heros
-
బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల ఓపెనర్స్ (భారత హీరోలు) ఎంతమందో తెలుసా..?
-
Happy Friendship Day 2024: బెస్ట్ ఫ్రెండ్స్‌తో మన టాలీవుడ్ హీరోస్(ఫోటోలు)
-
ఈ హీరోల మల్టీ టాలెంట్ గురించి తెలుసా?
యాక్షన్ మాత్రమే కాదు.. కొందరు స్టార్స్‌లో డైరెక్షన్ చేసే టాలెంట్ కూడా ఉంటుంది. అయితే యాక్షన్ ఫ్రంట్ సీట్.. డైరెక్షన్ బ్యాక్ సీట్లో ఉంటుంది. అందుకే డైరెక్షన్‌కి గ్యాప్ ఇచ్చి, యాక్షన్‌కి మాత్రం నో గ్యాప్ అంటారు. అలా కొందరు హీరోలు డైరెక్షన్ సీట్‌కి చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ మెగాఫోన్ పట్టుకుని ‘స్టార్ట్ కెమెరా.. యాక్షన్’ అంటున్నారు. కొందరు స్టార్స్ ఇటు కెమెరా వెనకాల డైరెక్షన్ చేస్తూ అటు కెమెరా ముందు యాక్షన్ చేస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. ఆరేళ్లకు... కెరీర్లో 50వ సినిమా అంటే ఏ ఆర్టిస్టుకైనా ప్రత్యేకమే. కోలీవుడ్ హీరో ధనుష్ కూడా తన 50వ సినిమాని చాలా స్పెషల్ అనుకున్నారు. అందుకే తన హాఫ్ సెంచరీ సినిమాలో తానే నటిస్తూ, దర్శకత్వం కూడా వహిస్తున్నారు. హీరోగా దాదాపు 30 సినిమాల్లో నటించిన తర్వాత ‘పా. పాండి’ (2017) చిత్రం కోసం తొలిసారి దనుష్ దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. ధనుష్ నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి చెప్పుకోదగ్గ ఆదరణ లభించింది. దీంతో 2019లో దర్శకుడుగా ధనుష్ మరో మూవీని తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. అయితే ఈ ఏడాది జూలైలో తన దర్శకత్వంలోని రెండో చిత్రం సెట్స్‌పైకి వెళ్లినట్లుగా ధనుష్ వెల్లడించారు. ఇలా దాదాపు ఆరేళ్ల తర్వాత దర్శకుడిగా మరోసారి మెగాఫోన్ పట్టారు. ఇక నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ ఓ కీ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్, ఎస్జే సూర్య, విష్ణు విశాల్, వరలక్ష్మీ శర కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారని టాక్. ఏడేళ్ల తర్వాత... యాక్టర్‌గా తెలుగు ప్రేక్షకుల్లో కన్నడ స్టార్ ఉపేంద్రకు ఎంత పాపులారిటీ ఉందో, ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలకూ అంతే క్రేజ్ ఉంది. ‘ష్..! (1993)’, ‘ఓం (1995)’, ‘ఉపేంద్ర (1999)’ వంటి సినిమాల్లో నటించి, దర్శకత్వం వహించారు ఉపేంద్ర. కన్నడంలో ఆయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తెలుగులో అనువాదపై, ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే 2015లో వచ్చిన ‘ఉప్పి 2’ తర్వాత దర్శకుడిగా ఉపేంద్ర గ్యాప్ తీసుకున్నారు. ఏడేళ్ల తర్వాత 2022లో ‘యూఐ’ సినిమా వర్క్స్‌ను మొదలు పెట్టారు ఉపేంద్ర. ఆయన నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఉపేంద్ర అండ్ టీమ్ పేర్కొంది. కన్నడ, తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. పదేళ్లకు... కన్నడ స్టార్ హీరోల్లో ఒకరైన సుదీప్ దర్శకుడిగా ఆరు సినిమాలను తెరకెక్కించారు. కానీ ఈ ఆరూ రీమేక్ చిత్రాలే కావడం విశేషం. తమిళ ‘ఆటోగ్రాఫ్’ని కన్నడంలో ‘మై ఆటోగ్రాఫ్’ (2006)గా రీమేక్ చేసి, నటించారు సుదీప్. అలాగే దర్శకుడిగా తెలుగు హిట్ ఫిల్మ్ ‘మిర్చి (2013)’ కన్నడ రీమేక్ ‘మాణిక్య (2014)’లో టైటిల్ రోల్ చేసి, ఈ సినిమాకు దర్శకత్వం వహించారు సుదీప్. ఈ సినిమా తర్వాత సుదీప్ మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. మళ్లీ దశాబ్దం తర్వాత అంటే... 2024లో సుదీప్ నటించి, దర్శకత్వం వహించనున్న ‘కేకే’ (వర్కింగ్ టైటిల్) సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఆల్రెడీ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ‘దేవుడు క్షమిస్తాడు.. నేను కాదు...!’ అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ సినిమా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే కథతో సాగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దర్శకుడిగా ఇప్పటివరకూ రీమేక్ చిత్రాలే చేసిన సుదీప్.. ఈ ఏడవ సినిమాని స్ట్రయిట్ కథతో తీయనున్నారా లేక రీమేకా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ‘ఈగ’, ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రాలతో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. పుష్కర కాలం తర్వాత... ‘దిల్ చాహ్ తా హై’ (2001) చిత్రంతో రచయితగా, దర్శకుడిగా కెరీర్ ఆరంభించారు ఫర్హాన్ అక్తర్. ‘డాన్: ది చేజ్ బిగిన్స్’, ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రాలతో దర్శకుడిగా తనదైన పేరు సంపాదించారు. అయితే 2011లో వచ్చిన ‘డాన్ 2: ది కింగ్ ఈజ్ బ్యాక్’ చిత్రం తర్వాత నటుడిగా కాస్త బిజీ అయిన ఫర్హాన్ మరో సినిమాకు దర్శకత్వం వహించలేదు. పదేళ్ల తర్వాత 2021 ఆగస్టులో ‘జి లే జరా’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు ఫర్హాన్ వెల్లడించారు. ఆలియా భట్, ప్రియాంకా చోప్రా, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో తన డైరెక్షన్లోనే ‘డాన్ 3’ సినిమాను ప్రకటించారు ఫర్హాన్. అయితే ఈ సినిమాలో ఆయన నటించడం లేదు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించనున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇలా ఫర్హాన్ దర్శకత్వంలోని మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లడానికి పుష్కరకాలం అంటే పన్నెండేళ్లు పట్టిందని చెప్పొచ్చు. ‘డాన్ 3’ చిత్రం 2025లో విడుదల కానుంది. ఇలా కొంత విరామం తర్వాత దర్శకులుగా మెగాఫోన్ పట్టిన స్టార్స్ ఇంకొందరు ఉన్నారు. -
వీళ్లూ హీరోలే.. కానీ విలన్లగానూ మెప్పిస్తారు
కథను ముందుకు తీసుకెళతాడు కథానాయకుడు (హీరో). ఆ కథానాయకుడికి అడుగడుగునా అడ్డం పడుతుంటాడు ప్రతినాయకుడు (విలన్). హీరోగా ఒకరు, విలన్‌గా వేరొకరు నటిస్తుంటారు. అయితే నాయకులు అప్పుడప్పుడూ ప్రతినాయకులుగా కూడా నటిస్తుంటారు. ఇలా కొందరు కథానాయకులు ‘ప్రతినాయకులు’గా కనిపించడానికి రెడీ అయిన చిత్రాల గురించి తెలుసుకుందాం. మిషన్.. ప్రాజెక్ట్ కె రెండొందలకు పైగా సినిమాల్లో నటించి, ఏడు పదుల వయసు సమీపిస్తున్న తరుణంలో కూడా కెరీర్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కమల్‌హాసన్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్ 2’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు కమల్‌హాసన్. అలాగే దర్శకులు మణిరత్నం, హెచ్. వినోద్ కథల్లో కథానాయకుడిగా నటించేందుకు కమల్‌హాసన్ ఆల్రెడీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇలా హీరోగా వరుస ప్రాజెక్ట్స్‌ను ఆయన లైన్లో పెట్టారు. అయితే కథానాయకుడిగానే కాదు.. కథ నచ్చితే ఆ కథలోని కథానాయకుడికి ప్రతినాయకుడిగా సవాలు విసరడానికి రెడీ అయ్యారు కమల్. ప్రభాస్, దీపికా పదుకోన్ జంటగా అమితాబ్ బచ్చన్, దిశా పటానీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’లో నటించడానికి కమల్‌హాసన్ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కమల్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. అయితే ప్రతినాయకుడి పాత్రలు చేయడం కమల్‌హాసన్‌కు కొత్తేమీ కాదు. (ఇదీ చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) ‘ఇంద్రుడు–చంద్రుడు’ (కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్), ‘ఇండియన్’, ‘ఆళవందాన్’ (తెలుగులో ‘అభయ్’), ‘దశావతారం’ వంటి సినిమాల్లో ఆయన హీరోగా, విలన్‌గా నటించి మెప్పించారు. సో.. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ నెగటివ్ షేడ్ క్యారెక్టర్లో కమల్ కనిపించినట్లు అవుతుంది. మరి.. ‘ప్రాజెక్ట్ కె’లో కమల్ చేస్తున్నది నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టరేనా? అనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ వార్‌లో... నాయకుడి పాత్రైనా, ప్రతి నాయకుడి పాత్రైనా ఎన్టీఆర్ అవలీలగా చేసేస్తుంటారు. ‘జై లవకుశ’ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన జై, లవ, కుశ పాత్రల్లో జై విలన్ క్యారెక్టర్ అనే సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’లో చేసేందుకు ఎన్టీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన హిందీ హిట్ స్పై థ్రిల్లర్ ఫిల్మ్ ‘వార్’. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ ఈ ఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ‘వార్’లో హీరోగా నటించిన హృతిక్ రోషనే సీక్వెల్లోనూ హీరోగా నటించనున్నారు. కాగా.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్ చేయనున్నారు. ఎన్టీఆర్ పాత్రకు కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. స్పై థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తారు. ఆదిత్యా చోప్రా నిర్మించనున్నారు. మరోవైపు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యారు. రాక్షస రాజు హీరో, విలన్, గెస్ట్ రోల్.. ఇలా ఏ పాత్రలో అయినా రానా అదుర్స్. ‘బాహుబలి’ సినిమాలో భళ్లాలదేవుడు పాత్రలో అద్భుతంగా విలనిజమ్ పండించారు రానా. అలాగే ‘నేనే రాజు నేనే మంత్రి’లో హీరోగా నటించిన రానా క్యారెక్టర్లో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. ఈ సినిమాకు తేజ దర్శకుడు. కాగా రానా, తేజ కాంబినేషన్లోనే ‘రాక్షస రాజు’ అనే టైటిల్‌తో మరో సినిమా తెరకెక్కనుంది. గోపీనాథ్ ఆచంట నిర్మిస్తారు. టైటిల్‌ని బట్టి ఈ చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ టచ్ ఉంటుందని ఊహించవచ్చు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరోవైపు గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్ ‘హిరణ్య కశ్యప’, మిలింద్ రావు దర్శకత్వంలో ఓ సినిమాలో రానా హీరోగా నటిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలపై మరో అప్డేట్ రావాల్సి ఉంది. కొత్త ఇన్నింగ్స్ ఐదేళ్ల క్రితం వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తర్వాత హీరోగా వెండితెరపై కనిపించలేదు మంచు మనోజ్. ప్రస్తుతం ‘వాట్ ది ఫిష్’ చిత్రంలో మనోజ్ హీరోగా నటిస్తున్నారు. వరుణ్ కోరుకొండ దర్శకత్వంలో విశాల్, సూర్య బెజవాడ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్‌గా కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట మనోజ్. రవితేజ హీరోగా ‘కలర్‌ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని, ఇందులో విశ్వక్ సేన్ కీలక పాత్రలో, మంచు మనోజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించ నున్నారని టాక్. మరి.. ప్రతినాయకుడి పాత్ర పరంగా మంచు మనోజ్ కొత్త ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. లంకల రత్న? ‘సామాజిక నిబంధనలను ధిక్కరించే ప్రపంచంలో బ్లాక్ ఉండదు, వైట్ ఉండదు, గ్రే మాత్రమే ఉంటుంది’ అన్నది విశ్వక్ సేన్ తాజా చిత్రంలోని డైలాగ్. దీన్నిబట్టి ఈ చిత్రంలో విశ్వక్ క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఊహించవచ్చు. ఈ సినిమా స్టార్టింగ్ సమయంలో మాస్ కా దాస్ బ్యాడ్‌గా మారాడు అంటూ చిత్ర యూనిట్ నుంచి వినిపించింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని చీకటి సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ఇది. ఈ సినిమాకు ‘లంకల రత్న’ టైటిల్ అనుకుంటున్నారనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ ముగిసినట్లు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని రిమోట్ లొకేషన్స్‌లో చిత్రీకరించినట్లు శుక్రవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. కృష్ణచైతన్య దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్నారు విశ్వక్ సేన్. వీరే కాదు.. ఒకవైపు నాయకులుగా నటిస్తూ మరోవైపు ప్రతినాయకులుగానూ నటిస్తున్న హీరోలు ఇంకొందరు ఉన్నారు. -
ఇటీవల యాక్షన్ షూట్లో దెబ్బతిన్న హీరోస్ వీళ్లే..
స్క్రీన్‌పై విలన్లను హీరో రఫ్ఫాడిస్తుంటే ఫ్యాన్స్‌కి కిక్కో కిక్కు.. కానీ ఆ యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు స్టార్స్‌కి తగిలే గాయాలు ఒక్కోసారి ఆపరేషన్‌కి దారితీస్తాయి. ఇక ఇటీవల యాక్షన్ షూట్లో పరేషాన్ అయిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. టైగర్‌కి గాయం ఐదు కేజీల డంబెల్‌ని అమాంతంగా ఎత్తగలిగే సల్మాన్ ఖాన్‌కి ఇటీవల ఐదు కేజీల కన్నా తక్కువ బరువు ఉన్న వస్తువులు ఎత్తడం కష్టమైంది. దానికి కారణం ‘టైగర్ 3’ సినిమా. ఈ చిత్రం కోసం నెలన్నర క్రితం ఓ రిస్కీ యాక్షన్ సీన్ చేస్తుండగా సల్మాన్ గాయపడ్డారు. ‘‘ప్రపంచాన్నే మన భుజం మీద మోస్తున్న ఫీలింగ్‌లో ఉన్నప్పుడు.. ఆ ప్రపంచాన్ని వదలండి.. ఇప్పుడు కనీసం ఐదు కిలోల డంబెల్ ఎత్తడం కూడా కష్టమవుతోంది’’ అని భుజానికి అయిన గాయం తాలూకు నొప్పిని తగ్గించే పట్టీ వేయించుకుని ఉన్న ఫొటోను షేర్ చేశారు సల్మాన్. అంతే.. ‘టైగర్ (సల్మాన్‌ని ఉద్దేశించి)కి ఏమీ కాదు... తగ్గిపోతుంది’ అంటూ ఫ్యాన్స్ స్పందించారు. కింగ్ ఖాన్.. నోస్ సర్జరీ షారుక్ ఖాన్ని ఆయన ఫ్యాన్స్ కింగ్ ఖాన్ అని పిలుచుకుంటారు. ఈ కింగ్ ఖాన్ ఫ్యాన్స్‌కి కిక్ ఇవ్వడానికి రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ చిత్రం కోసం యాక్షన్ సీన్ చేస్తూ, గాయపడ్డారు షారుక్. ముక్కుకి బలమైన గాయం కావడంతో సర్జరీ జరిగిందనే వార్త మంగళవారం వెలుగులోకి వచ్చింది. అమెరికాలో శస్త్ర చికిత్స జరిగిన అనంతరం షారుక్ ముంబై చేరుకున్నారట. ‘‘రక్త స్రావం ఆగడానికి ముక్కుకి చిన్నపాటి శస్త్ర చికిత్స చేశాం. కంగారుపడాల్సిన అవసరంలేదు’’ అని షారుక్ వ్యక్తిగత సిబ్బందికి డాక్టర్లు తెలియజేశారని బాలీవుడ్ టాక్. విక్రమ్.. రిస్కీ పోరాటమ్ విలక్షణ పాత్రలకు చిరునామా విక్రమ్. తాజాగా విక్రమ్ ఓ కొత్త లుక్‌లో నటిస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రం కోసం రిస్కీ ఫైట్ షూట్లో పాల్గొనే ముందు విక్రమ్ రిహార్సల్స్ చేశారు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ఆయన పక్కటెముక విరిగింది. వెంటనే విక్రమ్‌ను ఆస్పత్రికి తరలించారు. రెండు నెలల క్రితం ఈ ప్రమాదం జరిగింది. కోలుకున్నాక ఆయన తిరిగి షూట్లో పాల్గొనడంతో సినిమా పూర్తయింది. పృథ్వీ.. మూడు నెలల విశ్రాంతి మలయాళ పరిశ్రమలో ఓ స్టార్ హీరోగా, దర్శకుడిగా దూసుకెళుతున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘విలయత్ బుద్ధ’. పది రోజుల క్రితం ఈ సినిమా కోసం ఒక యాక్షన్ సీన్‌ని ఆర్టీసీ బస్సులో చిత్రీకరిస్తున్నప్పుడు పృ«థ్వీరాజ్ కింద పడటంతో దెబ్బ తగిలింది. బలమైన గాయం కావడంతో కాలికి సర్జరీ చేయాలని వైద్యులు పేర్కొన్నారు. శస్త్ర చికిత్స అనంతరం దాదాపు మూడు నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని పృథ్వీరాజ్‌కి సూచించారు. వరుణ్.. మూడు వారాల విశ్రాంతి వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రం కోసం ఇటీవల ఓ ఫైట్ సీన్ తీస్తున్న సమయంలో గాయపడ్డారు వరుణ్ సందేశ్. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయం అయింది. దీంతో ఆయన్ని హాస్పిటల్‌కి తరలించారు. చికిత్స అనంతరం మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలంటూ వరుణ్‌కి సూచించారు వైద్యులు. వరుణ్ సందేశ్ గాయపడటంతో ‘ది కానిస్టేబుల్’ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది. -
టాలీవుడ్లో పెళ్లి కాని ప్రసాద్‌లు ఇంతమంది ఉన్నారా?
టాలీవుడ్లో ప్రస్తుతం పెళ్లి టాపిక్ ట్రెండింగ్‌లో ఉంది. దీంతో ఇంకా 30 ఏళ్ల వయసు వచ్చినా.. పెళ్లి ఊసెత్తని హీరోలు ఎవరెవరు ఉన్నారో అని ఫ్యాన్స్ లెక్కలు వేసుకుంటున్నారు. ఈ మధ్యే ఈ జాబితా నుంచి వైదొలిగాడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ శర్వానంద్. జూన్ 3న శర్వానంద్ రక్షితారెడ్డిని వివాహమాడారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఇంతలోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం నేడు(జూన్ 9న) జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. (ఇదీ చదవండి: టాలీవుడ్లో ప్రేమ పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు వీళ్లే!) అయితే పెళ్లి ఆలోచన లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న బడా హీరోలు మాత్రం చాలా మందే ఉన్నారు. టాలీవుడ్లో బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్.. ఇప్పుడున్న యంగ్ హీరోలతో పోలిస్తే ప్రభాస్ వయస్సు అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. ప్రభాస్ పెళ్లి మీద రోజుకో వార్త పుట్టుకొచ్చినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి మోస్ట్ వాంటెడ్ బ్యాచ్‌లర్‌గా మిగిలిపోయాడు. చివరకు ప్రభాస్ పెళ్లి తర్వాతే తన పెళ్లి అని చెప్పిన శర్వానంద్ కూడా ఓ ఇంటివాడు అయిపోయాడు. దీంతో ‘ఆదిపురుష్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లో పెళ్లి గురించి అభిమానుల అరుపులకు సమాధానమిస్తూ.. ఎప్పుడైనా ఇక్కడే తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ హామీ ఇచ్చాడు. కానీ ఆ శుభాకార్యం ఎప్పుడనేది మాత్రం చెప్పలేదు. ఇక ఇదే వరుసలో మరో హీరో సాయిధరమ్ తేజ్ ఉన్నాడు. తన చిన్న వయసు వారంతా పెళ్లి చేసుకుంటున్న ఈ రోజుల్లో తేజ్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది. టాలీవుడ్లో మరో మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరకాలం దాటుతున్న పెళ్లికి మాత్రం సై అనడం లేదు. ఇదే లిస్ట్‌లో విజయ్ దేవరకొండ, అడవి శేష్, బెల్లం కొండ శ్రీనివాస్, సిద్ధార్థ్, అల్లు శిరిష్, తరుణ్ ఇలా బ్యాచ్లర్ల లిస్ట్ పెద్దదిగానే ఉంది. ఎంతోమంది హీరోలు.. పెళ్లయ్యాక కూడా సక్సెస్ అయ్యారు. మరి ఈ హీరోలు మాత్రం పెళ్లి విషయాన్నే మర్చిపోయి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. ఈ హీరోలంతా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాళ్లయితే చూద్దామని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న కమెడియన్ కెవ్వు కార్తీక్) ---- పోడూరి నాగ ఆంజనేయులు -
బాలాసోర్ రియల్ హీరోలు
ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఎక్కడో దూరాన ఉంటూ, ఈ వార్త విని తల్లడిల్లిపోతున్నవారి సంగతి అలా ఉంచితే, అక్కడే ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నవారి మనోభావాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడం ఎవరికైనా కష్టమే. రైలు ప్రమాద క్షతగాత్రులకు సహాయం అందించేందుకు సంఘటనా స్థలానికి చేరుకున్న యువకులు మీడియాతో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో తాము ఎక్కడ కాలు మోపినా మాంసపు ముద్దలు, తెగిపడిన అవయవాలు కనిపిస్తున్నాయన్నారు. కొందరు క్షతగాత్రులు తమ ప్రాణాలు కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి అరుపులు విన్నవెంటనే తాము పరిగెత్తుకుంటూ వెళ్లి బాధితులకు సాయం అందిస్తున్నామన్నారు. అలాగే కొన్ని వందల మృతదేహాలను వెలికితీశామన్నారు. బాధితులు వీరిని రియల్ హీరోలుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి రియల్ హీరోలలో ఒకరైన 38 ఏళ్ల తుకన్ దాస్ మాట్లాడుతూ తాను ఇక్కడకు ఒక మందిరం నిర్మాణ పనుల నిమిత్తం వచ్చానని, రైలు ప్రమాదం జరిగిందని తెలియగానే పరిగెత్తుకుంటూ వచ్చి సహాయ చర్యల్లో పాల్గొంటున్నానని తెలిపారు. తాను ఒక బోగీలోకి దూరి వెళ్లి చూడగా.. 60 మృతదేహాలు కనిపించాయని, అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారని అన్నారు. వెంటనే తాను వీలైనంతమందికి సాయం అందించానని తెలిపారు. ఇదేవిధంగా స్థానికంగా ఉంటున్న కొందరు యువకులు రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ముందుకు వచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతూ తాము 150కిపైగా మృతదేహాలను బయటకు తెచ్చామన్నారు. అలాగే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా బాలాసోర్‌లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకూ 288 మంది మరణించారు. సంఘటనా స్థలంలో సహాయక కార్యకలాపలు కొనసాగుతున్నాయి. -
కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సిస్టర్ ఆఫ్ శంకర్ కమర్షియల్ మూవీస్‌లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్‌లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. తొలి అడుగు ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్‌లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. డాటర్ ఆఫ్ భగవత్ అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్. కేరాఫ్ జైలర్ టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది. వెల్కమ్ టు టాలీవుడ్ వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్‌కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది. వీరే కాదు... కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు. -
8 సినిమాలు లైన్లో ఉన్నాయి ఏహీరో తో డైరెక్షన్ చేస్తానుఅంటే..!
-
త్రివిక్రమ్ పై మండిపడుతున్న చిరు, వెంకటేష్ ఫాన్స్ ..
-
సింగం సిరీస్ లో..సూర్య,అజయ్ దేవగన్
-
1500 మందితో మాస్ ఫైట్..పూనకాలు తెపిస్తున్న చరణ్,రామ్ లు
-
టాలీవుడ్ విలన్లుగా మారుతున్న బాలీవుడ్ హీరోలు
-
హాలీవుడ్ రేంజ్ స్పై సినిమాలపై హీరోల ఇంట్రెస్ట్
-
హీరోయిన్స్‌గా రఫ్ఫాడించిన హీరోల కూతుర్లు వీళ్లే.. (ఫొటోలు)
-
తెలుగు డైరెక్టర్స్ కి తమిళ హీరోలు ఎందుకు క్యూ కడుతున్నారో తెలుసా ..?
-
బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ ను దాటేస్తున్న టాలీవుడ్ హీరోలు
-
హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్న వారసులు
-
రొమాంటిక్ సీన్స్‌లో హీరోల ప్రవర్తన అలా ఉంటుంది: తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినపడల్లా స్పెషల్ సాంగ్స్‌తో అలరిస్తోంది. రీసెంట్గా గుర్తుందా శీతాకాలం మూవీతో అలరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్లో వరుస చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రీసెంట్గా తమన్నా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటింది. ఈ సందర్భంగా రొమాంటిక్ సీన్లతో హీరోల బిహెవియర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రొమాంటిక్ సీన్స్ చేసేటప్పుడు హీరోలు బాగా ఎంజాయ్ చేస్తారని అందరు అనుకుంటారు. కానీ అది తప్పు. చాలామంది హీరోలు ఈ సీన్స్ చేసేందుకు ఇష్టపడరు. షూటింగ్ సమయంలో హీరోయిన్లు ఏం అనుకుంటారోనని చాలా టెన్షన్ పడుతుంటారు. ముఖ్యంగా మోహమాటం ఎక్కువగా ఉన్న హీరోలు, స్టార్ హీరోలు అయితే ఈ సీన్స్ చేసేటప్పుడు కనీసం మాట్లాడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. మూవీ షూటింగ్ మొత్తంలో హీరోలు ఇబ్బంది పడేది సన్నిహిత సీన్లలోనే. అసలు చాలామంది హీరోలు.. హీరోయిన్లతో క్లోజ్‌గా ఉండే సన్నివేశాలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా తమన్నా ప్రస్తుతం తెలుగులో చిరంజీవి భోళా శంకర్ మూవీతో బిజీగా ఉంది. చదవండి: సూర్య ఇన్ని పాత్రల్లో నటిస్తున్నారా?.. ఇది పెద్ద రికార్డే..! ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.. -
టాప్ హీరోల మాస్బొమ్మలపై ఓ లుక్కేద్దాం ..!
-
తెలుగులో కొత్త కథలు లేవా..? పరభాష చిత్రాలనే అరువు తెచ్చుకోవాలా..?
-
షూటింగ్ సంక్షోభం.. దిగొచ్చిన అగ్ర హీరోలు.. చిరు లేఖ
టాలీవుడ్ నిర్మాతల చర్చలు ఫలిస్తున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సంక్షోభంలో భాగంగా పలువురు అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో బడ్జెట్ సంక్షోభం నెలకొంది. సినిమాల బడ్జెట్, టికెట్ ధరలపై మంగళవారం కీలక భేటీ అయిన ప్రొడ్యుసర్స్ గిల్డ్ సినిమా షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా నిర్మాణల బడ్జెట్ వ్యయం, హీరోల రెమ్యునరేషన్ అంశాలు ఓ కొలిక్కి వచ్చేంత వరకు తాత్కాలికంగా షూటింగ్ నిలివేస్తున్నట్లు నిన్న నిర్మాతల గిల్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. చదవండి: Tollywood: టాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం, కొత్త నిబంధనలివే! దీంతో షూటింగ్ దశలో ఉన్న పెద్ద హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల షూటింగ్ నిలిచిపోయే పరిస్థితి నెలకొనడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఇదే ఇదే అంశంపై పలువురు టాలీవుడ్ అగ్ర హీరోలతో ఆయన సమావేశమైనట్లు సమాచారం. నీ సందర్భంగా స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటామని దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మిగతా హీరోలతో కూడా ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని ప్రొడ్యుసర్స్ గిల్డ్ తెలిపింది. షూటింగ్ సంక్షోభంపై నిర్మాతల గిల్డ్‌కు చిరంజీవి లేఖ రాసినట్లు సమాచారం అందింది. ఇక దీనిపై ఈ రోజు మధ్యాహ్నం నిర్మాతలు భేటీకి సిద్ధం అవుతున్నట్లు కూడా తెలుస్తోంది. చదవండి: ఫ్యాన్స్‌కి షాక్.. ఏడాదికే బ్రేకప్ చెప్పుకున్న ‘బిగ్‌బాస్’ జోడీ -
టాలీవుడ్లో ఎన్టీఆర్, సమంత టాప్..
Jr NTR Samantha Tollywood Most Popular Actors As Per Ormax Media 2022: వివిధ సినీ ఇండస్ట్రీల్లో మోస్ట్ పాపులర్ నటులు ఎవరనే విషయంలో ప్రముఖ మీడియా కన్సల్టింగ్ సంస్థ 'ఓర్మాక్స్ మీడియా' (Ormax Media) ఒక సర్వే నిర్వహించింది. అందులో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో మోస్ట్ పాపులర్, ఇష్టమైన హీరోలు, హీరోయిన్లు ఎవరు అనే టాప్ 10 జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి మోస్ట్ పాపులర్ నటుడిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, నటిగా స్టార్ హీరోయిన్ సమంత టాప్ 1 స్థానంలో నిలిచారు. తారక్ తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు, పవన్ కల్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే.. సామ్ తర్వాత కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, తమన్నా, కీర్తి సురేశ్, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా ఉన్నారు. వీరితోపాటు బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ హీరోగా అక్షయ్ కుమార్ మొదటి స్థానంలో నిలిచారు. తర్వాత షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఉండగా చివరగా 10వ స్థానంలో వరుణ్ ధావన్ ఉన్నాడు. మోస్ట్ పాపులర్ హిందీ హీరోయిన్గా అలియా భట్ నిలిచింది. తర్వాత దీపికా పదుకొణె, కత్రీనా కైఫ్, కృతి సనన్ ఉండగా, చివరిగా అనుష్క శర్మ చోటు దక్కించుకుంది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/wxyhPygor6 — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular female Telugu film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZWDBHowzxE — Ormax Media (@OrmaxMedia) May 15, 2022 Ormax Stars India Loves: Most popular male Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/NgFZDHnbcw — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 Ormax Stars India Loves: Most popular female Hindi film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/OwerlKLNgo — Ormax Media (@OrmaxMedia) May 12, 2022 తమిళంలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా ఫస్ట్ ప్లేస్‌లో నయన తార నిలిచింది. తర్వాత సమంత, కీర్తి సురేశ్, త్రిశ, జ్యోతిక, ప్రియాంక మోహన్, తమన్నా, రష్మిక మందన్నా, అనుష్క శెట్టి, హంసిక ఉన్నారు. ఆరో స్థానంలో నిలిచిన ప్రియాంక మోహన్‌ను ఆల్‌టైమ్ హైయెస్ట్ ర్యాంక్‌గా ప్రకటించింది ఓర్మాక్స్ మీడియా. ఇక హీరోల విషయానికొస్తే మొదటి స్థానంలో విజయ్ ఉండగా తర్వాత అజిత్, సూర్య, విజయ్ సేతుపతి, ధనుష్, శివకార్తికేయన్, రజినీ కాంత్, విక్రమ్, కమల్ హాసన్, శింబు నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/irsBaQz6K2 — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 All-time highest rank: Priyanka Mohan takes the no. 6 position, her best-ever rank on Ormax Stars India Loves #OrmaxSIL pic.twitter.com/DbTr9eQgIK — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 Ormax Stars India Loves: Most popular male Tamil film stars (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/ZBwaSywyLB — Ormax Media (@OrmaxMedia) May 14, 2022 హాలీవుడ్ హీరోయిన్లలో స్కార్లెట్ జాన్సన్, ఏంజిలీనా జోలీ, ఎమ్మా వాట్సన్, జెన్నిఫర్ లారెన్స్, గాల్ గాడోట్, ఎమ్మా స్టోన్, కేట్ విన్స్లెట్, ఎలిజబెత్ ఓల్సెన్, జెండయా, నటాలీ పోర్ట్మన్ వరుసగా ఉన్నారు. హీరోలలో టాప్ 1 ప్లేస్‌లో టామ్ క్రూజ్ ఉండగా, తర్వాతి స్థానాల్లో రాబర్ట్ డౌనీ జూనియర్, డ్వేన్ జాన్సన్, విల్ స్మిత్, టామ్ హోలాండ్, లియనార్డో డికాఫ్రియో, క్రిస్ హెమ్స్వోర్త్, విన్ డీసిల్, క్రిస్ ఇవాన్స్, జానీ డెప్ నిలిచారు. Ormax Stars India Loves: Most popular female Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/7SZQM9GxKE — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 Ormax Stars India Loves: Most popular male Hollywood film stars in India (Apr 2022) #OrmaxSIL pic.twitter.com/zxScetz4bj — Ormax Media (@OrmaxMedia) May 13, 2022 -
సినీ హీరోలు తీరు మార్చుకోవాలి
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): సినీ హీరోలు తీరు మార్చుకోవాలని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హితవు పలికారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో అభివృద్ధి కార్యక్రమాలకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. ఇది పేద ప్రజలకు మంచిది. పేద వాడికి కాసేపు వినోదాన్ని అందించేది సినిమా. అలాంటి సినిమా విషయంలో భారీగా ఉన్న టికెట్ ధరలను తగ్గించి ప్రజలకు మేలు చేశాం. సినీ హీరోలు ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు. వారంతా చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ పేద ప్రజలకు అన్యాయం చేయడం దారుణం. సినిమా ఇండస్ట్రీలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్న దృష్ట్యా సినిమా వారికి మేలు చేసేలా, పేదలకు అన్యాయం చేసేలా చంద్రబాబు మాట్లాడటం తగదు. అసలు సినిమా హీరోలకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయం కూడా తెలియకుండా ఉన్నారు’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు రాజీనామా చేసి ఎన్నికకు రావాలి కాబోయే ముఖ్యమంత్రిని తానేనని చంద్రబాబు కలలు కంటున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయనకు అంత నమ్మకమే ఉంటే చంద్రబాబు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని తానేనని, అందరి పేర్లు రాసి పెట్టుకుని అందరి కథ చెబుతానని పోలీస్‌లను కూడా హెచ్చరించడం దారుణమని పేర్కొన్నారు. ఇటీవల కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో 70 శాతం వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారని, మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకున్నారని గుర్తు చేశారు. ఎప్పుడో రెండున్నర సంవత్సరాల తరువాత జరిగే ఎన్నికల కంటే ఇప్పుడు చంద్రబాబు రాజీనామా చేసి ఎన్నికకు వస్తే సత్తా చూపుతామని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని, ఆయన జీవితంలో ఇక ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. పవన్ కల్యాణ్‌తో పొత్తుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని, ఎందరితో పొత్తు పెట్టుకున్నా ఆయన గెలుపు అసాధ్యమని స్పష్టం చేశారు. -
టాలీవుడ్‌కి పరిచయం అవుతున్న పరభాషా హీరోలు
టాలీవుడ్‌ది పెద్ద మనస్సు... ఎంతమంది వచ్చినా ఎస్సు అంటుంది. మామూలుగా పరభాషా నాయికలు, విలన్లు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు పరభాషా హీరోలు ఇక్కడ హీరోలుగా పరిచయం కానున్నారు. అంతేనా... పరభాషలో హీరోలుగా దూసుకెళుతున్నవాళ్లు ఇక్కడ సహాయనటులుగా, విలన్లుగా పరిచయం కానున్నారు. ‘రారండోయ్ పరిచయం చేస్తాం’ అంటూ అందరికీ అవకాశం ఇస్తోంది టాలీవుడ్. ఈ పరిచయాలు పెరగడానికి ఓ కారణం పాన్ ఇండియన్ సినిమాలు. ఏది ఏమైనా ఇతర భాషల్లో లేనంతగా తెలుగులో పరభాషలవారికి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ స్టార్స్ గురించి తెలుసుకుందాం. తమిళ స్టార్ హీరో విజయ్ చేసిన ‘మాస్టర్’, ‘బిగిల్’, ‘సర్కారు’, ‘మెర్సెల్’ వంటి చిత్రాలు తెలుగులో అనువాదమై, మంచి వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ చేయనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రూపొందనుంది. మరో తమిళ స్టార్ ధనుష్ అయితే ఒకేసారి రెండు తెలుగు సినిమాలు కమిట్ కావడం విశేషం. శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి దర్శకత్వాల్లో ఆయన సినిమాలు చేయనున్నారు. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందనున్న ‘సర్’ (తమిళంలో ‘వాతి’) సినిమా షూటింగ్ ఈ నెల 5న ప్రారంభం కానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయాల్సిన సినిమా షూటింగ్ మార్చిలో ఆరంభమవుతుందట. ఇక తమిళంలో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకుని, హీరోగా మారిన శివకార్తికేయన్ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రానికి ఇటీవలే సైన్ చేశారు. ‘జాతిరత్నాలు’ వంటి మంచి హిట్ ఇచ్చిన కేవీ అనుదీప్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే సంగీతదర్శకుడిగా, ఎడిటర్‌గా నిరూపించుకుని, హీరోగా చేస్తున్న విజయ్ ఆంటోని ఇప్పటివరకూ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు తెరపై కనిపించారు. ఇప్పుడు తెలుగులో స్ట్రయిట్ సినిమా ఒప్పుకున్నారు. అయితే సోలో హీరోగా కాదు.. మరో హీరోతో కలిసి ‘జ్వాల’లో నటిస్తున్నారు. ఆ మరో నటుడు ఎవరంటే.. ‘బ్రూస్లీ’, ‘సాహో’ చిత్రాల్లో ఓ రోల్ చేసిన అరుణ్ విజయ్ అన్నమాట. ఈ ఇద్దరూ హీరోలుగా ‘జ్వాల’ (తమిళంలో ‘అగ్ని సిరగుగళ్’ టైటిల్) చేస్తున్నారు. ఈ చిత్రానికి నవీన్ దర్శకుడు. అటు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌కి ఎంత పాపులారిటీ ఉందో తెలిసిందే. కీర్తీ సురేష్ చేసిన ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేశన్ పాత్రలో ఆకట్టుకున్నారు దుల్కర్. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దుల్కర్‌కు హీరోగా తెలుగులో తొలి చిత్రం. ఇక టాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు మరో మలయాళ నటుడు దేవ్ మోహన్. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత టైటిల్ రోల్లో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’లో దేవ్ మోహన్ మెయిన్ లీడ్‌గా చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు తెలుగుకి పరిచయం కావడానికి రెడీ అవుతున్నారు. అక్కడ హీరోలు... ఇక్కడ క్యారెక్టర్లు! మాతృభాషలో హీరోలుగా చేస్తూ హీరోలుగానే తెలుగులో పరిచయమవుతున్న వారు కొందరైతే... పరభాష హీరోలు కొందరు ఇక్కడ కీలక పాత్రలు చేస్తుండడం విశేషం. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘గాడ్ ఫాదర్’ చిత్రంలో సల్మాన్ ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. అలాగే చిరంజీవి హీరోగా బాబీ తెరకెక్కిస్తున్న చిత్రంలో నవాజుద్దిన్ సిద్ధిఖీ ఓ పాత్ర చేయనున్నారనే ప్రచారం జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇక ప్రభాస్ హీరోగా చేసిన మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’. ఈ చిత్రంలో రాముడి పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా, రావణుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ చేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రధానంగా తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. సో.. ‘ఆదిపురుష్’ సినిమాయే సైఫ్‌కి తొలి తెలుగు చిత్రం. ఈ చిత్రంలోని లక్ష్మణుడి పాత్రను సన్నీ సింగ్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఓ రోల్ చేశారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. ఇక జూనియర్ ఆర్టిస్టు నుంచి మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న కన్నడ నటుడు దునియా విజయ్ టాలీవుడ్‌కు వస్తున్నారు. బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దునియా విజయ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. మరో కన్నడ యాక్టర్ ధనుంజయ ‘పుష్ప’ చిత్రంతో, వశిష్ట సింహా ‘నయీం డైరీస్’తో వచ్చారు. మరోవైపు ఇటీవల విడుదలైన ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో విలన్‌గా చేసి, తెలుగు ప్రేక్షకులకు స్ట్రయిట్‌గా హాయ్ చెప్పారు మలయాళ హీరో ఫాహద్ ఫాజిల్. వీరితోపాటు మరికొందరు పరభాషా నటులు స్ట్రయిట్ తెలుగు సినిమాలు చేస్తున్నారు. ఆల్రెడీ తెలుగు సినిమాల్లో కనిపించిన అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, వరుణ్ తేజ్ ‘గని’లో సునీల్ శెట్టి, రవితేజ ‘ఖిలాడి’లో ఉన్ని ముకుందన్ తదితరులు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నారు.