krishna distirict
-
భారీ వర్షాలు: ప్రమాద ఘటనలపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా జరిగిన ఘటనల్లో పలువురు మరణించిన ఘటనలపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.విజయవాడలో కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించడంతో పాటు, గుంటూరు జిల్లా ఉప్పలపాడులో వరద ఉదృతికి వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో టీచర్ సహా ఇద్దరు విద్యార్ధులు మృతి చెందడం, మంగళగిరి గండాలయ్యపేటలో కొండ చరియలు విరిగిపడి వృద్దురాలు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయా కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయిందని, విజయవాడ సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. ఈ ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆదుకోవాలన్నారు. ఆయా ప్రాంతాల్లో భారీవర్షాల బాధితులకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అండగా నిలవాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. -
బాబు పక్కకు నెట్టేశారు.. అజ్ఞాతంలోకి దేవినేని ఉమ!
సైకిల్ పార్టీలో ఒకప్పుడాయన ఎంతో కీలక నేత. జిల్లాలో ఎక్కడ పార్టీ కార్యక్రమం జరిగినా ఆయన ఉండాల్సిందే. అంతటి కీలక నాయకుడికి ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వకుండా పక్కకు నెట్టేశారు. ఆయన ప్రత్యర్థికి టిక్కెట్ ఇచ్చినా కామ్‌గా ఉండిపోయారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినా పార్టీలో ఎక్కడా కనిపించడంలేదని టాక్ నడుస్తోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆ నేత ఇప్పుడెందుకు అజ్ఞాతంలో ఉంటున్నారు? ఇంతకీ ఆ నేత ఎవరు? తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతల్లో కీలకంగా, చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిలో దేవినేని ఉమా మహేశ్వరరావు ఒకరు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. అదంతా గత వైభవం. ఇప్పుడు దేవినేని ఉమా పేరు పార్టీలో ఎక్కడా వినిపించడంలేదు. 2014 ఎన్నికల్లో కృష్ణాజిల్లా మైలవరం నుంచి అసెంబ్లీకి ఎన్నికై చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత దేవినేనికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఆయన వ్యవహరించే తీరుతో నియోజకవర్గంలోని ముఖ్య నేతల నుంచి క్యాడర్ వరకు దేవినేని ఉమ మీద తిరుగుబాటు చేశారు. ఈసారి ఉమకు టిక్కెట్ ఇవ్వడానికి వీల్లేదని పార్టీ నాయకత్వానికి తెగేసి చెప్పారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలోకి ఫిరాయించి మైలవరం టిక్కెట్ దక్కించుకున్నారు. వసంతకు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు అప్పటివరకు పార్టీలో కీలకంగా ఉన్న దేవినేని ఉమను సైడ్ చేసేశారు. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే మంచి రోజులొస్తాయని అధినేత చెప్పిన మాటను కాదనలేక తప్పనిసరి పరిస్థితుల్లో మైలవరంలో వసంతకు దేవినేని సహకరించారని టాక్. ఇంతవరకూ బాగానే ఉంది..టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేవినేని ఉమాను పార్టీ అధినేతతో సహా ఎవరూ పట్టించుకోవడం మానేశారని సమాచారం.చంద్రబాబు మాటకు కట్టుబడి ఎన్నికల్లో వసంత గెలుపు కోసం కృషి చేసిన దేవినేని ఇప్పుడు కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయిందట. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ... టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కచ్చితంగా తనకు సముచిత స్థానం దక్కుతుందని భావించిన దేవినేని ఉమాకు నిరాశే ఎదురయ్యిందట. అందుకే ఇప్పుడాయన పార్టీలో అందరికీ దూరంగా ఉంటున్నారట. కూటమి ఘన విజయం సాధించినా పార్టీ సంబరాల్లో ఉమా ఎక్కడా పాలు పంచుకోలేదట. అధినేతను కలిసి కనీసం శుభాకాంక్షలు కూడా తెలిపింది లేదట. ఇక సాక్షాత్తూ ప్రధానమంత్రి సమక్షంలోనే తమ నాయకుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా ..ఎవరితోనూ సంబంధం లేకుండా కామ్ గా ఎక్కడో ఓ మూలన కూర్చుని వెళ్ళిపోయారట.ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, పార్టీ అధికారంలోకి వచ్చింది గనుక చంద్రబాబు తనకు ఏదోరూపంలో ప్రాధాన్యం కల్పిస్తారని దేవినేని ఉమా నమ్మారట. అయితే పరిస్థితులు తనకు అనుకూలంగా లేవని తేలిపోవడంతో ఇక టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. దీంతో ఇప్పుడు అటు టీడీపీలోనూ.. ఇటు మైలవరంలోనూ తెలుగుతమ్ముళ్ల చర్చంతా దేవినేని చుట్టూనే తిరుగుతోందట. ఒకప్పుడు పార్టీలో కింగ్ మేకర్లా వ్యవహరించిన దేవినేని ఉమా ప్రస్తుత దీన పరిస్థితి తలుచుకుని తెగ ఫీలైపోతున్నారట. అసలు పార్టీలో ఎవరితోనూ కలవడంలేదనే టాక్ నడుస్తోంది. -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
-
ఇంటింటికి అమృతధార
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించే లక్ష్యం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మైక్రో వాటర్ ఫిల్టర్లను గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసేందుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించిన పనులను కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు మండలంలో ప్రారంభించారు. ఈ మండలంలోని 22 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే 12 పంచాయతీల్లో ఈ ఫిల్టర్ మార్పు పనులు పూర్తయ్యాయి. మిగిలిన పంచాయతీల్లో కూడా వేగవంతంగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు. సమస్య ఇదీ.. ప్రస్తుతం గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ద్వారా ప్రజల తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. అయితే ఇందులో స్లో శాండ్ ఫిల్టర్లు ఉండటంతో, వాటి నిర్వహణ పంచాయతీలకు భారంగా మారింది. ఫిల్టర్లు కడగటం వల్ల అరిగిపోయి తరుచూ మార్చాల్చి వస్తోంది. దీనికితోడు ఈ ప్రాసెస్ కోసం క్వాలిటీ ఇసుక అవసరం కావడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారుతోంది. శేరీదగ్గుమిల్లిలో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో.. ►జిల్లాలో ఎక్కువ శాతం తాగునీటి చెరువులు, కాలువల ద్వారా వచ్చే నీటినే తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ నీటిని శుద్ధి చేసేందుకు ఫిల్లర్లు తప్పని సరి. ►ఈ నేపథ్యంలో పంచాయతీలపై నిర్వహణ భారాన్ని తప్పించేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సాయంతో.. గుడ్లవల్లేరు పంచాయతీల్లోని జనాభా ఆధారంగా 0.5 ఎంఎల్డీ, ఒక ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. ►0.5 ఎంఎల్డీ వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుకు రూ.5లక్షలు ఖర్చు అవుతోంది. ఈ నిధులను జెడ్పీ నుంచి జిల్లా పరిషత్ చైర్పర్సన్ సమకూర్చుతున్నారు. ►ఇప్పటికే 12 గ్రామాల్లో రూ.70 లక్షలతో మైక్రో వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు. ►ఇంకా 12 గ్రామాల్లో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా రూ.85 లక్షలతో పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకొంటున్నారు. ►మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఫ్లాట్ ఫారాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఫ్లాట్ పారం నిర్మాణానికి రూ. 2.5లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఖర్చు అవుతోంది. తగ్గనున్న నిర్వహణ భారం.. మైక్రోఫిల్టర్ల ఏర్పాటుతో శుద్ధి చేసిన నీటితో పాటు, పంచాయతీలపైన వీటి నిర్వహణ భారం తగ్గనుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించడం వల్ల మూడేళ్ల వరకు ఇబ్బంది ఉండదు. దీని తర్వాత దశల వారీగా మిగిలిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. పెడన మండలంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రజారోగ్యమే దేశ సౌభాగ్యం.. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అని బాపూజీ చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం పాటిస్తోంది. అందులో భాగంగానే మా గ్రామంలో శుద్ధ జలాలు అందించేందుకు మైక్రో వాటర్ ఫిల్టర్ల ఏర్పాటుకు కృషిచేస్తోంది. ప్రజలకు స్వచ్ఛమైన సురక్షిత మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికకు మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా. – డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్, సింగలూరు, గుడ్లవల్లేరు మండలం రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దుతాం.. గుడ్లవల్లేరు మండలాన్ని రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇందులో భాగంగానే మొదటి దశలో అన్ని గ్రామాలకు శుద్ధి నీరు అందిస్తున్నాం. ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన గ్రామాల్లోనూ పనులు ప్రారంభిస్తాం. ఇక నాడు–నేడు ద్వారా పీహెచ్‌సీలు, పాఠశాలలను ఆధునికీకరిస్తున్నాం. ఈ పథకం కింద కవర్‌కాని పాఠశాలలను జెడ్పీ నిధులతో ఆధునికీకరిస్తున్నాం. – ఉప్పాల హారిక, జెడ్పీ చైర్పర్సన్, ఉమ్మడి కృష్ణా జిల్లా చదవండి: నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థిని హర్షితకు జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ -
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లపై దాడులు
-
మూడో రోజు ‘మెగా ఇళ్ల శంకుస్థాపన’ కార్యక్రమం
-
విషాదం: అదృశ్యమైన చిన్నారులు చెరువులో శవాలై..
-
వలంటీర్లకు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు ప్రదానం చేసిన సీఎం
-
ఎస్ఐ ఆత్మహత్య: ప్రియురాలు రిమాండ్
సాక్షి, విజయవాడ: గుడివాడ టూటౌన్ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు బ్యూటీషియన్ సురేఖను పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బుధవారం నాడు పోలీసులు ఆమెను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా గుడివాడలో డీఎస్పీ సత్యానందం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎస్ఐ విజయ్‌కుమార్ ఆత్మహత్య వివరాలు వెల్లడించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయ్ కుమార్ వ్యక్తి గత కారణాల వల్లే మరణించాడని తెలిపారు. పేకాట దాడుల నిర్వహణలో ఒత్తిడిలకు తట్టుకోలేక మృతిచెందాడని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడం అవాస్తవమని స్పష్టం చేశారు. దేవినేని ఉమ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చేసిన ఆరోపణలపై ఆధారాలు చూపించాలని నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. పోలీసులను రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని సూచించారు. ఎస్ఐ మృతి కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ పిల్లి విజయ్‌కుమార్(34)కు రెండున్నర నెలల క్రితం ఏలూరుకు చెందిన యువతితో వివాహమైంది. పోలీస్‌స్టేషన్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ప్రస్తుతానికి ఎస్ఐ ఒక్కడే అద్దెకుంటున్నాడు. అతడికి హనుమాన్ జంక్షన్లో పని చేస్తున్న సమయంలో సురేఖ అనే బ్యూటీషియన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ విషయం తెలుసుకున్న సురేఖ భర్త ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కొంతకాలం వీఆర్‌లో ఉంచారు. తిరిగి గుడ్లవల్లేరులో ఎస్ఐగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత మండవల్లిలో పనిచేసిన ఆయన ఇటీవల గుడివాడకు బదిలీ అయ్యారు. కాగా, విజయ్ కుమార్ భార్యను కాపురానికి తీసుకురావద్దని, తనతోనే ఉండాలని సురేఖ తరచూ గొడవ చేస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో సురేఖ.. విజయ్‌కుమార్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి అతనితో ఇదే అంశంపై గట్టిగా ప్రశ్నించినట్లు స్థానికులు చెబుతున్నారు. 'నీవు నీ భార్యకు విడాకులు ఇవ్వని పక్షంలో నేను ఆత్మహత్య చేసుకుని సూసైడ్ నోట్లో నీవే కారణమని తెలుపుతాను' అనిహెచ్చరించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఎస్ఐ తన గదిలోని ఫ్యాన్ హుక్కు టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. (చదవండి: గుడివాడ టూ టౌన్ ఎస్సై బలవన్మరణం) -
తల్లి కాలేయం ఇచ్చినా.. తప్పని గుండె కోత
సాక్షి, మచిలీపట్నం: బిడ్డను బతికించుకోవాలనే తపనతో తన కాలేయాన్ని ఇచ్చేందుకు సిద్ధమైన ఆ మాతృమూర్తికి గుండె కోత తప్పలేదు. పెళ్లైన పదిహేను ఏళ్ల తరువాత కలిగిన సంతానం కావడంతో ఎంతో అల్లారు ముద్దు చేసిన కుమారుడు ఇక లేడని తెలియడంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. తన కాలేయాన్ని అమర్చుకొని కొడుకు కళ్ల ముందుకొస్తాడని, అదే ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స పొందుతూ వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆ తల్లికి కన్న పేగు ఇక లేదని చెప్పే సాహసాన్ని అక్కడి వైద్యులు సైతం చేయలేని హృదయ విదారకరమైన పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం నగరం నోబుల్ కాలనీకి చెందిన గ్రేసీ, స్టీఫెన్ దంపతుల పెద్ద కుమారుడు ఇమ్మానియేల్ జాకబ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతనికి కాలేయ సంబంధిత వ్యాధి ఉందని ఇటీవల వరకు తెలియదు. కొన్ని రోజుల క్రితం నోటి నుంచి రక్తం పడటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. పరీక్షలు చేసిన వైద్యులు ఇమ్మానియేల్ జాకబ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కాలేయాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందని, లేకుంటే ప్రాణాలు దక్కవని చెప్పారు. వైద్యుల సూచన మేరకు ఇమ్మానియేల్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తండ్రి స్టీఫెన్ ప్రైవేట్ ఉపాధ్యాయుడు. ఖరీదైన వైద్యం చేయించాల్సి ఉన్నందున వారి పరిస్థితిని తెలుసుకున్న రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మానవీయ కోణంలో స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.25 లక్షలు మంజూరు చేయించారు. కుమారుడికి తన కాలేయాన్ని ఇచ్చేందుకు తల్లి గ్రేసీ సిద్ధమైంది. (చదవండి: ఘోర ప్రమాదం: 23 మంది మృతి) ఆపరేషన్ చేస్తుండగా.. కాలేయ మార్పిడికి ఆసుపత్రి వైద్యులు అంతా సిద్ధం చేసి తల్లి గ్రేసీకి ఆపరేషన్ ద్వారా కాలేయం కొద్ది భాగాన్ని తొలగించారు. దానిని ఇమ్మానియేల్‌కు అమర్చేందుకు ఆపరేషన్ చేస్తున్న క్రమంలో అతని ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం ఉదయం మృతిచెందాడు. తల్లి గ్రేసీని ఆరోగ్య పర్యవేక్షణ కోసం ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. కుమారుడు ఇమ్మానియేల్ మృతి చెందిన విషయం ఇంకా ఆమెకు తెలియదు. 50 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రం నుంచి బందరుకు వచ్చిన గ్రేసీ, స్టీఫెన్ దంపతులు అందరితోనూ కలిసిమెలిసి ఉంటారు. గిటార్ ప్లే చేయడంలో అందవేసిన చేయి అయిన ఇమ్మానియేల్ ఎవాంజెలికల్ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తన సంగీత ప్రతిభతో అందరి మనసును దోచుకునేవాడు. అటువంటి ఇమ్మానియేల్ ఇక లేడని తెలియడంతో నోబుల్ కాలనీలో విషాదం అలముకుంది. ఈ విషయాన్ని ఇమ్మీ స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని మచిలీపట్నానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. -
ఉద్రిక్తతలకు దారి తీసిన యువకుడి ఆత్మహత్య
సాక్షి, కృష్టా: యువకుడి ఆత్మహత్య జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. వివరాలు.. పరిటాలకు చెందిన మంగిన రాజశేఖర్ రెడ్డి నిన్న రాత్రి కృష్ణా బ్యారేజ్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం పేకాట ఆడుతూ పట్టుబడ్డ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ నేత కోగంటి బాబు, రాజశేఖర్ రెడ్డిని స్టేషన్ నుంచి విడిపించాడు. దాంతో మృతుడు, బాబుని పొగుడుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు మరోసారి రాజశేఖర్ రెడ్డిని స్టేషన్‌కి పిలిపించారు. అనంతరం అతడు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు అకారణంగా తనని స్టేషన్‌కి పిలిచి కొట్టారనే మనస్తాపంతోనే రాజశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపిస్తున్నారు.(చదవండి: టిక్‌టాక్ దంపతుల ఆత్మహత్య!) ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజశేఖర్ రెడ్డి బంధువులు జాతీయ రహదారిపై మృత దేహంతో ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని వారిని అక్కడి నుంచి తరలిచే ప్రయత్న చేశారు. -
తహసీల్దార్ కారులో రెండు లక్షలు లభ్యం
సాక్షి, కృష్ణా జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. మండల తహసీల్దార్ టీ.చంద్రశేఖర్ నాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు అతని నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. (అంబులెన్స్‌కు దారి ఇచ్చిన సీఎం కాన్వాయ్) రెవెన్యూ కార్యాలయంతో పాటు, అధికారుల వాహనాలను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షరూపాయలు డిప్యూటీ తహసీల్దార్ కారులో లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు మీడియాకు వివరిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సోదాల్లో మహేశ్వర రాజు, హ్యాపీ కృపానందం, నజీరుద్దిన్ బృందం పాల్గొన్నారు. (తెలుగు తమ్ముళ్ల వీరంగం, కెమెరాలో రికార్డు) గుంటూరు: రాజుపాలెం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్ పుస్తకాల మంజూరులో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. నెల్లూరు: గూడురు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. కర్నూలు: ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎస్పీ శివ నారాయణ తన సిబ్బందితో కలసి పట్టణంలోని పాత, కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డాగా కొందరు వీఆర్వోలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారిస్తున్నారు. కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు ఆడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు సాయంత్రం తెలుపుతామన్నారు. అలాగే రేషన్ డీలర్లను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. శ్రీకాకుళం : జిల్లాలో పలు తహశీలార్ల కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సంతకవిటి కార్యాలయంలో తనిఖీలు చేస్తుండగా వీఆర్వోలు, సిబ్బంది పరారయ్యారు. అనంతపురం: కూడేరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది అవినీతిపై విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు విజయనగరం: బలిజపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విశాఖ: కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు. -
కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ కోరలు
-
కరోనాను చాలా ఈజీగా జయించవచ్చు
-
టీడీపీ నేత నన్నపనేని లక్షీనారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు
-
జైలుకు వెళ్తాననే భయం చంద్రబాబుకు పట్టుకుంది
-
ప్రజా చైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర
సాక్షి, విజయవాడ: చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు.. పిచ్చోడి యాత్ర అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్తాననే భయం చంద్రబాబుకు పట్టుకుందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవమాసాల పాలనతో నారావారి నవనాడులు చిట్లిపోయాయని ఆమె ధ్వజమెత్తారు.(తాగుబోతుల పొట్టకొడుతోంది) అందుకే ఐటీ సోదాలు, దోపిడిపై మాట్లాడకుండా.. తేలు కుట్టిన దొంగల్లా చంద్రబాబు, లోకేష్ తిరుగుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఐటీ దాడులతో ఎప్పుడు లోపలేస్తారోనని చంద్రబాబు భయపడుతున్నాడని ఆమె అన్నారు. అందుకే బస్ యాత్ర పేరుతో అబద్ధాలు చెబుతున్నాడని రోజా మండిపడ్డారు. ఐటీని తానే కనిపెట్టానని చెప్పుకునే బాబు.. ఇప్పుడు ఐటీ పేరు చెబుతేనే వణికిపోతున్నాడని ఆమె అన్నారు. (అది మామూలు విషయమా: విజయసాయిరెడ్డి) -
హర్షిణి
నువ్వేంటి అనేది నీ పుట్టుక చెప్పదు.. నువ్వేంటో నీ వ్యక్తిత్వం చెప్తుంది.. నువ్వేంటో నీ జీవన శైలి చూపిస్తుంది.. ఆత్మగౌరవాన్ని మించిన అస్తిత్వం లేదు అని అమ్మ చెప్పిన మాటలను మంత్రంలా ఆచరించి తనను తాను గౌరవించుకున్న ఒక హర్షిణి కథ ఇది.. ‘‘నిజం చెబితే ఎందుకు ఉద్యోగం ఇవ్వరో చూడాలి.. నిజం చెప్పే ఉద్యోగాన్ని సాధించాలి’’ అని నిర్ణయించుకుంది ఆమె. ఆ పట్టుదలతోనే ‘జేఎల్ఎల్’ లో ఇంటర్వ్యూకి హాజరైంది. ఎప్పటిలాగే తొలి రెండు రౌండ్లు విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఆఖరి రౌండూ పూర్తయి, ఉద్యోగం ఖాయమని తేలగానే చెప్పింది ఆమె ఇంటర్వ్యూ ప్యానెల్‌కు.. ‘సర్ .. నేను ట్రాన్స్ ఉమన్‌ని’ అని. ఆ జవాబుకి ప్యానెల్ ఉలిక్కిపడలేదు. ‘మీరు ఎవరైనా మాకు అభ్యంతరం లేదు. అయితే ఈ విషయాన్ని స్టాఫ్‌తో చెప్పకండి. వాళ్లు సరిగా రిసీవ్ చేసుకోలేకపోతే మీరే ఇబ్బంది పడ్తారు’’ అని సలహా మాత్రం ఇచ్చారు. ఆమె ఆత్మవిశ్వాసం ఉప్పొంగింది. ఆమె పేరు హర్షిణి మేకల. అమ్మ చెప్పినట్టుగా.. ఆమెకు మాటిచ్చినట్టుగా చదువుకొని.. మంచి ఉద్యోగం సంపాదించి .. ఆత్మగౌరవంతో బతుకుతోంది! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్షిణి సొంతూరు కృష్ణాజిల్లా.. జగ్గయ్యపేట మండలంలోని బలుసుపాడు అనే చిన్న గ్రామం. తల్లి, తండ్రి ఇద్దరూ వ్యవసాయ కూలీలే (ఇప్పుడు లేరు, చనిపోయారు). హర్షిణికి ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు. ఇదీ హర్షిణికి సంబంధించిన ప్రాథమిక సమాచారం. తన జీవితంలోని మిగిలిన విషయాల గురించి ఆమె మాటల్లోనే... ‘‘అబ్బాయిగానే పుట్టినా ఆలోచనలన్నీ అమ్మాయిలాగే ఉండేవి. స్కూల్ నుంచి రాగానే అక్క వాళ్ల బట్టలు వేసుకునేదాన్ని. కళ్లాపి చల్లి ముగ్గుపెట్టడం వంటివి చేసేదాన్ని. అమ్మ వారించేది. కౌన్సెలింగ్ ఇచ్చేది. వినకపోగా వయసు పెరుగుతున్నకొద్దీ మరీ నేను అమ్మాయిలాగే ప్రవర్తిస్తుంటే అమ్మ.. వీడి శరీరం అబ్బాయిదే కాని మైండ్ అమ్మాయిదే అని ఒక అభిప్రాయానికి వచ్చేసింది. కుటుంబంలో మిగిలిన వాళ్లు నా పట్ల ఎలా ఉన్నా అమ్మ మాత్రం నన్ను అర్థంచేసుకోవడానికే ప్రయత్నించింది. నిజం చెప్పాలంటే నాకొక స్నేహితురాలిగా ఉంది. అమ్మాయిలాంటి నా నడత చూసి బయట, స్కూల్లోని అబ్బాయిలు గేలిచేసేవారు, భయంకరంగా ఏడిపించేవారు. భరించలేక ఇంటికొచ్చి అమ్మను పట్టుకొని ఏడ్చేసేదాన్ని. ‘ఇంత చిన్నవాటికే భయపడి ఏడిస్తే ఎలా? రేప్పొద్దున జీవితంలో చాలా ఎదుర్కోవాలి. బాగా చదవాలి.. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. గొప్పగా బతకాలి’’ అంటూ ధైర్యం చెప్పేది. ఎంత ధైర్యం కూడదీసుకున్నా హేళనలు, అవమానాలు తప్పలేదు. వాటిమధ్యే పెరిగాను. ముంబైకి నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు ఓ ఎన్జీవోలో పనిచేసే ఒక ట్రాన్స్ ఉమన్ పరిచయమై ‘‘ముంబైకి వెళితే నువ్వు మొత్తం అమ్మాయిలా మారిపోవచ్చు’’అని సలహా ఇచ్చారు. అది మనసులో పెట్టుకొని డిగ్రీ పూర్తయ్యాక ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ముంబై వెళ్లిపోయా. కానీ ఆ వాతావరణంలో ఇమడలేక మూడు రోజులకే తిరిగొచ్చేశా. ఈలోపు మా అమ్మ నా మీద బెంగపెట్టుకొని ఆసుపత్రిపాలైంది. గుండె జబ్బు అని తేలింది. ‘‘ఇంకోసారి ఇలాంటివి చేయొద్దు.. నువ్వు గౌరవంగా బతకాలి’’ అంటూ ఏడ్చేసింది అమ్మ. బాగా చదువుకొని, చక్కగా స్థిరపడాలని ఒట్టుపెట్టించుకుంది నాతో. అప్పుడు పీజీ ఎంట్రెన్స్ రాశా. ఆచార్య యూనివర్సిటీ, ఎమ్.ఏ. ఎకనామిక్స్‌లో సీట్ వచ్చింది. పూర్తయ్యాక నేను డిగ్రీ చేసిన కాలేజ్‌లోనే లెక్చరర్‌గా చేరా. యేడాదిన్నరకు అమ్మ చనిపోయింది. అంతా చీకటయిపోయినట్టే అనిపించింది. నా దుఃఖం, సంతోషం, కష్టం, సుఖం అన్నీ ఎరిగిన మనిషి.. నాకున్న ఏకైక స్నేహితురాలు అమ్మ.. ఆమె లేని ప్రపంచాన్ని ఊహించుకోలేకపోయా. కుంగిపోయి.. ఆత్మహత్యా ప్రయత్నమూ చేశా. అక్కా, తమ్ముడు రక్షించారు. అప్పటికే మా అక్కలిద్దరికీ పెళ్లిళ్లయి పిల్లలు కూడా. పెద్దక్క భర్త చనిపోవడంతో మా ఇంటికే తెచ్చేసుకున్నాం. తమ్ముడు చదువుకుంటున్నాడు. అమ్మ పోయిన బాధలో నాన్న తాగుడికి బానిసయ్యాడు. బాధ్యతగా మసలుకోవాలన్న స్పృహ వచ్చింది. ఊళ్లోనే ఉంటే అమ్మ జ్ఞాపకాలతో దిగులు పెరగడం తప్ప ఏమీ చేయలేనని గ్రహించి మళ్లీ ముంబై వెళ్లిపోయా. అక్కడ ‘త్రివేణి సమాజ్ వికాస్ కేంద్ర’ అనే స్వచ్ఛంద సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా కొన్నాళ్లు, క్రిస్టియన్ ఎన్జీవో ‘సేవానికేతన్’లో కొన్నాళ్లు పనిచేశా. ఆ టైమ్‌లోనే ఢిల్లీ వెళ్లి స్త్రీగా మారిపోయే సర్జరీ చేయించుకొని ‘పూర్తిగా అమ్మాయే’అనే సర్టిఫికెట్ తీసుకున్నా. దీంతో నా ‘ఐడెంటిటీ’ మార్చుకోవాలని కోర్టు అఫిడవిట్ కూడా తెచ్చుకొని ‘హర్షిణి’ నయ్యాను. ఎమ్‌ఎన్‌సీలలో ఉద్యోగం సంపాదించాలనుకున్నా. జేఎల్‌లో సాధించా. స్టాఫ్ దగ్గర నేనెవరో చెప్పొద్దన్న నా పై అధికారులే నేను చేరిన ఆరునెలలకు నా గురించి స్టాఫ్‌కి చెప్పారు గర్వంగా. అందరూ షాక్. నిజమే అంటూ నా స్ట్రగుల్‌ని నేను చెబితేగాని నమ్మలేదు ఎవరూ. బ్యూటిఫుల్ స్మైల్ ఉద్యోగం చేస్తూనే ట్రాన్స్ విమెన్ కోసం ప్రారంభించిన అందాల పోటీల్లో పాల్గొన్నా. ‘టాప్ సిక్స్’లో నిలిచి, ‘బ్యూటిఫుల్ స్మైల్’ టైటిల్‌నూ గెలుచుకున్నా. అలా జాతీయ అందాల పోటీలో పాల్గొన్న మొదటి తెలుగు ట్రాన్స్ ఉమన్‌ని నేనే. మోడలింగ్ కూడా చేశా. రెండు హిందీ లఘుచిత్రాల్లో నటించా. ముంబైలోని మరాఠీ, హిందీ, ఇంగ్లిష్ పత్రికలు నా గురించి రాశాయి. ఇదంతా మా ఊరికి ఇంకోరకంగా చేరి మా అక్కతో కొందరు ‘మీ చెల్లెలు ముంబైలో బెగ్గింగ్ చేసుకుంటోందట కదా’ అన్నారట. దాంతో మా అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది ‘ముంబై వద్దు.. ఏమొద్దు ఇక్కడికి వచ్చెయ్’ అని. హైదరాబాద్‌లో ఉన్న మా ఆఫీస్ బ్రాంచ్‌కి బదిలీ చేయించుకుని వచ్చేశా. నటి కావాలనే కోరిక చిన్నప్పటి నుంచీ ఉంది. ఇక్కడికి వచ్చాక సినిమాల్లో చాన్స్‌కోసం ప్రయత్నించడం మొదలుపెట్టా. నా గురించి తెలిసి రచయిత, దర్శకుడు అమాన్ అహ్మద్ ‘బద్లావ్’ అనే హిందీ నాటకంలో నాకు వేషం ఇచ్చారు. దానికి మంచి పేరు వచ్చింది. సినిమా చాన్సే ఇంకా రాలేదు. తమిళంలో, మలయాళంలో ట్రాన్స్ ఉమన్‌కు హీరోయిన్ అవకాశాలు ఇస్తున్నారు. మమ్ముట్టి లాంటి పెద్ద పెద్ద హీరోల పక్కనా చేస్తున్నారు. కానీ మన తెలుగులో కనీసం క్యారెక్టర్ రోల్స్ కూడా ఇవ్వడం లేదు. సీరియళ్లలో ‘ట్రాన్స్ ఉమన్’ పాత్రనూ ఆడవాళ్లే చేస్తున్నారు. కానీ మాకు ఇవ్వడం లేదు’’ అంటుంది హర్షిణి మేకల. ►ఏ ఊళ్లో అయితే ఒకప్పుడు అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానో ఆ ఊరి వాళ్లే ఇప్పుడు అభిమానిస్తున్నారు. నా లైఫ్ స్టైల్ చూసి సంతోషపడుతున్నారు. ఈ ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మ లేదనే దిగులు వెంటాడుతూనే ఉంది. అమ్మా.. నువ్వు కోరుకుంటున్నట్టే గౌరవంగా బతుకుతున్నాను అని చెప్పాలనుంటుంది. – హర్షిణి -
సముద్రం మధ్యలో నిలిచిన చెన్నై వేట బోట్లు
సాక్షి, కోడూరు: చెన్నైకి చెందిన రెండు వేట బోట్లు సాంకేతిక సమస్య కారణంగా సముద్రం మధ్యలో నిలిచిపోయి మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరిన ఘటన హంసలదీవి సాగరతీరంలో చోటుచేసుకుంది. పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నైకు చెందిన నలుగురు మత్స్యకారులు, కాకినాడకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వారం క్రితం రెండు బోట్లలో సముద్రంలో వేటకు బయలుదేరారు. ఈ నెల 24వ తేదీ (శనివారం) సాయంత్రం పాలకాయతిప్ప సముద్రతీరానికి వచ్చే సరికి రెండు బోట్లు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోయాయి. దీంతో కంగారుపడిన మత్స్యకారులు ఆ రాత్రంతా బోట్లలోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆదివారం సముద్రం పాటు సమయంలో మత్స్యకారులు బోట్లలో ఉన్న కొన్ని పరికరాల సహాయంతో ఒడ్డుకు చేరారు. ఈ విషయాన్ని మత్స్యకారులు ఎవరికి చెప్పకుండా బోట్లలో ఏర్పడిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేసేందుకు విజయవాడకు వెళ్లారు. సోమవారం ఉదయం స్థానిక మత్స్యకారులు సముద్రంలో బోట్లు నిలిచి ఉండడాన్ని గమనించి విషయాన్ని పాలకాయతిప్ప మెరైన్ పోలీసులకు అందించారు. ప్రత్యేక పడవలో వెళ్లిన పోలీసులు మెరైన్ పోలీసులు సోమవారం ఉదయం ప్రత్యేక పడవలో నిలిచిన బోట్లకు వెళ్లారు. బోట్లలో ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. నలుగురు మాత్రమే బోట్లలో ఉండగా మిలిగిన వారు సామగ్రి కోసం విజయవాడ వెళ్లినట్లు మత్స్యకారులు పోలీసులకు తెలిపారు. వారి వద్ద మత్స్యకార గుర్తింపు కార్డులు ఉన్నట్లు మెరైన్ సీఐ పవన్‌కిషోర్ చెప్పారు. సముద్రంలో చోరబాటుదారులను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. తనిఖీకి వెళ్లిన వారిలో ఎస్ఐ జిలానీ, రైటర్ రెహమాన్ జానీ, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఉన్నారు. -
అవనిగడ్డలో పెరిగిన పాముకాటు కేసులు!
సాక్షి, అమరావతి: జీవన చక్రంలో ఒక జీవి.. మరో జీవికి ఆహారంగా మారడం గమనిస్తూనే ఉంటాం. వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల హల్చల్ అధికమవుతుంది. కప్పలు, క్రిమికీటకాలను వేటాడేందుకు సర్పాలు అధికంగా బయట సంచరిస్తాయి. ఈ కాలంలోనే పాము కాట్ల బారిన పడుతున్న మనుషుల సంఖ్య ఏటా పెరుగుతోంది. పాము కాటుకు గురికాకుండా ముందు జాగ్రత్తలు పాటించడం.. ఒక వేళ పాము కాటేసినా సకాలంలో వైద్యుడిని సంప్రదించడం వల్ల ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. వానాకాలం వచ్చిందంటే చాలు చిరు జల్లులు.. వాటితో పచ్చగా మారే పరిసరాలు.. ఆ పరిసరాల్లో ఏపుగా పెరిగే గడ్డి.. దాన్ని తినడానికి వచ్చే కీటకాలు.. వాటిని వేటాడటానికి వచ్చే కప్పలు.. దీంతో పాటే ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉండే కాలం.. ఈ ఆహ్లాదం వెనుకే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. విషసర్పాలు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా కాటేసి ప్రాణం మీదకు తెస్తాయి. అందుకే వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివాసాలు, ఆట స్థలాలు, ఖాళీ ప్రదేశాల్లో వర్షాకాలంలో గడ్డి, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. వీటి చాటున పాములు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి సాగించే కాలమిది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సందర్భంగా పాము కాట్లపై ప్రత్యేక కథనం. దివిసీమపై అధిక ప్రభావం వర్షాకాలం వచ్చిందంటే చాలు దివిసీమ వాసులకు కంటిపై కునుకులేకుండాపోతోంది. ఎప్పుడు ఎవరు పాము కాటుకు గురవుతారోనని భయపడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో పొలాల్లోకి వెళ్తున్న రైతులు, కూలీలు పాము కాటుకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 63 మంది పాము కాటు బాధితులు అవనిగడ్డ ఏరియా ఆస్పత్రిలో చేరారని సమాచారం. ఒక్క అవనిగడ్డ ఏరియా వైద్యశాలలోనే గత ఏడాది 350కి పైగా పాము కాటు కేసులు నమోదయ్యాయంటే వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గన్నవరం, మైలవరం ప్రాంతంలోనూ పాము కాటు ప్రమాదాలు తీవ్రత అధికంగానే ఉంటోంది. కొందరు గ్రామీణులు నాటు వైద్యులను సంప్రదించి కాలహరణం చేయడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. పెరిగిన పాముల సంతతి కొన్నేళ్లుగా దివిసీమలో పాముల సంతతి అమాంతం పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం వరి పొలాల్లో వాడే గుళికలను రైతులు మూడేళ్లుగా వాడకపోవడమేనని స్థానికులు పేర్కొంటున్నారు. పాముల సంతతి 2009లో వచ్చిన వరదల తర్వాత ఈ ప్రాంతంలో అధికమయ్యిందని, అప్పటి నుంచి ప్రతి ఏడాది వర్షాకాలంలో పాము కాట్లు అధికంగా ఉంటున్నాయని చెబుతున్నారు. మరోవైపు పాములను పట్టి అడవుల్లో వదిలే స్నేక్ లవర్స్ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో లేకపోవడం మరో కారణం. పాటించాల్సిన జాగ్రత్తలు.. పాములు సాధారణంగా ఎవరిని ఏమీ చేయవు. వాటికి కూడా ప్రాణభయం ఉంటుంది. వాటికి ప్రమాదమనిపించినప్పుడు, ఏకాంతానికి భంగం కలిగినా, తొక్కడం, వేటాడటం వంటి చర్యలకు ప్రతి స్పందనగా మాత్రమే కాటు వేస్తాయి. మనం ముందు జాగ్రత్తతో చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు. పొలానికి వెళ్లే రైతులు, రైతు కూలీలు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాత్రి వేళలో తిరిగే వారు, అక్కడే నిద్రించే వారు తమ వెంట తప్పనిసరిగా టార్చిలైట్ తీసుకెళ్లాలి. పొలాలు, గడ్డి వాముల్లో తిరిగే వారు మోకాళ్ల దాకా రక్షణనిచ్చే బూట్లను ధరించడం ఉత్తమం. చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. పొదలు, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలి. రైతుల కోసం పరిశోధనల ద్వారా బెంగళూరుకు ప్రసాదం ఇండస్ట్రీస్ వారు ‘స్నేక్ గార్డ్’ అనే ఒక కర్రను పోలిన యంత్రాన్ని కనుగొన్నారు. దీనిద్వారా వచ్చే అల్ట్రాసోనిక్ తరంగాలకు భయపడి పాములు దూరంగా పారిపోతాయి. వీటివల్ల రైతులకే కాక పాముల జాతికి కూడా మానవుల నుంచి రక్షణ లభిస్తుంది. పెట్రోల్, కిరోసిన్ వంటి ద్రావణాల వాసనలను పాములు భరించలేవు. తగు జాగ్రత్తలతో వీటిని ఉపయోగించి కొంత వరకు నిరోధించవచ్చు. ప్రథమ చికిత్స తప్పనిసరి పాము కాటుకు గురైన వ్యక్తికి పాము విషం కన్నా.. అతని భయమే ఎక్కువ ప్రమాదం తెస్తుంది. బాధితులకు పక్కనున్న వారు ధైర్యం చెప్పాలి. కాటు వేసిన చోటుకు పైభాగంలో వెంటనే తాడుతో మిగతా శరీరానికి రక్త ప్రసరణ జరగకుండా బిగించి కట్టివేయాలి. గాయం చేసి రక్తం కారనివ్వాలి. వీలైనంత వరకు కాటుకు గురైన వ్యక్తి నడిపించడం చేయరాదు. -
హృదయమా.. కుశలమా!
సాక్షి, లబ్బీపేట (విజయవాడ) : మూడు దశాబ్ధాల కిందట 55–60 ఏళ్ల వయస్సు వారిలో గుండెపోటు రావడం చూసే వాళ్లం. ఇప్పుడు 35–40 సంవత్సరాల వయస్సు వాళ్లు గుండెపోటుకు గురవుతున్నారు. అంటే 15 ఏళ్ల ముందే గుండె జబ్బులకు గురవుతున్నారు. అందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిళ్లు, జన్యుపరమైన లక్షణాలు ప్రధాన కారణాలని సీనియర్ కార్డియాలజిస్టులు చెబుతున్న మాట. గుండెజబ్బులపై సరైన అవగాహనతోనే నివారించగలమని వారు సూచిస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో గణాంకాలు ఇలా (ఏడాదిలో అంచనా) ⇒ 14 వేల మంది రక్తపోటు కారణంగా.. ⇒ 12 వేల మందిమధుమేహం కారణంగా.. ⇒ 40 వేలు గుండె జబ్బుల బారిన పడుతున్న వారు ⇒ 3 వేలుగుండెపోటు మరణాలు ⇒ 10 వేల మంది గుండెపోటుకు గురవుతున్నవారు గుండెపోటుపై అవగాహన అవసరం గుండెపోటు విషయంలో సరైన అవగాహన లేక పోవడంతో అధిక శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటుకు గురైన వారు గ్యాస్‌ట్రబుల్‌గా భావించి సకాలంలో వైద్యం చేయించుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈసీజీ సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో గుండెపోటును సకాలంలో నిర్ధారించడం కష్టతరంగా మారుతోంది. పట్టణ ప్రాంత ప్రజలు సైతం గుండెజబ్బుల విషయంలో అశ్రద్ధ చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుండె జబ్బుల విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఎంతో మేలని వైద్యులు సూచిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ► రక్తపోటుకు గురికాకుండా ఉండేందుకు ఆహారంలో ఉప్పు తగ్గించి తీసుకోవాలి. ఒకరు రోజుకు 2 గ్రాములకు మించి తీసుకోరాదు. అయితే ప్రస్తుతం 5 నుంచి 8 గ్రాములు వాడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. వారు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది. ► ప్రతి ఒక్కరూ అఆఇ (ఏబీసీ) మెయిన్‌టెన్ చేయాలి. అ హెచ్‌బీఎ1సీ 6.5 శాతానికి మించకూడదు. ఆ బీపీ 130/80, చెడు కొలస్ట్రాల్ 70 కన్నా మించకుండా చూసుకోవాలి. 1 శాతం హెచ్‌బీఏ1సీని అదుపుచేసుకోవడం ద్వారా హార్ట్ ఎటాక్ అవకాశాలు 14 శాతం తగ్గించుకోవచ్చు. ► అధిక క్యాలరీలు కలిగిన ఆహార పదార్థాలు, కొవ్వుశాతం అధికంగా ఉండే ఆహారం, నెయ్యి, నూనెలు అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. పీచు పదార్థాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ► మధుమేహం, రక్తపోటు ఉన్న వారు ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ► రక్తపోటు 120/80 నార్మల్ కాగా, 120–139, 80–89 ఉంటే రక్తపోటు వచ్చే అవకాశం ఉన్నట్లు గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. ► రోజుకు 45 నిమిషాలు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయరాదు ఛాతీలో నొప్పి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ఆస్పత్రికి వెళ్లి ఈసీజీ తీయించుకోవడం అవసరం. నొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయడం ద్వారా ఒక్కో సమయంలో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం చిన్న వయస్సులోనే గుండెజబ్బుల బారిన పడుతున్నారు. జబ్బు వచ్చిన తర్వాత చికిత్స పొందడం కన్నా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మధుమేహం, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వంటివి చేయాలి. మధుమేహం, రక్తపోటు ఉన్న వారు తరచూ గుండె పరీక్షలు చేయించుకుంటే మంచిది. సీటీ కార్డియాక్ యాంజియోతో ఐదేళ్ల ముందుగానే గుండెపోటు నిర్ధారించవచ్చు. – డాక్టర్ పర్వతనేని నాగ శ్రీహరిత, సీనియర్ కార్డియాలజిస్టు -
జగన్ నిర్ణయం అభినందనీయం: ఎస్పీ
సాక్షి, కృష్ణా : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తానని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సంవత్సరంలో 365 రోజులూ కష్టపడే పోలీసులకు వారాంతపు సెలవులను ప్రకటిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు నేటి నుంచే అమలు కానున్నాయి. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి పోలీసు శాఖలో వారాంతపు సెలవులు అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. తొలి రోజైన గురువారం జిల్లా వ్యాప్తంగా 277 మంది సెలవు తీసుకున్నారని, ఈ వీక్లీ ఆఫ్ ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ వారంతపు సెలవుల విషయంలో ఎటువంటి ఇబ్బంది రానివ్వమని, ఉన్న సిబ్బందితోనే పోలీసు సేవలను కొనసాగిస్తామని పేర్కోన్నారు. రాష్ట్రంలో పని ఒత్తిడికి గురవుతున్న పోలీసులకు వారాంతపు సెలకు కొంత ఊరటనిస్తుందని, ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని కొనియాడారు. -
పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
సాక్షి, కలిదిండి (కైకలూరు) : మండలంలోని పోతుమర్రు పంచాయతీ శివారు పరమానందునిపేటలో ఆదివారం ఓ గృహిణి తన ఇద్దరి పిల్లలతోపాటు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటనలో గృహిణి, ఓ చిన్నారి మృతి చెందగా, మరో బాలిక భీమవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కట్టా త్రిమూర్తులు భార్య అశ్విని (27) తన ఇద్దరి పిల్లలు కట్టా శర్వాణి (3), కట్టా కిరణ్ (1) లకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లోనే పురుగు మందు పోసి తనూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమాదాన్ని గ్రహించిన కుటుంబీకులు ముగ్గురిని కైకలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అశ్విని, కిరణ్ ప్రాణాలు కోల్పోగా శర్వాణి చికిత్స పొందుతోంది. ఇరుగు పొరుగు కథనం ప్రకారం కుటుంబ కలహాల వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. గుడివాడ పట్టణంలోని బేతవోలుకు చెందిన అశ్వినికి త్రిమూర్తులుతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. తన అత్తతో అశ్వినికి మనస్పర్థలు ఉన్నాయి. ఇటీవల కుమారుడు కిరణ్ బర్త్‌డే కూడా చేశారు. అయితే, అత్తాకోడళ్ల గొడవ వల్ల అశ్విని ఆత్మహత్యకు పాల్ప డిందని సమాచారం. త్రిమూర్తులు అన్న గోవర్థన్ గుడివాడలో కానిస్టేబుల్‌గా పని చేస్తాడని, వాస్తవాలు నమోదు చేయడంలో పోలీసులు వెనుకాడవచ్చని పలువురు అనుమానిస్తున్నారు. కలిదిండి ఎస్ఐ వై.సుధాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘యథా ప్రజా తథా రాజాలా ఉండాలి’
సాక్షి, విజయవాడ : కులం, మతం, డబ్బు ఓటుకు ప్రామాణికం కాకూడదని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఓటు అనేది చాలా శక్తిమంతమైనది. ప్రతీ ఒక్కరు ఎన్నికల్లో పాల్గొనాలి. సెలవు ఉన్నప్పటికీ పోలింగ్‌లో పాల్గొనకపోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిది. యథా రాజా తథా ప్రజాలాగా కాకుండా.. యథా ప్రజా తథా రాజా అన్న చందంగా మారాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్న యువత తప్పక ఓటింగ్‌లో పాల్గొనాలి’ అని వ్యాఖ్యానించారు. ఓటుతో మన భవిష్యత్తును మనమే నిర్మించుకుందాం అంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రంలో భాగంగా కొత్తగా ఓటు నమోదు చేసుకున్న యువతీ యువకులకు గవర్నర్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఓటరు దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన వారికి బహుమతులు అందజేయడంతో పాటుగా ప్రతీ పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రతిఙ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌తో పాటు సీఎస్ అనిల్ చంద్ పునీత, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబరు 1950 పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సూచించారు. ఓటు అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని... అందరి సహకారంతో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. ఓటరు నమోదుపై సందేహాల నివృత్తికై 1950 అనే టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
142వ రోజు ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర
సాక్షి, నూజివీడు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్రలో 142వ రోజు నూజివీడు శివారు నుంచి వైఎస్ జగన్ ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు జననేత వెంట అడుగులు వేస్తున్నారు. నూజివీడు నుంచి కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావచర్లకు వైఎస్ జగన్ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమౌతుంది. వడ్లమాను మీదుగా ఆగిరిపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్నబిడ్డ ఇక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ.. జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు.