narsapuram
-
అన్నీ తానై.. తానే నాన్నయి
తండ్రి ఉన్నప్పుడు అఖిలకు చదువే లోకం. ఎప్పుడో తప్ప పొలానికి వెళ్లేది కాదు. నాన్నకు మాత్రం వ్యవసాయమే లోకం. నాన్న ఈ లోకాన్ని విడిచి వెళ్లిన తరువాత అఖిలకు దుఃఖం తప్ప బతుకు దారి కనిపించలేదు. ఆ విషాద సమయంలో ‘నాన్నా... నీకు నేను ఉన్నాను’ అంటూ పచ్చటి పొలం అఖిలకు అభయం ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను తలకెత్తుకున్న అఖిల ఇప్పుడు రైతుగా మారింది. తన రెక్కల కష్టంతో కుటుంబానికి అండగా నిలుస్తోంది. ‘డిగ్రీ సదివి ఏందమ్మా ఈ కష్టం’ అంటారు చాలామంది సానుభూతిగా. కానీ వ్యవసాయం చేయడం తనకు కష్టంగా కంటే ఇష్టంగా మారింది. ఎందుకంటే... పొలం దగ్గరికి వెళితే నాన్న దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది. నాన్న ఎక్కడి నుంచో తన కష్టాన్ని చూస్తున్నట్లు, సలహాలు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఎల్మ శ్రీనివాస్ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ‘చనిపోవాల్సిన వయసు కాదు’ అని తల్లడిల్లిన వాళ్లు.... ‘పిల్లల గతి ఏం కావాలి’ అని కన్నీళ్లు పెట్టుకున్న వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ‘ఇంత అన్యాయం చేసి పోతవా కొడకా’ అంటూ వృద్ధాప్యంలో ఉన్న శ్రీనివాస్ తల్లి ఏడుస్తుంటే అక్కడ ఉన్నవారికి ఏడుపు ఆగలేదు.‘కాలం ఎంత బాధకు అయినా మందుగా పనిచేస్తుంది’ అంటారు. అయితే రోజులు గడిచినా, నెలలు గడిచినా శ్రీనివాస్ భార్య బాధ నుంచి తేరుకోలేదు. ఆ బాధతోనే ఆమె మంచం పట్టింది. శ్రీనివాస్‌కు ఇద్దరు కుమార్తెలు. గత ఏడాది పెద్దకుమార్తె వివాహం జరిగింది. ఇక కుటుంబ భారాన్ని మోయాల్సిన బాధ్యత చిన్న కుమార్తె అఖిలపై పడింది.‘ఎవుసాయం నీ వల్ల ఎక్కడ అవుతుంది బిడ్డా... పట్నంలో ఏదన్న ఉద్యోగం చూసుకో’ అన్నారు కొందరు. ‘వ్యవసాయం అంటే వంద సమస్యలుంటయి. నీ వల్ల కాదుగని పొలాన్ని కౌలుకు ఇయ్యండ్రీ’ అని సలహా ఇచ్చారు కొందరు. ‘వ్యవసాయం ఎందుకు చేయకూడదు. అఖిల చెయ్యగలదు’ అనే మాట ఏ నోటా వినిపించలేదు.పూరింట్లో మంచం పట్టిన అమ్మను, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మను విడిచి పట్నంలో ఉద్యోగంలో చెయ్యలా? ‘చెయ్యను. వ్యవసాయమే చేస్తాను’ అని గట్టిగా నిశ్చయించుకుంది అఖిల. వ్యవసాయం అనేది కాలేజీని మించిన మహా విశ్వవిద్యాలయం. ఎప్పటికప్పుడు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉంటాయి. కాలేజీలో చదివే వారికి సంవత్సరానికి ఒక సారే పరీక్ష ఉంటుంది. కాని రైతుకు ప్రతిరోజూ పరీక్షే.‘యస్... ఆ పరీక్షల్లో నేను పాస్ కాగలను’ అంటూ ధైర్యంగా పొలం బాట పట్టింది కాలేజి స్టూడెంట్ అఖిల. ‘వచ్చినవా బిడ్డా’ అంటూ నాన్న చల్లగా నవ్వినట్లు అనిపించింది. ఆ ఊహ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. ‘నేను పరాయి దేశానికి పోలేదు. నాన్నకు ఇష్టమైన చోటుకే వచ్చాను. నాకు భయమెందుకు!’ అనుకుంది.మొదట బైక్ రైడింగ్ నేర్చుకుంది. ఆ తరువాత ట్రాక్టర్ నడపడం నేర్చుకుంది. ఇప్పుడు తనకు మరింత ధైర్యం, ‘వ్యవసాయం చేయగలను’ అనే నమ్మకం వచ్చింది. పొలంలో రెండు బోర్ల సాయంతో రెండు ఎకరాల వరకు వరి సేద్యం చేస్తోంది. ఇప్పుడు అఖిలకు వ్యవసాయం మాత్రమే కాదు... ఏ పనులు చేసుకోలేక మంచానికే పరిమితమైన తల్లి ఆలనాపాలన, నానమ్మ ఆరోగ్యం గురించి పట్టించుకోవడంలాంటి ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఒక్కముక్కలో చె΄్పాలంటే ఇప్పుడు అమ్మకు అమ్మ అయింది. నానమ్మకు కొడుకు అయింది అఖిల. నాన్న చెప్పిన మాట‘ఎందుకింత కష్టపడతవు నాన్నా’ అని పిల్లలు అన్నప్పుడు ‘రెక్కల కష్టం వుట్టిగ పోదురా’ అని నవ్వేవాడు నాన్న. ‘రెక్కల కష్టం’ విలువ గురించి చిన్న వయసులోనే నాన్న నోటి నుంచి విన్న అఖిల ఇప్పుడు ఆ కష్టాన్నే నమ్ముకుంది. ఒకవైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలపై దృష్టి పెట్టింది. కానిస్టేబుల్ కావాలనుకుంటోంది. అలా అని వ్యవసాయానికి దూరం కావాలనుకోవడం లేదు. ఎందుకంటే... తనకు వ్యవసాయం అంటే నాన్న! – బిర్రు బాలకిషన్,సాక్షి, రాజాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
మన అభ్యర్థులు వీరే..భారీ మెజారిటీతో గెలిపించండి
-
Watch Live: నరసాపురంలో సీఎం జగన్ ప్రచార సభ
-
RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
ఓ.. జమానాల సినిమా, అందులో మోహన్ బాబుది ఓ ఆకు రౌడీ రోల్. ‘నాకు సీఎం తెలుసు.. గవర్నర్ తెలుసు’ అని తన అసిస్టెంట్‌తో ఓ బడాయిలకు పోతుంటాడు. ఎంతైనా పాత సినిమా కదా.. దానికి తగ్గట్లే క్లైమాక్స్‌లో పోలీసులు వస్తారు. ‘అయ్యా.. మీకు సీఎం, గవర్నర్ తెలుసు కదా ఫోన్ చేయండి ఈ పోలీసులు మిమ్మల్ని వదిలేస్తారు’’ అని అసిస్టెంట్ గుర్తు చేస్తాడు. ‘నాకు వాళ్లు తెలుసుకానీ, వాళ్లకే నేను తెలియదు కదా’ అని చెప్పి పోలీస్ జీప్ ఎక్కుతాడు మోహన్‌బాబు. కట్ చేస్తే.. నరసాపురం సీటు విషయంలో RRR అదే రఘురామ కృష్ణంరాజు చేసిన హడావిడి ఆ పాత సినిమా సీన్లను సరిగ్గా మ్యాచ్ చేసిందనే చెప్పాలి. ‘‘నరసాపురం సీటు నాదే .. నా బ్యాక్ గ్రౌండ్ మీకు తెలియదు. నాకు వాళ్ళు తెలుసు.. వీళ్ళు తెలుసు’’ అంటూ ఫొటోలకు ఫోజులు పెట్టి మరీ మీసాలు తిప్పుకున్న రఘురామరాజుకు.. చివరకు చేతులు పిసుక్కోవడమే మిగిలింది. చంద్రబాబు ప్రోద్బలంతో, టీడీపీ అనుకూల మీడియా సాయంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శిస్తూ రచ్చబండ పేరుతో నాలుగేళ్లుగా నానా రాద్ధాంతం చేసినా రఘురామకు అచ్చీరాలేదు. ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాలో నరసాపురం సీటు గల్లంతైపోయింది.మొదటి నుంచి బిల్డప్ బాబాయే.. స్వతహాగా తాను అందరి లాంటి వాడిని కాదనే భావనలో కూరుకుపోయిన రఘురామ.. ఆ పరిస్థితులతో వైఎస్సార్సీపీలో ఎంతకాలం కొనసాగలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా నెగ్గిన ఆయన.. ఏడాదిలోనే అనూహ్యంగా పార్టీకి దూరం అయ్యారు. ఆ తర్వాత తనకు ఢిల్లీ పెద్దల అండ ఉందని ప్రొజెక్టు చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే.. అనర్హత వేటు పడకుండా ఐదేళ్ల పాటు లోక్‌సభలో ఎలాగోలా మేనేజ్ చేసుకోగలిగారు.ఇక.. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఢిల్లీలో నిత్యం ప్రెస్మీట్లు పెడుతూ.. ఏపీ ప్రభుత్వంపైనే కాకుండా వ్యక్తిగతంగా సీఎం జగన్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నారు. మధ్య మధ్యలో చంద్రబాబు సూచనలతో కోర్టుల్లో రకరకాల పిటిషన్లు వేశారు. టీడీపీని బీజేపీకి దగ్గర చేసి, 2024 తాను బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆయన భావించారు. ప్చ్.. ఇంతా చేస్తే చివరకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లు అయ్యింది RRR పరిస్థితి. అదే తిప్పి కొట్టింది మరీ.. ఈ నాలుగేళ్లుగా టీడీపీ కోసం రఘురామ చేయని పనంటూ లేదు. అదే సమయంలో.. బీజేపీ నీడలో ఉన్న తనపై వేటు కూడా వేయలేదంటూ వైఎస్సార్సీపీకి సవాల్ విసిరే స్టేజ్‌కు చేరుకున్నారు రఘురామ. అయితే.. తాను బాగా దగ్గర అని రఘురామ ఊహించుకుంటే.. బీజేపీ మాత్రం ఆయన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చంద్రబాబు మనిషి అనే కోణంలో ఎంత దూరం ఉంచాలో.. అంత దూరం పెట్టాలని నిర్ణయించుకుంది. వీటికి తోడు ఏపీ సీనియర్లు రఘురామ మీద ఇచ్చిన నివేదికల్ని సైతం పరిగణనలోకి తీసుకుంది. అందుకే నిర్మోహమాటంగా.. టిక్కెట్ కుదరదని తేల్చేసింది. నీ మెంబర్షిప్ ఏదయ్యా?.. ఏ పార్టీ అయినా సరే.. తమదాంట్లో ప్రాథమిక సభ్యత్వం లేకుండా టికెట్ ఇస్తుందా?. బిల్డప్పుల రఘురామకు ఆ మాత్రం సోయి లేదా?.. ఎంపీల జాబితా ప్రకటన తర్వాత బీజేపీపై రఘురామకృష్ణంరాజు అక్కసు వెళ్లగక్కారు. అయితే దీనిపై ఏపీ బీజేపీ రఘురామ గాలి తీసేసింది. ‘‘బీజేపీ ప్రకటించిన పార్లమెంట్ అభ్యర్ధుల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ పేరు లేకపోవడం ఆశ్చర్యమేముంది అంటూ ఎక్స్ వేదికగా బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజా పోస్ట్ వేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ బీజేపీలో ప్రాథమిక సభ్యత్వం లేకుండా సీటు ఎలా? అంటూ సెటైర్లు వేశారాయన. ‘‘వారిపై జాలిచూపే పార్టీలు(టీడీపీ, జనసేలను ఉద్దేశిస్తూ పరోక్షంగా) ఎందుకు సీటు ఇవ్వలేదో సమాధానం చెప్పాలి అని ప్రశ్నించారాయన. రఘురామకు తగిన శాస్తి జరిగిందంటూ కొందరు నెటిజన్ల కామెంట్లు ‘నాకు టికెట్ రాకుండా సోము వీర్రాజు ద్వారా జగన్ అడ్డుకున్నాడు’.. ఎంపీ రఘురామ కృష్ణంరాజుబాబోయ్.. కితకితలు పెట్టకుండానే రాజుగారు భలే నవ్విస్తున్నారే!. సోము వీర్రాజు MP టికెట్‌కే దిక్కు లేదు.. నీకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగాడా?.. మింగలేక మంగళవారం మాటలు. సోము వీర్రాజు (కాపు) కు MP టికెట్ రాకుండా చక్రం తిప్పింది పురంధేశ్వరి. ఎందుకంటే సోము కు ఎంపీ టికెట్ వచ్చి గెలిస్తే .. కాపు కోటాలో కేంద్ర మంత్రి అవుతాడు. నాకు రాదు అని ‘కమ్మ’ని కుట్ర పన్నింది ‘3 అడుగులు వెనక్కి వేస్తున్నాను’ .. టికెట్ రాకపోవడం పై రఘురామ రాజు. 30 అడుగులు వెనక్కి వేసినా పీకే_లేదు.. ఓ నెటిజన్ కామెంట్నీ అతి చేష్టలు , నీవు ఏ మాత్రం నమ్మదగినవాడివి కావు అని అన్ని పార్టీలకు తెలుసు. నీవు నరసాపురం మొఖం చూడక ఐదేళ్లు. నీవు ఏ పార్టీ తరపున పోటీ చేసినా ఓడిపోతావ్ అని అన్ని పార్టీలకు తెలుసు. అందుకే కా కమ్మ మీడియా ఈనాడు జ్యోతి TV5 నిన్ను వాడుకున్నాయి. కానీ నీవేమో నేను పెద్ద తోపు కాబోలు అనుకున్నావ్ ఆక్ పాక్ కరివేపాక్ క్లబ్బులో .. శాశ్వత సభ్యునిగా నీకు మెంబెర్ షిప్ ఇచ్చాడు చంద్రబాబురఘురామరాజుకు టికెట్ ఇవ్వని టీడీపీ. నర్సాపురం బీజేపీ సీటు వర్మకు ఇచ్చారు. కానీ బీజేపీ టికెట్ ఇవ్వలేదని పడి ఏడుస్తోంది టీడీపీ అను కుల భజన మీడియా ఈనాడు జ్యోతి TV5. 2014లో కూడా టీడీపీ టికెట్ ఇవ్వలేదు రఘురామరాజు2019 లో వైఎస్సార్సీపీ టికెట్ మీద ఎంపీగా గెలిచినా పని చేసింది మాత్రం టీడీపీ కోసంబాబు కళ్ళలో ఆనందం కోసం.. నిత్యం రెడ్లను తిడుతూ కమ్మోళ్లను పొగుడుతూ గడిపాడు 5 ఏళ్ళు ఇప్పుడు సమ్మగా కమ్మ గ ఉందంట.. బాగా తీరింది దూలఅంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు.. ముంతమామామిడి పండన్నాడే గంగరాజు..తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా ...నర్సాపురారం సీటు నాదే అని బాబు పవన్ ల ముందు ప్రకటించుకున్నాడు బిల్డప్ రాజు అయినా తగ్గడంట!అదేం చిత్రమో.. కోరుకున్న టికెట్ దక్కకున్నా.. రఘురామ రాజు ‘బేస్’లో వాయిస్ మాత్రం తగ్గలేదు. ఏమున్నా ప్రజల్లో తేల్చుకుంటానంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ రఘురామ ప్రకటించడాన్ని విడ్డూరంగా భావించాల్సిందే. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా.. పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించడంపై RRR ఒక వీడియో విడుదల చేశారు. కాలే కట్టేతో లోలోపల రగిలిపోతూనే.. తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంగా లేనంటూ డబుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా విజయం సాధించారంటూ సీఎం జగన్‌పై నెపం నెట్టే యత్నమూ చేశారు. బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా సీఎం జగన్ తనకు టికెట్ రాకుండా అడ్డుకోగలిగారనేది రఘురామ రాజు ప్రధాన ఆరోపణ. ప్రతి ఒక్కరికీ ప్రతిసారీ విజయం దక్కదని వ్యాఖ్యానించిన రఘురామ.. బీజేపీ అధిష్టానం కూడా అది గుర్తించే టికెట్ వేరే వాళ్లకు ఇచ్చిందేమో!. అయితే ఇంత మాట్లాడి.. ఆఖరికి చంద్రబాబుతో కలిసి నడవాలనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం పర్చడం ఇంతకాలం సాగిన కుట్రను మరింత బలపర్చిందని ఏపీ ప్రజలు గుర్తించరంటారా?.. :::సాక్షి వెబ్ పొలిటికల్ డెస్క్ -
ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది : సీఎం వైఎస్ జగన్
-
టీడీపీని తెలుగు బూతుల పార్టీగా,దత్తపుత్రుడి పార్టీను రౌడీసేనగా మార్చేశారు : సీఎం జగన్
-
సీఎం జగన్ మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపారు : సీదిరి అప్పలరాజు
-
సీఎం రాకతో నర్సాపురం రూప రేఖలు మారబోతున్నాయి : ప్రసాద రాజు
-
నరసాపురం చేరుకున్న సీఎం వైఎస్ జగన్
-
సీఎం వైఎస్ జగన్ మాట ఇచ్చారంటే.. నెరవేరుస్తారు : మంత్రి కారుమూరి
-
నరసాపురంలో నవశకం..
-
రేపు నరసాపురంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం వైఎస్ జగన్ చెప్పారంటే..చేస్తారంతే..
-
అభిమాని అత్యుత్సాహం: పవన్ కళ్యాణ్‌కు తప్పిన పెను ప్రమాదం
-
నోట్లో గుడ్డలు కుక్కి.. పీక నులిమి హత్య! ఏం ఎరగనట్టు నాటకం..
నక్కపల్లి: మండలంలో నీలకుండీల నర్సాపురంలో ఈ నెల 1వ తేదీన అనుమానాస్పదంగా మరణించిన గుబ్బల నాగమణిది హత్యేనని సీఐ నారాయణరావు, ఎస్ఐ డి.వెంకన్నలు తెలిపారు. బుధవారం వారు నక్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించాడు. కోటవురట్ల మండలం రామచంద్రపాలెంకు చెందిన గుబ్బల నాగమణి, తూర్పుగోదావరి జిల్లా రాజోలుకు చెందిన లక్ష్మణరావులు నర్సాపురంలో సహజీవనం చేస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు గ్రామంలో ఒక భూస్వామికి చెందిన తోటలో కాపలాదారులుగా ఉంటూ జీవిస్తున్నారు. అంతేకాకుండా వ్యసనాలకు బానిసయ్యాడు. తరచూ మద్యం సేవించి వచ్చి, నాగమణిని వేధిస్తుండేవాడు. గత నెల31న కూలిపనికి వెళ్లి వెయ్యి రూపాయలు సంపాదించాడు. ఒకటో తేదీన నాగమణి కూలి డబ్బుల విషయమై ఆరా తీసింది. అతను సరైన సమాధానం చెప్పక పోగా మద్యం సేవించి వచ్చి ఆమెను హింసించాడు. తన వ్యసనాలకు అడ్డంకిగా మారిందని ఎలాగైనా ఆమె అడ్డుతొలగించుకోవాలని భావించాడు. పీక నులిమి, నోటిలో గుడ్డలు కుక్కి నాగమణిని హత్యచేశాడు. నాగమణి చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విచారణలో నాగమణిని హత్య చేసింది లక్ష్మణరావేనని తేలిందని, అతను నేరాన్ని అంగీకరించాడని సీఐ, ఎస్ఐలు తెలిపారు. లక్ష్మణరావును అరెస్టుచేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు చెప్పారు. చదవండి: కన్న తండ్రి పైశాచికత్వం! కూతురిపై లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని సైతం -
సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు!
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యపు గింజపై కళాఖండాలు చెక్కి ఔరా! అనిపిస్తాడు. పెన్సిల్ మొనపై రాటుదేలిన తన పనితనంతో బొమ్మ చెక్కితే భూతద్దం పెట్టి చూసి నోరెళ్లబెట్టాల్సిందే. ఇప్పటికే తన కళాతృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ రికార్డులకెక్కిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణానికి చెందిన కొప్పినీడి విజయమోహన్ తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కి అందరినీ అబ్బురపరిచాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు చెక్కి గిన్నిస్ రికార్డును అందుకున్నాడు. సూక్ష్మకళలో కొన్నేళ్ల నుంచి అద్భుతాలు సృష్టిస్తున్న అతను బియ్యపు గింజలపై వివిధ కళాఖండాలు చెక్కడంలో దిట్ట. బియ్యపు గింజ ఎంత చిన్నగా ఉంటుందో మనందరికీ తెలుసు.. అలాంటి గింజపై వేల కొద్దీ బొమ్మలు చెక్కిన ఘనత ఆయనది. ప్రస్తుతం నరసాపురం మండలం లిఖితపూడి గ్రామ సచివాలయ అసిస్టెంట్ సర్వేయర్‌గా పనిచేస్తున్న మోహన్ ఎలాంటి సూక్ష్మదర్శిని వాడకుండా చిన్నపాటి సూదిమొనతో ఈ అద్భుతాలు సృష్టించడం విశేషం. – నరసాపురం బియ్యపు గింజలు, నువ్వుల గింజలు, కొబ్బరి పీచు ఇలా ఈ సూక్ష్మమోహనుడు పనితనానికి కాదేదీ అనర్హం. దేనిపైనైనా అద్భుతంగా బొమ్మలు చెక్కిచూపిస్తాడు. పదేళ్ల వయస్సులో పనికిరాని వస్తువులతో బొమ్మలు చేయడంతో ప్రారంభమైన ఇతని విజయ ప్రస్థానం ఈ రోజు గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. ప్రపంచం మొత్తంగా సూక్ష్మ కళాకారులు ఎంతో మంది ఉండగా.. బియ్యపు గింజపై బొమ్మలు చెక్కే వారు చాలా అరుదు. బియ్యపు గింజలపై పేర్లు రాయడం వంటివి చాలామంది చేస్తుంటారు. అయితే ఆ దశను మోహన్ దాటి మరింత ముందుకు వెళ్లాడు. ఇంత వరకూ బియ్యపు గింజలపై 3 వేల వరకూ బొమ్మలు చెక్కాడు. తల్లి గర్భంలో ఉన్న శిశువు, ప్రియురాలి హృదయం, దేశ నాయకులు ఇలా.. ఒక్కో బియ్యపుగింజపై ఒక్కో అద్భుత ఆకారాన్ని సృష్టించాడు. సూక్ష్మంలో మోక్షం అన్నట్లుగా.. ఒకే బియ్యపుగింజపై శ్రీరామ పట్టాభిషేకం దృశ్యం మొత్తం చెక్కడం ఆ యువకుడి ప్రతిభకు మరో తార్కాణం. పెన్సిల్ మొనలు, సుద్దముక్కలపై 5 వేల పైనే బొమ్మలు చెక్కాడు. నువ్వుల గింజ, కొబ్బరిపీచులో ఒక లేయర్‌పై బొమ్మలు వేస్తాడు. భవిష్యత్‌లో కొబ్బరిపీచు లేయర్‌పై కూడా బొమ్మ చెక్కే ప్రయత్నం చేస్తానని ధీమాగా చెబుతున్నాడు. జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన విజయమోహన్‌ను మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఢిల్లీ పిలిపించుకుని అభినందించారు. (చదవండి: ఇంజనీరింగ్ నైపుణ్యానికి మచ్చుతునక.. మల్లెమడుగు రిజర్వాయర్) తొలి ప్రయత్నంలోనే గిన్నిస్ రికార్డు బియ్యపు గింజలపై బొమ్మలే కాదు కాకుండా చెట్ల ఆకులపై సూదితో చిల్లులు పెడుతూ ఎవరి ఆకారాన్ని అయినా చెక్కేస్తాడు. అగ్గిపుల్లలు, కోడిగుడ్డు గుల్లలు, ఖాళీ బీరుబాటిళ్లు, పనికిరాని చెక్క ముక్కలు అతని కంటిలో పడితే అందాలు చిందే వస్తువులుగా మారిపోతాయి. ఇంజినీరింగ్ పూర్తిచేసి 2019 అక్టోబర్‌లో గ్రామసచివాలయంలో ఉద్యోగం సంపాదించాడు. అయినా తన ప్రవృత్తిని వదిలిపెట్టకుండా బొమ్మలు చెక్కడం కొనసాగిస్తూ గిన్నిస్ రికార్డు సాధించాడు. పెన్సిల్ లెడ్‌పై 37 సెంటీమీటర్ల పొడవులో ఏకంగా 246 లింకులు ఎలాంటి అతుకులు లేకుండా చెక్కి గిన్నిస్ సాధించాడు. అదీ తొలిప్రయత్నంలోనే కావడం గమనార్హం. దీనికి కేవలం రెండురోజుల సమయం పట్టింది. ఎన్నో అవార్డులు, రివార్డులు అతిచిన్న మిక్సీ తయారు చేసినందుకు 2019 మార్చి 16న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అతనిపై వ్యాసం వెలువడింది. మళ్లీ అదే ఏడాది అతిచిన్న మజ్జిగ చిలికే యంత్రం తయారుచేసి రెండోసారి లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ఎక్కాడు. నేషనల్ యూత్ అవార్డీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ ఆర్ట్స్ విభాగంలో విజయమోహన్‌ను జాతీయ స్థాయిలో రాష్ట్రీయ యువ గౌరవ అవార్డుతో సత్కరించింది. 2018 మార్చి 21న ఢిల్లీలోని ఆంధ్రా భవన్లో జరిగిన కార్యక్రమంలో అప్పటి కేంద్ర మంత్రులు విజయ్‌గోయల్, రాందాస్ అథవాలే చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అప్పుడే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ యువకుడిని తన నివాసానికి పిలిపించుకుని అభినందించారు. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇన్క్రెడిబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడుకు చెందిన ఆసిస్ట్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ ఎచీవర్ బుక్ అఫ్ రికార్డుల్లో పేరు నమోదు చేసుకున్నాడు. 2017 ఆగస్ట్‌లో ఒకే ఒక్క బియ్యపుగింజపై శ్రీరాముడి పట్టాభిషేకం ఘట్టాన్ని సూక్ష్మదర్శిని సాయం లేకుండా 3 గంటల వ్యవధిలో చెక్కినందుకు నేషనల్ రికార్డ్స్ బుక్ పురస్కారం లభించింది. 2017 సెప్టెంబర్‌లో మూడు బియ్యపు గింజలపై మూడు భాషల్లో జాతీయ గీతాన్ని 10 గంటల వ్యవధిలో రాసినందుకు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2015లో 33 రోజుల్లోనే 1,33,333 గింజలపై సాయిరాం నామావళిని రాసి ఔరా అనిపించాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. గిన్నిస్ సాధించాలన్న నా కల నిజమైంది. ఆనందంగా ఉంది. ఈ కళలో ఇంకా సాధించాలి, మరింత ప్రయోగాత్మకంగా ముందుకెళ్లాలని ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఏ వస్తువు చూసినా దానిని ఏదో చేయాలనే ఆలోచన వచ్చేది. ఇదే ఉత్సాహం నన్ను ఈ కళకు పరిచయం చేసింది. బియ్యపు గింజలపై బొమ్మలు చెక్కేవారు ప్రపంచం మొత్తంగా ఎవరూ లేరు. అదీ సూక్ష్మదర్శిని లేకుండా చిన్న సూది మొనతో చెక్కుతాను. అందువల్లే గిన్నిస్ సాధ్యమైంది. –కొప్పినీడి విజయమోహన్ -
నరసాపురం మండలం పెద్ద మైనవానిలంకలో విషాదం
-
నీట్లో మెరిసిన తెలుగుతేజం
సాక్షి, నరసాపురం: దేశవ్యాప్తంగా వైద్య విద్యార్హత ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఫలితాల్లో నరసాపురం చినమామిడిపల్లికి చెందిన జొన్నల బాల శివరామకృష్ణ ద్వితియ ర్యాంక్ సాధించాడు. ఈడబ్ల్యూఎస్ కేటగిరి జాతీయ స్థాయిలో ద్వితీయ ర్యాంకు సాధించిన శివరామకృష్ణ ఓపెన్ కేటగిరిలో 26వ ర్యాంకును కైవసం చేసుకుని ఢిల్లీ ఆల్ ఇండియా మెడికల్ సైన్స్‌లో సిటును దక్కించుకున్నాడు. నీట్ మొత్తం 720 మార్కులకు గాను శివరామకృష్ణ 705 మార్కులు సాధించాడు. నర్సాపురంలోని మత్స్యపురి గ్రామానికి చెందిన శివరామకృష్ణకు ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: నీట్లో తెలుగుతేజం) -
సీబీఐ కేసు: రఘురామకృష్ణం రాజు ఔట్
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల కాలంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వేటుపడింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి అతన్ని తప్పించారు. సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌గా వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు. అక్టోబర్ 9 నుంచే మార్పులు చేర్పులు అమల్లోకి వస్తాయని శుక్రవారం లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రుణాల ఎగవేత కేసులో రాఘురామకృష్ణం రాజుపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. (రఘురామకృష్ణంరాజుపై సీబీఐ కేసు) పంజాబ్ నేషనల్ బ్యాంకు నేతృత్వంలోని కన్సార్షియం ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రూ. 826.17 కోట్ల మోసానికి పాల్పడినట్టు ఫిర్యాదు అందినట్లు, నిధులను దారిమళ్లించి దుర్వినియోగానికి పాల్పడ్డట్టు అభియోగాలు మోపింది. ఈ కేసు ప్రస్తుతం విచారణ దశలో ఉంది. తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నందున అతన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. -
'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో ఉంటూ..'
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం నరసాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు. సీఎం జగన్ భారత రాజ్యాంగానికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్వార్ధంతో కాదని ముందుగా గమనించాలి. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ ఎవరిని మభ్య పెట్టలేదు.. బహిరంగంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వెన్నుపోటు పొడిచారు.. మోసం చేశారు.. అనే అర్హత చంద్రబాబుకు లేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వెన్నుపోటు దారుడుకు అర్హత గల వ్యక్తి చంద్రబాబు మాత్రమే. వెన్నుపోటు పొడిచే విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారు. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది' అంటూ సుబ్బారాయుడు పేర్కొన్నారు. (దమ్ముంటే రాజీనామా చేయాలి) -
‘తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం’
సాక్షి, పశ్చిమ గోదావరి: భార్య మీద కోపంతో పిల్లలను చితకొట్టి హింసించిన ఘటనపై స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. నరసాపురం ఘటన తనను కలచివేసిందని, తండ్రే పిల్లలను ఇలా హింసించడం బాధాకరం అన్నారు. బాధిత చిన్నారులను పరామర్శించిన మంత్రి అనంతరం వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తరపున కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తల్లి వచ్చేవరకు చిన్నారులిద్దరిని శిశు సంక్షేమ కేంద్రానికి తరలించి వారి సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చిన్నారులను హింసించిన కసాయి తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను మంత్రి అదేశించారు. ఇటువంటి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని, పిల్లలిద్దరిని తణుకు బాలసదనంలో చేర్పించి చదివిస్తామని మంత్రి పేర్కొన్నారు.(చదవండి: గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం) -
ఇద్దరు దొంగలు అరెస్ట్: 159 గ్రాముల బంగారం స్వాధీనం
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : ఉభయగోదావరి జిల్లాల్లో పలు ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పెనుగొండ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వేర్వేరు రెండు కేసుల్లో అరెస్ట్ చేసిన వీరి వద్ద నుంచి రూ.5.23 లక్షలు విలువచేసే 159 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం నరసాపురం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసాపురం డీఎస్పీ ఎం.నాగేశ్వరరావు వివరాలు వెల్ల డించారు. కాకినాడకు చెందిన పాలిక దుర్గాప్రసాద్ రావులపాలెంలో లారీ క్లీనర్‌గా పనిచేస్తూ ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. 2011 నుంచి ఇతనిపై 10కిపైగా కేసులు ఉన్నా యి. రెండుసార్లు పలు కేసుల్లో ఏదాదిన్నర జైలు శిక్ష కూడా అనుభవించాడు. తూర్పుగోదావరి జిల్లా సర్పవరం, ఏలేశ్వరం, తిమ్మాపురం, కోరంగి, అమలాపురం, కొత్తపేట, పి ఠాపురం ప్రాంతాల్లో చోరీలు చేశాడు. తాజాగా పెనుగొండలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. అతడిని పెనుగొండలో పో లీసులు అరెస్ట్ చేసి 123 గ్రాముల బంగారం, 230 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పెనుగొండకు చెందిన మరోవ్యక్తి కోసూరి కరుణ అనే యువకుడు భీమవరం, పాలకొల్లు, పోడూరు, తణుకు, ఇరగవరం, అమలాపురం, రావుపాలెం, నరసాపురం, పి.గన్నవరం ప్రాం తాల్లో జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనారాయణతో కలిసి చో రీలు చేశాడు. ఇప్పటికే జిల్లెళ్ల రాకేష్, పందరి వెంకటనా రాయణను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అయితే కరుణ మాత్రం పోలీసులకు దొరకకుండా ముంబై పారిపోయాడు. ఈనేపథ్యంలో కోసూరి కరుణ పెనుగొండకు వచ్చినట్టు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి 36 గ్రాముల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. పెనుగొండ సీఐ సునీల్‌కుమార్, ఎస్సై పి.నాగరాజు, పెనుమంట్ర, ఇరగవరం ఎస్సైలు బి.శ్రీనివాస్, డి.ఆదినారాయణ నిందితులు ఇద్దరినీ ప ట్టుకోవడంలో చురుగ్గా వ్యవహరించారని డీఎస్పీ చెప్పారు. నరసాపురం సీఐ బి.కృష్ణకుమార్, టౌన్ ఎస్సై ఆర్.మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
వైఎన్ కళాశాలకు అరుదైన గుర్తింపు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నరసాపురం వైఎన్ కళాశాల స్థాయి పెరిగింది. మెంటారు కళాశాలగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దీనిని గుర్తించింది. యూజీసీ దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి రూపొందించిన పరామర్ష్ పథకానికి వైఎన్ కళాశాలను ఎంపిక చేసింది. దేశంలో మొత్తం 167 కళాశాలలను ఈ పథకానికి యూజీసీ ఎంపిక చేసింది. రాష్ట్రంలో 10 కళాశాలలు, తెలంగాణలో 4 కళాశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని 10 కళాశాలల్లో జిల్లాకు సంబంధించి ఒకటి వైఎన్ కశాశాల కాగా, రెండోవది ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల. కొన్ని జిల్లాల్లో కళాశాలలకు, యూనివర్సటీలకు ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కళాశాలలోని మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, ప్రొఫెసర్ల సామర్థ్యం, గత చరిత్ర తది తర అంశాలను పరిగణలోకి తీసుకుని వైఎన్ కళాశాలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎన్ కళాశాల నాక్ ఏ గ్రేడ్‌ను మూడుసార్లు సాధించింది. డీమ్డ్ యూనివర్సిటీకి మార్గం సుగమం వైఎన్ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం సాగుతోంది. మెంటారు కళాశాలగా గుర్తింపు దక్కడం ద్వారా దీనికి మార్గం సుగమం అయ్యిందని కళాశాల ఇన్చార్జ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోలిశెట్టి రఘురామ్, ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం మహేశ్వరి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్లు డాక్టర్ కె.నాగేశ్వరరా వు, డాక్టర్ గంధం రామకృష్ణ ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా గుర్తింపుతో రూ.30 లక్షలు గ్రాంట్ వస్తుందన్నారు. తమ కళాశాల ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు కళాశాలలను ఎంపిక చేసుకుని వాటికి నేక్ గుర్తింపు వచ్చేలా కృషిచేయాలన్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని చెప్పారు. తాము భీమవరం వబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి కళాశాల, తాళ్లపూడి కలిదిండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు దీప్తి కళాశాల, అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, లక్కవరం అల్లూరి వరలక్ష్మి కళాశాలను ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్ చినిమిల్లి శ్రీనివాస్, ట్రెజరర్ పొన్నపల్లి శ్రీరామారావు పాల్గొన్నారు. -
మత్స్యసిరి.. అలరారుతోంది
సాక్షి, నరసాపురం: నరసాపురం తీరం నెలరోజులుగా మత్స్యసిరితో అలరారుతోంది. రికార్డు స్థాయిలో మత్స్యసంపద దొరుకుతోంది. నిషేధం అనంతరం వేట ప్రారంభించిన మత్స్యకారుల పంట పండుతోంది. బోట్లు మత్స్యసిరితో నిండిపోతున్నాయి. సాదారణంగా వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లిన బోటు చేపలతో నిండడానికి 10 నుంచి 15 రోజులు పడుతుంది. అయితే కొన్ని రోజులుగా ఇలా వేటకు వెళ్లినబోటు అలా నాలుగైదు రోజుల్లోనే తీరానికి చేరుకుంటోందని మత్ప్యకారులు చెబుతున్నారు. గత నెలరోజుల్లోనే తీరంలో దాదాపు రూ.300 కోట్ల విలువచేసే మత్స్యసంపద దొరికినట్టు అంచనా. గత ఏడాది కూడా జూన్, జూలై నెలల్లో పెద్ద ఎత్తున చేపలు దొరికాయి. కానీ గత ఏడాదికి మించి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎలాంటి విపత్తులూ లేకుండా ప్రకృతి కూడా కరుణించడంతో ముమర్మంగా వేటసాగుతోంది. ప్రస్తుతం తీరంలో వందల సంఖ్యలో మెకనైజ్డ్బోట్లు, ఫైబర్‌బోట్లు వేటసాగిస్తున్నాయి. మరెక్కడాలేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో విశాఖ తీరంతో సహా మరెక్కడా లేని విధంగా నరసాపురం తీరంలోనే అపార మత్స్య సంపద లభిస్తోంది. దీంతో ఇతర జిల్లాల నుంచి కూడా నరసాపురం తీరానికి బోట్లు పెద్దసంఖ్యలో చేరుకుంటున్నాయి. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల వరదనీరు సముద్రంలో కలుస్తుండడంతో నీటిపోటుకు మత్స్యసంపద పైకితేలుతోందని, అందుకే భారీగా వలలకు దొరకుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదికాక ఎగువప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా, నరసాపురం తీరంలో ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల సముద్రగర్భం ఇబ్బందికరంగా మారడంతో జలచరాలు పైకితేలడం వల్లే సులువుగా వలలకు చిక్కుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. 30 రోజుల్లో రూ 300 కోట్లపైనే వ్యాపారం కేంద్ర ప్రభుత్వం సముద్రంలో ఏటా 61 రోజులపాటు వేట నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇటీవలే జూన్ 15వ తేదీతో వేట నిషేధ కాలం ముగిసింది. వేట నిషేధం గడువు ముగిసి నెల దాటింది. నరసాపురం తీరంలో ఈ నెల రోజుల్లో రూ.300 కోట్ల విలువైన మత్స్య సంపద లభించినట్టు సమాచారం. సందువా, సొర, మాగ, పండుగొప్ప రకాల చేపలు, గుడ్డు పీతలు ఎక్కువగా లభ్యమవుతున్నాయి. వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక టైగర్ రకానికి చెందిన రొయ్యలూ దొరుకుతున్నాయి. ఈ రొయ్యిలను సీడ్ ఉత్పత్తి నిమిత్తం ముంబయ్, పూణెల్లోని పరిశోధనా కేంద్రాలకు పంపుతారు. దీంతో ఎగుమతిదారులు ఇటు నరసాపురం అటు అంతర్వేది రేవులకు చేరుకుని మత్స్యసంపదను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఇతర జిల్లాల బోట్లూ హల్చల్ నరసాపురం తీరంలో నిత్యం వేట ముమ్మరంగా సాగుతోంది. ఇక్కడ మత్స్యసంపద ఎక్కువగా దొరకడంతో ఇతర జిల్లాల నుంచి కూడా బోట్లు తరలి వస్తున్నాయి. మచిలీపట్నం, కాకినాడ, నెల్లూరు, విశాఖపట్టణం, ప్రకాశం జిల్లాలకు చెందిన బోట్లు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుని వేట సాగిస్తున్నాయి. ప్రస్తుతం రోజూ తీరంలో 150 నుంచి 200 వరకూ బోట్లు వేట సాగిస్తున్నాయి. ఎగుమతులు పెరిగాయి మత్స్య ఎగుమతులు భారీగా పెరిగాయి. నెలరోజుల నుంచి నరసాపురం తీరంలో రూ.వందల కోట్లలో ఎగుమతులు జరుగుతున్నాయి. గత ఏడాది కూడా ఈ సీజన్లో పరిస్థితి ఇలాగే ఉంది. కాకపోతే గత సంవత్సరం కంటే రికార్డు స్థాయిలో దిగుబడి పెరిగింది. సందువా, సొర లాంటి రకాల ఎగుమతులు పెరిగాయి. – మేకల సతీష్, ఆక్వా వ్యాపారి ఇతర జిల్లాల బోట్లు వస్తున్నాయి నరసాపురం తీరంలో ముమ్మరంగా వేట సాగుతోంది. ఇక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతున్నాయని ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బోట్లు వస్తున్నాయి. ఇబ్బంది లేకుండా అన్ని బోట్లుకు చేపలు పడుతున్నాయి. సాధారణంగా జూలైలో తుపాన్ల ప్రమాదం ఉంటుంది. వేట సవ్యంగా సాగదు. ఆ ఇబ్బంది కూడా ఈ సారి లేకపోవడంతో వేట లాభసాటిగా మారింది. – పీతల ప్రసాద్, బోటు యజమాని -
అరెస్ట్ చేశారు.. చార్జిషీట్ మరిచారు
సాక్షి , ఏలూరు, నరసాపురం: జిల్లాలో సంచలనం కలిగించిన హత్య కేసు విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. కేసులో నిందితులను అరెస్టు చేసిన ఏడాది తర్వాత కూడా చార్జిషీట్‌ను దాఖలు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని అప్పటి పోలీసు అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు లేవు.‘దంగేటి శ్రీగౌతమిది పక్కా హత్య. అది యాక్సిడెంట్ కాదు. ఈ కేసులో ఇప్పటివరకూ సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురి పాత్రను గుర్తించాం. అయితే ఈ కేసు దర్యాప్తు ఇప్పటికి సగమే పూర్తయ్యింది. ఇంకా సగం దర్యాప్తు మిగిలి ఉంది.’ ఇది శ్రీగౌతమి హత్యకేసు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే ముందు అప్పటి పాలకొల్లు రూరల్ సీఐ కె.రజనీకుమార్ 2018 జూన్ 26న చెప్పిన మాట. అయితే అప్పటి నుంచి కేసు పురోగతి ఏమీలేదు. మరి సాక్షాత్తు పోలీసులే చెప్పిన మిగిలిన సగం దర్యాప్తు ఏమైందనేది ఎవరికీ సమాధానం దొరకని ప్రశ్నగా మిగిలిపోయిం ది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన శ్రీగౌతమి హత్య కేసు దర్యాప్తు తీరుపై మళ్లీ విమర్శలు వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో పోలీసు చర్యలు నామమాత్రంగాగే ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రమాదం మాటున పక్కా ప్లాన్‌తో శ్రీగౌతమిని టీడీపీ నేత, మాజీ సర్పంచ్ సజ్జా బుజ్జి హత్య చేయించినట్టుగా పోలీసులు తేల్చారు. కేసులో నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్ ఏ–3 నిందితుడిగా ఉండటంతో ఈ హత్యకేసు అప్పట్లో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో ఈ ఘాతుకం వెనుక మరింత మంది పెద్దలు ఉన్నారనే ప్రచారం సాగింది. దర్యాప్తు సగమే అయ్యిందని పోలీసులు చెప్పడంతో మున్ముందు అసలు పెద్దలు తెరమీదకు వస్తారని అంతా అనుకున్నారు. ఈ కేసులో పూర్తిస్థాయి చార్జిషీట్‌ను పోలీసులు ఇప్పటివరకూ దాఖలు చేయలేదు. కేవలం ప్రిలిమినరీ చార్జి్జషీట్ను కోర్టుకు సమర్పించి ఊరుకున్నారు. పోలీసులు చేసిన కొత్త దర్యాప్తు ఏమిటి? 2017 జనవరి 18 రాత్రి శ్రీగౌతమి హత్య జరిగింది. కేసును 15 రోజుల్లోనే అప్పటి పోలీసు అధికారులు క్లోజ్చేశారు. ప్రమాదం నుంచి బయటపడ్డ శ్రీగౌతమి సోదరి పావని అది హత్య అని ఎంతమొత్తుకున్నా పోలీసులు పెడచెవిన పెట్టారు. మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు, విద్యార్థులు అందోళనలు చేసినా కూడా అది ముమ్మాటికీ రోడ్డు ప్రమాదమేనని పోలీసులు కుండబద్దలు కొట్టారు. అయితే కేసులో నిందితుడిగా ఉన్న సజ్జా బుజ్జి, ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గం నేత కావడం, స్థానికంగా అదే సామాజికవర్గానికి చెందిన కొందరు బడా వ్యక్తులు అండ ఉండటంతోనే పోలీసులు కేసును పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో పోలీసులు అదేమీ పట్టించుకోలేదు. సోదరికి జరిగిన అన్యాయంపై పావని ఒంటరి పోరాటం చేసింది. సీబీసీఐడీని ఆశ్రయించడంతో కథ మలుపు తిరిగింది. సీబీసీఐడీ దర్యాప్తు సాగించి ఇది పక్కా ప్లాన్‌తో చేసిన హత్య అని, ఇందులో ప్రధానంగా సజ్జా బుజ్జితో పాటు మరో ఆరుగురు ఉన్నారని తేల్చారు. ఈ వివరాలను పోలీసులకు అందించారు. దీంతో హడావుడిగా మళ్లీ పోలీసులు కేసును తీసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏ–1, ఏ–2లుగా ఉన్న టీడీపీ నేత సజ్జా బుజ్జి, బొల్లంపల్లి రమేష్‌తో పాటు ఏ–3గా ఉన్న నరసాపురం జెడ్పీటీసీ సభ్యుడు బాలం ప్రతాప్, అతని సోదరుడు బాలం ఆండ్రూను జూన్ నెల 26న అరెస్ట్ చేశారు. మరోవారం తరువాత బొల్లంపల్లి రమేష్ కారు డ్రైవర్ కవురు లక్ష్మ ణ్ను, పతకాన్ని పక్కాగా అమలుచేసి శ్రీగౌతమి ప్రాణాలు తీసిన సందీప్, దుర్గాప్రసాద్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. నిజానికి ఇక్కడి వరకూ దర్యాప్తు చేసింది సీబీసీఐడీనే. పోలీసులు కనుక్కున్న కొత్త విషయం ఏమీలేదు. ముందు ప్రమాదమని చెప్పి, తరువాత అది రోడ్డు ప్రమాదం కాదు హత్య అని చెప్పడం తప్ప. ఇంకా నీరుగార్చే ప్రయత్నమేనా.. ప్రారంభంలో కేసు దర్యాప్తు పూర్తిగా పక్కదారి పట్టినట్టుగా సీబీసీఐడీ తేటతెల్లం చేసింది. అయినా కూడా ఈ కేసు ప్రారంభ దర్యాప్తులో ఉన్న పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిజానికి పోలీసుశాఖ అందిరిని సస్పెండ్ చేస్తుందని భావించారు. ఈకేసులో పావని పోరాటం చాలాకాలం కొనసాగించింది. నరసాపురం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్న సజ్జా బుజ్జితో పాటు మిగిలిన నిందితులకు నిబంధనలకు విరుద్ధంగా సకల సౌకర్యాలు అందుతున్నాయని పావని జైళ్లశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, వారు విచారణ చేయడం కూడా సంచలనం కలి గించింది. తాను స్కూటీపై వెళుతుండగా సజ్జా బుజ్జి కారుతో ఢీకొట్టే ప్రయత్నం చేశాడని నెలరోజుల క్రితం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి, ఇటీవల బదిలీ అయిన జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను కలిసి పావని విన్నవించింది. అయితే బుజ్జిపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ చెప్పారని, ఈ కేసులో కనీసం కలవడానికి కూడా నరసాపురం డీఎస్పీ అవకాశం కలిపించడం లేదని పావని ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొంతమంది టీడీపీ అనుకూల పోలీసు ఉన్నతాధికారులు బుజ్జి వెనుక ఉండి తనకు అన్యాయం చేస్తున్నారని పావని ఆరోపిస్తోంది.