Indian football team
-
Intercontinental Cup football 2024: టీమిండియాకు ‘సున్నా’
సాక్షి, హైదరాబాద్: కొత్త కోచ్ మార్క్వెజ్ ఆధ్వర్యంలో భారత ఫుట్‌బాల్ జట్టు రాత మారుతుందని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఇంటర్ కాంటినెంటల్ కప్ తొలి పోరులో తమకంటే బలహీనమైన మారిషస్‌పై ఒక్క గోల్ కూడా కొట్టకుండా మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్ ఊహించినట్లుగానే తమకంటే పటిష్టమైన సిరియా చేతిలో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లోనూ గోల్ లేకుండా ఆటను ముగించింది. సోమవారం రాత్రి గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సిరియా 3–0 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించి టోర్నీ విజేతగా నిలిచింది. మూడు జట్ల మధ్య రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోరీ్నలో మారిషస్ జట్టు రెండో స్థానంలో నిలువగా... భారత్ చివరిదైన మూడో స్థానంతో సరిపెట్టుకుంది. తమ తొలి లీగ్ మ్యాచ్‌లో సిరియా 2–0తో మారిషస్‌పై గెలిచింది. భారత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ నెగ్గిన సిరియా అజేయంగా టైటిల్‌ను సొంతం చేసుకుంది. సిరియా తరఫున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్...76వ నిమిషంలో మొహసీన్ దలెహో గోల్స్ సాధించారు. ఆట చివర్లో పాబ్లో డేవిడ్ (90+6 నిమిషంలో) మరో గోల్ కొట్టి టోర్నీని ముగించాడు. భారత్ కంటే ఒక గోల్ తక్కువగా ఇచి్చనందుకు మారిషస్ జట్టుకు రెండో స్థానం దక్కింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి సిరియా జట్టుకు విన్నర్స్ ట్రోఫీతోపాటు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ చెక్‌ను అందజేశారు. సమష్టి వైఫల్యం... ఆట ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించిన సిరియా వరుసగా దాడులు చేసింది. దానికి 7వ నిమిషంలోనే ఫలితం దక్కింది. మహమూద్ బాక్స్ ఏరియా నుంచి కొట్టిన షాట్‌ను భారత డిఫెండర్లు నిలువరించగలిగినా... రీ»ౌండ్లో అతను దానిని ఛేదించగలిగాడు. గుర్ప్రీత్ ఆపలేకపోవడంతో సిరియా ఖాతాలో గోల్ చేరింది. తొలి 25 నిమిషాల్లో భారత పోస్ట్‌పై సిరియా ఐదుసార్లు అటాక్ చేయగా, భారత్ ఒక్కసారి కూడా చేయలేదు. తొలి అర్ధ భాగం ముగియడానికి నాలుగు నిమిషాల ముందు భారత్ పదే పదే దాడులు చేసింది. రాహుల్ భేకే, సమద్, మాని్వర్ గట్టిగా ప్రయతి్నంచినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేకపోయారు. రెండో అర్ధభాగంలో మూడు నిమిషాల వ్యవధిలో భారత్ గోల్ కొట్టేందుకు చేరువగా వచి్చనా, ప్రత్యర్థి కీపర్ అడ్డుకోగలిగాడు. మరోవైపు బాక్స్ వద్ద తనకు లభించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకుంటూ సిరియా ఆటగాడు తమ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. 87వ నిమిషంలో భారత ప్లేయర్ ఎడ్మండ్ అద్భుతంగా కొట్టిన షాట్‌ను కీపర్ హదయా ఆపాడు. ఇంజ్యూరీ టైమ్‌లో సిరియా మరో దెబ్బ కొట్టి భారత్‌కు వేదనను మిగిలి్చంది. -
‘భారత్‌కు స్వదేశీ కోచ్ ఉంటేనే మేలు’
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టుకు భవిష్యత్తులో స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని భారత జట్టు కొత్త హెడ్ కోచ్ మనొలొ మార్క్వెజ్ అభిప్రాయపడ్డారు. ఇగోర్ స్టిమాక్ స్థానంలో స్పెయిన్‌కు చెందిన 55 ఏళ్ల మార్క్వెజ్ను ఇటీవల హెడ్ కోచ్‌గా నియమించారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్పెయిన్ తర్వాత ఎక్కువగా గడిపింది భారత్‌లోనే. అందుకేనేమో కొన్నేళ్ల క్రితం భారత్‌కు హెడ్ కోచ్ కావాలని గట్టిగా అనుకున్నాను. అది అప్పుడు కల. కానీ ఇప్పుడు ఆ కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’ అని అన్నారు. అయితే భారత్ భిన్న రాష్ట్రాల సమ్మిళితం కాబట్టి స్వదేశీ కోచ్ ఉంటేనే బాగుంటుందని, స్థానిక భాషలు, అంశాలపై ఆయనకు పట్టు ఉంటుందని మార్క్వెజ్ వివరించారు. ‘భారత్ కోచ్‌గా జట్టు స్థాయి పెంచడమే మా లక్ష్యం. వ్యక్తిగతంగా ఆటగాళ్లు, సమష్టిగా జట్టు మెరుగయ్యేందుకు ప్రణాళికలు రచిస్తాం. ఇప్పటికిప్పుడు దీని ఫలితాలు రాకపోవచ్చు. దీనికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుత లక్ష్యమైతే ఆసియా కప్–2027కు అర్హత సాధించడం. ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు భారత్ ఆరేడు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని అన్నారు. -
భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్ పదవికి 291 దరఖాస్తులు
ఖాళీగా ఉన్న భారత సీనియర్ పురుషుల హెడ్ కోచ్ పదవి కోసం 291 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలో భారత జట్టు మాజీ సభ్యుడు, గతంలో మోహన్ బగాన్ క్లబ్, ఈస్ట్ బెంగాల్ క్లబ్ జట్లకు కోచ్‌గా ఉన్న స్టాన్లీ రొజారియో... నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ అసిస్టెంట్ కోచ్ నౌషాద్ మూసా కూడా ఉన్నారు. 64 ఏళ్ల రొజారియో సరీ్వసెస్‌తో తన కోచింగ్ కెరీర్‌ను మొదలుపెట్టి 2006 నుంచి 2008 వరకు టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించారు. ఈ నెలాఖరుకు కొత్త కోచ్‌ను నియమిస్తారు. -
2026 FIFA World Cup: భారత ఫుట్‌బాల్ జట్టు సత్తాకు పరీక్ష
దోహా: స్టార్ ప్లేయర్, కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికిన తర్వాత... భారత ఫుట్‌బాల్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా జోన్ రెండో రౌండ్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో నేడు ఆడనుంది. ఓవరాల్‌గా ఖతర్‌తో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఆడిన భారత్ ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇప్పటికే ఆసియా జోన్ మూడో రౌండ్‌కు అర్హత పొందిన ఖతర్ జట్టుకు ఈ మ్యాచ్ ప్రాక్టీస్‌లా ఉపయోగ పడనుండగా... భారత జట్టుకు మాత్రం తాడోపేడోలాంటింది. గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నాయకత్వంలో ఈ మ్యాచ్ ఆడనున్న భారత జట్టు విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ‘డ్రా’గా ముగిస్తే మాత్రం అఫ్గానిస్తాన్, కువైట్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫలితంపై భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంటుంది. భారత్ తమ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్ కూడా ‘డ్రా’గా ముగియాలి. అలా జరిగితేనే భారత్ మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్–కువైట్ మ్యాచ్‌లో ఫలితం వస్తే గెలిచిన జట్టు మూడో రౌండ్‌కు చేరుకుంటుంది. భారత్‌తోపాటు ఓడిన మరో జట్టు రెండో రౌండ్‌కే పరిమితమవుతుంది. 2026 ప్రపంచకప్‌లో తొలిసారి 48 జట్లు పోటీపడనుండగా... ఆసియా నుంచి 8 జట్లకు నేరుగా అవకాశం లభిస్తుంది. మరో బెర్త్ ప్లే ఆఫ్ మ్యాచ్ ద్వారా ఖరారవుతుంది. -
కోచ్‌గా స్టిమాక్ కొనసాగింపు!
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ జట్టు మైదానంలో నిరాశాజనక ఫలితాలు సాధిస్తున్నప్పటికీ... కోచ్‌గా ఐగర్ స్టిమాక్ కొనసాగనున్నారు. 2026 ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్లాంటి చిన్న జట్టుతో ఓటమి పాలవడం ఆయన కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సాంకేతిక కమిటీ కూడా హెడ్ కోచ్‌ను తప్పించాలనే సిఫార్సు చేసింది. అయితే ఒప్పంద నిబంధనలు ఆయన్ని ఉన్నపళంగా తప్పిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఉన్నాయి. దీంతో వేటు కంటే కొనసాగించడమే మేలని ఏఐఎఫ్ఎఫ్ భావిస్తోంది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టిమాక్ ఇన్చార్జ్గా జూన్ వరకు జట్టుతో కలిసి పనిచేస్తారు’ అని ఏఐఎఫ్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. జూన్‌లో ఆసియా క్వాలిఫయర్స్‌కు సంబంధించిన రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్... కువైట్, ఖతర్లతో తలపడాల్సివుంటుంది. ఈ ఫలితాలను బట్టే తదుపరి మూడో రౌండ్‌కు అర్హత సాధించేది లేనిది తేలుతుంది. అఫ్గానిస్తాన్‌తో ఇంటా బయటా జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ నిరాశపరిచింది. అఫ్గాన్‌కు సంబంధించిన హోమ్ మ్యాచ్ సౌదీలో జరగ్గా భారత్ డ్రా చేసుకుంది. -
ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) క్లబ్ జట్లు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎంపిక చేసిన పలువురు అగ్రశ్రేణి సీనియర్, జూనియర్ ఆటగాళ్లను ఐఎస్ఎల్ క్లబ్‌లు విడుదల చేయలేదు. 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో కెప్టెన్ సునీల్ ఛెత్రి మినహా మిగతా వారంతా అనుభవంలేని ఆటగాళ్లే ఉన్నారు. సునీల్ ఛెత్రితోపాటు సీనియర్ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్, సందేశ్ జింగాన్లను ఏఐఎఫ్ఎఫ్ ఎంపిక చేసింది. ఆసియా క్రీడల కోసం గుర్‌ప్రీత్‌ను బెంగళూరు ఎఫ్‌సీ, సందేశ్‌ను గోవా ఎఫ్‌సీ విడుదల చేసేందుకు ఆసక్తి చూపలేదు. భారత జట్టు వెంట రెగ్యులర్ కోచ్ ఇగోర్ స్టిమాక్ వెళ్తారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. ఆసియా క్రీడల ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఈనెల 19న మొదలుకానుండగా... ఐఎస్ఎల్ పదో సీజన్‌కు ఈనెల 21న తెరలేస్తుంది. భారత ఫుట్‌బాల్ జట్టు: ధీరజ్ సింగ్, గుర్మీత్ సింగ్ సుమిత్ రాఠి, నరేందర్ గెహ్లోట్, అమర్జీత్ సింగ్, శామ్యూల్ జేమ్స్, కేపీ రాహుల్, అబ్దుల్ రబీ, ఆయుశ్ దేవ్, బ్రైస్ మిరిండా, అజ్ఫర్ నూరాని, రహీమ్ అలీ, విన్సీ బరెటో, సునీల్ ఛెత్రి, రోహిత్ దాను, గుర్కీరత్ సింగ్, అనికేత్ జాదవ్. -
ఫిఫా ర్యాంకింగ్స్.. టాప్-100లో భారత జట్టుకు చోటు
న్యూఢిల్లీ: ఐదేళ్ల విరామం తర్వాత భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ర్యాంకింగ్స్‌లో టాప్-100లో చోటు దక్కించుకుంది. క్రితంసారి ర్యాంక్‌లను ప్రకటించినపుడు సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత ఫుట్‌బాల్ జట్టు సరిగ్గా 100వ ర్యాంక్‌లో నిలిచింది. ఇటీవల దక్షిణాసియా చాంపియన్‌షిప్‌లో టైటిల్ నిలబెట్టుకోవడంతో భారత జట్టు ఒక స్థానం మెరుగుపర్చుకొని 99వ ర్యాంక్‌లో నిలిచింది. 1996లో భారత జట్టు అత్యుత్తమంగా 94 ర్యాంక్‌ను దక్కించుకుంది. 2018 తర్వాత భారత్‌కు ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం. ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్‌లో కొనసాగుతుండగా.. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. ఆసియా ర్యాంకింగ్స్‌లో జపాన్ (ప్రపంచ 20వ ర్యాంక్) టాప్‌లో ఉంది. ᴡᴇ ᴍᴀʀᴄʜ ᴏɴ 💪🏽💙 🇮🇳 climbed up to 9️⃣9️⃣ in the latest official @FIFAcom world ranking 👏🏽🤩#BlueTigers 🐯 #IndianFootball ⚽️ pic.twitter.com/wLMe4WjQuA — Indian Football Team (@IndianFootball) July 20, 2023 చదవండి: బ్రిజ్‌భూషణ్‌కు బెయిల్; ఏ ప్రాతిపదికన వారికి మినహాయింపు? -
Asian Games 2023: ఆసియా క్రీడల్లో ఆడనివ్వండి
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడే అవకాశం కలి్పంచాలని కోరుతూ సీనియర్ టీమ్ హెడ్ కోచ్ ఐగర్ స్టిమాక్ దేశ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సెపె్టంబర్ 23 నుంచి చైనాలోని హాంగ్జూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఇందులో ఫుట్‌బాల్ క్రీడాంశంలో వివిధ దేశాలకు చెందిన అండర్–23 స్థాయి టీమ్‌లు పాల్గొంటాయి. ఈ జట్లలో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు కూడా ఆడే వెసులుబాటు కలి్పస్తారు. అయితే టీమ్ ఈవెంట్లలో ర్యాంకింగ్స్‌లో టాప్–8లో ఉంటేనే మన జట్లను పంపిస్తామని భారత క్రీడా శాఖ మాత్రం విధానం రూపొందించుకుంది. ప్రస్తుతం ఆసియాలో భారత ఫుట్‌బాల్ జట్టు 18వ ర్యాంక్‌లో ఉంది. దాంతో ఫుట్‌బాల్ టీమ్‌ను పంపడానికి అవకాశం లేదు. దీనిపైనే ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ స్టిమాక్ సోషల్ మీడియాలో సుదీర్ఘ లేఖ రాస్తూ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. భారత్ 2017లో అండర్–17 ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాటి జట్టులో ఆడినవారే ఇప్పుడు అండర్–23 క్వాలిఫయర్స్‌లో మెరుగ్గా రాణించారు. ఈ కుర్రాళ్లలో మంచి ప్రతిభ ఉంది. కానీ ఇప్పుడు ఆసియా క్రీడల్లో మన జట్టు పాల్గొనకుండా అడ్డు చెబుతున్నారు. ఈ టీమ్‌లో అలాంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలి. జట్టును పంపకుండా ఉండేందుకు చెబుతున్న కారణాలు సహేతుకంగా లేవు. అందుకే భారత్ కోచ్‌గా ఈ విషయాన్ని మీ దృష్టికి, కేంద్ర క్రీడాశాఖ దృష్టికి తీసుకొస్తున్నాను. కాబట్టి మీరు జోక్యం చేసుకొని జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చేయాలి అని స్టిమాక్ అన్నారు. ఎలాంటి ప్రత్యర్థినైనా ఓడించే సత్తా మన జట్టుకు ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. ‘ర్యాంకింగ్ పేరు చెప్పి మన క్రీడా శాఖనే జట్టు పాల్గొనకుండా చేస్తోంది. నిజానికి ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న కొన్ని ఇతర క్రీడల టీమ్‌ల కంటే మన ఫుట్‌బాల్ జట్టు ర్యాంక్ మెరుగ్గానే ఉంది. పైగా తమకంటే బలమైన జట్లపై చిన్న టీమ్‌లు సంచలన విజయాలు సాధించడం ఫుట్‌బాల్‌లో అసాధ్యమేమీ కాదని చరిత్ర చెబుతోంది’ అని స్టిమాక్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అక్కడి స్టార్ ఆటగాడు కిలియాన్ ఎంబాపె భారత్‌లో సూపర్‌హిట్ అని, అతనికి అక్కడికంటే మన దేశంలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని నరేంద్ర మోదీ చెప్పిన విషయాన్ని స్టిమాక్ గుర్తు చేశారు. ‘ఫ్రాన్స్ పర్యటనలో ఎంబాపె గురించి మీరు చేసిన వ్యాఖ్య భారత ఫుట్‌బాల్‌ను అభిమానించేవారందరికీ సంతోషం కలిగించింది. మన జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనేలా చూడాలని భారత టీమ్ తరఫున మిమ్మల్ని కోరుతున్నా. క్రీడాశాఖ సూచనల్లో ఒక ప్రత్యేక నిబంధన కూడా ఉంది. టాప్–8లో లేకపోయినా సరైన కారణంతో నిపుణుల బృందం సిఫారసు చేస్తే ఆ టీమ్‌ను ఆసియా క్రీడలకు పంపవచ్చు. దీని ప్రకారం అవకాశం కలి్పంచండి’ అని స్టిమాక్ కోరారు. భారత ఫుట్‌బాల్ జట్టు 1951 న్యూఢిల్లీ, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు... 1970 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఆ తర్వాత పలుమార్లు భారత జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొన్నా ఆరంభ రౌండ్లలోనే ని్రష్కమించింది. -
సెమీస్‌కు భారత్.. ప్రగల్బాలు పలికిన పాక్ లీగ్ దశలోనే ఇంటికి
బెంగళూరు: ‘శాఫ్’ చాంపియన్‌షిప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. గ్రూప్ ‘ఎ’లో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సునీల్ ఛెత్రి సేన 2–0 గోల్స్‌తో నేపాల్‌పై ఘన విజయం సాధించింది. శ్రీ కంఠీరవ స్టేడియంలో భారత జోరుకు ఎదురే లేకుండా పోయింది. తొలి అర్ధ భాగంలో నేపాల్ రక్షణ శ్రేణి చురుగ్గా ఉండటంతో గోల్ చేయలేకపోయిన భారత్ ద్వితీయార్ధంలోనే ఆ రెండు గోల్స్ చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 61వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, నోరెమ్ మహేశ్ సింగ్ 70వ నిమిషంలో గోల్ చేశాడు. మరోవైపు భారత డిఫెండర్లు నేపాల్ ఫార్వర్డ్‌ను ఎక్కడికక్కడ కట్టడి చేసి వారి దాడుల్ని సమర్థంగా అడ్డుకుంది. భారత ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా ఐదు షాట్లు కొడితే... నేపాల్ ఒక షాట్‌కే పరిమితమైంది. మ్యాచ్‌లో ఎక్కువసేపు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకొన్న భారత ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటల్ని సాగనివ్వలేదు. తాజా విజయంతో సొంతగడ్డపై భారత్ అజేయమైన రికార్డు 12 మ్యాచ్‌లకు చేరింది. 2019లో సెప్టెంబర్ 5న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన భారత్ తర్వాత స్వదేశంలో ఏ జట్టు చేతిలోనూ ఓడిపోలేదు. అంతకుముందు ఇదే గ్రూపులో కువైట్ 2–0తో పాకిస్తాన్‌ను చిత్తు చేయడంతో కువైట్ కూడా సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. 27న కువైట్‌తో జరిగే ఆఖరి లీగ్ మ్యాచ్‌తో గ్రూప్‌లో అగ్ర స్థానంలో నిలిచేది ఎవరో తేలుతుంది. నేపాల్, పాకిస్తాన్‌లు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టాయి. It's that m̶a̶n̶ legend once again!@chetrisunil11#SAFFChampionship pic.twitter.com/wx1eSk4Y5E— FanCode (@FanCode) June 24, 2023 2️⃣ goals in quick succession 🤩 India are through to the #SAFFChampionship2023 Semifinal 👏🏽💙#NEPIND ⚔️ #IndianFootball ⚽️ #BlueTigers 🐯 pic.twitter.com/ByzfjsKSZY— Indian Football Team (@IndianFootball) June 24, 2023 చదవండి: #CheteshwarPujara: 'ఆటగదరా శివ!'.. పుజారా ఎమోషనల్ పోస్ట్ -
‘శాఫ్’ ఫుట్‌బాల్ చాంప్ భారత్
న్యూఢిల్లీ: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 సాకర్ చాంపియన్‌షిప్‌లో భారత అబ్బాయిలు టైటిల్ నిలబెట్టుకున్నారు. కొలంబోలో గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 4–0తో నేపాల్‌పై ఘనవిజయం సాధించింది. బాబి సింగ్ (18వ ని.), కొరవ్ సింగ్ (30వ ని.), కెప్టెన్ వాన్లల్‌పెక గీటే (63వ ని.), అమన్ (90+4వ ని.) తలా ఒక గోల్ చేసి భారత్‌ను విజేతగా నిలిపారు. లీగ్ దశలో నేపాల్ చేతిలో 1–3తో ఎదురైన పరాజయానికి ఫైనల్లో అసాధారణ ప్రదర్శనతో ప్రతీకారం తీర్చుకున్నారు. -
సంస్కరణలతోనే క్రీడలు వర్ధిల్లుతాయి
నిబంధనల ఉల్లంఘన కారణంగా ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ మీద ‘ఫీఫా’(ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్) నిషేధం విధించడంతో జాతీయ స్థాయిలో క్రీడల నిర్వహణకు సంబంధించిన చర్చ మొదలైంది. ఇది జీర్ణించుకోలేని విషయమే అయినా వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. అయితే అక్టోబర్‌లో జరగనున్న ఫుట్‌బాల్ జూనియర్ ప్రపంచ కప్ నిర్వహణను వదులుకోలేని కేంద్ర ప్రభుత్వం దీన్ని స్నేహ పూర్వకంగా పరిష్కరించుకునేందుకు యత్నిస్తోంది. ఈ నిషేధ పరిణామాలు ఎలాగైనా ఉండనీ... మొత్తంగా దేశంలో క్రీడా రాజకీయాలకు సంబంధించి ఇదొక చెంపదెబ్బ కావాలి. దీని పాఠాల నుంచి నేర్చుకుని సంస్కరణలకు నడుం బిగించాలి. అప్పుడే దేశంలో నిజంగా క్రీడలు వర్ధిల్లుతాయి. ఈ దేశంలో క్రీడాసంస్థల పనితీరుపై ఎవ రైనా న్యాయస్థానంలో ప్రశ్నలు లేవనెత్తారను కోండి... నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) సమాధానం ఒక్కటే. తమకు స్వయం ప్రతిపత్తి ఉందీ అని. అదే సమయంలో న్యాయస్థానాలు తమ పరిధిని మించి వ్యవహరిస్తున్నాయని సణుగు తారు కూడా. లేదా న్యాయపరిధిని తగ్గించేందుకు అంతర్జాతీయ నిషేధాలను ఒక బూచిగా చూపే ప్రయత్నం చేస్తారు. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఫుట్‌బాల్ (ఫీఫా) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. ఫీఫా ఇటీవలే ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని చూపుతూ ఇండి యన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్(సీఓఏ) ఆధీనంలోకి తీసుకొస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే తెచ్చుకునే ప్రయత్నమూ జరిగింది. దీంతోపాటే 2011 నాటి జాతీయ క్రీడా నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నానికీ అడ్డు పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటీ 2011 క్రీడా నిబంధనలు? అధికారమే తప్ప బాధ్యత లేదా? ఎన్ఎస్ఎఫ్ ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగానికి అదనంగా సిద్ధం చేసిన ఒక డాక్యుమెంట్ ఇది. క్రీడా సంస్థల సమర్థ నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలు ఇందులో ఉన్నాయి. ఈ నిబంధ నల కంటే ముందు ప్రభుత్వం లేదా యువజన వ్యవహారాలు, క్రీడా శాఖలు 1975, 1988, 1997, 2001లలో ఎన్ఎస్ఎఫ్కు మార్గదర్శ కాలు జారీ చేశాయి. అయితే ఈ మార్గదర్శకాలను ఎన్ఎస్ఎఫ్ పట్టించుకోలేదు. ప్రజలు చెల్లించిన పన్నులను వాడుకుంటూ... భారత జాతీయ పతాకాన్ని అంతర్జాతీయ పోటీల్లో ప్రదర్శించే ఈ సంస్థల వ్యవహారం... అధికారం, డబ్బు అనుభవిస్తూ బాధ్యత, జవాబుదారీతనం లేకుండా వ్యవహరించడం అంటే తప్పులేదు. నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ రాజకీయ నేతలు, అధికారుల ప్రభా వానికి లోనవడం ఎప్పుడో మొదలైంది. ఈ సంస్థలకు ఎన్నికలు కానీ, క్రీడా కారుల ఎంపికలో పారదర్శకత కానీ అస్సలు కనిపించదు. కుంభకోణాలు, జరిగిన తప్పులు దిద్దుకునే చర్యలు లేకపోవడం వంటివి సర్వసాధారణమనే చెప్పాలి. దేశంలో జాతీయ క్రీడాభివృద్ధి చట్టం అమల్లోకి వచ్చే ముందు క్రీడాసంస్థల సమర్థ నిర్వహణకు ఉద్దేశించిన ప్రయత్నం 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యుమెంట్. అయితే క్రీడాభివృద్ధి చట్టానికి సంబంధించిన బిల్లు ఇప్పుడు మరుగున పడిపోయింది. అన్ని రకాల రాజకీయ పార్టీలూ దీన్ని వ్యతిరేకించాయి. అయితే 2014లో ఢిల్లీ హైకోర్టు 2011 నాటి క్రీడా నిబంధనల డాక్యు మెంట్ సరైందేనని తేల్చి చెప్పింది. భారత క్రీడా సంస్థల నిర్వహణకు సంబంధించి ఇదో చారిత్రాత్మకమైన తీర్పు. క్రీడా సంస్థల్లో ఎన్నికలు, ఓటర్లు, అధికారుల అధికార పరిధి, వయసు వంటి అంశాలపై ఇప్పుడు వాడి, వేడి చర్చ నడుస్తోంది. ఫుట్‌బాల్, టీటీ, హాకీ, జూడో... ప్రతి కేసులోనూ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చాలామంది కోర్టులను ఆశ్రయించారు. టేబుల్ టెన్నిస్ విషయంలో నిబంధనలను అతిక్రమించారని గుర్తించిన ఓ క్రీడాకారుడే కోర్టుకెక్కడం గమనార్హం. కోర్టు కాస్తా ఎన్ఎస్ఎఫ్ అక్రమ మైందని ప్రకటిస్తూ కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది. ఎన్ఎస్ఎఫ్ 2011 నాటి క్రీడా నిబంధనలు సక్రమంగా అమలయ్యేలా చూడటం ఈ సీఓఏ బాధ్యత. ఎన్నికల నిర్వహణ, పురాతన కాలం నాటి క్రీడా సంస్థల రాజ్యాంగాన్ని ఆధునికీకరించడం, మేనేజ్మెంట్ విధానాలను సమీక్షించడం వంటి వాటి ద్వారా సీఓఏ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. అయితే ఈ సీఓఏలోనూ మాజీ న్యాయ మూర్తులే ఉండటం, వారి పనితీరు నత్తనడకన సాగుతూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. అయితే భారతీయ క్రీడా వ్యవస్థ లన్నింటిలోనూ జరిగే తప్పులు వీరికి తెలుసు. వీటిని ఉల్లంఘిస్తున్న వారిని కూడా గుర్తించగలరు. అందుకే ఎవరైనా క్రీడా వ్యవస్థ సమూల ప్రక్షాళణకు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. కోర్టుల దాకా ఎందుకు? విషయం కోర్టులకు ఎక్కక ముందే ఎన్‌ఎస్‌ఎఫ్‌ను దారిన పెట్ట గల సత్తా, అధికారం రెండూ మంత్రిత్వ శాఖకు ఉన్నాయి. ఫెడరేష న్లను రద్దు చేయగలిగే, నిధుల మంజూరీని నిలిపివేసే అధికారం కూడా యువజన, క్రీడల మంత్రిత్వ శాఖకు ఉన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అయితే బాక్సింగ్, ఆర్చరీ వంటివాటిని మినహాయించి మిగిలిన చాలా సంస్థల విషయంలో మంత్రిత్వ శాఖ కూడా న్యాయ స్థానాలు స్పందించేంత వరకూ నిమ్మకు నీరెత్తినట్టుగానే వ్యవహరిం చింది. ఎందుకంటే, నేతలకూ క్రీడాసంస్థల్లో స్థానం ఉండటం. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ నిర్వహ ణకు కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్‌ను ఏర్పాటు చేసిన వెంటనే క్రీడల మంత్రిత్వ శాఖ తరఫున స్వయంగా సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ కేసును చేపట్టి ఒలింపిక్ అసోసియేషన్‌కు అండగా నిలవడం గమనార్హం. ప్రభుత్వం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రెండింటి తరఫున కోర్టుకు హాజరైన తుషార్ మెహతా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలనీ, లేదంటే అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాల్లో భారత్‌ను నిషేధిస్తారనీ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు యథాతథ స్థితిని కొన సాగించాల్సిందిగా ఆదేశాలిచ్చింది. ఈ సంద ర్భంగానే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తాత్కాలిక అధ్యక్షుడు అనిల్ ఖన్నా... అసోసియేషన్ ఆఫీస్ బేరర్ల పదవీ కాలం పన్నెండేళ్లు కాకుండా, 20 ఏళ్లు ఉండాలని నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. సాధారణంగా జాతీయ స్థాయి క్రీడా సంస్థలు... క్రీడలు, క్రీడా కారుల కంటే అధికారుల అహానికి, రాజకీయ పలుకుబడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. భారతీయ క్రీడా వ్యవస్థలో ఉన్న ప్రాథమికమైన లోపం... క్రీడాకారులకు తగినన్ని పోటీలు, రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో ఆడేందుకు తగినన్ని అవకాశాలు లేకపోవడమే. ఈ లోపాలే ఇప్పుడు ఫిర్యాదుల రూపంలో బయటపడుతున్నాయి. తమ స్థానాలను పదిల పరుచుకునేందుకు క్రీడా సంస్థల అధికార యంత్రాంగం తాపత్రయ పడుతూండటమే ఇప్పుడు అన్నిచోట్ల కనిపిస్తున్న అంశం. ఈ క్రమంలో అసలు విషయం కాస్తా మరుగున పడిపోతోంది. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. సమర్థతకే పట్టం కట్టాలి నేను నివసించే బెంగళూరులో బాస్కెట్ బాల్ అసోసియేషన్ జన వరిలో ఒక నోటీసు జారీ చేసింది. అసోసియేషన్ క్రీడాకారులు చిన్న 3 బై 3, 5 బై 5 పికప్ బాస్కెట్‌బాల్ కార్యక్రమాల్లో పాల్గొనడం అసోసియేషన్ నిబంధనలకు వ్యతిరేకమని. అలా పాల్గొన్న క్రీడా కారులను నిషేధిస్తామని ఈ నోటీస్ చెప్పడం గమనార్హం. 2019లో ప్రో వాలీబాల్ లీగ్ తొలి సీజన్లో విజయవంతమైంది. ఆ వెంటనే వాలీబాల్ అసోసియేషన్ ఈ లీగ్ నిర్వాహకులు బేస్‌లైన్ వెంచర్స్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. కాంట్రాక్ట్ నిబం ధనలను ఫెడరేషన్ ఉల్లంఘించినట్లు కోర్టు నియమించిన మధ్య వర్తులు గుర్తించారు. ఫెడరేషన్ బ్యాంక్ అకౌంట్లను స్తంభింపజేయ డంతోపాటు బేస్‌లైన్ వెంచర్స్‌కు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బేస్‌లైన్ వెంచర్స్... ప్రైమ్ వాలీబాల్ లీగ్ పేరుతో మళ్లీ ఫ్రాంచైజీ ఆధారిత టోర్నమెంటును ప్రారంభించింది. కానీ ఈ లీగ్‌లో పాల్గొన్న కొన్ని రాష్ట్రాల క్రీడాకారులను ఫెడరేషన్ పక్కన పెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కావాలని కోరుతున్న వారిలో కొందరు నిజానికి తాము అసమర్థ పరిపాలకులుగా కొన సాగేందుకు పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. క్రీడా సంస్థల మెరుగైన నిర్వహణ వీరి ఉద్దేశం కానే కాదు. వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
పుస్తక రూపంలో భారత దిగ్గజ ఫుట్‌బాలర్ బయోగ్రఫీ..
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, గత తరం దిగ్గజాల్లో ఒకడైన విక్టర్ అమల్‌రాజ్ బయోగ్రఫీ పుస్తక రూపంలో వచ్చింది. ‘మిడ్‌ఫీల్డ్ మాస్ట్రో’ పేరుతో వచ్చిన ఈ పుస్తకాన్ని సీనియర్ క్రీడా పాత్రికేయులు అభిజిత్‌సేన్ గుప్తా రచించారు. హైదరాబాద్‌నుంచి 21 మంది ఫుట్‌బాలర్లు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించగా...అందులో ఆరుగురు కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిలో విక్టర్ అమల్‌రాజ్ కూడా ఒకరు. 80వ దశకంలో మిడ్‌ఫీల్డర్‌గా భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అమల్‌రాజ్... కోల్‌కతాకు చెందిన ప్రఖ్యాత క్లబ్‌లు ఈస్ట్‌బెంగాల్, మొహమ్మదాన్ క్లబ్‌లకు కూడా సారథ్యం వహించారు. -
భారత ఫుట్‌బాల్ జట్టు కొత్త చరిత్ర.. వరుసగా రెండోసారి
ఆసియా కప్ 2023కి భారత ఫుట్‌బాల్ జట్టు క్వాలిఫై అయింది. మంగళవారం పిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాలస్తీనా జట్టు 4-0 తేడాతో విజయం సాధించడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. హాంకాంగ్‌తో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ అర్హత సాధించినట్లయింది. గ్రూప్ -డిలో భారత జట్టు 6 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఉన్న హంగ్‌కాంగ్‌కి, భారత జట్టుకి మధ్య ఒక పాయింట్ మాత్రమే తేడా. ఒకవేళ హాంకాంగ్‌తో మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికి ఆసియన్ కప్‌కు అర్హత సాధించనుంది. 1956లో ఆసియా కప్ ఆరంభం కాగా.. భారత జట్టు ఇప్పటిదాకా ఐదు సార్లు మాత్రమే అర్హత సాధించగలిగింది. 1964లో మొదటిసారి ఆసియా ఫుట్‌బాల్ కప్ ఆడిన భారత జట్టు.. ఆ తర్వాత 20 ఏళ్లకు అంటే 1984లో ఆసియాకప్‌లో ఆడింది. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు ఆసియాకప్‌కు అర్హత సాధించని భారత్.. 2011లో మూడోసారి ఆసియాకప్ ఆడింది. ఇక 2019లో నాలుగోసారి అర్హత సాధించిన భారత్ ఫుట్‌బాల్ జట్టు 2023 ఆసియాకప్ సీజన్లో ఐదోసారి ఆడనుంది. 1964లో ఆసియా కప్ ఫైనల్ మినహా మరెన్నడూ భారత్ ఫుట్‌బాల్ జట్టు చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయచలేదు. 🥳 HERE WE COME 🥳 As Palestine 🇵🇸 defeat Philippines 🇵🇭 in Group 🅱️, the #BlueTigers 🐯 🇮🇳 have now secured back-to-back qualifications for the @afcasiancup 🤩#ACQ2023 🏆 #BackTheBlue 💙 #IndianFootball ⚽ pic.twitter.com/3aNjymWLSm — Indian Football Team (@IndianFootball) June 14, 2022 చదవండి: రూట్ సెంచరీ.. ఎవరు ఊహించని సర్ప్రైజ్! విషాదం.. క్రికెట్ ఆడుతూ కన్నుమూత -
రొనాల్డో-మెస్సీ.. మధ్యలో మనోడు
రోనాల్డో -మెస్సీ.. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అంటూ ఇద్దరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కుమ్ములాడుకోవడం చూస్తుంటాం. కానీ, ఈ ఇద్దరిలో మధ్యలో గట్టి పోటీ ఇస్తూ ఇప్పుడు ఇంకొకడు వచ్చి దూరాడు. ఆ ఒక్కడు ఎవడో కాదు.. భారత ఫుట్‌బాల్ మాంత్రికుడు సునీల్ ఛెత్రి. దోహా: సోమవారం 2022 ఫిఫా వరల్డ్‌కప్, 2023 ఆసియా కప్ క్వాలిఫైయర్స్ టోర్నీలలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 2-0 తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా సునీల్ ఛెత్రినే కొట్టాడు. ఈ ఫీట్‌తో ప్రపంచంలో అత్యధిక గోల్స్ సాధించిన ఫుట్‌బాల్ ఆటగాడిగా(ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్ల) రెండో స్థానంలో నిలిచాడు ఛెత్రి. ప్రస్తుతం ఈ లిస్ట్‌లో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో ఉండగా(103)గోల్స్‌తో, రెండో స్థానంలో మొన్నటిదాకా అర్జెంటీనా స్టార్ లియోనాల్ మెస్సీ(72)గోల్స్‌తో ఉన్నాడు. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించడం ద్వారా మొత్తం 74 గోల్స్‌తో ఛెత్రి మెస్సీని వెనక్కి నెట్టి రెండో ప్లేస్‌కి చేరాడు. ఇక ఆల్‌టైం హయ్యెస్ట్ టాప్ 10 గోలర్స్ లిస్ట్‌లో చేరడానికి ఛెత్రి మరొక గోల్(75) సాధిస్తే సరిపోతుంది. వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచుల్లో భారత్‌కి ఆరేళ్ల తర్వాత దక్కిన తొలి గెలుపు ఇదే. ఇప్పటికే భారత్ ఫిఫా ఆశలు చల్లారగా.. కేవలం చైనాలో జరగబోయే ఆసియా కప్ అర్హత కోసం భారత్ ఫుట్‌బాల్ ఆడుతోంది. ఇక మెస్సీ యాక్టివ్‌గా ఉండడంతో ఛెత్రి రికార్డు త్వరగానే కనుమరుగు అయ్యే అవకాశం కనిపిస్తోంది. అయినప్పటికీ టాప్ లిస్ట్‌లో చేరిన ఛెత్రికి ఇండియన్ సోషల్ మీడియా సలాం చెబుతోంది. ఇక ఈ రికార్డు ఫీట్‌ను 36 ఏళ్ల ఛెత్రి కూడా చాలా తేలికగా తీసుకోవడం విశేషం. చదవండి: భారత్ పరాజయం Goals speak louder than words 🙏#IndianFootball #NationalTeam #JB6 #WCQualifiers pic.twitter.com/u4iOUzKwGa — Indian Football Team for World Cup (@IFTWC) June 7, 2021 -
గుండెపోటుతో ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి
న్యూఢిల్లీ: భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్, మిడ్ ఫీల్డర్ కార్ల్టన్ చాప్మన్ కన్నుమూశాడు. గుండెపోటుతో బెంగళూరులో సోమవారం తుదిశ్వాస విడిచాడు. ఆదివారం అస్వస్థతకు గురైన 49 ఏళ్ల చాప్మన్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించినట్లు ఆయన టీమిండియా సహచరుడు బ్రూనో కౌటిన్హో తెలిపాడు. 1995 నుంచి 2001 వరకు చాప్మన్ భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతని సారథ్యంలోని టీమిండియా 1997 ‘శాఫ్’ కప్‌ను గెలుచుకుంది. -
హైదరాబాద్ ‘కిక్’
కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ పుటల్లో హైదరాబాద్ ఆటగాళ్లకు ప్రత్యేక స్థానముంటుంది. అలనాటి జాతీయ సాకర్ జట్టును నడిపించినా... గెలిపించినా... అది హైదరాబాదీ ఆటగాళ్ల ఘనతే! ఇంకా చెప్పాలంటే ఒకానొక దశలో మనవాళ్లే భారత జట్టును శాసించారు. తుది జట్టుకు ఆడినవారిలో ఏకంగా 8 నుంచి 10 మంది హైదరాబాద్ అటగాళ్లే ఉన్నారంటే మన ఫుట్‌బాలర్ల సత్తా ఏంటో ఇప్పటికే అర్థమైవుంటుంది. భారత ఫుట్‌బాల్ జట్టుకు నాయకత్వం వహించిన విక్టర్ అమల్‌రాజ్ సహా ఎస్.ఎ.రహీమ్, నయీమ్, హకీమ్, జులిఫకర్, పీటర్ తంగరాజ్ తదితరులు భారత ఫుట్‌బాల్‌కు ఎనలేని సేవలందించారు. కాలక్రమంలో హైదరాబాదీల ప్రతిభ మరుగునపడింది. జాతీయ ఫుట్‌బాల్ జట్టులో మనోళ్లకు చోటే గగనమయ్యే పరిస్థితి తలెత్తింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ద్వారా హైదరాబాద్ ఫుట్‌బాల్ తెరముందుకొచ్చింది. పుణే స్థానంలో లీగ్‌లోకి... ఐఎస్ఎల్లో పుణే ఆరంభం నుంచి ఉంది. అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఆ ఫ్రాంచైజీ తప్పుకోవడంతో అనూహ్యంగా హైదరాబాద్‌కు చాన్స్ వచ్చింది ఈ సీజన్‌కైతే మొత్తంగా పుణే ఎంపిక చేసుకున్న ఆటగాళ్లతోనే ఆడుతున్నప్పటికీ వచ్చే సీజన్లో హైదరాబాదీలకు చోటిస్తామని ఫ్రాంచైజీ సహ యజమాని వరుణ్ త్రిపురనేని చెప్పారు. తమ జట్టుకు విశేష అనుభవమున్న కోచ్ ఫిల్ బ్రౌన్ (ఇంగ్లండ్) ఉన్నారని... తప్పకుండా ఈ సీజన్లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ రాణిస్తుందని ముఖ్యంగా హైదరాబాదీ ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పుకొచ్చారు. విజయ్ మద్దురితో కలిసి ఆయన ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. హైదరాబాద్ ఎఫ్‌సీ తమ హోమ్ మ్యాచ్‌లను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఆడుతుంది. -
భారత కోచ్‌గా ఐగర్ స్టిమాక్
న్యూఢిల్లీ: క్రొయేషియాకు చెందిన ఐగర్ స్టిమాక్ భారత ఫుట్‌బాల్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. గురువారం ఇక్కడ సమావేశమైన అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ పదవి కోసం స్టిమాక్‌తో పాటు లీ మిన్ సంగ్ (దక్షిణ కొరియా), ఆల్బర్ట్ రోకా (స్పెయిన్), హకాన్ ఎరిక్సన్ (స్వీడన్)తో దరఖాస్తు చేశారు. వీరిలో స్టిమాక్ నేరుగా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. మిగతావారు స్కైప్ ద్వారా మాట్లాడారు. అనంతరం సుదీర్ఘంగా చర్చించిన కమిటీ... స్టిమాక్ వైపు మొగ్గింది. 51 ఏళ్ల స్టిమాక్ సెంటర్బ్యాక్గా 53 అంతర్జాతీయ మ్యాచ్‌లాడాడు. 1996 యూరో కప్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 1998 ప్రపంచ కప్‌లో మూడో స్థానంలో నిలిచిన క్రొయేషియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2012–13 మధ్య తమ దేశ జటు కు కోచ్‌గా వ్యవహరించాడు. ఈయన ఆధ్వర్యంలోనే క్రొయేషి యా 2014 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. స్టిమాక్ మూడేళ్ల పాటు భారత కోచ్‌గా ఉండనున్నాడు. థాయ్‌లాండ్‌లో జూన్ 5 నుంచి జరుగనున్న కింగ్స్ కప్‌తో అతడి పదవీ కాలం ప్రారంభమవుతుంది. -
భారత జట్టుకు జై కొట్టినందుకు..
యూఏఈలో జరుగుతున్న ఏషియన్ ఫుట్‌బాల్ కప్‌లో భాగంగా గురువారం రాత్రి యూఏఈ-భారత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 0-2 తో పరాజయం పాలైంది. అయితే, మ్యాచ్‌కు ముందు భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులను ఓ దుబాయ్ షేక్ పక్షుల పంజరంలో బంధించాడు. వారితో యూఏఈకి మద్దతు పలుకుతామని బలవంతంగా చెప్పించాడు. ఆ వీడియో వైరల్ కావడంతో చిక్కుల్లో పడ్డాడు. ‘మీరు ఏ జట్టు గెలవాలని కోరుకుంటారు?’ అని షేక్ ప్రశ్నించాడు. ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ఫ్యాన్స్ మూకుమ్మడిగా.. ‘భారత జట్టుకే మా మద్దతు’ అనగానే.. ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరంతా యూఏఈ జట్టుకే మద్దతు పలకాలని చేతిలో బెత్తం పట్టుకుని బెదిరించాడు. దాంతో ఫ్యాన్స్ యూఏఈకే మద్దతు పలుకుతామని చెప్పడంతో పంజరం నుంచి విడుదల చేశాడు. ఈ తతంగానికి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూఏఈ అటార్నీ జనరల్ స్పందించారు. వివక్షాపూరితంగా వ్యవహరించి, బెదిరింపులకు పాల్పడినందుకు సదరు షేక్‌కు అరెస్టు వారెంట్ జారీ చేశారు. విచారణ నిమిత్తం అటెండ్ కావాలని ఆదేశించారు. కాగా, ఈ విషయం అరెస్టు దాకా వెళ్లడంతో సదరు షేక్ మాటమార్చాడు. ‘వీడియోలో చేసిందంతా సరదా కోసమే. పంజరంలో వేసిన వారంతో నా దగ్గర పనిచేసేవారే. గత 20 ఏళ్లుగా వీళ్లు నాకు బాగా తెలుసు. మేమేంతా కలిసిమెలిసి ఉంటాం. ఒకే కంచంలో కలిసి భోజనం కూడా చేస్తాం. అదంతా ఉత్తిదే. నేను వారిని కొట్టలేదు. అసలు నిజంగా వారిని బంధించనేలేదు’ అంటూ మరో వీడియో రిలీజ్ చేశాడు. టీమిండియా అభిమానులు పలు ఆసియా దేశాలకు చెందినవారుగా తెలిసింది. -
భారత్ సత్తాకు పరీక్ష
అబుదాబి: తొలి మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌ను 4–1తో చిత్తుగా ఓడించిన భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆసియా కప్‌లో నేడు అసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా గురువారం ఆతిథ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)తో భారత్ ఆడనుంది. యూఏఈ మాత్రం థాయ్‌లాండ్‌లా బలహీన జట్టేమీ కాదు. ర్యాంకింగ్స్‌లో కానీ, ఆటతీరులోగానీ భారత్ కంటే మెరుగ్గా ఉంది. అయితే బోణీ కొట్టిన ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ కనీసం ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా గ్రూప్ ‘ఎ’ నుంచి నాకౌట్‌కు చేరే అవకాశాలున్నాయి. భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. తన అనుభవంతో యూఏఈ మ్యాచ్‌లోనూ జట్టును ముందుండి నడిపిస్తే సానుకూల ఫలితం సాధించొచ్చు. మరోవైపు ప్రపంచ 79వ ర్యాంకర్ యూఏఈ తొలి మ్యాచ్‌లో బహ్రెయిన్‌తో అతికష్టంమీద ‘డ్రా’ చేసుకుంది. దీంతో ఆతిథ్య జట్టు ఈ మ్యాచ్‌లో విజయంపై కన్నేసింది. యూఏఈలో మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ హమది, అహ్మద్ ఖలీల్ కీలక ప్లేయర్లు. ఖలీల్ తొలి మ్యాచ్‌లో జట్టుకు కీలక గోల్ తెచ్చిపెట్టాడు. వీళ్లిద్దరిపై భారత డిఫెండర్లు దృష్టి పెట్టాలి. ఇప్పటివరకు భారత్, యూఏఈ ముఖాముఖిగా 13 సార్లు తలపడ్డాయి. రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలుపొందగా... ఎనిమిదింటిలో యూఏఈ విజయం సాధించింది. మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి. -
ఫైనల్లో భారత్
ఢాకా: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) కప్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు ఫైనల్ చేరింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో భారత్ 3–1తో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున మాన్వీర్ సింగ్ (49వ, 69వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... సుమీత్ పస్సీ (83వ ని.లో) ఓ గోల్ చేశాడు. పాక్ తరఫున హసన్ బషీర్ (88వ ని.లో) ఏకైక గోల్ కొట్టాడు. మరో సెమీఫైనల్లో మాల్దీవులు 3–0తో నేపాల్‌పై గెలిచింది. శనివారం జరుగనున్న తుదిపోరులో మాల్దీవులుతో భారత్ తలపడనుంది. -
13 మ్యాచ్‌ల తర్వాత...
బిష్కెక్ (కిర్గిస్తాన్): వరుసగా 13 మ్యాచ్‌ల్లో పరాజయం లేకుండా దూసుకెళ్తున్న భారత ఫుట్‌బాల్ జట్టుకు కిర్గిస్తాన్ బ్రేక్ వేసింది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భాగంగా మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–2 గోల్స్ తేడాతో కిర్గిస్తాన్ చేతిలో ఓడిపోయింది. కిర్గిస్తాన్ తరఫున జెమ్లియాన్‌ఖున్ (2వ నిమిషంలో), ముర్జయెవ్ (72వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు 88వ నిమిషంలో జెజె లాల్‌ఫెకులువా ఏకైక గోల్‌ను అందించాడు. ఈ మ్యాచ్‌లో భారత రెగ్యులర్ కెప్టెన్ సునీల్ చెత్రి బరిలోకి దిగలేదు. ఇప్పటికే భారత్, కిర్గిస్తాన్ వచ్చే ఏడాది యూఏఈలో జరిగే ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించడంతో ఈ మ్యాచ్ ఫలితం రెండు జట్లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. చివరిసారి 2016 మార్చి 29న తుర్క్‌మెనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 1–2తో ఓడిన భారత్ ఆ తర్వాత వరుసగా 13 మ్యాచ్‌ల్లో అజేయంగా నిలిచింది. ఆడిన 13 మ్యాచ్‌ల్లో భారత్ 11 విజయాలు సాధించి, రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. -
డిసెంబర్ 4న భారత ఫుట్ బాల్ కెప్టెన్ పెళ్లి
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ చెట్రి మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. చిన్ననాటి స్నేహితురాలైన సోనమ్ భట్టాచార్యను పెళ్లి చేసుకోనున్నాడు. గుర్గావ్లో సంగీత్ జరుపుకున్న ఈ జంట పెళ్లి డిసెంబర్ 4న కోల్‌కతాలో జరగనుంది. రిసెఫ్షన్ డిసెంబర్ 24న బెంగళూరులో నిర్వహించనున్నారు. సోనమ్ బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక సునీల్ చెట్రి ఇండియన్ సూపర్‌లీగ్-4 సీజన్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
రెండు స్థానాలు కిందికి..
న్యూఢిల్లీ: ఫిఫా ర్యాంకింగ్స్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు ర్యాంకింగ్ రెండు స్థానాలు దిగజారింది. గత నెల 130వ స్థానంలో కొనసాగిన భారత్ గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో 132వ స్థానంలో ఉంది. అర్జెంటీనా నంబర్‌వన్‌గానే ఉండగా బ్రెజిల్, జర్మనీ, చిలీ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
భారత్ ర్యాంక్ 135
న్యూఢిల్లీ: ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 135వ స్థానంలో నిలిచింది. గత ఆరేళ్ల కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. గురువారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) జట్ల ర్యాంకులను విడుదల చేసింది. ఆటగాళ్ల ఉత్తమ రాణింపుతోనే ఇది సాధ్యమైందని కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ తెలిపారు. ఈ ఏడాది భారత జట్టు శాఫ్ చాంపియన్‌షిప్‌తో పాటు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఉత్తమ ర్యాంకులో ఉన్న ప్యూర్టోరికోను 4–1తో ఓడించింది. -
భారత్ ఘనవిజయం
4-1తో ప్యూర్టోరికో చిత్తు ముంబై: ‘ఫిఫా’ ర్యాంకింగ్‌సలో తమకన్నా ఎంతో మెరుగైన ప్యూర్టోరికోపై భారత ఫుట్‌బాల్ జట్టు అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంది. అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపుతూ శనివారం స్థానిక అంధేరి స్పోర్ట్స కాంప్లెక్స్‌లో జరిగిన ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్ 4-1తో నెగ్గింది. చివరి 11 మ్యాచ్‌ల్లో భారత్‌కు ఇది తొమ్మిదో విజయం కావడం విశేషం. నారాయణ్ దాస్ (18వ ని.లో), సునీల్ చెత్రి (26వ ని.లో), జేజే లాల్పేఖులా (34వ ని.లో), జాకీచంద్ సింగ్ (58వ ని.లో) ఆతిథ్య జట్టు తరఫున గోల్స్ చేయగా... ప్రత్యర్థి జట్టుకు ఎమ్మాన్యుయల్ సాంచెజ్ (8వ ని.లో) ఏకై క గోల్ చేశాడు. ఆరు దశాబ్దాల అనంతరం ముంబైలో జరిగిన ఈ అంతర్జాతీయ మ్యాచ్‌లో... ప్రారంభంలోనే గోల్ సమర్పించుకున్నా భారత్ ఏ దశలోనూ ఒత్తిడికి లోను కాలేదు. 15వ నిమిషంలో జట్టు నుంచి గోల్ వైపు తొలి షాట్ వెళ్లింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే భారత్ ఖాతా తెరిచింది. సునీల్ చెత్రి ఫ్రీ కిక్ గోల్ పోస్టును తాకి బయటికి రాగా నారాయణ్ దాస్ తిరిగి గోల్‌గా మలిచాడు. ఇక అక్కడి నుంచి భారత్ దూకుడు కొనసాగి ప్రథమార్ధంలోనే మరో రెండు గోల్స్ చేసింది. చెత్రి, జేజే చెరో గోల్ చేశారు. ద్వితీయార్ధంలోనూ భారత్ ఆటతీరులో జోరు తగ్గలేదు. 58వ నిమిషంలో జాకీచంద్ సింగ్ జట్టుకు నాలుగో గోల్ అందించడంతో భారత్ తిరుగులేని విజయాన్ని సాధించింది.