government teacher
-
‘నా భర్త ఆత్మహత్యాయత్నంపై రాజకీయాలొద్దు’
సాక్షి, అనంతపురం: ఎల్లో మీడియా కుట్ర మరోసారి బట్టబయలైంది. జగనన్న ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాల్లో.. బాబు అనుకూల మీడియా సంస్థలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. తాజాగా టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం కేసును ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేశాయి. అయితే ఆ ఆరోపణల్ని బాధిత కుటుంబమే స్వయంగా ఖండించింది. వేతనం రాలేదని.. సీపీఎస్ రద్దు చేయాలన్న డిమాండ్ తో టీచర్ మల్లేష్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. దీన్ని మల్లేష్ భార్య శివలక్ష్మి సాక్షితో మాట్లాడుతూ ఖండించారు. ‘‘ప్రభుత్వంపై మాకు ఎలాంటి అసంతృప్తిలేదు. జగన్ పాలనలోనే నాకు ఉద్యోగం వచ్చింది. మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే. నా భర్త డిప్రెషన్‌తో బాధపడుతున్నారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేశారు. నా భర్త ఆత్మహత్యాయత్నంపై దయచేసి రాజకీయాలు చేయొద్దు’’ అంటూ ప్రతిపక్ష పార్టీలను కోరారామె. మరోవైపు బావ ఆదినారాయణ కూడా సోషల్ మీడియాలో, యెల్లో మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. సీఎం జగన్ (CM Jagan) మీద ఉన్న పిచ్చి అభిమానమే తన పాలిట మరణ శాసనం అయ్యిందంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడంటూ ఈనాడు, యెల్లో మీడియాలు హైలెట్ చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మల్లేష్ కుటుంబం ఈ ప్రచారాన్ని ఖండించింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్నముష్టూరుకు చెందిన మల్లేశ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పందేలతో లక్షలు పొగొట్టుకోవడంతో పాటు కుటుంబ పోషణకు, రుణాలను చెల్లించడానికి చిట్టీలు వేయడంతో పాటు బ్యాంక్‌ల్లో, యాప్‌ల్లో రుణాలు తీసుకున్నారు. ఈ రుణ భారాలు భరించలేక ఫోన్ స్విచాఫ్ చేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, మిత్రులు ఆయన ఆచూకీ కోసం ప్రయత్నించారు. పెన్నఅహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాల్లో విషం తాగి అపస్మారక స్థితిలో ఉండగా గుర్తించి ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి, తర్వాత అనంతపురం తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య
ఖమ్మం: పాఠశాలకు వెళుతున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని దుండగులు అడ్డగించి గొడ్డళ్లతో మెడపై నరికి హత్య చేసిన ఘటన కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారోజు వెంకటాచారి (49) సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో పీఈటీగా విధులు నిర్వహిస్తున్నాడు. నాయకన్‌గూడెం నుంచి పాఠశాలకు బైక్‌పై వెళుతూ హత్యకు గురయ్యాడు. కారుతో బైక్‌ను ఢీకొట్టి.. వెంకటచారి బైక్ పై వెళుతుండగా నాయకన్గగూడెం శివారులో కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగులు వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వెంకటాచారి కిందపడగా కారులోని వారితో పాటు ద్విచక్ర వాహనంపై వచ్చిన మరో వ్యక్తి అతని మెడపై గొడ్డలితో నరికి పరారైనట్లు స్థానిక రైతులు తెలిపారు. ఎరుపు రంగు కారు, దాని వెనకే బైక్ రావడం సీసీ పుటేజీల్లోనూ కనిపించడంతో వారే హత్య చేసి ఉంటారని పోలీసులు కూడా చెబుతున్నారు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు. వెంకటాచారి రెండేళ్ల క్రితం నాయకన్‌గూడెంలో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహించగా దాన్ని ప్రస్తుతం నడపటం లేదు. ఆ భవనాలను గురుకుల పాఠశాలకు అద్దెకు ఇచ్చాడు. దీంతో ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఖమ్మంరూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ జితేందర్‌రెడ్డి , ఎస్పై రమేష్‌కుమార్ పరిశీలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని, దుండగులు పరారు కావడంతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని సీఐ తెలిపారు. వెంకటాచారి కుటుంబసభ్యులు కూడా ఎవరిపై అనుమానాలు వ్యక్తం చేయలేదన్నారు. -
సీఎం సిద్ధరామయ్యను విమర్శిస్తూ పోస్టు.. నిమిషాలకే ప్రభుత్వ టీచర్‌కు షాక్!
బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఓ ప్రభుత్వ టీచర్ సస్పెండ్ అయ్యారు.చిత్రదుర్గ జిల్లాలోని కానుబెన్నహళ్లి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఎంజీ శాంతమూర్తి అనే ఉపాధ్యాయుడు సీఎం సిద్ధరామయ్యను, ప్రభుత్వం హామీ ఇచ్చిన ఉచిత పథకాలను విమర్శిస్తూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ‘ఉచితాలు ఇవ్వకుండా ఇంకేం చేయగలం’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన తన ఫేస్బుక్ పోస్ట్‌లో వివిధ ముఖ్యమంత్రి హయాంలో చేసిన అప్పులను శాతమూర్తి ప్రస్తావించాడు. ‘మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ హయాంలో రూ.3,590 కోట్లు.. ధరమ్‌సింగ్ రూ.15,635 కోట్లు, హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వంలో రూ.3,545 కోట్లు, బీఎస్ యడ్యూరప్ప హయాంలో రూ.25,653 కోట్లు, డీవీ సదానందగౌడ రూ.9,464 కోట్లు, జగదీశ్ షెట్టర్ రూ 13,464 కోట్లు, సిద్ధరామయ్య ప్రభుత్వంలో రూ. 2,42,000 కోట్లు’ అని తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. అంతేగాక ఉచితాలు అధికంగా ఇవ్వడం వల్ల రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోతుందంటూ విమర్శలు గుప్పించారు. కృష్ణా హయాం నుంచి శెట్టర్ వరకు రాష్ట్రం చేసిన రుణాలు రూ.71,331 కోట్లు కాగా.. కేవలం సిద్ధరామయ్య హయాంలోనే (2013-2018) అప్పులు రూ.2,42,000 కోట్లకు చేరాయని ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. దీంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు విద్యాధికారి ఎల్ జయప్ప ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయుడు శాంతమూర్తి ప్రభుత్వ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించాడని సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో 135 స్థానాలు గెలుచుకొని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరితోపాటు 8 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. చదవండి: అందుకే రద్దు.. మళ్లీ చలామణిలోకి రూ.1000 నోట్లు? ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ -
ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యాయత్నం.. మృతదేహం దొరికితే కాల్చేయాలని
ప్రకాశం: స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న గణిత ఉపాధ్యాయుడు రాజారపు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన ఓ లేఖ సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనం రేపింది. తనకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడం, మరో వైపు అప్పులిచ్చిన వ్యక్తులు వెంటాడటంతో మార్కాపురం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతదేహం దొరికితే కాల్చివేయాలని లేఖ రాసి స్నేహితుల గ్రూపులో సోమవారం వేకువజామున పోస్టు చేశాడు. తన ఫొటో, మాస్టర్ కార్డు, ముఖ్యమైన వారి ఫోన్ నంబర్లు, సూసైడ్‌నోట్, చెప్పులు చెరువు గట్టుపై ఆకుపచ్చ సంచిలో ఉంచుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కాగా ఉదయం 7 గంటలకు లేఖను చూసిన పలువురు పోలీసులకు సమాచారం అందించి చెరువు కట్ట దగ్గరకు వెళ్లారు. అక్కడ చెప్పులు, సంచి లభ్యమయ్యాయి. ఈతగాళ్ల సాయంతో చెరువులో గాలించినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. సమీపంలోని ప్రాంతాలను జల్లెడ పట్టగా డ్రైవర్స్ కాలనీ వద్ద లక్ష్మయ్య ఆచూకీ లభించిందని సీఐ భీమానాయక్ తెలిపారు. తన ఇంటికి చేర్చి సైలెన్ బాటిల్ ఎక్కించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సీఐ తెలిపారు. -
Heart Attack: టీచర్ గుండె ఆగింది
చీరాల: రోజు మాదిరిగానే ఉదయం పాఠశాల ప్రారంభమైంది. ప్రార్థనా గీతం అనంతరం తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం మొదలు పెట్టాడు. ఇంతలోనే తరగతి గది నుంచి ఒక్కసారిగా విద్యార్థుల కేకలు వినబడ్డాయి. సహ ఉపాధ్యాయులు ఏం జరిగిందోనని ఆందోళనతో ఆ తరగతి గదిలోకి వెళ్లగా కుర్చీలో ఉపాధ్యాయుడు అచేతనంగా ఒరిగిపోయి ఉన్నాడు. ఆందోళనతో.. 108కు సమాచారం అందించగా వారు పరీక్షించి ఉపాధ్యాయుడు మృతి చెందినట్లు చెప్పారు. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వాకావారిపాలెం ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగింది. వాకావారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జె.పంగులూరుకు చెందిన పాల వీరబాబు (45) ఉపాధ్యాయుడు. అతడి భార్య కూడా ఇదే మండలంలోని కొండమూరులో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలు. శనివారం యథావిధిగా పాఠశాలకు వచ్చిన వీరబాబు విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుర్చీలోనే మృతి చెందాడు. అప్పటివరకు తమతో మాట్లాడిన తోటి ఉపాధ్యాయుడు ఇకలేరని తెలియడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
ఉపాధ్యాయుల వివాహేతర సంబంధం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
సాక్షి, వరంగల్: ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య వివాహేతర సంబంధాన్ని భర్త బట్టబయలు చేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటన మంగపేట మండలంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఉపాధ్యాయురాలి భర్త, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు.. మరో ఉపాధ్యాయురాలితో కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఉపాధ్యాయురాలి భర్త మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. దీంతో కూతురితో అద్దె ఇంట్లో ఉంటున్న ఉపాధ్యాయురాలు, అప్పటికే ఇద్దరు భార్యలను వదిలేసి ఒంటరిగా ఉంటున్న ఉపాధ్యాయుడు నాగేందర్‌కు దగ్గరైంది. సెలవు రోజుల్లో వచ్చి వెళ్తే భర్తను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో అనుమానం వచ్చి కూతురు ద్వారా ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్నాడు. ఈ విషయంపై రెండు నెలల క్రితం పాఠశాల హెచ్ఎంకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు దూరంగా ఉండాలని నాగేందర్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. స్పందించిన అధికారులు ఉపాధ్యాయురాలిని మరో పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించారు. అయినప్పటికి నాగేందర్, ఉపాధ్యాయురాలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు భర్త కానిస్టేబుల్ ఈ నెల 18న శివరాత్రి బందోబస్తు డ్యూటీపై వేములవాడకు వెళ్లాడు. సోమవారం సెలవు ఉండటంతో మంగపేటలో ఉంటున్న భార్య, కూతురును చూసేందుకు వచ్చాడు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో నాగేందర్.. ఉపాధ్యాయురాలి సెల్‌కు ఫోన్‌చేయగా భర్త లిఫ్ట్ చేశాడు. ‘నేను వస్తున్నా తలుపు తీసి ఉంచు’అని నాగేందర్ చెప్పాడు. తన అనుమానం నిజమైందని భావించిన భర్త తలుపు తీసి బాత్రూంలో దాక్కున్నాడు. నాగేందర్ ఇంట్లోకి రాగానే గడియ పెట్టి ఇంతరాత్రి ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతున్న క్రమంలో పడుకుని ఉన్న తన భార్య, నాగేందర్ ఇద్దరు కలిసి అతనిపైనే దాడి చేసేందుకు యత్నించారు. దీంతో భయపడిన అతను ఇంటి గడియపెట్టి బయటకు వచ్చి ఇరుగుపొరుగుకు చెప్పాడు. ఉదయం తాళ్లతో ఇద్దరిని బంధించి పోలీసులకు అప్పగించారు. -
Hyderabad: నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు పక్కన నిలిపిన క్యాబ్ డోర్‌ను ఒక్కసారిగా తెరవడంతో అటుగా ద్విచక్ర వాహనంపై వచ్చినన ప్రభుత్వ టీచర్‌కు తీవ్ర గాయాలై మృతి చెందగా, అతని కుమారుడు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన ప్రభుత్వ పాఠశాల టీచర్ పెంటయ్య(45) ఆదివారం కొంపల్లిలో చదువుతున్న కుమారుడు శ్రీతేజను తీసుకుని ప్రగతినగర్‌కు వచ్చాడు. ఆపై అక్కడ నుండి జేఎన్టీయు మీదుగా కొండాపూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో ప్రగతినగర్ కాకతీయ హిల్స్ సమీపంలో రోడ్డుపై నిలిపిన క్యాబ్ డ్రైవర్ అకస్మాత్తుగా డోర్‌ను తెరిచాడు. దీంతో బైకుపై నుంచి పెంటయ్య, శ్రీతేజలు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో వెనుక నుండి వచ్చిన టిప్పర్ పెంటయ్య మీదుగా వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పెంటయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కాగా తీవ్రంగా గాయపడిన శ్రీతేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిర్లక్ష్యంగా క్యాబ్ డోరు తెరిచిన డ్రైవర్‌తో పాటు క్యాబ్ బుక్ చేసిన వ్యక్తిపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చిట్టి డబ్బులడిగితే.. కోరిక తీర్చమని వేధింపులు
సాక్షి, మెదక్ మున్సిపాలిటీ: చిట్టీల వ్యాపారం నిర్వహించే ఓ ప్రభుత్వ ఉపాధ్యా యుడు తనకు ఇవ్వాల్సిన చిట్టీ డబ్బులు అడుగుతుంటే కోరిక తీరిస్తేనే ఆ సొమ్ములు ఇస్తానని వేధిస్తున్నాడంటూ ఓ యువతి ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఉత్తరాలు రాసింది. మెదక్ పట్టణంలో కలకలం రేపిన ఈ లేఖల వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. ‘తండ్రి మద్యానికి బానిసగా మారి బాగోగులు పట్టించుకోకపోవడంతో నా పెళ్లికోసమని జీతంలో నుంచి కొంత పొదుపు చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర రూ.2 లక్షలకు చిట్టీ వేశాను. 26 నెలల చిట్టీ గడువు తీరి చాలా కాలమైంది. ఇటీవల పెళ్లి కుదరడంతో డబ్బులు అడిగితే మీ నాన్న కు ఇచ్చేశానని బుకాయిస్తున్నాడు. ఈ మధ్యన ఒంటరిగా కలిసినప్పుడు ఎలాగూ వచ్చేనెల పెళ్లి కాబట్టి, ఓ నాలుగు రోజులు నా దగ్గర గడుపు.. అలా అయితేనే నీ డబ్బులు నీకిస్తా’ అని వేధిస్తున్నాడు.. లేదంటే నీ క్యారెక్టర్ మంచిది కాదని పెళ్లి కొడుకు వాళ్లతో చెబుతాను.. మీ నాన్నకు ఓ పది వేలిస్తే అతను కూడా అదే చెప్తాడు.. అప్పుడు పరువుపోతుంది.. పైసలు పోతాయి.., పెళ్లి క్యాన్సిల్ అవుతుంది’ అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నాడని సదరు యువతి ఆ లేఖల్లో పేర్కొంది. కాగా ఈ వ్యవహారంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ మధు తెలిపారు. (చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ అనాథైన బాలిక) -
జోడో యాత్రలో వివాదాస్పద కంప్యూటర్ బాబా.. బదులివ్వాలన్న బీజేపీ
అగర్‌మాల్వా(మధ్యప్రదేశ్): కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో శనివారం వివాదాస్పద గురువు నాందేవ్ దాస్ త్యాగి అలియాస్ కంప్యూటర్ బాబా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మహుదియా గ్రామం వద్ద శనివారం ఆయన రాహుల్‌తో కలిసి నడిచారు. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలోని అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన పంచాయతీ సిబ్బందిపై చేయి చేసుకున్న కేసులో నాందేవ్ 2020లో అరెస్టయ్యారు. అలాంటి పలు కేసులున్న, జైలుకు వెళ్లొచ్చిన నిందితునితో రాహుల్‌తో కలిసి నడవడమేంటని బీజేపీ నిలదీసింది. అయితే, దేశ క్షేమం కోసం చేపట్టిన యాత్రలోకి సాధువులతో సహా అందరూ ఆహ్వానితులేనని కాంగ్రెస్ బదులిచ్చింది. అయితే ఈ కంప్యూటర్ బాబాకు 2018లో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సహాయ మంత్రి హోదాతో కూడిన పదవి కట్టబెట్టింది! అనంతరం బీజేపీతో పొసగక ఆయన కాంగ్రెస్ పంచన చేరారు. జోడో యాత్రలో పాల్గొన్నందుకు మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ టీచర్‌ను శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది. ఆరెస్సెస్ సమావేశాల్లో పాల్గొనే ప్రభుత్వోద్యోగులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నించింది. -
ప్రభుత్వ టీచర్‌గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా..
రాయచూరు రూరల్(కర్ణాటక): అవకాశాలు ఇస్తే ఏ రంగంలోనైనా ప్రతిభ చాటుకుంటామని హిజ్రాలు రుజువు చేస్తున్నారు. అశ్వత్థామ అలియాస్ పూజా (26) అనే ట్రాన్స్‌జెండర్ ప్రభుత్వ పాఠశాల టీచర్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన ఉపాధ్యాయ పరీక్షలలో పూజా కి ఉద్యోగం దక్కింది. మాన్వి తాలూకా నీరమాన్విలో ప్రభుత్వ పాఠశాలలో సోషల్ టీచర్‌గా ఇప్పుడు పనిచేస్తున్నారు. హిజ్రా కోటాలో ఉద్యోగం లభించినట్లు పూజా తెలిపారు. ఆమె నీరమాన్విలోనే టెన్త్ వరకూ కన్నడలో విద్యనభ్యసించింది. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. పూజా మాట్లాడుతూ 16 ఏళ్ల వయసులో ఉండగా హిజ్రాగా మారినట్లు తెలిపారు. చదువుపై ఇష్టంతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకుని బీఏ, బీఈడీ పూర్తి చేసినట్లు చెప్పారు. చదవండి: Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’ -
అయ్యో టీచరమ్మ! స్కూల్‌కు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి..
సంస్థాన్‌నారాయణపురం/నాంపల్లి: బ్రెయిన్ డెడ్‌తో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నారాయణపురం మండలానికి చెందిన జక్కిడి విజయలక్ష్మి నాంపల్లి మోడల్ స్కూల్లో పీజీటీగా పని చేస్తూ భర్త నర్సింహారెడ్డితో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఈనెల 21 పాఠశాలకు వచ్చే సమయంలో తీవ్రమైన తలనొప్పి వచ్చింది. కుటుంబ సభ్యులు ఆమెను హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు మెదడులో రక్తం గడ్డకట్టిందని చెప్పారు. మెరుగైన చికత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ విజలక్ష్మి కోమాలోకి వెళ్లింది. శుక్రవారం ఉదయం బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఇంటర్లో మళ్లీ వంద శాతం సిలబస్ అవయవాలు జీవన్‌దాన్ ట్రస్టుకు.. విజయలక్ష్మి అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో ఆస్పత్రి వర్గాల ద్వార జీవన్ దాన్ సంస్థకు రెండు కిడ్నీలు, లివర్, రెండు కళ్లను అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని సంస్థాన్ నారాయణపురానికి తీసుకొచ్చారు. శనివారం దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. విజయలక్ష్మి మృతికి ఉపాధ్యాయ సంఘం నాయకులు, ప్రజా నాట్య మండలి సభ్యులు, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎంఈఓ గురువారావు, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు చిలువేరు నారాయణ, పీఆర్టీయూ అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, టీఆర్ఎస్కేవీ నాయకుడు బిరుదోజు దామోదరచారి, ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షుడు నాంపల్లి చంద్రమౌళి, ఉపాధ్యాయులు సంజీవరావు, విఠల్, కృష్ణారెడ్డి, భారతి, పలువురు నేతలు తదితరులు ఉన్నారు. బంగారు నాణేనికి బదులు బిల్లొచ్చింది! -
Photo Feature: వెనుక ‘బడి’..
జగదేవ్‌పూర్ (గజ్వేల్): ఆ గ్రామ ప్రభుత్వ బడిలో విద్యార్థులున్నారు.. కానీ చదు వు చెప్పేందుకు ఉపాధ్యాయుడు లేరు. ఇదీ సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండ లం నిర్మల్‌నగర్ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాలలో 30 మందికి పైగా పిల్లలున్నా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేరు. దీంతో డిప్యుటేషన్‌పై ఒక ఉపాధ్యాయుడిని ని యమించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్ శ్యామలరాజు, గ్రామస్తుల సహకారంతో రెండేళ్లుగా ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పించారు. పాఠశా లలు పునఃప్రారంభమయ్యాక డిప్యుటేషన్ ఉపాధ్యాయుడు మొదటి రోజు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత నుంచి రాకపోవడంతో కొందరు పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో చేరారు. మరికొందరు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక ఇబ్బందిగా ఉందని, విద్యావలంటీర్‌ను ఏర్పాటు చేసి పాఠశాలను నడిపిస్తామని చెప్పారు. -
ఉగ్రవాదుల దుశ్చర్య.. కాల్పుల్లో ప్రభుత్వ టీచర్ మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మైనార్టీలను లక్ష్యంగా ఉగ్ర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కుల్గాం జిల్లాలో ఓ స్కూల్ టీచర్‌ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. గోపాల్‌పోరా ప్రాంతంలో ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ఆలోపే ఆమె కన్నుమూశారు. మృతురాలిని సాంబా ప్రాంతానికి చెందిన రజ్ని బాలా(36)గా పోలీసులు ప్రకటించారు. ఆమె కశ్మీరీ పండిట్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఉగ్రవాదుల్ని వీలైనంత త్వరగా ఏరివేస్తామని తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. మూడు వారాల కిందట.. కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ అనే ప్రభుత్వ ఉద్యోగిని కార్యాలయంలోనే ఉగ్రవాదులు బుద్గంలో కాల్చి చంపిన విషయం తెలిసిందే. అదే విధంగా వారం కిందట.. టీవీ నటి అమ్రీన్ భట్‌ను సైతం ఉగ్రవాదులు కిరాతకంగా కాల్చి చంపారు. ఇదిలా ఉంటే.. ఈ నెలలో ఉగ్రదాడుల్లో ఇది ఏడో మరణం. ముగ్గురు పోలీస్ సిబ్బందికాగా, నలుగురు పౌరులు మరణించారు. కశ్మీరీ పండిట్లను వెనక్కి రప్పించి మరీ.. ప్రాణాలను బలిగొంటోందని కేంద్ర ప్రభుత్వంపై కశ్మీరీ పండిట్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు వాళ్ల భద్రత విషయంలో కశ్మీరీ పార్టీలన్నీ ఒకేతాటిపై వచ్చి కేంద్రాన్ని నిలదీస్తున్నాయి. -
విద్యార్థులతో మేడమ్ రాసలీలలు వైరల్.. దర్యాప్తు ముమ్మరం
చెన్నై: తమిళనాడులో ఓ గవర్నమెంట్ టీచర్ చేసిన పని సంచలనంగా మారింది. ముగ్గురు విద్యార్థులతో శారీరకంగా కలవడమే కాదు.. ఆ చెండాలాన్ని వీడియో తీసి వైరల్ చేసిన ఘటన పెనుదుమారం రేపింది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే ఘటన కావడంతో స్వయంగా తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబు ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. మధురైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలలో పని చేస్తోంది సదరు టీచర్(42). ఈ క్రమంలో ఓరోజు ముగ్గురు విద్యార్థులను ఇంటికి రప్పించుకుని.. వాళ్లతో శారీరకంగా కలిసింది. ఈ తతంగాన్ని 39 ఏళ్ల వయసున్న ఆమె ప్రియుడు, స్థానిక వ్యాపారవేత్త ఒకడు వీడియో తీశాడు. ఆపై ఆ వీడియోను తన స్నేహితుల సాయంతో వాట్సాప్ ద్వారా సర్క్యూలేట్ చేశాడు. వీడియో వ్యవహారం పోలీసుల దృష్టికి చేరడంతో తమిళనాడు డీజీపీ కార్యాలయం స్పందించింది. తక్షణమే ఆ వీడియోను తొలగించే ప్రయత్నాలు చేయాలని మధురై సైబర్ సెల్‌ను ఆదేశించింది. ఈ వ్యవహారంపై టీచర్, ఆమె ప్రియుడ్ని మధురై పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ.. 2010 నుంచి సదరు వ్యాపారవేత్తతో సహజీవనం చేస్తోంది. కేవలం వైరల్ కావడం కోసమే ఆ వీడియో తీశారా? లేదంటే.. అశ్లీల సైట్లలో అప్లోడ్ చేసి డబ్బు సంపాదించాలనుకున్నారా? బ్లాక్‌మెయిలింగ్ కోణం ఉందా? అనేది సైబర్‌విభాగం తేల్చాల్సి ఉంది. వీడియోను ఎవరికి పంపారు? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఆ ముగ్గురు విద్యార్థుల తల్లిదండ్రులు సదరు టీచర్‌పై, ఆమె ప్రియుడిపై మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. -
ఉపాధ్యాయుడి బాగోతం బట్టబయలు.. జీతం లక్ష.. కానీ తనకు బదులుగా..
చింతూరు (తూర్పుగోదావరి): ఆ అయ్యవారి జీతం అక్షరాలా లక్ష రూపాయలు పైగా ఉంది. నెల తిరిగేసరికి ఆ డబ్బులు లక్షణంగా తీసుకుంటున్నాడు. జీవితం హ్యాపీగా గడుపుతున్నాడు. కానీ తన కనీస కర్తవ్యమైన బోధనను మాత్రం విస్మరించాడు. చిన్నారులకు పాఠాలు చెప్పడానికి విముఖత చూపుతున్నాడు. మారుమూల గిరిజన గ్రామం కదా! తనను ఎవరేం చేస్తారని అనుకున్నాడేమో! అస లు పాఠశాలకే వెళ్లడం లేదు. ఇందుకు ఎటువంటి అనుమతీ కూడా తీసుకోలేదు. పైగా తనకు బదులుగా పాఠాలు చెప్పడానికి ఓ యువకుడిని తానే దర్జాగా నియమించేశాడు. రోజూ కొంత డబ్బులు కూడా చెల్లిస్తున్నాడు. ఈ అయ్యవారి బాగోతం ఎట్టకేలకు బట్టబయలైంది. చదవండి: Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే? చింతూరు మండలంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట. ఇక్కడి గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకరు లాంగ్‌లీవ్‌లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో రెగ్యులర్ ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి ఉంది. ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న అతడు పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. ఈ విషయం బయటకు పొక్కడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు చిచ్చడి మురళి, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కలసి శనివారం ఆ పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ, ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డి పాఠశాలకు గైర్హాజరవుతున్నాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్న ఆ ఉపాధ్యాయుడు తన బదులు అదే గ్రామానికి చెందిన యువకుడు ముచ్చిక రవికుమార్‌ను అనధికారికంగా నియమించుకున్నాడని, అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తూ, విద్యార్థులకు పాఠా లు చెప్పిస్తున్నాడని తెలిపారు. రవికుమార్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడని చెప్పారు. ఉపాధ్యాయుడు గైర్హాజరవుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకువెళ్లినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని తెలిపారు. ఉపాధ్యాయుల వైఖరి ఇలాగే ఉంటే విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవలం అమల, వైస్ ఎంపీపీ యడమ అర్జున్, ఎంపీటీసీ సభ్యుడు సున్నం నాగరాజు, సర్పంచ్‌లు సవలం సత్తిబాబు, పాయం చంద్రయ్య, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ యగుమంటి రామలింగారెడ్డి పాల్గొన్నారు. -
ఈ సారు ఎంత మంచోడో.. కూడబెట్టిన 40 లక్షలు ఇచ్చేశాడు
ప్రపంచంలో బాధలను ఎవరూ తగ్గించలేరు, కానీ మనం చేయగలిగినంత మంచి చేయాలి.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి నోటి నుంచి వెలువడిన ఆణిముత్యం లాంటి మాట ఇది. మాటే కాదు.. ఆయన మనసూ స్వచ్ఛమే. విజయ్ కుమార్ చాన్సోరియా.. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాలో ప్రభుత్వ టీచర్‌గా పని చేశారు. 39 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఈ మధ్యే ఆయన సర్వీస్ నుంచి దిగిపోయారు. సోమవారం ఆయన ఉద్యోగ విరమణ సన్మానం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమంలో పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయల్ని పేద విద్యార్థులకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారాయన. భార్యతో విజయ్ కుమార్ సార్ ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది నాకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని చెప్పారాయన. రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నా. నాలాగే ఎంతో మంది ఇప్పటికీ కష్టపడుతున్నారు. చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు నాలాంటి కష్టం రాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నా అని ప్రకటించగానే.. అంతా చప్పట్లతో ఆయన్ని స్వాగతించారు. అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటే. అక్కడ చప్పట్లు కొట్టిన వాళ్లలో ఆయన భార్యా, కూతురూ ఉన్నారు కూడా. విజయ్ కుమార్ భార్య బాగానే చదువుకుంది. ఆయన కూతురికి ఆల్రెడీ పెళ్లైంది. ఇద్దరు కొడుకులూ ఉద్యోగాలు చేస్తూ మంచిగానే సెటిల్ అయ్యారు. వాళ్ల అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు విజయ్ కుమార్ చాన్సోరియా. చదవండి: కారడవిలో అడవి బిడ్డల భవిష్యత్తు కోసం 14కి.మీ. నడక! -
‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’
సాక్షి, మోర్తాడ్ (నిజామాబాద్): వేరే జిల్లాకు బదిలీ కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయురాలు సరస్వతికి కుటుంబ సభ్యులు, సహచర ఉపాధ్యాయులు కన్నీటితో వీడ్కోలు పలికారు. భీమ్‌గల్ మండలం బాబాపూర్‌లో సోమవారం పోలీసు బందోబస్తు నడుమ అంత్యక్రియలు నిర్వహించారు. సరస్వతి ఆత్మహత్య విషయం తెలిసి ఖతర్‌లో ఉంటున్న ఆమె భర్త భూమేశ్ హుటాహుటిన స్వగ్రామానికి వచ్చారు. రాజకీయ నాయకులు రాకుండా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఇతర పార్టీల నాయకులు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో గ్రామానికి వచ్చే అన్ని దారుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్, తపస్, డీటీఎఫ్ తదితర సంఘాల నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరస్వతి ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని, ఆమె ఆశయాలను సాధించడానికి, జీవో నెం.317 జీవో రద్దు చేసే వరకు పోరాడతామని హెచ్చరించారు. సరస్వతి అంతిమ యాత్రలో పాల్గొన్న ప్రజలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రి పర్యటన రద్దు.. రైతుబంధు పెట్టుబడి సహాయం రూ.50 వేల కోట్లకు చేరిన నేపథ్యంలో నిర్వహిస్తున్న సంబురాల్లో పాల్గొనడానికి మంత్రి ప్రశాంత్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే, సరస్వతి ఆత్మహత్య అనంతరం ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయోననే సందేహంతో మంత్రి తన పర్యటనను రద్దు చేసుకున్నారు. చదవండి: (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?) ‘పిల్లలను చూసైనా బతకాలనిపించలేదా?’ ‘గాంధారిలో ఉద్యోగం చేయడం ఇష్టం లేకుంటే రాజీనామా చేయు అని చెప్పానుగా సరస్వతి.. ఉద్యోగం మానేస్తే మరో నాలుగేళ్లు ఎక్కువ కష్టపడతా అన్నానుగా.. రామ్లక్ష్మణ్లను మంచిగా చదివించుకోవడమే ముఖ్యం అంటే సరే అన్నావు.. మరి ఎందుకిలా చేశావు సరస్వతి.. నా ముఖం, పిల్లల ముఖం చూసైనా బతుకుదామనిపించలేదా సరస్వతి... నీ దారిన నీవు పోయి మా అందరి దారి మూసేసావు సరస్వతి..’ అంటూ భర్త భూమేశ్ విలపించడం అక్కడున్న వారిని కలిచి వేసింది. పదేళ్ల నుంచి ఖతర్‌లో ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్న భూమేష్ ఏడాది కిందనే సెలవుపై వచ్చి వెళ్లాడు. మరో ఏడా ది తరువాత ఇంటికి రావాల్సి ఉండగా భార్య సరస్వతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పా ల్పడిన విషయం తెలుసుకుని సోమవారం హుటాహుటిని ఇంటికి చేరుకున్నాడు. -
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?
-
ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. అదే కారణమా..?
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బేతల సరస్వతి ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భీంగల్ మండలం రహత్ నగర్లో టీచర్‌గా పని చేస్తున్న సరస్వతికి ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోలో నిబంధనల్లో భాగంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ అయింది. దూరప్రాంతానికి బదిలీ కావడంతో మనస్థాపం చెందిన సరస్వతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. భర్త బేతల భూమేష్ ఉపాధి నిమిత్తం ఖతార్‌కు వెళ్ళాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: ('మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణం.. వారిని వదలొద్దు') టీచర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి స్వామి ఆర్మూర్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేశారు. ఉపాధ్యాయురాలు మృతికి మానసిక కారణమా? బదిలీతో మనస్థాపం చెందడమా అన్న కోణం విచారణలో తేలాల్సి ఉంది. బదిలీ కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నేతల హౌస్ అరెస్టు ఉపాధ్యాయురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ నేత అనిల్‌ను అరెస్టు చేసిన పోలీసులు పలువురు నేతలను వారి ఇంట్లోనే నిర్భందించారు. దీంతో పోలీసులు,కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చదవండి: (Hyderabad: ఇంట్లో చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి..) -
పోక్సో కేసులో 21 ఏళ్ల శిక్ష
కొత్తగూడెం రూరల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారితప్పాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతవర్ర గామ ప్రభుత్వ పాఠశాలలో దొడ్డ సునీల్‌కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన గత ఏడాది డిసెంబర్లో పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను పాఠశాలకు పిలిచేవాడు. ఆయన మాటలు నమ్మి వచ్చిన ఐదుగురు విద్యార్థినుల(మైనర్లు)పై సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సునీల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఐపీఎస్ అధికారి వినీత్ విచారణ జరిపారు. ఈ మేరకు కేసు కోర్టు విచారణకు రాగా, న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. అనంతరం నిందితుడు సునీల్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
నాడు దినసరి కూలీ నేడు టీచర్
యాలకుల తోటలో దినసరి కూలీగా పనిచేసే 28 ఏళ్ల సెల్వమరి ప్రభుత్వ ఉపాధ్యాయినిగా మారింది. ఆమె సాధించిన ఈ ఘనత వెనకాల కొన్నేళ్ల కృషి ఉంది. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తికి అర్థంలా సెల్వమరి గురించి పిల్లలకు పాఠంలా చెప్పచ్చు. పెద్దలూ తమ దారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు. స్వయంకృషితో ఎదిగిన సెల్వమరికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఫోన్ ద్వారా, ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. సెల్వమరి తన బాల్యంలో తల్లితో కలిసి సెలవుల్లో యాలకుల తోటలో పనిచేసేది. అర్ధరాత్రిళ్లు నూనె దీపాన్ని పెట్టుకొని చదువుకునేది. తండ్రి ఆమె చిన్నతనంలోనే తల్లిని, ఇద్దరు కూతుళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ పోషణకు తల్లి యాలకుల తోటలో పనిచేసేది. తల్లితోపాటు సెల్వమరి కూడా కూలికి వెళ్లేది. గణితంలో ప్రతిభ పూట గడవని రోజులైనా చదువును మాత్రం పక్కన పెట్టలేదు సెల్వమరి. చదువొక్కటే తమ జీవితాలను మారుస్తుందని నమ్మింది. తన కలను ఎవరికీ చెప్పకుండా దాచుకుంది. ఆ కలను సాధించడానికి నిత్యం కృషి చేసింది. సెల్వమరికి గణితం అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ గణితంలో ప్రతిభ చూపుతుండేది. తిరువనంతపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీలో చేరినప్పుడు తల్లికి ధైర్యం చెప్పింది. కాలేజీకి సెలవు రోజులు ఇవ్వగానే తిరిగి ఇంటికి వచ్చి, తల్లితో కలిసి కూలి పనులకు వెళ్లేది. అలా వేసవి సమయమంతా తల్లికి చేదోదు వాదోడుగా ఉండేది. సమస్యలను అధిగమిస్తూ.. ‘డిగ్రీ ఇంగ్లిషు మాధ్యమంలో చేరడంతో మొదట సమస్యగా అనిపించేది. మాతృభాష మలయాళం తప్ప ఇంగ్లిషు సరిగా వచ్చేది కాదు. కానీ, మా అమ్మ ముఖం గుర్తుకు తెచ్చుకొనేదాన్ని’ అంటూ సమస్యను అధిగమించిన విధానాన్ని తెలియజేస్తుంది సెల్వమరి. క్రమంగా భాషా సమస్యను పరిష్కరించుకొని డిగ్రీ, అటు తర్వాత ఎమ్మెస్సీ పూర్తి చేసింది. కుమిలీలోని ఎంజి యూనివర్శిటీ నుంచి బీఈడీ, ఎమ్ఈడీ పూర్తి చేసింది. థైక్వాడ్ గవర్నమెంట్ కాలేజీ నుంచి ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఇప్పుడు మ్యాథమేటిక్స్‌లో పీహెచ్డీ చేస్తోంది. యుజిసి నెట్ ఎగ్జామ్ పూర్తి చేసింది. సివిల్ సర్వీసులలో రాణించాలన్నది తన పెద్ద కల. అందుకు ఎంత కష్టమైనా పడతానంటున్న సెల్వమరి కేరళలోని ఇడుక్కి జిల్లాల్లో వంచివయాల్ ఉన్నత పాఠశాలలో ఇటీవలే ఉపాధ్యాయురాలిగా చేరింది. ఎక్కడా అవకాశాలు లేవు, ఎటు చూసినా ఆర్థిక ఇబ్బందులే, కుటుంబ పరిస్థితి ఏమీ బాగో లేదని వాపోతూ అనేక సాకులు వెతికేవారికి సెల్వమరి జీవితం ఓ పాఠం. కృషి చేస్తే జీవితం తప్పక మారుతుందని తెలిపే విజయకథనం. -
'నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం'
శ్రీనగర్: కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన షోహిబ్ బషీర్ అనే విద్యార్థి శనివారం(మే 29న) ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఏంఏ సైకాలజీ చదువుతున్న అతను పరీక్ష ఫీజు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే బషీర్ ఆత్మహత్యకు పాల్పడే ముందు ఫోన్లో రికార్డు చేసిన వీడియో వెలుగులోకి రావడంతో అసలు కారణం బయటపడింది. ఆ వీడియోలో బషీర్ పలికిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ''మా నాన్న బషీర్ అహ్మద్ మిర్.. గవర్నమెంట్ పాఠశాలలలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. పేరుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన మా నాన్నకు గత రెండు సంవత్సరాలుగా జీతం చెల్లించడం లేదు. దీంతో రెండేళ్లుగా మా ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. రెండేళ్ల క్రితం వరకు ఎంతో ఆనందంగా ఉన్న నా కుటుంబ పరిస్థితి విచ్చిన్నంగా తయారైంది. చదువును ఎక్కువగా ఇష్టపడే నేను.. ఏదైనా పని చేసుకొని ఫీజు చెల్లించాలనుకున్నా. కానీ మేముండే ప్రాంతంలో బాంబులు, ఎన్కౌంటర్ల మోత తప్ప ఇంకేం ఉండదు.. దీనికి బయపడి మా ఇంట్లోవారు నన్ను ఎక్కడికి పంపించేవారు కాదు. ఇది నా తండ్రి ఒక్కడితోనే ఆగిపోలేదు. కశ్మీర్లో ఉన్న 140 మంది ప్రభుత్వ టీచర్లకు గత రెండు సంవత్సరాలుగా జీతాలు చెల్లించడం లేదు. నేను నా చదువు మధ్యలో ఆగిపోతుందని ఆత్మహత్యకు పాల్పడడం లేదు. కనీసం నా చావుతోనైనా ఇక్కడి ప్రభుత్వ టీచర్లకు జీతాలు చెల్లిస్తారని అనుకుంటున్నా. నా ఆత్మహత్య కశ్మీర్ ప్రభుత్వ టీచర్లకు అంకితం. నా చావుతో ఇక్కడి ప్రభుత్వం కదిలివస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ బషీర్ ముగించాడు. ప్రస్తుతం బషీర్ వీడియో కశ్మీర్ ప్రభుత్వంలో కలకలం రేపింది. ఇప్పటికే అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం కశ్మీర్ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా ఉన్న తసాదుఖ్ మిర్ ప్రభుత్వ టీచర్ల జీతాల చెల్లింపుకు సంబంధించి ఒక నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వ టీచర్లకు ఇవ్వాల్సిన రెండేళ్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని కశ్మీర్ హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన కొడుకు ఆత్మహత్యపై తండ్రి బషీర్ అహ్మద్ మిర్ స్పందిస్తూ..'' నా కొడుకు ఇలా ఆత్మహత్యకు పాల్పడుతాడని ఊహించలేదు. వాడిది చాలా సున్నితమైన మనసత్వం. తండ్రి ప్రభుత్వ టీచర్ అయి ఉండి కూడా ఫీజులు చెల్లించలేకపోయాడని బాధపడేవాడు.'' అంటూ ఆవేదన చెందాడు. చదవండి: చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది -
నేను బతికేలా లేను.. బిడ్డలు, నువ్వు జాగ్రత్త!
సాక్షి, గొల్లపల్లి(ధర్మపురి): కరోనా అంటే భయపడవద్దని.. ఇంటి వద్దనే తగ్గుతుందని అందరిలో ధైర్యం నూరిపోసిన తానే ధైర్యం కోల్పోయాడు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చేరేందుకు వెనుకాడాడు. చివరికి శ్వాససంబంధిత సమస్య తలెత్తడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరి ప్రాణాలు కోల్పోయాడు. ‘నువ్వు.. బిడ్డలు జాగ్రత్త..’ అంటూ ఆస్పత్రిలో చేరే ముందు చెప్పినవే చివరిమాటలు అయ్యాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు బండారి చంద్రశేఖర్ కరోనా కాటుకు బలయ్యాడు. చంద్రశేఖర్ బుగ్గారం మండలం గంగాపూర్ ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్నారు. భార్య లహరి, కొడుకు చరణ్‌తేజ(14), కూతురు కీర్తి(11) ఉన్నారు. చంద్రశేఖర్ చిన్న వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడమే కాదు.. మారుమూల ప్రాంతంలోని పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. గ్రామంలో ఎవరికీ ఇబ్బంది ఎదురైన తనకు తోచిన సహాయం అందించేవారు. ఇలా అందరికీ సాయం చేసే శేఖర్ ఈ నెల 19న కరోనాతో పోరాడి ప్రాణాలు వదిలాడు. ఇంటి వద్దే తగ్గుతుందనుకున్నారు కరోనా పాజిటివ్ అని తెలిసినా భయపడలేదు. హోమ్ క్వారంటైన్లో ఉండి మందులు వాడితే తగ్గిపోతుందని భావించాడు. శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో హైదరాబాద్ తీసుకెళ్తామన్నాం. హైదరాబాద్ ఆసుపత్రిలో ఎక్కువ మంది లక్షలు ఖర్చు చేసుకున్నా తగ్గుతలేదని, ఇంటి వద్దనే మందులు వాడితే తగ్గిపోతుందని మాకు చెప్పాడు. అయితే ఐదు రోజులకే ఆరోగ్యంలో మార్పులు కనిపించాయి. వెంటనే హైదరాబాద్‌కు తీసుకెళ్లాం. ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో బిడ్డలు.. నువ్వు జాగ్రత్త అన్న మాటలే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు. ఆయన బతికిరావాలని మొక్కరాని దేవుళ్లకు మొక్కినం. రూ.8 లక్షల వరకు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదు. నాన్న వస్తాడమ్మ.. నాన్నకు ఏమికాదని నా పిల్లలు అంటుంటే దుఃఖం ఆగడం లేదు. – లహరి, శేఖర్ భార ఇప్పుడెవరిస్తారు నాన్న మా నాన్న అడుగక ముందే అన్ని ఇచ్చారు. నాన్న చనిపోయి 11 రోజులవుతుంది. బయటకు వెళ్తే ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేది. ఇప్పుడెవరిస్తారు నాన్న?. ప్రైవేట్ స్కూల్లో నన్ను, చెల్లిని చదవించావు. నేను బాగా క్లెవర్ అని కలెక్టర్ అయ్యే దాకా చదివిస్తాను అన్నావు. కానీ కలెక్టర్‌ను చేయకుండానే వెళ్లిపోయావు. నాకు బైక్ నేర్పించావు. నువ్వు లేకుండా బైక్ నడుపబుద్ది కావడం లేదు నాన్న. చెల్లి కీర్తి సారీ ఫంక్షన్ గ్రాండ్‌గా చేస్తానన్నావు. ఇప్పుడు కనిపించనంత దూరంగా వెళ్లిపోయిండు. మా నాన్న మళ్లీ రావాలి. – చరణ్‌తేజ్, కీర్తి చదవండి: బ్లాక్‌ఫంగస్ దానివల్ల రాదు.. ఇది అసలు విషయం! దమ్ము కొడితే.. దుమ్ములోకే.. -
టీచర్‌పై మమకారం.. అపురూప దృశ్యం ఆవిష్కృతం
సాక్షి, శ్రీకాకుళం : ఇంటి ఆడ పడుచు వేరే ఇంటికి వెళ్లిపోతున్న బాధ ఆ గ్రామస్తుల కళ్లలో కనిపించింది. అమ్మ ఊరెల్లిపోతుంటే అడ్డుకునే బిడ్డల అమాయకత్వం ఆ పిల్లల ముఖాల్లో అగుపించింది. నాలుగేళ్ల పాటు పాఠాలు చెప్పి, బడిని బాగు చేసి బదిలీపై వెళ్లిపోతున్న టీచర్‌ను విద్యార్థులు వదల్లేకపోయారు. వీడ్కోలు కూడా మర్చిపోలేని విధంగా ఉండాలని భావించారు. టీచర్ పనితీరు తెలిసిన గ్రామస్తులు కూడా పిల్లలకు జత కలవడంతో గొనకపాడులో అపురూప దృశ్యం ఆవిష్కృతమైంది. ఇక్కడి జెడ్పీ హైసూ్కల్లో నాలుగేళ్లు హెచ్ఎంగా పనిచేసి బదిలీపై వెళ్లిన అల్లాడ లలితకుమారిని విద్యార్థులు, గ్రామస్తులు బగ్గీపై ఊరేగించారు. పాఠశాల అభివృద్ధికి ఆమె అందించిన సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని స్థానికులు చెప్పారు. – సోంపేట చదవండి: ఏపీ: గవర్నర్‌ను కలిసిన ఎస్ఈసీ నీలం సాహ్ని -
బురిడీ మాష్టారు.. బండారం బట్టబయలు
సాక్షి విశాఖపట్నం: మాయమాటలు చెప్పి మోసగించిన ఓ ఉపాధ్యాయుడు, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూమి విక్రయించిన వారిద్దర్నీ ఆదివారం అరెస్టు చేసి, నర్సీపట్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచారు. న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఎస్ఐ ధనంజయ్ నాయుడు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మాకవరపాలెంకు చెందిన ఉపాధ్యాయుడు లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి నర్సీపట్నంలో ఆరు సెంట్లతో పాటు, విజయవాడ సమీపంలోని తాడేపల్లి వద్ద మరో రెండు సెంట్ల భూమి విక్రయించేందుకు 2019లో జోగుంపేటకు చెందిన గుడివాడ రాంబాబు నుంచి రూ.19 లక్షలు తీసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో పురోణి రాసి రాంబాబుకు అందజేశారు. ఆ తరువాత రిజిస్ట్రేషన్ చేయాలని పలు సార్లు రాంబాబు కోరగా వారు స్పందించలేదు. దీంతో అనుమానించిన రాంబాబు ఆ రెండు ప్రాంతాల్లోని భూమికి సంబంధించిన ఈసీ పొందగా అవి వేరే వ్యక్తుల పేరుపై ఉన్నాయి. దీనిపై బాధితుడు రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను నర్సీపట్నం న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా 15 రోజులపాటు రిమాండ్ విధించారని ఎస్ఐ చెప్పారు. ఉద్యోగాల పేరుతో టోకరా లాలం రమణబాబు, భార్య విజయ్‌దుర్గాదేవి పోస్టల్‌తో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేసి స్వాహా చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మాకవరపాలెం, నాతవరం, నర్సీపట్నం ప్రాంతాల్లో పలువురు వీరి చేతిలో మోసపోయారని చెప్పారు. బాధితులు సంబంధిత పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయనున్నట్టు సమాచారం. నర్సీపట్నంలో మరో కేసు నర్సీపట్నం: ఉపాధ్యాయుడు రమణబాబు నర్సీపట్నంలో కూడా మరో మోసానికి పాల్పడ్డాడు. భూమి విక్రయం పేరుతో తోటి ఉపాధ్యాయురాలు కోనాల సంధ్య వద్ద రూ.30 లక్షలు రమణబాబు దంపతులు తీసుకున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ చేయకపోగా డబ్బులు అడిగినందుకు సంధ్యపై దాడికి దిగాడు. సంధ్య పట్టణ పోలీసు స్టేషన్లో జనవరి 23న ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్ఐ లక్ష్మణ్‌రావు కేసు నమోదు చేశారు. అప్పట్లోనే రమణబాబు దంపతులను పట్టణ పోలీసులు అరెస్టు చేయాల్సి ఉండగా అతను కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడంతో కేసు విచారణ దశలో ఉండిపోయింది. ఉపాధ్యాయురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమణబాబు దంపతులను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం గొలుగొండ కేసులో రమణబాబు దంపతులు అరెస్టు అయినప్పటికీ రిమాండ్ అనంతరం మళ్లీ అరెస్టు చేయనున్నట్టు ఎస్ఐ లక్ష్మణ్‌రావు తెలిపారు. చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు!