Jailed
-
ఆన్లైన్లో ఆక్యుపంక్చర్ నేర్చుకుని ఏకంగా ఓ వ్యక్తికి చికిత్స చేసింది..కట్ చేస్తే..!
ఇటీవల చాలామంది ఎలాంటి నైపుణ్యాలు లేదా స్కిల్స్ నేర్చుకోవడానికి ఆన్లైన్ లెర్నింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని రకాల కోర్సులు, స్కిల్స్‌కే వర్కౌట్ అవుతుంది. వైద్య విద్యలాంటి కోర్సులకు అస్సలు పనికిరాదు. ఇది ఓ రోగి జీవితంతో ముడిపడి ఉంటుంది. ఏదైనా తేడా కొడితే అసలుకే మోసం వస్తుంది. చివరికి కటకటాలపాలవ్వుతాం. ఆన్లైన్ లెర్నింగ్‌లో వైద్య విధానం గురించి జస్ట్ అవగాహన తెచ్చుకోగలమే గానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందడం అసాధ్యం. కానీ ఇక్కడొక మహిళ అలాంటి సాహసానికి ఓడిగట్టి ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. చివరికి జైటుపాలయ్యింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..వివరాల్లోకెళ్తే..ఆగ్నేయ చైనాలోని వాంగ్ అనే మహిళ ఆన్లైన్ వీడియోల ద్వారా ఆక్యుపంక్చర్ మొత్తం నేర్చుకుంది. ఈ నైపుణ్యంతో తాను నివశించే గ్రామంలోని ప్రజలకు చికిత్స చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఎలాంటి తేడా కొట్టలేదు కాబట్టి డాక్టర్ లైసెన్స్ లేకుండానే ధర్జాగా చేసేసింది. అయితే గతేడాది లీ అనే వ్యక్తి అనారోగ్యంతో ఆ మహిళ వద్దకు వచ్చాడు. చికిత్స కోసం రూ. 5 వేలు చెల్లించాడుకూడా. ఆమె అతడికి చికిత్స అందించడమే గాక చివరి సెషన్లో భాగంగా చేసిన చికిత్స టైంలో లీ అసౌకర్యానికి గురయ్యాడు. కాసేపటి తర్వాత ఆమె అతడిని ఎంత తట్టి లేపిన లేవకపోవడంతో అతడిని హుటుహుటినా ఆస్పత్రికి తరలించింది. ఆ క్రమంలోనే పరిస్థితి విషమించిన చనిపోవడం జరిగింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరపర్చారు. అప్పుడే అసలు విషయం బయటపడింది. వాంగ్‌కు అధికారిక ఆక్యుపంక్చర్ శిక్షణ లేదని పరిశోధనలో వెల్లడయ్యింది. ఆమె ఆన్లైన్ వీడియోలతో నేర్చుకుని తనపై, తన భర్తపై సాధన చేసిందే తప్ప క్లినికల్ అనుభవం లేదని తేలింది. ఇక్కడ బాధితుడు లీకి తీవ్రమైన కరోనరీ హార్ట్ డిసీజ్ ఉంది. అలాంటి వాళ్లకు ఆంక్యుపక్చర్ అనేది ప్రత్యేక నిపుణులు పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి క్లినికల్ శిక్షణలేని వాంగ్ అతడికి తనకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానంతో చేయడంతో వికటించి అతని మరణించాడని కోర్టు పేర్కొంటూ ఆ మహిళకు 18 నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. (చదవండి: ఓ సంపన్న కుటుంబం దాష్టికం..ఏకంగా 26 ఏళ్ల పాటు..!) -
రషీద్ ప్రమాణ స్వీకారానికి ఎన్ఐఏ ఓకే
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న కశ్మీరీ నాయకుడు, ఎంపీగా ఎన్నికైన షేక్ అబ్దుల్ రషీద్ (ఇంజనీర్ రషీద్) ప్రమాణ స్వీకారం చేయడానికి మార్గం సుగమమైంది. జూలై 5న రషీద్ ఎంపీగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం నిమిత్తం రషీద్‌కు ఒకరోజు బెయిల్ ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం ప్రత్యేక కోర్టుకు తెలిపింది. మీడియాతో మాట్లాడకూడదని, ప్రమాణ స్వీకార ప్రక్రియను ఒక రోజులో పూర్తి చేయాలని ఎన్ఐఏ షరతులు విధించింది. ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం చేశారనే కేసులో కఠినమైన చట్ట వ్యతిరేక కార్యాకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద 2019 ఆగస్టులో అరెస్టయిన రషీద్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్లోని బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఒమర్ అబ్దుల్లా (ఎన్సీ)పై నెగ్గారు. -
కడుపుతో ఉన్నానంటూ ఓ మహిళ..ఏకంగా రూ. 98 లక్షలు..!
కొందరూ ప్రభుత్వం ఇచ్చే పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఎంతలా కక్కుర్తిపడుతుంటారో తెలిసిందే. అందుకోసం ఎంతకైనా తెగిస్తారు. ఎలాంటి పనులైన చేస్తారు. కానీ మరీ ఇలా గర్భాల పేరుతో లక్షల్లో డబ్బు కొట్టేయడం చూసి ఉండరు. పోనీ ఒకటో రెండో ప్రశూతి ప్రయోజనాలు కాదు. ఏకంగా ఎన్నిసార్లు ఇలా బూటకపు గర్భాల గురించి అబద్ధాలు చెప్పిందో వింటే కంగుతింటారు. అలాగే ప్రశూతి ప్రయోజనాలకు సంబంధించిన డబ్బు ఎంత మేర కొట్టేసిందో విన్నా వామ్మో! అంటారు. ఏం జరిగిందంటే.. ఇటలీలోని రోమ్‌కి చెందిన 50 ఏళ్ల బార్బరా నకిలీ గర్భాల పేరుతో దాదాపు రూ. 98 లక్షల దాక ప్రసూతి ప్రయోజనాలను కొట్టేసింది. నిజానికి ఆమె గర్భం దాల్చిన సమయంలో కలిగిన పిల్లల గురించి ఏ ఆస్పత్రిలో నమోదు కాలేదు, అధికారులెవ్వరూ కూడా ఆమె పిల్లలను చూడలేదు కూడా. ఆమె రోమ్‌లో ఉన్న క్లినిక్ నుంచి పిల్లల జనన ధృవీకరణ పత్రాను దొంగలించి అచ్చం అదే మాదిరిగా తన పేరుతో సర్టిఫికేట్లను సృష్టించి ప్రభుత్వ ప్రయోజనాలు పొందేది. ఇలా 24 ఏళ్ల కాలంలో 12 గర్భస్రావాలు జరిగినట్లు, ఐదు మంది పిల్లలు కలిగినట్లు పేర్కొంది. మొత్తంగా 17 బూటకపు గర్భాలతో అధికారులను మోసం చేసింది. అంతేగాక తాజాగా ఇటీవల గత డిసెంబర్లో తాను మరో బిడ్డను ప్రసవించినట్లు పేర్కొంది. దీంతో అనుమానం వచ్చి ఆ 50 ఏళ్ల మహిళ గురించి గత తొమ్మిది నెలలుగా గట్టి నిఘా పెట్టారు. ఆ విచారణలో ఆమె గర్భం అంతా ఓ బూటకమని తేలింది. బేబీ బంప్‌లా కనిపించేందుకు దిండ్లను ఉపయోగించనట్లు వెల్లడయ్యింది. పైగా పుట్టబోయే బిడ్డను మోస్తున్నట్లుగా చాలా బరువు మోస్తున్నట్లు ఫోజులిచ్చేదని అధికారుల చెబుతున్నారు. ఆఖరికి ఆమె భర్త డేవిడ్ పిజ్జినాటోని కూడా ఈ విషయమై ప్రశ్నించగా..తన భార్య గర్భవతి కాదని విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసుల సదరు మహిళ లోయెల్, ఆమె భర్తపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నిందితులిద్దరు ఇటాలియన్ హెల్త్ అసిస్టెన్స్‌నే మోసం చేశారంటూ మండిపడింది. ప్రజా సంస్థను మోసం చేయడమే గాదు దానికి హాని తలపెట్టారని చివాట్లు పెట్టింది. ప్రజా ప్రయోజనంలో భాగంగా సదరు రాష్ట్రం మహిళలకు అందించే ప్రశూతి ప్రయోజనాలను దుర్వినియో పరిచారని ఫైర్ అయ్యింది. అలాగే తనకు ఐదుగురు పిల్లలు ఉన్నారని పలుసార్లు గర్భస్రావాలు జరిగినట్లు తప్పుడు పత్రాల సమర్పించడమే గాక దాన్నే కొనసాగించే య్నతం చేయడం మరింత నేరం అని స్పష్టం చేసింది. అందుకుగానూ లోయెల్‌కి ఒక ఏడాది ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. అలాగే ఈ నేరంలో సహకరించిన ఆమె భర్తకు కూడా శిక్ష విధించింది. (చదవండి: 'నారీ శక్తి'..'నారీ శక్తి' అంటారుగా!.. చేతల్లో చూపండి!) -
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
అమ్మతనానికి మాయని మచ్చ.. సహజీవనం చేస్తున్న వ్యక్తితో కూతురిపై
తిరువనంతపురం: అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఉండదు. త్యాగానికి ప్రతిరూపం అమ్మ. పిల్లలపై కన్నతల్లికి ఉన్న ప్రేమ, మమకారం వర్ణించలేనిది. అలాంటి పేగు బంధానికి మాయని మచ్చ తెచ్చింది ఓ మాతృమూర్తి. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించింది కసాయి తల్లి. సభ్యసమాజం సిగ్గుపడే ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. కన్నతల్లి బంధానికే అర్ధాన్ని మార్చివేస్తూ మహిళ చేసిన నిర్వాకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోక్సో కేసులో సదరు తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన ఓ మహిళ తన భర్తను వదిలేసి ప్రియుడు శిశుపాలన్‌తో సహజీవనం చేస్తుంది. ఆ సమయంలో మహిళ ఏడేళ్ల కూతురు తన వద్దే ఉంటుంది. ఈ క్రమంలో బాలికనుని శిశుపాలన్ అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్నిసార్లు స్వయంగా తల్లే తన కూతురిని అతని వద్దకు తీసుకెళ్లి ఈ దారుణానికి ప్రోత్సహించింది. 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య కాలంలో ఈలైంగిక దాడి జరిగింది. అయితే బాధితురాలి పదకొండేళ్ల సోదరి ఇంటికి వచ్చినప్పుడు.. తనపై జరుగుతున్న వేధింపుల విషయాన్ని ఆమెకు వివరించింది. అంతేగాక పెద్ద అమ్మాయిని కూడా శిశుపాలను వేధింపులకు గురిచేశాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ క్రమంలో 11 ఏళ్ల అక్క చిన్నారితో కలిసి ఇంట్లో నుంచి తప్పించుకొని వాళ్ల అమ్మమ్మ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని వారితో చెప్పుకుంది. ఆమె పోలీసులను ఆశ్రయించగా.. నిందితులపై కేసు నమోదు చేసి తల్లితోపాటు సహజీవన భాగస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ సమయంలో నిందితుడు శిశుపాలన్ ఆత్మహత్య చేసుకోగా.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తితో సొంత కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లికి 40 ఏళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు. ఆమెకు ఆరునెలల కఠిన కారాగార శిక్ష కూడా విధించారు. తిరువనంతపురం ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఆ మహిళకు రూ. 20 వేలు జరిమానా కూడా విధించారు. ప్రస్తుతం పిల్లలు బాలల సంరక్షణ గృహంలో నివసిస్తున్నారు. చదవండి: కోటాలో 20 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 28వ ఘటన -
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్‌లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్‌లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
చిన్నారి హత్య కేసు నిందితుడికి 100 ఏళ్ల జైలు శిక్ష
ఒక వ్యక్తి అనుకోకుండా చేసిన హత్యకు భారీ మూల్య చెల్లించుకున్నాడు. క్షణికావేశలోనూ లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కూడా కాదు. ఒక వ్యక్తితో జరిగిన వివాదంలో కోపంలో తన వద్ద ఉన్న హ్యండ్ గన్‌తో అవతలి వ్యక్తిపై ఎక్కుపెట్టాడు. అంతే అనుకోకుండా గన్ నుంచి బుల్లెట్ విడుదలైంది. అవతలి వ్యక్తి ఆ తూటా నుంచి తప్పించుకున్నాడు గానీ సమీపంలోని గదిలో ఆడుకుంటున్న చిన్నారి తలలో దూసుకుపోయింది. అభం శుభం తెలియని ఒక నిండు ప్రాణం ఆ తూటాకి బలైంది. దీంతో కోర్టు ఆ వ్యక్తి ఏకంగా వందేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే...ష్రేవ్పోర్ట్కు చెందిన జోసెఫ్ లీ స్మిత్ అనే వ్యక్తి సూపర్ 8 లగర్జీ హోట్లోని పార్కింగ్ వద్ద ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కోపంతో ఊగిపోయిన స్మిత్ ఆవ్యక్తిపైకి ఎంఎం హ్యాండ్‌గన్‌ని ఎక్కుపెట్టారు. దీంతో విడుదలై బుల్లెట్ నుంచి సదరు వ్యక్తికి తప్పించుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు ఆ హోటల్ గదిలో ఆడుకుంటున్న భారత సంతతికి చెందిన ఐదేళ్ల చిన్నారి మయాపటేల్ తలలోకి దూసుకుపోయింది. దీంతో మయా పటేల్ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఆ చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా..అక్కడ మూడు రోజులు పాటు మృత్యువుతో పోరాడి మార్చి 23, 2021న చనిపోయింది. దీంతో స్మిత్‌ని అదుపులోకి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ హోటల్ని విమల, స్నేహల్ పటేల్ యజామాన్యంలో ఉంది, వారే ఆ హోటల్ని నిర్వహిస్తున్నారు. వారు ఆ హోటల్ గ్రౌండ్ ఫ్లోర్లో తమ కూతరు మాయా పటేల్, ఆమె చిన్న చెల్లెలుతో కలిసి ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో ఆ కుటుంబం ఒక బిడ్డను పోగోట్టుకోవలసి వచ్చింది. ఈ క్రమంలో కోర్టు సదరు వ్యక్తికి ఎలాంటి పెరోల్ లేదా శిక్ష తగ్గింపుకు అవకాశం లేకుండా 60 ఏళ్లు కఠిన కారాగారా శిక్ష విధించింది. అలాగే బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినందుకు గానూ 20 ఏళ్లు, అలాగే ఈ దారుణమైన ఘటనకు బాధ్యుడిగా మరో 20 ఏళ్ల కలిపి మొత్తం వందేళ్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని కాడో పారిష్ జిల్లా అటార్నీ కార్యాలయం స్పష్టం చేసింది. అయితే సదరు నిందితుడు స్మిత్‌కి గతంలో కూడా కొంత నేర చరిత్ర ఉందని, దాన్ని పునరావృతం చేశాడే గానీ ప్రవర్తన మార్చుకోనందున ఈ శిక్ష విధించినట్లు సమాచారం. (చదవండి: క్లాస్‌మేట్‌ను 114 సార్లు పొడిచాడు) -
కోర్టు తీర్పు.. మైడెన్ ఫార్మా ఫౌండర్ జైలుకి!
చాలా సంవత్సరాల క్రితం వియత్నాంకు నాసిరకం మందులను ఎగుమతి చేయడం వల్ల గాంబియాలో ఎంతో మంది పిల్లలు మరణించారు. పిల్లల మరణాలకు దగ్గు సిరప్లు కారణమని కొన్ని నెలల తర్వాత ఇద్దరు ఫార్మాస్యూటికల్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించినట్లు ఇటీవల వెల్లడైంది. 2022 అక్టోబర్‌లో మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారీ ప్రమాణాలను ఉల్లంఘించి తయారైన నాలుగు దగ్గు సిరప్లు ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆ తరువాత ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్ర ప్రభుత్వంతో చెప్పి ఉత్పత్తిని నిలిపివేసింది. (ఇదీ చదవండి: భారతదేశ భవిష్యత్తుని మార్చేది ఇలాంటివారే: ఆనంద్ మహీంద్రా) పిల్లల మరణాలకు గాంబియాలో తమ ఔషధాలే కారణం అనటాన్ని కంపెనీ కండించింది. అంతే కాకుండా గవర్నమెంట్స్ నిర్వహించిన టెస్ట్‌లో కూడా అందులో విషపదార్థాలు లేదని తేలింది. అయినప్పటికీ కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. హర్యానా సోనిపట్‌లోని కోర్టు ప్రాసిక్యూషన్ ఆరోపణను సముచితంగా రుజువు చేశారని హార్ట్‌బర్న్ ఔషధాన్ని వియత్నాంకు ఎగుమతి చేసినందుకు కంపెనీ వ్యవస్థాపకుడు నరేష్ కుమార్ గోయెల్, టెక్నికల్ డైరెక్టర్ ఎంకే శర్మలకు జైలు శిక్ష విధించింది. అయితే పై కోర్టులో అప్పీలు చేసుకోవడానికి కోర్టు 2023 మార్చి 23 వరకు గడువు ఇచ్చింది. రెనిటిడిన్ టాబ్లెట్స్ బిపి (మాంటెక్-150) మెడిసిన్ వియత్నాంకు ఎగుమతి చేసినందుకు ఇద్దరికి ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధించారు.అయితే గోయెల్ కాల్లకు సమాధానం ఇవ్వలేదు. అయితే ఎంకే శర్మ సంప్రదింపు వివరాలను అందించడానికి నిరాకరించినట్లు తెలిసింది. -
భార్య హత్య కేసులో జైలుకెళ్లిన భర్త.. ఆరేళ్ల తర్వాత షాక్..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ మథురలో షాకింగ్ ఘటన జరిగింది. భర్త చేతిలో హత్యకు గురైన భార్య ఆరేళ్ల తర్వాత తిరిగి ప్రత్యక్షమైంది. మరొకరితో కలిసి హాయిగా జీవిస్తున్న ఆమెను చూసి భర్త షాక్ అయ్యాడు. ఆమె హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇతడు ఇప్పటికే 18 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ఏం జరిగిందంటే? ఆర్తి దేవి, సోను సైని 2015లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. బృందావన్‌లో ఓ అద్దె ఇంట్లో నివాసముండే వారు. అయితే ఆర్తి కొద్ది రోజుల తర్వాత అదృశ్యమైంది. ఆ తర్వాత గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది. అది తన కూతురిదే అని ఆర్తి తండ్రి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఆర్తి భర్త సోను, అతని స్నేహితుడు గోపాల్‌పై హత్యానేరం కింద అభియోగాలు మోపారు. 2016లో ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో సోను 18 నెలలు, గోపాల్ 9 నెలలు జైలు శిక్ష అనుభవించారు. హత్యను త్వరగా ఛేదించినందుకు పోలీసులకు రూ.15వేల నజరానా కూడా ఇచ్చింది ప్రభుత్వం. అయితే సోను, గోపాల్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇద్దరూ జైలు నుంచి విడుదల అయ్యారు. తన భార్య చనిపోలేదని భావించిన సోను ఆమె కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆరేళ్ల తర్వాత ఆమెను మరొకరితో చూశాడు. వెంటనే మథుర పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన వారు.. ఆ మహిళను ఆదివారం అరెస్టు చేశారు. చదవండి: త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు.. -
కూతురిపై లైంగికదాడి కేసులో తల్లిదండ్రులకు జీవిత ఖైదు
చిత్తూరు అర్బన్/దేవీపట్నం(అల్లూరి సీతారామరాజు జిల్లా): కన్న కూతురిపైనే లైంగికదాడికి పాల్పడిన తండ్రికి, అతనికి సహకరించిన తల్లికి బతికి ఉన్నంతవరకు జైలు శిక్ష(జీవిత ఖైదు) విధిస్తూ చిత్తూరులోని ప్రత్యేక మహిళా న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి కథనం మేరకు.. 2018, నవంబర్ 3వ తేదీన పలమనేరుకు చెందిన కృష్ణమూర్తి, ధనమ్మ దంపతుల కుమార్తె(13 ఏళ్ల బాలిక) ఇంట్లో నిద్రిస్తోంది. చదవండి: ముంబై హోటల్లో మోడల్ ఆత్మహత్య.. నేను సంతోషంగా లేనంటూ.. మద్యం మత్తులో ఉన్న కృష్ణమూర్తి తన కుమార్తెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇందుకు బాలిక తల్లి సహకరించింది. బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి డీఎస్పీ రామ్‌కుమార్ కేసు నమోదు చేసి కృష్ణమూర్తి, ధనమ్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులపై నేరం రుజువుకావడంతో ఇద్దరూ జీవించి ఉన్నంత వరకు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శాంతి తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం చెల్లించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి 20 ఏళ్లు జైలు కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు తీర్పు చెప్పిందని ఎస్ఐ నాగార్జున శుక్రవారం తెలిపారు. దేవీపట్నం మండలంలో తున్నూరు గ్రామానికి చెందిన ఎ.రాజేశ్వరరెడ్డి తన కూతురు (మైనర్)పై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భం దాల్చింది. ఈ విషయం గమనించిన ఐసీడీఎస్ సూపర్వైజర్ చోడి వీర్రాఘవ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16న రాజేశ్వరరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ పోక్సో కోర్టు జడ్జి ఎల్. వెంకటేశ్వరరావు సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.2,500 జరిమానా విధించారని ఎస్ఐ తెలిపారు. -
జిన్‌పింగ్ కూతురి ఫొటో వల్లే ఈ కష్టాలు!
ఆయన ప్రపంచంలోనే రెండో అత్యంత శక్తివంతమైన నేత. అమెరికా అంటే.. అగ్గిమీద గుగ్గిలం అయిపోతుంటాడు. అలాంటోడు తన గారాల కూతురిని మాత్రం సురక్షితంగా శత్రుదేశంలోనే దాచిపెట్టాడు.. అక్కడే చదివించాడు కూడా. అదీ బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. ఆ కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా?.. 2019లో చైనాకు చెందిన నియూ టెంగ్యూ అనే వ్యక్తి.. ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. ఇంకేం అధ్యక్షుల వారికి మండిపోయింది. ఆ దెబ్బకు 22 ఏళ్ల ఆ యువకుడిని అరెస్ట్ చేసి.. కటకటాల వెనక్కి నెట్టారు పోలీసులు. అక్కడి చట్టాలేమో అతగాడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతగాడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. ఏకంగా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని వివరిస్తూ సంచలన ఆరోపణలు చేసింది. అధ్యక్షుడి కూతురి ఫొటో, ఐడెంటిటీ బయటపెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చాక నియూకి, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వచ్చాయట. అంతేకాదు.. అతని తరపున వాదించేందుకు లాయర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, ఒకవేళ వచ్చినా ఎక్కువ రోజులు ఉండడం లేదని, ఇప్పటిదాకా 14 మంది లాయర్లను నియమించుకున్నామని ఆమె చెబుతోంది. అంతేకాదు.. కొడుకును కలిసేందుకు ఎన్ని అర్జీలు పెట్టుకుంటున్నా గువాంగ్‌డోంగ్ న్యాయస్థానం వాటిని తిరస్కరిస్తోందని, పైగా ఆ అర్జీలు తమదాకా రావడం లేదని చెబుతోందని ఆమె ఆరోపించింది. ఇదిలా ఉంటే.. చైనాలో జీ జిన్‌పింగ్ ఫ్యామిలీని కదిలించినా.. ఆయన ప్రభుత్వంపై సెటైరిక్‌గా పోస్టులు చేసినా శిక్షలు కఠినంగానే ఉంటాయి. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఏకైక తనయ జీ మెంగ్జీ(30). తన రెండో భార్య పెంగ్ లియువాన్(ఫోక్ సింగర్)తో కలిగిన సంతానం. చైనా కమ్యూనిస్టు పార్టీ చట్టం ఆధారంగా అమెరికాలో కూతురు మెంగ్జీ ఉన్నత విద్యను అభ్యసించింది. ఆపై ఐదేళ్లపాటు చైనాలో ఉండి.. మళ్లీ అమెరికాకే వచ్చి రీసెర్చి విద్యార్థిగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని అమెరికా చట్ట సభ ప్రతినిధి(మాజీ) విక్కీ హార్ట్జ్లర్ ఆమధ్య ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అయితే ఆ వెబ్సైట్, పత్రికల్లో ప్రచురితమైన ఐడెంటిటీ మెంగ్జీదేనా? అనేది మాత్రం ఇప్పటికీ అనుమానమే!. అలాగే ఆమెకు సంబంధించిన ఇతర వివరాలేవీ ఇప్పటిదాకా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియవు. ఇదీ చదవండి: గన్ గురిపెట్టి చంపబోయాడు, కానీ.. -
Crime News: ఎంత పని చేశావ్ రమావతి!
భార్యభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు.. అప్పటికో, కాసేపటికో సర్దుకుపోవడం కూడా సహజమే. కానీ, ఒక్కోసారి అవి విపరీతాలకు కూడా దారి తీస్తుంటాయి. భార్యపై చెయ్యి చేసుకున్న ‘పాపాని’కి.. కలలో కూడా ఊహించని శిక్షపడింది ఆ భర్తకు. భార్యను ఎత్తుకెళ్లి.. హత్య చేసిన కేసులో ఓ భర్తకు పదేళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో దాదాపు ఎనిమిదేళ్లపాటు పోలీసు విచారణ సాగడం గమనార్హం. ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద వచ్చాడు అతను. మరో నాలుగేళ్ల తర్వాత.. ఈ మధ్యే మబ్బులు వీడిపోయే వార్త ఒకటి అతని చెవిన పడింది. అతని భార్య బతికే ఉందని! ఉత్తర ప్రదేశ్ బహ్రాయిచ్ ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. అక్కడి ఏఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాంపూర్ గ్రామానికి చెందిన కంధాయ్ అనే వ్యక్తి 2006లో అదే గ్రామానికి చెందిన రమావతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అయితే.. మూడేళ్ల తర్వాత అంటే 2009లో ఓరోజు హఠాత్తుగా ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రమావతి కుటుంబ సభ్యులు కంధాయ్‌ను కోర్టుకు ఇడ్చారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లి హత్య చేశాడని కేసు నమోదు చేయడంతో విచారణ కొనసాగింది. ఎనిమిదేళ్లు అయినా రమావతి తిరిగి రాకపోవడంతో చనిపోయి ఉంటుందని పోలీసులు నిర్ధారించుకున్నారు. అదే సమయంలో కంధాయ్‌కు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు సాక్ష్యం చెప్పడంతో.. 2017లో స్థానిక కోర్టు అతనికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆరు నెలల శిక్ష తర్వాత అలహాబాద్ హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు అతను. అయితే కంధాయ్ కూడా ఊహించని ట్విస్ట్ ఒకటి బయటపడింది ఈమధ్యే. బంధువులతో పరుగున.. రమావతి, కంధాయ్ ఇరు కుటుంబాలకు దగ్గరి బంధువైన ఓ వ్యక్తి.. ఈమధ్యే రమావతి సోదరి ఇంటికి వెళ్లాడు. అక్కడ రమావతిని చూసి షాక్ తిన్నాడు అతను. వెంటనే విషయాన్ని కంధాయ్‌కు చేరవేశాడు. భార్య బతికే ఉందన్న విషయం తెలిసిన కంధాయ్.. ఆలస్యం చేయకుండా తన బంధువులతో రమావతి సోదరి ఇంటికి చేరుకున్నాడు. ఈలోపు పోలీసులకు సైతం సమాచారం ఇవ్వడంతో వాళ్లు అక్కడికి వచ్చారు. అంతా రమావతిని చూసి కంగుతిని.. అసలు విషయాన్ని ఆరా తీసేందుకు ఆమెను వన్ స్టెప్ సెంటర్(మహిళా సంక్షేమ కేంద్రం)కు తీసుకెళ్లి విచారించారు. చాయ్ విషయంలో జరిగిన గొడవతో భర్త తనపై చెయ్యి చేసుకున్నాడని, అది నచ్చకనే భర్తను జైలు పాలు చేయాలని ఇలా చేశానని అసలు విషయం చెప్పుకొచ్చిందామె. ఆమె చెప్పిన కారణం విని కంగుతిన్న భర్త, పోలీసులు, బంధువులు.. ఇన్నేళ్లపాటు ఆమె తన జాడను గోప్యంగా ఉంచడంపై ఆశ్చర్యపోతున్నారు. ఆమె అజ్ఞాతవాసం-కంధాయ్ కారాగారవాసం వెనుక రమావతి కుటుంబ ప్రమేయం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇవాళ(సోమవారం) రమావతిని కోర్టులో హాజరుపర్చగా.. కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు. -
మా నాన్నను విడిపించండి
న్యూఢిల్లీ: భారతదేశంలో జన్మించిన తమ తండ్రిని అన్యాయంగా పాకిస్తాన్ జాతీయుడిగా నిర్ధారించి జైలుశిక్ష విధించారని, శిక్షాకాలం ముగిసినా నిర్బంధించారని, ఆయనను విడిపించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన అక్కాతమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొహమ్మద్ ఖమర్(62)ను యూపీలోని మీరట్‌లో 2011 ఆగస్టు 8న పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ జాతీయుడైన ఖమర్ అక్కడి పాస్పోర్టుతో భారత్‌కు వచ్చాడని, వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో ఉంటున్నాడని కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయస్థానం అతడికి మూడున్నరేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించింది. 2015 ఫిబ్రవరి 6న జైలుశిక్ష ముగిసింది. అతడిని తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో అధికారులు 2015లో∙లాంపూర్‌లోని నిర్బంధ కేంద్రానికి తరలించారు. దీంతో ఖమర్ ఏడేళ్లుగా నిర్బంధంలోనే కొనసాగుతున్నాడు. భారతీయురాలిని వివాహమాడిన ఖమర్‌కు భారత్‌లోనే ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు జన్మించారు. తమ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందని, తక్షణమే విముక్తి కలిగించాలని ఖమర్ కుమార్తె, కుమారుడు తాజాగా సుప్రీంను ఆశ్రయించారు. -
భారత్‌పై విషం చిమ్మే నజీర్.. ఎట్టకేలకు పాపం పండింది
భారత్‌పై, ప్రభుత్వ విధానాలపై వీలు చేసుకుని మరీ విషం చిమ్ముతూ.. పాక్ అండతో కశ్మీర్ ప్రచారకర్తగా తనను తాను ప్రచారం చేసుకున్నాడు లార్డ్ నజీర్ అహ్మద్(64). అయితే లైంగిక దాడుల పర్వంలో ఎట్టకేలకు ఈ చీడపురుగు పాపం పండింది. మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో జైలు శిక్ష పడింది. బ్రిటిష్-పాక్ సంతతికి చెందిన రాజకీయ నేత లార్డ్ నజీర్ అహ్మద్‌కు పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో ఐదున్నరేళ్ల శిక్ష ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం షెఫీల్డ్ క్రౌన్ కోర్టు నజీర్‌ను దోషిగా నిర్ధారించి.. శిక్ష ఖరారు చేసింది. 70వ దశకంలో ఇద్దరు మైనర్లపై నజీర్ అహ్మద్ లైంగిక వేధింపులపై పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. 1971 నుంచి 1974 మధ్య ఈ వేధింపుల పర్వం సాగినట్లు సమాచారం. వేధింపులతో పాటు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే.. నాలుగు దశాబ్దాలుగా బాధిత కుటుంబాల పోరాటం, మీటూ ఉద్యమం ప్రభావంతో 2019 మార్చిలో ఈ ఆరోపణలకు సంబంధించి నజీర్పై నేరారోపణలు నమోదు అయ్యాయి. కశ్మీర్‌ను ఉద్ధరిస్తానంటూ.. నజీర్ అహ్మద్ పీఓకేలో జన్మించాడు. అయితే రోథర్హమ్(యూకే)కు తండ్రి వలస వెళ్లడంతో.. నజీర్ అక్కడే పెరిగి, వ్యాపారాలతో రాణించాడు. 1998లో టోనీబ్లేయర్ ప్రధాని సారథ్యంలో నజీర్ హౌజ్ ఆఫ్ ది లార్డ్స్‌గా పని చేశాడు. 2013లో లేబర్ పార్టీకి రాజీనామా చేసి.. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో 2020లో హౌజ్ ఆఫ్ లార్డ్స్‌కు రాజీనామా చేశాడు. ఇతగాడి వేధింపులు నిజమేనని హౌజ్ కమిటీ ఒకటి నిర్ధారణ కూడా చేసింది. ఖలీస్థానీ గ్రూపుతో మంచి సంబంధాలు కలిగి ఉన్న నజీర్.. వీలుచిక్కినప్పుడల్లా భారత్‌పై విషం చిమ్ముతుంటాడు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌తోనూ అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసినప్పుడల్లా.. నజీర్ భారత్ మీద విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఒకానొక దశలో ప్రధాని మోదీపైనా వివాదాస్పద ప్రకటన ఇచ్చాడు నజీర్. కశ్మీర్ క్రూసేడర్ అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికే నజీర్.. పీవోకే ప్రాంతాన్ని ఉద్దరిస్తానంటూ ఫండింగ్ చేయడం ప్రారంభించాడు. సంస్కరణల పేరుతో కశ్మీర్ మహిళలను బలవంతంగా లోబర్చుకున్నట్లు నజీర్ మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో లండన్‌లో ఉండే కశ్మీర్ కమ్యూనిటీ మీటూ తరహా ఉద్యమంతో నజీర్ పీఠాన్ని కదిలించారు కూడా. నజీర్పై జైలు శిక్ష పడడంపై కమ్యూనిటీ హర్షం వ్యక్తం చేస్తోంది. చదవండి: అడుగు పెట్టకముందే ఇమ్రాన్ ఖాన్‌కు షాకిచ్చిన చైనా -
పోక్సో కేసులో 21 ఏళ్ల శిక్ష
కొత్తగూడెం రూరల్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారితప్పాడు. సొంత పిల్లల్లా చూసుకోవాల్సిన విద్యార్థినులపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై నమోదైన కేసులో నిందితుడికి 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.11 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువడింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జి మహ్మద్ అబ్దుల్ రఫీ శుక్రవారం వెలువరించిన తీర్పు వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి చింతవర్ర గామ ప్రభుత్వ పాఠశాలలో దొడ్డ సునీల్‌కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడిన గత ఏడాది డిసెంబర్లో పాఠాలు చెబుతానంటూ విద్యార్థినులను పాఠశాలకు పిలిచేవాడు. ఆయన మాటలు నమ్మి వచ్చిన ఐదుగురు విద్యార్థినుల(మైనర్లు)పై సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 15న లక్ష్మీదేవిపల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సునీల్‌ను అరెస్టు చేశారు. ఈ కేసును ఐపీఎస్ అధికారి వినీత్ విచారణ జరిపారు. ఈ మేరకు కేసు కోర్టు విచారణకు రాగా, న్యాయమూర్తి వాదోపవాదాలు విన్నారు. అనంతరం నిందితుడు సునీల్‌కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.11 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
ఆరుగురు అధికారులకు 6 నెలల జైలు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, రెవెన్యూ శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్లకు చెందిన భూమి సేకరణ విషయంలో ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ శాఖ, రెవెన్యూ అధికారులను ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడింది. ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను ఉల్లంఘించారంటూ అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆర్.శోభ, రంగారెడ్డి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ సునీత ఎం.భగవత్, డీఎఫ్‌వో జానకీరామ్, అడిషనల్ కలెక్టర్ ఎస్.తిరుపతిరావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎ.శాంతకుమారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్‌కు ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధించింది. రూ.2 వేల చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇటీవల తీర్పునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సర్వే నంబర్ 222/1 నుంచి 222/20లో మహ్మద్ సిరాజుద్దీన్ తదితరులకు 383 ఎకరాల భూమి ఉంది. అటవీ అధికారులు ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చాలని నిర్ణయించి సేకరించాలని భావించారు. అయితే ఈ భూమిని రిజర్వు ఫారెస్టుగా మార్చడం సాధ్యం కాదంటూ అటవీశాఖ సెటిల్మెంట్ ఆఫీసర్ 2008లో కలెక్టర్‌కు లేఖ రాశారు. అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు హైకోర్టును ఆశ్రయించగా, ఈ భూమిసేకరణ ప్రక్రియపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని 2009లో అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆరేళ్లయినా అటవీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా ఆ భూమిని తమకు అప్పగించకపోవడాన్ని సవాల్‌చేస్తూ సిరాజుద్దీన్ తదితరులు 2015లో కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. -
చైనా సంచలన నిర్ణయం: బిలియనీర్‌కు భారీ షాక్
బీజింగ్: బిలియనీర్, అగ్రికల్చరల్ టైకూన్ సన్ దావూకు (66) చైనా భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల పలువురు ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు జైలు శిక్ష విధించిన జిన్‌పింగ్ ప్రభుత్వం తాజాగా సన్దావూకు 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాన్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వ పరిపాలనను అడ్డుకోవడం, అక్రమ మైనింగ్, వ్యవసాయ భూముల ఆక్రమణ, అక్రమ నిధుల సేకరణ లాంటి నేరాల్లో సన్ దావూ దోషిగా తేలారని బీజింగ్ సమీపంలోని గావోబీడియన్ కోర్టు ప్రకటించింది. దీనిపై సన్ న్యాయవాదులు అభ్యంతరాలను వ్యక్తం చేశారు. గ్రామీణ సంస్కరణల మద్దతుదారుడుగా పేరొందిన సన్ను రహస్యంగా విచారించిన అనంతరం చైనా కోర్టు అతనికి 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాదు 3.11 మిలియన్ యవాన్ల (475,000 డాలర్ల) జరిమానా విధించింది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అనుభవజ్ఞుడైన సన్, తన సొంత సంస్థను స్థాపించడానికి ముందు ప్రభుత్వ యాజమాన్యంలోని అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనాలో పనిచేశారు. ఆ తరువాత భార్యతో కలిసి 1980లలో అగ్రికల్చరల్ అండ్ యానిమల్ హస్బెండరీ గ్రూప్ అనే భారీ సంస్థను నెలకొల్పారు. ఇందులో ప్రస్తుతం వేలాది మంది ఉద్యోగులున్నారు. అలాగే హెబీ ప్రావిన్స్‌లో 1,000 పడకల ఆసుపత్రి, ఇతర సౌకర్యాలతో దావు సిటీ అనే నగరాన్ని కూడా నిర్మించారు సన్ దావూ. ప్రభుత్వ బ్యాంకులపై విమర్శలు గుప్పిస్తూ 2000లో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రధానంగా గ్రామీణ పెట్టుబడులను నిర్లక్ష్యం చేస్తూ, గ్రామీణుల పొదుపు సొమ్మును పట్టణ ప్రాజెక్టులవైపు మళ్లిస్తున్నారని సన్ ఆరోపించారు. దశాబ్దాలుగా చైనా గ్రామీణ విధానాలను తీవ్రంగా విమర్శించడంతోపాటు, రైతుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడేందుకు వారికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వాలనేవారు. గ్రామీణ సంస్కరణలపై గొంతెత్తే సన్ 2019లో చైనాలో స్వైన్ ఫీవర్ విజృంభణపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 2003లో అక్రమ నిధుల వసూళ్లు ఆరోపణలతో సన్ను అరెస్ట్ చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. పలువురు మానవహక్కుల నేతలు, న్యాయవాదులు, విద్యావేత్తలు, పాత్రికేయుల నిరసనల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అయితే 2021 మేలో సన్ను మరోసారి అరెస్ట్ చేసిన ప్రభుత్వం, అతని వ్యాపారాలను సీజ్ చేసింది. కాగా రియల్ ఎస్టేట్ మొగల్ రెన్ జికియాంగ్‌కు గత సంవత్సరం చైనా 18 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
భారతీయ మహిళపై పైశాచికత్వం.. నోట్లో పళ్లన్నీ ఊడిపోయేలా..!
పొట్టకూటి కోసం విదేశాలకు వెళ్లే ఎందరో అమాయకులు బానిత్వంలో మగ్గిపోతున్నారు. వారిపై యజమానులు అమానుషంగా ప్రవర్తించిన ఘటనలు కోకొల్లలు. మానవత్వాన్ని మరిచి చేసే హింసల దాటికి బాధితులు బిక్కుబిక్కుమంటూ బతుకుతుంటారు. మెల్బోర్న్(ఆస్ట్రేలియా): ఓ భారతీయ మహిళను ఎనిమిదేళ్లపాటు తమ ఇంటిలో బానిసగా ఉంచినందుకు మెల్బోర్న్ దంపతులకు అక్కడి కోర్టు జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన కందసామి కణ్ణన్(57), కుముత్తిని కణ్ణన్(53) భార్యాభర్తలు. అయితే కొన్నేళ్ల క్రితం ఆస్ట్రేలియా వెళ్లి మెల్బోర్న్లో స్థిరపడ్డారు. కాగా వాళ్లింట్లో పనులు చేయించుకునేందుకు తమిళనాడుకు చెందిన ఓ మహిళను 2007లో మెల్బోర్న్కు తీసుకెళ్లారు. కొన్నాళ్లు బాగానే వ్యవహరించిన ఈ వృద్ధ దంపతులు ఆ తర్వాత ఆ మహిళ పట్ల కర్కశంగా వ్యవహరించారు. తిట్టి, కొట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఆమెపై పైశాచికంగా ప్రవర్తించి కొట్టడంతో నోట్లో పళ్లన్నీ ఊడిపోయాయి. సరిగ్గా తినడానికి తిండి కూడా పెట్టకుండా నరకం చూపించారు. ఇలా వెలుగులోకి.. కాగా 2015 జులైలో ఆ పెద్దావిడ మూత్రపు మడుగులో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆమెను పరీక్షించిన ఓ పారామెడిక్.. మహిళ కేవలం 40 కేజీల బరువు ఉండి, శరీర ఉష్ణోగ్రత కూడా 28.5 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆమెకు షుగర్ ఉండగా.. శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో ఆ పారామెడిక్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ భార్యాభర్తలు చేసిన అమానవీయ ఆకృత్యం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం బాధితురాలి వయసు 67 సంవత్సరాలు. ఈ అమానుష ఘటనపై విక్టోరియా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాన్ చాంపియన్ తీవ్రంగా స్పందించారు. వృద్ధ దంపతుల పట్ల ఎవరూ.. ఎలాంటి కనికరం చూపరాదని.. వాళ్లు చేసిన పని కచ్చితంగా మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తించడమేనని న్యాయమూర్తి తీర్పు వెలువరించే సందర్భంలో వ్యాఖ్యానించారు. -
బతుకు ఆగం జేసిన బొమ్మ తుపాకీ! 30 ఏళ్లు జైల్లో..
ఆ పెద్దాయనకు అస్సలు కిస్మత్ బాగోలేదు. అందుకే ముప్ఫైఏళ్ల క్రితం బొమ్మ తుపాకీతో బెదిరించి ఓ చోరీ చేశాడు. అదృష్టం బాగోలేక దొరికాడు. అది బొమ్మదని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. జీవిత ఖైదులో ముప్పై ఏళ్లు జైల్లోనే మగ్గాడు. చివరికి క్షమాభిక్ష దొరకడంతో జైలు నుంచి బయటపడేందుకు సిద్ధం అయ్యాడు. రోల్ఫ్ కయెస్టెల్(70).. అర్కన్సస్ రాష్ట్రంలో 1981లో ఓ చిరుతిళ్ల షాపులో దొంగతనం చేశాడు. బొమ్మ తుపాకీతో కౌంటర్ మీద ఉన్న వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఆ దొంగతనం కేసులో 40 ఏళ్ల జైలు శిక్ష.. బోనస్‌గా పదిహేను వేల ఫైన్ కూడా విధించింది కోర్టు. ఇక తాను చేసింది చిన్నతప్పేనని, క్షమాభిక్ష ప్రసాదించాలని కయెస్టెల్ అభ్యర్థిస్తూనే ఉన్నాడు. అంతెందుకు అతని చేతిలో దొపిడీకి గురైన వ్యక్తి కూడా.. వదిలేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తూ వచ్చాడు. ఐదుసార్లు క్షమాభిక్ష అప్పీల్ చేసుకున్నా అప్లికేషన్‌ను తిరస్కరించారు. సెలబ్రిటీలు సైతం అతని మంచి జీవితానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్లు నడిపించారు. చివరికి.. ఐదో సారికి అతనికి క్షమాభిక్ష దొరికింది. దీంతో పదేళ్ల ముందుగానే జైలు నుంచి బయటపడుతున్నాడు. అయితే విడుదల కోసం అతను మరో నెల రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ అసా హచిన్సన్ చేసిన ‘రోల్ఫ్ కయెస్టెల్ రిలీజ్’ ప్రతిపాదనను జనాలు కూడా ఆమోదించాల్సి ఉంటుంది. ఇంతకీ అతను దొంగిలించిన సొమ్ము ఎంతంటే.. 264 డాలర్లు. -
అత్యాచారం కేసు: 33 ఏళ్ల తర్వాత మహిళకు శిక్ష
శ్రావస్తి/లక్నో: 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు సాయం చేసిన మహిళకు శ్రావస్తి స్థానిక కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. అదనపు సెషన్స్ జడ్జి పరమేశ్వర్ ప్రసాద్ గురువారం నిందితురాలికి 15 వేల రూపాయల జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది కేపీ సింగ్ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరూ విచారణ సమయంలో మరణించారని ఆయన అన్నారు. కోర్టులో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న పురాతన కేసుల్లో ఇది ఒకటి అని సింగ్ అన్నారు. కేసు వివరాలు.. 33 ఏళ్ల క్రితం అనగా 1988, జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన బాధితురాలు సమీప గ్రామంలో ఓ విహానికి హాజరయ్యింది. రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితురాలు రామ్‌వతి, ఆమె తల్లి ఫూల్‌మాత మైనర్‌ను ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. ఈ కేసులో ముక్కు, పుస్సు, లాహ్రీ, రామ్‌వతి, ఆమె తల్లి ఐదుగురిపై ఐపీసీ సంబంధిత విభాగాల కింద భింగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. 33 సంవత్సరాల తరువాత, 2021 ఏప్రిల్‌లో కోర్టు వారందరినీ దోషులుగా గుర్తించి తన తీర్పును రిజర్వు చేసింది. చదవండి: ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్.. -
అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు ఎట్టకేలకు శిక్ష
-
పిల్లలతో వాంఛ.. దంపతులకు 26 ఏళ్ల జైలు
మాంచెస్టర్: ‘మీ ఇద్దరికి లైంగిక కోరికలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది మీకు, మీ ఇంటి వరకు పరిమితం అయితే అది మీ ప్రైవసికి సంబంధించిన విషయం. అది మీ పరిధి దాటి ముక్కు పచ్చలారని పిల్లలను మీ కామవాంఛలోకి లాగారు. అది ఆ పిల్లలపై ఎంతో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వారి తల్లిదండ్రులకు అంతులేని బాధను మిగులుస్తుంది. అందుకని మిమ్మల్ని కఠినంగా శిక్షించాల్సిందే!’ ‘మీలో కీలి బుర్లింగమ్ అనే 33 ఏళ్ల యువతి సామాన్యరాలు, సాదాసీతా జీవితం గడుపుతున్నారు. ఆమె మానసికంగా ఎంతో కుమిలిపోతోంది. పెళ్లి పెటాకులవడంతో కూడా ఆమె బాధ పడుతోంది. భర్త పీటర్ టేలర్ (33) ప్రోద్బలం లేకపోతే ఆమె ఇంతగా దిగజారేది కాదు, పీటర్‌ను పెళ్లే చేసుకోకపోతే ఆమె కోర్టు గడప తొక్కాల్సి వచ్చేది కాదన్న డిఫెన్స్ వాదనను పరిగణలోకి తీసుకుంటున్నాను. అయినా కమిషన్ ఆఫ్ చైల్డ్ సెక్స్ అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఏ చైల్డ్ అండర్ 13 కింద కఠినమైన శిక్ష విధించాల్సిందే. అన్ని అంశాలకు పరిగణలోకి తీసుకొని 11 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే, పీటర్ టేలర్ ఇక్కడ ప్రధాన నేరస్థుడు. కామవాంఛ తీసుకునేందుకు స్కూల్ డ్రెస్ వేసుకొని రావాల్సిందిగా భార్య బుర్లింగమ్‌ను కోరారు. అందుకు ఆమె అంగీకరించి అలాగే రావడంతో సమస్య మొదలయింది. స్కూల్ గర్ల్స్ మీదకు పీటర్ టేలర్ మనసు మళ్లింది. 11 ఏళ్ల నుంచి ఐదేళ్ల వయస్సున్న ఆడ, మగ పిల్లలపై అత్యాచారం జరిపారు. ఈ విషయంలో భర్తకు సహకరించిన భార్య బుర్లింగమ్ కూడా పిల్లలతో కామవాంఛ తీర్చుకున్నారు. భార్యను స్కూల్ డ్రెస్‌లో చూడాలనుకున్న టేలర్‌కు, స్కూల్ పిల్లలపై ఎప్పటి నుంచి కోరిక ఉండి ఉంటుంది. అన్ని విధాల అతనే ప్రధాన నేరస్థుడిగా నిర్ధారిస్తూ 15 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నాను. అయినా ఇద్దరు ఇక్కడ సెక్స్ అఫెండర్స్ రిజిస్టర్ (వీరి వల్ల భవిష్యత్తులో ముప్పుందనుకుంటే యావజ్జీవ కారాగారా శిక్ష విధించేందుకు ఈ రిజిస్టర్ తోడ్పడుతుంది)లో సంతకం చేయాలి’ అని మాంచెస్టర్‌లోని మిన్శుల్ స్ట్రీట్ క్రౌన్ కోర్టు జడ్జీ మార్క్ సావిస్ శనివారం నాడు మాజీ దంపతులకు శిక్ష విధించారు. ఒకే వయస్సుగల బుర్లింగమ్, టేలర్‌లో గ్రేటర్ మాన్‌చెస్టర్‌లోని డుకిన్‌ఫీల్డ్‌కు చెందిన వారు. వారు 2016లో డేటింగ్ వెబ్సైట్ ద్వారా ప్రేమించుకున్నారు. భార్య ఓ కేఫ్‌లో పనిచేస్తుండగా, భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేశారు. పెళ్లికి ముందే వారి మధ్య అనైతికంగా లైంగిక సంబంధం ఏర్పడింది. అది కొద్ది కాలానికే పెడతోవలు పట్టింది. ముందుగా టేలర్ కామవాంఛ ఉద్దీపన కోసం ఇంటర్నెట్ నుంచి పిల్లల అసభ్య ఫొటోలను డౌన్లోడ్ చేసుకొని బుర్లింగమ్కు పంపించే నీచానికి దాగాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాక స్కూల్ డ్రెస్‌తో మొదలైన తతంగం పిల్లలతో కామవాంఛ తీర్చుకునే దారుణ స్థాయికి వెళ్లింది. పార్ట్‌టైమ్ బేబీ సిట్టర్‌గా పనిచేసిన బుర్లింగమ్ ఐదేళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, దాన్ని సెల్‌ఫోన్ ద్వారా రికార్డు చేసి, ఆ వీడియోను భర్తకు పంపించారట. అప్పటి నుంచి ఆ భార్యా భర్తలిద్దరు కలిసి, విడివిడిగానూ అసభ్యంగా పిల్లలతో గడపడమే కాకుండా వాటిని సెల్‌ఫోన్ ద్వారా వీడియో తీసి పరస్పరం షేర్ చేసుకునే పైత్యానికి దిగారు. ఆ తర్వాత వారి మధ్య పరస్పరం మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అయినప్పటికీ వారు పిల్లలతో పెట్టుకున్న సంబంధాన్ని వదులుకోలేక పోయారట. పక్కింటి ఐదేళ్ల బాలుడి తల్లి ఫిర్యాదుతో మొదట బుర్లింగమ్ అరెస్ట్ అయ్యారు. ఆమె దగ్గర దొరికిన సాక్ష్యాధారాల ఆధారంగా 2019, ఏప్రిల్ నెలలో టేలర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి సెల్ఫోన్లలో నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫొటోలు, షేర్ చేసుకున్న వీడియోలు, పంపుకున్న సందేశాలు దొరికాయి. వాటి ఆధారంగానే కేసు విచారణ ఇటీవలే ముగియడంతో శనివారం నాడు తీర్పు వెలువడింది. (ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్యపై..) -
జైలుకు పంపడానికి ట్రక్కును తెప్పించారు..
సాక్షి, న్యూఢిల్లీ : ఇరాక్‌లోని మొసుల్‌లో పట్టుబడిన ఐసిస్ నేత, ప్రభోదకుడు, భారీకాయుడైన షిఫాల్ నిమను జైలుకు తరలించేందుకు అధికారులు ముప్పతిప్పలు పడ్డారు. 130 కిలోలకు పైగా బరువున్న షిఫల్ను కారులో ఎక్కించలేక ఆయన కోసం ప్రత్యేకంగా ట్రక్కును తెప్పించారు. ఐఎస్ నేత స్ధావరం బేకరీ అయి ఉంటుందని ఆయన ఆకారాన్ని చూసిన నెటిజన్లు జోక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఐసిస్ ప్రముఖ నేతగా పేరొందిన షిఫల్ నిమ జారీ చేసిన ఫత్వాలు మేథావులు, ఆథ్యాత్మిక వేత్తల హత్యలకు దారితీశాయని ఇరాక్ పోలీసులు పేర్కొన్నారు. నిమ పట్టుబడటం ఐసిస్‌కు మానసికంగా కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. కాగా. 2013లో పురుడు పోసుకున్న ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద గ్రూపు తమ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాది హతమైనా ప్రపంచానికి పెనుముప్పుగానే పరిణమించింది. చదవండి : రాజధానిలో కలకలం: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్ -
అసాంజేకు 50 వారాల జైలు శిక్ష
వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు బుధవారం లండన్ న్యాయస్థానం 50 వారాల జైలు శిక్ష విధించింది. బెయిల్ నిబంధనలను ఆరోపించినందుకుగానూఈ శిక్షవిధిస్తూ సౌత్ వర్క్ క్రౌన్ కోర్డు తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును వికీలీక్స్ ఖండించింది. ఈ తీర్పుషాకింగ్, కుట్రపూరితమైందని వ్యాఖ్యానించింది. కాగా అమెరికన్ సైనికుల అరాచాకాలను తన వికీలీక్స్ ద్వారా బయటపెట్టి అగ్ర రాజ్యాన్ని గడ గడ లాడించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజేపై గత ఏడేళ్లుగా బ్రిటన్ కోర్ట్‌లో స్వీడన్లో నమోదైన ఆరోపణలపై విచారణ జరుగుతోంది. అయితే ఈక్వడేరియన్లో తలదాచుకున్న అసాంజేకు ఎంబసీ ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించిన నేపథ్యంలో బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. -
పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది. ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం మినహా, అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.