Girl died
-
చిరుతపులి దాడి.. మరో చిన్నారి మృతి
లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను, థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
ఈత సరదా ప్రాణం తీసింది
వైఎస్సార్: లింగాల మండలం తాతిరెడ్డిపల్లెలో ఈత నేర్చుకోవాలని చిన్నారి సరదా పడగా... ప్రమాదవశాత్తూ ఆమె ప్రాణం తీసింది. స్థానికుల వివరాల మేరకు.. తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన తోట రవీంద్రారెడ్డి, మంజుల దంపతుల కుమార్తె మహిత(12) బుధవారం గ్రామంలోని చెరువులో ఈత నేర్చుకునేందుకు తోటి పిల్లలతో కలిసి వెళ్లింది.నడుముకు ఖాళీ క్యాన్ కట్టుకుని చెరువులో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో నడుముకు ఉన్న క్యాన్ ఊడిపోయింది. అక్కడున్న పిల్లలు, పెద్దలు చూస్తుండగానే భయానికి గురైన మహిత నీటిలో మునగగానే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుమార్తె మృతిచెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతి
నల్గొండ: కారు డోరులో తల ఇరుక్కొని బాలిక మృతిచెందిన ఘటన మండలంలోని బొజ్జగూడెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొజ్జగూడెం గ్రామానికి చెందిన భూక్యా కోట్యా కుమార్తె వివాహం సోమవారం జరిగింది. వివాహం అనంతరం నూతన వధూవరులు కారులో వెళ్తుండగా వారితో పాటు కారు వెనుక సీటులో బానోతు వెంకటేశ్వర్లు కుమార్తె ఇంద్రజ(9) కూర్చుంది. ఈ క్రమంలో ఇంద్రజ కారు డోరులోంచి తల బయట పెట్టి డ్యాన్స్ చేస్తుండగా డ్రైవర్ శేఖర్ అద్దం పైకి లేపడంతో ఊపిరాడక చనిపోయింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
కాకినాడలో విషాదం.. కారులో ఊపిరాడక చిన్నారి మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో విషాదం చోటుచేసుకుంది. పార్క్ చేసి ఉంచిన కారులో ఆడుకునేందుకు వెళ్లిన పాప.. అందులోనే మృత్యువాతపడింది. కారు డోర్లు లాక్ అవడం.. ఎవరూ గమనించకపోవడంతో ఈ ఘోరం జరిగింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి.. దగ్గరల్లో పార్క్ చేసిన కారులోకి వెళ్లి డోర్ వేసుకుంది. మళ్లీ డోర్ లాక్ తీయరాకపోవడంతో ఊపిరి ఆడక ఇబ్బంది పడింది. ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. మధ్యాహ్నం కారులోకి వెళ్లిన పాప సాయంత్రం వరకు అందులోనే ఉండిపోయింది. కూతురు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కలా మొత్తం గాలించారు. చివరికి ఇంటి పక్కన కారులో కొన ఊపిరితో బాలికను గుర్తించిన స్థానికులు హుటాహుటిన యానాం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదిలా ఉండగా ఏడాది క్రితమే బాలిక తండ్రి మరణించగా.. బాలికతో పాటు, పదేళ్ల కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్మి పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చదవండి: ప్రమాదవశాత్తు మరుగుతున్న రసంలో పడి యువకుడు మృతి -
ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కొత్త ఏడాది తొలిరోజే ఓ యువతి దారుణంగా హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తప్పతాగిన ఐదుగురు దుండగులు బాధితురాలి స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను నాలుగు కిలోమీటర్లు రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. శరీరంపై నూలుపోగు కూడా లేకుండా రోడ్డుపై పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. ఈ దారుణ సంఘటన ఢిల్లీ సుల్తాన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు ఆదివారం తెల్లవారుజామున తన స్కూటర్‌పై వెళ్తోంది. ఆమె స్కూటర్‌ను ఓ కారు ఢీకొట్టింది. ఈ క్రమంలోనే ఆమె డ్రెస్ కారు టైరులో చిక్కుకుంది. స్కూటర్‌ను ఢీకొట్టినప్పటికీ ఆగకుండా కారును ముందుకు నడిపారు. టైరులో డ్రెస్ చిక్కుకోవడంతో సుమారు 4 కిలోమీటర్లు ఆ బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్రగాయాలపై ఆ యువతి మృతి చెందింది. ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా యువతి మృతదేహం కనిపించటం కలకలం సృష్టించింది. రోడ్డుపై నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని చూసి ముందుగా హత్యాచారంగా భావించారు. కానీ, రోడ్డు ప్రమాదం కారణంగా ఆమెను కారు వెనకాల ఈడ్చుకెళ్లడం ద్వారా మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 3.24 గంటలకు రోడ్డుపై మృతదేహం సమచారం అందినట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఓ మహిళ మృతదేహాన్ని బలెనో కారుకు కట్టి ఈడ్చుకెళ్తున్నారని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. కంఝవాలా పోలీస్ స్టేషన్ బృందం ఈ విషయంపై ఆ కాలర్‌కు తిరిగి పలు మార్లు ఫోన్ చేశారు. ఆ తర్వాత బలెనో కారును ఆ వ్యక్తి గుర్తించాడు.’ అని తెలిపారు. ఫోన్ రాగానే పోలీసు బృందం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుంది. రోహిణి జిల్లా క్రైమ్ టీం సైతం అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత మృతదేహాన్ని ఎస్జీఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ తర్వాత కారును పట్టుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈక్రమంలోనే సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్సిడెంట్ జరిగినట్లు వారు తెలిపారు. మహిళా కమిషన్ నోటీసులు యువతిని ఈడ్చుకెళ్లి మృతి చెందేందుకు కారణమైన ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కేసులో నిజానిజాలు తేల్చి పూర్తి వివరాలు సమర్పించాలని ఢిల్లీ పోలీసులకు నోటీసులు ఇచ్చారు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ శ్వాతి మాలివాల్. ‘ఢిల్లీ కంఘావాలా ప్రాంతంలో ఓ యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది. కొందరు యువకులు తప్పతాగి ఆమె స్కూటర్‌ను ఢీకొట్టడంతో పాటు ఆమెను పలు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటన చాలా ప్రమాదకరమైనది. ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేస్తున్నా.’అని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు -
ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
వైద్యుల నిర్లక్ష్యానికి యువ క్రీడాకారిణి బలి
చెన్నై: ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ యువ క్రీడాకారిణి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన తమిళనాడులోని పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్లో చోటుచేసుకుంది. వ్యాసర్పాడికి చెందిన ఆర్.ప్రియ(17) బీఎస్సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫస్టియర్ చదువుతోంది. ఫుట్‌బాల్ క్రీడాకారిణి అయిన ప్రియ కుడి మోకాలి లిగమెంట్ దెబ్బతింది. దీంతో ఆమె పెరియార్ నగర్ గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు వెళ్లింది. పరీక్షించిన వైద్యులు ఈ నెల 7న మోకాలికి ఆపరేషన్ చేసి, కంప్రెషన్ బ్యాండేజీ వేశారు. బ్యాండేజీ గట్టిగా వేయడంతో లోపల రక్త స్రావం అయి గడ్డకట్టి, మిగతా కాలికి సరిగ్గా రక్త ప్రసరణ జరలేదు. వైద్యులు గమనించకపోవడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను రాజీవ్‌గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (ఆర్జీజీజీహెచ్) రెఫర్ చేశారు. వైద్యులు ఈనెల 8న ఆమె కుడి కాలిని తొలగించారు. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స కొనసాగుతుండగానే కిడ్నీలు, లివర్, గుండె విఫలమై మంగళవారం ప్రియ తుదిశ్వాస విడిచిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ చెప్పారు. నిర్లక్ష్యం వహించిన గవర్నమెంట్ పెరిఫెరల్ హాస్పిటల్‌కు చెందిన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశామన్నారు. ప్రియ కుటుంబానికి రూ.10 లక్షల పరిహారంతోపాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఇదీ చదవండి: నా కూతుర్నే పార్టీ మారమన్నారు: సీఎం కేసీఆర్ -
ఘోరం.. వీధికుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి..
భోపాల్: మధ్యప్రదేశ్ ఖర్గోన్లో ఘోరం జరిగింది. వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. బకావా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. చిన్నారి కిరాణ దుకాణానికి వెళ్లే సమయంలో వీధిలోని అరడజనుకు పైగా శునకాలు ఆమెపై దాడి చేశాయి. మెడ, శరీరంలోని ఇతర భాగాలపై తీవ్రగాయాలు చేశాయి. దీంతో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. పాప అరుపులు కేకలు విని స్థానికులు వచ్చి కుక్కలను చెదరగొట్టారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ చిన్నారి సోనియా ప్రాణాలు కోల్పోయింది. ఆమె తండ్రి రోజూకూలీగా పనిచేస్తున్నాడు. తాను పని మీద బయటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని రోదించాడు. చదవండి: స్నేహితుడిని బెదిరించి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ -
హిజాబ్ హీట్: పాఠశాలలో పోలీసుల లాఠీఛార్జ్.. 15ఏళ్ల బాలిక మృతి
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు. అక్టోబర్ 13న అర్దాబిల్లోని షహేద్ గర్ల్స్ హైస్కూల్లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్ యూనియన్.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్ విద్యాశాఖ మంత్రి యూసఫ్ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. “Death to the dictator!” School girls waving forced-hijabs, chanting in the streets of Sanandaj. Oct 17 #Mahsa_Amini #مهسا_امینی pic.twitter.com/CggC37eVy9 — IranHumanRights.org (@ICHRI) October 17, 2022 ఇదీ చదవండి: హిజాబ్ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్! -
గుండెల నిండా దుఃఖం.. భుజంపై మేనకోడలి మృతదేహంతో..!
భోపాల్: కనీస మౌలిక సదుపాయలు అందక నిరుపేదలు ఇబ్బందులు పడుతున్న హృదయవిదారక సంఘటనలు దేశంలో ఏదో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ద్విచక్రవాహనంపై, తోపుడు బండిపై, భుజాలపై మృతదేహాలను మోసుకుంటూ వెళ్లిన సంఘటనలు కలిచివేస్తున్నాయి. అలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని రద్దీ రోడ్డులో ఓ వ్యక్తి తన భుజాలపై మోసుకుటూ బస్టాప్‌కు వెళ్లారు. అందరితో పాటే బస్సులో మృతదేహాన్ని స్వగ్రామం చేర్చారు. ఈ హృదయవిదారక సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాలుగేళ్ల చిన్నారి స్వగ్రామంలో ప్రమాదవశాత్తు మృతి చెందింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఛాతర్పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కానీ, మృతదేహాన్ని తిరిగి ఇంటికి చేర్చేందుకు ఆసుపత్రిలో వాహనం లేదు. ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లేందుకు చేతిలో చిల్లిగవ్వ లేదు. దీంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు దుఃఖంలో ఉన్న ఆమె మేనమామ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. బస్టాప్ వరకు తన భుజాలపై మోసుకెళ్లాడు. రద్దీగా ఉన్న బస్‌లోనే మృతదేహంతో ఎక్కాడు. అయితే, ఆయన వద్ద బస్సు టికెట్ కొనేందుకు సైతం డబ్బులు లేకపోవటం అందరిని కలచివేసింది. మరో ప్రయాణికుడు టికెట్ కొనిచ్చాడు. ఆసుపత్రి నుంచి మృతదేహాలను తరలించేందుకు పట్టణాభివృద్ధి విభాగం ఏర్పాట్లు చేయాలని చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ లఖన్ తివారీ తెలిపారు. ఇలాంటి వాటిలోకి ఆసుపత్రి, వైద్యులను లాగొద్దని కోరారు. నాలుగు నెలల క్రితం సైతం ఛతార్పుర్ జిల్లాలో ఇలాగే నాలుగేళ్ల చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్లారు. దీంతో జిల్లాలో సదుపాయలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. బుధవారమే సింగ్రౌలి జిల్లాలో శిశువును బైక్ సైడ్ బాక్సులో తీసుకెళ్లటం సంచలనంగా మారింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. A man carried the body of his four-year-old niece on his shoulders and took a bus to his village because he could not get a hearse from a hospital, This comes nearly four months after a four-year-old girl's body was carried by her family on their shoulders. Both in Chhatarpur. pic.twitter.com/NXZUNODqUT — Anurag Dwary (@Anurag_Dwary) October 20, 2022 ఇదీ చదవండి: 75వేల మంది యువతకు ప్రధాని మోదీ దివాళీ గిఫ్ట్ -
కెరీర్‌కు అడ్డుగా ఉందని కన్న కూతురును నాల్గో అంతస్తు నుంచి విసిరేసిన కన్న తల్లి
-
బెంగళూరు: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
-
నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!
బెంగళూరు: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే అల్లాడిపోతుంది తల్లి. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ, ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. నాలుగేళ్ల కుమార్తెను నాలుగో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. బెంగళూరులో జరిగిన ఈ అమానుష సంఘటన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. పాపను కింద పడేసిన తర్వాత ఆమె సైతం కింద దూకేందుకు బాల్కనీ రెయిలింగ్ ఎక్కి కాసేపు నిలబడింది. గమనించిన కుటుంబ సభ్యులు పరుగున వచ్చి ఆమెను వెనక్కి లాగారు. కింద పడిన పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఉత్తర బెంగళూరు ఎస్ఆర్ నగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ఘటన గురువారం జరిగినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల చిన్నారి మాట్లాడలేదని, చెవులు సైతం వినబడవని తెలిపారు. దాంతో ఆ మహిళ మానసిక ఒత్తిడికి లోనైనట్లు చెప్పారు. భర్త ఇచ్చిన ఫిర్యాదుతో నిందితురాలిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఒక డెంటిస్ట్ కాగా.. భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూడా. ‘తల్లి మానసిక పరిస్థితి సహా మేము అన్ని కోణాల్లో విచారిస్తున్నాము.’ అని పేర్కొన్నారు. A woman was arrested in #Bengaluru for killing her four-year-old mentally challenged daughter by throwing her from the fourth floor of a building, police said. pic.twitter.com/S96GaVblxx — IANS (@ians_india) August 5, 2022 ఇదీ చదవండి: ఎన్నేళ్ల నాటి పగ ఇది.. పాము కాటుకు కుటుంబంలో ఇద్దరు మృతి -
HYD: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో బాలిక మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్డింగ్‌పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధురానగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత(9) కిరాణా షాపునకు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీలోని ఓ బిల్డింగ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేసింది. అనంతరం,ఐదు నిమిషాల సమయంలో వర్షిత.. బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, చిన్నారి అసలు.. బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? పాప మృతిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు.. వర్షితది హాత్యా? లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. భవనంలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య -
కరీంనగర్: పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
-
పెళ్లైన 15 ఏళ్లకు పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ.. యువకుల ‘మత్తు’కు బలి
ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. ఆ బిడ్డకోసం మొక్కని దేవుడు, చేయని పూజలు లేవు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ చిన్నారే ఆ తల్లిదండ్రులకు లోకం. పాపే ప్రాణంగా బతుకుతున్న వారిపై దేవుడు చిన్నచూపు చూశాడు. ముగ్గురు యువకుల మద్యం మత్తు క్రీడకు అభం.. శుభం తెలియని చిన్నారి బలైంది. రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలికను వెనకనుంచి వచ్చిన కారు ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలింది. తిమ్మాపూర్(మానకొండూర్):పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లోకిని జంపయ్య– రాజేశ్వరీ దంపతులది సొంతూరు ఇందుర్తి. వీరికి కూతురు శివాని(10) ఉంది. పెళ్లయిన పదిహేనేళ్లకు పుట్టింది. బతుకుదెరువు కోసం తిమ్మాపూర్ వచ్చారు. స్టేజీవద్ద అద్దెకు ఉంటున్నారు. జంపయ్య కూలీపని, రాజేశ్వరి సమీపంలోని ఓ మొబైల్ క్యాంటీన్లో పనిచేస్తుంటుంది. శివాని శుక్రవారం మధ్యాహ్నం తల్లివద్దకు రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో అలుగునూరు నుంచి తిమ్మాపూర్‌కు వస్తున్న ఇదే గ్రామానికి చెందిన అట్ల సంతోశ్, శ్రీధర్, డేవిడ్ మద్యంమత్తులో కారుతో శివానిని వెనకనుంచి వేగంగా ఢీకొట్టారు. తర్వాత కారు సమీపంలోని విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగి పోయింది. బాలికను ఆస్పత్రికి తరలిస్తుండగా చని యింది. కారు నడిపిన సంతోశ్, డేవిడ్ పరారయ్యారు. శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యంమత్తు, ఓవర్‌స్పీడే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. ప్రమాదం తరువాత కూడా నిందితులు సమీపంలోని మద్యం దుకాణంలో మద్యం తాగినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నడిపిన సంతోశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రమోద్‌రెడ్డి తెలిపారు. చదవండి: వర్కర్‌పై కర్కశత్వం.. రెండేళ్లుగా చిత్రహింసలు.. బెల్టుతో.. -
క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం.. కారు రివర్స్ తీస్తుండగా..
సాక్షి, హైదరాబాద్: కారు ఢీ కొని చిన్నారి మృతి చెందిన సంఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. నాచారం ఇన్స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన యాటల కరుణాకర్, రవళి దంపతుల కుమార్తె సిరి(03) ఆడుకునేందుకు మధ్యాహ్నం ఇంట్లోనుంచి బయటికి వచ్చింది. అదే సమయంలో అటువైపు వచ్చిన క్యాబ్ రివర్స్ తీస్తుండగా చిన్నారి కారు కింద పడిపోయింది. సిరి తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ రాజీవన్‌కుమార్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ప్రేమపేరుతో బాలికను మహారాష్ట్ర తీసుకెళ్లి.. గది అద్దెకు తీసుకుని..) -
కస్తూర్బా పాఠశాలలో బాలిక మృతి.. ఉదయం టిఫిన్ తిన్న తర్వాత
సాక్షి, నిజామాబాద్: గరిడేపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో సోమవారం విద్యార్థిని మృతిచెందింది. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సోమ్లాతండా గ్రామానికి చెందిన గుగులోతు చంద్రు, లలిత దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. రెండో కుమార్తె దివ్య(14) గరిడేపల్లిలోని కస్తూర్బా బాలికల విద్యాలయంలో 8వ తరగతి చదువుతుంది. రోజుమాదిరిగా సోమవారం ఉదయం టిఫిన్ తిన్న తర్వాత దివ్య ఒక్కసారిగా కింద పడిపోయింది. విధుల్లో ఉన్న ఏఎన్ఎం ఇందిర, పీఈటీ ధనమ్మలు వెంటనే దివ్య తల్లిదండ్రులకు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బైక్‌పై తీసుకెళ్లగా అప్పటికీ ఇంకా తెరువలేదు. దీంతో అంబులెన్స్‌కు ఫోన్ చేసి హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే దివ్య మృతిచెందినట్లు ధ్రువీకరించారు. కాగా ఆదివారం సెలవు కావటంతో దివ్య తండ్రి చంద్రు పాఠశాలకు వచ్చి కుమార్తెని చూసి తన వెంట తెచ్చిన మిక్చర్(కారా) ఇచ్చి వెళ్లినట్లు తోటి విద్యార్థినులు తెలిపారు. ఉదయం దివ్య తండ్రి తెచ్చిన మిక్చర్ తిన్న అనంతరం కొద్దిసేపటికి ఈ సంఘటన జరిగినట్లు విద్యార్థినులు చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ కార్తీక్, మండల విద్యాధికారి చత్రునాయక్, ఎంపీఓ లావణ్య పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దివ్య చనిపోయిన విషయంపై సిబ్బందిని, విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. చదవండి: పిల్లలు పెద్దయ్యారు.. సఖ్యతగా మెలగడం కుదరదని చెప్పినా వినకపోవడంతో ఈ విషయంపై కస్తూర్బా పాఠశాల నిర్వాహకురాలు శైలజ మాట్లాడుతూ.. దివ్య కళ్లు తిరిగి పడిపోయిన వెంటనే హాస్టల్లో ఉన్న సిబ్బంది వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా తీయకపోవడంతో హుజూర్నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. అప్పటికే దివ్య చనిపోయినట్లు వైద్యులు తెలిపారని, ఆకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయి ఉండవచ్చని అభిప్రాయాలను వైద్యులు వ్యక్తం చేసినట్లు ఆమె చెప్పారు. అంతకుముందు దివ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని ఆమె తెలిపారు. చదవండి: మరణించిన టీచర్ పేరుతో రూ.33 లక్షలు డ్రా... కొడుక్కి విషయం తెలియడంతో.. -
వికటించిన వైద్యం: శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి
సాక్షి, తిరువళ్లూరు: వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంజీఆర్ నగర్‌కు చెందిన కుమార్‌కు లక్షిత(07) అనే కుమార్తె ఉంది. గతనెల 27న లక్షిత అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత చేయించారు. వైద్యులు ఇచ్చిన మందులను వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు మళ్లీ అదే వైద్యశాలకు తీసుకెళ్లారు. చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు) అయితే ఇక్కడ వైద్యం చేయలేమని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో బాలికను పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న చిన్నపిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలిక చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రైవేటు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. పోలీసు లు బాలిక బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వైద్యశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి) -
11 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన తామరపూలు
సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది. వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. -
తీవ్ర విషాదం: గుక్కెడు నీళ్లు దొరక్క దాహార్తితో..
జైపూర్: గ్రామానికి అమ్మమ్మతో నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి దాహంతో అలమటించి అలమటించి చివరకు మృత్యు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. గుక్కెడు నీళ్లు దొరక్క చిన్నారి కన్నుమూయడం తీవ్ర విషాదం నింపింది. అయితే ఆ అవ్వ కూడా దాహంతో అల్లాడి స్పృహ తప్పి పడిపోయింది. అటుగా వెళ్లేవారు గుర్తించి సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అవ్వకు నీళ్లు తాగించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాయ్‌పూర్‌లోని రాణివాడ తాలుక రోడ గ్రామానికి చెందిన సుఖిదేవి భిల్ (60), ఐదేళ్ల మనమరాలు ఆదివారం గ్రామానికి నడుచుకుంటూ బయల్దేరారు. రాయిపూర్ నుంచి నడుచుకుంటూ 15 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఎండ తీవ్రంగా ఉంది. నడిచి నడిచి అలసిపోయారు. దాహం వేస్తున్నా ఎక్కడా నీళ్లు లభించలేదు. దీంతో వారిద్దరూ మార్గమధ్యలో కుప్పకూలిపోయారు. దాహార్తితో పాప నీరసించిపోయి మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అవ్వకు నీళ్లు తాపించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌లో ఎండలు అధికంగా ఉంటాయి. పాప నీళ్లు లేక మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది. చదవండి: లాక్‌డౌన్‌తో ఛాన్స్‌ల్లేక నటుడు ఆత్మహత్యాయత్నం నీళ్లు తాగిస్తున్న పోలీసులు -
హారిక మృతి కేసు: విచారణ.. రూ.25 లక్షలు డిమాండ్
వంగర: శ్రీకాకుళం జిల్లా వంగర మండల పరిధి నీలయ్యవలస సమీపంలో బేతిన్ గ్రానైట్ క్వారీ ప్రదేశాన్ని పాలకొండ ఆర్డీవో టి.వి.ఎస్.జి.కుమార్, డీఎస్పీ మల్లంపాటి శ్రావణి గురువారం పరిశీలించారు. ఈ నెల 1వ తేదీన దుస్తులు ఉతికేందుకు తల్లి తొగరాపు సంతోషికుమారితో వెళ్లిన కుమార్తె హారిక క్వారీ గొయ్యిలో పడి మృతిచెందిన విషయం పాఠకులకు విదితమే. ఈ ఘటనపై సమగ్ర సమాచారం సేకరణకు క్వారీ ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. క్వారీ లీజు సమయం, నిర్వహణ కాలం, ఎప్పటి నుంచి మూసివేశారు, హెచ్చరిక బోర్డులు, రక్షణ కంచెలు వంటివి తనిఖీ చేశారు. క్వారీకి సంబంధించి సమగ్ర సమాచారంపై నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ డి.ఐజాక్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఘటనకు సంబంధించిన అంశాలపై డీఎస్పీ ఆరా తీశారు. రాజాం రూరల్ సీఐ డి.నవీన్‌కుమార్, ఎస్సై సంచాన చిరంజీవి, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. (చదవండి: ‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన) రూ.25 లక్షలు చెల్లించాలి.. హారిక కుటుంబానికి క్వారీ యాజమాన్యం రూ.25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావుతోపాటు సర్పంచ్ ప్రతినిధి చింతగుంట రామారావు, పలు పార్టీలకు చెందిన నాయకులు బెజ్జిపురం రవి, ఉత్తరావెల్లి మోహనరావు, మజ్జి గణపతిరావు డిమాండ్ చేశారు. హారిక కుటుంబ సభ్యులను క్వారీ యాజమాన్య ప్రతినిధులు కనీసం ఓదార్చలేదని, ఇప్పటివరకు పరామర్శించలేదని మండిపడ్డారు. క్వారీ గుంత వద్ద హారిక మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి, కుటుంబసభ్యులు (ఫైల్) -
‘నా కలల హారికా.. లేమ్మా..!’ కన్నీరు పెట్టిస్తున్న తండ్రి రోదన
ఆ తండ్రికి కుమార్తె అంటే పంచప్రాణాలు. అందుకే ఏదడిగినా కాదనడు. సరదాగా అమ్మతో కలిసి బట్టలు ఉతికేందుకు వెళ్తానని చెబితే అడ్డుచెప్పకుండా బైక్‌పై ఇద్దరినీ క్వారీ (చెరువు) వద్దకు తీసుకెళ్లి తాను ఇంటికెళ్లిపోయాడు. అయితే తన గారాలపట్టి చివరి చూపు అదేనని తెలుసుకోలేకపోయాడు. కుమార్తె ఇక లేదని తెలుసుకుని మృతదేహంపై పడి ‘హారికా లేవమ్మా..’ అంటూ గుండెలవిసేలా రోదించాడు. మరోవైపు తన కళ్లెదుటే కుమార్తె మృతి చెందడంతో తల్లి అపస్మారక స్థితికి చేరుకుంది. వంగర(శ్రీకాకుళం జిల్లా): మండలంలోని నీలయ్యవలస సమీపంలో గ్రానైట్ క్వారీ గొయ్యిలో పడి తొగరాపు హారిక (13) అనే బాలిక మంగళవారం మృతిచెందింది. ఆ సమయంలో పక్కనే ఉన్న తల్లి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వంగర ఎస్సై సంచాన చిరంజీవి తెలిపి వివరాల ప్రకారం.. నీలయ్యవలస సమీపంలో కొన్నాళ్ల కిందట బేతిన్ గ్రానైట్ పరిశ్రమ ఉండేది. అప్పట్లో జరిగిన తవ్వకాల్లో భాగంగా భారీ గొయ్యి (చెరువును తలపించేలా..) ఏర్పడింది. అందులో బట్టలు ఉతికేందుకు గ్రామానికి చెందిన తొగరాపు ఈశ్వరరావు తన భార్య సంతోషకుమారి, కుమార్తె హారికను బైక్‌పై తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వచ్చేశాడు. కొద్దిసేపటికే హారిక ప్రమాదవశాత్తు గోతిలోకి జారిపోయింది. అక్కడే ఉన్న తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నంలో ఆమె కూడా గోతిలో జారిపోయి కాపాడాలంటూ కేకలు వేసింది. అటువైపుగా వెళుతున్న ఓ రైతు గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. హుటాహుటిన గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోషకుమారిని కాపాడారు. హారిక కోసం నీటిలో గాలించగా కొద్దిసేపటికి శవమై కనిపింది. తల్లి సంతోషకుమారి అపస్మారక స్థితిలో ఉండగా, తండ్రి ఈశ్వరరావు గుండెలవిసేలే రోదించారు. ‘నా కలల హారిక.. లేవమ్మా..’ అంటూ మృతదేహాన్ని పట్టుకొని తండ్రి విలపించడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. హారిక బాగెంపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. తమ్ముడు చంద్రశేఖరరావు అంటే ఎంతో ఇష్టం. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోషు్టమార్టం నిమిత్తం రాజాం తరలించామని ఎస్సై తెలిపారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం.. 2017 ముందు మూతపడిన బేతిన్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కరణం సుదర్శనరావు, స్థానికులు మండిపడ్డారు. క్వారీ మూత వేసినప్పటి నుంచి ఈ ప్రదేశంలో రక్షణ చర్యలు చేపట్టలేదని, చిన్నారి మృతికి క్వారీ యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లీజు సమ యం ఉన్నప్పటికీ క్వారీ వద్ద రక్షణ కంచెలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: లాక్‌డౌన్‌తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య 15వ అంతస్తు నుంచి దూకి వైద్యుడు -
ఒక్కసారి కళ్లు తెరవమ్మా..
శివ్వంపేట(నర్సాపూర్): ఒక్కసారి లే తల్లీ.. కళ్లు తెరువమ్మా.. అల్లారుముద్దుగా పెంచుకుంటిని కదే.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ.. తమ్ముడు పిలుస్తున్నడు చూడమ్మా.. డాడి పిలుస్తున్నడు ఒక్కసారి ఊ అనవే.. అంటూ పాప మృతదేహం వద్ద ఆ తల్లి రోదించిన తీరు అందరి కంటా కన్నీళ్లు పెట్టించింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని సికింద్లాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు తూప్రాన్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన మాధవికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల పాప జాహ్నవి (6), నాలుగేళ్లు కుమారుడు ఉన్నారు. కూలి పనులు చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి వారిది. రోజులాగే సోమవారం పిల్లలిద్దరినీ ఇంటివద్దే నాయనమ్మ దగ్గర ఉంచి దంపతులిద్దరూ కూలి పనులకు వెళ్లారు. నాయనమ్మ ఇంట్లో ఉండగా జాహ్నవి ఓ బొమ్మతో ఆరుబయట ఆడుకుంటుండగా బొమ్మ ఇంటి ఎదుట ఉన్న డ్రమ్ములో పడిపోయింది. దీంతో కుర్చీ తీసుకొచ్చి బొమ్మను తీసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జారి డ్రమ్ములో పడిపోయింది. మనుమరాలు కనిపించకపోయేసరికి నాయనమ్మ ఇంట్లో వెతకగా డ్రమ్ములో పడిన విషయం గుర్తించి చుట్టు పక్కల వారిని పిలిచింది. వారు డ్రమ్ములో నుంచి పాపను బయటకు తీయగా విగతజీవిగా కనిపించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు అకాలమరణం చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
బాలిక ఉసురుతీసిన వాటర్ హీటర్
సాక్షి, వర్గల్(గజ్వేల్): పాఠశాలకు వెళ్లాలనే ఆతృత.. చలివేళ వేడి నీళ్ల తాపత్రయం.. అదే బాలిక పాలిట శాపంగా మారింది. స్నానానికి బాత్రూమ్లోకి వెళ్లిన ఎనిమిదో తరగతి బాలిక అనూష కరెంట్ హీటర్‌తో కూడిన నీటిని తాకింది. విద్యుత్ షాక్‌తో అసువులు బాసింది. కన్నవారికి కడుపుకోత మిగిలి్చన ఈ విషాదకర ఘటన గురువారం ఉదయం వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో జరిగింది. విద్యార్ధిని మృతి సమాచారంతో సంతాప సూచకంగా వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండా పాఠశాలలు మూసివేశారు. గ్రామస్తులు, ఉపాధ్యాయుల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం వివరాలివి... సీతారాంపల్లి గ్రామానికి చెందిన చిల్ల రవీందర్–జ్యోతి దంపతులకు అనూష(13), జశ్వంత్ ఇద్దరు పిల్లలు. గ్రామ సమీపంలోని వేలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో అనూష ఎనిమిదో తరగతి, జశ్వంత్ ఆరో తరగతి చదువుతున్నారు. గురువారం ఉదయం పాఠశాలకు సకాలంలో చేరే ఆలోచనతో కాలకృత్యాలకు సిద్ధమైంది. స్నానం కోసం బాత్రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు వాటర్ హీటర్ ఉన్న నీళ్లను తాకి విద్యుత్ షాక్‌కు గురైంది. స్నానానికి వెళ్లిన అనూష 15 నిమిషాలు దాటినా బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తలుపులు తీసి చూడగా అప్పటికే కరెంట్‌షాక్‌తో బాలిక అపస్మారక స్థితిలో గుర్తించి విద్యుత్ సరఫరా నిలిపివేయించారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేటప్పటికి బాలిక మృతి చెందినట్లు తెలిసి బోరుమన్నారు. అలుముకున్న విషాదం పాఠశాలకు వెళ్లాల్సిన బాలిక అనూహ్యంగా మృత్యువు పాలవడంతో తల్లిదండ్రులు పెనువిషాదంలో కూరుకుపోయారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. వేలూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ సహవిద్యారి్థని అనూష మృతి చెందిన సమాచారం తెలిసి కన్నీటి పర్యంతమయ్యాయి. హెచ్ఎమ్ కనకరాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల వద్ద సంతాపసూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. పాఠశాల మూసేసి అంత్యక్రియలలో పాల్గొన్నారు. బాలిక తల్లిదండ్రులకు సంతాపం వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలిక సొంత గ్రామమైన సీతారాంపల్లి ప్రాథమిక పాఠశాలను, అదే పంచాయతీ పరిధిలోని సీతారాంపల్లి తండా పాఠశాలలను సంతాప సూచకంగా మూసేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు బాలిక తల్లిదండ్రులను కలిసి ఓదార్చారు. ఈ విషాద ఘటన పట్ల ఎంఈఓ వెంకటేశ్వర్‌గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో వేలూరు, సీతారాంపల్లి, సీతారాంపల్లి తండాలలో విషాదం అలుముకున్నది. చదవండి : చదవాలని మందలిస్తే..యాసిడ్ తాగి ఆత్మహత్య