kanaka durgamma temple
-
పేకతో ఖాకీల ఆటవిడుపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఆ నలుగురు సీఐలది పేరుకు దసరా ఉత్సవాల బందోబస్తు విధులు.. కానీ వారి ధ్యాసంతా లాడ్జీలో పేకాటపైనే. దుర్గగుడిలో జరుగు తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల బందోబస్తు విధులకు హాజరైన సీఐలు ఓ లాడ్జీలో హుషారుగా పేకాడుతున్న వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విజయవాడ టూ టౌన్ సీఐ కొండలరావు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ సీఐ రాయుడు విజయకుమార్, సైబర్ క్రైం సీఐ పల్లెపు శ్రీను, అతని స్నేహితుడు, ఏలూరు రేంజి వీఆర్‌లో సీఐగా ఉన్న రఘు పేకాడుతూ వీడియోకు చిక్కారు. ఎవరైనా పేకాడుతుంటే అడ్డుకుని చర్యలు తీసుకోవాల్సిన పోలీసు అధికారులు, అమ్మవారి ఉత్సవాల బందోబస్తుకు వచ్చి పేకాటలో తమ ప్రవీణ్యాన్ని చాటుకోవటానికి తహ తహలాడారు. ఏయ్ ముక్కేయ్ అంటూ హూషారుగా వారు పేకాడుతున్న వీడియోను చూసి నెటిజన్లు సైతం నివ్వెరపోయారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీస్ ఉన్నతాధికారులు నలుగురు సీఐలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. వారు ఎప్పుడు, ఏ రోజు పేకాడారనే స్పష్టత లేదు. వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సైతం విచారణ చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి విచారణాధికారిగా ట్రాఫిక్ ఏడీసీపీ ప్రసన్నకుమార్‌ను నియమించారు. pic.twitter.com/iXLy7DwXVh— Telugu Scribe (@TeluguScribe) October 7, 2024 -
విజయవాడ దుర్గగుడిలో నిఘా వైఫల్యం..
-
నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న నిత్యాన్నదానానికి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన భక్తులు శనివారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరుకు చెందిన శనగవరపు ఆంజనేయ శాస్త్రి దంపతులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,00,010 విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.బంగారు తాపడం పనులకు రూ.1.20 లక్షల విరాళంఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయ బంగారు తాపడం పనులకు అనంతపురానికి చెందిన భక్తులు శనివారం రూ.1.20 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతపురానికి చెందిన జ్వాలాపురం శ్రీకాంత్ కుటుంబం శనివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఆలయ ప్రాంగణంలోని డోనర్ సెల్లో బంగారు తాపడం పనులకు రూ.1.20 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ ఈవో కె.ఎస్.రామరావు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.డోనర్ సెల్ ద్వారా రూ.30.27 లక్షల విరాళాలుఅమ్మవారి బంగారు తాపడం పనులకు డోనర్ సెల్ ద్వారా ఇప్పటివరకు రూ.30.27 లక్షల విరాళాలు అందాయని ఆలయ ఈవో కె.ఎస్. రామరావు తెలిపారు. ఏప్రిల్ 26న డోనర్ సెల్‌ను ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మవారి ఆలయ బంగారు తాపడం పనులకు రూ.30,27,434 విరాళాలను దాతలకు అందజేశారన్నారు. -
ఇంద్రకీలాద్రి పై ఘనంగా వసంత నవరాత్రి ఉగాది మహోత్సవాలు
-
దుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ దేవి ఉత్సవాలు ప్రారంభం
-
కోటి దీపోత్సవం కాంతులతో మెరిసిపోతున్న ఇంద్రకీలాద్రి
-
శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా మహోత్సవాలు జరిగాయి. శుక్రవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దుర్గమ్మ దర్శనమిస్తోంది. పూర్ణాహుతితో దసరా ఉత్సావాలు పరిసమాప్తం కానున్నాయి. సాయంత్రం కృష్ణానది ఒడ్డున ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నదిలో నీటి ఉధృతి కారణంగా ఉత్సవమూర్తులకు నదీ విహారం రద్దు చేశారు. చదవండి: Vijayawada: తెప్పోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి -
విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న సోనూసూద్
-
కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించికున్న పీవీ సింధు
-
10 నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనం
-
అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు
-
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మకు గాజుల మహోత్సవం
-
గాయత్రీదేవి రూపంలో అమ్మవారి దివ్యదర్శనం
సాక్షి, విజయవాడ: దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మంగళవారం గాయత్రిదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజామునుంచే ఆలయానికి తరలివస్తున్నారు. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించే పంచ ముఖాలతో గాయత్రీదేవి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందుతున్నారు. గాయత్రీదేవి శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కర్మసాక్షి సూర్యభగవానుడు గాయత్రీమంత్రానికి అధిష్టాన దేవతగా భాసిల్లుతున్నాడు. గాయత్రీమాతను దర్శించుకోవడం వల్ల సకలమంత్ర సిద్ధిఫలాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. -
భక్తజనకీలాద్రి
-
ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండవరోజు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి భక్తులకు దర్శనానికి అనుమతివ్వడంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనస్సు, బుద్ధి, చిత్తం శ్రీబాల త్రిపురసుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు. శ్రీ బాల త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు చెబుతున్నారు. కన్నులపండువగా ప్రారంభం ఇంద్రకీలాద్రిపై పదిరోజులపాటు సాగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం కన్నులపండువగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కోటి కనక ప్రభలతో శోభాయమానంగా వెలిగిపోతున్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఉదయం స్నపనాభిషేకం అనంతరం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతించారు. దుర్గగుడి పరిసర ప్రాంతాలన్నీ దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. మల్లిఖార్జున మహామండపంలో ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. ఉదయం 10 గంటల తర్వాత భక్తుల రద్దీ బాగా పెరిగింది. ఆదివారం కావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం ఆరుగంటలకు అమ్మవారి నగరోత్సవం నేత్రపర్వంగా సాగింది. శారదాపీఠంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు విశాఖపట్నం: చినముసిరివాడ శారదాపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండోరోజూ మహేశ్వరి అలంకరణలో రాజశ్యామల అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గోపూజ నిర్వహించి.. శారదా చంద్రమౌళీవ్వరులకు విశేష పంచామృతాభిషేకాలతోపాటు చక్రనవావరణార్చనను స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి నిర్వహించారు. -
కనకదుర్గమ్మను దర్శించుకున్న మోహన్ భగవత్
విజయవాడ: నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఆరెస్సెస్స్ ఛీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయంలో ఆయనకు ఈవో కోటేశ్వరమ్మ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ప్రసాదం, అమ్మవారి చీర ప్రసాదం, చిత్రపటం మోహన్ భగవత్‌కు అందచేశారు. విజయవాడలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోహన్ భగవత్ విజయవాడకి వచ్చారు. -
మంచుగుప్పిట బెజవాడ
-
అష్ట ఇష్ట నైవేద్యాలు
ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వారికి ఏమేమి పదార్థాలు ఇష్టమో అడిగి తెలుసుకుని వండి ప్రేమగా వడ్డిస్తాం. ఇవి దసరా నవరాత్రులు. అమ్మవారు మన ఇంటికి అతిథిగా అడుగుపెట్టారు. మరి ఆమెకు ఏమేమి ఇష్టమో తెలుసుకుని రుచిగా శుచిగా వండి, భక్తి శ్రద్ధలతో ఆమెకు నివేదిస్తే ఎంత బాగుంటుంది? ఆమెకు ఇష్టమైనవాటిని లలితా సహస్రంలో వర్ణించారు. వాటినే మేము ఇక్కడ మీకోసం వండాం... ఇంకెందుకాలస్యం? మీరూ ప్రయత్నం చేయండి... అమ్మవారికి ఆరగింపు చేయండి. 1 గుడాన్నం (బెల్లం అన్నం) (గుడాన్న ప్రీత మానసా) కావలసినవి: బాస్మతి బియ్యం – 400 గ్రా.; బెల్లం పొడి – 250 గ్రా; లవంగాలు – 4; నీళ్లు – 4 కప్పులు; నెయ్యి – 100 గ్రా; ఏలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ఈ రుచికరమైన వంటకాన్ని తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు అరగంటసేపు నానబెట్టాలి ∙ఒక పెద్ద గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి, స్టౌ మీద సన్నటి మంట మీద నీళ్లు మరిగించాలి ∙నీళ్లు బాగా మరిగిన తరవాత బియ్యం వేసి కలియబెట్టాలి ∙బియ్యంతో పాటు లవంగాలు కూడా వేయాలి ∙అన్నం మెత్తగా ఉడికిన తరవాత గంజి ఉంటే వార్చేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙బాదం పప్పుల తరుగు వేసి దోరగా వేయించాక, బెల్లం పొడి జత చేసి బాగా కలపాలి ∙బెల్లం బాగా కరిగిన తరవాత ఏలకుల పొడి వేసి కలిపి, ఉడికించిన అన్నం కూడా వేసి కలియబెట్టాలి ∙అన్నం గోధుమరంగులోకి వచ్చేవరకు కలిపి, మూత పెట్టి ఏడెనిమిది నిమిషాలు ఉడికించి దింపేయాలి ∙అమ్మవారికి తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించి ఆ తల్లి కృపకు పాత్రులవుదాం. కొబ్బరి అన్నం(స్నిగ్ధౌదన ప్రియా) కావలసినవి: బియ్యం – అరకిలో; నెయ్యి – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – ఒక కప్పు ; ఆవాలు – ఒక టీ స్పూను ; జీలకర్ర – ఒక టీ స్పూను ; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను ; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; ఇంగువ – చిటికెడు ; కరివేపాకు – రెండు రెమ్మలు ; పచ్చిమిర్చి – 5; కొత్తిమీర – తగినంత; ఉప్పు – తగినంత ; జీడి పప్పులు – 10 తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నెయ్యి వేసి కరిగించాలి ∙పచ్చి కొబ్బరి తురుము వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో జీడి పప్పులు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, ఆవాలు వేసి చిటపటలాడాక జీలకర్ర, పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి ∙పోపు బాగా వేగిన తరవాత తరిగిన పచ్చిమిర్చి వేసి మరోమారు వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, వేయించిన పచ్చి కొబ్బరి మిశ్రమం, తాలింపు, వేయించిన జీడి పప్పులు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙చివరగా కొత్తిమీరతో అలంకరించి, అమ్మవారికి నివేదన చేసి, మనస్ఫూర్తిగా ప్రార్థించి అమ్మ ప్రసాదంగా స్వీకరించాలి. క్షీరాన్నం (పాయసాన్న ప్రియా) కావలసినవి: కొత్త బియ్యం – అర కప్పు; పాలు – 3 కప్పులు; నెయ్యి – పావు కప్పు; బెల్లం పొడి – అరకప్పుకి కొద్దిగా తక్కువ; నీళ్లు – ముప్పావు కప్పు; జీడిపప్పులు – 10; బాదం పప్పులు – 5; కిస్మిస్ – 10; ఏలకుల పొడి – పావు టీ స్పూను తయారీ: ∙ఒక పాత్రలో బెల్లం పొడి, పాలు పోసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి, వడబోసి పక్కన ఉంచాలి ∙మందపాటి బాణలిని స్టౌ మీద ఉంచి అందులో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙జీడి పప్పులు, బాదం పప్పులు, కిస్మిస్ జత చేసి వేయించి తీసిపక్కన ఉంచాలి ∙అదే నేతికి బియ్యం జత చేసి దోరగా వచ్చేవరకు వేయించి తీసేయాలి ∙ బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించాలి ∙ అన్నం బాగా ఉడికిన తరవాత బెల్లం పాకం జత చేస్తూ ఆపకుండా కలుపుతుండాలి ∙మిశ్రమం బాగా దగ్గరపడేవరకు కలపాలి ∙మిగిలిన నేతిని జత చేయాలి ∙ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ జత చేసి బాగా కలిపి దింపేయాలి ∙అమ్మవారికి నివేదించి ప్రసాదంగా సేవించాలి. తేనె గారెలు(మధు ప్రీతా) కావలసినవి: మినప్పప్పు – రెండు కప్పులుఉప్పు – చిటికెడుతేనె – తగినంతనూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙మినప్పప్పును బాగా కడిగి, తగినన్ని నీళ్లు జతచేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాలి ∙నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి నీళ్లు ఎక్కువ పోయకుండా గట్టిగా రుబ్బుకోవాలి ∙బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాచాలి ∙పిండికి ఉప్పు జతచేసి కలపాలి ∙చేతికి తడి చేసుకుని కొద్దిగా పిండిని అరటి ఆకు మీద గారె మాదిరిగా ఒత్తి, కాగుతున్న నూనెలో వేసి దోరగా వేయించి తీసేయాలి ∙తయారుచేసుకున్న గారెల మీద తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీర్వాదం పొందాలి. దద్ధ్యోదనం(దధ్ద్యన్నాసక్త హృదయా) కావలసినవి: బియ్యం – పావు కిలో; పాలు – అర లీటరు; చిక్కటి పెరుగు – అర లీటరు; ఉప్పు – తగినంత ; నూనె – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీస్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను ; ఎండు మిర్చి – 4 ; ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు ; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; జీడి పప్పులు – 10 ; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి తరుగు – రెండు టీ స్పూన్లు తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి అన్నం వండి పక్కన ఉంచాలి ∙ ఒక పాత్రలో పాలు పోసి కాచి చల్లార్చాలి ∙ అన్నం బాగా చల్లారాక ఒక పెద్ద పాత్రలోకి తీసుకోవాలి ∙అందులో కాచి చల్లార్చిన పాలు, చిక్కటి పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాచాలి ∙ అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పెరుగు కలిపిన అన్నంలో పోపు, వేయించిన జీడిపప్పులు వేసి కలియబెట్టాలి ∙చివరగా అల్లం తురుము, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙ ఆ తల్లి దీవెనలు అందుకుని ప్రజలందరూ అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని ప్రార్థించాలి. పొంగల్ (ముద్గౌదనాసక్త హృదయా) కావలసినవి: పెసరపప్పు – 150 గ్రా.; కొత్త బియ్యం – 100 గ్రా.; మిరియాలు – 15 (పొడి చేయాలి); పచ్చి మిర్చి – 6; పచ్చి కొబ్బరి – ఒక కప్పు; నెయ్యి – పావు కప్పు; జీడిపప్పులు – 15; జీలకర్ర – అర టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండుమిర్చి – 3; మినప్పప్పు + సెనగ పప్పు – 2 టేబల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా; కరివేపాకు – రెండు రెమ్మలు; ఉప్పు తగినంత ; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙దళసరి పాత్రలో కొద్దిగా నెయ్యి వేసి స్టౌ మీద ఉంచి వేడి చేయాలి ∙పెసర పప్పు వేసి దోరగా వేయించాలి ∙బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా వేసి సుమారు ఐదు నిమిషాల పాటు బాగా వేయించి (తెలుపు రంగు పోకూడదు) తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక, మిరియాల పొడి వేసి వేయించాక, జీడిపప్పులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ∙ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు, సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చి కొబ్బరి, వేయించిన బియ్యం, పెసరపప్పు ఇవన్నీ వేసి కుకర్‌లో వుంచి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి ∙అందులో ఆవాలు, మినప్పప్పు, పచ్చి సెనగ పప్పు, జీలకర్ర, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాక, తయారుచేసి ఉంచుకున్న పొంగలిలో వేయాలి ∙ఉప్పు వేసి బాగా కలియబెట్టి, కొత్తిమీరతో అలంకరించి, వేడి వేడి ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ∙‘మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ’ అని ప్రార్ధించాలి పులిహోర(హరిద్రాన్నైక రసికా) కావలసినవి: బియ్యం – అర కేజీ; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 6; పచ్చి మిర్చి – 4; నూనె – 100 గ్రా.; పల్లీలు – 100 గ్రా.; ఇంగువ – మూడు రెమ్మలు; పసుపు – తగినంత; ఉప్పు – తగినంత; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను (పులుపు చాలకపోతే మరి కాస్త రసం జత చేయాలి) తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి, వెడల్పాటి పాత్రలో పోసి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, పల్లీలు, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించి, అన్నంలో వేసి కలపాలి ∙పసుపు, ఉప్పు, నిమ్మరసం జతచేసి మరోమారు బాగా కలిపి అమ్మవారిని నివేదన చేసి, ప్రసాదంగా సేవించాలి. కదంబం (సర్వౌదన ప్రీత చిత్తా) కావలసినవి: కంది పప్పు – అర కప్పు; కొత్త బియ్యం – అర కప్పు; వంకాయ ముక్కలు, సొర కాయ ముక్కలు, దోస కాయ ముక్కలు, బీన్స్ తరుగు, బంగాళ దుంప ముక్కలు, క్యారెట్ తరుగు, టొమాటో తరుగు – అన్నీ కలిపి రెండు కప్పుల ముక్కలు; పల్లీలు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర – తగినంత ; కరివేపాకు – రెండు రెమ్మలు; పచ్చి కొబ్బరి తురుము – అర కప్పు ; పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా తరగాలి); నెయ్యి – పావు కప్పు; చింతపండు గుజ్జు – పావు కప్పు (చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పసుపు – చిటికెడు; సాంబారు పొడి – 3 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; ఇంగువ – చిటికెడు తయారీ ∙కాయగూరలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి ∙బియ్యం, కందిపప్పులను శుభ్రంగా కడగాలి ∙కుకర్‌లో బియ్యం, కందిపప్పు, తరిగిన కూరగాయ ముక్కలు (టొమాటో వేయకూడదు), తగినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి ఉడికించాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, ఆవాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ వేసి బాగా వేయించాలి ∙పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, టొమాటో తరుగు వేసి దోరగా వేయించాలి ∙ చింతపండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా ఉడికించాలి ∙సాంబారు పొడి వేసి మరిగించాలి ∙బాగా ఉడికిన తరవాత ఆ గ్రేవీని ఉడికించిన బియ్యం, కందిపప్పు మిశ్రమంలో వేసి బాగా కలిపి, స్టౌ మీద ఉంచి మరోమారు కొద్దిసేపు ఉడికించాలి ∙ చివరగా కరివేపాకు, కొత్తిమీర, నెయ్యి, పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి ఒకసారి ఉడికించి దింపేయాలి ∙వేడి నెయ్యి జత చేసి, అమ్మవారికి నివేదన చేసి ఆ తల్లి దీవెనలు పొందుదాం. -
నాలుగవ రోజు దేవీ అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ చవితి, శనివారం 13–10–2018 శ్రీలలితా త్రిపురసుందరీదేవి ప్రాతఃస్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్ ఆకర్ణ దీర్ఘ నయనం మణి కుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్జ్వ ఫాల దేశమ్ ‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మశ్రీలలితాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ అమ్మవారు శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసి తనని కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూ ఉండగా చిరుమందహాసంతో వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ చెరకుగడను చేతపట్టుకొని శివుని వ„ý స్థలంపై కూర్చొని లలితా త్రిపురసుందరీదేవిగా దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా భక్తులు చేసే పూజలను అందుకొంటుంది. -
‘అవసరం తీరిన తర్వాత కించపరుస్తారా?’
సాక్షి, అమరావతి : గత కొన్నిరోజులుగా బెజవాడ దుర్గమ్మ గుడిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ప్రభుత్వ తీరుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అవసరం తీరిన తర్వాత అధికారులను కించపరచడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి చీరను దొంగలించింది పాలకమండలి సభ్యురాలైతే ఈవోపై వేటు వేయడమేమిటని ప్రశ్నించారు. దేవాదాయ శాఖలో ఆర్థికంగా లాభదాయకమైన పోస్టుగా భావించే.. దుర్గ గుడి ఈవో పోస్టుపై చాలా మంది కన్ను ఉంటుందని, అస్మదీయులకు ఈ పదవిని కట్టబెట్టడం కోసమే ప్రభుత్వం నాటకమాడినట్లుగా కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నీ గమనిస్తుంటే అధికారులతో హుందాగా వ్యవహరించడం ఏపీ ప్రభుత్వానికి ఇష్టం లేనట్లుగా ఉన్నట్లు కన్పిస్తోందని విమర్శించారు. కాగా ఇటీవల ఓ భక్తురాలు అమ్మవారికి సారెగా సమర్పించిన 18 వేల రూపాయల ఖరీదైన చీర కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో... ఆలయ ఈవో ఎం. పద్మపై బదిలీ వేటు వేశారు. ఆమె స్థానంలో ఐఆర్ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మను ఈవోగా నియమించారు. కాగా మాజీ ఈవో ఎం. పద్మను బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
కనకదుర్గమ్మ ఆలయంలో వెలుగులోకి మరో వివాదం
-
కనకదుర్గమ్మ గుడిలో మరో వివాదం
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఇటీవల అమ్మవారికి అలంకరించిన ఖరీదైన చీర గల్లంతయింది. ఉండవల్లికి చెందిన పద్మజ అనే భక్తురాలు మహామంటపంలో అమ్మవారికి ఈ చీరను సమర్పించారు. ఈ చీర విలువ రూ. 18వేలు. ఉత్సవ విగ్రహానికి అలంకరించిన కొద్దిసేపటికే చీర కనిపించకుండా పోయింది. అమ్మవారికి ఎంతో భక్తితో సమర్పించిన చీరను.. ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలికి ఇచ్చారని భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారికి సమర్పించిన చీర మాయం కావడంతో ఆలయ సిబ్బంది తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ దృశ్యాలను ఆలయ అధికారులు పరిశీలిస్తున్నారు. చీర ఎలా గల్లంతయిందీ.. ఆరా తీస్తున్నారు. -
దుర్గమ్మకు మొక్కు చెల్లింపు
సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మొక్కు చెల్లించారు. గురువారం కుటుంబసమేతంగా పూజలు చేసి అమ్మవారికి 11.9 గ్రాముల బంగారం, వజ్రాలు పొదిగిన ముక్కుపుడక సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే కనకదుర్గమ్మకు బంగారు ముక్కుపుడక సమర్పిస్తానని ఆయన మొక్కుకున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి శోభ, కోడలు నీలిమ, మనవడితో పాటు పలువురు బంధువులు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అర్చ కులు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ముక్కుపుడకతో పాటు పట్టువస్త్రాలు, పూలు, పండ్లను సీఎం సమర్పించారు. అర్చకులు ముక్కెర (ముక్కుపుడక)ను అమ్మవారికి అలంకరిం చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేసీఆర్ కుటుంబసభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయం వద్ద విజయవాడ మేయర్ కోనేరు శ్రీధర్, ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, ఈవో ఎం.పద్మ, ప్రధాన అర్చకుడు లింగబొట్ల దుర్గాప్రసాద్, తెలంగాణ దేవాదా య శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణవేణి తదితరులు సీఎంకు సాదరంగా స్వాగతం పలికారు. సీఎం వెంట ఎంపీలు కె.కేశవరావు, సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాజు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ సలహాదారు సుభాష్‌రెడ్డి తదితరులు కూడా ఉన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజగోపురం నుంచే... కేసీఆర్‌ను ఘాట్ రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రికి తీసుకెళ్లాలని పోలీసులు, దేవస్థానం అధికారులు తొలుత భావించారు. అమ్మవారి గుడికి తూర్పువైపున్న రాజగోపురం నుంచి దర్శనానికి వెళ్లడం శుభమని తెలంగాణ అధికారులు భావించి, అటువైపు నుంచే తీసుకెళ్లాలని కోరారు. ఆ మేరకు కేసీఆర్ దంపతుల్ని అర్జున వీధి మీదుగా మల్లికార్జున మహామండపానికి, అక్కడ నుంచి లిఫ్టులో రాజగోపురం వద్దకు తీసుకెళ్లారు. పూజల అనంతరం వారు అదే మార్గంలో తిరిగి వెళ్లిపోయారు. కేసీఆర్ ఆలయానికి వచ్చే ముందు ఇంద్రకరణ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం సిద్ధిస్తే అమ్మవారికి ముక్కపుడక సమర్పిస్తానన్న మొక్కును సీఎం ఇప్పుడు తీర్చుకుంటున్నారని తెలిపారు. ఆయన ఇప్పటికే తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామి మొక్కు చెల్లించారని గుర్తు చేశారు. విమానాశ్రయంలో ఘనస్వాగతం విమానాశ్రయం (గన్నవరం): ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన కేసీఆర్ కుటుంబానికి గన్నవరం విమానాశ్రయంలో ఏపీ జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్సింగ్, ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీసీపీ, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ తదితరులు ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం 12.05కు వచ్చిన సీఎం రోడ్డు మార్గంలో ప్రత్యేక భద్రత మధ్య విజయవాడ వెళ్లారు. అమ్మ వారి దర్శనానంతరం 1.40కి విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన టెర్మినల్‌లో కాసేపు విశ్రాంతి తర్వాత 2.30కు అదే విమానంలో సీఎం తదితరులు హైదరాబాద్ బయల్దేరి వెళ్లారు. అధికారులతో పాటు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ కుమారి తదితరులు వారికి వీడ్కోలు పలికారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారికి కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారని ప్రధానార్చకుడు దుర్గాప్రసాద్ మీడియాకు తెలిపారు. రెండు రాష్ట్రాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారని వివరించారు. సీఎం ఆలయానికి చేరుకునే ముందు కొందరు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రకీలాద్రి పైకి వచ్చి బ్యానర్లు పట్టుకుని ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. దేవస్థానం సిబ్బంది వారిని వారించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి నామస్మరణ తప్ప మరే నినాదాలూ చేయొద్దంటూ వారిని పంపేశారు. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ గన్నవరం విమానాశ్రయం నుంచి ఇంద్రకీలాద్రి దాకా ఫ్లెక్సీలు, ద్వారాలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఒకరోజు ముందే ఇంద్రకీలాద్రి చేరుకుని ఏర్పాట్లు సమీక్షించారు. -
దుర్గమ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్
-
దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు మనవడు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. వారికి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ కుటుంబం నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఇది వరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. ఈ ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది.