Jersy
-
వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌పై ఆస్ట్రేలియా కన్నేసింది. ఈ మెగా టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచి ఆరోసారి టైటిల్‌ను ముద్దాడాలని ఆసీస్ భావిస్తోంది. ఈ మెగా ఈవెంట్ కోసం అందరికంటే ఆస్ట్రేలియానే తమ జట్టును ప్రకటించింది. ఈ టోర్నీ కోసం కంగారూలు తమ వ్యూహాలను సిద్దం చేసుకుంటారు. ఇందులో భాగంగానే వరల్డ్‌కప్‌కు ముందు ఆతిథ్య భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో కమ్మిన్స్ సైన్యం తలపడనుంది. వరల్డ్‌కప్‌కు జెర్సీ విడుదల చేసిన ఆసీస్.. ఈ మెగా ఈవెంట్‌కు ధరించబోయే తమ నూతన జెర్సీని క్రికెట్ ఆస్ట్రేలియా ఆవిష్కరించింది. యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో కాస్త కొత్తగా కనిపిస్తున్న జెర్సీపై ఎడమవైపు వన్డే ప్రపంచకప్ 2023 అని రాసి ఉండగా.. మధ్యలో ఆస్ట్రేలియా అని ఇంగ్లీష్‌లో .. కుడివైపు ఆస్ట్రేలియా చిహ్నం ఉంది. కాగా ఆస్ట్రేలియా జెర్సీ స్పాన్సర్‌గా ప్రముఖ భారతీయ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉంది. ఇందుకు సంబంధిచిన ఫోటోలను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్(ఎక్స్)లో షేర్ చేసింది. ఇక ఇప్పటికే ఈ టోర్నీ కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు తమ జెర్సీలను విడుదల చేశాయి. వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న భారత్‌తో తలపడనుంది. చదవండి: ODI World Cup 2023: వరల్డ్‌కప్ ట్రోఫీని ఎవరు తయారు చేశారో తెలుసా.. ధర ఎంతంటే? Here it is! Our 2023 Men’s World Cup kit ready for action in India 🔥 #CWC23 #KitWeek pic.twitter.com/uOLgPAYvT5 — Cricket Australia (@CricketAus) September 22, 2023 -
కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్‌రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా!
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 16వ సీజన్‌కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు ఆయా ఫ్రాంచైజీలు ఒకొక్కటిగా తమ కొత్త జెర్సీలను విడుదల చేస్తున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ కొత్త జెర్సీని ఆవిష్కరించింది. ఆ జట్టు స్టార్ క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్‌లు తమ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఫోటోలను సన్‌రైజర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అదే విధంగా ఇందుకు సంబంధించిన ఓ వీడియోను కూడా ఎస్ఆర్హెచ్ అభిమానులతో పంచుకుంది. కాగా ఎస్ఆర్హెచ్ తమ పాత జెర్సీలో పూర్తి స్థాయిలో మార్పులు చేయకుండా.. కాషాయానికి కాస్త నల్లరంగును అద్దింది. అదే విధంగా ఆరంజ్ కలర్ లో ఉన్న ట్రాక్ ప్యాంటు స్థానంలో పూర్తి బ్లాక్ కలర్ ప్యాంటు తీసుకొచ్చారు. కాగా ఆరెంజ్ ఆర్మీ కొత్త జెర్సీ.. మొట్టమొదటి సౌతాఫ్రికా20 లీగ్‌లో టైటిల్ నెగ్గిన సన్‌రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జెర్సీని పోలి ఉంది. ఇక ఈ ఏడాది సీజన్లో ఎస్ఆర్హెచ్ తమ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఐడెన్ మార్కరమ్‌ను ఎంపిక చేసింది. అతని సారథ్యంలోని సన్ రైజర్స్ ఈస్ట్రరన్ కేప్ జట్టు తొట్ట తొలి సౌతాఫ్రికా20 లీగ్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. Idhi, Orange Fire 🔥 Buy your tickets now to watch your favourite #Risers in this brand new jersey soon 💥 🎟️ - https://t.co/ph5oL4pzDI#OrangeFireIdhi #OrangeArmy #IPL2023 pic.twitter.com/lRM75Yz6kO — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 ℍ𝔼ℝ𝔼. 𝕎𝔼. 𝔾𝕆. 🧡 Presenting to you, our new #OrangeArmour for #IPL2023 😍@StayWrogn | #OrangeArmy #OrangeFireIdhi pic.twitter.com/CRS0LVpNyi — SunRisers Hyderabad (@SunRisers) March 16, 2023 చదవండి: IPL 2023: శ్రేయస్ అయ్యర్ దూరం..! కేకేఆర్ కొత్త కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్! -
గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించిన ఐపీఎల్
గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఐపీఎల్ నిర్వహకులు రూపొందించారు. తద్వారా ఐపీఎల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఐపీఎల్-2022 ఫైనల్ జరగుతున్న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ జెర్సీని ఆవిష్కరించారు. ఈ జెర్సీపై ఐపీఎల్ 15లో ఆడుతున్న 10 జట్ల లోగోలు ఉన్నాయి. ఈ జెర్సీ 66 మీటర్ల పొడవుతో పాటు 42 మీటర్ల వెడల్పు ఉంది. ఇక ఈ జెర్సీకి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 ముగింపు వేడుకులు అంబరాన్ని అంటాయి. ముగింపు కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణవీర్ సింగ్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తమ ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చదవండి: కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్ World's Largest Jersey created at IPL 2022 Closing Ceremony. pic.twitter.com/A5JD6LY3nI — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2022 Vande Mataram in IPL 2022 Final with over 1,00,000 people, beautiful!pic.twitter.com/0Y6XC0ObnC — Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2022 -
అదిరిపోయే వేలం.. ప్రారంభ ధరే రూ.38 కోట్లా?
వేలం పాటలో ప్రాచీన వస్తువులకు, అరుదైన వాటికి ఎక్కువ ధర పలుకుతుండడం చూస్తుంటాం. ఒక్కోసారి సెలబ్రిటీలు, మేధావులకు సంబంధించిన గుర్తులు సైతం భారీ ధరకు పోతుంటాయి. అలాంటిది ఒక వస్తువు.. ప్రారంభ ధరనే భారీగా ఉండడం ఇక్కడ విశేషం. అర్జెంటీనా సాకర్ దిగ్గజం డియెగో మారడోనా, జెర్సీని వేలం వేయబోతున్నారు. అది మాములు జెర్సీ కాదులేండి. 1986 సాకర్ వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ జెర్సీనే ధరించాడు. రెండుసార్లు గోల్స్ చేయడమే కాదు.. అందులో ఒకటైన హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ కూడా నమోదు అయ్యింది ఈ మ్యాచ్‌లోనే. బుధవారం నుంచి నెంబర్ 10 ఉన్న ఈ బ్లూ జెర్సీని వేలం వేయడం మొదలుపెట్టారు. ఆరంభ ధర ఎంతో తెలుసా? 5 మిలియన్ డాలర్ల పైనే. అంటే.. మన కరెన్సీలో సుమారు 38 కోట్ల రూపాయలపైనే!. మే 4వ తేదీ వరకు ఈ వేలంపాట కొనసాగనుంది. న్యూయార్క్‌కు చెందిన సోత్‌బైస్ ఫైన్ ఆర్ట్స్ కంపెనీ.. ఈ వేలం నిర్వహించనుంది. క్రీడా ప్రపంచంలో ఇప్పటిదాకా 5.6 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది అమెరికన్ బేస్‌బాల్ ప్లేయర్ బాబే రూత్ జెర్సీ. న్యూయార్క్ యాంకీస్ తరపున ఆయన ఆడినప్పుడు ధరించిన జెర్సీ.. 2019లో వేలంపాటలో ఈ రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు మారడోనా జెర్సీ ఆ రికార్డును బద్ధలు కొట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. చదవండి: చిటికెడు మట్టి రూ.4 కోట్లు -
మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే...
Pakistan write UAE 2021 instead of India 2021 on their jersey: రాబోయే టీ 20 ప్రపంచకప్ టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నమెంట్ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. అయితే భారత్ నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆయా దేశాలు ప్రత్యేక జెర్సీలు రూపొందించుకుంటున్నాయి. అయితే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు అన్నీ ‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఇండియా 2021’ అనే లోగో ఉన్న జెర్సీలను మాత్రమే ధరించాల్సి ఉంది. ఈ క్రమంలో పాకిస్తాన్ తన వక్ర బుద్దిని మరోసారి చూపించుకుంది. అయితే పాకిస్తాన్ మాత్రం తమ జెర్సీపై 'ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ యుఏఈ 2021' అని రాసింది. ఇది ఇప్పుడు వివాదంగా మారింది. దీనికి సంబంధించి నెట్టింట తెగ చర్చలు జరగుతున్నాయి. పాకిస్తాన్ జెర్సీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పిసీబి ఇంకా అధికారికంగా జెర్సీని ఆవిష్కరించాల్సి ఉంది. క్వాలిఫైయింగ్ రౌండ్లో పాల్గొనున్న జట్లు ఇప్పటికే టోర్నమెంట్ కోసం తమ జెర్సీని అధికారికంగా ఆవిష్కరించాయి. కొన్ని రోజుల క్రితం తమ జెర్సీని విడుదల చేసిన స్కాట్లాండ్ కూడా తమ జెర్సీపై ‘ఇండియా 2021’ అని రాసింది. కాగా భారత్‌లో కరోనా కారణంగా యూఏఈ, ఒమన్ వేదికల్లో టీ 20 ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. చదవండి: IPL 2021 CSK Vs PBSK: లైవ్‌లో లవ్ ప్రపోజ్ చేసిన చెన్నై ఆటగాడు.. అమ్మాయికి కూడా ఓకే -
బ్లూ కలర్ జెర్సీలో కనిపించనున్న ఆర్సీబీ.. ఎందుకంటే?
RCB IPL Jersey 2021: యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ రెండో దశలో తమ మొదటి మ్యాచ్‌లో ఎరుపు రంగు జెర్సీలో కాకుండా బ్లూ కలర్ జెర్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగనుంది. రాయల్ ఛాలెంజర్స్ సెప్టెంబర్ 20 న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో.. రెండేళ్లుగా కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి కృతజ్ఞతగా రెడ్ జెర్సీకి బదులుగా బ్లూ జెర్సీని కోహ్లి సేన ధరించనుంది. "కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అమూల్యమైన సేవకు నివాళి అర్పించేందకు...ఫ్రంట్‌లైన్ యోధుల పీపీఈ కిట్ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం ఆర్సీబీ సభ్యులుగా మాకు గర్వకారణం’ అని ట్విట్ చేసింది. కాగా గత కొద్ది సీజన్ల నుంచి ఏదో ఒక మ్యాచ్ లో పర్యావరణం పట్ల తమ మద్దతును తెలపడానకి ఆకుపచ్చ జెర్సీని ఆర్సీబీ ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3 న కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ జట్టు ప్రకటించింది. కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధవంతంగా వాయిదా పడడంతో ఇప్పుడు బ్లూ జెర్సీను ధరించనునన్నారు. అయితే ఫేజ్-1 రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కాగా కాగా సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. చదవండి: Surya Kumar Yadav: పృథ్వీ షా విషెస్.. నవ్వులు పూయిస్తోన్న ఫొటో! United to help and support the frontline warriors who have worked selflessly and tirelessly to fight the Covid Pandemic. 🙌🏻🙌🏻 We are #1Team1Fight! 🔴🔵#PlayBold #WeAreChallengers #IPL2021 #KKRvRCB pic.twitter.com/W7fMXnvwrL — Royal Challengers Bangalore (@RCBTweets) September 14, 2021 -
మారడోనా జెర్సీ ధర ఎంతో తెలుసా..
లండన్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం.. సాకర్ స్టార్ ప్లేయర్ డీగో మారడోనా ఈ బుధవారం గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అర్జెంటీనా దేశం మాత్రమే గాక యావత్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు మారడోనా లేడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. మారడోనాను కడసారి చూసుకోవాలని ఫుట్‌బాల్ అభిమానులు తరలివచ్చారు.. అతని పార్థివ దేహాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ సందర్భంగా అభిమాన ఆటగాడు దూరమయ్యాడని బాధపడుతున్న అభిమానులకు మారడోనా జెర్సీని దక్కించుకునే అవకాశం కలిగింది. 1986 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ వేలం వేయనున్నారు. అసలు విషయంలోకి వెళితే.. 1986 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మారడోనా చేసిన ఒక గోల్ వివాదాస్పదంగా మారింది. చేత్తో ఫుట్‌బాల్‌ను గోల్‌పోస్ట్‌లోకి పంపించినట్లు అప్పటి ఇంగ్లండ్ ఆటగాళ్లు మ్యాచ్ రిఫరీ వద్ద ఆరోపించారు. కానీ రిఫరీ ఎలాంటి చర్య తీసుకోలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత మారడోనా చేసిన ఆ గోల్‌ను 'హ్యాండ్ ఆఫ్ గాడ్'(దేవుడిచ్చిన చేయి)గా అభివర్ణించారు. ఆ తర్వాత తాను చేత్తోనే బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపినట్లు మారడోనా ఒక ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ మ్యాచ్‌లో మారడోనా ధరించిన జెర్సీ మాంచెస్టర్‌లోని ఇంగ్లండ్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియంలో ఉంచారు. వాస్తవానికి మ్యాచ్ ముగిసిన తర్వాత మారడోనా, ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ స్టీవ్ హడ్జ్ సరదాగా తమ జెర్సీలను మార్చుకున్నారు. అప్పటినుంచి మారడోనా జెర్సీ హడ్జ్ వద్దే ఉండిపోయింది. (చదవండి : గుడ్‌బై మారడోనా) తాజాగా మారడోనా అస్తమయం తర్వాత అతను ధరించిన జెర్సీని వేలం వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 2 మిలియన్ డాలర్లగా కనీస ధరగా నిర్ణయించింది. అయితే మారడోనా జెర్సీని వేలం వేయడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫుట్‌బాల్ చరిత్రలో అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలిపిన ఒక దిగ్గజానికి ఇలాగేనా గౌరవం ఇచ్చేది అంటూ మండిపడుతున్నారు. ఒకవేళ జెర్సీ వేలంలోకి వచ్చినా ఇంకా ఎక్కువ ధరకు అమ్ముడయ్యే అవకాశం ఉంటుంది. అయినా ఫుట్‌బాల్‌కు మారడోనా చేసిన సేవలు వెలకట్టలేనిదంటూ అభిమానులు పేర్కొన్నారు. (చదవండి : మరో ప్రపంచానికి మారడోనా) ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో అరుదైన, లెక్కలేనన్ని ఘనతలు సొంతం చేసుకున్న డీగో... నాలుగు ప్రపంచకప్‌లు ఆడి 1986లో తమ జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. 1990లో అతని సారథ్యంలోనే అర్జెంటీనా రన్నరప్‌గా నిలిచింది. చనిపోయే సమయానికి మారడోనా అర్జెంటీనా ప్రీమియర్ డివిజన్ క్లబ్ జిమ్నాసియా (సీజీఈ)కి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్ చివర్లో వచ్చిన వివాదాలతో అప్పటి వరకు సాధించిన ఘనతలపై నీలి నీడలు కమ్ముకున్నా... మైదానంలో అతని మంత్రముగ్ధమైన ఆటను చూసినవారెవరూ మారడోనాను మరచిపోలేరు. ‘గోల్డెన్ బాయ్’గా మారడోనా సాధించిన ఖ్యాతి అజరామరం. -
మారిపోనున్న టీమిండియా ఆటగాళ్ల జెర్సీలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు కిట్ స్పాన్సర్‌గా ప్రఖ్యాత స్పోర్టింగ్ కంపెనీ ‘నైకీ’ 15 ఏళ్ల బంధం అధికారికంగా ముగిసింది. టీమిండియా కిట్ అండ్ మర్కండైజ్ స్పాన్సర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్ అపెరల్ అండ్ యాక్సెసరీస్‌తో బీసీసీఐ తాజాగా ఒప్పం దం కుదుర్చుకుంది. ఇ–స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్)కు చెందినదే ఈ ఎంపీఎల్ స్పోర్ట్స్. ఇకపై భారత సీనియర్ పురుషుల, మహిళల జట్లు, అండర్–19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్’ లోగో కనిపిస్తుంది. నవంబర్ 27 నుంచి ఆస్ట్రేలియాతో జరిగే తొలి వన్డే నుంచి ఈ ఒప్పందం అమల్లోకి రానుండగా... 2023 డిసెంబర్ వరకు మూడేళ్ల కాలానికి ఎంపీఎల్–బీసీసీఐ భాగస్వామ్యం కొనసాగుతుంది. టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఈ గేమింగ్ కంపెనీలో గరిమెళ్ల సాయి శ్రీనివాస్ కిరణ్, శుభమ్ మల్హోత్రా భాగస్వాములు. ఐపీఎల్ తర్వాత... 2006 జనవరి 1 నుంచి ‘నైకీ’ టీమిండియాకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. కాలానుగుణంగా ఈ ఒప్పందం రెన్యువల్ అవుతూ రాగా... గత నాలుగేళ్ల కాంట్రాక్ట్‌లో ‘నైకీ’ భారత జట్టు ఆడే ప్రతీ మ్యాచ్‌కు రూ. 85 లక్షల చొప్పున ఇవ్వడంతో పాటు రాయల్టీగా మరో రూ. 30 కోట్లు బోర్డుకు చెల్లించింది. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో తాము ఇంత చెల్లించలేమని, ఆ మొత్తాన్ని తగ్గిస్తే కిట్ స్పాన్సర్‌గా కొనసాగుతామని ‘నైకీ’ కోరగా భారత బోర్డు అందుకు అంగీకరించలేదు. కొత్తగా బిడ్లను ఆహ్వానించగా, ఎవరూ ముందుకు రాలేదు. దాంతో చివరి తేదీని మళ్లీ పొడిగించాల్సి వచ్చింది. ఆ తర్వాత అడిడాస్, ప్యూమావంటి టాప్ కంపెనీలతో పాటు డ్రీమ్ 11 స్పోర్ట్స్, రాంగ్, వాల్ట్ డిస్నీ కూడా టెండర్లు కొనుగోలు చేశాయి. కానీ మ్యాచ్‌కు ఇవ్వాల్సిన మొత్తంపైనే వెనక్కి తగ్గిన వీరు టెండరు దాఖలు చేయలేదు. చివరకు నిబంధనలు మార్చి మరీ ఇప్పుడు ‘ఎంపీఎల్’కు బీసీసీఐ కాంట్రాక్ట్ కట్టబెట్టింది. ఎంపీఎల్ ఇప్పుడు ఒక్కో మ్యాచ్‌కు రూ. 65 లక్షల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఏడాదికి రూ.3 కోట్ల చొప్పున మొత్తం రూ. 9 కోట్లు అదనంగా రాయల్టీ కింద అందజేస్తుంది. ఈ మూడేళ్ల కాలంలో భారత జట్టు కనీసం 142 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఐపీఎల్–2020లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఎంపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
ఆట ముగిసింది
నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో రీమేక్ అయింది. తెలుగు చిత్రాన్ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ హిందీ రీమేక్‌ను డైరెక్ట్ చేశారు. నాని పాత్రను షాహిద్ కపూర్ పోషించారు. కోవిడ్ వల్ల చాలా సినిమాల్లానే ఈ సినిమా చిత్రీకరణ కూడా ఆగిపోయింది. అయితే ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను ఉత్తరాఖండ్‌లో తిరిగి ప్రారంభించి, పూర్తి చేశారు. ఈ సినిమాలో క్రికెట్ ప్లేయర్‌గా కనిపించడానికి పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నారు షాహిద్. మృణాల్ థాకూర్ కథానాయికగా నటించారు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. -
జెర్సీ రీమేక్‌లో అమలాపాల్!
‘‘కథాబలం ఉన్న కథలు, బలమైన పాత్రలు రావడంలేదు. అందుకే సినిమాలు వదిలేద్దామనుకున్నా’’ అని ఇటీవల ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమలా పాల్ చెప్పారు. అయితే కథాబలం ఉన్న స్క్రిప్ట్ కావడంతో ‘ఆమె’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు అమలా పాల్కి మరో బలమైన పాత్ర చిక్కింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో అమలా పాల్‌ను కథానాయికగా అడిగారట. తెలుగు సినిమా చూసినవారికి కథానాయిక శ్రద్ధా శ్రీనాథ్ పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉందో తెలిసే ఉంటుంది. అందుకే ఈ చిత్రాన్ని అమలా పాల్ ఒప్పుకున్నారట. నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ రీమేక్‌ని హీరో రానా నిర్మించనున్నారు. నాని పాత్రలో విష్ణు విశాల్ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా దర్శకుడు ఖరారు కాలేదు. ఇదిలా ఉంటే ఈ చిత్రం హిందీ రీమేక్‌ని ‘దిల్’ రాజు, నాగవంశీ నిర్మించనున్నారు. ఇంకా తారాగణం ఎంపిక కాలేదు. -
వెటోరి జెర్సీకి కివీస్ గుడ్‌బై
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెట్ (ఎన్‌జడ్‌సీ) తమ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ డానియెల్ వెటోరీ సేవలకు చక్కని గుర్తింపునిచ్చింది. అతని జెర్సీ నంబర్ ‘11’కు రిటైర్మెంట్ ఇచ్చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఏ కివీ క్రికెట్ర్ జెర్సీ మీద ఈ నంబర్ కనిపించదు. ‘200పైగా వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన జెర్సీ నంబర్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాం. వెటోరి 11 జెర్సీతో 291 మ్యాచ్‌లాడి అత్యధిక వన్డేలాడిన న్యూజిలాండ్ క్రికెటర్‌గా నిలిచాడు’ అని ఎన్‌జడ్‌సీ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రీలంకతో జరిగే టెస్టు సిరీస్ కోసం తమ ఆటగాళ్ల జెర్సీ నంబర్లను ప్రకటించింది. రెండు టెస్టుల ఈ సిరీస్ ఈ నెల 14 నుంచి గాలే (శ్రీలంక)లో జరుగుతుంది. ఇక్కడి నుంచే కివీస్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ మొదలవుతుంది. -
టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి..
లండన్: టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఇలా ఆటగాళ్లు తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపిండం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై ఉన్న నంబర్‌ను బట్టి ఆ ఆటగాడు ఎవరో ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు.(ఇక్కడ చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్ నుంచే అమలు!) అయితే, టెస్టుల్లో మాత్రం ఇందుకు భిన్నం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు. టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. కాగా, యాషెస్ సిరీస్‌తో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఇరు క్రికెట్ బోర్డులు ఒప్పందంతో యాషెస్‌లో పేర్లు, నంబర్లతో ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. దీనికి సంబంధించి జో రూట్ ధరించిన టెస్టు జెర్సీపై నంబర్, పేరుతో ఉన్న ఫొటోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ట్వీటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. Names and numbers on the back of Test shirts! 🏴🏏 pic.twitter.com/M660T2EI4Z — England Cricket (@englandcricket) July 22, 2019 -
రంగు మార్చడం అవసరమా..!
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే పోరులో భారత జట్టు ధరించే ‘అవే’ జెర్సీని శుక్రవారం బీసీసీఐ విడుదల చేసింది. ముందు భాగంలో ముదురు నీలం రంగు... భుజాలు, వెనక భాగం పూర్తిగా నారింజ రంగుతో కనిపించేలా ఈ జెర్సీని ‘నైకీ’ సంస్థ డిజైన్ చేసింది. కొన్నాళ్ల క్రితం భారత్ ఉపయోగించిన ప్రాక్టీస్ డ్రెస్ పోలికలు ఇందులో కనిపిస్తున్నాయి. రేపు ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ కొత్త జెర్సీతో బరిలోకి దిగుతుంది. ఫుట్‌బాల్ తరహాలో హోం, అవే మ్యాచ్‌లకు వేర్వేరు జెర్సీలను వేసుకునే సంప్రదాయాన్ని ఐసీసీ తొలిసారిగా ఈ ప్రపంచ కప్‌లో ప్రవేశపెట్టింది. భారత్, ఇంగ్లండ్ రెండు జట్లూ నీలి రంగునే వాడుతుండటంతో వాటి మధ్య తేడా చూపించేందుకు టీమిండియా ఆటగాళ్లు నారింజ రంగు జెర్సీని వేసుకోబోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ‘హోమ్’ టీమ్ కాగా, భారత్‌ను ‘అవే’ జట్టుగా నిర్ధారించారు. రంగు మార్చడం అవసరమా..! ప్రపంచ కప్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లు చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమానికి వేర్వేరు జట్ల జెర్సీలు మనసులో ముద్రించుకుపోయే ఉంటాయి. భారత్, ఇంగ్లండ్ టీమ్ రంగులు పేరుకు ‘బ్లూ’ అయినా వీటి మధ్య ఎంతో తేడా ఉంది. అది స్పష్టంగా కనిపిస్తోంది కూడా. పైగా ఫుట్‌బాల్ తరహాలో ఆటగాళ్ల మధ్య గందరగోళానికి కారణమయ్యే ‘కలర్ క్లాషెస్’ క్రికెట్లో కనిపించదు. ఫుట్‌బాల్‌లో 22 మంది ఒకేసారి మైదానంలో ఉండటంతో పాటు సహచరుడికి పాస్‌లు అందిం చడం అతి కీలకమైన అంశం. కాబట్టి ఇబ్బంది లేకుండా పూర్తిగా భిన్నమైన రంగు జెర్సీలను ఆటగాళ్లు ధరిస్తారు. క్రికెట్లో ఇద్దరు బ్యాట్స్‌మెన్ కూడా పిచ్ వదిలి రారు. ఎదురుగా కనిపించే సహచరుడితో సమన్వయం ఉంటే సరిపోతుంది. ఫీల్డింగ్ జట్టు దృష్టి కూడా ఇద్దరు బ్యాట్స్‌మెన్‌పైనే ఉంటుంది తప్ప ఇతర ఆటగాళ్లతో గందరగోళానికి తావు లేదు. మొత్తంగా ఈ జెర్సీ రంగు మార్పు వ్యవహారం పటాటోపం, హంగామా కోసం చేసినట్లనిపిస్తుంది. ఏదో ఒక సాకుతో కాస్త ఆకర్షణ తెచ్చే ప్రయత్నం చేయడం తప్ప వాస్తవంగా చూస్తే ఈ మార్పుకు ఎలాంటి అర్థం లేదు. Presenting #TeamIndia's Away Jersey 🤩🤩🇮🇳🇮🇳 What do you make of this one guys? #TeamIndia #CWC19 pic.twitter.com/TXLuWhD48Q — BCCI (@BCCI) June 28, 2019 -
టీమిండియా కాషాయ జెర్సీ వెనుక బీజేపీ?
న్యూఢిల్లీ/ముంబై: వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా ఆరెంజ్ (కాషాయ) రంగు జెర్సీలను ధరించనుంది. అయితే టీమిండియా ఆరెంజ్ జెర్సీ ధరించడం వెనుక మోదీ ప్రభుత్వ ఒత్తిడి ఉందని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఆరోపించాయి. ఆదివారం టీమిండియా ఇంగ్లాండ్‌తో తలపడనున్న మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీలను ధరించనుంది. కనీసం రెండు రంగుల జెర్సీలను తమ వెంట తెచ్చుకోవాలని ఐసీసీ అన్ని దేశాలను కోరింది. అందులో భాగంగానే టీమిండియా రెండు జెర్సీలతో ఇంగ్లండ్ వెళ్లింది. దేశం మొత్తాన్ని కాషాయికరణ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీ ఆరోపించారు. అసెంబ్లీ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్రికెటర్లు ధరించే జెర్సీలకు ఆరెంజ్ రంగు పులుముతున్నారు. జాతీయ పతాకంలో మూడు వర్ణాలను నిర్ణయించిన వ్యక్తి ముస్లిం అని మోదీ గుర్తుపెట్టుకోవాలి. జెర్సీలకు మరో రంగు ఎంచుకోవాల్సి వస్తే త్రివర్ణాన్ని ఎంచుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్రతిదాన్ని కాషాయికరణ చేయాలకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పద’ని అబు అజ్మీ అన్నారు. ఈ వాదనను బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ వ్యతిరేకించారు. జెర్సీ రంగుపై రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాషాయ రంగును ఎందుకు అంతగా వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ఆరెంజ్ జెర్సీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి గులాబ్రావ్ పాటిల్ అన్నారు. ఆటలకు, రాజకీయాలకు ముడి పెట్టడం సరికాదని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. -
క్రికెటర్ల కష్టం తెలిసింది – నాని
‘‘గౌతమ్ ‘జెర్సీ’ కథ చెప్పగానే ఓకే అన్నాను. త్వరగా సెట్స్‌పైకి వెళ్లడం.. త్వరత్వరగా చిత్రీకరణ పూర్తవడం... ఈ సినిమా పోస్టర్లు, టీజర్ చూసి క్రికెట్ నేపథ్యంలో ఉంటుందనుకుంటున్నారు. కానీ, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అన్నారు నాని. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘జెర్సీ’ ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘36 ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే రంజీ క్రికెటర్ కథ ఇది. రంజీ మ్యాచ్‌లు ఆడుతున్న అతను అంతర్జాతీయ స్థాయిలో ఆడాలనే ప్రయత్నంలో ఉంటాడు. నేను స్కూల్‌డేస్‌లో క్రికెట్ ఆడేవాణ్ణి. సినిమా పిచ్చి ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఆడటం మానేశాను. ‘జెర్సీ’ కోసం ట్రైనింగ్ తీసుకుని ఆడాల్సి వచ్చింది. నేను, నిర్మాత నాగవంశీ స్కూల్‌డేస్‌లో క్లాస్మేట్స్. తను క్రికెట్ చాలా బాగా ఆడతాడు. తను మెయిన్, నేను ఎక్స్ట్రా ప్లేయర్. ఇన్నిరోజుల తర్వాత మమ్మల్ని విధిరాత కలిపిందనుకుంటున్నా. తను చాలా టెర్రిఫిక్, మాస్ ప్రొడ్యూసర్. ఈ సినిమా క్లైమాక్స్ మ్యాచ్ 14రోజులు రాత్రుళ్లు మంచి చలిలో చిత్రీకరించాం. ఈ సినిమా చేస్తున్నప్పుడు క్రికెటర్ల కష్టం తెలిసింది. ఈ సినిమా ప్రాక్టీస్, షూటింగ్ వల్ల బరువు తగ్గాను. ఈ చిత్రాన్ని 20 సార్లు చూశా. సినిమా చూస్తున్నంత సేపు నన్ను నేను మరచిపోయా. ఇందులో నన్ను కాదు.. అర్జున్ పాత్రని మాత్రమే ప్రేక్షకులు చూస్తారు. గౌతమ్ వల్ల ఇండస్ట్రీకి మరో మంచి డైరెక్టర్ దొరికాడు’’ అన్నారు. నాగవంశీ మాట్లాడుతూ– ‘‘తెలుగు సినిమాల్లో ఇదొక కొత్త జానర్‌ని క్రియేట్ చేస్తుంది. ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్ చేసి, 15న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. సినిమా ఈ నెల 19న విడుదల కాదని కొందరు మాట్లాడుతున్నారు. అనుకున్నట్లు 19నే కచ్చితంగా రిలీజ్ చేస్తున్నాం. ముందు తెలుగులో, ఆ తర్వాత చైనాలో విడుదల చేస్తాం’’ అన్నారు. -
ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు
‘నీ వయసు 36 ఏళ్లు. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైరయ్యే ఏజ్. పిల్లల్ని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావ?.. ఎంత ప్రయత్నించినా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు’.... 36 ఏళ్ల అర్జున్ క్రికెట్లో తన కలను నిజం చేసుకోవాలనుకున్నప్పుడు వినిపించిన మాటలు ఇవి. వీటన్నింటినీ తిప్పి కొట్టాడు అర్జున్. మాటలతో కాదు. బ్యాట్‌తో... గ్రౌండ్లో చేసిన రన్స్‌తో. నాని హీరోగా ‘మళ్ళీరావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ ఎండింగ్లో ‘ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు’ అని నాని చెప్పే డైలాగ్ ఇన్స్పైరింగ్గా ఉంది. ‘‘నో సింగిల్స్. నో డబుల్స్. స్ట్రయిట్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు’’ అంటూ టీజర్‌ను షేర్ చేశారు నాని. ‘‘తెలుగులో నేను సొంతంగా డబ్బింగ్ చెబుతున్న సినిమా ‘జెర్సీ’’ అన్నారు శ్రద్ధా శ్రీనాథ్. అనిరు«ద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుంది. -
నాని ‘జెర్సీ’ ఫస్ట్‌లుక్!
కృష్ణార్జున యుద్దం,దేవదాస్ లాంటి రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల ఫలితాలతో నిరాశపడ్డ నాని.. విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. నాని ప్రస్తుతం క్రికెటర్‌గా మారి స్టేడియంలో బౌండరీలు కొట్టేస్తున్నాడు. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ’జెర్సీ’ చిత్రంలో నాని క్రికెటర్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. నూతన సంవత్సరం కానుకగా జెర్సీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. క్రికెటర్‌గా అర్జున్ పాత్రలో నాని నటిస్తుండగా తమిళ సంచలనం అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతమందించడం విశేషం. అర్జున్ సాధించిన విజయాలను ఏప్రిల్ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. VINTAGE SPARKLES At 36 there is nothing left for him to prove in cricket. The dreams and heartburns have been left behind.. 1996-97 Ranji trophy season was just a display of his love for batting.#JERSEY #HappyNewYear2019 @gowtam19 @ShraddhaSrinath @anirudhofficial @vamsi84 pic.twitter.com/t7FNrWXDo8 — Nani (@NameisNani) 31 December 2018 -
తేజుకి పోటీ తప్పడం లేదా..?
మెగా మేనల్లుడిగా మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ మొదట్లో ఫుల్ జోష్‌లో ఉన్న హీరో.. ఈ మధ్య కాస్త తడబడ్డాడు. వరుసబెట్టి ప్లాఫులిస్తున్న ఈ మెగా హీరోకు టైమ్ అస్సలు కలిసి రావడం లేదు. ఈ మధ్యే తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘నేను శైలజా’ ఫేమ్ కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘చిత్రలహరి’ అనే సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయాలని.. అందులోనూ ఏప్రిల్ 19న చేయాలని అనుకున్నట్లు సమాచారం. ఏప్రిల్ మొదటివారంలో మహేష్ బాబు మహర్షి చిత్రం థియేటర్లలో సందడి చేయనుండగా.. చిత్రలహరిని రెండు వారాల గ్యాప్‌తో రిలీజ్చేయాలని భావించారు. అయితే ఇప్పుడు ఇదే డేట్‌కు నాని జెర్సీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే మరి చిత్రలహరిని నానికి పోటీగా వదులుతారో.. లేక వాయిదా వేస్తారో చూడాలి. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
నాని ‘జెర్సీ’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
‘కృష్ణార్జున యుద్ధం’ సినిమా బెడిసికొట్టడంతో.. మళ్లీ రూట్ మార్చి కథాబలం ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాచురల్ స్టార్ నాని. ఇటీవలె ‘దేవదాస్’ సినిమాతో హిట్ కొట్టాడు నాని. ‘మళ్లీరావా’ ఫేమ్ డైరెక్టర్‌తో జెర్సీ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ను ప్రకటించారు మేకర్స్. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ను డిఫరెంట్‌గా రిలీజ్ చేశారు. ఓ బ్యాట్‌పై జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ (ఏప్రిల్ 19)ను ఫిక్స్ చేశారు. ‘యూ టర్న్’ భామ శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. 19 April'19 It’s going to be a heartwarming summer. Promise :)#JERSEY @ShraddhaSrinath @gowtam19 @anirudhofficial @vamsi84 pic.twitter.com/33PC6PT6vr — Nani (@NameisNani) November 23, 2018 -
డబుల్ నాని
గ్రౌండ్లో నాని దూకుడు ఇంకా తగ్గలేదు. పైగా స్పీడ్ పెంచారు. నాని హీరోగా ‘మళ్ళీ రావా..’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘జెర్సీ’. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో కనిపించనున్నారు నాని. ఆయన రెండు లుక్స్‌లో కనిపిస్తారు. ఒకటి యంగ్ లుక్‌లో ఉంటే... మరొకటి 36–40 వయసులో ఉన్న వ్యక్తి పాత్ర. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. నాని, శ్రద్ధా శ్రీనాథ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ 35 శాతం పూర్తయింది. మరి.. క్రికెటర్ అర్జున్‌గా నాని ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేస్తారా? లేక బౌలింగ్, కీపింగ్ కూడా చేయగల సత్తా ఉన్న ఆల్ రౌండర్ అనిపించుకుంటారా? అనే విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరకర్త. -
నాన్‌స్టాప్
గ్రౌండ్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేస్తున్నారు నాని. స్పిన్ బౌలింగ్, ఫాస్ట్ బౌలింగ్ అన్న తేడా లేకుండా బంతిని బాదుతూ ఫీల్డర్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారట. మరి.. ఈ మ్యాచ్‌ను వెండితెరపై చూసేది ఎప్పుడు? అంటే అందుకు కాస్త టైమ్ ఉంది. ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా పీడీవీ ప్రసాద్, నాగవంశీ నిర్మిస్తున్న సినిమా ‘జెర్సీ’. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తున్నారు. క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శరవేగంగా జరుగుతోందని సమాచారం. పెద్ద బ్రేక్స్ తీసుకోకుండా వీలైనంత తొందరగా సినిమాను పూర్తి చేయాలని టీమ్ నిర్ణయించుకున్నారని వినికిడి. అంటే.. నాన్‌స్టాప్‌గా ఈ సినిమాను నాని కంప్లీట్ చేస్తారన్నమాట. ఈ సంగతి ఇలా ఉంచితే... దర్శకుడు విక్రమ్ కె. కుమార్ చెప్పిన కథ విన్న నాని సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారని తాజా ఫిల్మ్‌నగర్ టాక్. -
దీదీకి స్పెషల్ గిప్ట్ పంపిన మెస్సీ
కోల్‌కతా : లెజండరి ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియెనాల్ మెస్సీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అర్జెంటీనా ఆటగాడికి మన దేశంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఫుట్‌బాల్ ప్లేయర్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఒక ప్రత్యేక బహుమతిని పంపారు. మెస్సీ, ‘దీదీ నం 10’ అనే జెర్సీని మమతా బెనర్జీకి స్పెషల్ గిఫ్ట్‌గా పంపించారు. దాంతో పాటు ‘నా స్నేహితురాలికి శుభాకాంక్షలు మీ మెస్సీ’ అనే సందేశాన్ని జెర్సీ మీద ప్రింట్ చేయించారు. ఇంతకు దీదీకి ఈ ప్రత్యేక బహుమానం పంపాడానికి కారణం ఏంటంటే గతేడాది ఫిఫా యూ - 17(ఫిఫా అండర్ సెవంటీన్ వరల్డ్ కప్)ని భారతదేశంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలోని మొత్తం 6 స్టేడియాల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించగా.. ఫైనల్ మ్యాచ్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఫైనల్ మ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు దీదీని అభినందిస్తూ.. మెస్సీ ఈ జెర్సీని ప్రత్యేక బహుమతిగా అందజేశారు. గతంలో డియాగో మారడోనా, రొమారియో, రోనాల్డో వంటి దిగ్గజ క్రీడాకారులు ధరించిన ఈ జెర్సీని మెస్సీ, దీదీ గౌరవార్థం ఆమెకి బహుకరించారు. బార్సిలోనా లెజెండ్స్ ద్వారా మెస్సీ ఈ జెర్సీని నెక్స్ట్ ఫౌండేషన్ నిర్వాహకులకు అందజేశారు. ఈ విషయం గురించి ఫౌండేషన్ స్థాపకుడు కౌషిక్ మౌలిక్ ‘ఈ జెర్సీని వారు దీదీకి స్వయంగా అప్పగించడానికి కుదరక పోవడంతో మాకు అందచేశారు. దీన్ని సీఎమ్‌కు అందిచడం మా బాధ్యత. ఇందుకు గాను మేము సీఎమ్వోను కలవాల్సి ఉంది. ముఖ్యమంత్రి మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున మేము ఆమెని కలిసి ఈ జెర్సీని అందజేస్తాం’ అని తెలిపారు. లియోనాల్ మెస్పి 2011లో అర్జెంటీనా, వెనిజులాల మధ్య జరిగిన ఫ్రేండ్లీ మ్యాచ్ కోసం తొలిసారి కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చారు. -
పండక్కి ప్రారంభం
క్రికెట్ ప్రాక్టీస్‌ను స్పీడ్ అప్ చేశారట హీరో నాని. ఎందుకంటే ఆయన మ్యాచ్ ఆడే టైమ్ దగ్గరపడుతోంది. మరి... నాని జట్టులోని సభ్యులు ఎవరు? టీమ్ కెప్టెన్ నానీనేనా? ప్రత్యర్థి టీమ్ ఎవరు? అనే ఇలాంటి బోలెడు ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే కాస్త టైమ్ పడుతుంది. ‘మళ్ళీ రావా’ వంటి మంచి ప్రేమకథను తెలుగు ప్రేక్షకులకు అందించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘జెర్సీ’. ‘ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్’ అనేది ట్యాగ్ లైన్. సితార ఎంటైర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందనుంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ దసరా టైమ్‌లో స్టార్ట్ అవుతుందని తాజా సమాచారం. అంటే నాని కొత్త సినిమా పండక్కి ప్రారంభం అన్నమాట. ఇందులో మిడిల్ ఏజ్డ్ క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని కనిపించనున్నారు. ఒక హీరోయిన్గా నిత్యా మీనన్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చనున్న సంగతి తెలిసిందే. కాగా నాగార్జున, నాని నటించిన మల్టీస్టారర్ మూవీ ‘దేవదాసు’ ఈ నెల 27న విడుదల కానుంది. -
స్క్రీన్ ప్లే 15th June 2018
-
ఫీల్డ్ లో ఇద్దరు ఆమ్లాలు!
బ్లోమ్ ఫోంటీన్:దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ ల జట్ల మధ్య జరిగిన ఇక్కడ గురువారం జరిగిన తొలి టీ 20లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను ఓపెనర్లు హషీమ్ ఆమ్లా-డీకాక్ లు ఆరంభించిందుకు అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో ఇద్దరు ఆమ్లాలు ఒకేసారి కనిపించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన చర్చమొదలైంది. వారిద్దరూ ధరించిన జెర్సీలపై ఆమ్లా అని పేరు ఉండటంతో దీన్ని చూసిన ప్రేక్షకులు కొద్దిపాటిఇబ్బందికి గురయ్యారు. అయితే కాసేపటికి జరిగిన విషయాన్ని తెలుసుకుని నవ్వుకోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే.. మ్యాచ్ ఆరంభానికి ముందు డీకాక్ జెర్సీ కనిపించలేదు. ఎంత వెదికినా తన జెర్సీ దొరక్కపోవడంతో ఆమ్లా తన జెర్సీని అందించాడు. ఆ క్రమంలోనే ఆమ్లా జెర్సీ వేసుకుని డీకాక్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టాడు. అయితే మ్యాచ్ కాసేపు జరిగే వరకూ ఆ విషయాన్ని ఎవరూ గమనించలేదు. జట్టు స్కోరు 18 పరుగుల వద్ద ఆమ్లా(3)అవుటైన తరువాత డివిలియర్స్ తో కలిసి డీకాక్ ఆడుతున్న సమయంలో ప్రేక్షకుల్లో గందరగోళం మొదలైంది. ఆమ్లా అవుటై పెవిలియన్ కు చేరితే మళ్లీ ఎలా వచ్చాడనే సందిగ్థత ఏర్పడింది. కాకపోతే చివరకు అసలు విషయం తెలుసుకుని నవ్వుకున్నారు.మొదటి టీ 20లో సఫారీలు 20 పరుగుల తేడాతో విజయం సాధించారు.