Gadwal Vijaya Laxmi
-
ప్రపంచ స్థాయి వైద్యం నగరంలో దొరుకుతుంది : మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ : నగరంలో రోజురోజుకు మెడికో టూరిజం అభివద్ధి చెందుతున్నదని ఇది నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మంచి పరిణామమని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె మణికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాన్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న చిన్న పిల్లలకు కూడా కళ్లద్దాలు పెట్టుకొని కనిపిస్తుంటే బాధగా ఉందని స్మార్ట్ ఫోన్లు వినియోగం వల్లనే వారి కళ్లు దెబ్బతింటున్నాయని ఆమె అన్నారు.తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అప్పుడే వారు కళ్ళద్దాలకు దూరమవుతారని అన్నారు. మన దేశంలోని వివిధ నగరాల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులను ప్రతియేటా నగరంలోని ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకొని వెళ్తున్నారని ఈ సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిపుణులతో పాటు అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం నగరంలోని పలు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండటమే ఇందుకు గల కారణమని అన్నారు.అనంతరం ప్రాన్ కేర్ ఐకేర్ వైద్యురాలు అంజనీ ప్రతాప్ మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న పిల్లల కంటి సమస్యలు దూరపు చూపు కనిపించకపోవడం వంటి సమస్యలు తీవ్రమయ్యాయని ఇది ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్ళల్లో పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం వల్ల స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల పిల్లల కళ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వవొద్దని సూచించారు. తమ ఆస్పత్రిలో 20 రోజుల పాటు 15 సంవత్సరాల లోపు పిల్లలకు ఉచితంగా స్రీనింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ కస్తూరి నరేందర్, డాక్టర్ జి. సుధాకర్ రెడ్డి, ప్రొఫెసర్ రాజలింగం, ప్రణవ్, సీఎం రావు తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: మేయర్‌పై కేసు నమోదు
హైదరాబాద్, సాక్షి: బతుకమ్మ కార్యక్రమంలో శబ్ద కాలుష్యం నియమాలు ఉల్లంఘించినందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై కేసు నమోదైంది. శబ్ధ కాలుష్య నిబంధనలను ఉల్లంఘిస్తూ బతుకమ్మ వేడుకలకు అనుమతించి, సమయానికి మించి అధిక డెసిబుల్ సంగీతాన్ని అనుమతించారనే ఆరోపణలపై బంజారాహిల్స్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. -
నిమజ్జనానికి అంతా రెడీ: జీహెచ్ఎంసీ మేయర్
సాక్షి,హైదరాబాద్: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. సోమవారం(సెప్టెంబర్16) నిమజ్జనంపై సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.’నిమజ్జనానికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఆదేశించాం.ట్యాంక్‌బండ్‌పై క్రేన్స్ ఏర్పాటు చేశాం. ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం జరుగుతుంది. నాతోపాటు అధికారులు కూడా గత వారం రోజుల నుంచి నిమజ్జన ఏర్పాట్లలో ఉన్నారు. రేపు ఎల్లుండి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారు. వేలసంఖ్యలో సిబ్బంది, అధికారుల సమన్వయంతో నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాం. గతంతో పోలిస్తే ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం’అని మేయర్ చెప్పారు.కాగా, హైదరాబాద్‌లో మంగళవారం(సెప్టెంబర్ 17) నిమజ్జనం జరగనున్న విషయం తెలిసిందే. నిమజ్జనం కోసం పోలీసులు పక్కాగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖైరతాబాద్ గణేష్, నాలుగు గంటలకు బాలాపూర్ గణేష్ నిమజ్జనం జరగనుందని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి.. గణేష్ నిమజ్జనం..అనుభవాల నుంచి పాఠాలు -
అసభ్య పోస్టులపై జీహెచ్ఎంసీ మేయర్ ఫిర్యాదు
హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్ జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. -
GHMC: మేయర్ విజయలక్ష్మి ఇంట్లో చొరబడిన రౌడీషీటర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లోకి ఓ రౌడీ షీటర్ చొరబడటం తీవ్ర కలకలం సృష్టించింది. సదరు వ్యక్తి నేరుగా మేయర్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం, పోలీసులు మేయర్ ఇంటికి వచ్చిన రౌడీ షీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ మంగళవారం మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. నేరుగా వచ్చి ఆమె వ్యక్తిగత గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె సిబ్బంది అడ్డుకున్నారు. సిబ్బంది వారించినా అతను పట్టించుకోలేదు. దీంతో, అతడిని సిబ్బంది అడ్డుకుని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందించారు. ఇక, ఆ సమయంలో మేయర్ ఇంట్లో లేరు.వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే, లక్ష్మణ్‌కు మతిస్థిమితం సరిగా లేనట్టు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. లక్ష్మణ్ గత రెండు రోజులుగా మేయర్ ఇంటి చుట్టే తిరిగినట్టు పోలీసులు తెలిపారు. -
మేయర్ ఇంటి వద్ద కరెంటు పోలేదు
హైదరాబాద్: ‘విద్యుత్‌పై సమీక్ష చేసి.. ఒక్క నిమిషం కూడా కరెంటు పోనియ్యం.. అని సచివాలయంలో చెప్పి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లగానే కరెంటు పోయింది.. ప్రొటోకాల్ ప్రకారం సీఎం ఉన్న ఏరియాలో కరెంటు పోవద్దు.. రేవంత్‌రెడ్డి మీకే దిక్కు లేదు.. మీరు ప్రజలకేం గ్యారంటీ ఇస్తారు’ అని బీఆర్ఎస్ నేత వై.సతీ‹Ùరెడ్డి ఆదివారం చేసిన ట్వీట్‌తో విద్యుత్ అధికారులు స్పందించారు. శనివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఎన్బీటీనగర్లో కేకే, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వచ్చారని, ఆయన ఉన్నంతసేపు ఎలాంటి కరెంటు అంతరాయం కలగలేదని, టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రీట్వీట్ చేశారు. ఇంటర్నల్ వైరింగ్ లోపంతో టెంపరరీగా ఏర్పాటు చేసిన ఫ్లడ్ లైట్లు వెలుగుతూ ఆరిపోయాయని, ఇది కరెంటు వైర్ సమస్య వల్ల తలెత్తిందని, అసలు కరెంటు పోలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి ముందు, పరిసర ప్రాంతాల్లో వీధి దీపాలు నిరంతరాయంగా వెలిగాయన్నారు. ఇదిలా ఉండగా కరెంటు పోయినట్లుగా వచి్చన వార్తల పట్ల మేయర్ నివాస సిబ్బంది కూడా స్పందించారు. సీఎం ఉన్నంతసేపు అసలు కరెంటు పోలేదని, ఒక వైర్ కదలిక వల్ల ఫ్లడ్ లైట్లు ఆరుతూ వెలిగాయన్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇంటికి 11 కేవీ ఫీడర్‌తో స్పెషల్‌గా కరెంటు సరఫరా ఉందని బంజారాహిల్స్ ఏడీఈ ఆర్.హైమానంద వెల్లడించారు. శనివారం సీఎం వచి్చన సమయంలో మేయర్ ఇంటితో పాటు ఎన్బీటీనగర్లో కరెంటు అంతరాయం కలగలేదని స్పష్టం చేశారు. మేయర్ ఇంటి వద్ద సీఎం ఉన్న సమయంలో మూడుసార్లు కరెంటు పోయిందంటూ జరుగుతున్న దు్రష్పచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. -
కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో ఆమె హస్తం గూటికి చేరుకున్నారు. కాగా, కొద్దిరోజలుగా మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఆమె హస్తం గూటికి చేరారు. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ నివాసానికి చేరుకున్న విజయలక్ష్మి.. సీఎం, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక, అంతకుముందు మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కూడా హస్తం తీర్థం పుచ్చుకున్నారు. -
పార్టీ మారినా.. నో ఫియర్!!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా ఆమె పదవికి ఢోకా లేదు. అలాగే డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నా ఆమె పదవికీ నష్టం లేదు. ఎన్నికైన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వేరే పార్టీకి మారితే అనర్హత వేటుపడే ప్రమాదం ఉన్నా మేయర్, డిప్యూటీ మేయర్లకు మాత్రం పదవులు పోయే ప్రమాదం లేదు. జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పారీ్టలు మారినా వారి పదవులు పోయే అవకాశం లేదు. మొత్తం పాలక మండలిలో మెజార్టీ సభ్యుల అవిశ్వాస తీర్మానం ద్వారా మాత్రమే వారి పదవులు పోయే ప్రమాదం ఉన్నా, బాధ్యతలు చేపట్టాక నాలుగేళ్ల వరకు కూడా అలాంటి అవకాశం లేదు. అందుకే వారు ఏ పారీ్టకి మారినా దాదాపు మరో ఏడాది వరకు వారి çపదవులకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ప్రస్తుత పాలకమండలిలో మేయర్‌గా విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా శ్రీలత బాధ్యతలు స్వీకరించింది 2021 ఫిబ్రవరి 11న. 2025 ఫిబ్రవరి 10 వరకు వారి పదవులకు వచి్చన ముప్పు ఏమీ లేదు. ఒకవేళ వారి పనితీరు బాగాలేదనో, మరో కారణంతోనో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనుకున్నా అప్పటి వరకు ఆగాల్సిందే. కాబట్టి.. ఇప్పుడు జీహెచ్ఎంసీలో పార్టీల బలాబలాలు, అవిశ్వాస తీర్మానాలు అనేవి అసలు అంశమే కాదని అటు అధికారులతో పాటు ఇటు రాజకీయ నేతలు సైతం చెబుతున్నారు. నాలుగేళ్ల గడువు తర్వాత అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా వారి పదవులకు మిగిలి ఉండేది స్వల్ప సమయం మాత్రమే. అప్పటికి పార్టీల బలాబలాల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. మారనున్న బలాబలాలు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు భారీగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేయర్ పార్టీ మారుతుండగా, ఇదివరకే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డిప్యూటీ మేయర్ దంపతులు శ్రీలత, శోభన్‌రెడ్డిలు సైతం కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. ఇదే వరుసలో దాదాపు ఇరవైమంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి సైతం కొందరిని లాగే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉన్నట్లు తెలిసింది. ఫలించిన కాంగ్రెస్ వ్యూహం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచే జీహెచ్ఎంసీ మేయర్‌గా ప్రతిపక్ష పార్టీ వారుండరాదనే పట్టుదలతో ఉంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేది తమ ప్రభుత్వమే అయినందున మేయర్, డిప్యూటీ మేయర్లు కూడా తమ పార్టీ వారే ఉండాలనే వ్యూహంతో పనిచేసింది. ఆ దిశగా సఫలమైన కాంగ్రెస్ ఇక కార్పొరేటర్లపైనా వల వేయనుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యులు గెలిచింది ఇద్దరే అయినప్పటికీ, ప్రస్తుతం ఆ సంఖ్య డజనుకు చేరింది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్, బీజేపీల నుంచి దాదాపు 30 మంది వరకు కాంగ్రెస్‌లో చేరతారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని, ఎమ్మెల్యేలు పారీ్టలు మారితే వారి అనుయాయులు, అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారని చెబుతున్నారు. తమ డివిజన్లలో ఎక్కువ అభివృద్ధి పనులు జరగాలంటే, అందుకు అవసరమైన నిధులు పొందాలంటే అధికార పారీ్టలో ఉంటేనే సాధ్యమని కార్పొరేటర్లు సైతం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల నాటికే కాంగ్రెస్ సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అభిప్రాయాలున్నాయి. -
కాంగ్రెస్ లోకి మేయర్ విజయలక్ష్మి..?
-
హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్?
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె హస్తం గూటికి వెళ్తారా? అనే సస్పెన్స్ నెలకొంది. కాగా, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ నాయకులపై దృషి సారించింది. దీంతో, తాజాగా జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మేయర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో, ఆమె నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అనంతరం విజయలక్ష్మి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని దీపాదాస్ మున్షీ ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించిన తర్వాత నిర్ణయం చెబుతాను. వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటాను. రెండు సార్లు నన్ను గెలిపించిన కార్యకర్తలకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోను అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు వేగవంతం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, అసంతృప్త నేతలను టార్గెట్ చేసి హస్తం గూటికి తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ గూటికి ప్రతిపక్ష పార్టీలోని సీనియర్ నేతలు, అంతకుముందు కాంగ్రెస్‌ను వీడిన నేతలు హస్తం గూటికి చేరుతున్నారు. -
జీహెచ్ఎంసీ సమావేశంలో గందరగోళం..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. కౌన్సిల్ హాల్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య పోటాపోటీ వాగ్వాదం నెలకొంది. పలు సమస్యలపై ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన సమావేశంలో ఎస్ఆర్డీపీ రెండోదశ, మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, జిహెచ్ఎంసి బకాయిలని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేశారు. శానిటేషన్ పై చర్చ జరపాలని పట్టుబట్టారు. మరోవైపు జీహెచ్ఎంసీ కార్మికులకు, గ్రేటర్ ప్రజలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ కార్మికుల ఉద్యోగాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. మేయర్ ఆగ్రహం బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల పై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్ల నిరసనను తప్పుబట్టిన మేయర్.. ఏదైనా ఉంటే ప్రశ్నోత్తరాల్లో అడగాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ జరగకుండా అడ్డుపడితే మార్షల్‌తో బయటకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజల కోసం కౌన్సిల్‌ను సజావుగా నడవాలని కోరారు. ప్రజా సమస్యలపై చర్చించి 6 నెలలు గడుస్తోందని, మళ్లీ ఇప్పటి వరకు చర్చించలేదేని తెలిపారు. కార్మికుల అంశం పెద్ద సమస్యేనని, చర్చలు జరిపిన తరువాత కార్మికులపై ప్రకటన చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలకు బానిసలుగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైందని బీజేపీ కార్పొరేటర్లు మండిపడ్డారు. గ్రేటర్ సిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కార్పొరేటర్లను లెక్కచేయడం లేదని దుయ్యబట్టారు. ప్రోటోకాల్ లేకున్నా ఎమ్మెల్యేకు నచ్చిన వాళ్ళు రావాలి.. ఎమ్మెల్యేకు నచ్చకపోతే ప్రోగ్రాం క్యాన్సల్ అవుతోందని తెలిపారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలకు బానిసలుగా తయారు అయ్యాదని విమర్శించారు. డివిజన్ కార్యాలయాల్లో కనీసం జాతీయ జెండా ఎగరేసే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కమిషనర్ రోడ్లపై తిరుగుతున్నారని, మేయర్ కూడా సిటీలో పర్యటించాలని సూచించారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ హల్లో తమ నేతల పేర్లపై బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్ల పోటీపోటీగా నినాదాలు చేశారు. గ్రేటర్ సిటీ అభివృద్ధి కేటీఆర్, కేసీఆర్ వల్లే జరిగిందని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. గ్రేటర్ సిటీలో కేంద్రం పాత్ర, కిషన్ రెడ్డి పాత్ర ఉందని బీజేపీ కార్పొరేటర్లు పేర్కొన్నారు. పేర్లను తీసుకోవద్దని మేయర్ ఇరువుకి సూచనలు చేశారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు నిరసన ఆపాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ సమస్య జీహెచ్ఎంసీ పరిధిలో ప్రోటోకాల్ సమస్య అందరికీ ఉందని మేయర్ విజయలక్ష్మీ పేర్కొన్నారు. ప్రోటోకాల్ సమస్యపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే దీనిపై అధికారులతో రివ్యూ చేస్తామని చెప్పారు. ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కార్పొరేటర్ పేరు ఉండాలని తెలిపారు. మేయర్ Vs విజయారెడ్డి జీహెచ్ఎంసీ కౌన్సిల్ హల్లో మేయర్ వర్సెస్ విజయారెడ్డిగా మారింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతుండగా కాంగ్రెస్ కార్పొరేటర్ విజయారెడ్డి అడ్డుపడ్డారు. కార్మికులకు జీతాలు పెంచితే విజయారెడ్డి పాలాభిషేకం చేశారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు చెప్పగా.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని విజయారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుల పట్ల ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. కార్మికులను పర్మినెంట్ చేయాలని అడగటం చైర్‌ను అవమానించినట్లు కాదని, మేయర్ చైర్‌ను తాను అవమానించలేదని తెలిపారు. కొత్త కాంట్రాక్టు ఇవ్వడం వల్ల స్ట్రీట్ లైట్ల సమస్య ఉందని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. గత నెల రోజుల్లో 6వేల కొత్త లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రోజుకు 6 దల నుంచి వెయ్యి లైట్ల ఫిట్టింగ్ చేస్తున్నామన్నారు. సరైన విధంగా లైట్ల మెంటనెన్స్ లేనందున ఆయా సంస్థలకు 6కోట్ల ఫైన్స్ వేశామని తెలిపారు. కార్మికుల సమస్యలపై కార్పొరేటర్లు లేవనెత్తిన అంశాలను నోట్ చేసుకున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మేయర్‌తో మాట్లాడిన తరువాత త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పారు. -
అధికారులదే హవా?
-
మలబార్ గోల్డ్ & డైమండ్స్‌ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-
కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్‌గా పనిచేయడం అంత సులువు కాదని విజయలక్ష్మి అన్నారు. కాగా, తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించారు.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ మేయర్ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. -
కుక్కల దాడిపై స్పందించిన వర్మ.. జీహెచ్ఎంసీ మేయర్‌పై సెటైర్లు!
వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్మ ఏ కామెంట్ చేసిన సోషల్ మీడియాలో పెను సంచలనంగా మారిపోతుంది. అయితే, తాజాగా తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తనదైన స్టైల్లో వర్మ ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాగా, ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలో కుక్కల దాడులు పెరుగుతున్న కారణంగా మేయర్ విజయలక్ష్మి అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్‌లో భాగంగా మేయర్.. కుక్కల దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై వర్మ స్పందించారు. ఈ సందర్బంగా వర్మ.. కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ప్రశ్నించారు. Hey @GadwalvijayaTRS why don’t u resign your post as a mayor and take all the Dog goons into your home and feed them yourself , so that they won’t eat our children ? pic.twitter.com/2dfa426hRv — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 అయితే, అంతకుముందు మేయర్.. ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. Hey @GadwalvijayaTRS I WANT TO BITE @KTRBRS @hydcitypolice pic.twitter.com/bXTFqsxzzH — Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023 -
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కచ్చితంగా చర్యలు తీసుకుంటాం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడి మృతి బాధాకరం: మేయర్
-
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిపై ఆరోపణ
సాక్షి, వికారాబాద్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని ఓ వ్యక్తి బుధవారం మీడియా ఎదుట ఆరోపించాడు. ఇందుకు సంబంధించి అతడి వివరాలు ఇలా ఉన్నాయి.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్ 20లో పదెకరాల భూమిని గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్ కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్నారు. తాతల కాలం నుంచి ఈ భూమిలో తామే కబ్జాలో ఉన్నామని చెప్పాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దొరసాని రాములమ్మ నుంచి తమ పెద్దలు ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలు సైతం ఉన్నాయని వెల్లడించాడు. 2004 వరకు సదరు భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరునే నమోదై ఉందని తెలిపారు. అయితే 2005లో దొరసాని సంబంధీడైన నర్సింహారెడ్డి అప్పటి తహసీల్దార్ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన కడీలను నగర మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తొలగించేయిస్తున్నారని, అడిగితే చంపేస్తామని గన్‌తో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని వాపోతున్నారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. చదవండి: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌కు రిప్లై ఇచ్చిన రాష్ట్రపతి భవన్ -
ఉప్పల్‌లో మేయర్ విజయలక్ష్మికి నిరసన సెగ
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఉప్పల్ నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలో రసాభాస చోటుచేసుకుంది. మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే నిరసన సెగ తగిలింది. స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిని పిలవకుండా ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ మేయర్ విజయలక్ష్మిని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మేయర్ ప్రోటోకాల్ పాటించట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విజయలక్ష్మి తీరుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎమ్మెల్యే అనుచరులు, మేయర్ వర్గం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెండు వర్గాలు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపై విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ నిధులతో చేస్తున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను పిలవాల్సిన అవసరం లేదంటూ ఆగ్రహించారు. ప్రోటోకాల్‌తో తనకు సంబంధం లేదని, అది అధికారుల పనంటూ శంకుస్థాపన చేయకుండానే మేయర్ వెనుదిరిగారు. -
Hyderabad: పంజాగుట్ట టు శంషాబాద్.. సిగ్నల్ ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: పంజాగుట్ట నుంచి శంషాబాద్ వరకు సిగ్నల్ ఫ్రీ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం ఔటర్ రింగ్ రోడ్డు నుంచి శిల్పా లేఅవుట్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్, ఔటర్ రింగ్ రోడ్డు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లను అనుసంధానం చేస్తున్నామన్నారు. 1.4 కిలో మీటర్ల పొడవునా ఫ్లైఓవర్, 1.4 కిలో మీటర్లు ర్యాంప్, లింకు రోడ్లను రూ.300 కోట్లతో చేపట్టామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 47 ప్రాజెక్ట్‌లు చేపట్టగా ఎస్ఆర్డీపీ ద్వారా 41 ప్రాజెక్ట్‌లు, ఇతర శాఖల ద్వారా 6 ప్రాజెక్ట్‌లు చేపట్టామని తెలిపారు. శిల్పా లేఅవుట్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన నాలుగు లేన్ల బై డైవర్షనల్ 17వ ఫ్లైఓవర్ అని తెలిపారు. ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. (క్లిక్ చేయండి: హమ్మయ్య.. హైదరాబాద్ వాహనదారులకు ఊరట) -
కంప్యూటర్ ఆపరేటర్‌కు వేధింపులు.. మాతృ సంస్థకు ఉన్నతాధికారి
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ ఆపరేటర్‌ను లైంగికంగా వేధించాడనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఎస్ఓ)గా పనిచేస్తున్న ఎం.శ్రీనివాస్‌ను ఆయన మాతృశాఖ అయిన వైద్యారోగ్య శాఖకు పంపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ తనను కొంతకాలంగా వేధిస్తూ, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు నేరుగా మేయర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం, సీరియస్ అయిన మేయర్ ఎస్ఓను మాతృశాఖకు పంపించాల్సిందిగా ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ను మా తృశాఖకు పంపించడంతో పాటు ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి, తదుపరి చ ర్యల నిమిత్తం నివేదికను ఆయన మాతృశాఖకు పంపిస్తామని ఉత్తర్వులో పేర్కొన్నారు. చదవండి: సినీ పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
కంప్యూటర్ ఆపరేటర్‌కు లైంగిక వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళా కంప్యూటర్ ఆపరేటర్‌ను వేధిస్తున్న స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్‌ను వెంటనే సస్పెండ్ చేయడంతోపాటు మాతృశాఖకు పంపించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత ఆరోగ్యవిభాగం అడిషనల్ కమిషనర్ బాదావత్ సంతోష్‌ను ఆదేశించారు. బాధితురాలు మేయర్‌కు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. చార్మినార్ జోన్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని ఆరోగ్య విభాగంలో స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ కొంత కాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు, కొందరు యూనియన్ నేతలకు గత వారమే తన బాధలు తెలియజేశారు. తాజాగా సోమవారం నేరుగా మేయర్ విజయలక్ష్మిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. దాంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్ విజయలక్ష్మి అతన్ని వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు మాతృశాఖకు సరెండర్ చేయాల్సిందిగా అడిషనల్ కమిషనర్‌ను ఆదేశించారు. విషయం తెలిసినప్పటికీ, తగిన విధంగా స్పందించని చీఫ్ మెడికల్ ఆఫీసర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన శ్రీనివాస్ గత ఫిబ్రవరిలో పదోన్నతిపై బల్దియాకు వచ్చారు. గ్రేటర్‌లోని 30 సర్కిళ్లకు గాను 15 సర్కిళ్లకు స్టాటిస్టికల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. తరచూ చార్మినార్ జోన్‌కు వెళ్లేవాడని సమాచారం. తన విషయం బహిర్గతమవుతుందని తెలిసి సోమవారం అయ్యప్పమాల ధరించినట్లు జీహెచ్ఎంసీలో ప్రచారం జరుగుతోంది. -
GHMC: ఆస్తుల ధ్వంసం, మేయర్ ఆగ్రహం, బీజేపీ కార్పొరేటర్లపై కేసు
సాక్షి, బంజారాహిల్స్: బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో కలిసి జీహెచ్ఎంసీ ఆస్తులను ధ్వంసం చేయడం హేయమైన చర్య అని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ప్రజాప్రతినిధులుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో అనేక మార్గాలు ఉన్నప్పటికీ మన కార్పొరేషన్ ఆస్తులను మనమే ధ్వంసం చేయడం సరికాదన్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ విజయలక్ష్మి మాట్లాడారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజల ఆస్తిని ధ్వంసం చేయడంపై బీజేపీ కార్పొరేటర్లు ఆత్మపరిశీలన చేసుకోవాలని, రాజ్యాంగ పరమైన పదవిలో ఉండి ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రజలకు వ్యవస్థలపై నమ్మకం పోతుందన్నారు. చదవండి: GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్.. తనను కలిసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ రాకపోవడంపై బీజేపీ కార్పొరేటర్లు సమాధానం ఇవ్వాలన్నారు. ఆ విషయాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, కార్పొరేటర్లు ప్రజా సమస్యలపై స్పందించి వెంటనే పరిష్కరించటంలో రాజీపడటం లేదన్నారు. తాను నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో లోతట్టు ప్రాంతాలు సందర్శించి అధికారులను, ప్రజలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఎల్బీనగర్ జోన్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం ఎక్కువ ముంపునకు గురైన సందర్భంలో వెల్ఫేర్ అసోసియేషన్, కార్పొరేటర్లు, అధికారులతో సమీక్ష చేసి తాత్కాలిక, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జూన్ 29న వర్చువల్ ద్వారా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లు విన్నవించిన సమస్యలను పరిష్కరించినట్లు స్పష్టం ఆమె స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించలేకపోతున్నామని, ఈ విషయం బీజేపీ కార్పొరేటర్లకు తెలిసినప్పటికీ కావాలనే దాడి చేశారని అన్నారు. కార్పొరేటర్లు సహా 20 మందిపై కేసు ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుర్చీలు, పూల కుండీలు, టేబుల్, అద్దాలను ధ్వంసం చేయడంతో బీజేపీ కార్పొరేటర్లు సహా 20 మందిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
GHMC: రణరంగంగా మారిన మేయర్ చాంబర్..
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించాలని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించాలనే డిమాండ్లతో బీజేపీ కార్పొరేటర్లు తమ అనుచరులతో మేయర్ విజయలక్ష్మి కార్యాలయంలోనికి చొచ్చుకుపోవడం రణరంగాన్ని తలపించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో తీవ్ర తోపులాట జరిగింది. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ కార్పొరేటర్లు కమిషనర్ చాంబర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ గుంపుగా పోగైన వారు జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాసేపు బైఠాయించారు. అక్కడి నుంచి మేయర్ చాంబర్‌వైపు వెళ్లారు. కార్పొరేటర్లతో పాటు వారి అనుచరులు దాదాపు రెండొందల మంది వరకు గుంపులుగా చేరడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ముందుకు దూసుకువెళ్తూ వరండాలోని పూలకుండీలను ధ్వంసం చేశారు. చదవండి: కుంకుమ పువ్వు సాగుపై కేటీఆర్ ప్రశంస మేయర్ అప్పటికింకా కార్యాలయానికి రాలేదు. ఆమె చాంబర్లోకి వెళ్లి ఫర్నిచర్‌ను, ల్యాంపులు, పూలకుండీలను ధ్వంసం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల నేమ్‌బోర్డులు పీకిపారేశారు. కేబుల్‌వైర్లు తెంపారు. జీహెచ్ఎంసీ పేరున్న బోర్డుపై నల్లరంగు పూశారు. చాంబర్లో బైఠాయించారు. మేయర్‌కో హటావో.. జీహెచ్ఎంసీ బచావో తదితర నినాదాలతో కూడిన పోస్టర్లను చాంబర్లో అంటించారు. మెరుపు ధర్నాతో కాసేపు ఏం జరుగుతోందో అక్కడున్నవారికి అర్థం కాలేదు. ఈ పరిణామాలతో దాదాపు రెండు గంటల పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చదవండి: ఎంకి పెళ్లి సుబ్చి చావుకొచ్చిందన్నట్టు.. వారికి సంతోషమే.. కానీ.. పగిలిపోయిన పూలకుండీలను ఒకచోటకు చేరుస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బంది కార్పొరేటర్లుగా ఎన్నికై ఏడాదవుతున్నా ఇంతవరకు సమావేశాలు నిర్వహించలేదని, కార్పొరేటర్లకు బడ్జెట్ కేటాయించలేదని నినాదాలు చేశా రు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ జులుం నశించాలని నినదించారు. సమస్యలు పరిష్కరించకపోతే కేసీఆర్, కేటీఆర్ కార్యాలయాలను ముట్టడిస్తామన్నారు. ఒకసారి నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాణి వినిపించలేకపోయామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలని, సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీజేపీ నేతలు, వారి అనుయాయులను అరెస్టు చేశారు.