Indira Park
-
ఇందిరాపార్క్ వద్దకు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నాకు మద్దతు తెలిపిందేందుకు వెళ్లిన ఆయన ఆటోలో ప్రయాణించారు. కేటీఆర్ మొదట నందినగర్‌లోని తన నివాసం నుంచి కారులో బయలుదేరారు. ఆ తర్వాత కొందరు సీనియర్ నాయకులతో కలిసి ఆటో ఎక్కిన కేటీఆర్ మహాధర్నా వద్దకు చేరుకున్నారు. ఇబ్రహీంపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌తో కేటీఆర్ కాసేపు ముచ్చటించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్స్ మహాధర్నాకు నాయకత్వం వహిస్తున్న ఆటో కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత బస్సు పథకం కారణంగా నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.12 వేలు ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు.Live: "ఆటో డ్రైవర్ల మహా ధర్నా"కు మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/GLu6PB9jbC— BRS Party (@BRSparty) November 5, 2024 తెలంగాణ వచ్చాక ఆటో డ్రైవర్లకు రోజు రూ. 2 వేలు సంపాదిస్తే అన్ని ఖర్చులూ పోను.. 8 వందలు మిగిలేవి. అదే ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో 8 వందలు వస్తే ఖర్చులు పోను 2 వందలు మిగలడం లేదు, అధికారంలోకి రాక ముందు గతంలో ఆటోలో తిరిగిన రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి వచ్చాక సంవత్సరానికి 12,000 వేలు ఇస్తాను అన్నారు. కానీ ఏమీ ఇవ్వలేదు. 12 నెలల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు తీర్చిన గ్యారంటీలు ఎన్ని అని ఆలోచన చేయాలి. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ 12 నెలల్లో ఎందరు తనువు చాలించారో లెక్కలతో సహా అసెంబ్లీలో ఇచ్చాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా అన్నారు. కానీ చేయలేదు. ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. ఆనాడు కేసీఆ ర్తెచ్చిన ఇన్స్యూరెన్స్ను తొలగించాలి అనుకుంటున్నారు. ఓలా, ఉబర్‌తో జరుగుతున్న నష్టాన్ని పురిస్తా అన్న మాట మీద ప్రభుత్వం నిలబడాలి.రేవంత్ రెడ్డికి భయం పట్టుకుంది. బయటకు పోతే తంతారు అని.. పోలీసుల బందోబస్తు లేనిది బయటకు పోవుడు కష్టం అన్నట్లు ఉంది. హోమ్ గార్డుతో సహా అందరు పోలీసులు కష్టల్లోనే ఉన్నారు. ఇంకా నాలుగు ఏళ్ల సినిమా ఉంది. జైల్లో పెట్టిన మేము వెనక్కి తగ్గము మీరు మా వెంట ఉండాలి. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి అని కోరుతున్నాం. ఏఐటీయూసీతో పాటు అనేక ఆటో కార్మికులు అందరూ వల్ల సమస్యల పట్ల జెండాలు ఒకటవ్వాలి. అసెంబ్లీలో శాసన సభ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. మీ తరుపున మేము కొట్లడతాము. ఆటో కార్మిక ఐక్యత వర్ధిల్లాలి.’ అని తెలిపారు. -
మూసీ పక్కన టెంపుల్స్ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుంది.రేవంత్‌కి మరో సవాల్ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. -
ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీ నేతల ధర్నా
-
కాసేపట్లో ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా
-
ఇందిరా పార్క్‌లో ధర్నా చేస్తున్న కర్ణాటక రైతులపై దాడికి దిగిన కాంగ్రెస్ నేతలు
-
ఇందిరాపార్కు వద్ద ANMల ఉద్రిక్తత
-
గాంధీభవన్, ఇందిరా పార్క్ వద్ద ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అవమానకరంగా చిత్రీకరించారంటూ కాంగ్రెస్ నేతుల నిరసనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో, పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. గాంధీ భవన్ వద్దకు భారీ పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, గాంధీ భవన్ గేటుకు భారీకేడ్లు వేసి పోలీసులు వారిని నిలువరించారు. ఈ క్రమంలో గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు.. ఇందిరా పార్క్ వద్ద కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఎన్ఎంలు ధర్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్దకు చేరుకుని.. వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. ఈ సందర్బంగా పలువురు ఏఎన్ఎంలకు గాయాలయ్యాయి. మహిళా ఏఎన్ఎంలు ఒకరు సొమ్మసిల్లి పడిపోయారు. అయితే, గత కొంతకాలంగా వారిని పర్మినెంట్ చేయాలని ఏఎన్ఎంలు ఆందోళన చేస్తున్నారు. ఇది కూడా చదవండి: హంగు కాదు.. బీజేపీ డకౌట్ అవుతుంది: హరీష్ రావు -
KTR: హైదరాబాద్ ఉక్కు వంతెన ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నగరంలో నూతన బ్రిడ్జిలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో మరో ప్రత్యేకమైన వంతెన ఇవాళ తెరుచుకుంది. ఇందిరా పార్క్-వీఎస్టీ ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ వంతెన పేరు ఇందిరా పార్కు నాయిని నరసింహ రెడ్డి స్టీల్ బ్రిడ్జ్. కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి గౌరవార్థం నామకరణం చేశారు. ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్ భవన్ సమీపంలోని VST చౌరస్తా వరకు ఈ బ్రిడ్జిని నిర్మించారు. తద్వారా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో ఏర్పడే ట్రాఫిక్ రద్దీ తగ్గనుందని ప్రభుత్వం భావిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే మొదటి పొడవైన స్టీల్ బ్రిడ్జ్. జీహెచ్ఎంసీ చరిత్రలోనే ఈ బ్రిడ్జికి ఓ ప్రత్యేకత ఉంది. తొలిసారి భూసేకరణ లేకుండానే ఈ బ్రిడ్జిని నిర్మించారు. మెట్రో పై నుంచి ఉండడం ఈ బ్రిడ్జికి ఉన్న మరో ప్రత్యేకత. బ్రిడ్జి పొడవు 2.62 కిలోమీటర్లు.. వెడల్పు నాలుగు లైన్లు ఈ బ్రిడ్జి కోసం 12, 316 మెట్రిక్ టన్నుల ఉక్కు వినియోగించారు. 81 స్టీల్ పిల్లర్లు, 426 ఉక్కు దూలాలు వినియోగించారు. కాంక్రీట్ 60-100 ఏళ్లు, స్టీల్ 100 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటుందని ఇంజినీర్లు చెబుతున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద(ఎస్ఆర్డీపీ) రూ. 450 కోట్ల వ్యయంతో ఈ బ్రిడ్జిని జీహెచ్ఎంసీ నిర్మించింది. రోజుకు లక్ష వాహనాలు తిరిగే ఈ రూట్లో వాహనదారులకు బిజీ టైంలో 30-40 నిమిషాల టైం పట్టేది. ఈ వంతెన నిర్మాణంలో కేవలం ఐదే నిమిషాల్లో ప్రయాణం కొనసాగించొచ్చని అధికారులు చెబుతున్నారు. Good Morning Friends 😍❤️ Minister @KTRBRS will inaugurate the Naini Narsimhareddy Steel Bridge today#SteelBridge #Hyderabad #KTR pic.twitter.com/UzRW03wQ3M — Latha (@LathaReddy704) August 19, 2023 స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాం. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరతాయి. ఎస్ఆర్డీపీలో ఇది 36వ ప్రాజెక్టు. హైదరాబాద్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాం. అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నాం. :::బ్రిడ్జిని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో బీజేపీ మహాధర్నా
-
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్‌లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
స్తబ్ధత వీడేలా.. జోరుగా
సాక్షి, హైదరాబాద్: అధ్యక్షుడి మార్పునకు సంబంధించి చోటుచేసుకున్న పరిణామాలతో కొంతకాలంగా పార్టీలో ఏర్పడిన స్తబ్ధతను దూరం చేసే దిశలో బీజేపీ వివిధ కార్యక్రమాలను చేపడుతోంది. పార్టీ నాయకులు, కేడర్‌లో జోష్ నింపేలా వివిధ వర్గాల ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై ఆందోళనలకు సిద్ధమౌతోంది. ఇందులో భాగంగా రైతు రుణ మాఫీని వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన కార్య క్రమాలు నిర్వహించనుంది. ఆదివారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రారంభించిన టిఫిన్ బాక్స్ ‘బైఠక్’లను ఈ నెలాఖరు వరకు కొనసాగించనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ లలో 18, 19 తేదీలలో ఈ బైఠక్లను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ నాయకులు తెలి పారు. ఎక్కడికక్కడ నేతలంతా ఒకచోట చేరి పార్టీకి సంబంధించిన అంశాలు, ఇతర విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడుకోవడం ఈ బైఠక్ల ముఖ్యోద్దేశమని ఓ ముఖ్యనేత సాక్షికి తెలిపారు. ప్రతినెలా ఈ టిఫిన్ బాక్స్ బైఠక్‌లు నిర్వహించాలని నాయకత్వం నిర్ణయించిందని బీజేపీ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి చెప్పారు. 20 నుంచే రంగంలోకి కిషన్‌రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి.. అమెరికా, లండన్ పర్యట నల నుంచి తిరిగొచ్చాక ఈ నెల 21న బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించే భారీ సభ ద్వారా ఎన్నికలపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. జాతీయ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. దీనికి ముందే ఈ నెల 20న బాటసింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్లను కిషన్‌రెడ్డి పరిశీలించనున్నారు. భారీ కాన్వాయ్‌తో ఆయన అక్కడకు వెళ్తారని తెలుస్తోంది. పేదలకు 7 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీఆర్ఎస్.. కేవలం కొన్నివేలే పూర్తి చేసిందంటూ ఎండగట్టా లని భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ 24న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 25న ఇందిరాపార్కు వద్ద ధర్నా బీజేపీ నిర్వహించనుంది. ఇక నిరుద్యోగ యువత, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని కూడా పార్టీ నిర్ణయించింది. -
తలసాని Vs రేవంత్.. ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్క్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గొల్ల కురుమలను కించపరిచేలా రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. దున్నపోతులతో గాంధీభవన్‌ను ముట్టడించేందుకు యాదవ సంఘం యత్నించింది. సమాచారం అందుకున్న పోలీసులు గొల్ల కురుమలను అడ్డుకున్నారు. పలువురిని అరెస్ట్ చేశారు. తలసాని Vs రేవంత్ కాగా రాష్ట్రంలోని యాదవ, కురుమలను అవమానిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని యాదవ జేఏసీ డిమాండ్ చేసింది. తమ సామాజికవర్గాన్ని తక్కువ అంచనా వేయకూడదని, రాష్ట్రంలో 20 శాతానికి పైగా జనాభా ఉన్నదని, తమ సత్తా ఏమిటో చూపుతామని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ గల్లీలో తిరిగినా అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకుంటే 25న వేలాదిగా యాదవులు, కురుమలు దున్నపోతులతో ఇందిరాపార్కు నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తామని, అక్కడి నుంచి గాంధీ భవన్‌కు చేరుకొని ముట్టడిస్తామని మంగళవారం హెచ్చరించారు. -
ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తోంది: షర్మిల
-
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
మా నౌకరీలు మాగ్గావాలే
సాక్షి, హైదరాబాద్: ఈనెల 25న ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ ఆధ్వర్యంలో ‘నిరుద్యోగ మహా ధర్నా’నిర్వహించనున్నారు. ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగ యువతతో కలసి ఈ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో నాయకులు సమావేశమయ్యారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా ఇదివరకే రాసిన వివిధ పరీక్షలు రద్దయి దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నందున, వారికి మద్దతుగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు రూపొందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నిర్వహించిన సాగరహారం, మిలియన్ మార్చ్ వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఇందులో భాగంగా తొలుత 25న ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని, పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష చొప్పున పరిహారం అందించాలని, ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలనే డిమాండ్లతో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ప్రశ్నించే గొంతుకలకు అండగా.. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళం విప్పుతూ.. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న వివిధ సంస్థలు, జర్నలిస్టులకు అండగా నిలవాలని, వారి పక్షాన పోరాడాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. వివిధ సంస్థలు, స్వతంత్ర జర్నలిస్టులకు మద్దతుగా నిలిచేందుకు పార్టీనేతలు వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులతో బండి సంజయ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఎం.రవీంద్రనాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ నాయకులు ఆంటోనీరెడ్డి, పార్టీ కార్యదర్శి జయశ్రీ, అధికార ప్రతినిధి జె.సంగప్ప పాల్గొన్నారు. -
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
30న ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష
పంజగుట్ట: అనాథలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలు గుర్తు చేసేందుకు 30వ తేదీన ఇందిరాపార్క్ వద్ద ‘అనాథల అరిగోస’ పేరుతో దీక్ష నిర్వహిస్తున్నట్లు అనాథల హక్కుల పోరాట వేదిక వ్యవ స్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో సోమవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో అనాథ హక్కుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలు గుర్తుచేస్తూ రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రొఫెసర్ హరగోపాల్, కాంగ్రెస్ నేతలు మల్లు రవి, అద్దంకి దయాకర్, రాములు నాయక్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆప్ నేత ఇందిరా శోభన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములుతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథలకు ఎన్నో హామీలు ఇచ్చి నేటికి ఏడు సంవత్సరాల ఏడు నెలలు అయ్యిందని ఇప్పటికీ అవి నెరవేర్చకుండా మోసం చేశారని విమర్శించారు. -
హైదరాబాద్‌లో హై టెన్షన్.. అసెంబ్లీ టూ ప్రగతి భవన్ రోడ్డు మూసివేత!
సాక్షి, తెలంగాణ: అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వీఆర్ఏలు ప్రయత్నించారు. వీఆర్ఏలు, పలు ప్రజాసంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో అసెంబ్లీ నుంచి ప్రగతిభవన్ రోడ్డును పోలీసులు మూసివేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అక్కడున్న వ్యాపార సముదాయాలను సైతం పోలీసులు మూసివేయించారు. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుంటారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక, ఇందిరా పార్క్ నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన వీఆర్ఏలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, పోలీసులు, వీఆర్ఏల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు.. వీఆర్ఏలపై లాఠీచార్జ్ చేశారు. కాగా, పెద్ద ఎత్తున జిల్లాల నుంచి వీఆర్ఏలు హైదరాబాద్‌కు తరలివచ్చినట్టు సమాచారం. అయితే, వీఆర్ఏల సమస్యలపై జిల్లాలో, గ్రామాల్లో వీఆర్ఏలు గత 50 రోజుల నుంచి నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం వల్లే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. ఇందిరా పార్క్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పే స్కేల్ అమలు చేయాలంటూ వీఆర్ఏలు డిమాండ్ చేస్తున్నారు. రెడ్డి కార్పొరేషన్ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని మత్య్సకారులు, సింగరేణి కార్మికులు నిరసనలు తెలిపారు. దీంతో ఎక్కడికక్కడ ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. మరోవైపు.. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల అమలుకు జీవో జారీ చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, అసెంబ్లీ ముట్టడికి ఏడు సంఘాలు ప్రయత్నించినట్టు సమాచారం. -
ఇందిరా పార్క్‌లో హోలీ సంబరాలు
-
9న ఉపాధ్యాయుల మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోకు వ్యతిరేకంగా ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపడుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఉపాధ్యాయులంతా పెద్ద ఎత్తున ఈ ధర్నాకు తరలి వస్తున్నట్టు తెలిపింది. లోపభూయిష్టంగా ఉన్న ఈ జీవోకు సవరణలు చేసే వరకు వెనక్కు తగ్గేదిలేదని, ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వెల్లడించింది. యూఎస్పీసీ నేతలు సోమవారం హైదరాబాద్ యూటీఎఫ్ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు మాట్లాడుతూ, తమ పట్ల ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాను అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇవేవీ తమ ఆందోళనను అడ్డుకోలేవన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, సర్కార్ దిగిరాకపోతే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. బలవంతపు బదిలీలు చేశారు.. టీఎస్ యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి మాట్లాడుతూ, టీచర్ల మనోగతానికి విరుద్ధంగా ప్రభుత్వం బలవంతపు బదిలీలు చేసిందని ఆరోపించారు. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వకపోతే భవిష్యత్‌లో ‘నాన్ లోకల్స్ గో బ్యాక్’ అనే నినాదం బలపడే వీలుందన్నారు. టీచర్లు పెట్టుకున్న అప్పీళ్లను బుట్టదాఖలు చేయడం దుర్మార్గమన్నారు. పరస్పర బదిలీల్లోనూ అన్యాయమైన నిబంధనలు పెట్టడం దారుణమన్నారు. వివాహానికి ముందు స్థానికతను ప్రమాణంగా తీసుకుంటే ఎంతోమంది నష్టపోతారని తెలిపారు. పరస్పర బదిలీల్లో సీనియారిటీని కోల్పోవాల్సిన పరిస్థితి టీచర్లకు నష్టం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ జీవో వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారని యూటీఎఫ్ నేత జంగయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలున్న వాళ్లను దూర ప్రాంతాలకు బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. 2012 నుంచి అంతర్ జిల్లా బదిలీలు చేపట్టలేదని గుర్తుచేశారు. స్పౌజ్ అప్పీళ్లను పరిష్కరించకపోవడం వల్ల టీచర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని డీటీఎఫ్ నేత టి.లింగారెడ్డి అన్నారు. తమ డిమాండ్లను ఒప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి ఎదురీత తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని, దీన్ని టీచర్లు ఎంతమాత్రం సహించలేరని టీపీటీఎఫ్ నేత మైస శ్రీనివాసులు పేర్కొన్నారు. బాధిత ఉపాధ్యాయులంతా మహాధర్నాకు స్వచ్ఛందంగా హాజరవాలని యూఎస్పీసీ టీచర్లకు పిలుపునిచ్చింది. విలేకరుల సమావేశంలో జాదా వెంకట్రావ్, ఎ.రమణ, గాలయ్య, హరికిషన్ తదితరులు పాల్గొన్నారు. -
దిక్కుమాలిన ప్రభుత్వం కేంద్రంలో ఉంది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: వరి కొనుగోలు అంశంపై కేంద్రం, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య చెలరేగుతున్న మంట ఇప్పట్లో చల్లారేట్లు లేదు. ధాన్యాన్ని కొనుగోలుపై బీజేపీ, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. చదవండి: ఇందిరాపార్క్ ధర్నా ముగిశాక రాజ్‌భవన్‌కు టీఆర్ఎస్ పాదయాత్ర? ఈ మేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..తెలంగాణలో పండించే వడ్లను కొంటరా.. కొనరా అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం సూటిగా సమాధానం చెప్పకుండా వంకర టింకరగా సమాధానం చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ గోస తెలంగాణలోనే కాదు..దేశం మొత్తం ఉందన్నారు.. రైతు చట్టాలను రద్దు చేయండని ఏడాదిగా ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తున్నారని గుర్తు చేశారు. వానాకాలం పంటనే కొనే దిక్కు లేదు కానీ కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను ఎక్కడి నుంచి కొంటుందని ఎద్దేవా చేశారు. చదవండి: టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే కేంద్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. దేశాన్ని పాలించిన అన్ని పార్టీలు ఘోరంగా విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత ఈ దుస్థితికి కారణం ఆ పార్టీలేనని విమర్శించారు. వాస్తవాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు మాట్లాడుతోందని మండిపడ్డారు. హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 101 స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ కంటే భారత్ దీన స్థితిలో ఉందన్నారు. బీజేపీ అబద్ధాలు మాట్లాడుతూ అడ్డగోలు పాలన చేస్తోందని మండిపడ్డారు. ‘ఐటీఆర్ ప్రాజెక్టు ఇవ్వమంటే ఇవ్లేదు.. ప్రతి జిల్లాకు నవోదయాలు ఇవ్వమంటే ఇవ్వలే. చాలా ఓపికతో ఉన్నాం. ఈ సభలో కూడా బీజేపీకి సీఐడీలు ఉన్నారు. నిన్న కూడా ప్రధానికి లేఖ రాసిన. వడ్లు కొంటరా, కొనరా అని అడిగితే ఉలుకు పలుకు లేదు. రైతులు ఇబ్బంది పడతారనే యాసంగిలో వడ్లు వేయొద్దని చెప్పిన. పదవులను చిత్తు కాగితాల్లా ఎన్నిసార్లు వదిలేశామో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. రైతు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు రాజీ పోరాటం చేస్తాం. అనేక సమస్యలను పెండింగ్‌లో పెట్టారు. కుల గణన చేయాలని తీర్మాణం చేసి పంపితే ఇప్పటి వరకు దిక్కు లేదు. సమస్యలను పక్కకు పెట్టి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నీళ్లివ్వకుండా రాష్ట్రాల మధ్య తగాదాలు పెడుతున్నారు. సమస్యలను ఎత్తి చూపితే పాకిస్తాన్ అని విద్వేషాలు రెచ్చగొడుతోంది బీజేపీ. కరెంట్ కోసం తెలంగాణ 30ఏళ్లు ఏడ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే కరెంట్ సమస్య తీరింది. కరెంట్ మోటర్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెబుతోంది. రైతు కడుపు నిండా కరెంట్ ఇచ్చేది తెలంగాణే. బీజేపీకి చరమగీతం పాడితేనే ఈ దేశానికి విముక్తి’ అని సీఎం కేసీఆర్ కేంద్రంపై నిప్పులు చెరిగారు. -
టీఆర్ఎస్ మహాధర్నా: స్టేజి కింద కూర్చున్న కేటీఆర్.. నాగలితో ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు అంశం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. వరి కొనుగోలుపై అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో వరి కొనుగోలుపై కేంద్రం అవలంభిస్తున్న ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహాధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాలో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రైతులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదవండి: కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టాం: సీఎం కేసీఆర్ అయితే కేసీఆర్‌తో సహా మంత్రులంతా స్టేజి పైన కూర్చొని ఉండగా కేవలం కేటీఆర్ ఒక్కరే స్టేజి కింద కార్యకర్తలు ముందు కూర్చున్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మహాధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన శరీరంపై వడ్ల కంకులను అంకరించుకొని.. భుజంపై నాగలి పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఇదే తొలిసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ చేపడుతున్న ఆందోళనల్లో ఇది నాలుగోది. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా నిరసనలో పాల్గొనడం మాత్రం ఇదే తొలిసారి. గతంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలపవడంపై టీఆర్ఎస్ రాష్ట్ర బంద్‌ను నిర్వహించింది. అనంతరం కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన భారత్ బంద్‌లో పాల్గొంది. ధాన్యం సేకరణ సమస్యను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపట్టింది. తాజాగా ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నిరసనలో ఆయన కూడా పాల్గొన్నారు. ఈ మహాధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. -
గవర్నర్ తమిళిసైని కలిసిన టీఆర్ఎస్ ప్రతినిధుల బృందం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గురువారం మహా దర్నా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఈ ధర్నలో సీఎం కేసీఆర్‌తో సహా, మంత్రులు, ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ ధర్నా మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. మహాధర్నా తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సీఎం కేసీఆర్ వినతి పత్రం అందించారు చదవండి: మంత్రి కేటీఆర్ చొరవ.. ఐదేళ్ల చిన్నారిని దత్తత తీసుకున్న కలెక్టర్ ఇందిరాపార్క్ వద్ద టీఆర్ఎస్ మహాధర్నా ముగిశాఖ టీఆర్ఎస్ మంత్రులు బస్సులో రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ఈ మేరకు ఎంపీ కేశవరావు నేతృత్వంలోని బృందం 10 మంది మంత్రులు,10 ఎంపీలు గవర్నర్నర్‌ను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. వీరిలో గంగుల కమలాకర్, మంత్రి సత్యవతి రాథోడ్, కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కడియం శ్రీహరి, నారదాసు లక్ష్మణ్‌రావు, మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే జోగు రామన్న, పద్మాదేవేందర్‌రెడ్డి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాలోత్ కవిత, భాను ప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వరి కొనుగోలు విషయంలో కేంద్ర ద్వంద వైఖరిని నిరసిస్తూ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర విధానం వల్ల రైతులు దెబ్బతింటున్నారని, కేంద్ర వైఖరి రైతులకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. కేంద్రంపై యుద్ధానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఈ యుద్ధం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. అంతం కాదని స్పష్టం చేశారు. పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 50 రోజులు గడిచిన కేంద్ర నుంచి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్ల గురించి ప్రధానికి లేఖలు కూడా రాశామని.. గ్రామగ్రామల్లో వివిధ రకాల ఆందోళనలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ తెలిపారు ‘ఈ పోరాటం ఇక్కడితో ఆగదు. ఈ యుద్ధం ఢిల్లీ దాకా పోవాలి. కేంద్రం కళ్ళు తెర్పించడానికి ఈ యుద్ధం. మంత్రులే ధర్న కు కూర్చుంటున్నారు అంటున్నారు. 2006లో నాటి గుజరాత్ సీఎం నేటి ప్రధాని మోదీ కూడా ధర్నా చేశారు. రైతుల పక్షాన మేముంటం. పోరాటాలు మాకు కొత్త కాదు’ కాదు అని సీఎం స్పష్టం చేశారు. మరోవైపు సాయి చంద్ పాటకు మంత్రి కేటీఆర్ చప్పట్లు కొడుతూ ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. -
ఇందిరాపార్క్ వద్ద రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ ధర్నా
-
లవర్స్‌కు షాకిచ్చిన ఇందిరా పార్క్: వెనక్కి తగ్గిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం హైదరాబాద్‌లో ప్రముఖ పార్క్‌లోకి పెళ్లికాని జంటలను నిషేధించే ఉత్తర్వుల బోర్డు కలకలం సృష్టించింది. ‘‘పెళ్లి కాని జంటలకు పార్కులోనికి ప్రవేశం లేదు” అంటూ తాజాగా ఇందిరా పార్కు యాజమాన్యం ఒక బోర్డు పెట్టింది. పార్క్ మేనేజ్మెంట్ కొత్త మోరల్ పోలీసింగ్ వ్యవహారం దుమారాన్ని రేపింది. పరోక్షంగా ప్రేమికులకు ప్రవేశం లేదన్నట్టు హుకుం జారీ చేయడంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. తాలిబన్లు ఎక్కడో వేరే దేశంలో లేరు, మన చుట్టూనే వున్నారు, కావాలంటే వెళ్లి చూడండి హైదరాబాద్ ఇందిరాపార్క్‌కి అంటూ ఈ నిర్ణయంపై మహిళా ఉద్యమకారులు మండిపడ్డారు. పబ్లిక్ పార్క్ అనేది లింగభేదం లేని జంటలతో సహా చట్టాన్ని గౌరవించే పౌరులందరికీ అనుమతినిచ్చే ప్రదేశం. పార్క్‌లోకి ప్రవేశానికి 'వివాహం' ఎలా ప్రామాణికంగా ఉంటుందంటూ యాక్టివిస్ట్ మీరా సంగమిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి : తిప్ప తీగ, నిమ్మగడ్డి, అశ్వగంధ ఉపయోగాలు తెలుసా!? ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఇందిరా పార్క్ అంటే చాలా ఫ్యామస్. ఈ పార్క్‌ను సందర్శించే వారిలో పిల్లలు, ప్రేమికుల సంఖ్య ఎక్కువ. మరీ ముఖ్యంగా మార్నింగ్ వాక్కు వచ్చే వారితో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది. అందులోనూ ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు చేపట్టిన ప్రత్యక అభివృద్ది కార్యక్రమాలతో మరింత సందడి నెలకొంది. అయితే తాజాగా ప్రేమ జంటలకు షాక్ ఇవ్వడంపై భారీ వ్యతిరేకత రావడంతో ఈ బోర్డును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ మరో బోర్డు తగిలించింది. అయితే పార్క్ ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు పోలీసులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తూ తగిన శ్రద్ధ వహించాలని కోరినట్టు తెలిపింది. మరోవైపు ఇందిరా పార్కుతోపాటు, నగరంలోని ఇతర ప్రముఖ పార్కుల్లో కూడా ఇలాంటి ఆదేశాలే అమల్లోకి రానున్నాయంటూ సోషల్ మీడియాలో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడవం గమనార్హం. చదవండి : Kabul Airport: వరుస పేలుళ్ల కలకలం, 13 మంది మృతి New low & new level of moral policing by Indira Park Mgmt in Hyd! A public park is an open space for all law abiding citizens, including consenting couples across genders. How can 'marriage' be criteria for entry! @GHMCOnline & @GadwalvijayaTRS this is clearly unconstitutional. pic.twitter.com/4rNWo2RHZE — Meera Sanghamitra (@meeracomposes) August 26, 2021