Illegal construction
-
సినీ నటుడు అలీకి నోటీసులు
-
అమీన్పూర్లో హైడ్రా.. పలు భవనాలు కూల్చివేత
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. మరోసారి అమీన్పూర్పై ఫోకస్ పెట్టిన హైడ్రా పలు నిర్మాణాలను నేలమట్టం చేసింది.వివరాల ప్రకారం.. అమీన్పూర్ మున్సిపాలిటి పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. సోమవారం తెల్లవారుజామునే అమీన్పూర్ చేరుకున్న హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను మార్క్ చేసి కూల్చివేస్తున్నారు. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు. రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చివేస్తున్నారు. భారీ యంత్రాలతో అక్కడి వెళ్లిన అధికారులు ఇళ్లను నేలమట్టం చేశారు.ఇదిలా ఉండగా.. నగరం పరిధిలో ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువులను, రోడ్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను ఫోకస్ చేసి హైడ్రా కూల్చివేస్తోంది. -
మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి స్థలంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత..
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లోని శబ్దాలయ వెనుక సంగీత దర్శకుడు దివంగత చక్రవర్తికి కేటాయించిన స్థలంలో నిరి్మంచిన అక్రమ నిర్మాణాలను షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది బుధవారం కూల్చివేశారు. చక్రవర్తికి మ్యూజిక్ రికార్డింగ్ స్టూడియో నిరి్మంచుకునేందుకు ప్రభుత్వం 25 ఏళ్ల క్రితం బంజారాహిల్స్ రోడ్డునెంబర్–14లో 20 గుంటల స్థలాన్ని కేటాయించింది. అయితే కేటాయించిన స్థలంలో ఏడాది లోపు ఆ ఉద్దేశాన్ని బహిర్గతపరుస్తూ నిర్మాణాలు చేపట్టాలని నిబంధనలు చెబుతున్నాయి. సంగీత దర్శకుడు చక్రవర్తి మాత్రం తనకు కేటాయించిన స్థలంలో పదేళ్లు దాటినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఆ తర్వాత ఆయన మృతి చెందారు. ఆయన తనయుడు కూడా సదరు స్థలంలో రికార్డింగ్ స్టూడియో నిర్మించకపోగా తాను కూడా తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వా«దీనం చేసుకుని ల్యాండ్ బ్యాంక్‌లో నమోదు చేసింది. గత కొన్నేళ్లుగా ఈ స్థలం ప్రభుత్వ ఆ«దీనంలోనే ఉంది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో కొందరు అక్రమ నిర్మాణాలను చేపట్టారు. ఒక్కొక్కరి నుంచి రూ.10 నుంచి 25 వేలు వసూలు చేస్తూ డబ్బాలు ఏర్పాటు చేశారని, కొన్ని శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లు తమ దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు షేక్‌పేట మండల తహశీల్దార్ అనితారెడ్డి తెలిపారు.ఈ స్థలం ప్రభుత్వానిదేనని, ఎవరైనా నిర్మాణాలు చేపట్టినా, ఆక్రమించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రభుత్వ విభాగాలకు కేటాయించే ప్రతిపాదన ఉందన్నారు. ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు నకిలీ డాక్యుమెంట్లతో తమదేనంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దెలు తీసుకుంటున్నట్లుగా తమ దృష్టికి వచి్చందన్నారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
మూసీ నది ప్రక్షాళనపై తెలంగాణ సర్కార్ ఫోకస్
-
సంగారెడ్డిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
కావూరి హిల్స్‌లో కబ్జాలు.. అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ కట్టడాలను కూల్చివేసిన హైడ్రా.. తాజాగా కావూరి హిల్స్‌లో నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది.హైడ్రా అధికారులు, పోలీసులు.. సోమవారం ఉదయమే కావూరి హిల్స్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో కావూరి హిల్స్‌లో పార్క్‌ను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణంపై కావూరి హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదుతో అక్రమ షెడ్లను కూల్చేశారు. ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి కావూరిహిల్స్ పార్కు పేరిట బోర్డును ఏర్పాటు చేశారు. అయితే, పార్కు స్థలాన్ని 25 ఏళ్లు లీజుకు తీసుకున్నామని స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు తెలిపారు. గడువు తీరకముందే అన్యాయంగా నిర్మాణాలు తొలగించారని ఆరోపించారు.ఈ క్రమంలో ఇప్పటికే నిర్వాహకులకు తాము నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అధికారుల నోటీసులను జిమ్ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో తాజాగా కూల్చివేతలు ప్రారంభించినట్టు చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. శనివారం కూకట్పలిల్లోని నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిర్మించుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు.ఇక, ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచ్చిన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. నోటీసుల విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని బాధితులు బోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: సిట్టింగ్ జడ్జితో విచారణ: కేటీఆర్ -
యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి!
కూకట్పల్లి: కూకట్పల్లి పాత గ్రామంలోని నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భూమి ఉన్న పట్టాదారులు చేసిన తప్పులకు సామాన్యులు బలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్ని లీజుకు ఇవ్వడంతో పలువురు నిర్మాణాలు చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు ఇచి్చన నోటీసుల విషయాన్నీ యజమానులు తమ లీజుదారులకు చెప్పలేదు. దీంతో ఆదివారం హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చేయడంతో సామాన్యులు నష్టపోయారు. ఇన్నాళ్లు లీజు తీసుకుంటున్న యజమానులు మాత్రం సేఫ్‌గా ఉండిపోయారు. నల్ల చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో దాదాపు 45 మంది స్థానికులకు పట్టా భూమి ఉంది. నిబంధనల ప్రకారం ఈ భూమిని కేవలం వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకోవాలి. దీనికి విరుద్ధంగా కొందురు యజమానులు తమ భూమిని లీజుకు ఇచ్చారు. దీన్ని లీజుకు తీసుకున్న వ్యక్తులు అందులో 17 షెడ్లను తమ సొంత ఖర్చులతో నిరి్మంచుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం ప్రతి దఫా చెల్లించే లీజు మొత్తం నుంచి కొంత షెడ్ల నిమిత్తం మినహాయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా... ఈ నిర్మాణాలు అక్రమమని గుర్తించిన ఇరిగేషన్, హైడ్రా అధికారులు 15 రోజు క్రితం నోటీసులు జారీ చేశారు. నిబంధనలను అనుసరించిన పట్టాదారులకే వీటిని ఇచ్చారు. అయితే నోటీసులు వచి్చన విషయం దాచిన యజమానులు లీజు దారులను తప్పుదోవ పట్టించారు. ఆదివారం ఇరిగేషన్, హైడ్రా అధికారులు అక్కడి అక్రమ నిర్మాణాల్లో 16 కూల్చివేశారు. అయితే నోటీసులు విషయం తెలియని లీజు దారులు తమ యంత్రాలను, ఇతర వస్తువులను కూడా పూర్తిస్థాయిలో బయటకు తీసుకోలేకపోవడంతో అవి ధ్వంసమయ్యాయి. ఇరిగేషన్ అధికారులు తమకు సమాచారం ఇస్తే తామే సామాగ్రిని తీసుకొని వెళ్లిపోయేవారమని క్యాంటీన్ నడుపుతున్న రమేష్, అతని తల్లిదండ్రులు భోరున విలపించారు. కనీసం గంట సమయాన్ని కూడా ఇవ్వకుండా షెడ్లను నేలమట్టం చేయటం ఏమిటని మండిపడ్డారు. భూ యజమానులు సైతం ఇది ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోకి రాదంటూ చెప్పటంతోనే తాము లీజుకు తీసుకున్నామంటూ రవి అనే బాధితుడు కన్నీరు మున్నీరయ్యాడు. గతంలో హైడ్రా అధికారులు వ్యాపార సముదాయాలకు నోటీసులు ఇచ్చారని చెప్తున్నారు. ఈ భూమిలో అనేక మంది లీజుదారులు అప్పులు చేసి నిర్మాణాలు చేసుకోవడంతో పాటు వ్యాపారాలు ప్రారంభించారు. కొందరు క్యాంటీన్లు, హోటళ్లు, క్యాటరింగ్ చేస్తుండగా.. మరికొందరు డెకరేషన్ సామాను, జిరాక్స్ మెషిన్లు ఏర్పాటు చేసుకున్నారు. భూ యజమానులు చేసిన తప్పుకు తాము నష్టపోతున్నామంటూ బాధితులు బోరున విలపించినా హైడ్రా అధికారులు కూలి్చవేతలు కొనసాగించారు. అధికారులు నేరుగా తమకు నోటీసులు ఇచ్చానా, తమ నిర్మాణాలకు అంటించినా ఈ పరిస్థితి వచ్చేది కాదని వాపోతున్నారు. -
కూకట్‌పల్లిలో హైడ్రా.. బీఆర్ఎస్ నేత అక్రమ నిర్మాణాలు కూల్చివేత
సాక్షి, కూకట్పల్లి: హైదరాబాద్‌లోకి కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి.కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్లచెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది. నల్లచెరువు విస్తీర్ణం 27 ఎకరాలు ఉండగా.. 14 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు అధికారులు గుర్తించారు. నల్లచెరువుపై సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్‌జోన్‌లోని 4 ఎకరాల్లో 50కిపైగా పక్కా భవనాలు, అపార్టుమెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లు ఉన్నాయి. కూల్చివేతల సందర్భంగా బాధితుల ఆవేదన.. కన్నీటిపర్యంతం నివాసం ఉన్న భవనాలను మినహాయించి చెరువు ఆక్రమించి నిర్మించిన 16 షెడ్ల యజమానులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం, ఆదివారం తెల్లవారుజామునే హైడ్రా అధికారులు, పోలీసులు కూకట్పల్లి చేరుకున్నారు. చెరువు పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం జరుగుతోంది. అలాగే, అమీన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. ఈ నిర్మాణాలు ప్రముఖ బీఆర్ఎస్ నేత, బిల్డర్ చంద్రశేఖర్ నిర్మించారని గుర్తింపు. ఈ సందర్బంగా ఆయనను లోపలికి అనుమతించని అధికారులు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కోర్టు నోటీసులు ఉన్నా పట్టింపు లేదా? అని ప్రశ్నించారు. కనీసం మా సామాగ్రిని అయినా తెచ్చుకోనివ్వండి అంటూ కొనుగోలుదారులు ప్రాధేయపడుతున్నారు. మరోవైపు.. కూల్చివేతల సందర్భంగా అధికారులు మీడియాను అనుమతించలేదు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌కు మంత్రి పొంగులేటి సవాల్ -
హైడ్రా బుల్డోజర్ల దూకుడు.. నష్టం ఎవరికి ?
-
చెరువులు మింగేశారు.. హైడ్రా చేస్తున్నది సరైనదేనా?
-
అలా నిర్మించిన ఇళ్లను కూల్చివేయం: హైడ్రా కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పారు.ఆదివారం అక్రమ నిర్మాణాల కూల్చివేతల సందర్భంగా హైడ్రా కమిషనర్ మాట్లాడుతూ.. ‘ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఇప్పటికే నిర్మించి, అందులో ఎవరైనా నివాసం ఉంటే అలాంటి నివాసాలను కూల్చివేయం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంటే మాత్రమే నిర్మాణాలను కూల్చేస్తాం. మల్లంపేట చెరువులో కూల్చివేస్తున్న భవనాలు నిర్మాణదశలో ఉన్నాయి. బఫర్‌జోన్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారు.సున్నం చెరువులో నిర్మించిన కొన్ని షెడ్లు వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారు. గతంలో కూడా వాటిని కూల్చేశారు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతోనే ఇప్పుడు కూల్చివేస్తున్నాం. బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలు, ఇళ్లు మాత్రం కొనుగోలు చేయకండి అని ప్రజలకు సూచించారు.మరోవైపు.. హైడ్రా ఆదివారం ఉదయం మల్లంపేట్‌లోని లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలో కూల్చివేతలు చేపట్టింది. అలాగే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని హెచ్ఎంటీ కాలనీ, వాణీనగర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సహాయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ విల్లాలపై హైడ్రా పంజా..
-
హైడ్రా దూకుడుతో ఆందోళనలో ప్రజలు
-
తెలంగాణలో చెరువుల ఆక్రమణ ఉదంతంలో అధికారులపై హైడ్రా ఫోకస్. అక్రమ అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలకు నిర్ణయం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
TG: ఇక జిల్లాల వంతు.. అక్రమ కట్టడాల కూల్చివేతలు షురూ
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. ఇటు హైదరాబాద్ పరిధిలో ‘హైడ్రా’ రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేస్తుండగా అటు జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికారులు కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు.మహబూబ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు రెవెన్యూ అధికారులు. క్రిష్టియన్పల్లిలో సర్వే నెంబర్ 523లోని అక్రమ కట్టడాలను రెవెన్యూ, పోలీసులు కలిసి కూల్చివేశారు. గురువారం తెల్లవారుజాము నుంచే నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఘటనా స్థలంలోనే అధికారులు ఉండి.. కూల్చివేతలు కొనసాగించారు.ఇక, హైదరాబాద్ పరిధిలో హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సహా పలువురి అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చెరువును ఆక్రమించి కాలేజీల నిర్మాణాలు జరిగినట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఈ అంశం ఆసక్తికరంగా మారింది. -
హుస్సేన్ సాగర్ లో వెయ్యి ఎకరాలు మింగేసి అక్రమ కట్టడాలు
-
అక్రమ నిర్మాణాలు ఎవరు కట్టినా కూల్చడమే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారి కట్టడాలను కూడా కూల్చివేస్తామని కామెంట్స్ చేశారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘హైదరాబాద్ లేక్ సిటీ. గండిపేట, ఉస్మాన్ సాగర్.. హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయి. కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. డ్రైనేజీలను చెరువుల్లో కలుపుతున్నారు. ఆ ఫాం హౌస్‌ల నాలాలు గండిపేటలో కలిపారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. చెన్నై, ఉత్తరాఖండ్, వయనాడ్‌లో ఏం జరిగిందో అందరూ చూశారు. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టాం. ఎలాంటి ఒత్తిడి వచ్చినా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయాలనే నిర్ణయించాం. అందుకే హైడ్రాను ఏర్పాటు చేశాం.అక్రమ నిర్మాణాలు వదిలేస్తే నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్టే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు అందరూ సహకరించాలి. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతాం. చెరువుల్లో అక్రమ నిర్మాణాలను వదిలేది లేదు. ఆక్రమణదారుల చెర నుంచి చెరువులకు విముక్తి కలిగిస్తాం. రాజకీయం కోసమో.. నాయకులపై కక్ష కోసం కూల్చివేతలు చేయడం లేదు. చెరువుల ఆక్రమణదారుల్లో ప్రభుత్వాలను ప్రభావితం చేసేవారు కూడా ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములైన వారు కూడా ఉండవచ్చు. సమాజాన్ని ప్రభావితం చేసేవారు ఉండొచ్చు. కానీ, నేను ఎవరినీ పట్టించుకోను. హైడ్రా తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. భవిష్యత్ తరాలకు ప్రకృతిని అందించాలి’ అంటూ కామెంట్స్ చేశారు. -
వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’.. కబ్జాదారులే టార్గెట్‌గా...!
‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలతో రాజధాని హైదరాబాద్‌లోని చెరువుల్లో ఆక్రమణలు చేసిన వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఈ స్వయంప్రతిపత్తి సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్నారు.ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకున్న అధికారులు ఇప్పటివరకు నగరంలోని అనేక భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. నిత్యం ఏదో ఒకచోట అధికారులు ఆక్రమణలను కూల్చేస్తున్నారు. అయితే చాలా మందికి హైడ్రా మీద అనేక అనుమానాలు ఉన్నాయి.. వీటిపై హైడ్రా కమిషనర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..చదవండి: ఆక్రమణదారులకు సింహస్వప్నం!అసలు హైడ్రా అంటే ఏంటి?హైడ్రా అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు కబ్జాకు గురికాకూడదనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన హైడ్రా పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుంది.హైడ్రా ఛైర్మన్‌గా ముఖ్యమంత్రి వ్యవహరించనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మంత్రులు, సీఎస్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ, జీహెచ్ఎంసీ మేయర్ సభ్యులుగా ఉంటారు.హైడ్రా ఏం చేస్తుంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు. సిటీని పకృతి విపత్తుల నుంచి రక్షించడానికి కృషి చేయడం, విపత్తుల సమయంలో వేగంగా స్పందించి ప్రజలను కాపాడే సంస్థ ప్రభుత్వ భూములను స్థానికులతో కలిసి కాపాడుకోవడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ ఆస్తులైన చెరువులు, పార్కులు, నాలాలు, స్మశాన వాటికలు వంటి వాటిని కబ్జా కాకుండా చూస్తుంది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటం దీని ప్రధాన లక్ష్యాలు. ఇప్పుడున్న చెరువులను కాపాడుతూ గతంలో కబ్జాకు గురైన చెరువులను నెమ్మదిగా స్వాధీనం చేసుకోవడానికి చర్యలు తీసుకుంటాం. నగరంలోని చెరువుల్లో ఇప్పటి వరకు దాదాపు 66 శాతం కబ్జాకు గురయ్యాయి. ఇలాగే వదిలేస్తే ఒకటి రెండేళ్లలో సిటీ పరిధిలో చెరువనేదే కనిపించకుండా పోతుంది. వీటి రక్షణ కోసమే హైడ్రా. భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటే భయం పుట్టాలి. ఇది కబ్జాదారుల వెన్నులో వణుకు పుట్టించాలి.జీహెచ్ఎంసీ అధికారులు ఎవరైనా అవినీతికి పాల్పడితే, విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే వారి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు అందజేస్తాం. వర్షాలు వచ్చిన సమయంలో రోడ్లపై నీరు నిలిచిపోతే స్పందించి వాటిని క్లియర్ చేయడం. కూడా హైడ్రా విధినే.ఇప్పటికే హైడ్రా అధికారులు ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, లే అవుట్లలో సామాజిక అవసరాల కోసం కేటాయించిన స్థలాలు, పరిశ్రమల శాఖకు చెందిన స్థలాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఉన్న నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు.చదవండి: ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా? నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. మాదాపూర్‌లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ కూల్చివేతను అధికారులు చేపట్టారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. మూడున్నర ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. -
రంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా
-
విద్యార్థుల జలసమాధిపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కోచింగ్ సెంటర్లో విద్యార్థుల జలసమాధి ఘటనపై కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సోమవారం ప్రకటించింది. ఘటనకు కారణాలను తెల్సుకోవడంతోపాటు బాధ్యులెవరో తేల్చనుంది. ఘటనలు పునరావృతంకాకుండా తీసుకోవాల్సిన చర్యలతోపాటు అవసరమైతే విధానపర నిర్ణయాల్లో చేపట్టాల్సిన మార్పులను కమిటీ సిఫార్సుచేయనుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో ఢిల్లీ ప్రభుత్వ(హోంశాఖ) ముఖ్య కార్యదర్శి, ఢిల్లీ పోలీస్, ఫైర్ స్పెషల్ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. హోం శాఖ సంయుక్త కార్యదర్శి ఈ కమిటీకి కనీ్వనర్‌గా ఉంటారు. 30 రోజుల్లోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించనుందని హోం శాఖ అధికార ప్రతినిధి సోమవారం చెప్పారు మరో ఐదుగురి అరెస్ట్ ఈ ఘటనలో బేస్మెంట్ యజమానులపాటు మొత్తం ఐదుగురిని సోమవారం పోలీసులు అ రెస్ట్చేశారు. డ్రైనీజీలపై అక్రమ కట్టడాలను అధికారులు బుల్డోజర్లతో కూల్చేయడం మొదలెట్టారు.20 బేస్మెంట్లకు సీలుకోచింగ్ కేంద్రాలకు నిలయమైన పాత రాజీందర్ నగర్ ప్రాంతంలో సోమవారం అధికారులు అక్రమ కట్టడాలపై చర్యలకు ఉపక్రమించారు. అక్రమంగా నడుస్తున్న పలు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన 20 బేస్మెంట్లకు సీల్‌వేశారు. అధిక కోచింగ్ సెంటర్లు ఉండే మరో ప్రాంతం ముఖర్జీ నగర్లోనూ ఆకస్మిక పర్యటనలు చేయించండి. అభ్యర్థులను శాంతింపజేయడానికి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సోమవారం అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు తలో రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలపై ఉక్కుపాదం
-
రాజకోటల్లా టీడీపీ కార్యాలయాలు
-
‘డెక్కన్’లో ధిక్కరణ.. అడ్డగోలు నిర్మాణాలే అధికం..
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని మినిస్టర్స్ రోడ్‌లోని రాధా ఆర్కేడ్ భవనంలో డెక్కన్ కార్పొరేట్ భవనం నిబంధనల ఉల్లంఘనకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. ఇందులో అడుగడునా ఫైర్ సేఫ్టీ మెజర్స్ అతిక్రమించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. భవనం ఏరియా సైతం ఉండాల్సిన విధంగా లేదు. ఈ కారణంగానే గురువారం అగ్ని ప్రమాదంలో మంటల్ని అదుపు చేయడానికి పది గంటలకు పైగా శ్రమించాల్సి వచి్చంది. ముగ్గురు వ్యక్తులు గల్లంతు కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఉల్లంఘనలు ఇలా... ► ఈ భవనం సబ్–సెల్లార్, సెల్లార్, గ్రౌండ్ ప్లస్ సిక్స్ ఫోర్లుగా నిర్మించారు. దీని విస్తీర్ణంలో కనీసం 1/3 వంతు ఖాళీ స్థలం ఉండాల్సి ఉన్నా కనిపించలేదు. ► భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఖాళీ స్థలం ఉండాలి. అరకొర స్థలంలో నిర్మించిన ఈ భవనంలో దక్షిణం వైపు ప్రధాన రోడ్డు మినహామిస్తే మిగిలిన మూడు దిక్కులూ కనీసం నడిచే స్థలం కూడా లేదు. ఈ వాణిజ్య భవనం వెనుక, పక్కన నివాస సముదాయాలు ఉన్నాయి. ► ప్రమాదం జరిగితే బయటపడానికి వెలుపల వైపు స్టెయిర్ కేస్ ఉండాలి. వెలుపల మాట అటుంచితే లోపల ఉన్న ఇంటర్నల్ స్టెయిర్ కేస్ కూడా అవసరమైన స్థాయిలో లేదు. ► ఇలాంటి వాణిజ్య భవనాలకు అత్యవసర సమయంలో వెలిగించేందుకు ఎమర్జెన్సీ లైట్లు, ఆటో గ్లో సిస్టమ్ తప్పనిసరి. ‘డెక్కన్’లో వెతికినా ఇవి కనిపించలేదు. అగ్ని ప్రమాదం జరిగితే బయటపడటానికి ప్రత్యేక ఎగ్జిట్ ఉండాలి. ఇది ఎక్కడా కనిపించలేదు. ► మండలార్పేందుకు ఈ భవనంలో ఫైర్ ఎక్స్టింగి్వషర్లు, వాటర్ పైపులు, స్ప్రింక్లర్స్‌తో పాటు వెట్ రైజర్ తప్పనిసరి. ఈ భవనంలో ఇవి ఉన్న దాఖలాలు లేవు. ► విద్యుత్ ఫైర్ అలారం, మాన్యువల్ ఫైర్ అలారం తప్పనిసరి. ఈ రెండూ మచ్చుకైనా కనిపించలేదు. ప్రమాదాన్ని పసిగట్టి హెచ్చరించే ఆటోమేటిక్ వ్యవస్థ ఉండాలి. ఇలాంటింది ఎక్కడా కనిపించలేదని అగి్నమాక శాఖ అధికారులు చెబుతున్నారు. ► అగ్ని ప్రమాదాల్లో మాత్రమే వినియోగించడానికి ఉపకరించే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ తప్పనిసరి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ మాత్రమే ఉంది. దీన్ని సాధారణ వాడకానికి వినియోగిస్తున్నారు. ► అగ్ని ప్రమాదాల సందర్భంలో నీటిని సరఫరా చేసేందుకు విద్యుత్, డీజిల్, జాకీ పంప్‌లు ప్రత్యేకంగా ఉండాలి. కానీ.. ‘డెక్కన్’లో ఎంత వెతికినా కనిపించవు. చదవండి: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోజంతా మంటలే! -
డ్రైన్ ఉంటే మాకేంటి...ఆక్రమించి మరీ భవన నిర్మాణం!
ఒంగోలు సబర్బన్: నగరంలో అక్రమ కట్టడాలు యథేచ్చగా సాగుతున్నాయి. నగర పాలక సంస్థ అధికారుల అనుమతులు లేకుండానే భారీ నిర్మాణాలు పూర్తవుతున్నాయి. కళ్ల ముందే పెద్ద పెద్ద భవనాలు వెలుస్తున్నా నగర పాలక సంస్థ అధికారులు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. నగరంలో ఒకచోట కాదు అనేక ప్రాంతాల్లో అనుమతుల్లేని నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. తనిఖీలకు వెళ్లిన సమయంలో తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకుని వస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్‌లో అక్రమంగా నిర్మిస్తున్న భారీ భవనం. దక్షిణ బైపాస్ ప్రగతి భవన్‌కు వెళ్లే ప్రధాన గేటుకు ఆనుకొని దానిని నిర్మిస్తున్నారు. వారం రోజులుగా పనులు జరుగుతున్నాయని తెలిసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఒకటికి నాలుగు సార్లు అక్కడికి వెళ్లి వచ్చారే తప్ప నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేయలేదంటే.. దాని మతలబు ఏమై ఉంటుందో స్పష్టమవుతోంది. దీనికి తోడు దక్షిణ బైపాçస్లో ఉత్తరం వైపున ఆనుకొని ఒంగోలు నగరానికి చెందిన ప్రధాన డ్రైనేజీ కాలువ ఉంది. మామిడిపాలెం, హౌసింగ్ బోర్డు, ఎస్ఎస్ ట్యాంకు–1 పరిసర ప్రాంతాల నుంచి మురుగు నీరు, వర్షపు నీరు ఈ డ్రైనేజి నుంచే ప్రవహించాల్సి ఉంది. అయితే దాదాపు 10 అడుగుల వెడల్పు ఉండే దీనికి రెండు సిమెంట్ పైపులు వేసి తాత్కాలికంగా మట్టితో కప్పేసి మరీ నిర్మాణం చేస్తున్నారు. పెద్ద వరద వస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే వీలు లేక ప్రభుత్వ భవనాల సముదాయం, నాగార్జున యూనివర్శిటీ స్టడీ సెంటర్, నవోదయ కళాశాలల్లోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటికైనా నగరంలో అక్రమ నిర్మాణాలకు కట్టడి వేయాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతున్నా టౌన్ ప్లానింగ్‌లో ఉన్నతాధికారి స్పందించకపోవడం గమనార్హం. నగర పాలక సంస్థ ఆదాయానికి గండి: అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేసుకుంటూ పోతే నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతుంది. ఫ్లింత్ ఏరియాను బట్టి, అంతస్తుల భవనాల లెక్కన కార్పొరేషన్‌కు ఫీజులు చెల్లించాలి. నగర పాలక సంస్థ ఆదాయానికి భారీగా తూట్లు పడుతున్నా తమ జేబులు నిండితే చాలు అన్న చందంగా ఉంది టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు. నోటీసులు ఇచ్చి ఆపుతాం.. అక్రమంగా జరుగుతున్న భవన నిర్మాణాలను ఆపేస్తాం. నిబంధనలకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నిర్మాణాలు చేపట్టినా చర్యలు తీసుకుంటాం. దక్షిణ బైపాస్‌లో ప్రగతి భవన్ ముందు జరుగుతున్న భవన నిర్మాణం విషయం నా దృష్టికి వచ్చింది. వెంటనే నోటీసులు ఇవ్వమని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పా. నోటీసు ఇవ్వటంతో పాటు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేస్తాను. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలకు పాల్పడిన విషయం నా దృష్టికి రాలేదు. ఆ విషయంపై కూడా విచారణ చేసి చర్యలు తీసుకుంటాను. – ఎం.వెంకటేశ్వరరావు, కమిషనర్, ఒంగోలు నగర పాలక సంస్థ