The election campaign
-
నేటితో తెర
ఈ సాయంత్రం ముగియనున్న ‘గ్రేటర్’ ప్రచారం టీఆర్ఎస్ కీలక శక్తిగా హరీశ్ రావు చివరి రోజు ప్రచారానికి మంత్రి కేటీఆర్ బీజేపీ తరఫున దత్తాత్రేయ, హన్స్‌రాజ్ కాంగ్రెస్ నుంచి వీహెచ్ రాక హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచార పర్వానికి శుక్రవారం తెరపడనుంది. వారం రోజులుగా హోరుగా సాగుతున్న ఓట్ల అభ్యర్థనకు నేటి సాయంత్రం ఐదు గంటలకు చివరి గడువు కానుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు నగరంలో ప్రచారంతో సందడి చేస్తున్నారు. టికెట్ల పంపిణీ నుంచి టీఆర్ఎస్కు అన్నీ తానై వ్యవహరిస్తున్న హరీశ్‌రావు ఇప్పటికే దాదాపు నగరం మొత్తం ప్రచారం చేశారు. చివరి రోజు మున్సిపల్ మంత్రి కేటీఆర్ అధికార పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ ప్రచారానికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అధికార పార్టీ ముందు నుంచి ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రతిపక్ష పార్టీలు మొదట్లో నెమ్మదించినా పోలింగ్ తేదీ దగ్గర పడుతుండగా వేగం పెంచాయి. ఆయా పార్టీలకు చెందిన బడా నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలు సమర్పించాల్సి ఉంది. టీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు గ్రేటర్ వరంగల్ ప్రచారంలో కేంద్ర బిందువుగా మారారు. వారం రోజుల పాటు ఆ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార వ్యూహంలో హరీశ్‌రావు ప్ర త్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రేటర్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూనే.. మరోవైపు ప్రచారంలో పదును తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఎంపీలు పసునూరి దయాకర్, ఆజ్మీర సీతారాంనాయక్, బాల్క సుమన్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నగరంలో ప్రచారం చేస్తున్నారు. కాగా, చివరి రోజున టీఆర్ఎస్ మరో కీలక నేత కె.తారకరామారావు నగరంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన రోడ్‌షో నిర్వహించనున్నారు. అధికార పార్టీని ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు వ్యూహం రచించారు. బీజేపీ శాసనసభా పక్ష నేత లక్ష్మణ్ గురువారం ప్రచారం నిర్వహించారు. చివరిరోజు ప్రచారానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్‌రాజ్ రానున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి రెండు రోజులుగా వరంగల్‌లోనే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు.{పచారాన్ని నెమ్మదిగా ప్రారంభించిన కాంగ్రె స్ చివరి దశలో వేగం పెంచింది. ఆ పార్టీకి చెందిన అగ్రనాయకులు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. చివరిరోజున పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు రానున్నారు.తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. రేవంత్‌రెడ్డి రోడ్‌షోలు నిర్వహిస్తు ప్రభుత్వ వైఫల్యాలపై విరుచుకుపడుతూ ప్రచారం చేశారు. మొదటి నుంచి చివరి వరకు వీరిద్దరే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. బడా నేతలతో సంబంధం లేకుండా రెబల్ అ భ్యర్థులు, స్వతంత్రులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. తమకు కేటాయించిన ఎన్నికల గుర్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారం రో జులుగా శ్రమిస్తున్నారు. ఎన్నికల గుర్తుల ను పట్టుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ప్రతిఇంటికి వెళుతూ తమను గెలిపిం చాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
స్టార్ క్యాంపెయిన్
చివరి రోజు జోరు.. హోరు.. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఆదివారం ప్రచార ‘స్టార్లు’ నగరాన్ని చుట్టేశారు. టీఆర్ఎస్ తరఫున మంత్రి కేటీఆర్... బీజేపీ తరఫున ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి... ఎంఐఎం తరఫున ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ర్యాలీలు... పాదయాత్రలలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి తమ పార్టీల అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో రెండో అంకానికి ఆదివారంతో తెరపడింది. ఇరవై రోజుల పాటు వాడవాడలా.. ప్రతి ఇంటి తలుపును తట్టిన పార్టీల ప్రచార పర్వం ముగిసింది. చివరిరోజు కావడంతో అధికార పార్టీ మంత్రులు, ఇతర పార్టీల ముఖ్యనాయకులు జోరు పెంచారు. బైక్ ర్యాలీలు, బహిరంగ సభలతో కాలనీలను హోరెత్తించారు. -
ప్రచార పర్వంలోకి సిద్ధు
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె(బీబీఎంపీ) ఎన్నికల ప్రచార పర్వంలోకి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం లాంఛనంగా అడుగుపెట్టేశారు. బీబీఎంపీ ఎన్నికల్లో విజయం కోసం రూపొందించాల్సిన వ్యూహం పై చర్చించేందుకు గాను కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్‌తో కలిసి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న అభ్యర్థులతో గురువారం ఉదయం సిద్ధరామయ్య సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయా వార్డుల వారీగా అభ్యర్థులు ఎలాంటి ప్రచార కార్యక్రమాలను చేపట్టాలి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను నగర ప్రజలకు ఎలా వివరించాలి వంటి అంశాలపై అభ్యర్థులకు సూచనలు చేశారు. అంతేకాక బీజేపీ హయాంలో బీబీఎంపీలో జరిగిన కుంభకోణాలు, నగరంలో తలెత్తిన చెత్త సమస్య వంటి అంశాలను కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు. అనంతరం గురువారం మద్యాహ్నం నగరంలోని బీటీఎం లే అవుట్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పూర్తై తర్వాత నగరంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధరామయ్య తొలుత భావించారు. అయితే ఇప్పటికే బీజేపీ, జేడీఎస్‌లు ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఇంకా ఆలస్యం అయితే పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదముందని భావించి గురువారం నుంచే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ఈనెల 15 తర్వాత స్టార్ ప్రచారకులతో బీబీఎంపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఇక గురువారం సాయంత్రానికి నగరానికి చేరుకోనున్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం నుంచే నగరంలో ప్రచారాన్ని చేపట్టనున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో టికెట్ లభించని కారణంగా దాదాపు 100 మంది రెబల్ అభ్యర్థులు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో రెబల్ అభ్యర్థులతో పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరపడంతో వీరిలో దాదాపు 60 మంది గురువారం రోజున తమ నామినేషన్లను ఉప సంహరించుకున్నారు. కాగా మిగిలిన వారికి జేడీఎస్ పార్టీ తక్షణమే బీ-ఫాంలు అందించడంతో ప్రస్తుతం వీరంతా జేడీఎస్ తరఫున పోటీలో ఉన్నారు. దీంతో ఈ రెబల్స్ బెడదను తప్పించుకొని, విజయాన్ని సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులే చేయాల్సి వస్తోందనేది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
‘నారా’జకీయంపై నారీభేరి
రుణ మాఫీ మాటెత్తని చంద్రబాబు మండిపడుతన్న మహిళా సంఘాలు ‘మహిళలంటే నాకెంతో అభిమానం. వారు వేసిన ఓట్లే నా గెలుపునకు కారణం. వారిని జీవితంలో మరిచిపోను. మహిళల కోసం ఏమైనా చేస్తాను’.. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, అధికార దండం అందుకున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పుకొన్న గొప్పలివి. ఆయన ప్రముఖంగా ప్రచారం చేసుకున్న డ్వాక్రా మహిళల రుణ మాఫీపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. అధికారం చేపట్టి ఆరు నెలలైనా హామీని అమలు చేయలేదు. చంద్రబాబు కప్పదాటు వైఖరిపై జిల్లాకు చెందిన 6 లక్షల 20 వేల మంది డ్వాక్రా మహిళలు మండిపడుతున్నారు. ఏలూరు (టూటౌన్) : డ్వాక్రా మహిళలు తీసుకున్న మొత్తం రుణాన్ని మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వాగ్దానం చేశారు. అధికారంలోకి రాగానే గ్రూపునకు రూ.లక్ష చొప్పున మాఫీ చేస్తానని మాట మార్చారు. కనీసం ఆ హామీనైనా నిలబెట్టుకోలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసే వరకూ ఎవరూ రుణాలు కట్టొద్దన్న బాబు బ్యాంకుల వల్ల డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా కనీసం పరిష్కరించలేకపోయారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో దాచుకున్న పొదుపు సొమ్మును బ్యాంకు అధికారులు రుణం కింద జమ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 48 మండలాలు కలిపి 62 వేల డ్వాక్రా గ్రూపులున్నాయి. దీనిలో 6 లక్షల 20 వేల మంది మహిళలున్నారు. వీరందరూ వివిధ బ్యాంకుల ద్వారా రూ.1163 కోట్ల రుణం తీసుకున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబె ట్టుకోవాలంటే జిల్లాలోని డ్వాక్రా గ్రూపులకు రూ.620 కోట్లు అవసరం. ఇప్పటికే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిన నేపధ్యంలో మరో 6 నెలలు గడిచినా డ్వాక్రా మహిళల రుణాల మాఫీ అయ్యే అవకాశాల్లేవు. ఈ సందర్భంగా జిల్లాలోని కొందరు డ్వాక్రా మహిళలు వ్యక్తం చేసిన అభిప్రాయాలివి. అన్నీ అబద్దాలే ఎన్నికల సందర్భంగా చంద్రబాబు అబద్దాలు చెప్పి డ్వాక్రా మహిళలను మోసగించారు. మేం పొదుపు చేసుకున్న సొమ్మును బ్యాంకు అధికారులు జమ చేసుకుంటున్నారు. అదేమని అడిగితే మాకు సంబంధం లేదంటున్నారు. తీసుకున్న రుణాలు కట్టొద్దా? అని ప్రశ్నిస్తున్నారు. - అంబటి ధనలక్ష్మి, డ్వాక్రా మహిళ, ద్వారకాతిరుమల మాట తప్పిన బాబు డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయన్న నమ్మకం లేకుండా పోయింది. రుణాలు మాఫీ చేస్తామని చెప్పగానే నమ్మకంతో ఓట్లేశాం. ఆరు నెలలవుతున్నా మాఫీ కాలేదు. రుణాలు కట్టి తీరాలంటూ బ్యాంకు అధికారులు ఆదేశించటంతో కడుతున్నాం. చంద్రబాబు మాట తప్పారు. - పెద్దపులి సుధ, డ్వాక్రా మహిళ, చింతలపూడి పస్తులుండి చెల్లిస్తున్నాం చంద్రబాబు హామీని న మ్మి డ్వాక్రా రుణాన్ని సకాలంలో చెల్లించలేదు. వాయిదాలు మీరడంతో బ్యాంక్ అధికారులు ము క్కుపిండి వసూలు చేస్తున్నారు. పేద కుటుంబం కావడంతో చెల్లించలేకపోతున్నాను. చంద్రబాబు చేసిన మోసంతో పస్తులుండి చెల్లించాల్సి వస్తోంది. - గంటా రమణ, ఆర్జావారిగూడెం, భీమడోలు, డ్వాక్రా సంఘం నాయకురాలు వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏడాదిగా 500కు పైగా సంఘాలకు డ్వాక్రా రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్తే డ్వాక్రాసంఘాల మహిళలకు రుణం లభించకపోగా, అవమానాలు ఎదుర్కొంటున్నారు. మరో ఏడాది రుణం చెల్లించకపోతే వడ్డీలు అసలును మించిపోతాయి. - వనమా భాగ్యలక్ష్మి, మండల మహిళా సమాఖ్య సభ్యురాలు, కుక్కునూరు అప్పుల్లో మహిళా సంఘాలు డ్వాక్రా రుణాలు తీసుకున్న మహిళా సంఘాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న సంఘాలు చెల్లించాల్సిన వడ్డీ అసలు మించిపోయింది. రూ.3 లక్షలు తీసుకున్న సంఘాలకు రూ.లక్షకుపైగా బకాయిలున్నాయి. - బెజ్జంకి లక్ష్మి, వీఓ, రామసింగారం, కుక్కునూరు -
ఉద్యోగులు ఔట్
అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఊడగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు: ‘ఏరు దాటేదాకా ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ‘బాబు వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలోపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేసిన పాపాన పోలేదు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆదర్శ రైతులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణశాఖ వర్క్ఇన్స్పెక్టర్లతోపాటు పలుశాఖల పరిధిలో వందలాది మంది తాత్కాలిక సిబ్బంది ఉద్యోగాలు ఊడబెరికి ఇంటికి పంపారు. మిగిలిన వారిని సైతం డిసెంబర్ 31 నాటికి రోడ్డుపైకి నెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.2 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం మొదలు పెట్టారు. ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, తాగునీటి సరఫరాల శాఖ, పంచాయతీరాజ్ తదితర ముఖ్య శాఖల్లోనూ అధిక సంఖ్యలో ఖాళీలు ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 2006 నుంచి 1,793 మంది ఆదర్శరైతులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న సాకుతో ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించింది. గృహ నిర్మాణశాఖలో 112 మందిని తాత్కాలిక ఉద్యోగులను సైతం ఇంటికి పంపింది. మిగిలిన వారిని పంపేందుకు సిద్ధమైంది.మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న 853 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లలో 300 మందిని తొలగించగా, మిగిలిన వారిని ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది.260 మంది వెలుగు ఉద్యోగులను సైతం ఇంటికి పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీరితోపాటు అన్నిప్రభుత్వ శాఖల పరిధిలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు ఈ నెల 31 డెడ్‌లైన్‌గా పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీలు: సీనియర్అసిస్టెంట్లు -76, జూనియర్ అసిస్టెంట్లు -34, వీఆర్వోలు -186, వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలు: వైద్యాధికారులు-24, ఏఎన్ఎంలు-155, రెండవ ఏఎన్ఎంలు-75, ఎంపీహెచ్ మేల్-134, ల్యాబ్ టెక్నీషియన్లు- 43, ఫార్మసిస్టు-36, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు -86 సంక్షేమశాఖలో ఖాళీలు మొత్తం వసతి గృహాలు-68, సహాయ బీసీ సంక్షేమ శాఖాధికారుల పోస్టులు-4, ఖాళీ వార్డెన్ పోస్టులు-20, వర్కర్స్ -85, నీటి పారుదల శాఖలో ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్లు-2, టైపిస్టులు- 8, అటెండర్లు-34, జూనియర్ టెక్నీషియన్స్ - 13, టెక్నికల్ అసిస్టెంట్-1, డీఈ-3, ఏఈ-10, ఉద్యానశాఖలో ఖాళీలు సీనియర్ అసిస్టెంటు-1, అటెండర్ -1 డ్వామాలో ఖాళీలు ఏపీవోలు -2, టెక్నికల్ కన్సల్టెంట్ -18, కంప్యూటర్ ఆపరేటర్లు -15 పశుసంవర్థక శాఖలో ఖాళీలు వెటర్నరీ అసిస్టెంట్లు-21, ప్యారావెట్స్- 136, అటెండర్లు-86 వ్యవసాయశాఖలో ఖాళీలు వ్యవసాయాధికారులు-4, అదనపు వ్యవసాయాధికారుల పోస్టులు- 33 చిత్తూరు కార్పొరేషన్లో ఖాళీ పోస్టులు - అసిస్టెంట్ కమిషనర్ -1, రెవెన్యూ అధికారి -1, మేనేజర్ -1, అకౌంటెంట్ -1, పర్యావరణ ఇంజనీర్ -1, సిటీ ప్లానర్ -1, ఏఈ-2, శానిటరీ ఇన్స్పెక్టర్ -3, హెల్త్ ఇన్స్పెక్టర్ -1, మహిళ వైద్యాధికారి -1, వెటర్నరీ అసిస్టెంట్ -5, ఆయాలు -3, సీనియర్ అసిస్టెంట్ -16, ఆఫీసర్ సూపరింటెండెంట్ -7, యూడీఆర్‌ఐ -1, పబ్లిక్ అండ్ హెల్త్ - 4, స్వీపర్లు -19 తాగునీటి సరఫరా విభాగం ఖాళీలు ఎస్ఈ -1, ఈఈ-1, డీఈ-1, ఏఈ-24, జూనియర్ అసిస్టెంట్లు -2, అటెండర్లు -18, టైపిస్టులు -4, జేటీఓలు -13, టెక్నికల్ అసిస్టెంట్ - 1 జిల్లాపరిషత్‌లో ఖాళీలు జూనియర్ అసిస్టెంట్లు -12, అటెండర్లు -8 అరకొర పోస్టులతో డీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. దీంతో ఒ క్కొక్క పోస్టుకు వెయ్యిమంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నా భర్తీకి మాత్రం నోచుకోలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో బయాలజీకి ఒక్కపోస్టు కూడా చూపకపోవడం దారుణం. - చరణ్‌రాజ్,డీఎస్సీ అభ్యర్థి, ఐరాల ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించాలి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతియేటా డీఎస్సీని నిర్వహించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉన్నత విద్యలను పూర్తిచేస్తే ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెందుతోంది. నిరుద్యోగ సమస్య అధికమవుతోంది. -కుమార్, బీఈడీ నిరుద్యోగి,చిత్తూరు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. అధికారం చేపట్టాక నిరుద్యోగుల గురించి యోచనైనా చేయలేదు. కందిస్థాయి ఉద్యోగాలే కాకుండా ఇంజనీర్లు,ఎంఈవోలు,డీవైఈవోలు అధికసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. - షేరు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో అధికసంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఇమ్రాన్,చిత్తూరు జాబ్ జాడ ఎక్కడ బాబు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక డీఎస్సీ మినహా ఏ ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు. అది కూడా అరకొర పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి ప్రస్తావన తేవడం లేదు. పెపైచ్చు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచారు. అలాగే యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచారు. ఫలితంగా నిరుద్యోగులు మరో రెండేళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది. -వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
తుది దశ ప్రచారానికి తెర
జమ్మూకశ్మీర్‌లో 20, జార్ఖండ్‌లో 16 సీట్లకు రేపు పోలింగ్ జమ్మూ/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడింది. ఐదు దశల్లో చివరిదైన ఆఖరి దశ ఎన్నికలు శనివారం (20వ తేదీన) జరగనున్నాయి. కశ్మీర్‌లోని 20 స్థానాలు, జార్ఖండ్‌లోని 16 సీట్లకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో పలువురు ప్రముఖ నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కశ్మీర్‌లోని జమ్మూ, రాజౌరి, కథువా జిల్లాల్లోని 20 స్థానాల్లో 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక జార్ఖండ్‌లోని 16 నియోజకవర్గాల్లో 208 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్‌తో పాటు పలువురు మంత్రులు ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా, జమ్మూ సమీపంలోని బోర్ క్యాంప్ వద్ద గురువారం ప్రచారానికి వెళ్లిన బీజేపీ నేత, మాజీ క్రికెటర్ సిద్దూ కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ గాయపడ్డాడు. -
చాయ్‌వాలాపై నమ్మకముంచండి: మోదీ
చైబాసా: జార్ఖండ్‌కు రాజకీయ అస్థిరత నుంచి విముక్తి కల్పించేందుకుగాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ కట్టబెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం జార్ఖండ్‌లోని చైబాసాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘జార్ఖండ్ రాజకీయ అస్థిరతతో కొట్టుమిట్టాడుతుండడంతో ప్రజలు పేదరికంలో కూరుకుపోతున్నారు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ఈ చాయ్‌వాలా మీద నమ్మకం ఉంచండి. బీజేపీకి మెజారిటీ అందించండి. జార్ఖండ్‌ను కూడా గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలా అభివృద్ధి చేస్తానని మీకు హామీ ఇస్తున్నా’’ అని అన్నారు. 60 ఏళ్లుగా గత ప్రభుత్వాలు పేదలను తప్పుదారి పట్టించాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కాశ్మీర్‌కు వరదసాయం ఏదీ?: రాహుల్ పూంఛ్: కేంద్రంలో సర్కార్‌ను బడా పారిశ్రామిక వేత్తలే నడుపుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం పూంఛ్ ఎన్నికల సభలో విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలో ఆదానీ గ్రూపునకు భారీ రుణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,వరదలతో దెబ్బతిన్న జమ్ము కశ్మీర్‌కు రూ. వెయ్యికోట్లు ఇచ్చే హామీ అలాగే మిగిలిపోయిందన్నారు. -
ఆశలు ఆవిరి
అవనిగడ్డ సాక్షిగా... మాటతప్పిన బాబు ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీలకు నో చాన్స్ లబోదిబోమంటున్న అభ్యర్థులు ‘ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తాం..’ ఈ ఏడాది మేలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అవనిగడ్డ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మండలి బుద్ధప్రసాద్ తరఫున ప్రచారానికి వచ్చిన ఆయన స్థానిక రాజీవ్‌చౌక్‌లో జరిగిన బహిరంగసభలో నాటి టీడీపీ అభ్యర్థి, నేటీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ సూచన మేరకు ఈ ప్రకటన చేశారు. మరి ఇప్పుడేం చేశారంటే.. అవనిగడ్డ : ఎస్జీటీ పోస్టుల్లో బీఈడీ విద్యార్థులకు సైతం అవకాశం కల్పిస్తామని అవనిగడ్డ సాక్షిగా ప్రకటించిన చంద్రబాబు నేడు మాట తప్పారు. తాజాగా టెట్, డీఎస్సీ స్థానంలో టెట్ కమ్ టీఆర్టీగా పేరు మార్చి విడుదల చేసిన జీవోలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీలకు అవకాశం కల్పించకుండానే ఉత్తర్వులు జారీ చేశారు. ఆనాడు చంద్రబాబు చేసిన ప్రకటనను నమ్మి.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అవనిగడ్డలో డీఎస్సీ శిక్షణ పొందుతున్న వేలాదిమంది అభ్యర్థులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఊరించి.. ఉసూరుమనిపించారు... రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం డీఎస్సీ నోటీఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. బాలారిష్టాలు తొలగి ఎట్టకేలకు వెలువడిన డీఎస్సీ నోటీఫికేషన్ బీఈడీ విద్యార్థులు, అభ్యర్థులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టులు రాయడానికి అవకాశం కల్పించకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం కూలీనాలి చేసుకుని బతికే బడుగు జీవులు సైతం వేలాది రూపాయలు వ్యయంచేసి తమ బిడ్డలను ఇక్కడకు శిక్షణకు పంపారు. గత ఆరు నెలలుగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్ణయం అశనిపాతమైంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఎస్జీటీ చేసిన వారిని, ఆరు నుంచి పదో తరగతి బోధించే ఉపాధ్యాయులుగా బీఈడీ అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రతి జిల్లాలోనూ స్కూలు అసిస్టెంట్ పోస్టులు పెరిగేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు అందులో తమ జిల్లాలో తమ సబ్జెక్టుకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలు చూపకపోవడంతో మనోవేదనతో తల్లడిల్లిపోతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తామేం చేయాలో పాలుపోవడం లేదని పలువురు అభ్యర్థులు కన్నీరు పెట్టుకున్నారు. కొందరి ఆవేదన ఇలా ఉంటే మరికొందరి ఆవేదన మరోలా ఉంది. డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల వయోపరిమితి జూలై ఒకటి నాటికి 40 సంవత్సరాలు నిండకూడదని గడువు విధించటం కూడా కొందరిపాలిట అశనిపాతమైంది. కనీసం జూన్ నెలను ప్రాతిపదికగా చేసుకుని ఉంటే మరికొంతమందికి ఉద్యోగ అవకాశాలు లభించేవన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. నిరాశే మిగిలింది... ఐదు నెలలుగా ఇక్కడ మ్యాథ్స్ బీఈడీ అసిస్టెంట్‌కు శిక్షణ పొందుతున్నాను. డీఎస్సీ నోటిఫికేషన్లో మా జిల్లాలో ఖాళీలు చూపించకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. అయినవారందరికీ దూరంగా ఉంటూ ఉద్యోగంపై ఆశతో శిక్షణ పొందిన నాకు చివరకు నిరాశే మిగిలింది. - ఎస్.పద్మ, కడవకుదురు, ప్రకాశం జిల్లా అగమ్యగోచరం ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తే పోస్టుల సంఖ్య పెరుగుతాయని ఎంతో ఆశగా గత ఆరు నెలల నుంచి పగలనకా రేయనకా కష్టపడి చదువుతున్నాం. తీరా విద్యాశాఖ ప్రకటన చూశాక ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. - ఎన్.వెంగమ్మ, నెల్లూరు -
రుణమాఫీ జాబితాలు విడుదల
తహశీల్దార్ల వెబ్సైట్లకు పంపిన ప్రభుత్వం 7,600 పేజీలతో జాబితా నేడు పంచాయతీ కార్యాలయాలకు మచిలీపట్నం : పంట రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. వాటిని అన్ని మండల తహశీల్దార్ల వెబ్సైట్లకూ పంపింది. రుణమాఫీకి సంబంధించి అర్హుల జాబితాను తయారుచేసిన ప్రభుత్వం దాని వివరాలను తహశీల్దార్ కార్యాలయ వెబ్‌సైట్‌కు పంపి, అక్కడి పాస్వర్డ్తోనే ఓపెన్ అయ్యేలా ఏర్పాటు చేసింది. ఈ జాబితా 7,600 పేజీల్లో ఉందని పలువురు తహశీల్దార్లు తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన మండలం.. అందులోని రెవె న్యూ గ్రామాల వారీగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. రుణం తీసుకున్న రైతు పేరు, ఏ బ్యాంకులో తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఈ జాబితాలో ఉన్నాయని తహశీల్దార్లు వివరించారు. ఈ జాబితాను శనివారం ఆయా గ్రామాలకు పంపుతామని.. పంచాయతీ కార్యాలయాల్లో వీటిని ప్రదర్శించనున్నామని వారు వివరించారు. 20 శాతమే నగదు జమ... ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించిన జాబితాను ప్రకటించటంతో అందులో ఎంతమంది పేర్లు ఉన్నాయి. ఎవరెవరి పేరున ఎంత రుణమాఫీ జరిగింది అనే అంశంపై రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక కుటుంబానికి రూ.1.50 లక్షలు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా లేదా అనే అంశంపైనా పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల ప్రభుత్వం రుణమాఫీ కింద మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన రూ.5 వేల కోట్ల నగదును ఒక్కొక్క రైతు పేరున ఉన్న బకాయిలో 20 శాతం మేర జమ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతా మాయేనా... ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదవీ స్వీకారం రోజున వ్యవసాయ రుణాలన్నీ రద్దు చేస్తామని ప్రకటించారు. దీంతో పాటు రుణమాఫీ ఫైలు పైనే తొలి సంతకం చేస్తామని ఈ ప్రకటనల్లో వివరించారు. ప్రమాణస్వీకారం చేసే సమయంలో రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు కోటయ్య కమిటీని నియమిస్తున్నట్లు సంతకం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వ్యవసాయ రుణాలు రైతులెవ్వరూ కట్టవద్దని, బంగారం తాకట్టు పెట్టిన రుణాలు తీసుకుంటే ఆ రుణాలు చెల్లించి మీ బంగారం మీ ఇంటికే తీసుకువచ్చి ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలక్రమేణా అరటి, పసుపు, మిర్చి, కూరగాయలు, పూలతోటలు తదితర ఉద్యానవన పంటలకు రైతులు తీసుకున్న రుణాలను రుణమాఫీ జాబితాను తొలగించారు. మహిళల పేరుతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలే రద్దవుతాయంటూ మెలిక పెట్టారు. పట్టాదారు పాస్‌పుస్తకం ఉండాలని, ఆధార్ కార్డు, అడంగల్ కాపీలు ఈ వివరాలు ఉండాలని ఆంక్షలు విధించారు. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యే దశలో ఉన్నా ఇంతవరకు రైతులకు రుణాలు ఇప్పించటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి తోడు వరుణుడు కరుణించకపోవటంతో రైతులు పంటలు ఎండిపోయి దిగుబడులు ఆశించిన మేర రావని ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణాలు సకాలంలో చెల్లించకపోవటంతో వడ్డీ లేని పంట రుణాలు తీసుకున్న రైతులు నేడు 14 శాతం వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో మూడు శాతం ఇన్సెంటివ్‌గా కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఉండేది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు చేసి మరీ పంటలు సాగు చేశారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకోకపోవటంతో పంట బీమా సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం, రైతులు తీసుకున్న రుణాలు మార్చి 31లోపు చెల్లించకపోవటంతో రుణాలు తీసుకున్న రైతులంతా డిఫాల్టర్లుగా మారారు. ఇలాంటి స్థితిలో ప్రస్తుతం రుణమాఫీకి సంబంధించిన జాబితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జాబితాల్లోని వివరాలు బయటపడితే ప్రభుత్వం రుణమాఫీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. బ్యాంక్ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని కొత్తపేట, సూర్యారావుపేట, నున్న, పటమట పోలీసు స్టేషన్ల పరిధిలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రొబేషనరీ ఆఫీసర్స్ (పీఓ) పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ నగర పోలీసు కమిషనర్, మెట్రోపాలిటన్ ప్రాంత అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9, 15, 23, 29, 30 తేదీల్లో ఈ ఉత్తర్వులు ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో అమలులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఉత్తర్వులు జారీ చేసినట్టు కమిషనరేట్ అధికారులు తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉన్నందున పరీక్షలు జరిగే రోజుల్లో.. పరీక్షా కేంద్రాలకు 250 మీటర్ల పరిధిలో ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని, కర్రలు, రాళ్లు సహా మారణాయుధాలు కలిగి ఉండరాదని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని వివరించారు. -
కొత్తోళ్లకు క ష్టకాలమే..!
సాక్షి, ముంబై: సీట్ల సర్దుబాటుపై అటు అధికార ప్రజాస్వామ్య కూటమిలోనూ, ఇటు ప్రతిపక్ష మహా కూటమిలో స్పష్టత లేకపోవడంతో ఎన్నికల బరిలోదిగే అన్ని పార్టీల అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల్లో ఈ గుబులు మరింత ఎక్కువైంది. ఈ సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంత నిర్భయంగా ఉన్నప్పటికీ కొత్తగా పోటీచేసే వివిధ పార్టీ ల వందలాది అభ్యర్థులకు సవాలుగా మారింది. ఇంత తక్కువ సమయంలో ఎన్నికల ప్రచారం ఎలా చేయాలి...? ఎలా గెలవడమని ఆందోళనలో పడిపోయారు. శనివారం నుంచి ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఈ నెల 27తో ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల ఉపసంహరణకు రెండు, మూడు రోజు ల గడువు ఉంటుంది. అంటే ఒకటో తేదీ సాయంత్రం వరకు ఎంతమంది అభ్యర్థులు, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఒక స్పష్టత వస్తుంది. ఆ తర్వాత ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎన్నికలకు 48 గంటల ముందే ప్రచా రం నిలిపివేయాలి. అంటే కేవలం 13 రోజులు మాత్రమే ప్రచారాలకు, సభలకు సమయం దొరుకుతుంది. ఇంత తక్కువ సమయంలో నియోజకవర్గంలోని సుమారు రెండున్నర నుంచి మూడు లక్షల జనం మధ్యకు ఎలా వెళ్లాలి.. ఎలా ప్రచారం చేయా లో తెలియక కొత్తగా ఎన్నికల బరిలో దిగుతున్నవారు అయోమయానికి గురవుతున్నారు. ఎంత ప్రచారం చేస్తే విజయానికి అంత దగ్గరవుతార నేది జగమెరిగిన సత్యం. ఇదిలా ఉండగా, కూటముల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారంపై ఏమాత్రం ఆధారపడకుండా కొంద రు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ప్రారంభించారు. ఈసారి కూడా తమకు అభ్యర్థిత్వం దొరకడం ఖాయమనే ధీమాతో ఉన్నా రు. కాని కొత్తగా బరిలో దిగే అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీ టెకెటు దొరుకుతుందా..? లేదా...? తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ టికెటు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయ మార్గం వెతు క్కోవడానికి తగిన సమయం కావాలి. ఇండిపెండెంట్‌గా పోటీచేయాలంటే తగిన మందిమార్బలాన్ని, ప్రచార సామాగ్రిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా చివరి క్షణంలో అభ్యర్థిగా ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి ఏంటని కొత్త అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
దాతలారా ... దయచేయండి
ఒంగోలు: కేవలం రెండు రూపాయలకే ప్రతి పల్లెకు 20 లీటర్ల మినరల్ వాటర్ అందజేస్తామని ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఇచ్చిన హామీ. ఈ పథకానికి పెట్టిన పేరు ‘ఎన్టీఆర్ సుజల పథకం’. చంద్రబాబు ప్రకటించిన అయిదు సంతకాల్లో ఇది కూడా ఒకటి. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 818, మున్సిపాల్టీల్లో 98 ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు వ్యయం కనీసంగా రూ.32 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. నిర్మాణం ఇలా... ఈ పథకాన్ని ప్రారంభించేందుకు సంబంధిత ఆవాస ప్రాంతంలో ఏదో ఒక ప్రభుత్వ భవనం లేదా కమ్యూనిటీ హాలులో దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దానికి తప్పనిసరిగా కరెంటు సౌకర్యం ఉండాలి. అక్టోబరు 2వ తేదీ అంటే గాంధీ జయంతి నాటికి ప్రతి మండలానికి కనీసం ఒక ప్లాంట్ నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. కానీ చేతిలో దాతలు ఇచ్చే పైకం మాత్రం లేదు. ప్రతి గంటకు వెయ్యి లీటర్లను శుద్ధిచేసే ప్లాంట్‌కు కనీసంగా రూ.3 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించాలంటే బిగ్‌షాట్సే లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రభుత్వంలోని పలు కీలకమైన విభాగాలకు ఈ బాధ్యత అప్పగిస్తున్నారు. ముఖ్యంగా గ్రానైట్ వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, వీటిని పర్యవేక్షించే శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఇక వ్యాపారులపై కూడా కన్ను పడింది. ఏదో ఓ లొసుగు బయటకు తీసి విరాళాల ఒత్తిడి తేవడానికి పక్కా ప్లాన్ తయారు చేసుకున్నారు టీడీపీ నేతలు. డబ్బు ఒకరిది ... డాబు మరొకరిది ... ఇదేమి పథకమంటూ ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న అజ్ఞాత దాతలు మదనపడుతున్నారు. -
మాయమాటలతో పీఠమెక్కిన కేసీఆర్
నంగునూరు: ‘ప్రజలకు కల్లబొల్లి కబుర్లు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మభ్యపెడుతున్నాడ’ని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం మండల పరిధిలోని ముండ్రాయిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌పేట, పాలమాకుల, రాంపూర్, నంగునూరు, సిద్దన్నపేట, బద్దిపడగలో రోడ్‌షో నిర్వహించి తనను గెలిపించాలని కోరారు. అనంతరం బద్దిపడగలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే ప్రతీ ఇంటికి మంజీర నీటిని ఇప్పించడంతో పాటు సిద్దిపేటకు రైల్వే మార్గం వేయిస్తానన్నారు. ఎన్నికలకు ముందు వ్యవసాయానికి ఏడు గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం మూడు గంటలైనా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంద రోజుల పాలనలో ఏ ఒక్క సంక్షేమ పథకానైనా ప్రవేశపెట్టాడా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ది మాటల ప్రభుత్వం, బీజేపీది చేతల ప్రభుత్వం అన్నారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, నాయకులు వంగ రాంచంద్రారెడ్డి, భూపేశ్, యాదమల్లు, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, భూపాణి, చంద్రం, రాజుగౌడ్, చంద్రం, పరమేశ్వర్‌రెడ్డి, తిరుపతిరావు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. గెలిపిస్తే రైల్వే లైన్ తెస్తా.... సిద్దిపేట రూరల్: తనను గెలిపిస్తే సిద్దిపేటకు రైల్వే లైన్ తెస్తాననని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేట, రాఘవాపూర్, చిన్నగుండవెల్లిలో బుధవారం రాత్రి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రైల్వే లైన్ తేవడం తమతోనే సాధ్యమన్నారు. ప్రజా సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. -
జనహృదయమెరిగిన ప్రధాని
పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం మోడీకి సమస్య కాదు. ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణాలనే ఆయన అధిగమించాల్సి ఉంది. దేశానికి గమ్యాన్ని నిర్దేశించి, ప్రాధాన్యాలను ఎంచుకుని, వాటిని నెరవేర్చగలిగే రూట్ మ్యాప్‌ను తయారు చేయాల్సి ఉంది. గమ్యం లేకుండా ఎంత ఎగిరినా మిగిలేది సుదీర్ఘ ప్రయాణ ప్రయాసే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలోని ఉపన్యాస వేదికకు తరలేటప్పుడు ఏ ప్రధానమంత్రి అయినా మూడిట్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసి ఉంటుంది. తమ ప్రభుత్వాన్ని ఉద్దేశించే ప్రసంగించడం లేదా తమలో తాము గొణుక్కోవడం లేదా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం. మొదటిది సులువు. ఎందుకంటే ప్రభుత్వమే అందులో కథనమూ, కథకుడూ కూడా. మేం ఇది చేశాం (చప్పట్లు), మేం ఇది చేయబోతున్నాం (తప్పనిసరి చప్పట్లు) అంటూ ఏకరువు పెట్టి స్వీయ ప్రశంసల మిథ్యా సౌఖ్యాన్ని అనుభవించే అవకాశం అందులో ఉంది. ఇక రెండోది, ఆత్మవిశ్వాసం కొరవడటం పర్యవసానమే తప్ప ఆత్మావలోకనం కొరవడటం కాదు. మన్మోహన్ సింగ్ దాన్ని అలవాటుగా మార్చుకున్నారు. తాను సంకోచించవ లసినది చాలానే ఉన్నదని ఆత్మావలోకనం ద్వారానే బహుశా ఆయనకు బోధపడి ఉండాలి. అధినేతతో అనుబంధం చెడి పోయినా ఆమెకు మోకరిల్లక తప్పని విలక్షణమైన ప్రధాని మన్మోహన్. అధికారాన్ని సోనియాగాంధీ, ఆమె చపల చిత్తపు కుమారుడు రాహుల్‌గాంధీ అనుభవిస్తుండగా, ఆయన బాధ్యతలకు కట్టుబడి ఉండవలసి వచ్చింది. నష్టం వాట్లిలింది దేశానికి. ప్రధాని నరేంద్రమోడీ దేనిని ఎంపిక చేసుకున్నారో చెప్పిన వారికి బహు మానాలు లభించే అవకాశమేమీ లేదు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లా డారు. పోటీదారుల కన్నా మెరుగ్గా నిలవటం ఆయన సమస్య కాదు. ముమ్మ రంగా సాగిన ఎన్నికల ప్రచారంలో తాను నెలకొల్పిన అసాధారణ ప్రమాణా లనే ఆయన అధిగమించాల్సి ఉంది. ఇప్పుడాయన గమ్యాన్ని నిర్దేశించాల్సి ఉంది. ఆ దృష్టి నుండీ ప్రాధాన్యాలను ఎంచుకోవాలి. వాటిని నెరవేర్చడానికి తగిన రూట్ మ్యాప్‌ను తయారు చేసుకోవాలి. గమ్యం అంటూ లేకుండా ఎంత ఎగిరినా సుదీర్ఘ ప్రయాణపు ప్రయాస తప్ప ఎక్కడికీ చేరలేరు. మోడీ అసలు సారం ఏమిటో ఆగస్టు 15 ఉదయాన విన్నాం, కన్నాం. ఆయన హృదయం ఆకాశపు అంచును నిర్దేశిస్తే, బుద్ధి దిక్సూచీలోని అయస్కాంతమైంది. దేశ ప్రగతి ప్రభుత్వ కార్యక్రమమేమీ కాదు, ప్రజలందరి కార్యక్రమం అనే అంశం చుట్టే ఆయన సందేశపు ఉరవడి తిరిగింది. ఒక్క పోలికతో ఆయన ఆ విషయాన్ని చక్కగా చెప్పారు. 125 కోట్ల మంది భారతీయులు ఒక్కొక్కరూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తే, దేశం 125 కోట్ల అడుగులు ముందుకు పోతుంది. గత ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రసంగం షేర్ హోల్డర్ల వార్షిక సమావేశంలో సమర్పించే పద్దుల చిట్టాలా ఉండేది. మోడీ దానిని నిశిత పరిశీలన అనే ఇరుసుపై తిరుగాడే ముల్లుగా మార్చారు. మన జాతీయ స్వభావంలో ఏవైనా చెడులు ఉంటే వాటిని ఎత్తి చూపటంతోపాటు, అది పేదరికం లేదా లైంగిక వివక్షతతో కూడిన నేరాల వంటి శాపాలు లేదా అప్రతిష్టలపైకి వెలుగును ప్రసరింపచేసింది. ఇది నిరాశావాదం కాదు, వాస్తవిక వాదం. లక్ష్యం సాధించగలిగినది మాత్రమే కాదు, చేతికి అందుబాటులోనే ఉంది అనే విశ్వాసంతో మోడీ దేశ మానసిక స్థితిని మార్చేశారు. ఆ దార్శనికతనే ఆయన ప్రజలకు అందించారు. ఎర్రకోట దగ్గర మారుమోగిన చప్పట్లలో అతి గట్టిగా ధ్వనించినవి టీనేజీ బాలల చప్పట్లే. అవి దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలలోని కోట్లాది మంది ప్రజల ఆశల ప్రతిధ్వనులు. పెల్లుబికిన ఆనందోత్సాహాలు వివరణకు అందేవే. మన దేశానికి ప్రధానమంత్రి మాత్రమే కాదు, నేత దొరికాడు. ప్రధాని మోడీ ఎవరూ అడగని ప్రశ్నలను లేవనెత్తారు. కూతుళ్లను నిర్లక్ష్యం చేస్తూ మనం కొడుకుల పట్ల ఎందుకు గారం చేస్తున్నాం? ఆడపిల్లలను పిండదశలోనే చిదిమేసే అత్యంత అవమానకరమైన స్థితికి బాధ్యులు ఎవరు? మన ఇళ్లను, వీధులను, దేశాన్ని పరిశుభ్రం చేసుకోవడానికి మనకు చట్టాలు అవసరమా? కుల, మత హింస అనే కాలకూట విషానికి అంతం ఎప్పుడు? ఒక పదేళ్లపాటు సామరస్యాన్ని పాటించి ఫలితాలను మీరే చూడండి అంటూ ఆయన ప్రజలకు సవాలు విసిరారు. ఇలాంటి ప్రశ్నలను సంధించడం బహుశా ఢిల్లీ దర్బారుకు వెలుపలివారికి మాత్రమే సాధ్యమేమో. ప్రధాని మోడీ తనను తాను అలాగే అభివర్ణించుకున్నారు. అందుకే మోడీ ఢిల్లీ దర్బారు లోని భారత ప్రజాస్వామ్యపు అతి శిష్ట వర్గానికి, రాజకీయ-అధికార యంత్రాంగాన్ని నియంత్రించే వర్గం వారికి సంబంధించిన సర్వ సామాన్య సత్యాన్ని విస్పష్టంగా చూడగలరు. తీవ్ర సంస్కరణ తప్ప మరేదీ సరిదిద్దలేనంతగా వారి మధ్య సాగే అంతర్యుద్ధాలు పరిపాలనను పాడు చేశాయని చెప్పగలిగే నాయకత్వం కావాలి. మోడీ అలాంటి నాయకత్వాన్ని అందించగలరు. ప్రణాళికా సంఘం దాని అసలు లక్ష్యానికే కొరగాకుండా పోయింది. ఆ కారణంగానే మోడీ దాని మరణ సంతాప సందేశాన్ని వినిపించారు. అత్యంత తీవ్ర జాతీయ సంక్షోభమైన పేదరికం పట్ల గత పదేళ్లుగా అనుసరించిన స్వయం సంతృప్తికర, నిస్సార వైఖరే, దాని ముఖ్య వైఫల్యం. సామాన్యమైన అంచనాకు సైతం అది కనబడుతుంది. ఆరు దశాబ్దాల ప్రణాళికా బద్ధమైన ఆర్థిక వ్యవస్థలో పేదరిక రేఖకు దిగువనే ఉన్న భారతీయుల సంఖ్య కేవలం అతి స్పల్పంగా, ఏడాదికి అర శాతం (0.5 శాతం) చొప్పున తగ్గుతూ వచ్చింది. ఇది దిగ్భ్రాంతికరమైనదీ, ఆమోదయోగ్యం కానిదీ.రాష్ట్రాలతో సహకారం ద్వారా సమస్యలకు పరిష్కారాలను అన్వేషించాల్సింది పోయి ప్రణాళికా సంఘం రాచరిక ఆదేశాల పరంపరగా శాసించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు అది కేంద్రాన్ని బిచ్చమడుక్కుంటే ఒకటో రెండో మెతుకులు దక్కుతాయని బోధించేది. చట్ట రీత్యా, ఆచరణ రీత్యా కూడా మనది సమాఖ్య దేశం. కొన్ని చిన్న కేంద్రపాలిత ప్రాంతాలను మినహాయిస్తే, దేశంలోని మరే ప్రాంతాన్నీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా పరిపాలించడానికి వీల్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే అభివృద్ధి పనులు అత్యుత్తమంగా సాగుతాయి. కేంద్రం అందుకు దోహదకారే తప్ప నియంత కాదు. ప్రపంచం మారిపోతోంది. మనం దానికి అతీతంగా ఉండలేం. సాంకేతికపరమైన నూతన ఆవిష్కరణలు, అత్యధునాతన వస్తు తయారీ ప్రధానంగా ప్రైవేట్ రంగంలోనే సాగే శకం ఇది. అందువలన మనకు అంతర్జాతీయ సహకారమనే సృజనాత్మక శక్తి అవసరం. పేదరికానికి అత్యుత్తమ విరుగుడు పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలోని ఉపాధి కల్పనే. వ్యక్తిగత సంక్షేమాన్ని అది జాతీయ వృద్ధితో అనుసంధానిస్తుంది. ప్రధాని మోడీ అన్నట్లుగా భారత్ ప్రపంచ వస్తు తయారీరంగ కేంద్రంగా మారడానికి సన్నద్ధమై తీరాలి. కలలు నిజమయ్యేది మేలుకుని ఉన్నప్పుడు మాత్రమేనని ప్రధాని మోడీకి తెలుసు. నిద్రలో నడకతో అద్భుత స్వప్నం దిశగా మీరు ముందుకు పోజాలరు. జాతిని జడత్వం నుంచి మేల్కొల్పగల అభీష్టశక్తి ఆయనకుంది. రానున్న మాసాల్లో అది ఎలాగో మీరు చూస్తారు. (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు) - ఎంజే అక్బర్ -
తుది దశ ప్రచారానికి తెర
3 రాష్ట్రాల్లో 41 స్థానాలకు రేపు పోలింగ్ న్యూఢిల్లీ: నేతల మాటల యుద్ధాలు, కోడ్ ఉల్లంఘనలు, ఈసీ నోటీసులు, మందలింపులు, పలువురు అభ్యర్థుల అరెస్టులు, ఎన్నికల కమిషన్‌పైనే పలు పార్టీల ధిక్కార స్వరాల మధ్య దాదాపు నెలన్నరపాటు హోరాహోరీగా సాగిన 16వ లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో చివరి, తొమ్మిదో దశ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంట లకు తెరపడింది. మూడు రాష్ట్రాల్లోని 41 స్థానాలకు (ఉత్తరప్రదేశ్‌లో 18 సీట్లు, పశ్చిమ బెంగాల్లో 17 స్థానాలు, బీహార్‌లో 6 సీట్లు) సోమవారం పోలింగ్ జరగనుంది. మొత్తం 606 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 6.5 కోట్ల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు. 12న పోలింగ్ ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారాలపై నిషేధం తొలగనుంది. 16న ఫలితాలు వెలువడనున్నాయి. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ, కేజ్రీవాల్ తలపడుతున్న వారణాసి స్థానం యావ త్ దేశం దృష్టిని ఆకర్షించడం తో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ. ఆప్ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బరిలోని ప్రముఖులు వీరే: చివరి దశ ఎన్నికల బరిలో ప్రముఖుల్లో నరేంద్ర మోడీ, కేజ్రీవాల్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాద వ్ (ఆజంగఢ్ ), కేంద్ర మంత్రి ఆర్పీఎన్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన జగదాంబికాపాల్, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ కుమార్, భోజ్‌పురి నటుడు రవి కిషన్, బీజేపీ నేత కల్రాజ్ మిశ్రా, పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ నేతలు దినేశ్ త్రివేదీ ఉన్నారు. వారణాసిలో హోరాహోరీగా ర్యాలీలు వారణాసి:వారణాసిలో శనివారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడింది. చివరిరోజు ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు సైతం హోరాహోరీగా ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. మే 12న పోలింగ్ జరగనున్న వారణాసి నుంచి తలపడుతున్న బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ మధ్య ప్రధానంగా త్రిముఖ పోటీ నెలకొనగా, ఇక్కడి నుంచి సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు చిన్నా చితకా పార్టీలు సైతం తమ అభ్యర్థులను బరిలోకి దించాయి. స్వతంత్ర అభ్యర్థులతో కలుపుకొని వారణాసి నుంచి 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యంగా చివరి మూడు రోజులు వారణాసిలో హోరాహోరీ ప్రచారం సాగింది. చివరి రోజు తమ పార్టీ అభ్యర్థి అజయ్ రాయ్ తరఫున కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 12 కిలోమీటర్ల పొడవున సాగించిన రోడ్‌షో నాలుగు గంటల సేపు సాగింది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి కైలాస్ చౌరాసియా తరఫున యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రోడ్ షో నిర్వహించగా, ‘ఆప్’ నేత కేజ్రీవాల్ తరఫున అమేథీ నుంచి రాహుల్‌పై పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ రోడ్‌షో నిర్వహించారు. మిగిలిన వారితో పోలిస్తే, రాహుల్ రోడ్‌షోకు భారీగా జనం హాజరయ్యారు. వారణాసి సమీపంలోని చందౌలిలో కూడా రాహుల్ ప్రచార సభలో ప్రసంగించారు. -
నేడు వైఎస్సార్ జనభేరి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జిల్లాకు రానున్నారు. ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కనిగిరి, చీరాల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన జిల్లాకు చేరుకుంటారు. ఉదయం పది గంటలకు కనిగిరిలోని కంభం రోడ్డులో ఉన్న అర్బన్‌హట్ కాలనీ వద్ద హెలికాప్టర్ దిగుతారు. కనిగిరి చేరుకుని అక్కడి నుంచి కొత్తూరులోని ఆంజనేయస్వామి ఆలయం ఎదుట ఉన్న సభా ప్రాంగణానికి వెళతారు. బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి చేరుకుంటారు. అక్కడ సభ ముగించుకుని, మధ్యాహ్నం 3.00 గంటలకు చీరాలలోని వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎం కాలేజీ మైదానానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రచార రథంలో గడియారం స్తంభం సెంటర్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. -
అందరివాడిని...!
అందుబాటులో ఉంటా... రాజన్న, నాన్న కలలు నెరవేరుస్తా ఉపాధి కల్పన, సుజల స్రవంతి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఇంటర్వ్యూ గాజువాక, న్యూస్‌లైన్ : ‘నేను ఇక్కడే పుట్టి...ఇక్కడే పెరిగాను. నున్న ఇక్కడి ప్రజలు చేయి పట్టుకొని నడిపించారు. నాన్న గురునాథరావుపై ఉన్న అభిమానాన్ని ప్రేమగా మార్చి నాపై చూపించారు. నన్ను తమ భుజాలపై ఎత్తుకొని ఆడించారు. అందుకే... వారికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటా. వారి సంతోషాల్లో భాగస్వామినవుతా...’ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న 28 ఏళ్ల యువకుడు గుడివాడ అమర్నాథ్ చెప్పిన మాటలివి. ఎన్నికల ప్రచారంలో భాగంగా దాదాపు అన్ని గ్రామాల్లోను పర్యటించిన ఆయన న్యూస్‌లైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అవి ఆయన మాటల్లోనే... యువతకు ఉపాధి కల్పనే ధ్యేయం... అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో యువతకు ఈ ప్రాంతంలోనే ఉపాధి కల్పించడం నా ధ్యేయం. ఇక్కడ 18-25 ఏళ్ల యువతే ఎక్కువ. అంతా ఉన్నత విద్యావంతులే. తమను పెంచి, పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి వెళ్లలేక, ఇక్కడ ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. జగన్ అన్నయ్య ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలో ఈ విషయంపై చాలా స్పష్టంగా చెప్పారు. ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేస్తే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చూస్తాను. త్వరలో విశాఖ ఆర్థిక రాజధానిగా మారనుంది. కొత్తగా ఏర్పడే పరిశ్రమలకు పదేళ్లపాటు పన్నుల రాయితీలతోపాటు అనేక సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గమే అనుకూలంగా ఉంటుంది. మరింత ఎక్కువమందికి ఉపాధి లభిస్తుంది. ఐటీ హబ్ సాధిస్తా... హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ఐటి హబ్ మాదిరిగా అనకాపల్లి పార్లమెంట్‌ను కూడా ఐటి హబ్‌గా మారుస్తా. తెలంగాణకు శేరిలింగంపల్లి గుండెకాయవంటింది. అలాంటిది ఇక్కడ కూడా సాధిస్తాం. ఈ హబ్‌లోను, ఫార్మా సెజ్‌లోను స్థానిక యువకులందిరికీ ఉపాధి కల్పించాలనేది నా ఆశయం. రూరల్ బీపీవోలను ఏర్పాటు చేసి ఐటీ అభివృద్ధి చేయాలన్నది నా లక్ష్యం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి సాధిస్తా... జగన్ అన్నయ్య రైతులకు అండగా ఉంటారు. వైఎస్ కలల ప్రాజెక్టు అయిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసేందుకు రూ.1000 కోట్లు కావాలి. ఇక్కడి ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ఆ నిధులను తెస్తాం. ఈ ప్రాజెక్టుద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. అందులో రెండున్నర లక్షల ఎకరాలు విశాఖ జిల్లాలోనే ఉంది. సుజల స్రవంతి పూర్తై రైవాడ నీరు మొత్తం రైతులకు ఇవ్వొచ్చు. రైవాడద్వారా ఆరువేల ఎకరాలకు నీరు అందుతుంది. ఒక్కో పార్లమెంట్ సభ్యుడికి ఏడాదికి రూ.5కోట్లు అభివృద్ధి నిధులు కేటాయిస్తారు. ఇందులో ప్రతి ఏలా రూ.కోటి నిధులు దళిత ప్రాంతాల అభివృద్ధికి కేటాయిస్తాను. రాజకీయమే నా వ్యాపకం... నాకు రాజకీయం వ్యాపకం. నా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు అది వ్యాపారం. ప్రతిరోజు ప్రజలను కలవడంతోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. నిత్యం ప్రజలమధ్య, ప్రజలతోనే ఉంటాను. వారి (ప్రత్యర్థుల) మాదిరిగా నాకు ఏ వ్యాపారాలు లేవు. -
రేపు జిల్లాకు జగన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల నాలుగో తేదీన (ఆదివారం) ఎన్నికల ప్రచారం నిమిత్తం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నూకసాని బాలాజీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి జగన్ మోహన్‌రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరి జిల్లాకు జగన్ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కనిగిరి చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి 4.30 గంటలకు చీరాల చేరుకోనున్నారు. చీరాలలో జరిగే బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తారు. ఈ మేరకు జగన్ బహిరంగ సభలకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేపడుతున్నారు. రెండు నియోజకవర్గాల్లోను సభాస్థలానికి కొద్దిదూరంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసే పనుల్లో ఉన్నారు. జగన్ సభకు భారీగా ప్రజలు తరలి రావాలని నూకసాని బాలాజీ పిలుపునిచ్చారు. -
ఓటరు దేవునిదే భారం
కామారెడ్డి, న్యూస్‌లైన్ : పక్షం రోజులుగా ప్రచారాలు, ప్రలోభాల తో ఓటర్లను ఆకట్టుకునేందుకు పడరాని పాట్లు పడ్డ అభ్యర్థులు ఇక ఓటరు దేవునిపై భారం వేశారు. బుధవారం వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజక వర్గాలు, రెండు పార్లమెంటు నియోజక వర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డారు. ప్రత్యర్థులకు దీటుగా హంగూ, ఆర్భాటాలతో ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు మద్దతుగా ఆయా పార్టీ ల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల నిబంధనలు ఎన్ని ఉన్నా అభ్యర్థులు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు. ముఖ్యంగా కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించారు. కుల సంఘాలకు విందులు ఏర్పాటు చేయడంతో పాటు వారు కోరుకున్నట్టుగా డబ్బులు కూడా ముట్టజెప్పారు. కొందరు అభ్యర్థులు మాత్రం తమ చేతిలో ఉన్న అధికారంతో కుల సంఘాలకు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్న హామీలు కూడా ఇచ్చారు. కాగా ఎన్నికల వేళ ప్రధాన పార్టీల్లోని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీలు మారారు. దీంతో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉత్కంఠభరితం గా మారాయి. అభ్యర్థుల అన్ని ప్రయత్నాలు ముగిశాయి. ఇక ఓటరు దేవుడిపైనే భారం మిగిలుంది. ఎవరు వెళ్లినా నీకే నా ఓటన్న ఓటరు చివరికి ఎవరికి వేస్తాడో తెలియని విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా, అనేక హామీలతో సంతృప్తి పర్చినా చివరకు నిర్ణయించే ది ఓటరే కావడంతో అభ్యర్థులు ఓటరు దేవుని తీర్పుమీదే ఆశలు పెట్టుకున్నారు. లోపల ఎంత భయం ఉన్నా గెలుపుపై ధీమా మాత్రం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని చోట్ల బహుముఖ పోరు నెలకొన్న ప్రస్తుత తరుణంలో మరి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో వే చి చూడాలి. -
అభివృద్ధి చేశాం... ఆదరించండి
సోనియా పిలుపు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘మా హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందింది. రూ. ఆరు వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వికారాబాద్‌ను శాటిలైట్ సిటీగా ఆధునీకరించాం’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. పదేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా 19 నిమిషాలపాటు ప్రసంగించారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాదేనని, ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అధికారంలోకివస్తే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్ధేశించిన చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని సోనియా వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించామని, ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని స్పష్టం చేశారు. టీఆర్ఎస్పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన సోనియా.. ఆ పార్టీ అధినేత అవకాశవాద, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు మారుపేరు అని విమర్శించారు. ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించే ఇచ్చామని చెప్పుకొచ్చారు. బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులు వాయిలార్ రవి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులను సోనియాకు పొన్నాల పరిచయం చేశారు. భారీగా జన సమీకరణ సోనియా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. భారీగా జన సమీకరణ చేసింది. సుమారు 700 ప్రత్యేక బస్సులతో జిల్లా నలుమూలల నుంచి జనాలను చేవెళ్లకు తరలించారు. ఇటీవల తెలంగాణలో వివిధ చోట్ల జరిగిన అగ్రనేతల సమావేశాలు పేలవంగా జరిగిన నేపథ్యంలో దీనిపై మాజీ మంత్రి సబిత ప్రత్యేక దృష్టి సారించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఎన్నికల ప్రచారం ముగింపు వేళ అధినేత్రి ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో కాదని, మీరే నిజమైన హీరోలని సోనియా పేర్కొనడం ఉత్సాహాన్ని పెంచింది. కొన్ని పార్టీలు కల్లిబొల్లి మాటలతో దగా చేసేందుకు ముందుకొస్తున్నాయని, అవి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలనే పిలుపునకు మంచి స్పందన వచ్చింది. సోనియా రాకముందు కొందరు నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలను విసుగెత్తించాయి. -
నేడు టీఆర్ఎస్, టీడీపీ భారీ సభలు
గజ్వేల్/వర్గల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకున్న తరుణంలో గజ్వేల్ నియోజకవర్గంలో భారీ సభల నిర్వహణకు టీఆర్ఎస్, టీడీపీ సన్నద్ధమవుతున్నాయి. వర్గల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నిర్వహించే సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటారు. సాయంత్రం మూడు గంటలకు కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా వర్గల్ చేరుకుంటారు. వర్గల్ సభ ఖరారు కావడంతో శనివారం రాత్రే పార్టీ కార్యకర్తలు, నేతలు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణ, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు రాములు నాయక్, రాష్ట్ర నేత కమలాకర్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి రాజయ్య యాదవ్ తదితరులు ఆదివారం ఉదయం వర్గల్ సందర్శించారు. స్థానిక విశ్వతేజ స్కూల్ సమీపంలోని మైదానాన్ని వారు ఎంపిక చేశారు. ఈ మేరకు అక్కడి మైదానాన్ని చదును చేయించి, హెలిప్యాడ్ నిర్మాణ పనులను ముమ్మరం చేయించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్గల్ సభకు నియోజకవర్గంలోని తెలంగాణ అభిమానులు, ప్రజలు, భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గజ్వేల్‌లో చంద్రబాబు సభ గజ్వేల్ సంగాపూర్ రోడ్డు వైపున గల ప్రసన్నాన్నాంజనేయ ఆలయం పక్కనగల మైదానంలో సోమవారం ఉదయం 9.30గంటలకు నిర్వహించనున్న ఎన్నికల ప్రచార సభకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సినీనటుడు పవన్‌కల్యాణ్, టీడీపీ నేత ఆర్. క్రిష్ణయ్య, మహాజన సోషలిస్టు పార్టీ అధినేత మంద కృష్ణ తదితరులు హాజరవుతున్నట్లు ఆ పార్టీ టీడీపీ అభ్యర్థి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. -
జగన్‌కు ఎవరూ సాటిరారు
దుష్టపాలనకు స్వస్తి పలకండి ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం రాజంపేట ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి రామసముద్రం/ మదనపల్లె, న్యూస్‌లైన్: రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైఎస్.జగన్మోహన్రెడ్డికి ఏ నాయకుడూ సాటిరారని, ఆయన ప్రజల మనిషని వైఎస్సార్ సీపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో తొలిసారిగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రామసముద్రం, చెంబకూ రు తదితర గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించా రు. రోడ్డు పొడవునా మహిళలు కర్పూర హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టగా ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆయన పేరును చెరిపేసేందుకు కుట్రలు పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరువ కావాలంటే ఒక్క జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమన్నారు. రామసముద్రం మండలంలో 1000 అడుగుల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయని ఇంతకాలం ఉన్న ఎమ్మెల్యేలు తాగునీటిపై దృష్టి సారించలేదని ధ్వజమెత్తారు. స్థానికంగా ఉండి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతోనే తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఎంపీ అయిన వెంటనే ప్రతి గ్రామంలో బోరువేసి తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే హంద్రీ-నీవా పనులు పూర్తి చేయిస్తామని తెలిపారు. మైనార్టీలను చీల్చేందుకు కాంగ్రెస్, జై సమైక్యాంధ్ర పార్టీలు మదనపల్లె, పీలేరులో మైనార్టీలకు టికెట్ ఇచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. విభజనవాదుల మాయమాటలను నమ్మవద్దని, సువర్ణ పాలన కోసం ఫ్యాను గుర్తుపై ఓట్లువేసి తనను, డాక్టర్ దేశాయి తిప్పారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కుమార్, మండల పరిశీలకులు చిప్పిలి జగన్నాథరెడ్డి, మండల కన్వీనర్ శ్రీనాథరెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు పీ.కేశవరెడ్డి, యూత్ అధ్యక్షుడు విజయ్గౌడు, మదనపల్లె సీనియర్ నాయకులు ఎన్.బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్.మస్తాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎన్.ఇఫ్రాన్ఖాన్, జెడ్పీటీసీ అభ్యర్థి సీహెచ్.రామచంద్రారెడ్డి, బయ్యారెడ్డి, అడవిలోపల్లె గోపాల్‌రెడ్డి, భాస్కర్‌గౌడు, సుబ్రమణ్యం, జిల్లా మైనార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు మస్తాన్ పాల్గొన్నారు. మిథున్‌రెడ్డి రోడ్‌షోకు అశేష జనం మదనపల్లె నియోజకవర్గంలో పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి చేపట్టిన రోడ్‌షోకు భారీగా జనం తరలివచ్చారు. రామసముద్రం మండలంలో రోడ్‌షోను ప్రారంభిం చిన ఆయన చెంబకూరు, కట్టుబావి, పెంచుపాడు, బొమ్మనచెరువు, కొత్తపల్లె మీదుగా మదనపల్లెకు చేరుకున్నారు. మాలిక్ ఫంక్షన్ హాల్లో ముస్లిం మైనార్టీల సమావేశంలో ప్రసంగించారు. అనంతరం నిమ్మనపల్లె మండలంలో రోడ్‌షో నిర్వహించారు. సాయంత్రం తిరిగి మదనపల్లెకు చేరుకుని నిమ్మనపల్లె సర్కిల్, చిత్తూరు బస్టాండ్ సర్కిల్, టౌన్‌బ్యాంక్ సర్కిల్, అవెన్యూరోడ్, ఎంఎస్ఆర్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, మల్లికార్జున సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె వరకు రోడ్‌షో నిర్వహించారు. మహిళలు అడుగడుగునా మిథున్‌రెడ్డికి, తిప్పారెడ్డికి హారతులతో స్వాగతం పలికారు. -
నేడు షర్మిల ఎన్నికల ప్రచారం
ఉత్సాహంగా వైఎస్ఆర్ సీపీ శ్రేణులు ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నేడు తంబళ్లపల్లె, కుప్పం, పలమనేరు, పూతలపట్టుల్లో సభలు రేపు ఉదయం శ్రీకాళహస్తిలో బహిరంగసభ సాక్షి, చిత్తూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు, వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి వైఎస్ షర్మిల సోమ, మంగళవారాల్లో జిల్లాలో ఎ న్నికల ప్రచారం నిర్వహించనున్నా రు. వైఎస్ఆర్ సీపీ రాజంపేట, తిరుపతి, చిత్తూరు ఎంపీ అభ్యర్థులను, 14 నియోజకవర్గాల్లో ని ఎమ్మెల్యే అభ్యర్థుల విజ యం కోసం ఆమె రెండురోజుల పాటు చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచార పర్యటన నిర్వహించనున్నారు. 27న ఉదయం 9.30 గంటలకు ములకలచెరువులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. తంబళపల్లెలో 10.30గంటలకు, కుప్పం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3.30గంటలకు ప్రచార సభల్లో ప్రసంగిస్తారు. పలమనేరు నియోజకవర్గం వి.కోటలో 5 గంటలకు ప్రచార సభలో పాల్గొంటారు. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో సాయంత్రం 6.30 గంటలకు సభలో పాల్గొంటా రు. 28న ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో నిర్వహించే ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ సభల ఏర్పాట్లను ఉత్సాహంగా పర్యవేక్షిస్తున్నాయి. -
కేసీఆర్‌ది... అధికార దాహం
ఇంటర్వ్యూ: పొన్నాల లక్ష్మయ్య ‘సీసా లేదు, పైసా లేదు’ అని శంకరమ్మను కేసీఆర్ అవహేళన చేశాడు వైఎస్ పథకాలు మరింత మెరుగ్గా తెలంగాణలోనూ కొనసాగుతాయి చంద్రబాబును ఎవరూ నమ్మరు.. బీసీ సీఎం అనడం పెద్ద ఫార్స్ ఎలక్షన్ సెల్ : పొన్నాల లక్ష్మయ్య... తెలంగాణకు తొలి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు. ఎన్నికల ప్రచారం జోరు మీదున్న నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పొన్నాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ తమ వల్లే సాకారమైందనే ప్రచారంతోనే ఎవరికి వారు ప్రజల వద్దకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై ‘సాక్షి’ ప్రతినిధికి పొన్నాల ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే... సోనియా వల్లే రాష్ట్రం సాకారమైందన్న భావన తెలంగాణ ప్రజల హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. సోనియా-తెలంగాణ... ఈ రెండూ విడిపోని బంధం. మరో ప్రాంతంలో ఇబ్బందులున్నా తెలంగాణ ఇచ్చారని అందరూ కాంగ్రెస్‌ను హర్షిస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సోనియా చూపిన చొరవ, పట్టుదలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తాం. సుస్థిర పాలన... సుపరిపాలన... సామాజిక భాగస్వామ్యం ప్రధానాంశాలుగా ముందుకెళ్తాం. తెలంగాణలో గెలుపు మాదే. టీఆర్ఎస్కు ప్రజల మద్దతు లేదు తమ వల్లే తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ చెప్పుకోవడం విడ్డూరం. టీఆర్ఎస్ కంటే ముందు నుంచే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సాధనకు కృషి చేసింది. అయినా ఇద్దరు ఎంపీలున్న ఆ పార్టీ, పైగా పరస్పరం పొసగని ఇద్దరు ఎంపీలు... 543 మంది ఎంపీలున్న లోక్‌సభను ప్రభావితం చేయగలరని ఎవరనుకుంటారు? కాంగ్రెస్ లేకుంటే వీరివల్ల తెలంగాణ సాకారం అయ్యేదా? బిల్లు ఆమోదంలో టీఆర్ఎస్ పాత్ర ఏమాత్రం లేదని సోనియా కూడా స్పష్టం చేశారు. 2004 ఎన్నికల ప్రణాళికలోనే తెలంగాణ సాధన లక్ష్యాన్ని కాం గ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమనే నాడు టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 50 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 26 స్థానాల్లోనే గెలిచింది. 2009లో కాంగ్రెస్‌తో తెలంగాణ రాదని భావించిన ఆ పార్టీ మహా కూటమిగా ఏర్పడిన టీడీపీ, సీపీఐ, సీపీఐ పంచన చేరింది. అయినా 52 స్థానాల్లో పోటీ చేసి కేవలం 10 సీట్లే గెలిచింది. ఇది దేనికి ప్రతీక? ప్రజలు వారిని ఆదరించనే లేదు. తెలంగాణ సాకారమయ్యాక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల, మునిసిపాలిటీల ఎన్నికల్లో టీఆర్ఎస్కు, ఇతర పార్టీలకు కనీసం అభ్యర్థులు దొరకలేదంటే వారి గ్రాఫ్ పెరిగినట్టా, తగ్గినట్టా? పైగా టీఆర్ఎస్ ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చిన 20 మందికి, తెలంగాణను అడ్డుకున్న వాళ్లకు, తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చింది. మొదటి నుంచీ పార్టీలో ఉన్న వాళ్లకు మొండిచేయి చూపింది. ముస్లిం నేతలైన ఇబ్రహీం, రెహ్మాన్, దళిత నేతలు విజయరామారావు బయటకు పోయేలా చేసింది. గిరిజన నాయకుడు రవీంద్రనాయక్‌ను గెంటేశారు. బీసీ నాయకుడు దాసోజు శ్రవణ్, యాదగిరి, సురేందర్‌లను అనేక విధాలుగా అవమానపరిచారు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం కుటుంబ పెత్తనంగా మారింది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్, ఆ పీఠం తనకే కావాలని కలలు కంటున్నాడు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరనే అంశాన్ని పార్టీ ఇప్పుడే చెప్పడం లేదు. నేను సీఎం రేసులో ఉన్నానా, లేదా అనేది ఇప్పుడు అప్రస్తుతం. ఉన్నత స్థానంలో ఉన్నవారు ఎవరైనా సీఎం సీటు పట్ల ఆశ లేకుండా ఎలా ఉంటారు? టీడీపీ, బీజేపీ పొత్తును ఎవరూ విశ్వసించరు టీడీపీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసింది. బీజేపీదేమో తెలంగాణ ఇవ్వలేని పరిస్థితి. పార్లమెంటులో చివరిదాకా తటపటాయించింది. ఆ రెండు పార్టీలు అపవిత్ర పాత్ర పోషించాయి. టీడీపీని ఎవరూ నమ్మరు. వారిద్దరి పొత్తులను ఎవరూ విశ్వసించరు. మోడీ గాలి కేవలం హైప్. ఒకప్పుడు బీజేపీ అంటకాగి, అది తప్పని భావించి లెంపలేసుకున్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు అదే పార్టీతో పొత్తుకు వెళ్లడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలోకి రాలేనని తెలిసే చంద్రబాబు తెలంగాణలో బీసీ సీఎం అంటున్నారు. బీసీలపై బాబుకు నిజంగా ప్రేమే ఉంటే సీమాంధ్రలో బీసీని సీఎం చేస్తానని హామీ ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ బీసీల్లేరా? కనీసం బీసీని టీడీపీకి అధ్యక్షుడిగా ఎందుకు చేయలేకపోయారు? పవన్ క ల్యాణ్... ఎవరాయన? పవన్‌కల్యాణ్... ఎవరాయన? ఏ పార్టీ? విధానమేమిటి? అనుభవమేమిటి? బీజేపీ వంటి జాతీయ పార్టీకి పవన్ కల్యాణ్ వంటివారు లేకుంటే నడిచే పరిస్థితి లేకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. బీజేపీ అంత తక్కువ స్థాయిలో ఉందా అన్న అనుమానం వస్తోంది. బీజేపీ పవన్ వెంటబడటమే విచిత్రంగా ఉంది. వైఎస్ పథకాలు కొనసాగుతాయ్... నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్‌వే. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పెన్షన్ వంటి పథకాలు తెలంగాణ ప్రభుత్వంలోనూ కొనసాగుతాయి. వాటిని మరింత మెరుగు పరిచి అమలు చేస్తాం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పార్టీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అయితే అక్కడి ప్రజలకు ఎవరికి ఓటేయాలో తెలుసు. జయశంకర్ ట్రస్టు పెడతాం 1969లోనూ, ఇప్పుడూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలను ఆదుకుంటాం. ప్రొఫెసర్ జయశంకర్ స్మారక ట్రస్టు ఏర్పాటు చేసి ఇల్లు, ఉద్యోగం, పరిహారం, పెన్షన్ ఇస్తాం. ట్రస్టుకు రూ.100 కోట్లు కేటాయిస్తాం. హైదరాబాద్‌లో ఐదెకరాల్లో అమరవీరుల స్మృతివనం ఏర్పాటు చేస్తాం. ఓడిపోయే సీటును శంకరమ్మకా? అమరవీరుల కుటుంబీకులెవరూ మమ్మల్ని టికెట్లు అడగలేదు కాబట్టే ఇవ్వలేదు. అయినా వారికి ఏ పార్టీలు టికెట్లిచ్చాయి? శంకరమ్మకు హుజూర్నగర్ టికెటిచ్చి టీఆర్ఎస్ అవమానించింది. బలమైన కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నందున ఎటూ గెలవలేమనే కేసీఆర్ అలా చేశారు. ఆమె సొంత నియోజకవర్గం అడిగితే ‘ఛీ... పో’ అన్నారు. ‘సీసా లేదు... పైసా లేదు’ అంటూ అవహేళన చేశారు. అమరవీరులపై నిజంగా ప్రేమే ఉంటే సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లల్లో ఏదో ఒకటి ఎందుకివ్వలేదు? -
గ్రామాలే టార్గెట్
సాక్షి, ఖమ్మం: ఎన్నికల ప్రచారం పల్లెబాట పట్టింది. ప్రచారానికి ఇక ఏడు రోజులే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా గ్రామాలపై కన్నేశారు. పోటాపోటీగా ప్రచారం హోరెత్తిస్తుండడంతో పాటు ఎవరికివారు తమదైన శైలిలో.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే గ్రామాలు ఇప్పుడు అభ్యర్థులకు కీలకమయ్యాయి. అభ్యర్థులు పగలు బహిరంగంగా, రాత్రి తెరచాటు ప్రచారంతో ఓటర్లకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా ద్వితీయ శ్రేణి నేతలకు తాయిలాలు ప్రకటించడంతో వారంతా ఊత్సాహంతో పల్లెరాజ‘కీ’యంలో సమీకరణలను మార్చుతున్నారు. అంతేకాకుండా అభ్యర్థులు పల్లె ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆయా పార్టీల అగ్రనేతలను ప్రచారానికి రప్పిస్తున్నారు. జిల్లాలోని మేజర్ పంచాయతీలపైనే అన్ని పార్టీలు దృష్టి పెట్టి.. ప్రచారాన్ని విసృ్తతం చేస్తున్నాయి. ఈ వారం రోజులు తమ భవిష్యత్తును నిర్ణయించే ముఖ్య ఘట్టాలుగా భావిస్తున్న అభ్యర్థులు.. అగ్రనేతలతో పల్లె ప్రచారంతో కదం తొక్కుతున్నారు. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా వైఎస్సార్సీపీ, సీపీఎం అభ్యర్థుల విజయం కోసం జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ అభ్యర్థులు తమ అధినేత కేసీఆర్‌ను సభలకు రప్పించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంకా టీడీపీ తరఫున ప్రత్యేకంగా అగ్రనేతలు రాలేదు. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నామా నాగేశ్వరారవు ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో టీడీపీ బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కడి వారు అక్కడ ప్రచారం చేస్తున్నా.. ఇతర నియోజకవర్గాల్లోకి మాత్రం వారు అడుగు పెట్టడం లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం తాను పోటీ చేస్తున్న ఖమ్మం పార్లమెంట్ పరిధిలోనే ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన పలు గ్రామాలు తిరిగి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. అయితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. ఆ పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి రావాలని కోరుతున్నా ఆయన బిజీగా ఉన్నానని అంటున్నట్లు సమాచారం. హామీలే హామీలు.. గత ఎన్నికల్లో ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని హామీలిచ్చిన నేతలు మళ్లీ అవే హామీలను వల్లేవేస్తుండడం గమనార్హం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పట్టించుకోకుండా మళ్లీ ప్రజల వద్దకు వెళ్తుండడంతో.. ఆయా అభ్యర్థులకు ప్రజల నుంచి గత హామీలు ఏమయ్యాయని నిలదీతలు, నిరసనలు ఎదురవుతున్నాయి. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు తీర్చలేని హామీలు ఇస్తుండడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు. అధికారంలో ఉండి ఏం చేశారని కాంగ్రెస్ అభ్యర్థులను ప్రశ్నిస్తున్నారు. ‘నన్ను గెలిపిస్తే మీ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా’ అని ఏ గ్రామానికి వెళ్లినా హామీల వర్షం గుప్పిస్తున్న నేతలపై.. గతంలో హామీలిచ్చి, అవి తీర్చలేదని ప్రజలు మండిపడుతున్నారు. నజరానాలకు ఏర్పాట్లు.. పల్లె ఓటర్లను దృష్టిలో పెట్టుకొని అధికార, ప్రతిపక్ష పార్టీలు నజరానాలు ప్రకటించే ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం. నియోజకవర్గాల పరిధిలోని పట్టణాల్లో తమ ప్రచార సరళితో ఓటర్లు ఎటు వైపు ఉన్నారో తేలిపోవడంతో.. ఇక అభ్యర్థులంతా పల్లె ఓటర్ల నాడి పట్టుకునే ప్రయత్నాల్లో మునిగారు. గ్రామాల్లో ఒక పార్టీలో ఉన్న నేతలకు మరో పార్టీ వారు గుట్టుచప్పుడు కాకుండా ఎరవేస్తూ తమ నజరానాలకు అంగీకరిస్తే, గెలిచిన తర్వాత ‘నీ భవిష్యత్ బంగారుమయం చేస్తా’మని నమ్మబలుకుతుండడంతో గ్రామాల్లో రాజకీయం రసకందాయంగా మారింది. తమ ప్రచారం, అగ్రనేతల ప్రచారం ఎలా ఉన్నా.. ప్రధానంగా పోలింగ్‌కు రెండు రోజుల ముందే పల్లె రాజకీయం చక్రం తిప్పే యోచనలో అభ్యర్థులున్నారు. ఇప్పటికే పోటీ చేసి, ఓటమి చెందిన అభ్యర్థులు మాత్రం గతంలో పల్లెల్లో తాము ఎక్కడ దెబ్బతిన్నామో ఆ మూలాలు వెతికి.. ఆయా గ్రామాల్లో భారీ నజరానాలు ఇచ్చేందుకు కూడా వెనకాడడం లేదు. ఇలా అంతుపట్టని పల్లె ఓటర్ల నాడితో అభ్యర్థులు హైరానా పడుతున్నారు. -
నేడు తెలంగాణలో రాహుల్ ప్రచారం
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘ఎన్నికల ప్రచారం’ సోమవారం నుంచి ప్రారంభమవుతోంది. ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాహుల్‌గాంధీ సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం నిజామాబాద్ జిల్లా, డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు హాజరవుతారు. ప్రసంగం ముగిసిన వెంటనే తిరిగి శంషాబాద్ చేరుకుని ఢిల్లీకి ప్రయాణమవుతారు. 25న హైదరాబాద్‌లో రోడ్‌షో!: రాహుల్ ఈనెల 25న హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాహుల్ నుంచి సమాచారం రావడంతో నగరంలో ఏయే నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించాలనే అంశంపై టీపీసీసీ నేతలు షెడ్యూల్‌ను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. రాహుల్ 24న రాత్రి హైదరాబాద్‌కు వస్తారు. మర్నాడు నగరంలో మూడు నాలుగు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించి, నిజాం కళాశాల మైదానంలో జరిగే సభలో పాల్గొంటారు.