Hello guru prema kosame
-
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
న్యూ లుక్‌లో రామ్
ఇటీవల హలో గురూ ప్రేమ కోసమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో రామ్ కొత్త సినిమాను ఇంత వరకు అంగీకరించలేదు. ప్రస్తుతం తదుపరి ప్రాజెక్ట్ కోసం కథను వెతికే పనిలో ఉన్న ఈ ఎనర్జిటిక్ స్టార్ లుక్ విషయంలోనూ ప్రయోగాలు చేస్తున్నాడు. తాజాగా తన కొత్త లుక్కు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు రామ్. రగ్డ్ లుక్‌లో ఉన్న తన ఫొటోతో పాటు హస్ట ల విస్ట అనే స్పానిష్ పదాన్ని కామెంట్ చేశాడు. వరుస సినిమాలు చేస్తున్న రామ్ ఓ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. Hasta la vista.. pic.twitter.com/XT0c9xYPlu — RAm POthineni (@ramsayz) 12 November 2018 -
వైజాగ్‌లో ‘హలో గురు ప్రేమ కోసమే’ టీం సందడి
-
‘హలో గురూ.. మీ ప్రేమ కోసమే...
‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రం యూనిట్ జిల్లాలో శుక్రవారం సందడి చేసింది. ఈ సినిమా హీరో రామ్, హీరోయిన్లు అనుపమా పరమేశ్వరన్, ప్రణితలు ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరి జిల్లాల వెటకారం చాలా బాగుంటుందని, అదంటే తమకు ఎంతో ఇష్టమంటూ కాకినాడ, రాజమహేంద్రవరంలో జరిగిన మీట్లలో ప్రకటించారు. ఈ సినిమా విజయానికి మీ ప్రేమ కావాలని, మీరంతా సినిమాను ఆదరిస్తారన్న ఆశతో మీ ముందుకు వచ్చానని రామ్ అన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమన్నారు. తూర్పుగోదావరి, ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): గోదావరి జిల్లాల వెటకారం చాలా బాగుంటుందని, అదంటే తనకు చాలా ఇష్టమని సినీ హీరో రామ్ అన్నారు. శుక్రవారం హోటల్ షెల్టాన్‌లో ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రం సక్సెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ సినిమాకు ప్రేక్షకుల నుంచి విశేషస్పందన లభిస్తుందన్నారు. గురువారం రాత్రి అశోకా థియేటర్లో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మరిచిపోలేనిదన్నారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను నేరుగా కలుసుకుని కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ యాత్ర చేపట్టామన్నారు. ‘హలో గురూ ప్రేమ కోసమే’ అన్ని వర్గాల ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమన్నారు. కొత్త సినిమా ఏమి చేయాలన్నది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో తాను రెండో చిత్రంలో నటించానన్నారు. ‘శతమానం భవతి’ సూపర్‌హిట్ అయిందని, ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు సక్సెస్ చేయడం సంతోషంగా ఉందన్నారు. రాజమహేంద్రవరం తనకు ఎంతో ఇష్టమని, ‘శతమానం భవతి’ షూటింగ్‌కు ఇక్కడ 40 రోజులు ఉన్నానని, ఇక్కడ వంటకాలు అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. మరో హీరోయిన్ ప్రణీత మాట్లాడుతూ ఈ సినిమా విజయవంతం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాలోని ‘పెద్దకళ్ళ పాప’ పాట లిరిక్స్ చాలా బాగున్నాయన్నారు. హ్యాట్రిక్ అందుకున్నా.. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ తాను రూపొందించిన ‘సినిమా చూపిస్త మామా, నేను లోకల్’ హిట్ అయ్యాయని, ఈచిత్రాన్ని కూడా హిట్ చేసి ప్రేక్షకులు హ్యాట్రిక్ అందించారన్నారు. ఈ చి త్రాన్ని జిల్లాలో జి.మామిడాడ ప్రాం తంలో షూట్ చేశామన్నారు. జిల్లా ప్రశాంతంగా ఉంటుందని, ప్ర జలు నవ్వుతూ ఉంటారని కితా బిచ్చారు. నిర్మాత హæర్షిత్రెడ్డి మాట్లాడుతూ చిత్రాన్ని అన్ని ఏరియాల్లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. రచయిత ప్రసన్నకుమార్ మాట్లాడుతూ సినిమాలో ఉప్మా డైలాగు ప్రేక్షకుల మదిలో కలకాలం నిలిచిపోతుందన్నారు. మరో రచయిత సాయికృష్ణ మాట్లాడుతూ సినిమాలో హీరో తండ్రి గోదా వరి యాసలో మాట్లాడడం ప్రేక్షకులను అలరించిందన్నారు. పంపిణీదారు వింటేజ్ క్రియేషన్స్ జేకే రా మకృష్ణ, ప్రసాద్ పాల్గొన్నారు. కాగా చిత్రం యూ నిట్ కాకినాడ పద్మప్రియ థియేటర్లో ప్రేక్షకుల్ని కలుసుకుంది. -
దుర్గఅమ్మను దర్శించుకున్న‘హలో గురు ప్రేమ కోసమే’ యూనిట్
-
ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది!
‘‘దిల్’ రాజు మా కుటుంబ సభ్యుడు. కథని నమ్ముకుని ప్రయాణం చేసే అతి తక్కువ మంది నిర్మాతల్లో రాజుగారు ఒకరు. అలాంటి నిర్మాత ఎంచుకున్న దర్శకుడు త్రినాథరావు. రామ్ స్వచ్ఛత ఉన్న మనిషి. తన సినిమాలు సరదాగా ఉంటాయి. ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో రామ్‌తో సెటిల్డ్‌గా చేయించారు త్రినాథరావు. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాకు హర్షిత్ నా వద్ద పనిచేశాడు. తనకు మంచి భవిష్యత్ ఉంది’’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. రామ్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘నేను తీసిన ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురు ప్రేమకోసమే’ మూడు సినిమాలు హిట్ అయ్యాయి. ఓ డైరెక్టర్‌గా ఇంతకంటే ఏం కావాలి.. చాలా హ్యాపీగా ఉంది.ఈ మధ్య కాలంలో ప్రకాశ్‌రాజ్‌గారితో చాలా ఎక్కువ రోజులు పనిచేసిన యూనిట్ మాదే. మా సినిమాని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఈ దసరాకి ప్రేక్షకులు ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు హ్యాపీ. చాలా మంది ఫోన్ చేసి అభినందిస్తుంటే సంతోషంగా అనిపించింది. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. త్రినాథ్రావుగారు చాలా ఎంటర్టైనింగ్ డైరెక్టర్’’ అన్నారు రామ్. ‘‘డైరెక్టర్‌గా, ఆర్టిస్ట్‌గా, రైటర్‌గా 34 ఏళ్లుగా ఇండస్ట్రీలో ప్రయాణం చేస్తున్నా. త్రినాథరావుని చూస్తే.. ఏ కోశానా డైరెక్టర్ లుక్‌లో కనపడడు. కానీ, సినిమాను కంఫర్ట్‌బుల్‌గా తీస్తాడు’’ అన్నారు పోసాని కృష్ణమురళి. ఈ సమావేశంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, రచయితలు సాయికృష్ణ, ప్రసన్న కుమార్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘హలో గురు ప్రేమ కోసమే’ సక్సెస్‌మీట్
-
నగరంలో ‘హలో గురు ప్రేమ కోసమే’ టీం సందడి
-
లావయ్యానా? లేదే!
‘‘అందరూ ఫోన్ చేసి పండగ సినిమా అని అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మన పాత్రను మనం బాగా చేయడం వరకే మన చేతుల్లో ఉంటుంది. సినిమా ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేం’’ అని అనుపమ అన్నారు. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రం గురువారం విడుదలైన సందర్భంగా అనుపమ పలు విశేషాలు పంచుకున్నారు. ♦ నేను చేసిన గత చిత్రాలు ‘కృష్ణార్జున యుద్ధం, తేజ్’ సరిగ్గా ఆడలేదు. ఈ ఫ్లాప్స్ వల్ల భవిష్యత్తులో స్క్రిప్ట్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకున్నాను. స్క్రిప్ట్స్ ఎంపిక విషయంలో తొందరపడకుండా ఉండాలి. ♦సినిమాలో ఎంత సేపు ఉన్నాం అన్నదానికంటే కూడా నా పాత్ర ఎంత బావుంది అన్నదే ముఖ్యం. అలాగే నా పాత్ర సినిమాకు ఎంత మేరకు సహాయపడుతుందో ఆలోచిస్తుంటాను. ♦‘హలో గురు..’ టీజర్, ట్రైలర్ చూసి లావయ్యాను అని కొందరు అన్నారు. నాకు మాత్రం లావు అయినట్టుగా ఏం అనిపించలేదు. ♦ ప్రకాశ్రాజన్ గారు, రామ్ పాత్రలు ఈ సినిమాకు చాలా కీలకం. ప్రకాశ్‌రాజ్‌గారి దగ్గర నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. షూటింగ్ సమయంలో మా మధ్య మనస్పర్థలు వచ్చాయి అని రాశారు. కానీ మా మధ్య అలాంటివి ఏం జరగలేదు. రామ్‌తో రెండోసారి పని చేయడం చాలా కంఫర్ట్‌బుల్‌గా అనిపించింది. ♦నాకెప్పుడూ వేధింపులు ఎదురవ్వలేదు. బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ల వల్ల మిగతా వారికి అవగాహన వస్తుంది. అది మంచి పరిణామం. ♦ ప్రస్తుతం కన్నడంలో ‘నట సార్వభౌమ’ అనే సినిమా చేస్తున్నాను. కన్నడం సరిగ్గా రాకపోయినా పునీత్ రాజ్‌కుమార్ బాగా సహాయంగా ఉంటున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ నాకేం ఇబ్బంది లేదు. అలాగే వైవిధ్యమైన పాత్రలు చేయాలనుంది. -
'హలో గురు ప్రేమ కోసమే' మూవీ రివ్యూ
టైటిల్ : హలో గురు ప్రేమ కోసమే జానర్ : రొమాంటిక్ కామెడీ తారాగణం : రామ్ పోతినేని, అనుపమా పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, సితార, జయ ప్రకాష్ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్ దర్శకత్వం : త్రినాధ్ రావు నక్కిన నిర్మాత : దిల్ రాజు యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. భారీ హిట్ కోసమే ఎదురుచూస్తున్న రామ్ ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. సినిమా చూపిస్త మామ, నేను లోకల్ సినిమాలతో సక్సెస్ సాధించిన త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. (సాక్షి రివ్యూస్)ఇటీవల శ్రీనివాస కళ్యాణం సినిమాతో షాక్ తిన్న దిల్ రాజు, ఈ సినిమాతో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. మరి హలో గురు ప్రేమ కోసమే రామ్, త్రినాధ్, దిల్ రాజుల కోరిక తీర్చిందా..? కథ ; సంజూ(రామ్ పోతినేని) కాకినాడలో అమ్మానాన్నలతో కలిసి సంతోషంగా ఉండే కుర్రాడు. తనకి ఇష్టం లేకపోయినా అమ్మానాన్నల కోసం హైదరాబాద్‌లో జాబ్ చేయడానికి బయల్దేరాడు. ట్రైన్లో కాకినాడ గురించి తక్కువ చేసి మాట్లాడిందని అను(అనుపమా పరమేశ్వరన్)ను టీజ్ చేస్తాడు. తర్వాత అను.. తను ఎవరి ఇంట్లో ఉండటానికి వచ్చాడో ఆ విశ్వనాథ్(ప్రకాశ్ రాజ్) కూతురు అని తెలిసి సంజూ షాక్‌కు గురవుతాడు. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్‌లో జాయిన్ అయిన సంజూ అక్కడ రీతు(ప్రణీత)ను ఇష్టపడతాడు. అయితే ఓ సంఘటన కారణంగా తన మనసులో ఉన్నది అను అని తెలుసుకుంటాడు. (సాక్షి రివ్యూస్) కానీ అదే సమయంలో విశ్వనాథ్, అనుకి వేరే సంబంధం చూడటంతో కథ మలుపు తిరుగుతుంది. సంజు ప్రేమను అను అంగీకరించిందా? తన ప్రేమను కాపాడుకోవటానికి సంజూ ఏం చేశాడు? అన్నదే మిగతా కథ. నటీనటులు ; రామ్ మరోసారి తనదైర ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. కామెడీతోనూ మెప్పించాడు. లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో పెద్దగా కొత్తదనం చూపించకపోవటం నిరాశ కలిగిస్తుంది. అనుపమా పరమేశ్వరన్‌కు మరోసారి నటనకు ఆస్కారం ఉన్న పాత్ర దక్కింది. ప్రణీత తెర మీద కనిపించింది కొద్దిసేపే అయినా ఉన్నంతలో తన పరిధి మేరకు ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన ప్రకాష్ రాజ్ మరోసారి తనదైన నటనతో సినిమాను నడిపించాడు. (సాక్షి రివ్యూస్)దాదాపు హీరోకు సమానమైన పాత్రలో కామెడీ, ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు. జయప్రకాష్, సితార, ఆమని, పోసాని కృష్ణమురళీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ ; సినిమా చూపిస్త మామ, నేను లోకల్ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లతో ఆకట్టుకున్న దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన మరోసారి సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నం చేశాడు. రామ్ లాంటి ఎనర్జిటిక్ స్టార్ ఉన్నా కామెడీ, ఫ్యామిలీ డ్రామా మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు. ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కూతురుని పడేయటానికి తండ్రినే సహాయం అడగటం కాస్త సిల్లీగా అనిపించినా.. కామెడీ బాగానే పండింది. అయితే తొలి అర్థభాగం చాలా సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. ప్రకాశ్ రాజ్, రామ్‌ల కెమిస్ట్రీ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. (సాక్షి రివ్యూస్) కామెడీ టైమింగ్‌లోనూ రామ్, ప్రకాష్ రాజ్‌లు ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. సినిమాకు ప్రధాన బలం మాటలు, కామెడీతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనే డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. దేవీ శ్రీ ప్రసాద్ పాటలతో పర్వాలేదనిపించాడు. నేపథ్య సంగీతంతోనూ తన మార్క్ చూపించాడు. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ సినిమాకు కలర్‌ఫుల్ లుక్ తీసుకువచ్చాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కామెడీ రామ్, ప్రకాశ్ రాజ్‌ల కాంబినేషన్ సీన్స్ మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ కొన్ని బోరింగ్ సన్నివేశాలు, పాటలు సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అరవింద సమేత.. నాన్–బాహుబలి రికార్డు!
అరవింద ఆల్రెడీ మెప్పించింది.. పండగ మార్కులు కొట్టేసింది.ఈ రోజు మరో రెండు సినిమాలకు తోరణాలు రెడీ అయ్యాయి. అభిమానులకు ఇంతకు మించి పండగ ఏముంటుంది? మూడు సినిమాలు! ఒకటి హిట్టు, రెండు మంచి టాపిక్. ఎంజాయ్ ది సినిమా దసరా. కుటుంబ సమేతంగా... ‘కడప కోటిరెడ్డి సర్కిల్ నుండి పులివెందుల పూల అంగళ్ల దాక .. కర్నూల్ కొండారెడ్డి బురుజు నుండి అనంతపూర్ క్లాక్ టవర్ దాకా.. బళ్లారి గనుల నుండి బెలగావ్ గుహల దాకా తరుముకుంటూ వస్తా తల తీసి పారేస్తా’... పవర్ఫుల్ డైలాగ్.‘యుద్ధం చేసే సత్తా లేనివాడికి శాంతి గురించి మాట్లాడే హక్కు లేదు’.. అర్థవంతమైన డైలాగ్.. ‘పాలిచ్చి పెంచిన తల్లులకు పాలించడం ఓ లెక్కా’ ఆలోచింపజేసే డైలాగ్... ‘అరవింద సమేత వీర రాఘవ’లో ఈ డైలాగ్స్ చాలు.. ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేయడానికి. హీరో అంటే విలన్‌తో హోరాహోరీగా తలపడాలి. ఫర్ ఎ చేంజ్ ‘శాంతి’ మార్గం అంటే.. పైగా ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో ఆ మాట అంటే? సినిమా చప్పగా ఉంటుంది. కానీ హీరోతో ఆ మాట అనిపించి, అభిమానులకు కావాల్సిన యాక్షన్‌ని కూడా చూపించారు త్రివిక్రమ్. అందుకే ‘అరవింద సమేత వీర రాఘవ’ భారీ ఎత్తున కలెక్షన్లు రాబడుతోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దసరా పండగకి వారం ముందే ఈ సినిమా విడుదలై, ఎన్టీఆర్ అభిమానులకు పండగని ముందే తెచ్చింది. దాదాపు 85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బయ్యర్లను ‘సేఫ్ జోన్’లో ఉంచుతుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఎన్టీఆర్ నటన, త్రివిక్రమ్ డైలాగ్స్, టేకింగ్.. అన్నీ కుదిరిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని చూస్తున్నారని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గత గురువారం విడుదలైన ఈ సినిమా ఈ మంగళవారం సెకండ్ షో కలెక్షన్లు వరకూ ట్రేడ్ వర్గాలు చెప్పిన ప్రకారం ఈ విధంగా... – ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కలెక్షన్స్ – 115 కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన షేర్ 55 కోట్లు కాగా వరల్డ్ వైడ్ షేర్ 74 కోట్లు. ఓవర్సీస్ 12 కోట్లకు అమ్మితే మంగళవారం వరకు 11కోట్ల 30 లక్షలు రాబట్టింది. నైజాం హక్కులను ‘దిల్’ రాజు 18 కోట్లకు కొన్నారు. ఆయన ఫుల్ సేఫ్‌లో ఉన్నారట. ఇప్పటికే గుంటూరు, సీడెడ్, వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లంతా సేఫ్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇంకా వైజాగ్, కృష్ణా, ఈస్ట్ గోదావరి, నెల్లూరు, కర్ణాటక బయ్యర్లు ఈ శుక్రవారం నుండి లాభాల బాటలో ఉంటారని ట్రేడ్ వర్గాల అంచనా. ఇవే కాకుండా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ను, శాటిలైట్ రైట్స్‌ను దాదాపు 45 కోట్లకు అమ్మారట చిత్రనిర్మాతలు. మొత్తం మీద ‘అరవింద సమేత...’ చిత్రబృందానికి దసరా పండగే పండగ. ‘బాహుబలి’ తర్వాత! ‘అరవింద సమేత...’ ఓపెనింగ్ వీకెండ్ సేల్స్‌లో నాన్–బాహుబలి రికార్డును సాధించినట్లు బుక్ మై షో నిర్వాహకులు అధికారికంగా పేర్కొన్నారు. ‘‘బుక్ మై షోలో ‘అరవిందసమేత’.. చిత్రానికి 12 లక్షల టిక్కెట్స్ సేల్ అయ్యాయి. ఈ ప్లాట్ఫామ్లో ఓపెనింగ్ వీకెండ్ సేల్స్ విషయంలో ‘బాహుబలి–2’ తర్వాత ఈ ప్లేస్ ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానిదే. తెలుగులో మంచి మంచి సినిమాలు వస్తున్నాయి’’ అని బుక్ మై షో ప్రతినిధి పేర్కొన్నారు. ఇద్దరు మగువల మధ్య... స్కూలైనా, కాలేజైనా, ఆఫీసైనా.. జాయినైన ఫస్ట్ డే అందరూ చేసే ఫస్ట్ పనేంటో తెలుసా... అబ్బాయిల్లో ఎవరు బాగున్నారా? అని అమ్మాయిలు. అమ్మాయిల్లో ఎవరు బాగున్నారా? అని అబ్బాయిలు ఏరుకోవడం. రామ్ లాంటి హుషారైన ఓ కుర్రాడు ఇలాంటి డైలాగ్ చెప్పాడంటే.. ఇంకా అతను ఎవర్నీ ఏరుకోనట్టే. అదేనండీ.. ప్రేమలో పడనట్టే. కానీ అతను అనుపమా పరమేశ్వరన్‌ని చూసి మనసు పారేసుకున్నాడు. ఇంకేముంది ఫాలోయింగ్ స్టార్ట్ చేశాడు రామ్. కానీ ఈజీగా పడితే వాళ్లు అమ్మాయిలు ఎందుకు అవుతారు? పైగా అది వాళ్ల హక్కాయే. ఈ లవ్‌ట్రాక్ అలా ఉండగానే... రామ్ లైఫ్‌లోకి మరో అమ్మాయి ప్రణీత వస్తుంది. ఈ ఇద్దరి అమ్మాయిల మధ్యలో రామ్‌కి ఓ మిడిల్ ఏజ్ వ్యక్తి ప్రకాశ్‌రాజ్ ఫ్రెండ్ అయ్యాడు. కట్ చేస్తే.. ఆ ఫ్రెండ్ రామ్‌కి మావయ్య అవుతాడట. ఆ మావయ్య కూతురే అనుపమ అట. అంటే.. విడిపోయిన కుటుంబాలను కలపడం కోసమే అనుపమాను రామ్ ప్రేమించాడా? ఏమో.. ఈ రోజు థియేటర్స్‌కి వెళ్లి ‘హలో గురు ప్రేమ కోసమే’ చూస్తే తెలుస్తుంది. ‘నేను లోకల్’ ఫేమ్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని దాదాపు 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారని విశ్వసనీయ వర్గాల సమాచారమ్. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 600 థియేటర్స్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్ బిజినెస్ 28 కోట్లు అయిందని ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. ‘హలో..’ కొన్ని డైలాగ్స్ ‘‘పెళ్లయిన తర్వాత అమ్మాయి లైఫ్ అమ్మ అవ్వడం వల్ల బాగుంటుంది. పెళ్లికి ముందు అమ్మాయి లైఫ్ నాన్న ఉండటం వల్ల బాగుటుంది’’ – అనుపమ‘‘ఈ సోదంతా చెబితే వినడానికి బాగుంటుంది’’ – రామ్ ‘‘అబద్ధం చెప్పడానికి సిగ్గులేదా?’’ – ప్రకాశ్‌రాజ్‘‘అబద్ధం చెబితే అమ్మాయిలు పుడతారో లేదో తెలీదు కానీ అబద్ధాలు చెబితే మాత్రం అమ్మాయిలు కచ్చితంగా పడతారు’’ – రామ్ ‘‘గుర్తుంచుకోవాలి.. గుర్తుంచుకోవాలి అనే చదువు మాత్రం మర్చిపోతాం. కానీ మర్చిపోవాలి.. మర్చిపోవాలి అని అనుకునే అమ్మాయిని మాత్రం...చచ్చేదాకా మర్చిపోలేం’’ – రామ్ పొట్టేల్ని కాదురా... పులివెందుల బిడ్డని ‘‘నీకు దమ్ముంటే పగ తీర్చుకోవడానికి మళ్లీ మా ఊరికి రా.. చూసుకుందాం’’... విలన్‌కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు హీరో. విలన్ కూడా తక్కువోడేం కాదు. పవర్‌ఫుల్లే. మరి.. హీరో ఊరికి విలన్ వెళతాడా? పగ తీర్చుకుంటాడా? పందెంలో గెలిచేది ఎవరు? దసరా పండగకి తెలిసిపోతుంది. దసరా బాక్సాఫీస్ బరిలోకి పందెం కోడిలా దూసుకొచ్చారు విశాల్. కెరీర్ స్టార్టింగ్‌లో విశాల్ చేసిన మంచి మాస్ మాసాలా మూవీ ‘పందెం కోడి’. ఈ సినిమాకి సీక్వెల్ ‘పందెం కోడి–2’. పార్ట్ 2 గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ పార్ట్ కథని గుర్తు చేసుకుందాం.హీరో విశాల్ ఇంజినీరింగ్ పూర్తి చేసి, వేరే ఊళ్లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వెళతాడు. ఆ ఫ్రెండ్ చెల్లెలు మీరా జాస్మిన్ అందచందాలకు, అల్లరికి పడిపోతాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. చుట్టపు చూపుగా వచ్చిన హీరో మళ్లీ తన ఊరికి ప్రయాణం అవుతాడు. కట్ చేస్తే.. సరిగ్గా బస్ ఎక్కుతున్న సమయంలో ఓ గూండా ఓ వ్యక్తిని చంపడానికి వెంటాడతాడు. అతన్నుంచి ఆ వ్యక్తిని కాపాడి, గూండాని రప్ఫాడిస్తాడు విశాల్. అతనెవరో కాదు.. పేరు మోసిన గూండా. ఊరుకుంటాడా? విశాల్ వివరాలన్నీ అతని స్నేహితుడి కుటుంబం ద్వారా తెలుసుకుని, అతని ఊరెళతాడు. అక్కడికెళ్లాక తెలుస్తుంది.. విశాల్ తండ్రి చాలా పవర్ఫుల్ అని. అయినా విశాల్ కుటుంబాన్ని అంతం చేయడానికి మంచి టైమ్ కోసం ఎదురు చూస్తాడు. గుడి ఉత్సవాల్లో ఆ పని పూర్తి చేయాలనుకుంటాడు. ఒకవైపు విలన్ ప్లాన్‌లో అతనుంటే మరోవైపు రెండు కుటుంబాలూ మాట్లాడుకుని విశాల్‌కి, మీరా జాస్మిన్‌కి పెళ్లి చేయాలనుకుంటారు. గుడి ఉత్సవాలు రానే వచ్చాయి. విలన్ ప్లాన్ ఫెయిలవుతుంది. అప్పుడు హీరో.. దమ్ముంటే మళ్లీ మా ఊరు రా అని విలన్‌తో పందెం కాస్తాడు. 13ఏళ్ల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘పందెం కోడి’ కథ ఇది. ఇప్పుడర్థమైంది కదా.. పార్ట్ 2 ఎలా ఉంటుందో? రెండు భాగాలకు లింగుస్వామియే దర్శకుడు. దసరా సందర్భంగా ఇవాళ సినిమా రిలీజవుతోంది. శాంపిల్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ ఎలా ఉందంటే.. ‘కత్తిని చూసి భయపడ్డానికి పొట్టేల్ని కాదురా.. పులివెందుల బిడ్డన‘ఏసేస్తా ఏసేస్తా అని చెప్పడం కాదు.. ఏసెయ్యాలి’.‘రంకెలేస్తూ కుమ్మడానికి వచ్చే ఆంబోతులా ఎంత పొగరుగా ఉన్నాడో చూడండ్రా’, ‘మగాడు నరికితేనే కత్తి నరుకుద్దనుకుంటున్నావా? ఆడది నరికినా నరుకుద్ది రా’‘మా వంశంలోని చివరి రక్తపుబొట్టు ఉన్నంత వరకూ మేము ఉంటాం’.ఇదండీ ట్రైలర్. టీజర్లోనూ ఆకట్టుకునే డెలాగ్స్ ఉన్నాయి.‘‘పవర్ఫుల్ డైలాగ్స్‌తో, పవర్ఫుల్ యాక్షన్‌తో, కుటుంబం మొత్తం చూసే మంచి సెంటిమెంట్‌తో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు ఫెస్టివల్ ఫీస్ట్‌లా ఉంటుంది’’ అని చిత్రసమర్పకుడు ‘ఠాగూర్’ మధు తెలిపారు. విశాల్, కీర్తీ సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కాంబినేషన్లో ఈ చిత్రం రూపొందింది. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు 60 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్.ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2500 థియేటర్లలో విడుదలవుతోందని ‘పందెం కోడి–2’ యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. అప్పట్లో మీరా జాస్మిన్ చేసిన అల్లరి అమ్మాయి పాత్రను ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ చేయడం విశేషం. అలాగే వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందట. -
ఎక్కువ చిత్రాలు చేయాలనే ఉంది
‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ఇప్పటివరకూ చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. కానీ, ఎవరూ టచ్ చేయని పాయింట్‌తో మా సినిమా ఉంటుంది. ఆ పాయింట్‌ని ఈ యాంగిల్లో కూడా చూడొచ్చా! అనేలా స్టోరీని తీర్చిదిద్దారు. కథ విన్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశానో.. ఫైనల్ ఔట్పుట్ చూసినప్పుడూ అంతే ఎంజాయ్ చేశా’’ అని రామ్ అన్నారు. ఆయన హీరోగా అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా రేపు (గురువారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా రామ్ పంచుకున్న విశేషాలు... ∙ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో నాది సాఫ్ట్వేర్ ఇంజినీర్ పాత్ర. పల్లెటూరి నుంచి పట్నం వచ్చిన యువకుడిగా నటించాను. ∙త్రినాథరావు, రైటర్ ప్రసన్న మధ్య మంచి ర్యాపో ఉంది. త్రినాథరావు ఒక ప్రేక్షకుడిలా సీన్‌ని పరిశీలిస్తుంటారు. ప్రసన్న పాత్రల గురించి సెట్స్‌లో వివరిస్తూ ఉంటారు. ఒక సన్నివేశం చేసేటప్పుడు నేను, డైరెక్టర్, రైటర్ డిస్కస్ చేసుకున్న తర్వాతే షూట్‌కి వెళతాం. ∙త్రినాథరావు ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ మాస్ ఓరియంటెడ్. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్ని మిక్స్ చేసి తెరకెక్కించారు. ఆయన గత చిత్రాల్లో హీరోయిన్ తండ్రితో హీరో చాలెంజ్ చేసే స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలో అలా కాకుండా ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ∙సక్సెస్ కావాలని నేను సినిమాలు చేయను. ప్రతి సీన్ సక్సెస్ కావాలని అనుకుంటాను. అలాంటి సమ యాల్లో కథ వర్కవుట్ అయితే సక్సెస్ అవుతాయి. రిలీజ్ తర్వాత ఫలితాన్ని అనలైజ్ చేసుకుంటా. నా దగ్గరి వాళ్లతో డిస్కస్ చేస్తా. ∙ఈ సినిమా ప్రధానంగా ప్రకాష్‌రాజ్, అనుపమ పరమేశ్వరన్, నా మధ్యనే రన్ అవుతుంది. సన్నివేశాల పరంగానే కామెడీ ఉంటుంది. ఇందులోని మెయిన్ పాయింట్, డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉంటాయి. ∙ఓ హీరోగా ఎక్కువ సినిమాలు చేయాలని నాకూ ఉంది. అయితే నన్ను ఎగై్జట్ చేసే కథలు చాలా తక్కువగా దొరుకుతున్నాయి. మా పెదనాన్నగారు(‘స్రవంతి’ రవికిషోర్) కూడా కథలు వింటారు. నాకు ఏమాత్రం నచ్చుద్ది అని ఆయనకు అనిపించినా నన్ను కథ వినమంటారు. ∙దర్శకుడు ప్రవీణ్ సత్తారుగారితో కొన్ని కారణాల వల్ల సినిమా ముందుకెళ్ల లేదు. భవిష్యత్‌లో ఓ సినిమా చేస్తా. నా తర్వాతి ప్రాజెక్టు కోసం ప్రస్తుతం కథలు వింటున్నాను. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ∙‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రం తర్వాత ‘దిల్’ రాజుగారితో మరో సినిమా చేయాలనుకున్నా సరైన కథ కుదరలేదు. రాజుగారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా బాగా రావాలనే తపన ఉన్న వ్యక్తి. అందుకే సినిమా మేకింగ్‌లో బాగా ఇన్ వాల్వ్ అవుతారు. -
కుటుంబ సమేతంగా..‘హలో గురు..’
ఈ రోజుల్లో సెన్సార్‌బోర్డు నుంచి యు సర్టిఫికెట్‌ను పొందడం సాధారణ విషయం కాదు. చాలా మంది దర్శక, నిర్మాతలు యు/ఏ సర్టిఫికెట్ వస్తే చాలు అనుకునే పరిస్థితి. అలాంటిది సింగిల్ కట్ లేకుండా.. క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ అందుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సెన్సార్ క్లీన్ ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు ‘యూ’ సర్టిఫికెట్‌ను అందంచడంతో పాటు సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే మంచి కథా చిత్రం అంటూ కితాబు కూడా ఇచ్చారట. ‘ఉన్నది ఒకటే జిందగీ’ తర్వాత రామ్, అనుపమ పరమేశ్వరన్ మరోసారి ఈ మూవీ కోసం జోడి కట్టారు. ప్రకాష్ రాజ్, పోసాని ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘నేను శైలజ’చిత్రం తర్వాత భారీ హిట్ లేక సతమతమవుతున్న రామ్ ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ జోరుగా నిర్వహిస్తోంది. రీసెంట్గా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ‘శ్రీనివాస కళ్యాణం’ మూవీకి సెన్సార్ వాళ్లు ఒక కట్ చెప్పకుండా.. క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆయన మాటలే స్ఫూర్తి
‘‘జీవితంలో మనం చాలా చూస్తుంటాం. గెలుపు, ఓటములు సహజం. అది క్రీడల్లో అయినా, రాజకీయాల్లో అయినా. మా సినిమా వాళ్ల విషయానికి వస్తే సక్సెస్, ఫెయిల్యూర్స్ వచ్చినా సినిమా తీయాలనే ప్యాషన్‌తో ఇక్కడే ఉంటూ.. సక్సెస్ గురించి ట్రావెల్ అవుతుంటారు’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా ఈనెల 18న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ‘దిల్’రాజు మాట్లాడుతూ– ‘‘స్రవంతి’ రవికిషోర్‌గారు 30 ఏళ్లుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. 2002 ఫిబ్రవరి 16న ‘అమృత’ సినిమాని విడుదల చేయడానికి తీసుకున్నాం. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్‌గా నిన్ను చూస్తాను’ అని రవికిషోర్‌గారు అనడంతో సోప్ వేస్తున్నాడనుకున్నాను. ‘బొమ్మరిల్లు’ సక్సెస్‌మీట్‌లో ఆయన గుర్తు చేసే వరకు నాకు గుర్తుకులేదు. నాలో ఏం చూసి ఆయన ఆ మాట అన్నారో తెలియదు. ఇప్పుడు ఏ సినిమా అయినా సక్సెస్ కాకపోతే.. ‘సక్సెస్, ఫెయిల్యూర్ కామన్. మనం ముందుకెళుతుండాలి’ అని ఆయన చెప్పిన మాటలను నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. ఆయనకు థ్యాంక్స్. ప్రసన్న చెప్పిన కథలోని ఓ పాయింట్‌కి నేను, రామ్, దేవిశ్రీ ప్రసాద్, ప్రకాశ్‌రాజ్‌గారు కనెక్ట్ అయ్యాం. ఇది హిలేరియస్ మూవీ.. ఓ అద్భుతమైన పాయింట్‌ని సినిమాలో చూస్తారు’’ అన్నారు. ‘‘రాజుగారి లైఫ్‌లో ప్రేమకథలు ఉన్నాయో లేదో కానీ ప్రతి సినిమాను ఎంతగానో ప్రేమించేస్తారు. త్రినాథరావుగారితో పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే ఆయన ముందు ప్రేక్షకుడు, ఆ తర్వాతే డైరెక్టర్. ప్రకాశ్‌రాజ్‌గారితో పనిచేయడం గౌరవంగా ఉంటుంది’’ అన్నారు రామ్. ‘‘104 డిగ్రీల జ్వరం ఉన్నా రామ్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. రామ్, ప్రకాశ్‌రాజ్‌గారు పాటను చాలా చక్కగా పాడారు’’ అన్నారు త్రినాథరావు నక్కిన. ‘‘మా సినిమా పాటలను హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్. అనుపమా పరమేశ్వరన్, నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, పాటల రచయిత శ్రీమణి, నటుడు ప్రవీణ్, రచయిత ప్రసన్నకుమార్, సాయికృష్ణ పాల్గొన్నారు. -
‘హలో గురు ప్రేమ కోసమే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
దూసుకెళ్తోన్న ‘హలో గురు ప్రేమకోసమే’ ట్రైలర్
రామ్, అనుపమా పరమేశ్వరన్ మరో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యారు. ఉన్నదీ ఒకటే జిందగీ సినిమాతో తొలిసారి జోడి కట్టి ప్రేక్షకులను పలకరించారు. సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వీరి జోడి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. అందుకే వీరు మరో సినిమాతో వచ్చేందుకు సిద్దమయ్యారు. త్రినాథ్‌రావు నక్కిన డైరెక్షన్లో రాబోతోన్న హలో గురు ప్రేమకోసమే.. సినిమాలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్ మూడు మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలో సందడిచేయనుంది. 3 Million+ Views for #HGPKTrailer - https://t.co/Vk0iqBNfWI 💗💜💥#HelloGuruPremakosame Dussehra Shubhakankshalatho October 18th Release.#HGPKonOct18th@ramsayz @ThisIsDSP @anupamahere @pranitasubhash @VijayKesav Directed by Trinadha Rao Nakkina pic.twitter.com/tHuDnxT2sx — Sri Venkateswara Creations (@SVC_official) 11 October 2018 -
‘అబద్దాలు చెప్తే అమ్మాయిలు ఖచ్చితంగా పడతారు’
ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తరువాత ఎనర్జిటిక్ యంగ్ హీరో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా హలో గురూ ప్రేమకోసమే. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్న చిత్రయూనిట్ ఆడియోను కూడా డైరెక్ట్‌గా మార్కెట్లోకి విడుదల చేశారు. తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రామ్ ఎనర్జీ, అనుపమా, ప్రణీతల క్యూట్ పర్ఫామెన్స్తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమాలో ప్రకాష్రాజ్లు మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘హలో గురు ప్రేమ కోసమే’ మూవీ స్టిల్స్
-
హలో... పాటలొచ్చాయ్
రామ్ హీరోగా, అనుపమా పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాలోని పాటల్ని మార్కెట్లోకి విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘లవ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. టీజర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. రామ్, అనుపమ, ప్రణీతల కెమిస్ట్రీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది. మా బ్యానర్లో ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలకు సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికీ సంగీతం అందించారు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ నెల 10న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తాం. అక్టోబర్ 13న వైజాగ్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. దసరా సందర్భంగా ఈ నెల 18న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి. -
మారొచ్చు ట్రెండు!
నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘సాక్ష్యం’ సినిమాకు ఆయన వాయిర్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడాయన ‘హలో గురు ప్రేమకోసమే...’ సినిమా కోసం హీరో రామ్‌తో కలిసి పాట పాడారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ అనే పాటను కలిసి పాడారట రామ్ అండ్ ప్రకాశ్‌రాజ్. ఈ పాటను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
సింగర్‌గా మారిన ఎనర్జిటిక్ హీరో
ఈ జనరేషన్ యంగ్ హీరోలు కేవలం నటులుగా మిగిలిపోయేందుకు ఇష్టపడటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. చాలా మంది హీరోలు నిర్మాణ రంగంవైపు అడుగులు వేస్తుండగా అడపాదడపా గాయకులుగా మారి సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో యంగ్ హీరో కూడాచేరిపోయాడు. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం హలో గురు ప్రేమ కోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రామ్ గాయకుడిగా మారుతున్నాడట. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఇప్పటికే రామ్ ఆలపించిన పాటను రికార్డ్ కూడా చేశారు. దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ సినిమాను అక్టోబర్ 18న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘హలో గురు ప్రేమ కోసమే’ టీజర్ విడుదల
-
క్యూట్‌గా ‘హలో గురు ప్రేమ కోసమే’ టీజర్
ఎనర్జిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హలో గురు ప్రేమ కోసమే. రామ్‌కు జోడీగా మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేసిన మూవీ యూనిట్ టీజర్‌తోనూ అదరగొట్టేసింది. ‘చూశావా... నీ కోసమే కాఫీ..’ అంటూ అనుపమ వాయిస్‌తో మొదలై... రామ్ సమాధానంతో టీజర్ ముగుస్తుంది. వీరిద్దరి మధ్య సంభాషణలకు తోడు.. బ్యాక్‌గ్రౌండ్‌లో దేవి శ్రీ మ్యూజిక్ వింటుంటే.. పేరుకు తగ్గట్టుగానే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఫుల్ టూ రొమాంటిక్‌గా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. -
నేడే ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్
‘ఉన్నది ఒకటే జిందగి’ లాంటి సినిమా తరువాత మళ్లీ ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నాడు రామ్. ‘నేను లోకల్’ సినిమాతో హిట్ కొట్టిన త్రినాథరావు నక్కినతో కలిసి ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను పట్టాలెక్కించాడు. హలో గురు ప్రేమకోసమే.. అంటూ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించేలా చేశారు చిత్రబృందం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సోమవారం (సెప్టెంబర్ 17) సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. A lovely and romantic teaser of #HelloGuruPremaKosame will be released at tomorrow 5 PM.. 💖💞#HGPKonOct18th #HGPKTeaser @ramsayz @anupamahere pic.twitter.com/QSs7UZ5zJ7 — Sri Venkateswara Creations (@SVC_official) September 16, 2018 -
ప్రేమ ప్రదక్షణలు
ప్రేయసి కోసం ఓ కాలేజీ చుట్టూ ప్రేమ ప్రదక్షణలు చేస్తున్నారు హీరో రామ్. మరి... ఆయన ప్రేమ ఫలించడానికి ఈ ప్రదక్షణలు, వెయిటింగ్లు ఏ మాత్రం సాయం చేసాయన్నది సిల్వర్ స్క్రీన్‌పై తెలుస్తుంది. రామ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘హలో గురు ప్రేమకోసమే..’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుపమ పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సినిమాలో కీలకమైన కాలేజీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని నైట్ సీన్స్‌ను కూడా కెమెరాలో బంధిస్తున్నారు చిత్రబృందం. బావ–మరదళ్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా ఉంటుందట. రామ్ మామయ్య పాత్రలో ప్రకాశ్‌రాజ్ కనిపిస్తారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.