Google Chrome
-
అమ్మకానికి గూగుల్ క్రోమ్?.. త్వరలో తీర్పు
యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ (DOJ).. గూగుల్ క్రోమ్ ఇంటర్నెట్ బ్రౌజర్‌ను విక్రయించేలా దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌పై ఒత్తిడి చేసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడిస్తూ.. గూగుల్ సెర్చింజన్ మార్కెట్‌పై చట్ట విరుద్ధంగా ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తోందని ఆగస్టులో ఒక న్యాయమూర్తి రూలింగ్ కూడా ఇచ్చారు. అదే జడ్జి ముందు డీఓజే ఈ ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తోంది. ఏఐ, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన చర్యలు తీసుకోవాలి ఇందులో పేర్కొన్నట్లు సమాచారం.గూగుల్ క్రోమ్‌ను విక్రయించమని.. గూగిల్ ప్లే నుంచి ఆండ్రాయిడ్‌ను వేరు చేయమని అడగడంతో పాటు, ప్రకటనదారులతో మరింత డేటా.. సమాచారాన్ని భాగస్వామ్యం చేయమని న్యాయమూర్తి గూగుల్‌ను అడగవచ్చు. అయితే దీనిపైన డీఓజే వ్యాఖ్యానించలేదు.గూగుల్ రెగ్యులేటరీ అఫైర్స్ వైస్ ప్రెసిడెంట్ లీ అన్నే ముల్హోలాండ్ స్పందిస్తూ.. డీఓజే ఒక ర్యాడికల్ అజెండాను ముందుకు తెస్తోందని అన్నారు. ఇది వినియోగదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.ఈ విషయం మీద న్యాయమూర్తి చివరికి ఏమి తీర్పు ఇస్తారో చూడాల్సి ఉంది. గూగుల్ గుత్తాధిపత్యం నిజమే అని పరిగణలోకి తీర్పు ఇస్తే.. గూగుల్ తప్పకుండా క్రోమ్‌ను వదులుకోవాల్సి వస్తుందని పలువురు చెబుతున్నారు. యూఎస్ ఎన్నికల ప్రచార సమయం గూగుల్ ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఇదీ చదవండి: 30 నిమిషాల్లో.. ఢిల్లీ నుంచి అమెరికాకు: సాధ్యమే అంటున్న మస్క్గూగుల్ కేసుకు సంబంధించిన తీర్పును అమెరికన్ కోర్టు వచ్చే ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అంతకంటే ముందే కంపెనీ.. క్రోమ్‌ను విక్రయించకుండా ఉండటానికి కావలసిన ఏర్పాట్లను చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మొత్తానికి గూగుల్ క్రోమ్ ఈ సమస్య నుంచి బయటపడుతుందా? లేదా? అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) ఆధ్వర్యంలోని సైబర్ సెక్యూరిటీ వాచ్డాగ్ గూగుల్ క్రోమ్ యూజర్లకు ఓ హెచ్చరిక జారీ చేసింది. విండోస్, మ్యాక్ఓఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్‌లపై గూగుల్ క్రోమ్ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించింది.క్రోమ్ బ్రౌజర్లో బగ్‌లు ఉన్నాయని, వాటిని హ్యాకర్లు ఉపయోగించుకునే అవకాశం ఉందని.. సిస్టమ్‌లో స్టోర్ చేసి పెట్టుకున్న ముఖ్యమైన డేటాను, పాస్‌వర్డ్‌లను సైతం వారు కాపీ చేసుకునే అవకాశం ఉందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. గూగుల్ బ్రౌజర్ ఉపయోగించేవారు వెంటనే దాన్ని అప్డేట్ చేయాలని సంస్థ పేర్కొంది.ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14తో పనిచేసే స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లతో సహా అనేక రకాల ఆండ్రాయిడ్ పరికరాలను గూగుల్ క్రోమ్ ప్రభావితం చేస్తుందని సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. కాబట్టి యూజర్లు తప్పకుండా క్రోమ్ అప్డేట్ చేసుకోవాలి.ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, క్రోమ్ బ్రౌజర్లో ఈ భద్రతా లోపం సుమారు 18 సంవత్సరాల నుంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని డెవలపర్లు గుర్తించకపోవడం గమనార్హం. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ఒలిగో పరిశోధకులు ఈ సమస్యను వెలికితీశారు. -
గూగుల్ క్రోమ్ యూజర్లూ తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హై రిస్క్ వార్నింగ్
Google Chrome Users High Risk Warning గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యూజర్లూ బీ అలర్ట్. గూగుల్ క్రోమ్ వర్షన్ అప్ డేట్ చేసుకోకపోతే మీ కీలక సమాచారం చోరీ అయ్యే ప్రమాదం పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది. అప్డేట్ చేసుకోకపోతే సెక్యూరిటీ పరమైన సమస్యలు తప్పవంటూ యూజర్లకు హై రిస్క్ వార్నింగ్ జారీ చేసింది. భారతదేశంలో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) తాజాగా గుర్తించిన లోపాలను హై-రిస్క్‌గా వర్గీకరించింది. ముఖ్యంగా WebPలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో ఎర్రర్, కస్టమ్ ట్యాబ్‌లు, ప్రాంప్ట్‌లు, ఇన్పుట్, ఇంటెంట్లు, పిక్చర్ ఇన్ పిక్చర్, ఇంటర్‌స్టీషియల్స్ లోపాలను గుర్తించినట్టు తెలిపింది. అలాగే డౌన్లోడ్లు, ఆటోఫిల్‌లో వాటిల్లో పాలసీ సరిగ్గా అమలు కాలేదని తెలిపింది. గూగుల్ క్రోమ్ ఈ లోపాలను బాధితుడి సిస్టమ్‌కు అనధికారిక యాక్సెస్‌ని అందించేలా సైబర్ నేరగాళ్లకు అవకాశం ఉంటుందని CERT-In వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్ వినియోగదారులు తమ సిస్టమ్ ప్రొటెక్షన్ కోసం అప్డేట్ చేసుకోవడంఉత్తతమని సూచించింది. Google Chromeఅప్డేట్ చేసుకోవడం ఎలా? Chrome విండోను ఓపెన్ చేసి కుడి ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై క్లిక్ చేయాలి. డ్రాప్‌డౌన్ మెను నుండి, హెల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి. " About Google Chrome"పై క్లిక్ చేయండి. అప్డేట్పై క్లిక్ చేసి, బ్రౌజర్‌ని రీస్టార్ట్ చేస్తే చాలు. -
గూగుల్ క్రోమ్ అప్డేట్ చేసుకున్నారా? తక్షణమే చేయండి!
గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితో మీకో అలర్ట్. కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. డెస్క్ టాప్ కంప్యూటర్లు, లాప్‌టాప్‌ల్లో పాత క్రోమ్ బ్రౌజర్లు వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. తక్షణమే అప్డేట్ చేసుకోవాలని కోరింది. గూగుల్ క్రోమ్బ్రౌజర్లో పలు లోపాలను గుర్తించినట్టు తెలిపింది. దీంతో హ్యాకర్లు చొరబడి యూజర్ల పెర్సనల్ డేటా చోరీ చేసే అవకాశం ఉందని సైబర్ సెక్యూరిటీ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. CERT-In హైలైట్ చేసినవి CVE-2023-4427 CVE-2023-4428 CVE-2023-4429 CVE-2023-4430 CVE-2023-4431 ప్రభావిత సాఫ్ట్వేర్ గూగుల్ క్రోమ్ విండో వర్షన్ 116.0.5845.110/.111 మ్యాక్, లైనక్స్ వర్షన్ 116.0.5845.110 కంటే ముందు వర్షన్ బ్రౌజర్లలో లోపాలను గుర్తించామని, వీటిని యూజర్లకు ముప్పు పొంచి ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేసుకోవాలని, అలాగే అనుమానాస్పద, నమ్మశక్యం కాగాని వెబ్సైట్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది. Google Chromeని ఎలా అప్డేట్ చేసుకోవాలి కంప్యూటర్లో క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి కుడివైపున టాప్‌లో క్లిక్ మోర్మీద క్లిక్ చేయాలి చేయాలి. ‘హెల్ప్ అబౌట్ గూగులో క్రోమ్’ మీద క్లిక్ చేసి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ క్రోమ్ బటన్ కనిపించకపోతే మీ కంప్యూటర్ ఇప్పటికే అప్డేట్ అయినట్టు అర్థం. అపుడు రీలాంచ్ అనే బటన్‌మీద క్లిక్ చేయాలి. ఇప్పటికే కొన్నింటిని అప్డేట్ చేసింది.అయితే ఆటోమేటిక్‌గా అప్ డేట్ కానిపక్షంలో ‘క్రోమ్ ఈజ్ అప్ టూ డేట్’ అనే మెసేజ్ వస్తుంది. -
గూగుల్ క్రోమ్ యూజర్లకు హైరిస్క్ వార్నింగ్! తేలిగ్గా తీసుకుంటే అంతే..
గూగుల్ క్రోమ్ యూజర్లకు భారత ప్రభుత్వం హైరిస్క్ వార్నింగ్ ఇచ్చింది. తేలిగ్గా తీసుకుంటే మీ బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత సమాచారం చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చిరించింది. ఈ బ్రౌజర్లో వ్యక్తిగత సమాచారాన్ని హ్యాజర్లు సులువుగా హ్యాక్ చేస్తున్నారని తెలియజేసింది. మనలో చాలా మంది వాడే వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్. ఇంటర్నెట్ను ఉపయోగించేటప్పుడు మనకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని ఇస్తుంటాం. ఒకవేళ మనం వాడే బ్రౌజర్ సురక్షితం కాకుంటే మన సమాచారమంతా హ్యాకర్ల చేతికి వెళ్తుంది. ఇలాంటి వాటిని అరికట్టేందుకు గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వర్షన్లను అప్డేట్ చేస్తుంటుంది. ఒకవేళ మీరు పాత వర్షన్ బ్రౌజర్లను వాడుతుంటే ప్రమాదంలో పడినట్లే. విండోస్ యూజర్లు 110.0.5481.77/.78 వర్షన్, మ్యాక్, లైనెక్స్ యూజర్లు 110.0.5481.77 వర్షన్ కంటే పాతవి ఉపయోగిస్తున్నవారికి భారత ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో యూజర్ల సమాచారాన్ని హ్యాకర్లు ఎలా దొంగిలిస్తున్నారో ఇండియన్ కంప్యూటర్ ఎమెర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఓ నివేదిక విడుదల చేసింది. వీళ్ల బారిన పడకూడదంటే గూగుల్ తెస్తున్న కొత్త వర్షన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. (ఇదీ చదవండి: బోయింగ్‌కు హైదరాబాద్ నుంచి తొలి ‘ఫిన్’ డెలివరీ) -
యూజర్లూ బీ అలర్ట్! 2022 మోస్ట్ రిస్కీ బ్రౌజర్ ఏదో తెలుసా?
న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే మీకొక షాకింగ్ న్యూస్. 2022లో అత్యంత ప్రమాదకరమైన ఇంటర్నెట్ బ్రౌజర్‌గా క్రోమ్ తేలిందట. అట్లాస్ వీపీఎన్ తాజా విశ్లేషణ ప్రకారం 10 నెలల వ్యవధిలో గూగుల్ క్రోమ్ అత్యధికంగా 303 సమస్యలను ఎదుర్కొన్నట్లు కనుగొంది. అలాగే లైఫ్ టైంలో ఈ బ్రౌజర్ మొత్తం 3,159 వల్నరబులిటీలను ఎదుర్కొందని విశ్లేషించింది. (చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు) గూగుల్ క్రోమ్ తరువాత మొజిల్లా ఫైర్ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, యాపిల్ సఫారీ ఈ కోవలో నిలిచాయి. డేటా దుర్బలత్వ డేటాబేస్ (VulDB) నుండి వచ్చిందని ఈ నివేదిక తెలిపింది. జనవరి 1 నుండి అక్టోబర్ 5 వరకు డేటాను ఇది రివ్యూ చేసింది. పరిశోధన ప్రకారం, ఈ నెలలో ఇప్పటివరకు Google Chrome మాత్రమే సమస్యలక గురైంది. ముఖ్యంగా CVE-2022-3318, CVE-2022-3314, CVE-2022-3311, CVE-2022-3309, CVE-2022-3307 ఈ కొత్త భద్రతా సమస్యలు ప్రతీ డివైస్ మెమరీని దెబ్బతీస్తాయని పేర్కొంది. అయితే బ్రౌజర్ వెర్షన్ 106.0.5249.61కి అప్డేట్ చేసుకోవడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చని వెల్లడించింది. 2022లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ 103 భద్రతా సమస్యలను, మొజిల్లా ఫైర్ఫాక్స్ 117 సమస్యలను ఎదుర్కొంది. మైక్రోసాప్ట్ ఎడ్జ్ లాంచ్ తరువాత మొత్తం 806 వల్నరబులిటీస్ని ఫేస్ చేసింది. 2021 నుండి 62 శాతం పెరుగుదల. ఇదీ చదవండి: Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ ఇటీవల వినియోగదారుల సంఖ్య ఇటీవల ఒక బిలియన్‌ను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా యాపిల్ సఫారీ రెండవ స్థానానికి చేరుకుంది. 2022లో, ఈ బ్రౌజర్ అతి తక్కువ సమస్యలొచ్చాయి. ఈ పరిశోధన సమయంలో కేవలం 26 వల్నరబులిటీస్ని మాత్రమే ఎదుర్కొంది. అయితే మొత్తంగా 1,139 దుర్బలత్వాలను ఎదుర్కోవడం గమనార్హం. చివరగా, మొత్తం లైఫ్ టైంలో 344 భద్రతా సమస్యలను ఎదుర్కొన్న ఒపెరా బ్రౌజర్‌కు ఈ కాలంలో ఎలాంటి సమస్యా రాలేదు. అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా బ్రౌజర్లు ఒకే Chromium ఇంజిన్‌పై ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమస్యలు వాటిని ప్రభావితం చేయవచ్చని పరిశోధన వెల్లడించింది. -
ప్రమాదంలో గూగుల్ క్రోమ్ యూజర్లు..వెంటనే ఇలా చేస్తే మేలు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్( సీఈఆర్టీ-ఇన్)హెచ్చరికలు జారీ చేసింది. ఎంపిక చేసిన కంప్యూటర్లపై మాల్వేర్ సాయంతో భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. గూగుల్ క్రోమ్ యూజర్లు 104.0.5112.101కి ముందు వెర్షన్లను వినియోగిస్తున్న గూగుల్ క్రోమ్ వినియోగదారులు ఈ దాడులకు ప్రభావితం అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే మాల్వేర్కు చిక్కకుండా ఉండేలా బ్రౌజర్‌ను అప్డేట్ చేయాలని సలహా ఇస్తున్నారు. కేంద్రం ఏం చెబుతోంది సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ విభాగం ప్రతినిధులు దేశానికి చెందిన యూజర్ల కంప్యూటర్లలో గుర్తుతెలియని మాల్వేర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ మాల్వేర్ సాయంతో సైబర్ నేరస్తులు సెలెక్టెడ్ కంప్యూటర్లు లేదంటే నెట్ వర్క్ గ్రూప్‌కు చెందిన కంప్యూటర్లను వారి ఆదీనంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఆ పీసీ, ల్యాప్‌ట్యాప్‌లలో ఉన్న డేటా దొంగిలించడం, ఆ దొంగిలించిన డేటాను డార్క్ వెబ్‌లో అమ్మి సొమ్ము చేసుకోవడంతో పాటు యూజర్లు మరింత ఇబ్బందులు పెట్టేలా మాల్వేర్ను స్ప్రెడ్ చేస్తారని సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా ఫెడ్సీఎం, స్విఫ్ట్ షేర్, ఏంజెల్,బ్లింక్, సైన్ ఇన్‌ఫ్లో వంటి ఫ్రీ సాఫ్ట్ వేర్లను ఉపయోగించే యూజర్లు మరింత ప్రమాదమని తెలిపింది. అందుకే ఆన్లైన్లో ఫ్రీగా లభ్యమయ్యే సాఫ్ట్వేర్ల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు చెప్పింది. -
భయపెట్టిన 3 అంకెలు..! ఎట్టకేలకు సెంచరీ కొట్టిన గూగుల్ క్రోమ్..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన ఇంటర్నెట్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ సెంచరీ కొట్టింది. నేటి నుంచి గూగుల్ క్రోమ్ వెర్షన్ మూడు అంకెలకు విస్తరించనుంది. విండోస్, మ్యాక్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో స్థిరమైన బిల్డ్‌తో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్‌ను గూగుల్ లాంచ్ చేసింది. ఇక క్రోమ్ బ్రౌజర్ కోసం రిఫ్రెష్ చేసిన లోగోను కూడా గూగుల్ తీసుకువచ్చింది. 2014 తరువాత క్రోమ్ లోగోను అప్డేట్ చేయడం ఇదే మొదటిసారి. ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే వెబ్ బ్రౌజర్ క్రోమ్ తన 100 వెర్షన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇది గూగుల్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలవనుంది. 2008లో ప్రారంభించినప్పటి నుంచి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనేక యూజర్లను ఆకర్షించింది. ఇక ఈ క్రోమ్ 100 అప్డేట్ వెర్షన్లో కొత్త ఫీచర్లు ఏవీ లేవు. భయపెట్టిన మూడు అంకెలు..! ఒకనొక సమయంలో గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ గూగుల్‌కు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఈ మూడు అంకెల అప్డేట్తో అనేక వెబ్సైట్లను విచ్చిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ భావించింది. ఈ వెర్షన్ గతంలో సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లపై ప్రభావం చూపనుందని గూగుల్ భయపడింది. గూగుల్ క్రోమ్ 100 వెర్షన్ బదులుగా మరిన్నీ ఫీచర్లతో ‘క్రోమ్ కానరీ’ ను లాంచ్ చేయాలని భావించింది. తాజా వెర్షన్ 100తో ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో గూగుల్ ఊపిరిపిల్చుకున్నట్లు సమాచారం. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్..! కేంద్రం హెచ్చరికలు..!
కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ బ్రౌజర్స్‌లో లోపాలున్నట్లుగా గుర్తించింది. గూగుల్ క్రోమ్‌లో లోపాలు..! గూగుల్ క్రోమ్ 99.0.4844.74 వెర్షన్ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సెర్ట్-ఇన్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్‌ను వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. సెర్ట్-ఇన్ హెచ్చరికల ప్రకారం... బ్లింక్ లేఅవుట్, ఎక్స్టెన్షన్స్, సేఫ్ బ్రౌజింగ్, స్ప్లిట్‌స్క్రీన్, ఆంగిల్, న్యూ ట్యాబ్ పేజీ, బ్రౌజర్ UI, GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గూగుల్ క్రోమ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా భద్రతా లోపాలున్నట్లు CERT-In నివేదించింది. యాంగిల్ ఇన్ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, కాస్ట్ యూఐ ఇన్ ఫ్రీ యూజ్, ఓమ్నిబాక్స్ ఫ్రీ యూజ్‌వంటి లోపాల కారణంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా పొందే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. కొద్ది రోజుల క్రితమే యాపిల్ ఉత్పత్తులపై కూడా కేంద్రం తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. చదవండి: పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
గూగుల్ క్రోమ్ యూజర్లకు పెను ప్రమాదం..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..!
ప్రపంచంలో ఎక్కువ మంది వాడే బ్రౌజర్‌గా గూగుల్ క్రోమ్ నిలుస్తోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే యూజర్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. బ్రౌజర్లో లోపాలున్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-In) పేర్కొంది. సులువుగా హ్యాంకింగ్...! తాజాగా గూగుల్ క్రోమ్‌లో నెలకొన్న లోపాలతో యూజర్లను హ్యకర్లు సులువుగా దాడి చేసే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఏజెన్సీ వెల్లడించింది. ఆర్బిట్రరీ కోడ్‌ను ఉపయోగించుకొని హ్యాకర్ గూగుల్ క్రోమ్ ద్వారా ఆయా ఫోన్లలోకి, కంప్యూటర్లోకి ప్రవేశిస్తున్నట్టు రెస్పాన్స్ టీమ్ పేర్కొంది. భద్రతా లోపాలు..! గూగుల్ క్రోమ్బ్రౌజర్లో కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ సేఫ్ బ్రౌజింగ్, రీడర్ మోడ్, వెబ్ సెర్చ్, థంబ్‌నెయిల్ ట్యాబ్ స్ట్రిప్, స్క్రీన్ క్యాప్చర్, విండో డైలాగ్, పేమెంట్స్, ఎక్స్టెన్షన్స్, యాక్సెసిబిలిటీ అండ్ క్యాస్ట్ స్క్రీన్, ANGLEలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో; పూర్తి స్క్రీన్ మోడ్, స్క్రోల్, ఎక్స్టెన్షన్స్ ప్లాట్‌ఫారమ్ అండ్ పాయింటర్ లాక్, COOPలో పాలసీ బైపాస్, V8లో అవుట్ ఆఫ్ బౌండ్స్ మెమరీ యాక్సెస్కాప్చర్ వంటివి లోపాలకు కారణమని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఈ లోపాలతో సైబర్‌నేరస్తులు ఆయా క్రోమ్ యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా చేయండి..! క్రోమ్ 98 బ్రౌజర్లో ఉన్న బగ్స్‌ను ఇటీవలే గూగుల్ ఫిక్స్ చేసింది. గూగుల్ క్రోమ్ 98 వర్షన్‌కు వెంటనే అప్డేట్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ వర్షన్ 98.0.4758.80 కంటే ముందు వర్షన్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఈ వర్షన్లలోనే బగ్స్ ఉన్నాయి. విండోస్‌తో పాటు మాక్ ఓఎస్, లైనన్స్ యూజర్లకు గూగుల్ క్రోమ్ 98 కొత్త అప్డేట్ వర్షన్‌ను ఫిక్స్ చేసింది. దాంట్లో 27 సెక్యూరిటీ ఫిక్స్‌లను జతచేసింది. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
మీరు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్ ఫుల్..! గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం మరోసారి హెచ్చరికలను జారీ చేసింది. బ్రౌజర్లో లోపాలున్నట్లుగా తెలుస్తోంది. భద్రతా లోపాలు..! గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో మరోసారి భద్రతా లోపాలున్నట్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT - In) క్రోమ్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. బ్రౌజర్లో కొన్ని విభాగాల్లో లోపాలు ఉన్నట్లు సెర్ట్-ఇన్ గుర్తించింది. యూజ్ ఆఫ్టర్ ఫ్రీ ఇన్ స్టోరేజీ, స్క్రీన్ కాప్చర్, సైన్ ఇన్, స్విఫ్ట్‌షేడర్, పీడీఎఫ్, ఆటోఫిల్, ఫైల్ మెనేజర్ ఏపీఐతో పాటు డెవ్‌టూల్స్, నావిగేషన్, ఆటోఫిల్, బ్లింక్, వెబ్‌షేర్‌లో, పాస్వర్డ్, కంపోసిటింగ్‌లో అనవసరమైన ఇంప్లిమెంటేషన్లు లోపాలకు కారణమని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఈ లోపాలతో సైబర్‌నేరస్తులు ఆయా క్రోమ్ యూజర్ల డేటాను తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇలా చేస్తే సేఫ్..! గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో నెలకొన్న లోపాలనుంచి బయటపడేందుకు సెర్ట్-ఇన్ యూజర్లకు పలు సూచనలు చేసింది. ఆయా గూగుల్ క్రోమ్ యూజర్లు వెంటనే అప్డేట్ చేయాలని సూచించింది. గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ 97.0.4692.71 కు మారాలని వెల్లడించింది. గూగుల్ క్రోమ్ వెర్షన్ 97.0.4692.71 కంటే తక్కువ వెర్షన్ ఉంటే యూజర్ల భద్రతకే ప్రమాదమని సెర్ట్-ఇన్ అభిప్రాయపడింది. గూగుల్ క్రోమ్‌లోని లోపాలను గుర్తించిన గూగుల్ కొద్ది రోజల క్రితమే లేటెస్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. బ్రౌజర్లో నెలకొన్న 37 సమస్యలను గూగుల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్డేట్ చేయండి Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి. కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవండి: 200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..! -
ల్యాప్‌టాప్, పీసీలలో ఇలా చేస్తున్నారా? ఇక మీ పని అయిపోయినట్టే..
మీరు మీ సొంత/కంపెనీ ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తున్నారా? అయితే, ఇక మీ పని అయిపోయినట్టే. హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్, పీసీలోని పాస్‌వర్డ్‌లను రెడ్ లైన్ మాల్ వేర్ సహాయంతో హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నట్లు నిపుణులు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో ఇంటి నుంచి పనిచేసే వారి శాతం రోజు రోజుకి పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారు తమ కార్యాలయ పనులతో పాటు ముఖ్యమైన పనులకు సంబంధించిన పాస్‌వర్డ్‌లను ల్యాప్‌టాప్, పీసీలోని గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లలో సేవ్ చేసుకుంటున్నారు. అయితే, ఇలా చేయడం వల్ల భారీ ముప్పు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఆహ్న్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీకి చెందిన ఉద్యోగి ఇంటి నుంచి పనిచేస్తున్న సమయంలో ఇతర ఉద్యోగులు వాడే ల్యాప్‌టాప్‌లో పనిచేసేవారు. అయితే, ఆ ల్యాప్‌టాప్‌లో సమాచారాన్ని దొంగిలించే రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఉందనె విషయం అతనికి తెలియదు. ఈ విషయం తెలియక ఆ ఉద్యోగి తను వాడుతున్న ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో ముఖ్యమైన పాస్‌వర్డ్‌లను సేవ్ చేశాడు. అప్పటికే ల్యాప్‌టాప్‌లో ఉన్న రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ ఆ సమాచారాన్ని మొత్తం హ్యాకర్ల చేతికి ఇచ్చింది. అయితే, మరో కీలక విషయం ఏమిటంటే. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నట్లు సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంటర్నెట్ డార్క్ వెబ్ సైట్లలో దీనిని $150కు కొనుగోలు చేయవచ్చు. అంటే, ఎవరైనా, మీ ల్యాప్‌టాప్, పీసీలలో ఈ స్పై సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఇక మీ పని అంతే అని నిపుణులు అంటున్నారు. అందుకే, మీ సొంత ల్యాప్‌టాప్, పీసీలతో కంపెనీ ఇచ్చే వాటిలో పాస్‌వర్డ్‌లను సేవ్ చేసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. ఈ రెడ్ లైన్ స్టీలర్ అనే మాల్ వేర్ మొదట మార్చి 2020లో రష్యన్ డార్క్ వెబ్‌లో కనిపించింది. ఇలాంటి మాల్ వేర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. (చదవండి: 50 బిలియన్ డాలర్ల లక్ష్యం..! యాపిల్..మేక్ ఇన్ ఇండియా..!) -
200 కోట్ల యూజర్లకు పెను ప్రమాదం..! గూగుల్ హెచ్చరిక..!
Google Warns 2 Billion Users Of Update That Could Break Websites Worldwide: ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల క్రోమ్ యూజర్లకు పెనుప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని గూగుల్ హెచ్చరించింది. రాబోయే క్రోమ్ బ్రౌజర్ అప్డేట్ ప్రపంచవ్యాప్తంగా అనేక వెబ్సైట్లను విచ్ఛిన్నం చేసే అవకాశం ఉందని గూగుల్ యూజర్లకు హెచ్చరిక జారీ చేసింది. అంతుచక్కని సమస్య.! పరిష్కారమే లేదు..! టెక్ దిగ్గజం గూగుల్ తన క్రోమియంబగ్ ట్రాకర్ బ్లాగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. రాబోయే అనిశ్చితికి ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారమే లేకపోవచ్చునని గూగుల్ అభిప్రాయపడింది. కాగా తన వంతుగా సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఏ వెబ్సైట్లకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయం అస్పష్టంగా ఉంది. అలర్ట్‌గా ఉండడమే..! సమస్య పరిష్కారమయ్యేంత వరకు క్రోమ్ యూజర్లు ఇతర బ్రౌజర్స్‌ను వాడాలని ఫోర్బ్స్ తన నివేదికలో పేర్కొంది. క్రోమ్ యూజర్లు అలర్ట్‌గా ఉండడమే మంచిదని తెలిపింది. వచ్చే నెలలో క్రోమ్ యూజర్లకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెర్షన్స్‌తో సమస్య..! ఫోర్భ్స్ ప్రకారం...గూగుల్ క్రోమ్ వెర్షన్స్‌లో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రోమ్ బ్రౌజర్ 96 వెర్షన్లో ఉంది. అయితే గూగుల్ మరిన్ని ఫీచర్స్‌ను యూజర్లకు అందుబాటులోకి తెచ్చేందుకు ‘క్రోమ్ కానరీ’ బ్రౌజర్‌ను గూగుల్ టెస్ట్ చేస్తోంది. ఇది ప్రారంభ యాక్సెస్ డెవలపర్ బిల్డ్. ఇప్పుడు ఇది వెర్షన్ 99లో ఉంది. ఎప్పుడైతే బ్రౌజర్ వెర్షన్ 100కి చేరుకుంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ గ్లిచ్‌తో ప్రభావితమైన వెబ్సైట్లు స్పష్టంగా లోడ్ అవడం ఆగిపోతాయని ఫోర్బ్స్ పేర్కొంది. దీనికి కారణం ఈ వెబ్సైట్లు యూజర్లు సైట్‌ను సందర్శించే సమయంలో క్రోమ్ వెర్షన్‌ను తనిఖీ చేస్తాయి. అయితే ప్రోఫెషనల్ వెబ్సైట్ డిజైనర్ డూడా వంటి డిజైన్ సాఫ్ట్వేర్ మొదటి రెండు అంకెలను మాత్రమే తనిఖీ చేస్తుంది. ఈ సమయంలో క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ 100కు యాక్సెస్ ఉండే అవకాశాలు తక్కువగా ఉండనున్నాయి. గూగుల్ ప్రయత్నాలు..! ఈ గ్లిచ్ ప్రభావాలను నివారించడానికి హ్యాకింగ్ వంటి ప్రక్రియలతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఆయా వెబ్సైట్లను సందర్శించేటప్పడు వెర్షన్ 100 స్థానంలో రెండంకెల వెర్షన్ పొందేలా గూగుల్ ప్రయోగాలు చేస్తోంది. చదవండి: అమెరికా టెక్ దిగ్గజాలకు చుక్కలు చూపిస్తున్న రష్యా..! -
గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక..!
గూగుల్ క్రోమ్ వాడే యూజర్లకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేసే ప్రభుత్వ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గూగుల్ క్రోమ్‌లో అధిక తీవ్రతతో కూడిన సమస్య ఉన్నట్లు గుర్తించింది. CERT-In ప్రకారం గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్లో అనేక దుర్బలత్వాలు ఉన్నాయని పేర్కొంది. వీటితో యూజర్లపై సైబర్ దాడులు సులువుగా జరిగే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ వెల్లడించింది.గూగుల్ క్రోమ్ V8 టైప్ కన్ఫ్యూజన్ కారణంగా అనేక సమస్యలను ఉన్నట్లు తేలింది. దీంతో హ్యాకర్లు యూజర్ల వ్యక్తిగత డేటాకు యాక్సెస్ పొందవచ్చని, వారిని లక్ష్యంగా చేసుకొని కంప్యూటర్లో మాల్వేర్ను ఇంజెక్ట్ చేసేందుకు సులువుగా ఉంటుందని సెర్ట్-ఇన్ తెలిపింది. గూగుల్..నివారణ చర్యలు..! గూగుల్ క్రోమ్ వెబ్‌బ్రౌజర్‌లో సమస్యలు ఉన్నట్లు గూగుల్ కూడా గుర్తించింది. అందుకోసం నివారణ చర్యలను కూడా చేపట్టింది. గూగుల్ క్రోమ్ అప్డేట్డ్ వెర్షన్‌ను విడుదల చేసింది. యూజర్లు వీలైనంత త్వరగా క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సుమారు 22 రకాల భద్రతా పరిష్కారాలను అందించినట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది.గూగుల్ ఇటీవల ప్రకటించినట్లుగా విండోస్, మ్యాక్, లైనెక్స్ కోసం విస్తృతంగా ఉపయోగించే క్రోమ్ బ్రౌజర్ వెర్షన్‌ను 96.0.4664.93 రిలీజ్ చేసింది. మీ క్రోమ్ బ్రౌజర్‌ని ఇలా అప్డేట్ చేయండి • Google Chrome బ్రౌజర్‌ని ఒపెన్ చేయండి. • కుడి ఎగువ మూలలో, మూడు చిన్న చుక్కలపై క్లిక్ చేయండి •హెల్ఫ్‌పై క్లిక్ చేయండి. మీకు బ్రౌజర్ వెర్షన్‌ను చూపుతుంది. అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేయండి. ఇలా కాకుండా మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి..మై యాప్స్‌లో గూగుల్ క్రోమ్‌పై క్లిక్ చేసి అప్డేట్ అప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. చదవండి: జియో కమాల్: ప్రపంచంలోనే చీపెస్ట్ ఇంటర్నెట్ ప్యాక్.. కస్టమర్లకు పండగే! -
స్వీయ తప్పిదం! గూగుల్ కొంపముంచుతుందా?
ఏం అవసరం పడినా.. ఇంటర్నెట్లో వెతికే ఎక్కువమంది ఆశ్రయించేది గూగుల్ బ్రౌజర్‌నే. గూగుల్ రూపొందించిన ఈ క్రాస్ ప్లాట్‌ఫామ్ వెబ్ బ్రౌజర్‌ను.. రోజూ కొన్ని కోట్ల మంది ఉపయోగిస్తుంటారు. అలాంటిది తన స్వీయ తప్పిదంతో గూగుల్ వాళ్లందరినీ దూరం చేసుకోవాలని చూస్తుందా?! ‘సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయి. గూగుల్ క్రోమ్‌ను అప్డేట్ చేసుకోండి’.. గత కొన్ని నెలలుగా తెర మీద వినిపిస్తున్న ప్రకటన ఇది. స్వయంగా తన యూజర్ల కోసం గూగుల్ స్వయంగా చేసిన భారీ హెచ్చరిక ఇది. సాధారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఏవీ ఈ తరహా ప్రకటనలు చేయవు. కానీ, అందుకు విరుద్ధంగా గూగుల్ చేసిన ప్రకటన.. ఇప్పుడు గూగుల్‌కే డ్యామేజ్ చేయనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల భద్రత విషయంలో గత కొంతకాలంగా హెచ్చరికలు జారీ చేస్తున్న గూగుల్.. ఈమధ్య మరో అప్డేట్ ఇచ్చింది. 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త క్రోమ్ వెర్షన్‌కు అప్డేట్ కావాలని కోట్ల మంది యూజర్లను కోరింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. అయితే గూగుల్ చేసిన ఈ ప్రకటన.. పరోక్షంగా తన యూజర్లను తానే దూరం చేసుకున్నట్లు అవుతుందని ‘ది రిజిస్ట్రర్’లో ఒక ఎడిటోరియల్ కథనం ప్రచురించింది. ఈ ప్రకటన ద్వారా గూగుల్ బ్రౌజర్ నుంచి కోట్ల మంది దూరం అయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. పైగా గూగుల్ చేస్తున్న సవరణలు.. మొత్తంగా ఇంటర్నెట్ బ్రౌజింగ్ వ్యవస్థనే ప్రభావితం చేయనున్నాయట!. గూగుల్ అప్డేట్ వల్ల ఏం ఒరగకపోగా.. వెబ్సైట్ వ్యవస్థ నాశనం అవుతుందని సీనియర్ టెక్ ఎక్స్పర్ట్ స్కాట్ గిల్బర్ట్సన్ ఈ మేరకు ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అంతేకాదు గూగుల్ చర్యల వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని, మొత్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొంది. వెబ్ అనేది కేవలం ప్రొఫెషనల్స్ డెవలపర్స్ కోసమే కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొసమెరుపు ఏంటంటే.. గూగుల్ బ్రౌజర్ కంటే మోజిల్లా ఫైర్ఫాక్స్ తన దృష్టిలో బెస్ట్ బ్రౌజర్ అంటూ స్కాట్ కామెంట్లు చేయడం. చదవండి: గూగుల్ సంచలన నిర్ణయం.. మీ ప్రమేయం లేకుండానే! -
గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్‌ఫుల్...!
Google Warns Chrome Users Of A Huge Security Threat: మనలో చాలా మంది ఎప్పుడు ఎదో ఒక విషయాన్ని తెలసుకునేందుకు బ్రౌజ్ చేస్తూనే ఉంటాం. బ్రౌజ్ చేసేందుకు గాను మనలో చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌పైనే ఆధారపడి ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్ యూజర్లు గూగుల్ క్రోమ్ సొంతం. విస్తృత స్థాయిలో యూజర్ బేస్ ఉన్న క్రోమ్ బ్రౌజర్‌కు తరుచుగా సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచవ్యాప్తంగా క్రోమ్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. వెంటనే క్రోమ్ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లకు గూగుల్ తెలిపింది. గూగుల్ తన అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో లైనక్స్, మాక్ఓఎస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ క్రోమ్ బ్రౌజర్లో నెలకొన్న సమస్యలను గూగుల్ వెల్లడించింది. జీరో డే హ్యాక్ పేరిట పలు క్రోమ్ యూజర్లపై సైబర్ దాడులు జరుగుతున్నట్లు గూగుల్ పేర్కొంది. గూగుల్ క్రోమ్‌పై సైబర్ దాడులు జరుగుతున్నట్లు గూగుల్ ఉద్యోగులు గుర్తించారు. హై-రిస్క్ హ్యక్ నుంచి యూజర్లను రక్షించడం కోసం వెంటనే క్రొమ్ అప్డేట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. తాజాగా గూగుల్ తెచ్చిన కొత్త అప్డేట్తో మరింత సెక్యూర్డ్ బ్రౌజింగ్ అనుభూతిని పొందవచ్చును. మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ సురక్షితంగా ఉందో లేదో ఇలా చూడండి.. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. సెర్చ్ బార్ పక్కన ఉన్న త్రి డాట్స్‌పై క్లిక్ చేసి ‘సెట్టింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోండి. సెట్టింగ్ ఆప్సన్లో కిందికి స్క్రోల్ చేసి ‘అబోట్ క్రోమ్’ను సెలక్ట్చేయండి. అబోట్ క్రోమ్ సెలక్ట్ చేశాక మీకు ఆప్లికేషన్ క్రోమ్ వర్షన్ కన్పిస్తోంది. మీరు వాడే క్రోమ్ వెర్షన్ 94.0.4606.61 ఉంటే మీరు వాడే బ్రౌజర్ సురక్షితంగా ఉన్నట్లు..లేకపోతే వెంటనే గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి అప్డేట్ చేయండి. -
Google: గూగుల్ వాడుతున్నారా? అయితే అర్జెంటుగా..
గూగుల్ తన యూజర్లకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది. అర్జెంట్‌గా గూగుల్ క్రోమ్‌ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోవాలని సూచిస్తోంది. గత కొంతకాలంగా గూగుల్ క్రోమ్ -94 అప్డేట్ గురించి విస్తృత స్థాయిలో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హఠాత్తుగా బుధవారం ఈ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. ఆండ్రాయి, ఐవోఎస్, విండోస్‌తో పాటు మాక్‌ఓస్ వెర్షన్లను సైతం కొత్త ఫీచర్స్‌తో ఒకేసారి అప్డేట్ అందించింది. ప్రైవసీ, కొత్తగా మరికొన్ని సెక్యూరిటీ ఫీచర్స్‌ను అందిస్తూనే క్రోమ్-94.. బగ్స్‌ను(దాదాపు 32) సైతం ఫిక్స్ చేసేసింది గూగుల్. ఇక 19 రకాల సెక్యూరిటీ సమస్యలను సైతం ఈ కొత్త వెర్షన్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని తెలిపింది. అంతేకాదు కాపీ లింక్స్, క్యూఆర్ కోడ్లను వెబ్సైట్లతో పంచుకునేందుకు సురక్షితమైన హబ్‌గా క్రోమ్ కొత్త వెర్షన్‌ను ప్రకటించుకుంది. హాట్‌న్యూస్: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..! మరో విశేషం ఏంటంటే.. ఇది HTTPS-First modeకి సంబంధించిన వెర్షన్. అంటే.. సురక్షితంకానీ వెబ్సైట్లను ఓపెన్ చేసినప్పుడు ఫుల్ పేజీ అలర్ట్‌ను చూపించే వెర్షన్‌గా లేటెస్ట్ అప్డేట్ ఘనత సాధించింది. తద్వారా యూజర్లను మరింత అప్రమత్తం చేస్తామని గూగుల్ ప్రకటించుకుంది. వెబ్సైట్ ఆరంభంలో ఉండే హెచ్‌టీటీపీఎస్ అనే లెటర్ష్.. సంబంధిత వెబ్సైట్ అసలా? నకిలీనా? అనే విషయం తెలియజేస్తుందని తెలుసు కదా!. ఒక్కోసారి సురక్షితంకానీ వెబ్సైట్లను సైతం ఓపెన్ కావడానికి క్రోమ్ అనుమతిస్తుంది. అలాంటప్పుడు గతంలో గూగుల్ అలర్ట్ ఏదో నామమాత్రంగానే.. చిన్నగా వచ్చేది. కానీ, ఒక్కోసారి అది గమనించకుండా యూజర్లు ముందుకెళ్లేవాళ్లు. కానీ, ఇప్పుడు కొత్త అప్డేట్ ద్వారా ఫుల్‌పేజీ అలర్ట్ ఇస్తారు. తద్వారా యూజర్ మరింత జాగ్రత్త పడొచ్చు. అలాంటి సైట్ల నుంచి వెనక్కి వచ్చేయొచ్చు. ఓవైపు సేఫ్ బ్రౌజింగ్. మరోవైపు వెబ్కోడెక్స్ ద్వారా గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను యూజర్లకు అందించనుంది క్రోమ్ 94. అంటే.. మానిటర్, ఇతర స్క్రీన్ల మీద వీడియోను సురక్షితంగా ప్లే చేయడంతో పాటు హార్డ్‌వేర్ డీకొడింగ్ను సురక్షితంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. చదవండి: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే! ఇదీ చదవండి: ఫోన్ స్టోరేజ్ నిండిందా? డోంట్ వర్రీ.. వీటిలో ట్రై చేయండి -
గూగుల్ దెబ్బ.. ఆ బ్రౌజర్‌కు ఘోరంగా తగ్గిన యూజర్లు
వెబ్ బ్రౌజర్‌గా ఒకప్పుడు ఊపుఊపిన మోజిల్లా ఫైర్ఫాక్స్.. కాలక్రమంలో తన యూజర్లను కోల్పోతోంది. గడిచిన 3 ఏళ్ల కాలంలో 46 మిలియన్ల మంది యూజర్లు.. మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్‌కు దూరం అయినట్లు రెడ్డిట్‌లో ఓ పబ్లిక్ డేటా రిపోర్ట్ ఒకటి వెల్లడించింది. 2002లో విడుదలైన మోజిల్లా ఫైర్ఫాక్స్.. వెబ్ బ్రౌజర్ యూజర్లను ఆకట్టుకోవడంతో అనతి కాలంలో విశేష ఆధారణ లభించింది. ముఖ్యంగా థర్డ్ వెర్షన్‌ను రిలీజ్ చేసిన ఒక్కరోజులోనే సుమారు 8 మిలియన్లు పైగా యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. కానీ, అప్రతిహితంగా కొనసాగుతూ వచ్చిన ఫైర్ఫాక్స్ ఉనికికి.. గూగుల్ 2008లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ తీసుకొచ్చి బ్రేకులు వేసింది. ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ బ్రౌజర్ ఇన్ బిల్ట్‌గా రావడం, ఎక్కువ సంఖ్యలో వెబ్సైట్లు గూగుల్ క్రోమ్‌కు అప్టిమైజ్ కావడం, అదే టైంలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ నెమ్మదించడం లాంటి కారణాలతో క్రోమ్‌కు ఆదరణ పెరుగుతూ వస్తోంది. పబ్లిక్ డేటా రిపోర్ట్ ప్రకారం.. 2018లో మోజిల్లా ఫైర్ఫాక్స్ బ్రౌజర్ యూజర్లు 244 మిలియన్ల మంది.. 2021 నాటికి ఆ సంఖ్య 198 మిలియన్ యూజర్లకు పడిపోయింది. అయితే మరో బ్రౌజర్ ఏదీ గూగుల్ క్రోమ్‌కి ప్రత్యామ్నాయంగా లేకపోవడంతో రెండో స్థానంలో మోజిల్లా ఫైర్ఫాక్స్ కొనసాగుతోందని టెక్ గురూస్ అంచనా వేస్తున్నారు. ఇక ఒకప్పుడు పాపులర్ బ్రౌజర్‌గా ఉన్న మోజిల్లా ఫైర్ఫాక్స్కు ఆదరణ తగ్గడానికి కారణం దాని పనితీరేనని అంచనా వేస్తున్నారు. మోజిల్లా అప్ డేట్ల గురించి ఫిర్యాదులతో పాటు యూజర్ ఇంటర్ ఫేస్ వెర్షన్ (యూఐ) ఫైర్ఫాక్స్ 89 కూడా ఆకట్టుకోలేక పోయింది. -
గూగుల్‌లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్‌లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్‌కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్‌డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్‌తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్‌ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్‌కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్‌ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్‌ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్‌ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్‌లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్‌లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్‌తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్‌ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్‌కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్‌ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్‌కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
ప్రమాదంలో 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా
ప్రస్తుతం మొబైల్, కంప్యూటర్ వాడుతున్న ప్రతి పరికరంలో గూగుల్ క్రోమ్ కచ్చితంగా వినియోగిస్తారు. గూగుల్ క్రోమ్ ముఖ్యంగా విండోస్, ఆండ్రాయిడ్ లో అత్యంత విస్తృతంగా ఉపయోగించే బ్రౌజర్. వాస్తవానికి, ఈ బ్రౌజర్ ని చాలా ఆండ్రాయిడ్ పరికరాల్లో వాడుతుండటం మనం గమనించవచ్చు. వివాల్డి, ఒపెరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్ బ్రౌజర్ వంటి అనేక ఇతర బ్రౌజర్లు కూడా క్రోమియం బ్రౌజర్ సర్చ్ ఇంజిన్ పై ఆధారపడి పనిచేస్తాయి. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కోట్ల మంది గూగుల్ క్రోమ్ యూజర్ల డేటా ప్రమాదంలో ఉన్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న గూగుల్ క్రోమ్ లో హ్యాకర్లు హ్యాక్ చేయడానికి వీలుగా ఒక కొత్త బగ్ ఉన్నట్లు ఇటీవల కనుగొనబడింది. ఈ బగ్ ద్వారా హ్యాకర్ రిమోట్ గా బగ్ కోడ్ ను మీ మొబైలో ప్రవేశ పెట్టడానికి వీలుగా అనుమతించే ఒక పెద్ద భద్రతా లోపాన్ని కనుగొన్నట్లు గూగుల్ పేర్కొంది. అందుకే వెంటనే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఇన్ స్టాల్ చేసిన వినియోగదారులు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ పేర్కొంది. ఒకవేల క్రోమ్ బ్రౌజర్ అప్ డేట్ చేయకపోతే హ్యాకర్లు మీ ఫోన్ హ్యాక్ చేయడమే కాకుండా, భద్రతా లోపం కారణంగా మీ డేటాను బహిర్గతం చేసే ప్రమాదం ఉంది. కొత్తగా గుర్తించిన ఈ బగ్ ఇప్పటికే ఉపయోగంలో ఉన్నట్లు గూగుల్ తన బ్లాగులో వెల్లడించింది. తమకు తెలియకుండానే హ్యాకర్లు డేటాను దొంగలిస్తున్నట్లు గూగుల్ తెలిపింది. హ్యాకర్లు హ్యాక్ చేసిన మిలియన్ డాలర్లకు డార్క్ వెబ్ లో విక్రయిస్తారు. పాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వెర్షన్ లను ఉపయోగిస్తున్న క్రోమ్ యూజర్లు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కచ్చితంగా మీ గూగుల్ క్రోమ్ వెర్షన్ 91.0.4472.164 ఉండాలని సంస్థ పేర్కొంది. -
గూగుల్ క్రోమ్ యాప్‌తో జర జాగ్రత్త!
కరోనా మహమ్మారి కాలంలో సైబర్ దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు మెయిళ్లు, లింక్‌లు, మెసేజ్‌లతో హ్యాకింగ్ చేస్తే ఇప్పుడు ఏకంగా గూగుల్ క్రోమ్ యాప్‌నే సైబర్ నేరగాళ్లు మోసాల కోసం వాడుకుంటున్నారు. గూగుల్ క్రోమ్ యాప్ లాంటి ఒక కొత్త నకిలీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ ను సృష్టిస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మొబైల్స్ కి మాల్వేర్ సోకినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రెడియో పరిశోధకులు తెలిపారు. స్మిషింగ్ ట్రోజాన్ ను నకిలీ గూగుల్ క్రోమ్ ద్వారా ఫోన్లోకి పంపించి మొబైల్‌నే ఏకంగా మాల్వేర్ సూపర్ స్ప్రెడర్గా మార్చేస్తున్నట్లు సైబర్ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ అనేది మొబైల్ పై దాడి చేయడంలో ఒక భాగం మాత్రమే. ఈ నకిలీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక మీ క్రెడిట్ కార్డ్ వివరాలను దొంగలించడంతో పాటు ఇతరులకు మెసేజ్‌ల ద్వారా స్పామ్, ఫిషింగ్ లింక్‌లను పంపించి మొబైల్స్‌ను హ్యాక్ చేయడానికి వెక్టర్‌గా ఉపయోగిస్తుంది. గత వారాల్లో లక్షలాది మంది దీని భారీనా పడినట్లు అంచనా వేస్తున్నాము అని ప్రెడియో పరిశోధకులు తమ వెబ్‌సైట్‌లోని ‘సెక్యూరిటీ అలర్ట్ ’పోస్ట్‌లో చెప్పారు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ మీ ఫోన్లోకి ఎలా ప్రవేశిస్తుంది? మీకు విదేశాల నుంచి ఏదో పార్సిల్ వచ్చిందని, అది కావాలంటే కొంత డబ్బు కట్టాలని మోసగాళ్లు ఒక మెసేజ్ పంపిస్తారు. ఆ మెసేజ్ లో ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన తర్వాత క్రోమ్ యాప్ అప్డేట్ చేయమని కోరుతుంది. ఒకవేళ మీరు క్రోమ్ యాప్ అప్డేట్ చేస్తే ఇక అంతే సంగతులు. అప్డేట్ తర్వాత మీ గూగుల్ క్రోమ్ మాల్వేర్ యాప్ లాగా మారిపోతుంది. తర్వాత ప్యాకేజీని డెలివరీ చేయడానికి క్రెడిట్ కార్డుల ద్వారా ఒకటి లేదా రెండు డాలర్లు చెల్లించాలి అని పేర్కొంటుంది. మీరు కనుక క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు చెల్లిస్తే మీ వివరాలన్నీ సైబర్ క్రైమినల్ చేతికి చిక్కుతాయి. దీంతో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీన్నే స్మిషింగ్ ట్రోజాన్ అంటున్నారు. మీ ఫోన్ మాల్వేర్ ‘సూపర్ స్ప్రెడర్’ గా ఎలా మారుతుంది? ఇది ఇక్కడితో ఆగదు. నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ బాధితుడి ఫోన్లోకి ఇన్స్టాల్ అయిన తర్వాత. బాధితుల మొబైల్ నుంచి వారానికి 2000 కంటే ఎక్కువ మెసేజ్ లను, ప్రతిరోజూ 2 లేదా 3 గంటలలో ఒకరినొకరు అనుసరిస్తున్నట్లు అనిపించే యాదృచ్ఛిక ఫోన్ నంబర్లకు పంపుతుంది. ఇలా ఒకరి మొబైల్ నుంచి మరొక మొబైల్ కి పంపించి దాడి చేస్తారు. ఈ నకిలీ గూగుల్ క్రోమ్ యాప్ చూడటానికి అధికారిక క్రోమ్ యాప్ లాగే ఏమాత్రం అనుమానం రాకుండా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యాప్ ఇన్ఫోలో ప్యాకేజీ పేరు లాంటి వివరాలు చూసి నిజమైనది కానిది గుర్తుపట్టొచ్చు. మొబైల్లోని యాంటీ వైరస్లు సైతం దీన్ని గుర్తించనంత పకడ్బందీగా హ్యాకర్లు ఈ ఫేక్ గూగుల్ క్రోమ్ యాప్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతానికి, పరిశోధకులు రెండు నకిలీ క్రోమ్ యాప్ లు కనుగొన్నారు. ఇలాంటి సైబర్ నెరగాళ్ల చేతిలో చిక్కుకుండా ఉండటానికి ఎలాంటి లింక్స్ క్లిక్ చేయకపోవడం మంచిది అని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కడ కూడా డెబిట్/ క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేయవద్దు అని సూచిస్తున్నారు. మొబైల్ వినియోగదారులు ఎల్లప్పడు అధికారిక గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలని కోరారు. చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! -
గూగుల్ క్రోమ్ కొత్త లోగో
గూగుల్ తన అప్లికేషన్ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. తాజాగా గూగుల్ క్రోమ్ యొక్క లోగో కూడా మార్చనున్నట్లు తెలుస్తుంది. రెండు రోజుల క్రితం నుండి ఆపిల్ యొక్క కొత్త M1- టోటింగ్ మాక్స్‌లో గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో అందుబాటులో ఉంది. తదుపరి తీసుకు రాబోయే గూగుల్ క్రోమ్ యొక్క కొత్త లోగో బాగుంది అని కొందరి అభిప్రాయం. కొత్త క్రోమ్ చిహ్నాన్ని రూపొందించడానికి గూగుల్ పాత క్రోమ్ చుట్టూ ఒక పెట్టెను బ్యాక్ గ్రౌండ్ లో తీసుకొచ్చింది. గూగుల్‌లో డిజైనర్ మరియు డెవలపర్ అయిన ఎల్విన్ హు దీన్ని షేర్ చేసారు.(చదవండి: 5,000లలో బెస్ట్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్) As many of you noticed, we introduced a new Chrome icon for macOS Big Sur today ✨ The team has also been exploring some further macOS-aligned options (some examples here), and we’re interested in hearing what you think about them 🙏 pic.twitter.com/dUS70OZdCr — Elvin 🏳️🌈 (@elvin_not_11) November 17, 2020 పైన చెప్పుకున్న విదంగా మొదటి డిజైన్(ఎ) లోగో ఉంటుంది. B మరియు C డిజైన్ లలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. గూగుల్ తన అప్లికేషన్ లొగోలలో గత రెండు నెలల నుండి మార్పులు చేస్తుంది. అయితే ఈ కొత్త లుక్‌పై యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది కొత్త లుక్ బావుదంటే మరికొందరు పాత లొగోలు బావున్నాయని అంటున్నారు. ముఖ్యంగా జీమెయిల్ లొగో విషయంలో పెద్ద చర్చే జరిగింది. -
గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: గూగుల్ క్రోమ్‌ను ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ది కంప్యూటర్ ఎమర్జన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సీఈఆర్టీ-ఇన్) వినియోగదారులను హెచ్చరించింది. యూజర్ల డేటాను సేకరిస్తున్నారని తెలిసిన తరువాత 100 హానికరమైన గూగుల్ ఎక్స్టెన్షన్లను తొలగించినట్లు తెలిపింది. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ సెక్యూరిటీని స్కాన్ చేయడానికి ఈ ఎక్స్‌టెన్షన్స్‌లో కోడ్ ఉన్నట్లు కనుగొన్నట్లు కూడా సీఈఆర్టీ-ఇన్ తెలిపింది. (సైబర్ యుగంలో స్వాహాల పర్వం ) ఈ ఎక్స్టెన్షన్స్ స్క్రీన్షాట్లను తీయడం, క్లిప్‌బోర్డ్ చదవడం, పాస్‌వార్డులు తెలుసుకోవడం, రహస్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని కూడా ఈ ఏజన్సీ తెలిపింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు కచ్చితంగా అవసరమైన ఎక్స్టెన్షన్స్ మాత్రమే ఇన్స్టాల్ చేసుకోవాలి అని, అలా చేయడానికి ముందు వినిమోగదారుల రివ్యూలను తెలుసుకోవాలని సూచించింది. ఈ ఏడాది జనవరిలో, సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో గూగుల్ అన్ని కమర్షియల్ ఎక్స్‌టెన్షన్స్‌ను నిలిపివేసింది. గూగుల్ క్రోమ్ స్టోర్‌ను ఉపయోగించుకొని చాలా కాలంగా సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా వినియోగదారులను మోసం చేస్తున్నారు. సీఈఆర్టీ-ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఇది సైబర్ భద్రతకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటుంది. (భారత్‌పై సైబర్ దాడులకు పాల్పడ్డ చైనా) -
గూగుల్ క్రోమ్ గురించి ఇవి తెలుసుకోండి..
మీరు గూగుల్ క్రోమ్‌ను వాడుతున్నారా .. అయితే కచ్చితంగా ఈ వార్తను చదవాల్సిందే. ప్రస్తుత నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు గూగుల్ క్రోమ్‌ను విరివిగా వాడుతున్న సంగతి అందరికి తెలిసిందే. మరి అలాంటి గూగుల్ క్రోమ్‌లో ఇటివలే కొన్ని కొత్త ఫ్యూచర్స్ వచ్చి చేరాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ►గెస్ట్చర్ నావిగేషన్ : వినియోగదారులు క్రోమ్‌ను వాడే సమయంలో ఒక వెబ్ పేజీ నుంచి మరొక వెబ్‌పేజ్‌కు వెళ్లేందుకు క్రోమ్‌లో ఒక గెస్ట్చర్(నావిగేటర్)ను ప్రవేశపెట్టింది. దీనిని యాక్టివేట్ చేయాలంటే మీ యూఆర్ఎల్ బార్లో 'క్రోమ్ ://ఫ్లాగ్స్/# ఓవర్ స్క్రోల్-హిస్టరీ-నావిగేషన్'ను టైప్ చేయాలి. ►గూగుల్ ఓమ్నిబాక్స్ : ఈ ఆప్షన్ క్రోమ్‌లో ఉంటుందని సాధారణంగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ క్రోమ్‌లోని అడ్రస్ బార్లో సాధారణంగా యూఆర్ఎల్ ఉండేదానినే గూగుల్ ఓమ్నిబాక్స్ అంటారు. ఇది నేరుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానమై ఉంటుంది. ఓమ్నిబాక్స్‌లో టైప్ చేసే విషయాలను గూగుల్ నేరుగా తీసుకుంటుందని వినియోగదారులు గమనించాలి. ►రికవరింగ్ లాస్ట్ టాబ్స్ : మీరు ఎప్పుడైనా పొరపాటుగా మీ ట్యాబ్‌లను క్లోజ్ చేస్తే పేజ్ రీలోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు.. అలా కుదరకపోతే మళ్లీ కొత్తగా పేజ్ ఓపెన్ చేయాల్సిందే. ఇక మీదట అలా చేయకుండా క్రోమ్ ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మీరు చేయాల్సిందల్లా విండోస్‌లో 'కంట్రోల్ + షిఫ్ట్ + టి' నొక్కగానే మీరు ఇంతకు ముందు వాడిన పేజ్‌కు యాక్సెస్ అవుతుంది. ►డార్క్ మోడ్ : గూగుల్ క్రోమ్‌లో డార్క్ మోడ్ అనే ఆప్షన్ 2019 లోనే ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్ధేశం కళ్ళపై ఒత్తిడి ఏర్పడకుండా ఓఎల్ఈడీ రూపంలో ఉంటుంది. దీనిని సెలెక్ట్ చేసుకోవాలంటే 'విండోస్>సెట్టింగ్స్> అప్పియరెన్స్'అనే ఆప్షన్‌కు వెళ్లి థీమ్‌ను 'మెటీరియల్ ఇగ్నిటో డార్క్' ఎంచుకోవాలి. అయితే ఈ డార్క్‌మోడ్ ఆప్షన్ అనేది మాక్ ఓఎస్ 10.14, విండోస్ 10 వర్షెన్లలో మాత్రమే పనిచేస్తుంది. ►మ్యూటింగ్ సైట్స్ : అప్పుడప్పుడు బ్రౌజింగ్ చేస్తున్న సమయంలో పాపప్ యాడ్స వస్తూ చికాకు తెప్పిస్తుంటాయి. అయితే పాపప్‌ను ఆపేందుకు కొత్తగా గూగుల్ క్రోమ్‌లో మ్యూట్ సైట్ అనే ఆప్షన్ వచ్చి చేరింది.ఆడియో ప్లే అవుతున్న సమయంలో టాబ్‌పై కుడివైపు క్లిక్ చేసి మ్యూట్ సైట్ క్లిక్ చేస్తే పాప్అప్ యాడ్స్ ఇక కనిపించవు. -
సేవ్ చేసిన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డు వివరాలు చోరి
న్యూఢిల్లీ : ఇంటర్నెట్లో మరో కొత్త మాల్వేర్ విజృంభించింది. ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్లలో నిక్షిప్తం చేసుకున్న ఫైనాన్సియల్ డేటాను అది చోరి చేసేస్తోంది. అదే వేగా స్టీలర్. వేగా స్టీలర్ అనే కొత్త మాల్వేర్ యూజర్లు సేవ్ చేసుకున్న అత్యంత కీలకమైన పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డుల సమాచారాన్ని ఫైర్‌బాక్స్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ల నుంచి దొంగలిస్తుందని ప్రూఫ్‌పాయింట్ రీసెర్చర్లు పేర్కొన్నారు. చిన్న చిన్నగా చేస్తున్న ఈ దాడులు, భవిష్యత్తులో వ్యాపారాలకు పెనుముప్పుగా పరిణమించనుందని రీసెర్చర్లు పేర్కొన్నారు. వేగా స్టీలర్ అనేది ఆగస్ట్ స్టీలర్కు వేరియంట్ అని, ఇది అత్యంత కీలకమైన, రహస్యకరమైన డాక్యుమెంట్లను, క్రిప్టోకరెన్సీని, ఇతర ముఖ్యమైన సమచారాన్ని చోరి చేస్తుందని పేర్కొన్నారు. సేవ్ చేసుకున్న కీలకమైన సమాచారాన్ని దొంగలించడంపైనే ఈ మాల్వేర్ ఎక్కువగా ఫోకస్ చేసిందని, గూగుల్ క్రోమ్, ఫైర్బాక్స్ల నుంచి పేమెంట్ సమాచారాన్ని చోరి చేస్తుందని రీసెర్చర్లు తెలిపారు. కీలకమైన సమాచారంలో పాస్వర్డ్లు, ప్రొఫైల్స్, సేవ్ చేసుకున్న క్రెడిట్ కార్డు వివరాలు, కుకీస్ ఉన్నాయి. కేవలం సమాచారాన్ని దొంగలించడమే కాకుండా.. ప్రభావితమైన డివైజ్‌లను స్క్రీన్షాట్లను తీస్తుందని, .doc, .docx, .txt, .rtf, .xls, .xlsx, or .pdf తో ముగిసే ఫైళ్లను స్కాన్ చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ మాల్వేర్, వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్, రిటైల్, తయారీ, మానవ సంబంధాల విభాగాలపై ఎక్కువగా టార్గెట్ చేసిందని పేర్కొన్నారు.