ అధికారులకు మార్కులు ఇచ్చేందుకు తర్జనభర్జన పడ్డారు. ఎటువంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని, మార్కులను ఎంసెట్ కమిటీకి అందించాలని సీఎస్ సుబ్రహ్మణ్యం ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మికి సూచించారు. బయటకు వెల్లడి కావన్న షరతుతో ఈ మార్కులు అందించేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఇంటర్మీడియెట్ మార్కుల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామనడంతో సమస్య పరిష్కారమైంది. తెలంగాణ బోర్డు నుంచి వచ్చే వరకు నిరీక్షణ తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు తీవ్ర గందరగోళంలో పడిన నేపథ్యంలో వాటి సమాచారం ఎప్పటికి వస్తుందో అనే అంశంపై సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ ఎంసెట్–2019కు మొత్తం 2,67,627 మంది హాజరయ్యారు. వీరిలో తెలంగాణలో ఇంటర్ చదివినవారు 40,242 మంది ఉన్నారు. వీరిలో 14 వేల మంది వరకు తెలంగాణకు చెందిన విద్యార్థులు కాగా తక్కినవారు అక్కడ సెటిలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇలా వేలాది సంఖ్యలో తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్‌కు హాజరైనందున వారి మార్కులు కూడా వచ్చాకనే తుది ఫలితాలు విడుదల చేయాలని సీఎస్ అధికారులకు సూచించారు. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలపై అక్కడి హైకోర్టు ఈ నెల 8 వరకు గడువు ఇచ్చినందున రెండో వారంలో ఆ ఫలితాలను అక్కడి బోర్డు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలను విడుదల చేసేలా షెడ్యూల్‌ను నిర్ణయించుకోవాలని సీఎస్ సూచించారని సమావేశంలో పాల్గొన్న ఉన్నత విద్యామండలి అధికారులు పేర్కొన్నారు. జూన్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ మే మూడో వారంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించాక ప్రవేశాలపై ఉన్నత విద్యా మండలి దృష్టి సారించనుంది. జూలై నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. దాని ప్రకారం ఎంసెట్ కౌన్సెలింగ్‌ను జూన్ రెండో వారం నుంచి ప్రారంభించి, జూలై నాటికి ప్రవేశాలను పూర్తి చేయించి, అనంతరం తరగతుల ప్రారంభానికి వీలుగా చర్యలు తీసుకోనున్నామని ఉన్నత విద్యా మండలి వర్గాలు వివరించాయి. -
ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యం
సాక్షి, అమరావతి : ఏపీ ఎంసెట్ ఫలితాలు మే 3వ వారంలో వెల్లడి కానున్నాయి. ఇంటర్మీడియెట్ మార్కులు లేకపోవడంతో ఎంసెట్ ఫలితాల వెల్లడిపై సందిగ్ధత ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఎంసెట్‌పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బుధవారం అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఇంటర్ మార్కులు ఇవ్వాలని ఏపీ ఇంటర్ బోర్డుకు సీఎస్ ఈ సందర్భంగా ఆదేశించారు. గ్రేడింగ్ విధానంలో ఫలితాలు ఇచ్చినా ఎంసెట్ కోసం మార్కులు ఇవ్వాలని సీఎస్ స్పష్టం చేశారు. ఇక మార్కులు రహస్యంగా ఉంచుతారా? బహిరంగంగా వెల్లడిస్తారాన అనే దానిపై సాయంత్రంలోగా స్పష్టత రానుంది. కాగా గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు వెల్లడించనున్న నేపథ్యంలో గ్రేడింగ్‌తో ఎంసెట్ వెయిటేజీ ఎలా ఇవ్వాలనే దానిపై అధికారులు తంటాలు పడుతున్నారు. ఇక తెలంగాణ ఇంటర్ ఫలితాల వివాదంతోనూ ఏపీ ఎంసెట్‌కు తంటాలు వస్తున్నాయి. సుమారు 20వేలమంది తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్ రాశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలోనూ స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎంసెట్ పలితాలు ఎలా ఇవ్వాలో అధికారులకు అంతు చిక్కడం లేదు. దీంతో సీఎస్ సమీక్షతో నిర్వహణ అనంతరం తెలంగాణ ఇంటర్ ఫలితాలు తేలి మార్కులు అందాకే ఎంసెట్ ర్యాంకులు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. -
ఎంసెట్ ఫలితాల్లో చిక్కుముడులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్–2019 ఫలితాల విడుదల ఓ చిక్కుముడిగా మారింది. వివిధ ఆటంకాల కారణంగా ఫలితాల విడుదల ఆలస్యమవుతోంది. తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలలోని గందరగోళం పరిష్కారం కాకపోవడం, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ల (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ల అమలు తదితర అంశాల్లో స్పష్టత లేకపోవడంతో పాటు ఏపీ ఇంటర్ విద్యార్థులకు మార్కులు కాకుండా, గ్రేడ్లు ఇవ్వడం ఎంసెట్ ఫలితాల విడుదల ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు. మంగళవారం ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి దమయంతి ఈ అంశాలపై సమీక్ష నిర్వహించారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో వీటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుని ఎంసెట్ ఫలితాల విడుదల తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు చెప్పాయి. ఏపీ ఇంటర్ గ్రేడ్లతో సమస్య ఎంసెట్‌లో విద్యార్థులు సాధించిన మార్కులను 75 శాతంగా పరిగణించి వాటికి ఇంటర్ మార్కులను వెయిటేజీగా తీసుకుని ర్యాంకులను ప్రకటించాల్సి ఉంటుంది. ఏపీలో కొత్తగా ఇంటర్ ఫలితాలను మార్కుల విధానంలో కాకుండా గ్రేడ్ల విధానంలో ప్రకటించారు. ఎంసెట్‌లో ర్యాంకులు ప్రకటించాలంటే ఇంటర్లో విద్యార్థులకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా ఇంటర్ బోర్డు.. ఎంసెట్ కన్వీనర్‌కు అందించాలి. ఈ మార్కులకోసం కన్వీనర్ బోర్డుకు లేఖ రాశారు. అయితే గ్రేడింగ్‌పై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నందున మార్కులను ఇచ్చేందుకు బోర్డు వెనుకాడుతోంది. విద్యార్థుల మార్కుల శాతాన్ని తెలుసుకొనేందుకు పార్ములాను సూచించి దాని ఆధారంగా ముందుకు వెళ్లవచ్చని సూచిస్తోంది. అయితే ఇంటర్ గ్రేడ్ల విధానం తీసుకుని ఎంసెట్ ర్యాంకులు ప్రకటిస్తే గందరగోళంగా మారుతుందని ఎంసెట్ అధికారులు వాదిస్తున్నారు. మార్కులు ఇవ్వాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఇందుకు బోర్డు నుంచి స్పష్టత రాలేదు. ఇక ఏపీ ఎంసెట్ రాసిన వారిలో తెలంగాణ ఇంటర్ విద్యార్థులు దాదాపు 20 వేల మంది వరకు ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ఫలితాలు మే 8న విడుదలకు అవకాశముందని, ఆ తరువాత అంటే మే రెండో వారంలో ఆ మార్కులు అందిన తర్వాత ఏపీ ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపైనా సందేహాలు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్థల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దాన్ని అమలు చేయాల్సి ఉంది. ఈ పది శాతంలో 5 శాతం కాపులకు ప్రత్యేకిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలన్నదానిపైనా ఉన్నత విద్యాశాఖలో సందేహాలు ఏర్పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు సూపర్‌న్యూమరరీ సీట్లు కేటాయించాలని పేర్కొన్నా ఆమేరకు ఉత్తర్వులు లేవని ఎంసెట్ అడ్మిషన్ల అధికారులు చెబుతున్నారు. జాతీయ విద్యాసంస్థల్లో వేర్వేరు విధానాలు అమలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు రావలసి ఉందని వివరించారు. వీటన్నిటిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమక్షంలో జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎంసెట్ ఫలితాలపై తర్జనభర్జన!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎంసెట్–2019 ఫలితాల విడుదల తేదీపై సందిగ్థత నెలకొంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎంసెట్‌ను అధికారులు పూర్తిచేసినా ఫలితాల విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. ర్యాంకులతో ఫలితాల ప్రకటనకు అవసరమైన ఇంటర్మీడియెట్ మార్కులు అందకపోవడమే దీనికి కారణం. అటు ఏపీ, ఇటు తెలంగాణ బోర్డుల నుంచి ఇంటర్ మార్కుల సమాచారం రావాల్సి ఉండడంతో సకాలంలో ఎంసెట్ ఫలితాలు ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు గ్రేడుల రూపంలో ప్రకటించిన ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్ కమిటీకి అప్పగించాల్సి ఉంది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు గందరగోళంలో పడ్డాయి. మార్కులతో సంబంధం ఉన్న ర్యాంకులను ముందుగా ప్రకటించకుండా ఎంసెట్‌లో ఆయా విద్యార్థులు సాధించిన మార్కులను ముందు ప్రకటించే అంశంపై అధికారులు ఆలోచన సాగిస్తున్నారు. ఇంటర్మీడియెట్ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులను ప్రకటిస్తారు. దీనిపై సోమవారం నిర్ణయం తీసుకోనున్నారు. సకాలంలో పరీక్షలు పూర్తిచేసినా.. ఏపీ ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలను ఈనెల 20 నుంచి 24 వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్‌లో 1,85,711 మంది, అగ్రి, మెడికల్‌లో 81,916 మంది పరీక్షలు రాశారు. వీటికి సంబంధించి సెషన్ల వారీ మాస్టర్ ప్రశ్నపత్రాలు, ప్రాథమిక ‘కీ’లను కూడా ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సాయిబాబు వెబ్సైట్ ద్వారా ప్రకటించారు. ఈ ప్రాథమిక ‘కీ’లపై అభ్యంతరాల స్వీకరణ శనివారంతో ముగిసింది. వీటిని నిపుణుల కమిటీతో పరిశీలన చేయించి, తుది ఫలితాలను ర్యాంకులతోపాటు ప్రకటించాల్సి ఉంది. ఈసారి అనుకోని అవాంతరాలు ఈసారి ఎంసెట్ ఫలితాల ప్రకటనకు అనుకోని అవాంతరాలు తప్పడం లేదు. పరీక్షలను నిర్ణీత తేదీల్లో ముగించిన అధికారులు ఫలితాలను గతంలో కంటే ముందుగా మే 1నే ప్రకటించాలని భావించారు. అయితే, ఎంసెట్ ర్యాంకులను వెల్లడించాలంటే ఆ విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన మార్కులను 75 శాతంగా, ఇంటర్లో వచ్చిన మార్కులను 25 శాతంగా తీసుకొని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మార్కుల కోసం ఏపీ, తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డులకు ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు ఇప్పటికే లేఖలు కూడా రాశారు. అయితే, ఏపీ ఇంటర్ ఫలితాలను ఈసారి మార్కుల విధానంలో కాకుండా గ్రేడింగ్ విధానంలో విడుదల చేశారు. ఈ ఫలితాలను మార్కుల రూపంలో ఎంసెట్ కమిటీకి ఇంటర్మీడియెట్ బోర్డు అందించాల్సి ఉంది. దీనికి ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాట్లు చేపట్టింది. మరోపక్క తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల ప్రకటన తీవ్ర గందరగోళంలో పడిన సంగతి తెలిసిందే. తెలంగాణ నుంచి ఆలస్యమయ్యే అవకాశం ర్యాంకులు ప్రకటించాలంటే తప్పనిసరిగా ఇంటర్మీడియెట్ మార్కులు రావాలి. ఏపీ ఇంటర్ మార్కులు త్వరగా వచ్చే అవకాశాలున్నా తెలంగాణ బోర్డు నుంచి చాలా ఆలస్యమయ్యేలా ఉంది. ఆ మార్కులతో సంబంధం లేకుండా ఏపీ మార్కులు వచ్చిన వెంటనే ఫలితాలు విడుదల చేయొచ్చు. కానీ తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు దాదాపుగా 18 వేల మంది వరకు హాజరయ్యారు. వారిలో ఎక్కువ మంది ఏపీకి చెందినవారే. టాప్‌టెన్ ర్యాంకుల్లో కూడా సగానికిపైగా వారికే వస్తుంటాయి. ఈ నేపథ్యంలో వారిని విస్మరించి ర్యాంకులు ప్రకటించడం సరికాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. అందుకే ర్యాంకులను ప్రకటించకుండా కేవలం ఆయా అభ్యర్థులు ఎంసెట్‌లో సాధించిన మార్కులను ముందుగా మే 1న ప్రకటిస్తే ఎలా ఉంటుందనే అంశంపై అధికారులు ఆలోచన చేస్తున్నారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియెట్ మార్కులు వచ్చాక పూర్తి స్థాయిలో ర్యాంకులతో కూడిన ఫలితాలను ప్రకటించాలని భావిస్తున్నారు. -
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో నారాయణ విద్యార్థుల హవా
-
ఎంసెట్ ఫలితాలను విడుదల చేసిన కడియం శ్రీహరి
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు. మే 25 నుంచి ఇంజినీరింగ్ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. అలాగే జులై మొదటి వారంలో రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుందని, జులై 16 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం అవుతాయన్నారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇంటర్నల్స్ స్లైడింగ్ విధానం ద్వారా ఒక కోర్సు నుంచి మరో కోర్సుకు విద్యార్థులు మారవచ్చని తెలిపారు. ఫలితాలతో పాటు ఇంటర్ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటించారు. సీబీఎస్ఈ ఫలితాలు రాలేని వారికి, ఇంటర్మీడియెట్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ర్యాంక్‌లు ఇవ్వలేదని తెలిపారు. కాలేజీల్లో ప్రమాణలు పెరుగుదలతో ఇంజినీరింగ్ ఫలితాలు మెరుగుపడ్డాయన్నారు. కాగా తెలంగాణ ఎంసెట్ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్ ఆధారితంగా ఎంసెట్ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను Sakshi Education వెబ్సైట్ లో చూడవచ్చు. ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ ర్యాంక్‌లు 1. వెంకట పాని వంశీనాథ్(మాదాపూర్) 2. గట్టు మైత్రేయ (మాదాపూర్) 3.వినాయక (రంగారెడ్డి) 4. హేమంత్ కుమార్ (విశాఖపట్నం) 5.మదన్ మోహన రెడ్డి (విజయవాడ) 6. భరత్ (శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం) 7. యస్కర్ (హైదరాబాద్ మదీనాగూడ) 8. రిశీయంత్ (హన్మకొండ) 9. షేక్ వాజిద్ (రంగారెడ్డి) 10.వెంకట మల్లిబాబు (రంగారెడ్డి) అగ్రికల్చర్, ఫార్మసీ ర్యాంకులు 1. నమ్రత -కర్నూలు 2. సంజీవ్ కుమార్- హైదరాబాద్ 3. శ్రీఆర్యన్, ఆర్మూర్ 4.సంజన -మల్కాజ్గిరి 5. జయసూర్య-హైదరాబాద్ 6. గంజికుంట శ్రీవత్సావ్-ఆదోని 7. విచిత్- గోదావరి ఖని 8. అనగ లక్ష్మి- దిల్ సుఖ్ నగర్ 9. శ్రీ చైతన్య- కరీంనగర్ 10.సత్యశ్రీ సౌమ్య- ఖమ్మం -
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి
-
ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఫలితాలు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదలయ్యాయి. ఏపీ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది ఎంసెట్‌లో లక్షా 38వేల మంది ఉత్తీర్ణత సాధించారని, 72.28శాతం మంది ఉత్తీర్ణులయ్యారని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఏపీ ఎంసెట్‌లో భాగంగా 1,90,924 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు హాజరవ్వగా.. 73,371మంది అగ్రి, మెడికల్ పరీక్షలకు హాజరయ్యారు. గతంలో విడుదల చేసిన ఎసెంట్ కీకి సంబంధించి.. 224 అభ్యంతరాలు వచ్చాయని, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించి.. అభ్యంతరాలను నివృత్తి చేస్తుందని మంత్రి గంటా తెలిపారు. గతంలో కంటే ఈసారి ఎంసెట్‌లో విద్యార్థుల అర్హత శాతం తగ్గిందని చెప్పారు. ఇంజినీరింగ్‌లో భోగి సూరజ్ కృష్ణ (95.27శాతం మార్కులు) ఫస్ట్ ర్యాంక్ సాధించగా, రెండో ర్యాంకును మైత్రేయ (94.93), మూడో ర్యాంక్‌ను లోకేశ్వర్‌రెడ్డి, నాలుగో ర్యాంక్‌ను వినాయక్ వర్ధన్ (94.20), ఐదో ర్యాంక్‌ను షేక్ వాజిద్ సొంతం చేసుకున్నారు. ఇక ఎంసెట్ ప్రవేశాల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభం కానున్నాయి. అగ్రికల్చర్ విభాగంలో సాయిసుప్రియ (94.78శాతం మార్కులతో) మొదటి ర్యాంకును సొంతం చేసుకున్నారు. రెండో ర్యాంక్ వాత్సవ్ (93.26), మూడో ర్యాంక్ హర్ష (92.47) సాధించారు. ఏపీ ఎంసెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రేపే ఎంసెట్ ఫలితాలు
విజయవాడలో మధ్యాహ్నం 3 గంటలకు విడుదల సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ఏపీ ఎంసెట్–2017 ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. విజయవాడలోని స్టేట్ గెస్టు హౌస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డిల సమక్షంలో ఈ ఫలితాలు వెల్లడించనున్నట్లు ఎంసెట్ ఛైర్మన్ ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్ తెలిపారు. ఫలితాలు విడుదలైన అరగంట తరువాత ర్యాంకుల సంక్షిప్త సందేశాలను విద్యార్ధుల మొబైల్ నంబర్లకు పంపిస్తామన్నారు. ఇలా ఉండగా ఎంసెట్ ప్రశ్నలపై అందిన 110 అభ్యంతరాలపై నిపుణుల కమిటీ బుధవారం పరిశీలన చేసింది. వారిచ్చేనివేదికలోని అంశాలను ఎంసెట్ కమిటీ మళ్లీ చర్చించనుంది. ఇందుకు గురువారం విజయవాడలోని ఉన్నత విద్యామండలిలో చైర్మన్ ప్రొఫెసర్ విజయరాజు అధ్యక్షతన ఎంసెట్ కమిటీ సమావేశమవుతుంది. నివేదికకు ఆమోదముద్రతో పాటు వాటి ఆధారంగా తుది ఫలితాల వెల్లడికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అనంతరం శుక్రవారం ఫలితాలను వెల్లడించనున్నారు. -
మెడి‘సీన్ రివర్స్’!
* తెలుగు రాష్ట్రాల ఎంసెట్లలో ఆసక్తికర ఫలితాలు * టీఎంసెట్‌లో ‘మెడిసిన్’ టాపర్ ఏపీ విద్యార్థి.. * ఏపీ ఎంసెట్‌లో తెలంగాణ విద్యార్థికి ఫస్ట్ ర్యాంకు * ఇంజనీరింగ్‌లో రెండు చోట్లా తెలంగాణ విద్యార్థులకే మొదటి స్థానం * టీఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి * నేటి నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ జవాబు పత్రాలు * ఉత్తీర్ణత: మెడిసిన్‌లో 85.98%, ఇంజనీరింగ్‌లో 70.65% * జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు * ప్రవేశాలకు వచ్చే నెల 12న షెడ్యూల్ రెండు రాష్ట్రాల ఎంసెట్లలో ఆసక్తికర ఫలితాలు సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా నిర్వహించిన ఎంసెట్‌ల ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలోనైతే ఏపీ పరీక్షలో తెలంగాణకు చెందిన అబ్బాయి టాప్ ర్యాంకు సాధించగా.. తాజాగా గురువారం విడుదలైన తెలంగాణ పరీక్షలో ఏపీకి చెందిన అమ్మాయి మొదటి ర్యాంకు సాధించింది. అంతేకాదు రాష్ట్ర విభజన తరువాత మొదటిసారిగా వేర్వేరుగా జరిగిన ఈ రెండు ఎంసెట్‌లకు పలువురు విద్యార్థులు హాజరయ్యారు. వారిలో కొందరు రెండు చోట్లా మంచి ర్యాంకు సాధించారు కూడా. గురువారం ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమ్మాయి ఉప్పల పాటి ప్రియాంక మొదటి ర్యాంకు సాధించింది. అదే ఈనెల 21న ప్రకటించిన ఏపీ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ విభాగం ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి కాడ శ్రీవిధుల్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోవడం గమనార్హం. ఇంజనీరింగ్ విభాగంలో మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ తెలంగాణ విద్యార్థులే మొదటి ర్యాంకును కైవసం చేసుకున్నారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరిం గ్ విభాగంలో తెలంగాణకు చెందిన మోపర్తి సాయి సందీప్ మొదటి ర్యాంకును కైవసం చేసుకోగా... అటు ఏపీ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనూ హైదరాబాద్‌కు చెందిన కొండపల్లి అనిరుధ్‌రెడ్డి మొదటి ర్యాంకు సాధించాడు. మొత్తంగా తెలంగాణ ఎంసెట్ మెడిసిన్ విభాగంలో టాప్-10 ర్యాంకులు సాధించిన వారిలో ఐదుగురు తెలంగాణకు చెంది న వారు కాగా.. మరో ఐదుగురు ఏపీకి చెందిన విద్యార్థులు. తెలంగాణ ఇంజనీరింగ్‌లో మాత్రం టాప్-10లో ఎనిమిది మంది రాష్ట్ర విద్యార్థులు కాగా.. ఇద్దరే ఏపీ వారు. ర్యాంకులు విడుదల చేసిన కడియం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు, ర్యాంకులు గురువారం ప్రకటించారు. హైదరాబాద్ జేఎన్టీయూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ర్యాంకులను విడుదల చేశారు. విద్యార్థులకు ఎంసెట్‌లో వచ్చిన స్కోర్‌కు వారు ఇంటర్ సాధించిన మార్కుల వెయిటేజీ (25 శాతం) కలిపి ఈ ర్యాంకులను ప్రకటించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, జేఎన్టీయూ వీసీ శైలజారామయ్యార్, సాంకేతిక విద్య కమిషనర్ వాణీప్రసాద్, ఎంసెట్ కన్వీనర్ రమణరావు, మండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జేన్టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరంలో కూడా సెమిస్టర్ విధానాన్ని అమలుచేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో 70.65 శాతం.. తెలంగాణ ఎంసెట్ కోసం మొత్తంగా 2,32,047 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,39,682 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈనెల 14న నిర్వహించిన పరీక్షకు 1,28,162 మం ది హాజరయ్యారు. ఇందులో 90,556 మంది విద్యార్థులు (70.65 శాతం) అర్హత సాధించారు. ఇక అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ కోసం 92,365 మంది దరఖాస్తు చేసుకోగా.. 84,659 మంది పరీక్ష రాశారు. అందులో 72,794 మంది (85.98 శాతం) విద్యార్థులు అర్హత సాధించారు. వెబ్సైట్లో జవాబు పత్రాలు.. విద్యార్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను ఎంసెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నారు. 29వ తేదీ సాయంత్రం 5 నుంచి వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 5 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిలో ఏమైనా తేడాలుంటే వెంటనే వెబ్సైట్ ద్వారా తెలియజేయాలి. 3వ తేదీ నుంచి ర్యాంకు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గణితంలో మారిన ఆప్షన్.. ఎంసెట్ గణితం సబ్జెక్టు కోడ్-ఏలో 23వ ప్రశ్నకు (కోడ్-బీలో 60వ, కోడ్-సీలో 24వ, కోడ్-డీలో 68వ ప్రశ్నగా వచ్చింది) ప్రాథమిక కీలో 3వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా పేర్కొనగా.. దానిపై అభ్యంతరాలను పరిశీలించిన నిపుణుల కమిటీ 2వ ఆప్షన్‌ను సరైన సమాధానంగా ఖరారు చేసింది. ఇక మెడి సిన్ పరీక్ష కోడ్-ఏలో 43వ ప్రశ్నకు 1, 3గా సమాధానాలుగా మార్చారు. టాపర్ల మనోగతం: మెడిసిన్ విభాగం కష్టపడి చదివాను ‘‘ చాలా కష్టపడి చదివాను. ఇంటర్లో 98శాతం మార్కులు సాధించా. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు వచ్చినా కూడా తెలంగాణలోనే చదువుతా. పేద ప్రజలకు సేవలందిస్తా. ’’ - కాడ శ్రీవిధుల్, 2వ ర్యాంకు కార్డియాలజిస్ట్ అవుతా.. ‘‘ఎంసెట్‌లో 160 మార్కులకు 159 మార్కులు సాధించా. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ చదవాలని ఉంది. కార్డియాలజిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. పేదలకు వైద్యం అందించాలనేది నా లక్ష్యం..’’ - వంగాల అనూహ్య, 3వ ర్యాంకు మెడిసిన్ చేయాలనేది కోరిక.. ‘‘మెడిసిన్ చేయాలన్నది ఎప్పటి నుం చో నా కోరిక. ఎయిమ్స్‌లో సీటు సాధించేందుకు శాయశక్తులా కష్టపడతా. ఏపీ ఎంసెట్‌లో 85వ ర్యాంకు వచ్చింది. కష్టపడి చదవడంతో తెలంగాణ ఎంసెట్‌లో 4వ ర్యాంకు వచ్చింది. ఇంటర్లో 984 మార్కులు వచ్చాయి’’ - సాయితేజ, 4వ ర్యాంకు న్యూరాలజిస్టునవుతా.. ‘‘ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేయాలన్నది నా కోరిక. గొప్ప న్యూరాలజిస్టు కావడం నా లక్ష్యం. రోజుకు 8 నుంచి 10 గంటలు చదివా. కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకు సాధించాను’’ - చెన్నూరి సాయిరెడ్డి, 5వ ర్యాంకు నిజాయితీగా సేవలందిస్తా... ‘‘అమ్మా నాన్న కష్టజీవులు. వారికి అండగా నిలవాలనేది నా అభిలాష. వైద్య వృత్తిలో స్థిరపడి నిజాయతీగా పనిచేసి ప్రజలకు సేవలు చేయాలనేది లక్ష్యం. మా అమ్మనాన్నల కల కూడా అదే. దానిని నెరవేర్చేదిశగా చదువుల్లో ముందుకు సాగుతున్నా..’’ - పైడి తేజేశ్వరరావు, 6వ ర్యాంకు పేదలకు సేవ చేస్తా.. ‘‘తెలంగాణ ఎంసెట్‌లో మంచి ర్యాంకు వస్తుందన్న నమ్మకం మొదటి నుంచి ఉంది. ఓయూలో చదివి కార్డియాలజిస్ట్ కావడం నా లక్ష్యం. పేదలకు సేవ చేయాలని ఉంది.’’ - నాగసత్య వరలక్ష్మి, 7వ ర్యాంకు మెడిసిన్ చదవాలని ఉంది ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో గర్వంగా ఉంది. జాతీయ స్థాయిలో ఏఐఎం, జిప్మర్లో మంచి ర్యాంకు సాధించి, జాతీయ స్థాయి సంస్థలో మెడిసిన్ చదవాలని ఉంది. అందుకోసం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతున్నాను. ఇంటర్లో 987 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 20వ ర్యాంకు వచ్చింది..’’ - బి.కీర్తన షణ్ముఖ, 8వ ర్యాంకు గొప్ప వైద్యుడిని కావాలని ఉంది ‘‘ న్యూరాలజిస్టు కావాలన్నదే నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో ఆరో ర్యాంకు సాధించా. మా అమ్మ, నాన్న, తాత వైద్యులే. వారి ప్రోత్సాహంతోనే మంచి ర్యాంకు సాధించా. మంచి వైద్యుడిని కావాలని ఉంది..’’ - అన్ష్గుప్తా, 9వ ర్యాంకు సివిల్స్ సాధించడమే లక్ష్యం.. ‘‘సివిల్స్ సాధించి దేశసేవ చేస్తా. ఐఏఎస్ కావడం నా చిన్నప్పటి కోరిక. ముంబై ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలనుంది.’’ - సాయిప్రీతమ్, 10వ ర్యాంకు ఇంజనీరింగ్ విభాగం కంప్యూటర్ సైన్స్ చదువుతా.. ‘‘ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. ఏపీ ఎంసెట్‌లో నాకు 6వ ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 326 మార్కులు సాధించాను. ముంబై ఐఐటీ సీఎస్సీ చేస్తా...’’ - మోపర్తి సాయి సందీప్, మొదటి ర్యాంకు మా నాన్నే స్ఫూర్తి.. ‘‘ఎంసెట్‌లో రెండో ర్యాంక్ రావడం ఆనందంగా ఉంది. మా నాన్న నాగేశ్వరరావు నాకు స్ఫూర్తి. ఆయన అనుక్షణం నన్ను ప్రోత్సహించారు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ కోర్సు పూర్తి చేస్తా. సాఫ్ట్వేర్ సంస్థకు సీఈవో కావడమే లక్ష్యం..’’ - రౌతు నిహార్ చంద్ర, రెండో ర్యాంకు ఆనందంగా ఉంది ‘‘మాది విజయనగరం జిల్లా బొబ్బిలి. 3వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. మా నాన్న మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు. ఏపీ ఎంసెట్‌లో 18వ ర్యాంకు వచ్చింది..’’ - బి.కీర్తన, 3వ ర్యాంకు ఐఐటీలో చదవాలని ఉంది.. ‘‘ఐఐటీలో చేరి సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే లక్ష్యంతో కష్టపడి చదువుతున్నాను. 4వ ర్యాంకు సంతృప్తిని ఇచ్చింది.’’ - జి.సాయితేజ, 4వ ర్యాంకు సేవ చేయాలని ఉంది ‘‘మంచి ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఈ విజయం సాధించా. ఇంటర్లో 978 మార్కులు వచ్చాయి. మంచి ఉద్యోగం చేస్తూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఉంది..’’ - వి.హేమంత్ రెడ్డి, 5వ ర్యాంకు ఎమ్మెస్సీ చేస్తా.. ‘‘తల్లిదండ్రులు, అధ్యాపకులు ప్రోత్సాహంతోనే 6వ ర్యాంకు సాధిం చాను. ఐఐటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజ నీరింగ్ చదవాలని ఉంది. ఆ తర్వాత ఎమ్మెస్సీ, ఎంబీయే చేయాలని నా కోరిక.’’ - తన్నీరు శ్రీహర్ష, 6వ ర్యాంకు గొప్ప ఇంజనీర్ కావాలనుంది ‘‘మా అమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. విజయనగరం జిల్లా ఎం.కొత్తవలస మా స్వస్థలం. గొప్ప ఇంజనీర్ కావాలని ఉంది..’’ - ఎం.సందీప్‌కుమార్, 7వ ర్యాంకు కంప్యూటర్ ఇంజనీర్ అవుతా.. ‘‘ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చేయడమే నా లక్ష్యం. 8వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. ఇంటర్లో 975 మార్కులు వచ్చాయి. ఏపీ ఎంసెట్‌లో 7వ ర్యాంకు సాధించా..’’ - గార్లపాటి శ్రీకర్, 8వ ర్యాంకు ఐఏఎస్ కావడమే లక్ష్యం.. ‘‘ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. ప్రస్తుతం ఐఐటీ ముంబైలో సీటు సాధించి చదువుతా.. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అవుతాను. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే మం చి ర్యాంకు సాధించాను.’’ - అక్షిత్‌రెడ్డి, 9వ ర్యాంకు ముంబై ఐఐటీలో చేరుతా.. ‘‘ఐఐటీ ముంబైలో చేరి కంప్యూటర్ సైన్స్ చదవాలనేది నా లక్ష్యం. ఏపీ ఎంసెట్‌లో మొదటి ర్యాంకు సాధించాను. ఇంటర్లో 971 మార్కులు వచ్చాయి..’’ - కె.అనిరుధ్‌రెడ్డి, పదో ర్యాంకు -
మెడిసిన్‌లో మెరిశారు...
►స్టేట్ టాప్‌టెన్‌లో మూడు ర్యాంకులు ►ఇంజినీరింగ్‌లో 48, 56, ర్యాంకులు మాత్రమే.. ►ఎంసెట్ ఫలితాల్లో సత్తా చాటిన జిల్లా విద్యార్థులు గుంటూరు ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల ప్రవేశ పరీక్ష (ఎంసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు తమ సత్తాచాటారు. మెడికల్ విభాగంలో రాష్ట్రస్థాయి టాప్‌టెన్‌లో ర్యాంకులు కైవసం చేసుకున్న విద్యార్థులు జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేశారు. మెడికల్ విభాగంలో వినుకొండకు చెందిన గుండా జయహరీష్ 4వ ర్యాంకు, గుంటూరుకు చెందిన గజ్జల సాయిధీరజ్రెడ్డి 5వ ర్యాంకు, తెనాలి మండలం అంగలకుదురులోని కె.జగదీష్ 7వ ర్యాంకు సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ టాప్‌టెన్‌లో ఏ ఒక్క ర్యాంకు జిల్లా విద్యార్థులకు దక్కలేదు. ఇంజినీరింగ్ విభాగంలో గుంటూరు నుంచి పల్లెర్ల కృష్ణ ప్రీతీష్ రెడ్డి 48వ ర్యాంకు, ఎ. లక్ష్మీ హిమవంత్ 56వ ర్యాంకు సాధించారు. గత ఏడాది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంసెట్ ఫలితాల్లో జిల్లాకు మెడికల్ విభాగంలో స్టేట్ టాప్‌టెన్‌లో చెప్పుకోదగ్గ ర్యాంకు దక్కని లోటును భర్తీ చేస్తూ తాజా ఫలితాల్లో ఒకే సారి మూడు ర్యాంకులు కైవసం చేసుకోవడం ఈసారి విశేషం. పేదింట ఆణిముత్యం మెడిసిన్‌లో వినుకొండ కుర్రోడికి నాల్గవ ర్యాంక్ వినుకొండ టౌన్ : వినుకొండ పట్టణానికి చెందిన గుండా నరసింహరావు, వరలక్ష్మీ దంపతుల చిన్న కుమారుడు జయహరీష్ ఎంసెట్‌లో మెడిసన్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో నాల్గవ ర్యాంక్ సాధించి పేదింట ఆణిముత్యంగా నిలిచాడు. జయ హరీష్ ఒకటి నుంచి 5 వరకు నిర్మల ఇంగ్లిష్ మీడీయం స్కూల్, 6, 7 తరగతులు గుడ్ షెప్పర్డ్ పాఠశాలలో చదివాడు. కృష్ణా జిల్లా గుడివాడ విశ్వభారతి పాఠశాల నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చి ఫీజు రాయితీతో 8 నుంచి 10 వరకు చదివాడు. శ్రీ చైతన్య విజయవాడ బ్రాంచి నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి బైపీసీ గ్రూపులో ఉచిత సీటు సంపాదించాడు. ఎంసెట్ లో 150 మార్కులు సాధించాడు. ఇంటర్లో 983 మార్కులను సాధించాడు. గ్రూప్ సబ్జెక్ట్స్‌లో 600 మార్కులకు 600 సాధించి రికార్డు సృష్టించాడు. పేద కుటుంబంలో విరిసిన ఆణిముత్యం.. జయహరీష్ తండ్రి నరసింహరావు ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నారు. పెద్ద కుమారుడు ప్రదీప్ కుమార్ సైతం ఎంసెట్‌లో 200 ర్యాంకు సాధించాడు. జేఈఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి ఇంజినీరింగ్ చదువుతున్నాడు. - కుటుంబ సభ్యులతో జయ హరీష్ డాక్టర్‌గా పేదలకు సేవ చేయాలని... మెడిసిన్ 7వ ర్యాంకర్ జగదీష్ మారీసుపేట (తెనాలి) : తనకు ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మెడిసిన్ చదవాలని ఉందని ఎంసెట్(మెడిసిన్) ఏడవ ర్యాంకర్ కోయి జగదీష్ చెప్పాడు. డాక్టర్‌గా పేదలకు సేవ చేయాలనేది తన లక్ష్యమని తెలిపాడు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెబుతూ తన విజయంలో వారి పాత్ర ఎక్కువని చెప్పాడు. జగదీష్ 7వ ర్యాంక్ సాధించటం పట్ల అతడి కుటుంబ సభ్యులు హర్షం ప్రకటించారు. తెనాలిలో ఉన్న జగదీష్ తాతయ్య, నాయనమ్మ భాస్కరరావు, సుభాషిణి, బాబాయి కుటుంబ సభ్యులు స్వీట్లు పంపిణీ చేశారు. జగదీష్ తల్లిదండ్రులు రవీంద్ర, సరితాదేవి మాట్లాడుతూ తమ కుమారుడు మొదటి నుంచి విద్యపై ఆసక్తి చూపేవాడన్నారు. పుస్తకాలు చదవటంతోపాటు ఇంటర్నెట్లో స్టడీ మెటీరియల్‌ను చదువుతూ ఉండేవాడని చెప్పారు. ప్రతిభ చూపిన జగదీష్. జగదీష్ ఒకటో తరగతి నుంచి 3 వరకు అంగలకుదురులోని మాస్టర్ మైండ్స్ పాఠశాలలో చదివాడు. 8వ తరగతి వరకు తెనాలి చెంచుపేటలోని గౌతం మోడల్ స్కూల్లో చదివాడు. 9,10 తరగతులు తెనాలి చైతన్య టెక్నో స్కూల్లో చదివాడు. పదో తరగతిలో 9.8 జీపీఏ సాధించి పాఠశాలలో ప్రథమంగా నిలిచాడు. ఇంటర్మీడియెట్ కృష్ణా జిల్లా కంకిపాడు మండలం గోశాలలోని నారాయణ శ్రీచైతన్య మెడికల్ అకాడమీలో బైపీసీ చదివాడు. ఇంటర్లో 980 మార్కులు సాధించాడు. అక్కడ కొద్ది నెలలు ఎంసెట్ శిక్షణ తీసుకున్నాడు. ఇటీవల జరిగిన ఎంసెట్(మెడిసిన్)లో 153 మార్కులకు 150 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంక్ సాధించాడు. కుటుంబ నేపథ్యం.. పొన్నూరు మండలం గరికపాడుకు చెందిన రైతు కోయి రవీంద్ర కుటుంబం పిల్లల చదువుల నిమిత్తం కొన్నేళ్ల కిందట తెనాలి రూరల్ మండలం అంగలకుదురు వచ్చింది. పెద్ద కుమారుడు జగదీష్, రెండవ కుమారుడు సాయి ఆదిత్య. రవీంద్ర భార్య సరితాదేవి గృహిణి.