ITF womens tourney
-
చాంపియన్ సహజ
గురుగ్రామ్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి చాంపియన్‌గా అవతరించింది. గురుగ్రామ్‌లో ఆదివారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో 21 ఏళ్ల సహజ 6–3, 7–6 (7/5)తో మూడో సీడ్ విక్టోరియా (స్లొవేకియా)పై విజయం సాధించింది. సహజ కు 3,935 డాలర్ల (రూ. 3 లక్షల 10 వేలు) ప్రైజ్ మనీ 50 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ప్రాంజల శుభారంభం
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాలోని బెన్‌డిగో పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 7–6 (7/1), 6–3తో యు చికారైషి (జపాన్)పై గెలిచింది. ఇదే టోర్నీలో ఆడుతున్న భారత నంబర్‌వన్ అంకిత రైనా తొలి రౌండ్లో 1–6, 1–6తో రొడియోనోవా (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయింది. -
చాంపియన్ సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టైటిల్ విజేతగా తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల నిలిచింది. గువాహటి వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సంజన 5–7, 6–2, 6–4తో రేష్మా మరూరి (కర్ణాటక)పై విజయం సాధించింది. 3 గంటల 10 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి సెట్‌ను కోల్పోయిన సంజన... రెండో సెట్ నుంచి విజంభించింది. తర్వాతి సెట్లలో ప్రత్యరి్థకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రెండు సెట్లను గెలిచి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో సంజన 6–4, 6–4తో మల్లిక మరాటీపై, క్వార్టర్స్‌లో 6–1, 6–0తో కనిక శివరమన్పై, ప్రిక్వార్టర్స్‌లో 6–2, 6–2తో అమీక్ కిరణ్‌పై, తొలి రౌండ్లో 6–2, 6–0తో సుహిత మరూరిపై గెలిచింది. టైటిల్ గెలిచిన సంజనను స్పాన్సర్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఎండీ, చైర్మన్ డాక్టర్ రమేశ్ కంచర్ల అభినందించారు. -
సౌజన్య పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో జాతీయ చాంపియన్, హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి పోరాటం ముగిసింది. గ్వాలియర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సౌజన్య 4–6, 3–6తో ఏడో సీడ్ సోఫియా షపటవా (జార్జియా) చేతిలో ఓడిపోయింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సౌజన్య మూడు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. అంతకుముందు ఈ టోర్నీలో సౌజన్య తొలి రౌండ్లో 6–3, 7–5తో జాక్వలైన్ సబజ్ అవాద్ (స్వీడన్)పై, రెండో రౌండ్లో 6–4, 6–3తో రెండో సీడ్ దరియా మర్సిన్‌కెవికా (లాత్వియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–3, 2–6, 6–4తో మరియా తిమోఫీవా (రష్యా)పై విజయం సాధించింది. -
రన్నరప్ సౌజన్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారిణులు సౌజన్య భవిశెట్టి, శ్రావ్యశివాని చిలకలపూడి రాణించారు. ట్యునీషియాలోని టబర్కా వేదికగా జరిగిన ఈ టోర్నీలో వీరిద్దరూ జంటగా మహిళల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచారు. ఫైనల్లో నాలుగో సీడ్ సౌజన్య–శ్రావ్య శివాని జంట 2–6, 2–6తో మూడో సీడ్ ఎవా వెడెర్–స్టీఫెన్ జుడిత్ విసెర్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో సౌజన్య–శ్రావ్య శివాని ద్వయం 7–5, 3–6, 10–6తో రెండోసీడ్ అడెలినా బరవి–విక్టోరియా మిఖైలోవా (రష్యా) జంటను కంగుతినిపించింది. క్వార్టర్స్‌లో 6–3, 6–3తో అండ్రియానా పినో–గియా స్వార్‌సియాలుప్ (ఇటలీ) జోడీపై, ప్రిక్వార్టర్స్‌లో 6–1, 6–1తో ఒలింపి లాన్స్‌లాట్ (ఫ్రాన్స్)–డెనిజ్ పాకోవ్ (టర్కీ) జంటపై విజయం సాధించారు. సింగిల్స్ విభాగంలో వీరిద్దరూ తొలిరౌండ్లోనే ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రావ్య శివాని 3–6, 1–6తో ఎనా కజెవిక్ (క్రొయే షియా) చేతిలో, రెండోసీడ్ సౌజన్య 1–6, 2–6తో స్టీఫెన్ జుడిత్ విసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లోనూ భారత క్రీడా కారులకు కలిసి రాలేదు. ప్రిక్వార్టర్స్‌లో తరుణ్ అనిరుధ్ చిలకలపూడి (భారత్)–మాజెద్ కిలాని (ట్యునీషియా) జంట 6–7 (7/9), 3–6తో నాలుగోసీడ్ ఇగ్నాసియో కారో–ఫెమిన్ టెంటి (అర్జెంటీనా) జంట చేతిలో... అనిరుధ్ చంద్రశేఖర్–విఘ్నేశ్ పెరణమల్లూర్ (భారత్) ద్వయం 4–6, 5–7తో మూడోసీడ్ మాట్స్ హెర్మన్స్–బార్ట్ స్టీవెన్స్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాయి. -
ప్రాంజల ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం తొపలోవా (బల్గేరియా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల తొలి సెట్‌ను 3–6తో చేజార్చుకుంది. అనంతరం రెండో సెట్‌ను 6–0తో గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. మూడో సెట్లో స్కోరు 3–4 వద్ద ఉన్న దశలో ప్రాంజల గాయం కారణంగా వైదొలిగింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సౌజన్య భవిశెట్టి (భారత్)–ఇలోనా (రొమేనియా) జంటకు తమ ప్రత్యర్థి జంట నుంచి వాకోవర్ లభించింది. ఇదే వేదికపై జరుగుతున్న పురుషుల టోర్నీలో తొలి రౌండ్లో హైదరాబాద్ ఆటగాడు రిషభ్ అగర్వాల్ 2–6, 1–6తో టిమ్ వాన్ రిజ్తోవిన్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. -
రన్నరప్ ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాంజల రాణించింది. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఈ టోర్నీలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ప్రాంజల 6–0, 1–6, 3–6తో రఖిమోవా (రష్యా) చేతిలో ఓటమి పాలైంది. -
భారత బాలికల జట్టుకు తొలి గెలుపు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆసియా ఓసియానియా జూనియర్ ఫెడ్ కప్ టోర్నమెంట్లో భారత బాలికల జట్టు ఖాతాలో తొలి విజయం చేరింది. గ్రూప్ ‘ఎ’లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన భారత్ ప్రస్తుతం 9 నుంచి 16 స్థానాల కోసం వర్గీకరణ మ్యాచ్‌లు ఆడుతోంది. ఇండోనేసియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 3–0తో గెలుపొందింది. తొలి సింగిల్స్‌లో తెలంగాణ అమ్మాయి సంజన సిరిమల్ల 6–2, 6–0తో జెస్సికా క్రిస్టా వీరా (ఇండోనేసియా)పై నెగ్గి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించింది. రెండో సింగిల్స్‌లో తెలంగాణకే చెందిన మరో అమ్మాయి భక్తి షా 6–1, 6–0తో నికెన్ ఫెరిలియానా (ఇండోనేసియా)ను ఓడించి భారత్‌కు 2–0తో ఆధికాన్ని అందించడంతోపాటు విజయాన్ని ఖాయం చేసింది. నామమాత్రమైన డబుల్స్ మ్యాచ్‌లో సుదీప్త–భక్తి షా ద్వయం 6–2, 6–4తో జెస్సికా–నికెన్ జోడీని ఓడించింది. శుక్రవారం జరిగే మరో వర్గీకరణ మ్యాచ్‌లో మలేసియాతో భారత్ ఆడుతుంది. -
శ్రావ్య శివాని ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి చిలకలపూడి శ్రావ్య శివాని పోరాటం ముగిసింది. ఈజిప్ట్‌లోని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రావ్య సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో తొలి రౌండ్లో నిష్క్రమించింది. క్వాలిఫయర్ హోదాలో సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ మ్యాచ్ ఆడిన శ్రావ్య 2–6, 2–6తో లీసా మేస్ (ఆస్ట్రేలియా) చేతిలో పరాజయం పాలైంది. డబుల్స్ తొలి రౌండ్లో శ్రావ్య–లీసా మేస్ ద్వయం 4–6, 2–6తో మినామి అకియామ–ఇకుమి యామజకి (జపాన్) జోడీ చేతిలో ఓడింది. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ ఆటగాడు విఘ్నేశ్ పెరణమల్లూర్ 1–6, 3–6తో పెర్చికాట్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
సెమీస్‌లో సౌజన్య జోడీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ అమ్మాయి సౌజన్య భవిశెట్టి రాణిస్తోంది. టర్కీలోని అంటాల్యా వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో తన భాగస్వామి పెట్రా జనుస్కోవా (కెనడా)తో కలిసి సౌజన్య డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకుంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో సౌజన్య (భారత్)– పెట్రా జనుస్కోవా (కెనడా) ద్వయం 4–6, 6–3, 10–7తో సకురా హొసోజి (జపాన్)–డెనిజ్ (టర్కీ) జంటపై గెలుపొంది సెమీస్‌లో అడుగు పెట్టింది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో సౌజన్య 2–6, 6–3, 2–6తో క్రిస్టినా మిలెన్‌కోవిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో పరాజయం పాలైంది. -
రన్నరప్ సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమల్లకు నిరాశ ఎదురైంది. ఇండోర్‌లో జరిగిన ఈ టోర్నీలో సంజన ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన బాలికల సింగిల్స్ టైటిల్‌పోరులో ఎనిమిదో సీడ్ సంజన 1–6, 0–6తో శ్రేయ (ఢిల్లీ) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు సెమీస్‌లో 7–5, 6–0తో అర్చిత మహాల్వాల్ (ఢిల్లీ)పై, క్వార్టర్స్‌లో 6–4, 6–1తో టాప్ సీడ్ ప్రియాన్షి భండారి (మహారాష్ట్ర)పై విజయం సాధించింది. -
సెమీస్‌లో సంజన
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) గ్రేడ్–5 జూనియర్స్ టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి సంజన సిరిమళ్ల నిలకడగా రాణిస్తోంది. శ్రీలంకలో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు చేరుకున్న సంజన... డబుల్స్ విభాగంలో క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో సంజన (భారత్) 6–2, 7–5తో టాప్‌సీడ్ లింగ్ చుయ్ కీ (హాంకాంగ్)కి షాకిచ్చింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 6–4, 6–4తో మ యుజా (చైనా)పై, తొలిరౌండ్లో 6–4, 5–7, 6–4తో సెనివిరత్నే (శ్రీలంక)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్ తొలిరౌండ్లో బిపాషా– సంజన (భారత్) ద్వయం 6–4, 7–5తో లిన్ జిన్ టాన్– హనా సీన్ ఇయాన్ యిప్ (మలేసియా) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
పోరాడి ఓడిన ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. థాయ్‌లాండ్‌లోని హువా హిన్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో ప్రాంజల సింగిల్స్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లో... డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. ఆరో సీడ్ జాక్వలైన్ కాకో (అమెరికా)తో జరిగిన సింగిల్స్ మ్యాచ్‌లో ప్రాంజల 6–4, 3–6, 4–6తో పోరాడి ఓడింది. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల మూడు ఏస్‌లు సంధించి, నాలుగు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రాంజల–తమాచాన్ (థాయ్‌లాండ్) ద్వయం 6–4, 6–7 (5/7), 10–12తో ‘సూపర్ టైబ్రేక్’లో నిచా–నుద్నిదా (థాయ్‌లాండ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
భారత టెన్నిస్ జట్టులో మలిష్క
సాక్షి, హైదరాబాద్: ‘దక్షిణాసియా రీజనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ చాంపియన్‌షిప్’లో పాల్గొనే అండర్–12 భారత టెన్నిస్ జట్టుకు హైదరాబాద్ అమ్మాయి మలిష్క ఎంపికైంది. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగే ఈ టోర్నీలో మలిష్క భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. నేపాల్‌లోకి కఠ్మాండులో ఏప్రిల్ 21 నుంచి 28 వరకు టీమ్ విభాగంలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల జట్టుకు శ్రుతి అహ్లావత్, అంజలి రాఠి, దుర్గాన్షి ఎంపికవగా... మలిష్క రిజర్వ్ ప్లేయర్‌గా చోటు దక్కించుకుంది. బాలుర జట్టులో వన్ష్ నందల్, హర్ష్ ఫొగాట్, రుషీల్ ఖోస్లా చోటు దక్కించుకోగా... మానస్ మనోజ్ రిజర్వ్ ఆటగాడిగా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ‘శాట్స్’ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి భారత జట్టుకు ఎంపికైన మలిష్కను అభినందించారు. -
ప్రాంజల ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్ మహిళల టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌లో పరాజయం పాలైంది. గ్వాలియర్‌లో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల 3–6, 1–6తో ఐదోసీడ్ కర్మన్ కౌర్ థండి (భారత్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్)–కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) జోడీకి ప్రత్యర్థి వాకోవర్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరింది. నేడు జరిగే సెమీస్‌లో టాప్‌సీడ్ యానా సిజికోవా (రష్యా)–అనా వెసెలినోవిక్ (మాంటెనిగ్రో) జంటతో ప్రాంజల జోడీ తలపడుతుంది. -
ప్రాంజల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల శుభారంభం చేసింది. గ్వాలియర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో సింగిల్స్ విభాగంలో రెండోరౌండ్‌కు చేరుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రాంజల 6–4, 6–4తో సారా యాదవ్ (భారత్)పై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్‌కే చెందిన సౌజన్య భవిశెట్టి 3–6, 4–6తో కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే సింగిల్స్ తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో అంకిత రైనాతో రిషిక సుంకర, ఎమిలీ వెబ్లీ స్మిత్ (బ్రిటన్)తో నిధి చిలుముల తలపడతారు. డబుల్స్ తొలిరౌండ్లో నటాషా–రిషిక సుంకర (భారత్) జంటతో ప్రాంజల (భారత్)–కరిన్ కెన్నెల్ (స్విట్జర్లాండ్) జోడీ తలపడుతుంది. -
ప్రాంజల జోడీ ఓటమి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె డబుల్స్ విభాగంలో సెమీస్‌లో ఓటమి పాలైంది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్‌లో రెండో సీడ్ ప్రాంజల–ఎమిలీ వెబ్లీ (బ్రిటన్) జంట 3-6, 6-4, 7-10తో నాలుగో సీడ్ కనిక వైద్య (భారత్)–రోసెల్ వాన్ డెర్ హోక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది. -
రెండో రౌండ్లో సౌజన్య, ప్రాంజల
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు ముందంజ వేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన సౌజన్య భవిశెట్టి, ప్రాంజల యడ్లపల్లి సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు... డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలిరౌండ్లో సౌజన్య (భారత్) 6–1, 6–0తో దీక్ష మంజు ప్రసాద్ (భారత్)పై గెలుపొందగా... మూడో సీడ్ ప్రాంజల 6–3, 6–3తో యుబ్రాని బెనర్జీ (భారత్)ను ఓడించింది. డబుల్స్ తొలిరౌండ్లో సౌజన్య–రిషిక సుంకర (భారత్) ద్వయం 7–5, 6–2తో అద్రిజ బిశ్వాస్–ఆర్తి మునియన్ (భారత్) జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ప్రాంజల (భారత్)–ఎమిలీ వెబ్లీ స్మిత్ (గ్రేట్ బ్రిటన్) జంట 6–2, 6–0తో నిత్య రాజ్–సౌమ్య (భారత్) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు సింగిల్స్ తొలి రౌండ్లో నిధి చిలుముల (తెలంగాణ) 2–6, 4–6తో ఐదోసీడ్ ఫ్రేయ క్రిస్టీ (గ్రేట్ బ్రిటన్) చేతిలో, రిషిక సుంకర 6–7 (10/12), 0–6తో నుడిడా లాంగ్నమ్ (థాయ్‌లాండ్) చేతిలో, భువన కాల్వ (తెలంగాణ) 5–7, 4–6తో తెరీజా మిహలికోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇతర డబుల్స్ మ్యాచ్‌ల్లో నిధి చిలుముల–స్నేహాదేవి రెడ్డి (భారత్) జంట 7–6 (7/5), 7–5తో మోనికా రాబిన్సన్ (అమెరికా)–జో వెన్ స్కాండలిస్ (భారత్) జోడీపై గెలుపొందింది. -
సెమీస్‌లో శివాని
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్–2018 గ్రేడ్–2 టోర్నమెంట్లో శివాని అమినేని సెమీస్‌కు చేరింది. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీ బాలికల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శివాని 6–0, 6–1తో మరో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మికపై విజయం సాధించింది. సెమీస్‌లో సెలీన్ ఓవున్క్ (టర్కీ)తో శివాని తలపడనుంది. -
క్వార్టర్స్‌లో శివాని, రష్మిక
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్–2018 గ్రేడ్–2 టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. కోల్‌కతాలో జరుగుతున్న ఈ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, శివాని అమినేని క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో శివాని అమినేని 6–4, 7–5తో కావ్య (భారత్)పై విజయం సాధించగా... శ్రీవల్లి రష్మిక 7–6 (7/1), 6–3తో పూజ ఇంగాలే (భారత్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. -
రన్నరప్ ప్రాంజల జంట
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల సర్క్యూట్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ఆకట్టుకుంది. నవీ ముంబైలో జరిగిన ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో ఆమె రన్నరప్‌గా నిలిచింది. టైటిల్ పోరులో ప్రాంజల (భారత్)–తమారా జిదాన్సెక్ (స్లొవేనియా) ద్వయం 0–6, 1–6తో రెండో సీడ్ జార్జినా గార్సియా పెరెజ్ (స్పెయిన్)–డయానా మార్సింకెవికా (లాత్వియా) జంట చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు సెమీస్‌లో ప్రాంజల జోడీ 6–4, 2–6, 13–11తో టాప్ సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా)–పొలినా మోనోవా (రష్యా) జంటపై విజయం సాధించింది. -
శివాని జోడీకి టైటిల్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–3 టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి అమినేని శివాని సత్తా చాటింది. పుణేలో జరిగిన ఈ టోర్నీలో తన భాగస్వామి ఆకాంక్ష భాన్‌తో కలిసి డబుల్స్ టైటిల్‌ను అందుకుంది. శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ శివాని–ఆకాంక్ష (భారత్) ద్వయం 3–6, 6–2, 10–3తో సాల్సా అహర్ (భారత్)–షియోరి ఇటో (జపాన్) జంటపై విజయం సాధించింది. సింగిల్స్ విభాగంలో శివాని పోరాటం సెమీస్‌లో ముగిసింది. సింగిల్స్ సెమీస్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ శివాని 5–7, 0–6తో టాప్ సీడ్ ఆకాంక్ష చేతిలో పరాజయం పాలైంది. -
సెమీస్‌లో శివాని
సాక్షి, హైదరాబాద్: ఐటీఎఫ్ జూనియర్స్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. బాలికల విభాగంలో అమినేని శివాని సింగిల్స్ విభాగంలో సెమీస్‌కు, డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. బాలుర విభాగంలో తీర్థ శశాంక్ పోరాటం క్వార్టర్స్‌లో ముగిసింది. గురువారం జరిగిన బాలికల సింగిల్స్ క్వార్టర్స్‌లో శివాని (భారత్) 6–3, 6–3తో షియోరి ఇటో (జపాన్)పై గెలుపొందింది. మరోవైపు బాలికల డబుల్స్ సెమీస్‌లో టాప్ సీడ్ శివాని– ఆకాంక్ష (భారత్) ద్వయం 4–6, 6–3, 10–8తో చే హ్యూన్ (కొరియా)– డోగా (టర్కీ) జోడీపై గెలుపొందింది. బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ (భారత్) 5–7, 4–6తో సచిత్ శర్మ చేతిలో పరాజయం పాలయ్యాడు. -
ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సంఘం (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. షోలాపూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో డబుల్స్ విభాగంలో సెమీస్‌కు చేరిన ప్రాంజల... సింగిల్స్ విభాగంలో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం పాలైంది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్ ప్రాంజల 6–7 (3/7), 7–5, 2–6తో బున్వయి థాంచవత్ (థాయ్‌లాండ్ ) చేతిలో ఓడిపోయింది. డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల (భారత్)–చింగ్ వెన్ సు (చైనీస్ తైపీ) ద్వయం 6–1, 7–6 (7/4)తో జియాక్సిన్ కోంగ్–జియాకంగ్ (చైనా) జంటపై గెలుపొందింది. మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు చెందిన సామ సాత్విక–షేక్ హుమేరా బేగం జంట 1–6, 5–7తో అలెగ్జాండ్రా గ్రించిషినా (కజకిస్తాన్)–అల్బినా ఖబిబులినా (ఉజ్బెకిస్తాన్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
ప్రాంజల పరాజయం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. ఇండోర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె సెమీఫైనల్లో ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో నాలుగో సీడ్ ప్రాంజల 3–6, 5–7తో రెండో సీడ్ ఓల్గా డోరోషినా (రష్యా) చేతిలో పరాజయం పాలైంది. గంటా 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రాంజల ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తన సర్వీస్‌ను ఏడుసార్లు కోల్పోయిన ప్రాంజల... ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది.