Jailer Movie
-
వర్త్ ...వర్మా వర్త్
మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. ఆదివారం కడపలో హల్చల్ చేసిన ఓ వ్యక్తిని చూసినవారు ఇది నిజమేనని ఆశ్చర్యపోయారు. జైలర్ సినిమాలో వర్మ పేరుతో నటించిన వినాయకన్ విలన్ ఎంత పాపులర్ అయ్యాడో తెలిసిందే. అన్నమయ్య జిల్లా చిన్నమండెంకు చెందిన మాజిద్ అచ్చు వినాయకన్లాగే కనిపించి హల్చల్ చేశాడు. బీడీలు తాగుతూ వర్మ వేషధారణలో హావభావాలు ప్రకటించాడు. దీంతో ప్రజలు అతని చుట్టూ చేరి జైలర్ సినిమాలోని పాపులర్ డైలాగ్ ‘వర్త్.. వర్మా వర్త్’ అంటూ కేరింతలు కొట్టారు. – మహమ్మద్ రఫీ, సాక్షి సీనియర్ ఫొటోగ్రాఫర్, కడప -
జైలర్‌తో ధనుష్?
మామా అల్లుడు రజనీకాంత్, ధనుష్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. హీరో రజనీకాంత్ టైటిల్ రోల్లో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. 2023లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దీంతో రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ తీయాలని ప్రస్తుతం స్క్రిప్ట్ తయారు చేస్తున్నారు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్.ఈ ఏడాది చివర్లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ‘జైలర్ 2’లోని ఓ కీలకపాత్ర కోసం ధనుష్‌ను సంప్రదించారట నెల్సన్. ఈ ప్రత్యేకపాత్రలో నటించేందుకు ధనుష్ కూడా దాదాపు ఓకే చెప్పారట. ఇదిలా ఉంటే... ప్రస్తుతం చెన్నైలో జరుగుతున్న ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు రజనీ. ఓ యాక్షన్ సీక్వెన్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2025లో విడుదల కానుంది. -
జైలర్ సినిమా విలన్ వినాయక్ అరెస్ట్
-
'జైలర్'కు ఏడాది.. మూడు భాగాలుగా మేకింగ్ వీడియోలతో ఫ్యాన్స్‌కు ట్రీట్
రజనీకాంత్ కథానాయకుడిగా గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. భారీ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించారు. సౌత్ ఇండియాలో ఈ సినిమా అనేక రికార్డ్స్‌ను క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 620 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అంతటి విజయాన్ని అందుకున్న జైలర్ 2023 ఆగష్టు 10న విడుదలైంది. ఏడాది పూర్తి అయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్.జైలర్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సన్‌పిక్చర్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో సినిమా మేకింగ్ ప్రివ్యూ వీడియోను విడుదల చేసింది. జైలర్ సినిమా మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేసేందుకు నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆగష్టు 12న మేకింగ్ వీడియో ప్రివ్యూను తన సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. ఆపై ఆగష్టు 16న సన్ నెక్ట్స్ ఓటీటీ వేదికగా జైలర్ మేకింగ్ వీడియోను మూడు భాగాలుగా విడుదల చేయనున్నారు.నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రంలో రజనీకాంత్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. ప్రస్తుతం రజనీకాంత్ దర్శకుడు T.S.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వెట్టయన్' అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మిస్తోంది. -
జైలర్ డైరెక్టర్ తో బన్నీ డిస్కషన్స్..
-
సైమా అవార్డ్స్ 2024.
-
రజనీతో నటిస్తానని ఊహించలేదు, జైలర్ సీక్వెల్..: నటుడు
జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవమని నటుడు వసంత్ రవి పేర్కొన్నారు. తరమణి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నారు. చిత్రాల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తున్న ఈయన ఆ తరువాత రాఖి అనే పుల్ యాక్షన్ మూవీలో నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ తరువాత అశ్విన్స్ అనే కథా చిత్రంలో నటించి సక్సెస్ అయ్యారు. అలాగే రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన సూపర్‌హిట్ చిత్రం జైలర్‌లో వసంత రవి ఆయనకు కొడుకుగా ముఖ్యపాత్రను పోషించారు. రజనీతో పనిచేయడం.. అలాగే ఇటీవల అశోక్‌సెల్వన్‌తో కలిసి పొన్ ఒండ్రు కండేన్ చిత్రంలో నటించారు. జి.స్టూడియో సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతోంది. కాగా ఏప్రిల్ 18న వసంత్ రవి పుట్టినరోజు కాగా చెన్నైలో ఆయన తన జర్నీ గురించి మాట్లాడారు. తాను మొదటి నుంచి డిఫరెంట్ బ్యానర్లలో నటిస్తున్నట్లు చెప్పారు. జైలర్ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. జైలర్ 2లో? తాను నటుడుగా పరిచయం అయ్యే ముందు రజనీకాంత్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నానని, అయితే ఆ తరువాత ఆయనతో కలిసి నటిస్తానని ఊహించలేదన్నారు. జైలర్–2 చిత్రంలో నటిస్తారా? అని అడుగుతున్నారని, వాస్తవానికి ఆ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదన్నారు. దాని గురించి ఇప్పుడే చెప్పలేనన్నారు. అదే నా లక్ష్యం అన్ని రకాల పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తమిళ సినిమాను గ్లోబల్ స్థాయికి చేర్చాలన్నదే తన లక్ష్యమన్నారు. ప్రస్తుతం వెపన్, ఇంద్ర చిత్రాల్లో నటిస్తున్నానని, ఇవి చాలా వైవిధ్య కథా చిత్రాలుగా ఉంటాయన్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకున్నారా? అన్న ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదన్నారు. ఇంకా మంచి చిత్రాలు చేయాలన్నదే తన కోరిక అని వసంత్ రవి పేర్కొన్నారు. చదవండి: Vishal: జగన్ తప్పకుండా మళ్లీ గెలుస్తారు -
'జైలర్' ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అదిరిపోయే టైటిల్‌తో సీక్వెల్
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'జైలర్'. అప్పటి వరకు హిట్ సినిమాలు లేని రజనీకాంత్‌కు జైలర్‌తో మంచి విజయాన్ని అందుకున్నారు. గతేడాది అగష్టులో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించింది. నిర్మాతకు కూడా భారీ లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ వార్త వైరల్ అవుతుంది. జైలర్ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించారు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ పనులను డైరెక్టర్ ప్రారంభించారట. 'హుకుమ్' పేరుతో పార్ట్ 2 పనులను ఆయన మొదలుపెట్టేశారట. ఈ జూన్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులను కూడా ఆయన స్టార్ట్ చేయబోతున్నారని టాక్ ఉంది. #Jailer2, #Hukum హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్‌మీడియాలో ఈ వార్త ట్రెండ్ అవుతుంది. దీంతో జైలర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌కు ఏప్రిల్ 22న టైటిల్ ఖరారు కానుంది. సన్‌పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. మరోవైపు టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో 'వేట్టయాన్' చిత్రాన్ని కూడా రజనీ పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. జైలర్‌లో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మిర్నా మేనన్, యోగిబాబు కీలక పాత్రలలో మెప్పించారు. టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా రజనీ హీరోయిజానికి ఫ్యాన్స్ ఫిదా అయితే.. వర్మన్‌గా వినాయకన్ విలనిజానికి కూడా అదే రేంజ్లో విజిల్స్ పడ్డాయి. జైలర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. HUKUM... TIGER KA #HUKUM 🔥😎 Morattu excited for the re-entry of the character & combo 💥#Jailer2 #Vettaiyan #Thalaivar171 #ThalaivarNirandharam pic.twitter.com/VTdJI7leXq https://t.co/gBS4XMgze8 — Shreyas Srinivasan (@ShreyasS_) April 12, 2024 -
జైలర్ హిట్ అయ్యింది నావల్లే.. తమన్నా సంచలనం
-
'జైలర్' హిట్ నా వల్లే.. నిర్మాతలకు తమన్నా కొత్త డిమాండ్
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం జైలర్. ఇందులో నటి తమన్న ఒక్క పాట, కొన్ని సన్నివేశాల్లో మాత్రమే నటించారు. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్‌ను కూడా తెరకెక్కించడానికి నెల్సన్ రెడీ అవుతున్నారు. కాగా నటి తమన్న తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసినట్టు టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇటీవల ఈమె ఒక భేటీలో పేర్కొంటూ జైలర్ చిత్రం అంత సంచలన హిట్‌కు కారణం రజనీకాంత్ కాదని, తానేనని పేర్కొన్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజం చెప్పాలంటే ఆ చిత్రంలో తమన్న నటించిన నువ్వు కావాలయ్యా అనే పాట పెద్ద హిట్ అయ్యింది. ఆమె అందాల ప్రదర్శన కర్రకారును విపరీతంగా అలరించింది. చిత్రం విడుదలైన తరువాత ఎక్కడ విన్నా 'నువ్వు కావాలయ్యాస పాటనే. అయితే ఆ పాట హిట్ అయినా, తమన్నకు మాత్రం ఇక్కడ మరో అవకాశం రాలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రాలతోనే సరి పెట్టుకుంటున్న ఈ మిల్కీబ్యూటీకి తాజాగా ఒక తెలుగు చిత్రంలో నటించే అవకాశం వరించింది. అది మినహా దక్షిణాదిలో ఒక్క చిత్రం కూడా లేదు. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునిగి తేలుతున్న తమన్న త్వరలో అతగాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ విషయం అలా ఉంచితే ఈ అమ్మడు తన పారితోషికాన్ని ఏకంగా రూ. 5 కోట్లకు పెంచేసిందని సమాచారం. అదేమంటే జైలర్ చిత్రం హిట్‌కు ప్రధాన కారణం తానేనని చెప్పుకుంటోందట. మరి దీనిపై జైలర్ చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది. -
జైలర్ 2 గురించి గుడ్‌న్యూస్ చెప్పిన నటి
రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రం ఈ మధ్య విడుదలై సంచలన విషయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నటి తమన్నా కీలక పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని నెల్సన్ తెరకెక్కించారన్నది విదితమే. రూ.600 కోట్లు కొల్లగొట్టిన చిత్రం జైలర్. దీనికి సీక్వెల్ రూపొందనుందన్న విషయం చాలాకాలంగా జరుగుతోంది. దాన్ని ఇప్పుడు నటి మిర్నా మీనన్ ఖరారు చేశారు. ఈమె జైలర్ చిత్రంలో రజనీకాంత్‌కు కోడలుగా నటించారన్నది గమనార్హం. జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందన్న విషయాన్ని ఈమె స్పష్టం చేశారు. దీని గురించి నటి మిర్ణా తెలుపుతూ తాను దర్శకుడు నెల్సన్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటానని చెప్పారు. జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని తనతో చెప్పారన్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన కథను రెడీ చేస్తున్నట్లు చెప్పారన్నారు. అయితే దానికి సీక్వెల్లో తాను నటిస్తానో, లేదో తెలియదు అన్నారు. దీంతో జైలర్ చిత్రానికి సీక్వెల్ ఉంటుందన్న విషయం స్పష్టం అయ్యింది. నటుడు రజనీకాంత్ ప్రస్తుతం వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. దీని షూటింగ్ సగానికి పైగా పూర్తి అయ్యిందని సమాచారం. తర్వాత తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేస్తున్నట్లు సమాచారం. జైలర్–2 సెట్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఇది రజనీకాంత్ నటించే 172వ చిత్రం అవుతుంది. -
రజనీకాంత్ 'జైలర్' సీక్వెల్లో స్టార్ హీరోయిన్‌కు ఛాన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో లేడీ సూపర్‌స్టార్ నయనతార మరోసారి జత కట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆయన అతిథి పాత్ర పోషించిన లాల్ సలాం చిత్రం ఫిబ్రవరి 9వ తేదీన తెరపైకి రానుంది. ఆయన పెద్దకూతురు ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. కాగా ప్రస్తుతం జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ వేట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో మలయాళం స్టార్ హీరోయిన్ మంజు వారియర్ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ తన 171వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. కాగా రజనీకాంత్ తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపారనే వా తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈయన ఇంతకుముందు నటించిన జైలర్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సీక్వెల్‌ను దర్శకుడు నెల్సన్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఆయన సరసన నటి నయనతార నటించనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే ఈ జంట చంద్రముఖి, కథానాయకుడు, శివాజీ, దర్భార్, అన్నాత్తే మొదలగు ఐదు చిత్రాలలో కలిసి నటించింది. తాజాగా ఆరోసారి ఈ కాంబోలో చిత్రం రూపొందబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
జైలర్ మూవీ.. అలా చేయొద్దని హెచ్చరించారు: డైరెక్టర్
ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమాల్లో జైలర్ ఒకటి. రజనీకాంత్ తన స్వాగ్తో సినిమాను రఫ్ఫాడించేశాడు. ఎమోషనల్ సీన్లలో జీవించేసి ఏడిపించేశాడు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. ఆయన మాట్లాడుతూ.. 'ఈ కథ రాసుకున్నప్పుడు, షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు పెద్ద చాలెంజ్ ఎదురైంది. చాలామంది జైలర్ మూవీలో రజనీకాంత్ సర్ వెంటుక్రలను తెల్లగా చూపించొద్దని చెప్పారు. అన్నింటికీ సిద్ధపడ్డా.. ఆయనతో ఏ ప్రయోగాలైనా చేయండి కానీ వయసు మీదపడ్డవారిలా తెల్ల జుట్టుతో మాత్రం చూపించొద్దని అడిగారు. ఇండస్ట్రీలో ఉన్నవారు కూడా ఇలాంటి మాటలే చెప్పేసరికి భయపడిపోయాను. పైగా ఆయన తన వయసుకు తగ్గ పాత్రలో నటించిన తొలి చిత్రం ఇదే! దీంతో నేనేం చేయాలా? అని చాలా తికమకపడ్డాను. ఏదైతే అదైందని ముందడుగు వేశాను. ఏదైనా విమర్శలు వస్తే స్వీకరించడానికి సిద్ధపడిపోయాను. కానీ పది రోజులు షూటింగ్ జరిగాక నాపై నాకు నమ్మకం వచ్చింది. జైలర్‌లో స్టార్ హీరోలు.. రజనీని అలా చూపించడం వల్ల ఏమాత్రం నష్టం లేదని అర్థమైంది. సినిమా రిలీజయ్యాక ఎటువంటి స్పందన లభించిందో మీ అందరికీ తెలిసిందే' అని చెప్పుకొచ్చాడు నెల్సన్. కాగా జైలర్ సినిమాలో తమన్నా భాటియా, వసంత్ రవి, యోగి బాబు, రమ్య కృష్ణన్, వినాయకన్ కీలక పాత్రల్లో నటించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్, మలయాళం స్టార్ మోహన్ లాల్ అతిథి పాత్రల్లో మెప్పించారు. చదవండి: రెండు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు చిత్రం! -
నెల్సన్ నెక్ట్స్ ఏంటి.. జైలర్ తర్వాత ప్లాన్ ఇదేనా?
ఇంతకుముందు నయనతార ప్రధాన పాత్రలో కోలమావు కోకిల, విజయ్హీరోగా బీస్ట్, ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు నెల్సన్. కాగా జైలర్ చిత్రం విడుదలై 100 రోజులు కావస్తోంది. దీంతో సహజంగానే నెల్సన్ చేయబోయే నెక్ట్స్ చిత్రం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇప్పుడు కోలీవుడ్‌లో అలాంటి చర్చే జరుగుతోంది. అయితే నెల్సన్ తాజా చిత్రంపై ఆసక్తికరమైన ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆయన ఒక కమర్షియల్ అంశాలతో కూడిన కథను సిద్ధం చేస్తున్నట్లు, ఇందులో నటుడు ధనుష్‌ను కథానాయకుడిగా నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ధనుష్ ఇప్పుడు చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. దీని తరువాత తెలుగు, హిందీ చిత్రాలు అంటూ వరుసగా కమిట్ ఇస్తారని టాక్. దీంతో దర్శకుడు మరో ఆప్షన్ కూడా పెట్టుకున్నట్లు సమాచారం. ఒకవేళ ధనుష్ కాల్షీట్స్ లభించకపోతే లేడీ సూపర్‌స్టార్ నయనతారతో చిత్రం చేయాలని భావిస్తున్నారట. ఈ బ్యూటీ కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి నెల్సన్ దర్శకత్వంలో నటించడానికి నయనతార గ్రీన్ సిగ్నల్ ఇస్తారా అనేది చూడాలి. ఏదేమైనా దర్శకుడు నెల్సన్ తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారన్నది గమనార్హం. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. -
'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?
వర్త్ వర్మ వర్త్.. ఈ డైలాగ్ వినగానే మీ 'జైలర్' సినిమాలో విలన్ గుర్తొస్తాడు. మూవీలో విలనిజంతో అదరగొట్టిన నటుడు వినాయకన్‌ని కేరళ పోలీసులు నిజంగానే అరెస్ట్ చేశారు. జీపులో స్టేషన్ కి కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ఏం జరిగింది? కేరళకు చెందిన నటుడు వినాయకన్.. పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాలు కూడా చేస్తున్నాడు. తాజాగా మద్యం ఫుల్‌గా తాగేసి పబ్లిక్ ప్లేసులో అసభ్యంగా ప్రవర్తించాడట. కొందరు అతడిని కంట్రోల్ చేయాలని ప్రయత్నించినప్పటికీ.. అతడు వినకపోగా వారిని ఇష్టమొచ్చినట్లు బూతులు తిడుతూ ఇబ్బంది పెట్టాడట. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. ఇక వినాయకన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకుళంలోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అయితే వినాయకన్ ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుందని కొందరు ఆరోపిస్తున్నారు. మలయాళ, తమిళ సినిమాల్లో చేస్తున్న వినాయకన్.. తెలుగులో కల్యాణ్ రామ్ 'అసాధ్యుడు'లో సెకండ్ విలన్‌గా నటించాడు. (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
వాళ్లకు లక్కీ నటుడిగా మారిపోయిన శివరాజ్ కుమార్?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఈయన దివంగత కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడు అన్న విషయం తెలిసిందే. శివ రాజ్‌కుమార్ నటించిన చిత్రాలకు కన్నడ ప్రేక్షకులు జేజేలు పలుకుతారు. అంత ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడు ఈయన. అలాంటిది ఎప్పుడు తమిళంలో ప్రముఖ హీరోల చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించడానికి వెనుకాడటం లేదు. రజనీకాంత్‌తో ఇటీవల జైలర్ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. దీంతో జైలర్ చిత్రం తమిళనాడుతో పాటు కర్ణాటకలోనూ మంచి వసూళ్లు సాధించింది. దీనికి కారణం అక్కడ శివరాజ్ కుమార్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఏదేమైనా ఆయన ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం నటుడు కమలహాసన్ కథానాయకుడిగా నటించే చిత్రంలోని శివరాజ్ కుమార్ నటించే అవకాశం ఉన్ట్లు ప్రచారం జరుగుతోంది. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఘోస్ట్ చిత్రం ఈనెల 19వ తేదీన విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమం ఇటీవల ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటుడు కమలహాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాగా కమలహాసన్‌తో దిగిన ఫొటోను శివరాజ్ కుమార్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి కమలహాసన్ వీరాభిమానినైనా తాను ఆయనను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. దీంతో రజనీకాంత్, ధనుష్ తర్వాత కమలహాసన్ చిత్రంలో కూడా శివరాజ్ కుమార్ నటించబోతున్నట్లు ప్రచారం హోరెత్తుతోంది. -
అభిమాని అలాంటి ప్రశ్న అడగడంతో ఫైర్ అయిన తమన్నా..
నటి తమన్నా రూటే సెపరేటు. పాలరాతి బొమ్మలాంటి అందాలు ఈమెకే సొంతం. మొదటినుంచి గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తమన్నా అలాంటి పాత్రలపైనే తన నట జీవిత సౌధాలను ఏర్పాటు చేసుకుంది అని చెప్పవచ్చు. తాజాగా సమీప కాలంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన జైలర్ చిత్రంలో ఒక్క పాటకి, ఒకటి రెండు సన్నివేశాలకే పరిమితమైంది. అయినా ఆ చిత్ర ప్రమోషన్ అంతా ఆమె పాటపైనే సాగిందని చెప్పవచ్చు. అందులో నువ్వు కావాలయ్యా అనే పాటలో తమన్న డాన్స్ యువతను గిలిగింతలు పెట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అయితే ఆ పాటలో తమన్నా హద్దులు మీరి అందాలను ఆరబోసిందని విమర్శలను ఎదుర్కొంటుంది. ఇదే ప్రశ్నను ఇటీవల ఒక అభిమాని తమన్నాను అడగ్గా ఆమె అతనిపై ఫైర్ అయ్యింది. అవకాశాలు తగ్గడంతో ఆ విధంగా అందాలను విచ్చలవిడిగా తెరపై ఆరబోస్తున్నారా అన్న ఆ అభిమాని ప్రశ్నకు తమన్నా బదులిస్తూ తనకు అవకాశాలు లేవని ఎవరు చెప్పారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను ఇప్పటికీ రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని చెప్పింది. అంత బిజీగా ఇంతకుముందు ఎప్పుడులేనని కూడా పేర్కొంది. అయినా తన హద్దులు ఏమిటన్నది తనకు తెలుసని తాను ధరించే దుస్తులు ఆయా పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయని చెప్పింది. తాను పాత్రలు నచ్చితేనే నటించడానికి అంగీకరిస్తానని, అలా ఒప్పుకున్న తర్వాత ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉంటుందని పేర్కొంది. అరకొర తెలివితో ఇలాంటి ప్రశ్నలు వేయవద్దని హెచ్చరించింది. పెళ్లి ఎప్పుడు అన్న మరో అభిమాని ప్రశ్నకు తనకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుందో అప్పుడు చేసుకుంటానని తమన్నా బదులిచ్చింది. (ఇదీ చదవండి: దిల్‌రాజు అల్లుడి కారు చోరీ.. దొంగలించిన వ్యక్తి మాటలకు పోలీసులు షాక్) -
రజనీకాంత్ 'జైలర్'కు మెగాస్టార్ చిరంజీవి చురకలు
ఓ సీనియర్ జర్నలిస్ట్ రాసిన కొత్త పుస్తకాన్ని చిరంజీవి చేతుల మీదగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం కొద్దిరోజుల క్రితమే జరిగింది. ఈ సమయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. భోళా శంకర్, జైలర్ రెండు సినిమాలు రోజుల వ్యవధిలోనే తెరపైకి వచ్చాయి. భోళాశంకర్ భారీ డిజాస్టర్ కాగా, జైలర్ సూపర్ హిట్ కొట్టింది. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ‘జైలర్’ సినిమా సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు అనిరుధ్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. జైలర్ విజయంలో అనిరుధ్ కూడా ఒక కారణమని, ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజీఎం సూపర్ అని రజనీ తెలిపాడు. సినిమా రీరికార్డింగ్‌కి ముందు చూసినప్పుడు అంతగా బెటర్ అనిపించలేదు కానీ.. ఈ సినిమాకు మ్యూజిక్ యాడ్ అయిన తర్వాత జైలర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లిందని ఆయన తెలిపాడు. ఒక రకంగా జైలర్‌ను అనిరుధ్ మ్యూజిక్ మాత్రమే కాపాడిందని రజనీకాంత్ పరోక్షంగా ఒప్పుకున్నాడు. అలాంటి పరిస్థితి మనది కాదు: చిరంజీవి ఒక సినిమాలో చిరంజీవి హీరోయిజం ఎలా ఉండాలో తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'ప్రతి వ్యక్తి జీవితంలో కష్టపడాలి అని మెగాస్టార్ అన్నారు. అభిమానుల కోసం నేను ఎప్పుడూ డ్యాన్స్‌లు, ఫైట్లు చేయాలని ఉంటుంది. నా నుంచి వారు కూడా అదే ఆశిస్తారు. ప్రొడ్యూసర్స్ కూడా నేను ఒళ్ళోంచి కష్టపడి డ్యాన్స్ లు ఫైట్స్ చేస్తేనే ఆనందపడతారు. కొందరు నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్లు సొంతం చేసుకుంటున్నారు. నేను కూడా అలాగే హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని నటించి.. బీజీఎంతో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సినిమాలు చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఉంది. (ఇదీ చదవండి: ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో తెలుగు నటి గాయత్రి) కానీ.. అలా చేస్తే ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరు. అలాంటి పరిస్థితి మనది కాదు. మనం ఆడాలి, నిజంగానే ఫైట్లు చేయాలి. ఒళ్లు హూనం చేసుకోవాలి. అలాచేయకపోతే దర్శక- నిర్మాతలకు, సినిమా చూసే ప్రేక్షకులకు తృప్తి ఉండదు. అలాగే నాకు కూడా తృప్తిగా ఉండదు. అందుకే కష్టపడాలి. కానీ ఒక సీన్లో విషయం లేకున్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ బీజీఎంతోనే మ్యాజిక్ చేస్తున్నారు.' అని చిరంజీవి అన్నారు. ఇప్పుడా కామెంట్లను జైలర్ సినిమాకు నెటిజన్లు లింక్ చేస్తున్నారు. జైలర్ సినిమాను ఉద్దేశించే మెగాస్టార్ ఆ కామెంట్లు చేశాడని కొందరు అంటుండగా.. ఉన్న విషయమే ఆయన చెప్పాడని మరికొందరు అంటున్నారు. -
మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ
సినిమా హిట్ కావాలంటే హీరోలుండాలనేది పాత మాట. అనిరుధ్ కూడా ఉండాలనేది కొత్త మాట. ఎందుకంటే సాదాసీదా మూవీస్‌ని కూడా తన మ్యూజిక్‌తో బ్లాక్‌బస్టర్స్ చేస్తున్నాడు. అతడి పేరే అనిరుధ్ రవిచందర్. రీసెంట్గా రిలీజైన జైలర్, జవాన్ సినిమాలతో మనోడి క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒక్కో సినిమా కోసం రూ.10 కోట్ల వరకు తీసుకునే అనిరుధ్.. అస్సలు డబ్బులు తీసుకోకుండా పాడతాడని మీలో ఎంతమందికి తెలుసు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ప్రస్తుతం దేశంలోనే మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన అనిరుధ్.. ఒక్కో సినిమా కోసం దాదాపు రూ. 10 కోట్లు వరకు తీసుకుంటున్నాడని సమాచారం. తన సినిమాల్లో కాకుండా ఇతర సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటలు కూడా పాడుతుంటాడు. ఇలా పాడుతున్నందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోడు. ఈ విషయాన్ని స్వయంగా అనిరుధ్ బయటపెట్టాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ సంగతి రివీల్ చేశాడు. పాడటం తన ప్రొఫెషన్ కాదని కానీ దాన్ని ఎంజాయ్ చేస్తానని, అందుకే వేరే సంగీత దర్శకులు ఎవరైనా వచ్చి అడిగితే ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వాళ్లకోసం పాట పాడుతానని అనిరుధ్ చెప్పాడు. ఇలా చేయడం వల్ల వాళ్ల కంపోజింగ్ స్టైల్ తెలుస్తుందని, అది తన మ్యూజిక్ స్టైల్‌ని అప్డేట్ చేసుకునే విషయంలో ఉపయోగపడుతుందని అన్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ ఇస్తే కోట్లు తీసుకునే ఓ మ్యూజిక్ డైరెక్టర్.. సింగర్‌గా ఫ్రీగా పాడతాడంటే విశేషమే కదా! (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
ఆ సినిమాల్లో నటించకపోవడమే మంచిది.. తమన్నా సంచలన వ్యాఖ్యలు
తమిళసినిమా: కొందరు బాలీవుడ్ హీరోయిన్ల పరిస్థితి ఒడ్డు దాటేవరకు ఓడన్నా, దాటిన తర్వాత బోడన్నా అన్న సామెతలా ఉంది. దక్షిణాది చిత్రాల్లో అవకాశాల కోసం పాకులాడి దర్శక నిర్మాతల ఆసరా, ప్రేక్షకుల ఆదరణతో ఉన్నత స్థాయికి ఎదిగి ఆ తర్వాత అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో, ఇక తమకు అవకాశాలు రావని తెలియడంతో, ఇక ఆచిత్ర పరిశ్రమతో పనిలేదు అన్నట్లుగా ప్రవర్తించడం ఆనవాయితీగా మారింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదేనేమో. ఆమధ్య నటి ఇలియానా, తాప్సి వంటి వారు దక్షిణాది చిత్రాలతో ఎదిగి డబ్బు కూడబెట్టుకుని ఆ తర్వాత ముంబైకి మకాం మార్చి దక్షిణాది చిత్ర పరిశ్రమను కించపరిచేలా విమర్శలు చేసి ఆ తర్వాత నాలుక కరచుకుని అలా అనలేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నటి తమన్నా పరిస్థితి కూడా ఇలానే ఉంది. 18 ఏళ్లు తెలుగు చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ మిల్కీబ్యూటీని దక్షిణాది ప్రేక్షకులు ఇప్పటికీ నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకు కారణం ఇటీవల విడుదలైన జైలర్ చిత్రమే నిజానికి. ఈ చిత్రంలో తమన్నా పెద్దగా నటించిందేమీ లేదు. ఒక్క పాటలో అంగాంగ ప్రదర్శన చేయడం తప్పా. అలాంటిది ఈమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దక్షిణాది చిత్రాల్లో కమర్షియల్ అంశాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని చిత్రాలు అయితే తన పాత్రను కథకు సంబంధం లేకుండానే ఉంటున్నాయని చెప్పారు. దర్శకులకు ఆ కొరతను సరి చేయమని చెప్పిన ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. అందుకే అలాంటి చిత్రాల్లో నటించడం ఇష్టం లేక తప్పుకున్నానని చెప్పారు. దక్షిణాది భాషా చిత్రాల్లో హీరోలను సహించలేనంతగా ఆదరించేంతగా కథ చిత్రాలను రూపొందిస్తున్నారని అన్నారు. అలాంటి చిత్రాల్లో నటించకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే నటించడం అంటే తనకు ఇష్టమని, జయాపజయాల గురించి పెద్దగా పట్టించుకోనని తమన్నా భాటియా అన్నారు. -
రజనీకాంత్ జూదంలో ఎన్నో కోట్లు పోగొట్టుకున్నాడా..?
రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కిన జైలర్ చిత్రం రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విజయం సాధించడంతో రజనీకాంత్‌కు రూ.100 కోట్ల చెక్కు, కారుతో సత్కరించారు చిత్ర నిర్మాత కళానిధి మారన్. అలాగే దర్శకుడు నెల్సన్, సంగీత దర్శకుడు అనిరుధ్‌లకు కూడా ఆయన లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చారు. జైలర్ సక్సెస్ మీటింగ్‌లో మాట్లాడిన రజనీ కూడా కళానిధి మారన్ కొని ఇచ్చిన కారులో వచ్చాను. ఇప్పుడిప్పుడే ధనవంతుడయ్యానన్న ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: సూర్య,జ్యోతిక వేరు కాపురం.. కన్నీళ్లు తెప్పిస్తున్న కార్తీ మాటలు) సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ఈ స్పీచ్‌పై కోలీవుడ్‌లో ప్రముఖ సినిమా క్రిటిక్ బిస్మీ ఇలా స్పందించాడు. రజనీకాంత్ ప్రసంగం ఒక కోణంలో సరైనదేనని ఆయన చెప్పుకొచ్చాడు. కానీ కళానిధి మారన్‌కు మరో కోణంలో ఈ వ్యాఖ్యలు అతిశయోక్తి కలిగించి ఉంటాయని బిస్మి చెప్పాడు. రజనీ సూపర్‌స్టార్ అయినప్పటికీ చాలా ఏళ్లుగా అంబాసిడర్ కారునే వాడేవారు. పదేళ్ల క్రితం వరకు ఆయన అంబాసిడర్ కారునే వాడేవాడని ఆయన తెలిపాడు తర్వాత ఆయన ఇన్నోవా కారుకు మారారని తెలిపాడు. రజనీ తర్వాత వచ్చిన నటీనటులంతా విలాసవంతమైన కార్లలో వస్తుంటే, రజనీ మాత్రం సినిమా షూట్లకు వెళ్లి తిరిగి వచ్చేది సాధారణమైన కారులోనే అని ఆయన తెలిపాడు. రజనీ కాంత్ అప్పట్లో తలచుకుని ఉండుంటే ఎన్నో లగ్జరీ కార్లను కొని ఉండవచ్చు. కానీ అతను సింపుల్‌గానే ఉండాలని ఎందుకు అనుకున్నాడో ఎవరికీ అర్థం కాని ప్రశ్న.. ఎన్నో ఏళ్లుగా అంబాసిడర్ కారు వాడుతున్న రజనీ ఈ మధ్యే ఇన్నోవా కారుకు మారాడని గుర్తుచేశాడు. అందువల్లే కళానిధి మారన్ ఇచ్చిన గిఫ్ట్‌ను ధనవంతుల కారుగా ఆయన చెప్పి ఉండవచ్చు అని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!) ఒక విజయవంతమైన నటుడిగా ఆయన ఎన్నో సినిమాలు తీశాడు. లెక్కలేనన్ని కోట్లు సంపాదించాడు. ఎంతో ధనవంతుడైన రజనీ వద్ద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయో చెప్పడం కష్టం అనే రేంజ్‌కు చేరుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన పరిస్థితి అంతలా లేదని కోలీవుడ్‌లో టాక్. ఇప్పటికే రజనీకాంత్‌తో పాటు ఆయన భార్యపై పలు చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయని కోలీవుడ్ ఇండస్ట్రీలో వినికిడి. జూదగాడు ఓడిపోయాడు ఇదిలా ఉంటే, రజనీ విలాసవంతమైన కార్లు నడపలేదు కానీ జీవితాంతం విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు అని బిస్మీ చెప్పాడు. సినిమాకి కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ ఆ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో తెలియక లాస్ వెగాస్ వెళ్లి జూదం ఆడి ఇక్కడ సంపాదించిన డబ్బంతా రజనీ పోగొట్టుకున్నాడని ఆయన పేర్కొన్నాడు. ఎంతో కష్టపడి ఇక్కడ సంపాదించడం కొన్ని నిమిషాల్లోనే ఆ డబ్బంతా అక్కడ పోగొట్టుకుని ప్రస్తుత జీవితాన్ని రజనీ గడుపుతున్నాడని తెలిపాడు. అలాంటప్పుడు నేడు కళానిధి మారన్ ఇచ్చిన లగ్జరీ కారు ఆయనకు ఇప్పటి పరిస్థితిల్లో గొప్పగానే ఉంటుందని తెలిపాడు. ప్రస్తుతం రజనీ వద్ద ఎలాంటి లగ్జరీ కారు లేనందునే కళానిధి మారన్ ఈ కానుకను ఇచ్చాడని తమిళనాట ప్రచారం జరుగుతుంది. రజనీకాంత్ గురించి బిస్మీ చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. లాస్ వెగాస్‌లో ఆయన జూదం ఆడుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్టింట ఉన్నాయి. అప్పట్లో ప్రధాన నేషనల్ మీడియా ఛానల్స్ కూడా ఇదే విషయంపై పలు కథనాలను కూడా ప్రచురించింది. -
జైలర్ సినిమాను తిరస్కరించిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఓ లవ్ స్టోరీ, రెండు,మూడు పాటలు, ఫైటింగ్‌లు.. చాలా సినిమాల్లో ఇదే జరుగుతుంది. కానీ కొన్ని చిత్రాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. అందులో ఒకటి జైలర్. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్ లేదు, రొమాంటిక్ సాంగ్స్ లేవు, రౌడీలను హీరో చితక్కొట్టే సన్నివేశాలూ పెద్దగా లేవు. అయినా బొమ్మ బ్లాక్‌బస్టర్.. అదీ రజనీకాంత్‌కు, ఆయన ఎంచుకున్న కథకు ఉన్న సత్తా! కొంతకాలంగా వరుస అపజయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆయన జైలర్‌తో దుమ్ములేపాడు. జైలర్ కథ ఫస్ట్ ఆయనకే వినిపించాడా? ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతటి భారీ బ్లాక్‌బస్టర్ సినిమాను ఓ హీరో చేజేతులా వదిలేనుకున్నాడంటూ కోలీవుడ్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి! డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మొదట ఈ కథను చిరంజీవికి వినిపించాడట! అయితే పెద్దగా పాటలు గట్రా లేకపోవడంతో చిరు అంతగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఏమని సమాధానం చెప్పాలో తెలియక తర్వాత చూద్దాంలే అని దాటవేశాడట. ఒకరికి బ్లాక్‌బస్టర్.. మరొకరికి డిజాస్టర్ విషయం అర్థమైన నెల్సన్.. రజనీకాంత్‌ను కలవగా ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట! ఇకపోతే రజనీ జైలర్(ఆగస్టు 9న), చిరంజీవి భోళా శంకర్ (ఆగస్టు 11న) కేవలం రెండు రోజుల వ్యవధితో థియేటర్లలో విడుదలయ్యాయి. భోళా శంకర్ ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని అపజయాన్ని మూటగట్టుకోగా జైలర్ హిట్ టాక్‌తో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. చదవండి: రైతు బిడ్డకు 26 ఎకరాలు, 4 కార్లు, కోట్ల ఆస్తి?.. ప్రశాంత్ తండ్రి ఏమన్నాడంటే? -
హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!
రజనీకాంత్ పేరు చెప్పగానే సూపర్‌స్టార్ అనే పదం గుర్తొస్తుంది. ఎందుకంటే 170 సినిమాలతో ప్రేక్షకులకు అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్నాడు. ఇలాంటి వ్యక్తి ఏదైనా మాట్లాడాడు అంటే చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. కానీ తాజాగా సొంత కుటుంబానికి చెందిన వ్యక్తికి ఎలివేషన్ ఇవ్వడం కోసం హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే అవమానించినంత పనిచేశాడు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ఏం జరిగింది? సూపర్‌స్టార్ రజనీకాంత్ చాలా ఏళ్ల నుంచి హిట్ అనేది లేదు. అలాంటి ఇతడికి 'జైలర్' మూవీ రూపంలో అద్భుతమైన కంబ్యాక్ దక్కింది. స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ టేకింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాంటి అంశాలు సినిమాకు బాగా కలిసొచ్చాయి. దీంతో రూ.600 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా చెన్నైలో 'జైలర్' సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులో మాట్లాడుతూ.. రజనీ దర్శకుడు నెల్సన్‌ని అవమానించాడు! (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) రజనీ ఏమన్నాడు? రీరికార్డింగ్ జరగడానికి ముందు 'జైలర్' సినిమాని నెల్సన్ ఫ్రెండ్, సన్ పిక్చర్స్‌కి చెందిన ఓ వ్యక్తితో కలిసి తాను చూశానని చెప్పాడు. నెల్సన్ ఫ్రెండ్ సూపర్‌హిట్ అని చెప్పగా, మరోవ్యక్తి యావరేజ్ అన్నాడని తనకు మాత్రం అబోవ్ యావరేజ్ అనిపించిందని రజనీ చెప్పాడు. కానీ అనిరుధ్ రీరికార్డింగ్ సినిమాకు చాలా ప్లస్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. దర్శకుడికి అవమానం! రజనీ ఇలా మాట్లాడటం ఇదే కొత్త కాదు. గతంలో 'భాషా' సినిమా విషయంలో ఇలాంటి కామెంట్స్ చేశాడు. అయితే ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఎవరెంత పనిచేసినా దర్శకుడు క్రెడిట్ తక్కువ చేయడానికి అస్సలు లేదు. 'జైలర్' విషయంలో అనిరుధ్ ని మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ దర్శకుడిని తక్కువ చేసేలా రజనీ మాట్లాడటం సరికాదని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఇలా ఏదైనా చెప్పాల్సి వస్తే.. అది వ్యక్తిగతంగా ఉండాలి గానీ స్టేజీపై అందరి ముందు చెప్పడం కరెక్ట్ కాదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. (ఇదీ చదవండి: టచ్ చేస్తూ ప్రశాంత్ గొడవ.. రతిక మాస్ వార్నింగ్!) -
ఆ ముగ్గురికి కార్లు.. ఈ 300 మందికి గోల్డ్ కాయిన్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 'జైలర్' హిట్ కావడం మాటేమో గానీ.. నిర్మాత కళానిధి మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బి అయిపోతున్నారు. ఎందుకంటే పెట్టిన బడ్జెట్‌కి రెండు మూడు రెట్లు లాభాలు వచ్చేసరికి ఆయన ఆపడం ఎవరి తరం కావట్లేదు. దీంతో అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు ఏకంగా 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. (ఇదీ చదవండి: ఇన్నాళ్లకు ఓటీటీలోకి శ్రియ సినిమా.. తెలుగులోనూ రిలీజ్!) సాధారణంగా ఏ సినిమా హిట్ అయినాసరే నిర్మాత ఫుల్ హ్యాపీగా ఫీలవుతారు. తెలుగు ప్రొడ్యూసర్స్‌లో కొందరు మాత్రం హీరోకి లేదా దర్శకుడికి ఖరీదైన కారు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తుంటారు. 'జైలర్' నిర్మాత కళానిధి మారన్ కూడా అలానే చేశారు. హీరో రజనీ బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్-మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి ఖరీదైన పోర్సే కార్లని గిఫ్ట్స్‌గా ఇచ్చాడు. ఇది ఇక్కడితో అయిపోలేదు. ఓ సినిమా తీయాలంటే హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కష్టపడితే పని అయిపోదు కదా. ఈ క్రమంలోనే 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి.. నిర్మాత కళానిధి మారన్ తలో గోల్డ్ కాయిన్ చొప్పున ఇచ్చారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) Mr.Kalanithi Maran felicitated more than 300 people who worked for #Jailer with gold coins today. #JailerSuccessCelebrations pic.twitter.com/qEdV8oo6dB — Sun Pictures (@sunpictures) September 10, 2023 -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 23 సినిమాలు
మరో వీకెండ్‌కి అంతా రెడీ అయిపోయింది. గురువారం కృష్ణాష్టమి సందర్భంగా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'జవాన్' చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వీటిపై భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు ఓటీటీలోనూ.. ఈ శుక్రవారం ఒక్కరోజే దాదాపు 23 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో రజనీకాంత్ 'జైలర్' అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' Day-3 హైలైట్స్.. టాస్క్‌లో గెలిచిన ఇద్దరు!) అయితే 'జైలర్' మూవీ ఒక్కటి మాత్రమే ఆసక్తికరంగా ఉందంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే 'హడ్డీ' అనే హిందీ చిత్రం, 'లవ్' అనే తమిళ చిత్రం కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఓవరాల్‌గా 22 కొత్త చిత్రాలు, వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లో రిలీజ్ కానున్నాయి. ఇంతకీ ఆయా సినిమాలేంటి? ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయనేది ఇప్పుడు చూసేద్దాం. దిగువన 'స్ట్రీమింగ్ అవుతున్నాయి', 'ఇప్పటికే స్ట్రీమింగ్' అని ఉన్నావి గురువారం రిలీజైపోయినట్లు అర్థం. ఈ శుక్రవారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ ఏ టైమ్ కాల్డ్ యూ - కొరియన్ సిరీస్ బర్నింగ్ బాడీ - స్పానిష్ సిరీస్ రోజా పెరల్స్ టేప్స్ - స్పానిష్ సినిమా సెల్లింగ్ ద ఓసీ: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ స్పై వూప్స్ - ఇంగ్లీష్ సిరీస్ డియర్ చైల్డ్ - జర్మన్ సిరీస్ (ఇప్పటికే స్ట్రీమింగ్) గామేరా రీ బర్త్ - జపనీస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) కుంగ్ ఫూ పాండ: ద డ్రాగన్ నైట్ సీజన్ 3 -ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) టాప్ బాయ్ సీజన్ 3 - ఇంగ్లీష్ సిరీస్ (స్ట్రీమింగ్) వర్జిన్ రివర్ సీజన్ 5: పార్ట్ 1 - ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) వాట్ ఇఫ్ - ఇంగ్లీష్ సినిమా - తగలాగ్ సినిమా (స్ట్రీమింగ్) అమెజాన్ ప్రైమ్ సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్ - ఇంగ్లీష్ మూవీ జైలర్ - తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) క్యారీ ఆన్ జెట్టా - పంజాబీ చిత్రం (ఆల్రెడీ స్ట్రీమింగ్) జీ5 హడ్డీ - హిందీ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) ఆహా లవ్ - తమిళ సినిమా ఫ్యామిలీ ధమాకా - తెలుగు రియాలిటీ షో జియో సినిమా యే హై ప్లానెట్ ఇండియా - హిందీ డాక్యుమెంటరీ సోనీ లివ్ లొక్కీ చెహ్లే - బెంగాలీ సినిమా టెన్ పౌండ్స్ పొమ్స్ - ఇంగ్లీష్ సిరీస్ బుక్ మై షో లవ్ ఆన్ ద రోడ్ - ఇంగ్లీష్ మూవీ లయన్స్ గేట్ ప్లే ద బ్లాక్ డీమన్ - ఇంగ్లీష్ చిత్రం ఆపిల్ ప్లస్ టీవీ ద ఛేంజ్లింగ్ - ఇంగ్లీష్ సిరీస్ (ఇదీ చదవండి: 'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?)