Film Stars
-
అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో సినీ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన- రామ్ చరణ్ (ఫొటోలు)
-
హాలీడే టూర్స్‌లో స్టార్స్ బిజీ బిజీ
స్టోరీ సిట్టింగ్స్, సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్... ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అందుకే అప్పుడప్పుడూ కాస్త రిలాక్స్ అవ్వాలనుకుంటారు. విహారం.. వినోదం కోసం కొంత టైమ్ కేటాయిస్తారు. ప్రస్తుతం అలా వెకేషన్ మోడ్‌లో ఏ స్టార్స్ ఎక్కడున్నారో తెలుసుకుందాం. మాల్దీవుల్లో మస్తీ వెకేషన్ స్పాట్ కోసం మాల్దీవులను ఎంచుకున్నారు రజనీకాంత్. వారం రోజుల క్రితం ఆయన మాల్దీవులకు వెళ్లిన సంగతి గుర్తుండే ఉంటుంది. అక్కడి బీచ్‌లో రజనీ నడుస్తున్న ఫొటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇక వెకేషన్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలోని సినిమా, లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లోని సినిమాలతో రజనీకాంత్ బిజీ అవుతారు. విదేశాల్లో బర్త్ డే ఇటీవలి కాలంలో సినిమా షెడ్యూల్స్‌కి కాస్త గ్యాప్ రావడంతో మహేశ్‌బాబు హాలిడే మోడ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెకేషన్లో ఉన్నారు మహేశ్‌బాబు. రెండు వారాలకు పైగానే ఈ వెకేషన్‌ను ΄్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 9న మహేశ్ బర్త్ డే. ఈ పుట్టినరోజుని విదేశాల్లోనే ఫ్యామిలీతో కలిసి జరుపుకుంటారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. వెకేషన్ కంటిన్యూ ఈ ఏడాది సంక్రాంతి సమయంలో విడుదలైన అజిత్ తమిళ చిత్రం ‘తునివు’ (తెలుగులో ‘తెగింపు’). ఆ సినిమా తర్వాత దాదాపు హాలిడే మూడ్‌లోనే ఉన్నారు అజిత్. తనకు ఇష్టమైన బైక్స్‌పై విదేశాల్లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌ను సందర్శించారు. కాగా అజిత్ తర్వాతి చిత్రం ‘విడా ముయర్చి’ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి మరికొంత సమయం ఉందట. దీంతో మరోసారి అజిత్ విదేశాలకు ప్రయాణమయ్యారని టాక్. షార్ట్ గ్యాప్ విజయ్ హీరోగా నటించిన ‘లియో’ చిత్రం ఈ దసరాకు విడుదల కానుంది. అలాగే విజయ్ నెక్ట్స్ ఫిల్మ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఈ చిత్రం ఆరంభం కావడానికి కాస్త టైమ్ ఉందట. ఈ షార్ట్ గ్యాప్‌లో విజయ్ విదేశాలకు వెళ్లారని కోలీవుడ్ సమాచారం. బాలీలో జాలీగా.. ఆరోగ్య, వ్యక్తిగత కారణాల దృష్ట్యా సినిమా చిత్రీకరణలకు కాస్త దూరంగా ఉండాలని సమంత నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సమంత వెకేషన్ కోసం బాలీ వెళ్లారు. అక్కడ ఐస్ బాత్ చేశారు సమంత (మెరుగైన ఆరోగ్యం కోసం ఓ ప్రక్రియ). మైనస్ 4 డిగ్రీల చలిలో ఆరు నిమిషాల ΄అటు ఐస్ బాత్ చేసినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేశారీ బ్యూటీ. ఇక సమంత హీరోయిన్గా నటించిన ‘ఖుషీ’ చిత్రం సెప్టెంబరు 1న విడుదల కానుంది. ఇందులో విజయ్ దేవరకొండ హీరో. అలాగే వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. దుబాయిలో హాయి హాయి.. గత నెల మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్ చాలా జోష్‌గా గడి΄ారు. ఈ హాలిడేని ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. తాజాగా ఫ్యామిలీతో కలిసి దుబాయ్ రిసార్ట్స్‌లో ఫుల్ జోష్‌లో ఉన్నారు రకుల్. తన తల్లి బర్త్ డేను దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారామె. ఇందుకోసమే రకుల్ అండ్ ఫ్యామిలీ దుబాయ్ వెళ్లారు. ‘భోళా శంకర్’ షూటింగ్‌ను పూర్తి చేసిన తర్వాత వెకేషన్‌కు వెళ్లొచ్చారు చిరంజీవి. ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చిన చిరంజీవి ఆగస్టు 11న విడుదల కానున్న ‘భోళా శంకర్’ ప్రమోషన్స్‌తో బిజీ అవుతారని తెలుస్తోంది. ఇక ఇటీవలే ఆస్ట్రియా వెళ్లొచ్చారు వెంకటేశ్. అక్కడ కొంత క్వాలిటీ హాలి డే టైమ్‌ను స్పెండ్ చేసొచ్చారు. ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు వెంకటేశ్. ఈ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు యాభై రోజులు యూఎస్‌లో స్పెండ్ చేసిన ప్రభాస్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘సలార్’, మారుతి దర్శకత్వంలోని ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న ఓ టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీ అవుతారని తెలుస్తోంది. ఇటు దర్శకుల విషయానికి వస్తే... రాజమౌళి తమిళనాడులోని ఆధ్యాత్మిక లొకేషన్స్‌లో ఎక్కవ టైమ్ స్పెండ్ చేశారు. ఇలా వెకేషన్‌కి వెళ్లొచ్చిన హీరో హీరోయిన్లు, దర్శకులు మరికొందరు ఉన్నారు. -
సిక్స్ కొట్టినంత ఈజీ కాదు.. సచిన్‌కు జగ్గారెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ‘క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, రవిశాస్త్రి, సినీ తారలు కంగనా, అజయ్ దేవగన్, అక్షయ్‌కుమార్ లాంటి వారు ఒక్కసారి నాగలి పట్టి, భూమి దున్ని, ఇత్తులేసి, నీరు పోసి, పంట పండించగలరా? నాగలి పట్టి, పొలం దున్ని, పంట పండించడం అంటే క్రికెట్ ఆడినంత ఈజీ కాదు.. సినిమాల్లో డైలాగ్ చెప్పి డాన్స్ చేసినంత సులువు కాదు. రైతుల గురించి, వారు చేస్తున్న ఉద్యమాల గురించి అవమానకరంగా మాట్లాడడం మానుకోవాలి’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి హితవు పలికారు. రైతులు పండించిన పంట తింటూ వారి పోరాటాన్నే వ్యతిరేకిస్తూ కొందరు సినీ తారలు, క్రికెట్ ప్లేయర్లు మూర్ఖంగా మాట్లాడటం బాధాకరమని శుక్రవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘సినీ పరిశ్రమలో, క్రికెట్ ఆటలో విరామం ఉంటుంది. వారు ఆడుతున్నా, నటిస్తున్నా చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తారు. కానీ రైతులు నాగలి పట్టి భూమి దున్నేటప్పుడు అలాంటిదేమీ ఉండదు. రైతులకు పరాయి దేశస్తులు మద్దతిస్తే దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన సెలబ్రిటీలు విమర్శలు చేయడం సిగ్గుచేటు’అని దుయ్యబట్టారు. -
కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.. ‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్డౌన్లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట. లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ. కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది. ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు. -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
చిన్న బ్రేక్
‘‘వ్యక్తిగత, వృత్తి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ, అప్పుడప్పుడూ చిట్‌చాట్ సెషన్స్‌తో తమ ఫాలోయర్స్, ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉంటుంటారు సినిమా స్టార్స్. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం అనేది కొంచెం ఒత్తిడితో కూడుకున్న పనే అని కొందరు స్టార్స్ అంటున్నారు. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ఇటీవల పలువురు తారలు ‘డిజిటల్ డిటాక్స్’ (సోషల్ మీడియాకు దూరంగా ఉండటం) సూత్రం ఫాలో అవుతున్నారు. కరోనా కారణంగా అందరూ సామాజిక దూరం పాటిస్తున్నాం. ‘డిజిటల్ డిటాక్స్’ అంటూ ఇటీవల సామాజిక మాధ్యమానికి బ్రేక్ ఇచ్చిన స్టార్స్, చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ యాక్టివ్‌గా ఉంటున్న స్టార్స్ గురించి తెలుసుకుందాం. మళ్లీ కలుద్దామని చెప్పి డిజిటల్‌కి దూరమైపోయారు త్రిష. ‘‘నా మైండ్‌కు కాస్త ఉపశమనం కావాలి. ఇది డిజిటల్ చికిత్స అనుకోవచ్చు. కొంచెం గ్యాప్ తర్వాత మళ్లీ కలుద్దాం’’ అంటూ ట్వీటర్‌కి చిన్న బ్రేక్ ఇచ్చారు త్రిష. ఇటీవలే ‘టిక్‌టాక్’లో కూడా త్రిష ఎంట్రీ ఇచ్చారు. మరో హీరోయిన్ యామీ గౌతమ్ ‘‘నా ప్రతి విషయాన్నీ ఇతరులతో పంచుకోవాలనుకోవడం లేదు’’ అని డిజిటల్ డిటాక్స్‌ను ఉద్దేశించి మాట్లాడారు. మరో బ్యూటీ పరిణీతీ చోప్రా ‘‘నా కోసం నాకు కొంత సమయం కావాలి. నా గురించి నేను మరింత తెలుసుకోవాలి. అందుకే కొంతకాలం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండాలనుకోవడం లేదు’’ అన్నారు. ‘‘ఈ క్వారంటైన్ టైమ్‌ని నా కోసం సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉంటాను’’ అన్నారు శ్రియా పిల్గోన్కర్. రానా నటించిన ‘హాథీ మేరీ సాథీ’ (తెలుగులో ‘అరణ్య’) చిత్రం ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ఈ బ్యూటీ. సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియాప్రకాశ్ వారియర్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేసి కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. ‘‘మానసిక ప్రశాంతత కోసమే నా ఇన్‌స్టా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశాను. లైక్‌లు, షేర్లు వంటివి నాలో ఒత్తిడిని పెంచాయనిపిస్తోంది. కొంత సమయం తర్వాత ఇప్పుడు నేను తిరిగి ఇన్‌స్టాలోకి వచ్చాను. భవిష్యత్‌లో కూడా కావాలనుకుంటే కొన్ని రోజులు నా అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేస్తాను’’ అన్నారు ప్రియాప్రకాశ్ వారియర్. డీయాక్టివేట్ ట్వీటర్లో నెగటివిటీ పెరిగిపోయిందని తన అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు సోనాక్షీ సిన్హా. నెగటివిటీ, అసభ్యపదజాలంతో కూడిన కామెంట్స్ ఎక్కువైపోయాయని, అందుకే ట్వీటర్ నుంచి వైదొలుగుతున్నానని అన్నారు బాలీవుడ్ నటుడు సాకిబ్ సలీమ్. ‘బద్రీనాథ్‌కి దుల్హనీయా, ధడక్’ చిత్రాలను తెరకెకెక్కించిన బాలీవుడ్ దర్శకుడు శశాంక్ కేతన్ తన ట్వీటర్ అకౌంట్‌ను డీ యాక్టివేట్ చేశారు. ‘‘సోషల్ మీడియా వల్ల రియల్ వరల్డ్ ఫేక్ వరల్డ్లాగా, ఫేక్ వరల్డ్ రియల్ వరల్డ్‌గా కనిపిస్తోంది’’ అంటున్నారు కృతీసనన్. -
సహాయం కోసం వేలం
కరోనా వల్ల ప్రపంచం ముందుకు వెళ్లకుండా ఆగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ప్రభావం అందరి మీదా పడింది. ఈ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఎవరికి తోచిన స్థాయిలో వారు సహాయం చేస్తున్నారు. సినిమా స్టార్స్ కుడా విరాళాలు ఇస్తూ, ఫ్యాన్స్‌ని సహాయం చేయమని పిలుపునిస్తూ ఉన్నారు. తాజాగా నిత్యా మీనన్ కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు గ్రామాలకు సహాయం చేయదలచుకున్నారు. అందుకోసం ఓ భిన్నమైన దారిని ఎంచుకున్నారు. గతంలో ఓ ఫ్యాషన్ షో కోసం తాను వేసుకున్న డిజైనర్ డ్రెస్‌ని వేలం వేస్తున్నారు నిత్య. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఓ ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలకు సహాయం చేయాలనుకుంటున్నారు. (ఓ రైటర్ కథ) -
సమోసా రెడీ
లాక్ డౌన్ కారణంగా అందరికీ వీలైనంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగ్‌లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్. -
కరోనా విరాళం
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు, సినిమా కార్మికుల కోసం ఇటీవలే ‘సీసీసీ మన కోసం’’ (కరోనా క్రైసిస్ చారిటి మనకోసం) ఏర్పాటు చేశారు ఇండస్ట్రీ ప్రముఖులు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. ఆదివారం విరాళం ప్రకటించిన వారి వివరాలు. ► రవితేజ (20 లక్షలు) ► వరుణ్ తేజ్ (20 లక్షలు) ► ‘దిల్’ రాజు, శిరీష్ (10 లక్షలు) ► శర్వానంద్ (15 లక్షలు) ► సాయిధరమ్ తేజ్ (10 లక్షలు) ► విశ్వక్ సేన్ (5 లక్షలు) ► ‘వెన్నెల’ కిశోర్ (2 లక్షలు) ► సంజయ్ (25 వేలు) -
కరోనా పాట
కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు కావాల్సిన జాగ్రత్తలు పాటించమని సినిమా స్టార్స్ తమ సోషల్ మీడియా ద్వారా అభిమానులందర్నీ కోరుతున్నారు. అయితే ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్. ప్రముఖ గాయకులు యస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాపై తమిళంలో ఓ పాట కంపోజ్ చేసి, పాడారు. ఈ పాటను రచయిత వైరముత్తు రచించారు. ప్రస్తుత సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఈ పాటను రాశారు. ఈ పాటను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు యస్పీబీ. -
సాయం సమయం
విపత్కర పరిస్థితుల్లో ‘మేం ఉన్నాం’ అంటూ సినిమా పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే షూటింగ్స్ అన్నీ రద్దు కావడంతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీపై ఆధారపడి జీవనం సాగించే చిన్నస్థాయి కళాకారుల జీవనశైలి కుంటుపడింది. దీంతో అటు కరోనా వైరస్‌పై పోరాడేందుకు కొందరు, చిన్నస్థాయి కళాకారులకు అండగా ఉండేందుకు మరికొందరు సినిమా తారలు ఇప్పటికే విరాళాలు ప్రకటించారు. గురువారం మరికొంతమంది తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటించారు. ఈ వివరాలు. ► చిరంజీవి – కోటి రూపాయలు (కరోనా కారణంగా ఉపాధి కాల్పోయిన సినీ వేతన కార్మికుల సంక్షేమం కోసం). ► మహేశ్‌బాబు – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► ప్రభాస్ – కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్‌కు 50లక్షలు, తెలంగాణకు 50 లక్షలు.) ► పవన్‌కల్యాణ్ – 2 కోట్లు (ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి కోటి రూపాయలు.) ► ఎన్టీఆర్ – 75 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 25 లక్షలు, తెలంగాణకు 25 లక్షలు, తెలుగు సినీ కార్మికులకు 25 లక్షలు.) ► రామ్‌చరణ్ – 70 లక్షలు (కేంద్ర, తెలుగురాష్ట్ర ప్రభుత్వాల సహాయనిధికి) ► ‘నాంది’ (ప్రస్తుతం ‘అల్లరి’ నరేష్ హీరోగా నటిస్తున్న చిత్రం) యూనిట్లో రోజువారి వేతనంతో జీవనం సాగించే 50మందికి పైగా ఉన్న కార్మికులకు చిత్రనిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్కరికి తలా 10వేల రూపాయలను సాయంగా అందించాలని ‘అల్లరి’ నరేశ్ నిర్ణయించుకున్నారు. ► సాయితేజ్ – 10 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) ► నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► త్రివిక్రమ్ – 20 లక్షలు (ఆంధ్రప్రదేశ్‌కు 10లక్షలు, తెలంగాణకు 10 లక్షలు.) ► అనిల్ రావిపూడి – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5లక్షలు, తెలంగాణకు 5లక్షలు) ► కొరటాల శివ – 10 లక్షలు ( ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు.) -
కుకింగ్.. క్లీనింగ్
కోవిడ్ 19 (కరోనావైరస్)తో దేశవ్యాప్తంగా థియేటర్స్, షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. దీంతో సినిమా తారలందరూ హోమ్ క్యారంటైన్లో ఉన్నారు. షూటింగ్స్, ప్రమోషన్స్ ఎప్పుడూ బిజీగా ఉండే వీరికి కాస్త ఖాళీ సమయం దొరకడంతో రోటిన్‌కి భిన్నంగా ఎవరికి వారు తమకు తోచిన పనిలో నిమగ్నమైపోయారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే గరిటె తిప్పే పనిలో పడిపోయారు. బెండాకాయ వేపుడు చేశారు ఇలియానా. హౌస్ క్లీనింగ్ పనిలో పడిపోయారు తాప్సీ. ఓ చైనీస్ వంటకం చేశారు వరలక్ష్మీ శరత్‌కుమార్. బాలీవుడ్ హీరోయిన్ అనుష్కా శర్మ తన తండ్రి (అజయ్ శర్మ) కోసం స్వయంగా కేక్ చేశారు. వర్కౌట్‌కి సై అన్నారు సన్నీ లియోన్. చీపురు పట్టుకుని గార్డెను క్లీన్ చేశారు బాలీవుడ్ హీరో ఆదిత్యారాయ్ కపూర్. షూటింగ్‌కి బదులుగా కుకింగ్.. క్లీనింగ్‌తో బిజీ బిజీగా ఉంటున్నారు తారలు. అనుష్కాశర్మ చేసిన కేక్, ఆదిత్యారాయ్ కపూర్, ఇల్లు క్లీన్ చేస్తున్న తాప్సీ ఇలియానా చేసిన కూర, సన్నీలియోన్, వరలక్ష్మీ చేసిన చైనీస్ డిష్ -
కరోనాపై యుద్ధం గెలుద్దాం
కోవిడ్ 19 (కరోనా వైరస్)ను కట్టడి చేసే క్రమంలో 21 రోజులు దేశం లాక్ డౌన్లో ఉంటుందని ప్రధాని మోదీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజలందరూ ఇందుకు సహకరించాలని కొందరు సినీ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వివరాలు ఇలా.. ► ఇంట్లో వాడే నిత్యావసర సరుకులను వీలైనంత తక్కువగా వాడుకుంటూ పొదుపు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ అయిపోయాయి, కొనాలంటే వస్తువులు దొరకడం లేదనే కంగారు, ఆందోళనలు ఉండవు. ► అవసరం మేరకు మాత్రమే కొని భద్రపరచుకుందాం. కనీస పొదుపు ఆచరించి ఇతరుల అవసరాలకు కూడా సహకరిద్దాం. ► వేపుడు వంటకాలు, కాలక్షేప, తీపి తినుబండారాలకు దూరంగా ఉందాం. ఖాళీ సమయం దొరికింది కదా అని కొత్త వంటలు, ప్రయోగాలను ఇప్పటి పరిస్థితుల్లో మానుకుందాం. ► మన చిన్నతనంలో బామ్మలు, అమ్మమ్మలు, అమ్మ మనకు చేసిపెట్టిన తరహాలో కనీస కూరలతో భోజనం కానిద్దాం. ► భారతీయులుగా మనమంతా ఒక్కటై కరోనా వైరస్ వ్యాప్తిని నివారిద్దాం. ► దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీగారికి, అందుకు సహకరిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా అభినందనలు, ధన్యవాదాలు. ► ఈ లాక్డౌన్ సమయంలో ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యంగా ఉందాం... ఆరోగ్యం పంచుదాం. – చిరంజీవి మన ప్రధాని మోదీగారు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. కరోనా కట్టడికి ఇది మంచి అడుగు. మన జీవితాల కన్నా ఏదీ ముఖ్యం కాదు. నేను, నా కుటుంబం ఇంట్లోనే ఉంటున్నాం. మీరు కూడా ఇదే పాటించాలని కోరుకుంటున్నాను. – తమన్నా ధనిక, పేద, కులం, మతం అనే తారతమ్యాలు లేవు. మనం దరం మనుషులం. సమిష్టిగా పోరాడి కరోనాను చంపేద్దాం. – మంచు మనోజ్ ఇప్పటి మన జీవనశైలిలో 21రోజులు ఇంటిపట్టునే ఉండటం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఇలా మనందరం లాక్డౌన్లో ఉన్నందుకు సంతోషపడే సమయం వస్తుందని నమ్ముతున్నాను. – తాప్సీ స్వీయ నియంత్రణకు, పాత అలవాట్లను మానుకుని కొత్త అలవాట్లు అలవరచుకోవడానికి 21 రోజులు సమయం చాలా ఉత్తమమైనది. ఆన్లైన్ కోర్సులు, ఎక్కువగా చదువుకోవడం ముఖ్యంగా మెడిటేషన్ వంటివి చేస్తున్నాను నేను. సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి. – కాజల్ అగర్వాల్ ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవు. మనకు నచ్చిన రీతిలో ఉగాది వేడుక జరుపుకోలేకపోయాం. కరోనా మహమ్మారి మరణం తర్వాత తొందర్లోనే ఓ కొత్త ఆరంభం లభిస్తుంది. ఇంట్లో ఉండండి. సురక్షితంగా ఉండండి. – అదితీరావ్ హైదరీ మానసికంగా ధృడంగా ఉండండి. పుస్తకాలు చదవడం, వంటలు చేయడం, యోగా చేయడం వంటివి చేయండి. అప్పుడప్పుడు ప్రార్థనలు చేయండి. 21 రోజులు ఇట్లే గడిచిపోతాయి. – అనుపమా పరమేశ్వరన్ ‘కంట్రీ 21డేస్ లాక్డౌన్’కు కట్టుబడి ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని మరికొందరు స్టార్స్ స్పందించారు. ఈ 21 రోజుల లాక్‌డౌన్‌ని పాటించకపోతే ఈ లాక్డౌన్ ఇంకా మరో నెల కొనసాగే అవకాశం ఉంది. ఇటలీ, స్పెయిన్, ఇరాన్ వంటి దేశాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో మనం చూస్తున్నాం. అక్కడి పరిస్థితులను చూసి మనం ఇక్కడ నేర్చుకుందాం. ఏం కాదులే అనే నిర్లక్ష్యంతో మనం వ్యవహరిస్తే మనతో పాటు మనకు ఇష్టమైనవారిని, దేశంలోని ప్రజలను మనం విపత్కర పరిస్థితుల్లోకి నెట్టినవాళ్లం అవుతాం. కరోనాను కట్టడి చేయడంలో ఉన్న మీ వంతు బాధ్యతను ఓసారి గుర్తు చేసుకోండి. మనందరం కలిసి పోరాడితే ఈ కరోనా పరిస్థితులను విజయవంతంగా దాటగలం. – ఇలియానా కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. పలువురు సెలబ్రిటీలు కూడా తమ వంతు బాధ్యతగా కరోనా మహమ్మారిని తరిమేద్దాం అంటూ అవగాహన కల్పిస్తున్నారు. ఉగాది సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి, కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మహేశ్‌బాబు. ‘నమ్మకమైన సమాచారాన్ని కలిగి ఉండండి. ప్రార్థిద్దాం, మంచిని ఆశిద్దాం.. కలసికట్టుగా ఈ యుద్ధాన్ని గెలుద్దాం’ అంటూ, కింది విలువైన నియమాలను పాటించాలని కోరారు మహేశ్‌బాబు. 1 ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు. 2 ఏదైనా వస్తువును తాకితే కనీసం 20 నుంచి 30 సెకన్లు మీ చేతులను సబ్బు మరియు నీటితో కడుక్కోవాలి. 3 ముఖాన్ని.. ముఖ్యంగా కళ్లు, నోరు, ముక్కును తాకకుండా ఉండండి. 4 దగ్గు లేదా తుమ్ము వచ్చినప్పుడు మీ మోచేతులు లేదా టిష్యూ వాడండి. 5 సామాజిక దూరం అవసరాన్ని అర్థం చేసుకుని, మీ ఇంటి లోపల లేదా బయట ఇతర వ్యక్తుల నుండి కనీసం 3 మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. 6 మీకు కరోనా లక్షణాలు లేదా అనా రోగ్యం ఉన్నట్లయితే మాత్రమే మాస్క్‌ని వాడండి. మీకు కోవిడ్–19 లక్షణాలు ఉంటే దయచేసి డాక్టర్ని లేదా క్లినిక్‌ని సంప్రదించండి. -
నాలుగో విడుతలో ఓటు వేసిన ప్రముఖులు
-
ఓటెత్తిన ప్రముఖులు
-
వాయుసేనకు వందనం : ఫిలిం స్టార్స్
ఆత్మాహుతి దాడితో 40 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకున్న తీవ్రవాదులపై భారత వైమానిక దళం పగ తీర్చుకుంది. ఈ రోజు (మంగళవారం) ఉదయం భారత వాయు సేన 29 నిమిషాల పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో దాదాపు 200 నుంచి 300 మంది తీవ్రవాదులు హతమయ్యుంటారని భావిస్తున్నారు. ఈ ప్రతీకార చర్యపై ప్రతీ ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్జికల్ స్ట్రైక్ 2 అంటూ సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని విజయ గర్వాన్ని పంచుకుంటున్నారు. సినీ తారలు సైతం భారత సైన్యాన్ని ప్రశంసిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్ బాబు, కమల్ హాసన్, రామ్ చరణ్, అఖిల్, వరుణ్ తేజ్, మంచు విష్ణు, మెహరీన్, సోనాక్షి సిన్హా, నితిన్, ఉపాసన, వెంకీ అట్లూరిలతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు విజయానందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. Our country gives a fitting reply. #IndiaStrikesBack . Salute to the Indian Air Force #JaiHind — Jr NTR (@tarak9999) 26 February 2019 Extremely proud of our #IndianAirForce. Salutes to the brave pilots of IAF🇮🇳 — Mahesh Babu (@urstrulyMahesh) 26 February 2019 Salute to the #IndianAirForce 🙏🏻. JAI HIND. #IndiaStrikesBack — rajamouli ss (@ssrajamouli) 26 February 2019 Our 12 return safely home after wreaking havoc on terrorist camps in Pakistan. India is proud of its heroes. I salute their valour. — Kamal Haasan (@ikamalhaasan) 26 February 2019 #SaluteIndianAirForce 🇮🇳🇮🇳🇮🇳 https://t.co/1G4RDOssu2 — Varun Tej Konidela (@IAmVarunTej) 26 February 2019 Proud of the Indian Air Force 🇮🇳 Jai Hind 🇮🇳 🙏🏼#IndiaStrikesBack #ramcharan pic.twitter.com/f5rN4Qc1sP — Upasana Konidela (@upasanakonidela) 26 February 2019 -
బాధ్యతగా ఓటేశారు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా సినీతారలు, క్రీడాకారులు ఉదయాన్నే పోలింగ్ స్టేషన్లకు చేరుకున్నారు. ఓటేసిన తరువాత అందరూ తప్పకుండా ఓటేయాలని మీడి యా ద్వారా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. చింతమడకలో కేసీఆర్.. మరోవైపు రాజకీయ నేతల్లో అధికశాతం తాము పోటీ చేస్తోన్న సీట్లలో కాకుండా మరో చోట ఓటువేయడం గమనార్హం. సీఎం కేసీఆర్ దంపతులు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం లో ఓటు వేశారు. మంత్రి హరీశ్‌రావు దంపతులు సిద్దిపేటలో ఓటేశారు. మంత్రి కేటీఆర్ బంజారాహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆజంపురాలో, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాంగ్రెస్ స్టార్ క్యాం పెయినర్ విజయశాంతి (బంజారాహిల్స్), జైపాల్‌రెడ్డి (జూబ్లీహిల్స్), వి.హనుమంతరావు (అంబర్‌పేట) కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నల్లగొండలో ఓటేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ (చిక్కడపల్లి), కిషన్‌రెడ్డి (కాచిగూడ), ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ (రాజేంద్రనగర్), టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ (జగిత్యాల), టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం (తార్నాక), సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి (శేరిలింగంపల్లి), సీపీఐ కేంద్ర కార్యదర్శి నారాయణ (హిమాయత్‌నగర్), సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి (హుస్నాబాద్), ప్రజాగాయకుడు గద్దర్ (అల్వాల్) ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల్లో క్యూలో నిలుచుని ఓటు వేశారు. ఉన్నతాధికారులు గవర్నర్ నరసింహన్ దంపతులు (ఎంఎస్ మక్తా), ప్రభుత్వ సీఎస్ ఎస్కే జోషి (ప్రశాసన్‌నగర్), తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి (కుందన్‌బాగ్), ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ దంపతులు (ఖైరతాబాద్)లు నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్– సుజాత దంపతులు (వరంగల్‌లో) ఓటేశారు. సినీతారలు సైతం.. కృష్ణ–విజయనిర్మల, చిరంజీవి–సురేఖ, నాగార్జున–అమల, వెంకటేశ్, నిర్మాత సురేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ దంపతులు, ఆయన తల్లి శాలిని, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రాణా, గోపీచంద్, రాజమౌళి దంపతులు, నితిన్, బండ్ల గణేశ్, రామ్ పోతినేని, శేఖర్ కమ్ముల, కోచ్ గోపీచంద్, పీవీ సింధు, సానియా మీర్జా, వందేమాతరం శ్రీనివాస్, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, తొట్టెంపూడి వేణు, మంచులక్ష్మి, జగపతిబాబు, ఆర్పీ పట్నాయక్, వరుణ్‌తేజ్, నాగబాబు, చార్మి, శ్రీకాంత్–ఊహ, బ్రహ్మాజీ, నిఖిల్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను, సుమ, ఉపాసన, సమంత, ఝాన్సీ, రాఘవేంద్రరావు తదితర ప్రముఖులు హైదరాబాద్‌లో ఓటేశారు. ఓటు వేసేందుకు వస్తున్న మహేశ్‌బాబు -
బిగ్ బి 1.. దీపికా 2
సినిమా తారలను, క్రీడాకారులను రోల్ మోడల్‌గా తీసుకుంటారు యూత్ అంటోంది యూగోవ్ అనే సంస్థ. ఈ ఏడాది ఇండియాలో యూత్‌ని ఎక్కువ ప్రభావితులను చేసిన ప్రముఖులు ఎవరు? అంటూ ఈ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ లిస్ట్‌లో అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో దీపికా పదుకోన్ ఉండగా అక్షయ్ కుమార్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్ 5,6,7 స్థానాల్లో నిలిచారు. 3, 4 స్థానాల్లో క్రీడాకారులు ఉన్నారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా 9, 10 స్థానాల్లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో ఉన్నవాళ్లలో ఆలియా భట్ చిన్న వయస్కురాలు కావడం విశేషం. -
బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు
బాలీవుడ్ సినీ ప్రముఖులు దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేస్తారు. సినిమా రిలీజ్‌ల పరంగా కూడా ఈ సీజన్లో మంచి సందడి కనిపిస్తుంది. టాప్ స్టార్లయితే తమ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలం గడుపుతూ ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు బిగ్ బీ అమిత్ బచ్చన్. ప్రతీ ఏడాది అమితాబ్ ఇంట్లో దీపావళి సంబరాలు ఘనంగా జరుగుతాయి. బిగ్ బీ స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. బాలీవుడ్ తారాతోరణం అంతా అమితాబ్ ఇంట్లో వేడుకల్లో పాల్గొంటారు. అయితే గత ఏడాది మాత్రం ఈ సందడి కనిపించలేదు. అమితాబ్ కోడలు, నటి ఐశ్వర్యరాయ్ తండ్రి మరణించటంతో బిగ్ బి ఫ్యామిలీ వేడుకలకు దూరంగా ఉంది. కేవలం ఉదయం కుటుంబ సమేతంగా లక్ష్మీ పూజ చేసిన అమితాబ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఏడాది మరోసారి తన స్టైల్లో సినీ తారలతో కలిసి వేడుకలు నిర్వహించేందుకు అమితాబ్ ప్లాన్ చేస్తున్నారట. బాలీవుడ్ తారలంతా బిగ్‌బీ ఇంట్లో జరిగే దీపావళి సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. -
బ్యూటీ స్మైల్
-
కరుణానిధికి సినీతారల కన్నీటి నివాళి
తమిళ సినిమా (చెన్నై): కరుణానిధి పార్థివ దేహానికి నివాళులర్పించేందుకు సినీతారలు భారీగా తరలివచ్చారు. రజనీకాంత్, ఆయన సతీమణి లతా రజనీకాంత్, కూతురు ఐశ్వర్య, అల్లుడు, నటుడు ధనుష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. నటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్, అజిత్, శాలిని దంపతులు, శివకుమార్, సూర్య, దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్, నాజర్, ఇతర కార్యవర్గ సభ్యులు, ప్రభు, రామ్‌కుమార్, విక్రమ్ ప్రభు, టి.రాజేందర్, ప్రసన్న, స్నేహ, రాధా రవి, సత్యరాజ్, దర్శకుడు కె.భాగ్యరాజ్, గౌండ్రమణి, వివేక్, పార్తీపన్, సిబి రాజ్, శివకార్తీకేయన్, విజయ సేతుపతి, అధర్వ, నందా, బాబీ సింహా, పశుపతి, ఆర్కే.సురేశ్, మన్సూర్ అలీఖాన్, శ్రీమాన్, విమల్, పా.విజయ్, సంతానభారతి, నటి సరోజాదేవి,కోవై సరళ, దర్శకుడు ఎస్పీ.ముత్తురామన్, పి.వాసు, కేఎస్.రవికుమార్ తదితరులు నివాళులర్పించారు. విదేశాల్లో షూటింగ్లో ఉన్న నటుడు విజయ్, విక్రమ్, దర్శకుడు ఏఆర్ మురుగదాస్, సంగీత దర్శకుడు రెహమాన్, దర్శకుడు శంకర్ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. -
అలనాటి అందాల తారలు
80లలో సినీరంగంలో హీరోలు, హీరోయిన్లు గా ఓ వెలుగు వెలిగిన దక్షిణాది తారలు ప్రతీ ఏటా కలిసి పార్టీ చేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ సంవత్సరం ఓ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళ, మలయాళల, కన్నడ నటులు పాల్గొంటారు. ఈ ఏడాది కూడా ఈ గెట్ టు గెదర్ కన్నుల పండుగగా జరిగింది. 28 మంది దక్షిణాది తారలు ఇందులో పాల్గొన్నారు. అలనాటి అందాల తారలంతా ఒకే థీమ్ దుస్తుల్లో దిగిన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఆత్మీయ సమావేశంలో తెలుగు స్టార్ హీరో చిరంజీవి, వెంకటేష్ లతో పాటు శరత్ కుమార్, నరేష్, భాను చందర్, సురేష్, భాగ్యరాజ... హీరోయిన్లు రమ్యకృష్ణ, సుమలత, రాధిక, రేవతి, నదియా, సుహాసిని, జయసుధ, ఖుష్బూ తదితరులు పాల్గొన్నారు. -
జల్లికట్టు కోసం కొనసాగుతున్న నిరసనలు
చెన్నై : తమిళుల సాంప్రదాయ క్రీడ, జల్లికట్టు కోసం సామాన్య ప్రజలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా నిరసనలకు దిగుతున్నారు. ఇప్పటికే సినీ రంగంనుంచి స్టార్ హీరోలు సాంకేతికనిపుణులు జల్లికట్టు కోసం తమ గళం వినిపించగా తాజాగా బహిరంగ నిరసనకు దిగారు. సంక్రాంతి పండుగ ముగిసినా వివాదం మాత్రం సద్దుమణగటం లేదు. జల్లికట్టును నిషేదిస్తూ కోర్టు తీర్పునిచ్చినా.. నిరసనకారులు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. తాజాగా మెరీనా బీచ్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తమిళ స్టార్ హీరోలు సూర్య, విశాల్, విజయ్, శింబు, లారెన్స్ లు పాల్గొన్నారు. ఆందోళనలో భాగంగా మంగళవారం రాత్రి కూడా బీచ్ లోనే ఉన్న ఆందోళనకారులు బుధవారం కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మెరీనా బీచ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులు నిరసన కారులు గుమిగూడి ఉన్నారు. ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోయినా.. ముందు జాగ్రత్తగా భారీ ఎత్తున బీచ్ పరిసరాల్లో పోలీసు బలగాలను మోహరించారు. -
సండే నో హాలిడే
వర్క్.. వర్క్.. మండే మార్నింగ్ నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ బిజీ బిజీగా గడిపే జనమంతా, వీకెండ్స్ వచ్చేసరికి సినిమాకో.. పార్టీకో.. వెళ్తారు. ఎంజాయ్ చేస్తారు. మరి, సినిమా తారల సంగతేంటి? వాళ్లది 9 టు 6 జాబ్ కాదుగా. సండే.. మండే.. వీకెండ్స్ అనే తేడా ఉండదు. షెడ్యూల్‌ను బట్టి షూటింగ్ చేయక తప్పదు. స్టార్స్ నుంచి స్మాల్ ఆర్టిస్టుల వరకూ వీకెండ్స్‌లో షూటింగ్ ఉంటే చేస్తారు. ఈ వారాంతంలో చిరంజీవి, మహేశ్‌బాబు, అక్షయ్‌కుమార్ వంటి హీరోలతో పాటు శ్రుతీహాసన్ టు తాప్సీ... చాలామంది తారలు మేకప్ వేసుకున్నారు. ‘సండే నో హాలిడే... అయినా ఓకే’ అంటూ హ్యాపీగా షూటింగ్‌లకు హాజరయ్యారు. చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. రాఘవా లారెన్స్ నృత్య దర్శకత్వంలో చిరు, రాయ్ లక్ష్మీలపై ప్రత్యేక గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. చిరంజీవియేమో స్టూడియోలో స్టెప్పులేస్తుంటే.. మహేశ్‌బాబు హైదరాబాద్ రోడ్స్‌పై ఫైట్ చేస్తున్నారు. ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో చేస్తున్నారు. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో ఛేజింగ్, యాక్షన్ సీన్స్ తీస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్ హీరోగా నటిస్తున్న ‘ఉంగరాల రాంబాబు’ సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణలోనే జరుగుతోంది. హైదరాబాద్‌లో శ్రుతీహాసన్ ‘కాటమరాయుడు’ షూటింగ్లో బిజీగా ఉంటే.. మలేసియాలో ‘నామ్ షబానా’ అంటున్నారు తాప్సీ. ‘బేబి’కి ప్రీక్వెల్‌గా రూపొందుతోన్న ‘నామ్ షబానా’ షూటింగ్‌తో ఆమె బిజీ. ఇందులో తాప్సీది మెయిన్ రోల్. అక్షయ్‌కుమార్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. శింబూతో కలసి చెన్నైలో జరుగుతోన్న ‘అన్బానవన్ అసురాదవన్ అడంగాదవన్’ షూటింగ్లో పాల్గొంటున్నారు తమన్నా. ఇంకా పలువురు తారలు ఈ వీకెండ్ షూటింగులతోనే గడిపారు. -
ఇచట సినిమా దుస్తులు అమ్మబడును
‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో బన్నీ వేసుకున్న ట్రౌజర్ అదిరిపోయింది కదరా... అచ్చం అలాంటిది దొరికితే ఎంతైనా పెట్టి కొనేస్తాను అంటాడో కుర్రాడు. ‘‘జనతా గ్యారేజ్’ మూవీలో సమంత వేసుకున్న టాప్ చాలా బాగుందే. వాళ్లకి అలాంటివి దొరుకుతాయి. మనకెందుకు దొరకవు? అంటూ నిట్టూరుస్తుందో యువతి. అయితే ఇలాంటి సరదాలు తీర్చడానికి ఇప్పుడు కొన్ని వెబ్సైట్లు సిద్ధమయ్యాయి. చెర్రీలా దుస్తుల్లో చెలరేగాలనుకునే చిన్నోళ్లు... తమన్నాలా త‘లుక్’మనాలనుకునే తరుణీమణులూ... బీరెడీ. – శిరీష చల్లపల్లి తెరపై కథానాయికలు ధరించే అందమైన చీరలు, డ్రెస్సులు జీవితంలో ఒక్కసారైనా మనం వేసుకోగలమా? అని ఆలోచించే అమ్మాయిలు... లైఫ్ అంటే హీరోలదే... మనకా అదృష్టం లేదని చింతించే అబ్బాయిలూ ఉన్నారు. అలాంటి వాళ్లను చూసి ‘వీరి సినిమా పిచ్చి తగలెయ్య..’ అనుకుంటూ నవ్వుకోవడం నిన్నటిమాట.. ఇప్పుడు సీన్ మారిపోయింది. తమకి ఇష్టమైన సినిమాల్లో, రియాలిటీ షోలో... తమ ప్రియ హీరోయిన్/హీరో ఫలానా సీన్/పాటలో... ధరించిన డ్రెస్ వేసుకోవాలని అనిపించడమే ఆలస్యం.. ఒక్క క్లిక్‌తో అవి ఒంటి మీద వాలుతున్నాయి. హవా స్టైల్... లివాస్టార్ ‘స్టార్’ దుస్తుల ఫ్యాషన్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చిన వెబ్సైట్లలో లివాస్టార్ ఒకటి. లివాస్టార్ వెబ్సైట్లోకి వెళ్లి మనకు కావాల్సిన సినిమా డ్రెస్సింగ్ స్టైల్ ని ఫొటోతో సహా వారికి పోస్ట్ చేయాలి. వెంటనే రిప్లై మెసేజ్ వస్తుంది. అలా మీ టెస్ట్‌కు తగ్గట్టూ, సైజును బట్టి మీరు కోరుకున్న స్టార్ కాస్ట్యూమ్ నాలుగు రోజుల్లో కళ్ల ముందుంటుంది. హీరో, హీరోయిన్లు ధరించిన కాస్ట్యూమ్స్ మీ సైజ్‌కు తగ్గట్టుగా రెడీమేడ్‌గా డెలివరీ అయిపోతాయి. కేవలం దుస్తులు మాత్రమే కాదు సినిమా స్టార్స్ ధరించే యాక్ససరీస్, ఆభరణాలు, రిస్ట్‌వాచ్‌లు సైతం ఈ తరహా వెబ్‌సైట్స్‌లో ఆర్డర్ చేయొచ్చు. అ‘డ్రెస్’ చెబుతారు కొంతమందికి కొన్ని సినిమాల్లో డ్రెస్‌లు నచ్చినా ఆ తర్వాత అవి ఎక్కడ చూశామో గుర్తుండకపోవచ్చు. అలాంటి వారు ఫలానా హీరోయిన్/హీరో పేరుని పోస్ట్ చేస్తే వారికి సంబంధించి, వారు ధరించగా హిట్ అయిన ఫ్యాషన్ కలెక్షన్స్ డిస్ప్లే చేస్తారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాటిలో కావాల్సిన కాస్ట్యూమ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్స్ దుస్తులు మక్కీకి మక్కీ కావాలనుకునేవారు కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. యాక్టర్స్ రేంజ్లో డ్రెస్ వేసుకోవాలంటే ఆ మాత్రం తప్పదు కదా.