Jagapati Babu
-
రాజమౌళి కుటుంబంతో ఉండే మజానే వేరు.. ఇక నా అమెరికా అల్లుడి గురించి చెప్పాలంటే..
-
‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, భీమ్రావ్ దొరగా జగపతిబాబు
జగపతిబాబు, ఆశిష్ గాంధీ, విమలా రామన్, మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు రైటర్‌గా చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎమ్మెల్యే, కవి, గాయకుడు రసమయి బాలకిషన్ నిర్మించారు. ‘రుద్రంగి’ ఫస్ట్‌లుక్, టైటిల్ మోషన్ పోస్టర్ని సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ‘రుద్రంగి నాది.. రుద్రంగి బిలాంగ్స్ టు మీ’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ వినిపిస్తుంది. జాలి, దయ లేని భీమ్ రావ్ దొరగా జగపతిబాబుని పరిచయం చేశారు. ‘‘త్వరలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి నాఫల్ రాజా సంగీతం అందిస్తున్నారు. first innings chusaru, second innings chusaru, third innnings chudabothunaru.. mee #BheemRaoDhora from #Rudrangi movie. pic.twitter.com/NWdYfmbWjR — Jaggu Bhai (@IamJagguBhai) October 3, 2022 -
చెన్నై హోటల్లో తారక్ ఫ్యాన్స్‌తో జగ్గూ భాయ్, ఆ ఫొటో షేర్ చేయనన్న చిట్టి
ప్రామిస్ ఇదే చివరిది ఇక ఆ ఫొటో షేర్ చేయనన్న చిట్టి మనల్ని మనం ప్రేమించుకోవడమే సంతోషానికి తొలి మెట్టు అంటున్న సదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో చెన్నై హోటల్లో జగ్గూ భాయ్ లంచ్ కూతురితో అనుష్క శర్మ, లిటిల్ వామికకు అష్టమి శుభాకాంక్షలు View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) -
ఆనందయ్య మందు వాడాను, కరోనా రాలేదు: జగపతిబాబు
ఒకవైపు కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తుంటే, మరోవైపు కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మందు కరోనాకు పని చేయదని కొందరు అంటుంటే మరి కొందరు ఆనందయ్య ఆయుర్వేద మందు ఎలాంటి హానీ కలిగించదని చెప్పుకొచ్చారు. ఎన్నో పరిణామాల అనంతరం.. మళ్లీ ఆనందయ్య మందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జనాలు ఆనందయ్య మందు కోసం క్యూ కడుతున్నారు. సామాన్యులే కాదు కొందరు సెలబ్రిటీలు కూడా ఈ మందును విశ్వసిస్తున్నారు. తాజాగా విలక్షణ నటుడు జగపతిబాబు తాను ఆనందయ్య మందును ఎప్పుడో వాడానని, ఆయుర్వేదం హానీ చేయదని తాను బలంగా నమ్ముతానన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వారిలో తాను ఒకడినని. తనకు కరోనా రాలేదని ఆయన స్పష్టం చేశారు. ‘ఆయుర్వేదం మందులను పకృతి సహాజమైన ఔషధాలతో తయరు చేస్తారు. అలాంటి మందు ఎలాంటి హానీ చేయదని నేను విశ్వసిస్తున్నాను. నేచర్, భూదేవి తప్పు చేయదు. ఆనందయ్య మందు విషయంలో చాలామంది అభిప్రాయాలు చూశాను.. రకరకాల వీడియోలు చూసిన తరువాత ఓ అభిప్రాయానికి వచ్చాను’’ అన్నారు జగపతిబాబు. ‘‘ఎవరేమన్నా సరే.. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. కచ్చితంగా మంచే జరుగుతుందని నేను ఆనందయ్య మందుని వాడాను. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు నాకు కోవిడ్ రాలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటు చెప్పుకొచ్చారు. ‘ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ మందు శాస్త్రీయంగా అనుమతులు పొంది ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా. అతన్ని దేవుడు ఆశీర్వదించాలి’ అంటూ ఇంతకుముందు జగపతిబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. -
నీ మరణం బాధాకరం, కళ్ల ముందే..: జగపతిబాబు
20 ఏళ్లుగా విలక్షణ నటుడు జగపతిబాబు అభిమానిగా ఉన్న శ్రీను గుంటూరులో కరోనాతో ప్రాణాలు విడిచాడు. ఈ విషయం తెలిసి కలత చెందిన జగపతిబాబు సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని తెలియజేశాడు. తన అభిమాన సంఘం గుంటూరు ప్రెసిడెంట్‌గా ఉన్న శ్రీను కరోనాతో కన్నుమూయడం బాధాకరమన్నాడు. శ్రీను, అతడి భార్య కోటీశ్వరిగారు వారి సంతానంలో ఒకరికి జగపతి అని తన పేరే పెట్టారని ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ కుటుంబానికి ఎప్పటికీ తన అండ ఉంటుందని భరోసానిచ్చాడు. శ్రీనును చాలా మిస్ అవుతున్నానంటూ మనసులోని బాధను బయటపెట్టాడు. కరోనా వల్ల కళ్ల ముందే ఎంతోమంది చనిపోతున్నారని, ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియలేని దుస్థితిలో ఉన్నామని తెలిపాడు. కాబట్టి ఇప్పటికైనా అందరూ మాస్క్‌లు పెట్టుకుంటూ, శానిటైజ్ చేసుకోవాలని కోరాడు. కాగా ప్రస్తుతం జగపతిబాబు 'అన్నాత్తే', 'మహా సముద్రం' సహా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: సినిమాల్లోకి రంభ రీఎంట్రీ.. ఫొటోలు, ఫ్లెక్సీలతో హల్చల్! -
ఇది నీ కథేనా అని అడుగుతున్నారు!
‘‘ఎఫ్‌సీయూకే’లో నా పాత్ర గురించి వెల్లడైన విషయాలు చూసి, ఇది నీ కథేనా? అని కొందరు అడుగుతున్నారు. పిల్లలకు ఆటలు కావాలి, యూత్‌కు రొమాన్స్ కావాలి, మాకు అన్నీ కావాలి. ఈ సినిమాలో అవన్నీ ఉంటాయి. ప్రేక్షకుల్ని ఈ సినిమా అలరిస్తుంది’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా జగపతిబాబు ప్రధాన పాత్రలో బేబీ సహస్రిత మరో పాత్రలో నటించిన చిత్రం ‘ఎఫ్‌సీయూకే’ (ఫాదర్.. చిట్టి.. ఉమ.. కార్తీక్). విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో శ్రీరంజిత్ మూవీస్‌పై దామోదర్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ..‘దామోదర్ ప్రసాద్ మంచి అభిరుచి ఉన్న నిర్మాత. నాన్నగారు (వి.బి. రాజేంద్రప్రసాద్) నిర్మించి, దర్శకత్వం వహించిన ‘దసరా బుల్లోడు’ ఈ జనవరి 13కు 50 ఏళ్ళు పూర్తి చేసుకోవడం హ్యాపీ’ అన్నారు. ‘సినిమా అనేది వ్యాపారమైనప్పటికీ విలువలతో సినిమాలు తీస్తూ వస్తున్నాను. ‘ఎఫ్‌సీయూకే’ కూడా అలాంటి సినిమానే’ అన్నారు దామోదర్ ప్రసాద్. ‘ప్రేక్షకులను బాగా నవ్వించే చిత్రమిదని విద్యాసాగర్ రాజు పేర్కొన్నారు. ‘ఫిబ్రవరి 12న జగపతిబాబు, దాము బర్త్‌డే. ఆ రోజే మా సినిమా రిలీజ్ చేస్తామని రామ్ కార్తిక్ తెలిపారు. సినిమాటోగ్రాఫర్ శివ, సహనిర్మాత యలమంచిలి రామకోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ రెడ్డి పాతూరి, లైన్ ప్రొడ్యూసర్ వాసు పరిమి పాల్గొన్నారు. -
మిస్ ఇండియా మూవీ రివ్యూ
టైటిల్ : మిస్ ఇండియా నటీనటులు : కీర్తి సురేశ్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా, నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తదితరులు నిర్మాణ సంస్థ: ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ నిర్మాత: మహేష్ కోనేరు దర్శకత్వం: నరేంద్రనాథ్ సంగీతం: ఎస్.ఎస్. థమన్ సినిమాటోగ్రఫీ: డానీ సంచేజ్ లోపేజ్, సుజిత్ వాసుదేవ్ ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : నవంబరు 4, 2020 ( నెట్‌ఫ్లిక్స్) థియేటర్లు మూతబడి 8 నెలలు కావస్తోంది. కరోనా కారణంగా పెద్ద పెద్ద సినిమాలేవీ వెండితెరపై ప్రదర్శించే అవకాశం లేకపోయినప్పటికీ.. మహానటి కీర్తి సురేష్ అభిమానులకు మాత్రం ఓటీటీ.. ఆ వెలితి లేకుండా చేసింది. చాలా వరకు ఆమె చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ దశలో ఉండగానే లాక్డౌన్ మొదలైన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు రిలీజ్ చేయడమే తప్ప వేరొక మార్గం లేదని తెలిసినప్పటికీ బడా నిర్మాతలు ఎవరూ ఆ సాహసం చేయలేదు. కానీ కీర్తి అభినయం, నటనా కౌశలంపై ఉన్న నమ్మకంతో ఆమె నటించిన ‘పెంగ్విన్’ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేశారు మూవీ మేకర్స్. దాని ఫలితం ఎలా ఉన్నా ఇప్పుడు కీర్తి సురేష్ ‘‘మిస్ ఇండియా’’ అనే మరో సినిమాతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ ట్రైలర్‌తో మ్యాజిక్ చేసిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుందో తెలుసుకుందాం. కథ: మధ్య తరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కంటుంది మానస సంయుక్త( కీర్తి సురేశ్). ఎప్పటికైనా తన సొంత బ్రాండ్‌ను స్థాపించి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి తనేంటో ప్రపంచానికి తెలియజేయాలనే పట్టుదలతో ఉంటుంది. ప్రకృతి అందాల నడుమ లంబసింగిలో తన తాతయ్య (రాజేంద్రప్రసాద్) బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీపై మక్కువ పెంచుకున్న మానస.. దానినే తన బిజినెస్‌గా మలచుకోవాలనే ఆలోచనతో ఉంటుంది. అకడమిక్స్‌లో మార్కులు సాధించడం కంటే కూడా ఓ లక్ష్యంతో ముందుకు సాగడంలోనే అసలైన మజా ఉంటుందని తన తండ్రి చెప్పిన మాటలు కూడా చిన్నతనంలోనే ఆమెపై ప్రభావం చూపిస్తాయి. ఈ క్రమంలో అనుకోని కారణాల వల్ల అమెరికాకు చేరుకున్న మానస.. అక్కడ తన ఆలోచనలను ఎలా అమలు చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అనుభవాలేమిటి? ఒక మహిళగా, యువ ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాగిన మానస ప్రయాణంలో కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) సృష్టించిన అడ్డుంకులేమిటి? ఆశయం కోసం ప్రేమను కూడా పక్కనపెట్టిన మానస తన లక్ష్యాన్ని చేరుకుందా లేదా? ఇంతకీ మిస్ ఇండియా బ్రాండ్‌లో ఉన్న గొప్పదనం ఏమిటి? అన్నదే మిగతా కథ. విశ్లేషణ: నువ్వెంత గొప్పవాడివో ఈ ప్రపంచానికి చాటి చెబుతా అంటూ మానస తన తాతయ్యతో చెప్పిన మాటలకు కొనసాగింపుగా సాగిన ఈ కథలో మొదట.. హీరోయిన్ కుటుంబ పరిస్థితులు, వెనువెంటనే వాళ్లు అమెరికాకు చేరుకోవడం వంటి సీన్లు సగటు మధ్య తరగతి కుటుంబంలో జరిగే సంఘటలకు కాస్త భిన్నంగా సాగుతాయి. ఇక సెకండ్ హాఫ్‌లో అసలైన కథ మొదలవుతుంది. కాఫీ వ్యాపారంలో నంబర్ వన్‌గా కైలాశ్ శివకుమార్( జగపతి బాబు) కారణంగా మానసకు ఎదురైన తొలి ఓటమితో కథలో వేగం పుంజుకుంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా మన ఇండియన్ ఛాయ్‌కు తిరుగులేదని ప్రతీ సీన్ గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మాయే కదా వ్యాపారం ఎలా చేస్తుంది, విజయం ఎలా సాధిస్తుంది అనుకునే వారికి ఈ సినిమా మంచి సమాధానం. అంతర్లీనంగా మహిళా సాధికారికతకు పెద్దపీట వేసినా, కథను వినోదాత్మకంగా సాగించడంలోనూ దర్శకుడు నరేంద్రనాథ్ కొంతమేర సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. చిన్నతనం నుంచే కలలు కనడం, వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడడం అనే కాన్సెప్ట్ కూడా రొటీన్‌గా ఉన్నా.. కీర్తి సురేష్ వంటి నటిని ఈ కథకు ఎంపిక చేసుకోవడం ద్వారా హైప్ క్రియేట్ చేయగలిగాడు. అయితే సినిమా ఆసాంతం దానిని కొనసాగించలేకపోయాడు. ఎవరెలా నటించారు? మహానటి సినిమాతో తనకు తిరుగులేదని నిరూపించుకున్న కీర్తి ఈ సినిమాలోనూ తన మార్కు నటనతో మంచి మార్కులే కొట్టేశారు. ఇక తానే టాప్‌లో ఉండాలనే స్వార్థం, ఓ మహిళ తనకు పోటీరావడాన్ని ఏమాత్రం సహించని విలన్ పాత్రలో ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపిస్తూనే కైలాశ్ శివకుమార్‌గా జగపతిబాబు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్, నరేశ్, నదియా వంటి సీనియర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక నవీన్ చంద్ర, సుమంత్ శైలేంద్ర, పూజిత పొన్నాడ తమ పరిధి మేర ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అల్టిమేట్‌గా ఛాయ్‌కు, కాఫీకు జరిగే యుద్ధంలో ఛాయ్ గెలుస్తుందని చూపించడంలో సీన్లు కొంచెం లాగ్ అయ్యాయని చెప్పవచ్చు. రొటీన్‌గా ఉన్న కథను.. ఆసక్తికరంగా మలచడంలో డైరెక్టర్ కాస్త తడబడ్డాడు. థమన్ సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఓవరాల్‌గా మంచి సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఆశించినంత మేర వినోదం అందించలేదనే అనిపిస్తుంది. ‘‘మిస్ ఇండియా’’ బ్రాండ్ ఛాయ్ ఘుమఘుమలు అనుకున్న స్థాయిలో సువాసనలు వెదజల్లలేదనే చెప్పవచ్చు! కాకపోతే ఒక్కసారి మాత్రం ‘ఛాయ్’ను కళ్లతోనే టేస్ట్ చేసి ఆనందించవచ్చు!! -
బిజినెస్ అంటే ఆడపిల్లల ఆట కాదు..
సాక్షి, హైదరాబాదు : మహానటి సినిమాతో జాతీయ అవార్డు కొట్టేసిన కీర్తి సురేష్ మరో అదిరిపోయే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కీర్తి నటించిన మిస్ ఇండియా ట్రైలర్ శనివారం రిలీజ్ అయ్యింది. చదువు, చిన్న ఉద్యోగం, కుటుంబం, వీటన్నింటికీ భిన్నంగా ఒక మధ్యతరగతి యువతి చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచనతో పెరగడం, ఇండియన్ చాయ్ బిజినెస్ ద్వారా ఉన్నతంగా ఎదిగిన తీరును ఈ ట్రైలర్ లో అద్భుతంగా చూపించారు. మిస్ ఇండియా అంటే ఒక బ్రాండ్ అంటూ మరో లేడీ ఓరియంటెడ్ పాత్రతో ఎప్పటిలాగానే కీర్తి సురేష్ నటన, బిజినెస్ అనేది ఆడపిల్లల ఆట కాదంటున్న జగపతి బాబు విలనిజం, థమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. నరేంద్ర నాథ్ దర్శకత్వంలో మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాలో నవీన్ చంద్ర,రాజేంద్ర ప్రసాద్, నదియా, కమల్ కామరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మొదటినుంచీ భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం తాజా ట్రైలర్ తో మరిన్ని అంచనాలను పెంచేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో రిలీజ్ అయిన పెంగ్విన్ సినిమాతో ప్రశంసలందుకుంది కీర్తి. అటు వరుస హిట్ లను అందిస్తున్న ఓటీటీ ప్లాట్ ఫాంలో మరో సాలిడ్ హిట్ ఖాయమంటున్నారు. -
రాజా వస్తున్నాడహో...
మమ్ముట్టి హీరోగా వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మధుర రాజా’. జై, మహిమా నంబియార్ కీలక పాత్రలు చేశారు. జగపతిబాబు ప్రతినాయకుడిగా నటించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ మలయాళ చిత్రం ‘రాజా నరసింహా’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. జై చెన్నకేశవ పిక్చర్స్ పతాకంపై సాధుశేఖర్ ఈ నెల 22న ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘రాజా నరసింహా’ ట్రైలర్ పవర్‌ఫుల్‌గా ఉంది. టైటిల్ యాప్ట్‌గా ఉంది. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి, నిర్మాతకు మంచి పేరు, లాభాలు రావాలి’’ అన్నారు. సాధు శేఖర్ మాట్లాడుతూ– ‘‘చక్కని సందేశంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. మమ్ముట్టి పవర్ఫుల్ యాక్షన్, జగపతిబాబు విలనిజం, గోపీ సుందర్ సంగీతం, సన్నీ లియోన్ ప్రత్యేక గీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మలయాళంలో వంద కోట్లు వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: నూల అశోక్, నిర్మాణ సారధ్యం: వడ్డీ రామానుజం, పురం రాధాకృష్ణ. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ జగపతి బాబు
-
మీటూపై స్పందించిన జగపతిబాబు
-
ఇంకేం కావాలి?
‘‘నేను హీరోగా చేస్తున్నప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు చూస్తున్నంత సక్సెస్‌ని అప్పుడు చూడలేదు. ఇన్ని భాషల్లోనూ, ఇంత మంది ఆర్టిస్టులతో, దర్శకులతో అప్పుడు చేయలేదు. ఇంకేం కావాలి’’ అన్నారు జగపతిబాబు. ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. యస్.రాధాకృష్ణ నిర్మాత. ఇందులో జగపతిబాబు విలన్‌గా కనిపించారు. తాను చేసిన బసిరెడ్డి పాత్రకు మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు చెప్పిన విశేషాలు. ♦ ఈ సినిమాలో నా పాత్ర సృష్టించింది త్రివిక్రమ్ అయితే నన్ను ప్రోత్సహించింది ఎన్టీఆరే. సినిమాలో నా పాత్ర బావుంటుంది అని అనుకున్నాను కానీ ఇంత బావుంటుంది అనుకోలేదు. ఒక టాప్ హీరో అయ్యుండి నన్నే పొగుడుతూ ఉన్నారు ఎన్టీఆర్. చాలా బాగా చేశారు.. ఇంకా బాగా చేయాలి అని ఎంకరేజింగ్‌గా మాట్లాడేవారు. ♦ ఈ సినిమాలో నటన కంటే డబ్బింగ్‌కే ఎక్కువ కష్టపడ్డాను. కొన్నిసార్లు డబ్బింగ్ చెబుతూ పడిపోయే పరిస్థితులు వచ్చాయి. డబ్బింగ్ క్రెడిట్ పెంచల్ దాస్‌గారు, అసోసియేట్ దర్శకుడు ఆనంద్, ఇంజనీర్ పప్పుకి ఇవ్వాలి. ♦ ఈ సినిమా కథ వినలేదు. ఒక డైరెక్టర్ని నమ్మానంటే అంతే. సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్ ఓ నలభై మందిని కొడుతుంటే, ఎప్పుడూ ఇవేనా ఇంక మారరా? అనుకున్నాను. త్రివిక్రమ్ అయినా కొత్తగా చేయొచ్చుగా అనుకున్నాను. మధ్యాహ్నానికి ఫైట్ వద్దు.. ఇంకోలా చేద్దాం అనడంతో ఆశ్చర్యపోయా. అది ఈ సినిమా బ్యూటీ. ♦ ‘గూఢచారి’లో టెర్రరిస్ట్‌గా, ‘రంగస్థలం’లో ప్రెసిడెంట్‌గా, ‘అరవింద సమేత..’లో ఫ్యాక్షనిస్ట్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు చేశాను. మూడు రకాల పాత్రలకు కారణం దర్శకులే. తర్వాత సినిమాకు ఏం చేయాలి అని ప్రతి సినిమాకు అనుకుంటూనే ఉంటాను. ♦ పాత సినిమాల్లో యస్వీ రంగారావు, నాగభూషణం పాత్రలు తమ పాత్రలను డామినేట్ చేసినా కూడా ఇష్టంగా పెట్టుకునేవారు హీరోలు. అందుకే అవి అంత పెద్ద సినిమాలు అయ్యాయి. ‘శుభలగ్నం’ సినిమాని ఆమని సినిమా అని దర్శకుడు అన్నారు. నేను కూడా క్రెడిట్ ఆమనికి వెళ్లాలని అన్నాను. ఈ సినిమాకు కూడా తారక్ ఇలానే చెప్పారు. ‘మన కంటే సినిమా పెద్దది. సినిమా పెద్దది అయితేనే హీరో ఇంకా పెద్దవాడు అవుతాడు అని అన్నాడు. ♦ సాఫ్ట్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. ఎంటర్టైన్మెంట్తో ఉన్నది అయినా, సాఫ్ట్ హస్బెండ్ పాత్రలు చేయాలని ఉంది. క్లాస్ పాత్రలను ఇష్టపడతాను. ‘గాడ్ పాధర్’ లాంటి సినిమా చేయాలనుంది. -
‘ఆటగాళ్లు’
-
‘గ్యాంగ్ స్టార్స్’లో జగ్గుభాయ్
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ నటుడు జగపతిబాబు డిజిటల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లో వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే రానా లాంటి ఫాంలో ఉన్న యంగ్ హీరోలు కూడా వెబ్ సిరీస్‌లలో నటించేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా జగపతిబాబు కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. డార్క్ కామెడీగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టార్స్ వెబ్ సిరీస్‌లో జగపతిబాబు గూండా కృష్ణదాస్ పాత్రలో కనిపించనున్నారు. నందిని రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో ‘దడ’ ఫేం అజయ్ భుయాన్ ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. శ్వేత బసు ప్రసాద్, నవదీప్, పోసాని కృష్ణ మురళి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్‌ను 12 ఎపిసోడ్లుగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. జూన్ 1న తొలి ఎపిసోడ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది. -
వెబ్ సిరీస్‌లలో యంగ్ హీరోలు
-
వెబ్ సిరీస్‌లో మరో యంగ్ హీరో
ప్రవీణ్‌సత్తారు డైరెక్షన్లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన సీనియర్ నరేశ్, సిద్ధు జొన్నలగడ్డల నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందినిరెడ్డి అందించిన కథతో ‘దడ’ డైరెక్టర్ అజయ్ భుయాన్ ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ కథను ముందుగా పూర్తి స్థాయి సినిమాగా తీయాలనుకున్నా...నిడివి ఎక్కువ అవుతుందని వెబ్ సిరీస్ ఆలోచన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాలో సిద్ధు సెలబ్రెటీలకు మేనేజర్‌గా పనిచేస్తూ ఉంటాడనీ, సిరీస్ మొత్తం సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందనీ, పూర్తిగా వినోదాత్మకంగా ఉంటుందని సమాచారం. ఈ వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రల్లో జగపతిబాబు, పోసాని కృష్ణమురళి, హరితేజ (బిగ్‌బాస్ ఫేం) నటిస్తున్నారు. ఈ వెబ్‌సిరీస్‌తో దర్శకుడిగా సక్సెస్ సాధిస్తానని అజయ్ భుయాన్ నమ్మకంగా ఉన్నాడు. -
‘ఆటగాళ్లు’ మొదలు పెట్టారు..!
విలన్ గా మారిన తరువాత వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సీనియర్ స్టార్ జగపతి బాబు, త్వరలో ఓ మల్టీ స్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో నారా రోహిత్ తో కలిసి ఆటగాళ్లు అనే మల్టీ స్టారర్ సినిమాలో నటిస్తున్నాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మాస్ యాక్షన్ జానర్ లో రూపొందుతోంది. ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం మొదలైంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావటంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల అంచనాలను అందుకునే స్థాయిలో సినిమా తెరకెక్కుతుందంటున్నారు చిత్రయూనిట్. -
ఆటగాళ్లుగా.. రోహిత్, జగ్గుభాయ్
ఇప్పటికే పలువురు యంగ్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాల్లో నటించిన నారా రోహిత్, ఇప్పుడు ఓ సీనియర్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. విభిన్న పాత్రలతో అలరిస్తున్న స్టార్ జగపతిబాబుతో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇటీవల కమర్షియల్ సినిమాల మీద దృష్టి పెట్టిన రోహిత్ మరోసారి మాస్ యాక్షన్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు (బుధవారం) ప్రారంభమైంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆటగాళ్లు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నారా రోహిత్, జగపతి బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తున్న ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
రోహిత్ హీరోగా మరో యాక్షన్ మూవీ
బాణం సినిమాత సాఫ్ట్ ఇమేజ్ తో హీరోగా పరిచయం అయిన నారా రోహిత్, ప్రయోగాత్మక చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న రోహిత్ ప్రస్తుతం మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న బాలకృష్ణుడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ హీరోగా దర్శనమివ్వనున్నాడు రోహిత్. ఈ సినిమా తరువాత కూడా మరోసారి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించేందుకు అంగీకరించాడు. పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాకు అంగీకరించాడు. సీనియర్ స్టార్ జగపతిబాబుతో కలిసి రోహిత్ నటించనున్న ఈ సినిమా బుధవారం ప్రారంభం కానుంది. ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. -
పులి వేటాడినట్టే!
పటేల్ ఓ పది మందిని కొడితే... అచ్చం అడవిలో జింకలను పులి వేటాడినట్టే ఉంటుంది. ఏదో క్రూరమృగం దాడి చేసినట్టు పదిమంది శవాలు చెల్లాచెదురుగా పడతాయి. అటువంటి పటేల్ ఓ చిన్నారి పిలిచేసరికి చిన్న పిల్లాడిలా మారతాడు. చిన్నారితో ఆటలు ఆడతాడు, ప్రేమను పంచుతాడు. ఇతడి కథను ఈ నెల్లోనే చూపిస్తామంటున్నారు దర్శకుడు వాసు పరిమి. ఆయన దర్శకత్వంలో జగపతిబాబు హీరోగా నటించిన సినిమా ‘పటేల్ సార్’.వారాహి చలనచిత్రం అధినేత సాయి కొర్రపాటి నిర్మాణ సార«థ్యంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ స్టైలిష్ రివెంజ్ డ్రామాలో జగపతిబాబు ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేశారు. సాయి కొర్రపాటి మాట్లాడుతూ – ‘‘హాలీవుడ్ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో జగపతిబాబు లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలుస్తాయి. వాసు పరిమి టేకింగ్ సూపర్. సినిమా ప్రారంభోత్సవం రోజున విడుదల చేసిన కాన్సెప్ట్ టీజర్‌ను యూట్యూబ్‌లో 27 లక్షల మంది చూశారంటే సినిమాపై ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. పద్మప్రియ, తాన్యా హోప్, ‘బేబీ’ డాలీ, సుబ్బరాజు, పోసాని, రఘుబాబు, ‘శుభలేఖ’ సుధాకర్, కబీర్ సింగ్, పృథ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వసంత్. -
అంతా డిఫరెంట్..!
సుకుమార్ సినిమాలు ఎంత ఢిపరెంట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా కాన్సెప్ట్, హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రస్తుతం రామ్‌చరణ్ హీరోగా ఆయన తెరకెక్కించనున్న సినిమా ఫుల్ డిఫరెంట్‌గా ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 20న మొదలు కానుంది. ఆ తర్వాత రెండు రోజులకు సమంత జాయిన్ అవుతారని సోమవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో సమంతను కథానాయికగా ఎంపిక చేశారు. కానీ, ఆమె చేయడంలేదనే వార్త రెండు రోజులుగా హల్చల్ చేస్తోంది. ‘అదేం లేదు’ అని ఈ ప్రకటన నిర్ధారణ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్‌పై ఈ చిత్రాన్ని ఎర్నెని నవీన్, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ఇది. ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరుస్తున్నారు. పల్లెటూరి వ్యక్తిలా చరణ్ పంచె కట్టుకుని, కావడి కుండలు మోసుకెళుతున్న లుక్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే.‘‘ఈ ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. ఈ ఏడాది జూలై నాటికి షూటింగ్ పూర్తయ్యేలా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా, తమిళనాడులో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది’’ అని నిర్మాతలు చెప్పారు. -
కృష్ణమ్మతో రాజుగారి పాట!
మహారాజు తలచుకుంటే ఏ పనైనా క్షణాల్లో జరుగుతుంది. కానీ, రాజుగారి తలపులకు కృష్ణమ్మ దగ్గర తలుపులు మూసుకున్నాయి. కోరుకున్నది జరగని తరుణంలో రాజులకు కోపం రావడం సహజమే. మరి, ఈ రాజు ఏం చేశారో? ఫిబ్రవరి 10న రిలీజవుతోన్న ‘ఓం నమో వేంకటేశాయ’ చూసి తెలుసుకోవాలి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ భక్తిరస ప్రధాన చిత్రంలో వెంకన్న భక్తుడు హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్కలు నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కృష్ణమ్మపై మనసుపడిన మహారాజు పాత్రలో జగపతిబాబు నటిస్తున్నారు. ‘‘జగపతిబాబుది కాస్త ప్రతినాయక ఛాయలున్న పాత్ర. మహారాజుగా ఆయన ఆహార్యం అద్భుతంగా ఉంటుంది. జగపతిబాబు, అనుష్కలపై దర్శకులు రాఘవేంద్రరావు ఓ పాటను కూడా చిత్రీకరించారు’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సౌరభ్ జైన్, విమలా రామన్, ప్రజ్ఞా జైస్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జె.కె. భారవి, సంగీత దర్శకుడు: యం.యం. కీరవాణి. -
ఇప్పుడిక... స్ట్రయిట్ గా తెలుగులో!
తెలుగు కుర్రాడు విశాల్ తమిళంలో తిరుగు లేని మాస్ హీరోగా దూసుకెళుతున్నారు. తమిళంలో ఆయన చేస్తున్న చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై, ఇక్కడ విడుదలవుతుంటాయ్. పందెంకోడి, పొగరు, వాడు-వీడు, జయసూర్య, లేటెస్ట్గా ‘రాయుడు’.. వంటి చిత్రాల ద్వారా విశాల్ ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పట్నుంచో తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలనుకుంటున్న విశాల్ ఈ ఏడాది ఆ కోరిక నెరవేర్చుకోనున్నారు. ఇటీవల విడుదలైన తమిళ చిత్రం ‘మరుదు’ని తెలుగులో ‘రాయుడు’గా విడుదల చేసిన హరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సురాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా ఖరారయ్యారు. ఇందులో విశాల్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనున్నారు. జూన్ 9న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. నిర్మాత మాట్లాడుతూ- ‘‘విశాల్-తమన్నా జంట ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. జగపతిబాబు మెయిన్ విలన్ కాగా, మరో విలన్‌గా తరుణ్ అరోరా నటిస్తారు. జూన్ నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సినిమాటోగ్రఫీ: రిచర్డ్స్, సహ నిర్మాతలు: ఎం.పురుషోత్తం, ఎ.కె ప్రకాశ్. -
రాక్షసుణ్ణి నిద్రలేపాను!
‘‘ఈ సినిమాకు ముందు సి. కల్యాణ్‌గారు నన్ను కలిసి ‘నువ్వు చేయాల్సిన సినిమాలివి కావు’ అంటూ రెండు గంటలు క్లాస్ పీకారు. నా నుంచి డ్రామా, యాక్షన్ చిత్రాలను ప్రేక్షకులు ఆశిస్తున్నారన్నారు. చిరంజీవిగారి ‘కొట్టండి, తిట్టండి..’ అనే ఓ పాటను బేస్ చేసుకుని ఈ సినిమాలో ఓ పాట రాయించాను. అయితే ఈ పాట వేరే స్టయిల్లో ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే నాకున్న యాటిట్యూడ్‌తో అందరిలోని రాక్షసుణ్ణి నిద్రలేపా’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మంచు మనోజ్, సురభి, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాశ్‌రాజ్ ప్రధానపాత్రల్లో శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్ పతాకంపై రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వరుణ్, తేజ, శ్వేతలానా, సి.వి. రావు నిర్మించిన చిత్రం ‘ఎటాక్’. రవిశంకర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను మంగళవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘ఏప్రిల్ 1న సినిమాను రిలీజ్ చేస్తున్నాం. రామాయణం, మహాభారత కథలను గుర్తుకు తెచ్చేలా సాగే చిత్రమిది’’ అని పేర్కొన్నారు. ‘‘ఫిల్మ్ మేకింగ్‌లో రామ్‌గోపాల్‌వర్మ ఓ యూనివర్సిటీ లాంటి వ్యక్తి. కల్యాణ్‌గారి బ్యానర్లో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని మంచు మనోజ్ తెలిపారు. ఈ వేడుకలో కథానాయికలు సురభి, పూనమ్ కౌర్, లైన్ నిర్మాత ప్రసాద్ గుమ్ములూరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సహ నిర్మాత మలినేని లక్ష్మయ్య చౌదరి, గాయకుడు ‘గజల్’ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆట ఒకటే... దొంగలే వేరు!
ఆ సీన్ - ఈ సీన్ ఏ విషయంలోనైనా అనుసరణ ఉండాలి తప్ప అనుకరణ ఉండకూడదు అంటారు. కానీ ఈ విషయాన్ని సినిమావాళ్లు పట్టించుకోరేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ముఖ్యంగా దొంగాట లాంటి సినిమాలు చూసినప్పుడు ఆ అభిప్రాయం మరింత బలపడుతుంది! జగపతిబాబు, సౌందర్యలతో కోడి రామ కృష్ణ తీసిన ‘దొంగాట’ చిత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. గిలిగింతలు పెట్టే కామెడీ, కంటతడి పెట్టించే సెంటి మెంట్, మనసును తడిమే సన్నివేశాలు, చక్కని సంభాషణలు... అన్నీ కలిసి ‘దొంగాట’లో దర్శకుడిని విజేతగా నిలి పాయి. అయితే నిజానికి... ఈ ఆటను హాలీవుడ్‌వాళ్లు అంతకు ముందే ఆడేశారు. కేట్ కెనడాలో హిస్టరీ టీచర్. ప్రియుడు చార్లీని పెళ్లాడటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే చార్లీకి బిజినెస్ పనిమీద ప్యారిస్ వెళ్లాల్సి వస్తుంది. ఆమెనూ రమ్మంటాడు కానీ, విమాన ప్రయాణమంటే ఉన్న భయం వల్ల రానంటుంది. అతను వెళ్లిపోతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేసి, ప్యారిస్‌లో పరిచయమైన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డానని చెప్తాడు. షాక్ తిన్న కేట్ ప్యారిస్ బయలుదేరుతుంది. ఫ్లయిట్ ఎక్కాక భయంతో వణికిపోతుంటే, పక్క సీట్లో కూర్చున్న ల్యూక్ మాటల్లో పెట్టి, భయం లేకుండా చేస్తాడు. అతడో దొంగ. తను కొట్టేసి తీసుకెళ్తోన్న డైమండ్ నెక్లెస్‌ని, కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటారన్న భయంతో కేట్ లగేజీలో కలిపేస్తాడు. తర్వాత దాని కోసం ఆమెనే అనుసరిస్తాడు. ఆ క్రమంలో కేట్కు అండగా మారతాడు. అతని సాయంతో చార్లీని కలుసుకుంటుంది కేట్. కానీ చార్లీ ఎంత చెడ్డవాడో తెలుసుకుని, అతణ్ని తనతో తీసుకెళ్లాలన్న ఆలోచనను విరమించుకుంటుంది. తగిన బుద్ధి చెప్పి తిరిగి ప్రయాణమవుతుంది. వెళ్లేముందు ల్యూక్ని పట్టుకోవడానికి తిరుగుతోన్న పోలీసాఫీసరుకి తన దగ్గరున్న నెక్లెస్‌ని ఇచ్చేసి, అతణ్ని వదిలేయమంటుంది. వైన్యార్డ్ పెట్టి సెటిలవ్వడానికే ల్యూక్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుని, తను దాచుకున్న డబ్బు మొత్తం అతనికి చెందేలా చేసి బయలుదేరుతుంది. అది పోలీసు ద్వారా తెలుసుకున్న ల్యూక్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి, తన ప్రేమను కేట్కి తెలపడంతో కథ ముగుస్తుంది. ఇది 1995లో విడుదలైన ‘ఫ్రెంచ్ కిస్’ చిత్ర కథ. అచ్చం ‘దొంగాట’ కథలాగే ఉంది కదూ! కథే కాదు... కథనం, సన్ని వేశాలు అన్నీ అచ్చు గుద్దినట్టే ఉంటాయి. నటీనటులు, ప్రదేశాలే మారతాయి. హాలీవుడ్లో హీరోయిన్ మెగ్ ర్యాన్ కెనడా నుంచి ఫ్రాన్స్‌కు వెళ్తుంది. టాలీవుడ్లో సౌందర్య ఓ పల్లెటూరి నుంచి సిటీకి వస్తుంది. మెగ్ ఫ్లయిట్ ఎక్కితే, సౌందర్య రెలైక్కుతుంది. ఆమెకు విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు భయం. ఈమెకు రైలు బ్రిడ్జిమీద వెళ్లేటప్పుడు భయం. ఇలా మన నేటివిటీకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప, మిగతాదంతా సేమ్ టు సేమ్. సినిమా మొత్తం హీరో, హీరోయిన్, ఆమె ప్రియుడు, అతడు ప్రేమించిన అమ్మాయి, పోలీసాఫీసర్... ఈ ఐదు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే తెలుగులో కొందరు కమెడియన్లను యాడ్ చేశారు. మనకు పాటలూ ముఖ్యం కాబట్టి వాటినీ చేర్చారు. ఇంకే తేడా ఉండదు. ‘దొంగాట’ విడుదలైన తర్వాతి ఏడు హిందీలో కూడా ‘ఫ్రెంచ్ కిస్’ని తీశారు... ‘ప్యార్తో హోనా హీ థా’ పేరుతో. అజయ్ దేవగన్, కాజోల్ జంటగా నటించారు. అది కూడా మక్కీకి మక్కీనే. కాకపోతే అక్కడా హిట్టయ్యింది. ఈ మూడు సినిమాల్లో ఒక్కటి చూసినా మరొకటి చూడక్కర్లేదు. ఎంత కాపీ కొట్టినా మరీ ఇలా జిరాక్స్ కాపీల్లాగా కనిపించే సినిమా మరోటి ఉండదేమో. వేరే భాషలో సక్సెస్ సాధించిన చిత్రం నుంచి స్ఫూర్తి పొంది, మనవాళ్లకూ ఆ సినిమాను అందించాలను కోవడంలో తప్పు లేదు. కాకపోతే కథ మనది కానప్పుడు కనీసం రచయితలు తమ పేరు వేసుకోకుండా ఉంటే బాగుంటుంది. ఆ విషయాన్ని విస్మరించి క్రెడిట్ తీసుకోవడం మాత్రం అన్యాయమే! కొసమెరుపు: సినిమాయే కాపీ అంటే, ‘దొంగాట’లో ఓ పాట కూడా కాపీయే. ‘ఓ చిలకా... రా చిలకా’ అన్న పాట, చాలా యేళ్ల క్రితం వచ్చిన ‘రామ్ తేరీ గంగా మైలీ’ చిత్రంలో ‘సున్ సాహిబా సున్’ అన్న హిట్ పాటకు కాపీ. ఈ చిత్రాలకు ప్రాణం హీరోయిన్ల పర్ఫార్మెన్సే అని చెప్పాలి. ‘ఫ్రెంచ్ కిస్’లో మెగ్ ర్యాన్ నటన శిఖరాగ్ర స్థాయిలో ఉంటుంది. తెలుగులో సౌందర్య కూడా అమాయకమైన అమ్మాయిగా అదరగొట్టింది. హిందీలో కాజోల్ కూడా కంటతడి పెట్టించింది. ఈ కథకు నూరు శాతం న్యాయం జరిగింది, లాభాల పంట పండింది అంటే... అందుకు ముఖ్య కారణం ఈ నటీమణుల అద్భుత నటనే.