lottery win
-
నిరుపేద డ్రైవర్‌కు లక్ష్మీ కటాక్షం!.. రాత్రికే రాత్రే రూ.30 కోట్లకు యజమాని
సాక్షి, జగిత్యాల(సారంగాపూర్): ఓ నిరుపేద యువకుడిని లక్ష్మీదేవి కరుణించడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి చెందిన ఓగుల అజయ్ అనే యువకుడు దుబాయ్‌లో కొన్న లాటరీ టికెట్ అతన్ని రూ.30 కోట్లకు యజమానిని చేసింది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. తుంగూరుకు చెందిన ఓగుల ప్రమీల– దేవరాజుది పేద కుటుంబం. వారికి గుంట వ్యవ సాయభూమి కూడా లేదు. దేవరాజు 2015లో మృతిచెందగా.. ప్రమీల తన ఇద్దరు పిల్లలు అజయ్, రాకేశ్‌ను కష్టపడి చదివించింది. అజయ్ నాలుగే ళ్లక్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఓ బంగారం దుకాణంలో డ్రైవర్‌గా పనికి కుదిరాడు. ఈ క్రమంలోనే 30 దిర్హాములతో రెండు ఎమిరేట్స్ లక్కీ లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అందులో నంబర్లు కలిపితే ప్రైజ్‌మనీ గెలుచుకోవచ్చు. అజ య్ ఆరు నంబర్లు కలపడంతో 1.50 కోట్ల దిర్హాము లు (రూ.30 కోట్ల రూపాయలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా అజయ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘మాది పేద కుటుంబం. నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ద్వారా రూ.30 కోట్లు గెలుచుకోవడం సంతోషంగా ఉంది’ అని తెలిపారు. -
రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా.. ఏకంగా 165 మందికి జాక్‌పాట్! ఎలా ?
న్యూఢిల్లీ: ఎవరైనా ఒక వ్యక్తికి అనూహ్యంగా ఏదైనా మంచి జరిగితే కలిసి వచ్చిన అదృష్టం అనుకుంటాం. కానీ అనుకోకుండా అదృష్ట దేవత తలుపు తట్టడంతో గ్రామంలో ఏకంగా 165మందికి జాక్‌పాట్ తగిలింది. బెల్జియంలోని ఒక గ్రామంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది. దీంతో క్రిస్మస్ ముందే వచ్చిందంటూ వారంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు. దాదాపు 165 మంది అకౌంట్లో ఏకంగా (15,11,83,056 డాలర్లు) ఒక్కొక్కరికీ రూ.7.50 కోట్లు జమ అయ్యాయి. ఇదేదో సినిమా స్టోరీలా అనిపించినా.. నిజంగా మిరాకిల్ జరిగింది. వివరాల్లోకి వెళితే ఆంట్వెర్ప్లోని ఉత్తర బెల్జియంలోని ఓల్మెన్ అనే చిన్న గ్రామానికి చెందిన 165 మంది వ్యక్తులు విజేతలుగా నిలిచారని యూరో న్యూస్ నివేదించింది. యూరో మిలియన్స్ లాటరీలో ఓల్మెన్ వాసులు దాదాపు 165 మందిని లాటరీ రూపంలో అదృష్టం వరించింది. ఓల్మెన్‌లో దాదాపు 4000 మంది జనాభా ఉండగా, ప్రతి 24 మందిలో ఒకరు విజేతలు. అయితే గ్రామానికి చెందిన ఒక్కొక్కరు కొంత మొత్తాన్నిచందాగా వేసుకుని ఉమ్మడిగా యూరో మిలియన్ లాటరీ టికెట్స్‌ను కొనుగోలు చేశారు. అంతే వారికి జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.1200 కోట్ల విలువైన నగదు గెలుచుకున్నారు. ఫలితంగా ఒక్కొక్కరి ఖాతాలో దాదాపు రూ.7.50కోట్లు జమయ్యాయి. దీంతో ఈ ఏడాది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ అంటూ ఆ 165 మంది ఆనందంతో మునిగి తేలుతున్నారు. గత కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలుచేస్తున్నప్పటికీ ఇప్పటికి అదృష్టం వరించింది, మరోవైపు లాటరీ గెల్చుకున్నవారంతా ఇప్పటికీ నమ్మలేకపోతున్నారని లాటరీ షాప్ యజమాని విమ్ వాన్ బ్రోకోవెన్ చెప్పాడు. ఇంతమందికి ఒకేసారి లాటరీ రావడం తనకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. విజేతలలో ఇరవై ఏళ్ల యువతి తనకు, తన కుక్కల కోసం ఇల్లు కొనాలని యోచిస్తోందని తెలిపాడు. ఇప్పటివరకు అతిపెద్ద గ్రూప్‌గా ఇంత పెద్దమొత్తంలోలాటరీ గెల్చుకోవడం ఇదే తొలిసారి అని బెల్జియం లాటరీ ప్రతినిధి జోక్ వెర్మోరే వ్యాఖ్యానించారు. అయితే విజేతల వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు. కేవలం 15 యూరోల పెట్టుబడికిగాను ఈ నగదును గెల్చుకోవడం సంచలనంగా మారింది. -
లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు ...కానీ భార్య, పిల్లలకు చెప్పకుండా..
ఒక వ్యక్తికి ఏకంగా రూ. 248 కోట్లు ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. కానీ ఈ విషయం తన భార్యకు పిల్లలకు చెప్పలేదట. పైగా చెబితే వారుకి ఎక్కడ అహంకారం నెత్తికెక్కి సోమరులుగా మారతారని చెప్పలేదంటున్నాడు. వివరాల్లోకెళ్తే...చైనాలోని ఒక వ్యక్తి లాటరీలో రూ. 248 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. అతను అక్టోబర్ 24న ఫ్రైజ్‌మనీని కలెక్ట్ చేసుకోవడమే కాకుండా దాదాపు రూ. 5 కోట్లు చారిటీలకు విరాళంగా ఇచ్చాడు. అతను ఈ డబ్బును తీసుకునేటప్పుడూ కూడా కార్టూన్ వేషంలో వచ్చి తీసుకున్నాడు. అత్యంత గోప్యంగా ఉండాలన్న ఉద్దేశంతో అలా చేసినట్లు వివరించాడు. ఆ తర్వాత అధికారులు సదరు వ్యక్తిని గ్వాంగ్సీ జువాంగ్ ప్రాంతానికి లీగా గుర్తించారు. తాను ఇంత పెద్ద మొత్తంలో డబ్బును గెలుచుకున్నట్లుతన భార్యకు, పిల్లలకు కూడా చెప్పలేదన్నాడు. ఇంత మొత్తంలో డబ్బు చూసి అహంకారంతో ఉండటమే గాక పిల్లలు సరిగా చదువుకోవడం మానేస్తారని చెప్పకూడదని నిర్ణయించుకున్నాడట. చైనా చట్టం ప్రకారం సుమారు రూ. 48 కోట్లు పన్నుల రూపంలో వెళ్లిపోగా దాదాపు రూ. 147 కోట్లు ఇంటికి తీసుకువెళ్లనున్నాడు. తాను గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా లాటరీ టిక్కెట్లు కొంటున్నానని, ఈ సారి మ్రాతం ఈ నెంబర్‌కి భారీ మొత్తంలో లాటరీ తగిలిందని లీ ఆనందంగా చెప్పుకొచ్చాడు. (చదవండి: గులాబీ కలర్ వేసినందుకు ఏకంగా రూ. 19 లక్షలు జరిమానా) -
ఇది కదా జాక్‌పాట్.. ఏడాదికి రూ.20 లక్షల చొప్పున జీవితాంతం
లాన్సింగ్: లాటరీలో అదృష్టం వరించిన వారికి ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు వస్తాయని అందరకీ తెలుసు. కానీ, ప్రతి ఏడాది లక్షల రూపాయలు జీవితాంతం లభిస్తే అది జాక్‌పాట్‌కే జాక్‌పాట్ అంటారు కదా? అలాంటి జాక్పాట్నే కొట్టేశాడు మిచిగాన్కు చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి. ఏడాదికి రూ.20లక్షల చొప్పున జీవితాంతం పొందే లాటరీని సొంతం చేసుకున్నాడు. ఆన్లైన్లో రాండమ్ నంబర్ జనరేటర్లో తన టికెట్‌పై ఉన్న నంబర్లను పొంది ఈ లాటరీ గెలుపొందనట్లు యూపీఐ పేర్కొంది. ఆయనే.. మిచిగాన్‌లోని వారెన్ ప్రాంతానికి చెందిన అరోన్ ఎసెన్‌మాచెర్(50). వారెన్ హ్యాపీ డేస్ పార్టీ స్టోర్‌లో సెప్టెంబర్ 15న లక్కీ ఫర్ లైఫ్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.‘నేను లక్కీ ఫర్ లైఫ్ ఆడాను. ప్రతిసారి ఒకే సెట్ నంబర్లను వినియోగించాను. నేను నా టికెట్ కొనుగోలు చేసినప్పుడు సాధారణంగానే సంఖ్యలను ఎంచుకున్నాను. తర్వాత ఆన్లైన్లో కనుగొన్న రాండమ్ సంఖ్యలను ఉపయోగించాలని నిర్ణయించుకున్నా. డ్రా తీసిన తర్వాతి రోజు నేను నంబర్లను తనిఖీ చేశాను. నేను ఐదు నంబర్లను సరిగా మ్యాచ్ చేసినట్లు తెలుసుకున్నాను. రాండమ్ నంబర్ జనరేటర్లో గెలుపొందిన నంబర్లే ఇక్కడా వచ్చాయి. దాంతో షాక్‌కు గురయ్యాను. ధ్రువీకరించుకునేందుకు నా టికెట్‌ను యాప్‌లో పలుమార్లు స్కాన్ చేసి చూశాను. అప్పుడు నిజంగానే వచ్చిందని తెలుసుకున్నా.’ అని తెలిపారు అరోన్ ఎసెన్‌మాచెర్. ఐదు తెల్లని బంతులపై 02-18-27-41-45 సంఖ్యలు రావటంతో అరోన్ ఎసెన్‌మాచెర్ ఈ జాక్‌పాట్ గెలుపొందారు. దీంతో ఏడాదికి 25వేల డాలర్లు(రూ.20లక్షలు) పొందేందుకు అర్హత సాధించారు. ఇవి 20 ఏళ్లు లేదా జీవితాంతం(ఏది మందుగా వస్తే అది) చెల్లిస్తుంది లాటరీ సంస్థ. అయితే, ఈ 20 ఏళ్ల పాటు చెల్లించే డబ్బులు మొత్తం రూ.3.2 కోట్లు ఒకేసారి ఇవ్వాలని అరోన్ కోరినట్లు లాటరీ సంస్థ పేర్కొంది. అప్పులు చెల్లించాలని, మిగిలిన వాటితో టూర్‌కు వెళ్లాలని చెప్పినట్లు తెలిపింది. లక్కీ ఫర్ లైఫ్ ఆడేందుకు కేవలం 2 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లైనా ఆడొచ్చు. ఈ గేమ్‌లో రోజుకు వెయ్యి డాలర్లు జీవితాంతం చెల్లించటం అతిపెద్ద ప్రైజ్. 1 నుంటి 48 నంబర్ల మధ్య ఐదు నంబర్లను సహా ఓ లక్కీ బాల్ 1-18 నంబర్లును మ్యచ్ చేస్తే గెలచుకోవచ్చు. అయితే, లక్కీబాల్ కాకుండా ఐదు నంబర్లు మాత్రమే సరిగా గుర్తిస్తే ఏడాదికి రూ.20 లక్షలు వస్తాయి. ఇదీ చదవండి: జర్నలిస్టులకు లక్షల్లో ‘క్యాష్ గిఫ్ట్‌లు’.. మరో వివాదంలో కర్ణాటక ప్రభుత్వం -
రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది
తిరువనంతపురం: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. అదృష్టం కలిసొచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి ఇలాగే జరిగింది. అయితే అతనికి కష్టం, అదృష్టం ఒకేసారి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుల్లో కూరుకుపోయి బాధపడుతున్న అతడ్ని అదృష్టం వరించి లక్షాధికారిని చేసింది. వివరాలు.. కొల్లాం జిల్లా మినగపల్లికి చెందిన ఓ మత్స్యకారుడికి భార్య, పిల్లలు ఉన్నారు. అవసరాల నిమిత్తం ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ. 9 లక్షలు లోన్ తీసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల అది తీర్చలేకపోయాడు. అక్టోబర్ 12న చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా ప్రభుత్వానికి చెందిన అక్షయ లాటరీ రూ.70 లక్షల విలువైన టికెట్ కొనుగోలు చేశాడు. తిరిగి మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి అతనికి బ్యాంక్ నుంచి నోటీస్ వచ్చింది. ఇంటిని తాకట్టు పెట్టి తీసుకున్న లోన్ డబ్బులు రూ.9 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు పంపించింది. లేకుంటే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొంది. బ్యాంక్ నోటీసులు చూసిన మత్స్యకారుడు తీవ్ర కుంగుబాటుకి లోనయ్యాడు. ఏం చేయాలో.. లోన్ డబ్బులు ఎలా కట్టాలో తెలియక తల పట్టుకున్నాడు. చివరికి ఇంటిని అమ్మి అయినా లోన్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది! అంతలోనే ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లువిరిశాయి. నోటీసులు అందుకున్న కొన్ని గంటల్లోనే అక్షయ లాటరీ టికెట్ దక్కినట్లు కాల్ వచ్చింది. రూ. 70 లక్షల విలువైన మొదటి బహుమతి గెలుచుకున్నట్లు చెప్పారు. దీంతో పీకల్లోతు అప్పుల్లో ఉన్న మత్య్సకారుడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ డబ్బుల గురించి మాట్లాడుతూ.. ముందుగా ఇంటి లోన్‌ను తీర్చనున్నట్లు తెలిపారు. అలాగే తమ పిల్లలకు మంచి చదువులు అందించి వారిని గొప్ప స్థాయిలో నిలబెట్టాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: వాట్సాప్‌లో మహిళా పోలీసులకు ప్రైవేటు ఫోటోలు.. చిక్కుల్లో డీఎస్పీ -
భార్య మాట విన్నాడు.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు!
వాషింగ్టన్: ఇంట్లో సరుకులు అయిపోయాయి వచ్చేటప్పుడు తీసుకురండి అనీ భార్య ఫోన్ చేస్తే చాలా మంది భర్తలు విసుక్కుంటారు. నువ్వే వెళ్లి తెచ్చుకో.. నాకు ఓపిక లేదని తెగేసి చెబుతుంటారు. కానీ, భార్య మాట విని చెప్పిన పని చేసిన ఓ భర్త జీవితమే మారిపోయింది. లాటరీలో ఏకంగా రూ.1.5 కోట్ల జాక్‌పాట్ తగిలింది. ఈ సంఘటన అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో జరిగింది. మిచిగన్ రాష్ట్రంలోని మార్క్వేట్ ప్రాంతానికి చెందిన ప్రిస్టోన్ మాకీ(46) అనే వ్యక్తికి ‘మిచిగన్ లాటరీ’లో 190,736డాలర్లు(రూ.1.5కోట్లు) గెలుచుకున్నాడు. అయితే, ఆ లాటరీలో డబ్బులు వచ్చేందుకు తన భార్య పంపిన మెసేజ్ కారణమని చెబుతున్నాడు ప్రిస్టోన్ మాకీ. ‘నేను నా విధులు ముగించుకుని తిరిగి వచ్చేటప్పుడు కిరాణ సరుకులు తీసుకురావాలని నా భార్య మెసేజ్ చేసింది. దీంతో వచ్చే దారిలో సరుకులు కొనేందుకు షాప్‌కి వెళ్లాను, అక్కడే 5 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాను. ఆ తర్వాతి రోజు ఉదయం, కిచెన్‌లో ఉన్న సమయంలో లాటరీ టికెట్లను మొబైల్ యాప్‌లో స్కాన్ చేశాను. నేనే జాక్‌పాట్ విన్నర్‌గా తెలుసుకున్నాను. అది ఊహించని పరిణామంగా అనిపించింది. ’ అని తెలిపారు ప్రిస్టోన్ మాకీ. లాటరీలో లభించే రూ.1.5 కోట్ల నగదులో కొంత తన పెట్టుబడుల కోసం ఉంచుకుని, మిగిలినది కుటుంబ సభ్యులకు పంచిస్తానని చెప్పారు ప్రిస్టోన్ మాకీ. కొద్ది రోజుల క్రితం ఓ వ్యక్తి సైతం ఈ విధంగానే రూ.15 కోట్ల జాక్‌పాట్ కొట్టినట్లు చెప్పాడు. తాను కిరాణ సరుకుల కోసం వెళ్లి టికెట్ కొనుగోలు చేయటం ద్వారానే లాటరీలో విజేతగా నిలిచానని తెలిపాడు. ఇదీ చదవండి: ఢిల్లీ నుంచే యూరప్‌లో ప్రధాని మోదీ కారు డ్రైవింగ్.. 5జీ సాయంతో.. -
133 కోట్ల డాలర్ల.. ‘మెగా’ జాక్‌పాట్!
షికాగో: అమెరికాలో ఇద్దరు అదృష్టవంతులు మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్ల జాక్‌పాట్ గెలుచుకున్నారు. జూలై చివర్లో ఓ పెట్రోల్‌బంక్‌లో కొన్న టికెట్‌ను ఈ అదృష్టం వరించిందని లాటరీ సంస్థ పేర్కొంది. ఏకమొత్త చెల్లింపు కింద విజేతలకు 78 కోట్ల డాలర్లు అందుతుంది. దాన్ని వారిద్దరూ పంచుకుంటారు. వారి కోరిక మీద పేర్లను గోప్యంగా ఉంచారు. ఇది అమెరికా చరిత్రలో మూడో అతి పెద్ద జాక్‌పాట్. గత ఏప్రిల్ నుంచి వరుసగా 29 డ్రాల్లో ఒక్కరు కూడా గెలుచుకోకపోవడంతో అది ఇంత భారీగా పెరిగిందట. ఇదీ చదవండి: రూ.2.3 లక్షల టిప్ ఇచ్చాడు.. తీసుకున్నాక సీన్ రివర్స్.. ఆమె ఆనందం ఆవిరి.. -
లాటరీలో ఏకంగా... రూ.10,588 కోట్లు!
వాషింగ్టన్: అమెరికాలో ఓ వ్యక్తికి మెగా జాక్‌పాట్ తగిలింది. లాటరీలో ఏకంగా 133.7 కోట్ల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో 10,588 కోట్ల రూపాయల పైమాటే! అమెరికాలో గత ఐదేళ్లలో అతి పెద్ద జాక్‌పాట్ ఇదేనట. మొత్తంగా చూసుకుంటే ఆ దేశ చరిత్రలో మూడో భారీ జాక్‌పాట్. ఈ సొమ్మును విజేతకు సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున 29 ఏళ్ల పాటు చెల్లిస్తారు. ఇలినాయీ రాష్ట్రంలోని కుక్ కౌంటీలోని ఓ స్టోర్‌లో అమ్ముడైన మెగా మిలియన్స్ లాటరీకి శుక్రవారం రాత్రి తీసిన డ్రాలో ఈ బంపర్ జాక్‌పాట్ తగిలింది. దీన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతుడెవరన్నదీ ఇంకా తెలియలేదు. -
ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ
కోజికోడ్: కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఓ వ్యక్తి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉండగా అదృష్టం లాటరీ రూపంలో వచ్చి కాపాడింది. తన సొంతింటిని మరికొద్ది గంటల్లో విక్రయించే సమయంలో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ తగిలింది. కోజికోడ్‌లోని మంజేశ్వర్‌కు చెందిన మహ్మద్ బవ(50) వృత్తిరీత్యా పెయింటర్. ఇతడికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. సుమారు 8 నెలల క్రితం 2వేల అడుగుల విస్తీర్ణంలో ఇంటిని ఎంతో ఇష్టంగా కట్టుకున్నాడు. అయితే, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్లు చేయడంతోపాటు కొడుకును ఖతార్ పంపేందుకు చేసిన రూ.50లక్షల అప్పులు మిగిలాయి. దీంతో, కట్టుకున్న ఇంటిని రూ.40 లక్షలకు అమ్మేందుకు సిద్ధపడ్డాడు. అయితే, ఇతడికి లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో నాలుగు టికెట్లు కొన్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిర్వాహకులు డ్రా తీయగా మహ్మద్‌కు జాక్‌పాట్ తగిలింది. కొద్ది గంటల్లో అడ్వాన్స్ కూడా తీసుకోవాల్సి ఉన్న సమయంలో ఇది జరిగింది. దీంతో మహ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. లాటరీ మొత్తంలో పన్నులు పోగా చేతికి రూ.63 లక్షలు అందనుంది. దీంతో, కలల ఇంటిని అమ్మే అవసరం అతడికి తప్పింది. ఇదీ చదవండి: ఒక్క రూపాయి డాక్టర్ సుషోవన్ ఇకలేరు -
అదృష్టమంటే అది.. కలలో వచ్చిన నెంబర్‌తో రెండు కోట్లు గెలుచుకున్నాడు..
ఇష్టమైన కలలు వచ్చినప్పుడు.. అవి నిజమవ్వాలని చాలా మందే కోరుకుంటారు. అవేవీ జరగవు. కానీ యూఎస్‌లో ఓ వ్యక్తి కల నిజమైంది. రెండు డాలర్లు పెట్టి టికెట్ కొంటే రెండు కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. అదెలా ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదివేయండి. వర్జీనియాలోని హెన్రికో కౌంటీకి చెందిన అలోంజో కోల్మాన్ రిటైర్డ్ ఉద్యోగి. అతనికి 13–14–15–16–17–18–19నంబర్ల లాటరీ కొంటే, అది గెలిచినట్టు కల వచ్చింది. కలే కదా అని కొట్టి పారేయలేదు. గ్రేటర్ రిచ్మండ్ రీజియన్‌లోని తన స్వస్థలమైన కార్నర్ మార్ట్ నుంచి కలలో వచ్చిన నంబర్లతోనే ఉన్న లాటరీ టికెట్ 13–14–15–16–17–18ను రెండు డాలర్లు పెట్టి కొన్నాడు. అప్పటినుంచి డ్రా తేదీ జూన్ 11కోసం ఎదురుచూస్తున్నాడు. ఆరోజురానే వచ్చింది. వెళ్లి చూస్తే... స్క్రీన్ మీద అతని లాటరీ నంబర్ 13–14–15–16–17–18, రెండున్నర లక్షల డాలర్లు గెలుపొందినట్టుగా ఉండటంతో అతని ఆనందానికి అవధులు లేవు. రూ.1,97,37,725లు, అంటే దాదాపు రెండు కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. అయితే తన కలలో వచ్చిన నంబర్ సెట్స్‌నే తాను కొన్నానని, ఆ లాటరీ టికెట్ తగలడం నిజంగా నమ్మలేకున్నానని చెప్పాడు కోల్మాన్. ఇటీవల, ఒక ట్రక్ డ్రైవర్కూడా ఇలాగే 7.9 కోట్ల జాక్‌పాట్ కొట్టాడు. -
‘డబుల్’ జాక్‌పాట్..
ఎవరికైనా భారీ లాటరీ తగలడమంటే మామూలు విషయం కాదు.. వేల మంది లేదా కొన్ని రకాల లాటరీల్లోనైతే లక్షల మంది టికెట్లు కొంటే వారిలో ఏ కొందరినో అదృష్టం వరిస్తుంటుంది. అలాంటిది ఒకరికే రెండోసారి కూడా లాటరీ తగిలితే..! అది కూడా మొదటిసారి కొన్న షాపులో మళ్లీ టికెట్ కొన్న వ్యక్తినే జాక్‌పాట్ వరిస్తే...! అమెరికాలోని దక్షిణ కరోలినా రాష్ట్రంలో ఓ మహిళకు ఇలాగే అదృష్టం కలిసొచ్చింది. 2020లో ఆ మహిళ 20 రెట్లు ప్రైజ్‌మనీ అందించే ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. కొందరు బంధువులతో కలసి వెళ్లి ఓ కన్వీనియన్స్ స్టోర్ ప్రతినిధుల నుంచి ఆ టికెట్ కొన్నది. చివరకు లక్కీడ్రా తీయగా ఆమెకు రూ. 1.9 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఎగిరి గంతేసిన ఆమె ఆ సొమ్ముతో తనకు నచ్చిన వస్తువులు కొనుక్కుంది. ఈ ఏడాది అదే లాటరీ సంస్థ మళ్లీ టికెట్లు అమ్మడంతో ఆవిడ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. గతంలో తన వెంట వచ్చిన బంధువులను మళ్లీ అదే స్టోర్‌కు వెంటబెట్టుకెళ్లింది. అలాగే తొలిసారి టికెట్ అమ్మిన ప్రతినిధుల చేతుల మీదుగానే మళ్లీ టికెట్ అందుకుంది. ఆశ్చర్యకరంగా ఆమెకు మళ్లీ జాక్‌పాట్ తగిలింది. ఈసారి లాటరీలో ఆమె రూ. కోటిన్నర గెలుచుకుంది. ఈ సొమ్ముతో మంచి ఇల్లు కొనుక్కుంటానంటూ ఎంతో మురిపెంగా చెప్పింది. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
అదృష్టం అంటే వీళ్లది.. రూ. 10కోట్ల జాక్‌పాట్ కొట్టేశారు
అదృష్టం ఉండాలేగానీ.. డబ్బు దానంతట అదే మనల్ని చేరుకుంటుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎలా ఎవరి తలుపు తడుతుందో ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన డా.ఎం ప్రదీప్, అతని బంధువు ఎన్ రమేశ్‌కు కేరళలో రూ.10కోట్ల లాటరీ తగిలింది. అయితే, వీరిద్దరూ కొద్ది రోజుల క్రితం విదేశం నుంచి వచ్చిన తమ బంధువును ఇంటికి తీసుకువచ్చేందుకు కేరళలోని తిరువనంతపురం విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కేరళ విషు బంపర్ లాటరీ టికెట్ నడుస్తోంది. ఈ క్రమంలో వారిద్దరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓ ఏజెంట్ వద్ద లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఇక, ఈ నెల 15వ తేదీన లాటరీ డ్రాలో ఊహించని రీతిలో వీరిద్దరికి జాక్‌పాట్ తగిలింది. డ్రాలో వీరి టికెట్‌కు రూ.10కోట్ల లాటరీ తగిలింది. ఈ క్రమంలోనే లాటరీ నిర్వాహకులు వీరిని విజేతలుగా ప్రకటించారు. దీంతో వారు సోమవారం లాటరీ భవన్‌కు వెళ్లి టికెట్‌తో పాటు అవసరమైన పత్రాలు సమర్పించి రూ.10 కోట్లు తీసుకెళ్లారు. ఇది కూడా చదవండి: 35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం -
England: లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
-
అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
లండన్: యూకేలోనే అతిపెద్ద యూరో మిలియన్స్ లాటరీని లండన్‌లోని గ్లూసెస్టర్‌కు చెందిన జంట గెలుచుకుంది. గురువారం నిర్వహించిన లక్కీడిప్‌లో జో(49), జెస్‌థ్వైట్(44) అనే దంపతులు సుమారు రూ.1,800 కోట్ల (184 మిలియన్ పౌండ్ల) జాక్‌పాట్ కొట్టేశారు. దీంతో, సాధారణ జీవితం గడుపుతున్న వీరు రాత్రికి రాత్రే కుబేరులైపోయారు. భరత జో.. కమ్యూనికేషన్స్ సేల్స్ మేనేజర్ కాగా, జెస్ హెయిర్ డ్రెస్సింగ్ సెలూన్ నిర్వహిస్తోంది. వీరికి స్కూలుకెళ్లే వయస్సున్న ఇద్దరు పిల్లలున్నారు. తమ కలలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం వచ్చిందని జో, జెస్ ఆనందం వ్యక్తం చేశారు. కాగా, 2019 అక్టోబర్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి 170 మిలియన్ పౌండ్ల భారీ లాటరీ గెలుచుకోవడమే ఇప్పటి దాకా రికార్డుగా ఉంది. ఈ రికార్డును జో జంట తుడిచిపెట్టారు. చదవండి: ఇదేం చిత్రం.. ముసుగు వేసుకుని వార్తలు చదవాలట! -
ఊహించని అదృష్టం.. పొరపాటున లాటరీ టికెట్ కొంటే.. కోటీశ్వరురాలిని చేసింది
రాత్రికిరాత్రే కోటీశ్వరులు అయిపోతే ఎలా ఉంటుంది? లక్ష్మీ దేవి కరుణించి ఒక్కసారిగా కాసుల వర్షం కురిపిస్తే.. అబ్బా ఆ ఊహే అద్భుతంగా ఉంటుంది కదా.. మరి అదే నిజమైతే.. మన కాళ్లు భూమ్మీద ఉంటాయా, ఆనందానికి అవధులుంటాయా.. సరిగ్గా ఇలాంటి ఆశ్చర్యకర ఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పొరపాటున తప్పుడు బటన్ నొక్కడంతో ఓ మహిళకు ఊహించని అదృష్టం వరించింది. కోట్ల రూపాయలు ఒళ్లో వచ్చిపడ్డాయి. వివరాలు.. కాలిఫోర్నియాకు చెందిన లాక్వెడ్రా ఎడ్వర్డ్స్ అనే మహిళ లాటరీతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుంది. గత ఏడాది నవంబర్‌లో 40 డాలర్ట విలువైన టికెట్ కొనుగోలు చేయాలనుకున్నారు. అయితే అప్పుడే ఓ వ్యక్తి అనుకోకుండా ఆమె మీద పడటంతో మహిళ లాటరీ మెషిన్లో తప్పుడు బటన్ నొక్కింది. దీంతో మహిళ కొనుగోలు చేయలనుకున్న లాటరీ టికెట్‌కు బదులు వేరే టికెట్ వచ్చింది. పైగా దానికి డబ్బులు ఎక్కువ చెల్లించాల్సి వచ్చింది. ఆమెను ఢీకొన్న వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండానే అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎడ్వర్డ్స్ ఆమె లాటరీ డబ్బులో 75 శాతం అనుకోకుండా ఒక టిక్కెట్‌కి వెళ్లడంతో పరిస్థితిని చూసి చికాకుపడింది. చదవండి: రన్‌వే మీద రెండు ముక్కలైన విమానం.. వీడియో అయితే ఆమె కోపం ఎక్కువ సేపు నిలవలేదు. జరిగిన పొరపాటుతో ఆమెకు అదృష్టం వరించింది. లాటరీ ఫలితాల్లో టికెట్‌ను స్క్రాచ్ చేయగా.. ఆమె 10 మిలియన్ల డాలర్ల(దాదాపు 75 కోట్లు) ప్రైజ్ మనీ గెలుచుకున్నట్లు గ్రహించింది. ముందు ఆ విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది. "నేను మొదట దానిని నిజంగా నమ్మలేదు. కానీ నేను టికెట్ చూస్తూ ఉండిపోయాను. మళ్లీ మళ్లీ చెక్ చేసుకున్నాను. నేనింకా షాక్‌లో ఉన్నాను." అని ఎడ్వర్డ్స్ చెప్పింది. నేను ధనవంతురాలిని అయిపోయానని సంబరపడిపోయింది. తనకొచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని, అందరికీ ఉపయోగపడే విధంగా ఓ సంస్థను ప్రారంభిస్తానని ఎడ్వర్డ్స్ తెలిపారు. -
అదృష్టాన్ని ఊహించగలమా?.. రూ. 44 కోట్లు గెల్చుకున్న లీనా
Kerala woman living in Abu Dhabi wins Big Ticket lottery Worth 44 Crores: నిజంగా అదృష్టాన్ని ఊహించగలమా? అలాంటి నమ్మకమే లేని ఓ యువతి.. సరదాగా తన కొలీగ్స్‌తో కలిసి టికెట్ కొన్న ఆ భారతీయ యువతికి జాక్‌పాట్ తగిలింది. అదీ కలలో కూడా ఆమె ఊహించని రేంజ్లో.. ఏకంగా 44 కోట్ల రూపాయల లాటరీ తగిలింది ఆమె టికెట్ మీద!. సౌదీ కంట్రీస్‌లో భారీ ప్రైజ్ మనీ లాటరీలు సర్వసాధారణం. అలాంటి జాక్‌పాట్ ఓ కేరళ యువతిని వరించింది. ఫిబ్రవరి 3న బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రా నిర్వహించారు. అందులో ఏకంగా 22 మిలియన్ల దీరామ్స్(మన కరెన్సీలో 44 కోట్ల 73 లక్షల 52 వేల 598 రూపాయల దాకా) ఆమె టికెట్ గెల్చినట్లు ప్రకటించారు. ఆమె పేరు లీనా జలాల్. లీనా స్వస్థలం కేరళ త్రిచూర్. అంజన్ గడి ప్రాంతానికి చెందిన ఆమె, ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా అబుదాబిలో ఉంటోంది. అబుదాబిలో షోయిదార్ ప్రాజెక్ట్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎల్ఎల్ సీ అనే కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తోంది. ఈ మధ్య తన పది మంది ఆఫీస్ సహచరులతో కలిసి Terrific 22 million series 236లో భాగంగా ఆమె టికెట్ కొన్నది. తాజాగా డ్రా తీయగా, లీనా జలాల్ కొనుగోలు చేసిన టికెట్ కు రూ.44 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కింది. అయితే, ఆ టికెట్ ను ఆమె తనతో పాటు ఆఫీసులో పనిచేసే మరో తొమ్మిది మందితో కలిసి కొనుగోలు చేసింది. దాంతో, ఆ ప్రైజ్ మనీని ఇప్పుడు వారందరూ పంచుకోనున్నారు. అయినప్పటికీ, ఒక్కొక్కరికి రూ.4 కోట్లు దాకా వస్తుంది. దీనిపై లీనా జలాల్ మాట్లాడుతూ.. లాటరీ తగిలిందని చెప్పగానే, తొలుత నమ్మలేకపోయానని వెల్లడించింది. తనకు మాటలు రావడంలేదని, దేవుడికి రుణపడి ఉంటానని తెలిపింది. అయితే, ఈ డబ్బును ఏంచేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని, కుటుంబ సభ్యులను అడిగిన తర్వాత నిర్ణయించుకుంటానని లీనా తెలిపింది. మరో నలుగురూ భారతీయులే.. బిగ్ టికెట్ అబుదాబీ వీక్లీ డ్రాలో లీనా కాకుండా గెలిచిన మరో నలుగురు కూడా భారతీయులే కావడం విశేషం. సెకండ్ ప్రైజ్‌ను సురాయిఫ్ సురు(2 కోట్ల రూ. పైగా), సిల్జోహ్న్ హోయాన్నన్ (కోటికి పైగా), నాలుగో ప్రైజ్ అన్జర్ సుక్కారియా(యాభై లక్షల రూ.), ఐదో ప్రైజ్ దివ్య (20 లక్షలరూ.) దక్కాయి. బంగ్లాదేశ్‌కు చెందిన నజీర్ అనే వ్యక్తికి రేంజ్ రోవర్ ఎవోక్యూ దక్కింది. మార్చి 3న ఈ ప్రైజ్‌మనీని, గిఫ్ట్‌ను అందించనున్నారు. -
వ్యాక్సిన్ వేయించుకుంది.. రూ 7.4 కోట్లు గెలుచుకుంది
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా అధికారులు రకరకాల అవగాహన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా తమ దేశంలోని ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకునేలా రకరకాల కార్యక్రమాలతో పాటు భారీ ప్రోత్సాహకాలను ప్రకటించింది. (చదవండి: అక్తర్‌కు పరువు నష్టం నోటీస్.. భజ్జీతో కనిపించినందుకే!) ఈ మేరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటే ఉచితంగా బీర్లు, ఆహారపదార్థాలు, లాటరీ వంటి టికెట్లను ఇస్తామంటూ రకకరాల ప్రోత్సహాకాలను అందించింది. అంతేకాదు ప్రజలందరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించే నిమిత్తం ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రవేట్ కంపెనీలు ఒక మిలియన్ డాలర్ వ్యాక్స్ అలయన్స్ లాటరీని రూపొందించారు. ఇది ప్రజలనుంచి విశేష స్పందన వచ్చింది. పైగా దాదాపు 30 లక్షల మంది ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవటమే కాక ఈ లక్కీ డ్రాలో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. అయితే చివరికి ఈ లక్కీ డ్రాని 25 ఏళ్ల ఝూ గెలుచుకంది. సదరు లక్కీ డ్రా అధికారులు చెప్పేంత వరకు ఆమెకు తెలియదు. దీంతో ఆమె ఈ డబ్బులో కొంత భాగం తమ కుటుంబ సభ్యుల కోసం వెచ్చించడమే కాక మిగిలి డబ్బుని భవిష్యత్తు అవసరాల కోసం ఖర్చుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. (చదవండి: దీపావళి పండుగ ముగింపు... ఒక వింతైన ఆచారం) -
ఉబర్ డ్రైవర్ని వరించిన రూ. 75 లక్షల లాటరీ
వాషింగ్టన్: లాటరీ తగలడమే అదృష్టం అందులోనూ ఆ లాటరీలో మరింత ఎక్కువ డబ్బు వస్తే ఇక ఆనందానికి అవధులే ఉండవు. పైగా చిన్నచితకా ఉద్యోగాలతో రోజంతా నిర్విరామంగా పనిచేసే వాళ్లకు లాటరీ తగలితే ఇక ఆనందం అంతా ఇంతా కాదు. అలాంటి అనుభవం ఒక ఉబర్ డైవర్కి ఎదురైంది. వివరాల్లోకెళ్లితే...అమెరికాలోని 69 ఏళ్ల ఒక ఉబర్ డ్రైవర్ పగలు రాత్రి రైడింగ్‌తో నిర్విరామంగా పనిచేస్తుంటాడు. (చదవండి: సంవత్సరాల తేడాతో ఒకే నెల ఒకే తేదిలో జన్మించినన ముగ్గురు అక్కాచెల్లెళ్లు) పెద్దగా ఆదాయం లేని విరామ సమయాన్ని ఈ ఉబర్ డ్రైవర్ మంచి లాభదాయకంగా మార్చుకున్నాడు. ఇంతకీ అతను ఆ సమయంలో ఏం చేశాడంటే....జోప్పాలోని ఓ దుకాణం వద్ద 10 డాలర్లతో లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేస్తూ డబ్బలు గడిస్తుండేవాడు. ఆ విధంగా అతను ఒకరోజు అనుకోకుండా 1000 డాలర్ల వెచ్చించి మరీ పెద్ద లాటరీ టికెట్లను కొనుగోలు చేశాడు. అయితే ఆరోజు అనుహ్యంగా లక్ష (రూ.75 లక్షలు) గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఉబర్ డైవర్ మాట్లాడుతూ.. "ఈ రోజు చాలా పవిత్రమైంది అంటూ నేను అరుస్తుంటే పక్కనే ఉన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారి బాగానే ఉన్నావా అంటూ విచిత్రంగా చూశాడు. ఆ తర్వాత నేను చూశావా నాకు లాటరీలో ఎంత తగిలిందో చూడు అంటూ ఆనందంగా చూపించాను. మిడిల్ రివర్ నుండి వచ్చిన నేను మేరీల్యాండ్ లాటరీ టికెట్ కంపెనీకి ఉబర్ డ్రైవర్‌గా ఐదేళ్లు నుంచి పనిచేయడమే కాక 24 వేల రైడ్లకు పైగా చేశాను" అని అన్నాడు. అంతేకాదు సదరు డ్రైవర్ ఈ డబ్బులో కొంతవరకూ తన కారును బాగుచేయించుకోవడానికి ఖర్చు పెడతానని అన్నాడు. (చదవండి: దయచేసి ఫోన్ ఎత్తి మేము సురక్షితంగా ఉన్నాం అని చెప్పండి!) -
ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ
డెస్ మెయినెస్(అయోవా): కాలిఫోర్నియా వాసి ఇంట్లో కనకవర్షం కురిసింది. అమెరికాలో లక్షలాది లాటరీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేల కోట్ల విలువైన ‘పవర్‌బాల్ లాటరీ’ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపు 70 కోట్ల డాలర్ల జాక్‌పాట్ కోసం సోమవారం రాత్రి తీసిన డ్రాలో మొత్తం ఆరు సంఖ్యలు సరిగ్గా మ్యాచ్ అయిన ఒకే ఒక్క లాటరీ టికెట్‌కు జాక్‌పాట్ తగిలింది. కాలిఫోర్నియాలోని మొర్రో బే ప్రాంతంలోని ఒక సరకు దుకాణంలో ఏవరో ఒక వ్యక్తి దీనిని కొనుగోలు చేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది. అయితే ఆ అదృష్టజాతకుడు/జాతకురాలు ఎవరనే పేరు, ఇతర వివరాలు మాత్రం ఇంకా బహిర్గతం కాలేదు. టికెట్ కొన్నది నేనేనంటూ ఇంత వరకూ ఎవరూ క్లెయిమ్ చేసుకునేందుకు ముందుకు రాలేదు. ఆ విజేత లాటరీ నగదును మొత్తంగా ఒకేసారి తీసుకోవాలంటే 49.6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.3,696 కోట్లు) మాత్రమే లాటరీ సంస్థ అందజేస్తుంది. అలాకాకుండా, విడతల వారీగా తీసుకునేందుకు లాటరీ విజేత ఒప్పుకుంటే ఆ విన్నర్‌కు ఏడాదికి ఒకసారి పెద్దమొత్తం ముట్టజెపుతారు. ఇలా 29 సంవత్సరాల పాటు ఇస్తారు. ఈ రెండు ఆప్షన్లలో ఏ ఒక్కదానికి ఒప్పుకున్నా సరే పన్నులు పోను మిగతా సొమ్ము ఆ వ్యక్తికి దక్కుతుంది. మరోవైపు దాదాపు 28 లక్షల మంది చిన్న స్థాయిలో నగదు బహుమతులు పొందారు. వీరిలో 4 డాలర్లు(దాదాపు రూ.300) మొదలుకొని 10 లక్షల డాలర్ల(దాదాపు రూ.7.45కోట్లు) వరకు సొమ్మును పొందనున్నారు. -
అదృష్టమంటే ఆమెదే: వంద పెట్టింది.. కోటి గెలిచింది
అమృత్సర్: అదృష్టమంటే ఆమెదే. రూ.వంద ఖర్చు చేసింది.. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. వస్త్ర వ్యాపారం చేసుకునే ఆమె ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆ అదృష్టం వరించింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్ గర్భిణి. భార్యాభర్తలు ఇద్దరూ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రేణు ఇటీవల రూ.100 పెట్టి లాటరీలో డీ-12228 టికెట్ కొనింది. ఈ లాటరీకి సంబంధించిన డ్రా ఫిబ్రవరి 11వ తేదీన తీశారు. ఆ డ్రాలో రేణు కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఆమెకు సమాచారం అందించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అవసరమైన పత్రాలు సమర్పించాలని లాటరీస్ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం కార్యాలయానికి చేరుకుని అవసరమైన పత్రాలు అందించింది. త్వరలోనే ఆమె బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నగదుతో తమ కష్టాలు తీరుతాయని రేణు చౌహాన్ తెలిపింది. లాటరీ నగదుతో తాము హాయిగా జీవిస్తామని హర్షం వ్యక్తం చేస్తూ రేణు చెప్పింది. -
పెళ్లికి వెళ్లి.. కోటీశ్వరుడై తిరిగొచ్చాడు..
సాక్షి, మండ్య: అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. మామూలు మనిషి కాస్తా కోటీశ్వరుడు కావచ్చు. నిజంగా అలాగే జరిగింది. కర్ణాటకలో మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని సోమనహళ్ళి గ్రామానికి చెందిన యువకునికి కేరళలో రూ.కోటి లాటరీ తగిలింది. శోహాన్ బలరామ్ అనే యువకుడు ఈ నెల 5వ తేదీన కుటుంబంతో కలిసి బంధువుల పెళ్లి కోసం కేరళకు వెళ్లాడు. అక్కడ శుభకార్యం చూసుకుని స్నేహితుడు దేవదాసు ప్రభాకర్ ఇంటికి వెళ్లాడు. దేవదాసు దుకాణంలో కేరళ భాగ్యమిత్ర లాటరీ టికెట్‌ను రూ.100 పెట్టి కొన్నాడు బలరామ్. తరువాత కుటుంబంతో కలిసి కారులో మండ్యకు బయల్దేరాడు. మధ్యాహ్నం 3.30 సమయంలో శోహాన్ మొబైల్‌కు ఫోన్ వచ్చింది. నువ్వు కొన్న టికెట్‌కు రూ. 1 కోటి లాటరీ వచ్చిందని మిత్రుడు చెప్పగా ఏదో తమాషా చేస్తున్నాడు అని నవ్వుకున్నాడు. కానీ వెంటనే టికెట్ తీసుకుని తిరిగి రా అని ఒత్తిడి చేయడంతో వెనుదిరిగాడు. డ్రాలో వచ్చిన నంబర్ చూసుకుంటే నిజంగానే లాటరీ తగిలింది. సుమారు 48 లక్షల మంది లాటరీ టికెట్ కొంటే అందులో ఐదుమందికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుందని స్థానికులు తెలిపారు. బలరామ్ సంతోషం పట్టలేక స్వీట్లు కొని పంచిపెట్టాడు. లాటరీ డబ్బుతో తమకున్న రైస్‌మిల్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటామని అన్నారు. -
అదృష్టమంటే ఇదే.. ఆరోసారి జాక్‌పాట్
వాషింగ్టన్ : లాటరీ ఆయన ఇంటి పేరుగా మారినట్టు ఉంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు లాటరీ గెలవగా తాజాగా ఆరోసారి కూడా లాటరీ గెలిచి వార్తల్లో నిలిచాడు. అన్ని లాటరీల్లో కన్నా ఆరోసారి లాటరీలోనే అత్యధికంగా నగదు సొంతం చేసుకున్నాడు. ఏకంగా 2,50,000 డాలర్లు సొంతం చేసుకున్నాడు. అది మన కరెన్సీలో అయితే 1 కోటి 82 లక్షలు. అయితే ఆయన లాటరీల్లో సొంతం చేసుకున్న నగదును సమాజానికి వినియోగిస్తుండడం అభినందించే విషయం. ఇంతకు అతనెవరో కాదు బ్రియాన్ మోస్ అనే వ్యక్తి అమెరికాలోని ఇదహో రాష్ట్రానికి చెందినవాడు. ఆయన తాజాగా క్రాస్ వర్డ్ స్క్రాచ్ గేమ్ ఆడాడు. ఆ గేమ్‌లో వచ్చిన లాటరీలో ఆయన 1 కోటి 82 లక్షల నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ సంస్థ నిర్వాహకులు ప్రకటించారు. అయితే అలా లాటరీల్లో గెలిచిన నగదును ఆయన విలాసాలకు కాకుండా సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. ఇదహోలోని ప్రభుత్వ పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సౌకర్యాల కల్పనకు వెచ్చిస్తున్నాడు. దాంతోపాటు తన కూతురి చదువు కోసం కొంత లాటరీ నగదును ఉపయోగిస్తున్నాడు. ‘‘ప్రభుత్వ విద్యాలయాల బాగుకు పని చేయడం నాకు గర్వంగా ఉంది. అందుకే లాటరీల్లో పాల్గొంటున్నా’’ అని బ్రియాన్ మోస్ తెలిపాడు. -
అదృష్టం అంటే ఇదేనేమో
లాటరీ అనే పదం మనకు ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. జీవితంలో ఒక్కసారైనా మనకు లాటరీ తాకపోతుందా అని మనం కూడా ఎదురుచూస్తూ ఉంటాం. కానీ కొందరికి అదృష్టం ఉంటే ఒకటి లేదా రెండు సార్లు లాటరీ తాకుతుంది. కానీ, మనం ఇప్పుడు చెప్పబోయే అతనికి మాత్రం ఏకంగా 160 టికెట్లకు లాటరీ తగిలింది. దీనిని నమ్మడానికి కష్టాంగా ఉన్న ఇది నిజం. వర్జీనియా చెందిన క్వామే క్రాస్ అనే వ్యక్తి డిసెంబర్ 5న నిర్వహించిన లాటరీ డ్రాలో 160 టికెట్లను కొన్నాడు. 1,3,4,7 అంకెలు కలిగి ఉన్న లాటరీలను కొన్నాడు. డిసెంబర్ 7న విడుదల చేసిన లాటరీ డ్రాలో తను కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగిలింది. (చదవండి: గూగుల్‌పై 73 లక్షల కోట్ల జరిమానా) 7314 కాంబినేషన్ తో ఉన్న ఎంచుకోవడానికి కారణం చెప్పాడు. అతను ఒక టీవీ షో చూస్తున్నప్పుడు 7314 నెంబర్ కి లాటరీ తాకే అవకాశం ఉందని చెప్పడంతో నేను అలానే చేశాను అని తను చెప్పాడు. తర్వాత తాను కొన్న ప్రతి లాటరీ తగిలిందని చెప్పడంతో చాల ఆశ్చర్యపోయాడు. ఇది కల నిజమా అని ఒకటి పది సార్లు చెక్ చేసుకున్నట్లు తెలిపాడు. అతను కొన్న 160 టికెట్ల బహుమతి విలువ మొత్తం $8,00,000 (రూ.5.89 కోట్లు). తను కొన్న ఒక్క టికెట్ అయిన లాటరీ తగిలితే ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ పెడదామని అనుకున్నాని చెప్పాడు. మరి ఇప్పుడు ఏకంగా రూ.5.89 కోట్లు గెలవడంతో అతను సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఆ డబ్బుతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదని క్రాప్ చెప్పుకొచ్చాడు. కొన్న ప్రతి టికెట్ కి లాటరీ తగలడంతో ఇతనిని అదృష్టానికే బ్రాండ్ అంబాసిడర్ అనాలేమో అని ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఇలాగే ఒక సంఘటనలో రేమండ్ హారింగ్టన్ అనే వ్యక్తి 25 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసి 25 సార్లు గెలిచి 1,25,000 డాలర్లు లభించాయి. -
యూఏఈలో భారతీయుడికి 20 కోట్ల లాటరీ
దుబాయ్: యూఏఈలోని ఉంటున్న భారతీయుడొకరు లాటరీలో భారీ మొత్తం గెలుచుకున్నారు. షార్జాలోని ఓ ఐటీ కంపెనీకి మేనేజర్‌గా పనిచేస్తున్న గుర్ప్రీత్ సింగ్(35) 10 మిలియన్ దిర్హామ్స్(సుమారు 19.90 కోట్లు) గెలుచుకున్నట్లు ఖలీజ్ టైమ్స్ తెలిపింది. పంజాబ్‌కు చెందిన గుర్ప్రీత్ ఆగస్టు 12వ తేదీన లాటరీ టికెట్ కొన్నారు. ఈ నెల 3వ తేదీన బిగ్ టికెట్ లాటరీ సంస్థ ప్రకటించిన ఫలితాల్లో గురుప్రీత్ సింగ్ జాక్‌పాట్ గెలుచుకున్నారు. రెండేళ్ల నుంచి బిగ్ టికెట్ లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్న గురుప్రీత్‌ను ఎట్టకేలకు అదృష్టం వరించింది. ఈ డబ్బుతో దుబాయ్‌లో ఇల్లు కొనుక్కుని, పంజాబ్‌లో ఉంటున్న వృద్ధ తల్లిదండ్రులను తీసుకువస్తానని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ చెప్పారు. -
ఆ డ్రైవర్‌కు రూ 2.6 కోట్ల జాక్‌పాట్..
షార్జా : కేరళకు చెందిన 43 ఏళ్ల డ్రైవర్‌కు అబుదాబిలో అదృష్టం వరించింది. ఓ మాల్లో నిర్వహించిన రాఫెల్ డ్రాలో కేరళ వాసి అబ్దుల్ సలాం షనవాస్కు ఏకంగా 2,72,260 డాలర్లు అంటే దాదాపు రూ 2.6 కోట్ల జాక్‌పాట్ తగిలింది. 1997లో తిరువనంతపురం నుంచి ఖాళీ చేతులతో కేరళ వచ్చానని, మరో 50 ఏళ్లు కష్టపడినా ఇంత సొమ్ము తనకు లభించదని షనవాస్ చెప్పుకొచ్చారు. డ్రైవర్‌గా పాతికేళ్ల నుంచి పనిచేస్తున్నా ఎక్కువ డబ్బు దాచలేకపోయానని, అబుదాబికి వచ్చిన తర్వాత నెలకు రూ 49,200 ఆర్జిస్తున్నానని అన్నారు. ఈ డ్రాలో ఎంట్రీ ఇచ్చేందుకు తాను 54 డాలర్లు వెచ్చించానని, తనను లాటరీ వరించిన విషయం ఎవరికీ చెప్పలేదని, తన భార్యకు మాత్రం భారీ సర్ప్రైజ్ ఎదురుచూస్తోందని చెప్పానని ఖలీజ్ టైమ్స్‌తో వెల్లడించారు. ఇక లాటరీ విజేతగా ఉద్విగ్న క్షణాలను ఎదుర్కొన్నానని..డ్రాలో నమోదైన తర్వాత తనకు వచ్చిన మొబైల్ మెసేజ్‌ను తాను డిలీట్ చేశానని, ఎస్ఎంఎస్ కనిపించకపోవడంతో గుండె ఆగినంత పనైందని, ఫోన్ నెంబర్ ఇతర వివరాలను సరిపోల్చుకున్న తర్వాత లాటరీ విజేతగా నిర్వాహకులు నిర్ధారించారని చెప్పారు. లాటరీ ద్వారా వచ్చే డబ్బుతో ఇటీవల తాను కొనుగోలు చేసిన స్ధలంలో మంచి ఇల్లు కట్టుకుంటామని షనవాస్ తన ప్రణాళికలు వెల్లడించారు. చదవండి : ఒక్క పోస్ట్... వంద రూపాలు