Hall of Fame
-
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో షరపోవా, బ్రయాన్ బ్రదర్స్
న్యూపోర్ట్: అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో రష్యా స్టార్ మరియా షరపోవా... మేటి డబుల్స్ జోడీ బ్రయాన్ బ్రదర్స్ బాబ్, మైక్‌లకు చోటు లభించింది. బ్యాలెట్ సెలెక్షన్స్ ఓటింగ్ ద్వారా ఈ ముగ్గురిని ఎంపిక చేశారు. ఐదు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన షరపోవా 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్ (2008), వింబుల్డన్ (2004), యూఎస్ ఓపెన్ (2006) గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఒక్కోసారి నెగ్గగా... ఫ్రెంచ్ ఓపెన్‌ను (2012, 2014) రెండుసార్లు సొంతం చేసుకొని ‘కెరీర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించింది. కవల సోదరులైన బాబ్, మైక్ బ్రయాన్లు అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) డబుల్స్ ర్యాంకింగ్స్‌లో 438 వారాలు నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. అంతేకాకుండా 16 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్‌ను దక్కించుకున్నారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం నెగ్గడంతోపాటు 2007లో అమెరికా జట్టు డేవిస్ కప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పేస్, విజయ్ అమృత్‌రాజ్
న్యూపోర్ట్ (అమెరికా): భారత దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్‌లకు గొప్ప గౌరవం లభించింది. ఈ ఇద్దరికీ అంతర్జాతీయ టెన్నిస్ ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించారు. ఆసియా నుంచి ఈ గౌరవం పొందిన టెన్నిస్ క్రీడాకారులు వీరిద్దరే కావడం విశేషం. 51 ఏళ్ల పేస్ వరుసగా ఏడు ఒలింపిక్స్ క్రీడల్లో (1992 బార్సిలోనా నుంచి 2016 రియో వరకు) పోటీపడ్డ ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పాడు.1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో వ్యక్తిగత సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం నెగ్గిన పేస్ డేవిస్‌కప్‌లో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. తన సుదీర్ఘ కెరీర్లో పురుషుల డబుల్స్‌లో 8 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మిక్స్డ్ డబుల్స్‌లో 10 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను గెల్చుకున్న పేస్‌కు ‘ప్లేయర్ కేటగిరీ’లో హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎంపిక చేశారు.ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహిళా దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ మార్టినా నవ్రతిలోవా చేతుల మీదుగా పేస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ పతకాన్ని అందుకున్నాడు. మరోవైపు 70 ఏళ్ల విజయ్ అమృత్‌రాజ్ 1974, 1987లలో భారత జట్టు డేవిస్‌కప్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 28 దేశాల నుంచి 267 మంది టెన్నిస్ ప్లేయర్లకు ‘హాఫ్ ఆఫ్ ఫేమ్’లో స్థానాన్ని కల్పించారు. -
రిత్విక్ జోడీ ఓటమి
న్యూపోర్ట్ (అమెరికా): హాల్ ఆఫ్ ఫేమ్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ రితి్వక్ చౌదరీ–నికీ కలియంద పునాచా (భారత్) ద్వయం 1–6, 4–6తో ల్యూక్ సవిల్లె–అలెగ్జాండర్ వుకిచ్ (ఆ్రస్టేలియా) జంట చేతిలో ఓడిపోయింది. 56 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రితి్వక్ ద్వయం ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేయడంతోపాటు తమ సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి వినయ్ కుమార్.. గేల్, ఏబీడీ సరసన చోటు
ఆర్సీబీ తమ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో మరో ఆటగాడికి చోటు కల్పించింది. ఫ్రాంచైజీ మాజీ ఆటగాడు వినయ్ కుమార్ కొత్తగా ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేరాడు. గతేడాది (2023) మాజీ ఆటగాళ్లు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్‌లను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి చేర్చిన ఆర్సీబీ.. ఈ ఏడాది వినయ్ కుమార్‌ను ఆహ్వానించింది. నిన్న (మార్చి 19) జరిగిన అన్‌బాక్స్ ఈవెంట్ సందర్భంగా ఆర్సీబీ వినయ్ కుమార్‌ను హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలోకి ఆహ్వానించి, సత్కరించింది. వినయ్‌ను సత్కరించిన వారిలో ఆర్సీబీ యజమానితో పాటు విరాట్ కోహ్లి, డుప్లెసిస్, మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధన ఉన్నారు. వినయ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఆహ్వానిస్తున్న విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్ వేదికగా వెల్లడించింది. Vinay Kumar joins the elite company of RCB icons 𝑪𝒉𝒓𝒊𝒔 𝑮𝒂𝒚𝒍𝒆 and 𝑨𝑩 𝒅𝒆 𝑽𝒊𝒍𝒍𝒊𝒆𝒓𝒔✨ pic.twitter.com/mJ8OdaeH6U— CricTracker (@Cricketracker) March 20, 2024 40 ఏళ్ల వినయ్ ఆర్సీబీ తరఫున 2008, 2009, 2010, 2012, 2013 సీజన్లలో ఆడాడు. వినయ్ ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా (80) ఉన్నాడు. ఓవరాల్‌గా తన ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచ్‌లు ఆడిన వినయ్ 105 వికెట్లు పడగొట్టాడు. వినయ్ 2012 (19), 2013 (23) సీజన్లలో ఆర్సీబీ తరఫున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్లో మొత్తం 11 సీజన్లు ఆడిన వినయ్.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, కేకేఆర్ ఫ్రాంచైజీలకు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో కర్ణాటక తరఫున రంజీ అరంగ్రేటం (2004) చేసిన వినయ్.. రంజీ చరిత్రలో 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. దేశవాలీ క్రికెట్లో వినయ్‌ను దావణగెరె ఎక్స్‌ప్రెస్ అని పిలుస్తారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఘనమైన రికార్డు కలిగిన వినయ్.. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. వినయ్ భారత జట్టు తరఫున 9 టీ20లు, 31 వన్డేలు, ఏకైక టెస్ట్ ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. -
బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్ అద్వానీ
న్యూఢిల్లీ: భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) దిగ్గజం పంకజ్ అద్వానీ తన విజయవంతమైన కెరీర్లో మరో మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బిలియర్డ్స్‌లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. బిలియర్డ్స్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో పంకజ్‌కు స్థానం కల్పించారు. చైనాలోని షాంగ్రావొ నగరంలోని ప్రపంచ బిలియర్డ్స్ మ్యూజియంలో హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాను పొందుపరిచారు. ప్రపంచ విశిష్ట క్రీడాకారుల సరసన తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని పంకజ్ చెప్పాడు. ‘అరుదైన గౌరవానికి అర్హుడినైనందుకు ఆనందంగా ఉంది. సుదీర్ఘమైన కెరీర్లో అభిమానులు, శ్రేయోభిలాషుల మద్దతు వల్లే అత్యున్నత శిఖరాలను అధిరోహించాను’ అని అద్వానీ అన్నాడు. గత నవంబర్‌లో 38 ఏళ్ల వయసులోనూ భారత విఖ్యాత ఆటగాడు అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఓవరాల్‌గా 26వ టైటిల్‌ను గెలుపొందాడు. ఇందులో పాయింట్ల ఫార్మాట్, లాంగ్ ఫార్మాట్, ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో టైటిళ్లున్నాయి. -
హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి భారత టెన్నిస్ దిగ్గజాలు
టెన్నిస్‌కు సంబంధించి ప్రతిష్టాత్మకమైన హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలోకి ఇద్దరు భారత దిగ్గజాలు ప్రవేశించారు. వేర్వేరు జమానాల్లో భారత టెన్నిస్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. ఆసియా నుంచి హాల్ ఆఫ్ ఫేమ్‌కు ఎంపికైన తొలి పురుష టెన్నిస్ క్రీడాకారులుగా లియాండర్ పేస్, విజయ్ అమృత్‌రాజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరితో పాటు ప్రముఖ పాత్రికేయుడు, రచయిత రిచర్డ్ ఎవాన్స్ కూడా టెన్నిస్‌లో అత్యున్నత గౌరవాన్ని దక్కించుకున్నారు. పేస్, అమృత్‌రాజ్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కడంతో ఈ జాబితాలో ప్రాతినిథ్యం లభించిన 28వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది. 50 ఏళ్ల లియాండర్ పేస్ పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మాజీ నంబర్ వన్‌గా చలామణి అయ్యాడు. 90వ దశకంలో పేస్ కెరీర్ పీక్స్‌లో ఉండింది. పేస్ తన కెరీర్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో 18 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. పేస్ 1996 ఒలింపిక్స్‌లో పురుషుల సింగిల్స్ విభాగంలో కాంస్య పతకం కూడా సాధించాడు. ఓవరాల్‌గా పేస్ 1990-2020 మధ్యలో 54 డబుల్స్ టైటిళ్లు సాధించాడు. విజయ్ అమృత్‌రాజ్ విషయానికొస్తే.. ఈ 70 ఏళ్ల భారత టెన్నిస్ లెజెండ్ 70, 80 దశకాల్లో భారత్‌కు విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చాడు. కెరీర్లో ఓవరాల్‌గా 15 టైటిళ్లు సాధించిన అమృత్‌రాజ్ ఆతర్వాత టెన్నిస్ ప్రమోటర్‌గా, వ్యాఖ్యాతగా మంచి గురింపు తెచ్చుకున్నాడు. -
ICC Cricket World Cup: ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో సెహ్వాగ్, ఎడుల్జీ
దుబాయ్: భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ, మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు భారత క్రికెటర్లతో పాటు శ్రీలంక దిగ్గజం అరవింద డిసిల్వాను కూడా తాజాగా ఐసీసీ ఈ విశిష్ట క్రికెటర్ల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇప్పటి వరకు తొమ్మిది మందికి చోటు లభించగా... ఎడుల్జీ ఈ జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్ కావడం విశేషం. ఆయా జట్లకు అందించిన సేవలు, నడిపించిన తీరు, గెలిపించిన ఘనతలు అన్నీ పరిగణించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లోకి ఎంపిక చేస్తారు. డయానా ఎడుల్జీ: భారత్‌లో అమ్మాయిల క్రికెట్‌వైపు కన్నెత్తి చూడని రోజుల్లోనే క్రికెటరై తర్వాత సారథిగా ఎదిగింది. 1976 నుంచి 1993 వరకు భారత జట్టుకు ఆడి స్పిన్ ఆల్‌రౌండర్‌గా రాణించింది. 20 టెస్టులాడి 63 వికెట్లు తీసి, 404 పరుగులు చేసింది. 34 వన్డేల్లో 211 పరుగులు సాధించి 46 వికెట్లు పడగొట్టింది. సెహ్వాగ్: భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా సెహ్వాగ్ రికార్డుల్లోకెక్కాడు. భారత్ 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ సాధించడంలో తనవంతు పాత్ర పోషించాడు. సెహ్వాగ్ 104 టెస్టులు ఆడి 8586 పరుగులు సాధించాడు. 23 సెంచరీలు చేశాడు. 40 వికెట్లు తీశాడు. 251 వన్డేలాడి 8273 పరుగులు, 15 సెంచరీలు సాధించాడు. 96 వికెట్లు కూడా తీశాడు. 19 టి20లు ఆడి 393 పరుగులు సాధించాడు. అరవింద డిసిల్వా: ఆ్రస్టేలియాతో జరిగిన 1996 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో డిసిల్వా వీరోచిత సెంచరీతో జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 308 వన్డేల్లో 9284 పరుగులు చేశాడు. 106 వికెట్లు పడగొట్టాడు. 93 టెస్టుల్లో 6361 పరుగులు సాధించాడు. -
క్వార్టర్ ఫైనల్లో సాకేత్ జోడీ
‘హాల్ ఆఫ్ ఫేమ్’ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో సాకేత్ మైనేని–యూకీ బాంబ్రీ (భారత్) జోడీ శుభారంభం చేసింది. అమెరికాలోని న్యూపోర్ట్‌లో బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో సాకేత్–యూకీ ద్వయం 3–6, 6–1, 10–8తో టామీ పాల్–స్పిజిరి (అమెరికా) జంటను ఓడించింది. హైదరాబాద్‌కు చెందిన అనిరుధ్ చంద్రశేఖర్–విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట కూడా క్వార్టర్ ఫైనల్ చేరింది. అనిరుధ్–ప్రశాంత్ 6–4, 6–3తో జూలియన్ క్యాష్ (బ్రిటన్)–మాక్సిమి క్రెసీ (అమెరికా)లపై గెలిచారు. -
వద్దనుకొని 23 ఏళ్ల క్రితం విడాకులు.. మళ్లీ ఆమెతోనే పెళ్లి
డబ్ల్యూడబ్ల్యూఈ(వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్) లెజెండ్, హాల్ ఆఫ్ ఫేమ్ జేక్ రాబర్ట్(ముద్దుగా The Snake) 68 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకోనున్నాడు. ఇక్కడ విచిత్రమేంటంటే 23 ఏళ్ల క్రితం విడాకులు ఇచ్చిన తన భార్యనే మళ్లీ వివాహమాడనున్నాడు. ఈ విషయాన్ని ది స్నేక్ రాబర్డ్ స్వయంగా చెప్పుకొచ్చాడు. విషయంలోకి వెళితే.. జేక్ రాబర్ట్స్ 1984లో చెరిల్ హాగ్వుడ్ను ప్రేమించి పెళ్లి పెళ్లిచేసుకున్నాడు. ఈ జంటకు నలుగురు పిల్లలు. 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న ఈ ఇద్దరు 2000వ సంవత్సరంలో విడిపోయారు. ఆ తర్వాత జేక్ రాబర్ట్స్ 2006లో జూడీ లిన్‌ను వివాహామాడాడు. 2011లో వీరిద్దరికి విడాకులయ్యాయి. అప్పటినుంచి జేక్ రాబర్ట్స్ ఒంటరిగానే ఉంటున్నాడు. తాజాగా జేక్ రాబర్ట్స్ తన మనసులోని మాటన బయటపెట్టాడు. ''23 ఏళ్ల క్రితం నా భార్య చెరిల్ హాగ్వుడ్కు విడాకులు ఇచ్చాను. ఇన్నేళ్లు మేము విడిగానే ఉంటున్నా ఫ్రెండ్లీగానే ఉంటూ వచ్చాం. అయితే ఈ మధ్యనే తనను కలిసి మళ్లీ పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆమె నుంచి తొలుత స్పందన రాకపోయినప్పటికి తర్వాత పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. నిజంగా మాది ఒక అద్బుత లవ్‌స్టోరీ. 23 ఏళ్లు మేం విడిపోయాం అంటే నమ్మలేకుండా ఉన్నా. దేవుడు నాకు ఇవ్వబోతున్న సెకెండ్ చాన్స్‌ను ఉపయోగించుకుంటా. చెరిల్ హాగ్వుడ్ను ఈసారి కష్టపెట్టను.. ఆమెను బాగా చూసుకోగలను అనే నమ్మకం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు. కాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్‌గా పేరు పొందిన జేక్ రాబర్ట్స్ అనగానే ముందు గుర్తుకు వచ్చేది అతని మెడలో ఒక కొండచిలువను వేసుకొని రింగ్‌లోకి అడుగుపెడుతుండేవాడు. అందుకే ది స్నేక్ మాస్టర్(The Snake) పేరుతో పాపులర్ అయ్యాడు. ఇక 2014లో డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన జేక్ రాబర్ట్స్ ప్రస్తుతం ఆల్ ఎలైట్ రెజ్లింగ్(AEW Pro Wrestling)లో లాన్స్ ఆర్చర్‌కు మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. చదవండి: స్కూల్ఫ్రెండ్ను పెళ్లాడనున్న సీఎస్కే స్టార్ -
జాతీయ స్థాయిలో సత్తాచాటిన ఏపీ.. టూరిజం అభివృద్ధిలో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జాతీయ టూరిజం అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేశారు. కాగా, వీటిలో ఏపీకి పలు అవార్డులు వచ్చాయి. అవార్డుల లిస్ట్ ఇదే.. - సమగ్ర టూరిజం అభివృద్ధిలో ఏపీకి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు. - బెస్ట్ టూరిజం ఫ్రెండ్లీ రైల్వే స్టేషన్‌గా సికింద్రాబాద్. - విదేశీ భాషలో ఏపీ కాఫీ టేబుల్ బుక్కు అవార్డ్. - విజయవాడ ది గేట్ వే హోటల్‌కు బెస్ట్ ఫైవ్ స్టార్ హోటల్ అవార్డు . - బెస్ట్ టూరిజం గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్‌కు అవార్డు. - అపోలో హెల్త్ సిటీకి బెస్ట్ మెడికల్ టూరిజం ఫెసిలిటీ అవార్డు - సమగ్ర టూరిజం అభివృద్ధిలో తెలంగాణకు మూడో బహుమతి లభించింది. -
ఆర్సీబీ మాజీ క్రికెటర్లకు అరుదైన గౌరవం
ఆర్సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు ఇటీవలే ఒక కార్యక్రమంలో హాల్ ఆఫ్ ఫేమ్‌ను పరిచయం చేసింది. ఆర్సీబీ తరపున సేవలందించిన క్రికెటర్లకు ఇందులో స్థానం దక్కనుంది. అయితే ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో తొలుత చేరిన క్రికెటర్లు.. ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కావడం విశేషం. కొన్నేళ్ల పాటు తమ సేవలను ఆర్సీబీకి అందించినందుకు కృతజ్ఞతగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరుస్తున్నట్లు ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్లో ప్రకటించింది. దానికి సంబంధించిన వీడియోనూ రిలీజ్ చేసింది. ఈ వీడియోలో హాల్ ఆఫ్ ఫేమ్‌లో జాయిన్ అయిన ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్‌ను ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్ డుప్లెసిస్, ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసన్లు అభినందిస్తూ స్పీచ్ ఇచ్చారు. ఆ తర్వాత వారిద్దరికి ఆన్లైన్ వేదికగానే వారి పేర్లతో పాటు జెర్సీ నెంబర్ ఉన్న గోల్డ్ మెటల్ మొమొంటోతో సత్కరించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో గేల్, డివిలియర్స్‌కు విడదీయరాని బంధం ఉంది. డివిలియర్స్ 184 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 5162 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ 142 మ్యాచ్‌లాడి 4965 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 31 అర్థ సెంచరీలు ఉన్నాయి. చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి! Introducing the #RCB Hall of Fame: Match winners, Legends, Superstars, Heroes - you can go on and on about @ABdeVilliers17 and @henrygayle, two individuals who are responsible for taking IPL to where it is today. #PlayBold #WeAreChallengers #IPL2022 #ನಮ್ಮRCB #RCBHallOfFame pic.twitter.com/r7VUkxqEzP — Royal Challengers Bangalore (@RCBTweets) May 17, 2022 -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో జయవర్ధనే, పొలాక్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ముగ్గురు దిగ్గజ క్రికెటర్లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు కల్పించింది. శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే, దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ షాన్ పొలాక్‌లతో పాటు ఇంగ్లండ్ దివంగత మహిళా క్రికెటర్ జెనెట్టె బ్రిటిన్‌లు ఈ జాబితాలో ఉన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నేడు జరిగే టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ఆరంభానికి ముందు వీరిని ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో అధికారికంగా చేరుస్తారు. జయవర్ధనే సభ్యుడిగా ఉన్న శ్రీలంక జట్టు 2014 టి20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచింది. వన్డే, టెస్టు ఫార్మాట్లలో 3 వేల పరుగులు, 300 వికెట్ల చొప్పున తీసిన తొలి క్రికెటర్‌గా షాన్ పొలాక్ ఘనతకెక్కాడు. బ్రిటిన్ 19 ఏళ్ల (1979–1998) పాటు టెస్టుల్లో ఇంగ్లండ్ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె 2017లో మరణించింది. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్
ఫ్లోరిడా: క్రొయేషియా మాజీ టెన్నిస్ ప్లేయర్ ఇవానిసెవిచ్కు గొప్ప గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఇవానిసెవిచ్కు చోటు లభించింది. ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్న 49 ఏళ్ల ఇవానిసెవిచ్ ‘వైల్డ్ కార్డు’తో బరిలోకి దిగి 2001లో వింబుల్డన్ టోర్నీ టైటిల్‌ను గెలిచాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో కాంస్య పతకాలు సాధించా డు. ఇవానిసెవిచ్తోపాటు మాజీ నంబర్‌వన్ హెవిట్ (ఆస్ట్రేలియా), వింబుల్డన్ మాజీ విజేత కొంచిటా మార్టినెజ్ (స్పెయిన్)లకు ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం దక్కింది. -
టెన్నిస్ దిగ్గజం షిర్లీ ఇర్విన్ కన్నుమూత
న్యూయార్క్: మహిళల సింగిల్స్‌లో మాజీ వరల్డ్ నంబర్‌వన్, నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత షిర్లీ జూన్ ఇర్విన్ కన్నుమూసింది. ఆమె వయసు 94 సంవత్సరాలు. 1951లో ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గిన ఆమె...1956లో వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌తో పాటు తర్వాతి ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మహిళల టెన్నిస్‌లో నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన పది మందిలో షిర్లీ కూడా ఒకరు. డబుల్స్‌లోనూ 13 గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆమెకు 1970లో టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. -
హాల్ ఆఫ్ ఫేమ్: అమరవీరులకు వందనం!
హాల్ ఆఫ్ ఫేమ్... ఇది మనకు పెద్దగా పరిచయం లేని మ్యూజియం. ఇండో– పాక్, ఇండో–చైనా యుద్ధాల్లో మనదేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమర వీరుల జ్ఞాపకార్థం సహ సైనికులు నిర్మించిన మ్యూజియం. ఈ ప్రదేశం మొత్తం మనకు కశ్మీర్గానే పరిచయం. కానీ తాజా విభజన ప్రకారం ఇది లధాక్ కేంద్రపాలిత ప్రాంతం. లధాక్ రాజధాని నగరం లేహ్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో లేహ్– కార్గిల్ రోడ్లో ఉంది. కెప్టెన్ రాసిన ఉత్తరం హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం రెండంతస్థుల భవనం. ఒక అంతస్థులో ఓపీ విజయ్ గ్యాలరీ ఉంది. ఇందులో సియాచిన్ గ్లేసియర్‌లో డ్యూటీ చేసే భారత సైనికులు ధరించి దుస్తులు, ఇతర వస్తువులు, కార్గిల్ యుద్ధంలో మనం ఉపయోగించిన ఆయుధాలతోపాటు ప్రత్యర్థి సైనికుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా చూడవచ్చు. లెస్ట్ ఉయ్ ఫర్గెట్ పేరుతో ఒక గోడ ఉంది. ఆ గోడకు కార్గిల్ యుద్ధ చిత్రాలున్నాయి. ‘ఆపరేషన్ విజయ్’ డాక్యుమెంటరీ చూడవచ్చు. ‘ద లాస్ట్ పోస్ట్’ పేరుతో మరో గోడ ఉంది. ఇది కదిలే చిత్రాల గోడ. యుద్ధఘట్టాల ఫొటోలు డిస్ప్లేలో ఆటో ప్లే అవుతుంటాయి. కెప్టెన్ వైజయంత్ థాపర్ అమరుడు కావడానికి కొద్దిరోజుల ముందు తన తల్లిదండ్రులకు రాసిన ఉత్తరం మనసును కదిలిస్తుంది. మైనస్ యాభై డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఎముకలు కొరికే చల్లదనంతో ఉండే సియాచిన్ గ్లేసియర్‌లో సైనికులు నివసించే బంకర్లు, గుడారాలు, వెచ్చని దుస్తుల నమూనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. లధాక్ చారిత్రక ప్రదర్శన మరో అంతస్థు లధాక్ చరిత్ర, సంస్కృతిని తెలిపే చిత్రాలు, వస్తువుల సుమహారం. ఇక్కడ ఉన్న సావనీర్ దుకాణంలో టీ షర్టులు, కప్పులు, కాఫీ మగ్గులు, పశుమినా శాలువాలుంటాయి. కోవిడ్ సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఐఆర్సీటీసీ తిరిగి పర్యాటకద్వారాలు తెరిచింది. డిస్కవర్ లధాక్ ఎక్స్ ఢిల్లీ (ఎన్డీఏ 12) ప్యాకేజ్‌లో లేహ్‌కు సమీపంలో ఉన్న హాల్ ఆఫ్ ఫేమ్ మ్యూజియం కూడా ఉంది. -
అష్ట కాంతులు
న్యూయార్క్‌లో 1969 నుంచీ ‘నేషనల్ ఉమెన్స్ హాల్ ఆఫ్ ఫేమ్’ అనే సంస్థ ఉంది. ఆ సంస్థ ఉన్న ప్రదేశంలో 173 ఏళ్ల క్రితం తొలిసారి మహిళా హక్కుల సదస్సు జరిగింది. ఆ సదస్సు జరిగిన స్థలం కావడం, రెండేళ్లకోసారి ఆ సంస్థ అమెరికాలోని ప్రసిద్ధ మహిళల్ని విశిష్ట వ్యక్తులుగా ఎంపిక చేసుకోవడం.. ఈ రెండు కారణాల వల్ల ‘హాల్ ఆఫ్ ఫేమ్’కి చారిత్రక ప్రాధాన్యం ఏర్పడి, ఆ హాల్‌కి (సంస్థకి) ఎంపికవడం ఒక ప్రతిష్ట అయింది. ప్రతి బేసి (సంఖ్య) సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక ఎంపిక జరుగుతుంది. ఈ ఏడాది మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం పొందారు. వచ్చే అక్టోబర్ 2 న ఈ ఎనిమిది మందిని నేషనల్ ఉమెన్స్ ఆఫ్ ఫేమ్ అధికారికంగా తన రికార్డులలో చేర్చుకుంటుంది. మొన్నటి మహిళా దినోత్సవం రోజు హాల్ ఆఫ్ ఫేమ్ వీళ్ల పేర్లను ప్రకటించింది. మిషెల్ ఒబామా (57) నలభై నాల్గవ అమెరికా ప్రథమ మహిళ. ఆ స్థానంలోకి వచ్చిన తొలి నల్లజాతి మహిళ కూడా. ‘21వ శతాబ్దపు అత్యంత ప్రభావశీలి అయిన ఆదర్శమూర్తి’ అని హాల్ ఆఫ్ ఫేమ్ మిషెల్‌ను అభివర్ణించింది. మిషెల్ మహిళలు, బాలికల హక్కుల ఉద్యమకారిణి, న్యాయవాది, రచయిత్రి. ప్రథమ మహిళగా ఉన్న ఎనిమిదేళ్ల కాలంలోనూ మిషెల్ శ్వేత సౌధానికి వన్నెతెచ్చారు. వైట్ హౌస్‌ను పీపుల్స్ హౌస్‌గా మార్చారు! ఆ తర్వాత కూడా మిషెల్ ప్రజా సంక్షేమం కోసమే పనిచూస్తూ ఉన్నారు. బాలల్లో స్థూలకాయం తగ్గించేందుకు ‘లెటజ్ మూవ్’, నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ‘రీచ్ హయ్యర్’, వృద్ధుల కోసం ‘జాయినింగ్ ఫోర్సెస్’, కౌమారదశలోని బాలిక ల విద్యకు ‘లెట్ గర్ల్స్ లెర్న్’.. ఇలా అనేక కార్యక్రమాలను రూపొందించారు మిషెల్. 2018లో ‘బికమింగ్’ అనే పేరుతో తన జ్ఞాపకాలను పుస్తకంగా తీసుకువచ్చారు. తన బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్‌కు 2020లో గ్రామీ అవార్డు పొందారు! హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం సంపాదించిన మిగతా ఏడుగురిలో రెబెక్కా హాల్స్టెడ్ (62) మిలటరీ అధికారి. జోయ్ హర్జో (69) కవయిత్రి, రచయిత్రి. ఇంద్రానూయీ (65) పెప్సీ కంపెనీ తొలి మహిళా సీఈవో. మియా హమ్ (48) సాకర్ లెజెండ్. జూడీ చికాకో (81) చిత్రకారిణి. తక్కిన ఇద్దరిలో ఆక్టేవియా ఇ బట్లర్ (1947–2006) సైన్స్ రైటర్. ఆమె గౌరవార్థం ఆమె పేరుతో నాసా ఇటీవలే అంగారకుడిపై పెర్సీ రోవర్ దిగిన చోటుకు నామకరణం చేసింది. ఆక్టేవియా ల్యాండింగ్ అంటారు ఇకపై ఆ ప్రదేశాన్ని! ఇక నాసా గణితశాస్త్ర వేత్త అయిన క్యాథరీన్ జాన్సన్ (1918–2020) ముప్పై ఐదేళ్ల పాటు నాసాలో పని చేశారు. మిషెల్ బబామా, మరో ఏడుగురు మహిళలు ఈ ఏడాది ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందారు. వారిలో ఇద్దరు.. బెస్ట్ సెల్లింగ్ సైన్స్–ఫిక్షన్ రచయిత్రి ఆక్టేవియా, నాసా గణిత శాస్త్రవేత్త క్యాథరీన్ జాన్సన్‌లకు.. మరణానంతరం ఈ గౌరవం దక్కింది. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మేవెదర్, లైలా అలీ
న్యూయార్క్: తమ ప్రొఫెషనల్ కెరీర్లో పరాజయంతో పరిచయం లేని అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్ మేవెదర్, మహిళా స్టార్ లైలా అలీ అంతర్జాతీయ బాక్సింగ్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జగద్విఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ కుమార్తె అయిన లైలా అలీ తండ్రికి తగ్గ తనయగా రింగ్‌లో నిరూపించుకుంది. తన కెరీర్లో 24–0 రికార్డుతో ప్రతి బౌట్ గెలిచిన 42 ఏళ్ల లైలా 21 పోటీల్లో నాకౌట్ విజయాలు సాధించడం మరో విశేషం. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్ది కూడా చెక్కుచెదరని రికార్డే. ఇంకా చెప్పాలంటే బాక్సింగ్‌లో అతని స్కోరు ఫిఫ్టీ నాటౌట్! 50–0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్ ఖాతాలో 27 నాకౌట్ విజయాలున్నాయి. ఇంకా ఈ ‘హాల్ ఆఫ్ ఫేమ్’ జాబితాలో హెవీవెయిట్ మాజీ విజేత వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్మన్ ఉన్నారు. -
ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో కలిస్, లీసా, జహీర్ అబ్బాస్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మరో ముగ్గురు మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆల్‌రౌండర్ జాక్వస్‌కలిస్... అలనాటి పాకిస్తాన్ డాషింగ్ బ్యాట్స్‌మన్, మాజీ సారథి జహీర్ అబ్బాస్... ఆస్ట్రేలియా మహిళల జట్టు మాజీ కెప్టెన్ లీసా స్థాలేకర్ కొత్తగా ఈ జాబితాలో చేరినట్లు ఆదివారం ఐసీసీ ప్రకటించింది. కరోనా నేపథ్యంలో వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో షాన్ పొలాక్‌తో పాటు భారత దిగ్గజం సునీల్ గావస్కర్ పాల్గొని ఈ ముగ్గురికీ శుభాకాంక్షలు తెలిపారు. దక్షిణాఫ్రికా తరఫున 1995– 2014 మధ్య కాలంలో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టి20 మ్యాచ్‌ల్లో కలిస్ ప్రాతినిధ్యం వహించాడు. సఫారీల తరఫున టెస్టుల్లో అత్యధికంగా 13,289 పరుగులు చేసి 292 వికెట్లు తీశాడు. వన్డేల్లో 11,579 పరుగులు సాధించి 273 వికెట్లు పడగొట్టాడు. గ్రేమ్ పొలాక్, బ్యారీ రిచర్డ్స్, డొనాల్డ్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు పొందిన నాలుగో దక్షిణాఫ్రికా క్రికెటర్ కలిస్. ‘ఏదో ఆశించి నేను ఆట ఆడలేదు. నా జట్టును గెలిపించేందుకు నిజాయితీగా ఆడాను. కానీ ఈరోజు ఐసీసీ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది’ అని 44 ఏళ్ల కలిస్ వ్యాఖ్యానించాడు. మహిళల వన్డే ప్రపంచకప్ (2005, 2013), టి20 ప్రపంచ కప్ (2010, 2012) గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యురాలైన 41 ఏళ్ల లీసా స్థాలేకర్... భారత్‌లోని పుణే నగరంలో పుట్టి ఆస్ట్రేలియాకు వలస వెళ్లింది. ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం పొందిన ఐదో మహిళా క్రికెటర్ లీసా. తన కెరీర్లో 8 టెస్టులు ఆడి 416 పరుగులు చేసి, 23 వికెట్లు తీసింది. 125 వన్డేలు ఆడి 2,728 పరుగులు చేసి 146 వికెట్లు పడగొట్టింది. 54 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడిన లీసా 769 పరుగులు చేసి 60 వికెట్లు తీసింది. హనీఫ్ మొహమ్మద్, ఇమ్రాన్ ఖాన్, జావెద్ మియాందాద్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్ తర్వాత ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం సంపాదించిన ఆరో పాకిస్తాన్ ప్లేయర్ జహీర్ అబ్బాస్. 73 ఏళ్ల జహీర్ అబ్బాస్ 1969 నుంచి 1985 వరకు పాక్ జట్టు తరఫున ఆడారు. 78 టెస్టులు ఆడిన ఆయన 5,062 పరుగులు సాధించారు. ఇందులో 12 సెంచరీలు, 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 62 వన్డేలు ఆడిన అబ్బాస్ 2,572 పరుగులు చేశారు. ఇందులో 7 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో 100 కంటే ఎక్కువ సెంచరీలు చేసిన ఏకైక ఆసియా క్రికెటర్ జహీర్ అబ్బాస్ కావడం విశేషం. -
సెమీస్‌లో పేస్ జంట
న్యూపోర్ట్ (అమెరికా): భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ హాల్ ఆఫ్ ఫేమ్ ఏటీపీ–250 టోర్నమెంట్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ లియాండర్ పేస్–మార్కస్ డానియల్ (న్యూజిలాండ్) ద్వయం 6–4, 5–7, 14–12తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)–రాబర్ట్ లిండ్‌స్టెట్ (స్వీడన్) జోడీపై గెలిచింది. 46 ఏళ్ల పేస్ 1995లో హాల్ ఆఫ్ ఫేమ్ టోర్నీలో తొలిసారి ఆడాడు. తాజా విజయంతో పేస్ జాన్ మెకన్రో (47 ఏళ్లు–2006 సాన్‌జోస్ టోర్నీ) తర్వాత ఏటీపీ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి సచిన్ టెండూల్కర్
లండన్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రతిష్టాత్మక ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కింది. అతడితో పాటు దక్షిణాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్, ఆస్ట్రేలియా మాజీ మహిళా పేసర్ క్యాథరిన్ ఫిట్జ్ప్యాట్రిక్లకు సైతం ఈ గౌరవం లభించింది. లండన్‌లో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో వీరి పేర్లను జాబితాలో చేర్చారు. టెస్టులు (200 మ్యాచ్‌లు 15,921 పరుగులు), వన్డే (463 మ్యాచ్‌లు 18,426 పరుగులు)ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డులకెక్కిన సచిన్... భారత్ నుంచి ‘ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్’ ఘనత అందుకున్న ఆరో క్రికెటర్. అతడి కంటే ముందు బిషన్ సింగ్ బేడీ (2009), సునీల్ గావస్కర్ (2009), కపిల్ దేవ్ (2010), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018)లకు చోటుదక్కింది. నిబంధనల ప్రకారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై అయిదేళ్లు పూర్తయినందున సచిన్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి అర్హత లభించింది. అతడు 2013 నవంబరులో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. ‘తరతరాలుగా ఎందరో క్రికెటర్లను వరించిన ఈ ఘనత నాకు గౌరవప్రదమైనది. వారంతా ఆటను ఉన్నత స్థితిలో నిలిపేందుకు ప్రయత్నించారు. అందులో నా పాత్ర కొంత ఉన్నందుకు సంతోషం’ అని సచిన్ పేర్కొన్నాడు. ‘ఈ ముగ్గురూ అత్యున్నత ఆటగాళ్లు. వారికి 2019 హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తున్నట్లు ప్రకటించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఐసీసీ తరఫున వారికి అభినందనలు’ అని ఐసీసీ సీఈవో మను సాహ్ని పేర్కొన్నాడు. ► అలెన్ డొనాల్డ్... దక్షిణాఫ్రికాకు ప్రధాన పేసర్‌గా దశాబ్దం పాటు సేవలందించాడు. గొప్ప బ్యాట్స్‌మెన్‌ను సైతం ఇబ్బంది పెట్టే బౌలర్‌గా పేరుగాంచాడు. 2004లో రిటైరయ్యాడు. 72 టెస్టుల్లో 330, 164 వన్డేల్లో 272 వికెట్లు పడగొట్టాడు. సఫారీ జట్టు అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంలోనే బలమైనదిగా నిలవడంలో డొనాల్డ్ కీలక పాత్ర పోషించాడు. ► హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి ఎక్కిన 8వ మహిళా క్రికెటర్ క్యాథరిన్ ఫిట్జ్‌పాట్రిక్. ఆస్ట్రేలియాకు 16 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన ఆమెకు వేగవంతమైన బౌలర్‌గా పేరుంది. వన్డేల్లో 180 వికెట్లు పడగొట్టిన ఫిట్జ్ రెండేళ్ల క్రితం వరకు ఆ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. ఆసీస్ మహిళల జట్టు 1997, 2005 ప్రపంచ కప్‌లు గెలవడంలో ప్రధాన భూమిక ఈమెదే. 2012– 15 మధ్య కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఫిట్జ్... తమ దేశానికి వన్డే ప్రపంచ కప్, రెండు టి20 ప్రపంచ కప్‌లు దక్కడంలో పాలుపంచుకుంది. -
భారతీయ రైతుకు అరుదైన గౌరవం
కెనడాలో వ్యవసాయ రంగంలో చేసిన విశేష కృషికిగాను భారతీయ రైతుకు కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. అక్కడి ‘కెనడియన్ అగ్రికల్చరల్ హాల్ ఆఫ్ ఫేమ్ (సీఏహెచ్ఎఫ్ఏ)’ లో రైతు పీటర్ పావిటర్ ధిల్లాన్ పేరును చేర్చారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు చేసిన వారి పేరును సీఏహెచ్ఎఫ్ఏలో చేర్చి వారి విజయాలను ఆ సంస్థ ప్రచారం చేస్తుంది. కెనడాలోనే అత్యధిక క్రాన్బెర్రీ పంటను పండించినందుకుగాను ధిల్లాన్‌ను సంస్థ ఇలా గౌరవించింది. పంజా బ్, హోషియార్‌పూర్‌లోని పాండోరి గ్రామం నుంచి 1950లో ధిల్లాన్ తండ్రి రాచ్పాల్ సింగ్ ధిల్లాన్ కెనడాకి వచ్చారు. 19 ఏళ్ళ వయస్సులోనే రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్‌లో చేరిన తొలి ఇండో కెనడియన్‌గా పీటర్ ధిల్లాన్ గుర్తింపు పొందాడు. అనతి కాలంలో డిప్యూటీ షరిఫ్గా ధిల్లాన్ ఎదిగారు. బ్రిటన్‌లో లా పూర్తిచేశాక ధిల్లాన్ కుటుంబం 1993లో వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ధిల్లాన్ ఏకంగా 2000 ఎకరాల్లో క్రాన్బెర్రీ పండిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధిక క్రాన్బెర్రీ సాగుచేస్తున్నవారిలో ధిల్లాన్ రెండో స్థానంలో ఉన్నారు. రిచ్మండ్, బ్రిటిష్ కొలంబియాల్లో రిచ్బెర్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరుతో క్రేన్బెర్రీ ఉత్పాదక పరిశ్ర మను నిర్వహిస్తున్నారు. గత ఏడాదిలో రిచ్బెర్రీ గ్రూప్ రూ.188 కోట్ల విలువైన క్రాన్బెర్రీలను పండించింది. అమెరికా, కెనడా ల్లోని క్రాన్బెర్రీ మార్కెటింగ్ కో–ఆపరేటివ్ ‘ఓషియన్ స్ప్రే’కి «ప్రస్తుతం దిల్లాన్ చైర్మన్. «2014లో తొలిసారిగా దిల్లాన్ ఓషియన్ స్ప్రేకో ఆపరేటివ్ సొసైటీకి శ్వేతజాతీయేతర చైర్మన్‌గా ఎంపికై రికార్డు సృష్టించారు. ఓషియన్ స్ప్రేకి చెందిన 2.5 బిలియన్ డాలర్ల ఖరీదైన ఉత్పత్తులు ప్రతియేటా అమ్ముడవుతున్నాయి. త్వరలో భారత మార్కెట్లోకి అడుగు పెట్టాలన్న యోచనలో ఉన్నారు. -
సచిన్ కంటే ముందు ద్రవిడ్ ఎందుకు?
న్యూఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) విడుదల చేసిన హాల్ ఆఫ్ ఫేమ్‌లో టీమిండియా మాజీ కెప్టెన రాహుల్ ద్రవిడ్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ద్రవిడ్‌తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవడం ద్వారా ఈ ఘనత సాధించిన ఐదో భారత ఆటగాడిగా ద్రవిడ్ నిలిచాడు. అతడి కంటే ముందు భారత తరపున బిషన్ సింగ్ బేడీ, సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే మాత్రమే ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ఎందుకు దక్కలేదనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన సచిన్‌కు ఇప్పటివరకూ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు ఎందుకు దక్కలేదనే దానిపై అభిమానులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, ఒక క్రికెటర్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలంటే వన్డే, టెస్టుల్లో కలిపి ఒక బ్యాట్స్‌మన్ ఎనిమిది వేలకు పైగా పరుగులతో పాటు 20 సెంచరీలు చేసి ఉండాలి. అదే సమయంలో ఒక క్రికెటర్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి కనీసం ఐదేళ్ల పూర్తి కావాలి. దాని ప్రకారం చూస్తే సచిన్ తన కెరీర్‌కు గుడ్ బై చెప్పి ఇంకా ఐదేళ్ల పూర్తి కాలేదు. 2013, నవంబర్‌లో సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ఐసీసీ నిబంధనల ప్రకారం సచిన్ హాల్ ఆఫ్ ఫేమ్లోచోటు దక్కించుకోవాలంటే ఇంకా కొంత సమయం ఉంది. దాంతో సచిన్‌కు మిగతా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంకా ఐదేళ్లు పూర్తి కాకపోవడంతో హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. 2012లో ద్రవిడ్ తన చివరి మ్యాచ్ ఆడాడు. కాబట్టి అతడు ఈ ఏడాది హల్ ఆఫ్ ఫేమ్‌లో చేరాడు. వచ్చే ఏడాదికి సచిన్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పి ఐదేళ్లు పూర్తవుతాయి. కాబట్టి 2019లో క్రికెట్ గాడ్ ఆ జాబితాలో చేరే అవకాశం ఉంది. -
ద్రవిడ్‌కు అరుదైన గౌరవం
దుబాయ్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) హాల్ ఆఫ్ ఫేమ్‌లో ద్రవిడ్‌కు స్థానం లభించింది. ఈ మేరకు దుబాయ్‌లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించిన విషయాన్ని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ రిచర్డ్సన్ స్పష్టం చేశారు. ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ క్లెయిర్ టేలర్‌లకు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఈ ఘనత దక్కించుకున్న ఐదో భారత ఆటగాడు రాహుల్ ద్రవిడ్. గతంలో బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, అనిల్ కుంబ్లేలు భారత తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించిన ఆటగాళ్లు. ఇక ఆసీస్ తరపున హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 25వ ఆటగాడు పాంటింగ్ కాగా, ఈ ఘనత సాధించిన ఏడో మహిళా క్రికెటర్ టేలర్. ఇంగ్లండ్ తరపున మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించారు.. ‘క్రికెట్ గేమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో స్థానం కల్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. వరల్డ్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి ఇచ్చే గుర్తింపు ఇది. ఈ సందర్భంగా రాహుల్ ద్రవిడ్, రికీ పాంటింగ్, టేలర్‌లను అభినందిస్తున్నా’ అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ తెలిపారు. ‘ ఇదొక గొప్ప గౌరవం. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ తరహా గౌరవం కచ్చితంగా ఏ ఆటగాడి జీవితంలోనైనా రెట్టించిన ఆనందాన్ని తీసుకొస్తుంది’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. -
‘హాల్ ఆఫ్ ఫేమ్’లో ఆంధ్రుడు
వాషింగ్టన్: అమెరికా ఒహయో రాష్ట్రంలోని టోలెడో మెడికల్ అండ్ లైఫ్ సైన్సెస్ విశ్వవిద్యాలయం హాల్ ఆఫ్ ఫేమ్‌లో తెలుగు వైద్యుడు వాడరేవు రాజుకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజు 1965లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. ఆ తరువాత భారత్‌లోనే ఇంటర్న్‌షిప్, రెసిడెన్సీ పూర్తి చేసిన ఆయన ఇంగ్లండ్‌లోని సర్రేలోని ఓ ఆసుపత్రిలో అత్యవసర విభాగం అధికారిగా పనిచేశారు. 1984 నుంచి క్లినికల్ ప్రొఫెసర్‌గా సేవలందిస్తూ ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఈఎఫ్ఏ)కు రాజు వ్యవస్థాపకుడు, మెడికల్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. పశ్చిమ వర్జీనియా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇప్పటికే 14 దేశాల్లో తన సేవలను ప్రారంభించడంతో పాటు భారత్‌లో కంటి ఆసుపత్రులను స్థాపించింది. -
టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో మౌరెస్మో
ప్రపంచ మహిళల టెన్నిస్ మాజీ నంబర్‌వన్ అమెలీ మౌరెస్మో (ఫ్రాన్స్)కు అంతర్జాతీయ టెన్నిస్ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో స్థానం లభించింది. ప్రస్తుతం బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రేకు కోచ్‌గా వ్యవహరిస్తున్న 36 ఏళ్ల మౌరెస్మో 2006లో ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్స్‌ను సాధించింది. అదే ఏడాది 36 వారాలపాటు నంబర్‌వన్ ర్యాంక్‌లో కొనసాగింది. కెరీర్ మొత్తంలో 25 టైటిల్స్ నెగ్గిన ఆమె 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో రజతం సాధించింది.