Musi River
-
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
కిలోమీటర్‌కు రెండు వేల కోట్లా.. మూసీపై క్లారిటీ ఉందా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. మూసీపై సీఎం రేవంత్‌కే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల హామీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు అంటూ ఆరోపించారు.ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మొన్నటి వరకు హైడ్రా జరిగింది. ఆ బాధితుల్లో జేసీబీ, బుల్డోజర్లు అనే భయం కనిపించాయి. ఇప్పుడు మూసీ బాధితులను చూస్తుంటే వారిలో బీజేపీ ఉందనే భరోసా కనిపిస్తోంది. కాంగ్రెస్ విధానాలపై ప్రజలకు అండగా ఉండి బరా బర్ కొట్లాడుతాం. మూసీ ఒకప్పుడు మంచినీళ్లు అందించింది.. ఇప్పుడు విషం కక్కుతోంది. నేను పాదయాత్ర చేసినప్పుడు కళ్లారా చూశా. మూసీ సర్వ నాశనం కావడానికి కారణం కాంగ్రెస్. పరిశ్రమలకు అడ్డగోలుగా పెట్టుకోవాలని చెప్పి అనుమతి ఇచ్చింది వారు కాదా?.మొన్న రేవంత్ లండన్ పోయి ఒక నది చూశాడు.. అది చూసే లక్షన్నర కోట్లు అన్నాడు. నిన్న సియోల్‌కు నేతలను పంపాడు.. వాళ్ళు ఎంత చెప్తారో మరి. రేవంత్.. ముందు మంత్రులను మూసీ పరివాహక ప్రాంతాల్లో తిరగమని చెప్పు. అలా వెళ్తే ప్రజలు వాళ్లను గంప కింద కమ్ముతారనే భయం ఉంది. రేవంత్ మూసీ సుందరీకరణ అని ఒకసారి అంటాడు.. పునరుజ్జీవనం అని మరోసారి అంటాడు.. ఏంటో ఆయనకే క్లారిటీ లేదు. లక్షన్నర కోట్ల ఖర్చు అన్నాడు.. మళ్ళీ నేను అనలేదు అంటున్నాడు. మూసీ ప్రక్షాళన పేదల కోసం కాదు.. ఇదంతా కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా అల్లుడి కోసమే.బీఆర్ఎస్ నేతలకు దీనిపై మాట్లాడే హక్కు లేదు. ఆరు గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే హైడ్రా, మూసీ అంటూ ఈ డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఒక డ్రామా కంపెనీ. ఆ పార్టీలో ఎవరికీ వారు సీఎంలు. సబర్మతి ఖర్చు రూ.7వేల కోట్లు. నమామి గంగ ఖర్చు రూ.40వేల కోట్లు అయితే మూసీకి లక్షన్నర కోట్లా?. ఒక్క కిలోమీటర్‌కు 2వేల కోట్లా?. ఇంతకంటే ఖరీదైన ప్రాజెక్టు.. స్కామ్ ప్రపంచంలో లేదు. దోషులు ప్రజలు కాదు.. అక్రమంగా కూల్చుతున్న ప్రభుత్వమే దోషి. మాకు కేసులు, లాఠీలు కొత్త కాదు. ఎన్ని జైళ్లు కట్టుకుంటావో కట్టుకో రేవంత్.. మేము కొట్లాడేందుకు సిద్ధం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రోడ్లపై తిరగకుండా చేస్తాం. సోనియా అల్లుడికి పైసలు కావాలంటే కాంగ్రెస్ నేతలు దోచుకున్న వాటిలో నుంచి ఇవ్వండి.. పేదల వద్ద నుంచి లాక్కుంటామంటే ఊరుకోం’ అంటూ హెచ్చరించారు. -
మూసీ పేరిట కాంగ్రెస్ భారీ దోపిడీ ప్లాన్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి ప్లాన్ చేసిందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. సంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు బీజేపీ వ్యతిరేకం అని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు(శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద బీజేపీ చేపట్టబోయే మహాధర్నాను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మూసీ బాధితులు, ప్రజలు పెద్దఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బండి సంజయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు...మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీసింది. కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ పార్టీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి ఏటీఎంలా వాడుకుంది. రూ.లక్షన్నర కోట్లు అప్పు చేసి మూసీని కాంగ్రెస్‌కు ఏటీఎంలాగా మార్చాలనుకుంటున్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దారుణంగా ఉంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలివ్వడం గగనమైందిసంక్షేమ పథకాలను అమలు చేయలేక, ఎన్నికల హామీలు అమలు చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది. మూసీ ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ నిధులు కూడా ఖర్చు చేసినా ఒరిగిందేమీ లేదు. పాలకులు చేస్తున్న అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతోంది. తెలంగాణలో 92 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. మూసీ పేరుతో రూ.లక్షన్నర కోట్ల అప్పు చేసి ప్రజలపై మోయలేని భారం మోపడం దుర్మార్గం. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు. కాంగ్రెస్ దోపిడీకి, పేదల ఇండ్ల కూల్చివేతకు వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్‌ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్‌కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్‌ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్‌ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
మూసీ అభివృద్ధికి కాదు.. మీ దోపిడీకి వ్యతిరేకం
నాగోలు (హైదరాబాద్): మూసీ పునరుజ్జీవం కో సం రూ.26 వేల కోట్లు మించని వ్యయాన్ని లక్షన్నర కోట్లు కావాలని చెబుతుంటే ఎలా అంగీకరిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మీరు చేసే దోపిడీకి వ్యతిరేకమని అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలతో కలిసి ఆయన నాగోల్ ఎస్టీపీని పరిశీలించారు. దేశంలోనే అతిపెద్ద మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని (ఎస్టీపీ) నాగోల్‌లో 320 ఎంఎల్డీ సామ ర్థ్యంతో నిర్మించామని, ఇక్కడ శుద్ధి చేసిన నీళ్లు నల్లగొండ జిల్లాకు పోతాయన్నారు. ఈ ఎస్టీపీలను సక్రమంగా నడుపుకుంటే చాలన్నారు. మూసీని మురికి కూపంగా మార్చింది కాంగ్రెస్, టీడీపీ ప్రభు త్వాలేనని ఆరోపించారు. దక్షిణాసియాలోనే వంద శాతం మురుగు శుద్ధి కోసం రూ.3,800 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం ప్రారంభించామని చెప్పారు. నగరంలోని 54 నాలాల నుంచి మూసీలోకి మురికి నీరు వస్తోందని చెప్పారు. మూసీకి రెండువైపులా రిటైనింగ్ వాల్ కట్టండి బీఆర్ఎస్ హయాంలో మూసీపై 15 చోట్ల బ్రిడ్జిలను నిర్మించాలని ప్రణాళికలు రూపొందించామని కేటీఆర్ వెల్లడించారు. నగరంలో ట్రాఫిక్ సమస్య లు తలెత్తకుండా మూసీపై రూ.10 వేల కోట్లతో భారీ స్కై ఓవర్ నిర్మించాలనుకున్నామన్నారు. హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూ లు చేస్తున్నారన్నారు. మూసీ పక్కన తాను మూడు నెలలు కాదు మూడేళ్లు ఉంటానని చెప్పారు. మూసీ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని తెలిపారు. మూసీకి రెండువైపులా రిటై నింగ్ వాల్ కట్టాలని సూచించారు. మూసీ పేరుతో జరుగుతున్న లూటీకి చరమగీతం పాడాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాద వ్, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, బంగారి లక్ష్మా రెడ్డి, వివేకానంద్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పాల్గొన్నారు. -
మూసీపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన బీఆర్ఎస్
-
కేటీఆర్ అతి తెలివి.
-
మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్..!
-
సీఎం రేవంత్ కు హరీష్ రావు కౌంటర్
-
మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్: హరీష్ రావు
సాక్షి, తెలంగాణభవన్: రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. అలాగే, ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మూసీలోకి వస్తున్న వ్యర్థాలను ఆపాల్సిన అవసరం ఉంది. మూసీ పునరుజ్జీవనం అని చెబుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రక్షాళన అంటున్నారు. మూసీ పునరుజ్జీవనం అంటే నదీ జలాల శుభ్రంతో ప్రక్రియ ప్రారంభం కావాలి. కేసీఆర్ హయంలో మూసీలోకి గోదావరి నీళ్లు తెచ్చేందుకు డీపీఆర్ కూడా సిద్ధమైంది.సీఎం మాటలతో అబద్దమే ఆశ్చర్యపోతోంది. పేదల ఇళ్లను కూలగొట్టడాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నాం. శత్రుదేశాలపై దాడి చేసినట్టు పేదల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చారు. మెగాస్టార్, సూపర్ స్టార్‌ను మించిన నటుడు రేవంత్ రెడ్డి. ఐదేళ్లలో రూ.లక్షా 50వేల కోట్లతో మూసీని ప్రక్షాళిస్తామన్నారు. మూసీపై సీఎం రోజుకో మాట మాట్లాడుతున్నారు.మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. చర్చకు నేను సిద్ధం. రేపు(శనివారం) ఉదయం తొమ్మిది గంటలకు నేను సిద్ధంగా ఉంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను రెడీ. సెక్యూరిటీ లేకుండా అక్కడికి వెళ్దాం. బాధితులకు మాట్లాడేందకు మీరు వస్తారా?. వారి వద్దకు వచ్చే దమ్ముందా? రివర్ ఫ్రంట్ ఏంటి..?. దాన్ని వెనుకున్న స్టంట్ ఏంటి? అని ప్రశ్నించారు. ముందు మూసీ వద్దకు పోదాం. తర్వాత కొండ పోచ్చమ్మ సాగర్, మల్లన్నసాగర్, కిష్టాపూర్ వద్దకు వెళ్దాం అన్నారు. మూసీలో పరివాహక ప్రాంతంలో నివాసం ఉండటానికి నేను సిద్ధం. 10వేల మందికి సహాయం అవుతుంది అనుకుంటే మూడు నెలలు కాదు నాలుగు నెలలు మూసీ పక్కనే నివాసం ఉంటాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంత్రి పదవి ఇచ్చింది నాకు కృతజ్ఞత ఉండాలని రేవంత్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డికి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కృతజ్ఞత ఉండాలి. నేను మంత్రి అయినప్పుడు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ చేసిండు. నేను అమరవీరులకు నివాళులర్పిస్తుంటే.. రేవంత్ రెడ్డి నా వెనకాల నిలబడి హైట్ తక్కువ ఉంటాడు కదా.. కెమెరాల్లో కనపడాలని నక్కి నక్కి చూశాడు. మా మద్దతుతోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచాడు అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
మూసీ సుందరీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో మూసీ సుందరీకరణ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అలాగే, మూసీ నదిలో డ్రైనేజీలు కలవకుండా చూడాలన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ సుందరీకరణ చేసినా పునర్జీవం చేసినా మేం వ్యతిరేకం కాదు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. డ్రైనేజీ మూసీలో కలవకుండా చూడండి. పేదల ఇల్లు కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మూసీ పునర్జీవం చేయండి. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థుల న్యాయ బద్ధమైన సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ వ్యతిరేకం. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణలో ఇంకా వ్యతిరేకత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు సీట్లే ఇవ్వలేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్ -
పనికిమాలిన మాటలు.. పాగల్ పనులు: కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా.. పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది.👉ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది👉మూసీ ప్రాజెక్టుతోనే హైదరాబాద్ అభివృద్ధి అవుతుందన్న చేతకాని దద్దమ్మ తెలుసుకోవాల్సింది చాలా ఉంది👉మూసీ ప్రాజెక్టుతో సంబంధం లేకుండానే తలసరి ఆదాయంలో (పర్ క్యాపిటాలో) తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అయింది👉మూసీ ప్రాజెక్టులో 1,50,000 కోట్లు దోచుకోకుండానే జీడీపీ అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానం సాధించింది👉బిల్డర్లను, రియల్టర్లను బెదిరించకుండానే ఐటీ ఎగుమతుల్లో బెంగళూరును హైదరాబాద్ దాటేసింది👉మీ బడే భాయ్ మోడీ ITIR ని రద్దు చేసినా, తెలంగాణకు ఒక రూపాయి సహాయం చెయ్యకపోయినా, IT ఎగుమతులలో 2035 లో చేరుకోవాల్సిన టార్గెట్ ని పదకొండేళ్ల ముందే 2023 లో చేర్చిన ఘనత కెసిఆర్ నాయకత్వానిది👉ఢిల్లీకి డబ్బు సంచులు పంపకుండానే తెలంగాణ విత్తన భాండాగారమైంది. దేశంలోనే ధాన్యరాశిగా మారింది👉పేదల కంట కన్నీరు లేకుండానే Paris, Bogota, Mexico City, Montreal లను అధిగమించి ప్రపంచంలోనే అత్యుత్తమ గ్రీన్ సిటీ అవార్డును హైదరాబాద్ దక్కించుకుంది👉మూసీ నదికి అటుఇటు అభివృద్ధి, ఆకాశ హర్మ్యాలు కడుతున్నప్పుడు మరి ఫోర్త్ సిటీ ఎందుకు? మూసీ పక్కన పెట్టుబడి పెట్టేందుకు ఫోర్ బ్రదర్స్ మనీ స్పిన్నింగ్ కోసమా? ఫ్యూచర్ సిటీ అని పొంకణాలు ఎందుకు ?👉ఎత్తైన కుర్చీలో కూర్చుంటేనో.. సమావేశాల్లో తల కిందకి, మీదకి తిప్పితేనో అభివృద్ధి జరగదు👉ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నా అంటూ ప్రభుత్వ బడి పిల్లల ఇజ్జత్ తీయకు. కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులు అద్భుతమైన ఇంగ్లిష్ మాట్లాడతారు. ప్రపంచవ్యప్తంగా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు.పాలన చేతకాక పనికిమాలిన మాటలు.. .. పాగల్ పనులు. వెరసి తెలంగాణ రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందిఆడలేక మద్దెల ఓడు అన్నట్లు పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక మూసీ మురుగులో పొర్లుతున్న కాంగ్రెస్.... తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుంది…— KTR (@KTRBRS) October 18, 2024 -
మూసీ నది సుందరీకరణ కాదు.. పునరుజ్జీవం... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
మూసీపై సీఎం తీరు అర్థరహితం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూసీ ప్రక్షాళన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరు అర్థరహితంగా ఉందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కీలక ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలంగాణ భవన్లో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని తెలిపింది. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు మురుగునీటి శుద్ధీకరణ ప్లాంట్లను ప్రతిపాదించి, చాలా వరకు పూర్తి చేసినట్లు కేటీ రామారావు పలు సందర్భాల్లో వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎస్టీపీల నిర్మాణ పనులను ఇటీవల కేటీ రామారావు పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించారు. -
‘మూసీ’ ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు. ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
Hydra: కూల్చివేతలకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహకం పరిధిలోని నివాసాల కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీగర్భం, బఫర్ జోన్లో గుర్తించిన నివాసాలకు పునరావాసం, పరిహారం అంశాలు తేల్చాకే కట్టడాల తొలగింపునకు ముందడుగు వేయాలని సర్కారు పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలు అందడటంతో రెవెన్యూ యంత్రాంగం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నదీ గర్భంలో సైతం రెడ్ మార్కింగ్ నిలిచిపోగా, నివాసాలు ఖాళీ చేసి డబుల్ బెడ్ రూమ్‌లకు తరలిన కుటుంబాల ఇళ్లను సైతం కొన్నింటిని మాత్రమే కూలీలతో కూల్చివేశారు. మిగతా కూల్చివేత పెండింగ్‌లో పడింది. కొన్ని ఉమ్మడి కుటుంబాలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించినా..వెళ్లని పరిస్థితి నెలకొంది. ఇళ్ల కూల్చివేతలపై మూసీ పరీవాహకం పరిధిలోని నివాసితుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుండడంతో అధికారులు ముందుకు వెళ్లేందుకు సాహసించడం లేదు. సర్కారు మాత్రం మూసీ ప్రక్షాళన తప్పనిసరి అని పేర్కొంటున్నా...నివాసితులకు పునరావాసం, పరిహారం ప్రధాన సమస్యగా తయారైంది. ఆదిలోనే హంసపాదు మూసీ ప్రక్షాళనకు ఆదిలోనే హంసపాదు ఎదురైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నదీ పరీవాహకం పరిధిలో సర్వే ద్వారా గుర్తించిన నివాసాలపై రెడ్మార్కింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం బెడిసి కొట్టినట్లయింది. నివాసితుల నుంచి త్రీవ వ్యతిరేకత ఎదురుకాగా, సగం ఇళ్లకు మాత్రమే రెడ్ మార్క్ వేసి వెనుకకు తగ్గక తప్పలేదు. మరోవైపు నివాసితులకు ప్రతిపక్ష పారీ్టల మద్దతు పెరగడంతో వారు సైతం ఆందోళనలను ఉధృతం చేశారు. ఈ నేపథ్యంలో నదీగర్భంలో రెడ్‌మార్క్ వేసిన గృహాల జోలికి సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పరీవాహక పరిధిలో 12,184 పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని రెండుగా వర్గీకరించి నదీగర్భం, బఫర్ జోన్లుగా విభజించారు. నదీగర్భంలో 2,166 నిర్మాణాలు ఉండగా, అందులో 288 భారీ నిర్మాణాలున్నాయి. నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్లు వరకు గల బఫర్‌జోన్ పరిధిలో 7,851 ఆక్రమణలు, ఇందులో 1032 బడా నిర్మా ణాలున్నట్లు అ«ధికారులు గుర్తించారు. మిగతా పరిధిలో 3004 అక్రమ కట్టడాలున్నట్లు బయటపడింది. పునరావాసంపై అయోమయం మూసీ నదీ గర్భంలోని నివాసితులు పునరావాసం సమస్యగా తయారైంది. అధికార లెక్కల ప్రకారం 2166 డబుల్ బెడ్రూమ్లు అవసరం ఉంటుంది. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 1595, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలో 239, రంగారెడ్డి జిల్లా పరిధిలో 332 కుటుంబాలను పునరావాసం కల్పించాల్సిన ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని 14 డబుల్ బెడ్రూమ్ సముదాయాల్లో మొత్తం మీద ఖాళీగా ఉన్న గహాలు 500కు పైగా కూడా లేనట్లు తెలుస్తోంది. నివాసాలు ఖాళీ చేసిన సుమారు 10 శాతం కుటుంబాలకు పునరావాసం కల్పించగలిగారు. సైదాబాద్, హిమాయత్‌నగర్,æ నాంపల్లి మండలాల్లోని వివిధ బస్తీలు, కాలనీలకు చెందిన 193 మందిని మలక్‌పేటలోని పిల్లిగుడిసెలు, జియా గూడ, ప్రతాపసింగారం, జంగంమెట్‌లోని రెండు పడకల గృహసముదాయానికి తరలించారు. మిగతా వారికి పునరావాసంపై ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. -
హైడ్రాపై హైరానా వద్దు.. హైదరాబాద్ అంటేనే రాక్స్, లెక్స్: భట్టి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమేనని భట్టి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు అంటూ కామెంట్స్ చేశారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ..‘చెరువుల ఆక్రమణ హైదరాబాద్‌కు పెను ప్రమాదకరంగా మారనుంది. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీ, హైడ్రాపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. హైదరాబాద్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది రాక్స్, లెక్స్ అండ్ పార్క్స్. కాలక్రమేనా పార్క్స్ అండ్ లేక్స్ కబ్జాలకు గురి అయ్యాయి.చిన్న వర్షం పడితేనే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయి. మూసీ ప్రక్షాళన సమాజ శ్రేయస్సు కోసమే. మూసీపై ప్రజలకు కొందరు భ్రమలు కల్పిస్తున్నారు. తప్పుడు ఆరోపణలతో ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014కు ముందు 2024 వరకు కబ్జాకు గురైన చెరువులపై సర్వే చేశారు. హైదరాబాద్‌లో 20 పార్కులు పూర్తిగా కబ్జా అయ్యాయి. మూసీ సుందరీకరణ విషయంలో ఎవరికీ వ్యక్తిగత ఎజెండాలు లేవు. చెరువులు కబ్జా కాకూడదు అనేదే మా ఆలోచన. మాది ప్రజా ప్రభుత్వం. ప్రజల ఎజెండా మాత్రమే కానీ.. వ్యక్తిగత ఎజెండాలు లేవు.మన ఆస్తులు మనకు కావాలి.. కాపాడుకోవాలి అని తెలంగాణ తెచ్చుకున్నాం. కోరి కొడ్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని సురక్షితంగా కాపాడుకునే బాధ్యత మనమీద ఉంది. గత పాలకులు బాధ్యత లేకుండా పాలన చేశారు. కబ్జాకు గురైన కట్టడాలను కూల్చాలని కేటీఆర్, హరీష్ అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు వక్రీకరిస్తున్నారు. మూసీ బాధితులకు ఆదుకుంటాం. ఇళ్లకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మాది. మూసీ బాధితులను ఆదుకునేందుకు మా తలుపులు తెరిచే ఉన్నాయి. మూసీ గర్భం, ఎఫ్టీఎల్ వరకు మాత్రమే వెళ్తున్నాం.. బఫర్ జోన్ జోలికి వెళ్ళడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జీహెచ్ఎంసీ ఆఫీసు కూల్చేస్తారా?: ఎంపీ అసద్ ఫైర్ -
మూసీ ప్రక్షాళన.. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి..?
-
ఫామ్‌హౌస్‌లు కాపాడుకునేందుకు దీక్షలా?: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కబ్జాల కారణంగా మూసీ పూర్తిగా మూసుకుపోతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మూసీ ప్రాంతాల్లో ఉన్న వాళ్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశారు.వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. చెరువుల ఆక్రమణతో మన బ్రతుకులు సర్వనాశనమవుతున్నాయి. బఫర్ జోన్లో ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయం చూపిస్తాం. చెరువుల్లో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నవాళ్లు మిమ్మల్ని ఏరకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తాం. మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది. ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్ రావుకు సూచన చేస్తున్నా. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి. మా ప్రభుత్వానికి ఎవరిపైనా కోపం లేదు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా అని అన్నారు ..కబ్జాల వల్ల మూసీ మూసుకుపోతోందని, అందువల్లే ప్రక్షాళన మొదలుపెట్టాం. మూసీ నిర్వాసితులను అనాథలను చేయం. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. వలస వచ్చిన వాళ్లకు మంచి జీవితాన్ని ఇవ్వడమే మా లక్ష్యం. కొందరు కావాలనే పేదలను రెచ్చగొడుతున్నారు. పేదలను రెచ్చగొట్టడం మానేసి నిర్వాసితులను ఆదుకునేందుకు సలహాలివ్వండి. తెలంగాణ ప్రజల ఆస్తులు తగ్గుతుంటే.. ప్రతిపక్ష నేతల ఆస్తులు ఎలా పెరిగాయి?. ఫామ్‌హౌస్‌లను కాపాడుకునేందుకు కొందరు దీక్షలు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ.1500 కోట్లు ఉన్నాయి. పేదలకు రూ.500 కోట్లు ఇవొచ్చు కదా?. అంబర్‌పేటలో 200 ఎకరాల భూమి ఉంది. అది పేదలకు పంచుదాం.. ప్రతిపక్ష నేతలు ఏమంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు. మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?. కేసీఆర్, కేటీఆర్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్‌లో కొంత భూమిని పేదలకు దానం చేయండి. పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి. మీ ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి. అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు. ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం 11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం 18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం. దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి. సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు. సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం అంటూ హెచ్చరించారు. ఇది కూడా చదవండి: ‘జీహెచ్ఎంసీ’పై మంత్రి కోమటిరెడ్డి సంచలన ప్రకటన -
మూసీ ప్రక్షాళనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం
-
కొండా సురేఖ వ్యాఖ్యలపై శ్రీధర్‌బాబు స్పందన ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే తన స్పందన అని చెప్పుకొచ్చారు. అలాగే, హైడ్రాకు ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించిందన్నారు.మంత్రి శ్రీధర్ బాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీ అభివృద్ధి, సంక్షేమంపై చాలెంజ్ చేస్తాం. కత్తుల యుద్ధం చేస్తా అంటే నాలుగేళ్ల తర్వాత చేద్దాం. సంచులు మోసింది వాళ్లే అందుకే అదే గుర్తుకు వస్తుంది. ఇష్టారాజ్యం, అడ్డుగోలుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే సహించేది లేదు. పార్టీ పరంగా ఏమైనా తప్పులు జరిగితే రాహుల్ గాంధీ సరిచేస్తారు. అంతేగానీ మూసీ ప్రాజెక్ట్‌కు రాహుల్ గాంధీకి ఏం సంబంధం లేదు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసి రెండు రోజులు వార్తల్లో ఉండాలి అనుకుంటున్నారు.డిజిటల్ కార్డుల కార్యక్రమంలో ఈటల రాజేందర్‌కు ఆహ్వానం అందలేదు అంటే సమీక్ష చేస్తాం. ప్రోటోకాల్ అంశంలో ఎక్కడ తప్పు జరిగిందో రివ్యూ చేస్తాం. ప్రభుత్వ కార్యక్రమాలను కావాలనే బీఆర్ఎస్ నేతలు బద్నాం చేస్తున్నారు. జహీరాబాద్‌కు పొల్యూషన్ కంపెనీలు అని హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. జహీరాబాద్‌కు త్వరలో హ్యుందాయ్ సంస్థ వస్తుంది.. అది పొల్యూషన్ సంస్థనా?. తెలంగాణ నుంచి కంపెనీలు తరలి వెళ్తున్నాయి అనేది అవాస్తవం.కొండా సురేఖ వ్యాఖ్యలపై పీసీసీ స్పందనే నా స్పందన. నేను ఇప్పటి వరకు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు.. చేయను. కేటీఆర్, బండి సంజయ్, హరీష్ రావు నా మిత్రులు. కేవలం రాజకీయ అభిప్రాయాలు మాత్రమే వేరు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రేవంత్‌కు ఈటల సవాల్.. ముక్కు నేలకు రాస్తా అంటూ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడీగా మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతానికి వెళ్దాం. ప్రజలు రేవంత్‌ను శభాష్ అంటే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దీంతో.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టు రాజకీయం మారిపోయింది.మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..రేవంత్ రెడ్డికి నిజంగా దమ్ము, ధైరం ఉంటే మూసీ బాధితుల వద్దకు ఇద్దరం కలిసే వెళ్దాం. సెక్యూరిటీ లేకుండా అక్కడికి పోదాం. మూసీ పరివాహక ప్రాంత ప్రజల రేవంత్‌ను శభాష్ అంటే నేను అక్కడే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతాను. అలాగే, రాజకీయ సన్యాసం తీసుకుంటా. రేవంత్.. ప్రజల చేత ఇంతలా తిట్టించుకున్న నాయకుడు ఎవరూ లేరు.గర్భిణీ అని చూడకుండా ఇళ్లు ఖాళీ చేయమని బెదిరించారు. కడుపు మండి మాట్లాడిన పేదలను ఐదు వేలకు అమ్ముడుపోయారని రేవంత్ అన్నారు. అద్దాల మేడలో కూర్చొన్న రేవంత్‌కు అధికారం నెత్తికెక్కింది. మూసీ ప్రక్షాళన రోడ్ మ్యాప్ ఏంటీ ? డీపీఆర్ ఏంటీ?. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. లక్షన్నర కోట్లతో ప్రాజెక్ట్ అంటే మాకు అనుమానాలు వస్తున్నాయి. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులే లేవు అంటున్నారు. ఆర్థిక వ్యవస్థ నాశనమైందని రేవంత్ చెబుతున్నారు. మరి.. లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుండి తెస్తున్నారు. కేసీఆర్ కూడా గతంలో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. రేవంత్ అదే తరహాలో వ్యవహరిస్తున్నారు. మోసం, అబద్ధానికి మారుపేరు రేవంత్’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
రూ. ఐదు కోట్ల భూమికి పరిహారం ఐదు లక్షలేనా?.. కాంగ్రెస్‌పై ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫోర్త్ సిటీ పేరుతో అధికార పార్టీ నేతలు రైతుల వద్ద నుంచి భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళనను తాము అడ్డుకోవడంలేదని క్లారిటీ ఇచ్చారు. నల్లగొండ ప్రజలు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.బీజేపీ ఎంపీ ఈటల గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘మూసీ ప్రక్షాళన వద్దు అని మేము చెప్పడం లేదు. మూసీ కంపును కడగమని మేమే చెబుతున్నాం. నల్లగొండ ప్రజలు మూసీలో స్వచ్చమైన నీరు పారాలని కోరుకుంటున్నారు. నల్లగొండకు మూసీ కంపు ఉండవద్దని మేము ఆశిస్తున్నాం. హుస్సేన్‌సాగర్ పక్కన జలవిహార్, ఐమ్యాక్స్, పెద్దపెద్ద వాళ్లకు స్థలాలు ఇచ్చారు. ఇదే తరహాలో మూసీ బాధితులకు కూడా మంచి స్థలం ఇవ్వాలి.ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ భూసేకరణను కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. కేంద్రం దగ్గర మాట్లాడే బాధ్యత నాది. ప్రభుత్వం అంటే మీ అయ్య సొత్తు కాదు. ఐదు కోట్ల రూపాయల ఇళ్లు కూలగొట్టి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇస్తారట. భూములు సేకరించేటప్పుడు స్థానికుల అభిప్రాయం సేకరించరా?. రెండు ఎకరాల భూమి తీసుకుని రెండు లక్షల రూపాయలు ఇస్తే ఆ రైతు పరిస్థితి ఏంటి?. గజ్వేల్‌లో 19 గ్రామాలు ఖాళీ చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. కొంత మంది ప్రజలు అడ్డామీది కూలీలుగా మారారు. భూమి ఉంటే భద్రత, భరోసా.భూమి లాక్కోని రోడ్డుమీద పడేస్తే ఊరుకోవడానికి ఇది నిజాం సర్కార్ కాదు.. రజాకార్ సర్కార్ కూడా కాదు. రైతులు దగా పడుతుంటే చూస్తే ఊరుకునేది లేదు. ఫోర్త్ సిటీలో రైతుల నుంచి భూములు లాక్కొని అధికార పార్టీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు రైతుల పొట్టకొట్టి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఎంత గొప్ప పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. ప్రజలకు ఎంత గొప్ప సేవ చేశామన్నది ముఖ్యం. ప్రజలు ఓట్లు వేసి కేవలం మీకు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదు అని గుర్తు పెట్టుకోండి’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇది కూడా చదవండి: కొండా సురేఖ కామెంట్స్ దుమారం.. సినీ పెద్దలకు టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి -
బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులు: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: పేదలు, మధ్యతరగతి ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ తెచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వమని తెలిపారు. మూసీలో అక్రమ కట్టడాలు గుర్తించాలని గతంలో కేసీఆర్ ఆదేశించలేదా అని ప్రశ్నించారు. మూసీని కాలుష్య రహితంగా చేయాలని కేసీఆర్ చెప్పలేదా అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులు మర్చిపోయినట్లున్నారని సెటైర్లు వేశారు.ఈ మేరకు మంత్రి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. 2021లో మూసీపై కేసీఆర్ ప్రభుత్వం సమావేశాలు పెట్టిందని తెలిపారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్‌ను నిర్ణయించారన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ హయాంలోనే మూసీకి సరిహద్దులను ఫిక్స్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఎందుకని బీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారని అన్నారు. -
బీఆర్ఎస్కు కోమటిరెడ్డి సవాల్.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్షాలకు మానవత్వం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మూసీ నది విషయంలో ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణను పది సంవత్సరాలు పాలించి బీఆర్ఎస్ నేతలు దోచుకున్నారని ఘాగు విమర్శలు చేశారు.మంత్రి కోమటిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మూసీలో పారేది విషపు నీరు. తెలంగాణ వచ్చాక మూసీ స్థితి మారుతుందని అనుకున్నాం. మూసీ కోసం కేటీఆర్ వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు. మూసీ డెవలప్మెంట్ బోర్డు అన్నావ్ కదా ఏమైంది?. గుడిసె వేసుకుని నివాసం ఉంటున్న వాళ్లు మూసీ పక్కన ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. లక్షల కోట్లు సంపాదించుకున్నావు కాదా.. పేదలపై కొంచెం కూడా జాలి లేదా?. మూసీ ప్రక్షాళన చేస్తే కమీషన్ రాదని మొదలు పెట్టలేదా?. మూసీని ప్యూరిఫైర్ రివర్‌గా మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది.ప్రతిపక్షాలకు కనీసం మానవత్వం లేదు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చి మూసీ ప్రక్షాళనపై మాట్లాడాలి. కేసీఆర్, కేటీఆర్ నాయకులు కాదు. కాళేశ్వరం ఒక తుగ్లక్ పని. మల్లన్న సాగర్ నిర్వాసితులను గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో చూశాం. మూసీ పరిస్థితి ఎలా ఉందో కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేసిన ప్రియాంక వర్గీస్‌ను అడగండి. మల్లన్న సాగర్ నిర్వాసితులను పోలీసులతో ఎందుకు కొట్టించారు?.నల్గొండ జిల్లా గ్రౌండ్ వాటర్‌లో ఫ్లోరైడ్ ఎక్కువ. మూసీ ప్రక్షాళనలకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి. నేను నల్గొండ వ్యక్తిగా, మూసీ బాధితుడిగా మాట్లాడుతున్నాను. మమ్మల్ని చావామంటారా?. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ వాళ్లు గోదావరి జలాలతో సంతోషంగా ఉండాలి. మేము మాత్రం నల్గొండ మూసీ మురికితో చావాలా?. మూసీ నీళ్లను అమెరికా తీసుకెళ్లి టెస్ట్ చేయించండి. నల్గొండ వచ్చినా, వయా నల్గొండ వెళ్ళినా అక్కడి ప్రజలు ప్రతిపక్ష నేతలకు బుద్ధి చెప్తారు. జిల్లా పరిషత్ బడుల్లో చదివిన మాకే ఇంత తెలివి ఉంది. అమెరికాలో చదువుకున్న అని చెప్పుకుంటున్న నీకు తెలివి ఏమైంది?. నల్గొండలో మీ బంధువులు లేరా?. నల్గొండపై ఎందుకు కక్ష కట్టారు?.బీఆర్ఎస్ నేతలకు సవాల్ చేస్తున్నా.. మూసీపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్దామా?. బస్సు పెడతాను, నేను మీతో పాటే వస్తాను. ప్రజలు ఏం చేస్తారో మీరే చూడండి. నేను 25ఏళ్ల కింద మూసీ నది కోసం దీక్ష చేశాను. జయశంకర్ అప్పుడు నాకు మద్దతు తెలిపారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రెచ్చగొడుతున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: బుల్డోజర్ను బొంద పెట్టండి: మూసీ నిర్వాసితులతో కేటీఆర్