failure love story
-
నటితో క్రికెటర్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ
క్రికెట్ స్టేడియంలో ఆ బాట్స్మన్ బ్యాటింగ్ తీరుకి ప్రత్యర్థులు బెంబేలెత్తుతున్నారు.. గ్యాలరీలో ఉన్న స్వదేశీయులు జేజేలు పలుకుతున్నారు. వాళ్లల్లో ఒక హీరోయిన్ అయితే ఆనందంతో కేరింతలు కొడ్తోంది. ఆ ఆనందం ఆ బ్యాట్స్‌మన్‌కి మరింత ఉత్సాహాన్నిస్తోంది. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడల్లా ఆమె వంక చూస్తున్నాడు. అభినందనలను చప్పట్లతో మారుమోగిస్తోంది ఆమె. అతను.. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ.. బ్యాట్‌తో మెరుపుదాడి చేసి స్టేడియంలో బంతులను పరిగెత్తించే టైగర్.. ఆ హీరోయిన్.. షర్మిలా టాగోర్ .. కాదు. నాజూకు మేని.. అంతే నాజూకైన స్వరం... బ్రిటిష్ యాక్సెంట్ ఇంగ్లిష్ ప్రత్యేకతల సిమీ గరేవాల్. అవును.. షర్మిలాను జీవిత భాగస్వామిగా చేసుకునే కంటే ముందు పటౌడీ శ్వాస, ధ్యాస సిమీనే. ఆ ఫెయిల్యూర్ లవ్ స్టోరీనే ఈ వారం ‘మొహబ్బతే’. టైగర్ పటౌడీ పరిచయం అక్కర్లేని పర్సనాలిటీ. సిమీ అంతే పేమస్ బాలీవుడ్ ప్రేక్షకులకు. ‘సిద్ధార్థ’ సినిమాలో బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా కనిపించింది. ‘మేరా నామ్ జోకర్’, ‘చల్తే చల్తే’ వంటి సినిమాలతో మెప్పించింది. జాతీయ అంతర్జాతీయ సెలబ్రెటీలను కూర్చోబెట్టి మాటల్లో పెట్టి వాళ్ల జీవిత కథను (‘రెండవూ విత్ సిమీ గరేవాల్’ అనే టాక్ షోలో) వినిపిస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అనీ నిరూపించుకుంది. పుట్టింది లుధియానా (పంజాబ్)లో, పెరిగింది ఇంగ్లాండ్‌లో. సిమీ సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదు. నిరాహార దీక్ష చేసి పెద్దవాళ్ల చేత ‘ఎస్’ చెప్పించుకుంది. సిమీకి శ్వేత వర్ణం అంటే ఇష్టం. ఎక్కువగా ఆ రంగు దుస్తులనే వేసుకుంటుంది తన టాక్ షో అయినా.. సినిమా వేడుక అయినా. అందుకే ఆమెను ‘ది లేడీ ఇన్ వైట్’ అని పిలుస్తారు సినిమా రంగంలోని వాళ్లు. (చదవండి: ఆ హీరో ఇద్దరితో ప్రేమలో పడ్డాడు.. కానీ!) ఫస్ట్ లవ్.. తన పదిహేడేళ్ల వయసులో ఇంగ్లాండ్‌లో వాళ్లింటి పక్కనే ఉంటూండే జమ్నాగర్ మహారాజుతో ప్రేమలో పడింది. అతని వల్లే బయటి ప్రపంచం తెలిసింది అనీ చెప్పింది సిమి ఒక ఇంటర్వ్యూలో. మూడేళ్లు సాగిన ఆ బంధం బ్రేక్ అయింది. సినిమాలతో సివీమ బిజీగా ఉన్న సమయంలో ఒక పార్టీలో పటౌడీ పరిచయం అయ్యాడు. ఆటలు, ఇంగ్లిష్ కల్చర్ అంటే ఆ ఇద్దరికీ ఉన్న ఆసక్తి వాళ్లిద్దర్నీ స్నేహితులుగా మార్చింది. సిమీ ధైర్యం, నొప్పించకుండా ఉండే మాట తీరుకు ఆకర్షితుడై.. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు పటౌడీ. నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండే అతని తీరునూ సిమీ ఇష్టపడింది. ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఉన్నా.. ఏ సినిమా వేడుకకైనా జంటగా వచ్చేవాళ్లిద్దరూ. క్రికెట్, సినిమా పరివారానికంతటికీ తెలిసిపోయింది వీళ్లిద్దరూ ప్రేమ పక్షులని. గ్యాలరీలో సిమీ కేరింతల కోసం పిచ్ మీద నుంచి ఆశగా చూసేవాడు పటౌడీ. ఆలంబనగా చేతులు చాచేది సిమీ. అంతే ఆమెను చూస్తూనే వచ్చే బంతిని బౌండరీ దాటించేవాడని చెప్తారు ఈ ఇద్దరి సన్నిహితులు. అందుకే ఆ రెండు రంగాల వాళ్లు వీళ్ల పెళ్లి పత్రిక కోసం ఎదురు చూడసాగారు. పటౌడీ కూడా వాళ్లింట్లో వాళ్లకు సిమీ గురించి చెప్పేసి ఆమెతో పెళ్లి నిశ్చయం చేసుకోవాలనే శుభ ఘడియ కోసం ఆగాడు. ఈలోపు.. ఏదో సందర్భంలో షర్మిలా కలిసింది పటౌడీని. తొలి చూపులోనే ఆమె రూపం అతని మనసులో ముద్ర పడిపోయింది. ఈసారి తాను సందర్భం కల్పించుకొని షర్మిలాను కలిశాడు. పటౌడీని ఇష్టపడింది ఆమె. అతనికీ ఇష్టం ఉంది. కాని ఇంకా సందిగ్ధంలో ఉన్నాడు. జీవితభాగస్వామిగా షర్మిలా చేయే పట్టుకోవాలనే నిశ్చయించుకున్నాడు కాని సిమీతో ఉన్న బంధం అతణ్ణి కన్ఫ్యూజన్లో పెట్టింది. అయినా ఏ కొంచెం సమయం చిక్కినా షర్మిలాతోనే సమయం వెచ్చించసాగాడు. ఆ స్నేహ సంభాషణలతో కన్ఫ్యూజన్ పోయి స్పష్టత వచ్చేసింది. ఒకరోజు సాయంకాలం.. సిమీ వాళ్లింటి కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసింది సిమీ. ఎదురుగా పటౌడీ. ఎప్పటిలా నవ్వుతూ ఆప్యాయంగా ఆహ్వానించింది ఆమె. ఇబ్బందిగానే హాల్లోకి వెళ్లి కూర్చున్నాడు. ‘లెమనేడ్ ఇష్టం కదా మీకు? తీసుకొస్తా’ అంటూ కిచెన్‌లోకి వెళ్లబోతుంటే ‘ఇప్పుడేం వద్దు. నీతో మాట్లాడాలి అంతే’ అన్నాడు పటౌడీ. ‘లెమనేడ్ తాగుతూ కూడా మాట్లాడొచ్చు కదా’ అని నవ్వుతూ వంటింట్లోకి వెళ్లి లెమనేడ్ తెచ్చి పటౌడీ చేతికిచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది సిమి. ‘ఇప్పుడు చెప్పండి’ అన్నట్టుగా. చేతిలో ఉన్న గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ అన్నాడు పటౌడీ ‘సిమీ.. ఇట్స్ ఓవర్’ అని. కనుబొమలు పైకి స్ట్రెచ్ చేస్తూ చూసింది ఆమె ‘ఏంటీ?’ అన్నట్టుగా. ‘యెస్.. నేను షర్మిలాను ఇష్టపడ్తున్నాను. తననే పెళ్లిచేసుకుంటున్నాను. ఇంక మనమధ్య.. ’ అని ఆగాడు. నవ్వుతూనే నిట్టూర్చుంది సిమీ. ‘ఐయామ్ సారీ సిమీ’ అన్నాడు పటౌడీ ఆమె కళ్లలోకి చూస్తూ. అదే నవ్వు ఆమె పెదవుల మీద. కాని ఆ కళ్లల్లో కనిపించిన నీటి పొర పటౌడీ దృష్టిని తప్పించుకోలేదు. అక్కడ ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. ‘బై’ అంటూ లేచాడు. తనూ లేచింది ఎప్పటిలాగే లిఫ్ట్ దాకా పటౌడీని సాగనంపడానికి. వద్దంటూ ఒక్కతీరుగా వారించాడు. అయినా వినకుండా అతని వెంటే వెళ్లింది. లిఫ్ట్ దగ్గర.. పటౌడీ కోసం ఎదురుచూస్తూ నిలబడ్డ షర్మిలా కనిపించింది సిమీకి. ఊహించని దృశ్యానికి షర్మిలా ఇబ్బంది పడింది. ఈ లోపు లిఫ్ట్ వచ్చింది. షర్మిలా, వెనకాలే పటౌడీ.. లిఫ్ట్‌లో వెళ్లిపోయారు. ఒంటరి అయిపోయింది సిమీ. తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీకి చెందిన రవి మోహన్ అనే వ్యాపారవేత్తను సిమీ పెళ్లి చేసుకుంది. కాని ఆ పెళ్లి ఎంతో కాలం నిలువలేదు. ఒంటరిగానే జీవనయానం సాగిస్తోంది సిమీ. - ఎస్సార్ -
నా వల్లే తను చనిపోయింది.
ఈ ప్రపంచాన్ని అందులో ఉన్న మనుషులను నడిపిస్తుంది రెండే రెండు అక్షరాల రెండు పదాలు. అందులో మొదటి రెండు అక్షరాల పదం డబ్బు అయితే... రెండోది ప్రేమ. డబ్బు లేకుండా ఏ మనిషి బ్రతక లేడు. కానీ ప్రేమ లేకుండా ఏ మనిషికి జీవం లేదు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి మనిషి డబ్బుకోసం మాత్రమే బ్రతుకుతున్నాడు. ప్రేమ ఉన్నా లేకున్నా డబ్బు ఉంటే చాలు జీవితాంతం సంతోషంగా బ్రతికేయ్యొచ్చు అనే ఆలోచనలతోనే ఉంటున్నాడు. డబ్బు మాయలో పడి, డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలతో నిజమైన ప్రేమని కూడా అబద్దంగా మార్చేస్తున్నాడు. నిజానికి ప్రేమ గొప్పదా ...? డబ్బు గొప్పదా...? అనే ప్రశ్నకి జవాబు మాత్రం దొరకడం లేదు. ఇలాంటి చిక్కు ప్రశ్న కి సమాధానం వెతుక్కోవాల్సి న రోజూ వస్తుంది అని ఎవరం అనుకోం కదా ! కాని నా జీవితం లో అలాంటి రోజు ఒకటి వచ్చింది. ఆ క్షణం నేను తీసుకున్న నిర్ణయం నా జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు నేను ఆ ప్రశ్న కి సమాధానాన్ని , నేను ఎదుర్కొన్న సంఘటనని మీకు చెప్పబోతున్నాను. నా పేరు అరుణ్. మాది ఒక బీద కుటుంబం. నేను , అమ్మ , నాన్న ఉండేవాళ్ళం. నా తల్లిదండ్రులు రోజూ వారి కూలి చేసి దానితో వచ్చిన డబ్బుతో ఇల్లు గడిపేవాళ్ళం. ఒక్క రోజు కూలీ కి వెళ్లకుంటే ఆ రోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లదండ్రులు పస్తులు ఉంటూ మరీ కూలీతో వచ్చిన డబ్బులతో నన్ను బడికి పంపించి చదువించేవారు. వాళ్ళు ప్రతి రోజు నాకు ఒకటే మాట చెప్పేవారు... నువ్వు మంచిగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి మంచి స్థాయిలో ఉండాలి అని. వాళ్ళలా నేను కూలీ పని చేసుకోకూడదు అని , బాగా కష్ట పడి చదివి బాగా డబ్బులు సంపాదించాలని వాళ్ళ కోరిక. నేను నా తల్లిదండ్రుల కష్టం చూడలేక బాగా చదువుకుని ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుని ప్రతి రోజూ పాఠశాలకి వెళ్తూ మంచిగా చదువుకుంటూ నా ఎం. బి. ఎ నీ మొదటి తరగతిలో పూర్తిచేశాను. తర్వాత నా మార్కులను , నాలోని నైపుణ్యాలను చూసి ఒక పెద్ద కంపెనీ వాళ్ళు నాకు వాళ్ళ కంపెనీ లో పని చేసేందుకు అవకాశం ఇచ్చారు. నేను ఎంతో సంతోషంగా వెళ్లి నా తల్లిదండ్రలకు ఈ విషయం చెప్పాను, వాళ్ళు ఎంతో సంతోషించారు. ఇక నేను ఆ కంపెనీకి వెళ్లి పని చెయ్యడం ప్రారంభించాను. అలా నా జీవితంలో సంపాదన ప్రారంభం అయింది. నేను అనుకున్నట్టుగానే బాగా సంపాదించడం ప్రారంభించాను. నేను పని చేస్తున్న కంపెనీ లోనే ప్రమోషన్లు పొందుతూ బాగా సంపాదిస్తూ నా తల్లిదండ్రులు అనుకున్నట్టుగానే ఉన్నత స్థాయికి ఎదిగాను. ఇలా సంపాదనలో మునిగి తేలుతున్న నా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ మలుపుకి కారణం ఒక అమ్మాయి. ఆ అమ్మాయి రాక నన్ను నా జీవితాన్ని మొత్తం మార్చేసింది. డబ్బు పిచ్చితో బ్రతుకుతున్న నా జీవితానికి ప్రేమని పరిచయం చేసి , ప్రేమ లోతుల్ని అర్థం అయ్యేలా చేసిన ఆ అమ్మాయి పేరు దీప్తి. తను నేను పనిచేసే కంపెనీలోన నా సహోద్యోగి. నేను కంపెనీలో చేరిన మొదట్లో పని విషయంలో నాకు ఎలాంటి సందేహం ఉన్న తీర్చేది. ఒక్కోసారి నా పని కూడా తనే చేసేది. అలా అలా మా ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. తను మొదటి నుండి నాపై ఎక్కువగా జాగ్రత్త , ప్రేమ , అభిమానాలు చూపించేది. ఇక అలా తను చూపించే ప్రేమాభిమానాలకి నేను ముగ్ధుడిని అయ్యాను. నాకు తెలియకుండానే నేను తనతో ప్రేమలో పడిపోయాను. అలా అలా మా పరిచయం కాస్తా ప్రేమగా, సన్నిహితులం కాస్తా ప్రేమికులుగా మారిపోయాం. ఒకే కంపెనీ కావడంతో మా ప్రేమకి ఎలాంటి అడ్దంకులు , ఇబ్బందులు ఉండేవి కావు. దీప్తి మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పింది. నన్ను మా ఇంట్లో చెప్పి ఒప్పించమంది. సరే అని నేను చెప్పబోయాను . కానీ అంతలోనే సిటీలోనే అతి పెద్ద కంపెనీకి ఓనరు వచ్చి నా నైపుణ్యాలను , సామర్థ్యాల ను చూసి నన్ను వాళ్ళ కంపెనీలో చేరమని చెప్పడానికి వచ్చారు . అంతే కాకుండా నన్ను తన కూతురికి ఇచ్చి పెళ్లి చేసి ఆ కంపెనీని కూడా నా సొంతం చేస్తాను అని అన్నాడు. ఇక నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు , బాగా ఆలోచించాను ఇంత డబ్బు దానితో పాటు అమ్మాయి వస్తుంది అంటే ఏ అబ్బాయి అయినా ఎందుకు కాదు అంటాడు. పైగా నాకు ఉన్న డబ్బు పిచ్చితో ప్రేమ కావాలా...? డబ్బు కావాలా...?అంటే డబ్బే కావాలి అని నేను దానికి ఒప్పుకున్నాను. ఈ విషయం తెలుసుకున్న దీప్తి ఏకంగా మా ఇంటికే వచ్చి నా తల్లిదండ్రులకు జరిగింది అంతా చెప్పి ,,," ఛీ!!! నువ్వు ఇలాంటి వాడివి అని అనుకోలేదు. నీకు డబ్బు అంటే ఇంత పిచ్చి ఉంది. నువ్వు డబ్బుకోసం ఏం అయినా చేస్తావ్ , ఎంతకైనా దిగజారుతావు అని నాకు ఇన్ని రోజులలో తెలియలేదు , తెలిసుంటే నీలాంటి వాడిని అస్సలు ప్రేమించేదానినే కాదు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను నా ప్రేమని కాదని వెళ్ళావో ఏదో ఒక రోజు నువ్వు నీ డబ్బు తప్ప నీకంటూ నిన్ను ప్రేమించే వాళ్ళు, నిన్ను చూసుకునేవారు ఎవరు ఉండరు. ఏ డబ్బు కోసం అయితే నువ్వు నన్ను మోసం చేశావో అదే డబ్బు మాయలో పడి నువ్వు తప్పకుండా మోసపోతావు" అని నన్ను తిట్టి....బోరుమని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోయింది. ఇదంతా చూసిన నా తల్లిదండ్రులు ఎంతో బాధ పడుతూ " నువ్వు ఇంత బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఇంత సంపాదిస్తుంటే నా కొడుకు అని ఎంతో సంతోషంగా గర్వంగా చెప్పుకుని తిరిగాం... కానీ నువ్వు ఇంత నీచుడివని, డబ్బు కోసం ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీ వదులుకున్నావు, నీలాంటి కొడుకు మాకు పుట్టకున్న బాగుండు అనిపిస్తుందన్నారు. దీప్తి మాటలు , నా తల్లిదండ్రుల మాటలు విన్నాక నాపై నాకే అసహ్యం వేసింది. నేను చేసిన తప్పు ఏంటో బాగా తెలిసొచ్చింది. ఇక వెంటనే ఆలస్యం చెయ్యకుండా దీప్తి దగ్గరకి వెళ్ళాను. కానీ.... నేను వెళ్ళే సరికి దీప్తి లేదు తన శవం మాత్రం ఉంది. నన్ను తిట్టి అక్కడి నుండి ఎంతో బాధతో ఇంటికి వెళ్తున్న దీప్తినీ ఒక లారీ వచ్చి గుద్దడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆ వార్త విని ఒక్కసారిగా నేను షాక్ అయ్యాను . ఏమి చెయ్యలేక పిచ్చి వాడిలా దీప్తి పై పడి నువ్వు , నీ ప్రేమ నాకు కావాలి అని గుండెలు పగిలేలా ఏడ్చాను . కానీ ఏమి లాభం బ్రతికుండగా వద్దు అని చనిపోయాక కావాలి అంటే ఏదీ రాదు కదా..!! నాకున్న నా డబ్బు పిచ్చే దీప్తి చావు కి కారణం అయింది. డబ్బే లోకం అనుకునే నన్ను తన లోకంగా భావించి, ప్రేమించిన దీప్తి నీ దూరం చేసుకునీ ,,, చివరకి తప్పు తెలుసుకుని తను తన ప్రేమ కావాలని వెళ్తే అందనంత దూరంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళింది నా దీప్తి. తను లేని లోటు తీరనిది. తను చనిపోయాక దీప్తినే తల్చుకుంటూ , నేను చేసిన తప్పుకి బాధ పడుతూ నా తల్లిదండ్రులు చెప్పింది వింటు ఈ ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. నా ఈ జీవితానికి నేనే విలన్ . డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అనుకున్నాను కానీ దానికంటే విలువైంది మరొకటి ఉంది అదే ప్రేమ అని తెలుసుకోలేక పోయాను. నేను డబ్బు కావాలా? ప్రేమ కావాలా ? అన్నప్పుడు నాకు ప్రేమే కావాలి అని అనుంటే ఈ రోజు నా జీవితం దీప్తి తో చాలా అద్భుతంగా ఉండేది. నా జీవితం నాకు నేర్పింది ఏంటంటే డబ్బు కన్న ప్రేమే గొప్పది . ఎందుకంటే డబ్బుతో ప్రపంచం నడుస్తుండొచ్చు కానీ మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రేమ కావాలి ""మనం పుట్టినప్పుడు మనల్ని జాగ్రత్త గా చూసుకునే "అమ్మ ప్రేమ" పెరుగుతూ ఉన్నప్పుడు మనల్ని నడిపించే "నాన్న ప్రేమ" సరదాగా ఆనందించే సమయంలో "మిత్రుల ప్రేమ" పెళ్లి అయ్యాక "భార్య/ భర్త ప్రేమ" ముసలి వాళ్ళం అయ్యాక "పిల్లల ప్రేమ" . ఇక్కడ ప్రేమించే విధానం , ప్రేమించే వ్యక్తులు వేరు కావచ్చు కానీ , ప్రేమ మాత్రం ఒక్కటే ,,,,అదే శాశ్వతం. డబ్బు ప్రతి ఒక్కరీ దగ్గరా ఉంటుంది కానీ ప్రేమ మాత్రం కొందరికే దక్కుతుంది. మన జీవితం లో ఒక్క నిమిషంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని ఊహించలేని మలుపు తిప్పుతాయి. కాబట్టి ఆ ఒక్క నిమిషం ఆలోచించి నిర్ణయం తీసుకుందాం, ప్రేమ బాటకై అడుగేద్దాం ఇట్లు ఈ విషాద గాథకి విలన్ అరుణ్ (హైదరాబాద్). -
వారంలో పెళ్లి... అంతలోనే!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం ఊహించలేము. తలచినదే జరిగినదా దైవం ఎందులకు అన్నట్లుగా మనం ఎన్ని చేద్దాం అనుకున్నా జరిగేది ఆపలేము. ఇది నా జీవితం నాకు నేర్పిన పాఠం. మాది చాలా రిచ్ ఫ్యామిలీ. నేను కోరుకున్నది అప్పటి వరకు అన్ని దక్కాయి. ఓడిపోవడం అంటే ఏంటో నాకు తెలియదు. మా అమ్మనాన్నలకు నేనొక్కడినే. నా పేరు అభి. నన్ను ఎంతో గారాబంగా పెంచారు. నేను అడగకుండానే అన్ని ఇచ్చారు. ఏది అడిగిన ఎప్పుడు కాదనలేదు. నేను మా కాలేజీ డేస్‌లో ఒక అమ్మాయిని ప్రేమించాను. తన పేరు సరిత. చాలా మంచిది. మానవత్వం ఎక్కువ. ఎప్పుడూ ఏదో ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. చిన్న వయస్సులోనే ఇలా ఉండటం చూసి నాకు చాలా బాగా నచ్చింది. నాతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేది. ఒకరోజు తనకి నా ప్రేమ విషయం చెప్పాను. తను కొన్ని రోజులు తరువాత నాకు ఒకే చెప్పింది. వాళ్ల ఇంట్లో ఒప్పుకుంటే నన్ను చేసుకోవడానికి తనకి ఎలాంటి ప్రాబ్లెమ్ లేదని చెప్పింది. నేను మా ఇంట్లో విషయం చెప్పాను. ఎప్పటిలాగానే వాళ్లు నా ఇష్టానికి అడ్డుచెప్పలేదు. వాళ్లే వెళ్లి సరిత వాళ్ల ఇంట్లో మాట్లాడారు. కులాలు వేరు కావడంతో మొదట వాళ్లు ఒప్పుకోకపోయిన తరువాత అంగీకరించారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్‌గా చేసుకున్నాం. పెళ్లి పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. పెళ్లి ఇంకో వారం ఉందనగా అనుకోని ఘటన జరిగింది. సరిత యాక్సిడెంట్లో చనిపోయింది. రెండు కుటుంబాలలో విషాదం అలముకుంది. నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నా బాధ చూడలేక మా అమ్మ ఆరోగ్యం కూడా పాడైంది. నేను ఆ బాధలో నుంచి బయటపడటానికి రెండు సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ సరిత రోజు గుర్తుకొస్తూనే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్న ఏదీ జరగాలనుంటే అదే జరుగుతుందని అర్థం అయ్యింది. మా ఇంట్లో వాళ్లు నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. నేను మాత్రం సరిత ఆలోచనల్లో నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేకపోతున్నాను. తన స్థానంలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నాను. అభి, కృష్ణా జిల్లా. -
అంతా బాగున్న సమయంలో అలా జరిగింది!
నా పేరు వినయ్. నాది చాలా హ్యాపీ లైఫ్. అన్ని ఉన్నాయి నాకు. మంచి అమ్మనాన్న, అల్లరి చేసే చెల్లి, ప్రేమగా చూసుకునే నాన్నమ్మ, తాతయ్య అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు. చాలా ఆనందంగా ఉండేది మా లైఫ్. అంతా మంచిగా ఉంటుంది అనుకున్న సమయంలో మా అమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. అంతా ఒక్కసారిగా తలకిందులై పోయింది. మా ఇంట్లో నవ్వులు మాయమయ్యాయి. మా నాన్న ఇష్టం లేకపోయిన రెండో పెళ్లి చేసుకోవల్సి వచ్చింది. మా చెల్లి చాలా చిన్నపిల్ల. తనకోసమే మా నాన్న మా పిన్నిని చేసుకున్నారు. ఇంకా మాకు కష్టాలు మొదలయ్యాయి. రోజు ఏదో ఒక గొడవ. ఇంట్లో ఉండాలంటేనే చిరాకు వేసేది. నేను ఇంటర్ అయిపోయి బీటెక్‌లో జాయిన్ అయ్యాను. ఎవ్వరితో మాట్లాడేవాడిని కాదు. చాలా సైలెంట్‌గా ఉండేవాడ్ని. అప్పుడే నా లైఫ్‌లోకి నందు వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ పక్క వారిని నవ్విస్తూ ఉండేది. తను నా దగ్గరకు కూడా వచ్చి ఎందుకు బాబు ఎప్పుడు మొహం ఉమ్మ్...అని పెట్టుకొని ఉంటావు అంది. నాకు కోపం వచ్చి నువ్వు ఎవరివే నన్ను అడగడానికి పో ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాను. అంతే తన కంట్లో నుంచి నీళ్లు ధారలా కారిపోయాయి. తను ఎప్పుడు ఏడవడం నేను చూడలేదు. నాకే చాలా బాధ వేసింది. తరువాత కొద్దిసేపటికి నేనే వెళ్లి సారీ చెప్పాను. నందు చాలా మంచిది వెంటనే క్షమించేసింది. అప్పటి నుంచి తనతో మాట్లాడటం మొదలు పెట్టాను. చాలా చక్కగా మాట్లాడేది. మా ఇంట్లో విషయాలు తనతో చెప్పాను చాలా బాధపడింది. నన్ను చాలా ప్రేమగా చూసుకునేది. నా కోసం స్పెషల్‌గా బాక్స్ తెచ్చేది. మేమిద్దరం చాలా క్లోజ్ అయిపోయాం. మళ్లీ నా లైఫ్‌లోకి హ్యాపీ డేస్ వచ్చాయి అనిపించింది. తను లేకుండా నేను ఉండలేకపోయేవాడ్ని. అందుకే తనకు ఒకరోజు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లైఫ్ లాంగ్ మా అమ్మను ఎంత ప్రేమిస్తానో అంత ప్రేమిస్తాను అని చెప్పాను. తను కూడా ఒక వారం టైం తీసుకొని మా ఇంట్లో ఒప్పిస్తే పెళ్లి చేసుకుంటాను అంది. మా ఇద్దరి కాస్ట్‌లు వేరు. అయినా నేను చదువు అయిపోయిన వెంటనే మంచి జాబ్ తెచ్చుకొని వాళ్ల ఇంట్లో ఒప్పించాను. మా నా జీవితంలోకి సంతోషం వచ్చింది. నందు, నేను, మా చెల్లి ముగ్గురం కలిసి ఉంటున్నాం. మా చెల్లిని కూడా నందు అమ్మలా చూసుకుంటుంది. నా నందు దొరకడం నా అదృష్టం. ఐ లవ్ యూ సో మచ్ నందు. వినయ్ కర్నూలు. -
ఎన్నోసార్లు అడిగింది కానీ....
మాది అందమైన ఊరు. చుట్టూ పచ్చని పొలాలు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే కల్మషం లేని మనుషులు. నేను ఇంటర్ వరకు మా ఊరిలోనే చదివాను. చాలా హ్యాపీగా గడిచిపోయేది జీవితం. తరువాత బీటెక్ చదవడం కోసం నేను హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ వాళ్లను చూస్తేనే భయమేసేది. ఎవ్వరూ నాలా లేరు. అందరూ చాలా స్టైల్‌గా ఉన్నారు.వాళ్లందరూ మంచి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉండేవారు. నేను క్లాస్‌లో జాయిన్ అయిన రోజే నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఫస్ట్ టైమ్ తనని ఎల్లో కలర్ డ్రెస్‌లో చూశాను. తన జుట్టు రింగులు రింగులుగా ముఖం మీద పడుతూ ఉండేది. చాలా అందంగా ఉండేది. తనని అలా చూస్తూ ఉండాలనిపించేది. తను రాగానే ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంది. చాలా సైలెంట్‌గా ఉండేది.అందరు పేర్లు చెప్పి పరిచయం చేసుకుంటుంటే తన పేరు చందు అని తెలిసింది. తను ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదు. తనతో మాట్లాడం ఎలా అని ఆలోచించేవాడిని. క్లాస్‌లో ఎప్పుడు ఏ కార్యక్రమ జరిగిన తను ముందుండేది. ఇంగ్లీష్‌లో టకటక మాట్లాడేది. అది చూస్తేనే నా గుండె దడదడ అనేది. తనతో ఎలా అయిన ఫ్రెండ్షిప్ చేయాలి అని ఆలోచించే సమయంలో తను మా ఫ్రెండ్ వాళ్ల లవర్ రూమ్మేట్ అని తెలిసింది. ఇంకా నా లైన్ క్లియర్ అయ్యింది అనుకున్నాను. మా ఫ్రెండ్‌కు చెబితే కావాలని మేం ఇద్దరం కలిసేలా ప్లాన్ చేశారు. మేం కలిసిన తరువాత తను అడిగిన ప్రశ్న విని నేను షాక్ అయ్యాను. నువ్వు మా క్లాస్యేనా? నిన్ను ఎప్పుడూ చూడలేదే నీ పేరు ఏంటి అని అడిగింది. అప్పుడు నన్ను నేనే ఎన్ని తిట్టుకున్నానో తెలియదు. తరువాత నుంచి రోజు క్లాస్‌లో చూసి నవ్వేది. అప్పుడప్పుడు కొంచెం కొంచెం మాట్లాడేది. తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది. ఆమెతో నాతో మాత్రమే మాట్లాడేది. నా నెంబర్, తన నెంబర్ పక్కపక్కనే ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగిన తన వెనకాలే నేను ఉండేవాడిని. తను మాత్రం కొంచెం కూడా కాపీ కొట్టనిచ్చేది కాదు. అలా కొన్ని రోజులు గడిచాక నేను,చందు, చందు వాళ్ల ఫ్రెండ్ బాగా క్లోజ్ అయిపోయాం. రోజు కలిసి క్యాంటీన్‌కి వెళ్లి తిని రచ్చ రచ్చ చేసేవాళ్లం. అందరు మమ్మల్ని చూసి మా లాగా ఉండాలి అనుకునే వాళ్లు. అలాగే చాలా మంది చందు నాకు ఓకే చెప్పేసింది, మేమిద్దరం లవర్స్ అనుకునేవాళ్లు. వాళ్ల మాటలన్ని విని తను చాలా సార్లు నేనుంటే నీకిష్టమా? ఎందుకు అందరూ ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడిగేది. తను అంటే ఇష్టం ఉన్ననిజం చెబితే తను ఎక్కడ దూరం అవుతుందో అని అదేం లేదు, చాలా మంది చాలా అనుకుంటారు వదిలేయ్ అని చెప్పేవాడ్ని. మా ఫైనల్ ఇయర్లో తనకు మా ప్రేమ విషయం చెబుదాం అనుకున్నాను. కానీ ఇంతలో తను నాకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. తను వేరు అతనితో ప్రేమలో పడింది అని. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. నేనేం మాట్లాడకుండా సరే అని అన్నాను. తరువాత నాకేమైందో తెలియదు ఆరోజు రాత్రి తనని ఫోన్ చేసి అసలు నువ్వు వాడిని ఎందుకు లవ్ చేశావ్. వాడు నీకు సెట్ కాడు. మీరు విడిపోతారు అని ఇష్టం వచ్చినట్లు తిట్టేశాను. తనని చాలా బాధ పెట్టాను. అప్పటి నుంచి తను నాతో మాట్లాడటం మానేసింది. నిన్ను చాలా సార్లు అడిగాను అప్పుడు ఏం చెప్పలేదు. ఎప్పుడు ఇలా మాట్లాడతావనుకోలేదు అని చెప్పింది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు. నన్ను చూడలేదు. మా కాలేజ్ అయిపోయి నాలుగు సంవత్సరాలు ఇప్పటి వరకు తను ఎలా ఉందో ఏం చేస్తుందో కూడా నాకు తెలియదు. ఒక్కసారి తనకి సారీ అని మనస్ఫూర్తిగా చెప్పాలనుంది. ఇట్లు అరవింద్‌కుమార్ కరీంనగర్ -
అతనికి లవర్ ఉందని తెలిసినా....?
నా పేరు కావ్య. నేను ఇంటర్వ్యూ కోసం ఒక ఆఫీస్‌కు వెళ్లాను. ఆ ఆఫీస్ చూడటానికి చాలా బాగుంది. అంత పెద్ద బిల్డింగ్‌ను చూడగానే భయపడుతూనే లోపలికి వెళ్లాను. రిసెస్ఫన్లో కుర్చున్నాను. ఇంటర్వ్యూ కోసం లోపలికి పిలవడానికి చాలా సేపే పట్టింది. నేను ఒక సోఫాలో కూర్చొని వచ్చే పోయే వాళ్లను గమనిస్తూ ఉన్నాను. అప్పుడే ఫస్ట్ టైం తనని చూశాను. చూడటానికి చాలా పొడవుగా, ఆకర్షణీయంగా ఉన్నాడు. అప్పటి వరకు ఎవరిని చూసినా నాకు అంతలా నచ్చలేదు. వచ్చిన ఇంటర్య్వూ గురించి కాకుండా నా ఆలోచనలన్ని అతని చుట్టే తిరుగుతున్నాయి. ఈ ఉద్యోగం వస్తే అతనిని కలవచ్చు అనుకున్నాను. అసలు అతను ఎవరో కూడా తెలియదు. కానీ ఎందుకో నన్ను కట్టిపడేసేలా ఉన్నాడు. అందమైన అమ్మాయిని చూడగానే అబ్బాయిలు కవిత్వాలు ఎలా చెబుతారా అనుకునే దాన్ని. తనని చూశాక నచ్చిన వాళ్లు కనబడితే కవితలు, పాటలు అలాగే వస్తాయి అని అర్థం అయ్యింది. ఇంటర్వ్యూ బాగానే జరిగింది. ఇంటికి వెళ్లిపోయాక కూడా ఎందుకో తనే కనబడుతున్నట్లు ఉంది. ఒక రెండు మూడు రోజుల్లోనే ఆ ఆఫీస్ నుంచి సెలెక్ట్ అయినట్లు ఫోన్ వచ్చింది. ఎగిరిగంతేశాను. ఉద్యోగం వచ్చింది అన్న ఆనందం కన్నా అతన్ని చూస్తాను అన్న ఆనందమే ఎక్కువగా ఉంది. నేను జాయిన్ అయిన రెండు మూడు రోజుల దాకా అతను కనిపించలేదు. తరువాత ఒక రోజు మా డిపార్ట్మెంట్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు మళ్లీ అనుకోకుండా తనని చూశాను. తన పేరు ఏంటో, ఏ డిపార్ట్మెంటో తెలుసుకోవాలనిపించింది. నా కోలింగ్కు నేను అతనిని ఇష్టపడుతున్న విషయం చెప్పాను. అతని పేరు కాంత్ అని చెప్పాడు. రోజు లంచ్ టైమ్‌లో అతనిని చూసేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ అతనిని చూడగానే నన్ను ఆట పట్టించే వారు. ఒక్కరోజు తనని చూడకపోయిన చాలా బాధగా అనిపించేది. నేను తనని చూస్తున్న అన్న విషయం తనకి కూడా తెలుసు. నన్ను చూడగానే వాళ్ల ఫ్రెండ్స్ కూడా తనని ఏడిపించేవారు. కాంత్‌తో మాట్లాడాలని చాలా సార్లు ట్రై చేశాను. కానీ ధైర్యం చాలలేదు. ఒకరోజు తనకి లవర్ ఉంది అనే విషయం తెలిసింది. చాలా ఏడుపొచ్చింది. కానీ తను వస్తే మాత్రం చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అనుకోకుండా ఒక రోజు తను ఆఫీస్ మానేసి వేరే జాబ్‌లో జాయిన్ అయ్యాడని తెలిసింది. అప్పటి నుంచి ఎప్పుడు లంచ్ చేయడానికి క్యాంటీన్‌కు వెళ్లిన తనే గుర్తుకు వస్తాడు. తనని చాలా మిస్ అవుతున్నాను. ఇట్లు కావ్య(హైదరాబాద్) -
నేను దుబాయ్‌కు వెళ్లే రెండు రోజుల ముందు!
నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా పెద్దబాపు కొడుకు దుబాయ్ నుంచి వచ్చాడు. తన వాళ్ల ఫ్రెండ్స్ అందరి కోసం గిఫ్ట్‌లు తీసుకువచ్చాడు. అవి వాళ్లకు ఇవ్వడానికి నేను కూడా తనతోపాటు వెళ్లాను. అక్కడే నేను మొదటిసారి ఆమెను చూశాను. తనని చూడగానే తను నాకు బాగా నచ్చింది. మాట్లాదాం అనుకున్నాను కానీ కుదరలేదు. మేం ఇంటికి తిరిగి వచ్చేశాం. తరువాత మళ్లీ వాళ్ల బంధువుల పెళ్లి అయితే వెళ్లాం. నేను తనని చూస్తూ ఉండిపోయాను. తనతో ఒక్కసారి మాట్లాడాను. తరువాత మా పెద్దబాపు కొడుకును అడిగి ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాను. తనకి మెసేజ్ చేశాను. చాలా రోజుల వరకు రిప్లై రాలేదు. తరువాత ఎవరు మెసేజ్ చేసింది అని రిప్లై వచ్చింది. నేను చెప్పగానే నన్ను గుర్తుపట్టింది. నేను ఇంకా రోజు మెసేజ్ చేసేవాడ్ని బాగానే మాట్లాడేది. తనకి నా ప్రేమ విషయం ఎదురుగా వెళ్లి చెబుదాం అనుకున్నాను. కానీ ధైర్యం చాలలేదు. ఫోన్లోనే నా ప్రేమ విషయం చెప్పాను. తను రిప్లై ఇవ్వలేదు. కానీ తరువాత రోజు నుంచి నాతో మాములుగానే చాట్ చేసేది. నాకు ఎందుకో తనని ఇబ్బంది పెడుతున్నాను అనిపించింది. నేను దుబాయ్ వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. అయితే నేను దుబాయ్ వెళ్లే రెండు రోజుల ముందు తను నాకు ఐ లవ్ అని చెప్పింది. దుబాయ్ హ్యాపీగా వెళ్లిరా అని చెప్పింది. రెండు సంవత్సరాలు దుబాయ్ లోనే ఉన్నాను. నేను ఒకసారి తన ఫోటో అడిగాను. తను ఎందుకు అని అడిగింది. నిన్ను చూడాలనిపిస్తోంది అని చెప్పాను. తను పంపింది. అది ఒక్కటే ప్రస్తుతం నాకు మిగిలింది. కొన్ని రోజులకు వాళ్ల ఇంటిలో తనకు సంబంధాలు చూస్తున్నారు అని ఇంట్లో వచ్చి మాట్లాడమని చెప్పింది. నేను మాట్లాడితే బాగోదు అని మా ఇంట్లో ఒప్పించి వాళ్ల ఇంటికి పంపిచాను. వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. తను అప్పటి నుంచి నాతో మాట్లాడటం మానేసింది. తనకు వేరే వాళ్లతో పెళ్లి అయిపోయింది. నాకు అసలు అర్థం కానీ విషయం ఏంటంటే అమ్మాయిలు అంత తేలికగా ఎలా మారిపోతారు. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోతారు.అసలు తను నన్న ఎలా మర్చిపోయిందో అర్థం కావడం లేదు. నేను మాత్రం తనని మర్చిపోలేకపోతున్నాను. కొన్ని కొన్ని సార్లు అయితే చచ్చిపోవాలనిపిస్తోంది. తనతో మాట్లాడిన ప్రతి మాట నాకొక మధుర జ్ఞాపకమే. తను ఎక్కడ ఉన్న ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు, నాని(హైదరాబాద్). -
తనని ఆ ఒక్క విషయం అడగాలనుంది!
తన పేరు శిల్పా. నేను 6 వ తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను చూశాను. ఆమె చాలా అందంగా ఉండేది. ఆమె అందమైన ముఖం నాకు ఇప్పటికీ గుర్తుకు వస్తోంది. తనని ప్రతి రోజు ఇంటికి వెళ్లేటప్పుడు ఆమెకు తెలియకుండా ఫాలో అయ్యేవాడ్ని. నాకు పేవర్గా ఉండే ఒక సార్ నన్ను క్లాస్ లీడర్‌గా చేశారు. తనని కూడా చేశారు. నాకు ప్రతి రోజు తనని చూడటమే సరిపోయేది. కానీ ఎప్పుడు నా ఫీలింగ్స్ చెప్పలేదు. వాళ్ల ఇంటి చుట్టూ తిరుగుతున్నని మా నాన్న నన్ను వేరు స్కూల్లో చేర్చించారు. తను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఉండిపోయింది. నేను ప్రతి రోజు స్కూల్ నుంచి రాగానే తనని చూసే వరకు నిద్రపోయే వాడ్ని కాదు. తను ట్యూషన్లో చేరిందని తెలిసి నేను కూడా అదే ట్యూషన్లో చేరాను. కానీ తను ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు. మా 9వ తరగతిలో తను కూడా ఏదో ప్రైవేట్ స్కూల్లో చేరింది. నేను రోజు వాళ్ల హాస్టల్ దగ్గరకు వెళ్లిన తను కనిపించేది కాదు. ప్రతి రోజు బాధపడే వాడ్ని. ఇంటర్‌కు వెళ్లాక తన కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉండేవాడ్ని. కానీ నేను తన చుట్టూ తిరుగుతున్న ఒక్కసారి కూడా తనకి ఆ విషయం తెలిసేది కాదు. ఎన్నోసార్లు ప్రయత్నించా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పడానికి కానీ ఊర్లో తెలిస్తే గొడవలు అవుతాయని భయంవేసేది. తన ఊరు వచ్చినప్పుడల్లా నేను వాళ్ల ఇంటివైపు ఏదో పని వంకతో వెళ్లి చూసి వచ్చేవాడ్ని. అలాగే ఒక్కసారి అయినా నాతో మాట్లాడుతుందేమో అనే ఆశతో 2002 నుంచి 2017 వరకు తన చుట్టూ తిరిగాను. కానీ నా బ్యాడ్ లక్ నేను నా ప్రేమ విషయం తనకు చెప్పకుండానే తనకు పెళ్లి అయిపోయింది. కానీ నేను ఇప్పటికీ తనని ఒక దేవతలానే చూస్తాను. నేను చచ్చేలోపు ఒక్కసారి అయినా నేను నీతో మాట్లాడాలి శిల్ప ప్లీజ్. నేను అసలు ఎవరో తనకి తెలుసా లేదో అనే విషయాన్ని ఒక్కసారి తనని అడగాలనుంది. ఒకే ఒక్క మాట నేను నీకు తెలుసా అని అడగాలి అని చాలా సార్లు అనిపిస్తుంది. తనని మొదటిసారి చూసిన ఆ క్షణం తన ముఖం ఎప్పుడూ నాకు గుర్తువస్తూనే ఉంటుంది. అది తల్చుకున్నప్పుడల్లా నా ముఖం మీద చిరునవ్వు వస్తుంది. శిల్ప ఈ మెసేజ్ నువ్వు చూస్తే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇది నువ్వు గుర్తుపట్టాలి అనుకుంటే ఒక హింట్ ఇస్తాను నీకు అరవ తరగతిలో ఉన్నప్పుడు ప్రతిమ, గీత అనే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్లీజ్ శిల్ప నువ్వు గుర్తుపడితే ఒక్కసారి నాతో మాట్లాడు. ఇట్లు కుమార్ (పేరు మార్చాం) ఒంగోలు. -
నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే!
హాయ్ నా పేరు కృష్ణ. నేను బీఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని చూశాను. తన పేరు శృతి. తను టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చేది. అప్పుడే తను నాకు పరిచయం అయ్యింది. కొద్ది రోజుల తరవాత అది ప్రేమగా మారింది. నేను ఒక రోజు శృతికి ఆ విషయం చెప్పాను. తను కూడా నా ప్రేమను ఒప్పుకుంది. మా ప్రేమ విషయంలో మాకు చాలా గొడవలు అయ్యాయి. అయిన మేం ఒకరిని వదిలి ఒకరం ఉండలేకపోయేవాళ్లం. ఎన్ని గొడవలు అయిన ఒక్క రోజు కూడా తనతో మాట్లాడకుండా ఉండలేకపోయేవాడిని. శృతి అంతలా నా మీద ప్రేమ చూపించేది. ఒక రోజు తను వాళ్ల ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. నేను మనం వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అన్నాను. తను సరే అంది. మా ఇద్దరి కులాలు వేరు. అందుకే నేను ఒక సంవత్సరం పాటు ఎదురు చూశాను. తను ఒకరోజు ఫోన్ చేసి నాకు ఇంట్లో మ్యారేజ్ ఫిక్స్ చేశారు. నాకు ఇంకా ఫోన్ చేయకు అని చెప్పింది. అప్పుడు నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత బాధ వేసింది. శృతికి ఆ పెళ్లి ఇష్టం లేకపోయిన వాళ్ల ఇంట్లో వాళ్ల కోసం ఆ పెళ్లికి ఒప్పుకుందని తరువాత నాకు తెలిసింది. అప్పుడు నేను వచ్చేసేయ్ మనం పెళ్లి చేసుకుందాం అని అడిగాను. తను రాలేదు. ఇప్పుడు కూడ తన కోసమే నా ఆలోచన. నా స్థానంలో వేరే వాళ్లను ఊహించుకోలేకపోతున్నాను. నా ఊపిరి ఉన్నంత కాలం నేను తనని మర్చిపోలేను. నువ్వు జాగ్రత్త శృతి నువ్వు లేని జీవితం శూన్యం శృతి. నువ్వే నా ప్రపంచం. నువ్వు గుర్తురాని క్షణం లేదు. ఐ లవ్ యూ శృతి. ఐ మిస్ యూ. నేను నిన్ను మర్చిపోవడం అంటే చచ్చిపోవడమే. కృష్ణ(అమలాపురం). -
అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు!
నేను జాబ్ చేసే టైంలో నాతో పాటు జాజ్ చేసే ఒక అమ్మాయి చాలా రోజులు నా వెంట పడింది. ప్రేమిస్తున్న అని చాలా కాలం నా కోసం ఎదురు చూసింది. నేను అంత తొందరగా ఆమె ప్రేమను ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రేమలో నిజాయితీ చూసి ఒప్పుకున్నా. నాలుగు సంవత్సరాలు మా ప్రేమ ప్రయాణం సాగింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని పెళ్లి చేసుకుందాం అంది. నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అన్నాను, ఆమె మాత్రం వాళ్ళ నాన్న ను ఓప్పించి చేసుకోవాలి అంది. అలా ఒప్పుకోరు పెళ్లి చేసుకున్నాక వాళ్లే ఒప్పుకుంటారు అన్నాను. అయినా ఆమె నా మాట వినలేదు. ఇద్దరికి చాలా పెద్ద గొడవ అయ్యింది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా నన్ను లవ్ చేశావు, పెళ్లి కి మాత్రం అందరూ ఒప్పుకోవాలి అనడం కరెక్ట్ కాదు అని నేను ఆమెతో విడిపోయాను. నేను మాత్రం మా నాన్న కి తెలియకుండా అసలు చేసుకొను అంది. అలా మేమిద్దరం విడిపోయాం. ఆమె మాత్రం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది. నేను మాత్రం ఆమె జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతున్నా. ఆమె వస్తుంది అని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్నా. లవ్ చేసే ముందు గుర్తు రాని తల్లిదండ్రులు పెళ్లి చేసుకునే ముందు ఎందుకు గుర్తు వస్తారో నాకు అర్థం కాదు. ఇప్పటికీ ఫోన్ చేస్తోంది. పెళ్లి చేసుకో అని చెప్తుంది. నేను ఒకటే చెప్పా తనతో నువ్వు చేసిన మోసం నుంచే ఇంకా కోలుకోలేదు. ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని మోసం చేయలేను అని చెప్పాను. కమల్(సికింద్రాబాద్). -
మనం ఫేస్బుక్ ఫ్రెండ్స్ మాత్రమే అంది!
నేను ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడే వాడిని కాదు. అందరి అబ్బాయిల్లాగా అమ్మాయిల వెంట పడే వాడ్ని కాదు. ఎప్పుడూ చదువు మీదే ఉండేది నా ధ్యాసంతా. అలా నా డిగ్రీని 2015 లో డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. తరువాత ఐసెట్ ద్వారా ఎంసీఏ హైదరాబద్ లో పూర్తి చేశాను. నేను నా సెమిస్టర్ ఎగ్జామ్స్ అప్పుడు మాత్రమే కాలేజీకి వెళ్ళేవాడిని. అలా నేను కాలేజీకి వెళ్లకుండానే ఫస్ట్ క్లాస్ లో ఎంసీఏ పూర్తి చేశాను. ఎంసీఏ పూర్తి చేసిన తరువాత అందరి లాగా ఏదో సాఫ్టువేర్ కంపెనీ లో జాబ్ చేయాలి అనుకోలేదు. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేద్దామని సోషల్ మీడియాను ఎంచుకున్నాను. ఎందుకంటే నా ఆలోచనలు ఎప్పుడు పెద్దవిగా వుండేవి. ఆ ఆలోచనలే ఇప్పుడు నన్ను అయోమయంలో పడేస్తాయి అని ఎప్పుడూ అనుకోలేదు. నా బిజినెస్ ఐడియా ఏంటంటే చాలా మంది ప్రజలు టీవీల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ గడుపుతారు. కొంత మంది తమ వెబ్ సైట్ డిజైన్ కోసం సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తారు. కొంత మంది వెబ్సైట్ ట్రాఫిక్ కోసం గూగుల్ లాంటివి సంప్రదిస్తారు. వాళ్ళ అందరి కోసం నేను కొన్ని ఫేస్బుక్ పేజెస్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ను క్రియేట్ చేశాను. అలా నేను ఒక ఫేస్బుక్ పేజీను సైన్స్ & టెక్నాలజీ పేరుతో స్టార్ట్ చేశాను. అలా నేను సోషల్ మీడియాలో లీనం అయ్యాను. నాలాంటి ఆలోచనలు ఉన్న అమ్మాయి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యింది. నేను ఎప్పుడూ మెసేజెస్ పెట్టేవాడిని కాదు. ఆ అమ్మాయి కూడా నాలాగే ఫేస్బుక్ సొసైటీకి సంబంధించిన పేజిని రన్ చేస్తుండేది. ఆమె ఎప్పుడూ సొసైటీ మీదే ఎక్కువ దృష్టి పెట్టేది. అలా నేను ఆమె ప్రతి పోస్ట్ కు లైక్స్, కామెంట్స్ పెట్టేవాడిని. ఎవరైనా నెగటివ్ గా కామెంట్స్ పెడితే నేను హీరో లాగా వాళ్ళకు రిప్లై ఇచ్చేవాడిని. ఆమె నన్ను ఇష్టపడుతుంది అనే భ్రమలో నేను నా బిజినెస్, జాబ్ మీద దృష్టి పెట్టలేదు. ఒక రోజు నా మనస్సు లోనీ మాట ఆమెకు చెప్పాను. కానీ ఆమె నాకు ఇలా రిప్లై ఇచ్చింది. నువ్వు జస్ట్ ఫేస్బుక్ ఫ్రెండ్‌వు మాత్రమే అని అంది. నేను పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళాను. నాకు అందరిలాగ ఫ్రెండ్స్ ఎక్కువగా లేకపోవడం వల్ల అలా అయ్యాను. ఇప్పుడు నేను సోషల్ మీడియా ను పక్కన పెట్టి జాబ్ కోసం ట్రై చేస్తున్న. ఇప్పుడు ప్రేమ అంటేనే చాలా భయం వేస్తోంది. విజయ్(పేరు మార్చాం). -
నా జీవితంపై వెయ్యి ఎపిసోడ్లు తీయొచ్చు!
నా పేరు కన్నా. నాకు స్కూల్ డేస్‌లో ఒక లవ్ స్టోరీ ఉండేది.అది మర్చిపోతున్న సమయంలో స్టడీస్ కోసం ముంబాయ్‌కు వెళ్లాం. అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. 7 సంవత్సరాల ఫ్రెండ్షిప్ తరువాత అది అలా అలా లవ్ దాకా వెళ్లింది. అది కూడా నా వైపు నుంచే. ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానో లేదో నా అమాయకత్వం వల్లనో నాకు ఆమెను పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆమెకు క్లారిటీ లేకపోవడం వల్ల నేను రోజుకు ఒక యుద్దం చేయాల్సి వచ్చేది. 2 సంవత్సరాల క్రితం నేను పార్క్‌లో ఆమెకు ప్రపోజ్ చేశాను. తను నేనంటే ఇష్టం లేదని నా ముఖం మీద చెప్పింది. ఇంకా ఏం చేస్తాను ఏడ్చుకుంటూ వచ్చేశాను. తరువాత 2017లో నాకు నువ్వు కావాలి అని మెసేజ్ చేసింది. తరువాత మళ్లీ 6 నెలల తరువాత మళ్లీ సేమ్ నాకు నువ్వు వద్దు మా నాన్నకి ఇష్టం లేదు అని చెప్పింది. అప్పుడు నేను డిప్రెషన్లో గుండు కొట్టించుకున్నాను. నా మీద నాకే అంతలా అసహ్యం వేసింది. మళ్లీ 2019లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. మళ్లీ నేను ఓకే చెప్పాను. ఈసారి మా ప్రేమ ఎంగేజ్మెంట్దాకా వచ్చింది. నా లైఫ్‌లో క్లైమాక్స్ అదే. కొన్ని కారణాల వల్ల మా పెళ్లి ఒక నెల ముందు ఆగిపోయింది. రీజన్ వింటే నవ్వు ఏడుపు రెండూ వస్తాయి. ఎవరో చెప్పిన మాటలు విని పెళ్లి వద్దు అని చెప్పింది. ఇదంతా అయ్యాక లాస్ట్ ఇయర్ నుంచి మళ్లీ డిప్రెషన్. నా జీవితంలో ఆనందం కంటే డిప్రెషనే ఎక్కువ అని నా ఫీలింగ్. నా లైఫ్ ఎందుకు ఇలా అయ్యింది అని ఏడవని రోజు లేదు. 7 సంవత్సరాల నుంచి ఒకే అమ్మాయి అన్ని తనే అనుకొని ఉన్నాను. ఇప్పుడు ఇలా అయ్యింది. తనకు క్లారిటీ లేకపోవడం వల్లే ఇలా జరిగింది. లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఇలా జరిగేది కాదు. ఇలా జరిగి సంవత్సరం అయ్యింది.కానీ ఇప్పటికీ నేను ఆమెను ప్రేమిస్తున్నాను. కానీ ప్రయోజనం లేదు. ఆమెది పిల్లల మనస్తత్వం, ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఏదో ఒక రోజు మెసేజ్ చేస్తుంది అనే నమ్మకంతో అలానే ఉన్నాను. మా ఇంట్లో వాళ్లు నన్ను ఇంకా పెళ్లి చేసుకో అంటున్నారు. నాకేము ఇప్పటివరకు చేసిన స్టంట్లు చాలు అనిపిస్తోంది. ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇంకా మా అమ్మ నాన్న నాకు ఒక మంచి ఆఫర్కూడా ఇచ్చారు. నేను ఎవరిని లవ్ చేసిన వాళ్లకి ఎలాంటి ఇబ్బంది లేదు అని. కానీ నా ముఖానికి ఎవరు పడతారు చెప్పండి ( చూడటానికి బాగానే ఉంటాలే). కానీ ఏ అమ్మాయితో మాట్లాడిన అక్క, చెల్లి అనేవాడిని. అందుకే నా లైఫ్‌లో అక్క చెల్లెళ్లు తప్ప లవర్లు, క్రష్‌లు ఏం ఉంటారు చెప్పండి. నా లైఫ్ ఒక జోక్. నా జీవితం మీద 1000 ఎపిసోడ్లు తీయ్యెచ్చు, అన్ని ట్వీస్ట్‌లు ఉంటాయి. అయినా కూడా ఆ దేవుడికి నా మీద జాలి కలగడం లేదు. బయటకు వెళ్లిపోదాం అని వీసా అప్ల చేస్తే రెండుసార్లు రిజెక్ట్ అయ్యింది. చెప్పడం మర్చిపోయాను, మొన్నిమధ్య ఒక అమ్మాయి వచ్చి నేనంటే ఇష్టం అని చెప్పింది. నేను ఇంకా నా లైఫ్ లో ట్విస్ట్‌లు చాలు అక్క అని చెప్పాను. అందరికి ఒకే ఒక గమనిక ఏదో సినిమాలో అన్నట్లు లైఫ్ అందరి దూలా తీర్చేస్తుంది భయ్యా ఎవరిని వదలదు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు నా వయస్సు 28. ఒక పక్క ఫ్యామిలి గొడవలు, ఇంకొ పక్క నా దురదృష్టం. ఇంకా ఎన్నెళ్లో ఇలా. నాకు కూడా మంచి రోజులు వస్తాయిలే అనే నమ్మకంతో రోజు లేస్తున్నాను. లేకపోతే ఎప్పుడో చచ్చిపోయే వాడిని. అయినా చచ్చి పోయి ఏం సాధిస్తాం, అమ్మనాన్నలను ఏడిపించడం తప్ప. నాలా ఎవరైనా డిప్రెషన్లో ఉంటే మా లాగే ఇంకో వెదవకూడా ఉన్నాడు అని నవ్వుకుంటూ ధైర్యంగా ఉంటారని ఈ లెటర్ రాస్తున్నాను. ఇట్లు, మీ తెలుగోడు( ముంబాయి). -
తనతో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతా!
నా పేరు అఖిల. నాకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక అబ్బాయి ఫ్రెండ్ అయ్యాడు. తరువాత మా స్నేహం ప్రేమగా మారింది. తను నన్ను చాలా ఇష్టపడేవాడు. ఎంతలా అంటే నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవాడు. మా విషయం మా ఇళ్లలో తెలిసింది. తరువాత మేం ఒక సంవత్సరం మాట్లాడుకోలేదు. తరువాత ఒకరోజు తనే కాల్ చేశాడు. ఈ సంవత్సరం మేం దూరంగా ఉన్నామే కానీ ఒకరినొకరం మర్చిపోలేదు. మేం అప్పుడప్పుడు మాట్లాడుకునేవాళ్లం. తరువాత మా మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. 5 సంవత్సరాల తరువాత వాళ్ల ఫ్రెండ్స్ ద్వారా నంబర్ తీసుకొని తనతో మాట్లాడాను. తను అంతగా మాట్లాడలేదు అనిపించింది. తరువాత 10 రోజుకు తనే నాకు ఫోన్ చేసి బాగా మాట్లాడాడు. తనతో మాట్లాడుతుంటే నాకు ప్రపంచమే తెలియదు. తను నన్ను అంత బాగా చూసుకుంటాడు. వాళ్ల అమ్మ మా ప్రేమను ఒప్పుకోరు అని తను చెప్పాడు. నాకు తన కోసం లైఫ్ లాంగ్ ఎదురుచూడాలనుంది. కానీ నాకు మా ఇంట్లో మ్యాచ్‌లు చూస్తున్నారు. ఇంత లవ్ చేసే అబ్బాయి దొరకడు అని నాకు తెలుసు. కానీ ఇంట్లో వాళ్ల కోసం తప్పడం లేదు. తన కోసం ఎదురు చూస్తూ ఉండాలని ఉన్నా తప్పదు. మనం ఒకటి అనుకుంటే లైఫ్‌లో మరొకటి జరుగుతుంది. నేను ఎప్పటికీ తనని తప్పుపట్టను. వాళ్ల పేరెంట్స్ మీద ఉన్న గౌరవంతో ఇలా చేస్తున్నాడు. చూడాలి నా జీవితం ఎలా ఉండబోతుందో. వచ్చే జన్మలో అయినా నీ లవర్‌గా నీ భార్యగా పుట్టాలని కోరుకుంటున్నాను. అఖిల(హైదరాబాద్) -
నువ్వు మంచిదానివి నేను నీకు వద్దు!
నువ్వు చాలా మంచి అమ్మాయివి నేను నీకు వద్దు అని వదిలేసి వెళ్లిపోయాడు. నేను స్కూల్ డేస్ నుంచి చాలా సైలెంట్‌గా ఉంటూ ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఇంటర్ కూడా వైజాగ్‌లో గార్ల్స్ హాస్టల్లో ఉండే చదువుకున్నాను. డిగ్రీలో చేరాక సగంలో తను పరిచయం అయ్యాడు. తను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్. నేనే ముందు తనకి మెసేజ్ చేశాను. మేం చాలా మాట్లాడుకునేవాళ్లం. తను నాకు నీతో రిలేషన్షిప్ కావాలి అని అడిగాడు. నేను సరే అన్నాను. అలా నాకు తెలియకుండా నేను తనని చాలా ప్రేమించాను. చాలా సార్లు చెప్పాలనుకున్నాను. కానీ తను ఏమనుకుంటాడో అని భయమేసి చెప్పలేదు. కానీ తనంటే నాకు ఇష్టం అని తనకి తెలుసు కావాలనే నన్ను దూరం పెట్టాడు. తను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. తను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకునే దాన్ని. ఈ విషయాలు అన్ని తెలిసి కూడా నేను తనని ప్రేమించాను. తను నన్ను లవ్ చేయకపోయిన పర్వాలేదు నాతో మాట్లాడితే చాలు అని అనుకునేదాన్ని. కానీ తను నాతో మాట్లాడటం మానేశాడు. తన కోసం ఏడవని రోజు లేదు. ప్రతి రోజు తన ఫోటోస్ చూసుకుంటూ, పాత మెసేజ్‌లను చదువుకుంటూ బతికేస్తున్నాను. తనంటే అంత పిచ్చి నాకు. ఈ జన్మలో కాకపోయిన వచ్చే జన్మ అంటూ ఉంటే నువ్వు ప్రేమించే అమ్మాయిని నేనే కావాలనుకుంటున్నాను. నా జీవితంలో నిన్ను ఎప్పటికీ మర్చిపోను. గీత(విశాఖపట్నం). -
నా జీవితంతో తెగిపోని అనుబంధమా... ఓ నా ప్రియతమా!
విరించి, తెగ తపించి, మలచిన అందమా , నా జీవితంతో తెగిపోని అనుబంధమా, ఓ నా ప్రియతమా. నీకోసమే ఈ పలుకులు , నా మది వర్షించిన తేనే చినుకులు. ఇలా చాలానే రాసుకున్నాను తన గురించి. మాది చిన్ననాటి నుంచి మొదలైన ప్రేమ. మా వయసులా మా ప్రేమ కూడా పెరిగి పెద్దదయ్యింది. అప్పుడు మా వయసులు 25. కులం జులం నాకు తెలిసొచ్చిన రోజులు అవి. మా ప్రేమ గురించి వాళ్ళ పెద్దలతో మాట్లాడాను. అందరిలానే కులాలు కలవవు అని కాదన్నారు. నా కులం, నా అప్పటి ఆర్థిక స్థితినే వాళ్లు చూశారు, తూలనాడారే కానీ, నా చదువు, భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. తనని అడిగాను నాతో వచ్చేయమని పెద్దల్ని ఎదిరించే ధైర్యం లేదో మరింకేమో తెలియదు కానీ నాకు నువ్వూ కావాలి మావాళ్లు కావాలి ఇదే తన సమాధానం. కొన్నాళ్లకు కబురొచ్చింది తనకు పెళ్లి అని, మళ్లీ అడిగి చూశాను తనని. నీ సంపాదనతో నువ్వే బ్రతకలేవు(అప్పటికే నేను ఒక ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం చేస్తున్న) నన్ను ఏమి పెట్టి పోషిస్తావు అంది. తనమాటలు నాలో పట్టుదల, సాధించాలి అనే కసిని రగిలించాయి. రెండు సంవత్సరాలు సమయం ఇవ్వు అని అడిగా, సరే అన్న తనే పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి చేసుకొని తన మాటను తుంగలో తొక్కింది. అయినా తనమీద కోపం లేదు. మంచి స్థాయికి చేరుకోవాలి అనే కోరిక తప్ప. ఉద్యోగం వదిలి, విదేశాలకు కదిలి , ఉన్నత స్థితికి చేరాను. ఇప్పటికీ తనంటే నాకు అదే ఇష్టం, అదే ప్రేమ. ఎందుకంటే నేను ఉన్నత స్థితిలో ఉండటానికి కారణం తనే. అందుకే తను నా జీవితంలో ఒక మలుపు, నా గెలుపు, తొలివలపు. తను ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడ్ని కోరుకుంటూ... సెలవు పుల్లారావు నక్కా (అబూదాబి) -
అలా అన్నప్పుడు నా ప్రాణం పోయినట్లు ఉంటుంది!
హాయ్ నా పేరు రాజు.నేను హైదరాబాద్ లో ఉంటాను. 2006లో అనుకోకుండా ఒక పని వల్ల నెల రోజులు వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది.అంతా బాగానే ఉంది 15 రోజులు చాలా తొందరగా గడిచి పోయాయి. నేను పని చేసే ఇంటి పక్కన ఒక అమ్మాయికి నాకు అసలు పడేది కాదు. ప్రతీ విషయంలో నాతో గొడవపడేది. నేను కూడా అలాగే ప్రవర్తించేవాడిని. నేను స్వతహాగా డ్యాన్సర్‌ని. పని అయిపోయాక డాన్స్ చేయడం అలవాటు. తను ఉండే ఊర్లో ఒక పండగ వచ్చింది. వాళ్ల ఇళ్లంత బంధువులతో నిండి పోయింది . ప్రతీ రోజూలాగే ఆ రోజు కూడా నేను డాన్స్ చేస్తున్నా...తన బంధువులు అనుకోకుండా నేను డాన్స్ చేస్తుంటే చూడటానికి వచ్చారు. వాళ్లతో పాటు తను కూడా వచ్చింది. వాళ్లంతా నన్ను మళ్లీ డాన్స్ చేయమని అడిగారు సరే అని నేను చేశాను. ఎప్పుడూ నాతో గొడవ పడే ఆ అమ్మాయి నా డాన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. తన బంధువులు కూడా నాతో చాలా బాగుంది అని చెప్పారు. ఏమయ్యిందో తెలియదు కానీ తరువాత రోజు నుంచి తను నన్ను చూసి నవ్వేది. నేను కూడా నవ్వే వాడిని. అది లవ్ అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. అలా అనుకోకుండా మా ప్రేమ కథ స్టార్ అయ్యింది. డైలీ తను నాకు ఒకచిన్న పిల్లాడికి అమ్మ లాగ అన్నం కలిపి పెట్టేది. అలా మిగతా 15రోజులు అయిపోయాయి. నేను తిరిగి హైదరాబాద్ వెళ్లిపోవాలి. అప్పుడు తను చాలా ఏడ్చింది. నేను కూడా ఏడ్చాను. మా ఇద్దరి కులాలు వేరే. ఒకసారి వాళ్ల అమ్మని వేరే విధంగా అడిగాను మీ అమ్మాయి కి పెళ్లికి ఎలాంటి వాడు కావాలి అని. తను వాళ్ల కులం తప్ప వేరే చేయను అని చెప్పింది. తను నేను లేకుండా ఉండలేను అని చెప్పింది.మ హైదరాబాద్ వెళ్లిన తరువాత మా ఇంట్లో విషయం చెప్పాను. సరే అన్నారు. మా బ్రదర్ తప్ప ఇంట్లో అందరూ మా పెళ్లికి ఒప్పుకున్నారు. అప్పుడు నా ఫ్రెండ్స్ నాకు తనకు శంషాబాద్ సిద్దుల గుట్ట శివాలయంలో పెళ్లి చేయడనికి అంతా రెడీ చేశారు. తను బస్ ఎక్కే టైంకి వాళ్ల బ్రదర్ పట్టుకున్నాడు. ఆమె రాలేకపోయింది. నేను నా ఫ్రెండ్స్ కలసి తనని ఇంట్లో నుంచి తీసుకువద్దమని వాళ్ల ఊరు వెళ్లాం. అప్పుడు వాళ్ల బ్రదర్ మా లవ్ గురించి వాళ్ల ఇంట్లో చెప్పాడు. గొడవ స్టార్ట్ అయింది. నేను వెళ్ళిపోయాను. తరువాత మా అన్న నాకు వేరే పెళ్లి ఫిక్స్ చేశాడు. వద్దు అని చెప్పినా వినలేదు.ఎంగేజ్మెంట్ అయ్యింది. తను నాకు కాల్ చేసి చాలా ఏడ్చింది. నేను కూడా చాలా ఏడ్చాను. నాకు వేరే పెళ్లి అయ్యింది. కానీ నాకు మాత్రం తను ప్రతి క్షణం గుర్తుకు వస్తోంది. తన కోసం మళ్లీ వాళ్ల ఇంటికి వెళ్లాను. కానీ తనతో మాట్లడలేదు.మళ్లీ ఇంకోసారి తన కాలేజీకి వెళ్లాను. కానీ ప్రయోజనం లేదు. 2009లో తనకి పెళ్లి అయ్యింది. అప్పటి నుంచి తనని చూడలేదు. తరువాత అనుకోకుండా ఒక రోజు తన ఫోన్ నంబర్ దొరికింది . తన నంబర్‌కు ఫోన్ చేశాను.తన నుంచి ఎలాంటి సమాధానం లేదు. నా నంబర్ బ్లాక్ చేసింది. తను హ్యాపీగా ఉంది అని తెలిసింది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. .అనుకోకుండా మళ్లీ తను నాకు మెసేజ్ చేసింది. తను కూడా నేను ఎలా ఉన్నాను అని తెలుసుకోవడానికి ఫోన్ చేసింది..అప్పుడప్పుడు ఫోన్ చేసి ఎందుకు వదిలేసి పోయవురా అన్నప్పుడు నాకు చనిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. నేను కోరుకునేది ఒక్కటే నా వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు, రావద్దు అని. అందుకే నేను తనకు ఎలాంటి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయను. తను చేస్తే తప్పకుండా సమాధానం ఇస్తాను.జీవితాంతం నీకు ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన నేను నీకు తోడుగా ఉంటాను. త్వరలో నీ పేరుతో ఒక అనాధాశ్రమం పెట్టాలని కోరిక ఉంది. తప్పకుండా పెడతాను. ఎక్కడున్న నువ్వు హ్యాపీగా ఉంటే చాలమ్మ. ఇట్లు, నీ రాజు -
అతను రాసిన లెటర్స్ చదవాలనుంది!
మేము 3 సంవత్సరాలు అనంతపురంలో ఉన్నాం. అక్కడే నేను 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అక్కడే చదివాను. చాలా కష్టపడి చదివేదాన్ని. చదువే నా లోకం. నేను అక్కడ ఒక చోట ట్యూషన్లో చేరాను. చాలా బిడియం, అమాయకం. మగ పురుగును చూడటం కూడా తప్పు అని అనుకునేదాన్ని. ఒకబ్బాయి పేరు వరదరాజు. నన్ను నాకు తెలియకుండా రోజు చూసేవాడు. నా కోసం 9 వ తరగతిలో ట్యూషన్ మానేసిన తను 10వ తరగతిలో నాకోసమే మా ట్యూషన్లో చేరాడు. నేను చాలా యాక్టివ్‌గా ఉండేదాన్ని. డ్రాయింగ్, సింగింగ్ ఇలా అన్నింటిలో పాల్గొనేదాన్ని. అతను కూడా నేను వెళ్లే ప్రతి కాంపిటిషన్‌కు వచ్చే వాడు. వాళ్లది బాయ్స్ స్కూల్. అతను నన్ను చాలా డీప్‌గా లవ్ చేస్తున్నాడని మా ఫ్రెండ్స్ చెప్తే నాకు తెలిసింది. నా పేరు ట్యూషన్లో ఉండే సోఫా మీద వందసార్లు రాశాడు. నేను ఎప్పుడైనా చూస్తే చాలు మా క్లాస్ గర్ల్స్ అందరూ చూసింది చూసింది అని అనేవారు. దాంతో ఏదో తప్పు చేసినట్లు తల దించుకుని స్టడీస్ మీద శ్రద్ద పెట్టేదాన్ని. హాలిడేస్ వస్తే చాలు నా కోసం మా వీధి చివర నిల్చునేవాడు. నేను వచ్చేంత వరకు అక్కడే ఉండేవాడు. నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఏమి రాసేవాడో ఏమో కానీ నేను ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు నా వెంట వచ్చేవాడు. లాస్ట్ రోజు రొప్పుతూ నా దగ్గరకు వచ్చి నన్ను మిస్ అవుతున్నానని చెప్పాడు. తను నా కోసం చాలా ఉత్తరాలు రాశాడంట అది నేను వినాలి అని చెప్పాడు. అప్పుడు నేను తనది చాలా స్ట్రాంగ్ లవ్ అని నమ్మాను. తరువాత హాలిడేస్‌లో మేం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. ఒక్కసారి కూడా నేను తనని సరిగా చూడలేదు, మాట్లాడలేదు. కానీ రిసెంట్‌గా స్వప్న మూవీలో లవ్ లెటర్స్ మూవీ చూశాక చాలా బాధపడ్డాను. నేను ఎంత ట్రూ లవ్‌ను మిస్సయ్యనో అనిపించింది. ఎలా తట్టుకున్నాడో నేను వెళ్లిపోయాక. అసలు ఉన్నాడా అని నా డౌట్. 30 ఏళ్ల నుంచి నా మనస్సులో ఆ అనుమానం ఉంది. కానీ నేనేం చేయలేను. ఎక్కడ ఉన్నా సారీ చెప్పాలని ఉంది. ఆ లెటర్స్ చదవాలని ఉంది. చాలా సంఘటనలు ఉన్నాయి. తను నా కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఐయమ్ సారీ. గౌరీ(అనంతపురం). -
అమ్మలేదు... ఆ అమ్మాయి కూడా రాదు!
నాకు అమ్మలేదు. మా అమ్మ పేరు ఉష. నేను ప్రేమించిన అమ్మాయి పేరు కూడా ఉషనే. అమ్మ ఇప్పుడు నాతో లేదు. ఆ అమ్మాయి కూడా నాతో ఉండదేమో అనిపిస్తుంది. తను మా అత్తమ్మ వాళ్ల అమ్మాయి. నేను ఆమెకు ప్రపోజ్ చేసి రెండు సంవత్సరాల పైనే అయ్యింది. ఆమె నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. వస్తుంది అనే నమ్మకం కూడా లేదు. నాకు ఉష కావాలి. ఉష లేకపోతే చచ్చిపోతాను అని చెప్పాను కానీ నా బాధ మాత్రం దానికి సమానమైనదే. తనకి నా ప్రేమ ఎందుకు అర్థం కావడంలేదో. బహుశా నాకు ఉద్యోగం లేదు. అంత అందంగానూ ఉండను. కానీ తను అలా అనుకునే అమ్మాయి కాదు. అందుకే ఆమెను ప్రేమించాను. జాబ్ లేకపోయిన నేను రైతును అన్నింటికి మించి తనని చాలా ప్రేమిస్తున్నాను. ఇది చాలదా ఆమె నన్ను ప్రేమించడానికి? నీకు నచ్చడానికి ఏమైనా చేయాలా చెప్పండి ఉషగారు. అలాగే ఉంటాను. అంతేగాని నాకు మాత్రం దూరంగా ఉండకండి. ఏడుపొస్తోంది. నీ కోసం ఎన్ని రోజులైన ఎదురుచూస్తూ ఉంటాను. నువ్వు ఒప్పుకునే వరకు ఉంటాను. లేదా మీరు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పండి. నిజంగా మిమ్మల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. ఐ లవ్ యూ మేడమ్. నాకు ఈ ప్రపంచంలో ఉండాలి అనిపించడం లేదు. బాధపడుతూ అయిన ఉంటాను. మిస్ యూ ఉషగారు. శివ (నెల్లూరు). -
కాలేజ్‌లో చేరాక తను మారిపోయింది!
నా పేరు హర్ష(పేరు మార్చాం). నా జీవితంలో ఒక మంచి లవ్ స్టోరీ ఉంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు సుధారాణి. తనంటే నాకు చాలా ఇష్టం. ఆ అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడే బాగా నచ్చింది. ఐ లవ్ యూ చెప్పాలనిపించింది. వాళ్ల ఇళ్లు మా రూమ్ పక్కనే ఉండేది. తనకి ఐ లవ్ యూ అనే మూడు ముక్కలు చెప్పడానికి నాకు మూడు నెలలు పట్టింది. అది కూడా నేను చెప్పలేదు. మా చెల్లితో నా ప్రేమ విషయం తనకి చెప్పించాను. తను ఒప్పుకుంది. తరువాత మేం చాలా హ్యాపీగా ఉన్నాం. అలా రెండు సంవత్సరాలు గడిచాయి. తరువాత తను బీటెక్ చదవడానికి కాలేజీలో చేరింది. అప్పటి నుంచి తను పూర్తిగా మారిపోయింది. నన్ను చెడ్డగా అనుకోవడం మొదలుపెట్టింది. అయినా నేను తనని బతిమిలాడాను. తరువాత కూడా మేం రెండు సంవత్సారాలు కలిసి ఉన్నాం. తరువాత ఒకరోజు నేనంటే తనకి ఇష్టం లేదని నన్ను ఫ్రెండ్‌గానే చూశాను అని చెప్పింది. అప్పుడు ప్రాణం పోయేంత బాధగా అనిపించింది. తరువాత నాకు ఆమెకు చాలా మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసి షాక అయ్యాను. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎవ్వరూ కరెక్ట్‌గా లేరు( ఇది నా ఉద్దేశ్యం మాత్రమే). హర్ష( హైదరాబాద్) -
నేనంటే తనకు ఇప్పటికీ కోపమే!
నేను ఇంటర్లో రమ(పేరు మార్చాం) అనే అమ్మాయిని లవ్ చేశాను. కానీ తను నన్ను లవ్ చేయలేదు. తరువాత ఇంటర్ సెకండ్ ఇయర్లో తను నాకు ఓకే చెప్పింది. తరువాత ఇద్దరం చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. తిట్టుకుంటూ, కొట్టుకుంటూ అలా మా ప్రేమ డిగ్రీ అయిపోయేదాకా కూడా కంటిన్యూ అయ్యింది. అలా ఆరు సంవత్సరాలు లవ్ చేసుకున్నాము. తరువాత తను నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. నేను చేసుకుంటాను అన్నాను. ఇంతలో తనకు వాళ్ల ఇంటిలో పెళ్లి సంబంధాలు చూశారు. తనకి పెళ్లైపోయింది. నేను చేసుకుందాం అనుకుంటే అప్పటికీ నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు స్థిరపడ్డాను కానీ ఇప్పుడు తను నాతో లేదు. పెళ్లి అయ్యాక ఒక్కసారి కూడా తను నాతో మాట్లాడలేదు. నేను పెళ్లి చేసుకోలేదు అనే కోసం తనకి ఇప్పటికీ ఉంది. అప్పుడు నాకు కుదరక చేసుకోలేకపోయాను కానీ తన మీద ప్రేమ లేక కాదు. తను ఎక్కడ ఉన్న బాగుండాలి. తనకి ఒకప్పుడు నేనంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేనంటే తనకు చాలా అసహ్యం. కానీ తనంటే నాకు ఇప్పుడు, ఎప్పుడు ఎప్పటికీ ఇష్టమే. ఐ లవ్ యూ రమ. వెంకట్ (భీమవరం). -
మన ప్రేమకథను సినిమాగా చేస్తా!
నా పేరు శ్రీకాంత్. నేను ఓ కాలేజీలో బీఫామ్ చదువుతున్నాను. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరిచిపోలేని ఒక మధురమైన అనుభూతి. కానీ అది నా జీవితంలో మోయలేక మోస్తున్న ఒక భారం. నేను ఆ కాలేజీకి ఇష్టం లేకుండా అయిష్టంగానే వెళ్లాను. కానీ మా కాలేజీలో నా ర్యాంక్ ప్రకారం నేనే టాపర్‌ను. అంతేకాదు నేనే క్లాస్ సీఆర్గా కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. దీలీప్ అనే ఒక ఫ్రెండ్ ద్వారా తన అల్లరి గురించి విన్నాను. ఒక రోజు మా క్లాస్ అందరికి కలిపి ఫేస్బుక్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేశారు. ఆ గ్రూప్‌లో ఫ్రెండ్స్ ద్వారా యాడ్ అయిన తను వెంటనే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. అప్పటి నుంచి రోజు రాత్రి 2 వరకు చాట్ చేసుకునేవాళ్లం. తను నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టక ముందు తన పేరుతో నేనే ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి మా ఫ్రెండ్ రోహిత్‌కు రిక్వెస్ట్ పెట్టాను. వాడితో సరదాగా ఆడుకునేవాడిని. తను పరిచయం అయిన తరువాత తప్పు తెలుసుకొని ఇద్దరికీ నిజం చెప్పేశాను. ఆ సంఘటనతో మా ఇద్దరికి మరింత పరిచయం పెరిగింది. ఈ లోపు ఎలా మరిందో తెలియదు కానీ పరిచయం కాస్తా తన మీద ప్రేమగా మారింది. ఒక రోజు ధైర్యం చేసి తనకు ప్రపోజ్ చేశాను. ఆ తరువాత ఒక వారం రోజుల వరకు మా మధ్య మాటలు లేవు. ఆ తరువాత ఒక పోలియో క్యాంప్ ద్వారా మా మధ్య బంధం మరింత పెరిగింది. అది ఎంత అంటే చాట్ చేసుకోవడం నుంచి కాల్ చేసుకునే వరకు. ఇద్దరం క్లాస్ బంక్ కొట్టి మరీ ఫోన్స్ మాట్లాడుకునే వాళ్లం. ఒకసారి మేమిద్దరం మా దగ్గరలో ఉండే టెంపుల్‌కు కూడా వెళ్లాము. మా ఫ్రెండ్ ఒకడు తన గురించి బ్యాడ్‌గా కామెంట్ చేస్తే నేను మా ఫ్రెండ్ కలసి వాడిని కాలేజీ వాష్‌రూమ్‌లో కొట్టాము. ఇంతలో నా పుట్టినరోజు వచ్చింది. తను రాత్రి 12 ఇంటికి కాల్ చేసి నాకు విష్ చేసి కొరియన్ భాషలో ఐ లవ్ యూ చెప్పింది. నా ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ తరువాత రోజు తను ఫోన్ చేసి కేవలం నీ పుట్టిన రోజు నాడు నువ్వు ఆనందపడతావని అలా చెప్పాను అంది. నేను తను సిగ్గుపడి అలా చేసింది ఏమో అనుకున్నాను. ఇంతలో మా ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి.నేను టాపర్ కావడంతో నైట్ నేను చదివి తనకు అన్ని అర్దం అయ్యేలా చెప్పేవాడిని. ఆ తరువాత వచ్చిన మా సెమ్ ఎగ్జామ్స్ టైంలో మాకు చిన్న గొడవ అయ్యింది. అది చిలికి చిలికి గాలి వాన అయ్యింది. అప్పుడు బ్రేక్ అయిన రిలేషన్ ఇప్పటి వరకు కలవలేదు. తను సారీ చెప్పడానికి కాల్ చేసింది. నేను ఆ టైంలో తాగి ఉండటం వల్ల తనని చాలా తిట్టేశాను. అంతే మా ఫస్ట్ ఇయర్లో అయిన ఆ గొడవ వల్ల విడిపోయిన మేము ఇప్పుడు మా ఫైనల్ ఇయర్ అయిన ఇంకా కలవలేదు. నాకు ఇప్పటి వరకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. 5 సార్లు కాలేజీ నుంచి సస్పెండ్ అయ్యాను. తాగి క్లాస్‌కు వెళ్లడం, లెక్చలర్స్తో దురుసుగా ప్రవర్తించడం వల్ల అలా జరిగింది. ది మోస్ట్ ఫనియస్ట్ గయ్ నుంచి ది మోస్ట్ ఫ్రస్టెటెడ్ గాయ్ గా నా ఫ్రేమ్ మారిపోయింది. తన ప్రేమ కోసం అలా 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. తన కోసం మా ప్రేమను సినిమాగా తీయాలనుకుంటున్నాను. ఇంకొన్ని నెలల్లో ఆ సినిమా తీస్తాను. ఇంకో మూడు నెలల్లో మా ఫైనల్ ఇయర్ అయిపోతుంది. నా కళ్లు మళ్లీ ఆమెను చూడలేవు. నా మనసు ఆమె నవ్వును, చెవులు ఆమె స్వరాన్ని వినలేవు. నా ఈ అలుపెరుగని ప్రేమకు ముగింపు పడనుంది.ఈ సందర్భంగా నా బాధలో, నా నవ్వులో తోడున్న నా ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు. ఫైనల్‌గా నీకు ఓ మాట చెప్పాలనుకుంటున్నా మన మొదటి ఫేస్బుక్ పరిచయం, ఆ తరువాత చాట్, ట్రూత్ ఆర్ డేర్ గేమ్, టెంపుల్‌కు వెళ్లడం, చిలకజోస్యం, ఎగ్జామ్స్, సీనియర్‌తో నీ గొడవ, వాష్ రూంలో నా గొడవ, నేను నీ బర్త్‌డే కి ఇచ్చిన గిఫ్ట్, నా బర్త్‌డేకు నువ్వు ఇచ్చిన గిఫ్ట్( వాల్ముతే కొరియన్లో ఐ లవ్ యూ), గురు సినిమాకు వెళ్లి సినిమా చూడకుండా ఇంటర్వెల్ వరకు సినిమా చూడకుండా నీతో మాట్లాడుతూ గడిపిన ఆ రోజు, నేను నీకు చేసిన ప్రపోజల్, ఇచ్చిన లవ్ లెటర్, టెంప్టెషన్ ఆల్మండ్, మీ ఫ్రెండ్‌గా నాకు పరిచయమయిన మన జూనియర్, తనతో ముచ్చట్లు, బసూది, మార్చుకున్న మన క్యారెక్టర్స్, ఫైనల్‌గా మన గొడవ... అన్ని అలా నా కళ్ల ముందు కదులుతూ ఇంకొన్ని రోజులే నేను నిన్ను చూసేది అని గుర్తుచేస్తూ నా కళ్లు తడుపుతున్నాయి.మళ్లీ నేను నీకు ఈ మాట ‘సాక్షి’ సాక్షిగా చెపుతున్నా అప్పుడు 50 మంది ముందు చెప్పలేకపోవచ్చు, ఇప్పుడు ఈ పేపర్ చదివే లక్షల మంది సాక్షిగా చెబుతున్నా ఐ లవ్ యూ ఫర్ ఎవర్ మహి. శ్రీకాంత్( మంగళగిరి). -
కౌగిలించుకుంది...తరువాత మిస్సయ్యింది!
నా పేరు అనిల్ కుమార్. నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తరువాత డీసెట్ ఎంట్రెన్స్ కోసం కోచింగ్‌కు వెళ్లాను. కొన్ని రోజుల తరువాత ఒకమ్మాయి కొత్తగా కోచింగ్‌లో చేరింది. నేను కొత్తలో పెద్దగా పట్టించుకోలేదు. తరువాత తను కొంచెం కొంచెం పరిచయమయ్యింది. చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్లం. కాలం గడుస్తున్న కొద్ది ఒకరిని ఒకరం చూసుకోవడం మొదలుపెట్టాం. నేను ఎవరిని ఏం అడిగిన తను తెచ్చి నాకు ఇచ్చేది. ఒకరోజు నువ్వంటే నాకిష్టమని తనకి చెప్పేశాను. తను నాకు సమాధానం చెప్పకుండా ఆ రోజు వాళ్ల ఊరిలో ఫెస్టివల్ ఉందని రమ్మని చెప్పింది. నేను అక్కడికి వెళ్లాను కానీ తను మాత్రం అక్కడికి రాలేదు. నేను తరువాత రోజు నేను మీ ఊరు వచ్చాను. నువ్వు ఫెస్టివల్‌కు ఎందుకు రాలేదు అని అడిగాను. తను నా కోసంవచ్చావా అని నన్ను చూస్తూ ఉంది. క్లాస్‌లో ఎవరు లేరు. తను నన్ను కౌగిలించుకుంది. నేను వెంటనే ఇంకోసారి ఐ లవ్ యూ చెప్పాను. తను వెంటనే నన్ను వదిలి క్లాస్‌లో నుంచి బయటకు వెళ్లిపోయింది. ఆ తరువాత తను నాతో మాట్లాడలేదు. నాలుగురోజులకు మా కోచింగ్ అయిపోయింది. ఎంత రిక్వెస్ట్ చేసిన తన నుంచి నో రెస్పాన్స్. కోచింగ్ అయిపోయిన తరువాత తను ఒక్కసారి కూడా నాకు కనిపించలేదు. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అనిల్‌కుమార్(కోటనందూరు). -
నన్ను వదిలించుకోవడానికే అలా చేశాడు!
నా పేరు బుజ్జి. నేను బీటెక్ పూర్తి చేసిన ఇంట్లో ఉన్నాను. అప్పుడు మా నాన్న గారికి యాక్సిడెంట్ అయ్యింది . అప్పుడు మా నాన్నకి సాయంగా ఒక వారం రోజులు నేను హాస్పిటల్ ఉన్నాను. అప్పుడే ఫేసుబుక్‌లో నాకు హాయ్ అని ఒక మెసేజ్ వచ్చింది. నేను కూడా హాయ్ అని పెట్టాను. తనకి నేను తెలిసినట్లే చాట్ చేశాడు. నేను మా బాబాయికి చెప్పాను ఇలా ఎవరో చాట్ చేస్తున్నారు అని,తను నీకు వరసకి బావ అవుతాడు అని మా బాబాయి చెప్పారు. మన వాళ్ళే కదా అని చాట్ చేశాను.చాటింగ్ తరవాత కాల్స్ ఆలా ఆలా చాలా మాట్లాడుకున్నాము.తాను నాకు ప్రపోజ్ చేశాడు.నాకు అలాంటి ఆలోచన లేదు అన్నాను. నాకు చదువు ఇంకా మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటం అదే తెలుసు. తను నన్ను పెళ్లి చేసుకుంటున్నాను అన్నాడు.నాకు టైం కావాలి అన్నాను.ఒక రోజు నాన్న గారిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం తను కూడా ఆ రోజు మా దగ్గరికి వచ్చారు. అదే ఫస్ట్ టైం తనని చూడటం . చూడగానే నాకు నచ్చారనిపించింది. మా ఇంట్లో చెప్పాను కులాలు కూడా ఒక్కటే మా ఇంట్లో ఒపుకున్నారు. కానీ తన ఇంట్లో ఒప్పుకోవాలంటే మంచి జాబ్ తెచ్చుకోవాలి అప్పుడే మా ఇంట్లో చెప్తాను అన్నాడు.అవును కదా మంచి పొజిషన్లో ఉంటే అందరికి మంచిది కదా అని అనుకున్నాను. తను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. కానీ తనకి జాబ్ రాలేదు, నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. నేను హైదరాబాద్ వెళ్ళాను. మా ఇంట్లో నాకు మంచి సంబంధాలు వస్తున్నాయి. కానీ తనకి జాబ్ లేదు కాబట్టి నన్ను వేరే సంబంధం చేసుకోమని మా నాన్నమ్మ ఫోర్స్ చేసింది. అప్పుడే తనకి నాకు తెలిసిన ఆఫీసులోనే జాబ్ ఇప్పించాను.మా ఇంట్లోపెళ్లి చూపులకి వచ్చి వెళ్ళు అని ఫోర్స్ చేశారు. నేను ఆ విషయం తనకి చెప్పాను ఒకసారి వెళ్లి రా .. అని చెప్పాడు. తరువాత తనకి జాబ్ చేసే దగ్గర ఒక అమ్మాయి పరిచయం అయింది. తను నన్ను అవాయిడ్ చేయడం మొదలు పెట్టాడు . నాకు నాకు తెలియదు వాళ్ళు లవ్ చేసుకుంటున్నారని,నేను అడిగాను ఎందుకు బావ నన్ను అవాయిడ్ చేస్తున్నావ్ అని. అప్పుడు నన్ను చాలా తిట్టాడు పెళ్లి చూపులకి ఎందుకు వెళ్ళావ్ అని. కానీ నిజం ఏమిటంటే తను వెళ్ళమంటేనే నేను వెళ్ళాను, మా ఇంట్లో టైం అడిగి వచ్చాను. అది తను నమ్మలేదు. నన్ను వదిలించుకోవడానికే ఇదంత చేశాడు అని నాకు తెలిసింది . నాకు తనంటే చాలా ఇష్టం. తన కోసం ఏమైనా చేస్తా అని తెలుసు. అందుకేనేమో తను త్వరగా ఆ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో చెప్పి 15రోజుల్లోనే పెళ్లి చేసున్నారు. నాకు చచ్చిపోవాలనిపించింది. చాలా ఏడ్చాను. కానీ తను చాలా హ్యాపీగా ఉన్నాడు. అబ్బాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను అదే నా ఫస్ట్ లవ్ కూడా. ఎప్పుడు తను హ్యాపీగా ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. బుజ్జి(గుంటూరు). -
నా కడుపున పుడతానన్నాడు!
వేసవి సెలవులు కావడంతో మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను . అక్కడ నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు తన పేరు ఉష కుమార్ . తను నన్నురోజూ చూసేవాడు అని నాకు మా అక్క చెప్పేది. ఒక రోజు తను నా దగ్గరకి వచ్చి నీ పేరు ఏంటి అని అడిగాడు భయమేసి నేను చెప్పలేదు. కానీ వన్డేలోనే నా పేరు నా వివరాలు అన్ని తెలుసుకున్నాడు.నేను బయటకి ఎక్కడికి వెళ్లిన నా వెనుక ఫాలో అయ్యేవాడు. కొన్ని రోజులకి నాకు ప్రపోజ్ చేశాడు. కానీ నేను ఏమీ చెప్పకుండా అక్కడ నుండి వెళ్ళిపోయా. నాకు డైలీ లవ్ యూ అని మెసేజ్ చేసేవాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పేవాడు. తన బిహేవియర్ నచ్చి నేను ఓకే చేశా. చాలా తొందరగా సమ్మర్ హాలిడేస్ గడచిపోయాయి. నేను హైదరాబాద్ కి వెళ్ళిపోయాను. రోజూ కాల్స్, మెసేజ్‌లు చేసుకునేవాళ్ళం. తరువాత కొన్ని రోజులకి మా ప్రేమకు చాలా పెద్ద ప్రాబ్లమ్ వచ్చింది. తను నాతో సరిగా మాట్లాడకపోయేవాడు. కాల్ చేస్తే కట్ చేసేవాడు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వడం మానేశాడు. నాకు ఏమి చేయాలో అర్థం కాక చాలా ఏడ్చాను. ఇంకా అలా కాదు అని మా పెద్దమ్మ వాళ్ళ ఊరికి వెళ్లి తనను మీట్ అయ్యాను. నన్ను చూడగానే తన కళ్ళలో ఏదో తెలియని బాధ. నన్ను వచ్చి ఒకసారి హగ్ చేసుకొని చాలా ఏడ్చాడు. ఏమైంది అంటే ఏం చెప్పలేదు. కొంచెంసేపటి తరువాత ఎందుకు వచ్చావు వెళ్లు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని పంపించేశాడు. తరువాత కొంతకాలానికి నేను వాళ్ల సిస్టర్‌కు కాల్ చేశాను. అసలు ఏమైందో చెప్పమని అడిగాను. అప్పుడు తను వదిన మా అన్నయ్యను మర్చిపో, అన్నయ్యకు బ్లడ్ క్యాన్సర్ అంది. ఆ మాటతో నా గుండె పగిలిపోయింది. చాలా ఏడ్చాను. తను నన్ను మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండు, నిన్ను పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా చూసుకుందాం అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు అంత అదృష్టాన్ని ఇవ్వలేదు. నేను ఇంకా ఎన్నో రోజులు బతకను, నన్ను మరచిపోయి నువ్వు వేరే పెళ్లి చేసుకొని హాయిగా ఉండు అని చెప్పాడు. కొన్ని రోజులకు అతను చనిపోయాడు. ఇప్పటికీ వాళ్ల ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. తన జ్ఞాపకాలు తనని మర్చిపోలేకుండా చేస్తున్నాయి. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేనే వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యపీగా ఉండాలని తను కోరుకున్నాడు. నా కడుపున బేబీగా పుడతాను అని చెప్పాడు. లవ్ యూ బంగారం, తొందరగా రా ఓకే నా! అక్షర ( కామా రెడ్డి) -
నిమిషం కూడా ఆలోచించకుండా చచ్చిపొమ్మంది
నా పేరు ఉదయ్. మాది విశాఖపట్నం. నేను నాలుగు సంవత్సరాల క్రితం ఒక అమ్మాయిని లవ్ చేశాను. తనకి నేను ప్రపోజ్ చేసిన తరువాత ఒక సంవత్సరానికి తను నాకు ఓకే చెప్పింది. అందరి లవర్స్ లాగానే మేము కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఒకరోజు మా విషయం వాళ్ల ఇంట్లో తెలిసింది. వెంటనే తను నాకు ఫోన్ చేయడం మానేసింది. కానీ నేను ప్రతి రోజూ తన ఫోన్ కోసం ఎదురు చూసేవాడ్ని. ఒక రోజు తన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ తను నాకు ఫోన్ చేసి నన్ను మర్చిపో అంది. నాకు చాలా బాధ అనిపించింది తాను లేని జీవితం వృధా అనుకున్నా. తనకి ఫోన్ చేశాను నువ్వు లేని జీవితం భరించటం నా వల్ల కాదు నేను చనిపోతా అని చెప్పాను కానీ తను కనీసం ఆలోచించకుండా చనిపో అంది. అప్పుడు చాలా ఏడ్చాను. ఎలాంటి అమ్మాయిని కూడా ఇంకా నా జీవితం లోకి రానివ్వకూడదు అని నిర్ణయించుకన్నాను. తాను 2019లో పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది కానీ నేను తన గురించే తలచుకుంటూ బతుకుతున్నాను. తాను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను. -ఉదయ్(విశాఖపట్నం)