holly wood
-
అంతర్జాతీయంగా గుర్తింపుపొందిన సింగర్స్
-
మహేష్ సినిమాతో హాలీవుడ్ పై కన్నేసిన జక్కన్న
-
డయానా పోలికలు
ప్రిన్సెస్ డయానా పుట్టిన ముప్పైఏళ్లకు జన్మించిన క్రిస్టెన్ స్టెవార్ట్ ఇప్పుడు తన ముప్పై ఏళ్ల వయసులో డయానా ముప్పై ఏళ్ల వయసులోని పాత్రను పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఇంతకన్నా సరళంగా చెప్పాలంటే... ప్రిన్స్చార్లెస్తో తన దాంపత్యం సవ్యంగా లేదని డయానా గ్రహించిన ఒకనాటి వీకెండ్ చుట్టూ కథను నిర్మించుకుని చిలీ దర్శకుడు పాబ్లో లారెయిన్ తీస్తున్న ‘స్పెన్సర్’ అనే చిత్రంలో క్రిస్టెన్ కథానాయికగా నటిస్తున్నారు. 20 ఏళ్ల వయసులో ప్రిన్స్ చార్లెస్‌తో డయానాకు పెళ్లయింది. తర్వాత పదేళ్ల కన్నా తక్కువ కాలంలోనే భర్తతో మానసికంగా ఆమె బంధం తెగిపోయింది. తెగిందని రూఢీ అయిన ఆ శని, ఆది వారాలలో డయానా మానసిక స్థితిని ఈ సినిమాలో క్రిస్టెన్ ప్రతిఫలింప జేయబోతున్నారు. బ్రిటన్ యువరాణిగా అభినయించనున్న ఈ అమెరికన్ నటి తన అత్యద్భుతమైన ప్రదర్శనను అలవోకగా ఇవ్వగలదని లారెయిన్ నమ్ముతున్నారు. బహుశా ఆ నమ్మకం రెండు కారణాల వల్ల ఆయనకు కలిగి వుండొచ్చు. ఒకటి స్టీవెన్ నైట్ స్క్రిప్టు ఇంకోటి క్రిస్టెన్ నవ్వు. ఆమె నవ్వితే అచ్చు నవ్వీనవ్వకుండా డయానా నవ్వినట్లే ఉంటుంది. -
కరోనాకు బలైన హీరోయిన్ తండ్రి
లండన్ : ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ సోఫియా మైల్స్ తండ్రి పీటర్ మైల్స్(67) కరోనా బారిన పడి కన్నుమూశారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కొద్దిరోజుల కిత్రం కరోనా సోకింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇతర వ్యాధుల కారణంగా కోలుకోలేకపోయిన ఆయన శనివారం మరణించారు. తండ్రి మరణించిన విషయాన్ని సోఫియా ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ ఆర్ఐపీ పీటర్ మైల్స్ . మా నాన్న కొన్ని గంటల క్రితమే మరణించారు. కరోనా వైరస్ కారణంగానే ఆయన చనిపోయార’ని పేర్కొన్నారు. తండ్రి పీటర్ మైల్స్‌తో సోఫియా ఆసుపత్రిలో తండ్రి మృతదేహం వద్ద దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. తండ్రి ఆరోగ్య పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ట్విటర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తున్న ఆమె కొద్దిరోజుల క్రితం ఓ వీడియోను విడుదల చేశారు. ‘అందరినీ హెచ్చరిస్తున్నాను. కరోనా వ్యాధి సోకిన మా నాన్న ప్రత్యేక వార్డులో ఉంచబడ్డారు. అక్కడ అందరూ కరోనా బాధితులే. ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. వారిలో అందరూ వృద్ధులే. దయచేసి కరోనాను సీరియస్‌గా తీసుకోండ’ని ఆ వీడియాలో విజ్ఞప్తి చేశారు. కాగా, యూకేలో ఇప్పటివరకు 5,018 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 233 మంది మరణించారు. -
మరో ముగ్గురికీ కరోనా
హాలీవుడ్లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఐదు రోజుల క్రితం స్టార్ కపుల్ టామ్ హ్యాంక్స్, రీటా విల్సన్ తమ కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. మరో తార ఓల్గా కురిలెంకో కూడా కరోనా బారిన పడ్డారు. సోమవారం ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపారు. మంగళవారం నటుడు క్రిస్టోఫర్ హివ్జు కూడా తన బ్లడ్ శాంపిల్‌లో కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. ‘ది వెండీ ఎఫెక్ట్’, ‘ది లాస్ట్ కింగ్’, ‘ది ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్’, ‘డౌన్‌హిల్’ తదితర చిత్రాల్లో నటించారు క్రిస్టోఫర్. టెలివిజన్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో చేసిన టోర్ముండ్ పాత్ర ద్వారా క్రిస్టోఫర్ చాలా పాపులర్. ‘‘నేను, నా కుటుంబ సభ్యులు ప్రస్తుతం మా అంతట మేం గృహనిర్భందంలో ఉన్నాం. అందరం ఆరోగ్యంగా ఉన్నాం. నాకు కొంచెం జులుబు ఉంది. కరోనా లక్షణాలు కనిపించాయి. కోవిడ్–19 ప్రమాదకరమైన వైరస్. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి’’ అన్నారు క్రిస్టోఫర్ హివ్జు. నటుడు ఇద్రిస్ ఎల్బా కూడా కోవిడ్ 19 వైరస్ సోకినట్లు తెలిపారు. ‘లూథర్’, ‘ది వైర్’ తదితర చిత్రాల్లో నటించారు ఎల్బా. కరోనా లక్షణాలు కనిపించడంతో ఇంటి నుంచి బయటకు రావడంలేదని పేర్కొన్నారు. వైరస్ ఉన్న వ్యక్తికి సమీపంగా ఉండటం వల్ల తనకు కూడా సోకిందేమోననే అనుమానంతో టెస్ట్ చేయించారట ఎల్బా. పాజిటివ్ రావడంతో ఇంటికి పరిమితం అయ్యారు. ‘‘ఇది మనిషికీ మనిషికీ దూరం పాటించాల్సిన సమయం’’ అని పేర్కొన్నారు ఇద్రిస్ ఎల్బా. ‘ఫ్రోజెన్ 2’, ‘హ్యాపీ డెత్’ వంటి చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ తార రేచెల్ మాథ్యూస్ తనకు కోవిడ్ 19 టెస్ట్‌లో పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘వైరస్ సోకిందని తెలియగానే వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాను. ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే డాక్టర్లు చెప్పేవరకూ ఇంటి నుంచి బయటకు రాకూడదనుకుంటున్నాను. ఈ వ్యాధి గురించి ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడగండి. ఎందుకంటే కరోనా బారిన పడ్డాను కాబట్టి ఈ స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’’ అన్నారు రేచెల్. -
జీవీ హాలీవుడ్ ఎంట్రీ షురూ
యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్ హాలీవుడ్ ఎంట్రీ షురూ అయ్యింది. కోలీవుడ్‌లో వెయిల్ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయమయ్యి అతి పిన్న వయసు సంగీత దర్శకుడిగా పేరొందారు జీవీ. ఇక డార్లింగ్ చిత్రంతో హీరోగా తెరపైకి వచ్చారు. ఈ తర్వాత సంగీతం, నటన అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సక్సెస్‌పుల్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా నటుడిగా కోలీవుడ్ నుంచి ఏకంగా హాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ట్రాప్ సిటీ’అనే హాలీవుడ్ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్ నటించనున్నారు. దీనికి బాలీవుడ్ దర్శకుడు నిక్కీ బ్రూచ్చల్ దర్శకత్వం విహించనున్నారు. దీన్ని కైబా అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థపై టెల్ గణేశన్ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు నెపోలియన్ ప్రధాన పాత్రలో నటించిన వెవిల్స్ నైట్, క్రిస్మస్ కూపన్ వంటి హాలీవుడ్ చిత్రాలను నిర్మించారు. కాగా జీవీ నటించనున్న చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాండన్ టీ.జాక్సన్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. జీవీ.ప్రకాశ్‌కుమార్ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నా రు. ఆయన నటించిన 100% కాదల్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా ఐన్గరన్, అడంగాదే, జెయిల్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం బ్యాచ్చిలర్, ఆయిరం జన్మంగళ్,కాదలిక్క యారుమిల్లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడిగానూ ధనుష్, దర్శకుడు వెట్రిమారన్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న అసురన్, సూర్య దర్శకురాలు సుధ కొంగరల కాంభినేషన్లో రూపొందుతున్న సూరరై పోట్రు చిత్రాలకు పని చేస్తున్నారు. కాగా కోలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ధనుష్ వంటి అతి కొద్ది మంది నటుల సరసన ఇప్పుడు జీవీ ప్రకాశ్‌కుమార్ చేరనున్నారన్నమాట. -
చాలా అంచనాలు పెట్టుకున్నాను.. కానీ
ఫలితం గురించి ఆలోచించకుండా చేస్తున్న పని కోసం వందకు వంద శాతం కష్టపడతానంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం రంగస్థలంతో భారీ విజయాన్ని అందుకున్న చెర్రి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ కెరియర్ గురించి ముచ్చటించారు. బాలీవుడ్ ఎంట్రీ ‘జంజీర్’ అపజయం గురించి కూడా వివరణ ఇచ్చారు. ఐదేళ్ల క్రితం రామ్ చరణ్ హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా ‘జంజీర్’(తెలుగులో తుఫాను) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఘోర పరజయాన్ని మిగిల్చింది. ఈ విషయం గురించి చెర్రి మాట్లాడుతూ.. ‘జంజీర్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాను. ఎందుకంటే బాలీవుడ్లో అది నా తొలి చిత్రం. మనస్ఫూర్తిగా నమ్మి, వంద శాతం కష్టపడి చేసిన సినిమా అది. కానీ నా అంచనాలకు తగ్గట్టు ఆడలేదు. ఫలితం నాకు నిరాశ కలిగించిన మాట వాస్తవమే. ఆ సినిమా విజయం సాధించలేదని చెప్పి బాలీవుడ్ ప్రయత్నాలు మానుకోను. మంచి కథ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాన’ని తెలిపారు. ప్రియాంక చోప్రాతో నటించడం గురించి చెబుతూ.. ‘ప్రియాంక చాలా అందమైన, ప్రతిభ గల నటి. సినిమా అంటే ఆమెకు చాలా ఇష్టం. వృత్తికి పూర్తిగా అంకితమవుతారు. మరోసారి ఆమెతో నటించాలనుకుంటు’న్నాను అన్నారు. ప్రియాంక ప్రస్తుతం హలీవుడ్లో నటిస్తున్నారు కదా మీరు ఆ వైపు వెళ్లే ఆలోచనలు ఉన్నాయా అని అడగ్గా ‘తెలుగు పరిశ్రమలో నేను చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాను. నేను ఎప్పుడు ఫలానా సినిమాలు చేయాలి అని అనుకోలేదు. అలానే హలీవుడ్‌కి వెళ్లాలి అని కూడా అనుకోలేదు. నాకు నప్పే కథలతోనే నా ప్రయాణం సాగుతుంది. అంతేకాని ప్రణాళికలు వేసుకుని పనిచేయడం నాకు చేతకాదు. నేను చేసే ఏ సినిమాకైనా వందశాతం పూర్తిగా కష్టపడతాను. కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా’ అన్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్‌కు జోడిగా కైరా అద్వానీ నటించనుండగా, మిగతా పాత్రల్లో వివేక్ ఓబెరాయ్, స్నేహ, ఆర్యన్ రాజేష్‌లు నటిస్తున్నారు. -
జురాసిక్ పార్క్ ఐదో సీక్వెల్ వస్తోంది!
సాక్షి సినిమా: హాలీవుడ్ చిత్రాల్లో భారతీయ సినీ ప్రేక్షకులను అధికంగా అలరించిన అతి కొద్ది చిత్రాల్లో జురాసిక్ పార్క్ నమోదు అవుతుందని ప్రత్కేకంగా చెప్పనవసరం లేదు. ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రాలు జురాసిక్‌పార్క్ సిరీస్. పార్క్ అనే నవల ఆధారంగా 1993లో ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ తెరపై ఆవిష్కరించిన వండర్ జురాసిక్‌పార్క్ చిత్రం. ప్రపంచ స్థాయిలో ఘన విజయం సాధించిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఇస్లా నుప్లర్ అనే ఒక కల్పన దీవిలో డైనోసర్ అనే ఒక వింత జాతికి జంతువు అరాజకాల ఇతివృత్తంగా తెరకెక్కిన ఆ చిత్రానికి ఆ తరువాత ది లాస్ట్ వరల్డ్ పేరుతో 1997లోనూ, జురాసిక్ పార్క్ 3 పేరుతో 2001లోనూ, జురాసిక్ వరల్డ్ పేరుతో2015లోనూ అదే స్టీవెన్ స్పీల్బెర్గ్ వరుసగా సీక్వెల్స్‌ను రూపొందించారు. తాజాగా జురాసిక్‌పార్క్– ఫాలెన్కింగ్డమ్ పేరుతో ఐదవ సీక్వెల్‌ను తెరకెక్కించిన చిత్రం జూన్‌న్7న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది. అదే డైనోసర్ విలనిజాలను మరో కొత్త కోణంలో తెరపై దర్శకుడు ఆవిష్కరించారట. 1993 నుంచి జురాసిక్ పార్క్ సిరీస్‌లోనూ నటించిన జెఫ్ కోల్ట్ప్లమ్ ఈ జురాసిక్‌పార్క్–ఫాలెన్ కింగ్డమ్ చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బెర్గ్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోవడం విశేషం. ఈ చిత్రంపై అంచనాలు భారి స్థాయిలో నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తమిళం.ఆంగ్లం భాషల్లో యూనివర్శల్ పిక్చర్స్ సంస్థ విడుదల చేయనుంది. -
అంతేనా.. ఎమీ?
తమిళసినిమా: అంతేనా ఎమీ? కుదిరితే కొన్ని చిత్రాలు, అందులో మరికొన్ని రొమాన్స్ సీన్స్ అందించే అవకాశం ఉండదా? ఇది ఇంగ్లిష్ బ్యూటీ ఎమీజాక్సన్ గురించి ఆమె అభిమానుల అభిప్రాయం. ఇంతకీ ఏమిటీ ఎమీ గోల అనేగా మీ ఆసక్తి. మదరాసుపట్టణం చిత్రంతో కోలీవుడ్‌కు, ఇంకా చెప్పాలంటే భారతీయ వెండి తెరకు పరిచయమైన నటి ఎమీజాక్సన్. ఆ చిత్రం ఒక్కటే ఈ అమ్మడికి సరైన సక్సెస్ ఇచ్చింది. ఆ తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన చిత్రం ‘ఐ’. ఆ చిత్రం ప్రేక్షకుల మధ్య మిశ్రమ ఆదరణ అందుకుంది. అయితే ఆ చిత్రంలో హద్దుల అంచుల వరకూ అందాలను ఆరబోసి అభిమానులను ఖుషీ పరిచింది. అందుకే ఎమీ కోలీవుడ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. అంతే కాదు కోలీవుడ్‌నే నమ్ముకుని ఇక్కడే మకాం పెట్టింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించిన 2.ఓ చిత్రంలో నటించింది. ఈ చిత్రం కోసం రజనీకాంత్ సహా చిత్ర వర్గాలు, సినీ వర్గాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎమీ కూడా 2.ఓ చిత్రం అందించే విజయం కోసం ఎదురు చూస్తోందని అందరూ అనుకుంటున్నారు. నిజమే ఇంతకు ముందు తనూ అలాంటి స్టేట్‌మెంటొకటి చేసింది. ఈ చిత్రం విజయం ఎమీకి చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈ జాణకు చేతిలో ఏ భాషలోనూ ఒక్క చిత్రం కూడా లేదు. అయినా ఇలాంటివేవీ పట్టించుకోకుండా హాలీవుడ్ సూపర్ గర్ల్ సీరీస్‌లో నటించడానికి అమెరికాలోని లాస్ఏంజిల్స్కు పరిగెత్తింది. అంత వరకూ బాగానే ఉంది. అమ్మడు ఇక 2018 వరకూ ఇదే నా ఇల్లు అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇండియన్ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. దీంతో అంతేనా కుదిరినప్పుడైనా కోలీవుడ్‌లో కొన్ని చిత్రాలు లేదా సింగిల్ సాంగ్స్‌లో రొమాన్స్ చేసే అవకాశం లేదా అంటూ ఎమీ అభిమానులు ట్విట్టర్లో అడుగుతున్నారు. మరి వారి కోసం అయినా ఎమీ మనసు మార్చుకుంటుందో, లేదో చూడాలి. -
ఆ నిర్మాతపై జీవితకాల నిషేధం
న్యూయార్క్: లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్ (పీజీఏ)జీవిత కాల నిషేధం విధించింది. నటీమణుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇప్పటికే పీజీఏకు రాజీనామా చేశారు. నిషేధం కారణంగా మున్ముందు కూడా ఆయన పీజీఏ సభ్యత్వం స్వీకరించే అర్హత కోల్పోతారు. వీన్‌స్టీన్‌ను గిల్డ్ నుంచి బయటకు పంపే చర్యలు తీసుకోవాలని ఈ నెల 16వ తేదీనే పీజీఏ నిర్ణయించింది. అయితే, బైలాస్ ప్రకారం నిర్దేశిత నిబంధనల ప్రకారమే ఆపని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు చర్య తీసుకోవటానికి 15 రోజుల ముందుగా ఆయనకు నోటీసులు అందజేశారు. స్పందించిన వీన్‌స్టీన్ పీజీఏ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీన్‌స్టీన్ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట... పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. లైంగిక వేధింపుల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పీజీఏ పేర్కొంది. దుష్ప్రవర్తన, వేధింపులకు 1970వ దశకం నుంచీ పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను బ్రిటిష్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ అకాడెమీ కూడా బహిష్కరించింది. ది వీన్‌స్టీన్ కంపెనీ కూడా ఆయన్ను వెళ్లగొట్టింది. -
'నాకు జీవితమే లేకుండా చేస్తానన్నాడు'
లండన్ : తాను చెప్పినట్లు వినకపోతే తనకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరించాడని ప్రముఖ హాలీవుడ్ నటి ఈవా గ్రీన్ హాలీవుడ్ నిర్మాత, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హార్వే వెయిన్స్టన్పై ఆరోపించింది. అయితే, ఆరోజు తాను ఏదోలా బయటపడి తప్పించుకున్నానని, లేదంటే జీవితాంతం మర్చిపోలేని సంఘటన జరిగి ఉండేదని తన అనుభవం వెల్లడించింది. ఇప్పటికే హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో హార్వేపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాండ్తోసైతం నటించిన ఈవా తన అనుభవాన్ని తాజాగా పంచుకున్నారు. 'అందరితో చెప్పినట్లుగానే నాతో కూడా అదే విషయం చెప్పాడు. సినిమా స్క్రిప్టు గురించి మాట్లాడుకుందాం రావాలని పిలిచాడు. వృత్తి నేపథ్యంలోనే సమావేశం కావడంతో నేను కూడా వెళ్లాను. అతడి హోటల్లోనే కార్యాలయం కూడా ఉంది. ఆ రోజు నేను ఆయనను అనుసరిస్తూ వెళ్లాను. అక్కడికి వెళ్లాక అతడి దుస్తులు విప్పేసి మసాజ్ చేసేందుకు రమ్మన్నాడు. నేను ఏం మాట్లాడుతున్నారని ప్రశ్నించాను. ఆయన చెప్పినట్లు వినాలని బెదిరించారు. లేదంటే నాకు జీవితమే లేకుండా చేస్తానని బెదిరించారు. నేను అవన్నీ పట్టించుకోకుండా పారిపోయి వచ్చాను' అని తన భయంకర అనుభవం చెప్పుకుంది. -
అతడి వద్దకు వచ్చిన 40మందికి అదే అనుభవం
లండన్ : ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా దాదాపు 20 ఏండ్లపాటు ఆయన అకృత్యాలకు అంతలేకుండా పోయింది. పైకి పెద్ద మనిషిలా చెలామణి అవుతూ హాలీవుడ్ చిత్ర నిర్మాణ రంగంలో మూవీ మొగల్‌గా వెలుగొందుతూ హర్వే వెయిన్‌స్టన్ పెద్ద చీకటి రాజ్యమే నడిపాడు. యువతుల, మహిళల అవసరాలు, కలలను అవకాశంగా తీసుకొని తనకు నచ్చినట్లుగా వారితో ప్రవర్తించాడు. ఒప్పుకుంటే మంచిగా లేదంటే వార్నింగ్‌లు, దాడి చేయించే సంఘటనలు, కెరీర్లేకుండా చేసే పనులతో దాదాపు తేనెపూసిన కత్తిలా ప్రవర్తించాడు. ఇలా దాదాపు ఒకరు కాదు ఇద్దరు కాదు.. హాలీవుడ్‌ని ప్రముఖ నటీమణులు 40మంది వరకు అతడి బాధితులే. ఉదాహరణకు ఎంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో, లియా సెడాక్స్, కేట్ బెక్కిన్సేల్ ఇలా చెప్పకుంటూ వెళితే అంతా ప్రముఖులే.. ఇంకా బయటకు కనిపించని వాళ్లు.. ధైర్యంగా తమకు జరిగిన అనుభవాలను వెల్లడించని వారు పదుల సంఖ్యలో ఉన్నారు. 1990 దశకంలో మొదలుకొని ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టిన ప్రతి మగువను అతడు ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేసినట్లు తెలుస్తోంది. సినిమా కథలు చర్చిద్దాం రండి అని చెప్పి వారు వచ్చే సమయానికి అతడు బాత్ రూమ్‌లో నగ్నంగా ఉండి లోపలికి పిలిచేవాడంట. అతడి ప్రవర్తనను ముందే పసిగట్టి తాము బయటపడేవాళ్లమని వారంతా దాదాపు ఒకే అనుభవం చెప్పారు. -
'ఇలాంటి భర్త నాకొద్దు.. మీడియా అర్ధం చేసుకోవాలి'
న్యూయార్క్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్(65)కు మరో గట్టి షాక్ ఎదురైంది. ఆయనను విడిచిపెట్టి వెళుతున్నట్లు భార్య ఫ్యాషన్ డిజైనర్ జార్జియానా చాప్మన్(41) ప్రకటించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న హార్వేపై హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని కొందరు, లైంగిక దాడి చేశారని ఇంకొందరు ఆయనపై కేసులు పెట్టగా తాజాగా ప్రముఖ నటి ఏంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో వంటి నటీమణులు కూడా పెదవి విప్పారు. తమపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాన్ని న్యూయార్కర్ మేగజిన్, డెయిలీ న్యూస్ ముఖచిత్రంతో పెద్ద స్టోరిని వేసింది. దీంతో తారా స్థాయిలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఇలాంటి షాకింగ్ విషయాలు తెలిసిన తర్వాత తాను ఇక ఆయనతో ఏమాత్రం ఉండబోనని హార్వే భార్య చాప్మన్ ప్రకటించారు. 2007లో ఆయనను వివాహం చేసుకున్న చాప్మన్ ఆరు రోజులపాటు మౌనంగా ఉండి చివరకు ఆయనతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. తొలుత ఆయనకు ఆమె మద్దతిస్తూ వచ్చినప్పటికీ ఆమె ఫ్యాషన్ లేబుల్ మార్చెసాను అంతా బహిష్కరించండి అంటూ ప్రజలు పిలుపునివ్వడంతో ఇక ఆమె వేరే దారి లేక ఆయనతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 'మహిళలందరి తరుపున నా హృదయం రోధిస్తోంది. ఇలాంటి క్షమించరాని చర్యలకు బాధితులైన వారిని చూసి నేను బాధపడుతున్నాను. నేను ఇక నా భర్తను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా పిల్లలను చూసుకోవడమే నాకున్న తొలి ప్రాధాన్య అంశం. ఇలాంటి సమయంలో దయచేసి నాకు కొంత ప్రైవసీ ఇవ్వండని మీడియాను వేడుకుంటున్నాను' అని ఆమె చెప్పారు. -
ఈ నిర్మాత కామాంధుడు.. ఏంజెలినాపై కూడా..
న్యూయార్క్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ గురించి మరో బాంబులాంటి విషయం తెలిసింది. పలువురు హాలీవుడ్ నటీమణులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇప్పటికే దశాబ్దకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటున్న ఆయన గురించి మరో షాకింగ్ విషయాన్ని న్యూయార్కర్ అనే మేగిజిన్ వెల్లడించింది. వెయిన్‌స్టన్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన వారు పదుల సంఖ్యలో ఉన్నారని, వారిలో ప్రముఖ హాలీవుడ్ నటీమణులు ఎంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో కూడా ఉన్నారని ఆ మేగిజిన్ వెల్లడించింది. వారిద్దరు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వెయిన్ స్టన్ సినిమాలో తమ కెరీర్ ఆరంభంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తన లైంగిక వాంఛలు తీర్చాలని వేధించాడని వారు వివరించారు. దీంతో ఇప్పుడు ఆయనను దాదాపు అంతా అసహ్యించుకునే పరిస్థితి ఎదురైంది. ఇక అమెరికాలో పెద్ద పార్టీ అయినా డెమొక్రటిక్ కూడా షాక్‌కు గురైంది. ఎందుకంటే వెయిన్‌స్టన్ ఎప్పటి నుంచో ఈ పార్టీకి పెద్ద విరాళదాత. ఆయనపై వచ్చే ఆరోపణలు కూడా గతంలో డెమొక్రాట్లు కొట్టిపడేసేవారు. అయితే, తాజాగా ఆయన నిజస్వరూపాన్ని మేగిజిన్ మరోసారి ఆధారాలతో సహా వెల్లడించడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు మాలియా కూడా ఈయన వద్దే ఇంటర్న్‌షిప్ చేస్తోంది. దాదాపు ఎనిమిదిమందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో టైమ్స్ వెల్లడించగా ఇప్పుడు ఎంజెలీనావంటి నటీమణులను కూడా ఆయన వదలలేదని తెలియడం, వారు కూడా ఈ విషయం చెప్పడం మూలిగేనక్కపై తాటి పండు పడ్డ చందాన ఆయన పరిస్థితి తయారైంది. దీనిపై హిల్లరీ క్లింటన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను ఏమాత్రం సహించరాదని అన్నారు. -
ఆ పిచ్చిలో పడకూడదనే..
లండన్: ప్రముఖ హాలీవుడ్ సుందరి కేట్ విన్స్లెట్ తన పిల్లలకు కొన్ని నిషేధాజ్ఞలు అమలుపరిచింది. వారు ఎట్టి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశించడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేసింది. ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాలోకి తన ఇద్దరు పిల్లలను అనుమతించకుండా కట్టడి చేసింది. వారు అలా చేస్తే తమ అస్తిత్వాన్ని కోల్పోతారని, వారి సహజసిద్ధ లక్షణాలపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ పరిమితులు విధించినట్లు చెప్పింది. విన్స్లెట్కు మియా అనే టీనేజ్ కూతురు జో అనే 11 ఏళ్ల బాబు ఉన్నాడు. ఈ రోజుల్లో టీనేజి యువతుల్లో సోషల్ మీడియా ప్రభావం అమితంగా ఉందని, దాని పిచ్చిలో పడి వారికి అసలు ఏం కావాలో అనే విషయం మర్చిపోతున్నారని, ఆహారపు అలవాట్లలో కూడా తీవ్ర మార్పులు వస్తాయని అందుకే తన ఇంట్లో సోషల్ మీడియాను నిషేధించి.. తన పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. -
ఇక నటనకు గుడ్ బై!
లాస్ ఏంజిల్స్:హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజిలీనా జోలీ నటనకు గుడ్ బై చెప్పనుందా? ఆమె దృష్టి నటన నుంచి దర్శకత్వం వైపు మళ్లిందా?అంటే ఆమె తాజా వ్యాఖ్యలను బట్టి అవుననక తప్పదు. తనకు కెమెరా ముందు నిలబడటం కంటే మెగా ఫోన్ చేతిలో పట్టుకోవడమంటేనే ఇష్టమంటోంది. అయితే తాను దర్శకురాలిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని హొయలు ఒలగబోస్తోంది. 'నాకు నటించడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. కెమెరా ముందు ఎప్పుడూ నిలబడాలన్నా అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ఇక నుంచి పూర్తి స్థాయిలో ఫిల్మ్ మేకింగ్ పై దృష్టి పెడతా. దర్శకత్వ శాఖలో కూడా రాణిస్తానని ఆశిస్తున్నా' అని ఏంజిలీనా స్పష్టం చేసింది. చివరిసారిగా ఏంజిలీనా 'మేల్ ఫీసెంట్' చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. గత మే నెల్లో విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను కొల్లగొట్టింంది. -
‘అందాల’ ఆర్ట్ ఎగ్జిబిషన్!
హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్ల లీకైన నగ్న చిత్రాలు కనువిందు చేయుబోతున్నాయుట. అమెరికా సెరుుంట్ పీటర్స్‌బర్గ్‌లోని ‘కోరి అలెన్ కాంటెంపరరీ ఆర్ట్’లో వీటిని ప్రదర్శించనున్నారని ‘ఈఆన్లైన్.కామ్’ కథనం. త్వరలోనే వీటిని ప్రజల సందర్శనార్థం ఎగ్జిబిషన్లో పెట్టనున్నారు. ఈ ఇద్దరి సెలబ్రిటీలకు చెందిన ఏడేళ్ల ప్రైవేట్ వుూమెంట్స్ కలెక్షన్ ఈ ‘ది నో డిలీట్’ ప్రదర్శన అక్టోబర్ 30న ప్రారంభవువుతుంది. సో... వెరుుట్ ఫర్ ఏ ‘షో’కేస్. నెస్‌తో నో కాంప్రమైజ్..! సొట్ట బుగ్గల సుందరి ప్రీతీజింటా- ఆమె మాజీ ప్రియుుడు నెస్ వాడియూల రగడ ఇప్పట్లో సద్దువుణిగేలా లేదు. ఇటీవల ఈ ఇద్దరి వుధ్య సయోధ్యకు చేసిన ప్రయుత్నాలు బెడిసి కొట్టాయుని ‘వుుంబై మిర్రర్’ కథనం. నెస్ బేషరతుగా క్షవూపణ చెప్పేదాకా క్షమించేది లేదని తెగేసి చెబుతోంది ప్రీతి. సయోధ్యకు ఈ వుుద్దుగువ్ము ఐదు కండిషన్లు పెట్టిందట. అందులో అన్నింటికీ ఓకే అన్న నెస్... ‘సారీ’ షరతుకి వూత్రం సారీ చెప్పడంతో కథ మొదటికి వచ్చింది. ప్రీతి మాజీ ప్రియుుడిపై కేసు పెట్టిన నేపథ్యంలో... అతని కుటుంబ సభ్యులు ఈ రాజీ ప్రతిపాదనని తెరపైకి తెచ్చారని సవూచారం. రొవూన్స్... భలే చాన్స్..! కలల రాకువూరుడు సల్మాన్‌ఖాన్‌తో రొమాన్స్ చాన్స్ వస్తే ఏ అవ్మూరుు వూత్రం వదులుకొంటుంది! కరీనా అరుునా... కత్రినా అరుునా..! ఇప్పుడా అదృష్టం అందాల తార సోనమ్ కపూర్‌కు వచ్చింది. ఇంకేవుుంది... అవ్ముడు ఎగిరి గంతేసింది. అందర్నీ పిలిచి... చిలిపిగా చెప్పేసుకొంటోంది. ‘ప్రేమ్ (మైనే ప్యార్ కియూలో సల్మాన్ పాత్ర)ను చూస్తూ... ప్రేమిస్తూ పెరిగా. ఇప్పుడు అతడితో రొవూన్స్ చేయుబోతున్నానని తెలిసి నవ్ములేక నన్ను నేనే గిల్లుకున్నా’ అంటూ తెగ వుురిసిపోతోంది. ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రంలో కండల వీరుడితో కలసి చేయుబోతోంది సోనమ్. -
హాలీవుడ్ స్థాయిలో సినిమాసిటీ: కేసీఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్‌ను తలపించేలా తెలంగాణలో సినిమా సిటీని నిర్మించతలపెట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రవి కొత్తరకార, సి.కళ్యాణ్, శశికుమార్, నందకుమార్, ఎన్.శంకర్, హెచ్డి గంగరాజు, కాట్రగడ్డ ప్రసాద్, ఉదయ్‌సింగ్, ఎ.రాజ్‌కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ సినిమా సిటీ కేవలం సినిమాలు తీయడానికే పరిమితం కాకుండా, టీవీ సీరియళ్లు, కార్యక్రమాల రూపకల్పన, గ్రాఫిక్ ఎఫెక్ట్స్, యాని మేషన్, ప్రజా సమస్యలపై లఘుచిత్రాలకు ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఎక్కడ, ఎలా నిర్మిం చాలనే దానిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ముంబై సినీ పరిశ్రమ ప్రతినిధులు, భారతదేశ సినీరంగపెద్దలు, తెలుగు సినీపరిశ్రమకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పా రు. అనంతరం ఫిల్మ్‌ఫెడరేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా భారత్ కేం ద్రంగా తెలంగాణ ఫిల్మ్‌సిటీ మారాలనే సంకల్పానికి తాము కూడా చేయూతనందిస్తామని తెలిపారు. రెండువేల ఎకరాల్లో ప్రారంభించే ఈ ఫిల్మ్‌సిటీ అన్ని భాషల సినిమాల తయారీకి కేంద్రం కావాలని ఆశిస్తున్నామన్నారు. సీఎంతో టర్కీ కాన్సూల్జనరల్ భేటీ ఈ ఏడాది అక్టోబర్ 24న హైదరాబాద్‌లో జరగనున్న తమ జాతీయ దినోత్సవాల్లో పాల్గొనాలని టర్కీ కాన్సూల్జనరల్ మురాత్ ఒమెరోగ్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. దీనికి కేసీఆర్ సమ్మతించారు. సోమవారం సచివాలయంలో మురాత్ తెలంగాణ సీఎంతో భేటీ ఆయ్యారు. కాగా, మరోసారి సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించాలని నిర్ణయించారు. టర్కీలోని ఇస్తాంబుల్ ఇప్పుడు నవీకరించిన నగరమని, దీనిని సందర్శించాలనే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాటుచేస్తామని మురాత్ ఒమెరోగ్లు హామీ ఇచ్చారు. -
నేనుమార్లిన్ మన్రో!
‘‘ఈ హాలీవుడ్ చిత్రమైంది. ఇక్కడ మీ ఆత్మను పరిస్తే దక్కేది యాభై చిల్లర పెంకులు; అదే ఒక్క ముద్దుకు వేయి డాలర్లు ముడతాయి.’’ నాకు ఇప్పుడే తెలిసింది. ‘ఫాక్స్’ వాళ్లు నన్ను ‘సమ్‌థింగ్ ఈజ్ గాట్ టు గివ్’ నుంచి తొలగించారట. డెరైక్టర్ జార్జ్ కుకర్ నాతో పనిచేయలేనని చెప్పాడట. నేను ఆలస్యంగా షూటింగులకు వెళ్తున్నానట. నిలకడగా ఉండనట. మరి ఎవరిని పెట్టి పూర్తిచేస్తారు? మరో మార్లిన్ మన్రో దొరుకుతుందా వీళ్లకు? ‘సమయానికి’ రెడీ అవడం నాకెందుకు చేతకాదు! అందమైన స్త్రీకి, అద్దం ముందు కూర్చుంటే ఎందుకు తనివి తీరదో ఎవరూ కనిపెట్టినట్టులేదు. ఇంటిని అటుండనీ, ఒంటిని దిద్దుకోవడంలోనే నాకు తెల్లారిపోతుంది. ఇక నాకు మేకప్ ఎందుకు? ఎటని వెళ్లను! రాత్రి మస్కారా కూడా అలాగేవుంది. షాంపేన్ ఎక్కడుంది? నేను ఎలా నడిచినా ఆకర్షణీయంగానే ఉన్నప్పుడు, ఊగుతూ తూగుతుంటే మాత్రం బాగుండనా! మార్లిన్, నువ్వు ఫ్యాషన్ ఇండస్ట్రీని పదేళ్ల ముందుకు జరపగలవు! అలాంటిదాన్ని, ఫ్రాంక్ (సినట్రా) ఏమన్నాడు? కొంపదీసి, ఇక్కడే (కాల్ నేవా క్యాసినో) చచ్చిపోదుగా, అన్నాడా! నన్ను తోసేయమని చెప్పినట్టేగా! తను నామీద ఆశపడ్డవాడేగా! ఇప్పుడేం చేస్తావో చెయ్యి. ఇంకో పెగ్గు వంపుకుంటున్నా! ఈ ఇల్లు నాది. త్రీ బెడ్రూమ్. మెక్సికన్ స్టైల్లో కట్టించాను. నా ఫైర్‌ప్లేస్ ఎలా ఉంటుంది? డ్రెస్సర్, టిన్ కేండిల్బ్రా, ఫోల్డింగ్ స్టూల్స్... ఎక్కడ కొన్నానో అందరికీ కావాలి! అందరికీ ఎందుకు తెలియడం? పడుకున్నప్పుడు మీరు పైజామా ధరిస్తారా? గౌనా? ఇంకేమైనా? సినిమా తార అయితే ఏదైనా అడిగేయొచ్చా? మీకు వారానికి ఎంతమంది బాయ్ఫ్రెండ్సు? గాసిప్ కాలమ్స్ ఎక్కువ చదువుతారనుకుంటాను. ఏడీ నా మగస్నేహితుడు? హల్లో... నేను ల్లో అని ఒత్తి పలకడం ముచ్చటగా ఉంటుందట. పలకరించడానికి ఎవరూ లేరే! నా తండ్రి అని చెప్పిన వ్యక్తిని నేను తండ్రిగా భావించలేదు. మా అమ్మ ఫొటోలో చూపించినాయన బాగున్నాడు. సన్నమీసం, క్లార్క్ గేబుల్లా. ఆయన నాన్నయితే ఎంత బాగుండు! అమ్మకు మానసిక స్థిమితం లేదు; ఆర్థిక స్థిమితం అసలు లేదు. అందుకే నేను దేశపు బిడ్డను. నేను అనాథగా పెరగాలా! అమ్మ స్నేహితురాలు గ్రేస్ మెకీ నా బాధ్యత తీసుకుంది. జీన్ హార్లో అంటే పడిచచ్చేది. ఆమెలాగా నాకు మేకప్ చేసేది. నువ్వు కూడా సినిమా స్టార్‌వి కావాలనేది. పదకొండేళ్లకొచ్చాను కదా! సినిమా గొప్పతనం అర్థమవుతోంది. కానీ గ్రేస్ భర్త ప్రవర్తన అర్థంకాలేదు. అప్పుడు జేమ్స్ (డఫెర్టీ) పరిచయమయ్యాడు. పరిచయం ఏంటి? మా పక్కిల్లేగా! జిమ్మీ అనేదాన్ని. పోలీసు కావాలని అతడి కోరిక. జిమ్మీని చేసుకుంటే ఆసరా దొరుకుతుంది. పదహారేళ్ల అమ్మాయి, ఇరవయ్యేళ్ల అబ్బాయి! నేను ప్రేమించానా అతణ్ని? నేను హుషారుగా పాడతాను, ఆనందంతో నృత్యం చేస్తాను. అది జిమ్మీకి అర్థమయ్యేది కాదు. దాంతో మాకు మాటలు లేకుండా పోయాయి. నేను ఆర్మీ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడొక అద్భుతం జరిగింది. మమ్మల్ని ఫొటోలు తీయడానికి డేవిడ్ కనోవర్ వచ్చాడు. యువతులు కూడా యుద్ధంకోసం కష్టపడుతున్నారని చెప్పాలిగదా! అతడే నన్ను మోడలింగ్ ఏజెన్సీకి అప్లై చేసుకొమ్మన్నాడు. నా పాతజీవితం నాకు నచ్చలేదు. నా కలలకు అందులో చోటులేదు. ఇంకేం, జీన్ హార్లో మళ్లీ వచ్చిందన్నారు. ‘నయాగరా’లోని నా నడకను యువతులు అనుకరిస్తున్నారట! ‘జెంటిల్మెన్ ప్రిఫర్ బ్లాండెస్’... ‘హౌ టు మ్యారీ ఎ మిలియనీర్’... ‘రివర్ ఆఫ్ నో రిటర్న్’... బంగారుజుట్టు, అమాయకపు చూపులు... మార్లీన్, యు ఆర్ సో స్వీట్! ‘ద సెవెన్ ఇయర్ ఇచ్’ అప్పుడు నా లోపలి గోడల్ని ప్రేమ గోకుతోంది. జిమ్మీతో విడాకులయింతర్వాత జో(డిమాగియో) దగ్గరయ్యాడు. బేస్‌బాల్ ఆటగాడు. 56 గేమ్స్‌తో హిట్టింగ్ స్ట్రీక్ వరల్డ్ రికార్డ్ ఉంది. పిల్లాడి తండ్రి! ఇదీ నిలబడలేదు. కారణం: గాలికి పైకిలేచే స్కర్టు సీన్. నా సిగ్నేచర్ ఫొటో! కానీ జో నొచ్చుకున్నాడు. అరుచుకున్నాం. లిజ్ రినే, క్లియో మూర్, రీటా గామ్... ఎంతమందితో అతడికి సంబంధముందని వార్తలొచ్చాయి. పబ్లిగ్గా ఒప్పుకున్నాడా? జోసెఫ్‌ను నా పిల్లాడిలా చూసుకుందామనుకున్నానే! జో ఒకప్పుడు గొప్పగా ఆడివుండొచ్చు. ఇప్పుడు నా అంత ఇమేజ్ ఏడిచిందా? మాది 274 రోజుల పెళ్లి అని లెక్కలేస్తున్నారట. అదేమైనా థియేటర్లో ఆడుతున్న సినిమానా? డిమాగియో బాధ కూడా నిజమేనేమో! ఇంతా చేస్తే నేను సెక్స్ సింబల్నా? 37-23.5-37.5 కొలతల శరీరాన్నా? నేను యంత్రాన్ని కాదు. ‘బస్‌స్టాప్’లో నా నటనను విమర్శకులు మెచ్చుకుంటున్నారట! ఇన్నిరోజులూ నా నడుము దగ్గరే ఆగిపోయాయా వాళ్ల చూపులు? ఈ మాత్రం పరిణతి చూపకపోతే ఆర్థర్ మిల్లర్ నన్ను ఎలా భార్యగా అంగీకరిస్తాడు! ఆర్థర్ నాకోసమే మిస్ఫిట్స్ రాస్తున్నాడు. కానీ మాకు మేము మిస్ఫిట్స్గానే ఉండిపోతున్నామా! ఆర్థర్‌తో నాకు ఏం సమస్య ఉంది? ప్రేమ లేకపోతే నేనెందుకు కోర్టులో అతడికోసం నిలబడ్డాను! నిర్మాతలందరూ నా కెరీర్‌ను రిస్క్ చేస్తున్నావన్నారు. కమ్యూనిస్టులతో నీకెందుకు అన్నారు. సినిమావాళ్లు, కార్మికులు, నల్లవాళ్లు, అరబ్బులు, యూదులు అందరూ సోదరుల్లా మెలగాలని కోరుకున్నానే! దానివల్ల ఎఫ్బిఐ నా మీద కూడా నిఘా పెట్టిందే! టోనీ కర్టిస్! ఓ లవ్లీ మేన్! నేను చంచలను. పురుషుడి ఆకర్షణకు లొంగిపోకుండా ఉండే మనోబలం నాకెందుకు లేదు! హ్యాపీ బర్త్‌డే మిస్టర్ ప్రెసిడెంట్! నాలాంటి అతిలోక సుందరికి జాన్ (ఎఫ్ కెన్నెడీ) లాంటివాడే సరైన జోడి. నా సాన్నిహిత్యం ఆయన పదవికి అలంకారమా? ఆటంకమా? నన్నే తిరస్కరిస్తాడా ఎంత అధ్యక్షుడైతే మాత్రం! నేను లేకపోతే ఏమిటో చూపించాలి. నేను ఎక్కడ పుట్టాను? ఎలా పెరిగాను? ఎవర్ని ఆదరించాను? దేహం మీద మమకారం కొద్దీ ఆత్మను నిర్లక్ష్యం చేశానా? ఆత్మను శుభ్రం చేసుకోవడం సాధ్యమేనా? ఇంకా ఈ దేహపు వస్త్రాలు నాకెందుకు? బార్బిట్యురేట్స్... ఎన్ని మాత్రలు వేసుకుంటే కళ్లు మళ్లీ తెరవకుండా నిద్రపోతాం? అయినా నేనెందుకు చావాలి? హాయిగా పిల్లల్ని కంటాను, పెద్దచేస్తాను, అమ్మమ్మనైపోతాను. ఏం బాగుండదా? మార్లిన్ మన్రో నానమ్మా! నేను నక్షత్రం లాంటిదాన్ని. కానీ నక్షత్రాల వయసు తెలుసా? నేను గృహిణిగా బతకలేదు. ప్రయత్నమైతే చేశాను. తల్లిని కావాలని ఎంతగా ఆశపడ్డాను! మూడుసార్లు గర్భస్రావం అయిపోయిందే! నేను స్త్రీగా విఫలమయ్యాను. నానుంచి ఎవరైనా ఏం ఆశించారు? నేనేం ఇవ్వలేకపోయాను? నేను ప్రేమించిన మనిషిగా వాళ్లను ప్రేమించానా? వాళ్లను వాళ్లుగా ప్రేమించానా? ఒక్క నిమిషం. ఫాక్స్ వాళ్ల నుంచి సందేశం. నాకోసం డెరైక్టర్నే మార్చేస్తామంటున్నారు. ఎందుకు మార్చరు! కానీ చప్పగా ఉంది. నేను ఉత్సాహంగా కనబడ్డానేమోగానీ ఏనాడూ ఆనందంగా లేను. ఎవరి నొప్పిని వారే అనుభవించాలి. జీవితం పట్ల కఠినంగా ఉండాలంటారు. కోమలమైన స్త్రీ అలా ఎలా ఉండగలదు? కఠినత్వంలో ఏ స్త్రీత్వమూ లేదే! నేను 1926లో పుట్టాను. ఇది 1962. 26-62. ఇదేదో చిత్రంగా ఉంది. జీన్ హార్లో కూడా ఎక్కువ కాలం బతకలేదు. 26 ఏళ్లకే పోయింది. చివరికి నా దేహం కూడా నశిస్తుందా? మనిషికి అర్థవంతమైన ముగింపు ఏదవుతుంది? నాకు ఏస్పర్జర్ సిండ్రోమ్ ఉందంటారేమో! నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారేమో! నేనేమిటో అర్థంకాక తలలు బద్దలు గొట్టుకోవాలి. మార్లిన్ మన్రో అనే రాకుమారి గురించి జానపద కథలా లోకం చెప్పుకుంటూనే ఉండాలి. నా మొదటి భర్త జేమ్స్ నేను చనిపోయానని తెలిస్తే ఏమంటాడు? తన పోలీసు డ్యూటీలో పాట్రోల్కు వెళ్తూ ‘ఐ యామ్ సారీ’ అనేస్తాడంతే! ఆర్థర్... రచయిత కదా! నాలాంటి జీవితాలకు శుభం కార్డు పడదని ఆయనకు తెలిసేవుంటుంది! జో మాత్రం మళ్లీ చేరువయ్యాడు. సినిమావాళ్లకూ క్రీడాకారులకూ మధ్య ఏదో తెలియని సంబంధం. వాస్తవం కన్నా కల్పనలోనే ఎక్కువగా బతుకుతాం కాబోలు. అయినా, ‘జస్ట్ ఫ్రెండ్స్’గా మాత్రమే ఉండదలిచాను. నువ్వు ఏమైనా చేయగలిగితే నా శరీరానికి అంతిమసంస్కారాలు నిర్వహించు. నీ చేతులకు తోచినప్పుడు నా సమాధి ముందు కొన్ని ఎర్రగులాబీ పూలనుంచు! కథనం: ఆర్. ఆర్. -
ప్రేక్షకుల వెర్రి అభిమానంతోనే నా సక్సెస్!
సన్నీ లియోన్... ఈ పేరే ఓ సంచలనం. శృంగార చిత్రాల నాయికగా సన్నీ పొందిన ప్రఖ్యాతి అంతా ఇంతా కాదు. 41 శృంగార చిత్రాల్లో నటించిన సన్నీ, అత్యధికంగా శృంగార చిత్రాలకు కూడా దర్శకత్వం వహించింది. రెండేళ్ల క్రితం ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొని, బాలీవుడ్లో పాపులర్ అయిపోయిన ఆమె.. బాలీవుడ్లో బిజీ తార. ప్రస్తుతం ఓ అరడజను సినిమాలు సన్నీ చేతిలో ఉన్నాయి. దీనంతటికీ కారణం ప్రేక్షకులు పిచ్చి అభిమానమేనని సన్నీ లియోన్ తెలిపింది. ప్రస్తుతం దక్షిణాది చిత్రాల్లో రెండు పాటల్లో నటించడానికి ఓకే చెప్పిన ఈ అమ్మడు.. ఐటం సాంగ్స్ ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని తెలిపింది. ఐఎన్ఎస్ కు ఇచ్చిన తాజా ఇంటర్యూలో సన్నీఈ వ్యాఖ్యలు చేసింది. 'నేను ఈ స్థాయిలో ఉండటానికి ప్రేక్షకుల పిచ్చి అభిమానమే. అలలా వచ్చిన నాకు ఇంతటి అభిమానం ఉందంటే అది కచ్చితంగా అభిమానులదే. వారి అండ దండలే నా సంతోషానికి కారణం'అని సన్నీ పేర్కొంది. హిందీ చిత్రాల్లో దూసుకుపోతున్న సన్నీ.. త్వరలోనే హిందీ చిత్రాలకు డబ్బింగ్ చెబుతానని స్పష్టం చేసింది. శృంగార చిత్రాలకు ఇక స్వస్థి చెప్పాలని అనుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. -
తుషార్‌కు జాక్‌పాట్!
బాలీవుడ్ మాజీ హీరో జితేంద్ర కొడుకు తుషార్ కపూర్‌కు జాక్‌పాట్ తగిలినట్టు హాలీవుడ్ భోగట్టా. బాలీవుడ్లో కొన్నేళ్లుగా తంటాలు పడుతున్నా, ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్లేవీ లేని తుషార్‌కు మాజీ జేమ్స్‌బాండ్ స్టార్ పీర్స్ బ్రోస్నన్, కేట్ హడ్సన్లతో నటించే అవకాశం దొరికిందట. ఆటవిడుపుగా అమెరికా వెళ్లిన తుషార్‌కు అనుకోకుండా ఈ అవకాశం దక్కినట్టు అతడి సన్నిహితుడొకరు చెప్పారు. ఈ చిత్రానికి దర్శకత్వం.. పీర్స్ బ్రోస్నన్ కొడుకు సీన్ బోస్నన్. -
'నాకోసం ఎప్పుడూ గుగూల్ లో శోధించలేదు'
లాస్ ఏంజిల్స్:మనకు ఏమైనా సమాచారం కావాల్సి వస్తే గూగుల్ సెర్చ్ ఇంజన్ ను ఆశ్రయిస్తాం. అలా గూగుల్ లో చర్చించడానికి వారు సెలిబ్రెటీలా?సామాన్యుల అనే తారతమ్యం కూడా ఉండదు. గూగుల్ తల్లికి అందరూ అతిథులే. ప్రస్తుత ప్రపంచం ఇంటర్ నెట్ తోనే ముడిపడి ఉందనేది కాదనలేని వాస్తవం. నెట్ తో పరిచయం ఎవరైనా గుగూల్ ను అశ్రయిస్తూనే ఉంటారు. అసలు గుగూల్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే కీలక సమాచారాన్నిఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో తెస్తోంది. కాగా, హాలీవుడ్ నటుడు జానీ డెప్(50) ఎప్పుడూ తన కోసం గుగూల్ లో శోధించలేదట. తాను కంప్యూటర్ ను ఉపయోగించినా నెట్ కు దూరంగా ఉంటానన్నాడు. ఈ విషయాన్ని తానే ప్రకటించాడు. తనకు ఇంటర్ నెట్ తో పరిచయం తక్కువని , అందులో ఎక్కువగా కనిపించే రూమర్స్ ను చూసి కలత చెందటం ఇష్టం ఉండదన్నాడు. ఈ క్రమంలోనే గూగుల్ లో తన కోసం ఎప్పుడూ శోధించలేదని జానీ స్పష్టం చేశాడు. కాగా, పిల్లలకు ఎప్పుడూ సాయంగా ఉంటూ వాళ్ల హోం వర్క్ కు తోడ్పడుతుంటానన్నాడు. ఇందులో భాగంగానే కంప్యూటర్ ను ఉపయోగిస్తానని తెలిపాడు. పిల్లలకు ఆసరాగా ఉండేందుకు అతను నటి అంబర్ హార్డ్ ను త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించాడు. -
వయసు 44.. మనసు 28...!
కొంతమంది 20లలోనే 60 ఏళ్ల వయసులో ఉన్నట్లుగా ఫీలైపోతుంటారు. అందుకు పూర్తి భిన్నంగా కొందరు 60లలోనూ 20లలో ఉన్నట్లుగా భావిస్తారు. ఏ ఫీలింగైనా శరీర తత్వం, మనస్తత్వాన్ని బట్టే ఉంటాయి. ఇక, హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్ గురించి చెప్పాలంటే... ఆమె వయసు 44. కానీ, మనసు వయసు మాత్రం 28 అంటారామె. ప్రస్తుతం జెన్నీ ఓ ధారావాహికలో నటిస్తున్నారు. అలాగే ఓ ఆల్బమ్ రూపొందిస్తున్నారు. ఓ వస్త్ర దుకాణానికి అధినేత కూడా. ఆరేళ్ల కవలలకు తల్లి. ఇన్ని బాధ్యతలను సునాయాసంగా మోసేస్తున్నారు జెన్నిఫర్. కుర్ర తారలు సైతం పోటీపడలేనంత ఎనర్జీ ఆమె సొంతం. ఎందుకంటే, తన వంటి మీదకు వయసు పెరుగుతున్నట్లు ఎప్పుడూ ఫీలవలేదట జెన్నిఫర్. ఏళ్లు గడిచే కొద్దీ వయసు పెరగడం సహజం అని, దాంతోపాటే తన ఎనర్జీ కూడా పెరుగుతోందని ఆమె పేర్కొన్నారు. -
వన్నె తగ్గని వర్జిన్ యజమాని!
సినిమా రంగంలో ప్రముఖుడిగా వెలుగుతూ, వ్యాపారవేత్తగా కోట్ల రూపాయల వ్యవహారాలను చక్కదిద్దుతూ... ఖాళీ సమయంలో థ్రిల్లిచ్చే గేమ్స్‌ను ఆడుతూ గడిపేయడం... ఇది ఏ రంగుల కల లాంటి జీవితం గురించో వర్ణన కాదు. రిచర్డ్ బ్రాసన్ వ్యక్తిగత జీవనశైలి గురించి వర్ణన. చాలా మందికి కల లాంటి జీవితాన్ని గడుపుతున్నాడాయన. హాలీవుడ్లో సినిమా స్టార్‌గా, వర్జిన్ మొబైల్ యజమానిగా, సముద్రాలపై సాహసక్రీడలతో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు. స్కూల్లో బ్రాసన్ తీరును గమనించి ఒక మాస్టారు... ‘‘రేయ్ నువ్వు అయితే కోటీశ్వరుడివి అవుతావు. లేకుంటే జైల్లో పడి, అక్కడే జీవితాన్ని ముగిస్తావు...’’ అనే వారట. మరి మాస్టారి మాటలపై గురి కుదిరిందో ఏమో కానీ కుర్ర బ్రాసన్ వెంటనే స్కూల్ మానేశాడు. చదువు మానేసి జీవితంలో సెటిలయ్యే మార్గాలను అన్వేషించడం మొదలుపెట్టాడు. అప్పటికి అతడికి 16 యేళ్లు, ఒక సాదాసీదా కుర్రాడు. కనీసం చదువు కూడా లేదు. అయితే ఏదో ఒకటి సాధించాలన్న తపన మాత్రం ఉంది. అదే అతడి చేత ఎన్నో ప్రయోగాలను చేయించింది. గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగేలా చేసింది. తీరా ఒకస్థాయికి చేరాక ఆ వెల్లువలో కొట్టుకుపోలేదు. సక్సెస్ కేవలం వ్యాపారంతోనూ, డబ్బుతోనూ ముడిపడి లేదని తనకు ఇష్టమైన రంగాలవైపు దృష్టిసారించి కొత్త మజాలను ఆస్వాదిస్తున్నాడు! స్కూలు చదువుకు సగంలోనే స్వస్తి చెప్పి ఖాళీగా ఉన్న సమయంలో కొంత పెట్టుబడితో ‘స్టూడెంట్’ అనే మ్యాగజైన్‌ను ప్రారంభించాడు బ్రాసన్. యువత లైఫ్‌స్టైల్‌కు గైడ్‌గా బ్రాసన్ తీర్చిదిద్దిన ఆ పత్రిక సూపర్‌సక్సెస్ అయ్యింది. బ్రాసన్ దశ తిరిగింది. 1970ల నాటికి బ్రిటన్‌లో వీడియో రికార్డ్‌లకు మంచి మార్కెట్ ఉండేది. బ్రాసన్ దృష్టివాటి మీద పడింది. అప్పటికే నాలుగేళ్లుగా పత్రికను వెలువరిస్తున్న ఈయన వీడియో రికార్డ్ డిస్క్ వ్యాపారంలోకి దిగాడు. లండన్‌లో ‘వర్జిన్ రికార్డ్స్’ పేరిట స్టోర్స్‌ను నెలకొల్పాడు. ఆ విధంగా ‘వర్జిన్’గ్రూప్‌కు పునాది పడింది. షాప్‌కు ‘వర్జిన్’ అని పేరు పెట్టడంలోనే బ్రాసన్ చమత్కారమంతా దాగి ఉంది. తన కంపెనీలు, ఐడియాలు ఎన్నటికీ వన్నెతగ్గనివని బ్రాసన్ విశ్వాసం. అందుకే ఆయన కంపెనీకి ఆ పేరు పెట్టుకొన్నాడు. 1999లో వర్జిన్ మొబైల్ కంపెనీని స్థాపించాడు. ప్రస్తుతం ఇండియాతో సహా చాలా దేశాల్లో ఈ నెట్వ ర్క్ అందుబాటులో ఉంది. వర్జిన్ మొబైల్ అధిపతిగా 300 కోట్ల పౌండ్లతో ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ వ్యాపారాల్లో ఒక ప్రముఖుడిగా నిలిచాడు బ్రాసన్. సినిమాలు, సాహసక్రీడలు! వ్యాపారవేత్తగా పనిలో మునిగితేలుతుండటం నుంచి వచ్చిన ఒక రకమైన విరక్తి బ్రాసన్ను సినిమాల వైపు మళ్లించింది. ‘ఫ్రెండ్స్’, ‘బే వాచ్’, ‘ది డే టుడే’వంటి టెలివిజన్ షోలలో బ్రాసన్ నటించాడు. ‘అరౌండ్ వరల్డ్ ఇన్ 80 డేస్’, ‘సూపర్‌మ్యాన్ రిటర్న్స్’ వంటి హాలీవుడ్ సినిమాల్లో కూడా చేశాడు. వ్యాపారం, ఖాళీ సమయాల్లో నటన.. ఇవి మాత్రమేగాక సాహసపూర్వకమైన ఆటల్లో కూడా బ్రాసన్ పేరు పొందాడు. వర్జిన్ మొబైల్స్ తరపునే ‘అట్లాంటిక్ క్రాసింగ్ ఛాలెంజర్’ జరుగుతుంది. ఈ పోటీల్లో బ్రాసన్ కూడా పాల్గొని విజేతగా నిలిచాడు, బెలూన్ ఫ్లైట్‌తో అట్లాంటిక్ మహాసముద్రం దాటాడు. ప్రస్తుతం బ్రాసన్ ఉన్న స్థాయిని బట్టి మాస్టారి అంచనాలు ఒకరకంగా నిజం అయ్యాయని చెప్పవచ్చు! -
భర్త ఆయుష్సు పై బెంగపెట్టుకున్ననటి కేట్ బ్లాంచెట్
లాస్ ఏంజిల్స్:ఆస్ట్రేలియాకు చెందిన నటి కేట్ బ్లాంచెట్ను తెలియని భయం వెంటాడుతోంది. తన భర్త అండ్రూ ఆప్టన్‌కు నలభై సంవత్సరాల వయసు దాటడంతో బ్లాంచెట్ మదిలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంతకీ ఆ భయం పట్టుకోవడానికి ఆమె తండ్రి మరణమే. కేట్ తండ్రి 40 ఏళ్ల వయసులోనే గుండె పోటుతో మరణించడమే దీనికి ప్రధాన కారణం. తన భర్తకు నలభై ఏళ్లు నిండిపోవడంతో.. గతంలో తండ్రి విషయంలో సంభవించిన ఆపద ఎక్కడ పునరావృతం అవుతుందోనని కేట్ తెగ భయపడిపోతున్నారు. ఈ విషయంలో కేట్ చాలా ఎక్కువగా ఆందోళనకు గురౌతున్నట్టు కాంటాక్ట్ మ్యూజిక్.కామ్ పోస్ట్ చేసింది. శేఖర్ కపూర్ దర్శకత్వం వహించిన ఎలిజిబెత్ చిత్రంతో కేట్ అంతర్జాతీయ గుర్తింపు సంపాదించింది. కేట్ నటిగానే కాక, నాటక దర్శకురాలుగా వివిధ పురస్కారాలను అందుకుంది. 1995 నుండి 2010 వరకూ ఐదు అకాడమిక్ అవార్డులకు ఎంపికైంది. మూఢ నమ్మకాల సామాన్యులకే పరిమితం కాదనేది..ఈ ఉదంతాన్ని బట్టి అర్ధమవుతోంది.