Hyderabad Book Fair
-
హైదరాబాద్ : పుస్తక ప్రదర్శనలో సందర్శకుల కిటకిట (ఫొటోలు)
-
హైదరాబాద్ : 37 వ జాతీయ బుక్‌ఫెయిర్ ప్రారంభం ..భారీ సంఖ్యలో సందర్శకులు (ఫొటోలు)
-
నేటి నుంచి పుస్తక ప్రదర్శన
కవాడిగూడ: హైదరాబాద్ బుక్‌ఫెయిర్ ఆధ్వర్యంలో 37వ జాతీయ పుస్తక ప్రదర్శన గురువారం సాయంత్రం ఎనీ్టఆర్ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు ఇది కొనసాగనుంది. బుధవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు యాకూబ్, కార్యదర్శి ఆర్.శ్రీనివాస్ విలేకరులతో ఇక్కడ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నారని తెలిపారు. ప్రతి ఇంటిలో పుస్తకం ఉండే లక్ష్యంతో బుక్ ఫెయిర్‌ను ముందుకు తీసుకువెళ్తామన్నారు. 36 ఏళ్ల క్రితం 30 స్టాళ్లతో ప్రారంభమై పుస్తక ప్రదర్శన ప్రస్తుతం 350 స్టాళ్లతో సాహితీ అభిమానులను, పుస్తక ప్రేమికులను ఆకట్టుకోనుందని తెలిపారు. బాల సాహిత్యానికి ప్రాధాన్యమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రవేశం ఉచితం.. పుస్తక ప్రదర్శనలో పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు వారి ఐడీ కార్డులు చూపించి ఉచిత ప్రవేశం పొందవచ్చని తెలిపారు. ఉచిత ఆరోగ్య శిబిరం.. నోరూరించే వంటకం తెలంగాణ రుచులతో ప్రత్యేక ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుక్‌ఫెయిర్ సందర్శకుల కోసం ఈ ఏడాది ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు రెండు వీల్ చైర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు.. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. సమావేశంలో తెలుగు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, బుక్‌ఫెయిర్ ఉపాధ్యక్షులు శోభన్‌బాబు, బాల్‌రెడ్డి, ట్రెజరర్ నారాయణరెడ్డి, జాయింట్ సెక్రటరీ సూరిబాబు, కె.సురేష్ పాల్గొన్నారు. -
మంచినీళ్ల కుండ
‘చదువని వాడజ్ఞుండగు! చదివిన సదసద్వివేక చతురత గలుగున్ !’ అంటాడు పోతన తన ఆంధ్ర మహా భాగవతంలో. చదవకపోతే ఏమీ తెలీదు, చదువుకుంటేనే మంచీ చెడుల వివేకం కలుగుతుంది; అందుకే, ‘చదువంగ వలయు జనులకు! చదివించెద నార్యులొద్ద, చదువుము తండ్రీ!’ అని ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్యకశ్యపుడితో చెప్పిస్తాడు. నిజంగానే ఆ గురువుల దగ్గరి చదువేదో పూర్తికాగానే, ‘చదివించిరి నను గురువులు! చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు! నే/ జదివినవి గలవు పెక్కులు! చదువులలో మర్మ మెల్ల జదివితి తండ్రీ!’ అని జవాబిస్తాడు ప్రహ్లాదుడు. కొడుకుకు కలిగిన వివేకం తండ్రి కోరుకున్నదేనా అన్నది పక్కనపెడితే, చదువనేది భిన్న ద్వారాలు తెరుస్తుందన్నది నిజం. ప్రహ్లాదుడు పుట్టు వివేకి కాబట్టి, తనకు కావాల్సిన సారాన్ని గ్రహించగలిగాడు. అందరికీ అలాంటి గుణం ఉంటుందా? అందుకే, ‘చదువులన్ని చదివి చాలవివేకియౌ/ కపటికెన్న నెట్లు కలుగు ముక్తి/ దాలిగుంటగుక్క తలచిన చందము’ అన్నాడు వేమన. ‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండి’నప్పుడు కూడా ఉండే బలహీనతలను ఎత్తిపొడిచాడు. ఆత్మసారం తెలుసుకోవడమే ముఖ్యమన్నాడు.అతడు ‘బాగా చదువుకున్నవాడు’ అంటే లోకాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరిణత స్వభావం ఉన్నవాడు, గౌరవనీయుడు, ఒక్క మాటలో వివేకి అని! వివేకం అనేది ఎన్నో గుణాలను మేళవించుకొన్న పెనుగుణమే కావొచ్చు. అయినా అదొక్కటే చాలా? ‘చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా/ చదువు నిరర్థకమ్ము’ అన్నాడు భాస్కర శతకకర్త మారవి వెంకయ్య. ‘బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం/పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!’ అని ప్రశ్నించాడు. కూరకు రుచి తెచ్చే ఉప్పులాగే జీవితంలో ‘యించుక’ రసజ్ఞత ఉండాలి. చాలామందిలో ఆ సున్నితం, ఆ సరస హదయం లోపించడం వల్లే సంబంధాలు బండబారుతున్నాయి. అందుకే వివేకం, రసజ్ఞతలను పెంచే చదువు ముఖ్యం. ఈ చదువు తరగతి చదువు కాదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరగతి గదిలోనే ఇవి అలవడితే అంతకంటే కావాల్సింది ఏముంది! ప్రపంచంలోకి దారి చూపే చదువు, ప్రపంచాన్ని చేరువ చేసే చదువు సాహిత్య రూపంలో ఉంటుంది. ఆ సాహిత్యం మంచి పుస్తకం రూపంలో హస్తభూషణమై ఉంటుంది.మనుషుల వివేకాన్ని కొలవదలిచినవాళ్లు ‘ఇప్పుడు ఏం చదువుతున్నారు?’ అని అడుగుతారు. చదవడం మాత్రమే సరిపోదు, ఆ చదువుతున్నది ఏమిటి? ‘నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయన్నది విషయం కాదు, నీ దగ్గరున్న పుస్తకాలు ఎంత మంచివి అన్నదే ముఖ్యం’ అంటాడు గ్రీకు తత్వవేత్త సెనెకా. మంచిని ఎలా కొలవాలి? ‘మనల్ని గాయపరిచే, పోటుపొడిచే పుస్తకాలే మనం చదవాలి. తల మీద ఒక్క చరుపు చరిచి మేలుకొలపకపోతే అసలంటూ ఎందుకు చదవడం’ అంటాడు రచయిత ఫ్రాంజ్ కాఫ్కా. చదవడమే పెద్ద విషయం అయిన కాలంలో, దానికి ఇన్ని షరతులా అన్న ప్రశ్న రావడం సహజమే. ఎందుకంటే, ‘నేషనల్ లిటరసీ ట్రస్ట్’ నివేదిక ప్రకారం, భారతీయ చిన్నారుల్లో చదవడం దాదాపు సంక్షోభం స్థాయికి పడిపోయింది. 5–18 ఏళ్లవారిలో కేవలం మూడింట ఒక్కరు మాత్రమే తమ ఖాళీ సమయంలో చదవడాన్ని ఆనందిస్తామని చెప్పారు. కేవలం 20 శాతం మంది మాత్రమే, ప్రతిరోజూ ఏదో ఒకటి చదువుతున్నామని జవాబిచ్చారు. చదివే అలవాటును పెంచకపోతే, వికాసానికి దారులు మూస్తున్నట్టే!ఆధునిక తరానికి చదవడం మీద ఉత్సాహం కలిగించేలా, అయోమయ తరానికి రసజ్ఞత పెంచేలా ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ డిసెంబర్ 19 నుంచి 29 వరకు పాటు కాళోజీ కళాక్షేత్రం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరగనుంది. మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఇది కొనసాగుతుంది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, హిందీలో పేరున్న భిన్న ప్రచురణకర్తలు, విక్రేతలు, రచయితల స్టాళ్లు సుమారు 350 వరకు ఏర్పాటవుతాయి. నూతన పుస్తకాల ఆవిష్కరణలు, ఉపన్యాసాలు ఉంటాయి. 1985 నుంచి జరుగుతున్న ఈ బుక్ ఫెయిర్‌ను ఈసారి పదిహేను లక్షల మంది సందర్శిస్తారని అంచనా. ‘మనం అనేక పండుగలు చేసుకుంటాం. కానీ పుస్తకాల పండుగ ప్రత్యేకమైనది. పెద్ద జాతరలో మంచినీళ్ల కుండ లాంటిది బుక్ ఫెయిర్. ఏ రకమైనా కావొచ్చుగాక, అసలు పుస్తకాల వైపు రాగలిగితే మనిషికి వివేకం, వివేచన పెరుగుతాయి. జీవిత సారాన్ని అందించేదే కదా పుస్తకమంటే! ‘ఏడు తరాలు’ లాంటి నవలకు మనం ఎట్లా కనెక్ట్ అయ్యాం! పుస్తకాలు, అక్షరాలు లేకపోతే మనం ఎక్కడుండేవాళ్లం? అందుకే ఈసారి నచ్చిన, మెచ్చిన, ప్రభావితం చేసిన పుస్తకం అంటూ పుస్తకం కేంద్రకంగా కొన్ని సెషన్లు నిర్వహిస్తున్నాం’ అని చెబుతున్నారు బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ‘కవి’ యాకూబ్. అయితే, పుస్తకాల దుకాణాల కన్నా, దగ్గర్లోని బజ్జీల బండికి గిరాకీ ఎక్కువ అనే వ్యంగ్యం మన దగ్గర ఉండనే ఉంది. అన్నింటిలాగే ఇదీ ఒక ఔటింగ్, ఒక వినోదం, బయటికి వెళ్లడానికి ఒక సాకు... లాంటి ప్రతికూల అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఏ వంకతో వెళ్లినా దేవుడి దగ్గరికి వెళ్లగానే భక్తిగా కళ్లు మూసుకున్నట్టు, పుస్తకం చూడగానే ఆర్తిగా చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఏ కారణంతో వెళ్తేనేం? కాకపోతే వ్యక్తిత్వానికి సరిపడే, వివేకం– రసజ్ఞతలను పెంచే పుస్తకాలను ఎంపిక చేసుకోవడమే పెద్ద పని. దానికోసం కొంత పొల్లు కూడా చదవాల్సి రావొచ్చు. కానీ క్రమంగా ఒక ఇంట్యూషన్ వృద్ధి అవుతుంది. అదే చదువరి పరిణతి. -
అది అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: భారతదేశం అనాదిగా నాస్తిక, అస్తిక వాదాలకు నిలయంగా ఉందని, అయితే ప్రస్తుత పరిస్థితులు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు అన్నారు. నగరంలోని కళాభారతిలో 10 రోజులపాటు కొనసాగిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ ముగింపు సభ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా సమతా స్ఫూర్తిని ప్రజలమధ్య నింపడానికి కృషిచేశారని, నాస్తికులు, ఆస్తికులు పోట్లాడుకుని జైళ్లకు వెళ్లడం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. అప్పటి సామాజిక విధానాల్లో ఉన్న అస్పృశ్యతను తొలగించడానికి అంబేడ్కర్ బౌద్ద మతాన్ని స్వీకరించి, అందులోని విధానాల ద్వారానే సౌభాతృత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. వీటికి సంబంధించిన విజ్ఞానం లభించాలంటే ఇలాంటి పుస్తక ప్రదర్శనలు అవసరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని తయారుచేయించడం అభినందనీయమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో గ్రంథాలయాలు: ఇంటర్నెట్తో పిల్లల్లో వచ్చిన మార్పులు చూశాక అందోళన అనిపించినా ఇలాంటి పుస్తక ప్రదర్శన ద్వారా ఆ భయాలు తొలగిపోయాయని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు. నైతిక విలువలు పెంపొందించే విధంగా విద్యావిధానం ఉండాలని తెలిపారు. హైదరాబాద్‌లో 100 స్కూళ్లను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని సిలబస్ మార్చే విధంగా కృషి చేస్తున్నామని, అందులో నీతి కథలు, పర్యావరణం, వ్యక్తిత్వ నిర్మాణం పాఠ్యాంశాలుగా చేర్చబోతున్నామని పేర్కొన్నారు. భిన్న వాదనలు ఉన్నా పుస్తకం మనుషులను ఏకం చేస్తుందని బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయా చితం శ్రీధర్, రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ సోమ భరత్ కుమార్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర్ పాల్గొన్నారు. -
Hyderabad Book Fair : ఎన్టీఆర్ స్టేడియంలో పుసక్త ప్రియుల సందడి (ఫొటోలు)
-
Hyderabad National Book Fair: బుక్‌ఫెయిర్‌కు 10 లక్షల మంది!
పంజగుట్ట: రాబోయే తరానికి దార్శనికతను అందించేందుకు బుక్‌ఫెయిర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అన్నారు. అక్షరాస్యత పెరుగుతున్న విధంగానే పుస్తకపఠనం కూడా పెరుగుతుందని, అది డిజిటల్, నెట్ ఏవిధంగా చదివినా అన్నింటికీ తల్లి మాత్రం పుస్తకమే అని ఆయన పేర్కొన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 35వ హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్ విశేషాలను ఆయన వెల్లడించారు. ఒగ్గు కథలకు ప్రాణం పోసిన మిద్దె రాములు ప్రాంగణంగా, కవి, రచయిత అలిశెట్టి ప్రభాకర్ వేదికగా ఈ యేడు నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22వ తేదీ నుంచి 2023 జనవరి 1వ తేదీ వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు, శని, ఆది, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన కొనసాగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు, జర్నలిస్టులకు గుర్తింపు కార్డు చూపితే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుక్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ స్టేడియంను ఉచితంగా ఇవ్వడమే కాకుండా, నిర్వహణకు కూడా సాంస్కృతిక శాఖ ద్వారా నిధులు కేటాయిస్తోందన్నారు. ఈ ఏడాది 340 స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు నుంచి సుమారు 10 లక్షల మంది పాఠకులు, పబ్లిషర్స్ వస్తారని చెప్పారు. మొదటి రోజు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, సబితతోపాటు పత్రికల సంపాదకులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హాజరవుతారని జూలూరి వెల్లడించారు. కాగా, సీఎం కేసీఆర్‌పై వివిధ రచయితలు రాసిన పుస్తకాలు, ఉద్యమ ప్రస్థానం, ప్రభుత్వ పాలన, సంక్షేమ పథకాలపై ప్రత్యేక బుక్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. -
Hyderabad Book Fair 2023: పుస్తకాల రుతువు
ఆ నల్లటి వరుస కట్టిన అక్షరాల వెంట అక్షువులతో వెంబడిస్తే గుత్తులుగా కాసిన మామిడి పండ్ల చెట్టు కింద అశ్వాన్ని వదిలి సేదతీరుతున్న రాకుమారుడు కనిపిస్తాడు. కొమ్మపై కూచున్న జంట పక్షులు ఏవో అతనికి తెలియాల్సిన రహస్యం మరికాసేపట్లో చెవిన ఊదుతాయి. నల్లటి వరుస కట్టిన ఆ పంక్తుల వెంట పరిగెడితే కొత్త పెళ్లికూతురిని శోభనం రాత్రి చంపడమే వ్రతంగా పెట్టుకున్న రాకుమారుడు ఆ పెళ్లికూతురు మొదలెట్టిన గొలుసు కథల్లో గుడ్లు తేలేసి వ్రతం మరిచి ‘ఆ తర్వాత?’ అనే ప్రశ్నతో జీవితాంతం బతుకు వెళ్లమార్చడం చూస్తాము. కాగితం మీద వరుస కట్టిన పంక్తులు రాముడు కానలకు వెళ్లాక కౌసల్య పడిన శోకమెట్టిదన్న ఆలోచనను ఇస్తాయి. బోధిచెట్టు కింద దేహాన్ని క్షోభ పెట్టుకుంటున్న సిద్ధార్థుని సాక్షాత్కారం కోసం వేచి చూడమంటాయి. కరకు పళ్లు దిగబడి కాలి విముక్తి కోసం ఘీంకారం చేస్తున్న గజేంద్రుని మోక్షానికి శంఖు చక్రాలు వదిలి శ్రీ మహావిష్ణువును పరిగెత్తమంటాయి. రామలింగడు ఈ పంక్తులు పలకడానికే అంబ ఇచ్చిన ఒక చేతి పాలు, మరో చేతి పెరుగును కలిపి గొంతులోకి ఒంపుకున్న వైనం చెబుతాయి. పుటలు కొన్ని శ్రీనాథుని పల్లకీ మోస్తాయి. పుటలు కొన్ని పేదవాడి తెల్లని నవ్వును మల్లెలుగా విరబూస్తాయి. పుటల నిండా వీరుని ధీరకంపనం... వనిత దీక్షా కంకణం... పసిపిల్లల కేరింతలు... యువతీ యువకుల సల్లాపాలు... కన్నీటి ఉప్పదనం... త్యాగపు శౌర్యము... భీరువు ఆక్రందన... ఆలోచనల అలజడి... తేజోమూర్తి జీవన సందేశము. ఒక దేశ ‘తలసరి ఆదాయం’ ఎలా గణిస్తారోగాని ఒక దేశ ‘తలసరి సంస్కారం’ సగటున ఆ దేశపౌరుడు చదివిన పుస్తకాల సంఖ్యను బట్టి అవి ఎలాంటి పుస్తకాలన్న నాణ్యతను బట్టి గణించాలి. ఆహార కొరత వస్తేనో, విదేశీ మారకద్రవ్యం అడుగంటితేనో, ద్రవ్యోల్బణం విజృంభిస్తేనో మాత్రమే ఆ దేశం ప్రమాదంలో పడినట్టు కాదు. ఏ దేశ ప్రజలైతే నిజంగా పుస్తకాలు చదవడం మానేస్తారో, ఇంట పుస్తకాల అల్మారా లేకుండా జీవిస్తారో, ‘పుస్తకమా అది ఏమి’ అని ఫోన్ స్క్రీన్‌లో తల కూరుస్తారో ఆ దేశం నిజంగా ప్రమాదంలో పడినట్టు! వస్తు ప్రపంచం కంటే పుస్తక ప్రపంచం మేలైనది. ఇంట టివి, ఫ్రిజ్జు, కారు, ఐఫోన్ ఎన్ని కొన్నా మరోటేదో కావాలన్న అత్యాశను, పేడలో పడవేసే పేరాశను కలిగిస్తాయి. పుస్తకాలు? నీ పాదాలకు లేపనం రాసి హిమానీనదాల వరకూ తీసుకెళతాయి. నీ చీకటి కవాటాలను తెరిచి వెలుతురు వాకిళ్ల ఎదుట నిలబెడతాయి. నీ మూఢవిశ్వాసాలకు నువ్వే నవ్వుకునేలా చేస్తాయి. చైతన్యాన్ని కలిగించి నీ నిజస్థితి మీద అంచనా కట్టిస్తాయి. ద్వేషంతో, హైన్యంతో, వ్యవస్థీకృత దుర్లక్షణాలతో బతకాలన్న నీ పట్టుదలను అవి హరిస్తాయి. పుస్తకాలు నిన్ను పెట్రోలు కొట్టించమనవు. ఫుడ్డు ఆర్డర్ పెట్టమనవు. విలాసాలు అమేజాన్ చేయమనవు. అవి కోరేదల్లా తెరిచి చదవమనే! రెండు రాష్ట్రాల్లో 9 కోట్ల తెలుగు జనాభా. ఏ పుస్తకమూ 500 కాపీలు అమ్ముడుపోదు. అంటే కోటికి 100 మంది కూడా పుస్తకాలు కొనరు. సినిమా హీరోల కొరకు టికెట్టు రికార్డు స్థాయిలో కొంటారు. ‘నెక్ట్స్ సినిమా ఏమిటి?’ అని అడుగుతారు. ‘నువ్వు చదివిన పుస్తకం చెప్పు’ అని ఏ హీరోనీ ఎవరూ అడగరు. శ్రీమంతురాలైన సుధామూర్తి తానే శ్రీమంతులుగా భావించే ఒకరి ఇంటికి వెళ్లిందట. ‘అబ్బబ్బ... ఆ ఇంట మణిమాణిక్యాలు వజ్రవైఢూర్యాలు.. బంగారు సింహాసనాలు... అమూల్య కళాకృతులు... ఒక్కటే లోపం. ఒక్క పుస్తకం కనపడలేదు’ అని రాసింది. ఇలాంటి పేదరికంలో ఉన్న శ్రీమంతులు మనలో ఎందరు? పూర్వం తెలుగు ఇళ్లల్లో తప్పనిసరిగా ఎక్కాల పుస్తకం ఉండేది. శతకాలు ఉండేవి. పెద్ద బాలశిక్ష అయినా కనిపించేది. ఒక చిన్న గూటిలో ఇవి కూడా లేని స్థితికి తెలుగుజాతి ఎగబాకింది 10 వేల మంది తెలుగు కవులు ఉన్నారు. పక్క కవి పుస్తకం కొనరు. 5 వేల మంది తెలుగు కథకులు ఉన్నారు. పక్క రచయిత సంకలనం కొనరు. పాఠకుల మీద వంక పెడుతుంటారు. మొదట వీరే పుస్తకాలు కొనరు. రచయిత అంటే ఎవరు? సీనియర్ పాఠకుడు! మంచి కవి కావాలన్నా, మంచి కథకుడు కావాలన్నా మొదట జీవితంలో పాల్గొనాలి అనుభవం కోసం. తర్వాత పుస్తకాలు చదవాలి సాధన కోసం. జీవన స్పర్శ, పుస్తకాల సంపర్కం లేని శుష్కకవులతో, కథకులతో నిండి ఉంది నేటి మెజారిటీ తెలుగు సమాజం. ఇక మన పాఠకులు ‘మా పిల్లలు తెలుగు చదవరు’... ‘మాకు ఈ కథలు, కవిత్వం పడవు’ అంటూ ఉంటారు. నీకు రోటి పచ్చడి ఇష్టమైతే కనీసం రోటి పచ్చళ్ల మీద వచ్చిన పుస్తకమైనా కొను. ఇంట పుస్తకంగా కనపడుతూ ఉంటుంది. డిసెంబర్ 22 నుంచి జనవరి 1 వరకు హైదరాబాద్‌లో పుస్తకాల రుతువు. అంటే బుక్ ఎగ్జిబిషన్. వందలాది స్టాళ్ళు, వేలాది పుస్తకాలు, ఆవిష్కరణలు, ఉపన్యాసాలు, సాహితీకారుల దర్శనం, మిత్రుల కరచాలనం, చలిగాలుల్లో ఛాయ్‌తో చేసే కబుర్లు. తెలుగులో ఎందరో రచయితలు, కవులు, బుద్ధిజీవులు... ఈ బుక్ ఎగ్జిబిషన్‌కు తరలివచ్చే పాఠకుల మీద నమ్మకంతో కొత్త పుస్తకాలను విడుదల చేస్తున్నారు. పాత క్లాసిక్స్‌ను రీప్రింట్ చేస్తున్నారు. ‘ఈ పుస్తకాలు చదివి ఆనందించండి, ఆస్వాదించండి, ఆలోచించండి’ అని కొమ్ముబూర ఊది మరీ మొరపెట్టుకోనున్నారు. ఈ రుతువులో పాలుపంచుకోండి. పుస్తకాల చెట్టు నీడ ప్రతి ఇంటా పడుగాక! -
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన.. పూర్తి వివరాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి జనవరి 1 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జాతీయ పుస్తక ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, మాజీ మంత్రి జోగు రామన్న, బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తదితరులు మంగళవారం మంత్రిని కలిశారు. పుస్తక ప్రదర్శనకు తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్) స్టేడియంలో అనుమతివ్వాల్సిందిగా కోరారు. ఈ మేరకు మంత్రి ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ 35 ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషా సంస్కృతి, తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు, దేశవ్యాప్తంగా 300 లకుపైగా పబ్లిషర్స్ రావడంతో ఇది జాతీయ పుస్తక ప్రదర్శనగా మారిందని తెలిపారు. (క్లిక్ చేయండి: ‘తానా’ అంతర్జాతీయ కార్టూన్ పోటీ.. విజేతలకు రూ. లక్ష నగదు) -
ప్రజల మనిషి నవలను చదివాను: సీజేఐ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ప్రతిఒక్కరూ పుస్తకం చదివి, ఇతరులతో చదివించడాన్ని ఒక ఉద్యమంలా ముం దుకు తీసుకెళ్లాలని భారత ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. ప్రపంచగతిని సాహిత్యమే మార్చిందని, ఎంతోమంది మహానుభావులు ప్రపంచాన్ని అర్థం చేసుకొని రాసిన గ్రం థాలే సమాజాలను ముందుకు నడిపించేందుకు దోహదం చేశాయని అన్నారు. గాంధీజీ, నెహ్రూ వంటి జాతీయనేతలు రాసిన పుస్తకాలు జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు. హైదరాబాద్ 34వ జాతీయ పుస్తక ప్రదర్శన ముగింపు సందర్భంగా మంగళవారం ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జస్టిస్ రమణ మాట్లాడుతూ చదివేవాళ్లు కరువవుతున్నారని, పుస్త కం భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన చెందుతున్న తరుణంలో వేలాదిమంది యువత పుస్తక ప్రదర్శనలో కనిపించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. పుస్తకం భవిష్యత్తు ప్రశ్నార్థం కాబోదని, అది సజీవంగానే ఉంటుందనే ఆశ చిగురించిందని చెప్పారు. తాను చదువుకొనే రోజుల్లో కోఠిలోని నవయుగ, విశాలాంధ్ర వంటి పుస్తకాల షాపుల్లోనే పుస్తకాలు లభించేవని పేర్కొన్నారు. డిజిటల్ రీడింగ్ ప్రమాదకరం ఇప్పుడు చదవాల్సిన అవసరం లేకుండా, చదివి వినిపించే డిజిటల్ రీడర్స్ అందుబాటులోకి వచ్చాయని, కానీ ఈ పద్ధతి ప్రమాదకరమని జస్టిస్ రమణ చెప్పారు. పుస్తకాలు, పత్రికలు చదివినప్పుడే మేధోవికాసం లభిస్తుందని, తల్లిదండ్రులు తప్పనిసరిగా పిల్లలు పుస్తకాలను చదివేవిధంగా ప్రోత్సహించాలని సూచించారు. తాను చిన్నప్పుడు రోజూ గ్రంథాలయానికి వెళ్లి మూడు, నాలుగు గంటలపాటు పత్రికలు, పుస్తకాలు చదివేవాడినని పేర్కొన్నారు. ప్రస్తుతం స్కూళ్లలో గ్రంథాలయాలు, ఆటస్థలాలులేవని, వాటి ఏర్పాటుకు అందరూ కృషి చేయాలన్నారు.భావాల వ్యక్తీకరణకు లేఖలు రాయడానికి మించిన మార్గం లేదని చెప్పారు. నేనూ ఓ పుస్తకం రాస్తా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, తగి నన్ని నిధులు ఇవ్వాలని జస్టిస్ రమణ కోరారు. మహాకవి శ్రీశ్రీ 1930 నుంచే రచనలు చేసినప్పటికీ ఆయన మహాప్రస్థానం వెలువడిన తరు వాతే ఎంతోమంది చదివి చైతన్య వంతులయ్యా రని అన్నారు. పుస్తక ప్రచురణ సంస్థల కష్టాలు తనకు తెలుసునని, లా చదివే రోజుల్లో కొంతకాలంపాటు ‘నడుస్తున్న చరిత్ర’పత్రిక నిర్వహించి చాలా కష్టాలు పడ్డానని గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్నో అద్భుతమైన పుస్తకాలు తెలుగులో వస్తున్నాయని, హైదరాబాద్ బుక్ ట్రస్టు ప్రచురించిన మేరీ టైలర్ జైలు జీవితం పుస్తకం చాలా బాగుందన్నారు. తాను చదువుకొనే రోజుల్లో అమ్మ నవలను ఎన్నోసార్లు చదివినట్లు చెప్పారు. పదవీ విరమణ అనంతరం పుస్తకాలు చదువుతానని, ఒక పుస్తకం కూడా రాస్తానని జస్టిస్ రమణ చెప్పారు. కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా వెల్లంకికి చెందిన ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం వ్యవస్థాపకుడు, దాశరథీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృ తిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, కోశాధికారి పి.రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగులోనే తీర్పులివ్వాలి మన తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు తీర్పులను తెలుగు, హిందీ భాషల్లో వెలువరించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పులను ఇప్పటికే కొంతకాలంగా ప్రాంతీయ భాషల్లోకి అనువదించి వెబ్సైట్లో ఉంచుతున్నట్లు చెప్పారు. తాను గతంలో హైకోర్టులో పనిచేసిన సమయంలో తెలుగులోనే తీర్పులివ్వాలనే ఉద్దేశంతో అప్పట్లో జూబ్లీహాలులో జడ్జిలకు సంవత్సరం పాటు శిక్షణ ఇప్పించామన్నారు. ఈ శిక్షణ పొంది తెలుగులోనే తీర్పులిచ్చిన వారిని అభినందించి, అవార్డులు కూడా అంద చేశామని ఆయన గుర్తుచేశారు. -
హైదరాబాద్: బుక్ ఫెయిర్‌కు పోటెత్తిన పాఠకులు
-
Hyd Book Fair: పుస్తకాల పండుగకు అక్షరాల తోరణం..
సాక్షి, సిటీబ్యూరో: పుస్తకాల పండుగ మళ్లీ వచ్చేసింది. ఏటేటా చదువరుల మనసు దోచుకుంటూ కొలువుదీరే 34వ జాతీయ పుస్తకమహోత్సవం శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, తదితరులు ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైవిధ్యభరితంగా.. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో పుస్తకం మరోసారి వేడుక చేసుకుంటోంది. వైవిధ్యభరితమైన అంశాలపైన రూపొందించిన పుస్తకాలతో పాఠక మహాశయులకు చేరువైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రచురణ సంస్థలతో 260 స్టాళ్లను ఏర్పాటు చేశారు. రచయితలు స్వయంగా తమ పుస్తకాలను విక్రయించేందుకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. విభిన్న జీవన పార్శ్వాలను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలు ప్రదర్శనలో పుస్తకప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సామాజిక మాద్యమాలు, ఇంటర్నెట్లు, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ పుస్తకానికి ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనంగా మొదటి రోజే సందర్శకులతో ఎన్టీఆర్ స్టేడియంలో సందడి నెలకొంది. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి అన్ని రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. మరోసారి ‘చందమామ కథలు’ అనేక దశాబ్దాల పాటు తెలుగు పాఠకలోకాన్ని కట్టిపడేసిన చందమామ కథలు సంపుటాలుగా వెలువడ్డాయి. బాలల మనసు దోచుకొనే అద్భుతమైన కథలతో రూపొందించిన ఈ పుస్తకాలు మొత్తం 15 సంపుటాలుగా ముద్రించారు. 1950 నుంచి 2012 వరకు వచ్చిన కథలనన్నింటినీ ఈ సంపుటాల్లో నిక్షిప్తం చేశారు. విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ తదితర స్టాళ్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. విశాలాంధ్రకు చెందిన 10 నుంచి 13వ స్టాల్ వరకు ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. చలం సమగ్ర సాహిత్యం.. చలం రాసిన పుస్తకాలన్నింటినీ 22 సంపుటాలుగా ముద్రించారు. ప్రియదర్శిని ప్రచురణ సంస్థకు చెందిన స్టాల్ నెంబర్ 112 లో ఈ సంపుటాలు అందుబాటులో ఉన్నాయి. మైదానం, దైవమిచి్చన భార్య, అమీనా, చలం మ్యూజింగ్స్, స్త్రీ వంటి అనేక గ్రంధాలతో ఆ నాటి నుంచి నేటి వరకు పాఠకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న చలం సాహిత్యం అంతా ఒక్క చోట లభించడం విశేషం. చిందు ఎల్లమ్మ వేదిక.. పుస్తక ప్రదర్శన వద్ద ఏర్పాటు చేసిన సాహిత్య వేదికకు ఈసారి యక్షగాన కళాకారిణి చిందు ఎల్లమ్మ వేదికగా నామకరణం చేశారు. అలాగే మొత్తం ప్రాంగణానికి మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణు మాధవ్ పేరు పెట్టారు. ♦ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తెలంగాణ కళారూపాలు, నృత్యప్రదర్శనలు నిర్వహిస్తారు. u యంగ్ రైటర్స్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. కోవిడ్ కారణంగా పుస్తకాలను ఆవిష్కరించలేకపోయిన వారికి సముచిత ప్రోత్సాహం ఉంటుంది. ♦పుస్తకం పఠనం పట్ల అభిరుచిని పెంచేందుకు సదస్సులు, చర్చలు ఉంటాయి. ♦ఈ నెల 22వ తేదీన పర్యావరణంపైన ప్రత్యేక సాహిత్య సదస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇదీ చారిత్రక నేపథ్యం... హైదరాబాద్ లో 1980వ దశాబ్దంలో పుస్తక ప్రదర్శన మొదలైంది. కానీ పుస్తకాలను ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచన కూడా లేని రోజుల్లో అంటే 1948 నుంచి వట్టికోట ఆళ్వారుస్వామి తన ‘దేశోద్ధారక గ్రంథమాల’ సంస్థ ప్రచురించిన పుస్తకాలను పాఠకుల వద్దకు తీసుకెళ్లాడు. 1961వరకు ఆయన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాడు. హైదరాబాద్ నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడ భాషలకు చెందిన పుస్తకాలు వచ్చాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడిచౌడీ బుక్ సెల్లర్సే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ వంటి సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రదర్శనలో తమ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రదర్శన ఆరంభం ఇలా.. ♦దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్టు ఆధ్వర్యంలో 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కేశవ మొమోరియల్ స్కూల్లో ప్రారంభించారు. ♦ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ♦ఆ నాటి నుంచి నేటి వరకు కథలు, నవలలు, గల్ఫికలు, చరిత్ర గ్రంథాలదే అగ్రస్థానం. శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, త్రిపురనేని గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్స్పియర్, సోమర్సెట్ మామ్, యద్దనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్‌రావు వంటి ప్రముఖుల రచనలు ఇప్పటికీ హాట్‌కేకుల్లా అమ్ముడవుతూనే ఉన్నాయి. ♦‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావి తం చేస్తూనే ఉన్నాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ఖడ్గసృష్టి వంటి గ్రంథాలకు ఇప్పుడూ అదే ఆదరణ ఉంది. ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్ బుక్ ఫెయిర్ చాలా అద్భుతంగా ఉంది. చాలా పుస్తకాలు కొనుక్కోవాలని ఉంది. కానీ న్యూజిలాండ్‌కు తీసుకెళ్లడం కష్టంకదా. చందమామ కథల సంపుటాలు తీసుకున్నాం. ఇప్పటి పిల్లలకు ఆ పుస్తకాలు చాలా అవసరం. – శ్రీలత మగతల, అధ్యక్షురాలు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పాఠకులకు నచ్చిన పుస్తకాలున్నాయి ఈసారి 260కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేశాం. సుమారు 2.5 లక్షల పుస్తకాలు అన్ని ప్రముఖ భాషలలో ఉన్నాయి. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి కావలసిన అద్భుతమైన మెటీరియల్ ఉంది. అలాగే ఎవరి అభిరుచికి తగిన పుస్తకాలను వారు కొనుక్కోవచ్చు. కవులు, రచయితల కోసం ఒక ప్రత్యేక స్టాల్‌ను కూడా ఏర్పాటు చేశాం. వారు అక్కడ స్వయంగా తమ పుస్తకాలను విక్రయించవచ్చు. – కోయ చంద్రమోహన్, బుక్ ఫెయిర్ కమిటీ కార్యదర్శి తెలుగు నవలల కోసం వచ్చాను తెలుగు నవలలపైన ఆసక్తితో వచ్చాను. తెలుగు భాషపైన పట్టు రావాలంటే సాహిత్యం చదవాలి కదా. ఈసారి చాలా మంచి పుస్తకాలు వచ్చాయి. బుక్‌ఫెయిర్ వారికి కృతజ్ఞతలు. – లహరి, దిల్సుఖ్నగర్ బైక్‌రైడింగ్..బుక్ రీడింగ్ బైక్ రైడింగ్ నా హాబీ. బైక్ పై చాలా దూరం వెళ్లి ప్రశాంతమైన వాతావరణంలో రోజంతా ఒక పుస్తకం చదువుకొని వస్తాను. చాలా హాయిగా ఉంటుంది. అందుకే నచ్చిన పుస్తకాలు కొనుగోలు చేద్దామని వచ్చాను. – విశ్వేశ్వర్, ఓల్డ్‌సిటీ -
స్త్రీలు పుస్తక ప్రియులు
‘మేగజీన్ వచ్చిందా’ నుంచి ‘సీరియల్ వస్తోంది టీవీ ఆన్ చెయ్యి’ వరకూ కాలం ప్రవహించింది. ఫేస్బుక్, వాట్సప్ చెక్ చేసుకుంటే తప్ప రోజు గడవని రోజూ వచ్చింది. ఒకప్పుడు పాఠకుల కంటే పాఠకురాళ్లే ఎక్కువ. వారి కోసమే మేగజైన్లు, ప్రత్యేక సీరియళ్లు నడిచేవి. కాని ఇప్పుడు తమ పుస్తక పఠనాన్ని కాపాడుకోవడం కోసం స్త్రీలు కూడా ప్రయాస పడాల్సి వస్తోంది. నేటి నుంచి హైదరాబాద్ బుక్‌ఫెయిర్ జనవరి 1 నుంచి విజయవాడలో. స్త్రీలు ఏం చదువుతున్నారు... ఎటువంటి పుస్తకాలు ఆశిస్తున్నారు... అసలు చదివే సమయం మిగిలిందా? చూద్దాం. మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలు చదివి ఉండాలి ఇంట్లో పుస్తకాలు ఉండే వాతావరణం వల్ల పుస్తకాలు చదివే అలవాటైంది. అయితే కాలక్షేపం పుస్తకాలు కాదు. హైస్కూల్లోనే ‘ఏడుతరాలు’ చదివేశా. ఉద్యోగాలు చేసే స్త్రీలు ఉద్యోగం, కుటుంబం రెంటి మధ్య సమయం వెతుక్కుని పుస్తకాలు చదవాల్సి వస్తోంది. నేనైతే ప్రయాణాల్లోనే ఇప్పుడు ఎక్కువగా చదువుతున్నాను. ‘అంటరాని వసంతం’ వంటి గొప్ప పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి. కనీసం మన భాషలో వచ్చిన గొప్ప పుస్తకాలను కొన్నైనా ప్రతి ఒక్కరూ చదివి ఉండాలి. ఇటీవల నేను కొత్త జనరేషన్ ఏం రాస్తున్నారా అని ఆసక్తిగా చూస్తున్నాను. పుస్తక పఠనం నా పిల్లలకు అలవాటు చేశాను. వాళ్లు నాకంటే ఎక్కువ చదువుతారు. కాకపోతే ఇంగ్లిష్‌లో. ఒక ప్రిన్సిపాల్‌గా విద్యార్థులకు పుస్తకాలు అలవాటు చేయడానికి లైబ్రరీలో కనీసం గంట కూచోవాలని చెబుతున్నా. – ఎం. ప్రగతి, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, హిందూపురం చదివేవాళ్లు సాకులు చెప్పరు పుస్తకాలు చదవడం మా నాన్నగారు, అమ్మగారు అలవాటు చేశారు. చిన్నప్పటి నుంచి నా బెస్ట్‌ఫ్రెండ్ పుస్తకాలే. నా ఎమోషన్ వాటితోనే షేర్ చేసుకునేదాన్ని. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు మొదట పుస్తకమే గుర్తుకు వస్తుంది. నేను మనుషులను డైరెక్ట్‌గా అర్థం చేసుకోవడం కంటే పుస్తకాల ద్వారానే అర్థం చేసుకున్నా. కాబట్టి నా మంచిచెడ్డలు రెంటికీ పుస్తకాలే బాధ్యులు. ‘ఏడుతరాలు’ వంటి పుస్తకాలు చిన్నప్పుడే చదివి పనిమనుషులతో ఎంత మర్యాదగా వ్యవహరించాలో నేర్చుకున్నాను. రావిశాస్త్రి ‘రత్తాలు– రాంబాబు’ చదివి టీనేజ్‌లో కంగారు పడ్డాను. పుస్తకం చదివే అలవాటు ఉన్నవాళ్లు వాటిని చదవలేకపోతే గిల్ట్ ఫీలవుతారు. పుస్తకాలు చదవడానికి టైం లేకపోవడాన్ని నేను నమ్మను. టైమ్ దొరుకుతుంది. కొంతమంది ఈ కాలం పిల్లల్ని గమనిస్తే ఇవాళ్టి జనరేషన్ కూడా పుస్తకాలు చదువుతున్నారన్న ఆశ ఉంది. – అరుణ ప్రసాద్, గృహిణి, నిజాంపేట, హైదరాబాద్ ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదవాలి నేను కాలేజీలో ఉండగా పుస్తకాలు చదవడం మొదలెట్టా. సీరియస్ సాహిత్యానికి నాన్ సీరియస్ సాహిత్యానికి తేడా సీరియస్ సాహిత్యంలో కూరుకుపోయా. సెంట్రల్ యూనివర్సిటీలో చదివేప్పుడు పుస్తకాలంటే ఎక్కువ ఆసక్తి ఏర్పడింది. నామిని పుస్తకం ‘పచ్చనాకు సాక్షిగా’ అక్కడే చదివా. చలం పుస్తకాలు, తిలక్ అమృతం కురిసిన రాత్రి, మహా ప్రస్థానం, జాషువా గబ్బిలం, శివసాగర్... ఇలా ఎన్ని పుస్తకాలో. అవన్నీ ఏ జనరేషన్ అయినా చదువుతూ ఉండాల్సిందే. టెక్నాలజీ వచ్చింది. కొంతమంది యూట్యూబ్‌లో కథలు వింటున్నారు. ఆడియో లిటరేచర్ వింటున్నారు. కాని నాకు పుస్తకం చదవడమే బాగుంటుంది. అది కూడా ఎక్కడ పడితే అక్కడ కూచుని పుస్తకం చదువుతూ ఉంటే ఆ ఆనందం వేరు. పుస్తకం ఇచ్చే ఆలోచన వేరు. –చల్లపల్లి స్వరూపరాణి, ప్రొఫెసర్, నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు ఇవాళ కావాల్సింది ఆలోచన రేపే పుస్తకాలు నేను ఆర్ట్ స్టూడెంట్‌ని. మా నాన్నగారు ఆర్ట్ స్టూడెంట్స్ సాహిత్యం కూడా చదవాలని‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ షేక్స్పియర్’ చదివించేవారు. ఆ రోజుల్లో నాకు ప్రకృతి అంటే ఇష్టం ఉండేది. వర్డ్స్‌వర్త్, షెల్లీ... ఇష్టపడ్డాను. ఆ తర్వాత ఓ హెన్రీ కథలు చాలా నచ్చాయి. మెల్లగా లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. మనం టీవీ చూడకపోతే చాలా పుస్తకాలు చదవొచ్చు. టీవీ ఐదు నిమిషాలైనా చూడగలమా? ఎప్పటికైనా సరే పుస్తకమే ముఖ్యమైనది. మనల్ని జంతువుల నుంచి వేరు చేసేది ఆలోచన. ఆ ఆలోచన పుస్తకం నుంచే వస్తుంది. ఈ రోజు సమాజంలో అనేక మార్పులు వస్తున్నాయి. వాటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. వివక్ష, సామాజిక సమస్యలు, మతతత్వం... వీటిని అర్థం చేసుకునే పుస్తకాలు చదవాలి. –కె.ఉషారాణి, ప్రజాశక్తి బుక్ హౌస్ మాజీ ఎడిటర్, విజయవాడ పుస్తకాల షెల్ఫ్‌లు లేని ఇళ్లు తయారయ్యాయి! మా ఇంట్లో మా నాన్న, మేనత్తలు పుస్తకాలు చదివేవారు. కనుక మాకు పుస్తకాలు చదవడం అలవాటైంది. ఇంట్లో అందుబాటులో పుస్తకాలు ఉంటే పిల్లలు ఎప్పుడో ఒకప్పుడు వాటిని చదువుతారు. మేము కొన్ని కారణాల రీత్యా ఇల్లు, ఊరు మారాం. కాని ఇంత పెద్ద ఫ్లాట్‌లో పుస్తకాలు పెట్టుకోవడానికి వీలుగా ర్యాక్స్ లేవు. ఇలాంటి ఇళ్లు తయారైతే ఎలా? మా చిన్నప్పుడు ఇంట్లో పుస్తకాలు లేకపోతే పక్కింటివాళ్లైనా ఇచ్చేవారు. ఇవాళ ఆ వాతావరణం మళ్లీ రావాలి. చలం ‘స్త్రీ’ వంటి పుస్తకం చదవకపోతే ఎలా? ఓటిటిలు, షాపింగులు స్త్రీల సమయాన్ని తీసుకున్నా ఆ ఆకర్షణకు మించిన పుస్తకాలు కూడా బోలెడు వచ్చి పడుతున్నాయి. వాటిలో చదవదగ్గది ఉంటే పఠనాభిలాష ఎక్కడికీ పోదు. మంచి పుస్తకాన్ని ఎవరు వదిలిపెడతారు? చదవడానికి ట్యూన్ కావాలి. అది ముఖ్యం. – వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, రచయిత, కాకినాడ ట్రాఫిక్‌లోనే చదవాల్సి వస్తోంది నేను చదివిన సెయింట్ ఫిలోమినా స్కూల్లో లైబ్రరీ ఉండేది. రోజూ ఒక గంట అందులో కూచుని చదవాలి. అలా నాకు పుస్తకాలు అలవాటయ్యాయి. మా చర్చిలో ఒక తాతకు చదువురాదు. ఆయన నా చేత పుస్తకాలు చదివించుకుని వాటి ఆధారంగా మాట్లాడేవాడు. అలా కూడా నేను పుస్తకాలు చదివాను. సీరియస్ సాహిత్యం అంటే 2002లో విశాలాంధ్ర వారు పెట్టిన వ్యాసరచన పోటీలో బహుమతి వస్తే వాళ్లు 3000 రూపాయల పుస్తకాలు గిఫ్ట్ చేశారు. వాటిలో విశ్వంభర, మహాప్రస్థానం, అమృతం కురిసిన రాత్రి ఉండటంతో పొయెట్రీలోకి వచ్చాను. ఆ తర్వాత ఫేస్బుక్ వల్ల చాలా పుస్తకాలు తెలిశాయి. ముఖ్యంగా జయకాంతన్ కథలు నాకు నచ్చాయి. ఇప్పుడు ట్రాఫిక్‌లో మాత్రమే పుస్తకాలు చదివే వీలు దొరుకుతోంది. నాకే కాదు.. చాలామందికి. టెక్నాలజీ పెరిగాక ఆఫీస్ కాల్స్ 24 గంటలు అవుతున్నాయి. పుస్తకం చదవాలంటే టైమ్ చూసుకోవాల్సిందే. – మెర్సీ మార్గరెట్, గురుకుల స్పెషల్ స్కూల్ ఇన్చార్జ్, ఘట్కేసర్. -
Hyderabad: 18 నుంచి 27 వరకు బుక్‌ఫెయిర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం రెక్కలల్లార్చుకొని చదువరి చెంతకు తిరిగి వచ్చేస్తోంది. లక్షలాది మంది సాహితీ ప్రియుల మదిని దోచుకోనుంది. ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన 34వ వేడుకలు ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈసారి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ సన్నాహాలు చేపట్టింది. ఏటా సుమారు 330 నుంచి 350 స్టాళ్లతో జాతీయ స్థాయి పుస్తక ప్రచురణ సంస్థలతో నిర్వహిస్తున్న ప్రదర్శనలో ఈ ఏడాది వీటి సంఖ్యను తగ్గించినట్లు నిర్వాహకులు తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ సందర్శకులు పుస్తక ప్రదర్శనలో పాల్గొనేందుకు అనుగుణంగా 250 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బహుభాషల్లో.. ► అన్ని రాష్ట్రాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో పుస్తకాలను అందుబాటులో ఉంచనున్నాయి. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలోనూ హైదరాబాద్ ఏటేటా పుస్తకానికి బ్రహ్మరథం పడుతూనే ఉంది. ► విభిన్న జీవన రంగాలకు చెందిన లక్షలాది పుస్తకాల విక్రయాలు జరుగుతున్నాయి. కథ, కవి త్వం, నవల, చరిత్ర వంటి సాహిత్యమే కాకుండా బాలల సాహిత్యం, పోటీ పరీక్షల పుస్తకాలు ఆర్థిక, రాజకీయ పరిణామాలపై వెలుడిన విశ్లేషణ గ్రంథాలు, వ్యక్తిత్వ వికాసం, అకడమిక్ పాఠ్యపుస్తకాలు వంటి వాటికీ పాఠకాదరణ లభిస్తోంది. (చదవండి: కళ్యాణలక్ష్మి: కాసులిస్తేనే.. ‘కానుక’!) ప్రదర్శన వేళలు ఇలా.. ► మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు. ► శని, ఆదివారాలు, సెలవు రోజుల్లో మధ్యాహ్నం 12.30 నుంచి రాత్రి 9 గంటల వరకు. జాగ్రత్తలు పాటించాలి ఎంతో సాహసం చేసి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శనకు సందర్శకులు సహకరించాలి. కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. మాస్కులు ధరించి మాత్రమే ప్రదర్శనకు రావాలి. భౌతిక దూరం పాటించాలి. – కోయ చంద్రమోహన్, బుక్‌ఫెయిర్ కమిటీ -
ఇంకొన్ని రోజులు ఉంటే బాగుటుంది..
-
విజేత ఉంటే విజయం మీ వెంటే!
-
బుక్ఫెయిర్లో ఆ స్టాల్స్ ఎంతో ప్రత్యేకం!
-
‘ఫోన్లు కాదు పిల్లలకు పుస్తకాలు ఇవ్వాలి’
-
‘ప్రేమ ఎప్పుడు ఒంటరిగా ఉండదు’
-
బుక్ ఫెయిర్
కలల వరద ప్రపంచంతో సంభాషించడా నికి అరుణాంక్ లత ఒక స్వప్న మార్గాన్ని ఎన్నుకున్నాడు. కలలో తొణికిన ప్రేమను అంతే జాగ్రత్తగా లేఖలుగా మలిచి పాఠకుల ముందుకు తెచ్చాడు. ‘యే తొలి సంధ్య వేళ సూర్యోదయమో, మలి సంధ్య వేళ చంద్రోదయమో చూసినప్పుడు తెరలు తెరలుగా చుట్టుము’ట్టే జ్ఞాపకాల పునాదులు ‘ఖ్వాబ్’లో ఉన్నాయి. ‘హృదయం బద్దలయ్యాక బతికి ఇంకా చేసేదేముందని. అయినా, పగిలిన హృదయంతోనూ ప్రేమించాను కదూ’ అని కలవరిస్తాడు. ఇందులో గుండె ఉక్కబోతలు, వాన పలకరింపులే కాదు, ఒక విధ్వంసం కోసం మరో విధ్వంసానికి బలవుతున్న నల్లమల వ్యథ, అసు వులు బాస్తున్న అఖ్లాక్‌ల కథ, వాఘా యుద్ధోన్మాద ప్రకటనలపై విసుర్లు కూడా ఉంటాయి. అందుకే ఇది ప్రేమ, విప్లవాల మేలుకలయిక. మరోవైపు తలత్, సైగల్ గొంతుల పలవరింత మైమరపిస్తుంది. మీరూ వినండి. (ఖ్వాబ్ –అరుణాంక్ లత, వెల: రూ. 120) బస్తర్ తిరుగుబాటు స్వాతంత్య్ర పోరాటంతో సహా ఆదివాసీలు ఎన్నో అసమాన పోరాటాలు చేసినా అవి ఎందుకో సరైన రీతిలో సమగ్రంగా చరిత్రకు ఎక్కలేదు. అలా విస్మృతికి గురైన మరో పోరాటం భూంకాల్ విప్లవ పోరాటం. ఆ పోరాటం నుంచి ఆవిర్భవించినవాడే గుండాధూర్. రాజకీయ నేతలెవరూ ఇంకా స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తక ముందే ఆదివాసీ సమాజం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించింది. బ్రిటిష్ సైన్యాన్ని గడగడలాడించి, తన జీవిత కాలంలోనే పురాణ పురుషుడిగా ఖ్యాతినొందాడు గుండాధూర్. 1910లో 30 గోండు రాజ్యాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా భూంకాల్ తిరుగుబాటు అనివార్యమైంది. గుండాధూర్ చేసిన పోరాటాలు బస్తర్ ప్రాంతంలోని ఆదివాసీలను ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి. (భూంకాల్– బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు–హెచ్.ఎల్.శుక్లా, వెల: రూ. 130) నమ్మకమిచ్చే కథలు కథలన్నీ సంకలనంగా రాకముందే, రచయితగా పాఠకులను మెప్పించినవారు అరుదుగా ఉంటారు. అలాంటివారిలో అక్కిరాజు భట్టిప్రోలు ఒకరు. వస్తువును స్వీకరించడంలో, దాన్ని నడిపించడంలో, పాత్రలకు సహజత్వాన్ని అద్దడంలో.. వెరసి పాఠకుడిని కథలోకి ఆవాహన చేయడంలో ఆయన చేయి తిరిగినవాడని ‘మూడు బీర్ల తర్వాత’ సంపుటం నిరూపిస్తుంది. తాను చూసిన జీవితంలోంచే కథా వస్తువులను స్వీకరించాడు. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలోని మహిళ అంతరంగాన్ని ఆవిష్కరించడంలో, అనుభూతి ప్రకంపనలు కోల్పో కుండా కొన్నిసార్లు కథను తర్కబద్ధంగా నడిపించడంలో, ఎవరినీ తప్పుబట్టకుండా జీవన వైరుధ్యాలను ఆవిష్కరించడంలో రచయిత ప్రతిభ పాఠకుడిని ఆకట్టుకుంటుంది. తన జీవన ప్రయాణంలోని అనుభవాలకు ఇచ్చిన ఈ కథలు కొన్నిసార్లు మనకూ తారసపడతాయి. – దేశరాజు (మూడు బీర్ల తర్వాత –అక్కిరాజు భట్టిప్రోలు, వెల: రూ. 170) నిలువెత్తు హింస అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి చేపట్టే భూసేకరణలో అంతు లేని హింస చోటుచేసుకుంటోంది. అందుకు దక్షిణ ఛత్తీస్ గఢ్ నిదర్శనం. అక్కడ ఏం జరిగిందనే వివరాలతో అక్కడి లైంగిక హింసపై ‘నిలువెత్తు సాక్ష్యం’ కార్యాచరణ బృందం వెలువరించిన పుస్తకాన్ని మలుపు ప్రచురణలు తెలుగులోకి తీసుకొచ్చింది. గనుల తవ్వకాల కోసం, ఉక్కు కర్మాగార నిర్మాణం కోసం స్థల సేకరణ, వారి సామగ్రి రక్షణకు సీఆర్పీఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరిస్తే, ప్రైవేట్ కంపెనీల అవసరాల కోసం సొంత సైన్యాలు రంగంలోకి దిగాయని సమాచారం. వీరంతా కలిసి రెండున్నర లక్షల మంది ఆదివాసీలను అడవి నుండి వెళ్లగొట్టారు. వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి, అవమానించి తరిమేయడానికి లైంగిక హింసను ఆయుధంగా వాడుకున్నారు. (నిలువెత్తు సాక్ష్యం–దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో లైంగిక హింస, వెల: రూ.130) కవిత్వపు గింజలు పల్లెను ప్రేమించడానికి అక్కడివారే కానక్కర్లేదు. పంటను కళ్లకద్దుకోవడానికి వ్యవసాయదారుడే అవ్వక్కర్లేదు. పచ్చదనాన్ని కలగనడానికి పర్యావరణవేత్తే కానక్కర్లేదు. ‘అతనికి అందరూ తెలియక పోవచ్చు/కానీ అన్నం తెలిసిన ప్రతివాడికీ/అతను తెలుసు, ఆకలి తెలిసినట్లే–’ అని రైతు గురించి రాయగలిగిన కవి దర్భశయనం శ్రీనివాసాచార్య గురించి కూడా కవిత్వం తెలిసినవారందరికీ తెలుసు. పంటను తగలబెట్టకు తండ్రీ, పంట కాల్వ, ధాన్య మానవునికి, మట్టి బిడ్డా, వరిపొలానికి కృతజ్ఞతల్తో, మళ్లీ నా వ్యవసాయ కళాశాలకు వంటి కవితలతో అన్నంపెట్టే రైతుపట్ల, వ్యవసాయంపట్ల తనకు గల అపార అభిమానాన్ని మరో సారి ఆయన చాటుకున్నారు. ‘వాళ్లు/ నేలతో నీటితో నింగితో నిప్పుతో/కలిసి బతికేవాళ్లు/అందుకే వాళ్లకు ప్రేమా దయా కృతజ్ఞతా/చల్లని చూపూ తెలుసు’అంటూ ప్రజల్ని అభిమానించే కవి కాబట్టే ‘కళ్లకు కాసిన్ని/చూపు ఉత్సవాల్ని ఇవ్వకుండా’ ఇంతగా పరుగెత్తాలా అని నిలదీస్తాడు.(ధాన్యం గింజలు–దర్భశయనం శ్రీనివాసాచార్య, వెల: రూ. రూ.80) పల్లె చెప్పిన పాఠం పల్లెటూరినుంచి మద్రాస్ వలసపోయిన విద్యాధిక కుటుంబంలో పుట్టి పెరిగిన పట్నవాసం అమ్మాయి.. పెళ్లయి పల్లె జీవితంలోకి వచ్చి పడితే ఎన్ని వైరుధ్యాలమధ్య నలగవలసి వస్తుందో చెప్పిన అనుభవాల పరంపరే ‘పాలంగి కథలు’. మద్రాసులో గొప్ప గొప్ప విద్వాంసుల రాకపోకలతో ఇల్లంతా సందడిగా పెరిగిన రచయిత్రి.. తణుకు పక్కన పాలంగి పల్లెటూరులో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఆధునికత దరిచేరని సమాజంలో, భిన్నమైన వాతావరణంలో ఎలా ఒదిగి పోయిందీ ‘పాలంగి కథలు’లో ఆత్మకథనాత్మక రీతిలో పాఠకుల ముందుపెట్టారు. ఇది ఆమె జీవితం మాత్రమే కాదు. అలనాటి సంప్రదాయ కుటుంబాల స్త్రీల జీవితాల ప్రతిబింబమీ కథలు. ఒక్క మాటలో చెప్పాలంటే ’ఈతరం వారు ఎప్పటికీ చూడలేని, అనుభవించలేని ఒక సహజ సుందరమైన గ్రామీణ జీవితంలోకి మనల్ని తీసుకుపోయే’ అరుదైన రచన. దీన్ని చదివే అనుభవాన్ని కోల్పోవద్దు. – కె. రాజశేఖరరాజు వెల: 100, ప్రతులకు స్టాల్ నంబర్ 275 -
అందుకే స్ర్తీవాద రచనలు చేస్తాను!
-
‘మాటల మడుగు’ మెర్సీ.. ‘లవ్ లెటర్స్’ కడలి..
-
పుస్తకం రాయడానికి అంతకు మించి ఇంకేం కావాలి!
-
ఈ ఏడాది ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడయ్యాయి!
-
పుస్తకాల జాతర చూసొద్దాం రండి