Karthik Subbaraj
-
టాప్ దర్శకుడితో జయంరవి కొత్త సినిమా..?
కోలీవుడ్ నటుడు జయంరవి వరుసగా చిత్రాలు చేసుకుంటూపోతున్నారు. వ్యక్తిగత సమస్యలు ఉన్నా, అవి ఆయన వృత్తికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకుంటున్నారు. తను నటించిన తాజా చిత్రం బ్రదర్ దీపావళికి తెరపైకి రానుంది. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. ప్రస్తుతం సీనీ, కాదలిక్క నేరమిల్లై చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. తాజాగా మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నది తాజా సమాచారం. ఈయన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం నటుడు సూర్య కథానాయకుడిగా ఆయన 44వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూజాహెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2డీ.ఎంటర్టెయిన్మెంట్ సంస్థ, స్టోన్ బెంచ్ స్టూడియోస్ సంస్థ కలిసి నిర్మిస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుందని సమాచారం. దీంతో కార్తీక్ సుబ్బరాజ్ జయంరవి హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని ఆయన తన సొంత నిర్మాణ సంస్థ అయిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్‌తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్‌గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్‌గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్‌లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)Happy Birthday @Suriya_offl Sir From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024 -
పడమ్ బిగిన్స్
కొత్త సినిమా షురూ చేశారు సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జోజూ జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ఆరంభమైంది.సూర్య కెరీర్‌లోని ఈ 44వ చిత్రం చిత్రీకరణ మొదలైనట్లుగా చెబుతూ, ‘పడమ్ బిగిన్స్’ (సినిమా ఆరంభమైంది) అంటూ చిన్న వీడియోను ‘ఎక్స్’లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. ప్రేమ, యుద్ధం, నవ్వు అంశాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలోని సూర్య లుక్‌ని బట్టి ఇది పీరియాడికల్ మూవీ అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నారు. -
ప్రముఖ ఆలయంలో సూర్య పూజలు..
సౌత్ ఇండియా స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమాను ప్రారంభించాడు. కోలీవుడ్ టాప్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్లో ఒక ప్రాజెక్ట్ సెట్ అయిన విషయం తెలిసిందే. 2డి ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, అండమాన్ దీవుల్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ ప్రారంభమైంది.సూర్య కెరియర్లో ఈ చిత్రం 44వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతుంది. వినోదంతో పాటు భారీ యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రానున్నట్లు తెలుస్తోంది. అండమాన్ దీవుల్లో తాజాగా ప్రారంభమైన తొలి షెడ్యూల్ దాదాపు 40రోజుల పాటు అక్కడే కొనసాగనుంది. అయితే, ఈ సినిమా షూటింగ్ కోసం ఆండమాన్ వెళ్లే ముందు ఆయన ప్రముఖ ఆలయంలో పూజలు నిర్వహించారు. చెన్నైలో ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉన్న శ్రీ కాళికాంబాల్ (కామాక్షి) సన్నిధిలో సూర్య పూజలు చేశారు. సుమారు 500 ఏళ్లకు పైగానే ఈ ఆలయానికి చరిత్ర ఉంది. 17వ శతాబ్దపు మరాఠా యోధుడు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ 1677న అక్టోబర్ 3న ఈ ఆలయాన్ని సందర్శించారు. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన చాలామంది ప్రముఖులు ఆ ఆలయాన్ని సందిర్శించినవారే కావడం విశేషం.ఆ ఆలయంతో 'బాబా' సినిమాకు లింక్రజనీకాంత్ బాబా సినిమాకు ముందు ఒకరోజు కాళికాంబాల్ ఆలయానికి వెళ్లారు. అక్కడ ఆయన సుమారు 20 నిమిషాల పాటు ధ్యానం చేశారు. అయితే, అమ్మవారిని దర్శించుకున్న రజనీ ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆ గుడిని మరిచిపోలేకపాయారట. ధ్యానం చేసిన సమయంలో ఆయన మనసులో ఏమైతే కలిగిందో దానినే బాబా సినిమాకు లింక్ చేశారట. ఆ సినిమా పెద్దగా మెప్పించకపోయిన రజనీకి మాత్రం బాబా చాలా ప్రత్యేకం అని అంటారు. -
అండమాన్‌లో యాక్షన్
కొద్ది రోజుల పాటు అండమాన్‌కు మకాం మార్చనున్నారు హీరో సూర్య. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగానే సూర్య అండమాన్ వెళ్లనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ అండమాన్‌లో ప్రారంభం కానుంది.నవ్వు, యుద్ధం, ప్రేమ అంశాల నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాను జూన్‌లో ప్రారంభించనున్నట్లు ‘ఎక్స్’లో ఓ వీడియోను షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజ్. అండమాన్‌లో ఆరంభించే ఈ తొలి షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. ఇక ఈ మూవీలో హీరోయిన్గా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. -
హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!
పూజా హెగ్డే.. కాదు కాదు బుట్టబొమ్మ అంటే తెలుగు ప్రేక్షకులు టక్కున గుర్తుపట్టేస్తారు. కొన్నాళ్ల క్రితం తెలుగులో వరస సినిమాలతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరస ఫ్లాప్స్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇక ఈమె కెరీర్ ఖతం అని అందరూ ఫిక్సయ్యారు. ఇలాంటి టైంలో ఈమెకి క్రేజీ బంపరాఫర్ చెంతకు చేరింది. ఇంతకీ ఏంటి సంగతి?(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!)కోలీవుడ్‌లో రేర్ కాంబో సెట్ కాబోతుంది. సూర్య 'కంగువ' మూవీ చేస్తున్నాడు. ఈ ఏడాదే థియేటర్లలోకి రానుంది. మరోవైపు తన 44వ చిత్రాన్ని కూడా రెడీ చేసేస్తున్నాడు. దీనికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకుడు. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టెయిన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రీసెంట్‌గానే అధికారిక ప్రకటన వచ్చింది. ఇప్పుడు ఈ మూవీలోనే పూజా హెగ్డేని హీరోయిన్ అనుకుంటున్నారట.పదకొండేళ్ల క్రితం 'మాస్క్' అనే తమిళ సినిమాతోనే హీరోయిన్ అయిన పూజా హెగ్డే.. మధ్యలో విజయ్‌తో 'బీస్ట్'తో రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఫ్లాప్స్ వల్ల పూర్తిగా ఛాన్సుల్లేక సైలెంట్ అయిపోయిన ఈమెకు.. సూర్య మూవీలో ఛాన్స్ అంటే బంపరాఫర్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఇది హిట్ అయితే మాత్రం మళ్లీ సౌత్‌లో పాగా వేసే ఛాన్స్ ప్లస్ కోరుకున్న బ్రేక్ రావొచ్చు. మళ్లీ రష్మిక లాంటి ట్రెండింగ్ బ్యూటీస్ పోటీ పడొచ్చు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్) -
ప్రేమ... నవ్వు... యుద్ధం
‘లవ్... లాఫ్టర్... వార్...’ అంటూ సూర్య కొత్త చిత్రం అధికారిక ప్రకటన గురువారం వెలువడింది. ‘పిజ్జా, పేటా, జిగర్ తండా, జిగర్ తండా డబుల్ ఎక్స్’ వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. హీరో సూర్యకి ఇది 44వ చిత్రం. అయితే ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. సినిమా ప్రకటించిన సందర్భంగా ‘లవ్... లాఫ్టర్... వార్...’ (ప్రేమ.. నవ్వు.. యుద్ధం) అని ఉన్న పోస్టర్ని ఎక్స్‌లో షేర్ చేశారు కార్తీక్ సుబ్బరాజు. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తారు. ఈ చిత్రాన్ని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్టైన్మెంట్స్, కార్తీక్ సుబ్బరాజు స్టోన్ బెంచ్ క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఇక ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’ చిత్రంలో నటిస్తున్న సూర్య తనకు ‘ఆకాశం నీ హద్దు రా’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన సుధ కొంగర దర్శకత్వంలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
'అందంగా లేని హీరోయిన్ను తీసుకున్నారు'.. దర్శకుడి సమాధానమిదే!
రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్తాండ డబుల్ ఎక్స్'. నవంబర్ 10న విడుదలైన ఈ మూవీ పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సినిమా సూపర్ సక్సెస్ కావడంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ అంత అందంగా ఏమీ లేదని వ్యాఖ్యానించాడు. తను బాగోలేకపోయినా సరే తనను సినిమాలోకి తీసుకుని ఆమె నుంచి నటన ఎలా రాబట్టుకున్నారని ప్రశ్నించాడు. అలా అనడం చాలా తప్పు ఈ ప్రశ్నకు ఖంగు తిన్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఘాటుగానే స్పందించాడు. 'ఆమె అందంగా లేదని నువ్వెలా చెప్పగలవు? నీకెందుకలా అనిపించింది? ఒకరు అందంగా లేరని అనేయడం, అలా డిసైడ్ చేసేయడం.. చాలా తప్పు' అని కౌంటరిచ్చాడు. దర్శకుడి సమాధానం విని చిత్రయూనిట్ అంతా చప్పట్లు కొట్టింది. ఇక ఈ సినిమాతో పాటు సక్సెస్ మీట్లోనూ భాగమైన మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. ఏమీ మారలేదు 'నేను అక్కడే ఉన్నాను. అందం గురించి అతడు పిచ్చి ప్రశ్న అడిగి వదిలేయలేదు. ఏదైనా వివాదాస్పదం అయ్యే ప్రశ్నలు అడగాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలాంటి ప్రశ్నలు అడిగేశాక తనకు తాను గర్వంగా ఫీలయ్యాడు. 9 ఏళ్ల క్రితం జిగర్తాండ మొదటి భాగం వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఏమీ మారలేదు' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నెటిజన్లు ఈ హీరోయిన్‌కు ఏం తక్కువ? అంత బాగా అభినయం చేస్తోంటే ఇలా అవమానించేలా ఎలా మాట్లాడుతారో అని కామెంట్లు చేస్తున్నారు. నటనలో ఘనాపాటి కాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నిమిషా సజయన్ ఈ విజయోత్సవ సభకు హాజరు కాలేదు. ఈమె ఇటీవల వచ్చిన సిద్దార్థ్ చిత్త(చిన్నా) మూవీలోనూ నటతో మెప్పించింది. ఈమె మలయాళ నటి. 2017లో కేరాఫ్ సైరా భాను సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ద గ్రేట్ ఇండియన్ కిచెన్, నాయట్టు, తొండిముతలుమ్ దృక్షాక్షియుమ్.. తదితర హిట్ చిత్రాల్లో నటించింది. జిగర్తాండ డబుల్ ఎక్స్ మూవీలో రాఘవ లారెన్స్ భార్యగా, గిరిజన యువతి మలైయారసి పాత్రలో కనిపించింది. I was there. It was not just about the ridiculous ‘beauty’ question for the reporter. There was a conscious effort from the guy to ask something controversial and he was so proud after asking this. Nothing has changed since the appalling ‘Jigarthanda’ - ‘Figuredhanda’ question 9… https://t.co/ZaVh5lEkK9 — Santhosh Narayanan (@Music_Santhosh) November 18, 2023 చదవండి: అందుకే 'అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి' మూవీ వదులుకున్నా.. భూమికతో గొడవలు.. -
ట్రైలర్ అదిరిపోయింది
‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో చూపించాడు. సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది’’ అని హీరో వెంకటేశ్ అన్నారు. రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’. కార్తికేయన్ సంతానం నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ నెల 10న విడుదలఅవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేశ్ మాట్లాడుతూ–‘‘లారెన్స్, ఎస్జే సూర్య వంటి ప్రతిభ ఉన్న నటులు ఈ సినిమాలో నటించారు. కార్తీక్ సుబ్బరాజ్ కల్ట్ డైరెక్టర్. నాకోసం తను త్వరలోనే ఓ స్క్రిప్ట్ తయారు చేస్తాడనుకుంటున్నాను’’ అన్నారు. రాఘవ లారెన్స్ మాట్లాడుతూ–‘‘తమిళనాడులో నేను ట్రస్ట్ పెట్టి సేవలు చేస్తున్నాను. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ట్రస్ట్ సేవలు అందించబోతున్నాను’’ అన్నారు. ‘‘అందరూ మా సినిమాను చూసి ఎంజాయ్ చే స్తారు’’ అన్నారు ఎస్జే సూర్య. ‘‘మా చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని కార్తికేయన్ సంతానం అన్నారు. ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ నాకు ఎంతో ప్రత్యేకం. నాలుగున్నరేళ్ల తర్వాత థియేటర్స్‌లోకి విడుదలవుతున్న నా సినిమా ఇది’’ అన్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ వేడుకలో సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ శైలేష్ కొలను, నటుడు నవీన్ చంద్ర మాట్లాడారు. -
RC 15: మరో వివాదంలో డైరెక్టర్ శంకర్..
‘అది నా కథ. నాకు తెలియకుండా కొట్టేశారు’ అంటూ అప్పుడప్పుడూ రచయితలో, దర్శకులో ఆరోపించే విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. ఇది శంకర్ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన వివాదం. రామ్‌చరణ్ (‘ఆర్సీ 15’.. చరణ్‌కి ఇది 15వ సినిమా) హీరోగా శంకర్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు ఓ ప్యాన్ ఇండియా మూవీ నిర్మించనున్న విషయం తెలిసిందే. ‘భారతీయుడు 2’ పూర్తి చేశాకే శంకర్ ఈ సినిమా చేయాలని ఆ చిత్రనిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయమూ విదితమే. మరోవైపు ‘అపరిచితుడు’ రీమేక్ వివాదం కూడా ఎదుర్కొన్నారు శంకర్. తాజాగా.. రామ్‌చరణ్ సినిమా కోసం తయారు చేసిన కథ తనదేనంటూ చెల్లముత్తు అనే రచయిత దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించారు. కార్తీక్ సుబ్బరాజ్ దగ్గర దర్శకత్వ శాఖలో చేశారు చెల్లముత్తు. ఇటు రామ్ చరణ్ సినిమా, అటు ‘అపరిచితుడు’ హిందీ రీమేక్ ప్లాన్స్‌తో బిజీగా ఉన్న శంకర్ ‘ఆర్సీ 15’కి కథ తయారు చేసి ఇవ్వమని కార్తీక్ సుబ్బరాజ్‌ని కోరారట. ఆ మేరకు కార్తీక్ ఓ కథ తయారు చేసి ఇచ్చారట. ఆ కథ తనదని చెల్లముత్తు ఆరోపిస్తున్నారు. కార్తీక్, చెల్లముత్తులతో మాట్లాడి, అసలు కథేంటి? కథ ఎవరిది? అనే విషయంలో రచయితల సంఘం త్వరలో తీర్పు వెల్లడిస్తుందని కోలీవుడ్ టాక్. చదవండి : డాక్టర్‌తో డైరెక్టర్ వివాహం.. హాజరైన ప్రముఖులు అల్లు అర్జున్‌తో డ్యాన్స్.. తెగ కష్టపడుతున్న రష్మిక -
‘మహాన్’గా విక్రమ్.. లుక్ అదిరిందిగా
విక్రమ్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదలైంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మహాన్’అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఇక లుక్ విషయానికొస్తే... మరోసారి సరికొత్త అవతారంలో కనిపించి సర్ప్రైజ్ చేశాడు విక్రమ్. పొడవాటి జుత్తు, గడ్డంతో చాలా స్టైలీష్‌గా కనిపించాడు. బుల్లెట్‌పై హుందాగా కూర్చొని నవ్వుతూ దర్శనం ఇచ్చాడు విక్రమ్. (చదవండి: షాకింగ్.. 100 సెలబ్రిటీల నగ్న వీడియోలు లీక్!) ఆయన వెనకాల కొమ్ములు, 16చేతులు గల ఒక ఆకారం కూర్చొని ఉంది. దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అని తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే సగ భాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంపై త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విక్రమ్ సరసన సిమ్రన్ నటిస్తోంది. ఎస్.ఎస్. లలిత్ కుమరా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. -
మన హీరోకి హాలీవుడ్ డైరెక్టర్ల విషెస్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. మిగతా భాషల్లోనూ టాలెంటెడ్ హీరోగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్నాడు. వరుసగా ప్రయోగాత్మక సబ్జెక్టుల్లో యాక్ట్ చేస్తున్న ధనుష్.. లేటెస్ట్గా గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘జగమే తందిరమ్’(జగమే తంత్రం)తో సందడి చేయబోతున్నాడు. ఈ తరుణంలో హాలీవుడ్ దర్శక ద్వయం రుస్సో బ్రదర్స్ ధనుష్‌కి గుడ్‌లక్ చెప్పారు. ‘సూపర్ డా తంబీ.. నీతో పనిచేసేప్పుడు ఎగ్జైట్ అయ్యాం. కొత్త సినిమా రిలీజ్‌కు గుడ్ లక్’ అంటూ ట్రైలర్‌తో సహా ట్వీట్ చేశారు. దానికి ధనుష్ స్పందిస్తూ థ్యాంక్స్ చెప్పడం, ఆ వెంటనే రుస్సో బ్రదర్స్ మళ్లీ స్పందించడం జరిగిపోయాయి. ఇదిలా ఉంటే జగమే తందిరం ఈ మధ్యాహ్నం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కాబోతోంది. తమిళ్, తెలుగుతో సహా పదిహేడు భాషల్లో 190 దేశాల్లో ఈ మూవీ అలరించనుంది. Thank you so much. That’s very sweet of you. Means a lot to me. https://t.co/SraBgHztgr — Dhanush (@dhanushkraja) June 17, 2021 ధనుష్ హాలీవుడ్లో ‘ది గ్రేమ్యాన్’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రుస్సో బ్రదర్స్ డైరెక్షన్ వహిస్తున్నారు. ఈ మూవీని కూడా నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తోంది. ఈ చొరవతో ఈ హాలీవుడ్ దర్శకులు ధనుష్‌కు విషెస్ చెప్పారన్నమాట. -
సినిమా నుంచి అనిరుధ్‌ను సైడ్ చేశారు!
చియాన్ విక్రమ్ 60వ సినిమా షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్‌కు స్వాగతం చెప్తూ ట్వీట్ చేశాడు. కానీ ఈ ట్వీట్ అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. కారణం.. ఈ చిత్రానికి గతంలో అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తాడని ప్రకటించారు. కానీ ఏమైందో ఏమోకానీ సడన్‌గా అతడిని సైడ్ చేస్తూ సంతోష్ పేరును ప్రకటించారు. "అవును, ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. మమ్మల్ని అర్థం చేసుకుని అండగా నిలిచినందుకు అనిరుధ్‌కు కృతజ్ఞతలు. ఈ రోజే చిత్రీకరణ ప్రారంభమవుతోంది" అంటూ కార్తీక్ సుబ్బరాజు ట్వీట్ చేశాడు. చిత్రయూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుండగా మరికొందరు మాత్రం అనిరుధ్ మాస్ బీజీఎమ్ మిస్ అవుతామని కామెంట్లు చేస్తున్నారు. Yes... It's A Santosh Narayanan Musical!! Welcome to the Gang @Music_Santhosh Thanks @anirudhofficial for your understanding & Support ... #Chiyaan60 shoot starts from TODAY... Need all your Support, Blessings and Love 🙏 More updates to follow.... pic.twitter.com/ZqmFKU6J86 — karthik subbaraj (@karthiksubbaraj) March 10, 2021 ఇక మీ సినిమాలో సిమ్రాన్, వాణి భోజన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లలిత్ కుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సెవర్ స్క్రీన్ స్టూడియోపై ఈ సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు విక్రమ్ 'పొన్నియిన్ సెల్వన్' అనే మరో యాక్షన్ డ్రామా సినిమా చేస్తున్నాడు. చదవండి: విక్రమ్‌కు సవాలు విసురుతున్న ఇర్ఫాన్ పఠాన్ అఖిల్ పేరు ఛాతీ మీద పచ్చబొట్టు వేయించుకున్న ఫ్యాన్ -
రజనీకాంత్ - కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ రిపీట్
రజనీకాంత్– డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందని కోలీవుడ్ టాక్. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం ‘పేట్ట’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా మరోసారి వీరిద్దరూ కలసి పనిచేయనున్నారట. రజనీకాంత్‌ను రెండోసారి డైరెక్ట్ చేసే అవకాశం ఈ యంగ్ ఫిల్మ్ మేకర్‌కి వచ్చిందని టాక్. ప్రస్తుతం ‘అన్నాత్తే’ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నారు రజనీకాంత్. ఈ సినిమా తర్వాత వీరి సినిమా సెట్స్ మీదకు వెళ్లొచ్చట. ప్రస్తుతం విక్రమ్, ఆయన తన యుడు ధ్రువ్ విక్రమ్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కార్తీక్ సుబ్బరాజ్. ఈ సినిమా పూర్తయ్యాక రజనీ సినిమా ప్రారంభం కానుందట. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
‘జగమే తంత్రం’ అంటున్న ధనుష్
కోలీవుడ్ స్టార్ ధునుష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘జగమే తంతిరమ్’. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్. శశికాంత్ నిర్మిస్తున్నారు. తెలుగులో ‘జగమే తంత్రం’అనే పేరుతో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో దర్శనమిచ్చాడు. చొక్కా, పంచెతో తమిళ సంప్రదాయంలో కనిపించినా.. చేతిలో గన్నులు భయపెట్టేలా ఉన్నాయి. దీంతో మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమాతో పండగే అని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్ర బృందం రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ధనుష్‌కు ఇది 40వ చిత్రం కావడంతో ‘డి 40’అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరిపారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా మే 1న రిలీజ్ కానుంది. -
గ్యాంగ్‌స్టర్‌గా దుమ్ములేపిన ధనుష్
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జగమే తంత్రం’. ధనుష్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ధనుష్ మాస్ లుక్ ఆకట్టుకుంది. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఉంది. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. ఆయనకిది 40వ చిత్రం కావడంతో.. ధనుష్ అభిమానులు D40 పేరుతో హాష్‌టాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ‘జగమే తంత్రం’ నిర్మించాయి. ఎస్. శశికాంత్ నిర్మాతగా, సహ నిర్మాతగా చక్రవర్తి రామచంద్రన్ వ్యవహరించారు. ఇక భిన్న కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే కార్తీక్ సుబ్బరాజ్.. ‘పేట’ సినిమాలో రజనీ వయసును 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. రజనీకాంత్‌కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్ ధనుష్‌తో ఛాన్స్ కొట్టేశాడు. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి కార్తీక్ దర్శకత్వం వహించిన సూపర్‌హిట్ సినిమాలు. -
లండన్‌కి బై బై
సెటిల్మెంట్లు, దందాలు చేయడం కోసం గ్యాంగ్‌స్టర్‌గా లండన్ వెళ్లారు ధనుష్. అక్కడ పనులన్నీ చక్కబెట్టి తిరిగి ఇండియా బయలుదేరారు. మరి.. సెటిల్మెంట్స్ను ధనుష్ ఏ స్టైల్లో సెటిల్ చేశారో వచ్చే ఏడాది వెండి తెరపై చూపిస్తాం అంటున్నారు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. ధనుష్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా చిత్రీకరణ ప్యాచ్ వర్క్ మినహా పూర్తయింది. ఇందులో ధనుష్ గ్యాంగ్‌స్టర్ పాత్ర చేశారు. ఆ మధ్య ఈ సినిమా చిత్రీకరణ యూకేలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘‘నాన్‌స్టాప్‌గా 64 రోజులు లండన్‌లో షూట్ చేశాం. చిత్రీకరణ ముగిసింది’’ అని పేర్కొన్నారు నిర్మాత శాష్. ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు జేమ్స్ కాస్మో ఓ కీలక పాత్ర పోషించారు. -
కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాణంలో ఐశ్వర్యా రాజేష్
విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్‌తో పేట చిత్రాన్ని తెరకెక్కించి స్టార్ దర్శకుడిగా మారిపోయారు. ప్రస్తుతం నటుడు ధనుష్‌తో చిత్రం చేయనున్నారు. కాగా మరో పక్క నిర్మాతగానూ నవ దర్శకులను ప్రోత్సహిస్తున్నారు. తన స్టోన్ బెంచ్ ఫిలింస్ పతాకంపై షార్ట్స్ ఫిలింస్‌ను నిర్మించారు. తర్వాత వైభవ్, ప్రియాభవానీశంకర్, ఇందుజా నటించిన మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించారు. అనంతరం ప్రభుదేవాతో మెర్కూరీ చిత్రాన్ని చేశారు. తాజాగా నటి కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో ఒక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే ప్రారంభం అయ్యింది. స్టోన్‌బెంచ్ ఫిలింస్ పతాకంపై నటి ఐశ్వర్యారాజేష్ ప్రధాన పాత్రలో మరో చిత్రాన్ని మొదలెట్టారు. ఈ చిత్రం సోమవారం నీలగిరిలో ప్రారంభం అయ్యింది. కల్ రామన్, ఎస్.సోమశేఖర్, కల్యాణ్ సుబ్రమనియన్లు ఈ సినిమాకు సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నదీంద్రన్ ఆర్.ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్నారు. రోబర్టో సస్సారా ఛాయాగ్రహణం, ఆనంద్ జరాల్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. లేడీ ఓరింయంటెడ్ కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో ఐశ్వర్య కీలక పాత్ర పోషిస్తున్నారు.చిత్ర షూటింగ్‌ను ఏకధాటిగా నిర్వహించి వచ్చే ఏడాది ప్రథమార్ధంలో తెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ వెల్లడించారు. -
వదిలేది లేదు
66వ జాతీయ అవార్డుల విషయంలో కోలీవుడ్ అసంతృప్తిగా ఉన్నా, ఇతర దక్షిణాది ఇండస్ట్రీలు హ్యాపీ అనే చెప్పాలి. ముఖ్యంగా తెలుగులో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి చిత్రంలో నటనకు గానూ కీర్తీసురేశ్‌కు ఉత్తమ నటి అవార్డు వరించడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. అతి పిన్న వయసులోనే సావిత్రి అంత గొప్ప నటి పాత్రలో ఎంతో పరిణితి నటనను ప్రదర్శించిన కీర్తీసురేశ్‌ను అందరూ ప్రసశించారు. అయితే నటి కీర్తీసురేశ్ మాత్రం జాతీయ అవార్డును ఊహించలేదని పేర్కొంది. అనుకోనిది అందుకోవడంలోనే మజా ఉంటుంది. ఆ ఆనందాన్నే కీర్తీసురేశ్ ఇప్పుడు అనుభవిస్తోంది. ఒక మలయాళ నటి తెలుగులో నటించిన చిత్రానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం అరుదైన విషయమే. కాగా ఈ అమ్మడు కోలీవుడ్‌లో నటించి చాలా కాలమే అయ్యింది. ఇంతకు ముందు తమిళంలో విజయ్, విశాల్, విక్రమ్ వంటి ప్రముఖ హీరోలతో వరుసగా నటించిన కీర్తీసురేశ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఒక్క చిత్రం కూడా చేయడం లేదు. ఇప్పుడామే టాలీవుడ్, బాలీవుడ్‌లపై దృష్టి సారిస్తోంది. బాలీవుడ్లో దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న చిత్రం ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులు చేసి స్లిమ్‌గా మారిపోయింది. ఇక తెలుగులోనూ ఒక లేడీ ఓరియేంటేడ్ కథా చిత్రంలో నటిస్తోంది. అలాంటిది తొలి హిట్‌ను అందించడంతో పాటు స్టార్ హీరోయిన్ అంతస్తును అందించిన కోలీవుడ్‌కు దూరం అవుతారా? అంటూ ఒక అభిమాని కీర్తీసురేశ్‌ను ప్రశ్నించాడు. ఇందుకు బదులిచ్చిన ఈ ఉత్తమ నటి, తాను కోలీవుడ్‌కు దూరం అయ్యే సమస్యే లేదని, త్వరలోనే తమిళ చిత్రంలో నటించనున్నట్లు చెప్పింది. ఈ అమ్మడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి అంగీకరించినట్లు తెలిసింది. ఇదీ హీరోయిన్ ఓరియన్‌టెడ్ కథా చిత్రంగానే ఉంటుందట. కమర్శియల్ చిత్రాల్లో బబ్లీగర్ల్ పాత్రల్లో నటించాల్సిన వయసులో కీర్తీసురేశ్ బరువైన పాత్రల్లో చిత్రాలను పూర్తిగా తన భుజాన మోయడానికి ప్రయత్నించడం సాధారణ విషయం కాదు అంటున్నారు విశ్లేషకులు. -
లండన్ ప్రయాణం
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్– ధనుష్ ఎప్పటి నుంచో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇదే సినిమాని పట్టాలెక్కించడానికి రెండుసార్లు ప్రయత్నించి, విఫలమయ్యారు. ఈ ప్రాజెక్ట్‌ను మళ్లీ స్టార్ట్ చేస్తున్నారని సమాచారం. వై నాట్ స్టూడియోస్ నిర్మించనున్న ఈ సినిమా ఎక్కువ శాతం షూటింగ్ లండన్‌లో జరగనుందట. రెండు నెలలు పాటు లండన్‌లో ఏకధాటిగా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఓ హాలీవుడ్ నటుడు కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. ప్రస్తుతం ధనుష్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయ్యాక కార్తీక్ సుబ్బరాజ్‌తో చేయబోయే సినిమా కోసం లండన్ ప్రయాణం కానున్నారు. -
కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో కీర్తీసురేశ్
యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చిత్రంలో యువ నటి కీర్తీసురేశ్ నటించబోతున్నారన్న టాక్. తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నిజానికి కీర్తీసురేశ్ కోలీవుడ్ చిత్రాల్లో నటించి చాలా కాలమైందని చెప్పవచ్చు. సర్కార్ చిత్రం తరువాత ఈ చిన్నది తమిళంలో నటించలేదు. అంతకు ముందు స్వామీ స్క్వేర్, సండైకోళి–2, సర్కార్ చిత్రాలతో పాటు తెలుగులో మహానటి వంటి చిత్రాలతో క్షణం తీరిక లేకుండా నటించేసిన కీర్తీసురేశ్ నటనకు కాస్త విరామం తీసుకోనున్నట్లు ప్రకటించారు. అయితే మలయాళంలో నటిస్తూనే ఉన్నారు. ఇక తెలుగులోనూ ఈ బ్యూటీకి అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ హిందీ చిత్రాల నిర్మాత, దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ కీర్తీసురేశ్‌ను బాలీవుడ్‌కు ఆహ్వానించారు. అక్కడ ఆయన నిర్మించనున్న చిత్రంలో అజయ్‌దేవ్‌గన్‌కు జంటగా నటించే అవకాశాన్ని కల్పించారు. విశేషం ఏమిటంటే ఆ చిత్రంలో కీర్తీసురేశ్ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అలా బాలీవుడ్లో ఎంట్రీతోనే ద్విపాత్రాభినయం చేస్తున్న తొలి దక్షిణాది బహుశా నటి కీర్తీసురేశే అయి ఉంటారు. ఈ చిత్రాన్ని అమిత్‌శర్మ తెరకెక్కిస్తున్నారు. అదే విధంగా మాతృభాష మలయాళంలో ప్రియదర్శన్ దర్శకత్వంలో మరక్కార్ అబిరక్కడలిండె సింహం అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో మోహన్‌లాల్, సునీల్‌శెట్టి, సుధీప్, అర్జున్, ప్రభు, మంజువారియర్, నెడుముడి వేణు, సుహాసిని మణిరత్నం వంటి స్టార్స్ నటిస్తున్నారు. వీటితో పాటు తెలుగులో నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఒక చిత్రం, నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఒక చిత్రం అంటూ బిజీగా నటిస్తున్నారు. ఇలా చూస్తే కీర్తీసురేశ్ నటించిన ఒక్క తమిళ చిత్రం కూడా ఈ ఏడాది తెరపైకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. తాజాగా ఒక తమిళ చిత్ర అవకాశం కీర్తీని వరించిందని తెలిసింది. సూపర్‌స్టార్‌కు పేట వంటి సూపర్‌హిట్ చిత్రాన్నిచ్చిన యువ దర్శకుడు కార్తీక్‌సుబ్బరాజ్ నటి కీర్తీసురేశ్‌ను తన చిత్ర కథానాయకిగా ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే ఇది ఆయన దర్శకత్వం వహించే చిత్రం కాకుండా సొంతంగా నిర్మించే చిత్రం అవుతుంది. తన స్టోన్ బెంచ్ పతాకంపై ఒక కొత్త దర్శకుడికి కార్తీక్‌సుబ్బరాజ్ అవకాశం కల్పిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఇదీ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంగా ఉంటుందట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారికపూర్వక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
అల్లుడి కోసం రజనీ
సక్సెస్ అవకాశాలను కుమ్మరిస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పరిస్థితి అలానే ఉంది. ఆ మధ్య మెర్కూరి, ఇరైవి చిత్రాలు కాస్త తేడా కొట్టడంతో నిరాశ చెందిన ఈ యువ దర్శకుడికి సూపర్ స్టార్ రూపంలో భారీ ఆఫర్ వచ్చింది. అదే పేట. ఈ చిత్రం రజనీకాంత్‌ను ఖుషీ పరచడంతో పాటు ఆయన కెరీర్లో మరో సంచలన చిత్రంగా నమోదు అయ్యింది. పేట చిత్రంలో రజనీకాంత్‌ను 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లి చాలా యూత్‌గా స్టైలిష్‌గా చూపించడంతో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ విజయవంతం అయ్యాడు. దీంతో బాగా ఇంప్రెస్ అయిన రజనీ కార్తీక్ సుబ్బరాజ్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సూపర్‌స్టార్, సుబ్బారాజ్ను పిలిచి తన చిన్నల్లుడు విశాఖన్ హీరోగా ఒక చిత్రంగా చేయాల్సిందిగా కోరినట్లు తాజా సమాచారం. ఈ ఆఫర్‌కు సుబ్బరాజు వెంటనే ఓకే చెప్పేశారట. విశాఖన్ రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య భర్త అన్న విషయం తెలిసిందే. గతంలో విశాఖన్ వంజగర్ ఉలగం చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించారు. యువ వ్యాపారవేత్త అయిన విశాఖన్‌కు నటనపై ఆసక్తి అట. దీంతో ఆయన్ను హీరోగా పరిచయం చేయమని తలైవా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌ను కోరినట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారిక పూర్వకంగా వెలువడాల్సి ఉంది. పేట చిత్రం తరువాత కార్తీక్ సుబ్బరాజ్ ధనుష్‌తో ఒక చిత్రం చేయబోతున్నారు. దీని తరువాత విశాఖన్‌తో చిత్రం చేసే అవకాశం ఉంది. అలా రజనీకాంత్ అళ్లుళ్లు ఇద్దరూ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంతో బిజిగా ఉన్నారన్న మాట. -
ఆన్ ద వే!
అంతా సవ్యంగా సాగి ఉంటే ధనుష్ హీరోగా ‘పేట’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం ఈ పాటికే వెండితెరపైకి వచ్చి ఉండేది. కానీ, కొన్ని కారణాలవల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయ్యింది. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ చిత్రం ఆగలేదు. ఆన్ ద వేలో ఉందని తాజా కోలీవుడ్ ఖబర్. కార్తీక్ సుబ్బరాజ్ ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారని సమాచారం. ధనుష్ ప్రస్తుతం వెట్రీ మారన్ దర్శకత్వంలో ‘అసురన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇంకా సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణసంస్థలో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. దర్శకునిగా ఓ సినిమా ఉంది. ఇలా వరుస కమిట్మెంట్స్తో ధనుష్ బిజీగా ఉన్నారు. మరి.. ఈ కమిట్మెంట్స్ అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ చిత్రం స్టార్ట్ అవుతుందా? లేక ఈ ఏడాదే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుందా? వెయిట్ అండ్ సీ. -
మామ తర్వాత అల్లుడితో
యువ దర్శకుల్లో కార్తీక్ సుబ్బరాజ్ శైలి భిన్నంగా ఉంటుంది. ఆయన తయారు చేసుకునే కథలు కూడా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటాయి. జిగర్తండా, కాదల్ సొల్పవదు ఎప్పడి, మెర్కూరి, ఇరైవి ఇలా ఏ చిత్రానికి ఆ చిత్రం భిన్నంగా ఉంటాయి. ఇక ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు పేట చిత్రంతో సూపర్‌హిట్ చిత్రాన్ని ఇచ్చాడు కార్తీక్. అందులో రజనీ వయసు 20 ఏళ్లు తగ్గించేశారనే ప్రశంసలను అందుకున్నారు. అలా రజనీకాంత్‌కు సూపర్ సక్సెస్ ఇచ్చిన కార్తీక్‌సుబ్బరాజ్.. ఇప్పుడు ఆయన అల్లుడు, ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. వును నిజానికి వీరి కాంభినేషన్లో ఇంతకు ముందే చిత్రం రూపొందాల్సి ఉంది. ఆ సమయంలో ధనుష్ వడచెన్నై, మారి–2 చిత్రాలతో బిజీగా ఉండడంతో వాయిదా పడింది. దీంతో వీరి కాంభినేషన్లో చిత్రం ఆగిపోయ్యిందనే ప్రచారం కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు కార్తీక్సుబ్బ రాజ్.. ధనుష్‌తో చిత్రం చేయడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఆయన కథ రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. జూన్‌లో ఈ చిత్రం సెట్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను వైనాట్ స్టూడియోస్ సంస్థ భారీ ఎత్తున నిర్మించనుంది. చిత్ర షూటింగ్‌ను అధిక భాగం న్యూయార్క్ నగరంలో చిత్రీకరించనున్నారని సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా ధనుష్ ప్రస్తుతం వెట్ట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న అసురన్ చిత్రంలో నటిస్తున్నారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించిన ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెన్సార్‌తో విడుదలకు సిద్ధంగా ఉంది.