gudivada amarnath
-
అవంతి శ్రీనివాస్ కు గూబ గుయ్యమనేలా కౌంటర్ ఇచ్చిన గుడివాడ
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్
-
సూపర్ సిక్స్ హామీలతో కూటమి డకౌట్.. ప్రభుత్వంపై గుడివాడ కౌంటర్
-
సాక్షి జర్నలిస్టులపై దాడి.. గుడివాడ అమర్నాథ్ కౌంటర్
-
లక్ష కోట్ల డ్రగ్స్.. ఆపరేషన్ గరుడ ఏమైంది.. చంద్రబాబు ఆర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట..
-
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
అధికారం కోసం చంద్రబాబు గడ్డి కరుస్తారు
-
‘చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడంలో దిట్ట’
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎంతటి నీచానికైనా దిగజారతారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత ఎన్నికల సందర్భంగా డ్రగ్స్‌తో ఓ కంటైనర్ విశాఖకు వచ్చిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు ప్రచారం చేశారని ఈ సందర్బంగా గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు. ఆ సమయంలో 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు ప్రచారం చేశారని, విశాఖ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడానికే చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు.‘ గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై, వైఎస్ జగన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. 25 వేల కేజీల డ్రగ్స్ తో కంటైనర్ విశాఖకు వచ్చిందని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. అధికారం కోసం నీచ రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు. కంటైనర్‌లో ఎటువంటి డ్రగ్స్ లేవని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. డ్రగ్స్ లేవని చెప్పడానికి 8 నెలల సమయం ఎందుకు పట్టింది.ఆపరేషన్ గరుడ అనే పేరుతో సీబీఐ విచారణ జరిపింది. చంద్రబాబు, ఎల్లో మీడియా వైఎస్ జగన్ పై తప్పుడు ప్రచారం చేశారు. మాకు ఆ కంటైనర్‌కు సంబంధం లేదని మేము మొదటి నుంచి చెపుతూనే వచ్చాము, మేము చెప్పిందే సీబీఐ కూడా చెప్పింది. కంటైనర్ షిప్ పై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ను డ్రగ్స్ పేరుతో దెబ్బ తీయడమే లక్ష్యంగా తప్పుడు ప్రచారం చేశారు. చంద్రబాబు అర్గనైజడ్ క్రైమ్ చేయడంలో దిట్ట’ అని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. ఇదీ చదవండి: కుప్పంలో సీజ్ ది థియేటర్ -
చంద్రబాబు విశాఖ పర్యటన పై గుడివాడ అమర్నాథ్ కామెంట్స్
-
ఒప్పందంలో ఈ ముక్క చదుకోలేదా చంద్రబాబు
-
అదానీతో విద్యుత్ ఒప్పందం జరగలేదు: గుడివాడ అమర్నాథ్
-
ఆరు నెలల కాలంలో ఒక్క హామీని నిలబెట్టుకోలేదు: అమర్నాథ్
-
Gudivada Amarnath: దమ్ముంటే నిరూపించండి.. దేనికైనా సిద్ధం
-
‘వైఎస్సార్సీపీ ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. లోకేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు అవుతోందని మండిపడ్డారు. నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలకు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రైల్వే భవనాల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం 52 ఎకరాలను కేటాయించిందన్నారు.‘కేకే లైన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదానీతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సేకీతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆదానీ సంస్థతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని నిరూపిస్తే నేను దేనికైనా సిద్ధం. ప్రధాని మోదీ ప్రారంభిస్తారనే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఒప్పందం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. ప్లాంట్‌కు సంబంధించిన భూ కేటాయింపులు మా ప్రభుత్వ హయాంలోనే జరిగాయి’ అని తెలిపారు. -
కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్ ఫైర్
-
YSRCP అండగా ఉంటుంది: గుడివాడ అమర్నాథ్
-
మేమున్నాం.. మేము చూసుకుంటాం
-
Amarnath: అబద్ధాలతో ప్రజలను చంద్రబాబు తప్పు దారి పట్టించారు
-
‘హామీలు నిలబెట్టుకోలేక.. అప్పులపై చంద్రబాబు తప్పుడు లెక్క’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు అబద్ధాలు ఆగలేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేశారని.. రాష్ట్రం దివాలా తీసిందంటూ దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని చంద్రబాబు చెప్పారు. బడ్జెట్ ప్రసంగంలో 6 లక్షల 40 వేల కోట్లు అప్పులు ఉన్నాయని చెప్పారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోక చంద్రబాబు అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారు’’ అని దుయ్యబట్టారు.వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి 3 లక్షల 13 వేల కోట్లు అప్పు ఉంది. కోవిడ్ పరిస్థితిని తట్టుకొని వైఎస్ జగన్ పాలన చేశారు. కోవిడ్ సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు. చంద్రబాబు సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు అప్పులు చేస్తున్నారు. చంద్రబాబు మోసాలు బయటపడతాయని వైఎస్సార్సీపీ కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’’ అని అమర్నాథ్ ఎండగట్టారు.పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడానికి గతంలో ఏ ప్రభుత్వం ఆరు నెలలు సమయం తీసుకోలేదు. పథకాలకు కేటాయింపులు సక్రమంగా జరపలేదు. ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్నారు. 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వారికి రూ. 12,500 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించారు. 18 ఏళ్లు దాటిన మహిళలు రాష్ట్రంలో కోటి 50 లక్షలు మంది వరకు ఉన్నారు. వారికి ఏడాదికి 26,000 వేల కోట్లు ఖర్చు అవుతుంది. బడ్జెట్లో ఆడబిడ్డ నిధికి బడ్జెట్లో ఒక రూపాయి కేటాయించలేదు. నిరుద్యోగ భృతికి ఒక రూపాయి కేటాయించలేదు. చంద్రబాబు హామీలకు ఏడాదికి లక్ష 20 వేల కోట్లు అవసరం. చంద్రబాబు బడ్జెట్లో 30 వేల కోట్లు ఖర్చు చేశారు...సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టు తర్వాత మమ్మలను అరెస్టు చేస్తారు. మేము దేనికైనా సిద్ధం. మా తాత పేరు మీద ఉన్న ట్రస్ట్‌కు 20 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి పేపర్లు తేవాలని అడుగుతున్నారు. పోలీసులకు భయపడేది లేదు’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. -
విశాఖలో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్.. గుడివాడ అమర్నాథ్ ఫైర్..
-
ఫిర్యాదు తీసుకోవడానికి కూడా పోలీసులు సిద్ధంగా లేరు..
-
వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ నేతలు సీపీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సీఎం వపన్ చెప్పారు. 6 నెలల్లోనే 50 మందికిపైగా మహిళలపరై అత్యాచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నేరాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది’’ అని తెలిపారు. -
ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లా?: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణే స్వయంగా ఒప్పుకున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వెంకటేష్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. అరెస్టుల ద్వారా పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, కార్యకర్తలను బెదిరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు.సోషల్ మీడియా కోఆర్డినేటర్లను అరెస్టు చేయొద్దంటూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుడివాడ అమర్నాథ్ ప్రస్తావించారు. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్దంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు.. -
రుషికొండ భవనాలపై బాబు కామెంట్స్.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన అమర్ నాథ్
-
‘ఒక్క రన్ కూడా తీయలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతావ్ బాబూ?’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని.. సూపర్ సిక్స్ హామీల అమలు సంగతి మర్చిపోయారంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు నిర్మించిన బిల్డింగ్లు వరదలకు గురయ్యాయి. మా హయాంలో అద్భుత భవనాలు నిర్మిస్తే ఓర్చుకోలేకపోతున్నారన్నారు‘‘రాష్ట్రంలో రుషికొండ టూరిజం ప్రాజెక్టు లాంటి నిర్మాణాలు ఎక్కడా లేవు. రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి అద్భుత భవనాలు లేవు. నిన్న చంద్రబాబు షెడ్యూల్లో కూడా ఏపీ టూరిజం బిల్డింగ్ అని షెడ్యూల్ విడుదల చేశారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా రుషికొండ టూరిజం భవనాలు లాంటివి నిర్మించారా?’’ అంటూ అమర్నాథ్ ప్రశ్నించారు.‘‘రూ.15 వందల కోట్లు పెట్టి చంద్రబాబు తాత్కాలిక సచివాలయం కట్టారు. వర్షం వస్తే మంత్రుల పేషిల్లోకి వరద నీరు వస్తుంది. తాత్కాలిక సచివాలయం పేరుతో పెద్ద ఎత్తున దోచేశారు. రుషికొండ నిర్మాణాలు అద్భుతంగా ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు.. రుషికొండ టూరిజం భవనాలను మేమే ప్రారంభించాం’’ అని గుడివాడ అమర్నాథ్ చెప్పారు.‘‘స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు ప్రకటన చేస్తారని ఉత్తరాంధ్ర ప్రజలు ఆశించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను పక్కదారి పట్టించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు’’ అని అమర్నాథ్ ధ్వజమెత్తారు.‘‘ప్రజలకు రుషికొండ భవనాలు చూపిస్తామని చంద్రబాబు అంటున్నారు. అమరావతి తాత్కాలిక సచివాలయం కూడా చూపిస్తే ఎవరి నిర్మాణాలు గొప్పవో ప్రజలే నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి అమరావతి తప్పితే వేరే ప్రాంతం అవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత విశాఖే పెద్ద నగరం. అందుకే విశాఖను రాజధాని చేయాలనుకున్నాం. విశాఖ గ్రోత్ ఇంజెన్గా ఉపయోగపడుతుంది. రాష్ట్రపతి, ప్రధాని వంటి పెద్దలు వచ్చినప్పుడు ఈ భవనాలు ఉపయోగపడతాయి.’’ అని అమర్నాథ్ వివరించారు.ఇదీ చదవండి: సిగ్గేస్తున్నది బాబూ!‘‘స్టేట్ గెస్ట్ హౌస్ కట్టాలని మా ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్లి స్టే తీసుకొచ్చారు.. రుషికొండ భవనాలు దేనికి వాడుతారో చెప్పాలి. కేవలం రుషికొండ భవనాలు మాత్రమే కాదు.. ఉద్దానం రీసెర్చ్ సెంటర్, మెడికల్ కాలేజీలు, జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ వంటివి కూడా ప్రజలకు చూపించాలి. పోలవరం నిర్మాణం ఎలా జరుగుతుందో చూపించడానికి రూ. 150 కోట్లు వృథా చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇళ్లు, ఫార్మ్ హౌస్ రెన్నోవేషన్ కోసం కోట్లు ఖర్చు చేశారు.’’ అని అమర్నాథ్ మండిపడ్డారు.‘‘సూపర్ సిక్స్ అన్నారు ఒక్క రన్ కూడా తియ్యలేదు.. ఇంకెప్పుడు సిక్స్ కొడతారు. గ్యాస్ ఇచ్చాం అంటున్నారు.. ముందు ప్రజలు డబ్బులు కడితే ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. మద్యం ధరలు తగ్గింపు అని బోర్డులు పెట్టారు. నిత్యావసర ధరలు తగ్గించకుండా మద్యం ధరలు తగ్గించారు. తల్లికి వందనం లేదు. నాన్నకు ఫుల్లుగా ఇంధనం ఇచ్చారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది.రుషికొండ భవనాలు ప్రభుత్వానివి.. ఎలా వాడాలో ఆలోచించండి. గుర్ల డయేరియా బాధితులను చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదు. ఆ కుటుంబాలను ఎందుకు పిలిచి మాట్లాడలేదు. గుంతలు సృష్టించి గుంతలు కప్పుతున్నారు. ఉన్న గుంతలను కప్పాలి. బాగున్న రోడ్లు తవ్వేసి కప్పేస్తున్నారు. లేని గోతులను సృష్టిస్తున్నారు. గుంతలు పూడ్చడానికి ఇంత ప్రచారం దేనికి’’ అంటూ అమర్నాథ్ దుయ్యబట్టారు.