Lunar Eclipse
-
అర్ధ శతాబ్ది తర్వాత చంద్రుడిపై అమెరికా కన్ను
కేప్ కనావరెల్(యూఎస్): యాభై సంవత్సరాల తర్వాత అమెరికా చంద్రుడిపై పరిశోధనలకు నడుం బిగించింది. ఆర్టెమిస్ మిషన్ సన్నాహకాల్లో భాగంగా నాసా.. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ వారు తయారుచేసిన పెరీగ్రీన్ ల్యాండర్‌ను యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ వల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి పంపింది. సోమవారం ఫ్లోరిడాలోని కేప్ కనావరెల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. పలుమార్లు కక్ష్యలను మార్చుకుంటూ ఫిబ్రవరి 23వ తేదీన అది చంద్రుడిపై దిగనుంది. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో ఈ ల్యాండర్‌ను తయారుచేశారు. ల్యాండర్ తయారీలో ఆస్ట్రోబోటిక్కు అవకాశం ఇవ్వడం ద్వారా నాసా.. అంతరిక్ష ‘డెలివరీ’ సేవల రంగంలోకి ప్రైవేట్ సంస్థలను ఆహా్వనించినట్లయింది. చంద్రుడిపై దిగాక పెరీగ్రీన్ పలు పరిశోధనలు చేయనుంది. ఈ పరిశోధనలు ఈ ఏడాది చివర్లో నాసా నలుగురు వ్యోమగాములతో చేపట్టే ప్రయోగానికి సాయపడనున్నాయి. ఆస్ట్రోబోటిక్తోపాటు నోవా–సీ ల్యాండర్‌ను తయారుచేసేందుకు హ్యూస్టన్‌కు చెందిన ఇంట్యూటివ్ మెషీన్స్తోనూ నాసా ఒప్పందం కుదుర్చుకుంది. నోవా–సీను ల్యాండర్‌ను వచ్చే నెలలో స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా చంద్రుడి మీదకు పంపనున్నారు. నేరుగా ప్రయాణం కారణంగా పెరిగ్రీన్ కంటే ముందుగా వారం రోజుల్లోనే ఇది చంద్రుడిపై దిగనుంది. 1960, 70 దశకాల్లో చంద్రుడిపై విజయవంతంగా ల్యాండింగ్లతో అమెరికా, సోవియట్ యూనియన్లు పోటాపోటీగా ప్రయోగాలు చేపట్టడం తెల్సిందే. చంద్రుడిపై శోధనాపర్వంలో 2013లో చైనా, 2023లో భారత్ చేరాయి. గతేడాది రష్యా, జపాన్ ల్యాండర్లు విఫలమయ్యాయి. -
ముగిసిన గ్రహణం..తెరుచుకున్న ఆలయం
తిరుమల/ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ)/శ్రీశైలం/శ్రీకాళహస్తి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి మూతపడిన ప్రధాన ఆలయాలన్నీ ఆదివారం తెరుచుకున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వారి ఆలయం, ఉపాలయాలు, శ్రీశైల క్షేత్రాల్లో గ్రహణ కాలం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి చేపట్టారు. అనంతరం మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యాలను నివేదించి దర్శనాలకు అనుమతించారు. తిరుమలలో ఆదివారం ఉదయం తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదాలు అందించారు. గ్రహణానంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయం తెరవడంతో భవానీలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆదివారం ఉదయం శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తడంతో వారికి సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకుగాను గర్భాలయ అభిషేకాలు, సామూహిక అభిషేకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. శ్రీకాళహస్తిలో గ్రహణ కాల పూజలు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో గ్రహణకాల పూజలను శాస్త్రోక్తం గా నిర్వహించారు. గ్రహణాల సమయాల్లో రాష్ట్రంలోని అన్ని ఆలయాలను మూసివేసినా శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం తెరిచే ఉంటుంది. గ్రహణ కాల సమయంలో స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు ప్రత్యేకాభిõషేకాలు నిర్వహించారు. ఆదివారం వేకువజాము 1 గంటకు మొదటి కాలాభిషేకం, 1:45 గంటలకు రెండోకాలాభిషేకం, 2.30 గంటలకు మూడో కాలాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ అభిషేకాలకు భక్తులు పోటెత్తారు. -
ప్రముఖ ఆలయాలకు చంద్ర గ్రహణం ఎఫెక్ట్
-
తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. గ్రహణం కారణంగా నిన్న రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసివేస్తారు. ఉదయం 3:15 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం చేసి, ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న 47 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, హుండీ ద్వారా 3.03 కోట్లు ఆదాయం వచ్చింది. #WATCH | Tirupati, Andhra Pradesh: After the lunar eclipse, the Tirumala Tirupati Devasthanam officials reopened the Sri Venkateswara Shrine doors on Sunday morning, cleaned the temple according to 'Shastras' and started the Suprabhata Seva. Temple Deputy EO Lokanadam, Peskar… pic.twitter.com/JpyirpnnyR — ANI (@ANI) October 29, 2023 -
రేపే చివరి చంద్రగ్రహణం.. అస్సలు చేయకూడని పనులు ఇవే
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఆదివారం (తెల్లవారుజామున)ఏర్పడనుంది. పంచాంగం ప్రకారం..అక్టోబర్ 29న తెల్లవారు జామున 1:05 గంటలకు ఏర్పడే గ్రహణం 2:22 గంటల వరకూ ఉంటుంది.మొత్తం గంట 16 నిమిషాల పాటు గ్రహణ సమయం ఉంటుందని దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారని అర్చకులు చెబుతున్నారు. ఈ గ్రహణం భారతదేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కనిపిస్తుంది. గ్రహణ సమయాన్ని అశుభంగా పరిగణిస్తారు. సూతక్ కాలంలో ఎలాంటి శుభకార్యాలు చేయవద్దు. ఇది అశుభ ఫలితాలను ఇస్తుందని నమ్ముతుంటారు. మరి ఎలాంటి పనులు చేయకూడదు? గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏ పనులు చేయకూడదు? ►చంద్రగ్రహణం యొక్క దుష్ప్రభావాల కారణంగా ఆ సమయంలో తింటే ఆహారం కలుషితమై ఆరోగ్య సమస్యలు వస్తాయని నమ్మకం. ► గ్రహణం సమయంలో గోళ్లు, వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ► చంద్రగ్రహణం సమయంలో దేవతామూర్తుల విగ్రహాలు, దేవాలయాలు మొదలైన వాటిని తాకడం నిషిద్ధం. ► చంద్రగ్రహణం సూతకాల సమయంలో నిద్రించడం నిషేధం. అయితే, రోగులు, వృద్ధులు, పిల్లలకు దీని నుంచి మినహాయింపు ఉంది. ► గ్రహణ సమయంలో దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుందని అంటారు ► గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా నదీస్నానం లేదా ఇంట్లోనే స్నానం చేయాలి. ఏం దానం చేస్తే మంచిది? ► చంద్రగ్రహణం ముగిసిన తర్వాత కొన్ని వస్తువులను దానం చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని పండితులు విశ్వసిస్తారు. ► చంద్రగ్రహణం తర్వాత పాలను దానం చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతారని చెబుతారు. జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారని నమ్మకం. ► అన్నం, బియ్యాన్ని దానం చేసినా అది సత్ఫలితాలను ఇస్తుందని నమ్ముతారు. ► వెండిని దానం చేయడం వల్ల కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. ► చంద్రగ్రహణం తర్వాత పంచదారని నైవేద్యంగా సమర్పించడం వల్ల సానుకూల ప్రభావం చూపుతుందని, ఇది సంపదను, శ్రేయస్సును కలిగిస్తుందని భావిస్తారు. గర్భిణిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సూర్యుడు, చంద్రుడు కదలిక లేదా స్థాన మార్పు ఒక వ్యక్తి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం గర్భిణీలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గ్రహణం సమయంలో గర్భిణీలు చేయకూడని పనులను జ్యోతిష్య శాస్త్రంలో నొక్కిచెప్పారు. చంద్రగ్రహణం లేదా సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం సమయంలో బయటకు వెళ్లకూడదని అంటారు. దీనివల్ల పిల్లలు వైకల్యంతో పుడతారని నమ్మకం ఉంది. గ్రహణం గర్భిణీ స్త్రీలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని బలంగా విశ్వసిస్తారు. కత్తి వంటి పదునైన వస్తువులను ప్రెగ్నెంట్ స్త్రీలు ఉపయోగించరాదని చెబుతారు. గ్రహణ సమయంలో భోజనం చేయకూడదని, గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాల్సిందిగా పెద్దలు చెబుతారు. -
నేడు చంద్రగ్రహణం.. తిరుమల సహా ఆలయాలు మూసివేత
సాక్షి, హైదరాబాద్: నేడు శారద పూర్ణిమ రోజున చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణం ప్రభావం భారతదేశంపై ఉండనుంది. ఈ క్రమంలో అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుండి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. దీంతో, నేటి రాత్రి నుంచే అన్ని దేవాలయాల తలుపులను మూసివేస్తారు. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులను 8 గంటల పాటు మూసి ఉంచనున్నారు. ఇక, ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీన చివరి సూర్యగ్రహణం ఏర్పడగా ఇప్పుడు అక్టోబర్ నెలలో 28వ తేదీన చివరి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. చంద్రగ్రహణం కారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందే ఆలయం తలుపులు మూసివేయనున్నారు. రేపు తెల్లవారుజామున 3:15కు తిరిగి శ్రీవారి ఆలయాన్ని తెరవనున్నారు. చంద్రగ్రహణం కారణంగా 13 గంటలపాటు భక్తులకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు సహస్ర దీపాలంకారణ సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. కాగా, సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 63,404. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 26,659. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్లుగా ఉంది. తిరుమలలో ఇలా.. ఎనిమిది గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత గ్రహణం కారణంగా నేడు రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేత తిరిగి రేపు తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేత. విజయవాడలో ఇలా... పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా దుర్గగుడి మూసివేత నేటి సాయంత్రం 6:30 గంటలకు దుర్గగుడితో పాటు ఉపాలయాల కవాట బంధనం(తలుపులు మూసివేయబడును) గ్రహణ మోక్షకాలం అనంతరం రేపు తెల్లవారు జామున 3 గంటలకు తలుపులు తెరుస్తారు స్నపనాభిషేకాల అనంతరం రేపు ఉదయం 9 గంటల నుంచి భక్తులకు దర్శనాలు ప్రారంభం తెలంగాణలో ఇలా.. చంద్రగ్రహణం నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో పాటు, అనుబంధ ఆలయాల మూసివేత ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుంచి రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాల వరకూ ఆలయాల మూసివేత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన ఆలయాలైన వేములవాడ రాజన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్టు అంజన్న ఆలయాలను మూసివేస్తున్నట్టు అధికారుల ప్రకటన రేపు ఉదయం 3 గంటల 45 నిమిషాలకు సంప్రోక్షణతో ప్రాత:కాల పూజ చేసి తిరిగి తెరుచుకోనున్న ఆలయాలు. పూరీ క్షేత్రంలో భిన్నంగా.. గ్రహణ కాలం ముందుగా దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాల్లో దేవతారాధన, పూజలు జరగవు. ఆలయాలు తలుపులు మూసేస్తారు. దీనికి భిన్నం పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి రాత్రంతా తెరిచే ఉంటుంది. స్వామివారికి ప్రత్యేక సేవలు జరుగుతాయి. భక్తులు ఆలయంలో పురుషోత్తమునికి మౌన ప్రార్థనలు చేస్తారు. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేస్తారు. అనంతరం మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ తదితర సేవలు జరుగుతాయి. ►అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను అధికారులు మూసివేయనున్నారు. ►చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు ఆలయాలు మూసివేత ►తిరిగి రేపు ఉదయం 5:30 గంటలకు ఆలయ శుద్ధి, మహా సంప్రోక్షణ అనంతరం ఉదయం 9 గంటలకు మహా మంగళ హారతితో భక్తులకు దర్శనం ఇవ్వనున్న స్వామి, అమ్మవార్లు. ►నేడు చంద్రగ్రహణం సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సత్యదేవుని ఆలయం మూసివేత. ►తిరిగి రేపు ఉదయం 7.30 గంటలకు ఆలయాన్ని తెరువనున్నారు. ►అనంతరం స్వామివారి సర్వదర్శనాలు ప్రారంభం -
28న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయాన్ని పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఈ నెల 28న(శనివారం) మూసివేయనున్నారు. సుమారు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 గంటల నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఉండగా.. గ్రహణ సమయానికి 6 గంటల ముందు తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. తెల్లవారుజామున 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాతసేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. గ్రహణం కారణంగా 28న సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులకు కల్పించే స్వామివారి దర్శన సదుపాయాలను రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. -
28న యాదాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట: చంద్ర గ్రహణం సందర్భంగా ఈ నెల 28న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయ నున్నారు. గ్రహణం కార ణంగా ఒక్క రోజు ముందు అంటే 27వ తేదీన రాత్రి 7 గంటలకు శరత్ పౌర్ణమి వేడుకలను బ్రహ్మోత్సవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నారు. 28వ తేదీన సాయంత్రం 4 గంటలకే ఆలయాన్ని మూసివేస్తారు. ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలైన శ్రీపర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయం, పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను మూసివేయ నున్నారు. గ్రహణం పూర్తయిన తరువాత 29వ రోజున ఆలయాన్ని వేకువజామునే తెరిచి సంప్రోక్షణ నిర్వహిస్తారు. -
చంద్రుడి స్థలాలపై హక్కు ఎవరిది?
1967లో కుదిరిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం.. చందమామ సహా అంతరిక్షంలోని సహజ ఉపగ్రహాలు, గ్రహాలు, నక్షత్రాలపై ఏ వ్యక్తికీ, దేశానికీ హక్కులు ఉండవు. కానీ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ (ఐఎల్ఎల్ఆర్), లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌తోపాటు పలు ఇతర సంస్థలు వెబ్సైట్లు పెట్టి చందమామపై స్థలాలను అమ్ముతున్నాయి. చంద్రుడిపై మానవులు ఆవాసాలు ఏర్పర్చుకోవడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో కూడా తెలియదు. అయినా చాలా మంది వినూత్నంగా ఉంటుందనో, భిన్నమైన బహుమతి ఇవ్వాలనో, సరదాకో చంద్రుడిపై భూములను కొనుగోలు చేస్తున్నారు. బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ గతంలో చంద్రుడిపై స్థలాన్ని కొన్నట్టు చెప్పారు. 2009లో షారుక్‌ఖాన్ మహిళా వీరాభిమాని ఒకరు ఆయనకు చంద్రుడిపై స్థలాన్ని కొని బహుమతిగా ఇవ్వడం గమనార్హం. అయితే చంద్రుడిపపై సుమారుగా 43,560 చదరపు అడుగులు లేదా 4,047 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఎకరం ధర సుమారు 37.50 (భారత కరెన్సీ ప్రకారం 3,054) మరియు సూపర్‌స్టార్‌కు అక్కడ అనేక ఎకరాలు బహుమతిగా ఇచ్చారు. చదవండి: ప్రధాని బెంగుళూరు పర్యటన.. సీఎంని రావొద్దని నేనే చెప్పా: మోదీ కాగా ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి ఉపరితలంపై పాదం మోపిన సంగతి తెలిసిందే. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటలకు.. అంటే ఈ నెల 23న రాత్రి 10.04 గంటలకు ల్యాండర్ తలుపులు తెరుచుకున్నాయి. రోవర్ నెమ్మదిగా బయటకు వచి్చంది. ప్రజ్ఞాన్ ప్రస్తుతం చందమామ ఉపరితలంపై తన ప్రయాణం నిరాటంకంగా సాగిస్తోంది. అందులోని పేలోడ్స్ సైతం పని చేయడం మొదలైందని ఇస్రో వెల్లడించింది. ప్రొపల్షన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, రోవర్‌లోని అన్ని పేలోడ్స్ చక్కగా పని చేస్తున్నాయని హర్షం వ్యక్తం చేసింది. -
Solar Eclipse 2023: సూర్యగ్రహణం రోజు గర్భిణీలు ఈ పనులు చేయొద్దు..!
ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న, రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 14న ఉన్నాయి. ఈ రోజు గర్భిణీలు అసలు బయటకు రాకూడదని ప్రాచీన కాలం నుంచి విశ్వసిస్తున్నారు. గ్రహణం వల్ల కడుపులోని బిడ్డకు హానికరం అని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. అందుకే సూర్యగ్రహణం సమయంలో గర్భంతో ఉన్న మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆరోజు వాళ్లు ఏమేం చేయకూడదో చెప్పారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం.. గ్రహణం వేళ గర్భిణీలు చేయకూడనివి.. ► సూర్యగ్రహణం పూర్తయ్యే వరకు గర్భిణీలు ఇంటి లోపలే ఉండాలి. ఈ సమయంలో బయటకు వెళ్తే పట్టుబోయే బిడ్డకు, తల్లికి హానికరం అని ప్రాచీన విశ్వాసం. గ్రహణం నీడ మీద పడినా కూడా తల్లీబిడ్డలకు మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు. ► సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ అసలు చూడవద్దు. చూస్తే కళ్లతో పాడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ► గ్రహణం సమయంలో ఎలాంటి ఆహారం తినొద్దు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావం పడుతుందని విశ్వసిస్తారు. ఈ సమయంలో బాగా ఆకలివేసి తప్పనిసరిగా తినాల్సి వస్తే మాత్రం పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలని పెద్దలు సూచిస్తున్నారు. ► గ్రహణం సమయంలో వీరు నిద్ర కూడా పోవద్దు. ► సూదులు, కత్తెర్లు, కత్తులు వంటి వస్తువులను గ్రహణం సమయంలో అసలు ఉపయోగించవద్దు. ఇలా చేస్తే కడుపులోని బిడ్డపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ► కత్తులు, పదునైన ఆయుధాలను అసలు ముట్టుకోకూడదు. గ్రహణం సమయంలో కత్తితో పండ్లు, కూరగాయలు కట్ చేయడం వంటి పనులు చేస్తే.. బిడ్డ పట్టేటపుడు అవయవాలు చీలి పోతాయి. అంటే శిశువులు పెదాలు చీలి పోయి జన్మించడం వంటివి జరగవచ్చు. ► గ్రహణం సమయంలో శారీ పిన్నులు, హెయిర్ పిన్నులు, నగలు కూడా ధరించకూడదు. ► ఈ సమయంలో గర్భిణీలు దుర్వ గడ్డి(గరికె)పై మంచం వేసుకొని కూర్చుని సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తే మంచిది. ఈ విశ్వాసాలు నిజం కాదని శాస్త్రవేత్తలు చాలా ఏళ్లుగా వాదిస్తున్నారు. అయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. గ్రహణం అనేది సహజ చర్యకు విరుద్ధం కాబట్టి కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని, కానీ ఏమేరకు హాని కలుగజేస్తాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్యులు చెప్పేవి వాస్తవం కాదంటున్నారు. కాగా.. ఈ ఏడాది రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఏప్రిల్ 20న మొదటి, అక్టోబర్ 14న రెండో సూర్యగ్రహణం ఉంది. మే 5-6 మధ్య మొదటి చంద్ర గ్రహణం, అక్టోబర్ 28-29 మధ్య రెండో చంద్ర గ్రహణం ఉన్నాయి. అయితే మొదటి సూర్యగ్రహణం ఆస్ట్రేలియా, సౌత్, ఈస్ట్ ఆసియా దేశాల్లో మాత్రమే కన్పించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత్‌లో కన్పించకవోచ్చని పేర్కొన్నారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
గ్రహణంతో ఆలయాల మూసివేత
యాదగిరిగుట్ట/భద్రాచలం/బాసర (ముథోల్): చంద్ర గ్రహణం కారణంగా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు మంగళవారం మూతబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం ఉదయం మూసివేశారు. యాదాద్రిలో తెల్లవారుజామున సుప్రభాత సేవలు సహా ఇతర పూజల అనంతరం ఉదయం 6:15 గంటల నుంచి 7:30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించారు. ఉదయం 8:15 గంటలకు ఆలయాన్ని మూసేసి తిరిగి చంద్రగహణం ముగిశాక రాత్రి 8 గంటలకు తెరిచారు. శుద్ధి, సంప్రోక్షణ, ఇతర పూజలు నిర్వహించారు. ఇక భద్రాచలంలో ఉదయం 7:30 గంటలకు ఆలయాన్ని మూసేసి రాత్రి 7:30 గంటలకు పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ, శాంతిహోమం నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచి దర్శనాలు పునః ప్రారంభం అవుతాయని అధికారులు వెల్లడించారు. బాసరలోనూ ఉదయం పూజలు, నైవేద్య నివేదన అనంతరం అర్చకులు ద్వార బంధనం చేశారు. గ్రహణానంతరం రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణ చేశారు. ఆలయాల్లో మంగళవారం రద్దు చేసిన ఆర్జిత సేవలు, దర్శనాలు బుధవారం ఉదయం నుంచి కొనసాగుతాయని అధికారులు తెలిపారు. -
Lunar Eclipse: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి?
సాక్షి, భువనేశ్వర్: దేశవ్యాప్తంగా మంగళవారం చంద్రగ్రహణం కనువిందుచేసింది. ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించగా.. కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపించింది. కొందరు అనాదిగా వస్తున్న కొన్ని ఆచారాలను పాటించగా, మరికొందరు వాటిని లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలో రెండో చోట్ల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాజధాని భువనేశ్వర్‌లోని లోహియా అకాడెమీలో హేతువాద వర్గం నేడు (చంద్రగ్రహణం) బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించింది. విషయం తెలుసుకున్న సంప్రదాయవాదులు అక్కడకు చేరుకుని చంద్రగ్రహణం రోజున వండిపెట్టిన ఆహారాన్ని తినడమేంటని అభ్యంతరం తెలిపారు. పూర్వ కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని మంటగలుపుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో బిర్యానీ ఫెస్టివల్ నిర్వహిస్తున్నవారిపై సంప్రదాయవాదలు దాడికి పాల్పడ్డారు. హేతువాదులపై ఆవుపేడ, రాళ్లతో దాడి చేశారు. (చదవండి: Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం) సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని లాఠీలకు పనిచెప్పారు. ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బెర్హాంపూర్లోనూ ఇలాంటి వెలుగుచూసింది. బిర్యానీ ఫెస్టివల్ నిర్వహణను సంప్రదాయవాదులు అడ్డుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను ధ్వంసం చేశారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసుల రాకతో పరిస్థితి సద్దుమణిగింది. సంప్రదాయవాదులు అంటున్నట్టుగా నిల్వ ఉంచిన ఆహారాన్ని స్వీకరిస్తే చెడు ప్రభావాలేమీ ఉండవని హేతువాదులు చెప్తున్నారు. అర్థంలేని ఆచారాలను పాటించాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి సూర్యగ్రహణం రోజున కూడా భువనేశ్వర్‌లో సంప్రదాయవాదులు, హేతువాదుల మధ్య బిర్యానీ పంచాయితీ వివాదానికి దారితీసింది. (చదవండి: చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..) -
ప్రపంచవ్యాప్తంగా కనువిందుచేసిన చంద్రగ్రహణం (ఫొటోలు)
-
Lunar Eclipse 2022: దేశవ్యాప్తంగా వీడిన చంద్రగ్రహణం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా చంద్రగ్రహణం వీడింది. కొన్ని నగరాల్లో సంపూర్ణంగా, మరికొన్ని నగరాల్లో పాక్షికంగా గ్రహణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 5:40 నిమిషాల నుంచి చంద్రగ్రహణం కనిపించింది. మొత్తంగా 39 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమై సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. గౌహతిలో అత్యధికంగా గంటా 43 నిమిషాల పాటు గ్రహణం కనిపించింది. దేశవ్యాప్తంగా గ్రహణ సమయం ముగియడంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరచుకుంటున్నాయి. మళ్లీ మార్చి 14, 2025న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇక ఇదిలా ఉంటే, ఒడిశాలో మాత్రం గ్రహణం ఉద్రిక్తతలకు దారితీసింది. హేతువాదులు, భజరంగ్‌దళ్ కార్యకర్తల మధ్య రగడ జరిగింది. చంద్రగ్రహణం రోజున చికెన్ బిర్యానీ ఫెస్టివల్ నిర్వహించడంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. -
చంద్ర గ్రహణం.. భారత్‌లో దీని ప్రభావమెంతంటే..
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈరోజు(నవంబరు8వ తేదీ) చంద్ర గ్రహణం ఏర్పడటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణం కాబట్టి దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు. ఏది ఏమైనా ఈ గ్రహణం ఏ సమయంలో సంభవించనుంది, ఏయే దేశాల్లో కనిపించనుందో చూద్దాం. ఈ రోజు ఏర్పడే చంద్ర గ్రహణం ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, ఫసిఫిక్, అట్లాంటిక్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా, అందులో సంపూర్ణ చంద్ర గ్రహణం 3.46 నుంచి సాయంత్రం 5.12 గంటల వరకు ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గంటల 40 నిమిషాలు పట్టనుంది. భారత్‌లో చంద్ర గ్రహణం ఏర్పడే సమయం పగటి పూట కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. కాగా, భారత్‌లో ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉండగా, కోల్‌కతా, భువనేశ్వర్, ఢిల్లీ, శ్రీనగర్, చెన్నై, గాంధీ నగర్, ముంబై వంటి ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. సాధారణంగా పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు. ఎందుకంటే పౌర్ణమి సందర్భంగా సూర్యుడు, భూమి, చంద్రుడు కచ్చితంగా ఒకే సరళ రేఖపైకి రావని నిపుణులు చెబుతున్నారు. భూమి కక్ష్య, చంద్రుని కక్ష్య పరస్పరం 5 డిగ్రీల కోణంలో వంగి ఉండడమే అందుకు కారణమని వారు విశ్లేషిస్తున్నారు. -
చంద్రగ్రహణం.. 12 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8:40 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. తిరిగి రాత్రి 7:20 గంటలకు మహాద్వారాలు తెరుచుకోనున్నాయి. సుమారు 12 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేయనుంది. రాత్రి 8 గంటలకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. మరోవైపు.. టీటీడీ అధికారులు వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. ఆలయం తిరిగి సాయంత్రం 6:30 గంటలకు తెరుచుకోనుంది. -
యాదాద్రి ఆలయం బంద్
యాదగిరిగుట్ట: సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 8.15 నుంచి రాత్రి 8గంటలకు వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం 2.37 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు సంపూర్ణ చంద్ర గ్రహణం ఉన్నందున ఆలయ వేళల్లో మార్పులు చేశారు. మంగళవారం వేకువజామున 3 గంటలకు ఆలయాన్ని తెరిచి, సుప్రభాతం తదితర సేవల అనంతరం 6.15 నుంచి 7.30 వరకు ఉభయ దర్శనాలు కల్పించనున్నారు. అనంతరం ద్వార బంధనం చేస్తారు. చంద్రగ్రహణం పూర్తయిన తరువాత రాత్రి 8గంటలకు ఆలయాన్ని తెరచి సంప్రోక్షణ, ప్రాయశ్చిత్త హోమం, నవకలశాభిషేకం, ఆరాధన, అర్చన, నివేదన, చాత్మర చేపట్టి, రాత్రి 10 గంటలకు శయనోత్సవం నిర్వహించి, ద్వార బంధనం చేస్తారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీస్వామి వారికి అన్నకూటోత్సవాన్ని లాంఛనంగా నిర్వహిస్తారు. చంద్రగ్రహణం సందర్భంగా నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం, ఊరేగింపు సేవలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే, స్వామి వారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలు, వాహన పూజలు సైతం ఉండవని వెల్లడించారు. ఈ పూజలన్నీ 9వ తేదీన యథావిధిగా కొనసాగుతాయన్నారు. -
గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్లే బిడ్డకు అలా జరుగుతుందా?
Health Tips: గర్భిణులు గ్రహణ సమయంలో బయట తిరగడం వల్ల వారికి పుట్టబోయే బిడ్దలకు గ్రహణ మొర్రి వస్తుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. వాస్తవం ఏమిటంటే.. గ్రహణ మొర్రి అనేది గ్రహణ సమయంలో గర్భిణులు సరిగా ఉండకపోవడం వల్ల వస్తుందనే దానిలో ఎటువంటి శాస్త్రీయతా లేదు. గ్రహణ మొర్రి అనేది బిడ్డ పిండ దశలో ఉండగానే ఏర్పడే ఓ అవకరం. దాదాపు ప్రతి 1000 జననాల్లో ఒకరికి ఇలా గ్రహణం మెుర్రి రావడం మామూలే. పిండం ఎదిగే సమయంలో దాదాపు ఆరు నుంచి పది వారాలప్పుడు బిడ్డలో తల భాగం రూపొందుతుంది. ఈ సమయంలో ఒక్కోసారి బిడ్డలోని రెండు పెదవులు, అంగిలి కలవవు. అలాంటప్పుడు బిడ్డలో ఈ మెుర్రి ఏర్పడుతుంది. అయితే... శస్త్రచికిత్స ప్రక్రియలు బాగా అడ్వాన్స్ అయిన ప్రస్తుత సవుయంలో ఇప్పుడిది సవుస్యే కాదు. శస్త్రచికిత్స ద్వారా ఈ గ్రహణం మెుర్రి సవుస్యను సవుర్థంగా చక్కదిద్దవచ్చు. గర్భం ధరించి ఉన్నప్పుడు గ్రహణం సంభవిస్తే అసలు దాని గురించి ఎలాంటి ఆందోళనా పడాల్సిన అవసరమే లేదు. అలాగని గ్రహణ సమయంలో ప్రత్యేకించి బయట తిరగమని చెప్పడం కాదు. అనుమానాలు, అపోహలు మాని మామూలుగానే ఉండవచ్చునని చెప్పడమే ముఖ్యోద్దేశం. -(చంద్రగ్రహణం రానున్న నేపథ్యంలో) చదవండి: Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. Health: పొద్దు పొద్దున్నే ఇబ్బంది.. మలబద్దకానికి కారణం ఏమిటి? పరిష్కారాలు.. ఉడికించిన పప్పు తింటే -
సూర్య, చంద్ర గ్రహణ రోజుల్లో.. 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ మేరకు బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కాగా, తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లు నిండాయి. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. -
చిటికెడు మట్టి రూ.4 కోట్లు
లండన్: అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్హామ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది. -
580 ఏళ్ల తర్వాత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం
కోల్‌కతా: 580 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం పునరావృతం కాబోతోంది. ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం దర్శనమివ్వనుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో ఈ చంద్రగ్రహణం చక్కగా కనిపిస్తుందని కోల్‌కతాలోని ఎంపీ బిర్లా ప్లానెటోరియం రీసెర్చ్ అండ్ అకడమిక్ డైరెక్టర్ దేబిప్రసాద్ దురై శనివారం తెలిపారు. సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని వివరించారు. ఇలాంటి గ్రహణం 580 సంవత్సరాల క్రితం.. అంటే 1440 ఫిబ్రవరి 18న చోటుచేసుకుందని వివరించారు. మళ్లీ ఇలాంటిదే చూడాలంటే 2669వ సంవత్సరం ఫిబ్రవరి 8 దాకా వేచి చూడాలన్నారు. -
ఆకాశంలో అద్భుతం.. 580 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి!
580 ఏళ్లలో సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం భారతకాలమానం ప్రకారం నవంబరు 19(కార్తీక పౌర్ణమి)న మధ్యాహ్నం 12.48 గంటలకు కనిపించనుంది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది అని ఎంపీ బిర్లా ప్లానిటోరియం పరిశోధన & అకడమిక్ డైరెక్టర్ డెబిప్రోసాద్ దుయారీ తెలిపారు. పాక్షిక గ్రహణం మధ్యాహ్నం 12.48 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4.17 గంటలకు ముగుస్తుందని ఆయన తెలిపారు. గ్రహణం కాలవ్యవధి 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లు ఉంటుంది. ఇది 580 సంవత్సరాల తర్వాత సుదీర్ఘమైనది అని మిస్టర్ దుయారీ తెలిపారు. మళ్లీ 648 ఏళ్ల తర్వాత చివరిసారిగా 1440 ఫిబ్రవరి 18న పాక్షిక చంద్రగ్రహణం సంభవించిందని, మళ్లీ అద్భుతాన్ని ఫిబ్రవరి 8, 2669న చూడవచ్చని ఆయన చెప్పారు. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అప్పుడు చంద్రునిలో 97 శాతం భూమి నీడతో కప్పబడి ఉంటుంది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 24 సెకన్లపాటు ఉండనుంది. ఫ్రాస్ట్ మూన్ ఈ పాక్షిక చంద్ర గ్రహణం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. (చదవండి: Jeff Bezos: నా గుండె పగిలి ముక్కలయ్యింది) -
కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుత దృశ్యం.. 21వ శతాబ్దంలో ఇదే మొదటిసారి!
Longest Lunar Eclipse: ఆకాశంలో మరో అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. ఈ శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగహణం నవంబరు 19న ఏర్పడతున్నట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్ధ నాసా శనివారం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నవంబరు 18, 19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపించనున్నట్లు తెలిపింది. భారతకాలమానం ప్రకారం నవంబరు 19(కార్తీక పౌర్ణమి)న శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ చంద్రగ్రహణం తారస్థాయికి చేరుతుంది. 2001 నుంచి 2100 మధ్య అత్యంత సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం ఇదే. చంద్రుడు, సూర్యుడి, భూమి ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అప్పుడు భూమి పౌర్ణమిలో 97 శాతం సూర్యకిరణాల నుండి దాచిపెడుతుంది అని నాసా తెలిపింది. ఈ అద్భుతమైన ఖగోళ సంఘటన సమయంలో, చంద్రుడు ఎరుపు రంగును పొందుతాడు. ఇది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తుందని పేర్కొంది. ఈ చంద్రగ్రహణం 3 గంటల 28 నిమిషాల 23 సెకన్లపాటు ఉండనుంది. ఇది 2001 నుంచి 2100 మధ్య 100 ఏళ్లలో వచ్చే ఇతర గ్రహణం కంటే ఎక్కువ ఉంటుందని నాసా తెలిపింది. 21వ శతాబ్దంలో భూమి మొత్తం 228 చంద్ర గ్రహణాలను చూస్తుందని నాసా పేర్కొంది. (చదవండి: రేపటి నుంచే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ సౌకర్యాలన్నీ బంద్!) ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఇదే కాగా.. మే 26 న వైశాఖ పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. కార్తీక పౌర్ణమి నాడు ఏర్పడే ఈ పాక్షిక చంద్ర గ్రహణాన్ని మంచుతో కప్పబడిన చంద్రుడిగా ఫ్రాస్ట్ మూన్ అని పిలుస్తారు. శరదృతువు చివరిలో ఏర్పడే మంచు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. శరత్కాలంలో చివరి పౌర్ణమి కూడా ఇదే. అమెరికాలోని కొన్ని స్థానిక తెగలు ఈ పేరును సూచించాయి. -
గురుపౌర్ణమిరోజు ఏర్పడిన చంద్రగ్రహణం
-
‘తొలి’ చంద్రగ్రహణం నేడే
కోల్‌కతా: ప్రస్తుత ఏడాదిలో ఆరు గ్రహణాలు ఏర్పడనున్నాయి. అందులో నాలుగు చంద్రగ్రహణాలు కాగా.. మరో రెండు సూర్య గ్రహణాలు. ఇక ఈ ఏడాదిలో మొట్టమొదట ఏర్పడే గ్రహణం చంద్రగ్రహణం కానుంది. జనవరి 10వ తేదీ రాత్రి 10.37 గంటలకు ప్రారంభమై జనవరి 11వ తేదీ తెల్లవారుజాము 2.42 గంటల వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగనున్నట్లు ఎంపీ బిర్లా ప్లానెటోరియమ్ బుధవారం తెలిపింది. జూన్ 5, జూలై 5, నవంబర్ 30 తేదీల్లో మరో మూడు చంద్రగ్రహణాలు సంభవించనున్నాయి.