garuda seva
-
శ్రీనివాసుని గరుడ సేవ.. భక్తజనంతో కిక్కిరిసిన తిరుమల (ఫొటోలు)
-
తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు పౌర్ణమి గరుడ సేవ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) 54,620 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,234. హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా లెక్క తేలింది. Tirumala Garuda Seva : శుక్రవారం తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు మాడ వీధులలో గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
Tirumala: వైభవంగా గరుడోత్సవం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి బ్రహోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజు.. శుక్రవారం సాయంత్రం గరుడోత్సవం వైభవంగా మొదలైంది. గరుడవాహనంపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం ఇచ్చారు. చిరు జల్లులతో వరుణుడు స్వాగతం పలికారు. తిరు వీధులు భక్తులతో నిండిపోయి.. గోవింద నామ స్మరణతో మారుమోగాయి. వేద పండితుల మంత్రాలు, భక్తుల గోవింద నామాలు , మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, దేవతా మూర్తుల కళా రూపాలతో తుమ్మలగుంట క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. స్వామి వారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం వైభవోపేతంగా సాగింది. సాయంత్రం 4 గంటల నుంచే చుట్టు ప్రక్కల ప్రాంతాలు, పక్క మండలాల నుంచి భక్తులు తుమ్మలగుంటకు అధికంగా తరలివచ్చారు. వాహన సేవ ముందు కళాకారుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిత్యం మూలమూర్తి అభరణాలైనా మకరకంఠి, సహాస్రనామ మాల, లక్ష్మీకాసుల హారాలను గరుడసేవలో అలంకరించారు. ఏడాది మొత్తంలో.. గరుడోత్సవం రోజు మాత్రమే ఆభరణాలు గర్భాలయం నుంచి బయటకు వస్తాయన్నది తెలిసిందే. మరోవైపు గ్యాలరీలలో రెండు లక్షల భక్తులు చేరినట్లు అంచనా. గరుడవాహన దర్శనం కోసం భక్తులు పోటీ పడ్డారు. గరుడవాహన దర్శనం కోసం రింగ్ రోడ్డుకు భక్త సంద్రం తరలి వచ్చింది. గరుడోత్సవంలో జిల్లా కలెక్టర్ శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శించారు. ఇస్కాన్ ప్రతినిధులు ఆలయం వద్దకు చేరుకుని సారె సమర్పించారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి సారె సమర్పణ శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడసేవ ప్రారంభానికి ముందు తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి శ్రీవారికి సారె తెచ్చారు. సుమారు వెయ్యి మంది గ్రామస్తులు పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పువ్వులు, పండ్లు తీసుకు వచ్చి స్వామి వారికి సమర్పించారు. ఉదయం మోహినీ అవతారంలో నిత్య కళ్యాణ శోభితుడు అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 7 గంటలకు కల్యాణ వెంకటేశ్వర స్వామి మోహినీ అవతారంలో పల్లకీపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనంకు వున్న ప్రత్యేకత ఏమంటే మోహినీ అవతారం లో వున్న స్వామి భక్తులను ఆకట్టుకునేలా వివిధ రకాల ఆభరణాలు ధరించి.. కుడి చేతిలో చిలుకను పట్టుకుని.. ముందు ఏర్పాటు చేసిన అద్దంలో ముఖాన్ని చూస్తూ వుంటారు. స్వామి వారి పల్లకీ సేవలో భక్తులు తరించి పునీతులయ్యారు. బ్రహ్మోత్సవాల్లో రేపు.. కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
గరుడోత్సవానికి భారీగా తరలివస్తున్న భక్తులు
-
భక్తుల సర్వదర్శనాలకు అన్ని ఏర్పాట్లు చేశాం : టీటీడీ చైర్మన్
-
తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
తిరుమలలో గరుడ సేవకు విస్తృత ఏర్పాట్లు
-
బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. ‘కరోనా’ కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ‘కరోనా’ తొలగడంతో ఈసారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు... బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరిస్తారా..? సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెప్టెంబరు 20న ఉదయం 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తాం. సెప్టెంబర్ 26న రాత్రి 7–8 గంటల మధ్య అంకురార్పణ జరుగుతుంది. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల వరకు మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు పెద్ద శేష వాహన సేవ జరుగుతాయి. ధ్వజారోహణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలు జరుగుతాయి. అయితే గరుడ వాహనసేవ మాత్రం రాత్రి 7 నుంచి ఒంటి గంట వరకు నిర్వహిస్తాం. అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తాం. తిరుమల ఆస్థానమండపం, తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి వద్ద సంగీత, నృత్య కార్యక్రమాలను నిర్వహిస్తాం. రెండేళ్ల ‘కరోనా’ మహమ్మారి తర్వాత ఈసారి బ్రహ్మోత్సవాలు భక్తుల నడుమ జరుగుతున్నందున అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఇందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? తిరుమలలో రెండేళ్ల తరువాత శ్రీవారి బ్రహ్మోత్సవ వాహనసేవలను మాడవీథుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లలో బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా జరిగాయి. దూరప్రాంతాల నుంచి సొంత వాహనాలపై వచ్చే భక్తుల కోసం అలిపిరి వద్ద ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. శ్రీవారి ఆలయంతో పాటు అన్ని ముఖ్యకూడళ్లలోనూ విద్యుద్దీపాలంకరణలను ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు సేవలందించేందుకు మూడున్నర వేల మంది శ్రీవారి సేవకులను ఇప్పటికే ఆహ్వానించాం. ఫొటో ఎగ్జిబిషన్, మీడియా సెంటర్ ఏర్పాటు చేస్తాం. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ, అదనంగా ఐదువేల మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసుకున్నాం. వైద్యవిభాగం ఆధ్వర్యంలో స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచుతాం. నిర్దేశిత ప్రాంతాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసి, అంబులెన్సులను అందుబాటులో ఉంచుతాం. భక్తుల రాకపోకల సౌకర్యం కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా తగినన్ని బస్సులను అందుబాటులో ఉంచుతాం. ప్రధాన కల్యాణకట్టతో పాటు పది మినీ కల్యాణకట్టల్లో భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా తలనీలాలు సమర్పించు కునేలా ఏర్పాట్లు చేశాం. టీటీడీలోని 337 మంది రెగ్యులర్ క్షురకులు, 852 మంది పీస్‌రేటు క్షురకులు కలిపి మొత్తం 1189 మంది ఉన్నారు. వీరు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచేలా ఏర్పాట్లు చేశాం. ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. ఘాట్ రోడ్లలో ప్రమాదాలు జరగకుండా చూసేందుకు గరుడసేవ నాడు పూర్తిగా, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నాం. అక్టోబర్ 1న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీ దృష్ట్యా ట్రస్టుల దాతలకు, కాటేజీ దాతలకు సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్లైన్లోను, ఆఫ్‌లైన్‌లోను గదుల కేటాయింపు ఉండదు. దాతలు ఈ విషయాన్ని గమనించాలని కోరుతున్నాం. టీటీడీ చైర్మన్‌గా మీరు రెండోసారి బాధ్యతలు చేపట్టారు. స్వామివారి సేవలో మరోసారి అవకాశం దక్కడంపై ఎలా భావిస్తున్నారు? శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రథమ సేవకుడిగా సేవచేసే అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. ఆ కొందరిలో నేను కూడా ఉండడం స్వామివారు ప్రసాదించిన అదృష్టంగా భావిస్తున్నాను. టీటీడీలో చైర్మన్, బోర్డు సభ్యులే కాదు అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు స్వామివారి అనుగ్రహం లేనిదే పనిచేసే అవకాశం రాదు. ఈ విషయాన్ని మనసా వాచా కర్మణా ప్రగాఢంగా నమ్ముతాను. స్వామివారి అనుగ్రహం వల్లే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి నాకు రెండోసారి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పనిచేసే అవకాశం కల్పించారు. భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? లక్షలాదిగా తరలివచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాను. (క్లిక్ చేయండి: శ్రీనివాసుని ఏ వారం దర్శించుకుంటే ఏ ఫలితం...) -
Tirumala: 27 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుమల: రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమాయత్తమవుతోంది. ఈనెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహన సేవలు జరగనున్నాయి. 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడసేవ నిర్వహించనున్నారు. ఇక కోవిడ్ కారణంగా రెండేళ్లపాటు ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసారి మాడ వీధుల్లో వాహన సేవలు జరగనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశముంది. ఈ క్రమంలో వారి కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈనెల 20న ఉ. 6 నుంచి 11 గంటల మధ్య సంప్రదాయబద్ధంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. (క్లిక్: ఏపీలో ‘ఆంధ్ర గోపుష్టి’ కేంద్రాలు.. విజయవాడలో తొలిస్టాల్) -
ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు
తిరుమల: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే, కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం జరుగుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి అయోధ్య కాండ లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో ఈనెల 21 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద వి/ê్ఞన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ జరగనుంది. పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్షిప్ అందించాయి. నేడు పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20న బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. -
తిరుమలలో వైభవంగా శ్రీవారి పౌర్ణమి గరుడ సేవ
-
వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో సోమవారం సాయంత్రం కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. కోవిడ్ నేపథ్యంలో లాక్డౌన్ అనంతరం మొదటిసారిగా మలయప్పస్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 నుండి 8.30 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియజెబుతున్నాడు.గరుడ వాహనసేవలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి కర్పూర నీరాజనాలు అందించారు. -
నేడు తిరుమలలో పున్నమి గరుడ సేవ
సాక్షి, తిరుమల: తిరుమలలో ప్రతినెలా జరిగే పున్నమి గరుడసేవ గురువారం సాయంత్రం జరుగనుంది. కోవిడ్ నిబంధనల కారణంగా ఆలయంలో కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. కాగా ఈ నెలలో స్వామివారికి మూడుసార్లు గరుడసేవ జరుగనుంది. పౌర్ణమి సందర్భంగా గురువారం, అక్టోబరు 31న, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 20న గరుడసేవ నిర్వహిస్తారు. -
తిరుమలలో శ్రీవారి పున్నమి గరుడ సేవ
-
తిరుమలలో వైభవంగా గరుడ సేవ
-
పెరటాసి నెల చివరి వారం.. తిరుమల కిటకిట
సాక్షి, తిరుమల: తిరుమలలో నాలుగు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఓ వైపు దసరా సెలవులు ముగుస్తుండటంతో పాటు, పెరటాసి నెల చివరి వారం కావడంతో తమిళనాడు నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం దాదాపు 26 గంటలకు పైగా సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలో భక్తులు వేచి ఉన్నారు. రద్దీ దృష్ట్యా నడక దారిన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు, సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. పెరటాసి మాసంలో శనివారం కావడంతో అక్టోబరు 12న 1,01,371 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. వెంకన్న దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. మరోవైపు స్వామివారికి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. దేవదేవుడు గరుడ వాహనంపై తిరు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చారు. కాగా ప్రతి నెలా పౌర్ణమి రోజు తిరుమలలో గరుడ సేవ జరగుతుంది. -
గరుడ సేవపై విహరించిన స్వామివారు
-
తిరుమలేశుడు గరుడ సేవా
-
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన స్వామివారు
-
‘శ్రీవారి గరుడ సేవకు అన్ని ఏర్పాట్లు చేశాం’
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల భాగంగా గరుడ వాహన సేవకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుమారు రెండు లక్షల మంది భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గ్యాలరీలలో వేచి ఉన్న భక్తులకు వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. మాడ వీధుల్లో 20 ప్రాంతాల్లో, వెలుపల 14 ప్రాంతాల్లో గరుడ సేవను భక్తులు తిలకించడానికి ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశామని అనిల్ సింఘాల్ పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత స్వామివారి గరుడ వాహన సేవకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని టీటీడీ సీవీఎస్ఓ గోపీనాథ్ జెట్టి తెలిపారు. సుమారు 4 వేల మంది పోలీసులు, 15000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతరం కంట్రోల్‌రూమ్ నుంచి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారని పేర్కొన్నారు. 1600 సీసీ కెమెరాలతో గరుడసేవ నిరంతరం పర్యవేక్షణలో ఉంటుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి గ్యాలరీలలోకి భక్తులను అనుమతిస్తామని గోపీనాథ్ తెలిపారు. -
తిరుమల కిటకిట
తిరుమల/తిరుపతి తుడా: ఇల వైకుంఠం.. తిరుమల క్షేత్రానికి వేసవి సెలవులతో భక్తులు పోటెత్తుతున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల కొండ నిత్యం కిటకిటలాడుతోంది. ఈనెల 11 నుండి 15వ తేదీ వరకు రికార్డు స్థాయిలో దాదాపు 4.39 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు తిరుమల ఇన్చార్జ్ జేఈవో బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సమన్వయంతో పనిచేసి ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో గత ఐదు రోజుల్లో 4,38,514 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు. 11వ తేదీ శనివారం 95,016, 12వ తేదీ ఆదివారం 1,01,086, 13వ తేదీ సోమవారం 87,947, 14వ తేదీ మంగళవారం 80,156, 15వ తేదీ బుధవారం 74,309 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సరాసరిన ప్రతి రోజు 87,702 మంది దేవదేవుడి దర్శనభాగ్యాన్ని పొందారు. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాదాలు, వసతి, తలనీలాల సమర్పణ, దర్శనం, లడ్డూ ప్రసాదాలు తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆయా విభాగాలు విశేషంగా కృషి చేశాయి. రవాణా విభాగం ఆధ్వర్యంలో ధర్మరథాలు నిరంతరం తిరుగుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసింది. సమన్వయంతో సేవలు: జేఈఓ వైకుంఠం క్యూకాంప్లెక్స్ 1, 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సేవలందించాయని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయ అధికారులు, సిబ్బంది క్యూలను క్రమబద్ధీకరించారన్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాల్లో గదుల వివరాలను ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నామని చెప్పారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు. నారాయణగిరి ఉద్యానవనాల్లోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్లు, వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేసినట్లు జేఈఓ తెలిపారు. శ్రీవారి సేవకులు క్యూల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల పంపిణీ, పరకామణి తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారన్నారు. యాత్రికుల సంక్షేమ సౌకర్యాల సేవకులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి సత్వరం పరిష్కారమయ్యేలా సేవలందించారని తెలిపారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారన్నారు. తిరుమలలో రేపు పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. తలనీలాల వేలం ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల ఈ–వేలం ద్వారా టీటీడీకి రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరింది. టీటీడీ గురువారం నిర్వహించిన ఈ–వేలంలో మొత్తం 600 కిలోల తలనీలాలను విక్రయించింది. మొదటి రకం (31 ఇంచుల పైన) తలనీలాలు కిలో రూ.22,502 ధరతో 2,500 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. రెండో రకం (16 నుండి 30 ఇంచులు) తలనీలాలు కిలో రూ.17,260 ధరతో 27,600 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.34.52 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కొనసాగుతున్న రద్దీ తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు బుధవారం శ్రీవారి హుండీకి సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.4.10 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు. రేపు పౌర్ణమి గరుడసేవ తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. -
ఫిబ్రవరి 1న దుబాయిలో శ్రీనివాస కల్యాణం
గల్ఫ డెస్క్: దుబాయిలో ఫిబ్రవరి 1న శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నారు. అజ్మన్ సిటీ సెంటర్ పక్కన గల అల్‌జర్ఫ్ హబిటాట్ స్కూల్లో ఈ వేడుక జరగనుంది. ఆ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు సుప్రబాతసేవ, 8 నుంచి 9 గంటల వరకు తోమాలసేవ, 9 నుంచి 10 గంటల వరకు 108 కలశాలతో అభిషేకం జరుగుతుంది. 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుకల్యాణం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4గంటల వరకు సర్వదర్శనం, 4 నుంచి 5 గంటల వరకు విష్ణుసహస్రనామం, 5నుంచి గరుడ సేవ ఉంటుం ది. యూఏఈలో మొదటిసారిగా స్వామివారి గరుడసేవ నిర్వహిస్తున్నారు. వైభవోపేతంగా జరిగే స్వామివారి కల్యాణ వేడుకలో పాల్గొనే వారు +971555794466, +971585771709 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఈ నెలలో శ్రీవారికి రెండు గరుడ సేవలు
-
వైభవంగా రథసప్తమి వేడుకలు
సాక్షి, తిరుమల: తిరుమలలో బుధవారం రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. తిరువీధుల్లో శ్రీవారు గరుడ వాహనంపై ఊరేగారు. ఈ రోజు ఉదయం చినశేష వాహనంపై స్వామి వారిని ఊరేగించగా, తెల్లవారుజామున సూర్యప్రభ వాహనంపై వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.