mothkupally narsimhulu
-
డప్పు కొట్టాల్సింది ఇక్కడ కాదు.. ఢిల్లీలో : మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధు’అమలు చేయాలంటూ బండి సంజయ్ డప్పు కొట్టాల్సింది హైదరాబాద్‌లో కాదని, దేశవ్యాప్త అమలు కోసం ఢిల్లీలో మోగించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. దళితబంధు దేశవ్యాప్తంగా అమలయ్యేంత వరకు బీజేపీ ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ వెంటాడుతుందని హెచ్చరించారు. బీజేపీ అనుసరిస్తున్న దళిత వ్యతిరేక విధానాలపై ఊరూరా డప్పుల దండోరా వేస్తామన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదని, మంగళవారం ఆ పార్టీ నిర్వహించిన ‘డప్పులమోత’లో ఏ ఒక్కరూ డప్పు వాయించే వారు లేరని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు ఎక్కడైనా అమలవుతోందా అని ప్రశ్నించారు. దేశంలో కుల వివక్ష పోగొట్టే ప్రయత్నం చేయకపోగా బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు. ఓట్ల కోసం ఆ పార్టీ నేతలు చేస్తున్న గారడీ వేషాలు మానుకోవాలని, ‘దళితబంధు’కు అడ్డుపడితే ఊళ్లలోకి రాకుండా ప్రజలు తొక్కిపెడతారని హెచ్చరించారు. చదవండి: Congress: కాంగ్రెస్‌కు షాక్.. పార్టీని వీడనున్న మరో కీలక నేత..! కేసీఆర్‌ను జైలుకు పంపి మనుగడ సాధిస్తారా? ‘కేసీఆర్ సహకారం లేకుండా కేంద్రంలో బీజేపీ పాలనే సాగించలేదు. కేసీఆర్‌ను జైలుకు పంపి బీజేపీ మనుగడ సాధిస్తుందా?’అని మోత్కుపల్లి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ది గెలుపు కాదు, వాపు అన్నారు. కాంగ్రెస్‌తో బీజేపీ అపవిత్ర కలయికతో ఈటల గెలుపొందారని విమర్శించారు. కేంద్ర మంత్రి కుమారుడు రైతులను కారుతో తొక్కించి చంపడమే దేశంలో రాక్షస పాలనకు ఉదాహరణ అని మోత్కుపల్లి దుయ్యబట్టారు. -
మోత్కుపల్లి నర్సింహులుతో స్ట్రెయిట్ టాక్
-
నేను వెళ్లి పార్టీని రక్షించాను : మోత్కుపల్లి
-
బీజేపీ నేత మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులుకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మోత్కుపల్లి చికిత్స కోసం సోమాజిగూడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మోత్కుపల్లికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వ్యైదులు పేర్కొన్నారు. చదవండి: టెస్టులు సరే.. మరి భౌతిక దూరం ఏదీ? -
బీజేపీలో చేరిన మాజీమంత్రి మోత్కుపల్లి
సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ బహిష్కృత నేత, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వాంచారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంలో పని చేసే అవకాశం రావడం అదృష్టమన్నారు. ‘దేశానికి గౌరవం తీసుకొస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు. నిజాం 8వ వారసుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా కొనసాగుతున్నారు. వ్యవస్థ పట్ల కేసీఆర్ ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకుంటున్నారు. ప్రజాస్వామ్యకి విరుద్దoగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. 2 లక్షల కోట్లు అప్పు తెలంగాణ రాష్ట్రంలో చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కేసీఆర్ నెరవేర్చడం లేదు. ప్రజలు త్వరలో కేసీఆర్‌కి తగిన గుణపాఠం చెప్పబోతున్నారు’ అని అన్నారు. మోత్కుపల్లి చేరిక తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి మరింత బలం చేకూరుతుందని తాము ఆశిస్తున్నామని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ‘ ఎన్టీఆర్ హయాంలో కూడా మోత్కుపల్లి పనిచేసారు.దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి. బీజేపీ చేస్తున్న అభివృద్ధి ,తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షణీయ అయ్యి మోత్కుపల్లి బీజేపీ లోకి చేరారు పార్టీలో ఒక సైనికులు గా పనిచేస్తా అని పార్టీ లోకి చేరారు. . కేసీఆర్ అవలంస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు పట్ల అమిత్ షా కి వివరించాము. సమ్మక్క సారక్క పండగకి కేంద్ర మంత్రులు ను ఆహ్వానించాం’ అని తెలిపారు. -
బీజేపీలోకి మోత్కుపల్లి
సాక్షి, యాదాద్రి : సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కాషాయ కండువా కప్పుకోనున్నారు. సోమవారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లారు. టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సంచలన ప్రకటనను చేసి టీడీపీ నుంచి బహిష్కృదుడయ్యాడు. అనంతరం 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం క్రితమే బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వా యిదా పడుతూ వస్తోంది. మంగళవారం ఢిల్లీలో బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. రాజకీయ జీవితంలో చేపట్టిన పదవులు ఎన్టీఆర్ మంత్రి వర్గంలో గనులు, విద్యుత్, సాంఘిక సంక్షేమం, టూరిజం శాఖ మంత్రిగా పని చేశారు. 1982లో ఎన్టీఆర్ నూతనంగా స్థాపించిన తెలుగుదేశం పార్టీలో విద్యార్థి దశలోనే చేరారు. 1983లో జరిగిన ఎన్నికల్లో ఆయన తొలిసారిగా ఆలేరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985లో టీడీపీ నుంచి, 1989లో ఇండిపెండెంట్‌గా, 1994 టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందా రు. 1999లో కాంగ్రెస్‌నుంచి ఆలేరులో గెలు పొందిన ఆయన 2004 టీడీపీ తరఫున ఆలేరులోనే ఓటమిపాలయ్యారు. 2008లో జరిగి న ఉపఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయా డు. 2009లో తుంగతుర్తి నియోజకవర్గంలో టీడీ పీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 లో ఖమ్మం జిల్లా మధిరలో పోటీ చేసి ఓటమి చెందాడు. 2018లో బీఎల్ఎఫ్ తరఫున ఆలే రు నుంచి పోటీ చేసి మరోసారి పరాజయంపాలయ్యాడు. 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావుపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి బహిష్కరణ అ నంతరం ప్రజావేదిక ఏర్పాటు చేసి 2018 ముందస్తు ఎన్నికల్లో బీఎల్ఎఫ్ మద్దతుతో ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగారు. -
టీటీడీపీ దుకాణం.. ఉమ్మడి నల్లగొండలో బంద్!
సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ తెలుగుదేశం (టీటీడీపీ) దుకాణం మూతపడనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, నియోజకవర్గ ఇన్‌చార్జులంతా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. త్వరలోనే బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో ఇక ఆ పార్టీకి సాధారణ కార్యకర్త కూడా కరువయ్యే దుస్థితి నెలకొంది. 2014 ఎన్నికల నాటినుంచి ఆ పార్టీ రోజు రోజుకూ దిగజారుతూ వస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో సరే సరి. ఇక, పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో, పార్టీ రహితంగా జరిగిన గ్రామ పంచాయతీల ఎన్నికల్లో .. ఇలా ఏ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఉనికిని కాపాడుకోలేకపోయింది. బోర్డు తిప్పేయడమేనా..? జిల్లాలో టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ఇన్నాళ్లూ ఆ పార్టీ జిల్లా నాయకులు ఊగిసలాటలో ఉన్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీ నుంచి ఇతర పార్టీలకు ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ వెంటనే 2014లో జరిగిన ఎన్నికల తర్వాత ఆ పార్టీ మరింత అయోమయంగా తయారైంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఉమ్మడి జిల్లాలోని పన్నెండు స్థానాల్లో ఒక్క చోట కూడా పోటీ చేయలేక పోయింది. కోదాడ నుంచి టికెట్ ఆశించి భంగపడిన బొల్లం మల్లయ్య యాదవ్ చివరి నిమిషంలో టీఆర్ఎస్లో చేరి విజయం సాధించి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ నాయకురాలు పాల్వాయి రజినీకుమారి టికెట్ ఆశించి భంగపడ్డారు. నల్లగొండ నుంచి మాదగోని శ్రీనివాస్‌గౌడ్ సైతం టికెట్‌పై ఆశలు పెట్టుకున్నా పొత్తులు దెబ్బకొట్టాయి. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నాయకుడికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం దక్కలేదు. ఈ పరిణామంతో పార్టీ శ్రేణులు పూర్తిగా నిరాశలో కూరుకుపోయాయి. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే నల్లగొండ టీడీపీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఇలా గడిచిన ఐదేళ్లుగా ఆ పార్టీనుంచి ఒక్కొక్కరు జారిపోయారు. ప్రస్తుతం మిగిలి ఉన్న నాయకులంతా మూకుమ్మడిగా బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఆలేరు నియోజకవర్గానికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన బండ్రు శోభారాణి, నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కడారి అంజయ్యతోపాటు, పాల్వాయి రజినీ కుమారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు బీజేపీలో చేరే నాయకుల జాబితాలో ఉన్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా నేతృత్వంలో హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమంలో వీరు ఆ పార్టీలో చేరనున్నట్లు చెబుతున్నారు. లేరు నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరడం ఖాయమై పోయింది. అయితే, ఉమ్మడి జిల్లా నేతలతో కాకుండా ఆయన ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కమలం కండువా కప్పుకుంటారని పేర్కొంటున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరడమే మిగిలి ఉందని అంటున్నారు. ఇదే జరిగితే.. జిల్లాలో ఇక టీడీపీ దుకాణానికి తాళం పడినట్టేనని, ఆ పార్టీ బోర్డు తిప్పేసినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వారిద్దరి పసుపు- కుంకుమ తుడిచింది నువ్వుకాదా?
సాక్షి, హైదరాబాద్ : ఇప్పుడు పసుపు-కుంకుమ అంటున్నావ్.. పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపూ, కుంకుమ తుడిచింది నువ్వు కాదా చంద్రబాబు అని టీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రశ్నించారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్ముతో ఓట్లు కొనాలని చూస్తున్న చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పి.. వైఎస్ జగన్‌కు ఓటేయాలని ప్రజలకు ఆయన విఙ్ఞప్తి చేశారు. సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన మోత్కుపల్లి అనంతరం మాట్లాడుతూ.. వెన్నుపోటు, అక్రమాలకు మారుపేరు చంద్రబాబు అని మండిపడ్డారు. పార్టీలో అందరూ వద్దన్నా కేవలం అల్లుడనే కారణంగా ఎన్టీఆర్ చంద్రబాబుని పార్టీలోకి తీసుకున్నారని తెలిపారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. అతడిని పార్టీలోకి తీసుకున్నందుకు ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఏడ్చారని.. గాంధీని చంపిన గాడ్సే కంటే కూడా చంద్రబాబు నీచుడని ఎన్టీఆర్ అన్నారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ టీడీపీ జెండాను దొంగిలించిన చంద్రబాబు ఓ దొంగ ఐతే..తాను పెట్టిన పార్టీకి ఏకైక మొనగాడు వైఎస్ జగన్ అని వ్యాఖ్యానించారు. 29 కేసులకు స్టే తెచ్చుకున్నావు..మర్చిపోకు మోత్కుపల్లి మాట్లాడుతూ.. ‘వైఎస్ జగన్ సొంత పార్టీతో ఒంటరిగా వెళుతున్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోతే చంద్రబాబు ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. రాజకీయ ప్రత్యర్థి చనిపోయాడు అన్న సంతోషమే తప్ప సాటి మనిషి ప్రాణం పోయిందన్న బాధ ఏమాత్రం లేని శాడిస్ట్ చంద్రబాబు. వైఎస్ జగన్ మీద 31 కేసులు ఉన్నాయని చెబుతున్నావు... కానీ నీ మీద 29 కేసులున్న సంగతి మర్చిపోకు చంద్రబాబు. వాటన్నిటికీ స్టే తెచ్చుకున్న వ్యక్తివి నువ్వు.. అవినీతితో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబూ.. ఈ రోజు నీ కోసం, నీ కొడుకు కోసం మాత్రమే బతుకుతున్నావ్....తప్ప ప్రజల కోసం ఏమీ చేయడం లేదు. ప్రస్తుతం అన్ని సర్వేలు వైఎస్ జగన్ భారీ మెజారిటీతో గెలుస్తారని వెల్లడిస్తున్నాయి. చంద్రబాబువి అన్నీ దొంగ సర్వేలు. ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా వైఎస్ జగన్‌ను గెలిపించండి. చంద్రబాబును చిత్తు చిత్తుగా ఒడించండి’ అని పిలుపునిచ్చారు. ఆంధ్రుల కోసం పోరాటం చేసింది వైఎస్ జగన్ మాత్రమే.. ‘పొద్దున లేస్తే చాలు కేసీఆర్‌ను తిడుతున్నావు. కేసీఆర్ కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు బాబు. ఈరోజు నేను రాజకీయ లబ్ధి కోసం మాట్లాడడం లేదు ప్రజల కోసం మాట్లాడుతున్నాను. వైఎస్ జగన్ మాత్రమే ఆంధ్రుల హక్కుల కోసం పోరాడారు. నువ్వు ఒక్కనాడు కూడా ఆంధ్ర ప్రజల కోసం పోరాటం చేయలేదు. మొన్నటిదాకా మోదీ గ్రేట్ ప్రధానమంత్రిని పొగిడి.. ఇప్పుడు ఆయన చెడ్డవాడు అని చెబుతున్నావు. నీది నాలుకా లేదా.. తాటి మట్టా చంద్రబాబు. ప్రత్యేక హోదా కోసం ఒక్కనాడైనా పోరాడావా? నీకు చిత్తశుద్ది ఉంటే తెలంగాణ ఆరు మండలాలు ఏపీలో కలిపిన కేంద్రం ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు. కేసీఆర్‌ను కలుపుకొని ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి.. విభజన చట్టం కింద 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని హైద్రాబాద్ నుంచి పారిపోయావు. నాకు కులం లేదని అంటున్న చంద్రబాబు కుల అహంకారి. మాల, మాదిగలలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారు అని నీచ వ్యాఖ్యలు చేశాడు. ఆరుగురికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. వాళ్ళందరికీ ఏ కుల ప్రాతిపదికన ఇచ్చావు. రూ. 100 కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకున్నారు. ఒక్కో పదవికి వందల కోట్లు లంచం తీసుకున్నావు’ అని మోత్కుపల్లి చంద్రబాబు తీరును ఎండగట్టారు. -
ఏపీ ఓటర్లు చంద్రబాబును నమ్మొద్దు
సాక్షి, హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో.. సీఎం చంద్రబాబునాయుడు చేసే మోసపు వాగ్దానాలు, గిమ్మిక్కులు, ప్రలోభాలకు లొంగిపోకుండా ఏపీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి నర్సిం హులు మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబును ఓటర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారం కోసం చివరి నిమిషంలో బాబు ఎన్ని అరాచకాలకయినా పాల్పడతాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహి చంద్రబాబు అన్నారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిన దళిత వ్యతిరేకి చంద్రబాబుని ఏకిపారేశారు. పోలింగ్ సమయం నాటికి ఏపీ ప్రజలు, ఓటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, మాట తప్పని, మడమ తిప్పని నేతను ఎన్నుకోవాలని సూచించారు. జగన్ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని మోత్కుపల్లి చెప్పారు. రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ మద్దతు.. భారతదేశంలోనే తొలిసారి ప్రైవేట్ టీచర్స్ అవస రాలు, సమస్యలను మేనిఫెస్టోలో పొందు పరిచి, పరిష్కరించడానికి ముందుకొచ్చిన ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమేనని రాష్ట్ర ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ (పీటీఎల్యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. అంబేడ్కర్, పి. జయభారత రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి వారు హైదరాబాద్‌లోని వైఎస్ జగన్ నివాసంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 5 లక్షల మంది సభ్యులున్న తమ సంఘం తరఫున కృషి చేస్తామని చెప్పారు. నేతలు ఎం.రియాజ్ ఖాన్, ఎస్ చాంద్ భాషా, ఎం. మద్దిలేటి, క్రిష్ణమూర్తి, బి.శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారు ఏపీ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పి.వెంకటనారా యణ ఆ పార్టీని వీడి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జగన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ సీఎం కావాలనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమ ర్శించారు. ఎక్కడ చూసినా ప్రజలు చంద్రబాబును ఛీ కొడుతున్నారని వెంకటనారాయణ చెప్పారు. జగన్‌ను కలిసిన ఎన్ఆర్ఐలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నాయకులు వెంకట్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు హరిప్రసాద్, హెచ్‌పీ రెడ్డి, నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్‌ను కలిశారు. వారు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం చాలా రోజుగా జిల్లాల్లో పని చేస్తున్నామన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్న జగన్ తప్పక సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
తెలంగాణలో టీడీపీ భూస్థాపితం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ భూస్థాపితమైందని టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు అన్నారు. మండవ వెంకటేశ్వరరావును సీఎం కేసీఆర్ టీఆర్ఎస్లోకి ఆహ్వానించడాన్ని స్వాగతించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో తెలుగుదేశం భూస్థాపితమవుతుందని తాను గతంలోనే చెప్పానని గుర్తుచేశారు. ‘బాబు ఓ అసమర్థుడు. ఆయనకు ఏపీలోనే దిక్కులేదు, ఇక తెలంగాణకు ఏం చేయగలడు’అని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలంతా టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నారని, సీఎం పిలిస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. -
చంద్రబాబు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలి
హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. తెలంగాణ ద్రోహిగా మిగిలిపోయిన చంద్రబాబుపై ఆంధ్రాద్రోహి అనే ముద్రకూడా పడే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదాపై గత ఐదేళ్లుగా ఒకే స్టాండ్‌పై ఉంటే ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేదని, గడికోమాట మాట్లాడి హోదా రాకుండా చేసింది చంద్రబాబే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొంగలా దొరికి పారిపోతే, పార్టీని నమ్ముకున్న వారంతా ఏం కావాలని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం చంద్రబాబు మోసపూరిత, వెన్నుపోటు విధానాలవల్ల తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తే ఒక్కటీ గెలవలేదని, పార్లమెంట్లో అభ్యర్థులను నిలిపే దమ్ము కూడా లేకుండా పోయిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం చూడలేని బాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే కేసీఆర్‌కు కూడా వెన్నుపోటు పొడిచేందుకు చూశాడని ఆరోపించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనుగోలు చేసేందుకు చూసి అడ్డంగా దొరికిపోయాడన్నారు. హోదా అడిగే హక్కు బాబుకు లేదు ఆంధ్రప్రదేశ్ బాగుండాలి అని కోరుకునే వాడైతే ప్రత్యేకహోదా కావాలనే డిమాండ్‌పై చంద్రబాబు ఎందుకు నిలబడలేదని మోత్కుపల్లి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అడిగే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. నాలుగున్నరేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోదీతో చేయికలిపి ఇద్దర్ని కేంద్రమంత్రి వర్గంలో ఉంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీ కావాలి అని అడగలేదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పథకాలన్నీ పేర్లుమార్చి కాపీ కొట్టిన ఘనత చంద్రబాబుదని, ఇన్నిరోజులూ గుర్తుకురాని నిరుద్యోగభృతి, రైతుబంధు, పసుపు కుంకుమ ఎన్నికలముందే గుర్తుకొచ్చాయా అని ప్రశ్నించారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలెవరూ చంద్రబాబుకు ఓటువేయరాదని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఆత్మగౌరవం అనే పదం వాడే హక్కు బాబుకు లేదని, నీతిమాలిన రాజకీయాలకు చంద్రబాబు మారుపేరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రాలో జగనే సీఎం ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతారని మోత్కుపల్లి జోస్యం చెప్పారు. ప్రభుత్వాలు మారితేనే పేదలు బాగుపడతారని, ఆంధ్రా ప్రజలు జగన్‌కు అవకాశం ఇవ్వాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క మాటపై నిలబడేవారని, బాబుది రెండు నాలుకల ధోరణి అన్నారు. జగన్‌ను ఏదోఒకవిధంగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆంధ్రాప్రజానీకం గుర్తించాలన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు రావడంతో ఆయనకు మతి భ్రమించిందన్నారు. -
‘తెలంగాణలో అంతరించిపోయిన టీడీపీ’
సాక్షి, హైదరాబాద్ : సామాన్యులను మంత్రులను చేసిన ఘనత నందమూరి తారక రామారావుదని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా మోత్కుపల్లి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మహనీయుడు, బడుగు బలహీన వర్గాలకు, పేదలకు ఒక వ్యవస్థను సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. మోత్కుపల్లి మాట్లాడుతూ.. 'సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆధ్యుడు. రాజకీయంగా చైతన్యం కలిగించిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన పథకాలనే నేటి ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. టీడీపీని టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని అంటే నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఏమైంది. దీనికి చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెప్తారు. ఎన్టీఆర్ ఆశయాల బాటలో నడుస్తున్నా. టీఆర్ఎస్తో టీడీపీ కలిసి ఉంటే బాగుండేది. తెలంగాణలో టీడీపీ అంతరించి పోయింది. ఎన్టీఆర్ జయంతిని, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి. తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఎన్టీఆర్‌ను మర్చిపోరు' అని అన్నారు. -
చంద్రబాబు దుర్మార్గుడు
రాజాపేట: తెలంగాణలో కేసీఆర్‌ను, ఆంధ్రాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిను ఉరితీస్తే చిరకాలం తానే ముఖ్యమంత్రిగా ఉండవచ్చని అనుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు అని మాజీ మంత్రి, ఆలేరు బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. గురువారం ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత స్వార్థం కోసం ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ సిద్ధాంతాలను బొందపెట్టిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం అని, చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో దొంగలా దొరికిపోయాడని అన్నారు. ఆంధ్రాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును తప్పకుండా ఓడించి తీరుతారని మోత్కుపల్లి స్పష్టం చేశారు. ఒకప్పుడు సీట్లు ఇచ్చే టీడీపీ.. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద సీట్ల కోసం అడుక్కుంటోందని, టీడీపీలో మోత్కుపల్లి అనేవాడు ఒక్కడు ఉంటే అధికారంలోకి తీసుకొచ్చిపెట్టే వాడని అన్నారు. తన స్వార్థం కోసం ఎవరికైనా, ఎదైనా చెడు చేసే దుర్మార్గుడు చంద్రబాబని ఆయన ధ్వజమెత్తారు. -
రాజకీయంగా వాడుకుంటే 10సీట్లు గెలిపించే వాడ్ని
యాదగిరిగుట్ట : తనను రాజకీయంగా అణచివేయడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేశాడని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. తాను ఏనాడు రాజ్యసభ, గవర్నర్ పదవులు అడగలేదని, ఆశపెట్టి మోసం చేసిండని మండిపడ్డారు. యాదగిరిగుట్టలో గురువారం జరిగిన ‘మోత్కుపల్లి శంఖారావ’ బహిరంగసభలో మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. ప్రజల కోసమే జీవితమంతా బతుకుతానని, ఓ దుర్మార్గుడు, ఓ పాపత్ముడు, ఓ నీచుడిని నమ్మి మోసపోయానని చంద్రబాబునాయుడిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తాను రాజకీయాలపై, పేద ప్రజల పక్షాన మాట్లాడడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ఓ మిత్రుడా.. కేసీఆర్... ఓ మిత్రుడా కేసీఆర్ నన్ను రాజకీయంగా వాడుకుని ఉంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లకు గానూ 10 అసెంబ్లీ సీట్లు గెలిపించి, పువ్వుల్లో పెట్టి ఇచ్చే వాడినని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలు తప్ప మిగతావి ఏవీ గెలవవని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రజలు ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే.. ఒక ఎమ్మెల్యే 2వందల ఎకరాల భూమి, మరొకరు 5వందల ఎకరాల భూమిని కోనుగోలు చేశారన్నారు. నేను ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కానీ ఒక్క రూపాయి కూడా సంపాదించుకోలేదన్నారు. గతంలో ఆలేరులో ఎమ్మెల్యేగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్, తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితను గెలిపించింది తనేనని మోత్కుపల్లి పేర్కొన్నారు. ఇవే నా చివరి ఎన్నికలు... నా వయస్సు 65 సంవత్సరాలు.. ఇవే నా చివరి ఎన్నికలు.. ఈ ఒక్క సారి ఆశీర్వదించండని ఉద్వేగంగా మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. ఆలేరు ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గానికి సాగు జలాలు తీసుకుచచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. సిద్దిపేటకు తరలుతున్న తప్పాసుపల్లి జలాలను రాజపేట, ఆలేరు ప్రాంతాలకు తీసుకువస్తానని, గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పూర్తి చేస్తానన్నారు. అంతే కాకుండా జిల్లాల విభజనలో జనగాంలో కలిసిన గుండాల మండలాన్ని తిరిగి యాదాద్రి జిల్లాలో కలిపే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ బహిరంగ సభలో ఎక్కడ కూడా కేసీఆర్‌ను విమర్శించకపోవడంతో స్థానికంగా చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి వెంకన్న, యాదగిరిగుట్ట మాజీ సర్పంచ్ కైరంకొండ శ్రీదేవి, దడిగె ఇస్తారి, గజం ఉప్పలయ్య, పాపయ్య, చంద్రారెడ్డి, కే.ఆంజనేయులు, అమరేందర్‌రెడ్డి, గుంటి మధుసూదన్‌రెడ్డి, శ్రీరామూర్తి, దానయ్య, వెంకట్‌రెడ్డి, మచ్చ లక్ష్మీనారాయణ, ప్రజా చైతన్య వారధి పాపట్ల నరహరి తదితరులున్నారు. -
మోత్కుపల్లి శంఖారావం.. ఇండిపెండెంట్‌గా పోటీ
సాక్షి, యదాద్రి : టీడీపీ బహిష్కిృత నేత మోత్కుపల్లి నరసింహులు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలువనున్నారు. తన సొంత నియోజకవర్గమైన ఆలేరు స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు మోత్కుపల్లి ప్రకటించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆలేరు ప్రజల అభీష్టం మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలను తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన ప్రకటించారు. తన జీవితానికి ఇవే చివరి ఎన్నికలని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు రేపు యాదగిరిగుట్టలో ‘‘మోత్కుపల్లి శంఖరావం’’ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. సభ ఏర్పాట్లను తన మద్దతుదారులతో కలిసి బుధవారం పరిశీలించారు. కాగా టీడీపీలో సీనియర్‌నేతగా, మంత్రిగా వ్యవహిరించిన మోత్కుపల్లి చంద్రబాబు వ్యవహారంతో విభేదించి ఆయనపై ఇటీవల తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీకి రాజీనామా అనంతరం వివిధ పార్టీల్లో ఆయన చేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆ మధ్య జనసేనాలో చేరుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. గత ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసిన మోత్కుపల్లి కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క చేతిలో ఓటమి పాలైయ్యారు. టీడీపీ కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగంగా ఉన్న సమయంలో కేంద్రంలో చంద్రబాబు సహాకారంతో ఏదోఒక పదవి వస్తుందని ఆశించిన మోత్కుపల్లి... చివరికి చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడంతో తీవ్ర మనస్థాపం చెందారు. -
చంద్రబాబు లాంటి నీచుడిని నమ్మొద్దన్నారు
చంద్రబాబు మోసాలు, కుట్ర, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. చంద్రబాబును నమ్మొద్దని ఎన్టీఆర్ ఆనాడే హెచ్చరించినా వినకుండా నమ్మి మోసపోయానన్నారు. తిరుపతి తుడా/తిరుమల: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసాలు, కుట్ర, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. తాను పేద దళితుడినని, అంబేడ్కర్ వారసుడినని, ఎన్టీఆర్ శిష్యుడినని చెప్పారు. చంద్రబాబులాంటి నీచుడిని నమ్మొద్దని ఎన్టీఆర్ ఆనాడే హెచ్చరించినా వినకుండా నమ్మి నిండా మోసపోయానని ఆక్రోశించారు. ఎన్టీఆర్‌ను మానసికంగా చంపి హత్య చేశాడని, కేసీఆర్‌ను రాజకీయంగా చంపాలని ప్లాన్ చేశాడని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు రాజకీయ వారసులు 30 ఉండగా నన్ను తప్ప మిగిలిన అందర్నీ అదే తరహాలో చంపేశాడని చెప్పారు. కుర్చీ కోసం వెన్నుపోటు: చంద్రబాబు అధర్మాలపై ధర్మపోరాటం పేరుతో బుధవారం మోత్కుపల్లి అలిపిరి మీదుగా కాలినడకన తిరుమలకు బయల్దేరారు. అంతకుముందు అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, జ్యోతిరావ్‌పూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్సార్ సీపీ, జనసేన, దళిత సంఘాల నేతలు ఘన స్వాగతం పలికాయి. అనంతరం అలిపిరి సమీపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై మోత్కుపల్లి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కుర్చీ కోసం పిల్లనిచ్చి పంచన చేర్చుకున్న మామకు వెన్నుపోటు పొడిచి మానసికంగా హత్య చేశారని ధ్వజమెత్తారు. టీడీపీలో దళితులంతా దగా పడ్డారు: చంద్రబాబు కుల రాజకీయాలతో పబ్బం గడుపుతున్నారు. టీడీపీలో దళితులంతా దగా పడ్డారు. పార్టీలో కష్టపడ్డ ఏ ఒక్క దళితుడికైనా న్యాయం చేశారా? కేంద్ర మంత్రి పదవులు, రాజ్యసభ సభ్యులుగా దళితులు పనికిరారా? రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బులు చాలవన్నట్టు ఒక్కో రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నారు. సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంటేష్‌లకు ఏ అర్హత ఉందని ఎంపీ పదవులు ఇచ్చారు? చంద్రబాబును చిత్తుగా ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు ఏకం కావాలి.’ అని మోత్కుపల్లి పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన మోత్కుపల్లి: శ్రీవారిని దర్శించుకోవడానికి బుధవారం కాలినడక మార్గంలో బయలుదేరిన మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. గాలిగోపురం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఆయనకు బీపీ తగ్గింది. దీంతో అక్కడ ఉన్న టీటీడీ ఆస్పత్రిలో ఆయన్ను చేర్చారు. వాహనంలో వెళ్లాలని సిబ్బంది సూచించినా నడుచుకుంటూనే తిరుమల చేరుకున్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురికాగా తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రిలో చేర్చారు. -
బాబు అధర్మంపై ధర్మ పోరాటం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత, దళిత నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ధర్మ పోరాటానికి శ్రీకారం చుడుతున్నారు. చంద్రబాబుకు తగిన బుద్ధి చెపుతానని, తిరుమల శ్రీవారి సాక్షిగా తన పోరాటాన్ని ప్రారంభిస్తానని గతంలోనే ప్రకటించిన మోత్కుపల్లి ఈ మేరకు మంగళవారమే తిరుపతి వెళ్లారు. బుధవారం ఉదయం ఆయన అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం చంద్రబాబుకు వ్యతిరేకంగా తన పోరాట కార్యాచరణను ప్రకటించనున్నారు. మోత్కుపల్లి తిరుపతి యాత్రకు ఆయన మిత్రమండలి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ‘చంద్రబాబు అధర్మంపై «మోత్కుపల్లి ధర్మపోరాటం’పేరిట రూపొందించిన పోస్టర్లపై టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుతోపాటు మోత్కుపల్లి చిత్రాలను పొందుపర్చారు. నా గొంతు కోసిన దుర్మార్గుడు బాబు తిరుపతి యాత్ర సందర్భంగా మోత్కుపల్లి నర్సింహులు మంగళవారం హైదరాబాద్‌లో తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను పేద దళితుడినని, తనను చంద్రబాబు నమ్మించి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే మోసం చేసిన చంద్రబాబు ఎన్టీఆర్ శిష్యులను మానసికంగా చిత్రహింసలకు గురి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ శిష్యులుగా గుర్తింపు పొందిన 25–30 మందిని చంద్రబాబు చిత్రహింసలకు గురిచేసి చంపారని, ఇటీవల మరణించిన గాలి ముద్దుకృష్ణమ నాయుడు కూడా అదే కోవలోకి వస్తారని చెప్పారు. 35 ఏళ్లుగా పార్టీ జెండాను అంటిపెట్టుకుని ఉన్న తాను ఏ తప్పు చేయకపోయినా గొంతు కోసిన దుర్మార్గుడు చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులంటే లెక్కలేనితనం ఉందన్నారు. దళితులను, దళిత నేతలను ఆయన చులకనగా చూడటం చాలా బాధాకరమన్నారు. బలహీన వర్గాలను అవమానపర్చడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు వైఖరితో తాను కూడా మానసికంగా చనిపోయానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని దళితులు, బలహీన వర్గాలను కోరారు. దిక్కులేని వారికి దేవుడే దిక్కని, అందుకే తన మానసిక క్షోభను వేంకటేశ్వరునికి చెప్పుకునేందుకు వెళుతున్నానని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని, ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని దేవుడిని వేడుకుంటానన్నారు. తనను నమ్మించి మోసం చేసిన చంద్రబాబును రాజకీయంగా అంతమొందించడమే ధ్యేయంగా పోరాడతానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. -
ఏపీకి పట్టిన శని చంద్రబాబు: మోత్కుపల్లి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నడి బజార్లో తన గొంతు కోశారని తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వాపోయారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రం రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వల్లనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, 30 ఏళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశానని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని పార్టీని కాపాడానని, తనకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నమ్మక ద్రోహి అని, రాష్ట్రంలో పేదలను అనగదొక్కుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ఏపీకి పట్టిన శని అని, యువకులు ఏపీకి సీఎం కావాలని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి, మంత్రి పదవులు ఇచ్చారని తెలిపారు. ఏపీకి పట్టిన శని చంద్రబాబు అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
అలిపిరిలో ప్రెస్‌మీట్: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు నేడు తిరుపతి వెళ్లనున్నారు. ఈరోజు (మంగళవారం) తిరుపతికి చేరుకుని, రేపు ఉదయం తొమ్మిది గంటలకు అలిపిరి నుంచి కొండపైకి కాలి నడకన వెళ్లి దేవుడుని దర్శించుకుంటానని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వ్యతిరేక శక్తులన్ని ఏకమై ఆ దుర్మార్గుడిని రాజకీయంగా బొందపెట్టాలని ఆ దేవుడిని వేడుకుంటానని వ్యాఖ్యానించారు. దళితులు, బలహీనవర్గాలు చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. దిక్కులేని వాడికి దేవుడే దిక్కని తన 64వ జన్మదినం రోజున తన మానసిక క్షోభను దేవుడికి చెప్పుకునేందుకే తిరుమల వెళ్తున్నాని తెలిపారు. రేపు ఉదయం అలిపిరి వద్ద మీడియాతో మాట్లాడి పాదయాత్రగా కొండపైకి చేరుకుంటానని అన్నారు. 12వ తేది మధ్యాహ్నం ఒంటిగంటకు తిరుపతిలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతానని ప్రకటించారు. -
దళితతేజం పేరుతో చంద్రబాబు మరో దగా
హైదరాబాద్: దళిత తేజం పేరుతో పేద వర్గాలను మరోసారి మోసం చేయాలని చంద్రబాబు పన్నాగం పన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిషృత నేత మోత్కుపల్లి నర్సింహులు దుయ్యబట్టారు. శనివారం ఆయన హైదరాబాదులో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు. దళితులకు క్షమాపణ చెప్పిన తర్వాతే దళితతేజం సభలో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులను అడుగడుగునా అణగదొక్కిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు. మహనీయుడు ఎన్టీఆర్ చెప్పినట్లు నీచుడు చంద్రబాబు రాజకీయాల్లో ఉండకూడదు. ఈ చీడపురుగును రాజకీయాల నుంచి తప్పించే అవకాశం వచ్చింది.. ఈ అవకాశం వదులుకోవద్దని ఆంధ్ర ప్రజలకు పిలుపు ఇస్తున్నానన్నారు. ప్రజలతో పాటు దేవదేవుడైనా వెంకటేశ్వర స్వామిని కూడా మొక్కుకుంటానన్నారు. ఇందుకోసం జూలై 11న తిరుమలకు నడిచివెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటానన్నారు. దుర్మార్గుడైన చంద్రబాబు కబంధ హస్తాల నుంచి ప్రజలను కాపాడాలని కోరతానన్నారు. చంద్రబాబు, ఆయన మనుషుల వల్ల తనకు ప్రాణహాని ఉందని, అయినా చంద్రబాబుకు రాజకీయ సమాధి చేసేందుకు తాను ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అది నీ జెండా కాదు... నందమూరి జెండా అని మళ్లీమళ్లీ చెబుతున్నా... దాన్ని మోసే అర్హత నీకు లేదని చంద్రబాబును హెచ్చరించారు. అమాయకమైన దళిత వర్గాలను ఆయన ప్రయోజనం కోసం విడగొట్టి, వాడుకుని పబ్బం గడుపుకున్న చంద్రబాబుకు దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి దళితులను మభ్యపెట్టి ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబును నమ్మరని, పాతరేస్తారని హెచ్చరించారు. పేదలకు వెయ్యి రూపాయలు పెన్సన్ ఇచ్చి ఎంతో చేశామని చెబుతూ ఇష్టారాజ్యంగా వందల కోట్ల ప్రజా సొమ్ము ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నారు.. ప్రజలేమైనా బిచ్చగాళ్లా అని ప్రశ్నించారు. రూ.3000 వేలు పెన్షన్ ఇస్తానంటున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 25 కోట్లు ఖర్చు చేస్తానంటున్నాడు... అది అంతా మీ సొమ్మే తీసుకోండి... ఓటు మాత్రం ఆయనకు వేయద్దు.. జగన్‌కు వేయండి.. లేదంటే మరెవరికైనా వేయండి అని మోత్కుపల్లి ఏపీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. చంద్రబాబుకు మతి మరుపు రోగం వచ్చింది... అందుకే ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చమని అడిగితే తిడుతున్నారని, ఇప్పటికే తెలంగాణ వాళ్లు తరిమేశారు.. త్వరలో ఆంధ్ర ప్రజలు కూడా తన్ని తరిమేస్తారని హెచ్చరించారు. నాలుగేళ్లు బీజేపీతో అధికారంలో అన్నీ అనుభవించిన చంద్రబాబుకు ఈ రోజు హోదా గురించే మాట్లాడే అర్హతలేదన్నారు. అసలు ఆంధ్రప్రజల గురించి మాట్లాడే అర్హతే లేదని దుయ్యబట్టారు. -
అవసరానికి వాడుకుని వదిలేయడం బాబు నైజం
-
మోత్కుపల్లిని కలిసిన ముద్రగడ
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఆ పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మాటల తూటాలు పేల్చన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం ఉదయం మోత్కుపల్లిని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆయన ఇంట్లో కలిసి తాజా పరిణామాలపై మంతనాలు జరిపారు. టీడీపీకి 35 ఏళ్లు సేవచేసిన మోత్కుపల్లి పట్ల పార్టీ వ్యవహరించిన తీరును ముద్రగడ తప్పుబట్టారు. అవసరానికి వాడుకొని వదిలేయడం బాబు నైజమని ముద్రగడ దుయ్యబట్టారు. మోత్కుపల్లి పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని ముద్రగడ అన్నారు. అదేవిధంగా ఏపీలో కాపు ఉద్యమం, బాబు దుర్మార్గపు పాలన తమ పోరాటానికి మద్దతు కావాలని మోత్కుపల్లిని కోరారు. దీనికి ఏపీలో ప్రభుత్వంపై పోరాటాలకు తన మద్దతు ఉంటుందని మోత్కుపల్లి అన్నారు. -
పొలిటికల్ కారిడర్ 25th May 2018
-
పార్టీ కోసం పనిచేసి షుగర్ ఎక్కువైంది
హైదరాబాద్ : మన పార్టీ(టీడీపీ) తెలంగాణలో పూర్తిగా నాశనమైందని, ఇప్పుడు స్మశానంలా ఉందని, మళ్లీ మొక్క పెట్టి నీళ్లు పోయాలని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పిలిస్తే వస్తాను కానీ మీరు నన్ను పొమ్మంటున్నారని, పార్టీ కోసం పని చేసి ఒంట్లో షుగర్ కూడా ఎక్కువైందని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ..‘ నేను ఏ తప్పుచేశానో నాకు తెలియదు. ఫలానా తప్పు చేశానని మా నాయకుడు చెబితే సంతోషిస్తా. నేను ఏం ఆల్తు ఫాల్తు గాన్ని కాదు. డబ్బులు లేకున్నా ఎన్టీఆర్ ఆశీస్సులు ఆలేరు ప్రజల ఓట్లతో గెలిచా. నేను ఏం తప్పుచేశానో చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈ తప్పుచేశానని చెబితే ముక్కు నేలకు రాస్తా. నన్ను మీటింగ్‌లకు పిలవరా, టెలీకాన్ఫరెన్స్‌లో నాకు లైన్ ఎందుకు ఇవ్వరు. ఎన్టీఆర్, పార్టీ స్థాపించిన మూల సిద్ధాంతాలతో పార్టీ నడవాలా వద్దా. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుల వల్ల పార్టీ తెలంగాణలో నాశనమైంది. రమణను సైలెంట్ చేసి సీఎంగా నిన్న గాక మొన్న వచ్చిన రేవంత్‌ను ఫోకస్ చేశారు. మీ పేరు బొమ్మ లేకుండా ప్రోగ్రాం చేసినా చర్యలు ఎందుకు తీసుకోలే. ఓటుకు కోట్లులో రెడ్ హ్యాండెడ్‌గా మనం తయారు చేసిన నాయకుడు దొరికితే చర్యలు ఎందుకు తీసుకోలేదని’ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ‘ చంద్రబాబు చెబితేనే టీఆర్ఎస్ను ఓడించేందుకు కాంగ్రెస్‌లో చేరా అంటున్నాడంట. రేవంత్ రెడ్డి పై మీకేందుకు అంత ప్రేమ, రేవంత్‌ను వ్యతిరేకిస్తే నన్ను దూరం పెడతావా. రేవంత్ బిడ్డ పెళ్లిలో ఎంగేజ్మెంట్కు కేబినెట్‌తో సహా వెళతావు. పెళ్లికి వెళుతావు, పెళ్లి ఖర్చంతా భరిస్తావు. నా బిడ్డ పెళ్లికి పిల్వంగ పిల్వంగ ఎప్పుడో సాయంత్రం వచ్చావు. నీకన్నా కేసీఆరే నయం. పెళ్లికి ముందే వచ్చాడు. పెద్ద మాదిగ అన్నావు. నిజామాబాద్‌లో మీ పాదయాత్ర ముందుండి నడిపించిన ఇద్దరు మాదిగ పిల్లలు ప్రమాదంలో చచ్చిపోతే పట్టించుకున్నావా. పేదోడంటే ఎందుకంత చులకన నీకు. పెద్ద మాదిగ అన్న నీవు ఎస్సీ వర్గీకరణ ఏం చేశావు. మాట్లాడితే రేవంత్ రెడ్డి అప్రూవర్‌గా మారుతా అని బెదిరిస్తున్నాడని భయపడుతున్నారంట. నిన్న మహానాడు చూస్తే నవ్వొచ్చింది. పక్కన ఎవ్వరు లేక ఆయనే జై కొట్టుకున్నాడ’ ని మోత్కుపల్లి చెప్పారు. ‘ నన్నే గౌరవించనప్పుడు అంబేద్కర్ పెద్ద విగ్రహం పెడితే ఎంత. పెట్టకపోతే ఎంత. పేదోనికి, తిండికి గతిలేని వానికి కూడా కేసీఆర్ రాజ్యసభ అవకాశం ఇచ్చాడు. పవన్ కళ్యాన్‌పై ఇక్కడ నుంచి స్పందించా. అక్కడ ఎవరు స్పందించలే. కేసీఆర్ మన వాడు. ఆ కేబినెట్లో ఉన్న వాళ్లంతా మన వాళ్లు. టీఆర్ఎస్తో యుద్దం ఏంది. అవసరమైతే కేసీఆర్‌తో పొత్తు పెట్టుకుంటే మంచిది. నాకు గవర్నర్ పదవి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే, హోదా ఉద్యమం నడుస్తుందని ఆపింది మీరు కాదా. నన్నుకాదని గరికపాటికి రాజ్యసభ ఇవ్వలేదా. టీజీ వెంకటేష్‌కు ఎలా రాజ్యసభ ఇస్తారు. అతను పార్టీకి ఏం సేవ చేశారు. కనీసం ఎన్టీఆర్ ఘాట్‌కైనా వర్ధంతి నాడు వస్తారనుకున్నా రాలేద’ ని తెలిపారు. ‘డబ్బులు లేకున్నా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. నేను ఏ నేరం చేయనున్న పార్టీ నుండి బయటకు పంపాలని చూస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక పార్టీ మనగడే తెలంగాణలో కష్టం అయినా నేను పార్టీని వీడలేదు. రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు పార్టీని బలిచేశారు. ఆయన వల్లనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది. సీఎం పదవి ఇస్తాం అని క్రిష్ణయ్యకు చెప్పారు. మేము ఏం అనలేదు కానీ అదేవిధంగా నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డికి ఏ విధంగా ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పారు. ఓటుకు నోటు కేసులో మధ్యాహ్నం దొంగగా దొరికాడు. ఎందుకు మీరు ఆయనను సస్పెండ్ చెయ్యలేదు. రాహుల్ గాంధీని కల్సి కాంగ్రెస్‌లో చేరుతున్నాను అని కేసీఆర్‌ను ఒడిస్తాను అని చెప్పినప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు. 15 సంవత్సరాల దోస్తాన చేసిన కేసీఆర్ ఇట్లా బిడ్డ పెళ్లి ఉంది అని చెప్పగానే ఆత్మీయంగా స్వాగతం పాలకడమే కాదు పెళ్లి కూడా వచ్చారు. అయ్యా చంద్రబాబు గారు ఆంధ్రాలో కూడా దళితులు ఉన్నారు జాగ్రత్త. కేసీఆర్ ఎప్పుడో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు. కనీసం మీరు ముఖ్యమంత్రి అయ్యాక కనీసం ఛాయా కోసం కూడా నాకు సమయం ఇవ్వలేదు. మీరా దళితులకు న్యాయం చేసేది. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన మీరు బడుగు బలహీన వర్గాలకు చేసిన న్యాయం ఇదేనా’ అని సూటిగా ప్రశ్నించారు. -
నువ్వెవరంటే.. నువ్వెవరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీలో తాజా సంచలనానికి కారణమైన వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను నిలదీశారు. శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన టీ టీడీపీ పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. పార్టీ వర్గాల సమాచారం మేరకు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, రేవంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్ సైతం రేవంత్‌ను నిలదీశారు. అయితే తాను తెలంగాణ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌ను అని, తానెవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏ విషయమైనా అధినేత చంద్రబాబు నాయుడుకే చెబుతానని రేవంత్ తేల్చి చెప్పారు. అసలేం జరిగింది...? ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కలిసినట్టు మీడియాలో జరుగుతు న్న ప్రచారంపై మోత్కుపల్లి, అరవింద్ కుమార్‌గౌడ్‌లు రేవంత్‌ను ప్రశ్నించారు. అధినేతకు సమాచారం ఇవ్వకుండా రాహుల్ గాంధీని ఎలా కలుస్తారంటూ నిలదీశారు. అయితే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా జరుగుతున్న ప్రచారంపై ఎలా స్పందిస్తానని రేవంత్ బదులిచ్చారు. యనమల రామ కృష్ణుడు, పరిటాల కుటుంబంపై ఎందుకు విమర్శలు చేశావని ప్రశ్నించగా దీనిపై సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా లేనని, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చంద్ర బాబు నాయుడుకు వివరిస్తానని రేవంత్ సమా ధానమిచ్చారు. ఎవరిని అడిగి టీఆర్ఎస్తో పొత్తుపెట్టుకుంటామని ప్రకటించారో చెప్పాలని మోత్కుపల్లిని రేవంత్‌రెడ్డి కూడా నిలదీశా రని సమాచారం. దీంతో కినుక వహించిన మోత్కుపల్లి, అరవింద్ కుమార్‌గౌడ్‌లు ఈ వ్యవహారాన్ని చంద్రబాబు వద్దే తేల్చుకుం టామని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో మిగిలిన పార్టీ నేతలు కూడా పొలిట్‌బ్యూరో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. రేవంత్ సమావేశం నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడకుం డానే వెళ్లిపోయారు. కాగా, ఈ నెల 26న ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో టీడీఎల్పీ సమావేశం ఉంటుందని పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆ తర్వాత మీడియాకు తెలిపారు. రేవంత్ వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చ జరగలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు పార్టీ నేతలు భేటీ కావడం ఆనవాయితీ అని, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకే సమావేశమైనట్లు చెప్పారు. రేవంత్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం: మోత్కుపల్లి రేవంత్‌రెడ్డికి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్ని విధాలుగా సిద్ధమయ్యారని, అందుకే పార్టీ నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఆయన వైఖరి నచ్చకే వెళ్లిపోయారని ఆరోపించారు. రేవంత్ సరైన సమాధానం చెప్పకపోవడంతో తాను, అరవింద్ కుమార్‌గౌడ్ సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేసినట్లు మీడియాకు తెలిపారు.