narsingi
-
నార్సింగి : సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు సందడి (ఫొటోలు)
-
Hyderabad: ‘హరేకృష్ణ’ టెంపుల్.. 430 అడుగులు!
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగరం మరో ఆధ్యాత్మిక కట్టడానికి ముస్తాబవుతోంది. హరే కృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ‘హరే కృష్ణ హెరిటేజ్ టవర్’ పేరుతో 430 అడుగుల ఎత్తులో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించనున్నారు. నార్సింగిలోని గోష్పాద క్షేత్రంలో ఆరు ఎకరాల స్థలంలో నిర్మించనున్నారు. శ్రీరాధా, కృష్ణుల అద్భుతమైన విగ్రహాలతో పాటు సీతారామచంద్రులు, గౌర నితాయి విగ్రహాలను ఈ దేవాలయంలో ప్రతిష్ఠించనున్నారు.శ్రీనివాస గోవిందుడి కోసం పూర్తిగా రాతి నుంచి దేవాలయాన్ని చెక్కనున్నారు. ఈ ప్రాజెక్టులో కాకతీయులు, చాళుక్యులు, ద్రవిడ సంస్కృతి, విభిన్నమైన పురాతన కాలం నాటి దేవాలయ కట్టడాల సంస్కృతి ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. శ్రీకృష్ణ గోసేవ మండల్ ఈ ప్రాజెక్టుకు భూసేవక్లుగా వ్యవహరించనున్నారు. ఈ క్యాంపస్‌లో లైబ్రరీ, మ్యూజియం, థియేటర్, పిల్లలు, యువతకు ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాలపై బోధనలు చేసేందుకు భగవద్గీత హాల్స్ నిర్మించనున్నారు. ఇక, ఈ దేవాలయ నిర్మాణానికి సంబంధించి అనంత శేష స్థాపన కార్యక్రమం ఈ నెల 23వ తేదీన జరగనుంది. కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అలాగే హరేకృష్ణ మూమెంట్ చైర్మన్ శ్రీమధు పండిట్ దాస ప్రభుజీ, అక్షయ పాత్ర ఫౌండేషన్ చైర్మన్ శ్రీసత్య గౌర చంద్ర దాస ప్రభు జీ తదితరులు పాల్గొననున్నారు. -
హైదరాబాద్ నార్సింగ్ లో ఘోర రోడ్డు ప్రమాదం
-
దోషికి ఉరిశిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, హైదరాబాద్: నార్సింగిలో ఘాతుకానికి పాల్పడ్డ దోషికి ఉరిశిక్ష విధిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువడించింది. 2018 నార్సింగిలో నాలుగున్నరేళ్ల బాలిక లైంగిక దాడి, హత్యకు గురైంది. బాలికపై సెంట్రింగ్ కార్మికుడు దినేష్‌కుమార్ లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు.2021లో దోషి దినేష్‌కుమార్‌కు రంగారెడ్డి కోర్టు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ జరిగింది. రంగారెడ్డి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. -
నార్సింగి డ్రగ్స్ కేసులో వీఐపీలు!
సాక్షి, హైదరాబాద్: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైజీరియా డ్రగ్ పెడ్లర్ల నుంచి మరో 30 మంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకొని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఆఫ్రికా దేశాల నుంచి మాదక ద్రవ్యాలను గోవా, ముంబై, ఢిల్లీ మీదుగా డ్రగ్స్ తరలించి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న ముఠాను నార్సింగి, తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (టీజీ న్యాబ్) పోలీసులు ఈనెల 16న పట్టుకున్న సంగతి తెలిసిందే. నిందితుల నుంచి రూ.కోట్లు విలువ చేసే 199 గ్రాముల కొకైన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు నైజీరియన్ పెడ్లర్లు అనౌహా బ్లెస్సింగ్, అజీజ్ నోహీమ్ అడేషోలాలతో పాటు బెంగళూరుకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, బోరబండకు చెందిన సానబోయిన వరుణ్ కుమార్, కొరియోగ్రాఫర్ మహ్మద్ మహబూబ్ షరీఫ్‌లను అరెస్టు చేశారు. సెల్ఫోన్లలో డేటాతో.. అరెస్టు సమయంలో నిందితుల సెల్ఫోన్లు, ఇతరత్రా ఎల్రక్టానిక్ ఉపకరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వాట్సాప్ చాట్స్, సందేశాలు, బ్యాంకు లావాదేవీలను పోలీసులు విశ్లేషించారు. దీంతో మరో 30 మంది వీఐపీల పేర్లు బయటికి వచ్చాయి. వీరంతా హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన ప్రముఖ ఐటీ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారస్తులుగా గుర్తించారు. దీంతో వీరందరికీ నోటీసులు ఇచ్చి, విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అమన్‌తో సహా మరో 20 మంది.. డ్రగ్ పెడ్లర్ల నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన మరో 20 మంది మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి డ్రగ్స్ సేవించినట్లు పాజిటివ్ వచి్చంది. దీంతో నిందితులను రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచారు. ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్‌సింగ్‌తో పాటు ఫిల్మ్‌నగర్‌కు చెందిన కిషన్ రాఠీ, బంజారాహిల్స్‌కు చెందిన అని, గచి్చ»ౌలికి చెందిన ఆలుగడ్డల రోహిత్, గండిపేటకు చెందిన శ్రీచరణ్, బంజారాహిల్స్‌కు చెందిన ప్రసాద్, ఫిల్మ్‌నగర్‌కు చెందిన హృతిక్ కుమార్, పంజగుట్టకు చెందిన నిఖిల్ దావన్, గచి్చబౌలికి చెందిన మధురాజు, రఘు, కనుమూరి కృష్ణంరాజు, వెంకట సత్యనారాయణ డ్రగ్స్ వినియోగిస్తున్నవారిలో ఉన్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్‌ను సరఫరా చేసిన ప్రధాన సూత్రధారులు ఎబుకా సుజీ, ఫ్రాంక్లిన్‌లు ఇంకా పరారీలోనే ఉన్నారు. బండ్లగూడ నుంచే చెల్లింపులు.. డ్రగ్స్ కింగ్‌పిన్ ఎబుకా సుజీ నుంచి బ్లెస్సింగ్‌కు డ్రగ్స్ సరఫరా జరుగుతుంది. ఈమె విమానాలు, రైళ్లు, బస్సులో ప్రయాణం చేస్తూ హైదరాబాద్‌కు డ్రగ్స్‌ను రవాణా చేస్తోంది. ఇప్పటివరకు బ్లెస్సింగ్ 20 సార్లు నగరానికి మాదక ద్రవ్యాలను తీసుకొచ్చింది. ఈమె నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ వీటిని ఏపీలో రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాల్లో వినియోగదారులకు విక్రయిస్తున్నాడు. ఇందుకుగాను గౌతమ్‌కు నైజీరియన్ నుంచి 9 నెలల్లో రూ.10 లక్షల కమీషన్ అందిందని, బండ్లగూడలోని లుంబినీ కమ్యూనికేషన్స్ ద్వారా నగదు చెల్లింపులు జరిగినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. -
బైరాగిగూడలో మరోసారి బుల్లెట్ కలకలం
మణికొండ: నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి బైరాగిగూడ విద్యానగర్ కాలనీలో మంగళవారం తుపాకీ తూటా కలకలం రేపింది. పద్మ అనే మహిళ కాలును తాకుతూ వెళ్లింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆమె బయటపడింది. బాధితురాలు పద్మ, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పద్మ తమ ఇంటి ముందు దుస్తులు ఆరేస్తుండగా కాలుకు అకస్మాత్తుగా ఏదో వస్తువు తగిలినట్లయ్యింది. కాలును గీసుకుని వెళ్లి రక్త్రస్తావమైంది. ఆ ప్రాంతంలో వెతకగా బుల్లెట్ కనిపించింది. కాలికి కాకుండా శరీరం పైభాగంలో అది తగిలి ఉంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని పద్మ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వెంటనే నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు బుల్లెట్‌ను స్వా«దీనం చేసుకుని బాధితురాలిని గోల్కొండ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆర్మీ బుల్లెట్‌గా గుర్తింపు.. గంధంగూడకు ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీస్ ఫైరింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఇటీవల ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తుండటంతో బుల్లెట్లు చుట్టు పక్కల ఉన్న జవావాసాల్లోకి వస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంధంగూడలో మహిళకు తగిలిన బుల్లెట్ ఆరీ్మదిగా గుర్తించామని, వారికి ప్రజలకు హాని కలిగే పరిస్థితులు వివరిస్తూ నోటీసు పంపుతామని పోలీసులు తెలిపారు. క్లూస్ టీంతో ఆదారాలను సేకిరించామని, తగు చర్యలు తీసుకుంటామన్నారు. -
హైదరాబాద్: మహిళ కాలులోకి దూసుకెళ్లిన బుల్లెట్
సాక్షి, రంగారెడ్డి: నార్సింగ్‌లో గన్ మిస్‌ఫైర్ అయ్యింది. ఓ ఇంట్లో ఉన్న మహిళ కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో మహిళ కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టిస్ చేస్తుండగా ఘటన జరిగింది. ఈ నెలలోనే ఇది రెండో ఘటనకాగా, ఈ నెల 13న నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది. ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
నార్సింగి కేసులో కీలక మలుపు.. 50 మంది సెలబ్రిటీల గుర్తింపు!
హైదరాబాద్, సాక్షి: నార్సింగి డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాళ్లందరికీ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని భావిస్తున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ సైతం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. నార్సింగి డ్రగ్స్ కేసులో అమన్ సహా పలువురిని జులై 15వ తేదీన జాయింట్ ఆపరేషన్‌తో అరెస్ట్ చేశారు. వాళ్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ టైంలో 19 మంది ప్రముఖులకు పోలీసులు నోటీసులు పంపించారు. తాజాగా.. నిందితులు మరో 30 మంది సెలబ్రిటీల పేర్లు వెల్లడించారు. ఇందులో ప్రముఖ కంపెనీల యాజమానులు సైతం ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో సెలబ్రిటీల సంఖ్య 50కి చేరినట్లయ్యింది. -
నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలనాలు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మొత్తం 20 మంది నిందితులు కాగా, వారిలో ఏడుగురు పెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు.. ఏ 10గా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్‌ను పోలీసులు చేర్చారు.నైజీరియా-ఢిల్లీ-హైదరాబాద్-ఏపీ లోని పలు ప్రాంతాలకు డ్రగ్స్‌ను చేరవేస్తున్నారు. ఎబుకా, బ్లెస్సింగ్, ఫ్రాంక్లిన్, అజీజ్, గౌతం, వరుణ్ ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వరుణ్, గౌతం, షరీఫ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ దందా సాగుతోంది. పెడ్లర్లను ఆర్థికంగా ఆదుకుంటున్న నైజీరియన్లు.. వారికి కావాల్సిన డబ్బును అరేంజ్ చేసి డ్రగ్ సరఫరాకు ప్రోత్సహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు కింగ్‌పిన్‌గా నైజీరియాకు చెందిన ఎబుకాగా పోలీసులు పేర్కొన్నారు. ఎబుకా నుండి బ్లెస్సింగ్ అనే మరో నైజీరియన్ ద్వారా ఇండియాలోని రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 20 సార్లు హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేసినట్టు బ్లెస్సింగ్ అంగీకరించాడు. గౌతమ్ అనే డ్రగ్ పెడ్లర్ ద్వారా రాజమండ్రి, హైదరాబాద్, ప్రకాశం జిల్లాకు డ్రగ్స్ చేరుతున్నాయి.9 నెలల్లో 10 లక్షల రూపాయలను కమిషన్ రూపంలో డ్రగ్ పేడ్లర్ గౌతంకు నైజీరియన్ ముట్టచెప్పాడు. బండ్లగూడలో ఉన్న లుంబిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లించారు. వరుణ్ నుండి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.ఫిలింనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, గచ్చిబౌలిలోని కస్టమర్లకు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు. తన స్నేహితురాలి పేరును తన పేరుగా బ్లెస్సింగ్ మార్చుకుంది. తండ్రి బస్సు డ్రైవర్ కావడంతో ఆర్థిక సమస్యలు కారణంగా ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2017లో ఫేస్ బుక్‌లో బ్లెస్సింగ్ అనే మహిళతో పరిచయం అయ్యింది. బెంగుళూరు వచ్చి బ్లెస్సింగ్ అనే స్నేహితురాలి బట్టల దుకాణంలో ఒనుహా పని చేశాడు. -
హైదరాబాద్: అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లిన బులెట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది.ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
నార్సింగిలో ఇంజినీర్ దారుణ హత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నార్సింగిలో ఓ ఇంజినీర్‌ను దారుణ హత్య చేశారు. ఇజాయత్ అలీ కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి ఇండియాకు వచ్చాడు. శనివారం.. దారుణ హత్యకు గురయ్యాడు. కారులో వచ్చిన దుండగులు ఇంజనీర్‌ను కదలకుండా పట్టుకోగా, మరొకరు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. అనంతరం పరారైనట్లు తెలుస్తోంది.వారిలో ఇద్దరు యువకులు కాగా.. ఓ యువతి ఉన్నట్లు సమాచారం. హత్య అనంతరం క్వాలిస్ వాహనాన్ని అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుల వాహనాన్ని, రెండు ఫోన్లను సీజ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
నార్సింగీ హిట్ అండ్ రన్ కేసుపై అనుమానాలు
సాక్షి, రంగారెడ్డి: నార్సింగీలో సోమవారం మరో హిట్ అండ్ రన్ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డుపై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రమాద సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ అయిన వాహనాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. యువకుడిని ఢీకొట్టి పరారైంది రెడీ మిక్సర్ వాహనంగా పోలీసులు గుర్తించారు. పోలీసుల అనుమానం.. రోడ్డు ప్రమాదంలో మృతుడిని ఆర్మీ సైనికుడిగా గుర్తించారు. గోల్కొండ ఆర్టలరీ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ కులాన్గా గుర్తించారు. హింట్ అండ్ రన్ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు అసలు ఔటర్ రింగ్ రోడ్ వైపు ఎందుకు వచ్చాడు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆర్మీ జవాన్లు ప్రమాద స్థలానికి భారీగా చేరుకున్నారు. -
షణ్ముక్ గంజాయి కేసు.. దర్యాప్తులో సంచలన విషయాలు!
బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్, అతని సోదరుడు సంపత్ వినయ్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తునకు వెళ్లిన పోలీసులకు వారి వద్ద గంజాయి లభ్యమైంది. వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా పోలీసులకు బాధిత యువతి తన వాంగ్మూలం ఇచ్చింది. ఆ యువతితో వినయ్‌కు మూడేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఆమెకు ఒకసారి అబార్షన్ కూడా చేయించినట్లు సమాచారం. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని చెప్పి నయవంచనకు గురి చేశాడని యువతి పేర్కొంది. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాధిత యువతి వెల్లడించింది. పోలీసులతో కలిసి వినయ్ ఫ్లాట్‌కు వెళ్లగా.. షణ్ముక్ వద్ద డ్రగ్స్, గంజాయి దొరికాయని తెలిపింది. వారితో తనకు ప్రాణహాని ఉందని.. న్యాయం కావాలని యువతి పోలీసులకు విజ్ఞప్తి చేసింది. యువతి వాంగ్మూలంలో సంచలన విషయాలు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. 'సంపత్‌ను యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిచయం చేశాడు. మా పరిచయం ప్రేమగా మారాక సంపత్ వినయ్ పలుమార్లు నాపై లైంగిక దాడి చేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని నన్ను బలవంత పెట్టగా.. చేతికి రింగ్ పెట్టి మనం పెళ్లి చేసుకోబోతున్నామని నమ్మించాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఒకసారి గర్భం కూడా తీయించాడు. ఈ విషయం సంపత్ పేరెంట్స్ అప్పారావుకి చెప్పా. ఎవరికైనా ఫిర్యాదు చేస్తే.. మీ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలకు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. సంపత్‌కి మరో యువతి తో పెళ్లి అయ్యిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.'అని తెలిపింది. పోలీసులతో కలిసి నానక్‌రామ్‌గూడలోని సంపత్ ఫ్లాట్‌కి వెళ్లాను. అక్కడే షణ్ముక్ ఉన్నాడు. అతని వద్ద గంజాయి.. డ్రగ్స్ పిల్స్ ఉన్నాయి. జావేద్ అనే కానిస్టేబుల్ షణ్ముక్‌కు సహకరించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని వెంటనే కిందకు వెళ్లమని బలవంతపెట్టాడు. నన్ను కాంప్రమైజ్ అవమని కానిస్టేబుల్ ఒత్తిడి తెచ్చాడు. నా దగ్గర విడియో కూడా ఉందని యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది -
లావణ్య కథా చిత్రం
-
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
Narsingi Animal Fest Photos: నార్సింగిలో మూడో రోజు పశు సంక్రాంతి (ఫొటోలు)
-
బీఆర్ఎస్కు షాక్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: నార్సింగ్‌లో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఓ స్థలంపై కన్నేశారు. అక్రమంగా భూమిని కబ్జా చేసే ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వారిపై నార్సింగిలో కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. కోకాపేట ల్యాండ్స్.. వివరాల ప్రకారం.. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్ మధ్య వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్ ప్రతినిధి గుండు శ్రవణ్ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అక్రమంగా తరలింపు.. అయితే, గోల్డ్‌ఫిష్ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేశారు. డీసీఎం వాహనాలను తీసుకువచ్చి కూలీలను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు. కాంటినెంటల్ ఆసుపత్రి వద్ద కూలీలను వదిలేసి మరోసారి అక్కడికి వెళితే అంతేనంటూ హెచ్చరించి వెళ్లిపోయారు అని తెలిపారు. దీంతో, తాము పోలీసులను ఆశ్రయించినట్టు స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలతో పాటుగా మరో ఆరుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: మాజీ మంత్రి హరీశ్వర్ రెడ్డి కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం -
నార్సింగిలో నీట మునిగిన విల్లాలు
-
HYD: భారీగా గంజాయి స్వాధీనం.. బీటెక్ విద్యార్థులే టార్గెట్..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగ్ చౌరస్తాలో గంజాయి కలకలం రేగింది. 12 కిలోల గంజాయిని నార్సింగ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులే లక్ష్యంగా గంజాయి దందా సాగుతోంది. చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయి అమ్ముతుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: Madhapur: డ్రగ్స్‌తో పాటు వ్యభిచారం కూడా! -
హైదరాబాద్ లో విషాదంతమైన బాలుడి మిస్సింగ్
-
హైదరాబాద్‌లో విషాదాంతమైన బాలుడి మిస్సింగ్
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కిరాణా షాప్‌కు వెళ్లిన బాలుడు బన్నీ..ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో వెదికారు. అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ టీమ్ సాయంతో ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశారు. -
హైదరాబాద్‌లో బ్రాండెడ్ కార్లతో రేసింగ్.. బడాబాబుల పిల్లల రచ్చ రచ్చ
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుర్రోళ్లు కారు రేసింగ్‌తో రెచ్చిపోతున్నారు. బడా బాబుల పిల్లలు బ్రాండెడ్ కార్లతో రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ శివారు నార్సింగిలో మితిమీరిన వేగంతో కారు రేసింగ్ నిర్వహించిన యువకులు.. స్థానికులను భయాందోళనలకు గురిచేశారు. దీంతో స్థానికులు ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. కార్లను సీజ్ చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. సయ్యద్ మాజీద్ హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ శర్మలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారంతా బడా బాబులు పిల్లలు కావడంతో వదిలిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. సంచలనాలు వెలుగులోకి.. -
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రేమోన్మాది ఘాతుకం
-
HYD: ఐటీ ఉద్యోగిపై జొమాటో డెలివరీ బాయ్ దాడి.. ప్రేమే కారణం?
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారమై యువకుడు దాడి చేశాడు. ఆమె మెడపై, చేతులపై కత్తితో దాడి చేయడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో, హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం.. వాసవిపై గణేశ్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వాసవి మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటూ గణేశ్.. వాసవిని హోటల్ వద్దకు పిలిచాడు. ఈ సందర్భంగా ఆమె అక్కడికి వచ్చింది. వారిద్దరూ మాట్లాడుకున్న కాసేపటికే వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, ఆవేశానికి లోనైన గణేశ్.. తన బ్యాగులో ఉన్న కత్తిలో ఒక్కసారిగి ఆమెపై దాడి చేశాడు. మెడ, చేతిపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే, తనను ప్రేమించలేదన్న కోపంతోనే గణేశ్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇక, వాసవి, గణేశ్.. ఇద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వాసవి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, గణేశ్ జొమాటోలో పనిచేస్తున్నాడు. ఇక, వీరిద్దరూ గచ్చిబౌలి ఏరియాలోని ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్రియురాలికి చీరను తీసుకెళ్లి శవమయ్యాడు! -
నార్సింగ్: కుర్రాడి అతివేగం.. ఓవర్ టేక్ చేయబోయి..