grand daughter
-
రాజేంద్రప్రసాద్ మనవరాలి చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం "ఎర్రచీర - ది బిగినింగ్". ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మాలయా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా బిజినెస్ షో వేశారు. ఈ సినిమా చూసిన డిస్ట్రిబ్యూటర్లందరూ సినిమా అద్భుతంగా ఉందని అన్నారు.అయితే ఈ మూవీని వచ్చే శివరాత్రికి థియేట్రికల్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో డివోషనల్ టచ్ ఉండడంతో ఇప్పుడు రిలీజ్ చేయడం మంచిది కాదని భావిస్తున్నారు. దీంతో వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా అంటే ఫిబ్రవరి 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఈ సందర్భంగా దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ..'సినిమా చూసిన వారందరూ అద్భుతంగా ఉందని కొనియాడారని అన్నారు. సినిమా ఆలస్యం కావచ్చు.. కానీ కంటెంట్ మాత్రం కంటెంట్ అద్భుతంగా ఉందని చూసినవారు చెప్పారు' అని అన్నారు. ఈ చిత్రంలో శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగార్ల సంగీతమందిస్తున్నారు. -
మురళీమోహన్ మనవరాలి పెళ్లిలో ఆర్ఆర్ఆర్ కొరియోగ్రాఫర్ (ఫోటోలు)
-
గ్రాండ్‌గా మురళీమోహన్ మనవరాలితో కీరవాణి కొడుకు పెళ్లి వేడుక (ఫోటోలు)
-
గ్రాండ్‌గా దిల్ రాజు మనవరాలు ఇషిక శారీ ఫంక్షన్ (ఫోటోలు)
-
మనవరాలితో అదానీ మురిపెం : బిలియనీర్ ఫోటో వైరల్
అసలు కంటే వడ్డీ ముద్దు అనేది నానుడి. అంటే బిడ్డలతో పోలిస్తే మనవలు మనవరాళ్లపైనే తల్లితండ్రులకు ఎక్కువప్రేమ అభిమానం ఉంటుంది అని. చాలా సందర్బాల్లో ఇది అక్షరాలా అనిపిస్తుంది. ఇందులో బడా పారిశ్రామికవేత్తలైనా, సెలబ్రిటీలైనా ఎవ్వరూ అతీతులు కారు. తాజాగా బిలియనీర్, అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీ తన ముద్దుల మనవరాలిని చూసి తెగమురిసిపోతున్నారు. నీ కళ్లలోని మెరుపుతో పోలిస్తే ఈ ప్రపంచంలోని సంపద అంతా దిగ దుడుపే అన్నట్టు రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరలవుతోంది. 14 నెలల మనవరాలు కావేరిని ఎత్తుకున్న ఫోటోలను ట్విటర్లో షేర్ చేశారు. ప్రపంచంలో ఇంతకుమించిన సంపద ఏముందంటూ ఒక కవితా పదాలను రాయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో హాట్‌టాపిక్‌గా నిలిచింది. "ఇన్ ఆంఖోన్ కీ చమక్ కే ఆగే దునియా కీ సారీ దౌలత్ ఫీకీ హై. (నీ కళ్ల మెరుపులో ప్రపంచంలోని సంపద అంతా మసకబారుతుంది)" అంటూ ఉద్వేగంతో రాసుకొచ్చారు. గౌతమ్ అదానీ- ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. వీరిలో పెద్ద కుమారుడు కరణ్- పరిధి ముద్దుల తనయ కావేరి. కాగా లండన్‌లోనే సైన్స్ మ్యూజియంలో న్యూ అదానీ గ్రీన్ ఎనర్జీ గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ చిన్నారితో ఫోటో తీసుకున్నారు. తన జీవితంలో మనవరాళ్లతో గడపడమే తనకు పని ఒత్తిడి (బిగ్గెస్ట్ స్ట్రెస్ రిలీవర్స్) పెద్ద ఉపశమనం అని గతంలో పేర్కొన్నారు. "నా మనుమరాళ్లతో సమయం గడపడం చాలా ఇష్టం, వారు నా ఒత్తిడిని తగ్గిస్తారు. నాకు రెండు ప్రపంచాలు ఒకటి ఉద్యోగం, రెండోది. కుటుంబం, కుటుంబమే నాకు గొప్ప శక్తి’’ గౌతమ్ అదానీ. इन आँखों की चमक के आगे दुनिया की सारी दौलत फीकी है। 🙏 pic.twitter.com/yd4nyAjDkR — Gautam Adani (@gautam_adani) April 2, 2024 -
మనుమరాలిని విషనాగు నుంచి కాపాడి.. కన్నుమూసిన బామ్మ!
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని అందరినీ కంటతడి పెట్టించే ఉదంతం చోటుచేసుకుంది. ఇక్కడి షాహ్గంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్గుపూర్ కాలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. రాత్రివేళ ఇంట్లో నిద్రిస్తున్న బామ్మ, మనవరాలి మంచంపైకి ఒక భారీ నాగుపాము చేరింది. ఆ పాము మనుమరాలి వైపు కదులుతున్న విషయాన్ని గమనించిన బామ్మ దానిని చేత్తో పట్టుకుంది. వెంటనే ఆ విషనాగు బామ్మను కాటేసింది. ఈ సమయంలో బామ్మ ఆర్తనాదాలను విన్న కుటుంబ సభ్యులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వెంటనే బామ్మను సమీపంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్‌హోమ్‌కు తరలించారు. అయితే ఆ బామ్మ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా పామును చేత్తో పట్టుకుని, మనుమరాలిని కాపాడున్న బామ్మ సాహసానికి సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వీక్షకులు బామ్మ సీతాదేవి(72) తెగువకు సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటనలో ఆమె మనుమరాలు(24)కు ఎటువంటి హాని జరగలేదు. కాగా పాము కాటుకు బామ్మ మృతిచెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయకుండా ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించారు. -
నటుడి మనవరాలి పెళ్లి.. హాజరైన సూపర్ స్టార్ రజినీకాంత్!
కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవా చెన్నైలో సందడి చేశారు. సీనియర్ నటుడు విజయకుమార్ మనవరాలు దియా పెళ్లికి ఆయన హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో నూతన వధువరులను ఆయన ఆశీర్వదించారు. బంధువులు, సినీ ప్రముఖుల సమక్షంలో విజయ్ కుమార్ కూతుర్లలో ఒకరైన అనితా కుమార్తె దియా పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఈ వివాహా వేడుకలో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నగరంలోని ఓ ఖరీదైన హోటల్లో ఈ వివాహా వేడుక జరిగింది. కాగా.. రజనీకాంత్, విజయకుమార్ ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలుగా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. నటుడిగా విజయకుమార్ తమిళ చిత్రసీమలో సీనియర్ నటుడిగా గుర్తింపు పొందారు. కోలీవుడ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో దాదాపు 400కి పైగా చిత్రాలలో కనిపించారు. ఆయన ప్రస్తుతం సినిమాలో క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నారు. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్‌లో కూడా నటించారు. కాగా.. రజనీకాంత్ ప్రస్తుతం దర్శకుడు టీజే జ్ఞానవేల్ చిత్రం'వెట్టయన్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత లియో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో కలిసి'తలైవర్ 170' అనే సినిమా చేయనున్నారు. View this post on Instagram A post shared by Anitha Vijayakumar (@anits1103) -
Zoleka: క్యాన్సర్‌తో మండేలా మనవరాలి కన్నుమూత
జొహన్నెస్‌బర్గ్: నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా(43) కన్నుమూశారు. జొలేకా.. రచయిత, ఉద్యమకారిణి కూడా. చాలా కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ కోసం ఈ నెల 18న ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం ఆమె కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. చిన్నవయసులోనే ఆమె కన్నుమూయడంతో మండేలా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కారణంగా.. జొలేకా ఊపిరితిత్తులతోపాటు శరీరంలోని ప్రధాన భాగాలకు క్యాన్సర్ కణాలు వ్యాపించినట్టు వైద్యులు తెలిపారు. జొలేకా తొలిసారిగా 32 ఏళ్ల వయసులోనే క్యాన్సర్ బారినపడిన ఆమె చికిత్సతో కోలుకున్నారు. 2016లో మరోమారు అది బయటపడింది. కానీ, ఈసారి మాత్రం అది చికిత్సకు లొంగలేదు. నెల్సన్ మండేలా కూతురు జింద్జీకి జొలేకా 1980లో జన్మించింది. మండేలా సుదీర్ఘ జైలు జీవితం నుంచి విడుదలయ్యే సమయానికి జొలేకాకు వయసు 10 ఏళ్లు. రచయితగా, ఆరోగ్య సంరక్షణ కార్యకర్తగా, న్యాయం కోసం పోరాడే ఉద్యమకారిణిగా జొలేకా పనిచేశారు. ఆమెకు నలుగురు పిల్లులు ఉన్నారు. 2010లో ఆమె 13 ఏళ్ల కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అప్పటి నుంచి రోడ్ సేఫ్టీ క్యాంపెయినర్‌గానూ అవగాహన కల్పిస్తున్నారు. లైంగిక వేధింపులు, డ్రగ్స్ అలవాటు వంటి విషయాలను ఆమె ఇటీవలే ఓ డాక్యుమెంట్లో సైతం వెల్లడించారు. జొలేకా మృతికి నెల్సన్ మండేలా ఫౌండేషన్ సంతాపం ప్రకటించింది. -
మనవరాలి సంరక్షణ కోసం.. గంటకు రూ. 1600లు డిమాండ్ చేసిన అమ్మమ్మ!..
ప్రస్తుతం ఆలుమగలు ఉరుకులు పరుగులు జీవితంతో పిల్లల ఆలనపాలన చూసుకోలేని స్థితిలో లేరు. అందులోనూ భార్యభర్తలిద్దరూ ఉద్యోగస్తులు అయితే పిల్లల బాగోగులు చూసుకోవడం అస్సలు కుదరదు. కాస్త స్తోమత ఉంటే డేకేర్ లేదంటే అమ్మమ్మ, నాయనమ్మల వద్ద ఉంచాల్సిందే. కానీ ఇక్కడొక అమ్మమ్మ తన మనవరాలిని చూసుకునేందుకు గంటకు రూ. 1600లు ఇవ్వాల్సిందేనని కూతురికి తెగేసి చెప్పింది. దీంతో కూతురు ఒక్కసారిగా షాక్ గురయ్యింది. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా! ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకిలా ఆమె డిమాండ్ చేసిందంటే.. అసలేం జరిగిందంటే..ఓ వృద్ధ మహిళ తన సొంత మనవరాలిని సంరక్షణ కోసం, గంటకు రూ. 1600 ఛార్జ్ చేస్తానని కరాఖండీగా చెప్పింది కూతురికి. అంతేగాదు ఆ చిన్నారికి సంబంధించిన కొన్ని లగ్జరీ వస్తువులను కూడా డిమాండ్ చేసింది ఆ వృద్ధురాలు. ఈ విచిత్ర ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. కూతురు..."తన తల్లి వృద్ధురాలని, పైగా ఇంట్లో ఖాళీగానే ఉంది. కాబట్టి తాను తన కూతురిని చూసుకోమని అడిగాను. ఇది ఏమైనా అడగకూడని విషయమా!. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తున్నందువల్లే అడుతున్నా" అని కూతురు తల్లిని ప్రాధేయపడుతోంది. తన తల్లి వయసు 64 ఏళ్లు అని, ప్రస్తుతం ఆమె ఏ ఉద్యోగం చేయడం లేదు. అందువల్ల ఆమెకు చాలా సమయం ఉంటుంది. కాబట్టి నా కుమార్తెను చూసుకోమని అడిగాను. కానీ ఆమె గంటకు సుమారు 16 పౌండ్ల ఛార్జీ ఇవ్వాలని చెబుతోంది. ఏం చేయాలో తెలియడం లేదని సోషల్ మీడియాలో వాపోయింది ఆ వృద్ధురాలి కూతురు. తన తల్లి ఆలస్య రుసుమును కూడా వసూలు చేస్తానని కరాఖండీగా చెప్పనట్లు తెలిపింది. అంతేగాదు కారులో ప్రత్యేక సీటు, స్టోలర్, బాటిల్ ఇతర వస్తువులు కూడా కావలని డిమాండ్ చేసిందంటూ గోడు వెల్లబోసుకుంది కూతురు. ఎందుకు ఆ వస్తువులన్నీ అడిగిందంటే.. తన తల్లి వస్తువులను శుభ్రం చేసి మళ్లీ ఉపయోగించను కూడా ఉపయోగించదని ఆవేదనగా చెబుతోంది. ఇంత మొత్తం చెల్లించాలంటే తాను అప్పులుపాలు కాక తప్పదని కూతురు ఒకటే గోల చేస్తోంది. కానీ సదరు వృద్ధురాలు తన డిమాండ్లను అంగీకరించకపోతే చూడనని నిర్మోహమాటం చెప్పేసింది. ఇక ఆమె ఒప్పుకోకపోతే కూతుర్ని డేకేర్‌లో పెడతానని చెబుతోంది. తన కుటంబంలో అందరూ నైన్ టు ఫైవ్ జాబే చేస్తారని, అందువల్లే తాను వాళ్ల అమ్మను కోరినట్లు పేర్కొంది. ఈ విషయం ప్రస్తుతం బ్రిటన్ అంతటా తెగ వైరల్ అవుతోంది. నిజానికి చాలామంది వృద్ధులు లేదా ఇంట్లోని పెద్దవాళ్ల పట్ల ఇలాంటి ధోరణితోనే ఉంటారు. ఇది సరైనది కాదు. వృద్ధులు ఖాళీగా పనిపాట లేకుండా ఉంటారని అలుసుగా చూడకూడదు. జీవితంలో పడరాని పాట్లు కష్టాలు పడి మనల్ని పెంచినవారు. వారు జీవితంలో ఎన్నో వేదనలను గెలుపోటములు చూసి.. చూసి.. అలసిపోయిన వాళ్లు. వాళ్లకంటూ కాస్త ఏకాంతం కావాలని కోరుకుంటారు. ముందుగా వారి ఓపెనియన్ అడగాలి. వారి మనసెరిగి మసులుకుంటే చూసేదేమో ఆమె!. ఏమో ఆమె మనసులో ఏమూలనో ఏదో అభద్రతా భావం ఉంటేనే కథ ఇలా మాట్లాడతారు. ఒక్కసారి ఇలా ఆలోచించి వారిని అర్థం చేసుకునే యత్నం చేయండి. కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఈ విషయం పట్ల నెటిజన్లు కూడా ఘాటుగానే స్పందించారు. పిల్లలను చూసుకునే సామర్థ్యం లేప్పుడూ పిల్లల్ని కనాలనే ఆలోచన తీసుకోకుండా ఉండాల్సింది. లేదా గర్భధారణ సమయంలోనే తల్లితో మాట్లాడి ఉండాల్సింది. అయినా ఆమె ఇప్పటి వరకు మిమ్మల్ని సంరక్షించింది. ఇక మీ కూతుర్ని చూసుకోవాల్సింది మీ బాధ్యతే అని ఆమెకు చివాట్లు పెడుతూ పోస్ట్‌లు పెట్టారు. (చదవండి: ఏనుగు చెవులు లాంటి అరుదైన ఆక్టోపస్! విస్తుపోయిన శాస్త్రవేత్తలు -
మా ఇంటి మహాలక్ష్మి పుట్టింది
-
లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?
ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో మూడో తరం అడుగుపెట్టింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు. తల్లీబిడ్డ పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు అపోలో ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. దీంతో ఇరు కుటుంబాల్లో ఆనందం నెలకొంది. (ఇదీ చదవండి: మెగా వారసురాలు అంటూ.. వీడియోలు షేర్ చేస్తున్న ఫ్యాన్స్) ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్‌కు స్వాగతం !! నీ రాకతో కోట్లాది మంది మెగా ఫ్యామిలీతో పాటు మా అందరికి ఆనందాన్ని పంచావ్. రామ్ చరణ్, ఉపాసనలను తల్లిదండ్రులను చేశావు. మమ్మల్ని గ్రాండ్ పేరంట్స్‌ను చేశావు. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నిన్ను కోట్లాది మంది మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు ఆశీర్వదిస్తారు'. అని ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఎన్టీఆర్ ట్వీట్ రామ్ చరణ్- ఉపసాన దంపతులకు పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ ట్విటర్ ద్వారా విషెస్ తెలిపాడు. 'తల్లిదండ్రుల క్లబ్‌లోకి మీ ఇద్దరికీ స్వాగతం. ఈ సమయంలో బేబీ గర్ల్‌తో మీరు గడిపిన ప్రతి క్షణం జీవితాంతం మరచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది. దేవుడ మీ ముగ్గురికి ఆపారమైన సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను' అని తెలిపాడు. Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness. — Jr NTR (@tarak9999) June 20, 2023 Welcome Little Mega Princess !! ❤️❤️❤️ You have spread cheer among the Mega Family of millions on your arrival as much as you have made the blessed parents @AlwaysRamCharan & @upasanakonidela and us grandparents, Happy and Proud!! 🤗😍 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 20, 2023 (ఇదీ చదవండి: మహేష్ బాబుతో విబేధాలు.. వాళ్లందరికీ ఇచ్చిపడేసిన థమన్) -
మరోమారు తాతయిన ముకేష్ అంబానీ.. పేరుతోనే వైరల్ అయినా వారసురాలు
-
మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా?... వీడియో వైరల్
-
మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకని కన్నుమూత
ముంబై: మహాత్మా గాంధీ మనవరాలు ఉషా గోకని మంగళవారం ముంబైలో కన్నుమూశారు. 89 ఏళ్ల వయసున్న గోకని గత ఐదేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, రెండేళ్లుగా నిలబడలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యారని మణి భవన్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మేఘశ్యామ్ అజ్గాంకర్ తెలిపారు. గోకాని గాంధీ స్మారక్ నిధికి గతంలో ఛైర్‌పర్సన్‌గా పని చేశారు. గాంధీజీ స్థాపించిన వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో ఆమె తన బాల్యాన్ని గడిపింది. ముంబైలోని గాంధీ స్మారక్ నిధి అనేది మహాత్మా గాంధీ తన జీవితకాలంలో అనుసరించిన అనేక రకాల నిర్మాణాత్మక కార్యకలాపాలను నిర్వహించడంతో పాటు వాటిని ప్రోత్సహించే లక్ష్యంతో స్థాపించబడింది. 1955 అక్టోబర్ 2న మణి భవన్‌ను గాంధీ మెమోరియల్ సొసైటీకి అప్పగించడంతో స్మారక్ నిధి లాంఛనంగా పని చేయడం ప్రారంభించింది. గాంధీ స్మారక్ నిధి ముంబై, మణి భవన్ గాంధీ సంగ్రహాలయ అనే రెండు సంస్థలు మణి భవన్లో ఉన్నాయి. మణి భవన్ భారతదేశ స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగింది. -
ఘనంగా దిల్ రాజు మనవరాలి పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
మియాపూర్: డబ్బుల కోసం అమ్మమ్మ కర్కశత్వం.. కూతురి పిల్లలనే కనికరం లేకుండా..
సాక్షి, మియాపూర్: సొంత అమ్మమ్మ మానవత్వం మరిచి రూ.30 లక్షలు డబ్బులిస్తేనే మనవళ్లను పంపుతానని కూతురును బెదిరించడంతో ఆమె మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ లింగానాయక్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ మదీనాగూడలో నివాసముంటున్న రుహీ వైద్యురాలు. పదేళ్ల క్రితం ముదాసర్ అలీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఎనిమిది సంవత్సరాల అర్ఫాన్, ఐదేళ్ల అర్హాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్త అలీ ఏడాదిన్నర క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ క్రమంలో తల్లి ముంతాజ్, అక్క రోషనాతో కలిసి మదీనాగూడలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆస్తి మీద కన్నేసిన తల్లి, అక్క జనవరిలో ఇద్దరు పిల్లలను తీసుకొని వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి తీసుకెళ్లిపోయారు. చదవండి: స్నేహను ప్రేమిస్తున్నానని చెప్పి.. తర్వాత మరో అమ్మాయితో పెళ్లన్నాడు.. చివరికి! అప్పటి నుండి పిల్లలను తల్లి రుహీకి కనిపించకుండా చేశారు. దీంతో రుహీ పిల్లల కోసం సత్తుపల్లి వెళ్లగా అక్కడ బంధువులందరూ ఆమె పై దాడి చేసి కారును సైతం లాక్కొని పంపించేశారు. దీంతో తల్లి, మిగతా కుటుంబ సభ్యులపైన రుహీ బుధవారం రాత్రి మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా గురువారం మియాపూర్ పోలీసులు రుహీ దగ్గర బంధువైన సలీమ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. బాధితురాలు రుహీ మానసిక పరిస్థితి సరిగా లేదని, పిల్లలను పట్టించుకోవడం లేదని వారి భవిష్యత్ దృష్యా తాము తీసుకెళ్లామని రుహీ తల్లి ముంతాజ్ తెలిపారు. పిల్లల అమ్మమ్మగా తమకు సర్వ హక్కులు కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు రుహీ తల్లి ముంతాజ్ తెలిపింది. చదవండి: Hyderabad: సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ ఫ్రమ్ హోం.. కూతురి గోల్డ్ చైన్ విషయమై భర్తతో గొడవ... దాంతో.. -
తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగింది
గడివేముల (కర్నూలు): మనవరాలంటే ఆ అవ్వకు పంచ ప్రాణాలు.. మనవరాలికి కూడా అవ్వపై ఎనలేని ప్రేమ.. ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు పెంచుకున్న ప్రేమాభిమానాలు మృత్యువులోనూ తొలిగిపోలేదు. మనవరాలు పాముకాటుకు గురై ఈ లోకం వీడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన అవ్వ.. ఆ మరణవార్త వినగానే తట్టుకోలేక పోయింది. చిన్నప్పుడు తాను ఎత్తుకు పెంచిన మనవరాలు కాస్త వయసొచ్చాక జేజీ.... ఏమైందంటూ బాగోగులు చూస్తూ వచ్చేది. వృద్ధాప్యంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ దగ్గరుండి చూసుకునేది. ఆకలేస్తే అన్నం, జబ్బు చేస్తే మందులు ఇలా మలిదశలో జేజిని అన్ని విధాలా చూసుకునేది. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) వారం రోజుల క్రితం కూలీ పనులకు వెళ్లిన మనవరాలు పాముకాటుకు గురై మంగళవారం చనిపోయిందని తెలుసుకున్న అవ్వకు లోకం శూన్యంగా మారింది. 17 ఏళ్లుగా మనవరాలి ప్రేమ నిండిన ఆమె ఇక తన గారాలపట్టి లేదని తెలిసి ఆ అవ్వ గుండె ఆగిపోయింది. ఇద్దరి మరణం ఏకకాలంలో సంభవించడంతో ఆ గ్రామ వాసులు హృదయ విదారకంగా ఈ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటన గడివేముల మండలం బిలకలగూడూరులో జరిగింది. గ్రామానికి చెందిన కాటెపోగు వెంకటసుబ్బయ్య, వెంకటలక్ష్మమ్మలకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో చివరి సంతానమైన రాణెమ్మ (17) తల్లిదండ్రులతో పాటు కూలీ పనులకు వెళుతుండేది. రాణెమ్మ వారం రోజుల క్రితం మినుము పంటలో కలుపు తీసేందుకు పొలం పనులకు వెళ్లింది. అక్కడ పాముకాటుకు గురైంది. చదవండి: (రెండో పెళ్లి.. భార్య విలాసాలు తీర్చలేక..) విషయం తెలుసుకున్న తోటి కూలీ మిత్రులు, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం నంద్యాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రాణెమ్మ కోలుకోలేక మృతి చెందింది. మనవరాలి మృతి వార్త విన్న రాణెమ్మ జేజమ్మ వెంకటలక్ష్మమ్మ (72) వెంటనే ఓయమ్మా.. అంటూ కుప్పకూలి ప్రాణాలు విడిచింది. జేజి, మనవరాలు ఇద్దరూ ఒకేరోజు నిమిషాల వ్యవధిలో మృత్యుపాలైన విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ ఆశీర్వచన కార్యక్రమం సోమవారం ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, సీజేఐ ఎన్వీ రమణ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, వివిధ రాజకీయపార్టీల ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: (ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్) -
ఉపరాష్ట్రపతి మనవరాలి రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరయ్యారు. పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో జరుగుతున్న నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. సీఎం వైఎస్ జగన్ రాకతో పెళ్లి వేడుకలో సందడి నెలకొంది. విజయనగరం డీసీసీబీ చైర్మన్ కుమార్తె వివాహానికి హాజరైన సీఎం జగన్ విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాస్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. చదవండి: (సీఎం జగన్ దంపతుల చేతుల మీదుగా 'డబుల్ ధమాకా') -
పోచారం మనవరాలి పెళ్లికి హాజరైన ఇరు రాష్ట్రాల సీఎంలు
-
ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్ రెడ్డితో వీఎన్ఆర్ ఫామ్స్‌లో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు. ఈ వివాహ వేడుకకు వైఎస్ విజయమ్మతో పాటు ఇరు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అలానే ఏపీ స్పీకర్ తమ్మినేని కూడా హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రఘువీరా రెడ్డిని స్తంభానికి కట్టిపడేసింది...ఎవరు?ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మాజీ వ్యవసాయ మంత్రి నీలకంఠాపురం రఘువీరారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయాలను పక్కన పెట్టి, వ్యవసాయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆయన రైతుగా కనిపించి ఇటీవల అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రాక్టర్‌తో పొలం దున్నుతూ అభిమానులను ఫిదా చేసిన డా.రఘువీరా తాజాగా మరోసారి ఆకట్టు కుంటున్నారు. మనవరాలు సమైరా స్తంభానికి కట్టిపడేసి మరీ తనతో ఆడుకోవడానికి నేను ఇంట్లో ఉండాలని డిమాండ్ చేసిందంటూ పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రఘువీరా ట్విటర్, ఫేస్బుక్లో వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోను కూడా షేర్ చేశారు. (HBD Nivetha Thomas: ఈ విషయాలు తెలుసా మీకు?) తనకు సమయాన్ని కేటాయించడం లేదని అలిగిన ఆయన మనవరాలు సమైరా రఘువీరారెడ్డిని తాళ్లతో స్థంభానికి కట్టి వేసిన దృశ్యంపై సోషల్ మీడియా యూజర్లు స్పందిస్తున్నారు. తాళ్లతో కట్టేసి మరీ తనతో ఆడుకోమని డిమాండ్ చేయడం భలే వుంది. చాలా హృద్యంగా, కట్టిపడేసేలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. డౌన్ టు ఎర్త్ అనేది రఘు వీరారెడ్డికి సరిపోయే మాట అంటున్నారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా సేవలు అందించి, విభజన అనంతరం పీసీసీ చీఫ్‌గా వ్యవహరించిన రఘువీరారెడ్డి ప్రస్తుతం సాధారణ రైతుగా జీవితాన్ని గడిపేస్తున్నారు. -
ఒకానొక సమయంలో దివాళా తీయాల్సిన పరిస్థితి: కబీర్ బేడి
న్యూఢిల్లీ: జీవితంలో అనుకోని విజయాలు, అంతలోనే పతనాలు ఇలా ఎన్నో చూశానంటున్నాడు బాలీవుడ్ ప్రముఖ నటుడు కబీర్ బేడి. ఇటీవల ఆయన రాసిన పుస్తకం ‘స్టోరీస్ ఐ మస్ట్ టెల్: ది ఎమోషనల్ లైఫ్ ఆఫ్ యాన్ యాక్టర్’ కు మంచి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఆయన తన మనవరాలు ఆలయతో లైవ్ వీడియో చాట్‌లో ముచ్చటించారు. కబీర్ రాసిన పుస్తకం మార్కెట్లో అత్యధిక కాపీలు అమ్ముడై బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి ఆయన తన మనవరాలు అలయతో చాలా సేపు సంభాషించారు. అందులో కబీర్.. తన జీవితంలో చవిచూసిన ఎత్తు పల్లాలు, వివిధ సంబంధాలు, వివాహం, విడాకులు, మానసిక ఆరోగ్యం లాంటి అంశాలను పంచుకున్నారు. కబీర్ రాసిన పుస్తకం తన స్నేహితులు చదివారని, వారికి ఎంతగానో నచ్చిందని ఆలయ తెలిపింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది నా జీవితంలో ఊహించని విజయాలు, అనుకోని పతనాలను చూడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో దివాలా తీయాల్సి వచ్చింది. కాని అంతలా జీవితంలో కిందకు పడ్డా వాటి నుంచి లేచాను. లైఫ్‌లో ఫెయిల్యూర్ కావడం సహజమే, కాని ఎదగాలన్న ఆశ వదులుకోవద్దు. నా వైఫల్యాల నుంచి గుణపాఠాలను నేర్చుకున్నాను అలాగే ఇతరులు కూడా చేస్తారని ఆశిస్తున్నానని ఆయన అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. కబీర పుస్తకానికి స్పందన రోజు రోజు పెరుగుతుండడంతో ఆయన తన పుస్తకాన్ని ఇటలీలో అతిపెద్ద ప్రచురణకర్త అయిన మొండడోరితో సెప్టెంబర్‌లో ఇటలీలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. View this post on Instagram A post shared by ALAYA F (@alayaf) చదవండి: తాప్సీపై కంగనా ఫైర్.. తన పేరు వాడొద్దంటూ చురకలు -
బామ్మకు బజారే దిక్కయింది..
వేములవాడ : రక్తం సంబంధం కుదరదు పొమ్మంటే.. ఆ వృద్ధురాలికి బజారు దిక్కయింది. మానవత్వంలేని మనవరాలి పనితో శతాధిక వయసులో రోడ్డుపైనే గడిపేస్తోంది. వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణానికి చెందిన వెంకట స్వామికి నలుగురు కూతుళ్లు. ఇందులో ఇద్దరు కూతుర్లు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి (బామ్మ) చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్న ఇంటివారు వెళ్లి పొమ్మన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకొని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. అయితే, మనవరాలు శతాధిక వృద్ధురాలిని ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో వెంకటస్వామి కూతురి ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే తల్లిని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. మాతృ దినోత్సవం రోజున బామ్మకు జరిగిన ఇబ్బందిపై కాలనీవాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
తాత చనిపోయాడని.. ఆస్పత్రిలో యువతి బీభత్సం
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): కరోనాతో తమ తాతయ్య ప్రాణం పోవడం తట్టుకోలేక ఓ యువతి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. గురువారం కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఆస్పత్రిలో బోడుప్పల్‌కు చెందిన సంజీవ్‌రావు (88) నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ రావడంతో అడ్మిట్ అయ్యాడు. సంజీవరావును కాపాడేందుకు వైద్యులు అన్ని విధాలా తమవంతుగా ప్రయత్నించారు. మూడ్రోజులపాటు 12 లీటర్ల ఆక్సిజన్‌ను అతనికి పెట్టారు. అయితే అతడిలో ఆక్సిజన్ శాచురేషన్ స్థాయిలు తగ్గిపోతుండటంతో వెంటిలేటర్ పెట్టాలని వైద్య సిబ్బంది సంజీవరావు కుటుంబ సభ్యులకు సూచించగా.. అందుకు వారు ఒప్పుకోలేదు. ఆస్పత్రిలో ధ్వంసమైన వెంటిలేటర్ చివరికి గురువారం మధ్యాహ్నం సంజీవరావు ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ పెట్టగా.. కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో ఆవేదన చెందిన మనవరాలు ఆస్పత్రి వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో సంజీవరావుకు పెట్టిన వెంటిలేటర్‌ను పగుల గొట్టడంతో వెంటిలేటర్ పాడైంది. కాగా, యువతి చర్యపై కింగ్ కోఠి జిల్లా ఆస్పత్రి వైద్యులు నారాయణగూడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.