legend movie
-
లెజెండ్ శరవణన్.. మళ్లీ వచ్చేస్తున్నాడు!
కోలీవుడ్ నటుడు లెజెండ్ శరవణన్ చాలా రోజుల తర్వాత మళ్లీ సందడి చేశారు. 2022లో 'లెజెండ్' మూవీ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా మరో సినిమాకు రెడీ అయిపోయాడు. తాజాగా షూటింగ్‌కు వెళ్తూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్లో షేర్ చేశారు.గతంలో వచ్చిన లెజెండ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా నటించింది. ఇందులో కథానాయికగా నటించేందుకు ఊర్వశి రౌతేలాకు భారీగానే రెమ్యునరేషన్ చెల్లించారు. అయితే ఈ మూవీ ఆశించినంత స్థాయిలో మెప్పించలేకపోయింది. తాజా చిత్రాన్ని హార్బర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించినున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీకి దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లెజెండ్ శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆండ్రియా, కిక్ శామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. గిబ్రాన్ సంగీతమందించనుండగా.. 2025 ఏప్రిల్‌లో ఈ చిత్రం పెద్ద ప్రేక్షకుల ముందుకు రానుంది.(ఇది చదవండి: 'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!)కాగా.. స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు.எனது அடுத்த படத்தின் படப்பிடிப்புக்காக #தூத்துக்குடி செல்லும் முன் ஊடகம் மற்றும் பத்திரிகையாளர் நண்பர்களை சென்னை விமான நிலையத்தில் சந்தித்த போது#LegendsNext #LegendSaravanan pic.twitter.com/RUWeGRYPKG— Legend Saravanan (@yoursthelegend) September 15, 2024 -
ఘనంగా బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీ పదేళ్లు వేడుక (ఫొటోలు)
-
రూ. 100 కోట్లు ఇచ్చినా సరే ఆ హీరోతో మాత్రం నటించనన్న నయనతార
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో నయనతార ఒకరు. ఒక్కో సినిమాకు ఆమె సుమారుగా రూ. 10 నుంచి 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారని ప్రచారం ఉంది. అయితే ఆమెకు రెట్టింపు రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ పలు సినిమాలను తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. తమిళనాడు వ్యాపార దిగ్గజం లెజెండ్ శరవణన్ సినిమాను నయనతార తిరస్కరించినట్లు ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం 'ది లెజెండ్'. ఈ సినిమా 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఉచితంగా టికెట్లు ఇచ్చినా కూడా సినిమాను ఎవడూ చూడలేని పరిస్థితి. ఈ మూవీకి నిర్మాత కూడా ఆయనే కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటెలా ఆయనకు జోడీగా నటించింది. కానీ ఆయన మొదట తన సినిమాలో హీరోయిన్గా నయనతార ఉంటే బాగుంటుందని ముచ్చట పడ్డారట. తన సినిమాలో కథానాయికగా ఉండాలని నయనతారను ఒప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. నయనతార ఇంటి ముందు ఎప్పుడూ రోల్స్ రాయిస్ కారు ఉండేదట.. ఆ కారు ఎవరిదో కాదట లెజెండ్ హీరో శరవణన్‌దే.. తన సినిమాలో హీరోయిన్గా నటించాలని పలుమార్లు ఆయన నయనతార ఇంటికి వెళ్లేవారట.. చెన్నైలో నయనతార ఉండే ప్రాంతం చాలా సెక్యూరిటితో నిండి ఉంటుందట.. అక్కడ ఎక్కువగా వీవీఐపీలు ఉండటంతో భారీగా భద్రతా వ్యవస్థ ఉంటుంది. అన్ని దాటుకుని ఆయన నయనతారతో మాట్లాడేందకు వెళ్లే వారట.. తన తొలి చిత్రంలో నయనతార జోడీగా నటించాలని ఆయన తీవ్రంగా కోరుకున్నారు. అందు కోసం ఆమెకు డబుల్ రెమ్యునరేషన్ ఇస్తానని ఆఫర్ చేశారట.. అందుకు నయనతార నో చెప్పి.. రూ. 10 కోట్లు కాదు వంద కోట్లు ఇచ్చినా నేను నటించనని డైరెక్ట్‌గానే చెప్పేసిందట.. ఆ కోపంలోనే బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌటేలాను శరవణన్ తీసుకొచ్చారని ప్రచారం ఉంది. బాలీవుడ్లో ఆమె తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుంది.. కానీ లెజెండ్ సినిమా కోసం ఆమెకు భారీ మొత్తంలో శరవణన్ చెల్లించారట. ఎవరీ శరవణన్..? చెన్నైలో ఆయనొక బిగ్ బిజినెస్‌మేన్.. శరవణ స్టోర్స్ అంటే తమిళనాడులో ఈ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్స్టైల్స్, జ్యువెలరీ స్టోర్స్‌తో పాటు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నగలు ఇలా శరవణ స్టోర్స్‌లో దొరకనిదంటూ ఏమీ లేదు. ఈ రిటైల్‌స్టోర్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన శరవణన్ సెల్వరత్నమ్ కుమారుడే అరుళ్ శరవణన్. చిన్నప్పటి నుంచి నటించాలని కోరికతో ఆయన ఒక సినిమాను తీశారు. అందుకోసం చెన్నైలోని అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు కూడా పూర్తి చేశారు. ఆయన కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, మోడల్‌గానూ రాణించాడు. ‘శరవణ స్టోర్స్’కు ఆయనే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. -
'జైలర్' పాటకు స్టెప్పులేసిన లెజెండ్.. డిఫరెంట్ గెటప్!
లెజెండ్ శరవణన్.. చాలా రోజుల తర్వాత మళ్లీ కనిపించాడు. గతేడాది 'లెజెండ్' మూవీతో ఎంటర్టైన్ చేసిన ఇతడు.. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. ఆ మధ్య ఓసారి కొత్త ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మాత్రం ఏకంగా రజనీ 'జైలర్' పాటకు స్టెప్పులేస్తూ కనిపించాడు. అయితే డిఫరెంట్ గెటప్‌తో ఉండేసరికి నెటిజన్స్ తొలుత గుర్తుపట్టలేదు. కానీ ఆ తర్వాత మాత్రం వీడియోని చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) స్వతహాగా బిజినెస్‌మ్యాన్ అయిన శరవణన్‌కు తమిళనాడులో చాలా క్లాత్ స్టోర్స్ ఉన్నాయి. అలానే తన బ్రాండ్‌కి తానే బ్రాండ్ అంబాసిడర్. గతంలో తమన్నా, హన్సిక లాంటి స్టార్ హీరోయిన్లతో కలిసి యాడ్స్‌లో యాక్ట్ చేశాడు. దీంతో హీరో కావాలని 'లెజెండ్' పేరుతో ఓ సినిమా తీశాడు. గతేడాది విడుదలైన ఈ మూవీ టాక్ ఏంటనేది పక్కనబెడితే ట్రోల్స్ మాత్రం విపరీతంగా వచ్చాయి. 'లెజెండ్' తర్వాత బయటపెద్దగా కనిపించని శరవణన్.. మళ్లీ ఇన్నాళ్లకు అది కూడా డిఫరెంట్ గెటప్‌లో ప్రత్యక్షమయ్యాడు. 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలువురు చిన్నారులకు గిఫ్ట్స్ ఇచ్చిన ఇతడు.. ఆ తర్వాత 'జైలర్'లోని హుకుమ్ పాటకు స్టెప్పులేసి అలరించాడు. అందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ లోనే పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అయింది. పలువురు నెటిజన్స్ ఈ వీడియోపై ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. அடுத்த படத்தின் அப்டேட்டை குழந்தைகளுடன் பகிர்ந்த தருணம்#Legend #Legendsaravanan @yoursthelegend pic.twitter.com/LocspXpDuX — Legend Saravanan (@yoursthelegend) August 15, 2023 (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) -
'లెజెండ్'కు 9అవార్డులు వస్తాయని నిరూపిస్తారా!
సాక్షి, హైదరాబాద్ : హింసాత్మక ప్రవృత్తితో కూడిన మూవీలు చేసే దర్శకుడు బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి అవార్డు ఇవ్వడం దారుణమని చిరంజీవి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి నాగేంద్ర అన్నారు. సుప్రసిద్ధ వ్యక్తి బీఎన్ రెడ్డి ఎన్నో విలువలతో కూడిన సినిమాలు తీశారు. ఇక్కడ బోయపాటికి బీఎన్ రెడ్డి గురించి తెలుసా. బోయపాటి ఏం చేశారని, ఆయన సినిమాలలో ఏం చూపించారని బీఎన్ రెడ్డి అవార్డు ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదంపై ఆయన మాట్లాడారు. 'మెగా హీరోలకు, వారి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని మేం చెప్పడం లేదు. అవార్డులు కావాలని అడగలేదు. కానీ, అసలు లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వస్తాయని ఎవరైనా నిరూపించగలరా. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఒపినియన్ పోల్ లాంటిది పెడితే.. ఆ సినిమాకు ఎన్ని అవార్డులొస్తాయన్న వాస్తవం బయటపడుతుంది. మనం సినిమా ఎంతో మంచి మూవీ. అందులో ఎన్నో విలువలున్నాయి. ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో అవార్డులు రావాల్సిన మనం మూవీకి కేవలం 'ద్వితీయ ఉత్తమ చిత్రం' అవార్డుతోనే సరిపెట్టారు. చివరిశ్వాస ఉన్నంతవరకూ నటిస్తానని చెప్పిన మహానటుడి చివరి చిత్రం 'మనం'. మనం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకపోవడం మహానటుడు ఏఎన్నార్ ను అవమానించడమే అవుతుంది. రుద్రమదేవి కోసం నటి అనుష్క ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ఆ మూవీకి సరైన గుర్తింపు దక్కలేదు. 'రుద్రమదేవి'లో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకోవాల్సిన అనుష్కకు 'సైజ్ జీరో'కు గానూ ఇవ్వడంలో అర్థం లేదు. ఎన్నో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బీఎన్‌రెడ్డి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మూవీలకూ సరైన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు ప్రధాన కారణమని' నాగేంద్ర అభిప్రాయపడ్డారు. మరోవైపు గుణశేఖర్, నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడం అల్లు అర్జున్ను అవమానించమేనని గుణశేఖర్ పేర్కొన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. 'నంది అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగింది. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారని' నిర్మాత బుజ్జి ప్రశ్నించారు. -
అవార్డులపై నమ్మకం పోతుంది : కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిభకు తగ్గట్లు అవార్డులు ఇచ్చారా ఆయన ప్రశ్నించారు. అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో అంటూ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు నెటిజన్లు ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికను విమర్శిస్తున్నారు. ఆ సినిమాలకు పలానా కేటగిరీలో ఎందుకు అవార్డులు ఇచ్చారన్నదానిపై కనీసం రెండు పేరాగ్రాఫ్ సమాచారం ఇవ్వాలన్నారు మూవీ క్రిటిక్ మహేశ్ కత్తి. అప్పుడైతే అవార్డు పలానా సినిమాకు ఎందుకిచ్చారో అర్థమవుతుందని, లేని పక్షంలో ఇండస్ట్రీతో పాటు ప్రజల్లోనూ అవార్డులపై నమ్మకం పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవం చెప్పాలంటే.. ఎవడే సుబ్రమణ్యం సూపర్ మూవీ. కానీ సామాజిక అంశాలున్న ఆ మూవీకి ఏ అవార్డు ఇచ్చారో చూడండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటి కీలక అవార్డులు రావాల్సిన మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం, తొలి చిత్ర దర్శకుడు అంటూ ఏదో ఇవ్వాలంటూ నామమాత్రంగా అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. లెజెండ్ మూవీకి తొమ్మిది అవార్డులిచ్చారు. అన్ని అవార్డులు ఎందుకిచ్చారో ఏపీ ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ఉత్తమ చిత్రం అవార్డు రావాల్సిన 'మనం' మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుతో సరిపెట్టారు. అవార్డులు ఇస్తున్నామంటే ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అవార్డ్ జ్యూరీ సభ్యులు, ప్రభుత్వం, ఇతరత్రా యంత్రాంగం గుర్తించాలి. ఇక్కడ అవార్డులు వచ్చిన ఏ మూవీకి జాతీయ, ఇతర సినీ అవార్డుల్లో అవార్డులు రావడం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మూడేళ్లకోసారి అవార్డులు ఇవ్వడం కంటే ప్రతి ఏడాది సంబంధిత అవార్డులు ఇస్తే ప్రేక్షకులకు ఓ అవగాహన వస్తుందన్నారు. -
నంది అవార్డ్సా.. నందమూరి అవార్డ్సా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఏపీ సర్కారు మంగళవారం సాయంత్రం నంది అవార్డులు ప్రకటించింది. ఈ మూడు సంవత్సరాలకు లెజెండ్, బాహుబలి, పెళ్లి చూపులు ఉత్తమ సినిమాలుగా, బాలకృష్ణ, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కారు రాజకీయంగా తమవారికే నందులు పంచిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబానికి అవమానం..! ముఖ్యంగా నంది అవార్డుల విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది. నంది అవార్డుల్లో మెగా హీరోలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అదీకాక రుద్రమదేవి సినిమాలో 'గోనగన్నారెడ్డి' పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి 'బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్' నటుడిగా నంది అవార్డు ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న యువ నటుడిని 'క్యారెక్టర్ ఆర్టిస్ట్'కు పరిమితం చేసి అవార్డు ఇవ్వడం ఏమిటి? అన్న వాదన వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు 'బెస్ట్ సోపోర్టింగ్ యాక్టర్' అవార్డు ఇస్తే న్యాయం జరిగి ఉండేదని, కానీ అందుకు భిన్నంగా అవార్డు ప్రకటించి అవమానించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. బన్నీ వాసు ఫైర్..! మెగా కుటుంబ అభిమాని.. గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ మేనేజర్ బన్నీ వాసు నంది అవార్డులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. "టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే.. తక్షణం చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ పొందాలి. నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు' అని బన్నీవాసు కామెంట్ చేశారు. మెగా అభిమానుల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ వ్యాఖ్యలు చాటుతున్నాయి. 'లెజెండ్' సినిమాకు 9 నందులా? బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'లెజెండ్' సినిమాకు నంది అవార్డుల్లో పెద్దపీట దక్కింది. ఈ సినిమాకు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్ మసాల కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నంది అవార్డుల జ్యూరీలో బాలకృష్ణ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇలా అవార్డులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సర్కారు ప్రకటించింది నంది అవార్డులా? నందమూరి అవార్డులా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 'నరసింహానాయుడు', 'శ్రీరామరాజ్యం' సినిమాలకుగాను బాలకృష్ణకు నంది అవార్డులు వచ్చినప్పుడు ఇదేవిధంగా విమర్శలు వచ్చాయి. 'మనం'కు అన్యాయం..! తెలుగు సినీ దిగ్గజం, లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా 'మనం'. ఈ సినిమాలో మూడు తరాల అక్కినేని నటులు నటించారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను కాదని తెరపై రక్తపాతం పారించిన 'లెజెండ్' సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ప్రకటించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలతో ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏఎన్నార్ నటించిన చివరి సినిమాకు ఇదా ఏపీ సర్కారు ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు ఇచ్చి సరిపుచ్చడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇందుకు నిరసనగా 'మనం' సినిమాకుగాను తనకు దక్కిన 'ఉత్తమ సహాయ నటుడు' అవార్డును బహిష్కరించాలని, ఈ అవార్డును నాగచైతన్య తీసుకోవద్దని అభిమానులు సూచిస్తున్నారు. 'రుద్రమదేవి'ని పట్టించుకోలేదు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతో శ్రమించి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన 'రుద్రమదేవి' సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని ఆ మధ్య గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 'రుద్రమదేవి' సినిమా నంది అవార్డుల్లో విస్మరణకు గురికావడం గమనార్హం అని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక, ఊపిరి, భలేభలే మగాడివోయ్ వంటి సినిమాలను అస్సలు గుర్తించకపోవడం, వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను విస్మరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను రాజకీయ కోణంలో ఏపీ సర్కారు పంపిణీ చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. "మేఘసందేశం" లాంటి క్లాసిక్ కు 9 నంది అవార్డులు, "లెజెండ్" లాంటి మాస్ ఎంటర్టైనర్ కు 9 నంది అవార్డులు. హతవిధీ!!! pic.twitter.com/jrHeGXojiF — GNR (@rao_goka) 15 November 2017 -
చరిత్ర సృష్టించిన బాలయ్య సినిమా
-
చరిత్ర సృష్టించిన బాలయ్య సినిమా
నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సరికొత్త రికార్డు నమోదు చేసింది. దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలో నాలుగు అంకెల రోజులు ప్రదర్శితమైన సినిమాగా చరిత్ర సృష్టించింది. సోమవారం నాటికి ఈ సినిమా 1005 రోజులు పూర్తి చేసుకుందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోని అర్చన ధియేటర్ లో నిర్విరామంగా వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుందని వెల్లడించారు. సౌత్ ఇండస్ట్రీలో ఈ ఘనత సాధించిన తొలి చిత్రంగా 'లెజండ్' నిలిచిందన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేశారు. తమ అభిమాన నటుడి సినిమా సక్సెస్ ఫుల్ గా వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడంతో ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. కేక్ కట్ చేసి, బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'లెజెండ్' సినిమా 2014, మార్చి 28న విడుదలైంది. జగపతిబాబు తొలిసారిగా ఈ సినిమాలో విలన్ గా నటించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. -
ఫస్ట్ టైమ్ ఆయన్ను చూసి షాక్ అయ్యా..!
-
'లెజెండ్' సక్సెస్ తో కొత్త శిఖరాలకు...
చెన్నై: 'లెజెండ్' విజయంతో టాలీవుడ్ లో తన స్థానం పదిలమైందని హీరోయిన్ సోనాల్ చౌహాన్ పేర్కొంది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులో అవకాశాలు పెరిగాయని వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ఘన విజయం సాధించడమే కాకుండా 400 రోజులు పూర్తి చేసుకుంది. ఈ విజయం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని సోనాల్ చెప్పింది. తెలుగు అభిమానులు తనను ఎంతో ఆదరిస్తున్నారని మురిసిపోయింది. వారి అభిమానాన్ని వర్ణించడానికి మాటలు రావడం లేదన్నారు. 'లెజెండ్' విజయం తన కెరీర్ కొత్త శిఖరాలకు తీసుకెళ్లిందని పేర్కొంది. తాజాగా 'పండగ చేస్కో' సినిమాలో నటించానని చెప్పింది. షేర్, సైజ్ జీరో సినిమాల షూటింగ్ తో బిజీగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుతం తన కెరీర్ రైట్ డైరెక్షన్ లో వెళుతోందని సోనాల్ చౌహాన్ పేర్కొంది. -
చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకున్నఎమ్మార్పీఎస్
కర్నూలు: ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ మూవీ విజయోత్సవ వేడుకలో పాల్గొనటానికి శనివారం ఎమ్మిగనూరు వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్ ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకుని తమ నిరసన గళం వినిపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ శ్రేణులు చంద్రబాబు కాన్వాయ్ ముందు ఆందోళన చేపట్టాయి. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
లెజెండ్ లో సన్నివేశాలు తొలగించండి: ఈసీ
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపూర్ ఎమ్యెల్యే అభ్యర్ధి, సినీనటుడు బాలకృష్ణ నటించిన 'లెజెండ్' సినిమాలో నాలుగు సన్నివేశాలను తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం తీసుకుంది. లెజెండ్ చిత్రంలో నాలుగు అభ్యంతకర సన్నివేశాలున్నట్లు ఈసీ గుర్తించింది. అభ్యంతరకరమైన సీన్లను తొలగించాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. హిందూపురం రిటర్నింగ్ అధికారి ద్వారా ఈసీ నోటీసులు పంపనుంది. 'లెజెండ్' చిత్రంపై చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ గురువారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో లెజెండ్ చిత్రం ప్రత్యేక షో వేశారు. లెజెండ్ చిత్రాన్ని రాష్ట్ర ఎన్నికల డిప్యూటి కమిషనర్ దేవసేన చూసి ఎన్నికల కమిషన్ కు నివేదిక సమర్పించారు. దేవసేన అందించిన నివేదిక అధారంగా నాలుగు సన్నివేశాలను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. -
'లెజెండ్' ప్రదర్శన ఆపండి
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. బాలకృష్ణ స్వయంగా పోటీలో ఉన్నందున లెజెండ్ సినిమాను నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వైఎస్సార్ సీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి దీని ప్రదర్శనను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం నేతలు ఆ జిల్లా కలెక్టర్‌కు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. -
‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి
-
హామీలపై వివరణలు సంతృప్తికరంగా లేవు: భన్వర్‌లాల్
పార్టీల మేనిఫెస్టోలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక: భన్వర్‌లాల్ సాక్షి, హైదరాబాద్: ఎన్నికల మేనిఫెస్టోల్లో పేర్కొన్న హామీలపై రాజకీయ పార్టీలు ఇచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ చెప్పారు. తెలుగుదేశం, లోక్‌సత్తా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వివరణలు కోరామని, అయితే వాటి నుంచి వచ్చిన వివరణలు సంతృప్తికరంగా లేవన్నారు. రుణాల మాఫీ పట్ల కొన్ని పార్టీలు వివరణ సంతృప్తిగా లేదని భావించి, తదుపరి చర్యలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక పంపించినట్లు చెప్పారు. గురువారం ఆయనిక్కడ మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక వచ్చిందన్నారు. ఆరోపణలు రుజువైతే చర్యల నిమిత్తం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని చెప్పారు. లెజెండ్ సినిమా డీవీడీ అందిన తరువాత సంబంధిత కమిటీ పరిశీలిస్తుందని వివరించారు. ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి ఫ్యాను గుర్తు కేటాయించడంపై మాట్లాడుతూ, ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాను గుర్తు ఇచ్చిన తరువాత స్వతంత్ర అభ్యర్థికి మళ్లీ అదే గుర్తును రిటర్నింగ్ అధికారి ఏవిధంగా కేటాయించారో తెలియదని, ఈ నేపథ్యంలో ఈసీకి నివేదిక పంపుతామని భన్వర్‌లాల్ తెలిపారు. -
‘లెజెండ్’ సినిమాను నిలిపేయండి
అనంతపురం: నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ ఆదినారాయణ శనివారం రాత్రి జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆ సినిమా కథానాయకుడైన బాలకృష్ణను తెలుగుదేశం పార్టీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఓటర్లు ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. లెజెండ్ సినిమా టీడీపీకి అనుకూలంగా ఉందని, అందులోని డైలాగులు, కథనం ఆ పార్టీకి ప్రచారం చేకూర్చేలా ఉన్నాయని వివరించారు. సీమాంధ్ర, తెలంగాణలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆ సినిమా ప్రదర్శనను నిలిపి వేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. బాలకృష్ణ టీడీపీ అభ్యర్థి అని తమకు బీ-ఫాం అందాక ఈ ఫిర్యాదును పరిశీలిస్తామని చెప్పారు. -
లెజెండ్‌ను కలవర పెడుతున్న సంపూ....
-
అభిమానులు నేను సీఎం కావాలనుకుంటున్నారు
సినీ నటుడు బాలకృష్ణ వెల్లడి సాక్షి, రాజమండ్రి/ విజయవాడ: తాను సీఎం కావాలని తన అభిమానులు కోరుకుంటున్నారని సినీ నటుడు బాలకృష్ణ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని అన్నారు. ఇటీవలి తన సినిమా ‘లెజెండ్’ విజయయూత్రలో భాగంగా మంగళవారం ఆయన రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ‘లెజెండ్’ విజయూనందంలో ఉన్నాన న్నారు. తనకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదంటూనే.. ఎమ్మెల్యేగా ఎక్కడినుంచి పోటీ చేయూలనే విషయం ఇక్కణ్ణుంచి వెళ్లాక తన బావ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా? లేక ఎంపీగా పోటీ చేయాలా? అనే అంశం చంద్రబాబు నిర్ణయిస్తారని బాలకృష్ణ తెలిపారు. తాను ఎక్కడ పోటీ చేసినా, ఏ పదవికి పోటీ చేసినా అభిమానులు పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలన్నారు. బాలకృష్ణ రాజమండ్రి వస్తున్నారని ముందుగానే తెలిసినా.. ఇటు విజయోత్సవ ర్యాలీలో కానీ మరెక్కడా టీడీపీ నాయకులెవరూ కనిపించలేదు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పరిమి వాసు మినహా తెలుగు తమ్ముళ్ళు దూరంగా ఉన్నారు. -
లెజెండ్’లో అంతరాయం అభిమానుల విధ్వంసం
స్క్రీన్ చింపివేత, కుర్చీలు ధ్వంసం హిందూపురం అర్బన్, న్యూస్‌లైన్: సినిమా ప్రదర్శనలో అంతరాయం చోటు చేసుకోవడంతో ఆగ్రహించిన అభిమానులు కుర్చీలు విరగ్గొట్టి, స్క్రీన్ చించి వేసి విధ్వంసం సృష్టించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని గురునాథ్ థియేటర్లో లెజెండ్ చిత్రం ప్రదర్శిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం మ్యాట్నీ ప్రదర్శిస్తుండగా, సాంకేతిక లోపం కారణంగా స్క్రీన్‌పై చిత్రం అదృశ్యమైంది. అర గంట గడిచినా చిత్ర ప్రదర్శన తిరిగి ప్రారంభం కాకపోవడంతో బాలకృష్ణ అభిమానులు థియేటర్ నిర్వాహకులతో వాదనకు దిగారు. వారు నచ్చజెప్పినా వినకుండా కుర్చీలను విరగ్గొట్టారు. హాలు బయట ఉన్న లైట్లు, క్యాంటీన్ అద్దాలు పగులగొట్టారు. కూల్డ్రింకు బాటిళ్లను థియేటర్లోకి విసిరారు. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొందరు స్క్రీన్‌ను కొద్దిగా చించివేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని అభిమానులను చెదరగొట్టారు. థియేటర్లో వేసిన ప్లాస్టిక్ కుర్చీలు విరిగిపోయాయి. రూ. లక్ష వరకు నష్టం వాటిల్లినట్లు క్యాంటిన్ యజమాని కుమార్ తెలిపారు. గొడవకు కారణమైన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
అభిమానులతో కలసి 'లెజెండ్' చూసిన బాలయ్య
హైదరాబాద్: తాను హీరోగా నటించిన 'లెజెండ్' సినిమాను నందమూరి బాలకృష్ణ అభిమానులతో కలిసి తిలకించారు. నిజాంపేటలోని భ్రమరాంబ థియేటర్లో ఆయన ఈ సినిమా చూశారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళి కూడా ప్రేక్షకులతో కలిసి 'లెజెండ్' సినిమాను వీక్షించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదలయింది. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, రాధిక ఆమ్టే హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ హీరో జగపతిబాబు ఈ సినిమాలో విలన్‌గా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా బాలకృష్ణ సినిమాకు సంగీతం అందించాడు. -
డైలాగ్ పవర్ ను పెంచేసిన బాలయ్య
-
'హీరోగా చేసి విలన్‌గా చేయడం కష్టం'
హైదరాబాద్: వంద సినిమాలు హీరోగా చేసి విలన్‌గా చేయడం కష్టమని నటుడు జగపతిబాబు అన్నారు. ఫ్యామిలీ హీరో ఇమేజ్ ఉన్న తనను దర్శకుడు బోయపాటి శ్రీను విలన్ చేశాడని అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన 'లెజెండ్' ఆడియో ఆవిష్కరణ కార్య్రమంలో జగపతిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈ సినిమాలో పనిచేయడంలో ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. 'లెజెండ్'లో బాలకృష్ణకు తాను విలన్ని అని, నిజజీవితంలో తాము స్నేహితులమని చెప్పారు. బాలయ్యకు తనకు చాలా పోలికలున్నాయని అన్నారు. సాధారణంగా తాము ఎవరికి జోలికి వెళ్లమని, కానీ తమ జోలికి వస్తే ఊరుకోబోమని వెల్లడించారు. బాలయ్య నిరాడంబరత తనకెంతో నచ్చిందన్నారు. లెజెండ్ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుండని ఆకాంక్షించారు. ఈ సినిమా తర్వాత తనకు విలన్‌గా అవకాశాలు పెరుగుతాయని జగపతిబాబు అన్నారు. -
'లెజెండ్' ఆడియోకు చంద్రబాబు డుమ్మా
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'లెజెండ్' సినిమా ఆడియో విడుదల అయింది. ఈ రోజు శిల్పకళా వేదికలో ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పలువురు ప్రముఖుల చేతులుగా పాటలను విడుదల చేశారు. బాలకృష్ణ వియ్యంకుడు చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి బాబు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండడం వల్లే చంద్రబాబు రాలేకపోయారని చెప్తుతున్నారు. అసలు చంద్రబాబును ఆహ్వానించలేదని సమచారం. బాలయ్య అల్లుళ్లు లోకేష్, శ్రీభరత్లతో పాటు బాలకృష్ణ, జగపతిబాబు, బోయపాటి శ్రీను, రాధికా ఆమ్టే, దేవిశ్రీ ప్రసాద్, దర్శకులు శ్రీనువైట్ల, బి.గోపాల్, సుకుమార్, రాజమౌళి, హంసానందిని హాజరయ్యారు. -
బాలకృష్ణ 'లెజెండ్' మూవీ పోస్టర్స్