high price
-
పెంట్ హౌస్ రూ.1,133కోట్లు!
వామ్మో అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా నిజం. దుబాయ్‌లో అత్యంత ఖరీదైన పామ్ జుమెరియా ప్రాంతంలో కడుతున్న కోమో రెసిడెన్సెస్ అనే 71 అంతస్తుల ఆకాశహర్మ్యంపై ఈ పెంట్ హౌస్ రానుంది. ఓ అజ్ఞాత కుబేరుడు దీన్ని ఏకంగా రూ.1,133 కోట్లకు కొనుక్కున్నాడు! ఈ ఐదు పడకగదుల పెంట్ హౌస్ విస్తీర్ణం 22 వేల చదరపు అడుగులు. ప్రపంచ రియల్టీ మార్కెట్లో అత్యంత ఎక్కువ ధర పలికిన మూడో పెంట్ హౌస్‌గా ఇది కొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వరకూ అయితే దీనిదే రికార్డు. 2027లో కోమో టవర్ నిర్మాణం పూర్తయ్యాక ఇది కొనుగోలుదారుకు అందుబాటులోకి రానుంది! అతని వివరాలను రహస్యంగా ఉంచినట్లు నిర్మాణ భాగస్వామి ప్రావిడెంట్ ఎస్టేట్ పేర్కొంది. అయితే ‘‘ఆ కుబేరుడు తూర్పు యూరప్ ప్రాంతానికి చెందిన వ్యక్తి’’ అని ప్రావిడెంట్ ఎస్టేట్‌కు అసోసియేట్ పార్ట్నర్ అయిన శామ్ హొరానీ వెల్లడించారు. రియల్టీ స్వర్గధామమైన దుబాయ్‌లో అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు, పెంట్ హౌస్‌ల ధరలు చుక్కలనంటడం ఇది తొలిసారేమీ కాదు. కొద్ది నెలల క్రితం మర్సా అల్ అరబ్ హోటల్ పెంట్ హౌస్ ఏకంగా రూ.956 కోట్లకు అమ్ముడైంది. ప్రత్యేకతలెన్నో... ఎన్నెన్నో ప్రత్యేకతలు కోమో రెసిడెన్స్ పెంట్ హౌస్ సొంతం ► ఇందులో 360 డిగ్రీల స్కై పూల్ ఉంటుంది. ►ఇది వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకమైన చోట రానుంది. ►దీనిపై నుంచి ఇటు చూస్తే ప్రపంచంలోకెల్లా ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా, అటు చూస్తే దానికి సాటి వచ్చే బుర్గ్ అల్ అరబ్, దుబాయ్ మరీనా వంటి ఆకాశాన్నంటే నిర్మాణాలెన్నో కను విందు చేస్తాయి. ►కోమో రెసిడెన్సెస్ టవర్ ఎత్తు 300 మీటర్ల (984 అడుగుల) పై చిలుకే. ►ఇంతా చేసి, ఈ అపార్ట్మెంట్లో ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకట్రెండు ఫ్లాట్లు మాత్రమే ఉంటాయి. ►రెండు నుంచి ఏడు పడకగదులతో కూడుకుని ఉండే ఈ ఫ్లాట్లకు ప్రైవేట్ లిఫ్టులు, ప్రైవేట్ శాండీ బీచ్‌లు, 25 మీటర్ల లాప్ పూల్స్, రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్ వంటి చాలా ప్రత్యేకతలుంటాయి. ►ఈ ఫ్లాట్ల ధర రూ.47.5 కోట్ల నుంచి మొదలవుతుంది. ప్రపంచ రికార్డు రూ.3,670 కోట్లు మొనాకోలోని ఓడియన్ టవర్ పెంట్ హౌస్ రూ.3,670 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెంట్ హౌస్‌గా రికార్డు సృష్టించింది. లండన్‌లోని వన్ హైడ్ పార్క్ పెంట్ హౌస్ రూ.1,975 కోట్లతో రెండో స్థానంలో ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బైకు తెచ్చిన భారీ లాభం.. పాత బైక్‌కు రూ.3 కోట్లు!
హాలీవుడ్ సినిమా ‘ఘోస్ట్ రైడర్’లో హీరో కంటే, ఆ హీరో నడిపిన మోటర్ బైక్ బాగా పాపులర్ అయింది. అలా సామాన్యులకు కూడా స్పోర్ట్స్ బైక్స్‌పై ఆసక్తిని పెంచింది ఆ సినిమా. అయితే, స్వతహాగానే చాలామంది అబ్బాయిలకు మోటర్‌బైక్స్, కారులంటే చాలా పిచ్చి. అలాంటి ఓ పిచ్చితోనే యూకేకు చెందిన వాకర్స్, 1973లోనే 150 పౌండ్లు (రూ. 16 వేలు) ఖర్చు పెట్టి 1931 నాటి రోల్స్‌రాయ్స్ కంపెనీ తయారు చేసిన ‘బ్రౌ సుపీరియర్ ఎస్ఎస్100’ మోడల్ బైక్ కొనుగోలు చేశాడు. ఈ మోటర్ బైక్ గరిష్ఠంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్‌బైక్. దాదాపు ఇరవై సంవత్సరాలు సంతోషంగా ఈ సూపర్‌బైక్‌ను నడిపిన వాకర్స్.. తర్వాత కారు కొని, బైకును మూడు దశాబ్దాలకుపైగా గ్యారేజ్‌కే పరిమితం చేశాడు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల కారణంగా తనకెంతో ఇష్టమైన ఈ సూపర్బైకును వేలానికి ఉంచడంతో కళ్లుచెదిరే ధర పలికింది. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ సూపర్‌బైక్‌ను 2.80 లక్షల పౌండ్లు (రూ.3 కోట్లు) చెల్లించి కొనుగోలు చేశాడు. అంటే రెండు వేల రెట్ల లాభం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యాభై ఏళ్ల తర్వాత కూడా ఈ మోటర్‌బైకు మంచి కండిషన్లోనే ఉండటం. ఇక వచ్చిన డబ్బును తన కాలి శస్త్రచికిత్సకు ఉపయోగిస్తానని వాకర్స్ చెప్పాడు. -
రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే. ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు.. ఈ సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులు నమోదవడంతో పేరు మార్చి.. హాంకాంగ్ కేంద్రంగా ఎంఎల్ఎం దందా చేస్తున్న క్యూ–నెట్‌పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్ ఖన్నా, ఉపేందర్‌రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. మూడు కోట్లు వసూలు చేసి.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ.. నిర్మల్‌లో ఇదే మేటి!
నిర్మల్ చైన్‌గేట్: ఇష్టమైన వాహనాలు కొనుగోలు చేసేందుకు రూ.లక్షలు, రూ.కోట్లు వెచ్చిస్తుంటారు. చాలామంది ఫ్యాన్సీ నంబర్ కోసం తెగ పోటీ పడుతుంటారు. ఎన్ని డబ్బులైనా వెచ్చించి సొంతం చేసుకుంటారు. నిర్మల్ రవాణా కార్యాలయంలో కూడా ఓ వాహనదారుడు ఫ్యాన్సీ నంబర్ కోసం గురువారం రూ.4.80 లక్షలు వేలంపాడి దక్కించుకున్నాడు. టీఎస్18–జీ 9999 ఫ్యాన్సీ నంబర్‌కు నిర్మల్ ఆర్టీవో అజయ్‌రెడ్డి సమక్షంలో ఆన్లైన్లో వేలం నిర్వహించారు. శ్రీపతి సంతోష్‌కుమార్ రూ.4,80,000కు దక్కించుకున్నాడు. జిల్లాలో ఫ్యాన్సీ నంబర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. అలాగే టీఎస్18–హెచ్ 0009 నంబర్‌ను వెంకట సత్యశ్రీధర్ వర్మ రూ.3,15,999కి దక్కించుకున్నాడు. టీఎస్18–హెచ్ 0001 నంబర్‌ను తడ్క నాగజ్యోతి రూ.2,02,000కు, 0002 నంబర్‌ను విజయ్ భాస్కర్‌రెడ్డి రూ.1,05,000కు, 0008ను కొంతం ప్రణయ్‌రెడ్డి రూ.12,124కు, 0007ను పూర్ణమ్మ రూ.55,678కు, 0004 ను తుంగెన ధర్మారావు రూ.16,434కు పొందారు. (క్లిక్: రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ) -
అమ్మో.. అరటిపండు.. డజన్ రూ.80 పైమాటే.. ఎందుకంటే?
కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): అమ్మో... అరటిపండు!.. ఆ మాటెత్తితే సామాన్యుడు ఉలిక్కిపడుతున్నాడు. మొన్నటివరకు సామాన్యుడి పండుగా పేరుగాంచిన అరటి ధర నేడు చుక్కలనంటుతోంది. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలు, పూజల్లో అరటి పండు ప్రధానపాత్ర వహిస్తోంది. విందు భోజనాల్లో ఎన్ని రకాలు వడ్డించినా చివరగా అరటిపండు లేకపోతే తృప్తిగా ఉండదంటారు. చదవండి: సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్ అలాంటి పండు ధర క్రమంగా రెండు నెలలుగా కొండెక్కి కూర్చొంది. డజన్ రూ. 20గా ఉన్న పండ్లు నేడు రూ. 80 లకు పైగా అమ్ముతున్నారు. కాస్త పెద్ద సైజు పండైతే రూ. 100 వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం వివాహ ముహూర్తాలు, శుభకార్యాలు లేకపోయినా అరటిపండ్ల ధర ఈ స్థాయిలో ఉంటే ఈనెల 29వ తేది నుంచి శ్రావణమాసం రావడం, నెలాఖరు వరకు వరుస ముహూర్తాలు ఉండడంతో మరింత ప్రియం అయ్యే అవకాశం ఉంది. ధర ‘పండు’తోంది ఏప్రిల్ వరకు డజన్ రూ. 20గా ఇంటింటికి తిరిగిన అరటిపండ్ల వ్యాపారులు మే నుంచి క్రమంగా కనుమరుగయ్యారు. కేవలం కడప నగరంలోనే 400కు పైగా ఉన్న అరటిపండ్లు విక్రయించే బండ్లు నేడు నాలుగో శాతానికి పడిపోయాయి. ముఖ్యంగా కూడళ్లలో అరటి పండ్ల వ్యాపారాలే అధికంగా కనిపించేవి. ప్రస్తుతం బండ్లు కిక్కిరేసి ఉండే పాత బస్టాండు లాంటి ప్రాంతంలో కూడా నాలుగైదుకు మించి అరటిపండ్ల బండ్లు కనిపించడం లేదు. కొనుగోలుదారుడు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా కూడా పండ్లలో నాణ్యత కనిపించదు. ఇంతకుమించి మంచి సరుకు రావడం లేదని, అసలు తోటల నుంచి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని, ఒకటి, రెండు మినహా సాగు, తోటలు తగ్గాయని విక్రయదారుడు పేర్కొంటున్నారు. ఈ పాతికేళ్లలో రూ.50కి మించి అరటిపండ్ల ధర లేదని, ఇప్పుడు ఒక్కసారిగా రూ. 80లుగా తిష్ట వేసుకుని కూర్చొవడం తమకు కూడా ఇబ్బందిగా ఉందని, రోజూ 200–400 డజన్ల పండ్లు అమ్మే తాము ఇప్పుడు 25 డజన్లు కూడా అమ్మలేక పోతున్నామని, అమ్ముదామన్నా బండి నిండుగా కూడా సరుకు లభించడం లేదని వాపోతున్నారు. వ్యాపారం మానేశాం ! గత 20 ఏళ్లుగా హౌసింగ్‌బోర్డు సెంటర్లో అరటిపండ్లను విక్రయిస్తున్నాను. ఒకటిన్నర నెలగా సరుకు లేక ఉన్నా...అంత ధర పెట్టి కొనేవారు రాకపోవడంతో ఈ వ్యాపారం మానేశాను. పరిస్థితి ఇంకా ఒకటి, రెండు నెలలు ఇలాగే కొనసాగితే అందరికీ కష్టమే. – విజయుడు, అరటిపండ్ల వ్యాపారి, కడప -
Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే?
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే తీరంలో ఈ నెల 5న ఓ కచ్చిడి చేపను రూ.4.30 లక్షలకు ఓ వ్యాపారి కొన్నాడు. నెల వ్యవధిలోనే మరో చేప అదే స్థాయిలో ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం -
ఈ చేప చాలా కాస్ట్లీ గురూ.. రేటు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..
సాక్షి, కవిటి(శ్రీకాకుళం జిల్లా): మత్స్యకారుడి వలకు చిక్కిన చేప అధిక ధరకు అమ్ముడుపోయింది. సీహెచ్ కపాసుకుద్ధి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైపల్లి తిరుపతిరావు సోమవారం సముద్రంలో వేటకు వెళ్లారు. ఈయన వేసిన వలకు సుమారు 15 కిలోల కచ్చిలి చేప చిక్కింది. దీన్ని వ్యాపారులు రూ.55 వేలకు కొనుగోలు చేశారు. దీంతో తిరుపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. అరుదుగా లభించే ఈ చేపలో ఎక్కువ పోషకాలు ఉంటాయి. చదవండి: నమ్మకస్తుడిగా ఉంటూ ఒంటరిగా ఉన్న యజమాని భార్యపై.. -
వింతైన ఇల్లు దీని ధర ఎంత తెలుసా?
మసాచుసెట్స్: ఎంత పెద్ద స్థలం అయినా మంచిగా అమ్ముడవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బాగా భూములు విలువ తెలిసిన వాళ్లు, రియల్ ఎస్టేట్ వాళ్లు మంచి రేటుకు క్రయ విక్రయాలు జరిపించగలరు. అయితే మసాచుసెట్స్‌లోని న్యూటన్ హైలాండ్స్‌లో ఉన్న అతి చిన్న ఇల్లు ఏకంగా రూ.2.3 కోట్లకు అమ్ముడైంది. అయితే ఈ ఇల్లు అంత ఎక్కువ రేటుకు ఎలా అమ్ముడైంది దీని ప్రత్యేకత ఏంటి అబ్బా అని ఆలోచిస్తూ తలలు పట్టుకోవద్దు చూద్దాం రండి! (చదవండి: అమ్మో ఎంత ధైర్యం.. సింహం తోక పట్టుకుని నడుస్తున్నావ్!) ఈ ఇల్లు కేవలం 250 చదరపు అడుగుల స్థలంలో స్టోర్ రూంలా ఉండే ఒక చిన్న అవుట్‌హౌస్. పైగా చుట్టూ గార్డెన్‌లా మొక్కలతో అందంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి ఇళ్లను ఎక్కువగా వ్యాయమశాల గానూ లేదా అవుట్ హౌస్లా వాడతారు. ఈ మేరకు ఈ ఇల్లు ఇంత అత్యధిక ధరకు అమ్ముడవ్వడానికీ గల కారణం అత్యధునిక టెక్నాలజీ అతి తక్కువ స్థలంలో నిర్మితమైన గృహం కావడం. అంతేకాదు గ్రానైట్ కౌంటర్టాప్తో కూడిన వంటగది, మంచి లైటింగ్ వచ్చేలా ఎలక్ట్రిక్ అప్గ్రేడ్లు ఉన్నాయి. పైగా అంత తక్కువ స్థలంలోనే అమరిపోయిలే చుట్టూరా గార్డెన్‌ని ఏర్పాటుచేసుకోనేంతా స్థలం ఉంది. అదీ కాక ఈ ఇల్లు బటన్స్ బోస్టన్లోని సంపన్న శివారు ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ఉన్న స్థలాలు ఎప్పుడూ అత్యధిక రేటులో ఉండటం వల్లే ఈ ఇల్లు అత్యధిక దరకు అ్మముడైంది. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) -
కశ్మీర్ మేక.. ధర కేక!
కురబలకోట: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లులో శనివారం జరిగిన గొర్రెల సంతలో కశ్మీర్ మేకపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరో వారంలో బక్రీద్ పండుగ రానుండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద సంఖ్యలో మేలు జాతి మేకలు, గొర్రెలు, పొట్టేళ్లు కొనేందుకు పోటీపడ్డారు. అయితే కశ్మీర్ మేకపోతులు ఒక్కోటి రూ.50 వేలపైన పలకడం విశేషం. -
ముర్రా దున్న @ రూ.15 లక్షలు
వేముల: గేదెల్లో ముర్రాజాతికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ జాతి దున్నలకు కూడా డిమాండ్ చాలా ఉంది. వైఎస్సార్ జిల్లా వేముల మండలంలోని కొండ్రెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు శిరిగిరెడ్డి అంకిరెడ్డి వద్ద ఉన్న ముర్రాజాతి దున్నపోతును కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. రూ. 15 లక్షలకు అమ్ముతానని ఆయన చెబుతున్నారు. ముర్రా జాతి దున్నలను కొనేందుకు డెయిరీలు నిర్వహించే వారు ఆసక్తి చూపుతారని, అందుకే ఆ దున్నకు అంత ధర పలుకుతోందని స్థానిక పశువైద్యాధికారి శ్రీవాణి తెలిపారు. చదవండి: వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస విద్యారంగం.. పురోగమనం -
వేలు కొరికిన వీడియో వైరల్.. వేలంలో 5.5 కోట్లకు సేల్
పసి పిల్లలు ఏం చేసినా చూడటానికి ముచ్చటగా, ముద్దుగానే ఉంటాయి. కొన్మి సందర్భాల్లో వాళ్ల అల్లరి మనకు కడుపుబ్బా నవ్వను కూడా తెప్పిస్తాయి. అందుకే కొందరు తల్లిదండ్రులు వాళ్ల పిల్లల చిలిపి మాటలను, అల్లరి పనులను వీడియో తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లల ఫన్నీ వీడియో వేలంలో భారీ మొత్తంలో అమ్ముడై అందరినీ ఆశ్చర్యపరిచింది. వేలంలో 5.5 కోట్లు పలికింది 2007లో యూట్యూబ్‌లో ‘చార్లీ బిట్ మై ఫింగర్’ అనే వీడియోను అపలోడ్ చేశారు. ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఇప్పటికే సుమారు 880 మిలియన్ వ్యూస్ పైగా రాబట్టింది. ఇటీవల నిర్వహించిన వేలంలో ఈ వీడియో ఏకంగా రూ.5.5 కోట్లకు అమ్ముడుపోవడం ఓ సంచలనంగా మారింది. ఈ వీడియోకు నాన్ ఫంజిబుల్ టోకెన్ పద్దతి (ఎన్ఎఫ్టి)లో వేలంపాట నిర్వహించగా 11 దేశాలకు చెందిన వ్యక్తులు పాల్గొన్నారు. ఎన్ఎఫ్టి ( నాన్ ఫంజిబల్ టోకన్స్ ) అంటే ప్రత్యేకమైన డిజిటల్ ఆస్తులని అర్థం. వీటిని బ్లాక్ చైన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఓ వ్యక్తి కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. వేలు కొరికాడు.. వైరల్‌గా మారింది ఈ వీడియోలో చార్లీ డేవిస్ కార్ అనే బుడ్డోడు.. తన అన్న హ్యారీ డేవిస్ కార్ సరదాగా వేలును కొరుకుతాడు. దాంతో మరోసారి నోట్లో వేలు పెట్టడంతో ఇంకా గట్టిగా కొరుకుతూ కాసేపు అలా నోట్లోనే ఉంచుతాడు. దీంతో కొరికిన బుడ్డోడు నవ్వులతో... కొరికించిన పెద్దోడు కన్నీళ్లతో మనకు కనిపిస్తారు. ఫన్నీ వీడియో అందరికీ తెగ నచ్చేసింది. కాగా ఇటీవల ఈ వీడియోను వేలంలో పెట్టగా, 5.5 కోట్లకు అమ్ముడు కావడంతో ప్రస్తుతం ఈ వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించారు. గతంలో ఇదే తరహాలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే మొట్టమొదటి ట్వీట్‌ను కూడా ఎన్ఎఫ్టి పద్ధతిలో 2.9 మిలియన్ డాలర్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘అవును.. తప్పు చేశా.. నేరం అంగీకరిస్తున్నా’ -
తెలుగు రాష్ట్రాల్లో ఇం‘ధన’హాసం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు ‘ఇంధనం’ ధరల్లో దేశంలోని మెట్రో నగరాల్లో సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. పెట్రోల్ ధరలో ఏపీ రాజధాని ‘అమరావతి’, డీజిల్ ధరలో తెలంగాణ రాజధాని ‘హైదరాబాద్’ టాప్‌లో ఉన్నాయి. డీజిల్ ధరలో అమరావతి, పెట్రోల్ ధరలో హైదరాబాద్ దేశంలో మూడో స్థానంలో ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాలతో పోలిస్తే పెట్రో ఉత్పత్తులపై పన్నుల మోత తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉంది. రోజువారీగా రెండు మూడు లీటర్లు వినియోగించే వారికి పెద్దగా భారం పడనప్పటికీ.. వందల లీటర్లు వినియోగించే వారికి మాత్రం ఆర్థికంగా భారంగానే ఉంది. దీంతో ఇంధనాన్ని భారీగా వినియోగించే వారు పన్ను తక్కువ ఉన్న ప్రాంతాల నుంచి బల్క్‌గా తెచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. పన్నుల వాత ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో దాదాపు సగానికి పైగా పన్నుల రూపంలోనే ఉన్నాయి. మొత్తం ధరల్లో పెట్రోల్‌పై 57 శాతం, డీజిల్‌పై 44 శాతం పన్ను పోటు పడుతోంది. ఇందులో పెట్రోల్, డీజీల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ భారం పడుతోంది. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కింద పెట్రోల్‌పై రూ.21.48, డీజిల్‌పై రూ.17.33 విధిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాట్ కింద పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్ 27 శాతం పన్నుగా వసూలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై 32 శాతం వ్యాట్ విధిస్తుండగా.. అదనంగా ప్రతి లీటర్‌పై రూ.2 వ్యాట్ కూడా వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25 శాతం పన్ను, ప్రతి లీటర్‌పై రూ.2 అదనపు వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రో, డీజీల్ ధరల దూకుడుకు కళ్లెం లేకుండా పోయింది. అదే పక్క రాష్ట్రాలైన కర్ణాటకలో పెట్రోల్‌పై 32 శాతం, డీజిల్‌పై 21 శాతం, తమిళనాడులో పెట్రోల్‌పై 34 శాతం, డీజిల్‌పై 25 శాతం పన్ను విధిస్తున్నారు. గత పదిరోజులుగా పెట్రో ఉత్పత్తుల ధరలు రోజు వారి సవరణతో దూకుడుగా ఉన్నాయి. -
పడిపోతున్న పసిడి డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : విశ్లేషకులు ఊహించినట్టుగానే బంగారం డిమాండ్ అంతకంతకూ క్షీణిస్తోంది. భారతదేశంలో పుత్తడి వినియోగంపై డబ్యూజీసీ(వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) తాజా నివేదికను మంగళవారం విడుదల చేసింది. బంగారం వినియోగంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద దేశం ఇండియాలో తాజాగా బంగారం డిమాండ్ మూడేళ్ల కనిష్ఠానికి పడిపోవచ్చని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. దేశీ మార్కెట్లో బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి పలు అంశాలను ఇందుకు కారణంగా పేర్కొంది. దేశంలో అత్యంత పవిత్రమైన రోజు ధంతెరాస్‌పై అమ్మకాలు కూడా గత నెలలో పడిపోయాయి, ఇది బలహీనమైన డిమాండ్‌ను మరింత సూచిస్తుందని తెలిపింది. పసిడి ధర కొత్త గరిష్ట స్థాయికి చేరడం, గ్రామీణ సెంటిమెంట్ బలహీనంగా ఉండటం వంటి అంశాలు పసిడి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం పీఆర్ తెలిపారు. ఇటీవల కాలంలో కురిసిన అధిక వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో బంగారం డిమాండ్ తగ్గొచ్చని అంచనా వేశారు. అలాగే ఈ ఏడాది బంగారం డిమాండ్ గతేడాదితో పోల్చుకుంటే 8 శాతం పడిపోయి 700 టన్నులకు చేరుకుందని, ఇది 2016 తర్వాత కనిష్ఠ స్థాయి అని డబ్యూజీసీ ఇండియా ఆపరేషన్ మేనేజింగ్ డైరక్టర్ సోమసుందరమ్ పీఆర్ అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో బంగారం వినియోగం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే భారీగా తగ్గి 123.9 టన్నులుగా నమోదైంది. ఇండియా మార్కెట్లో బంగారం ధరలు 2019లో అంతర్జాతీయంగా ఉన్న ధర కంటే 17 శాతం పెరిగాయి. డిమాండ్ మందగించడంతో బంగారం దిగుమతులు తగ్గాయని, ఇది ద్రవ్యలోటును తగ్గించి రూపీ బలపడడంలో సహాయపడిందని విశ్లేషకులు తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో బంగారానికి డిమాండ్ మూడొంతులలో రెండొంతులు గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తుంది. గత 25 ఏళ్ల కాలంలో జూన్-సెప్టెంబర్ సీజన్లో వానలు అధికంగా పడ్డాయి. ఇది అక్టోబర్‌లోనూ కొనసాగింది. ఫలితంగా సిద్ధంగా ఉన్న వేసవి కాల పంటలయిన పత్తి, సోయాబీన్, చిరుధాన్యలు నాశనమయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర జీవితకాల గరిష్ఠమైన రూ. 39,885 స్థాయికి చేరుకుంది. మొత్తంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దేశీయ కరెన్సీ రూపాయి క్షీణించడంతో ఈ ఏడాదిలో బంగారం ధరలు 22 శాతం మేర పెరిగాయి. దేశీయంగా బంగారం ధరలు పెరగడంతో పాటు, దిగుమతి సుంకాలు అధికంగా ఉండడంతో బంగారం డిమాండ్ జులై-సెప్టెంబర్‌లో తగ్గిందని డబ్యూజీసీ పేర్కొంది. ఈ ఏడాది జులై మొదటి వారంలో ఇండియా బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. జూలై-సెప్టెంబర్ కాలంలో123.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా. అంతకుముందు సంవత్సరం కంటే 32 శాతం క్షీణించింది. ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో వినియోగం 5.3 శాతం తగ్గి 496 టన్నులకు చేరుకుంది. జూలై-సెప్టెంబర్ కాలంలో నికర దిగుమతులు 66 శాతం క్షీణించి 80.5 టన్నులకు చేరుకున్నాయి. -
చాక్లెట్@:రూ.4.3 లక్షలు
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ ‘ఐటీసీ’.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చాక్లెట్‌ను తయారు చేసింది. ఈ కంపెనీకి చెందిన ఫాబెల్లె బ్రాండ్ ‘ట్రినిటీ – ట్రఫుల్స్ ఎక్స్‌ట్రార్డినేర్’ పేరిట చాక్లెట్‌ను రూపొందించగా.. దీని ఖరీదు కేజీ రూ. 4.3 లక్షలుగా ప్రకటించింది. ఇంతటి ఖరీదైన చాక్లెట్ మరొకటి లేనందున గిన్నిస్ బుక్‌లో ఈ లిమిటెడ్ ఎడిషన్ స్థానం సంపాదించినట్లు కంపెనీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. చేతిలో సరిపడే ఒక్కో చెక్క పెట్టెలో 15 ట్రఫుల్స్ ఉండగా.. సగటు బరువు దాదాపు 15 గ్రాములు ఉన్నట్లు తెలిపింది. ఈ విధంగా ఒక కిలో రేటును నిర్ణయించినట్లు తెలిపింది. కేవలం భారత్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించినందుకు సంతోషంగా ఉందని ఐటీసీ ఫుడ్ డివిజన్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అనుజ్ రుస్తాగి అన్నారు. -
ఇళ్లున్నాయ్.. కొనేవాళ్లే లేరు!
7,97,623 : దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది జూన్ వరకు అమ్మకాలకు నోచుకోని ఇళ్లు 4,13,000 : వీటిల్లో మధ్యతరగతి వర్గాల కోసం సరసమైన ధరల్లో ఉన్న ఇళ్లు సాక్షి, హైదరాబాద్: రండి బాబు.. రండి... సరసమైన ధరల్లో ఇళ్లు కావాలా.. వెంటనే సంప్రదించండి.. అంటూ నిర్మాణసంస్థలు కొనుగోలుదారుల వెంట పడాల్సి వస్తోంది. స్థిరాస్తిరంగం ఊపు మీదున్నా.. రాష్ట్రంలో గృహ నిర్మాణ రంగం మాత్రం మందకొడిగా నడుస్తోంది. ప్లాట్ల క్రయ విక్రయాలు జోరుగా సాగుతున్నా.. ఫ్లాట్ల అమ్మకాలు మాత్రం పడిపోతున్నాయి. దేశ వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండగా, రాష్ట్రంలో కొంత మెరుగ్గానే ఉంది. అయితే ఇక్కడ కూడా కాంక్రీట్ నిర్మాణాల అమ్మకాలు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. భూముల విలువలు నింగినంటడం, ముమ్మర నిర్మాణాలు, నిర్మాణ వ్యయం పెరగడంతో విల్లాలు, ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో వృద్ధి తగ్గింది. ప్రాప్ టైగర్ అనే సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఈ సర్వే ప్రకారం ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో ప్రాజెక్టు, ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల తాకిడితో రాజధాని పరిసర ప్రాంతం రియల్ రంగానికి చోదకశక్తిగా మారింది. ఇతర మెట్రో నగరాల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్తోపాటు చదరపు అడుగు ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితి మన దగ్గర తక్కువ కాబట్టి అమ్ముడుకాని ఇండ్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కేంద్ర బడ్జెట్లో గృహ రుణాల వడ్డీ తగ్గింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచడం వల్ల ఇళ్ల ఖరీదు ఊపందుకుంటుందని నిర్మాణరంగ నిపుణులు అంచనా వేస్తున్నా.. ప్రస్తుతానికి మాత్రం నిలకడ కనిపిస్తోంది. నేల చూపులు.. నింగిలో ధరలు రెరా చట్టం అమలు.. నిర్మాణ వ్యయం పెరగడం.. డెవలప్మెంట్లో భూ యజమానికి ఇచ్చే నిష్పత్తి శాతం పెరగడం కూడా ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరగడానికి కారణం. భూయజమానికి లెక్కకు మించి ఫ్లాట్లు ఇవ్వాల్సి రావడం, గుడ్‌విల్ కూడా చెల్లించాల్సి రావడంతో ఫ్లాట్ల ధరలు పెంచక తప్పడం లేదు. దీంతో నిర్మాణ సంస్థలు తగిన సమయంలో ప్రాజెక్టు పూర్తి చేసేలా అమ్మకాలు జరగడం లేదు. ఈ కారణంగా ప్రాజెక్టు అంచనా వ్యయంలోనూ పెరుగుదల వస్తోంది. ఈ కారణాలన్నింటితో సదరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ల ధరలు క్రమేణా పెంచాల్సి వస్తోంది. ఈ క్రమంలో అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోందన్నది ఓ ప్రముఖ బిల్డర్ అభిప్రాయం. గతంతో పోలిస్తే కొనుగోలుదారుల్లో అవగాహన పెరగడంతో నిర్మాణ సంస్థ గురించి వాకబు చేస్తున్నారు. అంతకుముందు చేపట్టిన ప్రాజెక్ట్‌ల నాణ్యత, సమయానికి ఇస్తారా.. లేదా.. వంటి విషయాలను తెలుసుకున్న తర్వాతనే కొనేందుకు ముందుకొస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నాయా? నిబంధనల మేరకు కడుతున్నారా.. లేదా.. తెలుసుకున్న అనంతరం అడుగు వేస్తున్నారు. ఈ మార్పులు మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయని బిల్డర్లు చెపుతున్నారు. దీంతో పాటు బడా బడా సంస్థలు స్థిరాస్తి వ్యాపారంలోకి రావడంతో భూముల విలువలు ఆకాశన్నంటాయి. ఈ నేపథ్యంలో డెవలపర్లు లాభాపేక్షతో ధరలు పెంచేయడం.. సౌకర్యాలకు తగ్గట్టుగా చదరపు అడుగుల చొప్పున ధరలను నిర్దేశించడంతో ఫ్లాట్లు అందుబాటులో లేకుండాపోయాయి. దీనికితోడు గచ్చిబౌలి, మాదాపూర్, చందానగర్, మేడ్చల్, కొంపల్లి, కొండాపూర్, నార్సింగి, మంచిరేవుల, నెక్నాంపూర్, మణికొండ, హైదర్షాకోట్ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల తాకిడితో టెకీలు వ్యయం ఎక్కువైనా ఫ్లాట్ల కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో గేటెడ్ కమ్యూనిటీ, బడా సంస్థలు నిర్మించే ప్రాజెక్టుల్లో విల్లాలను కొనేందుకు సంపన్నవర్గాలు, సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఇదే తరహాలో నగరంలోని ఇతర ప్రాంతాల్లో నిర్మిస్తే మాత్రం వాటిని అమ్మడం బిల్డర్లకు తలప్రాణం తోకకు వస్తోంది. ఇక, సెమీ అర్బన్ ప్రాంతాల్లోనూ గృహ నిర్మాణాలు, అమ్మకాలు ఈ మధ్య కాలంలో తగ్గిపోవడం గమనార్హం. ఇళ్ల స్థలాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్న ప్రజలు డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపడంలేదు. విల్లాలు, ఫ్లాట్ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో కొనుగోలుదారులు స్థలాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్‌లో మాత్రం ఆసాధారణంగా పెరిగిన ధరలు రియల్ రంగంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తుండటంతో నల్లధనం కూడా వెల్లువలా వస్తోంది. దీంతో భూముల విలువలు అందనంత ఎత్తుకు ఎగబాకాయి. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య మాత్రం దినదినాభివృద్ధి చెందుతోంది. ఆషాఢమాసంలో రూ.500 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారాప్రభుత్వ ఖజానాకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గత ఏడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అంటే అంతా స్థలాలు, సాగు భూముల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మందగించినా.. ట్రెండ్ మారుతోంది: రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు గ్రేటర్హైదరాబాద్లో నిర్మాణ రంగం శరవేగంగా పురోగమించడంతోపాటు స్థిరంగా వృద్ధిరేటు సాధిస్తోంది. కొంత కాలంగా రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు మందగించినప్పటికీ ఇప్పడు ట్రెండ్ మారుతోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్, ఐటీ, హార్డ్‌వేర్ పాలసీలతో పలు ప్రముఖ సంస్థలు నగరం వైపు దృష్టిసారించాయి. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్ ఫ్లాట్ల ధరలు నగరంలోనే అందుబాటు ధరల్లో ఉన్నాయి. -
ఈ పాలకు మస్తు గిరాకి..
సాక్షి, కదిరి(అనంతపురం) : ‘గంగిగోవు పాలు గరిటేడైన చాలు.. ఖరము పాలు కడవడైననేమీ’ అంటూ వేమన చెప్పిన మాటలు ప్రస్తుత రోజుల్లో తిరగబడ్డాయి. గంగి గోవు పాలు సంగతి ఎలా ఉన్నా.. ఖరము (గాడిద)పాలు ఉగ్గేడుంటే చాలు అంటూ పెద్దలు ఎంపర్లాడుతున్నారు. నవజాత శిశువులకు గాడిద పాలు తాపడం ద్వారా ఎలాంటి వ్యాధులు దరిచేరవని, జీర్ణశక్తి మెరుగు పడుతుందని పలువురు విశ్వసిస్తుండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో గాడిద పాలు అమ్మేవారు పది రోజులుగా కదిరి శివారులో మకాం వేశారు. కర్ణాటక ప్రాంతానికి చెందిన పది కుటుంబాలు దాదాపు 30కి పైగా గాడిదలను వెంట తెచ్చుకుని ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. రోజూ ఉదయాన్నే గాడిదలను తీసుకుని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పాలను అమ్ముతుంటారు. అయితే ఉగ్గు (దాదాపు 5 ఎంఎల్) గాడిద పాలను రూ.200 చొప్పున విక్రయిస్తుండడం గమనార్హం. -
కౌగిలింత ఖరీదు 90 లక్షల రూపాయలు
కన్సాస్: అమెరికాలో ఓవర్‌ల్యాండ్ పార్క్, టోమాహాక్ రిడ్జ్ కమ్యూనిటీ సెంటర్లో ఒక ఐదేళ్ల పిల్లవాడు తెలియక చేసిన చిన్న తప్పిదానికి దాదాపు 90 లక్షల రూపాయల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కమ్యూనిటీ సెంటర్లోని సర్వేలైన్ కెమెరాలో రికార్డయిన దృశ్యాల ప్రకారం సారా గాడ్మాన్ కొడుకు, ఐదేళ్ల పసివాడు అక్కడే ఉన్న ఓ విగ్రహాన్ని కౌగిలించుకుని, ఆడుకుంటున్నాడు. అయితే అనుకోకుండా ఆ విగ్రహం కాస్తా కింద పడి పగిలిపోయింది. అదృష్టవశాత్తు పిల్లవానికి ఎలాంటి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న సారా వెంటనే అక్కడకు వెళ్లి తన కుమారున్ని ఇంటికి తీసుకొచ్చింది. పగిలిపోయిన విగ్రహం ఖరీదు మహా అయితే ఓ 800 డాలర్లు (ఇండియా కరెన్సీ ప్రకారం 55,076 రూపాయలు) ఉంటుంది. ఆ మొత్తాన్ని కట్టేస్తే గొడవ ఉండదని అనుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత కమ్యూనిటీ సెంటర్ నుంచి సారాకు ఒక ఉత్తరం వచ్చింది. దానిలో తన కుమారుడు పగలకొట్టిన విగ్రహం ఖరీదు చూసిన సారాకు గుండె ఆగినంత పనయ్యింది. ఓ 800 డాలర్లు ఉంటుందనుకున్న విగ్రహం విలువ కాస్తా ఏకంగా 1,32,000 డాలర్లు (అంటే మన కరెన్సీ ప్రకారం 90,87,540 రూపాయలు) గా ఉంది. ముందు ఆ ఉత్తరం చూసి ఆశ్చర్యపోయిన సారా, తెరుకుని కమ్యూనిటీ సెంటర్ వారిని తిట్టడం ప్రారంభించింది. ‘అంత ఖరీదైన విగ్రహాన్ని ఎలాంటి రక్షణ లేకుండా, కనీసం తాకకూడదనే హెచ్చరిక కూడా లేకుండా ఇలా జనాలు తిరిగే ప్రదేశంలో ఎలా ఉంచుతార’ని ప్రశ్నించింది. అంతేకాక డబ్బు చెల్లించనని తేల్చి చెప్పింది. దాంతో కమ్యూనిటీ సెంటర్ అధికారులు ‘ఆ విగ్రహాన్ని సందర్శన నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చాము. అయినా ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంద’ని తెలిపారు. విగ్రహం ఖరీదు చెల్లించనని చెప్పిన సారా, కంపెనీ వారు తీసుకునే చట్టపరమైన చర్యలను ఎదుర్కొడానికి సిద్దపడింది. కానీ ఇంతలో కమ్యూనిటీ సెంటర్ అధికారి రైలీ ‘మా ఇన్సూరెన్స్ కంపెనీ పొరపాటున బిల్లు చెల్లించమనే ఉత్తరాన్ని సారాకు పంపింది. కానీ మేము ఆ బిల్లును సారా కుటుంబం నుంచి వసూలు చేయాలనుకోవడం లేదు. ఆమె ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ఈ వ్యవహారాన్ని ముగిస్తామ’ని తెలిపారు. సారా కొడుకు పగలకొట్టిన విగ్రహం స్థానిక శిల్పి బిల్ లియన్స్ రూపొందించిన ‘ఆఫ్రొడైట్ డి కాన్సాస్ సిటి’ అనే శిల్పం. -
పికాసో చిత్రం ఖరీదెంతంటే...!
న్యూయార్క్ : ప్రఖ్యాత చిత్రకారుడు ప్లాబో పికాసో వేసిన చిత్రాలకు ఉన్న డిమాండ్ ఓ స్ధాయిలో ఉంటుంది. పికాసో వేసిన చిత్రాలను వేలం వేసిన ప్రతిసారీ అవి ముందు చిత్రాల కంటే ఎక్కువ ధరే పలుకుతాయి. తాజాగా పెగ్గీ, డేవిడ్ రాక్ఫెల్లర్స్ కలెక్షన్ క్రిస్టీస్‌లో నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రానికి రికార్డు స్ధాయిలో ధర పలికింది. పికాసో 1905లో గీసిన చిత్రం ‘ఫిల్లెట్ ఏ లా కార్బిల్లె ఫ్లూరియ’ అనే చిత్రం అత్యధికంగా 115 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. రాక్ఫెల్లర్స్ వేలంపాట చరిత్రలోనే ఒక చిత్రం ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఇదే తొలిసారి.రాక్ఫెల్లర్స్ కలెక్షన్ మంగళవారం నిర్వహించిన వేలం పాటలో పికాసో చిత్రం అత్యధిక ధర పలకగా తర్వాతి స్థానాల్లో 1914 - 1917 నాటి ‘ఎన్మ్పియాస్ ఎన్ ఫ్లూయర్’ చిత్రం అత్యధికంగా 84.6 మిలియన్ డాలర్లు, 1923నాటి మరో చిత్రం ‘ఒడాలిస్క్ సోచ్చు ఆక్స్ మగ్నోలియాస్’ 80.7 మిలియన్ డాలర్లు పలికింది. ‘స్టాండర్డ్ ఆయిల్’ వ్యవస్థాపకుడు జాన్ డీ. రాక్ఫెల్లర్ చివరి మనవడు డేవిడ్ రాక్ ఫెల్లర్. ఇతని భార్య పెగ్గి రాక్ ఫెల్లర్. వీరిరువురు ఏర్పాటు చేసిన ‘డేవిడ్ రాక్ఫెల్లర్ కలెక్షన్’లో కళలు, ఫర్నిచర్, అలంకరణ, లైటింగ్‌కు సంబంధించిన దాదాపు 1500 వస్తువులు ఉన్నాయి. వీటన్నింటి ప్రస్తుత మార్కెట్ విలువ 500మిలియన్ డాలర్లు. డేవిడ్ రాక్ ఫెల్లర్ 2017, మార్చిలో మరణించాడు. దాంతో ఆయన వారసులు రాక్ఫెల్లర్ మరణించి ఒక సంవత్సరం అయిన సందర్భంగా ఈ విలువైన సంపదను వేలం వేసారు. వచ్చిన మొత్తాన్ని ముందుగా ఎన్నుకున్న సేవా సంస్థలకు అందజేయనున్నారు. -
ఐపీఎల్ : పైసల్ ఎక్కువ.. పరుగులు తక్కువ!
సాక్షి, హైదరాబాద్ : ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్కు ఏమాత్రం కొదవ ఉండదు. ఈ లీగ్‌లో ఆడేందుకు చాలా మంది ఆటగాళ్లు సొంత జట్టుకు ఆడటానికి నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఏడాది పాటు జాతీయ జట్టుకు ఆడితే రాని డబ్బు సరిగ్గా ఒకటిన్నర నెల ఆడితే తమ ఖాతాల్లో జమ అవుతుంది. దీంతోనే ఐపీఎల్లో ఆడేందుకు అన్ని క్రికెట్ దేశ ఆటగాళ్లు ఆసక్తి కనబరుస్తారు. ఒక్కో ఆటగాడికి కోట్ల రూపాయలు చెల్లిస్తారు. అయితే ఇప్పటికే ఐపీఎల్ లీగ్‌లో సగం షెడ్యూల్ పూర్తి అయింది. కానీ ఈ సీజన్ వేలంలో కొందరు ఆటగాళ్లు అధిక ధరకు అమ్ముడయ్యారు. కానీ వారు ఆటలో దారుణంగా విఫలమయ్యారు. వారు ఎవరంటే.. డీఆర్సీ షార్ట్ : ఆస్ట్రేలియాకు చెందిన షార్ట్ బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో అత్యధిక పరుగులు చేశాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. బిగ్‌బాష్‌లో లీగ్‌లో సంచలనం కలిగించిన ఈ యువ కెరటం ఐపీఎల్లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 97.01 స్ట్రైక్ రేట్‌తో కేవలం 65 పరుగులు చేశాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ : టీ20 క్రికెట్లో మ్యాక్స్‌వెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బరిలో దిగితే ప్రత్యర్థికి చుక్కలు చూపించేస్తాడు. కానీ గత రెండు సీజన్ల నుంచి మాత్రం తన ప్రభావం చూపించలేక పోతున్నాడు. కింగ్స్ పంజాబ్‌ను వదిలి ఢిల్లీ తరపున ఆడుతున్న మ్యాక్స్‌వెల్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా మొత్తం చేసిన పరుగులు 126, స్ట్రైక్ రేటు 159.49. ఈ ఆసీస్ ఆటగాడిని ఏడు కోట్ల రూపాలయకు ఢిల్లీ కొనుగోలు చేసింది. జయదేవ్ ఉనద్కట్ : బౌలర్లలో అత్యధిక ధర పలికిన ఆటగాళ్లలో ఉనద్కత్ ఒకడు. గత సీజన్లో పూణె తరపున సంచలన బౌలింగ చేసిన ఇతడు ఈ సీజన్లో మాత్రం తన బౌలింగ్ పదును చూపెట్టలేక పోతున్నాడు. గత సీజన్లో ఉనద్కత్ బౌలింగ్ చూసిన రాజస్తాన్ రాయల్స్ 11.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో 7మ్యాచ్‌లు ఆడి కేవలం 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఎకనామీ 10.18గా ఉంది. కీరన్ పోలార్డ్ : క్రీజులో దిగంగానే బంతిని బౌండరీ తరలించడంలో వెస్టిండీస్ ఆటగాళ్లు ముందుంటారు. ఈ కోవలో కీరన్ పోలార్డ్ ఒకరు. ముంబై తరపున ఆల్‌రౌండర్ పాత్ర పోషిస్తుంటాడు. చాలా సార్లు ఒంటిచేత్తో ముంబైకి విజయాలు అందించాడు. కానీ ఈ సారి దారుణంగా విఫలమయ్యాడు. ఏడు మ్యాచ్‌లు ఆడగా 108.57 స్ట్రైక్ రేటుతో కేవలం 76 పరుగులు చేశాడు. ఆరోన్ ఫించ్ : ఆస్ట్రేలియాకు చెందిన ఫించ్‌ను కింగ్స్ పంజాబ్ 6.2 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఈ సీజన్లో ఒక్కసారి కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక పోయాడు. ఆరు మ్యాచ్‌లు ఆడగా మొత్తం 24 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేటు 150గా ఉంది. -
అధిక ధరలపై ఏం చేస్తారో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుమలలో అధిక ధరలకు తినుబండారాలు, ఇతర వస్తువులను విక్రయించే వ్యాపారులపై ఏం చర్యలు తీసుకోబోతున్నారో తెలియచేయాలని హైకోర్టు మంగళవారం తిరుమల, తిరుపతి దేవస్థానాల(టీటీడీ) కార్యనిర్వహణాధికారి(ఈవో)ని ఆదేశించింది. అదేవిధంగా భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా ఉండేందుకు ఏం చేయబోతున్నారో తెలియచేయాలని హోటళ్ల యాజమాన్యాలకు స్పష్టం చేసింది. అధిక ధరలపై ఫిర్యాదులు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని, ఒకవేళ ఇప్పటికే ఉంటే ఆ నంబర్‌ను విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావాలని టీటీడీకి తేల్చి చెప్పింది. వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకునే యంత్రాంగం ఏదైనా ఏర్పాటు చేశారో లేదో తెలియచేయాలని పేర్కొంది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
తెలుగు తమ్ముళ్ల సినిమా వార్
పులివెందుల/పులివెందుల రూరల్ : పట్టణంలోని సినిమా థియేటర్ల విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వార్ నడుస్తోంది. పట్టణంలో 5 సినిమా థియేటర్లు ఉన్నాయి. అయితే ఇటీవల కొత్త సినిమా విడుదల సందర్భంగా అధిక ధరలకు టిక్కెట్లు విక్రయించుకోవడానికి ఓ వర్గం.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం టిక్కెట్ల ధరలు విక్రయించాలని మరొక వర్గం పట్టుబట్టాయి. దీంతో ఒక దశలో ఇరువర్గాలకు చెందిన చోటా నాయకులు ఘర్షణకు సైతం దిగారు. ఈ ఘర్షణకు కారణం కమీషన్ల కోసమేనని తెలుస్తోంది. ఓ వర్గం థియేటర్ల యాజమాన్యాలను నెలవారీ కమీషన్లు ఇవ్వాల్సిందిగా హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోవర్గం కమీషన్లు తమకు దక్కలేదన్న కారణంతో ఆ అధిక ధరలకు విక్రయిస్తున్నారని.. నిబంధనలు పాటించడం లేదని అధికారులు వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు హాళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి రాఘవేంద్ర, లక్ష్మి, మారుతి థియేటర్లను సీజ్ చేశారు. ఈ థియేటర్లకు నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు ఉన్నప్పటికి కేవలం ఫైర్‌స్టేషన్‌కు సంబంధించిన అనుమతి పత్రం లేదన్న కారణంతో సీజ్ చేశారు. అధికారులు తెలుగు తమ్ముళ్ల ఒత్తిడికి తట్టుకోలేక మూసివేసినట్లు తెలిసింది. వేధింపులతో స్టాపింగ్ వైపు.. జిల్లాలో ఉన్న థియేటర్లలో అన్ని అనుమతులు ఉన్నవి వేళ్లపై లెక్క పెట్టవచ్చు. మూసివేత కారణంగా ఒక్కో థియేటర్లో 15మంది కార్మికులు జీవనోపాధి కోల్పోతారు. ఇందులో లక్ష్మి థియేటర్‌ను ప్రస్తుతం నిర్వహిస్తున్న యజమాని 4 నెలల క్రితం లీజుకు తీసుకున్నారు. కొంతమంది తమ్ముళ్లు రిలీజ్ సినిమాలకు బెనిఫిట్ షో నడిపేందుకు ముందుండి అన్నీ తామే చూసుకుంటామని యజమానులతో, అధికారులతో కుమ్మక్కై కమీషన్లు తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీలు, స్మార్ట్ఫోన్ల ప్రభావంతో థియేటర్లు నడవడం గగనమైన నేపథ్యంలో టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి పెంచి మూసివేయించడం తగదని ప్రజలంటున్నారు. పట్టణంలోని రాఘవేంద్ర థియేటర్ యజమానులు అసలే నష్టాలతో హాలు నడుపుతున్నామని, అలాంటి పరిస్థితుల్లో ఇలా కమీషన్లు, నష్టాలను భరించలేక తాము థియేటర్ నడపలేమని, స్టాపింగ్‌కు అనుమతి ఇవ్వాలని జాయింట్ కలెక్టర్‌ను కోరినట్లు తెలిసింది. త్వరలోనే ఈ థియేటర్‌ను కూల్చివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. థియేటర్ల యజమానుల పరిస్థితి అగమ్యగోచరం పులివెందులలో ఉన్నఫలంగా థియేటర్లు మూసివేయడంతో యజమానుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో థియేటర్లకు అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు నిబంధనలు సరిగా లేకుంటే జరిమానా విధించి 20 నుంచి 30 రోజులు గడువు ఇచ్చి అనుమతిపత్రాలు తెచ్చుకోవాలని సూచించేవారు. కానీ ప్రస్తుతం తెలుగు తమ్ముళ్ల ఒత్తిడితో ఉన్నఫలంగా థియేటర్లను సీజ్ చేశారు. ఒక సినిమాకు రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు పెట్టుబడి పెట్టి కొనుగోలు చేస్తామని, అంత పెద్దఎత్తున పెట్టుబడి పెట్టినా లాభాలు రానీ పరిస్థితుల్లో తాము మరో వ్యాపారం చేయడం తెలియక ఇందులోనే అష్టకష్టాలు పడుతున్నామని వారు వాపోతున్నారు. ప్రస్తుత పండుగ సీజన్లో థియేటర్లు మూసివేయడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అడిగేవారు లేరని..
►బస్టాండ్‌లో ప్రయాణికుల దోపిడీ ► వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్న షాపుల యజమానులు ►అటకెక్కించిన ఎంఆర్పీ విక్రయ నిబంధన ► చూసీచూడనట్లు వెళ్తున్న ఆర్టీసీ అధికారులు ► రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు ► నిద్రిస్తున్న తూనికలు, కొలత శాఖ అధికారులు కర్నూలు(రాజ్‌విహార్): జిల్లాలో 12డిపోల్లో 430 షాపులుండగా కర్నూలు బస్‌స్టేషన్‌లో 80, ఆరుబయట మరో 130 షాపులున్నాయి. ఐదేళ్లకోసారి తిరిగి టెండర్లు పిలుస్తారు. ఒకసారి టెండరు ఖరారు అయితే మూడేళ్ల వరకు ఒక అద్దె ఉంటుంది. నాలుగో సంవత్సరం 10శాతం పెంచుతారు. చివరి సంవత్సరం నాలుగో ఏడు చెల్లించిన నెలవారి అద్దెపై 15శాతం అదనంగా వసూలు చేస్తారు. జిల్లాలోని షాపుల నుంచి నెలకు రూ.50 లక్షల వరకు ఆదాయం వస్తోంది. దోపిడీ ఇలా.. బస్టాండ్లలోని షాపుల్లో వస్తువులు, తినుబండరాలను నిబంధనల ప్రకారం ఎంఆర్పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్)కే అమ్మాలి. షాపులు దక్కించుకున్న యజమానులకు ఇచ్చే అగ్రిమెంట్లలో ఈవిషయాన్ని ప్రస్తావిస్తారు. అయితే, ఈ నిబంధన అమలు కావడం లేదు. రూ.10 ఎంఆర్పీ ఉన్న వస్తువును రూ.15కి అమ్ముతున్నారు. తినుబండరాలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ సైతం ఇదే తరహాలో విక్రయిస్తున్నారు. రూ.20 ఉన్న నీళ్ల బాటిల్‌ను రూ.25కి అమ్ముతున్నారని నంద్యాలకు చెందిన ప్రయాణికులు శ్రీకాంత్ వాపోయాడు. దీనిపై ప్రశ్నిస్తే ‘ఇది బస్టాండ్, మాకు బాడుగ ఎక్కువగా ఉంటుంది. ఎలా అమ్ముకోవాలి’ అంటు సమాధానం చెబుతున్నారని తెలిపారు. ప్రదర్శనల వరకే ధరల పట్టిక: షాపుల్లో అమ్మే వస్తువుల పేర్లు, వాటి ఎంఆర్పీ పట్టికను ప్రయాణికులకు కనిపించేలా పెట్టాలి. అందులో చూపిన ధరలనే అమ్మాలి. కానీ ఒకటి రెండు షాపుల వద్ద తప్ప ధరల పట్టిక ఎక్కడా కన్పించదు. పట్టిక ప్రదర్శనకు పెట్టిన వాళ్లు సైతం దీనిని అమలు చేయకపోవడం గమనార్హం. చర్యలు ఇలా.. ఎంఆర్పీ విస్మరిస్తే మూడంచెల తరహాలో చర్యలు తీసుకుంటారు. మొదటి సారి రూ.500, రెండో సారి రూ.1000 జరిమాన విధిస్తారు. మూడో సారి కూడా ఆదే షాపుపై కేసు నమోద అయితే షోకాజ్ నోటీసు ఇచ్చి షాపు టెంటరు లైసెన్స్ రద్దు చేస్తారు. ఇప్పటి వరకు కేవలం పాతికలోపే కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. శ్రీబాలాజీలో రాత్రిపూట అధిక ధరలు కొత్త బస్టాండ్‌లోని శ్రీ బాలాజీ క్యాంటీన్ చీకటి వ్యాపారానికి తెర లేపిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. రాత్రయితే చాలు ధరలు మరిపోతున్నాయని, పగలు ఉన్న ధరలను పెంచి రాత్రి వేళల్లో అధిక రేట్ల తినుబండరాలు, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తదితర పానియాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. వీటిపై గతంలో ఆర్టీసీ అధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేనట్లు తెలుస్తోంది. ఈ విషయంలో వారిపై విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టించుకోని తూనికలు, కొలతల శాఖ బస్టాండ్లలో ప్రయాణికులు దోపిడీకి గురవుతుంటే తూనికలు, కొలతల శాఖ అధికారులు నిద్ర మత్తులో ఉన్నారు. ఎప్పుడో ఓసారి దాడులు నిర్వహించి వదిలేస్తున్నారు. కర్నూలు బస్‌స్టేషన్ నుంచి ప్రతీరోజు దాదాపు 50వేల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. వీరి నుంచి రూ.లక్షల దోచుకుంటున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు కొత్త బస్టాండ్‌లోని బాలాజీ క్యాంటీన్లో వస్తువులను ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. పగలు ఒక రేటు, రాత్రి వేళల్లో ఒక రేటు పెట్టి తినిబండరాలు విక్రయిస్తున్నారు. రాత్రి వేళల్లో ఎంఆర్పీ కంటే రూ.2 నుంచి రూ.5వరకు అధికంగా అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. - ఎం. గోవిందు, పాతబస్తీ ఫిర్యాదు చేస్తే చర్యలు: బస్టాండ్లలో అధిక ధరలకు వస్తువులు అమ్మరాదు. ఎమ్మార్పీకే విక్రయించాలి. ఎక్కువ ధరలకు విక్రయిస్తే ప్రయాణికులు కంట్రోలర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీనివాసులు, డీసీటీఎం -
ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: కొనేటప్పుడు తక్కువ రేటులో రావాలి. అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ రేటు రావాలని కోరుకునేది ఒక్క స్థిరాస్తి రంగంలోనే. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువుగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ కొనుగోలుదారులు ఏం కోరుకుంటున్నారో ముందుగా కనుక్కోవాలి. అంతేకాదు స్థిరాస్తి మార్కెట్ ప్రస్తుతం ఎలా ఉందో తెలుసుకోవాలి. సొంతిల్లు అనగానే చాలా మంది డాబా ఇల్లా? ఫ్లాటా? అనే సందేహం వస్తుంది. పాత, కొత్త ఇళ్లలో వేటిని కోరుకుంటున్నారు? లేదంటే స్థలాలనా? అన్న విషయాలపై అవగాహన పెంచుకోవాలి. అప్పుడే అమ్మాలనుకునే ఆస్తికి మార్కెట్లో ఎలాంటి స్పందన ఉందో తెలుస్తుంది. ఇంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం బిల్డర్‌కి ఉంటుంది కానీ స్థలాన్నో, ఇంటినో అమ్ముకోవాలనే వారికెందుకనే భావన చాలామందికి ఉంటుంది. కానీ, మార్కెట్ గురించి తెలుసుకోవటం వల్ల వ్యక్తిగత ఆస్తులు అమ్మేవారికి వాస్తవమైన రేటు, అమ్మే రేటు ఎంతో తెలుస్తుందనే విషయాన్ని మరిచిపోవద్దు. ⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాస్తి ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట. ⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయించవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ⇒ స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఓ విషయంలో మాత్రం ఏ చిన్న పొరపాటు ఉన్నా కొనుగోలుదారులు ముందుకురారు. అదే న్యాయపరమైన అంశం. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి. -
ప్రతికూలంలో అమ్మకాలెలా?
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుతం మార్కెట్లో ప్రతికూల వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో అధిక ధర రావటం కొంచెం కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంత నేర్పు ఉంటే సులువగానే విక్రయించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ⇒ మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నప్పుటికీ కొన్ని అంశాలు స్థిరాస్తి ధరలను ప్రభావితం చేస్తుంటాయి. ఒకవేళ అవి ప్రతికూలంగా ఉన్నా.. వాటిని మెరుగుపరచడానికి, మార్చడానికి అవకాశం ఉండదు. ఉదాహరణకు స్థిరాసిత ఏ ప్రాంతంలో ఉంది? ఇరుగుపొరుగు ఎవరుంటారు? వంటి విషయాలన్నమాట. ఒకవేళ స్థిరాస్తి మంచి ప్రాంతంలో ఉంటే అమ్మకందారులు మంచి ధర పొందుతారు. ఇందుకు భిన్నంగా ఉంటే విక్రయానికి అనువైన పరిస్థితుల కోసం కసరత్తు చేయాల్సి ఉంటుంది. సరైన ధర చెప్పడం, ఆస్తికి సంబంధించిన పత్రాలన్నింటినీ పక్కాగా ఉంచుకోవటం, సరైన సమయంలో, సరైన కొనుగోలుదారున్ని పట్టుకోవటం వంటివన్నమాట. ⇒ ఇంటి ధరను ప్రధానంగా స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర నిర్ణయిస్తాయి. అయితే పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిచవు. మార్కెట్ సెంటిమెంట్ కూడా భాగస్వామే. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ ఎలా ఉంది? ఆ ప్రాంతంలో సగటు ధర ఎంత? వంటి విషయాలపై దృష్టిపెట్టాలి. ⇒ విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాలను కొనుగోలుదారుడికి స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారులు ముందడుగు వేస్తాడని గుర్తుంచుకోండి. -
ఆ కారు నంబర్ కోసం ఎంత పెట్టారో!
తుర్కయంజాల్: కర్మన్‌ఘాట్‌కు చెందిన ఓ వ్యక్తి ఇబ్రహీంపట్నం రవాణా శాఖ కార్యాలయంలో 9999 నెంబర్‌ను అధిక ధరకు వేలంలో దక్కించుకున్నాడు. మునదల రామచంద్రరావు తన కిర్లోస్కర్ కారుకు 9999 నెంబర్‌ను 4,58,020 రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. ఇంత ధర పలకడం ఇబ్రహింపట్నం రవాణా శాఖ కార్యాలయంలో ఇదే మొదటిసారి అని ఆర్టీఓ గౌరిశంకర్ తెలిపారు.