Nakshatra
-
మరో మహిళతో రూమ్‌లో ఉండగా పట్టుకున్న నక్షత్ర
-
సొంత అక్కను పడుకుంటావా అని అడిగాడు.. ఆడియో బయటపెట్టిన భార్య
-
14న ప్రధాని మోదీ నామినేషన్?
దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మే 14న తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అభిజిత్ ముహూర్తంలో ప్రధాని తన నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందించనున్నారు. అయోధ్య రామ మందిర శంకుస్థాపనకు ముహూర్తాన్ని అందించిన పండిట్ గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తాజాగా ప్రధాని మోదీ నామినేషన్ దాఖలుకు ముహూర్తాన్ని నిర్ణయించారు.మే 14న గంగా సప్తమి. ఆరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఆ రోజున నామినేషన్ దాఖలు చేయడం శ్రేయస్కరమని పండితులు ప్రధాని మోదీకి సూచించారు. గంగా సప్తమి రోజున బ్రహ్మదేవుని కమండలంలో నుంచి గంగ జన్మించిందని చెబుతారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం మే 13న ప్రధాని మోదీ వారణాసిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ మర్నాడు అంటే మే 14న ప్రధాని నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి ముందు మోదీ గంగామాతకు పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమాలను సంబంధించిన షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. -
వధూవరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయకూడదా..?
కొత్త ఏడాది నేపథ్యంలో పంచాగ శ్రవణం చేస్తాం. ఈ ఏడాది పెళ్లి ఈడు కొచ్చిన పిల్లలకు పెళ్లి చేయదలచుకున్న తల్లిదండ్రలు వాళ్ల గ్రహస్థితి ఎలా ఉందని తెలుసుకుంటారు. ఎలాంటి వరుడని చేస్తే మంచిది, ఏ నక్షత్రం అయితే బెటర్ అని ముందుగా పంచాగంలో చూసుయకోవడం వంటివి చేస్తారు. తరుచుగా అందరిలో వచ్చే అతిపెద్ద సందేహం.. వధువరులిద్దరిది ఒకే నక్షత్రం అయితే చెయ్యొచ్చా? లేదా?. చేస్తే ఏమవుతుంది? ఏయే నక్షత్రాల వారు చేసుకోకూడదు.. వధూవరులు ఒకే నక్షత్రములు రాశిభేదమున్నను ఏకరాశి అయి ఉండి వేరే నక్షత్రములైయున్నను శుభము. అయితే కొన్ని నక్షత్రాల వద్దకు వచ్చేటప్పటికీ..వధువరులిద్దరిది ఒకే నక్షత్రమైతే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కొందరికైతే అస్సలు పొసగదు. అందువల్లే నక్షత్రం వారి రాశి ఆధారంగా కొన్ని నక్షత్రాలు ఇరువురి ఒకటే అయినా సమస్య ఉండదు. కొన్ని నక్షత్రాల విషయంలో మాత్రం వివాహం చేసే విషయంలో జాగ్రత్తుతు తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు. ఇంతకీ ఏయే నక్షత్రాలు వధువరులిద్దదరిది ఒకటే అయినా సమస్య ఉండదు? వేటికి సమస్య అంటే.. రోహిణి, ఆర్ద్ర, పుష్యమి, మఘ, విశాఖ, శ్రవణము, ఉత్తరాభాద్ర, రేవతి ఈ ఎనిమిది నక్షత్ర ములలోను వధూవరులు ఏకనక్షత్రము వారైనను వివాహము చేయవచ్చును. అశ్వని, భరణి, ఆశ్లేష, పుబ్బ, స్వాతి, మూల, శతభిషము మధ్యమములు. తక్కిన నక్షత్రములు ఒక్కటైనచో వధూవరులకు హాని కలుగును. 27 నక్షత్రములలో ఏ నక్షత్రము ఏక నక్షత్రము అయినప్పటికీ పాదములు వధూ వరులు ఇరువురుకి వేరువేరుగా ఉన్నచో వివాహం చేయవచ్చు. గ్రహమైత్రి బ్రాహ్మణులకు, క్షత్రియులకు గణకూటమి (దేవ, రాక్షస, మనుష్య గణములు) వైశ్యులకు స్త్రీ దీర్ఘ కూటమి, శూద్రులకు యోని కూటమి (జంతువులు) ప్రధానంగా చూడవలెను. పాయింట్ల పట్టిక చూసినప్పటికీ ఈ కూటములు చూడనిదే ఎటువంటి ప్రయోజనం లేదు. (చదవండి: ఈ కొత్త సంవత్సరం మేష రాశివారికి ఆర్థిక లాభాలు ఉంటాయి) -
ఈవీవీ సినిమాలు గుర్తుకు వస్తున్నాయి
‘‘ఒకే సినిమాలో ఇంతమంది నటీనటులను చూస్తుంటే ఈవీవీగారి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. ‘అన్‌స్టాపబుల్’ చిత్రం పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, ఆక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి అతిథిగా ΄ాల్గొన్నారు. సప్తగిరి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో సన్నీ, డైమండ్ రత్నబాబులకు విజయం రావాలి’’ అన్నారు. ‘‘కుటుంబం అంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది. డైమండ్ రత్నబాబు మంచి హిలేరియస్ కథ రాశారు’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా ΄ోస్టర్ చూసిన వారు ఈవీవీగారి సినిమాలాంటి అనూభూతి కలుగుతుందని చెప్పడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఫస్ట్ షో ఎక్కడ ప్రదర్శించబడితే అక్కడ ఓ సీట్‌ను ఈవీవీగారి కోసం ఉంచుతాం. ఇది ఆయనకు మేం ఇచ్చే ఓ చిరు కానుక’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘క్వాలిటీ కామెడీ ఉన్న ఈ ఫిల్మ్ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అన్నారు రజిత్ రావు. -
అందుకే ‘అన్ స్టాపబుల్’ టైటిల్ పెట్టాం : వీజే సన్నీ
నేను బాలకృష్ణ గారికి పెద్ద అభిమానిని. అన్‌స్టాపబుల్ షోకి కూడా వెళ్లాను. నా సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెడుతున్నారని రత్నబాబుని అడిగాను. ‘మన టైటిల్ అన్ స్టాపబుల్ అన్ లిమిటెడ్ ఫన్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే టైటిల్ జనాల్లో ఉంది కాబట్టి అన్ స్టాపబుల్ యాప్ట్ గా ఉంటుంది’ అని చెప్పారు. నాకు కూడా టైటిల్ బాగా నచ్చింది’ అని హీరో వీజే సన్నీ అన్నాడు. రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ 'అన్ స్టాపబుల్'. 'అన్ లిమిటెడ్ ఫన్' అన్నది ఉపశీర్షిక. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూన్ 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీజే సన్నీ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► బిగ్ బాస్ తర్వాత కొత్త నిర్మాణ సంస్థల నుంచి చాలా మంది సంప్రదించారు. అయితే కథలన్నీ ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ వున్నవే వచ్చాయి. నాకు కామెడీ, థ్రిల్లర్, హారర్ కామెడీ కథలు చేయాలని ఉండేది. పక్కింటి కుర్రాడిలా అనిపించే పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి సమయంలో 'అన్ స్టాపబుల్' లాంటి అన్ లిమిటెడ్ ఫన్ కథ విన్నాను. చాలా నచ్చింది. కథ విన్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. కథని నమ్మి చేసిన చిత్రమిది. ► ఇందులో చాలా మంది సీనియర్ నటీనటులు ఉన్నారు. వాళ్లంతా నాకు కంఫర్ట్ జోన్ కల్పించారు. పృద్వీతో మంచి స్నేహం ఏర్పడింది. అలాగే పోసాని, రాజా రవీంద్ర, రఘు ఇలా అందరితో పని చేయడం మంచి అనుభూతి. నన్ను ఎప్పుడూ కొత్తవాడిలా ట్రీట్ చేయలేదు. నేను నాటకరంగం నుంచి రావడం కూడా ప్లస్ అయ్యింది. ► సప్తగిరి చాలా ఎనర్జిటిక్. సీన్ లో ఆయన ఉండే ఇన్వాల్వ్ మెంట్ నెక్స్ట్ లెవల్ ఉంటుంది. సీన్ ఇచ్చిన వెంటనే ఆయన ఒక ప్లాన్ లో ఉంటారు. ఆ ప్లాన్ ని మనం క్యాచ్ చేసుకోవాలి. తనని పరిశీలించాను కాబట్టి అతనకి తగట్టు నేను వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. చాలా స్పోర్టివ్ స్పిరిట్ తో వర్క్ చేశాం. ► ఇందులో నాకు జోడిగా నక్షత్ర నటించింది. తను ఇంతకుముందు ‘పలాస’ అనే సినిమా చేశారు. తను తెలుగమ్మాయి కావడం వలన సెట్స్ లో ఉన్నప్పుడు ప్రామ్టింగ్ ఇచ్చే అవసరం ఉండేది కాదు. చాలా చక్కగా నటించారు. ► బిగ్ బాస్ తర్వాత దాదాపు ముఫ్ఫై కథలు విన్నాను. ఇందులో డైమండ్ రత్నబాబు గారు చెప్పిన కథ చాలా నచ్చింది. కథని బలంగా నమ్మి చేసిన చిత్రమిది. రత్నబాబు గారు కూడా చాలా స్వేచ్ఛ ఇచ్చారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం. ► ‘ఎటీఎం’ చూసి దర్శకుడు హరీష్ శంకర్ గారు ప్రశంసించారు. ఆయన ప్రశంస నాలో ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఏ పాత్రనైనా చేయగలననే నమ్మకం ఉంది. నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఒక ఆర్టిస్ట్ గా ముందుకు వెళ్లాలని ఉంది. హీరోగా చేస్తూనే ఓ పెద్ద హీరో సినిమాలో చిన్న క్యారెక్టర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ► ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను. ఒకటి ఫన్, మరొకటి సస్పెన్స్ థ్రిల్లర్. -
కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు.. అవి సహజమే: డైరెక్టర్
‘‘ప్రతి రచయిత, దర్శకుడు వారి బలాలు ఏమిటో తెలుసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. రచయితగా ‘పిల్లా నువ్వులేని జీవితం’ (కొన్ని కామెడీ సన్నివేశాలు), ‘సీమశాస్త్రి’, ‘ఈడోరకం ఆడోరకం’లాంటి నవ్వించిన సినిమాలే నాకు ఇండస్ట్రీలో పేరు తెచ్చాయి. దర్శకుడిగా నేను చేసిన రెండు సినిమాలు (బుర్రకథ, సన్నాఫ్ ఇండియా) ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో నా బలం కామెడీ అని నమ్మి ‘అన్‌స్టాపబుల్’ మూవీ చేశాను. ఇకపై ప్రతి ఏడాది నా నుంచి ఓ నవ్వించే సినిమా వస్తుంది. ఒకవేళ ప్రయోగాలు చేయాలనుకుంటే ఓటీటీలో చేస్తా’’ అన్నారు డైమండ్ రత్నబాబు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సా ఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో కల్యాణ్ పాత్రలో సన్నీ, జిలానీ రాందాస్‌గా సప్తగిరి నటించారు. చాలామంది హాస్యనటులు నటించారు. ఇక ‘అన్‌స్టాపబుల్’ సినిమా కాన్సెప్ట్‌ని చెప్పలేను. కానీ ఈ సినిమాలోని ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో అన్ని పాత్రలు ఓ పాయింట్‌కు కలుస్తాయి. ఈ అంశాలను థియేటర్స్‌లోనే చూడాలి. సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో రజిత్‌రావు రాజీ పడకుండా నిర్మించారు. నిజం చెప్పాలంటే.. యాక్షన్, ఫ్యామిలీ తరహా సినిమాలను తీయడం కంటే కామెడీ సినిమాలు తీయడం కత్తిమీద సాము వంటిది. కానీ ఈ విషయంలో జంధ్యాల, ఈవీవీ, రేలంగి, ఎస్వీ కృష్ణారెడ్డిగార్లు సక్సెస్ అయ్యారు. నేను రచయితగా ఎలా అయితే నవ్వించానో దర్శకుడిగానూ నవ్వించే సినిమాలే చేస్తాను. ఏ రచయిత అయినా కెప్టెన్ ఆఫ్ ది షిప్ (డైరెక్టర్) కావాలనుకుంటాడు. నేను అలానే రచయిత నుంచి దర్శకుడిని అయ్యాను. నేను రచయితగా ఉన్నప్పుడు కొంతమంది దర్శకులతో అభిప్రాయబేధాలు వచ్చి ఉండొచ్చు. మన కుటుంబాల్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో కూడా అలాంటివి సహజమే. అయినా ఇప్పుడు ప్రతి రచయితలోనూ ఓ దర్శకుడు ఉన్నాడు. తమిళ పరిశ్రమలో ఎవరైతే కథ రాస్తారో వాళ్లకే దర్శకత్వం చేసే చాన్స్ కూడా ఉంటుంది. తెలుగులో కూడా అది మొదలైనట్లుంది’’ అని అన్నారు. -
కొత్త వాళ్లను ప్రోత్సహించాలి
‘‘జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిగార్ల సినిమాల్లో తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్లీ ఇంతమందిని (దాదాపు 50 మంది) ఒక్క దగ్గరికి చేర్చి ‘అన్‌స్టాపబుల్’ లాంటి మంచి వినోదాత్మక సినిమా చేయడం ఆనందంగా ఉంది. నిర్మాతలని యువ దర్శకులు, నటులు ప్రోత్సహించాలి.. అప్పుడే చిత్ర పరిశ్రమకు కొత్త ప్రతిభ వస్తుంది’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్ స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు. రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘అన్‌స్టాపబుల్’లో నటించిన వారందరూ ఒక బ్రహ్మానందం కావాలి’’ అన్నారు. ‘‘డైమండ్ రత్నబాబులాంటి దర్శకులు సక్సెస్ అయితే మాలాంటి వాళ్లకు మరిన్ని సినిమాలు వస్తాయి’’ అన్నారు సప్తగిరి. ‘‘ఈ మూవీతో ప్రేక్షకులను నవ్విస్తాం’’ అన్నారు వీజే సన్నీ. ‘‘అన్‌స్టాపబుల్’ పై ఉన్న నమ్మకంతో రిలీజ్‌కి ముందే నాకు కారుని బహుమతిగా ఇచ్చారు నిర్మాత రజిత్ రావు’’ అన్నారు డైమండ్ రత్నబాబు. ‘‘ఫ్యామిలీతో చూసే చిత్రం ఇది’’ అన్నారు రజిత్ రావు. -
రాహుల్ సిప్లిగంజ్ పాడిన బుల్..బుల్.. సాంగ్ విన్నారా?
వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా, నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘బుల్ బుల్ అన్‌స్టాపబుల్..’ అనే తొలి పాటని హీరో గోపీచంద్ విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్‌తో కలసి భీమ్స్ పాడారు. ‘‘ఈ పాటలో సన్నీ, సప్తగిరి మాస్ మూమెంట్స్ ఆకట్టుకుంటాయి’’ అని చిత్రయూనిట్ తెలిపింది. -
‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను విడుదల చేసిన నాగార్జున
బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సప్తగిరి హీరోలుగా నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’. అన్ లిమిటెడ్ ఫన్ అన్నది ఉపశీర్షిక. డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ‘అన్‌స్టాపబుల్’ టీజర్‌ను హీరో నాగార్జునతో విడుదల చేయించారు. ‘ట్విస్టులకే టీషర్టు వేసినట్లుండే ఇద్దరు ఇలఖత మఫిలియా గురించి మీకు చెప్తా’ అంటూ 30 ఇయర్స్ పృథ్వీ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగుతుంది. ‘‘డైమండ్ రత్నబాబు తన మార్క్ ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులను నవ్వించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్క్రీన్‌ప్లే రసవత్తరంగా ఉంటుంది. భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ అసెట్. రఘుబాబు, బిత్తిరి సత్తి, షకలక శంకర్, పాత్రలు నవ్వులు పంచే విధంగా ఉంటాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: వేణు మురళీధర్, కో ప్రొడ్యూసర్: షేక్ రఫీ, బిట్టు, రాము ఉరుగొండ. -
టీజర్ బాగుంది
‘‘తెలుగు చిత్ర పరిశ్రమకి యువతరం రావాల్సిన అవసరం ఉంది. కొత్త తరాన్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ‘ఎర్రర్ 500’ టీజర్ బాగుంది. యూనిట్ ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జస్వంత్ పడాల, నక్షత్ర త్రినయని ప్రధాన పాత్రల్లో సందీప్ మైత్రేయ ఎన్. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రర్ 500’. యు. బాలరెడ్డి (ఇన్ఫోసిటీ బిల్డర్స్) నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు. జస్వంత్ మాట్లాడుతూ– ‘‘ఎర్రర్ 500’ అందరికీ కనెక్ట్ అయ్యే కథ. నన్ను హీరోగా పరిచయం చేసిన బాలరెడ్డిగారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా రూపొందిన చిత్రమిది. ‘బిగ్ బాస్’ ఫేం జస్వంత్‌ని హీరోగా లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’’ అన్నారు సందీప్. ఈ చిత్రానికి కెమెరా: శశాంక్ శ్రీరామ్– ప్రశాంత్ మన్నె, సంగీతం: ఫణి కల్యాణ్. -
ఎయిర్ హోస్టెస్, ఏవియేషన్ సిబ్బంది ఫ్యాషన్ షో అదుర్స్
-
యాక్షన్ జెమ్
నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా నటించిన తాజా చిత్రం ‘జెమ్’. రాశీ సింగ్, నక్షత్ర హీరోయిన్లుగా నటించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో మహాలక్ష్మీ మూవీ మేకర్స్ పతాకంపై పత్తికొండ కుమారస్వామి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని హీరో రవితేజ విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ రాజా మాట్లాడుతూ– ‘‘యాక్షన్ నేపథ్యంలో సాగే చిత్రమిది. రెండేళ్లు శ్రమించి సిద్ధం చేసిన కథను అంతే బాగా తెరకెక్కించారు సుబ్రహ్మణ్యంగారు’’ అన్నారు. ‘‘అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాం’’ అన్నారు సుశీల సుబ్రహ్మణ్యం. ‘‘అవుట్‌పుట్ సంతృప్తికరంగా వచ్చింది’’ అన్నారు పత్తికొండ కుమారస్వామి. ‘‘తమిళ, కన్నడలో సినిమాలు చేసిన కుమారస్వామిగారు తెలుగులో మా అబ్బాయితో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు శివాజీ రాజా. ఈ చిత్రానికి సంగీతం: సునీల్ కశ్యప్. -
ఆ సినిమా కోసం బరువు తగ్గుతున్నాను
‘‘కథలో కొత్తదనం ఉండి నటిగా నన్ను ఛాలెంజ్ చేసే పాత్రలు చేయాలన్నది ప్రస్తుతం నా ఆలోచన. నటిగా ఒక జానర్‌కి ఫిక్స్ అయిపోకుండా అన్ని రకాల పాత్రలు, సినిమాలు చేసి విభిన్నత చాటుకోవాలనుంది’’ అన్నారు నటి నక్షత్ర. ‘రాజ్‌దూత్, పలాస’ చిత్రాల్లో హీరోయిన్గా నటించిన అచ్చ తెలుగు హీరోయిన్ నక్షత్ర. ఆమె పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా నక్షత్ర మాట్లాడుతూ – ‘‘నన్ను హీరోయిన్గా చూడాలన్నది మా నాన్న కల. కూచిపూడి డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నాను. గతంలో ‘లిటిల్ బుద్ధ’ అనే చిల్డ్రన్ ఫిల్మ్‌లో నటించాను. హీరోయిన్గా ‘పలాస 1978’ సినిమాతో నాకు మంచి పేరొచ్చింది. ఆ సినిమాలో పాత్ర కోసం సుమారు పది కిలోల బరువు పెరిగాను. తెలుగమ్మాయిగా ఇండస్ట్రీ నన్ను బాగా రిసీవ్ చేసుకుంది. చాలా సపో ర్టివ్గా ఉంది. లాక్డౌన్లో ‘ఆహా’ ప్లాట్ఫామ్లో ‘గీతా సుబ్రహ్మణ్యం, మెట్రో కథలు’ ప్రాజెక్ట్‌లు చేశాను. అలానే కొన్ని కొత్త కథలు విన్నాను. అల్లు అరవింద్‌గారి గీతా ఆర్ట్స్‌లో ఓ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా ఎంపికయ్యాను. అలాగే డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా కూడా అంగీకరించాను. ఆ సినిమా కోసం బరువు తగ్గుతున్నాను. లాక్డౌన్ ముందే ఓ సినిమా చిత్రీకరణ పూర్తయింది. అందులో నెగటివ్ రోల్లో కనిపిస్తాను. ఈ బర్త్‌డేకి ఓ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఎటు చూసినా ఆడవాళ్లపై అత్యాచారం అనే వార్తలే ఎక్కువగా వింటున్నాం. దానికి సంబంధించిన అవగాహన తీసుకురావాలనేది ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం. నటి కావాలని ఎంత కష్టపడ్డానో, ఈ ప్రోగ్రామ్‌కి కూడా అంతే కష్టపడతాను. ఓ బ్లాగ్ ఏర్పాటు చేసి ఓ కవిత ద్వారా దీనిని ప్రారంభిస్తాం’’ అన్నారు. -
కష్టం వృథా కాలేదు – తమ్మారెడ్డి భరద్వాజ
‘‘నా నలభైఏళ్ల కెరీర్లో నాకు గుర్తుండిపోయే చిత్రం ‘పలాస’. ఈ సినిమాలో నటీనటుల అద్భుతమైన హావభావాలకు ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. మా కష్టం వృథా కాలేదని భావిస్తున్నాను’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ నెల 6న విడుదలైంది. తమ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో రక్షిత్ మాట్లాడుతూ– ‘‘మా సినిమాకు మంచి రివ్యూస్ రావడం హ్యాపీ. సినిమాలోని ప్రతి సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం మరిన్ని మంచి సినిమాలు చేయడానికి ధైర్యాన్నిచ్చింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘దర్శకుడి ఆలోచన, నిర్మాత ప్రయత్నం సినిమాను నిలబెట్టాయి. నటీనటుల పాత్రలతో పాటు నా పాత్రకూ మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు–నటుడు రఘుకుంచె. ‘‘పలాస’లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు హీరోయిన్ నక్షత్ర. -
ఈ సినిమా సమర్పించడం గర్వంగా ఉంది
‘‘ఇప్పటివర కూ చాలా సినిమాల్లో నా పేరు ఉంది. కానీ వాటన్నింట్లో ‘పలాస’ చాలా ప్రత్యేకమైన సినిమా. నాకు బాగా సంతృప్తి కలిగించిన సినిమా. ‘పలాస’ సినిమాను సమర్పించడం గర్వంగా ఉంది’’ అన్నారు దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా సమర్పకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ప్రసాద్ పలు విషయాలు పంచుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లా డుతూ – ‘‘కరుణకుమార్ కథ చెప్పగానే నాకు చాలా నచ్చింది. ఎక్కడా వంకలు పెట్టలేని విధంగా చెప్పాడు. గతంలో వచ్చిన ‘మా భూమి’ వంటి సినిమాలా అనిపించింది. ఈ కథను ప్రసాద్‌గారి దగ్గరకు తీసుకెళ్లాం. ఆయనకు కూడా నచ్చింది. కరుణ కథ చెప్పినట్టే తెరకెక్కించాడు. ఎక్కడా తప్పులు కనిపించలేదు. వర్గ విబేధాలను కరుణ అద్భుతంగా తెరకెక్కించాడు. వాస్తవ సంఘటనలకు కాస్త కమర్షియల్ అంశాలు జోడించి ఈ సినిమా తెరకెక్కించాడు. అల్లు అరవింద్‌గారు ఈ సినిమా చూసి కరుణకు వాళ్ల బ్యానర్లో సినిమా చేసే అవకాçశం ఇచ్చారు’’ అన్నారు. ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘భరద్వాజగారు ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేవరకూ మా నీడలా మాతోనే ఉన్నారు. ఆయన మా వెనక ఉండటం వల్ల చాలా సమస్యలు సులువుగా పరిష్కారం అయ్యాయి. మా ఇద్దరి ఆలోచనా విధానం చాలా దగ్గరగా ఉంటుంది. ప్రతిసారీ మన సినిమాల్లో గెలిచిన వాళ్ల కథనే చూపిస్తుంటాం. ఇందులో ఓడినవాళ్ల కథను చెప్పాం. అణచివేయబడుతున్నవాళ్ల కథను చెప్పాం’’ అన్నారు. -
పలాస నాకు చాలా ప్రత్యేకం
‘‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమాలో కమల్‌హాసన్‌గారి పాత్రకు దగ్గరగా ఉండే పాత్రని ‘పలాస 1978’ చిత్రంలో చేశా. కచ్చితంగా వైవిధ్యంగా ఉంటుంది. ఒక నటుడిగా, సంగీత దర్శకుడిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇందులో సంగీతం కోసం సహజమైన వాయిద్యాలు వాడాం’’ అన్నారు రఘు కుంచె. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ చిత్రంలో విలన్‌గా నటించడంతో పాటు సంగీతం అందించిన రఘు కుంచె మాట్లాడుతూ– ‘‘నేను గతంలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ‘పలాస’ నాకు చాలా ప్రత్యేకం. ఈ సినిమాలో మైండ్ గేమ్ ఆడే విలన్ పాత్రలో మేకప్ లేకుండా సహజంగా నటించాను. ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఫ్రెష్‌గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రీ రికార్డింగ్ అవసరం లేకుండా పోయింది. సంగీత దర్శకుడిగా, నటుడిగా ‘పలాస 1978’ నా కెరీర్లో బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ సినిమాతో ఐదుగురు కొత్త గాయకుల్ని పరిచయం చేస్తున్నాం. జానపద కళ ఉన్న సినిమా కావడంతో ఫ్రెష్‌నెస్ కోసం కొత్తవారిని తీసుకున్నాం. ఉత్తరాంధ్ర జానపద సాహిత్యంతో కూడిన పాటలకు మంచి స్పందన వచ్చింది. నాకు మొదటి నుండి ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన నాకు ఫోక్ సాంగ్స్ పాడటం అలవాటు.. అలా గాయకుణ్ణి అయ్యాను. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేసిన సినిమాల్లో ఫోక్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ‘పలాస’ ప్రివ్యూ చూసిన తర్వాత కొందరు దర్శక–నిర్మాతలు ఫోన్ చేసి, మంచి పాత్రలున్నాయి చేయమని అడిగారు. ఆ వివరాలు త్వరలోనే చెబుతా’’ అన్నారు. -
సుకుమార్ అభినందనను మర్చిపోలేను
‘‘లండన్ బాబులు’ సినిమా తర్వాత ఒక వైవిధ్యమైన సినిమా చేయాలనుకున్నాను. రెగ్యులర్ ప్రేమకథలు కాకుండా కొత్త నేపథ్యం ఉన్న కథలకోసం చూస్తున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజగారి ద్వారా ‘పలాస 1978’ కథ నా దగ్గరకు వచ్చింది. తమ్మారెడ్డిగారికి, మా నాన్నగారికి కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది’’ అని రక్షిత్ అన్నారు. కరుణకుమార్ దర్శకత్వంలో రక్షిత్, నక్షత్ర జంటగా తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్ మాట్లాడుతూ – ‘‘కరుణ కుమార్‌గారు కొన్ని వాస్తవ సంఘటనలతో ఈ కథ రాసుకున్నారు. ఈ సినిమా కోసం శ్రీకాకుళం యాసని ప్రాక్టీస్ చేశా. 40 రోజులు పలాసలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాం. షూటింగ్ కంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కవ సమయం పట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా మా సినిమా గురించి మాట్లాడుకునే దాకా వచ్చామంటే కారణం కరుణ కుమార్. మా సినిమా ప్రివ్యూ చూసినవాళ్లు నా నటన గురించి మాట్లాడుతుంటే సంతోషంగా అనిపించింది. ఇందులో నాలుగు వేరియేష¯Œ్సలో కనపడాలి అన్నప్పడు ఛాలెంజ్‌గా తీసుకున్నాను. పాత్ర కోసం బరువు తగ్గడం, పెరగడం వంటివి చేశాను. ‘అసురన్’ తరహా సినిమా ‘పలాస 1978’. ఈ సినిమా చూసి డైరెక్టర్ సుకుమార్‌గారు అభినందించడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆ ఒక్క ఫోన్ కాల్ నాలో నమ్మకం పెంచింది’’ అన్నారు. -
వాస్తవ సంఘటనల పలాస
‘‘స్వచ్ఛ భారత్‌కి నేను చేసిన ‘చెంబుకు మూడింది’ లఘు చిత్రం జాతీయ స్థాయిలో రెండో బహుమతి తెచ్చుకోవడం నా జీవితంలో కీలక మలుపు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి కేటీఆర్‌గార్లు అప్పుడు నన్ను సన్మానించారు. కేటీఆర్‌గారి ప్రోత్సాహంతో చాలా ప్రభుత్వ యాడ్స్ చేశాను. ‘పలాస ’ నా మొదటి సినిమా అవుతుందనుకోలేదు’’ అన్నారు దర్శకుడు కరుణ కుమార్. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యా¯Œ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్ష¯Œ ్స ద్వారా ఈ నెల 6న విడుదల కానుంది. కాగా ‘పలాస 1978’ ట్రైలర్‌ని రానా ట్విట్టర్లో విడుదల చేసి, ‘ఈ చిత్రం విజువల్స్, నేపథ్యం చాలా కొత్తగా ఉన్నాయి’’ అన్నారు. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. తమ్మారెడ్డి భరద్వాజగారికి కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాం అని, నిర్మాత ప్రసాద్‌గారిని పరిచయం చేశారు. ఇది ఒక వ్యక్తి కథో, కుటుంబం కథో కాదు.. ఇది ఒక సమూహం కథ. ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా పలాస కథను తెరకెక్కించాం. ఈ చిత్రంలో ఒక నిజాయతీ కథ కనిపిస్తుంది. సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం.. వాళ్లు మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు’’ అన్నారు. -
భిన్నమైన పలాస
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘సెన్సార్ బోర్డ్‌వారు ఎక్కువ కట్స్ సూచించడంతో రివైజ్ కమిటీకి వెళ్లాం. అక్కడ మా చిత్రాన్ని చూసి, ప్రశంసించారు. తెలుగు సినిమాలో ‘పలాస 1978’ చిత్రం భిన్నమైనదని చెప్పగలను. రచయితగా ఉన్న నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, మాకు అండగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజగారికి, మా సినిమాను విడుదల చేస్తున్న సురేష్ ప్రొడక్షన్ సంస్థవారికి ధన్యవాదాలు’’ అన్నారు. రఘు కుంచె ఈ సినిమాకు సంగీతం అందించడంతో పాటు ఓ కీలక పాత్ర చేశారు. ‘మీడియా 9 మనోజ్’ ఈ సినిమాకు కో–ప్రొడ్యూసర్. -
పలాస కథ
మంచి కథ, కథనాలున్న సినిమాలను ప్రోత్సహించి, విడుదల చేయడానికి పెద్ద ప్రొడక్షన్ కంపెనీలు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వరుసలో ‘పలాస 1978’ చిత్రాన్ని విడుదల చేసేందుకు గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ముందుకొచ్చాయి. పలాసలో జరిగిన వాస్తవ సంఘటనలు, కొన్ని నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో రూపొందిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా జనవరి చివరి వారంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. మంచి కథ, కథనాలున్న ఈ సినిమా నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, వంశీలకు బాగా నచ్చడంతో గీతా ఆర్ట్స్, యూవీ ప్రొడక్షన్స్ పతాకాలపై విడుదల చేయనున్నారు. ‘‘మంచి సినిమాలను అందరికీ చేరువయ్యేలా చూడాలని అల్లు అరవింద్‌గారు భావించడంతో ‘పలాస 1978’ ఈ చిత్రాన్ని జీఏటు యూవీ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నాం’’ అని బన్నీ వాసు తెలిపారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘు కుంచె. -
గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే ఇష్టం
రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసిన పూరి జగన్నాథ్ మాట్లాడుతూ– ‘‘ఇలాంటి గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. అందరూ తిడుతున్నారని గ్యాంగ్‌స్టర్ సినిమాలు తీయడం లేదు. ‘పలాస 1978’ టీజర్ నాకు చాలా చాలా నచ్చింది. హీరో హీరోయిన్లు బాగున్నారు. కరుణ కుమార్ పనితనం నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘పూరీగారు మా టీజర్‌ను విడుదల చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఓ సొగసరి పాటతో పాటు టీజర్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. త్వరలో సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు కరుణ కుమార్. ఈ సినిమాలో నటించడంతో పాటు సంగీతం కూడా అందించారు రఘు కుంచె. -
ఓ సొగసరి...
రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఓ సొగసరి...’ అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ధ్యాన్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో మా సినిమా వస్తోంది. 1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ‘ఓ సొగసరి...’ పాటను పాడారు. బాలుగారు 30ఏళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే, బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్‌నెస్‌ను తీసుకువచ్చింది. లక్ష్మీ భూపాల్‌గారు ఈ పాటను చక్కగా రాశారు. కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రమైనా, రచయితగా సాహిత్యలోకంలో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి’’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, కెమెరా: అరుల్ విన్సెంట్. -
శ్రీహరిగారి పేరు నిలబెడతాడు
‘‘మేఘాంశ్ తొలి సినిమా ‘భైరవ’ (బాల నటుడు). ‘రాజ్‌ధూత్’ రెండవ (హీరో) చిత్రం. పాఠాలు సరిగ్గా చదవడు కానీ, డైలాగులున్న పేజీలు మాత్రం బాగా చదువుతాడు. మేఘాంశ్ రక్తంలోనే నటన ఉందని అప్పుడే అర్థమైంది. ‘రాజ్‌ధూత్’ ట్రైలర్ చూసిన తర్వాత శ్రీహరిగారి పేరును మేఘాంశ్ నిలబెడతాడన్న నమ్మకం వచ్చింది’’ అని దివంగత నటుడు శ్రీహరి సతీమణి, నటి శాంతి అన్నారు. శాంతిశ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతోన్న చిత్రం ‘రాజ్‌ధూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. అర్జున్–కార్తీక్ దర్శకత్వంలో ఎమ్.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘నేనీ స్థాయిలో ఉన్నానంటే కారణం మా బావ (శ్రీహరి). మా ఇద్దరిదీ 35 ఏళ్ల అనుబంధం. నాకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిచ్చింది ఆయనే. దాని పేరు శ్రీహరి నిలయం. తండ్రిలా మేఘాంశ్ పెద్ద స్టార్ అవ్వాలి’’ అన్నారు. ‘‘మా దర్శకులు ఇద్దరైనా ఒక్కరిలా పనిచేసి, చాలా క్లారిటీతో ఈ సినిమా తీశారు. పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లో సినిమా చూడండి’’ అని మేఘాంశ్ అన్నారు. ‘‘నిర్మాతకు కథ చెప్పగానే మూడు రోజుల్లో ఓకే చేశారు. మేఘాంశ్ పెద్ద డైరెక్టర్స్‌తో సినిమాలు చేయొచ్చు.. కానీ మమ్మల్ని నమ్మి అవకాశం ఇచ్చారు’’ అన్నారు అర్జున్–కార్తీక్. ‘‘శ్రీహరిగారి వల్ల ఎంతో మంది వివిధ రంగాల్లో సెటిల్ అయ్యారు. నేను ఇలా ఉండటానికి కారణం శ్రీహరిగారే. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అన్నారు ఫైట్ మాస్టర్ విజయ్. ‘‘నేను నిర్మాతగా ఉన్నానంటే కారణం శ్రీహరిగారే. ఆయన ఉండుంటే ఇంకా చాలా మంది నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చేవారు. ఎంతో మందికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి. మహాసముద్రంలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం దురదృష్టకరం’’ అన్నారు నిర్మాత బెల్లకొండ సురేష్. ‘‘రాజ్‌ధూత్’తో నేను గొప్ప నిర్మాత అవుతానో? లేదో? తెలియదు. కానీ అర్జున్–కార్తీక్ మంచి దర్శకులవుతారు. మేఘాంశ్ బాగా నటించాడు’’ అన్నారు చిత్రనిర్మాత సత్యనారాయణ. దర్శకులు ఇ.సత్తిబాబు, దేవీప్రసాద్, బాబీ, రవికుమార్ చౌదరి, శ్రీరామ్ ఆదిత్య, అజయ్ భూపతి, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తనయుడు సాయి, నటుడు రాజా రవీందర్, నిర్మాత అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. -
ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు
‘‘ముంబైలో మాఫియా ఒకలా, విజయవాడలో మరోలా ఉంటుంది. ప్రతి ఊరిలో ఒక్కోటి ఒక్కోలా ఉంటుంది. అది ఎలా ఉంటుందన్నది ‘పలాస’లో కొత్తగా ఉంటుంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. రక్షిత్, నక్షత్ర జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించారు. రక్షిత్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు మారుతి, తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు ప్రతిదర్శకుడు ఒక్కో జానర్లో సినిమాలు తీసేవారు. కానీ ఇప్పుడు అందరూ ఒకే జానర్లో సినిమాలు తీస్తున్నారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ లుక్‌లో కొత్త సబ్జెక్ట్‌తో తీసిన ‘పలాస’ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు. మారుతి మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ లుక్ పోస్టర్, హీరో లుక్ బాగున్నాయి. తమ్మారెడ్డిగారు ఇలాంటి సినిమాలకు అండగా నిలబడటం çహ్యాపీ’’ అన్నారు. ‘‘తెలుగు కథ వైజాగ్ దాటి ముందుకుపోలేదు. పలాస ప్రాంతం నేపథ్యంలో రాసుకున్న ఈ కథను ప్రసాద్, తమ్మారెడ్డిలకు చెప్పాను. వాళ్లు ముందుకు రావడంతోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలుగుతున్నాను. 40 యేళ్లపాటు సాగే కథను 40 రోజుల్లో తీయడం మా టీమ్ సహకారం వల్లే సాధ్యం అయింది’’ అన్నారు కరుణకుమార్. ‘‘ఇందులో క్రూరమైన పాత్ర చేశాను’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు రఘు కుంచె. ‘‘రెండు నెలల పాటు పలాసలో షూటింగ్ చేశాం. ‘గాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’ లాంటి సినిమాను ప్రేక్షకులకు ఇవ్వబోతున్నాం’’ అన్నారు రక్షిత్. నక్షత్ర, రచయిత నాగేంద్ర, కెమెరామెన్ విన్సెంట్ అరుల్, వెంకట సిద్ధారెడ్డి మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎ.ఆర్ బెల్లన్న.