Kejriwal
-
కేజ్రీవాల్‌కు ‘శీష్‌మహల్’ ఉచ్చు.. విచారణకు సీవీసీ ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్న ఆప్ అదినేత కేజ్రీవాల్ మరో సమస్యలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటున్న సమయంలో కేజ్రీవాల్ నివసించిన ఢిల్లీలోని ప్రభుత్వ భవనంలో అవినీతికి పాల్పడుతూ, అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో మాజీ ప్రతిపక్ష నేత, రోహిణి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా ఈ ఉదంతంపై ఫిర్యాదు చేశారు.శీష్ మహల్ (సీఎం ప్రభుత్వ బంగ్లాకు బీజేపీ పెట్టిన పేరు)పై విజేంద్ర గుప్తా దాఖలు చేసిన ఫిర్యాదుపై సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆయన 2024 అక్టోబర్ 14న సీవీసీకి దీనిపై ఫిర్యాదు దాఖలు చేశారు. 40,000 చదరపు గజాల (8 ఎకరాలు) విస్తీర్ణంలో శీష్ మహల్ నిర్మించడానికి కేజ్రీవాల్ భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.దీనిపై 2024, అక్టోబర్ 16న సీవీసీ దర్యాప్తు ప్రారంభించింది. వాస్తవ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని నాడు హామీ ఇచ్చింది. 2025, ఫిబ్రవరి 13న వాస్తవ నివేదికను పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని సంబంధిత ఉన్ననాధికారులు నిర్ణయించారు. ముఖ్యమంత్రి నివాసం, దాని పునరుద్ధరణ, ఇంటీరియర్ డెకరేషన్ కోసం జరిగిన వృధా ఖర్చుపై దర్యాప్తుకు సంబంధించి సీవీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసిన దరిమిలా ఇప్పుడు దీనిపై చర్యలు తీసుకోనున్నారు.ఢిల్లీ మాజీ సీఎం అధికార నివాసానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు బీజేపీ నేత విజేందర్ గుప్తా సీవీసీకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. శీష్ మహల్‌ని ఆధునీకరిస్తూ, టాయిలెట్లో గోల్డెన్ కమోడ్, స్విమ్మింగ్‌పూల్, మినీ బార్ వంటివి ఏర్పాటు చేసుకున్నారని గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బంగ్లాను ఆధునీకరించడంలో లెక్కలేనన్ని అవకతవకలు జరిగాయని బీజేపీ నేతలు కూడా పలుమార్లు విమర్శించారు.ఇది కూడా చదవండి: రాష్ట్రపతి పాలన తొలిగా ఏ రాష్ట్రంలో ఎందుకు విధించారు? -
ఇక ‘ఆప్’ప్లాన్ ఏంటి? సిసోడియా ఏమన్నారు?
న్యూఢిల్లీ: ఢ్లిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు ఘోర పరాభవం ఎదురయ్యింది. పార్టీలోని పెద్ద నేతలు కూడా ఓటమి పాలయ్యారు. దీంతో వారంతా దక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆప్ జాతీయ కన్వనీర్ అరవింద్ కేజ్రీవాల్ తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిలో పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా కూడా పాల్గొన్నారు. పార్టీ ఓటమి పాలయిన తర్వాత భవిష్యత్ ప్రణాళిక ఏమిటి? అనే ప్రశ్నకు సిసోడియా సమాధానమిచ్చారు.మనీష్ సిసోడియా విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై తమ నేత కేజ్రీవాల్ అందరితో చర్చించారని, తమలో ఆత్మవిశ్వాసాన్ని నింపారని, తాము ఏవిధంగానైతే ఢ్లిల్లీలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికల పోరాటం సాగించామో, అదేవిధంగా ప్రజలకు సేవ చేస్తూ వారి మధ్యలోనే ఉంటామన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు, చీరలు, చివరికి మద్యం కూడా పంపిణీ చేశారని, ఎన్నికల వ్యవస్థను దురుపయోగం చేశారని సిసోడియా ఆరోపించారు. ఈ తరహాలో జరిగిన ఎన్నికల్లో పోటీ అంత సులభం కాలేదన్నారు. అయినప్పటికీ ఆప్ తన పోరాటాన్ని ఆపలేదన్నారు.ఓటమి పాలయిన నేతలకు అరవింద్ కేజ్రీవాల్ ఒక విషయం చెప్పారని.. వారు పోటీ చేసిన ఆయా ప్రాంతాల్లోని ప్రజల మధ్యలో ఉంటూ, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 27 ఏళ్ల తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల అనంతరం నాల్గవసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కలలుగన్న ఆప్‌కు నిరాశ ఎదురయ్యింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా, ఆప్ 22 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్ ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది.ఇది కూడా చదవండి: Mahakumbh: రాష్ట్రమంతటా ట్రాఫిక్ జామ్.. ఎక్కడ చూసినా భక్తజన సందోహం -
‘ఆప్’ ఓటమితో పంజాబ్‌లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలు కావడంతో పంజాబ్‌లో వణుకు మొదలయ్యింది. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సింగ్‌కు ఢిల్లీ ఫలితాలు అగ్నిపరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తర్వాత పార్టీలోనూ, పంజాబ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కాగలరని వ్యాఖ్యానించారు. ఆయన పంజాబ్ మంత్రి, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. పంజాబ్‌లో హిందువు కూడా ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు.పంజాబ్‌లోని లూథియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలచుకుంటే అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ స్థానం నుంచి పోటీచేయించి, ముఖ్యమంత్రిని చేయవచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనపై ఆప్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్(Bhagwant Mann) ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతరం కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వాన్ని 'రిమోట్ కంట్రోల్'తో నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు -
‘ఢిల్లీ’లో ఓటమి.. కేజ్రీవాల్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) అధినేత కేజ్రీవాల్ తొలిసారిగా స్పందించారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. హామీలు నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు తెలిపారు. తాను ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఢిల్లీ ప్రజల కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, స్వయంగా కేజ్రీవాల్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై ఓటమి పాలవడం గమనార్హం. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సిసోడియా,సత్యేందర్‌జైన్ వంటి ఆప్ నేతలంతా ఓటమి పాలవడం హాట్‌టాపిక్‌గా మారింది. మరోవైపు ఆప్ సీనియర్ నేత, ప్రస్తుత సీఎం అతిషి మాత్రం కల్కాజి నియోజకవర్గంలో బీజేపీ నేత రమేష్ బిదూరిపై విజయం సాధించడం విశేషం. -
ఆప్ ఓటమి.. ఢిల్లీ సచివాలయం సీజ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ఓటమితో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సచివాలయం నుంచి ఒక్క ఫైల్ కూడా బయటకెళ్లకూడదంటూ సచివాలయ అధికారులకు లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. గత పదేళ్లుగా ఆప్ అవినీతిపై బీజేపీ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో కాగ్ నివేదికలు ప్రవేశపెడతామని కూడా మోదీ తెలిపారు. ఫైల్స్, రికార్డ్స్ భద్రతపరచాలని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు.ఢిల్లీ అసెంబ్లీపై 27 ఏళ్ల అనంతరం కాషాయ జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ కల హ్యాట్రిక్ కల నెరవేరలేదు. బీజేపీ పైచేయి సాధించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. తాజా సమాచారం మేరకు 70 అసెంబ్లీ స్థానాలకు గాను 47 స్థానాల్లో బీజేపీ, 23 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 47 శాతం ఓట్ షేర్ సాధించి ఆగ్ర స్థానంలో నిలిచింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రులు ఘోర ఓటమి చవిచూశారు. -
Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (శనివారం) కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ట్రెండ్స్.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాటలో ఉందని చూపిస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సీట్ల కంటే వెనుకంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా బీజేపీ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.2015లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లు గెలుచుకుంది. కానీ 2020లో ఈ సంఖ్య 62కి తగ్గింది. మరోవైపు బీజేపీ 2015లో 3 సీట్లు, 2020లో 8 సీట్లు గెలుచుకుంది. ఈసారి ఆ పార్టీ సీట్లు గణనీయంగా పెరగబోతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి బాట వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి:1. అవినీతి ఆరోపణలు-చట్టపరమైన సమస్యలు: పార్టీ అగ్ర నేతలు.. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లపై అవినీతి ఆరోపణలు, అరెస్టులు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ చట్టపరమైన వివాదాలు ఆప్ ప్రతిష్టను బలహీనపరిచాయి. యమునా నదిని శుభ్రపరచడం, ఢిల్లీ రోడ్లను అందంగా తీర్చిదిద్దడం, పరిశుభ్రమైన నీటిని అందించడం లాంటి కేజ్రీవాల్ హామీలు నెరవేరలేదు.2. నాయకత్వ అస్థిరత: కేజ్రీవాల్ అరెస్టు.. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడం పార్టీ నాయకత్వంలో అస్థిరతకు దారితీసింది. కొత్త ముఖ్యమంత్రిగా అతిషి నియమితులైనప్పటికీ, నాయకత్వ మార్పు పార్టీకి సవాలుగా మారింది. అరవింద్ కేజ్రీవాల్‌పై జనాల్లో విశ్వసనీయత విపరీతంగా తగ్గింది.3. ఓట్లను చీల్చిన కాంగ్రెస్: వాస్తవానికి సీట్ల పరంగా ఢిల్లీలో కాంగ్రెస్ ఒక సీటు మాత్రమే గెలుచుకోవచ్చనే అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లను చీల్చింది. 2013 తర్వాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ ఢిల్లీలోని ఏడు సీట్లనూ కోల్పోవడం, పంజాబ్‌లో కేవలం మూడు సీట్లలో మాత్రమే విజయం సాధించడం కారణంగా పార్టీ బలహీనపడింది.4. అంతర్గత కలహాలు- రాజీనామాలు: పార్టీ లో అంతర్గత కలహాలు, కైలాష్ గెహ్లాట్, రాజ్ కుమార్ ఆనంద్ తదితర ప్రముఖ నేతల రాజీనామాలు పార్టీని దెబ్బతీశాయి. అలాగే పార్టీ సంస్థాగత బలహీనతను బహిర్గతం చేశాయి.5. ప్రతిపక్ష పార్టీల ఆరోపణల ప్రభావం: ఆప్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ఉపయోగించుకున్నాయి. ఇది పార్టీ ప్రతిష్టను మరింత దెబ్బతీసింది. మహిళలు, కొత్త ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి దూరమయ్యారు. -
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై అన్నాహజారే రియాక్షన్
ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే స్పందించారు. అధికార దాహంతోనే కేజ్రీవాల్ ఓడిపోయారంటూ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయన్న అన్నాహజారే.. డబ్బు, అధికారాన్ని దుర్వినియోగం చేశారని.. అందుకే కేజ్రీవాల్‌ను ప్రజలు ఓడించారన్నారు.గతంలో అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి అన్నాహజారే.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌పై అన్నాహజారే మాట్లాడటం ఇదేమీ తొలిసారి కాదు.. లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సందర్భంలోనూ ఆయన మండిపడ్డారు.కాగా, ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తోంది. 50 సీట్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. సెంట్రల్ ఢిల్లీ, ఔటర్ ఢిల్లీలోనూ బీజేపీదే హవా చూపుతోంది. ఔటర్ ఢిల్లీలోనూ ఆప్ తుడిచిపెట్టుకుపోయింది. ఆప్ అగ్రనేతలు, మంత్రులు వెనుకంజలో ఉన్నారు. అవినీతి కేసుల్లో చాలామంది నేతలు ఇరుక్కోవడం ఆప్‌కు వ్యతిరేకతగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లాంటి అగ్రనేతలు జైలుకు వెళ్లి రావడంతో పలువురు ఆప్ అగ్రనేతలు బీజేపీలోకి చేరారు. దీంతో ఆయా స్థానాల్లో బీజేపీకి విజయావకాశాలు పెరిగాయి. మరోవైపు, ఢిల్లీసీఎం అధికారిక నివాసం నిర్మాణంలో అవినీతి, లిక్కర్ స్కాం అభియోగాలు ఆప్ ప్రతిష్ఠను మరింత దిగజార్చాయి. -
Delhi Election 2025: కేజ్రీవాల్ ఇంటికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢ్లిలీలోని మొత్తం 70 అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు((శనివారం) జరుగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బీజేపీ ముందంజలో ఉంది. #WATCH | Delhi: A young supporter of AAP National Convenor Arvind Kejriwal, Avyan Tomar reached the residence of Arvind Kejriwal dressed up as him to show support. pic.twitter.com/dF7Vevy6En— ANI (@ANI) February 8, 2025 ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి 'బేబీ మఫ్లర్ మ్యాన్' వచ్చాడు. ఇతని పేరు అవ్యాన్ తోమర్. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఆయన ధరించిన లాంటి దుస్తులు ధరించి వచ్చాడు. కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్న అవ్యాన్ తోమర్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్నికల ఫలితాల రోజున ఇక్కడికి వస్తుంటామని, ఆమ్ ఆద్మీ పార్టీనే మా కుమారునిని ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అనే పేరు పెట్టిందని తెలిపారు. #WATCH | Delhi: Avyan Tomar's father, Rahul Tomar says, "... We always come here on result days... The party has also given him the name of 'Baby Muffler Man'..." pic.twitter.com/cMdDc3sGWf— ANI (@ANI) February 8, 2025 -
Delhi Election 2025: 12 ఏళ్ల ‘ఆప్’ ప్రస్థానం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్‌పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
అరవింద్ కేజ్రివాల్ నివాసానికి ఢిల్లీ ACB టీమ్
-
'ఎగ్స్ కేజ్రీవాల్' రెసిపీ..: ఢిల్లీ మాజీ సీఎంకి ఏంటి సంబంధం..!
కొన్ని రెసిపీల పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి పేర్లు భలే తమాషాగా ఉంటాయి. అసలు వాటికా పేరు ఎలా వచ్చిందో వింటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఈ రెసిపీకి కూడా అలానే పేరు వచ్చింది. కాకపోతే మన దేశ రాజధాని ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) పేరు మీద ఉండటం చూస్తే..ఆయనే పేరు మీద రెసీపీ పేరేంటీ అని అనుకోకండి. నిజానికి ఆయనకి ఈ రెసిపీతో సంబంధం లేకపోయినా..ఆ రెసీపీ స్టోరీ మాత్రం వెరీ ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది ఎందుకంటే..?.ఆ వంటకం పేరు ఎగ్స్ కేజ్రీవాల్(Eggs Kejriwal) అనే ప్రసిద్ధ బ్రేక్‌ఫాస్ట్. భారతీయ వంటకాల్లో ఎగ్స్‌తో చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి. అయితే ఈ వంటకం మాత్రం చాలా గమ్మతైనది. ఈ వంటకం ఆవిష్కరణ కూడా అత్యంత విచిత్రమైనది. ఈ వంటకం మూలం ముంబై(Mumbai). ఈ వంటకానికి కేజ్రీవాల్ పేరు ఎలా వచ్చిందంటే..1960లలో ముంబైలోని నాగరిక విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్ దేవీ ప్రసాద్ కేజ్రీవాల్ అనే వ్యాపారవేత్త కారణంగా వచ్చిందట. ఆయనది పూర్తిగా శాకాహారులైన మార్వాడీ కుటుంబం. కాబట్టి ఇంట్లో గుడ్డు తినే ఛాన్స్ లేకపోయింది. అయితే ఆయనకు గుడ్లంటే మహా ప్రీతి. వాటిని ఆరగించేందుకు విల్లింగ్డన్ స్పోర్ట్స్ క్లబ్(Willingdon Sports Club) వెళ్లిపోయేవాడట. అక్కడ ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా గుడ్లు ఎలా తినాలన్నా ఆలోచన నుంచే..ఈ రెసీపీని కనిపెట్టారట పాకనిపుణులు. ఆయన బ్రెడ్‌ని చీజ్‌లో వేయించి దానిపై రెండు గుడ్లు వేయించుకుని ఆపై ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరియాల పొడితో గార్నిష్ చేయించుకుని మరీ తెప్పిచుకునేవాడట. చూసే వాళ్లకు ఏదో చీజ్ బ్రెడ్ తిన్నట్లు కనిపిస్తుంది అంతే..!. ఆయన ఆవిధంగా అక్కడకు వెళ్లిన ప్రతిసారి అలా ఆర్డర్ చేయించుకుని తినడంతో మిగతా కస్టమర్లలో ఆయన ఏం ఆర్డర్ చేస్తున్నాడనే కుతుహాలం పెరిగింది. ఆ తర్వాత అందరికీ అలా తినడమే నచ్చి ఆర్డర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో ఆ రెసిపీకి ఎగ్స్ కేజ్రీవాల్ అనే పేరు స్థిరపడిపోయింది. అంతేగాదు ఈ రెసిపీకున్న క్రేజ్ చూస్తే నోరెళ్లబెడతారు. ఎందుకంటే న్యూయార్క్, లండన్ రెస్టారెంట్లలో ప్రసిద్ద బ్రేక్‌ఫాస్ట్ ఇది. అలాగే న్యూయార్క్ టాప్ 10 వంటకాల జాబితాలో చోటు కూడా దక్కించుకుంది ఈ రెసిపీ. తమషాగా ఉన్న ఈ రెసిపీ స్టోరీ..ఓ మనిషి అభిరుచి నుంచే కొత్త రుచులతో కూడిన వంటకాలు తయారవ్వుతాయన్న సత్యాన్ని తెలియజేసింది కదూ..!. మరీ ఈ రెసిపీ తయారీ విధానం సవివరంగా చూద్దామా..!.కావాల్సిన పదార్థాలు తురిమిన చీజ్: 80 గ్రాములుబ్రెడ్: రెండు స్లైసులుస్ప్రింగ్ ఆనియన్స్ : 2పచ్చి మిరపకాయ: 1నూనె: 1 టీస్పూన్పెద్ద గుడ్లు: 2నల్ల మిరియాలు: రుచికి సరిపడతురిమిన చీజ్‌లో చక్కగా గోల్డెన్ కలర్లో బ్రెడ్లు కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మందపాటి గిన్నెలో రెండు గుడ్లను పగలకొట్టి వేసుకోవాలి. వాటిని చిదపకుండా అలానే బ్రెడ్‌పై వేసి కొద్దిసేపు కాల్చాలి. ఆ తర్వాత దానిపై ఆనియన్స్ తురిమిన చీజ్, పచ్చిమిర్చి, మిరియాల పౌడర్ చల్లి సర్వ్ చేయడమే. హెల్తీగానూ కడుపు నిండిన అనుభూతి కలిగించే మంచి బ్రేక్‌ఫాస్ట్ ఇది.(చదవండి: పుష్ప మూవీలో హీరో అన్నట్లు వర్క్‌లో బ్రాండ్ కావాలి..!) -
Delhi Assembly Election: అణువణువునా గస్తీ.. 35 వేల పోలీసులు మోహరింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో రేపు (ఫిబ్రవరి 5) మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. పొలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది. ఒక కోటీ 55 లక్షల మంది ఓటర్లు ఢిల్లీకి నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటికే పూర్తయ్యాయి. పోలీసులు, భద్రతా దళాలను ఢిల్లీ అంతటా మోహరించారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం రాత్రంతా సున్నితమైన ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు. 35 వేలకు పైగా పోలీసులను ఎన్నికల విధుల్లో నియమించారు. 220 కంపెనీల కేంద్ర రిజర్వ్ దళాలను కూడా భద్రత కోసం రంగంలోకి దింపారు. 19 వేల మంది హోమ్ గార్డ్ సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రచారం ముగిసిన తర్వాత బయటి వ్యక్తులు ఢిల్లీ విడిచి వెళ్లాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా తిరుగుతున్న పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఓటు వేయనున్నారు. దివ్యాంగ ఓటర్ల కోసం 733 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈసారి ఢిల్లీలో గరిష్ట ఓటింగ్ జరిగేలా చూసేందుకు, ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ఓటర్లు తమ పోలింగ్ బూత్ వద్ద ఎంత జనసమూహం ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొంది. దీనికి తోడు కాంగ్రెస్‌కు ఇక్కడున్న బలమైన ఉనికి ఈ ఎన్నికలను త్రిముఖ పోరుగా మార్చింది. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు పలువురు ముఖ్యమంత్రులు బీజేపీ తరపున ప్రచారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అతిషి నియోజకవర్గంలో మూడు ర్యాలీలు నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కల్కాజీ, కస్తూర్బా నగర్లలో రోడ్ షో చేశారు.ఇది కూడా చదవండి: 12న ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. ట్రంప్‌తో భేటీ? -
ముగిసిన ఢిల్లీ ఎన్నికల ప్రచారం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. బుధవారం(ఫిబ్రవరి5) పోలింగ్ ఉండడంతో 48 గంగల ముందు ప్రచారాన్ని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం సోమవారం సాయంత్రం నుంచి అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఆపేశాయి.చివరిరోజు ఆమ్ఆద్మీపార్టీ,బీజేపీ,కాంగ్రెస్ అగ్ర నేతలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఆప్ అధినేత కేజ్రీవాల్ అయితే ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘంపైనే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పోస్టా లేక ఇతర ఏదైనా పెద్ద పోస్టు ఆఫర్ చేసిందా అని ప్రశ్నించారు. కాగా, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీపార్టీ, కేంద్రంలో పవర్లో ఉన్న బీజేపీ మధ్యే ఈ ఎన్నికల్లో ప్రధాన పోరు ఉండనుంది. కాంగ్రెస్ పోటీ చేస్తున్నప్పటికీ అంతగా ప్రభావం చూపదని తెలుస్తోంది. కాంగ్రెస్ పోటీ వల్ల ఆప్కే నష్టమన్న వాదన వినిపిస్తోంది. గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఇటీవల ప్రకటించిన మినహాయింపు ఢిల్లీ ఎన్నికల్లో పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుందని, ఇది తమను గెలుపు తీరాలకు చేరుస్తుందని బీజేపీ ఆశిస్తోంది. -
Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక రెండు రోజులే మిగిలి ఉంది. ఢిల్లీలోని 70 స్థానాలకు బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హ్యాట్రిక్ విజయాలు సాధించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.ఢిల్లీలోని ఐదు స్థానాల్లో బీజేపీ బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదు స్థానాలను ఆప్ అతికష్టం మీద గెలుచుకుంది. ఆప్ అభ్యర్థులు బీజేపీని చాలా తక్కువ ఓట్ల తేడాతో ఓడించారు. ఆ సీట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.1. బిజ్వాసన్గత ఎన్నికల్లో నైరుతి ఢిల్లీలోని బిజ్వాసన్ స్థానంలో ఆప్ అభ్యర్థి భూపిందర్ సింగ్ జూన్ బీజేపీకి చెందిన సత్ ప్రకాష్ రాణాను కేవలం753 ఓట్ల తేడాతో ఓడించారు. భూపిందర్ సింగ్ జూన్‌కు 57,271 ఓట్లు, సత్ ప్రకాష్ రాణాకు 56,518 ఓట్లు వచ్చాయి. ఈ సీటును రెండుసార్లు గెలుచుకున్న సత్ ప్రకాష్ రాణా, 2015లో మొదటిసారి, 2020లో రెండవసారి ఈ సీటును కోల్పోయారు. ఈసారి ఆప్ సురేంద్ర భరద్వాజ్‌కు, బీజేపీ కైలాష్ గెహ్లాట్‌కు, కాంగ్రెస్ దేవేంద్ర సెహ్రావత్‌కు బిజ్వాసన్ టికెట్ ఇచ్చింది.2. కస్తూర్బా నగర్ఆగ్నేయ ఢిల్లీలోని కస్తూర్బా నగర్ సీటులో ఈసారి కూడా గట్టి పోటీ నెలకొంది. బీజేపీకి చెందిన రవీంద్ర చౌదరికి 33,935 ఓట్లు, ఆప్ నేత మదన్ లాల్‌కు 37100 ఓట్లు వచ్చాయి. మదన్ లాల్ కేవలం 3,165 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఆప్ రమేష్ పెహ్ల్వాన్ను బరిలోకి దింపింది. బీజేపీ నీరజ్ బసోయాకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ అభిషేక్ దత్‌ను నిలబెట్టింది.3. ఛతర్పూర్2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి కర్తార్ సింగ్ తన్వర్ కూడా దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్ అసెంబ్లీ స్థానాన్ని 3,720 ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈ ఎన్నికల్లో కర్తార్ సింగ్ కు 6,9411 ఓట్లు, బీజేపీకి చెందిన బ్రహ్మ సింగ్ తన్వర్ కు 6,5691 ఓట్లు వచ్చాయి. ఈసారి ఆ స్థానంలో అభ్యర్థుల్లో మార్పు జరిగింది. ఆప్ బ్రహ్మ సింగ్ తన్వర్‌ను, బీజేపీ కర్తార్ సింగ్‌ను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ పార్టీ రాజేంద్ర తన్వర్‌కు టికెట్ ఇచ్చింది.4. ఆదర్శ్ నగర్ఉత్తర ఢిల్లీలోని ఆదర్శ్ నగర్ స్థానంలో గత ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి పవన్ శర్మకు 46,892 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రాజ్ కుమార్ భాటియాకు 45,303 ఓట్లు వచ్చాయి. వారిద్దరి మధ్య ఓట్ల తేడా కేవలం 1,589 మాత్రమే. ఈసారి ఆప్ ముఖేష్ గోయల్ కు టికెట్ ఇవ్వగా, బీజేపీ రాజ్ కుమార్ భాటియాకు టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ శివంక్ సింఘాల్‌ను ఎన్నికల్లో పోటీకి దింపింది.5. పట్పర్గంజ్మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తూర్పు ఢిల్లీలోని పట్పర్గంజ్ స్థానం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సీటును సిసోడియా అతికష్టం మీద దక్కించుకున్నారు. 2020 ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియాకు 70,163 ఓట్లు వచ్చాయి. బీజేపీ నేత రవీంద్ర నేగికి 66,956 ఓట్లు వచ్చాయి. మనీష్ సిసోడియా 3,207 ఓట్ల తేడాతో గెలిచారు. ఈసారి ఆప్ అవధ్ ఓజాకు టికెట్ ఇచ్చింది. బీజేపీ రవీంద్ర నేగిని, కాంగ్రెస్ అనిల్ కుమార్‌ను బరిలోకి దింపాయి.ఇది కూడా చదవండి: వికటించిన విందు భోజనం.. ఆస్పత్రికి 200 మంది -
ఆప్ ఆశలపై ఐటీ దెబ్బ!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సారథి అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ ఆశలకు ఎలాగైనా గండి కొట్టేందుకు కృతనిశ్చయంతో ఉన్న మోదీ సర్కారు ప్రచారం చివరి దశకు చేరిన వేళ తురుపుముక్కను గురి చూసి మరీ వదిలింది. రాజధానిలో మూడొంతుల దాకా ఉన్న వేతన జీవులను ఆకట్టుకునేలా ‘ఐటీ మినహాయింపుల’ అస్త్రాన్ని ప్రయోగించింది! వారికి ఆదాయ పన్ను మినహాయింపు పరిధిని ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.12 లక్షలకు పెంచింది. శనివారం నాటి కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు చేసిన ప్రకటన ఆప్ శిబిరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది నిజంగా మోదీ మాస్టర్‌స్ట్రోకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో మూడు రోజుల్లో (బుధవారం) జరగనున్న ఢిల్లీ ఎన్నికల పోలింగ్‌లో ఐటీ మినహాయింపు ప్రభావం గట్టిగానే ఉండగలదని వారంటున్నారు. మాస్టర్ స్ట్రోక్! ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రతిష్టాత్మక పోరుకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారాయి. పాతికేళ్ల తర్వాత ఎలాగైనా గెలుపు ముఖం చూసేందుకు కాషాయ పార్టీ, వరుసగా మూడో విజయం కోసం ఆప్ ఇప్పటికే ఓటర్లకు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశాయి. రాజధాని జనాభాలో 97 శాతం నగర, పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారిలోనూ మధ్య తరగతి వర్గం ఏకంగా 67 శాతానికి పైగా ఉంది. దాంతో వాళ్లను ఆకట్టుకోవడానికి రెండు పారీ్టలూ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. పదేళ్లపాటు సామాన్యులు, అల్పాదాయ వర్గాలే లక్ష్యంగా సంక్షేమ, అభవృద్ధి పథకాలు అమలు చేస్తూ వచ్చిన ఆప్ ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత, కేజ్రీవాల్‌పై అవినీతి మచ్చ తదితరాలతో సతమతమవుతోంది. ఈ ప్రతికూలతలను అధిగమించేందుకు మిడిల్‌క్లాస్‌పై గట్టిగా దృష్టి సారించింది. తనమేనిఫెస్టోను కూడా మధ్యతరగతి పేరిటే విడుదల చేసింది. ఆ సందర్భంగా మాట్లాడిన కేజ్రీవాల్, ఐటీ మినహాయింపు పరిధిని రూ.10 లక్షలకు పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తద్వారా వేతన జీవులను ఆకట్టుకోవచ్చని భావించారు. కానీ ఆ పరిధిని ఏకంగా రూ.12 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేజ్రీవాల్ కంటే రెండాకులు ఎక్కువే చదివానని నిరూపించుకుంది. ఢిల్లీ ఓటర్లలో వేతన జీవులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వారందరినీ ఇది బాగా ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ వ్యతిరేక ఓటు ఈసారి ఆప్‌కు బదులు కాంగ్రెస్‌కు పడొచ్చన్న విశ్లేషణలు కేజ్రీవాల్ పార్టీని మరింతగా ఆందోళనకు గురి చేస్తున్నాయి. బీజేపీతో హోరాహోరీ పోరు జరిగే నియోజకవర్గాల్లో ఇది తీవ్రంగా దెబ్బ తీయవచ్చని ఆప్ భావిస్తోంది. గత ఎన్నికల్లో 15కు పైగా స్థానాల్లో 10 వేల లోపు మెజారిటీ నమోదవడం గమనార్హం. కేజ్రీవాల్‌కూ ఎదురీతే! ఆప్‌తో పాటు దాని సారథి కేజ్రీవాల్ కూడా కష్టకాలంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆయన కంచుకోట అయిన న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఈసారి ఎదురీత తప్పేలా లేదు. ఈ స్థానం పరిధిలో ప్రభుత్వోద్యోగులు, గ్రేడ్ ఏ, బీ అధికారులు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. తాజా బడ్జెట్లో ప్రకటించిన ఐటీ వరంతో వీరిలో అత్యధికులు లబ్ధి పొందనున్నారు. అవినీతి ఆరోపణలు, అధికార నివాసం కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని మంచినీళ్లలా వెచ్చించారంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఇప్పటికే కేజ్రీవాల్‌కు తల బొప్పి కట్టిస్తున్నాయి. వీటికి తోడు మౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తానన్న హామీని నిలబెట్టుకోలేదంటూ ఓటర్లు పెదవి విరుస్తున్నారు. 2013లో తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా నాటి సీఎం అయిన కాంగ్రెస్ సీనియర్ షీలా దీక్షిత్‌నే మట్టికరిపించారు. నాటినుంచీ అక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ, కాంగ్రెస్ నుంచి షీలా కుమారుడు సందీప్ దీక్షిత్ రూపంలో ఏకంగా ఇద్దరు మాజీ సీఎంల వారసులు ఆయనకు గట్టి సవాలు విసురుతున్నారు. కేజ్రీ ఓట్లకు సందీప్ భారీగా గండి కొడతారని, ఇది అంతిమంగా పర్వేశ్‌కు లాభిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
యమున నీటిని తాగే దమ్ముందా?..ఈసీకి కేజ్రీవాల్ సవాల్
ఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘానికి ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ సవాల్ విసిరారు. ఇప్పుడే నేను మీకు ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని పంపిస్తా. ప్రెస్ మీట్ పెట్టండి. ఆ ప్రెస్మీట్లో ఆ నీటిని తాగండి. అలా చేస్తే .మేం తప్పు చేశామని ఒప్పుకుంటామని స్పష్టం చేశారు.హర్యానా ప్రభుత్వం యమునా నధిలోకి వ్యర్థాలను వదులుతోందని క్రేజీవాల్ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై స్పందించిన ఈసీ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటల కల్లా వివరణ ఇవ్వాలని సూచించింది. అయితే ఈసీ నిర్ణయంపై కేజ్రీవాల్ గురువారం మీడియాతో మాట్లాడారు. మీడియా సమావేశంలో ఓ మూడు బాటిళ్ల యమునా నది నీటిని ఉంచారు.आम आदमी पार्टी की सरकार बनने पर दिल्ली में काम करने वाले सर्वेंट्स वर्ग के लिए नई योजनाएँ लाएँगे— जैसे रजिस्ट्रेशन पोर्टल, सरकारी कार्ड, सर्वेंट हॉस्टल, EWS मकानों में प्राथमिकता, मोबाइल क्लीनिक और तय काम के घंटे इत्यादि। सर्वेंट्स वर्ग ना सिर्फ़ हमारे घरों की देखभाल करते हैं,… https://t.co/9Fxoi5w4PC— Arvind Kejriwal (@ArvindKejriwal) January 30, 2025 ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బుల్ని వెదజల్లుతున్నాయి. కానీ వాటిని ఈసీఐ గుర్తించడం లేదు. రాజకీయాలు చేయడంలో బిజీగా ఉంది. ఎందుకంటే? కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ త్వరలో రిటైర్ కాబోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు చేయానుకుంటున్నారేమో? ఈ సందర్భంగా చరిత్ర ఎప్పటికీ క్షమించదని ఈసీఐకి గుర్తు చేస్తున్నాను.ఎన్నికల కమిషన్‌ను నేను నమ్మును. ఈసీఐ ఎప్పుడో అపఖ్యాతి పాలైంది. త్వరలో అరెస్టు అవ్వొచ్చు. అయినా నేను భయపడను. దేశంలో ఇంతకుముందెన్నడూ ఇలాంటి ఎన్నికలు జరగలేదు.‘అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉన్న మూడు యమునా నది వాటర్ బాటిళ్లను కేంద్ర ఎన్నికల సంఘానికి, కమిషనర్‌కు పంపుతా. ఆ నీటిని ముగ్గురు ఎన్నికల కమిషనర్లు మీడియా సమావేశంలో తాగాలి. అలా తాగితే మేము మా తప్పును ఒప్పుకుంటాము’అని కేజ్రీవాల్ అన్నారు.అమోనియం స్థాయి పెరిగికేజ్రీవాల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. యమునా నది నీరు విషపూరితంగా మారుతున్న సంగతి నిజమేనని, ఈ నీటిలో అమ్మోనియం స్థాయి ఇటీవల విపరీతంగా పెరుగుతోందని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీలోని నీటి శుద్ధి కేంద్రాలు సక్రమంగా పనిచేయకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నది నీటిలో అమ్మోనియా స్థాయి 7 పీపీఎం ఉందన్నారు.ఇది కచ్చితంగా విషంతో సమానమేనని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీలకు యమునా నది నీటిని ప్రజల సమక్షంలో బహిరంగంగా తాగే దమ్ముందా? అని సవాలు విసిరారు. ఎగువ రాష్ట్రంలో హర్యానాలో ఈ నదిలో విషపదార్థాలు కలుస్తున్నాయని మరోసారి ఆరోపించారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం నదిని విషతుల్యం చేస్తోందన్నారు.కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లుయమున నదిలో విషం కలుపుతున్నారంటూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్యానా ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణలను తప్పుపట్టింది. ఫిబ్రవరి 17వ తేదీన తమ ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ బుధవారం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. యమునా నదిని హర్యానా ప్రభుత్వం విషతుల్యం చేస్తున్నట్లు ఆధారమేంటో చెప్పాలని, నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. -
రాత్రి 8 కల్లా ఆధారాలు చూపండి
న్యూఢిల్లీ: హరియాణాలోని అధికార భాజపా యమునా నదిలోకి విషయం కలిపేందుకు ప్రయత్నించిందన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఘాటుగా స్పందించింది. ‘‘తప్పుడు ఆరోపణలు చేస్తే గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. విషం కలిపడానికి ప్రయత్నించారు మీరు చేసిన ఆరోపణలకు బలం చేకూర్చే అన్ని ఆధారాలను జనవరి 29వ తేదీ రాత్రి 8 గంటలలోపు మాకు సమరి్పంచండి. విషం కలుపుతుంటే అడ్డుకున్న ఢిల్లీ జల్ బోర్డ్ ఇంజనీర్ల వివరాలూ ఇవ్వండి’’ అని కేజ్రీవాల్‌కు ఈసీ మంగళవారం ఒక లేఖ రాసింది. హరియాణా నుంచి దిల్లీకి ప్రవహిస్తున్న యమునా నదీ ప్రవాహంలో అమ్మోనియా స్థాయి చాలా ఎక్కువగా ఉన్నట్లు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ఆరోపించడం తెల్సిందే. పొరుగు రాష్ట్రాలకు తాకిన కాలుష్య కాటుయమునా కాలుష్య అంశం ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారింది. కాలుష్యానికి హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన కారణమని, పారిశ్రామిక వ్యర్ధాలను యమునా కలిపి ఢిల్లీలోకి విషాన్ని పంపుతున్నారంటూ కేజ్రీవాల్ రెండ్రోజుల కిందట తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదో రకంగా జీవజల యుద్ధం, వాటర్ టెర్రరిజం అంటూ హరియాణా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీ సీఎం ఆతిశీ సైతం హరియాణా నుంచి ఢిల్లీకి ప్రవహిస్తున్న నదీ జలాల్లో వ్యర్థాలు, అమ్మోనియా స్థాయిలో చాలా ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. దీనిపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి ఆమె బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసి ఫిర్యాదుచేశారు. హరియాణా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఢిల్లీ ప్రజలకు నీటి సరఫరా ప్రమాదంలో పడిందని ఆరోపించారు. మునాక్ కాలువ నుంచి అదనపు జలాలను విడుదలచేయాలని మాన్ డిమాండ్‌చేశారు. దీనిపై హరియాణా సీఎం నయాబ్ సింగ్ షైనీ సైతం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ఎగువ రాష్ట్రాలతో సత్సంబంధాలు క్షీణించేలా, ఢిల్లీ ప్రజలను అనవసరంగా భయపెట్టేలా కేజ్రీవాల్ ఆరోపణ చేశారు. వీటిపై లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవాలి’’అని ఆయన డిమాండ్‌చేశారు. ఓటమి భయం కేజ్రీవాల్‌ను నిస్సహాయంగా మార్చిందని, ఢిల్లీ ప్రజలను భయపెట్టి ఓట్ల లబ్ధి పొందేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. బీజేపీ, ఆప్ పారీ్టలు తాము అధికారంలోకి వస్తే యమునా కాలుష్యాన్ని అరికట్టి పునరుజ్జీవం చేస్తామని తమతమ మేనిఫెస్టోల్లో ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు ఎన్నికల హామీల్లో ప్రధానమైనదిగా మారుతోంది. -
యమునా నీళ్లు.. ఢిల్లీ-హర్యానా మధ్య మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల వేళ యమునా నదిపై ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ ప్రజలు తాగునీటికి ఉపయోగించే యమునా నదీ జలాల్లో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతోందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఈ అంశం పెను దుమారానికి దారి తీసింది. యమునా నదీ జలాల్లో విషం కలుపుతున్నారని కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై హర్యానా ప్రభుత్వం స్పందించింది. ఈ వ్యాఖ్యలకుగాను కేజ్రీవాల్‌పై పరువునష్టం కేసు పెడతామని హెచ్చరించింది. అయితే.. హర్యానా ప్రభుత్వం కేసు పెడతామని వార్నింగ్ ఇవ్వడంపై కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను కేసులతో భయపెట్టలేరు. నా మీద కేసు పెట్టండి. నన్ను చంపండి. ఉరి తీయండి.ఢిల్లీ ప్రజలు తాగే నీళ్లను మాత్రం విషపూరితం చేయకండి. ఢిల్లీ ప్రజలను చంపకండి’అని కేజ్రీవాల్ బీజేపీని కోరారు. ఢిల్లీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీని శపిస్తారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.కాగా,ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.‘యమునా నదిలో ఏదో కలుస్తోందని వాటర్‌బోర్డు అనుమానం వ్యక్తం చేసింది. పక్కనున్న హర్యానా ప్రభుత్వం ఢిల్లీ ప్రజలు తాగే నీటిలో విషం కలిపింది. దీంతో కొందరు ఢిల్లీ వాసులు మరణిస్తే అది నాపై నెట్టవచ్చనుకుంటున్నారు’అని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే విషయంపై ఢిల్లీ సీఎం అతిషి కూడా స్పందించారు. యమునా నది జలాల్లో అమ్మోనియా స్థాయి అధికంగా ఉందని, వాటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చడం అసాధ్యమన్నారు. ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారామె. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవనున్నాయి. -
Delhi Election: కేజ్రీవాల్ ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ తరపున ‘మధ్యతరగతి మ్యానిఫెస్టో’ ప్రకటించారు. ఈ మ్యానిఫెస్టోలో ఆయన ఢిల్లీలోని మధ్యతరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి ఏడు ప్రధాన డిమాండ్లు చేశారు.ఇప్పటివరకు వివిధ ప్రభుత్వాలు మధ్యతరగతిని విస్మరించాయని, వారిని ప్రభుత్వానికి ఉపయోగపడే ఒక ఏటీఎంగానే పరిగణించాయని కేజ్రీవాల్ విమర్శించారు. పలు రాజకీయ పార్టీలు మధ్యతరగతిని పన్ను చెల్లింపుదారులుగా మాత్రమే చూస్తున్నాయని, వారి సమస్యలను విస్మరించాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు మెరుగైన జీవితంతో పాటు సౌకర్యాలు పొందగలిగేలా వారి సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆప్ తరపున ఆయన ఈ మ్యానిఫెస్టోను రూపొందించారు. VIDEO | AAP National Convenor Arvind Kejriwal (@ArvindKejriwal) criticises the Centre's tax policies, calling it 'tax terrorism.'"People have to pay taxes while they are alive, but now the government has created a situation where they have to pay even after death. Amid this tax… pic.twitter.com/6LreZj30co— Press Trust of India (@PTI_News) January 22, 2025ఆప్ ఏడు ప్రధాన డిమాండ్లు1. పన్ను రహిత ఆరోగ్య బీమా: ఢిల్లీ పౌరులకు ఉచితంగా సమగ్ర ఆరోగ్య బీమాను అందించాలని, తద్వారా వైద్య చికిత్స కోసం ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని ఆప్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.2. సీనియర్ సిటిజన్లకు ఉచిత చికిత్స: సీనియర్ సిటిజన్లకు పూర్తిగా ఉచిత ఆరోగ్య సంరక్షణ సేవలు అందించాలని పార్టీ కేంద్రాన్ని డిమాండ్ చేసింది.3. విద్యా హక్కులో మెరుగుదల: ఢిల్లీలో విద్యా స్థాయిని మరింత మెరుగుపరచడానికి సహాయం అందించాలని ఆప్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.4. ఉపాధి -ఉద్యోగ భద్రత: ఢిల్లీలో యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రతను పెంచాలని పార్టీ డిమాండ్ చేసింది.5. శరళమైన పన్ను విధానం: మధ్యతరగతి వారికి అదనపు పన్ను భారం నుండి ఉపశమనం కలిగించేలా పన్ను విధానాన్ని మరింత శరళంగా మార్చాలని పార్టీ డిమాండ్ చేసింది.6. ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల: ఢిల్లీలో నీరు, విద్యుత్, రోడ్లు, పారిశుధ్యం వంటి ప్రాథమిక సౌకర్యాలను మెరుగుపరచడానికి కేంద్రం నుండి సహాయం కోరింది.7. గృహనిర్మాణ పథకాలలో సహాయం: ఢిల్లీలోని పేదలు, మధ్యతరగతి వారికి అందుబాటు ధరలలో గృహనిర్మాణ పథకాలను అందించాలని ఆప్ విజ్ఞప్తి చేసింది.అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ ‘మా పార్టీ ఢిల్లీ ప్రజలకు అండగా నిలిచింది. అయితే మధ్యతరగతి వారికి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఉపశమనం లభించలేదు. దీనిని మార్చడానికి, ఢిల్లీలోని అన్ని తరగతుల గొంతును ప్రభుత్వానికి వినిపించడానికి కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: వీళ్లంతా ఐఐటీ బాబాలు.. మంచి ఉద్యోగాలు వదిలి.. -
Delhi Elections: ఆప్-బీజేపీ మధ్య చైనీస్ సీసీటీవీల జంగ్
న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరి 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూఢిల్లీ స్థానం నుండి పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటమి భయంతో అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వ వనరులను ఉపయోగించుకుంటున్నారని, మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. అలాగే పంజాబ్‌లోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీకి పిలిపించారని, వారు ఆప్ కార్యకర్తలుగా మారి, వాతావరణాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. తాజాగా అమృత్సర్ నుండి వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేశారన్నారు.ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీలో చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే కాకుండా భద్రతా దృక్కోణం నుండి చూస్తే కూడా ముప్పు వాటిల్లుతుందన్నారు. పంజాబ్ నుండి పెద్ద సంఖ్యలో వస్తున్న వాహనాలు ఢిల్లీలో తిరుగుతున్నాయని, వాటిలోని వస్తువులను తనిఖీ చేయడం లేదని ప్రవేశ్ వర్మ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వ ట్రక్కులలో కుర్చీలతోపాటు ఇతర వస్తువులు ఢిల్లీకి వస్తున్నాయన్నారు.అరవింద్ కేజ్రీవాల్ తన ఎమ్మెల్యేల నిధిగా ఉన్న రూ.30 కోట్లలో కేవలం రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. న్యూఢిల్లీలో ఎలాంటి కాంక్రీట్ పనులు చేయలేదని, పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. ఢిల్లీలో అభివృద్ధి పనులు చేయడానికి బదులు.. పంజాబ్ మాఫియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సహాయంతో ఎన్నికల్లో గెలవాలని కేజ్రీవాల్ కలలు కంటున్నారని ప్రవేశ్‌వర్మ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో పంజాబ్ ప్రభుత్వ సాయాన్ని వెంటనే నియంత్రించాలని తాను ఎన్నికల సంఘాన్ని కోరుతున్నానని అన్నారు. ఢిల్లీ ప్రజలకు నిజానిజాలన్నీ తెలుసని, రాబోయే ఎన్నికల్లో కేజ్రీవాల్ ఓటమి ఖాయమని ప్రవేశ్‌వర్మ జోస్యం చెప్పారు. -
Delhi Election 2025: ప్రచారంలో మూమూస్ రుచిచూసిన కేజ్రీవాల్
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ సమయం దగ్గర పడుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఢిల్లీలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.తాజాగా కేజ్రీవాల్ ప్రచారంలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న ఒక దుకాణంలో కేజ్రీవాల్ మూమూస్ రుచి చూశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆమ్ ఆద్మీ పార్టీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ఈ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ నేతలతో పాటు ఒక దుకాణం దగ్గర మోమోస్ తింటూ కనిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ‘ఢిల్లీ వాసులకు, మోమోలకు మధ్య అనుబంధం విడదీయరానిది. ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్న కేజ్రీవాల్‌ను స్వాగతిస్తూ ఒక మోమోస్ విక్రేత అతనికి మోమోస్ అందించారు’ అని రాసింది. दिल्लीवालों और मोमो का रिश्ता थोड़ा गहरा है 🥟♥️नई दिल्ली विधानसभा में चुनाव प्रचार के दौरान एक मोमो वाले भाई ने दिल्ली के बेटे @ArvindKejriwal जी को रोककर खिलाये मोमो‼️ pic.twitter.com/ydnOddSK5y— AAP (@AamAadmiParty) January 19, 2025ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన.. బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ లపై పోటీకి దిగారు. 2013 నుండి న్యూఢిల్లీ స్థానం నుండి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముక్కోణపు పోరుగా మారాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్ కూడా తన సత్తాను చాటేందుకు ఎన్నికల రంగంలోకి దిగింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 5 ఓటింగ్ జరగనుండగా, ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8న వెల్లడికానున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే -
Delhi Election 2025: కేజ్రీవాల్, ఆతిశీ సహా ‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్లు వీరే
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం సాగించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, సీఎం ఆతిశీ, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సహా 40 మంది ఆప్ నేతల పేర్లు ఉన్నాయి.ఈసారి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం కోసం పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌లతో పాటు మంత్రులు సౌరభ్ భరద్వాజ్, గోపాల్ రాయ్, ఢిల్లీ, పంజాబ్ మంత్రులను స్టార్ క్యాంపెయినర్లుగా పనిచేయనున్నారు. అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ ప్రచారకర్తల జాబితాలో మనీష్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్, హర్భజన్ సింగ్, మీట్ హయర్, దిలీప్ పాండే, రాంనివాస్ గోయల్, గులాబ్ సింగ్, రితురాజ్ గోవింద్ ఉన్నారు.మరోవైపు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది, ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, అజయ్ మాకెన్, ఖాజీ నిజాముద్దీన్, దేవేంద్ర యాదవ్, అశోక్ గెహ్లాట్, హరీష్ రావత్, ముకుల్ వాస్నిక్, కుమారి సెల్జా, రణదీప్ సింగ్ సుర్జేవాలా, సచిన్ పైలట్, సుఖ్వీందర్ సింగ్ సుఖుతో సహా మొత్తం నలభై మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. Aam Aadmi Party announces the list of 40-star campaigners for the #DelhiAssemblyElection2025 AAP National Convenor Arvind Kejriwal, his wife Sunita Kejriwal, Delhi CM Atishi, Manish Sisodia, Sanjay Singh, Punjab CM Bhagwant Mann's names are included in the list of star… pic.twitter.com/glRzUwuT6N— ANI (@ANI) January 19, 2025ఇదేవిధంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తన స్టార్ ప్రచారకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పియూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్, ఖట్టర్, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, గిరిరాజ్ సింగ్ సహా 40 మంది నేతల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. బీజేపీ జాబితాలో నలుగురు సినీ ప్రముఖులు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా కనిపించనున్నారు. ఢిల్లీలో ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్ అధికారిగా.. -
బీజేపీ మేనిఫెస్టోపై స్పందించిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ:బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ తమ నుంచి కాపీ కొట్టినవేనని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి బీజేపీకి విజన్ లేదని అర్థమవుతోందన్నారు. ఇక ప్రజలు ఇలాంటి విజన్ లేని పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.‘గతంలో పీఎం మోదీ ఉచితాలు మంచివి కావన్నారు. ఇప్పుడేమో బీజేపీ మా ఉచిత పథకాలన్నీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెడుతోంది. ప్రధాని ఇప్పటికైనా ఉచితాలు మంచివేనని,కేజ్రీవాల్ పథకాలు సరైనవేనని ఒప్పుకోవాలి. ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు.కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలి’అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.కాగా, బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఢిల్లీ ప్రజలకు కీలక హామీలిచ్చింది. మహిళా సమ్మాన్ యోజన పేరిట మహిళలకు నెలనెలా రూ.2500 నగదు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ మహిళలకు రూ.21వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ తమ పథకాలేనని కేజ్రీవాల్ అంటుండడం గమనార్హం.ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, ఆమ్ఆద్మీపార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపబోదనే అంచనాలున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో బీజేపీ ఉంది. ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే.. -
కేజ్రీవాల్‌కు మరింత టెన్షన్.. ఈడీ విచారణకు కేంద్రం అనుమతి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో హ్యాట్రిక్ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాబోయే ఎన్నికలకు కసరత్తు చేస్తున్నారు. అయితే ఇంతలోనే కేజ్రీవాల్‌ను మరో కష్టం చుట్టుముట్టింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి అనుమతి ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ పై కేసు నమోదు చేయడానికి హోం మంత్రిత్వ శాఖ ఈ అనుమతిని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీకి అనుమతినిచ్చింది. ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు అరవింద్ కేజ్రీవాల్‌పై అభియోగాల నమోదుపై స్టే విధించింది. ఇందుకోసం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ కింద ప్రాసిక్యూట్ చేయడానికి అవసరమైన అనుమతి లేకుండానే ట్రయల్ కోర్టు ఛార్జ్ షీట్‌ను పరిగణనలోకి తీసుకుందని కేజ్రీవాల్ వాదించారు. సీబీఐ తర్వాత ఇప్పుడు ఈడీకి ఇందుకు అనుమతి లభించింది. ఢిల్లీ మద్యం కేసులో అవినీతి నిరోధక చట్టం కింద అరవింద్ కేజ్రీవాల్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సీబీఐ గత ఏడాది ఆగస్టులో అవసరమైన ఆమోదం పొందింది. అయితే ఈడీ ఇందుకు ఇంకా ఆమోదం పొందలేదు. అయితే ఇప్పుడు హోం మంత్రిత్వ శాఖ స్వయంగా కేజ్రీవాల్‌పై చర్యలు తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్లో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ 'సౌత్ గ్రూప్' నుండి లంచం తీసుకున్నదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ బృందం దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు, పంపిణీని పర్యవేక్షించింది. 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ఆప్ ప్రభుత్వం రూపొందించిన ఎక్సైజ్ విధానం నుంచి ఈ బృందం లబ్ది పొందిందనే ఆరోపణలున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
ఓట్ల కోసం బంగారం పంచుతున్నారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ:ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.ఎన్నికల ప్రధానంగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు విమర్శల దాడి పెంచారు. తాజాగా ఆప్ (AAP)అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బంగారు గొలుసులు పంచుతున్నారని ఆరోపించారు.‘ఈ ఎన్నికల్లో బీజేపీ అక్రమాలకు పాల్పడుతోంది.ఓటర్లను ఆకట్టుకునేందుకు జాకెట్లు,షూస్,చీరలు, డబ్బులు పంచుతున్నారు. కొన్ని కాలనీల్లో అయితే బంగారు గొలుసులు కూడా ఇస్తున్నట్లు సమాచారం.నేను ఓటర్లను కోరేది ఒకటే..ఓట్లను అమ్ముకోకండి. బంగారం,డబ్బులు ఎవరిచ్చినా సరే,అది ఆప్ అభ్యర్థులైనా సరే వారికి ఓటు వేయకండి’ అని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేజజ్రీవాల్ చేసిన ఈ వ్యాఖ్యలకు బీజేపీ(Bjp) ఎంపీ మనోజ్ తివారీ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘కేజ్రీవాల్ మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తోంది. కేజ్రీవాల్ ఎప్పుడో మద్యం ట్రేడర్లకు సోల్డ్ఔట్ అయ్యారు’ అని మండిపడ్డారు.