Koneru konappa
-
కాంగ్రెస్‌లో చేరిన కోనప్ప
కాగజ్‌నగర్ రూరల్: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్ పట్టణంలోని విన య్ గార్డెన్లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్చార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్‌నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీనా సుల్తానా, వైస్‌చైర్మన్ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎవరు ఎటువైపు.. ‘గులాబీ’ గూటికి పగుళ్లు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: లోక్‌సభ ఎన్నికల ముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తు ఖరారు కావడంతో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప, ఆయన సోదరుడు జెడ్పీ చైర్పర్సన్ కోనేరు కృష్ణారావుతోపాటు అనుచర వర్గం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం కలి శారు. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఈ నియోజకవర్గంలో మరింత దెబ్బ తగలనుంది. తాజా పరిణామాలతో ఉమ్మడి జిల్లాలో మరి కొందరు నాయకులు కండువాలు మార్చుతారనే ప్రచారం జోరందుకుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పావులు కదుపుతుండడంతో ఎవరు ఎటువైపు వెళ్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. అటు ఆదిలాబాద్ ఇటు పెద్దపల్లి పార్లమెంటు స్థానాల్లో నాయకుల తీరు రాజకీయ మార్పులకు దారి తీస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యేల పక్క చూపులు.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచా రం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో నేతల్లో నైరాశ్యం నెలకొంది. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్‌లోకి వెళ్లడమా..? బీజేపీలో చేరడమా..? అనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. ప్రస్తుతం ‘గులా బీ’ పార్టీకి గడ్డు కాలమే ఉండడంతో కార్యకర్తలు, నాయకుల నుంచి ఒత్తిడి కారణంగా మార్పు తథ్యంగా భావిస్తున్నారు. ఇందుకు లోక్‌సభ ఎన్ని కలు మంచి తరుణంగా భావిస్తూ ఎవరికి ఏ పార్టీ తో మేలు ఉంటుందో లెక్కలు వేసుకుంటున్నా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తమకు ప్రాధాన్యత ఇస్తేనే చేరుతామనే మెలిక పెట్టినట్లుగా చెబుతున్నారు. అయితే ఎవరికీ స్పష్టమైన హామీ రానట్లు తెలిసింది. వీరితోపాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానాలు అందడంతో పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకోవడంపై ఆలోచిస్తున్నారు. ఓ మాజీ ఎమ్మెల్సీతోపాటు సీనియర్ నాయకులు సైతం పార్టీ మార్పుపై గత కొంతకాలంగా సమాలోచనలు చేస్తున్నారు. ఇవి చదవండి: పదేళ్లూ బీజేపీ సర్కార్ చేసిందేంటి? -
బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటితో భేటీ
-
TS: బీఆర్ఎస్కు కోనప్ప గుడ్‌బై..! మంత్రి పొంగులేటితో కీలక భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బుధవారం ఉదయం తెలంగాణ సెక్రటేరియట్లో రాష్ట్ర రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చాంబర్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడున్న మీడియా ప్రతినిధులతో ఆయన ముచ్చటించారు. కార్యకర్తలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్మీట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే కోనప్ప సచివాలయానికి వచ్చి సీఎం రేవంత్ మంత్రి వర్గంలో కీలక మంత్రిగా పేరున్న పొంగులేటితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సిర్పూర్ నుంచి కోనప్పపై పోటీ చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అని భావించిన కోనప్ప పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మధ్య ఉంటుందని అందరూ భావించినప్పటికీ సిర్పూర్ నుంచి అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. ఇదీ చదవండి.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా -
కోనప్ప Vs ఆర్ఎస్ ప్రవీణ్ గా మారిన సిర్పూర్ రాజకీయం
సాక్షి, ఆసిఫాబాద్: జిల్లాలో శాసనసభ ఎన్నికలు సెగ పుట్టిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సిర్పూర్ బరిలో నిలిచిన బీఆర్ఎస్, బీఎస్పీ అభ్యర్థులు ‘నువ్వా– నేనా’ అన్నట్లు సిగపట్లకు దిగుతుండటంతో నియోజకవర్గంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రచారంలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు బాహాబాహీకి దిగుతుండటం ఘర్షణకు దారితీస్తోంది. అభ్యర్థులు ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్లడంతో ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనని రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు.. ప్రత్యారోపణలు రాష్ట్రంలోనే వరుస పరంగా నంబర్– 1 నియోజకవర్గమైన సిర్పూర్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప నాలుగోసారి బరిలో ఉన్నారు. రావి శ్రీనివాస్, పాల్వాయి హరీశ్‌బాబు, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ క్షేత్రస్థాయిలో ప్రచారం ముమ్మరం చేశారు. కాగా.. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున ఎన్నికల్లో నిలబడి గెలిచి.. బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు అదే బీఎస్పీ తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్(ఆర్ఎస్పీ) కోనప్పకు పోటీగా నిలబడ్డారు. కోనప్పను కచ్చితంగా ఓడించి తీరుతానని ఆర్ఎస్పీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చాపకింద నీరులా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఎస్పీ దూసుకెళ్లేలా ప్రణాళికలు రచించారు. గ్రామం, మండలం, పట్టణం.. ఇలా ఇంటింటా తిరుగుతూ అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక దశలో ‘కోనేరు కోనప్ప.. కలప దొంగ’ అంటూ మీడియా ముందు తీవ్ర ఆరోపణలు చేయడం.. అందుకు కౌంటర్‌గా కోనప్ప ‘మర్డర్లు చేసిన ఘనత మాకే ఉంది. ఎన్కౌంటర్లు కూడా మేమే చేపించాం. పరిటాల రవిని మేమే చంపించాం. బెల్లంపల్లి, కరీంనగర్లో హత్యలు మేమే చేపించాం. ప్రవీణ్‌కుమార్ ఒక పొలిటికల్ టూరిస్ట్’ అంటూ ఆర్ఎస్పీపై ప్రత్యారోపణలు చేశారు. అప్పటి నుంచి ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ శ్రేణుల్లో ఘర్షణ వాతావరణం.. నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీలకు చెందిన అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వర్గాలుగా విడిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రేణుల ప్రచారం తారస్థాయికి చేరడమే కాకుండా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నెల 11న కాగజ్‌నగర్ పట్టణంలోని బస్టాండ్ ఏరియాలో బీఎస్పీ కార్యకర్త షేక్ ఆసిఫ్‌ను బీఆర్ఎస్ నాయకుడు కోనేరు ఫణితోపాటు పలువురు ఆకారణంగా దాడిచేయడమే కాకుండా చంపుతామని బెదిరించినట్లు ఆరోపిస్తూ బాధితుడు ఆసిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పోలీసులు ఫణితోపాటు పలువురిపై కేసు సైతం నమోదు చేశారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్తులకు అభ్యర్థులు గాలం వేస్తుండటం.. భారీ ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చి తమవైపు తిప్పుకోవడం పరిపాటిగా మారింది. పార్టీ ఫిరాయింపులు గెలుపోటములపై ప్రభావం చూపుతుండటంతో అభ్యర్థులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఫలితంగా ప్రచారంలో ప్రత్యర్థులపై దాడులకు దిగడానికి సైతం వెనుకాడకపోవడంతో నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆదివారం రాత్రి కాగజ్‌నగర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయబస్తీలో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ ప్రచార రథం డైవర్‌పై దాడి చేశారంటూ ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తమ ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా అన్యాయంగా కేసు పెట్టారని నిరసన తెలుపుతూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్పీ కాగజ్‌నగర్ పోలీసు స్టేషన్లో బైఠాయించారు. పోలీసులు చివరకు ఇరువర్గాల అభ్యర్థులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు సద్దుమణిగాయి. అయితే ఇలాంటివి పునరావృతమైతే మాత్రం నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం పోలీసులకు సవాలుగా మారనుంది. -
ఎవ్వరు అడ్డొచ్చినా.. మూడో సారి నేనే గెలుస్తా! : కోనేరు కోనప్ప
సాక్షి, ఆదిలాబాద్: అడవులు, కొండలతో నిండిన ఆ నియోజకవర్గానికి పదేళ్ళుగా కోనేరు కోనప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదేళ్ళుగా కోనప్ప చేసిందేమీ లేదని అక్కడి ప్రజలు నిట్టూరుస్తున్నారు. రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, ఉపాధి విషయాల్లో ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. కాని ఆ ఎమ్మెల్యే మాత్రం మూడో సారి నేనే గెలుస్తా అంటున్నారు. అయితే కోనప్పకు గట్టి ప్రత్యర్థి తగిలారు. అధికార పార్టీని ఓడిస్తానంటున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఎక్కడుంది? అక్కడి రాజకీయాలు ఎలా ఉన్నాయి? తెలంగాణ అసెంబ్లీలో ఆ నియోజకవర్గం క్రమ సంఖ్య ఒకటి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సిర్పూర్ టి. నియోజకవర్గంలో నిజాం కాలం నాడే కాగిత పరిశ్రమ స్థాపించారు. గతంలో మూత పడిన ఆ పరిశ్రమను బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తిరిగి తెరిపించారు. ఈ నియోజకవర్గం చుట్టూ పెన్‌గంగ, ప్రాణహిత, పెద్దవాగు వంటి జీవనదులు ప్రవహిస్తున్నాయి. సిర్పూర్ నుండి 2014 నుంచి కోనేరు కోనప్ప అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొదట బహుజన్ సమాజ్ పార్టీ తరపున గెలిచిన కోనప్ప..మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గులాబీ గూటికి చేరారు. గత ఎన్నికల్లో కూడా కారు గుర్తు మీద విజయం సాధించారు. మూడోసారి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ దక్కించుకుని బరిలోకి దిగారు. మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అంటున్నారు కోనేరు కోనప్ప. దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా.. కోనప్ప ఎమ్మెల్యే అయ్యాకే మూతపడ్డ కాగజ్‌నగర్ పేపర్ మిల్లును తిరిగి తెరిపించారు. దీనవల్ల వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. కాగజ్‌నగర్ లోని సర్కారు అసుపత్రిని అభివ్రుద్ది చేశారు. వార్థా నది పై బ్యారేజి నిర్మించడానికి నిధులు వచ్చేలా కృషి చేశారు. మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య గూడెం వంతెన నిర్మించడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మెరుగుపడ్డాయి. అయితే దశాబ్ద కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నా కోనప్ప చేసిన అభివృద్ధి ఏమీలేదనే అపవాదు ఉంది. పేపర్ పరిశ్రమను తిరిగి ప్రారంభించినా దానివల్ల స్థానికులకు ఏమీ ఉపాధి కలగలేదని, ఇతర రాష్ట్రాల వాళ్ళకే అందులో ఉద్యోగాలు లభించాయని సిర్పూర్ లోని నిరుద్యోగులు విమర్శిస్తున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ప్రజలకు తాగునీరు తీవ్ర సమస్యగా మారింది. మారుమూల ప్రాంతాల ప్రజలు అసుపత్రికి వెళ్లాలంటే రోడ్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివాసీ మహిళలు, తల్లులు పుట్టెడు అవస్థలు పడుతున్నారు. ఇంతకాలంగా ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నప్పటికీ కోనప్ప నియోజకవర్గానికి ఆయన చేసిన మేలు ఏమీ లేదని మండిపడుతున్నారు అక్కడి ప్రజలు. ఎమ్మెల్యే పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. రైతులకు సాగునీటి కోసం వార్థా బ్యారేజ్ నిర్మిస్తామనే హామీ మాటలకే పరిమితమైంది. నియోజకవర్గం చుట్టూ నీరున్నా పంటపొలాలకు సాగునీరు అందే పరిస్థితి లేదు. ఈ సమస్యలన్నీ ప్రతికూలంగా మారతాయని అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆందోళన చెందుతున్నారు. సిర్పూర్లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ.. ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత.. మరోవైపు కోనప్పపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో.. వీటన్నిటినీ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిర్పూర్ జనరల్ కేటగిరీ సీటు. ప్రవీణ్‌కుమార్ ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీఎస్పీకి వచ్చిన ఓట్లు, పార్టీ పట్ల ఉన్న ఆదరణ దృష్ట్యా సిర్పూర్‌లోనే తలపడాలని ప్రవీణ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. గురుకుల విద్యాసంస్థల కార్యదర్శిగా మంచిపేరు తెచ్చుకున్న ప్రవీణ్‌కుమార్ పట్ల ఎస్సీ వర్గాల్లో ఆదరణ బాగా వ్యక్తమవుతోంది. ఎస్టీలు, బౌద్ధ మతాన్ని ఆచరించేవారు కూడా బీఎస్పీ పట్ల మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనమీద స్థానికేతరుడనే ముద్ర వేయడాన్ని ప్రవీణ్‌కుమార్ ఖండించారు. నియోజకవర్గంలోనే ఇల్లు కొనుక్కుని స్థానికంగానే ఉంటున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ తన సంస్థ స్వేరో కార్యకర్తలను మోహరిస్తున్నారు. సిర్పూర్లో కోనప్ప పాలనను అంతం చేస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్. ఎన్నికల బరిలో పాల్వాయి హరీష్ బాబు.. అధికార పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ తో పాటు బిజెపి అభ్యర్థిగా పాల్వాయి హరీష్ బాబు ఎన్నికల బరిలో దిగుతున్నారు. హరీష్ బాబు తల్లితండ్రులిద్దరూ సిర్పూర్ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. మొత్తంగా పాల్వాయి కుటుంబానికి ఇక్కడి ప్రజల్లో మంచి పేరుంది. ఒకప్పుడు వీరిది కాంగ్రెస్ కుటుంబమే అయినా.. గత ఎన్నికల్లో హరీష్‌బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. కాని మంచి ఓట్లే సాధించారు. ఈసారి బీజేపీ తరపున తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా హిందూ ఓట్ బ్యాంక్ తనకు మద్దతుగా ఉంటుందని, పైగా సర్కార్ మీద, స్థానిక ఎమ్మెల్యే మీద వ్యతిరేకత తనకు అనుకూలమైతే గెలుపు ఖాయమని హరీష్ భావిస్తున్నారు. మొత్తం మీద మూడు పార్టీల అభ్యర్థులు గెలుపు మీద ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
కారు పార్టీ ఎమ్మెల్యేలను ఆ బ్రిడ్జీలు ముంచేస్తాయా? విపక్షాలకు సంబరమెందుకు!
నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. మూడోసారి కోనప్ప ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు. కాగజ్‌నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు. (చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!) రేఖ నాయక్‌కు షాకిచ్చేందుకు సిద్ధం? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం.. కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. (చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు) కష్టాలకు బదులివ్వడం ఖాయమా.. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
ఈసారి బీజేపీ నుంచి పోటీ తప్పదా?
కుమ్రం భీమ్ జిల్లా కేంద్రమైన సిర్పూర్ పట్టణం రాత మారుస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నియోజకవర్గం రాత మార్చలేకపోయిన ఎమ్మెల్యే తన మాటనే మార్చుకున్నారు. సీనియర్ నాయకుడు కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి తర్వాత టీఆర్ఎస్లో చేరారు. గత ఎన్నికల్లో కారు పార్టీ గుర్తు మీదే విజయం సాధించారు. అంబలి, అన్నదానం, నిరుపేద విద్యార్థులకు విద్యాదానంతో కోనప్ప రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాని నియోజకవర్గాన్ని చెప్పినంత స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంతోకాలంగా మూతపడ్డ నిజామ్ నాటి పేపర్ మిల్లును పట్టుబట్టి ప్రైవేటు యాజమాన్యం ద్వారా ప్రారంభింపచేశారు. దీనికి కేసీఆర్ సర్కార్ రాయితీలు కూడా ఇచ్చింది. పేపర్ పరిశ్రమ మూతపడేనాటికి ఉన్న ఉద్యోగులందరికీ మళ్లీ ఉద్యోగాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు. కాని పరిశ్రమ ప్రారంభం తర్వాత పాతవారికి పర్మినెంట్ ఉద్యోగాలు దక్కలేదు. మొత్తం ఉద్యోగాలన్ని ఉత్తరాది వారితో నింపేశారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. స్థానిక రెగ్యూలర్ ఉద్యోగులకే ఉద్యోగాలు ఇవ్వకపోయినా..ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని చెబుతున్నారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారిందంటున్నారు. పేపర్ మిల్లు పునరుద్దరించింది.. ఎవరి కోసం అంటూ నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే కోనప్పపై మండిపడుతున్నారు. నియోజకవర్గం లో సాగునీటి ప్రాజెక్టుల పనులు సాగడం లేదు. జగన్నాథ్ పూర్ ప్రాజెక్టు, కుమ్రం బీమ్ ప్రాజెక్టు కాల్వలు పూర్తికాలేదు. పీపీరావు ప్రాజెక్టు పనులు ఏళ్ళతరబడి సాగుతున్నాయి. ప్రాణహిత-చేవేళ్ల పై సర్కారు చేతులు ఎత్తేసింది. వార్థా బ్యారేజీ చేపడుతామని ప్రకటించినా అది కాగితాలకే పరిమితమైంది. పోడు భూముల సమస్య తీర్చితామని అనేకసార్లు హమీ ఇచ్చారు కోనప్ప. అయితే హక్కు పత్రాలు పంపిణీ చేయడంలో సర్కారు కాలయాపన చేస్తోంది. దీంతో పోడు రైతులు సర్కార్ పై ఉద్యమిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా..సేవా కార్యక్రమాలతో ఎన్నికలలో గట్టేక్కిస్తామని భావిస్తున్నారు కారు పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఇదిలాఉంటే..బీజేపీ నాయకుడు పాల్వాయి హరీష్ బాబు పోడు భూములపై పోరాటం సాగిస్తూ..ప్రజల్లో బలపడుతుండటం కోనప్పకు ఆందోళన కలిగిస్తోందట. గత ఎన్నికలలో ఓడినా సానుభూతి తోడువుతుందని..అదేవిధంగా హిందూత్వ ఓటు బ్యాంకు తోడైతే కోనప్పను ఓడించడం ఖాయమని భావిస్తున్నారట బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబు. మరోవైపు రావి శ్రీనివాస్ బిజెపి నుండి కాంగ్రెస్ లో చేరారు. ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని తెలుస్తోంది. తెలంగాణలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అసిఫాబాద్. ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అదివాసీల ప్రాబల్యం అత్యధికంగా ఉంటుంది. అసిఫాబాద్ నుంచి గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అత్రం సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామలతో అత్రం సక్కు కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి కారు పార్టీలో చేరిపోయారు. ఈసారి గులాబీ పార్టీ నుండి పోటీచేయడానికి సిద్దమవుతున్నారు. -
ఒకేరోజు ఒక్కటైన 111 జంటలు
పెంచికల్పేట్(ఆదిలాబాద్): మూడు ముళ్లు.. ఏడడుగులతో అగ్ని సాక్షిగా 111 జంటలు ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలంలో ఆదివారం ఏకమయ్యాయి. నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు కోనేరు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప–రమాదేవి దంపతులు సామూహిక వివాహాలు జరిపించారు. జయమంగళ నది (పెద్దవాగు) తీరాన శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకకు కోనేరు కోనప్ప దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. వధూవరులకు తాళి బొట్టు, మెట్టెలు, పట్టు వస్త్రాలు, వంట సామగ్రి అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ సురేశ్‌కుమార్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
ఎమ్మెల్యే అనుచరుడి బెదిరింపు కాల్.. మీటింగ్‌కు వెళ్లొద్దంటూ..
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనప్ప అనుచరుడు నరేందర్‌గౌడ్‌కు సంబంధించిన ఫోన్‌కాల్ ఆడియో హాట్‌టాపిక్‌గా మారింది. ఆదిలాబాద్‌లో జరిగే బీఎస్పీ మీటింగ్‌కు ఎవరు వెళ్లొద్దని స్థానిక వ్యాపారి శ్రీకాంత్‌కు ఆయన హెచ్చరికలు జారీ చేశాడు. తన ఆదేశాలు దిక్కరించి మీటింగ్ వెళ్లితే తోక్కుడే ఉంటుందని బెదిరిస్తూ ఫోన్లో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ ఫోన్‌కాల్ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసిన పోలీసులు..! ఇప్పటివరకు తమ పార్టీలో ఉన్న అర్షద్ రాజీనామా చేసి బీఎస్పీలో చేరడానికి సిద్ధమయ్యాడని, అతనితో పాటు ఆ పార్టీలో చేరడానికి ఎవరు వెళ్లవద్దని నరేందర్ గౌడ్ బెదిరింపులకు దిగాడు. ఒకవేళ తమ ఆదేశాలు దిక్కరించి అర్షద్‌తో పాటు బీఎస్పీ సమావేశానికి వెళ్లితే పరేషాన్లో పడతారని హెచ్చరించారు. చదవండి: CM KCR Tour: అడుగడుగునా పలకరింపులు.. ఆలింగనాలు -
ఎమ్మెల్యే కోనప్ప అనుచరుల బెదిరింపులు!
-
కరోనా కోరల్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
-
ఎమ్మెల్యే కోనప్పను క్వారంటైన్లో ఉంచండి
సాక్షి, హైదరాబాద్ : కరోనా కోరల్లో చిక్కిన అమెరికాలో ఇటీవల పర్యటించి వచ్చిన సిర్పూర్ కాగజ్‌నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులను క్వారం టైన్లో ఉంచాలని ఉన్నతాధికారులు జిల్లా వైద్యా దికారిని ఆదేశించారు. అక్కడికి వెళ్లి వచ్చిన ఆయన క్వారంటైన్లో ఉండటం మంచిదని సూచించారు. ఆయన్ను క్వారంటైన్లో ఉంచాల్సిందిగా ఉన్నతాధికారులు స్థానిక డీఎంహెచ్‌వోను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆసిఫాబాద్ డీఎంహెచ్‌వో ఎమ్మెల్యే కోనప్పకు ప్రభుత్వం తరపున లేఖ కూడా పంపారు. 14 రోజులపాటు ఇంట్లోనే ఉండాలని, ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనద్దని, ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని కోరారు. లేఖ ప్రతుల్ని జిల్లా ఎస్పీకి కూడా పంపి, అవసరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. (భయపడొద్దు.. జాగ్రత్తలే మందు). మరోవైపు తెలంగాణలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఒక్క రోజే తెలంగాణలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు ఉదయం ఇద్దరిని కరోనా పాజిటివ్‌గా గుర్తించగా.. తాజాగా మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. దీంతోపాటు లండన్‌లో చదువుకుంటున్న 18 ఏళ్ల యువతికి కూడా శుక్రవారం కోవిడ్ పాజిటివ్ తేలింది. దీంతో తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరినట్లయింది. (ఇండోనేసియా బృందంలో అందరికీ పాజిటివ్) -
క్వారంటైన్లో ఉండలేం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విదేశాల నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను ప్రభుత్వం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినా అక్కడ ఉండేందుకు వారు నిరాకరిస్తున్నారు. వసతులు లేవని, భోజనం సరిగ్గా లేదని, ఒంటరిగా ఉండలేకపోతున్నామని సాకులు చూపుతూ ఇంటిబాట పడుతున్నారు. తమ ఇళ్లలో అనేక వసతులున్నాయని, ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటామని చెబుతూ వెళ్లిపోతున్నారు. అయితే వారిని ఒప్పించడంలో, వసతులు కల్పించడంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు విఫలం అవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. శుక్రవారం నాటికి ఏడు క్వారంటైన్ కేంద్రాల నుంచి ఏకంగా 1,019 మంది వెళ్లిపోయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే వారి నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకొని పంపిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ముందు జాగ్రత్తగా తరలించినా... చైనా, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ సహా నాలుగు గల్ఫ్ దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు కరోనా వైరస్ లక్షణాలు లేకపోయినా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించింది. ఇతర దేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉండాలని సూచించింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ కేంద్రాల్లో ఎవరికైనా వైరస్ లక్షణాలుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలకు తరలిస్తోంది. అయితే ఈ విషయంలో మొదట కఠినంగా వ్యవహరించిన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు... చివరకు వసతులు కల్పించలేకపోతున్నామన్న భావనతో చేతులెత్తేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వారిని క్వారంటైన్ సెంటర్ల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్, పాస్‌పోర్టులు తీసుకొని పంపిస్తున్నారు. ఆయా దేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులందరినీ 14 రోజులపాటు వికారాబాద్‌లోని హరిత రిసార్ట్, దూలపల్లి ఫారెస్టు అకాడమీ లాంటి ఏడు చోట్ల ఉంచారు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన వారిలో వీఐపీలు ఉండటం, సర్కారు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారందరినీ ఇళ్లకు పంపేశారు. అయితే ఇలా అత్యధిక వైరస్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్లో ఉంచకుండా పంపిస్తే ఎలాగన్న దానిపై విమర్శలు వస్తున్నాయి. -
విలన్ కోనేరు కృష్ణనే!
సాక్షి, ఆసిఫాబాద్: కాగజ్‌నగర్ మండలం సార్సాలలో అటవీ అధికారులపై జరిగిన దాడుల్లో బుధవారం మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ హల్చల్ సృష్టించినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ దాడుల్లో మొదటి నుంచి పకడ్బందీగా అన్నీ తానై వ్యవహరించారు. ఆ వీడియో ప్రకారం.. ఆదివారం ఉదయం సార్సాల గ్రామస్తులను వెంట బెట్టుకుని అటవీ అధికారుల వద్ద ఉన్న ట్రాక్టర్ యజమాని మేకల తిరుపతిపై దాడికి పాల్పడ్డాడు. తిరుపతిని విచక్షణారహితంగా కర్రలతో కొట్టినట్లు కనిపిస్తోంది. తన ట్రాక్టర్ రాలేదని అతను ఎంత చెప్పినా వినకుండా దాడికి తెగబడ్డాడు. కాగజ్‌నగర్ టౌన్ సీఐ కిరణ్‌కుమార్ అటవీ అధికారులను అడ్డుకున్న వారందరినీ జీపులో ఎక్కించుకుని వెళ్లే క్రమంలో పోలీసులను బెదిరించి జీపులో ఉన్న వారిని కృష్ణ కిందకు దింపేశారు. అనంతరం ఎఫ్ఆర్వో అనితను దుర్భాషలాడారు. ఆగ్రహంతో ఊగిపోతూ ఆమెపై కర్రతో దాడి చేశారు. అనంతరం అక్కడ కనిపించిన వారిపై దాడి చేస్తూ వెళ్లారు. కృష్ణ సార్సాల గ్రామానికి రాకముందు అటవీ అధికారులు, గ్రామస్తులకు మధ్య వాగ్వాదం చేటు చేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆయన అండతో గ్రామస్తులు సైతం కర్రలు చేతబూని దాడులకు తెగబడ్డారు. పోలీసుల ప్రేక్షక పాత్ర ఈ దాడుల్లో పోలీసుల ప్రేక్షక పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. సీఐ కిరణ్‌కుమార్ జీపులో ఉన్న వారందరినీ దింపుతున్నా కృష్ణకు ఎదురు చెప్పకపోగా.. ఆయన దాడులను చూస్తూ ఉండిపోయారు. 31 మంది అరెస్టు అటవీ అధికారులపై దాడులు చేసిన వారిలో బుధవారం వరకు మొత్తం 38 మంది నిందితులను గుర్తించగా.. ఇందులో 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కోనేరు కృష్ణతో సహా వీరంతా ప్రస్తుతం ఆదిలాబాద్ జైలులో ఉన్నారు. -
అత్యంత అమానుషం
తెలంగాణలోని కుమురంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు మహిళా అటవీ అధికారి(ఎఫ్ఆర్ఓ) అనితపైనా, ఇతర సిబ్బందిపైనా జరిగిన దాడి దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రభుత్వ విధానాలను అమలు చేయడానికెళ్లిన అటవీ శాఖ సిబ్బందిపై అధికార పక్ష ప్రజాప్రతినిధే అనుచరులను పోగేసుకుని దాడికి దిగడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఇది నాలుగేళ్లక్రితం ఏపీలో చంద్రబాబు పాలనలో తహసీల్దార్ వనజాక్షిపై అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన నాయకత్వంలోని మాఫియా గణం చేసిన దాడిని గుర్తుకు తెచ్చింది. అయితే ఆ దాడి విషయంలో బాబు తరహాలోకాక తెలంగాణ సీఎం కేసీఆర్ సార్సాల ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకున్నారు. దానికి నాయకత్వం వహించిన జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో ఆ పదవికి రాజీనామా చేయించారు. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదంతం జరిగినప్పుడు చేష్టలుడిగి ఉండిపోయిన డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ విధానాలను అమలు చేసే క్రమంలో సిబ్బందికి ఇబ్బందులు తలెత్తడం రివాజే. ఆ విధానాలతో నష్టపోతున్నామని భావించేవారు తమ వాదనను బలంగా వినిపించడం, భావోద్వేగాలు పెరిగి అడ్డుకోవడానికి ప్రయత్నించడం కూడా సర్వసాధారణం. కానీ కర్రలతో ప్రభుత్వ సిబ్బందిపై దాడికి తెగబడటం క్షమార్హం కానిది. అలాంటి చర్యల పర్యవసానంగా ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా అది పూర్తిగా శాంతిభద్రతలకు సంబంధించిన వ్యవహారంగా మారి వికటిస్తుంది. పోడు భూముల సమస్య దాదాపు దేశమంతా ఉంది. అడవులపై తమకున్న సంప్రదాయ హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆదివాసులు తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఈ విషయంలో ఎన్నో ఉద్యమాలు సాగాక అటవీ హక్కుల చట్టం అమల్లోకొచ్చింది. కానీ దశాబ్దకాలం గడిచినా, లోటుపాట్లను సవరించడానికి మధ్యలో దానికి సవరణలు చేసినా అది సక్ర మంగా అమలు చేయటం లేదన్నది గిరిజనుల ఆరోపణ. ఆ చట్టం ప్రకారం తమ సాగులో ఉన్న అటవీ భూములకు వ్యక్తిగత పట్టాలివ్వాలని, అలాగే గిరిజన గూడేలకు ఉమ్మడి హక్కు పత్రాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. వానా కాలం ప్రవేశించాక పోడు భూములు సాగు చేసుకుందామని గిరిజనులు ప్రయత్నించినప్పుడు అటవీ సిబ్బంది దాడులు చేయడం ఏటా షరా మామూలుగా సాగుతోంది. పోడు భూములకు పట్టాలున్నా అటవీ సిబ్బంది ఖాతరు చేయరని, విత్తనాలు చల్లు కున్న భూమిని బుల్డోజర్లతో, జేసీబీలతో నాశనం చేస్తారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. గిరిజ నుల దగ్గరున్న పట్టాలు సరైనవా, కాదా... అందులో సాగు చేసుకోవడానికి వారికి హక్కుందా లేదా అన్న సంగతిని నిర్ధారిస్తే పదే పదే ఈ ఉదంతాలు పునరావృతం కావు. మొక్కలు నాటాలనుకున్న భూమి తమదేనని అటవీ శాఖ అంటుంటే, తమకు పట్టాలున్నాయని గిరిజనులు చెబుతున్నారు. కొన్నిచోట్ల గిరిజనేతరులు సైతం ప్రవేశించి వారికి దక్కాల్సిన ప్రయోజనాలను కాజేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాజకీయ నాయకులు తమ పలుకుబడితో తాత్కాలికంగా సమస్య సద్దుమణి గేలా చూస్తున్నారు. కానీ మరుసటి ఏడాది తిరిగి ఇదంతా యధాప్రకారం సాగుతుంది. ఇందులో ఎక్కడ తేడా వచ్చినా అటవీ సిబ్బందిపై దాడులు చేయడం, వారిని దుర్భాషలాడటం వంటి ఉదం తాలు చోటుచేసుకుంటాయి. ఈ ఉదంతాల్లో ఎందరో గిరిజనులు కేసుల్లో చిక్కుకుని జైలుపాలవు తున్నారు. కేవలం బతకడానికి, కుటుంబాలను బతికించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో గిరిజ నులు ఇన్ని ఇబ్బందులు పడటం విషాదకరం. అటవీ భూములను ప్రాజెక్టుల పేరు చెప్పి, అభ యారణ్యాల పేరు చెప్పి, రిజర్వ్ ఫారెస్టు భూములుగా చూపి ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుం టుంటే... వాటిపై ఆధారపడి జీవించే గిరిజనుల బతుకు అధోగతి అవుతోంది. గత నెలలో ఇదే కాగజ్‌నగర్ మండలం కొలాంగోందిగూడలో 67మంది గిరిజనులను టింబర్ డిపోలో నిర్బంధిం చిన ఉదంతం ఇటువంటిదే. హైకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని నిర్బంధితులను విడుదల చేయ డంతోపాటు వారికి ఆర్నెల్లలో భూమి, ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆదేశించింది. గిరిజనుల జీవనాధారం దెబ్బతినకుండా, వారిని అడవికి దూరం చేయకుండా సమస్యను ఎలా పరిష్కరించాలన్న అంశంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. హరితహారమో, మరే ఇతర కార్య క్రమమో మొదలెట్టినప్పుడు... లేదా ఒక విధానాన్ని రూపొందించే ముందు ఆ సమస్యతో సంబంధం ఉన్న అన్ని పక్షాలనూ పిలిచి మాట్లాడటం, ప్రజాప్రతినిధులను కూడా అందులో భాగ స్వామ్యం చేయడం, అందరి అంగీకారంతో ఒక సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించడం అవ సరం. ఎవరి దారి వారిదన్నట్టు ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించడం, దాన్ని అమలు చేయటం కోసం అధికారులు రంగంలోకి దిగడం, ప్రజాప్రతినిధులు జనాన్ని సమీకరించి ఆ అధికా రులపై దాడులకు పూనుకోవడం ప్రమాదకరమైన పర్యవసానాలకు దారితీస్తుంది. ఆదివారం నాటి ఉదంతంలో అనితను లక్ష్యంగా చేసుకుని కోనేరు కృష్ణ, ఆయన అనుచరులు సాగించిన దాడే ఇందుకు రుజువు. అంతమంది జనాన్ని పోగేసి ఆమెపైనా ఇతర సిబ్బందిపైనా దాడికి దిగడానికి బదులు... తానూ, తన సోదరుడు అధికార పక్ష ప్రజాప్రతినిధులు కనుక ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో చర్చించి స్థానిక సమస్యలేమిటో చెప్పడం, ఇప్పుడు అమలవుతున్న విధానంలో సవరణలు సూచించడం, అటవీ హక్కుల చట్టం సక్రమంగా అమలయ్యేలా చూడటం వంటివి చేయాలి. అందుకు భిన్నంగా అధికారులనూ, సిబ్బందినీ దాడులతో బెదరగొడితే సమస్య తీరు తుందని వారెలా అనుకున్నారో అనూహ్యం. సార్సాల దాడి ఉదంతం పోడు భూముల చుట్టూ అల్లుకున్న సమస్యల తీవ్రతను తెలియజేసింది గనుక తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిం చాలి. భవిష్యత్తులో సార్సాల ఉదంతం వంటివి పునరావృతం కాకుండా అందరి సహకారంతో సామరస్యపూర్వక పరిష్కారం సాధించాలి. -
‘అనితపై దాడి హేయమైన చర్య’
సాక్షి, హైదరాబాద్ : మహిళా అటవీ అధికారిణి అనితపై ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నాయకులు కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం దారుణమన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇలా ప్రభుత్వ అధికారులపై దాడులకు పాల్పడం హేయమైన చర్యలని కోమటిరెడ్డి అన్నారు. దాడులను ఎదుర్కొవడానికి అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు తిరిగి పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. (చదవండి : మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి) అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాం తంలో భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. -
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో వైరల్
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులపై ఆదివారం దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడిని ఎమ్మెల్యే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దాడికి సంబంధించిన కారణాలను విలేకరులకు ఎలా చెప్పాలో ఆదివాసీలు, గిరిజనులకు ఆయన హితబోధ చేశారు. తప్పంతా అధికారులదే అన్నట్లుగా ఉండాలని ఎమ్మెల్యే కోనప్ప ఆ వీడియోలో చెప్పడం గమనార్హం. ఆ వీడియోలో ‘ ఇప్పుడు నేను విలేకరులను పిలిపిస్తున్నా. వాళ్ల ముంగిట చెప్పండి. భూములు దగ్గరకు వెళ్లొద్దని రోజు వచ్చి బెదిరిస్తున్నారు. భూముల్లో తవ్వకాలు జరిపారు. మా భూములు లోపల ఉన్నాయి. అక్కడకు వెళ్లకుండా మమ్మల్ని బెదిరిస్తున్నారు. 15 రోజుల క్రితం వచ్చి కొట్టారు. ఇప్పుడు మళ్లీ కొట్టారు. కొట్టాక అందరం దున్నొద్దని ట్రాక్టర్ల దగ్గరకు వెళ్లాం. అప్పుడే గొడవ అయింది. ఇదంతా చెప్పాలి. విలేకరులను పిలిపిస్తా. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి.’ అంటూ ఎమ్మెల్యే పేర్కొనడం విశేషం. చదవండి: మహిళా అటవీ అధికారిపై ప్రజాప్రతినిధి దాడి కాగా అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భూమిని చదును చేసి మొక్కలు నాటేందుకు వెళ్లిన ఫారెస్ట్ అధికారుల బృందంపై అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, కుమురంభీం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణతో పాటు ఆయన అనుచరులు యథేచ్ఛగా దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా అటవీ అధికారిణి అనిత చేయి విరగడంతో పాటు పలువురు అటవీ సిబ్బందికి గాయాలయ్యాయి. కుము రంభీం జిల్లా కాగజ్‌నగర్ మండలం సార్సాల అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. అధికార పార్టీ నాయకుడు, సాక్షాత్తూ జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్, ఎమ్మెల్యే సోదరుడు ఇందుకు బాధ్యుడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే సోదరుడితో సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఈ సంఘటనపై ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. దాడిని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించి, ఇటువంటి సంఘటనలు పునరావృతం కారాదని హెచ్చరించారు. ఇక దాడిలో గాయపడ్డ ఎఫ్ఆర్వో అనితను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. భారీగా మోహరించిన పోలీసులు సల్సాల గ్రామ అటవీప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు నడుమ ట్రాక్టర్లతో అటవీ శాఖ అధికారులు సోమవారం భూమిని చదును చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 200మంది పోలీసులు మోహరించారు. ఎఫ్ఆర్వోపై దాది చేసిన కోనేరు కృష్ణతో పాటు 15మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వీడియో వైరల్
-
మహిళా ఎఫ్ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్
-
మహిళా ఎఫ్ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్
హైదరాబాద్ : సిర్పూర్ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్ స్పష్టం చేశారు. కోనేరు కృష్ణపై కేసు నమోదయిందని.. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా, ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి : మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.! నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత -
ఎఫ్ఆర్వోపై దాడి సీఎం కేసీఆర్ ఆగ్రహం
-
కోనేరు కృష్ణ తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్ : విధి నిర్వహణలో ఉన్న మహిళా అటవీశాఖ అధికారిణిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి సమగ్ర విచారణ జరిపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. చదవండి: నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత కాగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కొత్త సారసాల గ్రామంలో అటవీ శాఖ అధికారులపై తన అనుచరులతో హంగామా సృష్టించి, దాడికి పాల్పడ్డ కోనేరు కృష్ణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం మధ్యాహ్నం జెడ్పీ వైస్ చైర్మన్, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. కోనేరు కృష్ణ తన రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు పంపించారు. అయితే పార్టీ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్ఆర్వో అనితపై దాడి చేసిన కేసులో కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి 30మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. చదవండి: మహిళా ఎఫ్ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.! దాడి ఘటన ఖండించిన మంత్రి అల్లోల మరోవైపు అధికారులపై జరిగిన దాడిని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప, భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. అలాగే అటవీశాఖ సిబ్బందిపై దాడిని ఐఎఫ్ఎస్ అధికారుల సంఘం ఖండించింది. విధి నిర్వహణలో ఉన్న వారిని అడ్డుకోవడం, మహిళా అధికారిని తీవ్రంగా గాయపరచడం తీవ్రమైన చర్య అని, బాధ్యులపై వెంటన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. -
ఎఫ్ఆర్వోపై దాడి కోనేరు కృష్ణపై కేసు నమోదు
-
నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్ఆర్వో అనిత
సాక్షి, సిర్పూర్ కాగజ్ నగర్ : ఎఫ్ఆర్వో అనితపై దాడికి తెగబడ్డ ఘటనలో ఎమ్మెల్యే సోదరుడు కోనేరు కృష్ణ సహా 16మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 147,148, 207,332,353,427 సెక్షన్ల కింద ఈజ్గామ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కాగా దాడిలో గాయపడ్డ మహిళా అధికారిణి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కోనేరు కృష్ణ మొదటగా నాపై దాడికి పాల్పడ్డారు. తర్వాత మరో 10మంది కోనేరు కృష్ణ అనుచరులు కర్రలతో నా తలపై కొట్టారు. ఆ క్షణంలో నేను బతుకుతానని అనుకోలేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సిర్పూర్ కాగజ్‌నగర్ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రత్యామ్నాయ అటవీకరణ పనులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలోని సార్సాలా గ్రామంలో 20 హెక్టార్లలో చెట్లు నాటేందుకు అటవీ అధికారులు సిద్ధమయ్యారు. చెట్లు నాటేందుకు వీలుగా భూమిని చదును చేసేందుకు ట్రాక్టర్లు, సిబ్బందితో కలిసి ఆదివారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని సిర్పూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైఎస్ చైర్మన్ కృష్ణ తన అనుచరులతో అడ్డుకోవడమే కాకుండా అటవీ శాఖ అధికారులపై దాడికి తెగబడ్డారు.